rainfall
-
చలి కాలంలో వర్షం.. అనుకూలమా? ప్రతికూలమా?
దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. శీతాకాలంలో వర్షాలు కురవడం విచిత్రంగా అనిపిస్తుంది. ఇటువంటి వాతావరణంలో పొగమంచు పెరిగేందుకు అవకాశం ఉంటుందని, చలి తీవ్రత కూడా పెరుగుతుందని కొందరు అంటుంటారు. సాధారణంగా వేసవికాలంలో వర్షం కురిస్తే వాతావరణం చల్లగా మారి, మనకు హాయినిస్తుంది. అలాగే వాతావరణంలో తేమ శాతాన్ని పెంచుతుంది. మరి శీతాకాలంలో వర్షం పడినప్పుడు ఏమి జరుగుతుంది?మనదేశంలో శీతాకాలంలో వర్షాలు పడటం అనేది అతి అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఈ వర్షాలుకు రుతుపవనాలకు ఏమాత్రం సంబంధం లేదు. భారత్‌తో చలికాలంలో వాయువ్య దిశ నుండి వచ్చే గాలులు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. వీటిని వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ అంటారు. ఈ గాలులు పశ్చిమాన మధ్యధరా సముద్రం నుండి వస్తాయి. ఈ గాలుల కారణంగా వాతావరణంలో అల్ప పీడనం ఏర్పడుతుంది. ఫలితంగా వర్షాలు కురుస్తాయి.ఉష్ణోగ్రతలపై ప్రభావంభారతదేశంలో హిమాలయ ప్రాంతాలలో కురుస్తున్న మంచు కారణంగా ఏర్పడే చలి మైదాన ప్రాంతాల వరకూ వ్యాపిస్తుంది. శీతాకాలంలో వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, ఈ సమయంలో కురిసే వర్షం వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. ఈ వర్షం కారణంగా ఉత్తర, మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. గాలిలో తేమ పెరుగుతుంది. ఈ రెండింటి కలయిక కారణంగా చలి మరింతగా పెరుగుతుంది. మంచు కురుస్తున్న ప్రాంతాల్లో ఒకవేళ వర్షం పడితే, అక్కడ చలి తగ్గుతుంది. చాలా చల్లగా ఉండే ప్రాంతాల్లో, కురిసే వర్షపు నీరు ఉష్ణోగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుగుతుంది. అయితే అత్యంత అరుదుగా ఇది జరుగుతుంది. శీతాకాలంలో కురిసే తేలికపాటి వర్షం ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోకుండా కాపాడుతుంది.గాలిలో తేమశాతం పెరిగి..ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో వర్షం కారణంగా, గాలిలో తేమశాతం చాలావరకూ పెరుగుతుంది. పొగమంచు కూడా పెరుగుతుంది. మరోవైపు ఇప్పటికే పొగమంచు ఉన్న ప్రాంతాల్లో, వర్షాలు కురిస్తే పొగమంచు తగ్గుతుంది. చలికాలంలో కురిసే వర్షాల వల్ల ఒక ప్రయోజనం ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్ వంటి ప్రాంతాలలో కాలుష్యాన్ని తగ్గించడంలో, గాలి నాణ్యతను మెరుగుపరచడంలో వర్షాలు ఎంతో ఉపయోగపడతాయి. శీతాకాలంలో కురిసే వర్షాలు గాలిలోని కాలుష్య కారకాలను కడిగివేస్తాయి. ఇది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. పొగ, కాలుష్యం అధికంగా ఉండే నగరాల్లో వర్షం వల్ల కాలుష్యం తగ్గుతుంది. ఉత్తర భారతదేశంలో కురిసే శీతాకాలపు వానలు చలి గాలులను పెంచవు. వర్షం పడితే అది ఖచ్చితంగా చలిని కొంతవరకు ప్రభావితం చేస్తుంది. కానీ చలిగాలులను నియంత్రింపజేయదు. చలికాలంలో కురిసే వర్షం చల్లదనాన్ని తగ్గించడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఇటువంటి వర్షం గాలిలో తేమను, చల్లదనాన్ని పెంచుతుంది. అదే సమయంలో కలుషితమైన గాలిని తగ్గిస్తుంది. ఇది కూడా చదవండి: Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు -
నేడు నాలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తేలికపాటి చలి మొదలైంది. అక్టోబర్ చివరి వారంలో చలి తీవ్రత పెరగనున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బెంగళూరులో భారీ వర్షాల కారణంగా అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేశారు.దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో నేడు (సోమవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పాటు అండమాన్ నికోబార్ దీవులకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. బెంగళూరులో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన డోనా తుపాను ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అల్పపీడన ప్రాంతం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా డోనా తుపాను ఏర్పడింది. దీని ప్రభావంతో వివిధ చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కన్నడ, ఉడిపి, బెలగావి, ధార్వాడ్, హవేరి, గడగ్, శివమొగ్గ, దావణగెరె, బళ్లారి, తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపూర్, కోలార్‌తో సహా పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఇది కూడా చదవండి: 23న పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపాను -
సహారాలో భారీ వర్షాలు.. ఆశ్చర్యపరుస్తున్న దృశ్యాలు
రబాత్: ఎడారిలో నీటి మడుగులు ఏర్పడేంత వర్షాలు కురుస్తాయని మీరు ఎప్పుడైనా విన్నారా? మొరాకోలోని సహారా ఎడారిలో అకస్మాత్తుగా వచ్చిన వరదలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈత చెట్లు, ఇసుక దిబ్బల మధ్య నీటి మడుగులు ఏర్పడి, అరుదైన దృశ్యాలను మన కళ్లముందు ఉంచాయి.ఆగ్నేయ మొరాకోలోని ఎడారుల్లో అత్యంత అరుదుగా వర్షాలు కురుస్తాయి. అయితే సెప్టెంబరులో ఈ ప్రాంతంలో వార్షిక సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని మొరాకో ప్రభుత్వం తెలిపింది. రాజధాని రబాత్‌కు దక్షిణంగా 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాగౌనైట్ అనే గ్రామంలో 24 గంటల వ్యవధిలో 100 మి.మీ. కంటే అధిక వర్షపాతం నమోదైంది.విషయం తెలుసుకున్న పర్యాటకులు ఈ ఎడారి ప్రాంతాలను చూసేందుకు ఇక్కడికి తరలివస్తున్నారు. ఇక్కడి ఈత చెట్ల మధ్య ఏర్పడిన నీటి మడుగులను చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు. తమ కళ్లను తామే నమ్మలేకపోయామంటూ వారు చెబుతున్నారు. గడచిన 50 సంవత్సరాలలో మొదటిసారిగా, ఇక్కడ అత్యధిక వర్షపాతం నమోదైందని మొరాకో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెటియోరాలజీకి చెందిన హుస్సేన్ యూఅబెబ్ తెలిపారు.ఈ ప్రాంతంలో వరుసగా ఆరేళ్ల పాటు కరువు తాండవించింది. దీంతో రైతులు తమకున్న కాస్త పొలాలను బీడుగా వదిలివేయవలసి వచ్చింది. అయితే ఇప్పుడు కురిసిన భారీ వర్షాలు ఎడారి దిగువన ఉన్న భూగర్భజలాల నిల్వలను తిరిగి నింపడంలో సహాయపడతాయని భావిస్తున్నారు. కాగా భారీ వర్షాల కారణంగా అల్జీరియాలో 20 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. పలు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం అత్యవసర సహాయ నిధులను విడుదల చేయాల్సి వచ్చింది. జగోరా- టాటా మధ్య 50 ఏళ్లుగా ఎండిపోయిన ఇరికి సరస్సు నీటితో నిండుగా ఉండటాన్ని నాసా ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..! -
10 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీహార్‌లో భారీ వర్షాలకు అక్కడి జనం అతలాకుతలమవుతున్నారు. తూర్పు యూపీలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.రాబోయే ఐదారు రోజుల్లో ఈశాన్య ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర తదితర 10 రాష్ట్రాల్లో కుండపోత వర్షాలకు అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, బీహార్, సిక్కిం, అండమాన్- నికోబార్ దీవులలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, కోస్టల్ కర్నాటక, లక్షద్వీప్ తదితర దక్షిణాది ప్రాంతాలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అందించిన డేటా ప్రకారం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 106గా నమోదైంది. ఈ ఏడాది రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా వచ్చాయి. రాజస్థాన్, గుజరాత్‌లలో రుతుపవనాల ఉపసంహరణ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమైంది. ఢిల్లీలో రుతుపవనాల ఉపసంహరణ సాధారణంగా సెప్టెంబర్ 25న జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం గణనీయంగా ఆలస్యమవుతోంది.ఇది కూడా చదవండి: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే? -
#VijayawadaFloods : చెప్పలేనంత కష్టం.. చెప్పుకోలేనంత నష్టం! (ఫొటోలు)
-
‘పేద’ విజయవాడ పై దూసిన వరద కత్తి!
విజయవాడ నగర జీవనాడిపై ప్రకృతి కత్తి పడింది. అది సుడులు తిరుగుతూ చేసిన గాయం పొరలు పొరలుగా చర్మాన్ని కండరాలను చీల్చుకుంటూ ఇక్కడి పేదల ఎముకల్నీ పగలగొట్టి అందులోని మజ్జను తాకింది! జలసమాధిగా మారిన ఈ నగరంలో ఉత్తరాంధ్ర, దక్షణ కోస్తా, తెలంగాణ మూడూ ఉన్నాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాలు అంటే, సరే సరి. గడచిన పదేళ్ళలో అయితే, బీహార్, చత్తీస్‌ఘర్, ఒడిస్సా కూలీలు, పశ్చమ బెంగాల్ జరీ నేత పనివాళ్ళు, రాజస్థాన్ మార్బుల్ పనివాళ్ళు నగరంలో ఏడాది పొడుగునా కనిపిస్తున్నారు. వీళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాల మేళం కోసం ఏకంగా రాజస్థాన్ బ్యాండ్ బృందం ఒకటి మంగళగిరిలో ఉంటున్నది.ఇవన్నీ సరే మరి ఇక్కడి స్థానికులు మాటేంటి? అనేది సహజంగానే వస్తున్నది. దీనికే సరైన సమాధానం ఇప్పుడు ‘బెజవాడ’ దగ్గర లేదు. ‘నేను ఏమిటి?’ అని ఆ నగరం కూడా తనకొక ‘ఇమేజి’ ఉండాలని అనుకున్నట్టుగా పెద్దగా కనిపించదు. ఊళ్ళ నుంచి బెజవాడకు జరిగిన వలసల్లో తొలితరం రైతు కుటుంబాల ఛాయలు ఇప్పుడు పూర్తిగా చెరిగిపోయినట్లే. అవి కూడా వాళ్ళు తీస్తున్న సినిమాలు మాదిరిగానే- ‘పాన్ ఇండియా’ అయిపోయాయి. ఒకప్పుడు గవర్నర్ పేటలో మొదలైనవీరి ‘ఫైనాన్స్’ ఆఫీసులు ఇప్పుడు- ‘జూబిలీ హిల్స్’, ‘కావూరి హిల్స్’లో స్థిరపడ్డాయి. మరిక్కడ మిగిలింది ఎవరు? అనేది సమాధానం దొరకని ప్రశ్న. అయితే, శూన్యం ఎప్పుడు ఇలాగే ఉండదు కదా. ప్రతి శూన్యం పూడ్చబడుతుంది. చలన లక్షణం సహజమైన ‘రూపాయి’ చుట్టూ ఉండే ‘యాక్టివిటి’ అనంతం కనుక, పైన చెప్పిన పలు ప్రాంతాలు నుంచి ఇక్కడికి నిరంతరాయంగా జరుగుతున్న వలసలు కారణంగా దీని సహజ లక్షణం పోగొట్టుకోకుండా, బెజవాడ జంక్షన్ అంటే, అది 24X7 సిటీగానే ఇప్పటికీ చెలామణిలో ఉంది. గత చరిత్రలో కూడా మొదటి నుంచి ఇదొక ‘ఫ్లాట్ ఫారం’ వచ్చేవాళ్ళకు పోయేవాళ్లకు ఇదొక అనుకూలమైన ‘వై - జంక్షన్’. ఇది తూర్పు నుంచి వచ్చే ‘జి.టి. లైన్’ ఉత్తరం నుంచి వచ్చే డిల్లీ లైన్ రెండు ఇక్కడ కలిసి చెన్నై వైపుకు వెళ్ళడంతో ఈ రెండింటికీ మధ్యన వున్న నగరంగా బెజవాడ నగరం ‘వైజంక్షన్’గా మారింది.ఉత్తర భారతం నుంచి వింధ్య పర్వతాలను దాటి దక్షణాది పైకి వచ్చిన అన్ని సైన్య పటాలాలకు ‘నది’ - ఓడరేవు’ – ‘పీఠభూమి’ ఇలా మూడు వారికి అమిరింది ఇక్కడే! దాంతో ఈ ప్రాంతం ఏదీ తనకోసం పట్టించుకోకుండా, కాందిసీకుల గుడారాలకు మైదానమై, గుర్రాలకు పచ్చిక బయలై, వచ్చేపోయే వారికి వడ్డించే పూటకూళ్ళ ఇల్లు అయింది- బెజవాడ. అలా మొదటి నుంచి ‘కంటోన్మెంట్’ లక్షణాలు బెజవాడకు దాని భౌగోళిక రూపం నుంచి సంక్రమించాయి. అలాగని దానికి ఇప్పుడు ఏదో చికిత్స జరగాలని కూడా ఇక్కడ మిగిలిన స్థానికులు అనుకోవడం లేదు. కానీ, రాష్ట్ర విభజన జరిగాక, ఈ ఊరిపై జరుగుతున్న ప్రయోగాలు మాత్రం అత్యాచారాన్ని తలపిస్తున్నాయి. ప్రతి ఊరికి ఒక ‘స్కేల్’ ఉంటుంది కదా. అభివృద్ధి పేరుతొ మనం ఏమి చేసినా అది ఆ ‘స్కేల్’ పరిధిలో కదా ఉండాల్సింది. మరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా, స్థానికత స్పృహ లేని పరిపాలనతో ఎలా నెగ్గుకుని రావడం. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజి వద్ద తూర్పు, పశ్చమ డెల్టా కాల్వలు ఒకటి గుంటూరు వైపు, మరొకటి బెజవాడ వైపు వెళతాయి. దాంతో ఒక్క బెజవాడ నగరంలో నుంచే బందరు కాల్వ , రైవస్ కాల్వ, ఏలూరు కాల్వలు వెళతాయి. వీటిలో నాలుగవది నగరానికి ఉత్తరం వైపున తూర్పు నుంచి పడమరకు ప్రవహించే బుడమేరు. ఇది పశ్చమ కృష్ణాజిల్లా, ఆ పైన ఖమ్మం జిల్లాల్లో కురిసే వర్షం కారణంగా అరుదుగా ప్రవహిస్తూ చివరికి ఇది కొల్లేరులో కలుస్తుంది. ప్రాంతాన్ని అలా ఉంచి, మళ్ళీ ప్రజల వద్దకు వద్దాం.నగరంలో కాల్వలతో పాటుగా కొండలు కూడా ఎక్కువే కావడంతో, ఇక్కడికి జరిగే బ్రతుకుదెరువు వలసలకు ఈ రెండు నైసర్గిక అంశాలు ప్రధాన కారణాలు. బతకడానికి బెజవాడ కనుక వెళితే, అయితే కాల్వ ఒడ్డున లేదా కొండమీద ఒక్కడో ఒక చోట ‘ల్యాండ్’ కావడం మాత్రం తేలిక, అన్నట్టుగా ఒకప్పటి పరిస్థితి ఉండేది. అయితే, ఇవన్నీ తాటాకు గుడిసెలు. దాంతో ఎండాకాలం ఇక్కడ అగ్నిప్రమాదాలు తరుచుగా జరిగేయి. అలా ఒకేసారి కృష్ణ ఒడ్డున 450 ఇళ్ళు కాలిపోయినప్పుడు, వారికి ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇస్తే 1984లో ఏర్పడింది అజిత్ సింగ్ నగర్. నగరంలోనే ఏర్పడిన మురికివాడల్లో 1990-95 మధ్య ‘ఓ.డి.ఏ.’ (ఓవర్సీస్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’) పేరుతొ మురికివాడల అభివృద్ధి పనులు మొదలయ్యాయి. దాంతో కొత్తగా పేదలు నివసించే ప్రాంతాల్లో వీధి లైట్లు, రోడ్లు, మంచినీరు, స్కూళ్ళు, వైద్య కేంద్రాలు, కమ్యునిటీ హాళ్ళు, వచ్చాయి. ఇదే సమయంలో మొదలైన ‘డ్వాక్రా’ పొదుపు సంఘాలు ఏర్పడడంతో ఈ కాలనీల్లో మహిళలు కొత్త వినియోగదారులు అయ్యారు. ఇదే కాలంలో నగరానికి పశ్చామాన బుడమేరుకు ఇవతల సింగ్ నగర్ వద్ద సుభాస్ చంద్ర బోస్ కాలనీ పేరుతొ 2000 ఇళ్ళతో మరొక కాలనీ ఏర్పడింది. నగరంలోని కాల్వ ఒడ్డున పేదలకు మురికివాడ నిర్వాసితులకు ఈ హౌసింగ్ కాలనీలో ఇల్లు కేటాయించారు. దీన్ని 1986 అక్టోబర్ లో అప్పటి గవర్నర్ కృష్ణ కాంత్ ప్రారంభించారు. అలా మరికొన్ని కాలనీలు పెరిగాయి.ఆ తర్వాత నగరంలో నుంచి ఈ కాలనీలోకి రావడానికికొత్తగా ‘ఫ్లై ఓవర్’ వచ్చింది, దాంతో ఈ కాలనీలో ఉండే బలహీనవర్గాల ఉపాధి మెరుగైంది. దీని సమీపాన- ‘వాంబే’ (వాల్మీకి-అంబేద్కర్ ఆవాస్ యోజన) పేరుతొ ఆదివాసీలు కోసం మరొక కాలనీ ఏర్పడింది. ఈ రోజున నగరంలో అది ఏ రంగం అయినా- ‘సర్వీస్ ప్రొవైడర్స్’ మాత్రం ఈ ‘కాలనీలు’ నుంచి రావలసిందే. ఈ ముప్పై ఏళ్లలో ఈ కాలనీల రూపు రేఖలు మారిపోయాయి. ఇప్పుడు ఇవి ఎగువ మధ్య తరగతి వర్గాల నివాసిత ప్రాంతాలుగా మారిపోయాయి. ఒకప్పుడు సైకిళ్ళు, లూనాలు. టివీస్ బళ్ళు నుంచి ఇప్పుడు మోటార్ బైక్స్ స్థాయికి ఎదిగారు. వాటికి వాళ్ళు కట్టాల్సిన ‘ఇ.ఎం.ఐ’.లు అంటే, అవి ఎటూ ఉంటాయి. కానీ, ఊహించని రీతిలో వారి ఇళ్ళు నీటిలో మునిగి, కళ్ళముందు వారి విలువైన వస్తువులు అన్నీ నీళ్ళల్లో ధ్వంసమై ఇప్పుడు వారి కలలు చిద్రం అయ్యాయి. నష్టాల అంచనా జరగాల్సి వుంది. ప్రభుత్వాలు మారడం కొత్త ఏమీ కాదు. కానీ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు, ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు ఎలా మారతాయి? బందరులో కృష్ణాజిల్లా కలక్టర్ ఉంటున్న రోజుల్లో కేవలం ఒక వారం పాటు విజయవాడ వచ్చి ‘క్యాప్ ఆఫీస్’లో బసచేసి, వరద నియంత్రణ పర్యవేక్షించి తిరిగి బందరు వెళ్ళడం జరిగేది. ఇదే ముఖ్యమంత్రి కాలంలో కృష్ణానదికి 1998లో రికార్డు స్థాయిలో 12లక్షల క్యూసెక్కుల వరద వస్తే, అప్పటి కలక్టర్ బి.ఆర్.మీనా ఒంటిచేత్తో కేవలం జిల్లా అధికారుల నిర్వహణలో వరద నియంత్రణ పనులు పూర్తి చేసారు. కానీ ఒకప్పటి కృష్ణాజిల్లా ఇప్పుడు రెండు అయింది. అదనంగా ‘ఎన్.డి.ఆర్.ఎఫ్.’ దళాలు వీరికి ఇప్పుడు అందుబాటులో వున్నాయి, అయినా అయినా వైఫల్యం?‘ఒకప్పుడు బుడమేరుకు వరద వస్తే, కొల్లేరు సరస్సు పొంగి గుడివాడ వద్ద నందివాడ మండలంలో వరద వచ్చేది. కానీ ఇప్పుడు, ప్రభుత్వ నిర్వహణ వైఫల్యం కారణంగా విజయవాడ నగరం మునిగింది’ అంటున్నారు ఇరిగేషన్ అంశాలు తెలిసిన మాజీ ‘పిటిఐ’ కరస్పాండెంట్ కె.ఆర్. కె.రెడ్డి. (75) ‘కృష్ణా ‘కమాండ్ ఏరియా’ లో వచ్చే వరదలకు తెలంగాణ దక్షణ జిల్లాల్లో కురిసే వర్షపాతం కారణం కనుక, చిన్న చిన్న వాగులు వంకలు నీటి నిర్వహణకు ఎపి తెలంగాణ రెండు రాష్ట్రాల అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటు భవిష్యత్తులో ఇటువంటి విపత్తుల నిరోధానికి పరిష్కారం అంటున్నారు. ఏదేమైనా అసంఖ్యాకులైన వర్ధమాన వర్గాల కుటుంబాల కలలు చిద్రం చేసిన ఈ ప్రభుత్వ వైఫల్యం మాత్రం సమీప ఎ.పి. చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగులుతుంది.-జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
సెప్టెంబర్‌లోనూ అధిక వర్షపాతం
న్యూఢిల్లీ: ఆగస్ట్‌లో మాదిరిగానే సెప్టెంబర్‌లోనూ సాధారణానికి మించి వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఆగస్ట్‌లో సాధారణానికి మించి 16 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని తెలిపింది. అదేసమయంలో, వాయవ్య భారతంలో రికార్డు స్థాయిలో 253.9 మిల్లీమీటర్ల వర్షం పడిందని, 2001 సంవత్సరం తర్వాత ఆగస్ట్‌లో ఇంత భారీగా వానలు కురియడం ఇది రెండోసారని తెలిపింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర శనివారం ఢిల్లీలో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ‘దేశంలో ఆగస్ట్‌లో 248.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, అంతకుమించి ఈసారి ఆగస్ట్‌లో 287.1 మి.మీ. వర్షం కురిసింది. అదేవిధంగా, జూన్ ఒకటో తేదీన మొదలైన రుతు పవన సీజన్లో దేశంలో సాధారణంగా 701 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, ఈసారి ఏకంగా 749 మి.మీ. కురిసింది’అని ఆయన వివరించారు. ‘ఆగస్ట్‌లో సాధారణంగా 16.3 రోజులపాటు అల్పపీడన వాతావరణం కొనసాగుతుంది. కానీ, అంతకుమించి 17 రోజుల్లో అల్పపీడనాల ప్రభావం ఉంది. ఆగస్ట్‌లో ఏర్పడిన ఆరు అల్పపీడనాల్లో రెండింటి కారణంగా ఉత్తర, మధ్యభారతంతోపాటు తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు సహా దక్షిణ భారతంలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఆగస్ట్ నెల మొత్తం రుతు పవనాల ప్రభావం కొనసాగింది’అని ఐఎండీ డీజీ మహాపాత్ర తెలిపారు. అయితే, హిమాలయాలు, ఈశాన్య ప్రాంతంలోని పలు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. ఈ సీజన్లో అల్పపీడనాల్లో అధిక భాగం దేశ దక్షిణ ప్రాంతంపైనే కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణమని చెప్పారు. వాయవ్య భారతంలో అతిభారీ వర్షాలు వాయవ్య భారతం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆగస్ట్‌లో మాదిరిగా∙సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని ఐఎండీ డీజీ మృత్యుంజయ వివరించారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణానికి మించి వానలు పడొచ్చని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌లో దీర్ఘకాలం సగటు 167.9 మి.మీ. మించి వర్షాలు పడొచ్చని చెప్పారు. -
భారీ వర్షాలకు గుజరాత్ అతలాకుతలం
-
డ్యామ్ తెగి 60 మంది మృతి, వంద మందికి పైగా గల్లంతు!
ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈస్ట్రన్ రెడ్ సీ ప్రాంతంలో ఒక డ్యామ్ తెగిపోవడంతో పలువురు మృతిచెందారని, లెక్కలేనంతమంది గల్లంతయ్యారని సూడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో 60 మంది మృతిచెందారని, 100 మంది గల్లంతయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఎడతెగని భారీ వర్షాలకు అర్బత్ డ్యామ్ తెగిపోయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ఎంతమంది మృతిచెందారనేది ఇంకా తెలియలేదు. పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. స్థానిక అధికారి ఒకరు సుడానీస్ వార్తా వెబ్సైట్ అల్-తాగిర్తో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో 60 మంది మృతిచెందివుండవచ్చని, లెక్కలేంతమంది గల్లంతైవుంటారని అన్నారు. ఈ ప్రమాదం కారణంగా జరిగిన నష్టం తీవ్రవమైనదని నీటిపారుదలశాఖ అధికారి అమర్ ఇసా తాహిర్ మీడియాకు తెలిపారు.సూడానీస్ వార్తా సంస్థ మెదామిక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో 100 మందికి పైగా జనం గల్లంతయ్యారు. సమీప గ్రామప్రజలు కొండలపైకి చేరుకుని తలదాచుకున్నారని తెలుస్తోంది. ఈ డ్యామ్ పోర్ట్ సూడాన్ నగరానికి ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం శనివారం రాత్రి ఈ డ్యామ్ కూలిపోయింది. సూడాన్‌లో ప్రతి ఏటా వరదలు సంభవిస్తుంటాయి. గత మూడేళ్లుగా ఈ ప్రాంతంలో సంభవిస్తున్న వరదలకు వందలాది మంది మృతి చెందగా, పెద్ద ఎత్తున పంటనష్టం ఏర్పడింది.🇸🇩 SE COLAPSA PRESA DE JOR ARBAAT EN SUDÁNAl menos 60 personas perdieorn la vida ahogadas, luego de registrarse el colpaso de la presa de #JorArbaat, ubicada al este de #Sudán, que terminó por inundar al menos 5 pueblos con 5,000 habitantes cada una.Según reportan, la presa… pic.twitter.com/TH5eS6ePps— 𝗧𝗵𝗲 𝗠e𝘅𝗶𝗰𝗼 𝗣𝗼𝘀𝘁 (@MexicoPost) August 27, 2024 -
కుండపోత.. ఉక్కపోత!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వాన.. కానీ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తాపూర్‌లో మాత్రం మండే ఎండ, ఆపై ఉక్కపోత. పక్కపక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో ఒకే సమయంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోటార్ సైకిల్‌పైనో, కారులోనో అటునుంచి ఇటు, ఇటునుంచి అటు ప్రయాణించిన వారికి ఈ వింతైన అనుభవం ఎదురవుతోంది. గతంలో ఒకచోట వర్షం పడుతుంటే ఆ పక్కనున్న ప్రాంతం కాస్త చల్లగా ఉండేది. కానీ ఇప్పుడు అలా ఉండటం లేదు. వేడి, ఉక్కపోత కొనసాగుతోంది. కొన్నేళ్లుగా భారీ స్థాయిలో చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులతోనే ఒక్కసారిగా అతివృష్టి, లేకుంటే తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొంటున్నారు. ప్రణాళికలు లేని పట్టణీకరణ, పరిమితులు లేని వనరుల వినియోగం, సహజ వనరుల విధ్వంసం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని, జీవన ప్రమాణాలు మరింత దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ప్రపంచంలోని పర్యావరణ నిపుణులు గొంతెత్తి చెబుతున్న ఒకేఒక్క మాట ‘ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్’. సీజన్‌కు అనుగుణంగా ఉష్ణోగ్రతలు, వర్షాలు నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పుడు పర్యావరణంలో నెలకొన్న భారీ మార్పులతో ఎండ, వానలు గతి తప్పాయి. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి నెలకొంది. సీజన్లో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రత, సాధారణ వర్షపాతం గణాంకాల్లో భారీ వ్యత్యాసం నమోదవుతూ వస్తోంది. ఉదాహరణకు అదిలాబాద్‌లో ప్రస్తుత సీజన్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీ సెల్సీయస్ నమోదు కావాల్సి ఉండగా.. సోమవారం ఏకంగా 34.3 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. అదేవిధంగా ఖమ్మంలో ఈ సీజన్ సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 31.5 డిగ్రీ సెల్సీయస్ కాగా..సోమవారం 34.6 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. రామగుండంలో 31.1 డిగ్రీ సెల్సీయస్ సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతకు గాను 34.2 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. ఈ మూడు ప్రాంతాల్లోనూ సోమవారం నాడు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. ఆగస్టు నెలలో సాధారణ ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా నమోదు కావాల్సి ఉండగా, ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వాటికి తీవ్ర ఉక్కపోత తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రంలో 49.62 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. సోమవారం నాటికి 56.07 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్ర సగటును పరిశీలిస్తే సాధారణం కంటే 13 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు కనిపిస్తున్నప్పటికీ.. చాలా జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. అంటే కొన్ని జిల్లాల్లో కురిసిన అతి భారీ వర్షాలే గణాంకాలను గణనీయంగా పెంచేశాయన్న మాట. ఉమ్మడి మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఈ అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. అంటే కొన్నిచోట్ల అతి తక్కువ వర్షాలు లేదా అసలు వర్షమే లేకపోగా కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు నమోదయ్యాయన్న మాట. వాతావరణంలోనూ ఇదే తరహా భిన్నమైన పరిస్థితులు నెలకొంటుండటం గమనార్హం. పట్టణీకరణ పేరిట వనరుల విధ్వంసం పట్టణీకరణ పేరిట ఇప్పుడు వనరుల విధ్వంసం విపరీతంగా పెరుగుతోంది. పట్టణీకరణ వల్ల నీటివనరులు పెద్దయెత్తున ఆక్రమణలకు గురవుతుండగా.. చెట్లు, పుట్టలను ఇష్టారాజ్యంగా తెగనరికేస్తున్నారు. మొదట్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌గా ప్రారంభమై ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా రూపాంతరం చెంది అంతకంతకకూ విస్తరిస్తున్నా.. నగరీకరణపై సరైన వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడంతో నష్టం వాటిల్లుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వందలాది చెరువులతో కళకళలాడిన హైదరాబాద్, ఇప్పుడు నీటి సమస్యతో సతమతమవుతోందని, చెరువులు కబ్జాల పాలుకావడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీటి వనరులు కబ్జాలపాలు కావడంతో నీటి ప్రవాహం దెబ్బతిని వరదలు పెరుగుతున్నాయని, చివరకు నిల్వ చేయాల్సిన నీరు సముద్రం పాలుకావడంతో నీటి సమతుల్యత దెబ్బతింటోందని వివరిస్తున్నారు. అదేవిధంగా ఓపెన్ స్పేస్ నిబంధనలు గాలికొదిలి అనేక అంతస్తులతో భారీ నిర్మాణాలు చేపట్టడం, విచ్చలవిడి లేఅవుట్లతో పచ్చదనం పూర్తిగా తగ్గిపోతోందని అంటున్నారు. దేశంలో అత్యంత తక్కువ ఓపెన్ స్పేస్ ఏరియా ఉన్న నగరంగా హైదరాబాద్ రికార్డుల్లోకి ఎక్కడాన్ని గుర్తు చేస్తున్నారు. పెరగని సాగు విస్తీర్ణం సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం, ఉక్కపోతతో కూడిన విభిన్న వాతావరణం నెలకొనడం పంటల సాగుపైనా ప్రభావం చూపించింది. వానాకాలం సీజన్ చివరి దశకు చేరుకున్నా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగలేదు. ఈ సీజన్లో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా.. ఈ నెల 14వ తేదీ వరకు 1.03 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు వేయాల్సి ఉంది. కానీ 94 లక్షల ఎకరాల మేర మాత్రమే పంటలు సాగవడం గమనార్హం. నీటి వనరుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి హైదరాబాద్ లాంటి నగరానికి అతి త్వరలో తీవ్ర నీటి సమస్య ఎదురు కానుంది. ఒకప్పుడు వేలల్లో ఉన్న చెరువులు ఇప్పుడు వందల్లోకి పడిపోయాయి. నీటి నిల్వలకు కేంద్రంగా ఉండే చెరువుల సంఖ్య తగ్గిపోతుండగా కాలువలన్నీ కబ్జాలపాలవుతున్నాయి. ఉదాహరణకు ఫిరంగిరనాలా అనే కాలువతో శివారు ప్రాంతాల్లోని 22 చెరువులు నీటితో నిండేవి. కానీ ఈ నాలా కబ్జాకు గురైంది. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కానీ ఫలితం లేదు. ఆ నాలాను పునరుద్ధరిస్తే దాని కింద ఉన్న గొలుసుకట్టు చెరువులు నీటితో కళకళలాడుతాయి. అదేవిధంగా నగరంలో ఉన్న చెరువులు, ప్రధాన కాలువలను పునరుద్ధరించి పరిరక్షిస్తే నీటి సమస్యకు కొంతైనా పరిష్కారం లభిస్తుంది. – ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త సమగ్ర ప్రణాళికతోనే సాధ్యం... నగరీకరణలో అత్యంత కీలకం సమగ్ర ప్రణాళిక. కానీ ఇప్పుడు కేవలం కట్టడాలతోనే అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన ఉంది. అడ్డగోలు కట్టడాలతో కాంక్రీట్ జంగిల్‌గా మారడం తప్ప మెరుగైన జీవావరణం ఏవిధంగా సాధ్యమవుతుంది. అందకే పక్కా ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పుడు హైదనాబాద్లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ గత కొన్ని రోజులుగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇదే చిత్తశుద్ధితో పూర్తిస్థాయిలో కట్టడాల తొలగింపుతో పాటు ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను వ్యూహాత్మకంగా అమలు చేయాలి. – సుబ్బారావు, పర్యావరణ నిపుణులు వర్షాకాలంలోనూ ఎండ వేడిమి...పగటిపూటే కాకుండా రాత్రిళ్లు కూడా ఉక్కపోత కొనసాగుతుండటంతో ఏసీలు, కూల ర్లను రోజంతా వాడక తప్పని పరిస్థితి నెలకొంది దీంతో ఈ నెలలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఆదివారం (ఆగస్టు 18న) 273.665 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగ్గా.. గతేడాది ఇదే రోజున 254.123 మిలియన్ యూనిట్ల వినియోగమే నమోదు కావడం ప్రస్తుత పరిస్థితిని స్పష్టం చేస్తోంది. వాస్తవానికి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి 17 వరకు అధిక విద్యుత్ వినియోగం నమోదు కావడం గమనార్హం. -
కొండెక్కుతున్న ఉల్లి ధర..
-
రాయలసీమలో నేడు, రేపు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమ, తెలంగాణ నుంచి ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న కేరళ తీరం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాయలసీమలో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో నేడు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. -
మరోసారి కేరళకు భారీ ముప్పు
తిరువనంత పురం : మరోసారి కేరళకు భారీ ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం వయనాడ్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో కేరళలోని ఎనిమిది జిల్లాలకు రెడ్ అలెర్ట్ వాతావరణ శాఖ. ఇక వయనాడ్,కోజికోడ్,మలల్లా, పాలక్కాడ్, ఇడేక్కి సహా ఎనిమిది జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే ప్రాజెక్ట్‌లు, డ్యాంలు నిండుకుండలా మారాయి. వరదల ధాటికి వయనాడ్ మృతుల సంఖ్య 94కి చేరింది. చలియాద్ నదిలోకి మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. -
అఫ్గానిస్తాన్‌లో వర్ష బీభత్సం.. 35 మంది మృతి
అఫ్గానిస్తాన్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో కురిసిన భారీ వర్షాలకు వివిధ దుర్ఘటనలు చోటుచేసుకోవడంతో 35 మంది మృతి చెందారని తాలిబన్ అధికారి ఒకరు తెలిపారు.వర్షాల కారణంగా నంగర్హార్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ సెడిఖుల్లా ఖురేషి మీడియాకు తెలిపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారని, సుర్ఖ్ రోడ్ జిల్లాలో ఇంటి పైకప్పు కూలిపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయారని ఖురేషీ తెలిపారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారన్నారు.భారీవర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగింది. భారీ ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. నంగర్హార్లోని ప్రాంతీయ ఆసుపత్రి అధిపతి అమీనుల్లా షరీఫ్ మాట్లాడుతూ ఇప్పటివరకు 207 మంది బాధితులు వివిధ ఆస్పత్రులకు చికిత్స కోసం వచ్చారన్నారు. కాగా గత మే 10, 11 తేదీల్లో దేశంలో కురిసిన భారీ వర్షాలకు 300 మందికి పైగా మృతి చెందారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. -
14 రాష్ట్రాలకు భారీ వర్షసూచన
ఢిల్లీ ఎన్సీఆర్తో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షం కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళ,తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో దేశంలోని 14 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో 115.5 నుంచి 204.4 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ సమయంలో బలమైన గాలులు కూడా వీచే అవకాశాలున్నాయని తెలిపింది.సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మంగళవారం ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుందని, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి, చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.దేశంలో కొన్ని రాష్ట్రాలకు వాతావరణశాఖ హీట్‌వేవ్ హెచ్చరికను కూడా జారీ చేసింది. పంజాబ్, బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. గత 24 గంటల్లో జైసల్మేర్ (పశ్చిమ రాజస్థాన్)లో అత్యధికంగా 45.0 డిగ్రీల సెంటీగ్రేడ్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హర్యానా-చండీగఢ్-ఢిల్లీ, ఎన్సీఆర్, తూర్పు యూపీ, బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వివరించింది. -
అటు వర్షాలు..ఇటు వడగాడ్పులు!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ పక్క మోస్తరు వర్షాలు కురుస్తుండగా, మరోపక్క వడగాడ్పులూ వీస్తున్నాయి. జూన్ మొదటి వారం వరకు దడ పుట్టించిన వడగాడ్పులు ఆ తర్వాత నైరుతి రుతుపవనాల ఆగమనంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు గణనీయంగా తగ్గాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ ఊపందుకొని, వడగాడ్పులు వీస్తున్నాయి. వాస్తవానికి నైరుతి రుతుపవనాలు ఆరంభంలో ఆశాజనకంగానే ప్రభావం చూపాయి.గత వారంలో ఉత్తరాంధ్రకు విస్తరించాయి. అప్పట్నుంచి ముందుకు కదలకుండా స్తబ్దుగా ఉండిపోయాయి. దీంతో వర్షాలు అరకొరగానే కురుస్తున్నాయి. ఎక్కడైనా కొన్ని చోట్ల మినహా అనేక చోట్ల తేలికపాటి జల్లులు పడుతున్నాయి. ప్రస్తుతం కోస్తాంధ్రపైకి పశ్చిమ గాలులు వీస్తుండడం, కోస్తా వైపు రుతుపవనాలు విస్తరించకపోవడం వంటి కారణాల వల్ల మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగి వడగాడ్పులకు దోహద పడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం కోస్తాంధ్రలో కొన్నిచోట్ల సాధారణంకంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న ఒకట్రెండు రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని, ఫలితంగా పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో వడగాడ్పులకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం ఒక నివేదికలో వెల్లడించింది. విశాఖపట్నం జిల్లాలోనూ వడగాడ్పుల అనుభూతి కలుగుతుందని పేర్కొంది.నేడు, రేపు తేలికపాటి వర్షాలు..వచ్చే 4 రోజుల్లో నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చి, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్, బీహార్, కోస్తాంధ్ర అంతటా విస్తరించేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. మరోపక్క గోవా నుండి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు, 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటన్నంటి ప్రభావంతో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకా>శం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.అదే సమయంలో పలు ప్రాంతాల్లో వడ గాలులు కూడా వీస్తాయని తెలిపింది. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, తిరుపతి, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోను, బుధవారం అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.మరోవైపు గంటకు 40 – 50 కిలోమీటర్ల వేగంతో ఈదరు గాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు చిత్తమూరు (తిరుపతి)లో 4.2 సెంటీమీటర్లు, నెమలికళ్లు (పల్నాడు)లో 3.9, మంగళగిరి (గుంటూరు)లో 3.5, ఎస్.కోట (విజయనగరం)లో 3.5, నగరి (చిత్తూరు)లో 2.1 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
సూర్యుడి భగభగ.. ఎండ వేడి తట్టుకోలేక 54 మంది మృత్యువాత
న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీతో సహా తూర్పు, ఉత్తర భారతదేశంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లోంచి కాలు బయట పెట్టాలంటే ముచ్చెమటలు పడుతున్నాయి. కాళ్లకు చెప్పులు లేకుండా, నెత్తి మీద రుమాలు లేకుండా బయట అడుగు పెడితేా.. అంతే సంగతులు. కాళ్లకు బొబ్బలు కట్టడం ఖాయం, మాడు పగలడం ఖరార్. పైగా, వేడి గాలుల బీభత్సం. తెల్లారింది మొదలు రాత్రి 10 గంటల దాకా భానుడి భగభగలే.ఎంత వేడిని తట్టుకోలేక దేశ వ్యాప్తంగా 54 మంది మృత్యువాత పడ్డారు. బీహార్‌లో 32 మంది వడదెబ్బతో మరణించారు. ఔరంగాబాద్‌లో 17 మంది, అర్రాలో ఆరుగురు, గయాలో ముగ్గురు, రోహతాస్‌లో ముగ్గురు, బక్సర్‌లో ఇద్దరు, పాట్నాలో ఒకరు మరణించారు.. ఒడిశాలోని రూర్కెలాలో 10 మంది చనిపోయారు. జార్ఖండ్‌లోని పాలము, రాజస్థాన్‌లలో ఐదుగురు చొప్పున మరణించగా, ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఒకరు మరణించారు.ఇక ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు 45.6 డిగ్రీలను దాటేసింది. సాధారణం కంటే 5.2 డిగ్రీలు ఎక్కువ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో మే 31 నుంచి జూన్ 1 మధ్య.. హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో మే 31న దుమ్ము తుఫాను రానున్నట్లు భారత వాతావరణశాఖ అంచనా వేసింది. మే 31, జూన్ 1న వాయువ్య భారత్‌లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షతం నమోదుకానున్నట్లు పేర్కొంది. రోహిణి కార్తె తన ప్రతాపాన్ని చూపుతుంది. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. రుతుపవనాలు వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలకు మాడు అదిరిపోయేలా ఎండలు అదరగొడుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అల్లాడి పోయారు. ఒక ఢిల్లీలోనే కాదు..ఉత్తర భారత దేశంలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు.ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. సూర్య ప్రతాపానికి ప్రజలు విల విలాడిపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. బుధవారం తొలిసారిగా రికార్డు స్థాయిలో మంగేష్ పూర్లో ఏకంగా 52.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఏడారి ప్రాంతమైన రాజస్థాన్ కన్నా ఎక్కువగా రాజధానిలో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్‌లో అత్యధికంగా ఫలోడిలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఢిల్లీలోని నజాఫ్ గడ్, పిఠంపుర సహా మరికొన్ని ప్రాంతాల్లో నేడు 50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ భారతదేశంలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. వివిధ రాష్ట్రాల్లో తొలకరి జల్లులు పలకరిస్తుంటే.. ఉత్తర భారతం భానుడి భగభగలతో ఠారెత్తిపోతోంది.ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎండతీవ్రతకు తోడు వేడి గాలులు వీస్తున్నాయి. జనాలు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి. ఏసీలు, కూలర్లు వాడకం ఎక్కువ అయ్యింది. ఒక్కసారిగా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో 8వేల302 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి ఎద్దడి ఏర్పడింది. నీటిని వృధా చేసిన వారికి రెండు వేల జరిమానా విధిస్తున్నారు. రాజస్థాన్‌లోనూ ఇదే పరిస్థితి. వేసవి విడిదికోసం ఉత్తర భారతం వెళ్లిన పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో ఇంతటి మార్పులు గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు జనం.రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తో సహా అనేక ప్రాంతాలకు భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ మాదిరిగానే వేడి గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లోని ఫలొదిలో 51 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
పెన్నాలో అన్ని నీళ్లా?
సాక్షి, అమరావతి: వర్షఛాయ (రెయిన్ షాడో) ప్రాంతంలో పురుడుపోసుకుని ప్రవహించే పెన్నానదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏటా 210.12 టీఎంసీల నీటి ప్రవాహం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. 1985 నుంచి 2015 వరకు పెన్నానది పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఏటా పెన్నా బేసిన్లో కురిసే వర్షపాతం పరిమాణం 1,412.58 టీఎంసీలని లెక్కగట్టింది.వరద జలాలతో కలుపుకొంటే ఏటా 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. కానీ.. పెన్నాలో ఆ స్థాయిలో నీటిలభ్యత లేదని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. బేసిన్లో 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటిలభ్యతను లెక్కగట్టడం శాస్త్రీయం కాదంటున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా చేసే అధ్యయనానికే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఇదీ తేడా..పెన్నాలో నీటిలభ్యతపై 1993లో సీడబ్ల్యూసీ తొలిసారి అధ్యయనం చేసింది. 1944–45 సంవత్సరం నుంచి 1983–84 వరకు బేసిన్లో 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా అప్పట్లో నీటిలభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే పెన్నాలో 223.18 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పెన్నా బేసిన్ 55,213 చదరపు కిలోమీటర్లుగా పేర్కొంది. తాజాగా సీడబ్ల్యూసీ పెన్నా బేసిన్లో 1985–2015 మధ్య అంటే 30 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలిపితే 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది.75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే నదిలో 210.12 టీఎంసీలు ఉంటుందని పేర్కొంది. కానీ బేసిన్ మాత్రం 54,905 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు గుర్తించింది. 1993తో పోలిస్తే బేసిన్ విస్తీర్ణం 308 చదరపు కిలోమీటర్లు తగ్గింది. పెన్నా బేసిన్లో 1944–84తో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం అధికంగా ఉండటంవల్లే నీటిలభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. దీన్ని సాగునీటిరంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కేవలం 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాలను ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. అధ్యయనం పరిధిని తగ్గించుకోవడం వల్లే నీటిలభ్యత పెరిగిందని, ఇది అశాస్త్రీయమని స్పష్టం చేస్తున్నారు. పెన్నా బేసిన్ ఇదీ..కర్ణాటకలో వర్షఛాయ ప్రాంతమైన చిక్‌బళ్లాపూర్ జిల్లా నందికొండల్లోని చెన్నకేశవ పర్వతశ్రేణుల్లో పుట్టిన పెన్నానది.. రాష్ట్రంలో వర్షాభావ ప్రాంతాలైన శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల మీదుగా 597 కిలోమీటర్లు ప్రవహించి ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎడమవైపు నుంచి జయమంగళ, కుందేరు, కుడివైపు నుంచి సగిలేరు, చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యేరు ఉపనదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్లో 400 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఈ బేసిన్ విస్టీర్ణం 54,905 చదరపు కిలోమీటర్లని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం. -
మళ్లీ అధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగనున్నాయి. అకాల వర్షాల నేపథ్యంలో గత పది రోజులుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతూ వచ్చాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారడం, నైరుతి సీజన్‌కు సమయం అనుకూలంగా మారుతున్న తరుణంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. ఉక్కపోత కూడా తీవ్రం కానుందని తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరానికి సమీప నైరుతి ప్రాంతంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్ప పీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్ప పీడనం ఈశాన్య దిశలో కదిలి ఈ నెల 24వ తేదీ నాటికీ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత ఈ వాయుగుండం ఈశాన్య దిశలో కదులుతూ మరింత బలపడి ఈ నెల 25న ఈశాన్య, దానికి ఆనుకొని ఉన్న వాయవ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండబోదని తెలిపారు. రుతుపవనాలకు అనుకూలంగా..నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రానికి తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచిమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు. బుధవారం రాష్ట్రంలో చాలాచోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ మేర తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా ఆదిలాబాద్‌లో 41.8 డిగ్రీ సెల్సీయస్, కనిష్టంగా మెదక్‌లో 24.3 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
దారి మళ్లనున్న తుపాను!
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను దారిమళ్లి, రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లనుంది. ఈ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపుతుందని తొలుత భావించారు. అయితే తాజా వాతావరణ పరిస్థితులనుబట్టి అది బంగ్లాదేశ్ వైపు వెళ్తుందని తేలింది. దీంతో రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పనుంది. ఈనెల 22న (బుధవారం) నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది 24 నాటికి వాయుగుండంగా, ఆపై తుపానుగాను బలపడుతుందని వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. తొలుత వాయుగుండం వాయవ్య బంగాళాఖాతం వైపు పయనిస్తూ తుపానుగా మారితే దాని ప్రభావం కోస్తాంధ్ర, ముఖ్యంగా ఉత్తరాంధ్ర పైన ఉంటుందని పేర్కొన్నాయి. అయితే ఐఎండీ తాజా అంచనాల ప్రకారం.. అల్పపీడనం దిశ మార్చుకుని ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత మరింత బలపడి అదే దిశలో బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది. దీని ఫలితంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరానికి మధ్య బంగాళాఖాతం సుమారు వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటుంది. అంటే రాష్ట్రానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలోనే వాయుగుండం/తుపాను బంగ్లాదేశ్ వైపు మళ్లుతుండడం వల్ల దాని ప్రభావం ఏపీపై ఉండదు. అదే మధ్య బంగాళాఖాతంలో కాకుండా వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉంటే రాష్ట్రంలో భారీ వర్షాలకు ఆస్కారం ఉండేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.మళ్లీ కొన్నాళ్లు అధిక ఉష్ణోగ్రతలు..రాష్ట్రంలో వారం రోజులుగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. వడగాడ్పులు కూడా తగ్గాయి. తాజా అంచనాల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను గాలిలో తేమను బంగ్లాదేశ్ వైపు లాక్కునిపోతుంది. దీనివల్ల మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు 3 – 4 డిగ్రీల వరకు పెరుగుతాయని, కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.మూడు రోజులు తేలికపాటి వానలుప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. బుధవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 30 – 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
రేపు అల్పపీడనం! రాష్ట్రానికి మూడు రోజులు వర్షసూచన
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తొలుత వాయవ్య దిశలో కదిలి ఈ నెల 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. కాగా సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పసుమాములలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ సరిహద్దు జిల్లాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. సోమవారం చాలాచోట్ల సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా ఆదిలాబాద్‌లో 41.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవల ముంబైలో హోర్డింగ్ కూలిన ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు. అలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదన్నారు.ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో సోమవారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. దాంతో స్థానికంగా పెట్రోల్‌పంపు వద్ద 100 అడుగుల ఎత్తైన బిల్బోర్డ్ ఒక్కసారిగా కుప్పుకూలి రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులపై పడింది. బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. 74 మంది గాయపడ్డారు.ఈ ఘటనపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘ఇలాంటి సంఘటనలు ఆమోదయోగ్యం కాదు. ముంబయి ఆధునిక మహానగరంగా మారుతుంది. సీఎం అన్ని హోర్డింగ్‌లపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన నిబంధనలు పాటించాలి’ అని ట్వీట్ చేశారు.గాయపడిన వారిలో 31 మందిని రాజావాడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. హోర్డింగ్ కూలిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.14 dead.Om Shanti 🙏🏽60 injuredFrom a billboard collapse.Unacceptable. And we’re a city trying to transform itself into a modern metropolis. CM @mieknathshinde has ordered a probe into all hoardings.Stringent rules must follow.pic.twitter.com/DxvsaoBm0l— anand mahindra (@anandmahindra) May 14, 2024 -
3 రోజులు తేలికపాటి వానలు!
సాక్షి, హైదరాబాద్: అధిక ఉష్ణోగ్రతలు, ఉక్క పోతతో అల్లాడుతున్న జనానికి వాతావరణ శాఖ కాస్త చల్లని కబురు చెప్పింది. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వానలు పడతాయని ప్రకటించింది. మరోవైపు ఈ మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదుకావొచ్చని పేర్కొంది.19 జిల్లాల్లో వానలకు చాన్స్: ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో మంగళ, బుధ, గురు వారాల్లో ఉరు ములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన తేలిక పాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకా శం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా.. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్ద పల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జన గామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. వానలకు సంబంధించి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.జల్లులు పడినా ఎండల మంటలే..రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. దానితో ఆదివారం రాత్రి వాతావరణం కాస్త చల్లబడింది. అయినా సోమవారం ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా గుల్లకోట, అల్లిపూర్‌లో 46.8 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైనే నమోదైంది. వచ్చే మూడు రోజులు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగానే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
మండే ఎండల్లో కూల్ న్యూస్..‘ఐఎండీ’ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఎండలు మండుతున్న వేళ దేశ వాసులకు భారత వాతావరణ శాఖ( ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. దేశంలో దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 87 సెంటీమీటర్లుగా ఉండగా ఈ ఏడాది ఇందులో 106 శాతం వర్షపాతం రికార్డయ్యే చాన్స్ ఉందని వెల్లడించింది. ప్రస్తుతం మధ్య పసిఫిక్ సముద్రం మీదుగా ఎల్‌నినో(వర్షాభావ) పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఇది మెల్లగా తొలగిపోతూ రుతుపవనాలు ప్రారంభమయ్యే సరికి తటస్థ స్థితి(ఈఎన్ఎస్ఓ) ఏర్పడుతుందని వెల్లడించింది. కాగా, భారత్‌లోని ఏకైక ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్ కూడా ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. స్కైమెట్ అంచనాలు ఐఎండీ అంచనాలకు దగ్గరగా ఉండటం విశేషం. ఇదీ చదవండి.. నేటితో హిమాచల్‌కు 76 ఏళ్లు -
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో వడగాడ్పులు కొనసాగుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. బుధవారం గరిష్టంగా 42 డిగ్రీలకు మించలేదు. అత్యధికంగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా గోకవరం, విజయనగరం జిల్లా కొత్తవలసల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో 19 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 63 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. గురువారం 11 మండలాల్లో తీవ్ర, మరో 129 మండలాల్లో వడగాడ్పులు, శుక్రవారం 13 మండలాల్లో తీవ్ర, 79 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు గురువారం నుంచి మూడు రోజులపాటు ఉత్తర కోస్తాలోను, శుక్రవారం నుంచి రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నాటి బులెటిన్‌లో వెల్లడించింది. దక్షిణ కోస్తాలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వానలతో పాటు ఉరుములు, మెరుపులు, అక్కడక్కడా పిడుగులు సంభవించవచ్చని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రంలో ఒకింత వేడి, ఉక్కపోత, అసౌకర్య వాతావరణం నెలకొంటుందని వివరించింది. చల్లని కబురు చెప్పిన స్కైమేట్ మండే ఎండలో ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమేట్ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. రుతుపవనాల సీజన్లో 102 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు “స్కైమెట్’ ఎండీ జతిన్‌సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎల్‌నినో వాతావరణ పోకడ లానినాగా మారుతోందని పేర్కొన్నారు. దీనివల్ల రుతుపవనాల కదలికలు బలపడొచ్చని, ఫలితంగా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. -
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలు.. 39 మంది మృతి!
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలతో పాటు హిమపాతం కారణంగా 39 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా జనం గాయపడ్డారు. ఈ వివరాలను ఖామా ప్రెస్ వెల్లడించింది. విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సయెక్ మాట్లాడుతూ హిమపాతం కారణంగా వేలాది పశువులు కూడా మృతి చెందాయన్నారు. హిమపాతం, వర్షం కారణంగా 637 నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. 14 వేల పశువులు చనిపోయాయని తెలిపారు. కాగా నాలుగు రోజులుగా కురుస్తున్న హిమపాతం, మంచు తుఫాను తర్వాత సోమవారం సలాంగ్ హైవేను తెరిచారు. సార్ ఎ పుల్ నివాసి అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ భారీవర్షాలు, కురుస్తున్న హిమపాతం తమను ఆందోళనకు గురిచేస్తున్నదని అన్నారు. మంచు కారణంగా భారీ సంఖ్యలో పశువులు మృతి చెందుతున్నాయన్నారు. పలు రోడ్లు బ్లాక్ అయ్యాయని, ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. కాగా పశువుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బాల్ఖ్, జాజ్జాన్, బద్గీస్, ఫర్యాబ్,హెరాత్ ప్రావిన్సులలో పశువుల యజమానులకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. -
హన్నన్నా.. పెన్నాలో ఇన్ని నీళ్లా?
సాక్షి, అమరావతి: పెన్నా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏటా 210.12 టీఎంసీల నీటి ప్రవాహం ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. 1985 నుంచి 2015 వరకు పెన్నా నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఏటా పెన్నా బేసిన్లో కురిసే వర్షపాతం పరిమాణం 1412.58 టీఎంసీలని లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే ఏటా 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. కానీ.. పెన్నాలో ఆ స్థాయిలో నీటి లభ్యత లేదని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. బేసిన్లో 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతను లెక్కగట్టడం శాస్త్రీయం కాదని చెబుతున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా చేసే అధ్యయనానికే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అప్పటికి, ఇప్పటికి ఇదీ తేడా.. పెన్నాలో నీటి లభ్యతపై 1993లో సీడబ్ల్యూసీ తొలిసారి అధ్యయనం చేసింది. 1944–45 సంవత్సరం నుంచి 1983–84 వరకు బేసిన్లో 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా అప్పట్లో నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే పెన్నాలో 223.18 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పెన్నా బేసిన్ 55,213 చదరపు కిలోమీటర్లుగా పేర్కొంది. తాజాగా సీడబ్ల్యూసీ పెన్నా బేసిన్లో 1985–2015 మధ్య అంటే 30 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలిపితే 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే నదిలో 210.12 టీఎంసీలు ఉంటుందని తేల్చింది. కానీ.. బేసిన్ మాత్రం 54,905 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు గుర్తించింది. అంటే.. 1993తో పోల్చితే బేసిన్ విస్తీర్ణం 308 చదరపు కిలోమీటర్లు తగ్గింది. పెన్నా బేసిన్లో 1944–84తో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం అధికంగా ఉండటంవల్లే నీటి లభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. దీన్ని సాగునీటి రంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కేవలం 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాలను ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. అధ్యయనం పరిధిని తగ్గించుకోవడం వల్లే నీటి లభ్యత పెరిగిందని, ఇది అశాస్త్రీయమని స్పష్టం చేస్తున్నారు. పెన్నా బేసిన్ ఇదీ.. కర్ణాటకలో వర్షాఛాయ ప్రాంతమైన చిక్‌బళ్లాపూర్ జిల్లా నంది కొండల్లోని చెన్నకేశవ పర్వత శ్రేణుల్లో పుట్టే పెన్నా నది.. రాష్ట్రంలో వర్షాభావ ప్రాంతాలైన శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల మీదుగా 597 కిలోమీటర్లు ప్రవహించి.. ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎడమ వైపు నుంచి జయమంగళ, కుందేరు, కుడి వైపు నుంచి సగిలేరు, చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యేరు ఉప నదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్లో 400 800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఈ బేసిన్ విస్టీర్ణం 54,905 చదరపు కిలోమీటర్లని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం. -
Tamil Nadu Weather Updates: వర్ష బీభత్సం.. గంటల వ్యవధిలోనే రికార్డ్ వర్షపాతం
చెన్నై: తమిళనాడుని వర్షాలు ముంచెత్తుతున్నాయి. మొన్నటి దాకా చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు ప్రస్తుతం దక్షిణ తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. 12-14 గంటల వ్యవధిలో ఎడతెగని వర్షం కురిసింది. మణిముత్తర్, తిరుచెందూర్లలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం సంభవించింది. 500 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. తమిళనాడులో ఇటీవల కాలంలో ఇంతటి స్థాయిలో వర్షపాతం రావడం ఇదే ప్రథమం. Kanniyakumari Flood #TamilNadu #tamilnadurain @Savukkumedia @SavukkuOfficial pic.twitter.com/JgEwbobeba — Abdul Muthaleef (@MuthaleefAbdul) December 17, 2023 దక్షిణ తమిళనాడులోని తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, టెన్‌కాశి జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఈ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలతో పాటు బ్యాంకులు,ప్రైవేటు సంస్థల ఆఫీసులకు ఇప్పటికే సెలవు ప్రకటించింది. దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి అక్కడి పరిస్థితి గందరగోళంగా తయారైంది. పలు చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచి రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దక్షిణ తమిళనాడులోని జిల్లాలతో పాటు దక్షిణ కేరళ, లక్షద్వీప్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. Fire engine itself got stuck near V.O.C port ,Thoothukudi#TNRains #Tirunelveli #TamilNadu pic.twitter.com/Sc4PbSgQ4I — West Coast Weatherman (@RainTracker) December 18, 2023 ‘కన్యాకుమరి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెన్‌కాశీ జిల్లాల్లో భారీ వర్షాల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాం. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్)కు చెందిన 250 మంది సిబ్బందిని సహాయక చర్యల కోసం నియమించాం’ అని తమిళనాడు రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి రామచంద్రన్ తెలిపారు. Historic Deluge: #Kayalpattinam in #Thoothukudi Receives Record-Breaking 932mm of Rain in 24hrs Visuals of Thoothukudi bypass road in TN as district recorded Exceptionally heavy Rainfall #HeavyRain #TamilNaduWeather #TamilnaduRain #ThoothukudiRains pic.twitter.com/nASBMG0Y2D — sudhakar (@naidusudhakar) December 18, 2023 Dear Chennai MEDIA. Tamilnadu is not limited upto Chennai border!🤦🏾♂️🤦🏾♂️#Nellai_Rain@polimernews@PTTVOnlineNews @sunnewstamil@news7tamil@NewsTamilTV24x7pic.twitter.com/6JNCBwPfuG — Tirunelveli (@Porunaicity) December 17, 2023 ఇదీ చదవండి: కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం? -
ఈనెలా అరకొర వానలే!
సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభమై దాదాపు పది రోజులవుతోంది. ఈ సీజన్లో రాష్ట్రంలో వానలు సమృద్ధిగా కురవాల్సి ఉంది. కానీ వాటి జాడ కనిపించకుండా పోతోంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్–సెపె్టంబర్) కూడా రాష్ట్రంపై మిశ్రమ ప్రభావాన్ని చూపింది. కొన్ని ప్రాంతాల్లో సంతృప్తికరంగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో ఆ సీజనులో 521.6 మి.మీలకు గాను 454.6 మి.మీల వర్షపాతం మాత్రమే నమోదైంది. కురవాల్సిన దానికంటే 13 శాతం తక్కువ కురిసిందన్న మాట. సెప్టెంబర్ లోనూ 16 శాతం తక్కువగా సాధారణ వర్షపాతం (20 శాతం కంటే తక్కువ నమోదైతే సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు) రికార్డయింది. ఇక ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండే అక్టోబర్‌లో వర్షాలు మరింతగా ముఖం చాటేశాయి. ఈ నెలలో ఏకంగా 90 శాతం భారీ లోటు నమోదైంది. అక్టోబర్ 1 నుంచి 31 వరకు నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. 99 శాతం లోటుతో కర్నూలు జిల్లా అట్టడుగున నిలిచింది. ఆ జిల్లాలో అక్టోబర్‌లో 112.2 మి.మీలు కురవాల్సి ఉండగా కేవలం 0.1 మి.మీలు మాత్రమే కురిసింది. ఈశాన్య రుతుపవనాల ఆగమనం వేళ (అక్టోబర్ మూడో వారం) బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుపాను వాటి చురుకుదనానికి బ్రేకు వేసింది. గాలిలో తేమను ఆ తుపాను బంగ్లాదేశ్ వైపు లాక్కుని పోవడంతో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా మారాయి. అప్పట్నుంచి అవి చురుకుదనాన్ని సంతరించుకోలేక వర్షాలు కురవడం లేదు. నవంబర్లోనూ అంతంతే.. సాధారణంగా రాష్ట్రంలో నవంబర్లోనూ భారీ వర్షాలు కురుస్తాయి. అయితే రాష్ట్రంలో ఈ నెలలోనూ ఆశించిన స్థాయిలో వానలు కురిసే పరిస్థితుల్లేవని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. నవంబర్‌లో దక్షిణాది రాష్ట్రాల్లో సగటున సాధారణ వర్షపాతం నమోదవుతుందని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాధారణంకంటే తక్కువ వర్షపాతం రికార్డవుతుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు. వచ్చే మూడు రోజులు వానలు.. తాజాగా గురువారం నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కి.మీల ఎత్తులో విస్తరించి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి శ్రీలంక పరిసరాల్లో కొనసాగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌పైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈనెల ఆరో తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. శుక్ర, శనివారాల్లో ఉత్తరకోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. -
AP: రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కొన్నాళ్లుగా వాతావరణం పొడిగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో మార్పు వల్ల ఉక్కపోత ఉంటోంది. తాజాగా గాలుల దిశ మారిన కారణంగా తూర్పు, ఆగ్నేయ గాలులు రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అదే సమయంలో తేలికపాటి జల్లులు లేదా వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణశాఖ శనివారం ఓ నివేదికలో తెలిపింది. రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల జల్లులు కురవవచ్చని పేర్కొంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులకు ఆస్కారం ఉందని అంచనా వేసింది. -
లోటు వర్షపాతం భర్తీ
సాక్షి, అమరావతి: ఈ నైరుతి సీజన్లో వర్షాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఆగస్టులో వర్షాభావం నెలకొనడంతో సీజన్ మొత్తం ప్రభావితమవుతుందనే ఆందోళన నెలకొంది. కానీ గతవారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో లోటు వర్షపాతం దాదాపు భర్తీ అయినట్లేనని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్లో జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం నమోదవగా, ఆగస్టులో 55 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సాధారణంగా జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 96 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సివుండగా 66 మిల్లీమీటర్లు నమోదైంది. 31 శాతం లోటు ఏర్పడింది. జూలై నెలలో 159 మిల్లీమీటర్లకు 175 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ నెలలో 10 శాతం అధిక వర్షాలు కురిశాయి. ఇక ఆగస్టు నెలలో మాత్రం 165 మిల్లీమీటర్లకు 74 మిల్లీమీటర్లే వర్షం కురిసింది. 55 శాతం లోటు ఏర్పడటంతో ఈ సీజన్లో వర్షాభావంతో ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ నెలలో వర్షాలు ఈ నెలంతా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులు మారి లానినా పరిస్థితులతో దేశంలో నైరుతి రుతుపవనాల ద్రోణి చురుగ్గా ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. దీంతో ఈ నెలలో సమృద్ధిగా వర్షాలు పడతాయని చెబుతున్నారు. ఈ నెల 13వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అల్పపీడనంతో వారంపాటు భారీ వర్షాలు అల్పపీడనం ప్రభావంతో సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్రమంతా భారీ వర్షాలు కురిశాయి. ఒకటి నుంచి 7వ తేదీ వరకు 33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సివుండగా 63 మిల్లీమీటర్ల వర్షం పడింది. 89 శాతం అదనపు వర్షం కురిసింది. దీంతో ఆగస్టులో ఏర్పడిన లోటు భర్తీ అయింది. మొత్తం జూన్ నుంచి ఇప్పటి వరకు 453 మిల్లీమీటర్ల సగటు వర్షం పడాల్సివుండగా ఇప్పటివరకు 378 మిల్లీమీటర్లు పడింది. కేవలం 16 శాతం మాత్రమే తగ్గింది. 20 శాతం లోపు లోటు అయితే దాన్ని సాధారణంగానే పరిగణిస్తారు. మొత్తం ఈ సీజన్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధిక వర్షం కురిసింది. కాకినాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పల్నాడు, నెల్లూరు, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మాత్రం లోటు నెలకొంది. -
నైరుతి వానలన్నీ పడ్డట్టే!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్‌కు సంబంధించి వర్షపాతం సంతృప్తికర స్థాయికి చేరింది. మొత్తం సీజన్లో పడాల్సిన సాధారణ వర్షపాతం అంతా ఇప్పటికే నమోదైంది. ఇకపై రాష్ట్రంలో కురిసే వర్షాలన్నీ అధిక వర్షాలుగా పరిగణించవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఏటా జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వరకు ఉన్న కాలాన్ని నైరుతి రుతపవనాల సీజన్‌గా పేర్కొంటారు. ఈ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో 72.10 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవుతుంది. అదే ఈసారి ఇప్పటికే (సెప్టెంబర్ 6 నాటికే) 74.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 1.03 శాతం ఎక్కువగానే పడింది. ఇకపై కురిసే వానలన్నీ అదనంగా కురిసే వానలేనని చెప్తున్నారు. కొంత కలవరపెట్టినా.. నిజానికి ఈసారి నైరుతి సీజన్ వర్షాలు ఆలస్యంగా మొదలయ్యాయి. జూన్ నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను చూసి రైతులు ఆందోళన చెందారు. పంటల సాగు కూడా ఆలస్యమైంది. అయితే జూలై మొదటి నుంచే పరిస్థితి మారిపోయింది. ఏకంగా రెట్టింపు వర్షపాతం నమోదైంది. మళ్లీ ఆగస్టులో లోటు వర్షపాతం నమోదవగా.. సెప్టెంబర్‌లో వానలు ఊపందుకున్నాయి. గతేడాది 40శాతం అధికంగా.. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా నైరుతి సీజన్ వర్షపాతం అధికంగానే నమోదవుతూ వస్తోంది. 2021లో ఏకంగా 49శాతం అధిక వర్షపాతం నమోదుకాగా.. 2022లో 40శాతం అధికంగా (100.97 సెంటీమీటర్లు) వానలు పడ్డాయి. ఈ ఏడాది ఇప్పటికే 74.35 సెంటీమీటర్లు కురవగా.. నెలాఖరు నాటికి ఎంత వర్షపాతం నమోదవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి కూడా గణనీయంగానే అధిక వర్షపాతం నమోదుకావొచ్చని అధికారులు భావిస్తున్నారు. నాలుగు జిల్లాల్లో సాధారణంగా.. రాష్ట్రవ్యాప్తంగా వానలు పడటంతో జిల్లాల వారీగా కూడా లోటు వర్షపాతం లేకుండా పోయింది. అయితే నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో మాత్రం వర్షపాతం కాస్త తక్కువగా, మిగతా జిల్లాల్లో 20శాతం కంటే అధికంగా నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు సిద్దిపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం, 22 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవగా.. మిగతా 10 జిల్లాలు సాధారణ వర్షపాతం కేటగిరీలో ఉన్నాయి. నేడు, రేపు మోస్తరు వానలు రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలహీనపడిందని.. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రెండ్రోజుల పాటు వానలు పడతాయని పేర్కొంది. -
మళ్లీ పుంజుకోనున్న రుతుపవనాలు
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో జూన్, జూలై నెలల్లో వర్షాలు కురిశాయి. జూలైలో భారీ వర్షపాతం నమోదయ్యింది. ఆగస్టులో రుతుపవనాలు ముఖం చాటేశాయి. అయితే, అతిత్వరలో రుతుపవనాలు మళ్లీ పుంజుకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ(ఐఎండీ) గురువారం వెల్లడించింది. మధ్య, దక్షిణ భారతదేశంలో వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 91 నుంచి 109 శాతం వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురిసినా.. జూన్–సెప్టెంబర్ సీజన్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లేనని తెలిపారు. -
‘కృష్ణా’లో కరువు తీవ్రం!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. కృష్ణా బేసిన్లో ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ఉన్న అన్ని ప్రధాన జలాశయాలకు శనివారం నాటికి వరద ప్రవాహం దాదాపుగా ఆగిపోయింది. ఆల్మట్టిలోకి కేవలం 900 క్యూసెక్కులు చేరుతుండగా, దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్‌లోకి ఎలాంటి వరద రావడం లేదు. జూరాల రిజర్వాయర్‌కు 3,000 క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్‌లోకి 587 క్యూసెక్కులు చేరుతుండగా, శ్రీశైలానికి ఎలాంటి వరద రావడం లేదు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల రిజర్వాయర్లు గత జూలై నెలాఖరు నాటికి నిండగా, తర్వాత కురిసే వర్షాలతో వచ్చే వరదను నేరుగా శ్రీశైలం జలాశయానికి విడుదల చేయాల్సి ఉంది. కాగా, ఆగస్టు ప్రారంభం నుంచి తీవ్ర వర్షాభావం నెలకొని ఉండటంతో శ్రీశైలానికి ఎగువన ఉన్న జలాశయాలకు ఎలాంటి వరద రాలేదు. శ్రీశైలం జలాశయం నిండడానికి మరో 108 టీఎంసీల వరద రావాల్సి ఉంది. శ్రీశైలం గరిష్ట నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 107.194 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు శ్రీశైలం నుంచి జలవిద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ దిగువకు నీళ్లను విడుదల చేస్తుండటం, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ కాల్వలకు నీళ్లను తరలిస్తుండటంతో జలాశయంలో నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. నాగార్జునసాగర్‌కు సైతం ఎలాంటి ప్రవాహం రావడం లేదు. సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా 150.19 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. జలాశయం నిండడానికి మరో 161 టీఎంసీల వరద రావాల్సి ఉంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు ఇలానే కొనసాగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సాగు, తాగునీటి సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. ఉన్న నిల్వలను రెండు రాష్ట్రాలు పోటాపోటీగా వినియోగించుకుంటే వేసవిలో తాగునీటికి కటకటలాడాల్సి వస్తుందని ఇటీవల రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు హెచ్చరిక జారీ చేసింది. త్రిసభ్య కమిటీ భేటీని వాయిదా వేయాలి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని 22 లేదా 23వ తేదీలకు వాయిదా వేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ రాష్ట్రం కోరింది. శ్రీశైలం జలాశయం నుంచి తెలుగు గంగ/ చెన్నై తాగునీటి అవసరాలకు 5 టీఎంసీలు, శ్రీశైలం కుడిగట్టు కాల్వ/గాలేరు నగరి సుజల స్రవంతి అవసరాలకు 4 టీఎంసీలు, కేసీ కాల్వకు 2.5 టీఎంసీలు, హంద్రీ నీవా సుజల స్రవంతికి 4.5 టీఎంసీలు కలుపుకుని 16 టీఎంసీలను కేటాయించాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. తెలంగాణ రాష్ట్ర అవసరాలను సైతం తెలియజేయాలని కృష్ణా బోర్డు ఇక్కడి ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే, 21న తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ ఇతర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడంతో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని మరో తేదీకి వాయిదా వేయాలని కోరారు. -
వేడికొద్దీ వానలు
ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వర్షపాతం మామూలు కన్నా తక్కువగా ఉంటుందని సూచనలు వచ్చాయి. ఈ సూచనలు మొత్తం దేశానికి వర్తిస్తాయని చెప్పుకోవాలి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం వారి వాతావరణ శాఖ మాత్రమే కాక స్కైమెట్ అనే ఒక ప్రైవేట్ సంస్థ కూడా వాతావరణం గురించి పరిశోధనలు చేసి సూచనలు అందిస్తూ ఉంటుంది. ఈ సంస్థవారు నిజానికి ఈ సంవత్సరం వర్షపాతం దేశం మొత్తం మీద మామూలుగా 94 శాతం మాత్రమే ఉంటుందని ప్రకటించారు. మళ్లీ ఈ అవకాశం 40 శాతం ఉంటుందని కూడా అన్నారు. వాన రాకడ, ప్రాణం పోకడ చెప్పలేము అన్న మాట ఇక్కడ బహుశా గుర్తు చేసుకోవాలేమో? ఉత్తర భారత దేశం, దేశంలోని మధ్య ప్రాంతాలలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. మామూలు గానే ప్రపంచమంతటా వాతావరణం వేడెక్కుతోంది. హిందూ మహాసముద్రంలో డైపోల్ అనే పరిస్థితి ఒక పక్కన, అనుకున్న దానికన్నా ముందే వచ్చిన ఎల్ నినోలు మరోపక్కన ఇందుకు కారణం అని చెబుతున్నారు. తూర్పు ఉష్ణమండల ప్రాంతంలో ఉన్న శాంతి మహా సముద్రం అనే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రత సగటు కన్నా అర డిగ్రీ ఎక్కువయినందుకు ఎల్ నినో వస్తుంది. అన్నట్టు ఈ మాటలోనే చివరి అక్షరానికి ‘య’ ఒత్తు ఇచ్చినట్టు పలకాలట. మాటకు చిన్న బాబు అని అర్థం. ఈ పరిస్థితి ముందు అనుకున్న దానికన్నా రెండు నెలలు ముందే వచ్చేసింది. అంతకుముందు మూడు సంవత్సరాల పాటు లా మీనా అనే పరిస్థితి. అంటే ఇందుకు వ్యతిరేకమైన పరిస్థితి ఉండేది. సముద్రం పైభాగంలో నీళ్లు వేడెక్కడం, చల్లబడడం అనే ఈ రెండు పరిస్థితులు మూడు నుంచి ఏడేళ్లకు ఒకసారి మారుతుంటాయి. ఒక పక్కన మానవ కార్యక్రమాల వల్ల వాతావరణం వేడెక్కుతున్నది. దానికి తోడుగా ఈ పరిస్థితులు కూడా వచ్చేసరికి మొత్తం ప్రభావం చాలా గట్టిగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. పగడపు కొండలన్నీ పాడై పోతాయి. అనుకోని పద్ధతిలో వరదలు వస్తాయి. లక్షల కోట్ల డాలర్ల నష్టం కలిగే పరిస్థితులు వస్తాయి. ఎల్ నినో లేకుండానే వాతావరణ పరిస్థితి దారుణంగా ఉంది, ఇక ఇది కూడా తోడైతే ఏమవుతుందో అంటున్నారు పరి శోధకులు పెడ్రో డి నేజియో. 2015 – 16 ప్రాంతంలో ఇటువంటి పరిస్థితి బలంగా వచ్చింది. పసిఫిక్ సముద్రంలో పెద్ద ఎత్తున వేడి చేరుకున్నది. ఇందులో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కూడా కొంత ఉంది. ఇప్పుడిక సముద్రం మీద మూత తీసివేసినట్లే అంటారు యూఎస్ సంస్థ ‘ఎన్ఓఏఏ’ పరిశోధకులు మైఖేల్. సముద్రోపరితలంలో చేరిన వేడి ప్రభావం ఇప్పటికే ప్రపంచం మీద ప్రభావం చూపు తున్నది. 2024 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఒకటిన్నర డిగ్రీలు ఎక్కువయ్యే అవకాశం నిండుగా ఉంటుంది అంటున్నారు ఈయన. సాధారణంగా ఈ వేడి కారణంగా తూర్పు వ్యాపార పవనాల మీద ప్రభావం ఉంటుంది. కనుక వేడి మరింత పెరుగుతుంది. ఇప్పటివరకు ఆ గాలుల వేగంలో అంతగా మార్పు కనిపించలేదు అని పరిశీలకులు గమనించారు. ప్రస్తుతం వచ్చిన పరిస్థితి వచ్చే ఫిబ్రవరి దాకా బలంగా కొనసాగుతుంది. కనుక సముద్రం మీద నుంచి వచ్చే వ్యాపార పవనాలను అక్కడి వేడి ప్రభావితం చేస్తుంది. సెప్టెంబర్ కల్లా ఈ పరిస్థితి గురించి మరింత మంచి అవగాహన అందుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఎల్ నినో బలంగా ఉన్నా లేకున్నా వరదలు, ఉత్పాతాలు మాత్రం తప్పవు. ఎల్ నినో వల్ల మంచి కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిస్థితి కారణంగా ఆఫ్రికా లోని కరవు ప్రాంతాలలో వర్షాలు వస్తాయి. అక్కడి ఆకలిగా ఉన్న జనాలకు తిండి దొరుకుతుంది. మొత్తం మీద మాత్రం ప్రభావాలు వ్యతి రేకంగా మాత్రమే ఉంటాయనీ, ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం ఉండక తప్పదనీ పరిశోధకులు అంటున్నారు. ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తులలో ఐదు శాతం తగ్గింపు కనిపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అందరూ తెలివి తెచ్చుకుని, వాతావరణం వేడెక్కకుండా ఉండే ఏర్పాట్ల మీద దృష్టి పెట్టాలి. డా‘‘ కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ విషయాల రచయిత, అనువాదకుడు మొబైల్: 98490 62055 -
వానలుండవ్! అప్పటివరకు ఉష్ణతాపమే..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వానల కోసం కొన్నాళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మారిన వాతావరణం నేపథ్యంలో మరో వారం రోజుల పాటు వర్షాలకు అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. కొద్దిరోజుల నుంచి రాష్ట్రంపైకి పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. గాలిలో తేమ కూడా తక్కువగా ఉంటోంది. అలాగే బంగాళాఖాతంలో గాని, భూ ఉపరితలంలో గాని ఆవర్తనాలు/ద్రోణులు ఏర్పడటం లేదు. వర్షాలు కురవడం లేదు. అంతేకాదు.. మేఘాల జాడ కనిపించడం లేదు. వీటన్నిటి ఫలితంగా గాలిలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఏర్పడుతోంది. దీనికి పశ్చిమ/వాయవ్య గాలులు తోడై ఉష్ణతాపానికి, అసౌకర్య వాతావరణానికి కారణమవుతోంది. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో సాధారణంకంటే 3నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు వరకు వెళ్తున్నాయి. బుధవారం పల్నాడు జిల్లా శావల్యాపురంలో 39.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. కావలిలో 39.1, బాపట్లలో 39, ఒంగోలులో 38.9, విశాఖపట్నంలో 38 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న వారం రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని, వర్షాలకు ఆస్కారం ఉండదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా కురిసినా తేలికపాటి వర్షం లేదా చిరు జల్లులకే పరిమితమవుతుందని పేర్కొంటున్నారు. అల్పపీడనాలు ఇప్పట్లో లేనట్టే.. సాధారణంగా ఆగస్టు ఆరంభం నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ప్రభావం చూపుతుంటాయి. వాటికి ద్రోణులు, ఆవర్తనాలు తోడై ఈ నెలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ.. ఇప్పటివరకు వాటి జాడ లేదు. దీంతో వానలు ముఖం చాటేశాయి. ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ముందస్తు అంచనాల్లో స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే పరిస్థితులు కొనసాగుతున్నాయి. -
విధ్వంసంతో ఆస్తులే కాదు, ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి
వాతావరణంలో గత కొన్నాళ్లుగా వచ్చిన మార్పుల వల్ల, కుంభవృష్టి, క్లౌడ్ బరస్ట్ లాంటివి సాధారణం అయిపోయాయి. విస్తారంగా.. అంటే అనేక చోట్ల కురవాల్సిన వర్షం ఒకే చోట కురిస్తే ?అదీ.. కేవలం కొద్దిసేపట్లో, నాలుగైదు రోజుల్లోనే ఏడాదంతా పడాల్సిన వర్షమంతా పడితే? వాగులు, వంకలు నిండిపోతాయి. కొండచరియలు విరిగిపడతాయి. నదులు పొంగి పొర్లుతాయి. గత నెల రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల వర్షాలు సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. దీని వల్ల వేల కోట్ల ఆస్తుల నష్టంతో పాటు వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ► జులై, ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో విహారయాత్రలు, తీర్థయాత్రలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా కొండ ప్రాంతాలకు పోవద్దు. చార్ధామ్, అమర్నాథ్ యాత్రలు చేయాలనుకునేవారు వర్షాకాలానికి ముందే ప్లాన్ చేసుకోండి. ► పొంగి ప్రవహిస్తున్న బ్రిడ్జిలు, కల్వర్ట్లు మొదలైన వాటిపై పయనించొద్దు. ప్రవహించే నీటి గతిశక్తిని తక్కువ అంచనా వేయొద్దు. నీరు వాహనంలోకి ప్రవేశిస్తే దాని బరువు పెరిగి, మునిగిపోతుంది. ► అనేక రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలు, డ్యాంల నిర్వహణ ఏమాత్రం బాగా లేదు. ఇప్పటికే అనేకం శిథిలావస్థకు చేరుకున్నాయి. దిగువ తట్టు ప్రాంతాల్లో ఉన్నవారు క్షేమంగా ఉండాలంటే, చెరువు కట్టలు, బ్యాములు సరిగా నిర్వహించేలా ప్రజాప్రతినిశులపై ఒత్తిడి తీసుకురండి. ఎందుకంటే.. అథిదులు ఇంటికొచ్చాక పంట పండించలేము కదా, అలాగే వర్షకాలంలో మేలుకుంటే సరిపోదు, డ్యాములు, బ్రిడ్జిలు లాంటి నిర్వహణ ఏడాది పొడవునా జరగాలి. ► ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో వీటి స్థితిపై స్ర్టక్చరల్ ఆడిటింగ్ జరగాలి. అవి ధృడంగా ఉన్నాయని ఇంజనీర్లు సర్టిఫై చేయాలి. లేకపోతే వానాకాలంలో నిద్రలోనే జలసమాధి అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది ► నదుల్లోకి దిగొద్దు. మీరు దిగినప్పుడు నీరు తక్కువ ఉండొచ్చు. కానీ ఎగువ ప్రాంతంలో డ్యాం తెరవడం, భారీ వర్షం లాంటి కారణాల వల్ల క్షణాల్లో నీటి ప్రవాహం పెరిగి ఉపద్రవం సంభవించవచ్చు. ► కొండమార్గాల్లో అంటే, ఘాట్రూట్లలో వర్షాకాలంలో ప్రయాణాలు వద్దు. భారీ వర్షాలు కురిసినప్పుడు పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడతాయి. ఒక పెద్ద బండరాయి క్షణాల్లో కిందకు వచ్చి అక్కడ పయనిస్తున్న వాహనాన్ని లోపలికి తీసుకొని వెళ్లిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ►ఎక్కడో కొండప్రాంతాల్లో కాదు.మహానగరాల్లో జలప్రళయం సాధారణం అయిపోయింది. చెరువులు కుంటలు ఉన్న ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకోవద్దు . స్మార్ట్ ఫోనుల్లో కంపాస్ అనేది ఉంటుంది . అందులో చెక్ చేసుకొంటే మీరున్న ప్రాంతం ఎత్తు ఎంతో , ఇట్టే తెలిసిపోతుంది . ► రాబోయే రోజుల్లో జలప్రళయాలు సాధారణం అయిపోతాయి. ప్రభుత్వాలు కూడా లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవి నివాస యోగ్యం కావని ముందే హెచ్చరికలు జారీ చెయ్యాలి. ఇంట్లోకి నీళ్లు ప్రవేశిస్తే ఇంట్లోని సామాగ్రి మొత్తం పాడై వేలల్లో నష్టం జరుగుతుంది. పాములు, తేళ్లు, మొసళ్లు వంటివి ఇంట్లోకి వస్తే ప్రాణానికే ప్రమాదం. ► చెట్లు నాటడం, వన సంరక్షణ, డ్రైనేజీ వ్యవస్థలు, బ్రిడ్జిలు ఇతరత్రా మౌలిక సదుపాయాల నిర్వహణ ప్రభుత్వాలు బాధ్యత . వాటిని ఆయా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదలకుండా ఏటా ఇంత అని టార్గెట్ పెట్టి ఆ లక్ష్యాన్ని అందుకోవడం తప్పని సరి చేస్తూ పార్లమెంట్ చట్టం తేవాలి . లక్ష్యాన్ని అందుకొని ప్రభుత్వాల పై రాజ్యాంగ పరమయిన చర్యలు ఉండాలి . ► అహ నా పెళ్ళంట సినిమా లో కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ " నా కేంటి .. నా కేంటి " అంటుంటుంది . మనం పడవ లో పయనిస్తున్నాము . దానికి చిల్లు పడితే అందరం పోతాము . మనం బతకాలంటే మంది కూడా బతకాలి అనే ఇంగిత జ్ఞానం ప్రజల్లో రావాలి. ఆలా కాకపోతే ఒక వర్షాకాలం రాత్రికి రాత్రే ఒక భారీ డ్యాం పగిలి ఒక పెద్ద నగరం, అనేక గ్రామాలు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. -వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త -
కనురెప్ప కంటే తక్కువ బరువు.. వర్షానికి వాసన ఉంటుందా?
వాన.. మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యం. అయితే, అది ఎక్కువైనా నష్టమే.. తక్కువైనా కష్టమే.. ఎక్కువగా కురిస్తే కష్టాలు, నష్టాలు, ప్రమాదాలు.. తక్కువగా పడితే కరువు, కాటకాలు. గతవారం రాష్ట్రంలో వానలు దంచి కొట్టాయి. ఫలితంగా చాలా ప్రాంతాలు నీట మునిగి, జనం ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కావడంతో మొన్నటి వరకు లోటు వర్షపాతం నమోదు కాగా, పది రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. పది రోజుల క్రితం 54శాతం లోటు వర్షపాతం ఉండగా.. ఇప్పుడు ఏకంగా 65 శాతం అధిక వర్షపాతానికి చేరింది.ఈ సంగతి అలా ఉంచితే.. మన నిత్య జీవితంతో ముడిపడి ఉన్న వాన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు చూద్దామా? చినుకు ఎలా ఉంటుందంటే.. సాధారణంగా వర్షపు చినుకులు బిందువుల మాదిరిగా ఉంటాయనుకుంటాం. కానీ అవి బన్ ఆకారంలో ఉంటాయి. ఒక మిల్లీమీటర్ కంటే తక్కువ వ్యాసార్ధం కలిగిన చినుకులు గోళాకారంలో ఉంటాయి. కాస్త పెద్ద చినుకులు హాంబర్గ్ బన్‌లా ఉంటాయి. అదే 4.5 మిల్లీమీటర్ల వ్యాసార్ధం కంటే పెద్ద చినుకులు పారాచూట్ తరహాలో మారి చిన్నచిన్న చినుకులుగా కింద పడతాయి. నిమిషంలో31.2 మిల్లీమీటర్ల వర్షం.. ఒక్క నిమిషంలో అత్యధికంగా కురిసిన వర్షం ఎంతో తెలుసా? 31.2 మిల్లీమీటర్లు. 1956 జూలై 4న అమెరికా మేరీల్యాండ్‌లోని యూనియన్విల్లేలో ఇది నమోదైంది. ఇక 1966 జనవరి 7 నుంచి మరుసటి రోజు వరకు 24 గంటల్లో కురిసిన 1825 మిల్లీమీటర్ల వర్షమే ఇప్పటివరకు నమోదైన అత్యధిక వర్షపాతం. అదే మనదేశంలో అయితే.. మేఘాలయలోని మౌసిన్రామ్లో 2022 జూన్ 17న 1003.6 మిల్లీమీటర్ల వర్షం కురిసి రికార్డు సృష్టించింది. మేఘాలయలోని చిరపుంజిలో 1860 నుంచి 1861 వరకు 365 రోజుల వ్యవధిలో కురిసిన 1,042 అంగుళాల (26,470 మిల్లీమీటర్లు) వర్షమే ఇప్పటివరకు ఉన్న మరో రికార్డు. మన రాష్ట్రం విషయానికి వస్తే.. మొన్న ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 24 గంటల్లో నమోదైన 649.8 మిల్లీమీటర్ల వర్షపాతమే అత్యధికం. ఒక్క చినుకూ చూడని ప్రదేశం.. భూమిపై అస్సలు వర్షమే పడని ప్రాంతం అంటార్కిటికాలోని మెక్ ముర్డో డ్రై వ్యాలీస్. ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఇప్పటి వరకు ఒక్క వర్షపు చినుకు కూడా చూడలేదు. ఇక చిలీలోని అటకామా ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో ఏడాదికి సగటున 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. అంటే దాదాపు లేనట్టేనన్నమాట. ప్రతి చుక్కా కిందకు పడదు.. వర్షపు చినుకు అన్ని సార్లూ భూమిని చేరదు. కొన్ని సందర్భాల్లో అవి భూమిపై పడకుండానే మాయమైపోతాయి. గాలి వేడిగా ఉన్నచోట్ల అక్కడే ఆవిరైపోతాయి. ఇలా భూమిని చేరకుండానే ఆవిరైపోయిన వర్షపు చినుకును విర్గా అంటారు. వర్షానికి వాసన ఉంటుందా? వర్షం వాసన భిన్నంగా ఉంటుంది. వాస్తవానికి స్వచ్ఛమైన నీటికి రంగు, వాసన ఉండవు. అయితే, వర్షం పడటం ప్రారంభమైనప్పుడు మట్టి వాసన వస్తుంది. ఇది నేల తేమ నుంచి వెలువడుతుంది. వర్షం నుంచి వచ్చే సువాసనను పెట్రిచోర్ అంటారు. 14 మైళ్ల వేగం.. 2 నిమిషాలు.. ఒక్క వర్షపు చుక్క భూమిని చేరుకోవడానికి సగటున దాదాపు 2 నిమిషాలు పడుతుంది. మేఘాల నుంచి వర్షపు చినుకులు పడే ఎత్తును బట్టి ఇది మారుతూ ఉంటుంది. వర్షపు చినుకులు గంటకు 14 మైళ్ల వేగంతో భూమి మీదకు పడతాయి. పెద్ద చినుకులైతే 20 మైళ్ల వేగంతో వస్తాయి. వర్షపు నీటిలోనూ విటమిన్.. వర్షపు నీటిలో విటమిన్ బీ12 ఉంటుంది. ప్రకృతిలో సహజంగా ఉండే అనేక సూక్ష్మజీవులు విటమిన్ బీ12ను ఉత్పత్తి చేస్తాయి. వర్షపు నీరు గాలిలోకి రాగానే ఈ సూక్ష్మజీవులు అందులో చిక్కుకుని విటమిన్ బీ12ను ఉత్పత్తి చేస్తాయి. కనురెప్ప కంటే తక్కువ బరువు.. సగటు వర్షపు చినుకు బరువు కేవలం 0.001 ఔన్సులు (0.034 గ్రాములు). అంటే మన కనురెప్ప కంటే తక్కువ బరువు అన్నమాట. -
వర్షం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయం, పశువుల గ్రాసం తదితర అంశాలపై ఆయన శనివారం వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్షించారు. ఆరు జిల్లాల్లోని 130 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, ఈ జిల్లాల్లో ఆగస్టులో కూడా వర్షాలు తక్కువ ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. అధిక వర్షాల కారణంగా వరి నారు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలంలో దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరా చేయాలని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయంపై వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఖరీఫ్ లో మొత్తం 34.39 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 9.22 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేశారని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణంకంటే 20 నుండి 50 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. కృష్ణా జిల్లాలో 60 శాతం పైగా అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 20 నుండి 59 మిల్లీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వర్షపాతం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం సుమారు 10 వేల క్వింటాళ్ల మినుము, పెసర, కంది, ఉలవ, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర విత్తనాలను ఏపీ సీడ్స్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. అధిక వర్షాలతో వరి నారు మడులు దెబ్బతిన్న రైతులకు స్వల్ప కాలంలో పంట దిగుబడినిచ్చే ఎంటీయూ 1010, 1121,1153, బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్ 34449 వరి విత్తనాలను సుమారు 30 వేల క్వింటాళ్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ హరికిరణ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బి.ఆర్.అంబేద్కర్, పశు సంవర్థక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్, ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు, మత్స్య శాఖ అదనపు సంచాలకులు డా. అంజలి, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు బాలాజీ నాయక్, వెంకటేశ్వర్లు తదితర అధికారులుపాల్గొన్నారు. -
పది రోజుల్లో నాలుగింతల వాన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా గత పది రోజుల పాటు కురిసిన వానలు వర్షపాతం రికార్డులను తారుమారు చేశాయి. పది రోజుల క్రితం 54% లోటు వర్షపాతం ఉండగా.. ఇప్పుడు ఏకంగా 65 శాతం అధిక వర్షపాతానికి చేరడం గమనార్హం. ఏటా జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఈ నాలుగు నెలల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా సగటున 73.91 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. ఇందులో జూలై 28వ తేదీ నాటికి 33.64 సెంటీమీటర్ల సగటు వర్షం కురవాలి. అయితే ఈ ఏడాది ఇదే సమయానికి ఏకంగా 55.75 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అంటే సాధా రణం కంటే 22.11 సెంటీమీటర్లు (65 శాతం) అధికంగా వానలు పడ్డాయి. కేవలం గత పదిరోజుల వర్షపాతాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. సాధారణం కంటే ఏకంగా నాలుగింతలు అధికంగా వర్షాలు కురిశాయి. లోటు నుంచి అధికం వైపు వాస్తవానికి ఏటా నైరుతి సీజన్ జూన్ 1 నుంచి ప్రా రంభమవుతుంది. ఆ నెల తొలి లేదా రెండో వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించి, వానలు మొదలవుతాయి. కానీ ఈసారి జూన్ నాలుగో వారంలో రుతుపవనాలు ప్రవేశించాయి. ఒకట్రెండు రోజులు మోస్తరు వానలు పడ్డాయి. తర్వాత రుత పవనాల కదలికలు మందగించి వర్షాలు జాడ లే కుండాపోయాయి. దీనితో లోటు పెరుగుతూ వచ్చింది. ఈ నెల 18 నాటికి 19.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంతో పోలిస్తే 54శాతం లోటు. కానీ 18వ తేదీ నుంచి వానలు మొదలయ్యాయి. తర్వాతి పది రోజులకుగాను 8రోజులు వానలు పడ్డాయి. దీనితో వర్షపాతం 54 శాతం లోటు నుంచి ఏకంగా 65 శాతం అధికానికి చేరింది. అంతటా కుండపోత వానలతో.. గత పది రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో అయితే 64.98 సెంటీమీటర్ల అతిభారీ వర్షం రికార్డు సృష్టించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని వాతావరణ శాఖ ప్రకటించింది కూడా. ఇక తొమ్మిది జిల్లాల్లో అయితే 50 సెంటీమీటర్లపైన సగటు వర్షపాతం నమోదవడం గమనార్హం. -
కృష్ణాలో పెరిగిన వరద
సాక్షి, అమరావతి/హొళగుంద(కర్నూలు)/శ్రీశైలం ప్రాజెక్ట్: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన వరద ఉద్ధృతి పెరుగుతోంది. సోమవారం ఆల్మట్టి డ్యామ్‌లోకి 1,14,445 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 64.41 టీఎంసీలకు చేరుకుంది. దాంతో ఆల్మట్టి డ్యామ్ సగం నిండినట్లయింది. మరో 65 టీఎంసీలు చేరితే డ్యామ్ పూర్తిగా నిండిపోతుంది. మహారాష్ట్ర, కర్ణాటకలో సోమవారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆల్మట్టిలోకి మంగళవారం వరద ఉద్ధృతి మరింత పెరగనుంది. ప్రస్తుతం ఆల్మట్టిలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాలకు.. స్థానికంగా కురిసిన వర్షాలు తోడవుతుండటంతో నారాయణపూర్ డ్యామ్‌లోకి 13,675 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో ఆడ్యామ్లో నీటి నిల్వ 19.09 టీఎంసీలకు చేరుకుంది. డ్యామ్ నిండాలంటే ఇంకా 18 టీఎంసీలు అవసరం. ఇక జూరాల ప్రాజెక్టులోకి 26,244 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో విద్యుదుత్పత్తి చేస్తూ 33,235 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం డ్యామ్‌లోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 4,045 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 35.47 టీఎంసీలకు చేరుకుంది. మూసీ ప్రవాహంతో నాగార్జునసాగర్‌కు దిగువన వరద స్థిరంగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 8,532 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.73 టీఎంసీలకు చేరుకుంది. మున్నేరు, వాగులు, వంకల నుంచి ప్రకాశం బ్యారేజ్‌లోకి 10,917 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 7,785 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 3,132 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యాంకు భారీగా వరద కృష్ణా నది ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ప్రవాహం జోరందుకుంది. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ 30 టీఎంసీలను దాటింది. సోమవారం ఉదయం 64,023 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. నీటి చేరిక ఇలాగే ఉంటే నెలాఖరు నాటికి డ్యాం నిండి ఎల్ఎల్సీ కింద వరి సాగుకు అవకాశం కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శివమొగ్గ, ఆగుంబే, వరనాడు, తీర్థనహళ్లి తదితర డ్యాంల ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వరద నీరు చేరికపై వారు నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం దిగువ కాలువకు తాగునీటి అవసరాలకు బోర్డు అధికారులు ఈ నెల 28 తర్వాత నీటిని విడుదల చేయనున్నారు. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా సోమవారం ఉదయం 1,602.84 అడుగులకు చేరుకుంది. అలాగే పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30 టీఎంసీల నిల్వ ఉంది. 24ఏఎల్ఆర్129: తుంగభద్ర రిజర్వాయర్‌లోకి చేరిన వరద నీరు 24ఎస్ఆర్ఐ 30ఏ – 812 అడుగులు వద్ద శ్రీశైలం డ్యాం నీటిమట్టం -
దంచికొడుతున్న వానలు.. ప్రమాద స్థాయిలో బొగత జలపాతం, రెడ్ అలర్ట్!
సాక్షి, వరంగల్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం ఏకధాటిగా వర్షం కురుస్తోంది. పలుచోట్ల ముసురులా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. వర్షాకాలం ఆరంభం తర్వాత తొలిసారిగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద క్రమంగా వరద పెరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి ప్రాణహిత వరద పోటెత్తడంతో 35 గేట్లు ఎత్తి 165,394 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు తుపాకులగూడెం వద్ద సమ్మక్క బ్యారేజ్ కి గోదావరితో పాటు ఇంద్రావతినది వరద భారీగా వచ్చి చేరుతుండడంతో 33 గేట్లు ఎత్తి లక్షా 95 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. వర్షం కారణంగా భూపాలపల్లిలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 8 వేల టన్నుల బోగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ములుగు జిల్లా వ్యాప్తంగా 8.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగ, కొన్నాయిగూడెంలో అత్యధికంగా 9.84 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాజేడు మండలం బొగత జలపాతంకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రమాద స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతోంది జలపాతం వద్దకు పర్యటకుల సందర్శనను ఫారెస్ట్ అధికారులు నిలిపివేశారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. (కిలో కూరగాయలు రూ.20కే!.. ఎక్కడో తెలుసా!) ఉప్పొంగిన వాగులు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవాహిస్తున్నాయి. దీంతో అనేక గ్రామాల ప్రజలు బాహ్యప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కుమ్రంబీమ్ జిల్లా లో పెన్ గంగా, ప్రాణహిత పరివాహక ప్రాంతాలలో కలెక్టర్ హెమంత్ బోర్కడే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాగా, ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో అతిభారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. (ఇండియానే కాదు, చైనాను కూడా వర్షాలు వణికిస్తున్నాయి) -
వర్షంలోనూ బారులు తీరిన ఓటర్లు.. మరోవైపు ఓటింగ్ సామాగ్రి ధ్వంసం..
కలకత్తా: పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేడు జరుగుతోంది. ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. 24 దక్షిణ పరగణా జిల్లాల్లో వర్షం పడుతున్నా జనం లెక్కచేయకుండా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. గొడుగుల సహాయంతో క్యూ లైన్లలో నిలబడ్డారు. అటు.. గవర్నర్ సీవీ ఆనంద్ ఓటింగ్‌లో పాల్గొనేందుకు బసుదేబ్‌పూర్ బూత్‌కు వెళుతున్న క్రమంలో సీపీఐఎమ్ అభ్యర్థులు ఆయన్ను అడ్డగించారు. #WATCH | West Bengal #PanchayatElection23 | Voters queue up at a polling station in Basanti of South 24 Parganas district amid rainfall as they await their turn to cast a vote. pic.twitter.com/Iq7xBpbpft — ANI (@ANI) July 8, 2023 బ్యాలెట్ పేపర్లకు నిప్పింటించి.. కాగా.. పలు ప్రాంతాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల మాత్రం హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. కూచ్‌బిహార్ జిల్లాలోని సిటాయ్ ప్రాతంలో ఓ ప్రైమరీ పాఠశాలలో పోలింగ్‌కు ఏర్పాట్లు చేయగా.. దుండగులు పోలింగ్ సామాగ్రిని ధ్వంసం చేశారు. బ్యాలెట్ పేపర్లకు నిప్పింటించారు. #WATCH | Polling booth at Baravita Primary School in Sitai, Coochbehar vandalised and ballot papers set on fire. Details awaited. Voting for Panchayat elections in West Bengal began at 7 am today. pic.twitter.com/m8ws7rX5uG — ANI (@ANI) July 8, 2023 63,229 సీట్లకు పోలింగ్.. పశ్చిమ బెంగాల్లో 63,229 గ్రామ పంచాయతీ సీట్లకు నేడు ఎన్నికలు జరగుతున్నాయి. 9,730 పంచాయతీ సమితీలకు, 928 జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలీంగ్ నిర్వహిస్తున్నారు. కాగా.. జులై 11న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. ఇదీ చదవండి: అవినీతే కాంగ్రెస్ ఊపిరి -
పాకిస్థాన్‌లో భారీ వర్షం...రోడ్లన్ని జలమయం (ఫొటోలు)
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో రెండు రోజులు వానలు..
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దానికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వరకు విస్తరించింది. దీని ఫలితంగా రాబోయే రెండ్రోజుల్లో ఇవి ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా కదిలే అవకాశముంది. వీటి ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండే అవకాశం లేకపోయినా ఓ మోస్తరు వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖాధికారులు (ఐఎండీ) ఆదివారం రాత్రి తెలిపారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు బలంగా ఉండడంతో ఈ నెల 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. కాగా, అల్పపీడనం ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. ఇక ఆదివారం తూర్పుగోదావరి, శ్రీకాకుళం, గుంటూరు, నంద్యాల, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పైడిమెట్ట (తూర్పు గోదావరి)లో 5.9, ఆమదాలవలస (శ్రీకాకుళం)లో 4.1, రావెల (గుంటూరు)లో 4, జియ్యమ్మవలస (పార్వతీపురం మన్యం)లో 4, ముత్తాల (అనంతపురం)లో 3.4, జొన్నగిరి (కర్నూలు) 3.2 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో లోటు వర్షపాతం నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం ప్రభావం రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోంది. వీటి ఆగమనంలో జాప్యం జరగడంతో సకాలంలో వర్షాలు కురవక 20 జిల్లాల్లో లోటు వర్షపాతానికి దారితీసింది. నాలుగు జిల్లాల్లో సాధారణం, రెండు జిల్లాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది. జూన్ ఒకటి నుంచి మొదౖలెన నైరుతి రుతుపవనాల సీజనులో ఇప్పటివరకు రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో సాధారణం కంటే 68.1 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. ఆ జిల్లాలో 45.8 మి.మీ.ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా ఇప్పటివరకు 14.6 మి.మీ.లు మాత్రమే వర్షం కురిసింది. అత్యధికంగా బాపట్ల జిల్లాలో సాధారణంకంటే 38.5 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అక్కడ సాధారణ వర్షపాతం 58.2 మి.మీ.లకు గాను 81.2 మి.మీ.ల వర్షపాతం రికార్డయింది. ఇక సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలో కృష్ణా, పల్నాడు, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాలున్నాయి. ఈ సీజనులో ఇప్పటివరకు సగటున 84.2 మి.మీల వర్షపాతం కురవాల్సి ఉండగా, 56 మి.మీలు మాత్రమే కురిసింది. -
అదను దాట లేదు... ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్ అదను దాటలేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు భరోసా ఇచ్చింది. పంటలను విత్తుకోవడానికి సమయం దాటిపోలేదని విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ పి.రఘురామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీచేశారు. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. ఈ నెల ఒకటిన కేరళను తాకవలసిన రుతుపవనాలు 8వ తేదీకి వచ్చాయని, ఈ సమయంలో గుజరాత్ తీరంలో ఏర్పడిన తుపాను వల్ల మన రాష్ట్రానికి రుతుపవనాల రాక ఆలస్యమైందని పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడతాయన్న ఆయన.. పంటలవారీగా రైతులకు కొన్ని సలహాలు ఇచ్చారు. ఏ పంట? ఎప్పటివరకు ? వరి: ఇప్పుడు నార్లు పోసుకోవాలనుకునే రైతులు కేవలం స్వల్పకాలిక (125 రోజుల కన్నా తక్కువ) వరి రకాలను మాత్రమే విత్తుకోవాలి. నేరుగా విత్తే పద్ధతులపై (దమ్ముచేసి లేదా దమ్ము చేయకుండా) రైతాంగం శ్రద్ధ పెట్టాలి. పత్తి: జూలై 20 వరకు విత్తుకోవచ్చు.ౖ తేలిక నేలల్లో 50–60 మిల్లీమీటర్లు, బరువు నేలల్లో 60–75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే పత్తిని విత్తుకోవాలి. పత్తిలో అంతరపంటగా కంది మంచి లాభాలు ఇస్తుంది. కాబట్టి అంతర పంటగా కందిని సాగు చేపట్టాలి. కంది పంట: సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా ఆగష్టు 15 వరకు కందిని విత్తుకోవచ్చు. పెసర, మినుము, వేరుశనగ, పత్తి, ఆముదం సహా ఇతర పంటలతో అంతర పంటగానూ విత్తుకోవచ్చు. సోయాచిక్కుడు: జూన్ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే జూలై మొదటి వారంలో విత్తినా సోయాలో మంచి దిగుబడులు సాధించవచ్చు. మొక్కజొన్న: జూలై 15 వరకు విత్తుకోవచ్చు. నీటి ఎద్దడిని మొక్కజొన్న తట్టుకోలేదు. కాబట్టి బోదె, సాళ్ళ పద్ధతి ఆచరించడం ద్వారా పంటకు ఎక్కువ కాలం తేమ అందుబాటులో ఉంచవచ్చు. పెసర, మినుము: ఈ పంటలనుౖ జూలై 15 వరకు విత్తుకోవచ్చు. సరైన మొక్కల సంఖ్యను పాటించడం ద్వారా ఆశించిన దిగుబడులు పొందవచ్చు. ఇతర ఆరుతడి పంటలైన ఆముదం, పొద్దు తిరుగుడు, ఉలువలను జూలై 31 వరకు సాగు చేసుకోవచ్చు. కాబట్టి రైతాంగం ఆందోళన పడవలసిన అవసరం లేదు. -
ఊపిరి పీల్చుకున్న జనం! ఒక్కసారిగా మారిన వాతావరణం.. విజయవాడలో భారీ వర్షం
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భగ భగ మండే ఎండల నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పోందుతున్నారు. తాజాగా విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దాదాపు రెండు గంటలుగా భారీ వర్షం కురుస్తుండటంతో నగర వాసులకు ఊరట లభించింది. భారీ వర్షం నేపథ్యంలో నగరంలోని పలు రోడ్లు జలమయ్యాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా బిపర్ జోయ్ తుపాను కారణంగా విస్తరణ ఆలస్యం కావడంతో రైతులు, సాధారణ ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో.. తెలంగాణలో వేడిగాలులు, ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం రంగారెడ్డి జిల్లాలో షాద్‌నగర్‌లో వర్షం కురవగా.. హైదరాబాద్‌లో ఎండలు కాస్తున్నాయి. చదవండి: 5 తరాలు, 85 మంది కుటుంబ సభ్యులు.. 102 ఏళ్ల బామ్మకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు -
అల్పపీడనంగా మారుతున్న ‘బిపర్జోయ్’.. ఆ ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ
న్యూఢిల్లీ: గుజరాత్ తీరప్రాంత జిల్లాలను అతలాకుతలం చేసిన బిపర్జోయ్ తుపాను తాజాగా రాజస్తాన్‌పై ప్రతాపం చూపుతోంది. దీని ప్రభావం కారణంగా రాజస్థాన్, గుజరాత్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బిపార్జోయ్ తుఫాను ప్రస్తుతం అల్పపీడనంగా మారుతోందని తెలిపింది. ముఖ్యంగా దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్‌లోని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మత్స్యకారులు వెటకు వెళ్లద్దని హెచ్చరికలు జారీ చేశారు. భారత వాతావరణ విభాగం (IMD) డైరెక్టర్ జనరల్, మృత్యుంజయ్ మహపాత్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం నుంచి బుధవారం వరకు తూర్పు, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాల పురోగతికి ఈ పరిస్థితులు అనుకూలంగా మారుతాయని తెలిపారు. బైపోర్‌జోయ్ గుజరాత్‌లోని తీరప్రాంతాల్లో విధ్వంసాన్ని సృష్టించింది ఆ ప్రాంత ప్రజల రోజూవారి జీవనాన్ని స్తంభింపచేసింది. ముఖ్యంగా కచ్ జిల్లాలో ఇది ఎక్కువ ప్రభావం చూపింది. In 1999, a Super Cyclone that struck #Odisha claimed 10,000+ lives…back then, #india had only PSLV rocket& 4 sats Today, India has 50+ sats & 4 rockets, #BiparjoyCyclone barrels into #Gujarat and there’s 2 casualties That’s the power of #space #tech for you 🇮🇳🚀#isro #imd pic.twitter.com/2zhpyslRg5 — Sidharth.M.P (@sdhrthmp) June 16, 2023 తెలుగు రాష్ట్రాలపై ప్రభావం.. సాధారణంగా ఈపాటికే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొట్టాలి. కానీ, ఎర్రటి ఎండలు మాత్రం మే నెలను తలపిస్తున్నాయి. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను.. రుతుపవనాలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే కొనసాగుతుండగా.. వర్షాలు ఇంకా ఆలస్యంగా కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. Fresh visuals of #BiparjoyCyclone hitting Kutch coastal areas of Gujarat with a wind velocity of approximately 145 kmph during #LANDFALL#Gujaratcyclone #BiparjoyUpdate #BiparjoyNews pic.twitter.com/IbshQG4LYW — BN Adhikari, IIS(Rtd) (@AdhikariBN) June 15, 2023 The Depression (Remnant of Cyclonic Storm ‘Biparjoy’) over central parts of South Rajasthan & neighbourhood at 2330 IST of 17th June, about 60 km SSW of Jodhpur. Very likely to continue to move ENE-wards and maintain the intensity of Depression till forenoon of 18th June. pic.twitter.com/CMb5sfee8H — India Meteorological Department (@Indiametdept) June 17, 2023 -
ఈసారి సాధారణ వర్షపాతమే
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశవ్యాప్తంగానూ 87 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతమే నమోదవుతుందని తెలిపింది. ఈ మేరకు ఐఎండీ హైదరాబాద్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తొలి ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సీజన్లో రాష్ట్రంలో సాధారణ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించే తొలి నెల జూన్‌లో వర్షాలు సాధారణం కంటే తక్కువగా పడతాయని, జులై నుంచి క్రమంగా పుంజుకుంటాయని వెల్లడించింది. జూన్ మొదటి వారమంతా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. పెరగనున్న ఉష్ణోగ్రతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. గత రెండ్రోజులుగా పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతుండగా... ఇకపై మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చేనెల మొదటి వారమంతా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలే 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవ్వచ్చని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి వాయవ్య, పశ్చిమ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలు లు వీస్తున్నట్లు సూచించింది. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లా దామెరచర్లలో 44.3 డిగ్రీల సెల్సియస్, నల్లగొండలో 42.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం వానాకాలాన్ని తలపిస్తోంది. పొద్దంతా ఎండ తీవ్రంగా ఉన్నా.. సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడి వానలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలూ బాగా తగ్గి చలి వేస్తోంది. నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలుచోట్ల ఈ పరిస్థితి కనిపించగా.. మరో మూడు రోజులూ ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ చుట్టూ భారీగా.. పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీనికితోడు రాష్ట్రానికి దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండ్రోజులు హైదరాబాద్, పరిసర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలుచోట్ల సగటున 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు కుండపోత వానలు పడొచ్చని ప్రకటించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, పలుచోట్ల వడగళ్లు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా వానలే.. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఒక్కరోజే రాష్ట్రంలో సగటున 2.32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా వానాకాలంలోనే ఇలా వర్షపాతం నమోదవుతుంది. అలాంటిది ఈసారి నడి వేసవిలో కురుస్తున్నాయి. బుధవారం రాష్ట్రంలో 0.02 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఏకంగా 2.32 సెంటీమీటర్లు కురవడం గమనార్హం. ప్రాంతాల్లో సిద్దిపేట.. జిల్లా సగటులో నారాయణపేట అత్యధికంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో 10 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 9, భువనగిరిలో 9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఇక జిల్లా సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే.. నారాయణపేటలో 4.5 సెంటీమీటర్లు, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 4.48, యాదాద్రి భువనగిరిలో 3.88, వికారాబాద్ 3.66, మహబూబ్‌నగర్ 3.54, జోగుళాంబ గద్వాలలో 3.49 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తగ్గిన ఉష్ణోగ్రతలు వరుస వానల నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం గరిష్టంగా నల్లగొండలో 38.5 డిగ్రీలుగా నమోదవడం గమనార్హం. ఇక హనుమకొండలో కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలకు పడిపోయింది. వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకన్నా తక్కువగానే నమోదవుతాయని, పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయి చలి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. -
తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజుల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య మధ్యప్రదేశ్ నుంచి ఇంటీరియర్ మహారాష్ట్ర, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతాయని సూచించింది. శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 39.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 21.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. చదవండి: సాగర తీరాన పాలనా సౌధం.. ధగధగల సచివాలయం.. వైరల్ ఫోటోలు -
ఎల్లో అలర్ట్.. నేడు, రేపు ఆ ప్రాంతాల్లో వడగండ్ల వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నాయి. శని, ఆదివారాల్లో పలుచోట్ల 41 డిగ్రీ సెల్సీయస్ నుంచి 43 డిగ్రీ సెల్సీయస్ మధ్యన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలా బాద్‌లో 42 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20.3 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో కొన్నిచోట్ల వడగండ్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లా ల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా వడగండ్ల వర్షాలు కురుస్తాయని సూచించింది. చదవండి: సమ్మర్ టూర్.. వెరీ ‘హాట్’ గురూ! -
తెలంగాణ: రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత రెండు రోజులుగా కొనసాగిన ఉపరితల ద్రోణి శనివారం బలహీనపడింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది. మరో రెండ్రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే..గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 37.9 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 19.8 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. -
వదలని వానలు.. మరో మూడురోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. దాదాపు వారం రోజుల నుంచి వానలు కురుస్తున్నాయి. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, కొన్నిచోట్ల భారీగాను వర్షాలు పడుతున్నాయి. అంతర్గత తమిళనాడు నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ప్రస్తుతం రాయలసీమ నుంచి దక్షిణ జార్ఖండ్ వరకు తెలంగాణ, ఒడిశాల మీదుగా సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడురోజులు ఉత్తర, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం అనకాపల్లి, కాకినాడ, ఎస్పీఎస్సార్ నెల్లూరు, కృష్ణాజిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లిలో 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సామర్లకోటలో 7.8 సెంటీమీటర్లు, యలమంచిలిలో 7.7, కావలిలో 4.6, గుడివాడలో 4.2, మల్లాదిలో 3.7, ఉప్పలపాడులో 3.5 సెంటీమీర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
నిండా ముంచిన అకాల వర్షాలు.. 16 జిల్లాలపై ప్రభావం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంలోని 16 జిల్లాలపై ప్రభావాన్ని చూపాయి. నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, విజయనగరం, వైఎస్సార్, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, గుంటూరు, చిత్తూరు, పార్వతీపురం మన్యం, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ఏలూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని 119 మండలాల పరిధిలో 372 గ్రామాల్లో భారీ వర్షాల వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాగా వర్షాలు, పిడుగులకు 951 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం.. సుమారు 20 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికార యంత్రాంగం తేల్చింది. పలుచోట్ల విద్యుత్ లైన్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. పిడుగులు పడే అవకాశం కాగా మరో మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అంతర్గత తమిళనాడు నుంచి మధ్య ఛత్తీస్‌గఢ్ వరకు కర్ణాటక, రాయలసీమ, తెలంగాణల మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ.ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులకు ఆస్కారం ఉందని పేర్కొంది. కాగా సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. -
సమృద్ధిగా భూగర్భ జలాలు
ఆకివీడు: గోదావరి నది, కృష్ణా నదులకు శివారు ప్రాంతంగా ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత మూడేళ్లుగా భూగర్భ జలాలు సమృద్ధిగానే ఉన్నాయి. భూమికి రెండు మూడు అడుగుల నుంచి 100 అడుగుల వరకూ నీటి మట్టం ఉంది. 2020, 2021, 2022 సంవత్సరాల్లో వర్షాలు అధికంగా కురిశాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువడంతో లక్షలాది క్యూసెక్కుల నీరు పొంగి ప్రవహించింది. భూగర్భ జలాల నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి వర్షాలు, వాయుగుడం ప్రభావం, తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిస్తే మే నెలలో కూడా నీటి మట్టం యథావిధిగా ఉండే అవకాశం ఉందని భూగర్భజలవనరుల శాఖ చెబుతోంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో 17.12 మీటర్ల సరాసరి నీటి మట్టం ఉంది. ఈ ఏడాది ఏలూరు జిల్లా పరిధిలో 16.73 మీటర్ల సరాసరి నీటి మట్టం ఉంది. అధిక వర్షాలతో నీటి మట్టం నిలకడగా ఉంది. ఈ ఏడాది ఏలూరు జిల్లా పరిధిలో ఆగస్టు నెలలో సరాసరి నీటి మట్టం 20.53 మీటర్లు, సెప్టెంబర్‌లో 19.12, అక్టోబర్‌లో 16.73, నవంబర్‌లో 14.09 మీటర్లు నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో నీటి మట్టాలు గత ఏడాది కన్నా పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలోని 19 మండలాల్లో భూగర్భ జలాల లోతును పరీక్షిస్తే కాళ్ల మండలంలో నీటి మట్టం భాగా అడుగుకు ఉంది. సముద్ర తీర ప్రాంతం, ఉప్పుటేరుకు చేర్చి మండలం ఉన్నప్పటికీ భూమి పొరలలో నీటి చేరిక అంతంత మాత్రంగానే ఉందని చెబుతున్నారు. గత మూడు నెలల పరీక్షా ఫలితాల్లో నీటి మట్టం సరాసరిన ఆగస్టులో 26.5, సెప్టెంబర్ నెలలో 26.19, అక్టోబర్ నెలలో 27.72 మీటర్లుంది. ఇవే నెలలో నీటి మట్టం బాగాపైకి ఉన్న మండలాల్లో ఆగస్టులో ఆకివీడు మండలం 0.25, సెప్టెంబర్‌లో ఆకివీడు మండలంలో 1.5 మీటర్లు, అక్టోబర్‌లో ఉండి మండలంలో 0.45 మీటర్ల నీటి మట్టం ఉంది. మార్చి నెల వరకు నీటి మట్టాలు సరాసరి ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. నిండు కుండలా కొల్లేరు సరస్సు ప్రపంచ ప్రసిద్ది గాంచిన కొల్లేరు సరస్సు ఉనికిని కోల్పోయే విధంగా గత రెండు దశాబ్ధాలుగా బీడు పడి, నెరలు దీసి ఉంది. సుమారు 75 వేల ఎకరాల్లో ఉన్న కొల్లేరు సరస్సులో నీటి మట్టం తగ్గిపోవడంతో వేలాది పక్షులు వలసలు పోయాయి. కొన్ని చనిపోయాయి. గత మూడేళ్లుగా ఉమ్మడి జిల్లాలోనూ, ఎగువ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు కొల్లేరు నీటి మట్టం క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం మూడు, నాలుగు కాంటూర్ల పరిధిలో నీటి మట్టం 1.6 మీటర్ల నిలబడి ఉంది. సహజంగా సరస్సు నీటి మట్ట 1.2 మీటర్లు మాత్రమే ఉండేది. జూలై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలకు నీటి మట్టం భారీగా పెరిగింది. పెరిగిన నీటి మట్టం పశ్చిమగోదావరి జిల్లాలో సరాసరి భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. కొన్ని మండలాల్లో రెండు మూడు అడుగుల లోతులో, మరి కొన్ని మండలాల్లో 70 నుంచి 90 అడుగుల లోతులో నీటి మట్టం ఉంది. భారీ వర్షాలకు ఈ ఏడాది భూగర్భ జలాల నీటి మట్టం పెరిగింది. – కె.గంగాధరరావు, జిల్లా భూగర్భజల వనరుల శాఖ అధికారి, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం సరాసరి నీటి మట్టం 16.73 ఉమ్మడి జిల్లాలో గత మూడేళ్లలో నీటి మట్టం సరాసరి 16.73 ఉంది. వాటర్ లెవెల్స్ బాగా పెరిగాయి. ఆగస్టులో 20.53, సెప్టెంబర్‌లో 19.12, అక్టోబర్‌లో 16.73, నవంబర్‌లో 14.09 మీటర్లతో భూమి లెవిల్‌కు నీటిమట్టం పెరిగింది. – పీఎస్ విజయ్‌కుమార్, డీడీ, భూగర్భ జలవనరుల శాఖ, ఏలూరు జిల్లా -
కొనసాగుతున్న కుండపోత వర్షాలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలోని పల్నాడు, గుంటూరు, బాపట్ల, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని పలుచోట్ల ఆదివారం భారీ వర్షాలు కురవగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఆ జిల్లా వ్యాప్తంగా సగటున 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో 13.2 సెం.మీ. వర్షం పడింది. కారెంపూడి మండలం శంకరపురంసిద్ధాయిలో 8.6 సెం.మీ, నకరికల్లు మండలం చాగల్లులో 7.3, నాదెండ్ల మండలం గణపవరంలో 7, సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో 6.5 సెం.మీ. వర్షం కురిసింది. ఇక కాకినాడ సిటీలో పలుచోట్ల 15–16 సెంటీమీటర్ల వర్షం పడింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం ఈస్ట్ వీరయ్యపాలెంలో 6.1, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెలలో 6.1, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 5.9, గుంటూరు జిల్లా తాడికొండ మండలం బెజత్పురంలో 5.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని నల్లడ్రెయిన్కు గండి పడింది. ఫలితంగా వందలాది ఎకరాల్లోకి నీళ్లు చేరాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఆదివారం సగటు వర్షపాతం 28.6 మి.మీ., కృష్ణా జిల్లాలో 16.3 మి.మీ.గా నమోదైంది. ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఒంగోలు నగరంలో ముసురుపట్టినట్లు రోజుకు నాలుగైదుసార్లుగా వర్షం పడుతూనే ఉంది. నల్లవాగు, చిలకలేరు వాగులు ప్రవహిస్తున్నాయి. మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ వాగు ఎగువన కురిసిన వర్షాలకు మల్లవరం రిజర్వాయర్ ద్వారా శనివారం అర్ధరాత్రి నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు మండలాల్లో వర్షం కురిసింది. ప్రకాశం బ్యారేజ్‌కు భారీ వరద విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలోకి ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఆదివారం బ్యారేజీకి చెందిన 70 గేట్లను ఎత్తి వరద నీటిని సముద్రంలోకి వదిలేశారు. ఎగువ నుంచి 5,09,431 క్యూసెక్కుల వరద వస్తుండగా, కాలువలకు 2,827 క్యూసెక్కులు, సముద్రంలోకి 5,06,604 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ ఏడాది కృష్ణానదికి ఐదు లక్షల క్యూసెక్కుల పైబడి వరద రావడం ఇదే తొలిసారి. అలాగే, జూన్ 1 నుంచి ఆదివారం ఉ.6 గంటల వరకూ మొత్తం 1,035.768 టీఎంసీలు కడలిలో కలవడం గమనార్హం. అలాగే, నాగార్జునసాగర్‌లో 22 క్రస్ట్‌గేట్ల ద్వారా నీరు విడుదలవుతోంది. ఇక ఆదివారం సా. 6 గంటలకు శ్రీశైలంలోకి 4,01,187 క్యూసెక్కులు చేరుతుండటంతో తొమ్మిది గేట్లను పది అడుగుల మేర ఎత్తి 3,59,978 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సాగర్ జలాశయం నుంచి దిగువకు 3,67,443 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో శనివారం నుంచి ఆదివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 14.650 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.760 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. -
ఏపీలో మూడు రోజులు వానలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రెండు, మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం ఉత్తర–దక్షిణ ద్రోణి ఛత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక పరిసరాల వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనిస్తోంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే రెండ్రోజులుగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో దీని ప్రభావం మరింత ఎక్కువ ఉండడంతో అక్కడ వానలు ఎక్కువ పడుతున్నాయి. బుధవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఈనెల 9న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నాయి. ఇటు ద్రోణి, అటు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో బుధవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో ఉత్తరకోస్తాలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమలోని కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ పిడుగులకు ఆస్కారం ఉందని పేర్కొంది. రానున్న మూడు రోజులు తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించింది. కాగా మంగళవారం రాత్రి వరకు వెంకటగిరిలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్లు, సీతానగరం 8.8, బొబ్బిలి 8.3, సాలూరు 7.3, కొయ్యూరు 6.6, లింగసముద్రం 6.1, అమలాపురం 5.8, చోడవరం 5.2, గోకవరం 5.0, గుత్తి (అనంతపురం జిల్లా)లో 4.2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
సెప్టెంబర్‌లో వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అలర్ట్!
న్యూఢిల్లీ: సెప్టెంబర్‌లో కూడా అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతీ రుతుపవనాలు ముందుగానే నిష్క్రమించవచ్చంటూ గత వారం వేసిన అంచనాలను వెనక్కు తీసుకుంది. అవి మరికొంతకాలం కొనసాగుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర గురువారం మీడియాకు వెల్లడించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం తదితరాలు ఇందుకు కారణమని చెప్పారు. వాటి ప్రభావంతో ఉత్తరప్రదేశ్, బిహార్లలో రానున్న రెండు మూడు రోజుల్లో భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తమ్మీద సాధారణం కంటే 7 శాతం దాకా ఎక్కువ వర్షపాతం నమోదైనా యూపీ, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్, మణిపూర్, త్రిపురల్లో పలు ప్రాంతాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. ఇది ఖరీఫ్ సీజన్లో వరి నాట్లపై బాగా ప్రభావం చూపింది. ఈ లోటును సెప్టెంబర్ వర్షపాతం భర్తీ చేస్తుందని మహాపాత్ర ఆశాభావం వెలిబుచ్చారు. చదవండి: భారీ అగ్నిప్రమాదం.. 300 ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్న లారీలో పేలుడు -
ఈ మాత్రం జాగ్రత్తలు పాటించకుంటే ముందే నిమజ్జనం అవుతాం స్వామీ!
ఈ మాత్రం జాగ్రత్తలు పాటించకుంటే ముందే నిమజ్జనం అవుతాం స్వామీ! -
భాగ్యనగరంలో కురుస్తున్న భారీ వర్షం
-
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని మరోసారి కారుమబ్బులు కమ్మేశాయి. జంటనగరాల్లో శుక్రవారం సాయంత్రం కుండపోతగా వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ, కూకట్ పల్లి, షేక్‌పేట, టోలీచౌకి, రాయదుర్గం, గచ్చిబౌలి, నిజాంపేట, మూసాపేటలో భారీగా వానలు కురిసాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. The entire street in #Begumpet is flooded with just 15 mins of rain. #hyderabadrains#flooding pic.twitter.com/gi97UHAGsG — Renuka Kalpana (@RenukaKalpana) July 29, 2022 ఇక ఒక్కసారిగా వరుణుడు దంచికొట్టడంతో సికింద్రాబాద్‌లోని పలు కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. ఏకధాటిగా గంటసేపు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.మోకాళ్ల లోతుకుపైగా వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల ద్విచక్ర వాహనాలు సగం వరకు నీట మునిగాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. Dark clouds, heavy rain and gusty winds. Rumbling skies at Motinagar, Hyderabad feels like evening at 3.30pm#HyderabadRains @Hyderabadrains @balaji25_t @HYDmeterologist @Rajani_Weather pic.twitter.com/rIHnP7fh2C — CheppanuBrother (@thelisitheliyak) July 29, 2022 పొంగిపొర్లుతున్న రహదారులు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్ బి కాలనీ నాలుగో డివిజన్లో గంట సేపుగా కురిసిన కుండపోత వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. School van got stucked in heavy rain, trying to help them out #Stay safe #hyderabadrain #Hyderabad pic.twitter.com/VBC0e12QDS — Süråj Rôy (@SurajRoy__) July 29, 2022 ► చెర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎటు చూసినా రోడ్లపై నీరు చేరడంతో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Airport Authorities & GHMC are responsible for this mess created in Gaganvihar colony Begumpet. Knee deep water has entered the houses here. @GHMCOnline @CommissionrGHMC @EE_Begumpet @DcBegumpet @AAI_Official @KTRTRS #telanganafloods #hyderabadrain pic.twitter.com/sNsYRBFnt7 — Bhaskar Rao (@Bhaskar70113973) July 29, 2022 ► కుషాయిగూడ ,సైనిక్‌పురి, కాప్రా, చర్లపల్లి, దమ్మైగూడ, కీసర పరిసర ప్రాంతాలలో భారీ వర్షం ► ఉప్పల్, రామంతాపూర్, చిలుకానగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్, మేడిపల్లిలో భారీ వర్షం ►ఎల్బి నగర్, వనస్థలిపురం, బి ఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, అబ్దుల్లా పూర్ మెట్టు, పెద్ద అంబర్ పేటలో గాలులతో కూడిన భారీ వర్షం. ► ముషీరాబాద్, రాంనగర్, కవాడిగూడ, చిక్కడపల్లి, గాంధీనగర్, అశోక్ నగర్ , ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్ కాచిగూడ లో వర్షం ►దిల్ సుఖ్ నగర్, చైతన్య పురి, కొత్త పేట్, సరూర్ నగర్, అబిడ్స్, కోఠి , నాంపల్లి, బషీర్ బాగ్, లకిడికాపుల్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం. ►అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట్, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్ వర్షం. ►ముషీరాబాద్, రాంనగర్, కవాడిగూడ, చిక్కడపల్లి, గాంధీనగర్, అశోక్ నగర్ , ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్ కాచిగూడ లో వర్షం ► దిల్ సుఖ్ నగర్, చైతన్య పురి, కొత్త పేట్, సరూర్ నగర్, అబిడ్స్, కోఠి , నాంపల్లి, బషీర్ బాగ్, లకిడికాపుల్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం. ► అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట్, మణికొండ, పుప్పాలగూడ ,కాటేదాన్ వర్షం. #hyderabadrain when it rains, it pours in Hyderabad. And every year we face this and govt is busy constructing stories about cloud burst. @HiHyderabad @DonitaJose @CoreenaSuares2 @nimishaspradeep pic.twitter.com/GUrV3Yjq8t — Avinash | అవినాష్ (@avinash9999) July 29, 2022 -
‘కృష్ణా’లో బోటింగ్ బంద్
భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో టూరిజం శాఖ బోటింగ్ కార్యకలాపాలు మళ్లీ బంద్ అయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుంచి నాలుగైదు రోజుల పాటు బోటింగ్ రాకపోకలను నిలిపివేసిన అధికారులు ఎగువ నుంచి వచ్చే వరద నీటి ఉధృతి తగ్గటంతో తిరిగి ప్రారంభించారు. శనివారం శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడం, శుక్రవారం రాత్రి నుంచి 48 గంటల పాటు పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల కారణంగా ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా కృష్ణా నదిలో బోటింగ్ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలని ఏపీటీడీసీ అధికారులను ఆదేశించారు. దీంతో భవానీపురంలో ఉన్న హరిత బరంపార్క్‌లోని బోటింగ్ పాయింట్ వద్ద బోట్లను నిలుపుదల చేశారు. భవానీ ద్వీపంలో కాటేజీల్లో ఇప్పటికే ఉన్న పర్యాటకుల రాకపోకలకు, అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కోసం బోట్లను పరిమితంగా నడుపుతున్నారు. జలవనరుల శాఖ అధికారులు తిరిగి ఆదేశాలు ఇచ్చిన తరువాతే బోటింగ్ కార్యకలాపాలను ప్రారంభిస్తామని ఏపీ టూరిజం అధికారులు వెల్లడించారు. -
Andhra Pradesh Rains: వానలే వానలు.. వరదెత్తిన నదులు
సాక్షి,అమరాతి/సాక్షినెట్‌వర్క్: పరీవాహక ప్రాంతాల(బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, కృష్ణా నదులు వరదెత్తాయి. తెలంగాణ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాల్లో శనివారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. భారీగా వరద వస్తుండటంతో తెలంగాణలోని ఎస్సారెస్సీ రెండు రోజుల్లో నిండనుంది. ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్యారేజీల గేట్లు ఎత్తేయడంతో సమ్మక్క బ్యారేజీ వద్దకు ఆదివారం ఉదయానికి తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంచేరింది. అంతే ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద గంట గంటకూ వరద నీటి మట్టం పెరుగుతోంది. ఆదివారం అర్ధరాత్రికి భద్రాచలం వద్ద నీటి మట్టం 43 అడుగులకు చేరుకోనుంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో.. వరద ముప్పును తప్పించడానికి ముందుగా పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీలను అధికారులు ఖాళీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,67,782 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు 6,350 క్యూసెక్కులు విడుదల చేసి, మిగులుగా ఉన్న 1,60,432 క్యూసెక్కులను ధవళేశ్వరం ఆర్మ్, ర్యాలీ ఆర్మ్, మద్దూరు ఆర్మ్, విజ్జేశ్వరం ఆర్మ్‌లలోని మొత్తం 175 గేట్లు ఎత్తి కడలిలోకి వదిలేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఎగువ నుంచి భారీ వరదను దిగువకు వదిలేస్తున్న నేపథ్యంలో సోమవారం నాటికి పోలవరం ప్రాజెక్టు వద్దకు 10–12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం రాత్రికి పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటి మట్టం 30.1 మీటర్లకు చేరింది. దీంతో మొత్తం 48 రేడియల్ గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఇదిలా ఉండగా, ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది. దీనికి తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాల వల్ల కూడా పనులు చేయలేని పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. గంటకు 25 సెంటీమీటర్ల చొప్పున గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. దీంతో దిగువ కాఫర్ డ్యామ్, గ్యాప్–2 పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. కాగా, ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జల వనరుల శాఖ అధికారులు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ.. వరద ముప్పును తప్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణ కంటే తుంగభద్రకే ఎక్కువ వరద కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, ఉప నదులు పోటెత్తాయి. కృష్ణా కంటే దాని ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 91 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 90 టీఎంసీలకు చేరుకుంది. డ్యాం గరిష్ట సామర్థ్యం 101 టీఎంసీలు. దీంతో కొద్ది గంటల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఆ వరద జలాలు సుంకేసుల బ్యారేజీ మీదుగా మూడు నాలుగు రోజుల్లో శ్రీశైలానికి చేరుకుంటాయి. కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టిలోకి 75 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. నీటి నిల్వ 79.74 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టి, దాని దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయాలు నిండాలంటే మరో 55 టీఎంసీలు అవసరం. మరో రెండు రోజులు పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో కృష్ణా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఆ రెండు జలాశయాలు నిండితే.. ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం జూరాల మీదుగా శ్రీశైలానికి చేరుకోనుంది. తెలంగాణలోని మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో పులిచింతల్లోకి వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. పులిచింతలకు దిగువన పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజీలోకి 20 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. అంతే స్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఉత్తరాంధ్రలోనూ వరదలు బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నాగావళి, వంశధార నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజీలోకి 4,135 క్యూసెక్కులు చేరుతుండగా.. 4,343 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు నారాయణపురం ఆనకట్టకు చేరుకుంటున్నాయి. దీంతో నారాయణపురం ఆనకట్ట నుంచి 4,900 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 2,778 క్యూసెక్కులు చేరుతుండగా.. వంశధార ప్రాజెక్టు కాలువలకు విడుదల చేయగా, మిగులుగా ఉన్న 2,307 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉరకలెత్తుతుండటంతో చెరువులు.. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల్లోకి వరద జలాలు చేరుతున్నాయి. మరో 5 రోజులు వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏలూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఏలూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలూరు జిల్లాలో సగటున 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో 9.2 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనరసుపేటలో 8.2, ఎన్టీఆర్ జిల్లా అట్లప్రగడ కొండూరులో 8.1, ఏలూరు జిల్లా లింగపాలెం, చింతలపూడి, కొయ్యలగూడెం, నూజివీడులో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. తిరువూరు, కుక్కునూరు, గజపతినగరం, భీమడోలు, దవళేశ్వరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు, కైకలూరు తదితర ప్రాంతాల్లో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ► ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు, పడమటి వాగు, వైరా, మున్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కట్టలేరు ఉధృతితో గంపల గూడెం మండలంలో 14 గ్రామాలకు రాకపోకలు నిలిపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పత్తి, వరి పంటలకు ఊపిరి పోస్తున్నాయి. వరినాట్లు, పసుపు పంట వేసుకొనేందుకు ఈ వర్షాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ► అల్లూరి సీతారామరాజు జిల్లా పొల్లూరు, మోతుగూడెం పిక్నిక్ స్పాట్ సమీపంలో దుయం భారీ కొండ చరియలు విరిగి రహదారికి అడ్డంగా పడిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఏపీ జెన్కో జల విద్యుత్ కేంద్రానికి ఉద్యోగులు మరో మార్గం గుండా చుట్టూ తిరిగి వెళ్లారు. ఏపీ జెన్కో ఇంచార్జ్ సీఈ వెంకటేశ్వరరావు, ఈఈ బాబురావు కొండ చరియలు పడిన ప్రాంతాన్ని సందర్శించారు. రాళ్లను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. -
తెలంగాణ: ఆది, సోమవారాల్లో పలుచోట్ల వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశంఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, ఒకట్రెండు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వివరించింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్టు పేర్కొంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని సగానికి పైగా జిల్లాలకు విస్తరించినట్లు తెలిపింది. మరో రెండ్రోజుల్లో పూర్తిస్థాయిలో రుతుపవనాలు వ్యాప్తి చెందే అవకాశంఉందని స్పష్టం చేసింది. -
చల్లటి పవనం పలకరించింది..
సాక్షి, అమరావతి: ఎండ వేడిమితో ఉడికిపోతున్న రాష్ట్రాన్ని నైరుతి రుతు పవనం చల్లగా పలకరించింది. సోమవారం రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు ఇవి విస్తరించాయి. రుతు పవన గాలులు బలంగా ఉండటంతో వచ్చే రెండు రోజుల్లో రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలకు, ఆ తర్వాత రెండు రోజుల్లో కోస్తా ప్రాంతాలకు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. చల్లని గాలులు వీస్తూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. రాబోయే ఐదు రోజుల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు ఈ వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 566 మిల్లీ మీటర్లు. ఈసారి దీనికంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈసారి అన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఈ నెలలో రెండు, మూడు వారాల నుంచి వర్షాలు బాగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. నైరుతి సీజన్లో సాధారణంగా జూన్, జూలై నెలల్లో ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడతాయి. జులై, ఆగస్టు నెలల్లో మధ్య కోస్తా జిల్లాలు, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. వారం రోజులు ఆలస్యం నైరుతి రుతు పవనాలు ఈసారి వారం రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి వచ్చాయి. అసని తుఫాను ప్రభావంతో కొంచెం ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. గత నెల 28న (సాధారణంగా జూన్ 1న తాకాలి) కేరళను తాకాయి. అదే వేగంతో ముందుకు కదిలి ఈ నెల 3, 4 తేదీల్లో (సాధారణంగా జూన్ 5న) ఏపీలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ రాజస్థాన్ వైపు నుంచి పశ్చిమ గాలుల ప్రభావం తీవ్రమవడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో రుతు పవనాలు కర్ణాటక నుంచి ఏపీ వైపు కదలకుండా ఉండిపోయాయి. ఎట్టకేలకు అనుకూల వాతావరణం ఏర్పడడంతో వారం రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. -
సాక్షి కార్టూన్: 11-06-2022
-
రానున్న రెండ్రోజులు మోస్తరు వానలు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెం డ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు గురువారం వాతావరణ శాఖ వెల్లడించింది. చత్తీస్గడ్ నుంచి కోస్తాంధ్ర తీరం వరకు కొనసాగుతున్న ఉపరితలద్రోణి తెలంగాణకు దూరంగా వెళ్లిందని తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రానున్న రెండ్రోజుల్లో గోవా, దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. గురువారం రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 4డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 42.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 22.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. -
రుతుపవనాల మందగమనం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ముందుకు కదలడంలేదు. ఈ నెల 4వ తేదీనే రాయలసీమను తాకాల్సి ఉన్నా కర్ణాటకలోనే కదలకుండా స్థిరంగా ఉండిపోయాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రతి సంవత్సరం జూన్ ఒకటో తేదీన కేరళను తాకి 5వ తేదీకల్లా ఏపీకి విస్తరిస్తాయి. అంటే కేరళను తాకిన నాలుగైదు రోజుల్లో ఏపీలోకి ప్రవేశిస్తాయి. ఈ సంవత్సరం నాలుగు రోజుల ముందుగానే మే 28వ తేదీన రుతుపవనాలు కేరళను తాకాయి. అక్కడి నుంచి వేగంగా కదిలి 31వ తేదీకి కర్ణాటక, ఏపీ సరిహద్దు వరకు వచ్చాయి. అప్పటి నుంచి బెంగళూరు, ధర్మపురి ప్రాంతంలోనే కదలకుండా ఉండిపోయాయి. మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో రుతుపవనాలు మన రాష్ట్రం వైపు కదలడంలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఒకటి, రెండు రోజుల్లో రుతుపవనాలు రాయలసీమను తాకే అవకాశం ఉందని భావిస్తున్నారు. అవి ఒకసారి కదిలితే వేగంగా విస్తరిస్తాయని చెబుతున్నారు. అప్పటివరకు కోస్తా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. -
తెలంగాణలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలంగాణలోకి మంగళవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే రుతుపవనాల రాకకు రెండ్రోజులు ఆలస్యమైనట్లు పేర్కొంది. ఈ నెల 10వ తేదీ కల్లా రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది. వాస్తవానికి మే 29న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించగా ఆ తర్వాత వాటి కదలిక మందగించడంతో వ్యాప్తి ఆలస్యమైంది. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. సాధారణం కంటే కాస్త ఎక్కువ వానలు... ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే కాస్త ఎక్కువ వానలు కురుస్తాయని చెబుతున్నారు. తెలంగాణలో సాధారణ వర్షపాతం 72.05 సెంటీమీటర్లు కాగా.. గతేడాది వానాకాలంలో 100.97 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవగా 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, మరో 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి మొత్తంమీద 104 శాతం మేర వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాల కదలికలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అంచనాల్లో మార్పులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పెరిగిన ఉక్కపోత... కేరళలోకి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించినప్పటికీ తొలి మూడు రోజులు మందకొడిగా కదలడంతో వాతావరణం చల్లబడలేదు. సాధారణంగా సీజన్‌కు ముందుగా కురిసే వర్షాలతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని చల్లబడుతుంది. కానీ ఈసారి నైరుతి సీజన్‌కు ముందు ఉష్ణోగ్రతలు పెరిగాయి. నడివేసవిలో నమోదైనట్లుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. అసని తుపానుతో మే నెల మూడో వారంలో వాతావరణం చల్లబడినట్లు కనిపించినా ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. దీని ప్రభావంతో వాతావరణంలో ఉక్కపోత పెరిగింది. దీనికి వడగాడ్పులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తాజాగా మరో రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రుతుపవనాలు పూర్తిగా వ్యాప్తి చెందే వరకు ఉష్ణోగ్రతలు సాధారణానికి కాస్త అటుఇటుగానే నమోదు కానున్నాయి. ఆదివారం నల్లగొండలో 43.8 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా మెదక్‌లో 25 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. -
వణికిపోయిన ఢిల్లీ నగరం.. ఏమా గాలుల వేగం! వీడియోలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలివాన విజృంభించింది. సోమవారం సాయంత్రం కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన ధాటికి జనజీవనం స్తంభించింది. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇక్కట్లుపడ్డారు. విమానాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు ల్యాండింగ్ సమస్యను ఎదుర్కొన్నాయి. అధికారుల నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టాయి. ఇక భీకర గాలుల కారణంగా రోడ్డుపై వెళ్తున్న కార్లు సైతం వణికాయి. పార్కింగ్ చేసి ఉన్న వాహనాలపై చెట్లు కూలడంతో ధ్వంసమయ్యాయి. ఏపీ భవన్లో ఈదురు గాలులు బెంబేలెత్తించాయి. గాలుల వేగానికి నగరంలోని పలు కార్యాలయాల్లో అద్దాలు పగలిపోయాయి. వీటికి సంబంధించిన దృశ్యాలు ట్విటర్లో ట్రెండ్ అయ్యాయి. #WATCH | Bus trapped under an uprooted tree in the aftermath of a hailstorm in Delhi, causing traffic snarls near Sanchar Bhawan. pic.twitter.com/4Z91pAofpR — ANI (@ANI) May 30, 2022 #WATCH | Delhi gets a relief from scorching heat with a heavy downpour & thunderstorm. Visuals from National Media Centre. pic.twitter.com/7ZZuf05GMg — ANI (@ANI) May 30, 2022 #WATCH | Delhi witnesses uprooted trees amidst a heavy rainfall that hit the national capital. Visuals from Bhai Vir Singh Marg. pic.twitter.com/213buZrif2 — ANI (@ANI) May 30, 2022 #WATCH | Delhi: A car trapped under an uprooted tree in Connaught Place as the national capital received sudden rainfall accompanied by hailstorm. The car was unoccupied and was in the parking lot. pic.twitter.com/wdc7QDK2ZY — ANI (@ANI) May 30, 2022 #WATCH | Delhi: Heavy rain and thunderstorm lashed the national capital this afternoon. Visuals from BJP headquarters. pic.twitter.com/k8TDvjAtQy — ANI (@ANI) May 30, 2022 #WATCH | Bus trapped under an uprooted tree in the aftermath of a hailstorm in Delhi, causing traffic snarls near Sanchar Bhawan. pic.twitter.com/4Z91pAofpR — ANI (@ANI) May 30, 2022 -
ముప్పు తప్పినట్లే.. తీరం దాటిన అసని తుపాను
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/నెట్ వర్క్: ఎప్పటికప్పుడు దిశను మార్చుకుంటూ వణికించిన అసని తుపాను బలహీనపడడంతో రాష్ట్రానికి ముప్పు తప్పింది. బుధవారం ఉదయానికి తీవ్ర తుపానుగా ఉన్న అసని తొలుత తుపానుగా, సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతూ బుధవారం సాయంత్రం మచిలీపట్నం సమీపంలోని కోన వద్ద తీరాన్ని దాటింది. తీరం దాటే సమయంలో 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. చదవండి: ‘అసని’పై అప్రమత్తం ప్రస్తుతం ఇది తీరం వెంబడి నరసాపురం, అమలాపురం మీదుగా కదులుతూ గురువారం ఉదయానికి వాయుగుండంగా మారి యానాం దగ్గర మళ్లీ సముద్రంలోకి వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సముద్రంలోకి వెళ్లి ఇంకా బలహీనపడుతుందని అధికారులు చెబుతున్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు.. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని, మత్స్యకార గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలలు సాధారణం కంటే అరమీటరు ఎక్కువ ఎత్తుకు ఎగసిపడతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. తుపాను ప్రభావంతో గురువారం కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. అంచనాలకు అందని అసని అండమాన్ దీవుల నుంచి వేగంగా ఏపీ తీరానికి దూసుకొచ్చిన అసని తుపాను గమనం వాతావరణ శాఖ అంచనాలకు అందలేదు. తొలుత ఉత్తరాంధ్ర వైపు పయనించి ఒడిశా దిశగా బంగ్లాదేశ్ వైపు వెళుతుందని భావించారు. కానీ కాకినాడ–మచిలీపట్నం వైపు మళ్లింది. బుధవారం తెల్లవారుజామున ఆ ప్రాంతాల మధ్య తీరం దాటుతుందనే అంచనాలు కూడా తప్పాయి. మచిలీపట్నానికి 60 కిలోమీటర్ల దూరంలోనే కేంద్రీకృతమై నెమ్మదిగా అక్కడే బలహీనపడింది. ఒక దశలో కేవలం 3 కిలోమీటర్ల వేగంతో మాత్రమే మచిలీపట్నం వైపు కదిలింది. వేసవిలో అరుదుగా వచ్చిన తుపాను కావడంతో దాని గమనాన్ని అంచనా వేయలేకపోయినట్లు చెబుతున్నారు. విశాఖలో ఎగిసిపడుతున్న సముద్రపు అలలు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, గాలులు అనూహ్యంగా వచ్చిన అసని తుపాను అనూహ్యంగానే బలహీనపడడంతో రాష్ట్రానికి ముప్పు తప్పింది. దీంతో రాష్ట్రంలో వర్షాలు, గాలుల ప్రభావం తగ్గింది. తీరం వెంబడి గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సగటున 4.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లాలో సగటున 15 మిల్లీమీటర్ల వర్షం పడింది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో అత్యధికంగా 6 సెంటీమీటర్లు, గుడ్లూరులో 5.3, అనకాపల్లి జిల్లా మునగపాకలో 5.1, సత్యసాయి జిల్లా కేశపురంలో 4.3, విజయనగరం జిల్లా బొందపల్లిలో 4.1, అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబరాడలో 4, బాపట్ల జిల్లా నూజెల్లపల్లిలో 3.9, అనకాపల్లి జిల్లా చీడికాడ, సత్యసాయి జిల్లా ధర్మవరంలో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో సగటున 9.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సగటున అనకాపల్లి జిల్లాలో 3.1 సెంటీమీటర్లు, శ్రీకాకుళంలో 2.1, నెల్లూరులో 2, ప్రకాశంలో 1.8, విజయనగరంలో 1.7, విశాఖలో 1.6, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1.5, కోనసీమలో 1.5, కాకినాడ, బాపట్ల జిల్లాల్లో 1.3, తిరుపతి జిల్లాలో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లు అసని తుపాను నేపథ్యంలో అత్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్ నంబర్లు సిద్ధం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. సహాయం కావాల్సిన వారు హెల్ప్‌లైన్ నెంబర్లు 1070, 08645 246600కి ఫోన్ చేయాలని సూచించారు. కోతకు గురైన ఉప్పాడ తీరం కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఈదురుగాలులతో వర్షం కురిసింది. కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రం 30 మీటర్లు ముందుకు చొచ్చుకురావడంతో ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డును మూసివేశారు. ఉప్పాడ గ్రామం రూపును కోల్పోతోంది. ఉప్పాడ తీరప్రాంతం కోతకు గురైంది. మత్స్యకారుల ఇళ్లల్లోకి నీరు చొచ్చుకువచ్చింది. సముద్రపు కెరటాల ఉధృతికి ఉప్పాడలో ఇళ్లు, బీచ్ రోడ్డు ధ్వంసమయ్యాయి. కోనసీమ, కాకినాడ, రాజమండ్రి జిల్లాల్లో సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. 31 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రజలను శిబిరాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను సిద్ధంగా ఉంచారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించారు. ఇదిలా ఉండగా తుపాను కారణంగా పలుప్రాంతాల్లో పంటలకు, పండ్ల తోటలకు వాటిల్లిన నష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేస్తున్నారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తుమ్మలపల్లి–నర్రావారిపాలెం మధ్య పొన్నాలకాలువ పొంగడంతో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. తాడేపల్లి డోలాస్‌నగర్ వద్ద రహదారి వెంబడి చెట్టుకొమ్మ విరిగి ఆటోపై పడడంతో ఆటో పూర్తిగా దెబ్బతింది. ఇమీస్ కంపెనీ వద్ద వెళ్తున్న లారీ మీద భారీ వృక్షం విరిగిపడింది. కాగా, తుపాను గాలులకు కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం కామనగరువు శివారు అప్పన్నపేటలో ఇల్లు కూలి వ్యవసాయ కూలీ వాడపల్లి శ్రీనివాసరావు (43) మృతిచెందాడు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి విశ్వరూప్ ప్రమాదస్థలాన్ని బుధవారం పరిశీలించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. విమాన సర్వీస్‌లు రద్దు తుపాను ప్రభావంతో బుధవారం గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన 16 విమాన సర్వీస్‌లను రద్దు చేశారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రావాల్సిన 9 విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
అనూహ్య ‘అసని’
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: వాతావరణ శాఖ అంచనాలను సైతం తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా అటూఇటూ ప్రయాణిస్తోంది ‘అసని’ తీవ్ర తుపాను. రోజుకో దిశలో.. పూటకో వేగంతో కదులుతోంది. విశాఖ తీరానికి సమీపించి.. ఒడిశా వైపు వెళ్తున్నట్లు కనిపించిన తీవ్ర తుపాను మరోసారి దిశ మార్చుకుని మచిలీపట్నం వైపుగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. విశాఖ తీరం వైపు వచ్చిన సమయంలో గంటకు 16 కి.మీ. వేగంతో ప్రయాణించి.. దిశ మారిన తర్వాత నెమ్మదించింది. ప్రస్తుతం గంటకు 10 కి.మీ. వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. మంగళవారం రాత్రి 11.15 గంటల సమయానికి కాకినాడకు 170 కి.మీ., విశాఖకు 290 కి.మీ., గోపాలపూర్‌కు 530 కి.మీ., పూరీకి 630 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. బుధవారం ఉదయానికి మచిలీపట్నం–బాపట్ల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా మలుపు తిరిగి సముద్రంలోకి వెళ్తుందని.. అక్కడి నుంచి మరింత బలహీనపడి కాకినాడ మీదుగా విశాఖపట్నం తీరం వైపు వస్తుందని అంచనా వేస్తున్నారు. బుధవారం ఉదయానికి తుపానుగా.. గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుంది. ప్రకాశం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు తుపాను ప్రభావంతో ప్రకాశం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సుమారు 25 సెం.మీ. మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధ, గురువారాల్లో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనూ మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్ర కెరటాల ఉధృతికి కూలిపోతున్న మత్స్యకారుల ఇళ్లు 75–85 కి.మీ. వేగంతో గాలులు బుధవారం ఉదయం తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కి.మీ., గరిష్టంగా 75 కి.మీ. వేగంతోనూ మధ్యాహ్న సమయంలో గంటకు 75 నుంచి 85 కిమీ, గరిష్టంగా 95 కి.మీ. వేగంతోనూ బలమైన గాలులు వీస్తాయి. కాకినాడ, విశాఖపట్నం, భీమిలి, గంగవరం పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్–10 (జీడీ–10), మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో జీడీ–8 హెచ్చరికలు జారీ చేశారు. సహాయక చర్యలకు నౌకాదళం సిద్ధం తుపాను నేపథ్యంలో భారత నౌకాదళం అప్రమత్తమైంది. సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతంలోని నౌకాదళ సిబ్బంది, అధికారులకు విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లాయి. 19 వరద సహాయక బృందాలు, 6 డైవింగ్ టీమ్‌లు, జెమినీ బోట్లని విశాఖలో సిద్ధం చేశారు. తిరుపతి జిల్లాలో భారీ వర్షం తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓజిలి మండలం ఇనుగుంటలో 13.6 సెం.మీ. వర్షం కురిసింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురంలో 11.2 సెం.మీ., ఖాజీపేట మండలం ఎట్టూరులో 10.7, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 8.1, విశాఖలో 5.9, నెల్లూరు జిల్లా కావలి, గుడ్లూరు మండలం రావూరులో 5 సెం.మీ. వర్షం పడింది. మొత్తంగా ఉమ్మడి కోస్తాంధ్ర అంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోనసీమ, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సగటున రాష్ట్ర వ్యాప్తంగా 3.1 మి.మీ. వర్షం పడింది. 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్ రాబోయే మూడు రోజుల్లో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు రెడ్అలర్ట్ జారీ చేశారు. కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 68 విమానాలు రద్దు గోపాలపట్నం (విశాఖ పశ్చిమ)/మధురపూడి: తుపాను కారణంగా విశాఖ విమానాశ్రయంలో మొత్తం 68 సర్వీసులు రద్దయ్యాయని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇండిగో విమాన సర్వీసులు 46, ఎయిర్ ఏసియా విమాన సర్వీసులు 4, ఎయిరిండియా విమాన సర్వీసులు 2 రద్దయ్యాయి. స్పైజ్‌జెట్ సర్వీసు కూడా రద్దయ్యింది. బుధవారం కూడా ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. కాగా, రాజమహేంద్రవరం విమానాశ్రయానికి మంగళవారం రావాల్సిన పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. కాకినాడ బీచ్ రోడ్డు మూసివేత కాకినాడ సిటీ/విడవలూరు (నెల్లూరు): తుపాను ప్రభావంతో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో బలమైన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపోయాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండంతో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. కాకినాడ తీరంలో సముద్రం 30 మీటర్లు ముందుకు రావడంతో ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డును మూసివేశారు. ఉప్పాడ తీర ప్రాంతం సముద్ర కోతకు గురవుతోంది. సమీపంలోని ఇళ్లల్లోకి నీరు చొచ్చుకొచ్చింది. కెరటాల ఉధృతికి ఉప్పాడలో ఇళ్లు, బీచ్ రోడ్డు ధ్వంసమయ్యాయి. కాగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని తీర ప్రాంతంపై తుపాను ప్రభావం చూపుతోంది. మండలంలోని రామతీర్థం పరిసర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో 5 అడుగుల మేర అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం దాదాపు 150 మీటర్లు మేర ముందుకొచ్చింది. -
అలర్ట్: వర్ష సూచన.. ఆ సమయంలో ఇళ్లలోంచి బయటకు రాకండి
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజుల్లో నగరంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నగరంలో గరిష్టంగా 39.2 డిగ్రీలు, కనిష్టంగా 29.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని ప్రకటించింది. 20న ‘మ్యూజియం’ ఉచిత సందర్శన చార్మినార్: అంతర్జాతీయ మ్యూజియం వారోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 20న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాలార్జంగ్ మ్యూజియం తెరిచి ఉంటుందని... ఆ రోజు చిన్నారులు, అనాథ పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ ఎ.నాగేందర్ రెడ్డి తెలిపారు. ఉచిత ప్రవేశం కోసం ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు లిస్టు అందజేయాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: ఇలా ఎన్ని పేర్లు మారుద్దాం? -
Cyclone Asani: అతి తీవ్రంగా 'అసని'
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అసని తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఆదివారం నర్సీపట్నం, శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, కోనసీమ, విజయవాడ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అనంతపురం, కడప ప్రాంతాల్లోను వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో భారీ వర్షానికి రోడ్లు నీళ్లతో నిండి ట్రాఫిక్ స్తంభించింది. కృష్ణా జిల్లా మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ మండలాల్లో భారీవర్షాలు, ఈదురు గాలులకు చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. కోతకొచ్చిన మామిడికాయలు రాలిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావంతో 10, 11 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు, ఎక్కువచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. -
దూసుకొస్తున్న ‘అసని’ తుపాను
సాక్షి, అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది వాయవ్య దిశగా వేగంగా కదులుతూ ఆదివారం ఉదయానికి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపానుగా మారితే దీనికి ‘అసని’గా నామకరణం చేయనున్నారు. ఇది శ్రీకాకుళం–ఒడిశా తీరం మధ్య ఈ నెల 10వ తేదీన తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం అంత తీవ్రంగా ఉండదని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేక చోట్ల వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో పలుచోట్ల ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, దీని ప్రభావంతో శనివారం విశాఖ, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నా ఆ తర్వాత వాతావరణం చల్లబడింది. పిడుగులు పడి ముగ్గురు దుర్మరణం ఆమదాలవలస రూరల్, సరుబుజ్జిలి: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నెల్లిపర్తి, బూర్జ మండలం పణుకుపర్త గ్రామాల్లో శనివారం పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు. నెల్లిపర్తిలో గరికపాటి ఏకాశి (52), పొదిలాపు చిన్నలక్ష్మి (39) కంసాల చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా పిడుగుపడింది. దీంతో ఇద్దరూ ఉన్నచోటే కుప్పకూలిపోయారు. సహచరులు వారిద్దరినీ ఇంటికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలుపోయాయి. బూర్జ మండలం పణుకుపర్తలో పశువుల్ని మేపేందుకు వెళ్లిన కొండ్రోతు మేఘన (12) అనే బాలిక ఉరుములు, మెరుపులు రావడంతో తోటివారితో కలిసి ఓ చెట్టు కిందకు వెళ్లింది. అక్కడే పిడుగు పడటంతో అపస్మారక స్థితికి చేరింది. ఆమెతో పాటు ఉన్న మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వీరందరినీ పాలకొండ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ మేఘన చనిపోయింది. -
ముంపు ముప్పు తప్పాలంటే మేల్కొనే తరుణమిదే
సాక్షి, హైదరాబాద్: ముందుంది ముంచే కాలం.. నైరుతీ రుతుపవనాల కాలం మొదలయ్యే జూన్ తొలివారం నుంచే మొదలు కానుంది. హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం మరో 30 రోజుల్లో పొంచి ఉంది. ముంపు కష్టాలకు ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ మొదలైంది. తొలకరి పలకరింపుల అనంతరం వరుసగా కురిసే వర్షాలతో నగరం చిగురుటాకులా వణకడం ఏటా జరిగే తంతు. ఈ నేపథ్యంలో ఇప్పుడే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. శివార్లతో పోలిస్తే కోర్‌సిటీకే ముంపు ముప్పు ఎక్కువని ఐఐటీ హైదరాబాద్, వాతావరణ శాఖ తాజా అధ్యయనంలో తేలింది. గత కొన్నేళ్లుగా (2013–2019 సంవత్సరాలు) డేటాను అధ్యయనం చేసిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. ఈ మధ్య కాలంలో ఏకంగా 29 సార్లు నగరాన్ని వరదలు ముంచెత్తినా.. అధికార యంత్రాంగానికి కనువిప్పు కలగకపోవడం గ్రేటర్ పిటీ. కుండపోత లెక్కలివీ.. ► జీహెచ్ఎంసీ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ఈ పరిధిలో 37 ఆటోమేటిక్ వర్షపాత లెక్కింపు కేంద్రాల్లో 118 రోజుల భారీ వర్షపాతం లెక్కలను పరిశీలించిన అనంతరం ప్రధాన నగరానికే ముంపు ముప్పు ఏటా తథ్యమని ఈ అధ్యయనం తేల్చింది. తరచూ వర్షం కురిసిన రోజులు, తీవ్రత, నమోదైన వర్షపాతం లెక్కలను పరిశీలించారు. ప్రధానంగా రుతుపవన వర్షాలు కురిసే జూన్–సెప్టెంబర్ మధ్యకాలంలో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు కురిసినట్లు గుర్తించారు. ► కొన్ని గంటల వ్యవధిలోనే కోర్‌సిటీ పరిధిలో క్యుములో నింబస్ మేఘాలు కుమ్మేయడంతో కుండపోత వర్షాలు కురిశాయని విశ్లేషించారు. శివార్లలోనూ భారీ వర్షాలు కురిసినప్పటికీ తీవ్రత అంతగా లేదని తేల్చారు. ప్రధాన నగరంలో పట్టణీకరణ పెరగడం, వర్షపు నీరు వెళ్లే దారి లేకుండా విస్తరించిన కాంక్రీట్ రహదారులు, నాలాలపై ఆక్రమణలు, బహుళ అంతస్తుల భవనాల కారణంగా ముంపు సమస్య అధికంగా ఉందని నిగ్గు తేల్చింది. ► దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన వరదనీటి కాల్వలు కుంచించుకుపోవడమూ ఇందుకు కారణమని ఈ అధ్యయనం గుర్తించింది. ఈ వివరాలను నగరంలోని వాతావరణ మార్పులు,భారీ వర్షాల తీరుతెన్నులపై భారత వాతావరణ శాఖ ప్రచురించిన అర్బన్ క్లైమేట్ జర్నల్‌లోనూ ప్రచురించినట్లు పరిశోధకులు తేల్చారు. ఇరవైతొమ్మిదిసార్లు.. వరదలు.. నగరంలో 2013 నుంచి 2019 మధ్యకాలంలో 29 సార్లు ప్రధాన నగరాన్ని వరదలు ముంచెత్తినట్లు ఈ అధ్యయనం పేర్కొంది. ప్రధానంగా జూన్–సెప్టెంబరు మధ్యకాలంలోనే 15 సార్లు వరదలు సంభవించినట్లు తెలిపింది. మార్చి –మే మధ్యకాలంలో 8 మార్లు, అక్టోబరు–డిసెంబరు మధ్యకాలంలో 5 మార్లు వరదలు ముంచెత్తాయని పేర్కొంది. జనవరి–ఫిబ్రవరి మధ్యకాలంలో ఒకసారి వరదలు సంభవించాయని తెలిపింది. సెంటీమీటరు మేర కురిస్తేనే.. జీహెచ్ఎంసీ పరిధిలో ఏకధాటిగా ఒక సెంటీమీటరు వర్షం కురిస్తే చాలు నగరంలో వరదనీరు పోటెత్తుతోందని ఈ అధ్యయనం తేల్చింది. ఇక 24 గంటల్లో ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే నగరం అతలాకుతలమవుతుందని గుర్తించింది. ప్రధానంగా 90 శాతం వరదలు జూన్–అక్టోబరు మధ్యకాలంలోనే తలెత్తినట్లు తేల్చింది. 2013లో 31 రోజులు, 2016లో 25సార్లు నగరంలో వరదలు భారీగా సంభవించడంతో జనజీవనం అస్తవ్యస్తమైనట్లు అధ్యయనం తెలిపింది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురిసిన వర్షాలతోనే అధిక నష్టం వాటిల్లినట్లు తేల్చింది. -
అంచనాలు నిజం కావాలి!
ఎండలు మండిపోతున్న వేళ... ఇది చల్లటి వార్తే. అంతకంతకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వాటితో పాటు ఆకాశానికి అంటుతున్న ఆహార ధరలు, వెరసి విరుచుకు పడుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో కొంత ఉపశమన వార్త. ఆ చల్లటి కబురు ఏమిటంటే – ఈ ఏడాది వర్షాలు సకాలంలోనే పడతాయట! రాబోయే నైరుతి రుతుపవనాల్లో దేశంలో సగటు వర్షపాతం ‘సాధారణం’గానే ఉంటుందట! రాబోయే వర్షాకాలానికి సంబంధించి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించిన తొలి అంచనా ఇది. అయితే, సగటు వర్షపాతమంటే ఎంత అనే పరిణామాన్ని తగ్గించి, నిర్వచనాన్ని సవరించడం గమనార్హం. కాకపోతే, ఐఎండీ అంచనాలు నిజమైతే, కూరగాయల ధరలపై నేరుగా ప్రభావం చూపి, భారం కొంత తగ్గుతుందని ఆశ. కొన్నేళ్ళుగా ఏటా సగటు వర్షపాతం బాగుంది. కరోనాలో పట్టణాలను వదిలి వలసపోతున్న శ్రామికవర్గానికి గ్రామాల్లో వ్యవసాయం రంగంలో ఉపాధి కల్పనకు ఈ ‘సాధారణ’ వర్షపాతం ఉపయోగపడింది. ఈసారీ నైరుతి రుతుపవనాలు బాగుంటే, వ్యవసాయ రంగానికి మరింత ఊపు నిస్తుంది. కరోనా తగ్గుముఖం పట్టి, జనం తిరిగి పట్టణాల బాట పడుతుండడంతో, గ్రామీణ భారతంలో శ్రామికులకు మళ్ళీ గిరాకీ ఉంటుంది. కూలీ హెచ్చి, వారి కొనుగోలు శక్తీ పెరుగుతుందని భావన. జనాభాలో సగానికి పైగా వర్షాధారిత వ్యవసాయం మీదే ఆధారపడే దేశానికి సాధారణ వర్షపాతం, తద్వారా పెరిగే గ్రామీణ వినియోగం, మెరుగుపడే ఆర్థిక వ్యవస్థ శుభసూచనలే. జూన్ – సెప్టెంబర్ సీజన్‌కు సంబంధించి ఏటా ఐఎండీ రెండుసార్లు అంచనాలిస్తుంది. ఏప్రిల్‌లో చెప్పింది తొలి అంచనా. మళ్ళీ సరిగ్గా నైరుతి రుతుపవనాలు రావడానికి ముందు మే నెల చివరలో మరింత నిర్దిష్టమైన రెండో అంచనా వస్తుంది. ప్రస్తుతానికైతే... మధ్య పసిఫిక్‌ను వేడెక్కించి, నైరుతి భారతావనిపై వర్షాలను ఆవిరి చేసే ‘ఎల్‌నినో’ లాంటి పరిస్థితులేమీ ఉండవనే లెక్కతో ఐఎండీ తొలి అంచనా వేసింది. రాగల నాలుగు నెలల కాలం ‘ఎల్‌నినో’కు వ్యతిరేకంగా, భారత్‌కు లబ్ధి చేకూర్చే ‘లానినా’ పరిస్థితులు ఉన్నాయట. అయితే, ‘దీర్ఘకాలిక సగటు (ఎల్పీఏ)’ వర్షపాతం అంటే ఒకప్పుడు 89 సెంటీమీటర్ల వర్షపాతమని లెక్క. 1951 నుంచి 2000 వరకు 50 ఏళ్ళ సగటును బట్టి అలా తీర్మానించారు. కానీ, ప్రతి దశాబ్దానికి ఒకసారి దాన్ని సవరించాల్సి ఉంటుంది. నాలుగేళ్ళ క్రితం 1961 నుంచి 2010 సగటును చూసుకొని, ఆ నిర్వచనాన్ని 88 సెంటిమీటర్లకు తగ్గించారు. తాజాగా ఈ ఏడాది 1971 నుంచి 2020 వరకు సగటును బట్టి, దాన్ని మళ్ళీ సవరించారు. ‘ఇప్పుడిక ఎల్పీఏ అంటే 87 సెంటీమీటర్ల వర్షపాతమే’ అని తీర్మానించారు. సాధారణంగా ఎల్పీఏ లెక్కలో 96 నుంచి 104 శాతం మధ్య ఎంత వర్షం కురిసినా, ఆ ఏడాది వర్షపాతం ‘సాధారణ’మనే అంటారు. ఆ పద్ధతిలో రానున్న నైరుతి రుతుపవనాలు సాధారణ వర్షపాతం అందిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. మంచిదే. కానీ, ఎల్పీఏ నిర్వచనం ప్రకారం మునుపటి దశాబ్దాలతో పోలిస్తే సగటు వర్షపాతం 2 సెంటీమీటర్ల మేర తగ్గడం ఒకింత ఆందోళన కరం. ఒక్క సెంటీమీటరేగా అనుకోవడానికి వీల్లేదు. ఆ ఒక్క సెంటీమీటర్ సగటు వర్షపాతం వివిధ ప్రాంతాల్లో, విభిన్న రకాలుగా ఉండే వర్షాలలోని మార్పులకు సంకేతం. వాతావరణ శాఖ మాత్రం శతాబ్ద కాలంలో ప్రతి దశాబ్దానికోసారి సగటు వర్షపాతంలో మార్పులొస్తాయనీ, ఒక 30 ఏళ్ళ కాలం తగ్గుతూ వస్తే, తర్వాతి 30 ఏళ్ళు పెరుగుతూ వస్తాయని వివరిస్తున్నారు. ప్రస్తుతం మనం నిర్జల శకం చివరలో ఉన్నాం గనక వచ్చే 30 ఏళ్ళ తేమ శకంలో వర్షపాతం బాగుంటుందని భరోసా ఇస్తున్నారు. నిజానికి, వాన రాకడ – ప్రాణం పోకడ ఎవరైనా ఎంత కచ్చితంగా చెప్పగలరన్నది ప్రశ్న. అందులోనూ కాలచక్రంలో మార్పులతో, రుతువులు ముందు వెనుకలవుతూ అనిశ్చిత వర్తమాన వాతావరణంలో ఇది మరింత క్లిష్టమే. ఇక, పాశ్చాత్య దేశాల అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన వాతావరణ అంచనాలతో పోలిస్తే, మన దగ్గర అంచనాలు ఎంత నిర్దుష్టమనేదీ మరో ప్రశ్న. మన వాతావరణ అంచనాలు గతంలో పలు సందర్భాల్లో విఫలమైన ఉదాహరణలూ అనేకం. ఆ అప్రతిష్ఠనూ, అనుమానాలనూ ఐఎండీ పోగొట్టుకోవాలి. అలాగే ఒకప్పుడు వాతావరణ కేంద్రాల డేటా బాగా ఆలస్యమయ్యేది కూడా! అయితే, ఇప్పుడు ఆటోమేటెడ్ వ్యవస్థకు మారడంతో, ఏ క్షణానికి ఆ క్షణం డేటా వస్తుందని ఐఎండీ కథనం. అలాగే, ఒకప్పుడు 1000 పై చిలుకు వాతావరణ కేంద్రాలే ఉండగా, ఇప్పుడు 4 వేల కేంద్రాలున్నాయి. వీటన్నిటి వల్లే ఎల్పీఏ సహా అనేక అంశాలను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ, అంచనాలు వేయగలుగుతున్నామనేది వాతావరణ శాఖ మాట. వాతావరణ అంచనాలు ఎంత కచ్చితంగా ఉంటే, వ్యవసాయాధారిత దేశంలో రైతులు సహా అనేక వర్గాలకు అంత ఉపయోగం. అందుకే, మొక్కుబడిగా కాక నిక్కచ్చిగా ఇవ్వడం ముఖ్యం. దేశ వార్షిక సగటు వర్షపాతం 117.6 నుంచి 116 సెంటీమీటర్లకు తగ్గినట్టు లెక్క. ఈ పరిస్థితుల్లో దేశంలో కురిసే మొత్తం వర్షంలో దాదాపు 75 శాతానికి ఆధారమైన నైరుతి రుతుపవనాలు కీలకం. వరుసగా ఈ నాలుగో ఏడాదీ అవి సకాలంలో, సవ్యంగా వర్షిస్తే ప్రజానీకానికి హర్షమే. రుతుపవనాలతో పాటు మొదలయ్యే ఖరీఫ్ సాగుకు ఎరువులు మరో సమస్య. ఏడాదిగా ప్రపంచమంతటా ఎరువులు, వాటి ముడిపదార్థాల ధరలు ద్విగుణం, త్రిగుణమయ్యాయి. ఉక్రెయిన్‌లో యుద్ధంతో దిగుమతీ గడ్డుగా మారింది. మరి ఆఖరులో హడావిడి పడక, తగిన ప్రణాళికతో దేశ పాలకులు సిద్ధమవుతున్నారా? -
బంగాళాఖాతంలో వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం ఉదయం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి శుక్రవారం ఉదయం తీవ్ర వాయుగుండంగా మారే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇది శ్రీలంకలోని ట్రింకోమలికి 360 కి.మీ., తమిళనాడులోని నాగపట్నంకు 700 కి..మీ., పుదుచ్చేరికి 760 కి.మీ., చెన్నైకు 840 కి..మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రస్తుతం గంటకు 18 కి.మీ. వేగంతో కదులుతోందని.. రాగల 48 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణిస్తూ శ్రీలంక తూర్పు తీరం వెంబడి ఉత్తర తమిళనాడు వద్ద తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మార్చిలో తీవ్ర వాయుగుండం, తుపాను ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గడిచిన 200 సంవత్సరాల కాలంలో కేవలం 11 సార్లు మాత్రమే ఈ తరహా వాతావరణం ఏర్పడిందని.. చివరిసారిగా 1994లో బంగాళాఖాతంలో స్వల్ప తుపాను వచ్చినట్లు వారు వెల్లడించారు. ప్రస్తుత వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై తక్కువగా ఉంటుందన్నారు. దీని ప్రభావంవల్ల దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు, రేపు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయనీ.. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 50–60 కి.మీ. గరిష్టంగా 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని.. ఈ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మత్స్యకారులెవ్వరూ 6వ తేదీ వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. -
ఏపీకి వర్ష సూచన
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. చదవండి: బ్యాంక్ ఉద్యోగి చేతివాటం.. రూ.కోటికి పైగా బ్యాంకు సొమ్ము మాయం -
200 ఏళ్లలో ఇలా సాగిన తుపాను లేదు!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు)/మహారాణిపేట(విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపాను ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో పూరి తీరం వైపు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది విశాఖపట్నానికి తూర్పు ఈశాన్యంగా 370 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరికి 50, గోపాల్‌పూర్‌కు 130, పారదీప్‌కు 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి పశ్చిమ బెంగాల్ వైపు వెళుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఆ తరువాత 24 గంటల్లో పూరి సమీపంలో తీరం దాటుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు మినహా రాష్ట్రమంతా పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. రాష్ట్రంపై ఇక జవాద్ ప్రభావం ఉండదని పేర్కొంది. వచ్చే పదిరోజులు రాష్ట్రంలో సాధారణ వాతావరణమే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య గాలుల ప్రభావంతో ఈ నెల 8, 9 తేదీల్లో రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని చెప్పారు. చలి తీవ్రత పెరగనుందని, రాత్రి సమయంలో శీతల గాలుల ప్రభావం ఉంటుందని వెల్లడించారు. కూలిన ఆర్కే బీచ్ వద్ద చిల్డ్రన్ పార్కు గోడ 140 బోట్లు, మత్స్యకారులు సురక్షితం తుపాను బలహీనపడటంతో అధికారులు, మత్స్యకారులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 140 మరబోట్లు పారదీప్, గంజాంలో చిక్కుకుపోవడంతో మత్స్యకారుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది. కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు తదితరులు ఒడిశా అధికారులు, పోర్టు అధికారులను సంప్రదించారు. దీంతో 140 బోట్లకు పారదీప్, గంజాంలలో ఆశ్రయం కల్పించారని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణరావు తెలిపారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని మత్స్యకారులకు అందించి మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు ఎంతో సహకారం అందించారని విశాఖ డాల్ఫిన్ బోటు సంఘం అధ్యక్షుడు చోడిపల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. మరోవైపు ఆదివారం అర్ధరాత్రి ఎగసిపడిన అలలతో సముద్రం దూసుకొచ్చింది. అలల దాటికి విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద చిల్డ్రన్స్ పార్కు గోడ కూలిపోయింది. దీంతో సుమారు రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లిందని జీవీఎంసీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆర్కే బీచ్ నుంచి గోకుల్ పార్క్ వరకు ప్రవేశాన్ని నిషేధించారు. 200 ఏళ్లలో ఇలా సాగిన తుపాను లేదు జవాద్ తుపాను ప్రయాణం భిన్నంగా సాగింది. దక్షిణ చైనా సముద్రంలో మొదలైన దీని ప్రయాణం.. పశ్చిమ బెంగాల్ వైపు సుదీర్ఘంగా సాగింది. పైగా సముద్రంలోనే పూర్తిగా బలహీనపడుతోంది. ఇలా సుదీర్ఘ ప్రయాణం చేసి.. తీరం దాటకుండానే బలహీనపడిన తుపాను గడిచిన 200 ఏళ్లలో లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
వాయుగుండంగా మారిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం గురువారం ఉదయం వాయుగుండంగా బలపడింది. ఇది చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 140 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 110, కరైకల్‌కు తూర్పు ఈశాన్యంగా 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద చెన్నైకి సమీపంలో శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీవర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొన్నారు. శనివారం ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాలో ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. భారీవర్షాలు పడే జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు, విశాఖపట్నం పోర్టులో రెండో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు.. గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. రెండురోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో వడమాలపేటలో 132.75 మిల్లీమీటర్లు, పాకాలలో 110.75, తవణంపల్లెలో 108.25, చిత్తూరులో 106.50, రామచంద్రాపురంలో 104.25, చంద్రగిరిలో 96, శ్రీకాళహస్తిలో 94, కలకడ, రొంపిచర్లల్లో 93, యాదమర్రిలో 91.75, రేణిగుంటలో 90, చిట్వేల్‌లో 85, శ్రీరంగరాజపురంలో 82.75, కొత్తపల్లిలో 82, పలమనేరులో 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
తిరుపతి విల విల
సాక్షి, తిరుపతి/నెట్వర్క్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఎప్పుడూలేని విధంగా అతిభారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షంతో చిత్తూరు జిల్లా అతలాకుతలమైంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శేషాచలం కొండల నుంచి వస్తున్న భారీ వరద నీటితో తిరుపతి నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు.. తిరుమల ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండు ఘాట్‌రోడ్లలో రాకపోకలు నిలిపివేశారు. నడక మార్గాలను కూడా మూసివేశారు. తిరుమల కొండల్లో నుంచి వచ్చే వరదనీరు కపిలతీర్థాన్ని ముంచెత్తింది. కొండల్లో నుంచి నీరు ఉధృతంగా వస్తుండడంతో పరిసర ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 35 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇక రేణిగుంట విమానాశ్రయం జలమయం కావడంతో ఎయిరిండియా విమానం, స్పైస్‌జెట్ విమానాలను హైదరాబాద్, బెంగళూరుకు తిప్పి పంపారు. మొత్తం మీద చిత్తూరు జిల్లా వడమలపేటలో 13.2 సెంటీమీటర్లు, పాకాలలో 11, తవనంపల్లెలో 10.8, చిత్తూరులో 10.6, రామచంద్రాపురంలో 10.4, చంద్రగిరిలో 9.5, శ్రీకాళహస్తిలో 9.3, కలకడలో 9.3 సెం.మీ. వర్షం పడింది. తిరుపతి నగరం యావత్తూ ఉ.8.30 నుంచి రాత్రి 8.30 వరకు 7.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఒక ప్రాంతంలో వర్షం కురిస్తే మరో ప్రాంతంలో తక్కువగా లేదా అసలు పడకపోవచ్చని.. కానీ, గురువారం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో దాదాపుగా ఒకే స్థాయిలో కురిసినట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. నలుగురు మహిళలు గల్లంతు చిత్తూరు మండలంలోని బలిజపల్లె–టేకుమంద రహదారి జయంతి గ్రామం సమీపంలో గురువారం రాత్రి వాగులో నలుగురు మహిళలు గల్లంతైనట్లు ఎస్ఐ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. టేకుమంద గ్రామానికి చెందిన కస్తూరి, లక్ష్మీదేవి, జయంతి, ఉషారాణి సాయంత్రం ఫ్యాక్టరీలో పనిముగించుకుని సహచరులతో ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. బలిజపల్లెలోని కామాక్షమ్మ చెరువు నిండి జయంతి గ్రామం వద్ద రహదారిపై జోరుగా ప్రవహిస్తుండడంతో ఆటో వెళ్లేందుకు వీలుకాలేదు. దీంతో వారంతా ఒకరిచేయి ఒకరు పట్టుకుని వాగుదాటే క్రమంలో గల్లంతైనట్లు చెప్పారు. వీరి కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వర్షం పడుతుండడంతో గాలింపు కష్టంగా మారింది. తిరుపతి నగరం అతలాకుతలం కుండపోత వర్షంతో తిరుపతి నగరం జలమయమైంది. కాలువల ఆక్రమణలతో వరద నీరు ప్రవహించేందుకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా నగర వీధులను వరద నీరు ముంచెత్తింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గం, లీలామహల్ నుంచి కరకంబాడికి వెళ్లే రహదారి, ఎయిర్ బైపాస్ రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వెస్ట్‌చర్చి వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి, బస్టాండు సమీపంలోని మరో రైల్వే బ్రిడ్జి పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విద్యుత్ స్తంభాలు, టెలిఫోన్ లైన్లు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొబైల్ ఫోన్లు సుమారు గంటపాటు మూగబోయాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్, కమిషనర్ గిరీషా, అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అదేవిధంగా తిరుపతి రూరల్ మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురికావడంతో కలెక్టర్ హరినారాయణన్, ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. తలకోనలోని సిద్ధేశ్వరాలయం, పేరూరులోని ధర్మరాజుల ఆలయం జలమయమయ్యాయి. నిండుకుండలా జలాశయాలు జిల్లాలోని ఆరణియార్, కాళంగి, కృష్ణాపురం, ఎన్టీఆర్, కల్యాణి, బహుదా, పెద్దేరు జలాశయాల కు భారీగా వరద నీరు చేరింది. రిజర్వాయర్లన్నీ పూర్తిగా నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అలాగే, స్వర్ణముఖి నది, నక్కలవంక వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలం తిమ్మసముద్రం వద్ద దుప్పుటేటి కాలువ, జిల్లాలోని గార్గేయనది, బహుదా నది, బుగ్గకాలువ, కౌండిన్య నది పోటెత్తాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాల పరిధిలో రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. తిరుచానూరు–పాడిపేట మార్గంలోని స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తుండడంతో తిరుపతి–పుత్తూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి–వైఎస్సార్ కడప జిల్లా రహదారిలోని బాలపల్లె, కుక్కలదొడ్డి వద్ద కూడా ఇదే పరిస్థితి. కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు రాత్రంతా ఇబ్బందులు పడ్డారు. తిరుమల బైపాస్ రోడ్డు కొర్లగుంటను చుట్టుముట్టిన వరదనీరు వైఎస్సార్, అనంత,నెల్లూరు జిల్లాల్లో.. వైఎస్సార్ జిల్లానూ వర్షం ముంచెత్తింది. వెలిగల్లు, అన్నమయ్య, పింఛా, బుగ్గవంక, మైలవరం తదితర ప్రాజెక్టుల నుంచి పెద్దఎత్తున వరద నీటిని దిగువకు వదిలారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కడప మండలం పాలెంపల్లెకు చెందిన శేఖర్‌రెడ్డి అనే వ్యక్తి ఎద్దుల బండిలో ఇసుకను తీసుకొస్తుండగా వరద ఉధృతికి బండి కొట్టుకుపోయింది. గాలివీడు మండలంలో ద్విచక్ర వాహనదారుడు కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. అనంతపురం జిల్లాలోని కదిరి, పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం, ధర్మవరం, అనంతపురం డివిజన్ల పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. చిత్రావతి, కుశావతి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతితో సోమశిల జలాశయం 11గేట్లు ఎత్తి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నెల్లూరు నగరంలోనూ భారీ వర్షం కురుస్తోంది. డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాలనీల్లో ఇళ్ల చుట్టూ పెద్దఎత్తున నీరు చేరింది. చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు భారీ వర్షానికి మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్వగ్రామమైన నారావారిపల్లిలోని ఆయన నివాసం జలమయమైంది. విషయం తెలుసుకున్న ఆయన బంధువులు హుటాహుటిన మోటార్ల సాయంతో నీటిని బయటకు పంపుతున్నారు. రైళ్లు ఆలస్యం.. బస్సులు నిలుపుదల వర్షంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా తిరుపతి నుంచి రైల్వే కోడూరు మార్గంలో వెళ్లే పలు రైళ్లు గంటకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయని తిరుపతి స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ గురువారం రాత్రి తెలిపారు. ప్రధానంగా మామండూరు, బాలపల్లి సమీపంలో రైల్వే ట్రాక్‌పై వరదనీరు ప్రవహిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తాయని వెల్లడించారు. ఆయా రైల్వేస్టేషన్లలోని ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను పెద్దఎత్తున డ్రైనేజ్ నీరు ముంచెత్తింది. ఇక వర్షంతో రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పలు మార్గాల్లో ఆర్టీసీ సర్వీసులను నిలుపుదల చేసినట్లు తిరుపతి అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ డీఆర్ నాయుడు తెలియజేశారు. ప్రధానంగా తిరుమలకు వెళ్లే సర్వీసులను సాయంత్రం నాలుగు గంటల నుంచే నిలుపుదల చేశామన్నారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం రెడ్డివారిపల్లె వంతెనపై ప్రవహిస్తున్న వరద నీరు వరదలో తిరుమల మాడ వీధులు ఇక తిరుమలలోనూ ఎడతెరిపిలేని వర్షం కారణంగా నాలుగు మాడవీధుల్లో పెద్దఎత్తున వరద నీరు చేరుకుంది. శ్రీవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న మ్యూజియం వద్దకు కొండ ప్రాంతం నుంచి పెద్దఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. ఆ వరద మొత్తం లడ్డూ కౌంటర్ వద్ద నుంచి నాలుగు మాడవీధుల్లోకి చేరుకుంది. దీంతో మాడవీధుల్లో పెద్దఎత్తున బురద పేరుకుపోయింది. క్యూలైన్లలో కూడా పెద్దఎత్తున వరద నీరు చేరింది. అయితే, శ్రీవారి ఆలయం సమీపంలో నీరు త్వరగా వెళ్లిపోయే మార్గాలు ఉండడంతో అక్కడ ఈ పరిస్థితి ఏర్పడలేదు. అదే విధంగా తిరుమలలోని ఆర్జిత సేవ కార్యాలయంలోకి నీరు ప్రవహించడంతో సర్వర్లన్నీ స్తంభించిపోయాయి. అదేవిధంగా అదనపు ఈఓ ధర్మారెడ్డి క్యాంప్ కార్యాలయం పూర్తిగా నీటమునిగింది. మరోచోట గోడకూలి రమణ అనే వ్యక్తి పైన పడడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు.. తిరుమలలోని 10 ప్రాంతాల్లో విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్నారు. ఘాట్ రోడ్డు మొత్తం వరద నీరు ఉ«ధృతంగా ప్రవహిస్తోంది. నడకదారులను శుక్రవారం కూడా మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఘాట్ రోడ్డును ఎప్పుడు తెరిచేది తర్వాత చెబుతామని వెల్లడించింది. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కలిగి ఉండి వర్షాల కారణంగా వెళ్లలేకపోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పింది. అలాగే, శ్రీవారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో చిక్కుకుపోయిన భక్తులకు వసతి ఏర్పాట్లు కూడా చేసినట్లు వెల్లడించింది. తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం రెండు, మూడో సత్రాలకు వెళ్లాలని సూచించింది. నీట చిక్కుకున్న స్కూల్ బస్సు 32 మంది విద్యార్థులను కాపాడిన స్థానికులు చిత్తూరు నగరంలో 32 మందితో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు నీటిలో చిక్కుకుపోయింది. స్థానికులు హుటాహుటిన స్పందించి ప్రాణాలకు తెగించడంతో పిల్లలంతా క్షేమంగా బయటపడ్డారు. ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో ఫ్లైఓవర్ కింద ఉన్న సబ్వే రోడ్డు 8 అడుగుల లోతు వర్షపునీటితో నిండిపోయింది. ఇక్కడి పరిస్థితిని అంచనా వేయని డ్రైవర్ 32 మంది విద్యార్థులను బస్సులోకి ఎక్కించుకుని ఫ్లైఓవర్‌పై నుంచి వెళ్లకుండా సబ్వే నుంచి వెళ్లాడు. నీటి ఉధృతికి ఒక్కసారిగా బస్సు ఇంజిన్ ఆగిపోయింది. బస్సు లోపలకు వర్షపు నీళ్లు చేరుకున్నాయి. దీంతో పిల్లలు భయపడిపోయి సీట్లపైకి ఎక్కి కేకలు పెట్టారు. స్థానికులంతా కలిసి పిల్లల్ని గట్టుపైకి తీసురావడంతో సురక్షితంగా బయటపడ్డారు. తక్షణ సాయం రూ.వెయ్యి సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత జిల్లాల కలెక్టర్లతో గురువారం నిరంతరం సమీక్ష నిర్వహించారు. అవసరమైన చోట్ల వెంటనే సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలని ఆదేశాలు జారీచేశారు. వీటిల్లో అన్నిరకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడ ఉన్నవారికి వెయ్యి రూపాయల చొప్పున తక్షణ సహాయం అందించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్షించిన ఆయన సమావేశాల తర్వాత మరోసారి సమీక్షించారు. జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు, వాటి ప్రభావాన్ని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్లు, చెరువుల్లో నీటిమట్టాలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, తిరుపతిలో పరిస్థితులపై చిత్తూరు కలెక్టర్‌తో వైఎస్ జగన్ మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో సహాయక చర్యల కోసం సంబంధిత శాఖలు వెంటనే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అవసరమైన మేరకు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని.. వైద్య, ఆరోగ్య సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీటన్నింటికీ తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా రాజీపడాల్సిన అవసరంలేదని సీఎం స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందించాలని.. ఏం కావాలన్న వెంటనే కోరాలని, తాను నిరంతరం అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయా విభాగాలకు చెందిన శాఖాధిపతులు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించుకుని సహాయక చర్యలు చేపట్టాలన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'పెన్నా' పరవళ్లు
సాక్షి, అమరావతి: నీటిచుక్క జాడలేక ఎడారిలా మారిన పెన్నా నది ఇప్పుడు జీవనదిగా అవతరించింది. మూడు దశాబ్దాల తర్వాత 2019లో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురవడంతో పెన్నమ్మ పరవళ్లు తొక్కింది. గతేడాది, ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురవడంతో పెన్నమ్మ ఉరకలెత్తుతోంది. బేసిన్లో అన్ని ప్రాజెక్టుల నీటినిల్వ సామర్థ్యం 239.59 టీఎంసీలు. పెన్నా, ఉప నదులు ఉధృతంగా ప్రవహించడంతో బేసిన్‌లోని ప్రాజెక్టులు నిండిపోయాయి. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించినా.. ఖరీఫ్ పంటలకు వాడుకోగా ఇప్పటికీ ప్రాజెక్టుల్లో 175.91 టీఎంసీలు నిల్వ ఉండటం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టుల్లో 157.84 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అంటే.. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 18.07 టీఎంసీలు అధికంగా నిల్వ ఉండటం గమనార్హం. మొత్తం మీద ప్రాజెక్టులన్నీ నిండటం.. పెన్నా ప్రవాహంతో భూగర్భ జలాలు పెరగడంతో పాడిపంటలతో బేసిన్ సస్యశ్యామలమైంది. సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో.. గోదావరి, కృష్ణా నదులు పశ్చిమ కనుమల్లో పురుడుపోసుకోవడం.. పరీవాహక ప్రాంతంలో అధిక వర్షాలు కురవడంవల్ల ఆ నదులు ఉరకలెత్తుతూ ప్రవహిస్తాయి. కానీ, పెన్నా తద్భిన్నం. వర్ష ఛాయ (రెయిన్ షాడో) ప్రాంతంలో జన్మించి.. ప్రవహించే ప్రాంతంలో సగటున 400–800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఎల్‌నినో.. లానినో పరిస్థితుల ప్రభావంవల్ల నైరుతి రుతుపవనాల గమనం ఆధారంగా పెన్నా బేసిన్లో వర్షాలు కురుస్తాయి. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం పెన్నా బేసిన్. జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా ఈ బేసిన్లోనే ఉంది. కర్ణాటకలో 1995 నుంచి 2004 మధ్య నందిదుర్గం నుంచి నాగలమడక వరకూ ఆ రాష్ట్ర సర్కార్ పెన్నాపై భారీఎత్తున చెక్ డ్యామ్‌లు, డ్యామ్‌లు నిర్మించింది. పెన్నా ఉప నదులైన చిత్రావతిపై పరగోడు వద్ద డ్యామ్ నిర్మించింది. జయమంగళి, కుముద్వతిపైనా అదే రీతిలో చెక్ డ్యామ్‌లు నిర్మించడంతో పెన్నా, ఉప నదుల నుంచి.. ఎగువ నుంచి దిగువకు చుక్కనీరు రాకుండాపోయింది. అదే సమయంలో రాయలసీమలో సక్రమంగా వర్షాలు కురవక.. కరువు పరిస్థితులు ఏర్పడటంతో పెన్నా ఎండిపోయింది. 2019 నుంచి రాష్ట్రంతోపాటూ రాయలసీమలోనూ సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా, ఉప నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పెన్నా వరదకు కృష్ణా వరదను తోడుచేసి.. గత రెండేళ్లుగా గండికోట, సోమశిల, కండలేరు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో తొలిసారిగా గరిష్ఠస్థాయిలో నీటిని నిల్వచేశారు. జీవనదిగా పెన్నమ్మ రూపాంతరం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా, ఉప నదులు జలకళతో తొణికిసలాడుతున్నాయి. పెన్నా ప్రధాన పాయపై అనంతపురం జిల్లాలో పెండేకళ్లు, చాగల్లు, వైఎస్సార్ కడప జిల్లాలో గండికోట, మైలవరం, నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరుల్లో 2019, 2020, ఈ ఏడాదీ గరిష్ఠస్థాయిలో నీటి నిల్వలున్నాయి. ఉప నదులైన చిత్రావతిపై అనంతపురం–వైఎస్సార్ కడప సరిహద్దులోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, మద్దిలేరు (యోగి వేమన) ప్రాజెక్టుల్లో గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వ ఉంది. గతేడాది తరహాలోనే ఈ ఏడాది పాపాఘ్ని ఉప్పొంగడంవల్ల వైఎస్సార్ జిల్లాలోని వెలిగల్లు నిండిపోయింది. చెయ్యేరు, సగిలేరుపై ఉన్న ప్రాజెక్టుల్లో ఇదే పరిస్థితి. బాహుదా ఉరకలెత్తడంతో చిత్తూరు జిల్లాలోని బాహుదా ప్రాజెక్టు, పెద్దేరు నిండిపోయాయి. ఎగువన పెన్నమ్మకు పునరుజ్జీవం కర్ణాటక చెక్ డ్యామ్‌లు, డ్యామ్‌ల నిర్మాణంతో ఎగువ నుంచి పెన్నాకు వరద రాకపోవడంవల్ల కర్ణాటక సరిహద్దులో అనంతపురం జిల్లాలో ఉన్న పేరూరు డ్యామ్ (అప్పర్ పెన్నార్) నుంచి పీఏబీఆర్, మధ్య పెన్నార్ వరకూ పెన్నా ఒట్టిపోయింది. దీంతో దిగువ రీతిలో ఎగువన కూడా జీవనదిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాపాఘ్ని, స్వర్ణముఖి ఉప నదులనూ పునరుజ్జీవింపజేసే చర్యలను వేగవంతం చేసింది. వాతావరణ మార్పుల వల్లే.. వాతావరణ మార్పులవల్ల వర్షాలు పడే రోజులు తగ్గాయి. కానీ.. వర్షంపడే రోజుల్లో ఒకేసారి కుండపోత కురుస్తోంది. దీనివల్ల చెరువులు నిండి.. పెన్నాలోకి వరద ప్రవహిస్తోంది. ఫలితంగా 2019 నుంచి పెన్నా, ఉప నదులపై ఉన్న ప్రాజెక్టులు నిండుతున్నాయి. పాడిపంటలతో ఈ బేసిన్ సస్యశ్యామలమవుతోంది. ఎగువన పెన్నా నదిని పునరుజ్జీవింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించడం శుభపరిణామం. – డాక్టర్ మల్లారెడ్డి, డైరెక్టర్, యాక్షన్ ఫెటర్నా ఎకాలజీ సెంటర్, అనంతపురం సవ్యమైన రీతిలో జలచక్రం ఎన్నడూలేని రీతిలో 2019 నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంవల్ల పెన్నా, ఉప నదులు ఉరకలెత్తుతున్నాయి. పెన్నా వరద జలాలకు కృష్ణా వరద జలాలను జతచేసిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను నింపింది. ఇది పెన్నాలో వాతావరణ సమతుల్యతకు దారితీసింది. జలచక్రం సవ్యమైన రీతిలో మారడంవల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఇదే జీవనదిగా పెన్నా అవతరించడానికి బాటలు వేస్తోంది. – మురళీనాథ్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్, కర్నూలు జిల్లా -
AP: మూడు రోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. రానున్న మూడు రోజుల్లో అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించనుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ద్రోణి వాయవ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తా, రాయలసీమల్లో రానున్న మూడురోజులు విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు. గురువారం నుంచి 30వ తేదీ వరకు మూడురోజులు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వివరించారు. 29, 30 తేదీల్లో విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురిశాయి. -
నేడు, రేపు తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయి. ఈ నెల 26న ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల రాక ప్రారంభం కానుంది. మరోవైపు అధిక పీడనం కారణంగా సముద్రం నుంచి తేమ రాష్ట్రం వైపు వస్తోంది. దీంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. తిరుపతిలో 106.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
నేడు, రేపు మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. అదేవిధంగా అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తూర్పు, పశ్చిమ ద్రోణి సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. గడచిన 24 గంటల్లో గొల్లప్రోలులో 114.25, కొత్తపల్లిలో 102.25, వాకతిప్పలో 90, హరిపురంలో 87, రాజాంలో 76.75, టెక్కలిలో 67.7, గోపాలపురంలో 62, వేపాడలో 55.7, తునిలో 55.5, కొయ్యూరులో 51, తిరుపతిలో 49.2, మెరకముడిద్దాంలో 48.25 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. 27న మరో అల్పపీడనం ఈ నెల 27న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇది కాకినాడ, విశాఖపట్నం లేదా పూరీ ప్రాంతంలో తీరం దాటే సూచనలున్నాయని భావిస్తున్నారు. ఒకవేళ దిశను మార్చుకుంటే తమిళనాడు వైపుగా పయనించే అవకాశాలున్నాయని వెల్లడించారు. తిరుపతిలో భారీ వర్షం తిరుపతితుడా(చిత్తూరు జిల్లా): తిరుపతిలో శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఎడతెరపిలేని వర్షం పడటంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలువలు పొంగి ప్రవహించాయి. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. -
బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 24 గంటల్లో ఇది పశ్చిమ–వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. -
ఇంద్రకీలాద్రిపై వర్షం.. భక్తుల హర్షం
సాక్షి, అమరావతి: పాలకుడు మంచివాడైతే దైవం కరుణిస్తుందని, ప్రకృతి పులకిస్తుందని ఇంద్రకీలాద్రి సాక్షిగా మరోసారి రుజువైంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నప్పుడు అహ్లాదకర దృశ్యం ఆవిష్కృతమైంది. అంతవరకు మండే ఎండతో, ఉక్కపోతతో ఉన్న వాతావరణంతో అందరూ చమటలతో నిట్టూర్పులు విడవసాగారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రకీలాద్రి ఘాట్ ప్రారంభంలోని కామధేను అమ్మవారి ఆలయ సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా చిరుజల్లులు మొదలయ్యాయి. సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న సీఎం ఇంద్రకీలాద్రిపైకి చేరుకుని తన వాహనం నుంచి దిగగానే ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలై ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా మారిపోయింది. సీఎం ఆలయం లోపలికి వెళ్లి పూజలు ముగించుకుని తిరిగి బయటకు వచ్చే వరకు అంటే 3.45 గంటల వరకు వర్షం పడుతూనే ఉంది. సీఎం వైఎస్ జగన్ వాహనం ఇంద్రకీలాద్రి కిందకు దిగిన కాసేపటికి వర్షం ఆగిపోయింది. ఇంద్రకీలాద్రిపై తప్ప విజయవాడలో మరెక్కడా ఆ సమయంలో వర్షం పడకపోవడం విశేషం. ప్రజలకు మంచి చేయాలని పాలకుడు చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. దేవుని ఆశీస్సులు, ప్రకృతి కటాక్షం లభిస్తుందనడానికి ఇది శుభ సంకేతమని అర్చకులు, పండితులు, పలువురు భక్తులు వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులకు వెన్నుదన్ను ► ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.70 కోట్లు ప్రత్యేకంగా మంజూరు చేసిన విషయాన్ని భక్తులు గుర్తు చేసుకున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా నేరుగా ప్రభుత్వ నిధులను అమ్మవారి ఆలయానికి మంజూరు చేయలేదు. ► కృష్ణా పుష్కరాల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఏకంగా 40 ఆలయాలను కూల్చివేసిన విషయాన్ని కూడా భక్తులు ప్రస్తావించారు. అందుకు భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి హిందూ ఆలయాల అభివృద్ధికి కృషిచేయడం హైందవ ధర్మం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు. ► ఇంద్రకీలాద్రిపై అన్నదాన కాంప్లెక్స్, ప్రసాదాల పోటు, కేశ ఖండనశాల నిర్మాణంతోపాటు ఘాట్‌రోడ్డులో కొండరాళ్లు జారి పడకుండా రక్షణ చర్యలు చేపట్టేందుకు సీఎం మంజూరు చేసిన నిధులతో పనులు మొదలుపెట్టారు. -
నేడు, రేపు తేలికపాటి వానలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర అండమాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ కారణంగా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు మరింత ఆలస్యమవుతున్నాయి. దీని ప్రభావంతో ఈ నెల 13న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం ఐఎండీ తెలిపింది. ఇది క్రమంగా ఒడిశా వైపుగా పయనించి.. 15వ తేదీన మరింత బలపడే సూచనలున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగానూ.. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు రుతుపవన ద్రోణి రాయలసీమ మీదుగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వానలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడేందుకు ఆస్కారం ఉందని అధికారులు తెలిపారు. -
సంతృప్తికర స్థాయిలో వర్షాలు
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది రాష్ట్రంలో సంతృప్తికర స్థాయిలో వర్షాలు కురిపించాయి. జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో తొమ్మిది అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అందులో మూడు తీవ్ర అల్పపీడనాలుగా మారాయి. జూన్‌లో ఒకటి, జూలైలో మూడు, ఆగస్టులో రెండు, సెప్టెంబర్‌లో మూడు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ చివరలో గులాబ్ సెప్టెంబర్‌లో ఏర్పడ్డ రెండు వాయుగుండాల్లో ఒకటి తీవ్ర వాయుగుండంగా బలపడింది. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసే సమయంలో సెప్టెంబర్ చివరలో గులాబ్ తుపాను ఏర్పడింది. మొత్తంగా సెప్టెంబర్‌లోనే ఒక తుపాను, ఒక వాయుగుండం, ఒక తీవ్ర వాయుగుండం, రెండు తీవ్ర అల్పపీడనాలు, ఒక అల్పపీడనం ఏర్పడడం విశేషం. వీటన్నింటిలో గులాబ్ తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో వచ్చే తుపానులు ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో తీరం దాటుతాయి. అక్టోబర్, నవంబర్‌ల్లో వచ్చే తుపానులు ఎక్కువగా మన రాష్ట్రంలో తీరం దాటుతాయి. గత కొన్నేళ్ల వాతావరణ విశ్లేషణలు ఈ అంశాలను స్పష్టం చేస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా ఈ సెప్టెంబర్‌లో వచ్చిన తుపాను మన రాష్ట్రంలోని కళింగపట్నం దగ్గర తీరం దాటి తీవ్ర ప్రభావం చూపింది. విస్తారంగా వర్షాలు ఈ నైరుతి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 514 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సివుండగా 613.3 మి.మీ వర్షం కురిసింది. 19 శాతం ఎక్కువ వర్షపాతం కురిసింది. దీన్ని వాతావరణ శాఖ సాధారణ వర్షపాతంగానే (20 శాతం వ్యత్యాసం ఉంటే సాధారణమే) పరిగణిస్తుంది. వైఎస్సార్, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అధిక వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లాలో 49 శాతం అధిక వర్షపాతం కురవగా వైఎస్సార్ జిల్లాలో 32 శాతం అధిక వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం జిల్లాలో 37 శాతం, విజయనగరం జిల్లాలో 36 శాతం, గుంటూరు జిల్లాలో 33 శాతం, తూర్పుగోదావరిలో 29 శాతం, కృష్ణాలో 28 శాతం అధిక వర్షాలు కురిశాయి. అనంతపురం, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మిగిలిన జిల్లాల కంటె కొంచెం తక్కువ వర్షం కురిసింది. స్వల్పంగా లోటు వర్షం కురిసినా అది పది శాతంలోపే కావడంతో సాధారణంగానే పరిగణిస్తున్నారు. మొత్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సీజన్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ నెల 6 నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైంది. రాయలసీమకు భారీ వర్ష సూచన సాక్షి, విశాఖపట్నం: ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 14న వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరం వైపు పయనించనుంది. ఇది 15వ తేదీన తుపానుగా బలపడే సూచనలు పుష్కలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) చెబుతోంది. నిష్క్రమిస్తున్న నైరుతి రుతు పవనాలు క్రమంగా మన రాష్ట్రం వైపు వస్తుండటంతో వారం రోజుల పాటు వర్షాలు పుంజుకోనున్నాయి. వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలులు, అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా ఆదివారం దక్షిణ కోస్తాలోని ఒకట్రెండు చోట్ల, సోమవారం రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. కె.బిట్రగుంటలో 90.25 మి.మీ., ప్రత్తిపాడులో 63.5, కిర్లంపూడిలో 62.7, గోరంట్లలో 60, జగ్గంపేటలో 59, పమిడిలో 57, పలగలపల్లిలో 52.5, పెద్దతిప్పసముద్రంలో 45, ఓబుళదేవర చెరువు, శంఖవరంలో 44.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా, వైఎస్సార్ జిల్లాను శనివారం వర్షం ముంచెత్తింది. కడప, పులివెందుల, రాయచోటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని ప్రధాన నదులైన పాపాగ్ని, మాండవ్య నదులు వరద నీటితో ప్రవహిస్తున్నాయి. వీరబల్లి మండలంలోని గడికోట వద్ద మాండవ్య నది దాటుతూ కాకినాడకు చెందిన గోవిందరావు (45) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. -
టమాటా దిగుబడులపై వర్షం ఎఫెక్ట్
మదనపల్లె(చిత్తూరు జిల్లా): టమాటా దిగుబడులపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మార్కెట్‌కు అంతంతమాత్రంగా వస్తున్న టమాటా దిగుబడులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మరింతగా తగ్గిపోయాయి. వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో కాయలపై మచ్చలు వచ్చి.. తెగుళ్లు సోకుతున్నాయి. పంట నాణ్యతగా ఉండడం లేదు. గత నెల 9న రైతులు మార్కెట్‌కు 445 మెట్రిక్ టన్నుల టమాటాలు తీసుకువచ్చారు. ఇందులో మెదటి రకం టమాట ధర కిలో రూ.14 వరకు పలికింది. ప్రస్తుతం దిగుబడులు 70 శాతం మేర తగ్గిపోయింది. ఇతర రాష్ట్రాల్లో వర్షాలకు పంట దెబ్బతినడం, డిమాండ్‌కు తగ్గ సరుకు లేకపోవడంతో ధరలు పెరిగిపోతున్నాయి. శనివారం చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో మొదటిరకం టమాటా ధర కిలో రూ.35 నుంచి రూ.52 మధ్య పలికింది. రెండో రకం రూ.16 నుంచి రూ.33 మధ్య నమోదైంది. తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల నుంచి రైతులు 86 మెట్రిక్ టన్నుల టమాటాను మార్కెట్‌కు తీసుకువచ్చారు. కోత దశ చివరిది కావడంతో టమాటా దిగుబడులు తగ్గాయని, రబీ సీజన్ ప్రారంభమయ్యాక దిగుబడులు పెరిగే అవకాశం ఉందని హార్టికల్చరల్ ఆఫీసర్ సౌజన్య తెలిపారు. -
రెండ్రోజులు మోస్తరు వానలు
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య భారత దేశంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు తిరగోమనం చెందాయి. వారం రోజుల్లో తెలంగాణ, ఏపీ నుంచి నైరుతి నిష్క్రమణం మొదలవ్వనుంది. మరోవైపు తూర్పు అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కర్ణాటక, సీమ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఈ నెల 10న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తా, సీమల్లో అక్కడక్కడా మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. -
AP: ఈ నెలంతా వానలే
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల ఉపసంహరణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనంతోపాటు తుపాన్ల కాలం సమీపిస్తుండటంతో ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరందుకోనున్నాయి. బుధవారం నుంచి వాయవ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ మొదలుకానుంది. మరోవైపు తమిళనాడు, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం పైకి వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి. సూళ్లూరుపేటలో 176.50 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కాగా ఏర్పేడులో 139.5, ముత్తుకూరులో 133.25, బుచ్చినాయుడుకండ్రిలో 114.25, ఇందుకూరుపేటలో 99.25, తడలో 96, గూడూరులో 86.5, మనుబోలులో 79.5, చిల్లకూరులో 70.25, నెల్లూరులో 70, సత్యవేడులో 64.25, కొరుటూరులో 63, శ్రీకాళహస్తిలో 59.5, తొట్టంబేడులో 57.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై ఉండదు
సాక్షి, అమరావతి/విశాఖ దక్షిణ: వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారి గ్యాంగ్‌టక్, పశ్చిమ బెంగాల్ పశ్చిమ ప్రాంతాల్లో కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదిలావుండగా.. రుతు పవనాల కదలిక జోరుగా ఉందని, ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
Andhra Pradesh: తక్షణమే రూ.5 లక్షలు
మానవ తప్పిదాలు జరగొద్దు ఒడిశాలో కూడా బాగా వర్షాలు కురుస్తున్నందున అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశాలున్నాయని, అందువల్ల వంశధార, నాగావళి తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట సహాయ శిబిరాలకు తరలించాలన్నారు. రిజర్వాయర్లలో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటిని విడుదల చేయాలని, మానవ తప్పిదాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. దేవుడి దయవల్ల హుద్‌హుద్, తిత్లీ స్థాయిలో గులాబ్ తుపాను లేదని, అయితే అతి భారీ, భారీ వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. సాక్షి, అమరావతి: గులాబ్ తుపాను మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కింద వెంటనే రూ.ఐదు లక్షల చొప్పున చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. బాధితులకు సాయం అందించడంలో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని, డబ్బుల విషయంలో వెనకడుగు వేయవద్దని స్పష్టం చేశారు. అత్యంత ప్రాధాన్యతగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. తుపాను బాధితులకు నాణ్యమైన ఆహారంతో పాటు మందులు, మంచినీరు సరఫరా చేయాలని సూచించారు. పది రూపాయలు ఎక్కువైనా నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, ఉదారంగా ఉండాలని స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. విజయనగరం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ నుంచి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, విపత్తు నిర్వహణ కమిషనర్ కన్నబాబు, శ్రీకాకుళం నుంచి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఇందులో పాల్గొన్నారు. తుపాను అనంతర పరిస్థితులు.. సహాయ చర్యలపై ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టి ప్రతి అరగంటకూ సమాచారం సేకరిస్తూ కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అక్కడే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్దాస్కు సూచించారు. సీఎస్, జిల్లాల అధికారులతో సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్ విశాఖలో వేగంగా నీటి పంపింగ్.. బాధితుల పట్ల మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. సహాయం చేయడంలో డబ్బుల విషయంలో వెనకడుగు వేయవద్దని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యతతో కూడి ఉండాలని, మంచి వైద్యం, రక్షిత తాగునీరు అందించాలన్నారు. అవసరమైన అన్నిచోట్లా సహాయ, పునరావాస శిబిరాలను ప్రారంభించాలని సూచించారు. విశాఖ నగరంలో ముంపు ప్రాంతాల్లో వర్షపు నీటిని పంపింగ్ చేసి తొలగించే పనులు ముమ్మరంగా చేపట్టాలని, వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఆ కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలి ఇళ్లలోకి నీరు చేరి అవస్థలు పడుతున్న కుటుంబాలను ఆదుకోవాలని, ఆయా కుటుంబాలకు రూ.1,000 చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సహాయ శిబిరాల నుంచి బాధితులు తిరిగి వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.1,000 చొప్పున ఇవ్వాలని సూచించారు. వర్షపు నీరు కారణంగా తాగునీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉన్నందున వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించాలని, జనరేటర్లతో వాటర్ స్కీంలు నిర్వహించాలని ఆదేశించారు. పంట నష్టం అంచనాలు రూపొందించాలి పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్ చేయాలని, నష్టం అంచనాలు వెంటనే సిద్ధం చేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎన్యుమరేషన్ చేసేటప్పుడు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. సజావుగా రవాణా: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ శ్రీకాకుళం నుంచి సమీక్షలో పాల్గొన్న సీఎస్ అదిత్యనాథ్‌దాస్ తొలుత తుపాను అనంతర పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గంటకు 80 – 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, మిగిలిన చోట్ల అంత తీవ్రత లేదని తెలిపారు. అక్కడక్కడా విరిగిపడ్డ చెట్లను తొలగించామని, జాతీయ రహదారితో పాటు ప్రధాన మార్గాల్లో రవాణాకు ఎక్కడా ఆటంకం లేదని వెల్లడించారు. అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలో నిమగ్నమై అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. విశాఖ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశామని వివరించారు. – క్యాంపు కార్యాలయం నుంచి సమీక్ష సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి (డిజాస్టర్ మేనేజ్మెంట్) వి. ఉషారాణి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, అడిషనల్ డీజీ ఏ.రవిశంకర్, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్, సివిల్ సఫ్లైస్ కమిషనర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం: దంచికొట్టి.. ముంచెత్తి..
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని శనివారం రాత్రి భారీ వర్షం ముంచెత్తింది. రాత్రి 8 గంటల సమయంలో కుండపోత వర్షం మొదలైంది. అర్ధరాత్రి వరకు కుండపోతగా పడుతూనే ఉంది. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. రాగల మూడు రోజులు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రజలను కోరింది. నగరంలోని ఎల్బీనగర్, మణికొండ, షేక్‌పేట, శేరిలింగంపల్లి, మాదాపూర్, ఆసిఫ్‌నగర్, బాలనగర్, రాంనగర్, ముషీరాబాద్, విద్యానగర్, అంబర్పేట్, తార్నాక, అత్తాపూర్, కార్వాన్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నగరంలోని నల్లగొండ చౌరస్తాలో వర్షం నీటిలో మునిగిన కార్లు మణికొండ (8.8 సెం.మీ.), ఉప్పల్ (4.4 సెం.మీ.), ఎల్బీనగర్ (4.7 సెం.మీ.) ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కురిసిన ఎడతెగని వర్షంతో ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఇళ్లకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దిల్సుఖ్నగర్, మలక్‌పేట, మహేశ్వరం పరిధిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముసారాంబాగ్‌లో... కాలనీలు, బస్తీల్లోని డ్రైనేజీలు పొంగి వరదతో కలిసి మురుగునీరు రహదారులపై ప్రవహించింది. ఈ ప్రాంతాల పరిధిలోని పలు కాలనీలు నీటమునిగాయి. బంజారాహిల్స్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో వాహనదారులు నరకాన్ని చవిచూశారు. -
స్థిరంగా అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని చాంద్‌బలికి దక్షిణంగా సోమవారం తీరం దాటింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ రానున్న 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా మధ్యప్రదేశ్ వైపు కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని అధికారులు తెలిపారు. -
ఏపీకి తప్పనున్న వాయుగుండం ముప్పు!
మహారాణిపేట (విశాఖ దక్షిణ): తూర్పు, మధ్య ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. రానున్న 12 గంటల్లో ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారి.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో వాయువ్య బంగాళాఖాతం మీదుగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 2, 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావం ఏపీపై పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్రలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 45–55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. -
లక్ష్యం దిశగా 'సాగు'తున్న ఖరీఫ్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఖరీఫ్ లక్ష్యం దిశగా సాగవుతున్నది. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా పడుతుండడంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తుండడంతో ఖరీఫ్ సాగు వేగం పుంజుకుంది. రాయలసీమలో అధిక వర్షపాతం సీజన్లో సాధారణ వర్షపాతం 556 ఎంఎం కాగా, సెప్టెంబర్ 10 నాటికి 441 ఎంఎం వర్షపాతం కురవాల్సి ఉండగా, 500 ఎంఎం వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్ర సాధారణ వర్షపాతం 622.4 ఎంఎం కాగా, సెప్టెంబర్ 10 నాటికి 497.9 ఎంఎం కురవాల్సి ఉండగా.. 536.2 ఎంఎం వర్షపాతం కురిసింది. ఇక రాయలసీమలో సాధారణ వర్షపాతం 406.6ఎంఎం కాగా, సెప్టెంబర్ 10 నాటికి 312.9 ఎంఎం కురవాల్సి ఉండగా..415.4 ఎంఎం కురిసింది.కోస్తాంధ్రలో సాధారణ వర్షపాతం కురవగా, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం కురిసింది. లక్ష్యం దిశగా ఖరీఫ్.. రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 93.32లక్షల ఎకరాలు కాగా, 2019లో రికార్డు స్థాయిలో 90.38లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, 2020లో 90.20లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగైంది. కాగా ఈఏడాది 95.35లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చెయ్యాలని లక్ష్యంగా నిర్ధేశించగా ఇప్పటికే 75లక్షల ఎకరాల (80 శాతం) విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఖరీఫ్సీజన్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి సాధారణ విస్తీర్ణం 38.4లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 39.97 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 32 లక్షల ఎకరాల్లో (83శాతం) వరి సాగైంది. ఈ ఏడాది మొక్కజొన్న లక్ష్యానికి మించి సాగైంది. 2.55లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చెయ్యాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటి వరకు 2.60లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఇక 9లక్షల ఎకరాల్లో అపరాలు సాగు లక్ష్యం కాగా ఇప్పటికే 86 శాతం సాగయ్యాయి. అత్యధికంగా కందులు 5.05 లక్షల ఎకరాల్లో సాగవగా, మిగిలిన విస్తీర్ణంలో మినుములు, పెసలు, ఉలవలు సాగయ్యాయి. 19.95లక్షల ఎకరాల్లో నూనెగింజలు సాగు చెయ్యాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటి వరకు 16.47లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. తగ్గనున్న వేరుశనగ, పత్తి, మిరప ప్రధానంగా 18.62లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన వేరుశనగ ఈసారి 15.47లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. అదే విధంగా పత్తి సాగు లక్ష్యం 15లక్షల ఎకరాలు కాగా, 12లక్షల ఎకరాల్లోనే సాగైంది. అదే విధంగా 3.72లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన మిరప ఈ ఏడాది 2.23లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ మేరకు ఈ మూడు పంటలకు సంబంధించి ఏటా సాగవ్వాల్సిన విస్తీర్ణం పూర్తయినట్టుగా వ్యవసాయశాఖాధికారులు లెక్కతేల్చారు. దీంతో ఆ మేరకు మిగిలిన విస్తీర్ణంలో రైతులు అపరాలు, చిరు ధాన్యాల వైపు మళ్లినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. 7.56లక్షల టన్నుల ఎరువుల నిల్వలు ఖరీఫ్ సీజన్‌కు 20.20లక్షల టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో 19.69లక్షల టన్నుల నిల్వలుండగా, ఇప్పటి వరకు 12,13,187 టన్నుల అమ్మకాలు జరిగాయి. కాగా సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఖరీఫ్సాగు పూర్తయ్యే అవకాశాలుకన్పిస్తున్నాయి. ఆమేరకు అవసరమైన ఎరువులు, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు ఎక్కడా కొరత రానీయకుండా సమృద్ధిగా నిల్వ ఉంచారు. ఖరీఫ్ సాగు కోసం సెప్టెంబర్ నెలకు రైతులకు 6,07,017 ఎంటీల ఎరువుల అవసరం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 7.56లక్షల ఎంటీల ఎరువుల నిల్వలు ఉన్నాయి. లక్ష్యానికి మించి పంటల సాగు ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో లక్ష్యానికి మించి పంటలు సాగయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. సీజన్ ముగిసే వరకు రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయి. కృత్రిమ కొరత సృష్టించే డీలర్లపై నిఘా ఉంచాం. –హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
చెరువులా మారిన ఢిల్లీ విమానాశ్రయం, అంతా నీరే..
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిరాటంకంగా శనివారం భారీ వర్షం పడడంతో రోడ్లతో పాటు విమానాశ్రయం కూడా జలమయమైంది. ఎయిర్పోర్ట్ ప్రాంతమంతా నీటిలో మునిగింది. విమానాలు ఆగే ప్రాంతం.. ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతాలు నీటితో నిండాయి. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలు రద్దవగా మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. ఒక అంతర్జాతీయ, ఒక దేశీయ విమానం జైపూర్, అహ్మదాబాద్‌కు దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో మూడు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. చదవండి: సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్‌కు ఇంజెక్షన్ ‘అకస్మాత్తుగా కురిసిన వర్షంతో కొద్దీ సమయంలోనే నీళ్లు చేరాయి. మా బృందం వెంటనే చర్యలు చేపట్టింది’ అని ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. విమానాశ్రయాన్ని ఎప్పటికప్పుడు నీరు బయటకు పంపించేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దేశ రాజధానిలో శుక్రవారం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో 18 ఏళ్ల రికార్డు బద్దలవగా ఈ ఏడాది వర్షాకాలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. 40 ఏళ్లల్లోనే అత్యధిక వర్షాలు 2021లో నమోదయ్యాయని వాతావరణ శాఖ ప్రకటించింది. చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు #WATCH | Parts of Delhi Airport waterlogged following heavy rainfall in the national capital; visuals from Indira Gandhi International Airport (Terminal 3) pic.twitter.com/DIfUn8tMei — ANI (@ANI) September 11, 2021 बूँद-बूँद से बनता है सागर 🤦🏻♀️#DelhiAirport claims it’s all clear now and the water has been drained out. Latest pics below pic.twitter.com/5U1tKeFtUR — Poulomi Saha (@PoulomiMSaha) September 11, 2021 -
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది మరింత బలపడి ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో శనివారం (11వ తేదీన) అల్పపీడనం ఏర్పడనుంది. ఇది 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. క్రమంగా దక్షిణ ఒడిశా, ఒడిశా ప్రాంతాల మీదుగా మధ్యప్రదేశ్, విదర్భ వైపు వెళ్లనుంది. దీని ప్రభావం రాష్ట్రంపై అంతంత మాత్రంగానే ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు గుజరాత్ సమీపంలో అరేబియా తీరంలో అల్పపీడనం కొనసాగుతుండటం వల్ల తేమ గాలులు రాష్ట్రం వైపుగా వస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రెండురోజులు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు పడే అవకాశాలున్నట్లు చెప్పారు. గడిచిన 24 గంటల్లో పలాసలో 67 మిల్లీమీటర్లు, సోంపేటలో 63, వజ్రపుకొత్తూరులో 56, మందసలో 40.75, నరసన్నపేటలో 33.4, గారలో 22, ఎల్‌ఎన్‌పేటలో 19, సంతబొమ్మాళిలో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
గోదావరిలో స్థిరంగా వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్టు: పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. గురువారం సాయంత్రం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10 అడుగులకు చేరింది. గోదావరి డెల్టా కాలువలకు కొంతనీరు వదిలి, మిగిలిన 7,62,609 క్యూసెక్కుల నీటిని బ్యారేజ్‌లోని 175 గేట్లను ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఈ బ్యారేజి వద్ద నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం కృష్ణా నదిలో వరద ప్రవాహం తగ్గింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 70,577 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. తెలంగాణ ప్రభుత్వం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 25,426 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 878.80 అడుగుల్లో 181.8320 టీఎంసీల నీరు ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు తెలంగాణ ప్రభుత్వం ఎడమగట్టు కేంద్రంలో 71.067 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి› చేసింది. నాగార్జునసాగర్‌లోకి 17,151 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో కాలువలకు, విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి వస్తున్న 19,444 క్యూసెక్కులను స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఈ ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరు వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 63,003 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 11,203 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 51,800 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ నుంచి కిందకు వదిలేస్తున్నారు. సోమశిలలోకి పెన్నా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 26 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 72.84 టీఎంసీలకు చేరుకుంది. మరో 5.16 టీఎంసీలు చేరితే సోమశిల ప్రాజెక్టు గేట్లు ఎత్తేస్తారు. సోమశిల నుంచి వదలుతున్న నీటిలో కండలేరు రిజర్వాయర్‌లోకి 8,600 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం కండలేరులో 54.98 టీఎంసీల నీరుంది. కండలేరు నిండాలంటే ఇంకా 13.05 టీఎంసీలు అవసరం. -
విస్తారంగా వర్షాలు.. గోదావరి ఉగ్రరూపం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నదులు వరద ప్రవాహంతో పరుగులు తీస్తున్నాయి. ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలోని ఎస్సారెస్పీ (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) నుంచి 3.50 లక్షల క్యూసెక్కులు, ఎల్లంపల్లి నుంచి 6.71 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి ప్రాణహిత, ఇంద్రావతి వరద తోడవడంతో కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నుంచి 9.60 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చే వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు పోలవరం వద్దకు 5.20 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో వరదను దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 4.82 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 4.80 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గురువారం ఉదయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు 9 నుంచి 10 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీశైలంలోకి తగ్గిన వరద.. కృష్ణా బేసిన్లో వర్షపాత విరామం వల్ల కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గింది. శ్రీశైలంలోకి 89,391 క్యూసెక్కులు చేరుతుండగా.. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 30 వేల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 877.92 అడుగుల్లో 177.35 టీఎంసీల నీరుంది. సాగర్‌లోకి 12,200 క్యూసెక్కులు చేరుతుండగా విద్యుదుత్పత్తి ద్వారా 10,360 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587.6 అడుగుల్లో 305.86 టీఎంసీల నీరు ఉంది. సాగర్ నుంచి వస్తున్న ప్రవాహానికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 23,480 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో వరదను స్పిల్ వే గేట్ల ద్వారా, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి వస్తున్న జలాలకు కట్టలేరు, మున్నేరు, వైరా ప్రవాహం తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 1,16,771 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 9,821 క్యూసెక్కులు వదిలి, మిగిలిన 1,06,950 క్యూసెక్కులను బ్యారేజీ 60 గేట్లను రెండడుగులు, 10 గేట్లను మూడడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార, నాగావళిలో పెరిగిన వరద వంశధార, నాగావళి నదుల్లో వరద మరింతగా పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి 12,132 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి నారాయణపురం ఆనకట్ట వద్దకు చేరుతున్న 7,400 క్యూసెక్కులను కడలిలోకి విడుదల చేస్తున్నారు. సోమశిలలోకి పెన్నా ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. సోమశిల రిజర్వాయర్‌లోకి 25,613 క్యూసెక్కులు చేరుతుండగా 10,486 క్యూసెక్కులను కండలేరుకు, దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సోమశిలలో 71.51 టీఎంసీల నీరుంది. మరో 6.5 టీఎంసీలు చేరితే సోమశిల ప్రాజెక్టు గేట్లు ఎత్తేస్తారు. కండలేరులోకి 8,600 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 54.10 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 14 టీఎంసీలు అవసరం. -
11న అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/కొమ్మాది (భీమిలి)/విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి మన రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఈనెల 11న ఉత్తర బంగాళాఖాతాన్ని అనుకుని మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. షీర్ జోన్ (ద్రోణి) సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విశాఖ జిల్లా తిమ్మాపురం గ్రామం బుధవారం నీట మునిగింది. కాపులుప్పాడ ప్రాంతంలో వరిపొలాల్లోకి నీరు చేరింది. మంగమారిపేట, ఉప్పాడ, తిమ్మాపురం ప్రాంతాల్లో సముద్ర కెరటాలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో మంగమారిపేట వద్ద సముద్ర తీరం కోతకు గురైంది. జిల్లాలోని ప్రధాన నదులైన తాండవ, శారద, వరాహ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాండవ, కల్యాణపులోవ జలాశయాలు నిండుగా ఉన్నాయి. ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే ప్రధాన డుడుమ జలాశయంలో నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. గెడ్డలో కొట్టుకుపోయి.. బయటపడిన పాల వ్యాపారి ఆనందపురం మండలం వెల్లంకికి చెందిన పోలయ్య పాల వ్యాపారం కోసం కాపులుప్పాడ వెళ్తుండగా పరదేశిపాలెం గెడ్డ వద్ద నీటి ఉధృతికి ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయిన పోలయ్య.. అక్కడున్న కర్రల సహాయంతో ఒడ్డుకు చేరుకున్నాడు. మధ్యాహ్నం నీటి ఉధృతి తగ్గిన తర్వాత స్థానికుల సాయంతో ద్విచక్ర వాహనాన్ని ఒడ్డుకు చేర్చారు. -
రూ. 500 కోట్లతో పట్టణ రోడ్లకు మరమ్మతులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా నగరాలు, పట్టణాల్లోని రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు మునిసిపల్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. గత ప్రభుత్వం మునిసిపాలిటీల్లో అసంపూర్తిగా నిర్వహించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాలువలు, ఇతర పనుల వల్ల చిన్నపాటి వర్షాలకే రోడ్లు దెబ్బతింటున్నాయి. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు దెబ్బతిని పట్టణ ప్రాంత ప్రజలు అవస్థలు పడ్డారు. 1,500 కి.మీ. మేర మరమ్మతులు రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభు త్వం రూ.500 కోట్లు వెచ్చించనుంది. దీన్లో విజ యవాడ, గుంటూరు, విశాఖపట్నంసహా 17 నగరపాలక సంస్థల్లో చేపట్టే పనులకు రూ.350 కోట్లు వెచ్చిస్తారు. మిగిలిన 106 స్పెషల్, సెలక్షన్, ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు రూ.150 కోట్లు కేటాయించారు. మొత్తంగా 1,500 కిలోమీటర్ల మేర రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు మునిసిపల్ ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రతిపాదనల్ని సిద్ధం చేసి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. వర్షాలు తగ్గిన వెంటనే చేపడతాం నగరాలు, పట్టణాల్లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టడానికి సిద్ధమవుతున్నాం. ఈ నెలాఖరు నాటికి సాంకేతికపరమైన కార్యక్రమాలు పూర్తి చేసి.. వచ్చే నెలలో వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. – డాక్టర్ వి.చంద్రయ్య, ఈఎన్సీ, ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం -
విస్తారంగా వర్షాలు
సాక్షి, నెట్వర్క్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంగళవారం కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. విశాఖ జిల్లా ఏజెన్సీలో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. హుకుంపేట–అడ్డుమాండ ప్రధాన రహదారిలో వంతెనపైకి వరదనీరు రావడంతో రాకపోకలు స్తంభించాయి. తూర్పుగోదావరి జిల్లాలో గత 24 గంటల్లో సగటున 67.9 మిల్లీమీటర్ల వర్షపాతం చోటు చేసుకుంది. జిల్లావ్యాప్తంగా సింహభాగం మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కాకినాడ అర్బన్‌లో 174 మిల్లీమీటర్లు.. అత్యల్పంగా రాజోలులో 26.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఏజెన్సీలో కొండ వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రంపచోడవరం వాల్మీకిపేటకు చెందిన గొర్లె మహేష్ (చిట్టి) చేపలు పట్టేందుకు స్థానిక పంపుహౌస్ సమీపంలోని కాలువలో దిగగా ఉధృతికి కొట్టుకుపోయాడు. అతడిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో కెరటాలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం 15 అడుగులు ముందుకు రావడంతో తీర ప్రాంతం కోతకు గురైంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంట ఉన్న కపుల్ బెడ్స్, వాచ్ టవర్స్, గొడుగులు వంటి వాటిని కెరటాలు తాకడంతో పర్యాటకులు భయాందోళనలకు గురయ్యారు. భీమిలి బీచ్ రోడ్డు, మంగమారిపేట, ఉప్పాడ, తిమ్మాపురం ప్రాంతాల్లోనూ కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా కవిటిలో 125 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లా ఎద్దెలవాగు వంతెనపై ప్రవహిస్తున్న గోదావరి వరద పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే దారిలో ఎద్దెల వాగు వంతెన సోమవారం రాత్రి నీటమునిగింది. దీంతో దిగువన ఉన్న కొయిదా, కట్కూరు, కాచారం, తాళ్లగొంది, పూసుగొంది, చిట్టంరెడ్డిపాలెం, యడవల్లి, బుర్రెడ్డిగూడెం, టేకూరు, సిద్దారం, కుంకుడుకొయ్యల పాకలుతోపాటు మరో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత 2 రోజుల నుంచి పెదవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, రామవరం, ఊటగుంపు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అశ్వారావుపేట వెళ్లే రహదారిలో రామవరం వద్ద లోతు వాగు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు నుంచి రుద్రమకోటకు వెళ్లే దారిలో పెదవాగు వంతెన ప్రాంతంలో రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. మద్దిగట్ల ప్రాంతంలో వాగు ఉధృతిలో కొట్టుకుపోతున్న 2,000 గొర్రెలను ఎస్ఐ సాదిక్, సిబ్బంది కాపాడారు. తహసీల్దార్ చల్లన్నదొర ఎద్దెల వాగు వద్ద నాటు పడవను ఏర్పాటు చేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 0.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. వాగులో గల్లంతైన యువతి మృతి పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్లి తిరిగొస్తూ సోమవారం వాగులో గల్లంతైన మనీషా వర్మ (23) మృతదేహం మంగళవారం లభ్యమైంది. సుమారు ఐదు బృందాలు ఉదయం నుంచి వాగు వెంట ఐదు కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు తెలంగాణలోని అశ్వారావుపేట మండలం కంట్లం సమీపంలో వాగులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. వారంలో మరో అల్పపీడనం.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ కేంద్రం తెలిపాయి. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రానున్న వారం రోజుల్లో మరో అల్పపీడనం ఏపీ తీరానికి సమీపంలో ఏర్పడి.. ఒడిశా వైపుగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో 10 రోజుల తర్వాత మళ్లీ వర్షాలు పుంజుకుంటాయి. కాగా, గత 24 గంటల్లో తాడేపల్లిగూడెంలో 46.5, విశాఖపట్నంలో 30, పెందుర్తి, చింతపల్లిల్లో 22, అనకాపల్లిలో 18, వాయల్పాడులో 16.3, మాకవరపాలెంలో 12, కమలాపురంలో 11, సంజామలలో 10, నర్సీపట్నంలో 9, అమరపురంలో 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
నదులన్నీ కడలి వైపు ఉరకలు
సాక్షి, అమరావతి: వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో నదులు, వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా నదులు కడలి వైపు పరుగులు తీస్తున్నాయి. శ్రీశైలంలోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1.64 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు చేరుతుండటంతో నీటి నిల్వ 168.63 టీఎంసీలకు పెరిగింది. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ విడుదల చేస్తున్న నీటిలో 10,480 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌లోకి చేరుతుండటంతో నీటి నిల్వ 305.86 టీఎంసీలకు చేరుకుంది. తెలంగాణలో కురిసిన భారీ వర్షాల వల్ల మూసీ ఉరకలెత్తుతుండటం.. దానికి కృష్ణా వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 45,608 క్యూసెక్కులు చేరుతోంది. నీటి నిల్వ 32.25 టీఎంసీలకు చేరుకుంది. సిŠప్ల్ వే గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 52,513 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరు వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 1,10,191 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 7,991 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 1,02,200 క్యూసెక్కులను బ్యారేజీ 70 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదా‘వడి’ పెరుగుతోంది గోదావరిలోకి భారీగా వరద చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 3.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ధవళేశ్వరం బ్యారేజీలోకి 3.32 లక్షల క్యూసెక్కులు వస్తోంది. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 3.27 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ఉధృతి వంశధార, నాగావళి పరవళ్లు ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా వంశధార, నాగావళిలో వరద ఉధృతి పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి వంశధార నుంచి 7,133 క్యూసెక్కులు చేరుతుండగా.. 7వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళి ప్రవాహంతో తోటపల్లి, నారాయణపురం ఆనకట్టల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకుంది. దాంతో నారాయణపురం ఆనకట్ట నుంచి 5 వేల క్యూసెక్కుల నాగావళి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. పెన్నా బేసిన్లో రిజర్వాయర్లు కళకళ పెన్నా నదిలో వరద ఉధృతి పెరిగింది. గండికోట ప్రాజెక్టు ఇప్పటికే నిండిపోయింది. సోమశిల ప్రాజెక్టులోకి 22,792 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 70.40 టీఎంసీలకు చేరుకుంది. మరో 8 టీఎంసీలు చేరితే సోమశిల ప్రాజెక్టు నిండిపోతుంది. కండలేరులో నీటి నిల్వ 53.76 టీఎంసీలకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 15 టీఎంసీలు అవసరం. నాతవరం: తాండవ జలాశయ నీటిమట్టం మంగళవారం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో అప్రమత్తమైన ప్రాజెక్ట్ అధికారులు స్పిల్‌వే గేట్ల ద్వారా వరద నీటిని తాండవ నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్ట్ సాధారణ నీటిమట్టం 380 అడుగులు కాగా.. మంగళవారం మధ్యాహ్నానికి 379.2 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 2,500 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలో చేరుతోంది. రెండు స్పిల్‌వే గేట్ల ద్వారా 1200 క్యూసెక్కులు నదిలోకి విడుదల చేశారు. రైవాడ ప్రమాదస్థాయి నీటి మట్టం 114.25 మీటర్లు కాగా.. ప్రస్తుతం 108.25 మీటర్లకు చేరింది. కోనాం ప్రమాద స్ధాయి నీటిమట్టం 101.24 మీటర్లు కాగా.. ప్రస్తుతం 98.45 మీటర్లు, మేఘాద్రిగెడ్డ ప్రమాదస్థాయి నీటిమట్టం 61 అడుగులు కాగా.. 58 అడుగులకు చేరింది. పెద్దేరు ప్రమాదస్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా మంగళవారం సాయంత్రానికి 136.60 మీటర్లకు చేరింది. -
TS: రోడ్లన్నీ జలదారులే
ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే రుతు పవనాలు కూడా చురుగ్గా ఉండటం, ఈనెల 11న ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండటంతో.. వానలు మరికొద్దిరోజులు కొనసాగవచ్చని వెల్లడించింది. సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్:రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కారణంగా జన జీవనం అతలాకుతలమైంది. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చాలా పట్టణాలు, గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు వరంగల్ జిల్లా నడికుడలో ఏకంగా 38.8 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇంతస్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే మొదటిసారని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్ జిల్లా మల్యాలలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు వెల్లడించింది. ఈ రెండు చోట్ల మాత్రమే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 జిల్లాల్లో భారీ వర్షాలు నమోదైనట్టు తెలిపింది. భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం హన్మకొండలోని హంటర్ రోడ్డు జంక్షన్‌ను ముంచెత్తిన వరద జల దిగ్బంధంలో వరంగల్.. భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. వాగులు ఉప్పొంగి భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మేడారం జంపన్నవాగు బ్రిడ్జికి ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. వరంగల్‌లో ముంపు బాధితులను పునరావాస కేం ద్రాలకు తరలిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై భారీ వరద చేరడంతో పంతిని వద్ద ప్రవాహంలో ఓ లారీ చిక్కుకుంది. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో పంటలు నీటమునిగాయి. వేములవాడ శివారు లక్ష్మీపూర్‌కు చెందిన మూడు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, గ్రామస్తులు అన్ని చోట్లా బీభత్సమే.. ► ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. జోగిపేట అన్నసాగర్, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నల్లవాగు, జహీరాబాద్ నియోజకవర్గంలోని నారింజ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ► నిజామాబాద్ నగరంలో పలు లోతట్టు కాలనీలు నీటమునిగాయి. దీంతో కంఠేశ్వర్ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై ఆయా కాలనీల జనం ధర్నా చేశారు. ఉమ్మడి జిల్లా జిల్లావ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి, సోయా, పసుపు, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా సోయా పంటకు నష్టం ఎక్కువగా జరిగినట్లు అంచనా. పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. ► యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆలేరు–సిద్దిపేట మార్గంలోని కొలనుపాక, రాజాపేట మండల కేంద్రం జల దిగ్బంధం అయ్యాయి. భారీ వర్షాలతో యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ► నిర్మల్ జిల్లాలో గోదావరి నది, ఉప నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భైంసా పట్టణంలో 9 కాలనీలు నీటమునిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కుంటాల, పొచ్చర జలపాతాలు హోరెత్తుతున్నాయి. బోథ్ తహసీల్దార్ కార్యాలయం పైకప్పు పెచ్చులూడిపడ్డాయి. పది మంది మృతి.. ఇద్దరు గల్లంతు ► సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి–గూడాటిపల్లి మధ్య వాగు దాటుతూ. పోతారం(జే) గ్రామానికి చెందిన రంగు కిష్టస్వామి (45) చనిపోయారు. ► సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం మాద్వార్‌కు చెందిన కోవూరి మహిపాల్ (35) మంగళవారం మధ్యాహ్నం కిరాణా సరుకులు తీసుకొని ఇంటికి వస్తుండగా.. గ్రామ శివార్లలోని కాజ్వే దాటుతూ వాగులో కొట్టుకుపోయి మృతి చెందారు. ► ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట బస్టాండ్‌లో అనాథ వ్యక్తి వానకు తడిసి, చలి తట్టుకోలేక మృతి చెందారు. కోరుట్లలో నీట మునిగిన ప్రకాశం రోడ్ ప్రాంతం ► జగిత్యాల జిల్లాలో వాన నలుగురిని బలితీసుకుంది. గొల్లపెల్లి మండలం మల్లన్నపేట వద్ద బైక్‌పై కాజ్వే దాటుతూ.. నందిపల్లెకు చెందిన ఎక్కలదేవి గంగమల్లు, ఆయన కుమారుడు వరదలో కొట్టుకుపోయి చనిపోయారు. మల్లాపూర్ మండలంలో ఇంట్లో మోటార్ వేద్దామని వెళ్లిన నేరెల్ల శ్రీను అనే వ్యక్తి.. వైర్లు తడిసి ఉండటంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. గొల్లపల్లి మండలం బొంకూర్‌లో ఓ అంగన్వాడీ టీచర్ తడిసిన వైర్లను ముట్టుకోవడంతో విద్యుదాఘాతానికి బలయ్యారు. ► సిరిసిల్ల పట్టణంలో వరదలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. కానీ అప్పటికే అతను చనిపోయి ఉన్నట్టు గుర్తించారు. వరద తాకిడికి మూలవాగుపై నిర్మిస్తున్న వంతెన కూలిపోయిన దృశ్యం ► కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలో వానకు తడిసి ఇంటిగోడ కూలడంతో.. నిమ్మ నర్సవ్వ (35) అనే మహిళ చనిపోగా, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే జిల్లా బాన్సువాడ మండలం కన్నయ్యతండాలో ఆశ్రద్ (38) అనే రైతు పొలం వద్ద విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. ► నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలంలో టెంబరేణి దగ్గర ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌లో చేపలవేటకు వెళ్లి గుమ్ముల నరేశ్ (36), కరీంనగర్ మండలం చెర్లబుత్కూర్లో వాగు దాటుతూ ఓ వ్యక్తి గల్లంతయ్యారు. గర్భిణులకు వరద కష్టాలు ►ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొత్త వెంకటగిరి– బిల్లుపాడు గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వెంకటగిరికి చెందిన కిన్నెర మమత పురిటినొప్పులతో బాధ పడుతుండగా.. వాగు ప్రవాహం నుంచే నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా..ఆడపిల్లకు జన్మనిచ్చింది. ► ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం చిన్నుమియ తండాకు చెందిన గర్భిణి గంగాబాయికి మంగళవారం ఉదయం పురిటినొప్పులు మొదలయ్యాయి. గ్రామానికి 108 వచ్చే అవకాశం లేకపోవడంతో.. సమీపంలోని గుట్ట మీదుగా కిలోమీటర్ దూరం నడిపించుకుంటూ తీసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. -
ఆంధ్రప్రదేశ్: పాతాళ గంగ.. కరువు తీరంగ
సాక్షి, అమరావతి: పాతాళ గంగ పైపైకి వస్తోంది. దుర్భిక్ష ప్రాంతాల్లోనూ కరువు తీర్చే కల్పవల్లిగా అవతరిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగాయి. మే 31 నాటికి రాష్ట్రంలో సగటున 9.88 మీటర్ల లోతున భూగర్భ జలాలు లభ్యమయ్యేవి. ఇప్పుడు సగటున 8.24 మీటర్లలో లోతులోనే భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. రుతు పవనాల ప్రభావం వల్ల జూన్ నుంచి ఈ నెల 6 వరకూ రాష్ట్రంలో సగటున 433.59 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాలి. కానీ.. 382.55 మిల్లీమీటర్ల వర్షపాతమే కురిసింది. సాధారణం కంటే 11.77 శాతం తక్కువ వర్షపాతం నమోదైనా భూగర్భ జలమట్టం భారీగా పెరగడం గమనార్హం. దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఏకంగా 4.84 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగింది. 163.55 టీఎంసీల భూగర్భ జలాలు రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,63,099 చదరపు కిలోమీటర్లు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి ఇప్పటివరకూ కురిసిన వర్షపాతం పరిమాణం 2,233.47 టీఎంసీలు. ఇందులో 163.55 టీఎంసీలు భూగర్భ జలాల రూపంలోకి మారాయి. దాంతో భూగర్భ జలమట్టం 8.24 మీటర్లకు చేరుకుంది. గతేడాది సెప్టెంబర్ 6వ తేదీ నాటికి సగటున 13.27 మీటర్లలో భూగర్భ జలాలు లభ్యయ్యేవి. అంటే.. గతేడాది సెప్టెంబరు 6తో పోల్చితే ప్రస్తుతం రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సగటున 5.03 మీటర్లు పెరిగినట్టు స్పష్టమవుతోంది. అనంతపురం జిల్లాలో మే 31 నాటికి 15.54 మీటర్లలో భూగర్భ జలమట్టం ఉండేది. ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావం వల్ల ఆ జిల్లాలో భూగర్భ జలమట్టం 10.70 మీటర్లకు చేరుకుంది. అంటే ఏకంగా 4.84 మీటర్ల మేర జలమట్టం పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా భూగర్భ జలాలు పెరిగిన జిల్లా అనంతపురమే కావడం గమనార్హం. నెల్లూరు జిల్లాలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల అధికంగా వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం ఆ జిల్లాపై తక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆ జిల్లాలో భూగర్భజలమట్టం తగ్గింది. అక్కడ భూగర్భ జలమట్టం మే 31 నాటితో పోల్చితే సోమవారం నాటికి 0.71 మీటర్లు తగ్గింది. ఇబ్బందులు తప్పినట్టే.. రాష్ట్రంలో సుమారు 13 లక్షల బోరు బావుల కింద దాదాపు 24 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. తాగు, గృహ అవసరాల నీటి కోసం 2.33 లక్షల బోరు బావులపై ప్రజలు ఆధారపడతారు. భూగర్భ జలమట్టం భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది సాగు, తాగునీటి ఇబ్బందులు తప్పినట్టేనని అధికారులు విశ్లేషిస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఈ నెలతో పాటు అక్టోబర్‌లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈశాన్య రుతుపవనాలతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తూర్పు ప్రాంతం, ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంపై అధికంగా వర్షాలు కురుస్తాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే జలమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. -
రేపు అల్పపీడనం.. భారీ వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించింది. దీని ప్రభావంతో సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లోను.. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో రాజమండ్రిలో 7.2 సెం.మీ., అంబాజీపేటలో 7, ఎల్.ఎన్. పేటలో 6.7, తణుకులో 6.3, మచిలీపట్నంలో 6.1, మండపేటలో 5.9, అనపర్తి, పెడనలో 5.9, మచిలీపట్నంలో 5.6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
ఇడా తుపాను దెబ్బకు 46 మంది మృతి
న్యూయార్క్: అమెరికాలో ఇడా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మేరీలాండ్ నుంచి కనెక్టికట్ ప్రాంతం వరకు ఇడా సృష్టించిన విలయంలో దాదాపు 46 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. పలువురు ప్రజల ఇళ్లు, వాహనాలు నీటమునిగాయి. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇడా దెబ్బకు పలు ప్రాంతాల్లో నదులు పొంగి ఉత్పాతాలు సృష్టించాయి. ఈ తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో 23 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. పరిస్థితులను అధ్యక్షుడు జోబైడెన్ సమీక్షిస్తున్నారు. జోరున కురుస్తున్న వానతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొవిడ్ బాధితులతో పాటు అత్యవసర చికిత్సలు అవసరమైనవారి కోసం చాలా చోట్ల జనరేటర్లతో ఆసుపత్రులను నిర్వహించాల్సి వచి్చంది. అత్యవసర సహాయం కోసం ఏర్పాటు చేసిన 911 సేవలకూ ఆటంకాలు ఎదురయ్యాయి. చాలా చోట్ల చెట్లు కూలిపోవడంతో పాటు ఇళ్ల కప్పులు ధ్వంసమయ్యాయి. తుపాను కారణంగా ష్కైల్‌కిల్ నదికి 100ఏళ్లలో ఎన్నడూ రానంత వరద వచి్చంది. వాన, గాలి కారణంగా అధికారిక సహాయ చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. -
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
సాక్షి, అమరావతి /సాక్షి, విశాఖపట్నం: రుతుపవన ద్రోణి మచిలీపట్నం మీదుగా ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా గుజరాత్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కి.మీ వరకూ కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. శుక్రవారం కోస్తాంధ్రలోని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రావులపాలెంలో 12 సెం.మీ, అడ్డతీగలలో 9.5, రంగాపురంలో 7.2, ఆత్రేయపురంలో 6.6, నాగాయలంకలో 6.0, చిలకలూరిపేటలో 5.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌లో విస్తారంగా వానలు ఆగస్టులో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. 139.9 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 138.5 మి.మీ వర్షం కురిసింది. కోస్తా జిల్లాల్లో 162.1 మి.మీ వర్షానికి 169 మి.మీ వర్షం పడింది. రాయలసీమలో 108.5 మి.మీటర్లకు 96.4 మి.మీ వర్షం కురిసింది. 3 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ, 4 జిల్లాల్లో కురవాల్సిన దాని కంటే కొంచెం తక్కువ వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ వర్షాకాలంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ అంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాలు బలపడటంతో ఈ సీజన్లోనే ఎక్కువ వర్షపాతం ఈ నెలలో నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న అల్పపీడన ద్రోణి కూడా సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఎత్తులో స్థిరంగా ఉంది. వీటి ప్రభావంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. 13 జిల్లాల్లో సగటున 2.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 9.9, శ్రీకాకుళంలో 9 మి.మీ సగటు వర్షపాతం రికార్డయ్యింది. విశాఖపట్నంలో 5.6 మి.మీ, కృష్ణా జిల్లాలో 5, తూర్పుగోదావరిలో 4.9, పశ్చిమగోదావరిలో 4.2, ప్రకాశం జిల్లాలో 2.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. (చదవండి: లోకేశ్.. పిచ్చి ప్రేలాపనలు వద్దు) శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో అత్యధికంగా 116.5 మి.మీ (11.6 సెంటీమీటర్లు) వర్షం కురిసింది. విజయనగరం జిల్లా మెరకముడిదంలో 71.3, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 64.8, ప్రకాశం జిల్లా టంగుటూరులో 62.8, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 53.8, తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో 52.3, ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 51.3, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో 49.8, శ్రీకాకుళం జిల్లా బుర్జలో 47.8, కర్నూలు నగరంలో 47 మి.మీ వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు రోజులు కోస్తాంధ్రలోని పలుచోట్ల భారీ వర్షాలు, అనేక చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం ఉత్తరాంధ్రలో, గురువారం ఉత్తరాంధ్రతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం
శ్రీశైలం ప్రాజెక్ట్/అచ్చంపేట: శ్రీశైలం జలాశయానికి సోమవారం వరద ప్రవాహం పెరిగింది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల, సుంకేసుల, హంద్రీ నదుల నుంచి 33,650 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. ఎడమగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తూ తెలంగాణ 12,713 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తోంది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఎడమగట్టు కేంద్రంలో 6.890 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. కాగా, డ్యామ్ పరిసర ప్రాంతాల్లో 13.10 మి.మీ. వర్షం కురిసింది. ప్రస్తుతం జలాశయంలో 160.5282 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 874.30 అడుగులకు చేరుకుంది. పులిచింతలకూ వరద ప్రవాహం.. మరోవైపు నాగార్జునసాగర్ దిగువన పులిచింతల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం వస్తోంది. నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో అధికంగా నీరు ప్రాజెక్టులోకి చేరుతోందని ఏఈ రాజశేఖర్ తెలిపారు. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం 61,628 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు నిర్వహణ పనులు జరుగుతున్నందున 53 మీటర్ల లోతు సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో 50 మీటర్లకు మించి నీరు నిల్వ ఉంచే అవకాశం లేదన్నారు. అందువల్ల ఎగువ నుంచి వచ్చే నీటిని దిగువకు వదులుతున్నామని వివరించారు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32.5871 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. పూర్తి సామర్థ్యంతో నీటిని నింపాలంటే పనులు పూర్తి కావాలని చెప్పారు. ఇందుకు మరో 20 రోజులు పడుతుందని తెలిపారు. -
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం 12 జిల్లాల్లో వర్షాలు కురిశాయి. సగటున రాష్ట్ర వ్యాప్తంగా 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో అనేక చోట్ల ఎడతెరిపి లేని వర్షాలు పడ్డాయి. విజయనగరం జిల్లాలో 5 మి.మీ. సగటు వర్షపాతం నమోదవగా, శ్రీకాకుళం జిల్లాలో 4.2, పశ్చిమగోదావరిలో 4.2, తూర్పుగోదావరిలో 3.2, విశాఖపట్నంలో 3, గుంటూరులో 1.9, కృష్ణాలో 1.4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. వైఎస్సార్ కడప జిల్లాలో మాత్రమే వర్షపాతం నమోదవలేదు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అత్యధికంగా 73.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా నర్సాపురంలో 66, తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో 65.5, విజయనగరం జిల్లా సాలూరులో 45, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలలో 39.8, కోరుకొండలో 36.3, సఖినేటిపల్లిలో 36, విశాఖ జిల్లా మేకావారిపాలెంలో 33.5, పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్రలో 33, తూర్పుగోదావరి జిల్లా చింతూరులో 32.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. వచ్చే రెండురోజులు ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు బలపడ్డాయని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ సమీపంలో అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతుండగా, అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన రుతుపవన ద్రోణి శివపురి, ఛత్తీస్‌గఢ్, విశాఖపట్నం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. -
రేపు మూడు జిల్లాల్లో భారీ వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. అదేవిధంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఉత్తర బంగాళా ఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది దిశ మార్చుకొని ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణ వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లా ల్లో తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో వెంకటగిరిలో 6.1 సెంటీమీటర్లు, తవనంపల్లెలో 5.1, గోరంట్లలో 4.9, కృత్తివెన్నులో 4.6,నూజివీడులో 4.5, తాడేపల్లిగూడెంలో 4.2, జగ్గయ్యపేటలో 3.7, పలమనేరులో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
నేడు, రేపు విస్తారంగా వానలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): తమిళనాడు, శ్రీలంక తీరాలకు సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తీరం వెంబడి తూర్పు–పడమర గాలుల కలయిక (షియర్ జోన్) కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్లు నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. -
నేడు రాయలసీమలో విస్తారంగా వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: కోస్తా, రాయలసీమల్లో సోమవారం, మంగళవారం అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానంగా రాయలసీమలో సోమవారం రాత్రి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. అరేబియా సముద్రానికి సమీపంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీనివల్ల తేమగాలులు రాయలసీమ వైపు కదులుతున్నాయి. అదేవిధంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గత 24 గంటల్లో పెద్దపల్లిలో 8.9, చంద్రగిరిలో 6.7, రామచంద్రాపురంలో 6.6, తిరుపతిలో 6.2, కుప్పంలో 5.0, పెద్దారవీడులో 4.9, శ్రీరంగరాజపురంలో 4.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
మరో రెండ్రోజులు తేలికపాటి వానలు
సాక్షి,విశాఖపట్నం/కోడూరు(అవనిగడ్డ)/బుట్టాయగూడెం/సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఆదివారం, సోమవారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణ, రాయలసీమ మీదుగా కోస్తా తీరం వరకు ఆవరించి ఉంది. ఇది సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా భావదేవరపల్లిలో అత్యధికంగా 14.7 సెం.మీ వర్షం కురిసింది. నాగాయలంకలో 12.1, గణపవరంలో 9.8, అవనిగడ్డలో 9.4, పెనుమంట్ర, రేపల్లెల్లో 8.6, బైరెడ్డిపల్లెలో 8.4, రెడ్డిగూడెంలో 8.0, నిడదవోలులో 7.4, అద్దంకిలో 7.0, చింతలపూడిలో 6.7, అత్తిలిలో 6.3, గొలుగొండలో 6.1, విజయవాడలో 6.0, నున్నలో 5.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లా కోడూరులో నీట మునిగిన ఆలయం.. శనివారం కురిసిన భారీ వర్షాలకు కృష్ణా జిల్లా కోడూరు మండల కేంద్రంలో శ్రీబాల త్రిపుర సుందరీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం నీట మునిగింది. ఆలయం లోపల మోకాలు లోతున నీరు చేరడంతో స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించేందుకు అర్చకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి కొండవాగులు పొంగిపొర్లాయి. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం సమీపంలోని జల్లేరు వాగు, పాలకుంట, కాకులవారిగూడెం, పద్మవారిగూడెం సమీపంలో వాగులు, కేఆర్ పురంలో బైనేరు వాగు ఉధృతంగా ప్రవహించాయి. జల్లేరు వాగు ఉధృతికి సుమారు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా రేపల్లె, అమృతలూరు, గుంటూరు, మంగళగిరి, నిజాంపట్నం, పొన్నూరు, తాడేపల్లి, తాడికొండ, పెదకాకాని, నగరం, పిట్టలవానిపాలెం, తదితర మండలాల్లో భారీ వర్షం పడింది. జిల్లాలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు రేపల్లె మండలంలో అత్యధికంగా 85.5 మిల్లీమీటర్లు, అమృతలూరు మండలంలో 52 మి.మీ, మంగళగిరిలో 46.75 మి.మీ, నిజాంపట్నంలో 46 మి.మీల వర్షపాతం నమోదైంది. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు పొలాల్లో తాటి చెట్టుపై పిడుగు పడటంతో మంటలు చెలరేగి చెట్టు నిలువునా కాలిపోయింది. గుంటూరు నగరంలో రోడ్లపై నీటితో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. తాడికొండ నియోజకవర్గం పరిధిలో చీకటి వాగు, ఎర్రవాగు, నక్కవాగు, కోటేళ్ల వాగు, కొండవీటి వాగులు పొంగిపొర్లాయి. సమీపంలోని పంట పొలాల్లో వరద నీరు చేరింది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గుంటూరు–తుళ్లూరుల మ«ధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తాడేపల్లిలోని పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. -
రెండురోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్యభారత దేశం వైపు ప్రయాణించింది. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ, నైరుతి గాలులు రాష్ట్రం వైపుగా వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావం ఉత్తర కోస్తా వైపు ఎక్కువగా ఉంటోంది. ఈ కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇది ఈ నెల 21 నాటికి మరింత బలపడనుంది. దీని ఫలితంగా 21, 22 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా రాగల రెండు రోజుల పాటు తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయి. -
ఒకవైపు ఎండ.. మరోవైపు వాన
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుండగా మరికొన్ని జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురవగా, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లిలో 38.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకావడంతో మంగళవారం దక్షిణ భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన జిల్లాగా విశాఖ రికార్డుకెక్కింది. మిగిలిన ప్రాంతాల్లోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు... ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ తీరంలో అల్పపీడనం ఏర్పడి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ అల్పపీడనం దిశను మార్చుకుని ఒడిశా వైపు పయనించే సూచనలు కూడా కనిపిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు జోరందుకొంటాయని అధికారులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు కిర్లంపూడిలో 75.25 మి.మీ, రావులపాలెంలో 72.25 మి.మీ, అయినవిల్లిలో 64.5, ఐ.పోలవరంలో 62.25, రాజమండ్రిలో 55.5, దగదర్తిలో 44.5, ఒంగోలులో 42.5 మి.మీల వర్షపాతం నమోదైంది. -
ఇక వర్షాకాలమే...
సాక్షి, విశాఖపట్నం : ఉత్తర భారతదేశంలో అల్పపీడన ప్రాంతం.. రుతుపవన ద్రోణితో కలిసి హిమాలయాల వైపుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా మారుతున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే రోజులు సమీపించాయి. ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మరోవైపు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి, ఉభయగోదావరి జిల్లాల మీదుగా సోమవారం మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. వాయువ్య గాలుల ప్రభావంతో సోమవారం వివిధ ప్రాంతాల్లో ఎండలు విజృంభించాయి. మంగళవారం తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. -
12న అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల మధ్యలో బంగాళాఖాతంలోఈ నెల 12న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఈ నెల 13 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం తేలికపాటి వానలు పడతాయన్నారు. మరోవైపు ఉత్తర ఈశాన్య తెలంగాణ, ఉభయగోదావరి జిల్లాల మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు వానలు పడే సూచనలున్నాయి. మధ్య భారతదేశంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం కారణంగా రాష్ట్రంపై పొడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ కారణంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ అల్పపీడనం బలహీనపడేవరకు పరిస్థితులు ఇదే మాదిరిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి వాయవ్య దిశగా గాలులు నెమ్మదిగా రాష్ట్రంపైకి వీయనుండటంతో వాతావరణంలో మార్పులు కనిపించనున్నాయి. గడిచిన 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నూజివీడులో 80 మిల్లీమీటర్లు, వంగరలో 70, కిర్లంపూడిలో 47.25, దుగ్గిరాలలో 41, దేవరాపల్లిలో 39.25, చందర్లపాడులో 39, సత్తెనపల్లిలో 38, కురుపాం, నూజెండ్లల్లో 35, అమరావతిలో 33.5, శంఖవరంలో 33, కంచికచర్లలో 30.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
వర్షాకాలమా? ఎండాకాలమా?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పై వరుసగా మూడో రోజూ భానుడు ప్రతాపం చూపించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆగస్టులో గతంలో ఎన్నడూ లేనంతగా పలుచోట్ల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖలో 1989 ఆగస్టు తర్వాత రికార్డు స్థాయిలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తునిలో సాధారణం కంటే 6.5 డిగ్రీలు అత్యధికంగా 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖలో 39.0, బాపట్లలో 38.2, నెల్లూరులో 38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వారం చివరి వరకు ఇవే పరిస్థితులుంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఏపీ తీరంలో బుధవారం స్వల్ప ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనివల్ల అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసి.. ఎండల నుంచి కొంత ఉపశమనాన్ని అందించాయి. మరోవైపు మచిలీపట్నం సమీపంలో ఈనెల 8న అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీనపడనుంది. ఆ తర్వాత 12న మరో అల్పపీడనం ఏర్పడి రాష్ట్రం మీదుగా కదులుతూ ఛత్తీస్‌గఢ్ వైపు ప్రయాణించనుంది. వీటి వల్ల వర్షాలు విస్తరించే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. -
శాంతించిన కృష్ణమ్మ.. శ్రీశైలంలోకి తగ్గిన వరద ప్రవాహం
సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/శ్రీశైలం ప్రాజెక్ట్/సత్రశాల(రెంటచింతల)/అచ్చంపేట/విజయపురి సౌత్: పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణమ్మ శాంతించింది. అధికారులు ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేస్తూ.. దిగువకు విడుదల చేసే నీటి పరిమాణాన్ని తగ్గిస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోనూ అదే పరిస్థితి ఉంది. దీంతో శ్రీశైలంలోకి వచ్చే వరద తగ్గింది. శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు, కుడి, ఎడమ గట్టు విద్యుత్కేంద్రాల ద్వారా 1,77,321 క్యూసెక్కులను వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 29,792 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. వరద ఉధృతి తగ్గడంతో నాగార్జునసాగర్ గేట్లను మూసివేశారు. సాగర్ విద్యుత్కేంద్రాల ద్వారా దిగువకు 68,126 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీటితో దిగువన టెయిల్‌పాండ్‌ను నింపుతున్నారు. నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి 23,706 క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ట, ఏఈఈ కె.నాగ నరసింహారావు మంగళవారం తెలిపారు. మొత్తం మీద పులిచింతలలోకి 51 వేల క్యూసెక్కులు చేరుతున్నాయి. పులిచింతల గేట్లను కూడా అధికారులు మూసివేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుతుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ఉధృతి కాస్త తగ్గింది. మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 2,05,689 క్యూసెక్కులు చేరుతుండగా.. 9,689 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేశారు. మిగులుగా ఉన్న 1.96 లక్షల క్యూసెక్కులను 70 గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. జూన్ 1 నుంచి మంగళవారం రాత్రి 7 గంటల వరకు సుమారు 77 టీఎంసీల జలాలు సముద్రంలో కలవడం గమనార్హం. గోదావరిలోనూ వరద తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి వస్తున్న నీటిని డెల్టాకు విడుదల చేయగా.. మిగులుగా ఉన్న 91 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
వేసవిని తలపిప్తోన్న వానాకాలం!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టులో ఇటీవల కాలంలో లేనంతగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖలో 37.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా.. ఉక్కపోత వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఆగస్టు రెండో వారం నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు పడే సూచనలున్నట్లు తెలిపారు. కోస్తా తీరం వెంబడి రానున్న 3 రోజుల్లో ఉపరితల ద్రోణి ఏర్పడనుందని..దీనికి అనుబంధంగా ఈ నెల 7న మచిలీపట్నం సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది ఉభయగోదావరి జిల్లాల మీదుగా కదులుతూ తెలంగాణ వైపు ప్రయాణించనుందని దీని ప్రభావంతో ఈ నెల 11 నుంచి 22 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగానూ, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు వర్ష సూచనలు ఏపీలో పడమర, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వీటి ఫలితంగా రాగల 2 రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచన ఉందని వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
2 నెలలు... జోరు వానలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నైరుతి సీజన్ మొదలైన రెండు నెలలకే సాధారణ వర్షపాతం కంటే 53.5 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. జూన్ 3న రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా తొలకరి సమయంలోనే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడ్డాయి. నెలలో కురవాల్సిన సగటు వర్షపాతం దాదాపు 4–5 రోజుల్లోనే నమోదైంది. అనంతరం రుతుపవనాల కదలికలు కాస్త నెమ్మదించినప్పటికీ జూలైలో తిరిగి చురుకుగా ప్రభావం చూపడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 36.31 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... సోమవారం నాటికి 56.18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతం కంటే 53.5 శాతం అధికంగా వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆరు జిల్లాల్లో రెట్టింపు వర్షపాతం... రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు కురవగా ఆరు జిల్లాల్లో సాధారణం కంటే రెట్టింపు వర్షాలు కురిశాయి. జగిత్యాల, నారాయణపేట, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సాధారణం కంటే 100–150 శాతంఅధిక వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వివరించింది. మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లోనూ జూన్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదు కావడంతో అక్కడ కూడా 150 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో అత్యధిక వర్షాలు నమోదవగా 18 జిల్లాల్లో అధిక వర్షాలు, 6 జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో గతేడాది నైరుతి రుతుపవనాల సీజన్లో 107.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కానీ ఈసారి కేవలం జూలైలోనే సాధారణం కంటే 57% అధికంగా వర్షాలు కురిశాయి. అత్యధికం: నిజామాబాద్, వరంగల్ అర్బన్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాయ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి అధికం: అదిలాబాద్, ఆసీఫాబాద్, జగిత్యాల, మహబుబాబాద్, వరంగల్ రూరల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మల్కాజ్గిరి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం సాధారణం: మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, ములుగు. -
సీమ నేలపై వరుణ కరుణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వరుణుడు కరుణ జల్లులు కురిపిస్తున్నాడు. వరుసగా మూడో ఏటా కరువుతీరా వర్షం కురుస్తోంది. నేలతల్లి పులకిస్తోంది. జూన్, జూలై నెలల్లో రాష్ట్రంలో 34 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమలో సాధారణంగా కురిసే వర్షాల కంటే 82 శాతం అధిక వర్షాలు కురవగా, కోస్తాంధ్రలో 14 శాతం అధిక వర్షం కురిసింది. ఉత్తరాంధ్ర వరకే చూసినప్పుడు అక్కడి మూడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలల్లో సగటున 222 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా 298 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో జూన్ ఒకటి నుంచి జూలై 31 వరకు రాష్ట్ర వర్షపాత వివరాలను వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం విడుదల చేసింది. అనంతపురంలో 121.9 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 252 మి.మీ. (103 శాతం అధికం) కురిసింది. వైఎస్సార్ కడప జిల్లాలో 163.9 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 330.5 మి.మీ. (102 శాతం అధికం) కురిసింది. చిత్తూరు జిల్లాలో 173.8 మి.మీ.కిగానూ 335.5 మి.మీ. (93 శాతం అధికం).. కర్నూలు జిల్లాలో 199.5 మి.మీ.కిగానూ 283.2 మి.మీ. (42 శాతం అధికం) కురిసింది. కృష్ణాలో 45 శాతం అధికం.. కృష్ణా జిల్లాలో 314 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 456.6 మి.మీ (45 శాతం అధికం) వర్షం పడింది. గుంటూరు జిల్లాలో 241.5 మి.మీ.కిగానూ 308.4 మి.మీ. (28 శాతం అధికం), తూర్పుగోదావరి జిల్లాలో 336.9 మి.మీకి గానూ 423.5 మి.మీ. (26 శాతం అధికం), పశ్చిమగోదావరి జిల్లాలో 363.3 మి.మీ.కిగానూ 449 మి.మీ. (24 శాతం అధికం) వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలో 143.5 మి.మీ.కిగానూ 175.7 మి.మీ. (22 శాతం అధికం), ప్రకాశం జిల్లాలో 166.9 మి.మీ.కిగానూ 186.3 మి.మీ. (12 శాతం అధికం) వర్షం పడింది. విశాఖపట్నం జిల్లాలో 297.6 మి.మీ.కిగానూ 257.5 మి.మీ. (13 శాతం లోటు) వర్షం, విజయనగరం జిల్లాలో 325.3 మి.మీ.కిగానూ 288.8 మి.మీ. (11 శాతం లోటు), శ్రీకాకుళం జిల్లాలో 340.2 మి.మీ.కిగానూ 319 మి.మీ. (6 శాతం లోటు) వర్షపాతం నమోదైంది. 15 శాతం తక్కువ వర్షపాతం నమోదైనా వాతావరణ శాఖ దాన్ని సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తుంది. దీంతో ఉత్తరాంధ్రలో సాధారణం కంటే కొంచెం తక్కువ వర్షం పడినా అది సాధారణమే. -
వడివడిగా కన్నుల పండుగగా..
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలలోకి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. అలాగే ఉపనదుల నుంచి జోరుగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి గురువారం సాయంత్రానికి 5.37 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఈ సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే. ప్రాజెక్టులో 884 అడుగుల స్థాయిలో నీటి నిల్వ ఉంచుతున్నారు. గురువారం ఉదయం 10 గేట్లను పది అడుగుల మేర ఎత్తారు. 3 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను వరుసగా మూడో ఏడాది ఎత్తడం ప్రాజెక్టు చరిత్రలో ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు. వరద ప్రవాహం పెరిగితే దిగువకు విడుదల చేసే ప్రవాహాన్ని పెంచుతామని శ్రీశైలం ప్రాజెక్టు సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 66 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దాంతో నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ వేగంగా పరుగులు తీస్తోంది. గురువారం సాయంత్రానికి సాగర్‌లో నీటి నిల్వ 204.96 టీఎంసీలకు చేరుకుంది. తెలంగాణ సర్కార్ సాగర్, పులిచింతల్లో విద్యుత్‌ఉత్పత్తి చేస్తూ నీరు వదిలేస్తోంది. నాగార్జుసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టులోని 2 యూనిట్ల ద్వారా 46 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ట, ఏఈ బి.కాసులు తెలిపారు. పులిచింతల నుంచి వస్తున్న నీటికి వైరా, కట్టలేరు, మున్నేరు ప్రవాహం తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 10,468 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టాకు 9,018 క్యూసెక్కులు వదులుతూ.. మిగులుగా ఉన్న జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
రెండు రోజులపాటు వానలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తుల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉంది. దీని ప్రభావం వల్ల ఈ నెల 28న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. -
‘కృష్ణా’లో వరద హోరు
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం.. పి.గన్నవరం: పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, ఉప నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి దిగువకు వదిలేస్తున్నారు. దీంతో సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.17 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 150 టీఎంసీలకు చేరుకుంది. ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ దిగువకు వదులుతున్న 25,427 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి. సాగర్‌కు దిగువన మూసీ ప్రవాహం కృష్ణా నదిలోకి కొనసాగుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 10,600 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. విద్యుదుత్పత్తి చేస్తూ ఆ నీటిని కూడా తెలంగాణ సర్కార్ దిగువకు వదిలేస్తోంది. ఈ ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరుల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 37,712 క్యూసెక్కులు చేరుతున్నాయి. కాలువలకు 4,322 క్యూసెక్కులు విడుదల చేసి.. మిగులుగా ఉన్న 33,390 క్యూసెక్కులను 45 గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 35 టీఎంసీల కృష్ణా జలాలు కడలిపాలయ్యాయి. మరోవైపు వరద ఉధృతితో తుంగభద్ర డ్యామ్ నిండిపోయింది. దీంతో గేట్లు ఎత్తేసి దిగువకు 1.49 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆ జలాలు మంగళవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరనున్నాయి. గోదా‘వడి’ తగ్గింది.. పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు 5,76,833 క్యూసెక్కుల వరద చేరింది. స్పిల్ వే వద్ద వరద నీటిమట్టం 31.88 మీటర్లకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా పోలవరం స్పిల్ వే 42 గేట్ల నుంచి దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం 7,93,468 క్యూసెక్కులకు తగ్గడంతో నీటిమట్టం 10.85 మీటర్లకు తగ్గింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 10,200 క్యూసెక్కులు వదిలి.. మిగులుగా ఉన్న 7,83,268 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి వచ్చే వరద మంగళవారం మరింత తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని వశిష్ట, వైనతేయ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిలంక, బూరుగులంక గ్రామాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న అనగర్లంక, పెదమల్లంక, సిర్రావారిలంక, అయోధ్యలంక, కనకాయలంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. -
శ్రీశైలం @ 150 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది, దాని ఉప నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగానే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి దిగువకు వదులుతున్నారు. దాంతో సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.17 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. 871.8 అడుగుల నీటిమట్టంతో నీటి నిల్వ 150 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 65 టీఎంసీల నీరు అవసరం. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 25,427 క్యూసెక్కులను విడుదల చేస్తోంది. ఆ జలాలు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి. సాగర్‌కు దిగువన మూసీ ప్రవాహం కృష్ణా నదిలోకి కొనసాగుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 10,600 క్యూసెక్కుల వరద చేరుతోంది. ఇక్కడ కూడా విద్యుదుత్పత్తి చేస్తూ ఆ నీటిని తెలంగాణ దిగువకు వదులుతోంది. ఇక తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతుండటంతో తుంగభద్ర డ్యామ్ నిండిపోయింది. దాంతో గేట్లు ఎత్తేసి దిగువకు 1.49 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆ జలాలు మంగళవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరనున్నాయి. కృష్ణా వరదకు, తుంగభద్ర ప్రవాహం తోడవుతున్న నేపథ్యంలో మంగళవారం శ్రీశైలంలోకి వరద ఉధృతి పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. కాగా, రాష్ట్రంలో 43,870 చెరువులకు గాను 23,400 చెరువులు నిండాయి. -
గోదావరిలో పెరిగిన వరద ఉధృతి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: వర్షాల ప్రభావం వల్ల ఎగువన ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఆదివారం సాయంత్రం 6 గంటలకు 9.01 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. స్పిల్‌వే వద్ద నీటిమట్టం 32.94 మీటర్లకు చేరింది. 48 గేట్ల ద్వారా అంతే స్థాయిలో ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు 10,14,385 క్యూసెక్కులు చేరుతుండటంతో వరద నీటిమట్టం 11.75 అడుగులు దాటింది. దాంతో ఆదివారం రాత్రి 7.30 గంటలకు బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరి డెల్టాకు 5,700 క్యూసెక్కులు ఇచ్చి మిగులుగా ఉన్న 10,08,685 క్యూసెక్కులు (87.16 టీఎంసీలు)ను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఆదివారం పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో వరద తగ్గుముఖం పడుతోంది. లంకల్ని చుట్టేస్తున్న వరద ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన కోనసీమలోని లంక గ్రామాలను వరద నీరు చుట్టుముడుతోంది. పి.గన్నవరం మండలం చాకలిపాలెం గ్రామాన్ని ఆనుకుని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న కనకాయలంక కాజ్వే ఆదివారం వరద ఉధృతికి నీట మునిగింది. ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తుండటంతో అధికారులు పడవలు ఏర్పాటు చేశారు. జి.పెదపూడి రేవులో రహదారి కొట్టుకుపోవడంతో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిలంక, బూరుగులంక గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి జిల్లాల సరిహద్దున గల అనగారలంక, పెదమల్లంలంక, సిర్రావారిలంక, అయోధ్యలంకలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
కృష్ణమ్మ హోరు.. గోదారి జోరు
సాక్షి, అమరావతి/సాక్షి, బళ్లారి/శ్రీశైలం ప్రాజెక్ట్/హొసపేటె/ధవళేశ్వరం: పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతోపాటు ఉప నదులు పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం కనీస స్థాయిని దాటింది. శనివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.70 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో నీటిమట్టం 855.60 అడుగులకు చేరింది. ప్రస్తుతం శ్రీశైలంలో 93.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 122 టీఎంసీలు అవసరం. కాగా, ఈ వరద కనీసం వారం కొనసాగే అవకాశం ఉంది. ఆదివారం శ్రీశైలంలోకి కనీసం నాలుగు లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ల్లోకి భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో ఆ నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు స్పిల్ వే గేట్లు ఎత్తేసి 3.72 లక్షల క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. మరోవైపు తుంగభద్రలో వరద ఉధృతి పెరగడంతో తుంగభద్ర డ్యామ్‌లోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో నీటి నిల్వ 74.58 టీఎంసీలకు చేరుకుంది. డ్యామ్ నిండాలంటే ఇంకా 26 టీఎంసీలు అవసరం. ఆదివారం ఉదయానికి ఇన్‌ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉండటంతో నీటినిల్వ 90 టీఎంసీలకు చేరనుంది. దీంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. నదీ తీర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలంలో ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న నీటిలో నాగార్జునసాగర్‌కు 29,305 క్యూసెక్కులు చేరుతున్నాయి. మూసీ ద్వారా పులిచింతల్లోకి 13,800 క్యూసెక్కులు చేరుతుండగా.. తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తోంది. ఈ నీటికి కట్టలేరు, మున్నేరు, వైరా వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 94,711 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 1,551 క్యూసెక్కులు విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 93,160 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం జి.పెదపూడి రేవులో వరద ఉధృతికి నీట మునిగిన రహదారి గోదావరి ఉగ్రరూపం ఎగువ నుంచి భారీగా గోదావరి వరద నీరు వచ్చి చేరుతుండటంతో శనివారం సాయంత్రం 6 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు 6,33,474 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. స్పిల్ వే కాఫర్ డ్యామ్ వద్ద వరద నీటిమట్టం 32 అడుగులకు చేరుకుంది. వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నామని పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు తెలిపారు. భద్రాచలం నుంచి పోలవరం వద్దకు ఈ అర్ధరాత్రికి 11.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ మొత్తం 175 గేట్లను పూర్తిగా పైకి ఎత్తేసి 4,61,337 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఆదివారం తెల్లవారుజామున ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక (10 లక్షల క్యూసెక్కులు దాటితే) స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, గోదావరి, పలు వాగుల ఉధృతితో వీఆర్ పురం మండలంలో 10, చింతూరు మండలంలో 11, ఎటపాక మండలంలో 1, పి.గన్నవరం మండలంలో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలంలో 40 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ధవళేశ్వరంలో ఏర్పాటు చేసిన వరద నియంత్రణ కార్యాలయం నుంచి అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బ్యారేజీ దిగువన పి.గన్నవరం మండలం జి.పెదపూడి రేవు వద్ద వశిష్ట గోదావరి నదీపాయలో లంక గ్రామాల ప్రజలు తాత్కాలికంగా నిర్మించుకున్న రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిలంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భారీ వర్షాలు, స్పెషల్ ఆఫర్ ప్రకటించిన హ్యుందాయ్
భారీ వర్షాల కారణంగా డ్యామేజీ అవుతున్న హ్యుందాయ్ కార్లపై ఆ సంస్థ ఆఫర్ ప్రకటించింది.ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించడంతో పాటు స్పెషల్ సర్వీస్‌లను అందిస్తున్నట్లు వెల్లడించింది. గత నాలుగు రోజులుగా పడుతున్న భారీ వర్షాల కారణంగా ముంబైలో అతలాకుతలం అవుతోంది. కుండపోత వర్షాల కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 52మంది ఆచూకీ లభ్యం కాలేదని మహరాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు.. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), భారత నౌకాదళం కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయని, 84,452 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ముఖ్యంగా కోస్తా జిల్లాలైన రాయిగఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురవడంతో ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టకొని బిక్కుబిక్కుమంటూ గడపుతున్నారు. ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ముంబైలో వర్షాల కారణంగా దెబ్బతిన్న హ్యుందయ్ సంస్థకు చెందిన వాహనాలకు ఈ ఏడాది పాటు స్పెషల్ సర్వీస్‌లు అందించడంతో పాటు ఇన్సూరెన్స్ ప్రీమియంలో 50శాతం తగ్గిస్తున్నట్లు హ్యుందాయ్ ఇండియా సేల్స్,మార్కెటింగ్ డైరక్టర్ తరుణ్ గార్గ్ ప్రకటించారు. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి: కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలంలోకి 1.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 28, 252 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలంలో నీటిమట్టం పెరగడం లేదు. బుధవారం నాటికి శ్రీశైలంలో 843.7 అడుగుల్లో 67.84 టీఎంసీ లు నిల్వ ఉన్నాయి. కృష్ణా బేసిన్లో ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గురువారం కూడా శ్రీశైలంలోకి ఇదే రీతిలో వరద కొనసాగే అవకాశం ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. పులి చింతలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ వదిలేస్తున్న నీటికి.. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న ప్రవాహంతో కలిపి ప్రకాశం బ్యారేజీ లోకి 9,080 క్యూసెక్కులు వస్తోంది. ఇందులో 4,5 50 క్యూసెక్కులను సాగునీటి కాలువలకు ఇస్తూ.. మిగులుగా ఉన్న 4,530 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద మళ్లీ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 66 వేల క్యూసెక్కులు వస్తుండగా.. కాలువలకు 7 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 59 వేల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/అనంతపురం: దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అందువల్ల ఈ నెల 20, 21 తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ నెల 21న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇది బలపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. ఒకవేళ బలపడి వాయుగుండంగా మారితే ఒడిశా వైపు కదులుతుందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కదిరిలో రికార్డు స్థాయి వర్షపాతం రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా కదిరిలో అత్యధికంగా 23 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పెనుకొండ, హిందూపురం పట్టణాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. లేపాక్షిలో 10.04 సెం.మీ., ఎన్పీ కుంటలో 9, అమడగూరులో 8.52 చిలమత్తూరులో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కదిరిలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి పెద్దఎత్తున వర్షం నీరు చేరింది. ఓడీ చెరువు సమీపంలో ప్రధాన రహదారి తెగిపోవడంతో కదిరి, హిందూపురం, బెంగళూరు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పుట్టపర్తి వద్ద చిత్రావతి, కుషావతి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 3 నుంచి 6 సె.మీ. వర్షం కురిసింది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ చాలాచోట్ల వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
వర్షం ఎంత కురిసింది ఎలా లెక్కిస్తారో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ఒక్కోసారి కాస్త వాన పడుతుంది.. ఒక్కోసారి కుండ పోతగా కురుస్తుంది. అధికారులేమో.. పది సెంటీమీటర్లు పడింది.. 15 సెంటీమీటర్లు పడింది అని చెప్తుంటారు. మరి ఈ లెక్కలు ఎలా తీస్తారో తెలుసా..? ఇందుకు వాడేది రెయిన్ గేజ్‌గా పిలిచే ఓ చిన్నపాటి పరికరమే. ఓ చిన్నపాటి గాజు సీసా, దాని లోపలికి ఉండే ఓ గాజు గరాటు, దానిపై ఉండే మిల్లీమీటర్, సెంటీమీటర్ల కొలతలు.. అంతే. నిర్దిష్ట ప్రదేశాల్లో, నిర్ణీత ఎత్తులో ఈ రెయిన్ గేజ్‌లను ఏర్పాటు చేస్తారు. వాన కురిసినప్పుడు పైన ఉన్న గరాటు ద్వారా గాజు సీసాలోకి నీళ్లు చేరుతాయి. ఆ నీళ్లు ఎంత ఎత్తున చేరితే.. అన్ని సెంటీమీటర్లు/ మిల్లీమీటర్లు వాన పడిందన్న మాట. చెట్లు, భవనాలకు సమీపంలో, అటూఇటూ గాలి మళ్లేలా ఉన్న ఎగుడు దిగుడు ప్రదేశాల్లో రెయిన్ గేజ్‌లను ఏర్పాటు చేస్తే తప్పుడు లెక్కలు వస్తాయి. అందుకే విమానాశ్రయం వంటి విశాలమైన, చుట్టూ ఖాళీ ఉండే ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు. -
నిండుకుండల్లా ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్, నెట్వర్క్: మూడురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా దిగువన కర్ణాటకలోని ప్రాజెక్టుల్లోకి కృష్ణానదీ ప్రవాహాలు ఉధృతమవుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఆల్మట్టిలోకి మంగళవారం కేవలం 10 వేల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదవగా, బుధవారం సాయంత్రానికి ఏకంగా 56 వేల క్యూసెక్కులకు పెరిగాయి. ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర జలసంఘం అంచనా వేస్తోంది. ఆల్మట్టి నుంచి 20 వేల క్యూసెక్కులను నారాయణపూర్‌కు విడుదల చేస్తుండగా, నారాయణపూర్ నుంచి 24 వేల క్యూసెక్కుల మేర నీరు దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఈ నీరంతా గురువారం సాయంత్రానికి జూరాలకు చేరే అవకాశం ఉంది. జూరాలకు ప్రస్తుతం కేవలం 3,800 క్యూసెక్కుల ప్రవాహాలు మాత్రమే నమోదవుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు సైతం ప్రస్తుతం ప్రవాహాలు తగ్గినా, రెండ్రోజుల్లో మళ్లీ పుంజుకోనున్నాయి. ఇక గోదావరి పరీవాహకంలో ఉన్న ఎస్సారెస్పీకి మంగళవారం 90 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు రాగా, బుధవారం 52 వేల క్యూసెక్కులకు తగ్గాయి. నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 53.54 టీఎంసీలకు చేరింది. ► ఎగువమానేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 31 అడుగులు కాగా..పూర్తిస్థాయిలో నీరు చేరింది. ► మూసీ ప్రాజెక్టులో 7 క్రస్టుగేట్లు ఒక అడుగు మేర ఎత్తి 4,600 క్యూసెక్కులను దిగువకు వదిలారు. ► భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం బుధవారం సాయంత్రానికి 15.3 అడుగులకు చేరింది. తాలిపేరు ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి 11,248 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. కిన్నెరసాని జలాశయంలో 400.90 అడుగుల మేర నీరు చేరింది. ► ఎల్లంపల్లి ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి 75 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ► కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సరస్వతీ బ్యారేజీ 66 గేట్లలో 26 గేట్లెత్తి కాళేశ్వరం వైపునకు తరలిస్తున్నారు. కాళేశ్వరం వద్ద పుష్కరఘాట్‌ను తాకుతూ 8 మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. గోదావరి, ప్రాణహితల ద్వారా లక్ష్మీబ్యారేజీకి ఇన్‌ఫ్లో 96,630 క్యూసెక్కులు వస్తోంది. -
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన రద్దు
ఏలూరు (మెట్రో): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన పశ్చిమగోదావరి జిల్లా పర్యటన రద్దయిందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు ముఖ్యమంత్రి రావాల్సి ఉందని, అల్పపీడన ద్రోణి ప్రభావంవల్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో సీఎం పర్యటన రద్దయిందని ఆయన వెల్లడించారు. -
ఆవర్తనం ప్రభావంతో. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని, దీనికి అనుబంధంగా దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం మధ్యస్త ట్రోపోస్ఫియరిక్ స్థాయి వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉందని, తూర్పు–పశ్చిమ షియర్ జోన్ వెంబడి సముద్ర మట్టం నుంచి 2.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని వెల్లడించింది. ఈ ప్రభావం వల్ల ఉత్తర, దక్షిణ కోస్తాలతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో అత్యధికంగా 88.25 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
నేడు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపారు. -
తెలంగాణలో మరో రెండ్రోజులు వానలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు సూచించింది. దీనికి అనుబంధంగా ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి వ్యాపించి ఉన్నట్లు వివరించింది. వాటి ప్రభావంతో రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు సైతం నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 30 సెం.మీ. వర్షపాతం.. రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8:30 గంటల వరకు 1.93 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో ఇప్పటివరకు 30.17 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవగా 16 జిల్లాల్లో అధికం, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటలో 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో 11.8 సెం.మీ., వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేటలో 11.3 సెం.మీ., వరంగల్‌లో 10.1 సెం.మీ., ఖానాపూర్‌లో 10 సెం.మీ. వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు మండలాల్లో అతిభారీ, 20కిపైగా మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. -
కాకినాడ తీరంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం కాకినాడ తీరానికి సమీపంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో ఆవరణం వరకూ విస్తరించి ఉంది. అల్పపీడనం కారణంగా.. ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఒడిశా, మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ వరకూ సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. అల్పపీడనం వల్ల రాష్ట్రంపై తేమ గాలుల తీవ్రత పెరిగింది. దీనికితోడు దక్షిణం నుంచి రుతుపవన గాలులు విస్తరిస్తున్నాయి. ఈ కారణంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ., గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులెవరూ సోమవారం వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. మరోవైపు కర్ణాటకలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, తుంగభద్రలోకి వరద నీరు భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో సామర్లకోటలో 8.3 సెం.మీ., రంగంపేటలో 6.6, గొల్లప్రోలులో 6.3, జగ్గంపేటలో 5.9, పెద్దాపురంలో 5.3, రాజవొమ్మంగి, పిఠాపురంలో 4.8, నక్కపల్లిలో 4.7, దేవీపట్నంలో 4.6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
కోస్తాకు రేపు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా తీర ప్రాంతం మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వైపు తేమను తీసుకువస్తోంది. దీనికితోడుగా ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 2.1 నుంచి 3.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది క్రమంగా ఛత్తీస్‌గఢ్ వైపు పయనించనుందని తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. సోమవారం శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ, రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని వివరించారు. ఈ నెల 13 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లోనూ అనకాపల్లిలో 6.7 సెం.మీ., మధురవాడలో 6.6, సూళ్లూరుపేటలో 6, కోటనందూరులో 5.7, పరవాడలో 5.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బిహార్‌పై ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం ఒడిశా, ఉత్తర కోస్తా వరకూ విస్తరించింది. ఇది సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు ఈ నెల 11న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తా జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ. వరకూ.. గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని వివరించారు. మత్స్యకారులెవరూ రానున్న మూడు రోజులపాటు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. జంగారెడ్డిగూడెంలో 13.5 సెం.మీ., పెదపూడిలో 12.5, కాకినాడలో 10.3, ముండ్లమూరులో 10 సెం.మీ. భారీ వర్షపాతం నమోదవగా.. ఉలవపాడులో 9.6, సింగరాయకొండ, అద్దంకిలో 8.6, గోపాలపురం, కందుకూరులో 8.5, జగ్గంపేటలో 8.1, దేవరపల్లి 7.7, రాజాంలో 7.3, పిఠాపురంలో 7.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
11న అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తా తీరంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి మంగళవారం మధ్యాహ్నానికి బలహీనపడింది. ఈ నెల 11 లేదా 12న బంగాళాఖాతంలో కోస్తాకు సమీపంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. ఇది క్రమంగా దిశ మార్చుకుని ఒడిశా వైపు పయనించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 11, 12 తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పారు. కోస్తాంధ్రలో బుధవారం ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు పడతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. రుతుపవనాలు బలహీనంగా ఉన్న సమయంలో రాయలసీమలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలున్నాయి. గడిచిన 24 గంటల్లో విజయనగరంలో 7 సె.మీ, గరివిడిలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
మొబైల్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. అంతలోనే ఒక్కసారిగా
ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటుసుకుంది. మొబైల్ ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన 15 ఏళ్ల బాలుడు పిడుగుపాటుకు మృతి చెందాడు. మరో ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి. తహసీల్దార్ రాహుల్ సారంగ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం దహను తాలూకాలోని మంకర్పాడ వద్ద నలుగురు బాలురు పశువులను మేపడానికి బయటకు వెళ్లారు. సోమవారం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాతవరణ ప్రతికూల పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ సిగ్నల్ కు రాలేదు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ సిగ్నల్ కోసం నలుగురు పిల్లలు కలిసి చెట్టెక్కారు. అదే సమయంలో ఒక్క సారిగా పిడుగు పడడంతో రవీంద్ర కోర్డా (15) అనే బాలుడు మృతి చెందాడు. మరో మగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా 14 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్న వారే. గాయపడిన పిల్లల్ని కాసా గ్రామీణ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్ -
విస్తరిస్తున్న ‘ఆవర్తనం’
సాక్షి, అమరావతి/ విశాఖపట్నం/ అవనిగడ్డ/ కర్నూలు: దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలపై ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ఆంధ్రప్రదేశ్ తీరానికీ విస్తరించింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో (సోమ, మంగళవారాలు) రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని తీర ప్రాంతాల పరిసరాల్లో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంలో పశ్చిమ, వాయవ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవగా, అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కర్నూలు జిల్లాలో తుంగభద్ర పరీవాహక ప్రాంతాలైన మంత్రాలయం, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురవడంతో నదిలో వరద నీరు పోటెత్తింది. గోనెగండ్ల, గూడూరు, సీ.బెళగల్, వెల్దుర్తి తదితర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడటంతో హంద్రీ నదికి వరద చేరింది. మంత్రాలయం క్షేత్రం జలమయమైంది. నల్లవాగు, తుమ్మలవాగు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. తుమ్మలవాగులో లారీ చిక్కుకుపోగా అతి కష్టం మీద బయటకు తీశారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు జిల్లాలోని కోడుమూరులో అత్యధికంగా 120.4 మి.మీ., ఎమ్మిగనూరులో 116.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 54.8 మి.మీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 52.5, గూడూరులో 41.5, శ్రీకాకుళం జిల్లా కోవిలంలో 39.3, రేగిడి ఆముదాలవలసలో 35.3, పాలకొండలో 34.5, బొబ్బిలిలో 32, కర్నూలు జిల్లా మంత్రాలయంలో 31.5, కృష్ణా జిల్లా గుడివాడలో 30.8, విజయనగరం జిల్లా బొండేపల్లిలో 30.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 45 ప్రాంతాల్లో 15 నుంచి 30 మి.మీ. వర్షం పడగా, అనేకచోట్ల 5 నుంచి 16 మి.మీ. వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో మచిలీపట్నం జలమయమైంది. విజయవాడలో తేలికపాటి జల్లులు కురిశాయి. హంసలదీవి తీరంలో రాకాసి అలలు కృష్ణా జిల్లా హంసలదీవి సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. పాలకాయతిప్ప బీచ్ వద్ద సముద్ర అలలు 4 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. సముద్రపు నీరు సుమారు 200 మీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చి డాల్ఫిన్ భవనం చుట్టూ చేరింది. తీరం పొడవునా పర్యాటకులు సేదతీరేందుకు ఏర్పాటు చేసిన సిమెంట్ బల్లలు సముద్ర అలల ధాటికి కొట్టుకుపోయాయి. తీరానికి వెళ్లే రహదారి ముందు భాగాన్ని అలలు బలంగా తాకడంతో ధ్వంసమైంది. తారు, మట్టి కొట్టుకుపోయి కొండరాళ్లు బయటపడ్డాయి. బీచ్ నుంచి సాగర సంగమం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి. సముద్ర స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని, పర్యాటకులెవదూ తీరానికి రావద్దని అధికారులు కోరారు.