
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజుల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య మధ్యప్రదేశ్ నుంచి ఇంటీరియర్ మహారాష్ట్ర, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది.
దీని ప్రభావంతో పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతాయని సూచించింది. శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 39.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 21.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
చదవండి: సాగర తీరాన పాలనా సౌధం.. ధగధగల సచివాలయం.. వైరల్ ఫోటోలు