IMD forecast
-
బంగాళాఖాతంలో వాయుగుండం..ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
సాక్షి,విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. విశాఖపట్నంనకు 640 కిలోమీటర్ల దూరంలో,చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం ఏర్పడి వాతావరణం అల్లకల్లోలంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తీరంలో మత్స్య కారులు వేట నిషేధం విధించింది. కళింగపట్నం , విశాఖ, కాకినాడ, గంగవరం, మచిలీపట్నం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. -
ఏపీలో భారీ వర్షాలు
-
తెలంగాణలో ఫెంగల్ తుపానుతో వర్షాలు.. ఎల్లో వార్నింగ్ జారీ
హైదరాబాద్, సాక్షి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి తమిళనాడును ముంచెత్తి, ఏపీని వణికిస్తున్న ఫెంగల్ తుపాను.. తెలంగాణపైనా ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఈ ప్రభావం శుక్రవారం సాయంత్రం నుంచే రాష్ట్రంపై కనిపిస్తోంది. ఇక శనివారం పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక ఆది, సోమవారాల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం.... సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడనున్నాయి. ఈ మేరకు ఆ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. అలాగే చలి తీవ్రతా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.ఇదీ చదవండి: మళ్లీ తుపానుగా బలపడిన వాయుగుండం -
ఏపీని భయపెడుతున్న తుపాను
సాక్షి, విశాఖ: తమిళనాడుతో పాటు ఏపీని కూడా తుపాను భయపెడుతోంది. ఈ రాత్రికి తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంటోంది. ఫెంగల్ తుపాను సమీపించే కొద్దీ.. భారీ వర్షాలు అతలాకుతలం చేస్తాయని హెచ్చరిస్తోంది... ఇప్పటికే దక్షిణ కోస్తా భారీ వర్షాలు, తీవ్ర గాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మరో ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది. కోస్తా తీరం వెంబడి ఉన్న పోర్టులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు నేపథ్యంలో వ్యవసాయ పనులు చేసే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది అధికార యంత్రాంగం. ఇక.. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. .. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బుధవారం ఉదయం చెన్నైకు దక్షిణ ఆగ్నేయ దిశలో 550 కి.మీ, పుదుచ్చేరికి 470 కి.మీ కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ.. తుపానుగా మారే అవకాశం ఉంది. రాగల రెండ్రోజులు ఉత్తర ఆగ్నేయ దిశలోనే ప్రయాణించి తమిళనాడు తీరంలో కేంద్రీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలో పలు చోట్ల గురువారం, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అన్నారాయన.ఏపీపై తుపాను ప్రభావం వారంపాటు కొనసాగనుంది. రేపు సాయంత్రం నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజుల్లో.. దక్షిణ కోస్తా. రాయలసీమ, ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఈ నెల 30వ తేదీ దాకా మత్య్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు ఇదివరకే జారీ అయ్యాయి. ఇంకోవైపు.. తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇప్పటికే తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది అక్కడి విద్యాశాఖ. -
ఏపీలో పిడుగులతో వర్షాలు
అమరావతి, సాక్షి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయుగుండంగా మారి.. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరిస్తోంది.రేపటి నుంచి ఏపీపై వాయుగుండం ప్రభావం కనిపించనుంది. రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 28, 29న నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.తీరప్రాంతాల్లో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు.. కోస్తాంధ్రలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోస్తాంధ్ర రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. -
Telangana: రానున్న రెండ్రోజులు.. తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్త రు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచించింది.రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తు లో గాలులు వీస్తున్నట్టు వివరించింది. ఈ నెల 6,7 తేదీల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండదంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధా రణం కంటే కాస్త ఎక్కువగా నమోదవుతు న్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి.. -
‘దానా’ తుపాన్ టెన్షన్.. ఏపీకి భారీ వర్ష సూచన
సాక్షి విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘దానా’ టెన్షన్ పెడుతోంది. బుధవారం ఉదయానికి తుపానుగా, గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.దానా తుపాను ముప్పు ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడుకు పొంచి ఉంది. ఒడిశా, బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ భావిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మరో నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇక, తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు.. బెంగాల్లో ఏడు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించారు. రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. సహయక చర్యలు చేపట్టారు. ఇక, తుపాను నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది. 23, 24, 25వ తేదీల్లో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. గురువారం అత్యధికంగా 37 సర్వీసులు రద్దయ్యాయి. అలాగే, విశాఖ-భువనేశ్వర్ మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును 24న రద్దు చేశారు.24న రద్దు చేసిన రైళ్లు..సికింద్రాబాద్ - భువనేశ్వర్హైదరాబాద్ - హౌరాసికింద్రాబాద్ - హౌరాసికింద్రాబాద్ - మల్దాటౌన్25న రద్దు చేసిన రైళ్లు:..హౌరా - సికింద్రాబాద్షాలిమార్ - హైదరాబాద్సిల్చార్ - సికింద్రాబాద్ #CycloneDana beauty in bay. Massive intensification seen under favorable conditions. First set of rains from cyclone feeder bands will commence in coastal parts of #Odisha from today evening. Stay tuned for more updates. #Danacyclone pic.twitter.com/o0oro4X4ZX— Eastcoast Weatherman (@eastcoastrains) October 23, 2024 -
రేపు తీవ్ర అల్పపీడనం.. దక్షిణకోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి,విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం(అక్టోబర్14) అల్పపీడనం ఏర్పడింది. రేపటికి ఈ అల్పపీడనం తీవ్రరూపం దాల్చే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి 35- 45కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీయనున్నాయి. -
Rain Alert: రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి,అమరావతి: రానున్న 3-4 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. 17 వరకు కోస్తా, రాయలసీమలో భారీవర్షాలు పడతాయని చెప్పారు. ఆదివారం కోస్తాలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, తీరం వెంబడి 40 నుండి 55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రానున్న మూడు గంటల వ్యవధిలో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.భారీ వర్షాల కారణంగా 24 గంటలు విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉందని ఆర్పీ సిసోడియా తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్,హెల్ప్లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లకు ముందస్తు చర్యలకు ఆదేశాలు జారీ చేశామని, మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని ఆర్పీ సిసోడియా విజ్ఞప్తి చేశారు. -
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, మయన్మార్ దక్షిణ తీరం పరిసర ప్రాంతాల్లో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాటి ప్రభావంతో పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని చాలాచోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని అధికారులు చెబుతున్నారు.ఈ మేరకు పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. 31 శాతం అధికంగా వర్షాలు... నైరుతి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70.36 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 91.90 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 31% అధికమని రాష్ట్ర ప్రణాళిక శాఖ అధి కారులు తెలిపారు. ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 19 జిల్లాల్లో అధిక వర్షపాతం, తొమ్మిది జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సె ప్టెంబర్ నెలాఖరుతో నైరుతి రుతుపవనాల సీజ న్ ముగుస్తుంది.సీజన్ ముగిసే నాటికి వర్షపాతం గణాంకాలు మరింత పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది నైరుతి సీజన్లో ఒక్క జిల్లాలో కూడా లోటు వర్షపాతం నమోదు కాకపోవడం విశేషం. మండలాలవారీగా వర్షపా తం నమోదును పరిశీలిస్తే 108 మండలాల్లో అ త్యధిక వర్షపాతం, 283 మండలాల్లో అధిక వర్షపాతం, 216 మండలాల్లో సాధారణ వర్షపాతం, 5 మండలాల్లో మాత్రం లోటు వర్షపాతం ఉన్న ట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. -
ఏపీకి మరో తుపాన్ ముప్పు!
సాక్షి, విశాఖపట్నం: ఈ నెలాఖరులో రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 24న ఏర్పడే అల్పపీడనం తీవ్రరూపం దాల్చి తుపానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తుపానుగా మారితే.. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని తెలిపారు. పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో 20 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పారు. -
సెప్టెంబర్ 19 నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి
న్యూఢిల్లీ: ఈనెల 19 నుంచి 25 తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లడం మొదలవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఏటా సాధారణంగా జూన్ ఒకటో తేదీన తొలిసారిగా కేరళను తాకుతాయి. అక్కడి నుంచి విస్తరిస్తూ జూలై ఎనిమిదో తేదీకల్లా దేశమంతా చుట్టేస్తాయి. తర్వాత సెప్టెంబర్ 17వ తేదీన తిరోగమనం మొదలై అక్టోబర్ 15 కల్లా వెళ్లిపోతాయి. ఈ నైరుతి సీజన్లో దేశంలో సగటున 836.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ సగటు వర్షపాతం కంటే ఈసారి 8 శాతం ఎక్కువ నమోదవడం గమనార్హం. ఇదీ చదవండి : ఇయర్‌రింగ్స్‌తో కుట్ర..ట్రంప్-హారిస్ డిబేట్‌పై చర్చ -
AP: రెండురోజుల పాటు వర్షాలు
సాక్షి,విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమలో శని,ఆదివారాల్లో(సెప్టెంబర్7,8) విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నట్లు తెలిపింది.భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తీరంలో మత్స్యకారులకు మరో రెండు రోజులపాటు హెచ్చరికలు అమలులో ఉండనున్నాయి. కాగా, వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న తరుణంలో వాతావరణ శాఖ రాష్ట్రానికి మరోసారి భారీ వర్షసూచన చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు రెడ్ అలర్ట్
సాక్షి,ఢిల్లీ: తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ విషయమై ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర శనివారం(ఆగస్టు31) ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్, ఒడిషా, విదర్భ, రాయలసీమ, కర్ణాటకకు ఐండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
అస్నా తుపాను.. కర్ణాటకకు రెడ్ అలెర్ట్
బెంగళూరు: అస్నా తుపాను విస్తరిస్తున్న క్రమంలో భారత వాతావరణ శాఖ (IMD) కర్ణాటకలోని తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ (శనివారం) గుజరాత్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది అస్నా తుపాన్ గుజరాత్‌లోని సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో ఏర్పడటం సాధారణం కాదని తెలిపింది. అరేబియా సముద్రం వైపు కదిలి ఈ తుపాను ఒమన్ వైపు వెళుతుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. 1976 అరేబియా సముద్రంలో మొదటిసారి విస్తరించిన ఈ తుపాన్‌కు పాకిస్తాన్.. అస్నా తుపానుగా పేరు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 1976, 1944, 1964 సంవత్సరాల్లో తీర ప్రాంతాల్లో ఈ తుపాను ప్రభావం అధికంగా పడినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్‌ను ముంచెత్తాయి. దీంతో సుమారు 18 వేల మందిని సురక్షిత ప్రాంతలకు తరలించారు. 1200 మందినిస సహాయాక బృందాలు రక్షించాయి. గుజరాత్ భారీ వర్షాలకు 26 మంది మృతి చెందారు. అయితే నిన్న శుక్రవారం వర్షం కొంత తెరిపి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ మళ్లీ భారీ వర్షాలకు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారలు అప్రమత్తం అవుతున్నారు. -
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం మంగళవారం బలహీనపడింది. దీంతో తెలంగాణలో చాలా చోట్ల బుధ,గురు,శుక్ర వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ కొనసాగనుంది. -
తెలంగాణ: మూడు రోజులు వర్ష సూచన.. ఎల్లో అలెర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు రోజు వర్షాలు కురవనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఆవర్థనం, ద్రోని కొనసాగుతోంది. ఆవర్థనం, ద్రోని కారణంగా రాష్టానికి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మరో ముడు రోజులు రాష్టానికి వర్ష సూచన ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.ఈరోజు ఆదిలాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందిరేపు కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. -
ఏపీకి భారీ వర్ష సూచన
సాక్షి,విశాఖపట్నం: రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కోమరియన్ రీజన్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నందున వర్షాలు పడతాయని వెల్లడించింది. రాయలసీమలో మోస్తరు వర్షాలు, కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 30-40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. -
ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఢిల్లీలో ఏకధాటిగా వర్షం
న్యూ ఢిల్లీ : దేశ రాజధానిలో ఢిల్లీలో వాతావారణం ఒక్కసారిగా మారింది. దీంతో పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో ఢిల్లీ మున్సిపల్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.రాబోయే కొద్ది గంటల్లో నగరంలోని ప్రీత్ విహార్, ఐటీవో, అక్షరధామ్‌తో పాటు ప్రదేశాలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు, ఒక మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. ప్రస్తుతం, మధ్య, దక్షిణ, ఉత్తర ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారత వాతావరణ శాఖ ప్రకారం, ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడుతుందని అంచనా. కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తేమ స్థాయి 85 శాతంగా నమోదైందని ఐఎండీ తెలిపింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విభాగంలో 59 రీడింగ్‌తో సంతృప్తికరమైన కేటగిరీలో కొనసాగింది.ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ( ఏఐక్యూ)సున్నా 50 మధ్య ఉన్న ఏఐక్యూ ఉంటే మంచిది. 51 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికరమైనది. 101 నుంచి 200 మధ్య ఉంటే ఫర్వాలేదని , 201 మధ్య 300 తక్కువ ప్రమాదం అని, 301 నుంచి 400 మధ్య ఉంటే మరింత ప్రమాదమని, 401 నుంచి 500 మధ్య ఉంటే మరింత తీవ్రమైనదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
తెలంగాణకు 'ఎల్లో అలర్ట్'..రెండ్రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు యాక్టివ్‌గా ఉండటం.. ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ఈ క్రమంలోనే గురువారం నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
వీడియో: భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకాధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం ఒక గంట వ్యవధిలో 112.5 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.ఇక, భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీలో పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు.. వర్షాల కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు విమాన సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.#WATCH | Delhi: Waterlogging witnessed in several parts of the national capital after heavy rainfall; visuals from outside Civic Center near Ramlila Maidan. pic.twitter.com/19UhRO02ag— ANI (@ANI) July 31, 2024ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో నేడు ఢిల్లీలో అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిశి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. ఇక, వర్షాలు కురుస్తున్న వేళ జాగ్రత్తగా ఉండాలని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రజలకు సూచించారు. కాగా, ఢిల్లీలో రాబోయే 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ విధించింది. మరోవైపు.. వర్షాల కారణంగా ఢిల్లీలో 13 ఇళ్లు కూలిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. వర్షాల కారణంగా ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. #WATCH | Delhi: Traffic flow impacted near ITO as a result of heavy rains and waterlogging pic.twitter.com/clEyUfWurL— ANI (@ANI) July 31, 2024 Current Situation at Old Rajendra Nagar after Rains 🚨Years of Negligence and Corruption have Resulted into this. MCD and Delhi Govt should Wake Up to Such Conditions. Together, they have turned it into a Death Trap. pic.twitter.com/CeJosR4PTJ— Deepanshu Singh (@deepanshuS27) July 31, 2024 Delhi Minister & AAP leader Atishi tweets, "In light of very heavy rainfall today evening and forecast of heavy rainfall tomorrow, all schools - government and private - will remain closed tomorrow." pic.twitter.com/grisV4oFgT— ANI (@ANI) July 31, 2024 -
ఢిల్లీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జల దిగ్బంధం..
ఢిల్లీలో పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో లుటియన్స్ ఢిల్లీ,కాశ్మీర్ గేట్, ఓల్డ్ రాజేంద్రనగర్‌తో సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. వచ్చే 2 గంటల్లో ఢిల్లీలో 3 నుంచి 5 సెంటీ మీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తెలిపారు. సాధారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, కోచింగ్ సెంటర్లతో సహా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యేకంగా పరిష్కరించాలని సూచించారు. అంతకు ముందు, ఉత్తర ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, ఆగ్నేయ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, ఎన్సీఆర్లోని ఇతర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. -
మరోసారి కేరళకు భారీ ముప్పు
తిరువనంత పురం : మరోసారి కేరళకు భారీ ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం వయనాడ్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో కేరళలోని ఎనిమిది జిల్లాలకు రెడ్ అలెర్ట్ వాతావరణ శాఖ. ఇక వయనాడ్,కోజికోడ్,మలల్లా, పాలక్కాడ్, ఇడేక్కి సహా ఎనిమిది జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే ప్రాజెక్ట్‌లు, డ్యాంలు నిండుకుండలా మారాయి. వరదల ధాటికి వయనాడ్ మృతుల సంఖ్య 94కి చేరింది. చలియాద్ నదిలోకి మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. -
మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. ఏపీలో, తెలంగాణలో రాబోయే 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారుకాగా, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నాలుగు రోజులు పాటు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. అల్పపీడనం కారణంగా తీరం వెంబడి గంటలకు 40-50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో కూడా రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టు తెలిపింది. ఇక, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మూడు రోజుల పాటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
TG: పలు జిల్లాలకు భారీ వర్షసూచన
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం(జులై 19) నాలుగు జిల్లాలకు భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక శనివారం(జులై 20) ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపెల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాల్లో ఒక్కసారిగా వరదలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయుగుండం ప్రభావంతో.. బంగాళాఖాతలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుండటంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు పరిసర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది.