హైదరాబాద్, సాక్షి: ఉత్తర తెలంగాణ నుంచి నిజామాబాద్ దాకా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో.. తెలంగాణ అంతటా నేడు(మంగళవారం) భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షపాతం నమోదు కానుంది. సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు రాజధాని హైదరాబాద్ నగరానికి కూడా భారీ వర్ష సూచన ఉండడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసరం అయితే బయటకు రావాలని నగర పౌరులకు సూచిస్తున్నారు. మరోవైపు ఆఫీసులకు వెళ్లేవాళ్లు వాతావరణ పరిస్థితుల్ని బట్టి నడుచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment