weather report
-
హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా దంచికొడుతున్న వానలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో పలు జిల్లాలలో వాతావరణం ఒక్కసారిగా మారింది. గురువారం మధ్యాహ్నాం నుంచి ఉరుములతో, మెరుపులతో భారీగా వర్షం ఎడతెరిపి ఇవ్వకుండా దంచికొడుతోంది. దీంతో రోడ్లపై నీరు ఏరులై పారుతోంది. భారీ వర్షం కారణంగా ప్రజలు ఉక్కపోత నుంచి ఊరట పొందుతున్నప్పటికీ.. అకాల వర్షంతో రైతన్నలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండగా.. సంగారెడ్డి, సిద్ధిపేట, నిజామాబాద్‌లోనూ కుంభవృష్టి కురిసింది. హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా రోడ్లు నీట మునిగాయి. పంజాగుట్ట-ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మెర్క్యూరీ హోటల్ వద్ద ఓ కారుపై చెట్టు కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ముందస్తు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల ఏకధాటిగా రెండు గంటలపాటు వాన కురవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. శ్రీశైలంలోనూ నాన్ స్టాప్‌గా వానపడడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు నాగర్‌కర్నూల్‌లో పిడుగు ధాటికి ఇద్దరు మహిళలు మృతి చెందారు.మరో మూడు నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే క్యుములో నింబస్ కారణంగా.. ఉత్తర తెలంగాణకు వడగండ్లు, ఉరుములు మెరుపులతోనూ వానలు పడొచ్చని హెచ్చరిస్తోంది. అకాల వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికారులు ముందస్తు సూచనలు చేశారు. అయినప్పటికీ కొన్ని చోట్ల పంటలు నాశనం కాగా, కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైనట్లు తెలుస్తోంది. -
ఈ తరుణంలో చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ
-
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు
-
తెలుగు రాష్ట్రాల్లో మార్చిలోనే దంచికొడుతున్న ఎండలు (ఫొటోలు)
-
AP Rains: ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు
విశాఖపట్నం, సాక్షి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీన పడిన వాయుగుండం.. అల్ప పీడనంగా నైరుతి దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో.. ఏపీకి మరో రెండ్రోజులు వర్షాలు తప్పవని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో పల్నాడులో కుండపోత వాన పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది.రేపు, ఎల్లుండి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తా తీరం వెంబడి కొనసాగనున్న తీవ్రమైన ఈదురు గాలులు కొనసాగుతాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఇప్పటికే సూచించింది వాతావరణ శాఖ.ఇదీ చదవండి: అకాల వర్షం నిండా ముంచేసింది -
అల్పపీడనం ఎఫెక్ట్.. విశాఖ సంద్రం అల్లకల్లోలం (ఫొటోలు)
-
ఏపీలో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
విశాఖపట్నం, సాక్షి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. కోస్తా, రాయలసీమలపై తీవ్ర ప్రభావం చూపెట్టనుంది. ఇప్పటికే సముద్ర వాతావరణం అలజడిగా మారగా.. విశాఖ తీరం వెంట తేలికపాటి వర్షం మొదలైంది. రేపటి నుంచి నగరం సహా కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఓవైపు చలి తీవ్రత.. మరోవైపు తేలికపాటి వర్షం విశాఖను వణికిస్తోంది. అల్పపీడన ప్రభావంతో రేపటి నుంచి నాలుగు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా.. తీరం వెంబడి 35 -45 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అలాగే.. రాబోయే మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమ భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది. ఇప్పటికే.. దక్షిణ కోస్తా మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు వాతావరణశాఖ అంచనాలకు తగ్గట్లే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం మొదలైంది. నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రేపు ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే.. రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని చెబుతూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. -
ఢిల్లీలో తగ్గని కాలుష్యం, కేరళలో భారీ వర్షాలు, కశ్మీర్లో కురుస్తున్న మంచు
న్యూఢిల్లీ: దేశంలో చలి వాతావరణం కొనసాగుతోంది. జాతీయ రాజధాని ఢిల్లీలో విషపూరితమైన గాలి అక్కడి జనాలను పీడిస్తోంది. ఆదివారం కూడా గాలి నాణ్యత 'చాలా పేలవమైన' కేటగిరీలో ఉంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి అతలాకుతలమయ్యింది. దీంతో సైన్యం వరద సహాయక చర్యలను చేపడుతోంది.పుదుచ్చేరిలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా వరదలు సంభవించాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. డిసెంబర్ 2న పుదుచ్చేరిలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విల్లుపురం, కళ్లకురిచ్చి, కడలూరు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.ఫెంగల్ తుఫాను ఉత్తర తమిళనాడు తీరాన్ని దాటింది. ఈ నేపధ్యంలో చెన్నై బీచ్‌లలో అధిక అలలు ఏర్పడ్డాయి. ఫెంగల్ తుఫాను పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర తీర ప్రాంతాలపై క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఐఎండీ కేరళలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్‌లలో సోమవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉష్ణోగ్రతలు సున్నాకు దిగువకు పడిపోయాయి. డిసెంబరు 2వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఎత్తయిన ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 3.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. గుల్మార్గ్లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 2.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్లో ఉష్ణోగ్రత మైనస్ 0.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
AP: నేడు తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర వాయవ్యంగా ప్రయాణించి బుధవారం తుపానుగా మారనుంది. తర్వాత కూడా అదే దిశలో ప్రయాణిస్తూ శ్రీలంక తీరానికి ఆనుకుని ప్రయాణించి.. ఈ నెల 29న నాటికి ఉత్తర తమిళనాడు వైపు రానుంది. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.ఈ నెల 29, 30 తేదీల్లో రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో అన్ని ప్రధాన ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్న దృష్ట్యా డిసెంబర్ 1వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు హెచ్చరించారు. తీవ్ర వాయుగుండం మంగళవారం రాత్రి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కి.మీ. దూరంలో, నాగపటా్ననికి దక్షిణ–ఆగ్నేయంగా 710 కి.మీ., చెన్నైకి దక్షిణ–ఆగ్నేయంగా 800 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపానుగా మారిన తర్వాత దానికి ‘ఫెంగల్’ అని పేరు పెట్టనున్నారు. -
14 రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల చలి వాతావరణం నెలకొనగా, మరికొన్ని చోట్ల వర్షం కురుస్తోంది. కోస్తాంధ్రలో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, పలు రాష్ట్రాల్లో పొగమంచు ఆవరించే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాబోయే వారంలో దేశంలోని 14 రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోందో తెలియజేసింది.ఐఎండీ అందించిన వివరాల ప్రకారం నవంబర్ 25న నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతం శ్రీలంక తీరం వెంబడి 45 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నవంబర్ 26న తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నవంబర్ 27,28 తేదీల్లో గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, ఆ పక్కనే ఉన్న తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంపై అల్పపీడనం ఏర్పడింది. నవంబర్ 25-29 మధ్య తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నవంబర్ 27-28 తేదీలలో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 25న మత్స్యకారులు సముద్రతీరానికి వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లోని వివిధ ప్రాంతాలలో నవంబర్ 27 నుంచి 29 వరకు, హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 25 నుంచి 28 వరకు, ఉత్తరప్రదేశ్‌లో నవంబర్ 28 నుంచి 30 ఉదయం వరకు పొగమంచు కురియనుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్, నికోబార్ దీవుల్లో చలిగాలులు వీస్తున్నాయి. ఇది కూడా చదవండి: Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్‌యూలో విచిత్ర పరిణామం -
తిరుమల తిరుపతిలో భారీ వర్షం (ఫొటోలు)
-
భారత్‌లో విచిత్రమైన వాతావరణం!! 123 ఏళ్ల తర్వాత..
ఢిల్లీ: భారత్‌లో దాదాపు 120 ఏళ్ల తర్వాత విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నవంబర్ నెల వచ్చేసింది. అయినా చలి జాడ లేకుండా పోయింది. దీంతో ఈ నెల కూడా సూర్యతాపం తప్పదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.భారత్‌లో నెలకొన్ని ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులపై ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత వాతావరణ శాఖ(IMD) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వివరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనలు తరచూ ఏర్పడడం, తూర్పు గాలుల ప్రభావం, పశ్చిమ దిశ నుంచి ఎలాంటి అవాంతరాలు లేకపోవడం.. తదితర కారణాల వల్ల దేశవ్యాప్తంగా వాతావరణం వెచ్చగా ఉంటోందని వెల్లడించారు. అలాగేవాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. 1901 తర్వాత ఈ ఏడాది అక్టోబర్ అత్యంత వెచ్చని నెలగా రికార్డయ్యింది. సాధారణం కంటే.. 1.23 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. అలాగే దేశవ్యాప్తంగా సరాసరి ఉష్ణోగ్రత చూసినా.. 1.84 డిగ్రీల సెల్సియస్(20.01 డిగ్రీల సెల్సియస్ బదులు 21.85 డిగ్రీల సెల్సియస్ నమోదైంది) అధికంగానే రికార్డు అయ్యింది. ఈ గణాంకాలను బట్టి నవంబర్ నెల కూడా ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం ఉండకపోవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అలాగే.. రాబోయే రెండు వారాలు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని చెబుతోంది.అంటే.. ఈసారి నవంబర్ చలితో వణికించదని ఐఎండీ డైరెక్టర్ మహాపాత్ర చెబుతున్నారు. అలాగే.. డిసెంబర్ నుంచి మొదలయ్యే చలి జనవరి, ఫిబ్రవరి నెలలపాటు కొనసాగుతుందని వెల్లడించారు. అంతేకాదు.. దక్షిణ భారతంలో నవంబర్ నెలలో రుతుపవనాల తిరోగమనం సమయంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని కూడా తెలిపారాయన. -
తమిళనాడును కుదిపేస్తున్న భారీ వర్షాలు
-
AP: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/వాకాడు/మహారాణిపేట (విశాఖ జిల్లా): బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉందని సోమవారానికి ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 16–18వ తేదీ వరకు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావం రాయలసీమలో ఎక్కువగా..కోస్తాంధ్రలో మోస్తరుగా ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నేడు వర్షాలు కురిసే జిల్లాలు సోమవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూÆý‡ు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మంగళవారం కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలకు అవకాశమున్నట్లు తెలిపింది.బుధవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. గురువారం అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.6 మీటర్లు ముందుకు వచి్చన సముద్రం తిరుపతి జిల్లా వాకాడు మండలంలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. తూపిలిపాళెం వద్ద సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సముద్రం 6 మీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చింది. దీంతో మత్స్యకారులు తమ బోట్లు, వేట సామగ్రిని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు -
తెలంగాణ: 14 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
సాక్షి, హైదరాబాద్: కోస్తాకు సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. కోసాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు.. పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని 14 జిల్లాల్లో నేడు, రేపు(బుధ,గురు) భారీ వర్షాలు కురిసే అవకాముందని ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.నేడు(బుధవారం) నిజామాబాద్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.రేపు(గురువారం) నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.ఇదీ చదవండి: మూసీ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్.. బాధితుల కోసం ప్రభుత్వం స్పెషల్ ప్లాన్! -
సెప్టెంబర్ 19 నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి
న్యూఢిల్లీ: ఈనెల 19 నుంచి 25 తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లడం మొదలవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఏటా సాధారణంగా జూన్ ఒకటో తేదీన తొలిసారిగా కేరళను తాకుతాయి. అక్కడి నుంచి విస్తరిస్తూ జూలై ఎనిమిదో తేదీకల్లా దేశమంతా చుట్టేస్తాయి. తర్వాత సెప్టెంబర్ 17వ తేదీన తిరోగమనం మొదలై అక్టోబర్ 15 కల్లా వెళ్లిపోతాయి. ఈ నైరుతి సీజన్లో దేశంలో సగటున 836.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ సగటు వర్షపాతం కంటే ఈసారి 8 శాతం ఎక్కువ నమోదవడం గమనార్హం. ఇదీ చదవండి : ఇయర్‌రింగ్స్‌తో కుట్ర..ట్రంప్-హారిస్ డిబేట్‌పై చర్చ -
మరో మూడు రోజులు వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాయవ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో విస్తారంగా వానలు కురుస్తాయని తెలిపింది. ఆరు జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తగ్గిపోయిన ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, ముసురు వాతావరణంతో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. భద్రాచలం, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీల మేర, మిగతా చోట్ల ఒకట్రెండు డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాత్రివేళల్లో చలిగాలులు వీస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్‌లో 32.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.రెండు జిల్లాల్లో వానలు డబుల్ నైరుతి రుతుపవనాల సీజన్‌కు సంబంధించి వర్షాలు సాధారణాన్ని దాటిపోయాయి. సీజన్‌కు సంబంధించి ఇప్పటి (సెపె్టంబర్ 5)వరకు 60.32 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవాల్సి ఉండగా.. 40శాతం అధికంగా 84.72 సెంటీమీటర్లు కురిసింది. వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో సాధారణం కంటే రెండింతలకుపైగా వర్షాలు కురిసినట్టు తెలంగాణ ప్రణాళిక విభాగం గణాంకాలు చెప్తున్నాయి. వనపర్తి జిల్లాలో 37.15 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 79.14 సెంటీమీటర్లు, అంటే 114 శాతం అధికంగా వర్షం కురిసింది.నారాయణపేట జిల్లాలో 37.08 సెం.మీ. సాధారణ వర్షపాతానికిగాను 77.15 సెంటీమీటర్లు (108 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో ఆరు జిల్లాలు వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, సిద్దిపేట జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా.. మిగతా జిల్లాల్లో అధిక వర్షం కురిసింది. -
మరో అల్పపీడనం.. మూడు రోజులు భారీ వర్షాలు
-
అలర్ట్‌లకు అర్థం తెలుసా?
రోజూ చూస్తూనే ఉన్నాం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అని.. ఇంతకీ వాటి అర్థం ఏంటో మీకు తెలుసా? పదండి తెలుసుకుందాం. గ్రీన్ అలర్ట్ఏదైనా ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో 6.4 సెం.మీ. కన్నా తక్కువ వర్షం కురిసే అవకాశం ఉంటే వాతావరణ అధికారులు ఈ అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణ పరిస్థితుల్లో రాబోయే మార్పుల గురించి గ్రీన్ అలర్ట్ తెలియజేస్తుంది. అయితే ఈ అలర్ట్ కింద ప్రజలకు ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉండదు.ఎల్లో అలర్ట్ఒక నిరీ్ణత ప్రదేశంలో 6.45 సెం.మీ. నుంచి 11.55 సెం.మీ. మధ్య వర్షం కురిసే అవకాశం ఉందన్న అంచనాతో దీన్ని జారీ చేస్తారు. ఈ అలర్ట్ జారీ చేశారంటే ప్రస్తుత వాతావరణం కాస్త ప్రతికూలంగా మారుతుందని అర్థం. 30–40 కి.మీ. వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటే ఎల్లో అలర్ట్ ఇస్తారు. అంటే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని అధికార యంత్రాంగానికి సూచిస్తారు.ఆరెంజ్ అలర్ట్24 గంటల వ్యవధిలో 11.56 సెం.మీ. నుంచి 20.44 సెం.మీ. మధ్య వర్షం కురవొచ్చన్న అంచనాతో ఆరెంజ్అలర్ట్ను ఐఎండీ జారీ చేస్తుంది. 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తూ తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఈ అలర్ట్‌ను విడుదల చేస్తుంది. ఆరెంజ్ అలర్ట్ జారీ అయిందంటే రవాణా సరీ్వసులపై ప్రతికూల వాతావరణం ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అర్థం.రెడ్ అలర్ట్24 గంటల వ్యవధిలో ఒక ప్రాంతంలో 20.45 సెం.మీ.కుపైగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులను రెడ్ అలర్ట్ సూచిస్తుంది. రవాణా, విద్యుత్ సేవలకు అవాంతరాలు ఎదురవడంతోపాటు ప్రాణనష్టం కూడా సంభవించే అవకాశం ఉన్నప్పుడు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. రెడ్ అలర్ట్ ఇస్తే.. విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. గరిష్టంగా ఐదు రోజులపాటు ఆయా అలర్ట్‌లకు సంబంధించిన హెచ్చరికలు అమల్లో ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
Updates: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం
Telangana & Hyderabad Heavy Rains Alert Updatesరాజధాని హైదరాబాద్‌లో పలుచోట్ల మళ్లీ భారీ వర్షం ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, టోలిచౌకీ, లంగర్‌హౌజ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్టలో భారీ వర్షం కుండపోత వానతో రోడ్లపై వాహనదారుల ఇబ్బందులుఅప్రమత్తమైన జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు మంగళ, బుధ వారాల్లో భారీ వర్షాలున్నాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. హుస్సేన్‌సాగర్‌కు పెరిగిన నీటి మట్టంఉదయం 8గం. వరకు 513.55 మీటర్ల నీటి మట్టంఇన్ఫ్లో 1,850 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,600 క్యూసెక్కులుఅప్రమత్తమైన అధికారులుఎల్బీ స్టేడియం వద్ద కూలిన గోడరాత్రి కురిసిన వర్షానికి ఎల్బీ స్టేడియం వద్ద నేల కూలిన భారీ వృక్షంచెట్టు పడిపోవడంతో కూలిన ప్రహారీ గోడపలు పోలీసు వాహనాలు ధ్వంసంబషీర్బాగ్ సీసీఎస్ పాత కార్యాలయం వద్ద ఘటనహైదరాబాద్కు రెడ్ అలర్ట్నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది జీహెచ్ఎంసీమరోసారి కుండపోత వాన కురుస్తుందని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని హెచ్చరించిందిప్రధాన కూడళ్లలో మోకాల కంటే పైన నీరు పేరుకుపోయిందికాలనీలు, బస్తీలు చెరువుల్లా మారిపోయాయివాటర్ లాగిన పాయింట్ల వద్ద నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది క్లియర్ చేస్తున్నారుఅత్యవసర సేవల కోసం టోల్‌ఫ్రీ నెంబర్లు 040-21111111, 9000113667 సంప్రదించాలని జీహెచ్ఎంసీ కోరుతోంది.హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొర్లడంతో పాటు పలు కాలనీలు, రోడ్లపైకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జంట నగరాల్లో ఈ వేకువ జాము నుంచి ఉరుములు, పిడుగులతో కుండపోత కురుస్తోంది. మరో నాలుగు రోజులపాటు ఇలాంటి పరిస్థితి తప్పదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.హైదరాబాద్‌లో రామ్ నగర్లో భారీ వర్షానికి ఒకరు మృతి చెందారు. ఒక్కసారిగా రోడ్డు మీద నీరు పెరిగిపోవడంతో బైక్ మీద వెళ్తున్న వ్యక్తి.. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పార్శి గుట్ట నుంచి రామ్ నగర్‌కు మృతదేహం కొట్టకు వచ్చింది. మృతి చెందిన వ్యక్తిని రామ్ నగర్‌కు చెందిన అనిల్‌గా గుర్తించారు. మరోవైపు.. రోడ్లపై భారీ నీరు పేరుకుపోవడంతో.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావొద్దని నగరవాసులకు జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేస్తోంది. మ్యాన్ హోల్స్, కరెంట్ పోల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని, చిన్నపిల్లలను బయటకు రానివ్వొద్దని అధికారులు కోరుతున్నారు. నగరంలో పలు అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరింది. పలు కాలనీలు నీట మునిగాయి. బైకులు, కార్లు కొట్టకుపోయాయి. దిల్సుఖ్నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ఎల్బీనగర్, నాగోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం.. మంగళవారం వేకువజామును మరోసారి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాలిలోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మరోవైపు రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధప్రతిపాదికన చర్యల్లో పాల్గొంటున్నాయి. వర్ష బీభత్సం.. హైలెట్స్నీట మునిగిన బస్తీలు, కాలనీలుకొట్టుకుపోయిన కార్లు, బైకులురామ్, బౌద్ధ నగర్, గంగపుత్ర కాలనీల్లో నడుం అంచు వరకు నీరుప్రమాదం అంచుల్లో పార్సిగుట్టలోని పలు పప్రాంతాలుజంట నగరాల్లోని ప్రధాన రోడ్లపై ఉధృతంగా నీరు.. పంజాగుట్ట, లక్డీకాపూల్‌లో మోకాల లోతు దాకా నీరుహైటెక్ సిటీ దగ్గర చెరువును తలపిస్తున్న రోడ్లురాకపోకలకు అవాంతంర.. వాహనదారులకు ఇబ్బందులుచాలా చోట్ల 10 సెం.మీ. లకు పైగా వర్షపాతం నమోదు అయ్యిందియూసఫ్గూఢలో అత్యధికంగా 11 సెం.మీ. వర్షం పడింది Heavy rain 🌨️in many areas of hyderabad⚡ , Stay home and be safe.🏊🏊#HyderabadRains #Hyderabad#HyderabadRains #Hyderabad pic.twitter.com/ghaon2UJRg— Tabrez Alam (@Tabrez_saab) August 20, 2024మరోవైపు.. తెలంగాణ అంతటా ఇంకో నాలుగు రోజులు భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. జనగామ, గద్వాల, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, సిద్ధిపేట, వనపర్తికి ఐఎండీ వర్ష సూచన చేసింది.రంగారెడ్డి,సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు పడొచ్చని హెచ్చరించింది.ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.Heavy in Hyderabad. The roads are flooded and people are facing of problems 🌨️🌨️🌨️🌨️#HyderabadRains #earthquake pic.twitter.com/u82iTtn7rt— Vandana Meena (@vannumeena0) August 20, 2024 -
ఏపీవాసులకు అలర్ట్.. మరో మూడు రోజలు భారీ వర్షాలు
సాక్షి, ఏలూరు జిల్లా: కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉధృతంగా వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. గుండేటి వాగు ఉధృతితో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. స్పిల్‌వే ఎగువ నీటిమట్టం 31.315, దిగువ నీటిమట్టం 22.47 మీటర్లు. 48 గేట్ల ద్వారా 7,20,875 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం తమ్మిలేరు రిజర్వాయర్‌లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 355 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం తమ్మిలేరు బేసిన్ 349.49 అడుగులుగా కొనసాగుతోంది. గోనెల వాగు బేసిన్ 349.23 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు.. ప్రస్తుత నీటి నిల్వ 2.014 టీఎంసీలు. కాచ్ మెంట్ ఏరియాలో ఎగువ నుంచి వరదనీరు చేరుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తమ్మిలేరు ప్రవాహ ప్రాంతంలో గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.రాయలసీమ, తమిళనాడు పరిసరాలపై ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాలపై విస్తరించి ఉన్న మరో ద్రోణి వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఏర్పడినా దాని ప్రభావం ఒడిశాపైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.కానీ రాయలసీమపై ఉన్న ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, బుధవారం గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల తదితర జిల్లాల్లో ఎడతెగని వర్షాలు కురిశాయి.భారీ వర్షాలకు రాజధాని అమరావతి ప్రాంతం జలమయమైంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 9.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా చేబ్రోలులో 9.3 సెంటీమీటర్లు, నంద్యాల జిల్లా డోన్‌లో 8.8, శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 8.4, చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటలో 8.3 సెంటీమీటర్లు, విజయవాడలో 7.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
-
ఏపీలో రెండ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు
అమరావతి, సాక్షి: మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం, దీనికి అనుబంధంగా విస్తరించిన ఆవర్తనం రాష్ట్రం మీద ప్రభావం చూపించనుంది. ఈ ప్రభావంతో రెండ్రోజులపాటు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు, ఎల్లుండి (జులై 18, 19వ తేదీల్లో) కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే.. మిగిలినచోట్ల విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారాయన. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.‘‘వర్షం పడే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద ఉండరాదు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సూచించారాయన. అలాగే.. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ 1070, 112, 18004250101 సంప్రదించాలని కోరారాయన. భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలుశ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలుకోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్లుభారీ నుంచి అతి భారీ వర్ష సూచన జిల్లాలుకృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం -
హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో 3 రోజులు వానలే
సాక్షి, హైదరాబాద్: రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు, రేపు(శుక్ర,శని) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, నగరంలోని శుక్రవారం సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.బండ్లగూడ, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, కర్మన్‌ఘాట్, దిల్సుఖ్నగర్, సరూర్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, మలక్‌పేట్, సైదాబాద్, చంపాపేట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. -
నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌లో అలర్ట్
హైదరాబాద్, సాక్షి: ఉత్తర తెలంగాణ నుంచి నిజామాబాద్ దాకా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో.. తెలంగాణ అంతటా నేడు(మంగళవారం) భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షపాతం నమోదు కానుంది. సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు రాజధాని హైదరాబాద్ నగరానికి కూడా భారీ వర్ష సూచన ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసరం అయితే బయటకు రావాలని నగర పౌరులకు సూచిస్తున్నారు. మరోవైపు ఆఫీసులకు వెళ్లేవాళ్లు వాతావరణ పరిస్థితుల్ని బట్టి నడుచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. -
T20 WC 2024 IND VS PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య ఇవాళ (జూన్ 9) మహాసంగ్రామం జరగాల్సి ఉంది. న్యూయార్క్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. అయితే ఈ బిగ్ ఫైట్‌కు ముందు వరుణ దేవుడు క్రికెట్ అభిమానులను కలవరపెడుతున్నాడు.మ్యాచ్ ప్రారంభ సమయానికి (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలు) వర్షం పడే సూచనలు ఉన్నట్లు న్యూయార్క్ వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం కారణంగా టాస్ కూడా నిర్ణీత సమయంలో పడకపోవచ్చని అంచనా. అయితే సమయం గడిచే కొద్ది వరుణుడు శాంతించవచ్చని సమాచారం. ఒకవేళ వరుణుడు మ్యాచ్ ప్రారంభానికి ఆటంకం కలిగించినా ఓవర్ల కుదింపుతో మ్యాచ్ సాధ్యపడే అవకాశం ఉంది.మ్యాచ్ ప్రారంభానికి రెండున్నర గంటల ముందు అక్కడి వాతావరణం మేఘావృతమై ఉంది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే భారత్, పాక్‌లకు చెరో పాయింట్ లభిస్తుంది.మరోపక్క ఈ మ్యాచ్‌కు కేటాయించబడిన పిచ్ ఆటగాళ్లను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ డ్రాప్ ఇన్ వికెట్ క్యూరేటర్లకు సైతం అంతుచిక్కని విధంగా ఉంది. అనూహ్య బౌన్స్ కారణంగా బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాటర్ల పాలిట ఈ పిచ్ సింహస్వప్నంలా మారింది. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు సార్లు మాత్రమే 100కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దమవుతుంది. -
మండుతున్న భూగోళం...
-
నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
-
వర్ష సూచన: తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు
-
ఏపీలో మరో 7 రోజులు భారీ వర్షాలు
-
కొనసాగుతున్న ఉపరితల ద్రోణి..
-
ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
-
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో పట్టపగలే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. పలు చోట్ల వర్షం కురిసింది. మూసాపేట, కూకట్పల్లి, మియాపూర్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, చంపాపేట్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మెహిదీపట్నం, టోలిచౌక్, గచ్చిబౌలి, చార్మినార్, మలక్‌పేట్, నాగోల్ కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపునీరు చేరింది. రైల్వే అండర్ పాస్ కింద వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోఠి, చాదర్‌ఘాట్, మలక్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్తే రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో రాత్రిలోగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఐఎండీ సూచించింది.హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు గంటల్లో ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.రాష్ట్రంలో గురువారం భారీ వర్షాలు మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు ఖమ్మం, నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణం పేర్కొంది.రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మంచిర్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,మహబూబాబాద్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్‌నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో , ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. -
చల్లటి కబురు..నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్
-
ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు
గుంటూరు, సాక్షి: భానుడి భగభగలతో.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో.. ఉక్కపోతలతో అల్లలాడిపోతున్న ఏపీ ప్రజలకు చల్లటి కబురు. వాతావరణంలో మార్పులతో రాబోయే మూడు నాలుగు రోజులు ఎండలు, వడగాలులు తగ్గు ముఖం పట్టనున్నాయి. అదే సమయంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి.రేపటి నుంచి మూడు రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖ, గుంటూరుతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది.అలాగే.. తీవ్ర ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిని తలపిస్తున్న కోస్తా, రాయలసీమ జిల్లాల పరిధిలోనూ రెండ్రోజులపాటు(7-9 తేదీల మధ్య) వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్ష ప్రభావంతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయంది. అలాగే మిగతా ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ వర్షాలు పడనున్నాయి. ఇదిలా ఉంటే.. ఆదివారం నంద్యాల జిల్లా మహానందిలో 45.8 డిగ్రీల సెల్సియస్, కర్నూలు జిల్లా సింగవరంలో 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మార్కాపురం @ 48 డిగ్రీలు
సాక్షి, విశాఖపట్నం/మార్కాపురం: సూర్యప్రతాపం రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గురువారం 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న కొద్దిరోజులు రాష్ట్రంలో పరిస్థితి నిప్పులు చెరిగే పగళ్లు.. వేడిని వెదజల్లే రాత్రుళ్లు ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో పగటివేళ సాధారణంకంటే 4–7 డిగ్రీలు, రాత్రిపూట 3–6 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
మరో మూడు రోజులు సూర్య ప్రతాపం.. బయటకెళ్తే డేంజరే!
హైదరాబాద్/ గుంటూరు, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతున్నది. పగలు రాత్రి తేడా లేకుండా ఉక్కపోత వాతావరణం కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయి. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయితే.. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. వడగాడ్పులు అంతకంతకూ పెరుగుతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. ఒకపక్క.. ఏపీలో గురువారం 16 జిల్లాల్లో 43 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 102 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మరో 72 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. రానున్న మూడు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. శుక్రవారం ఏపీలో 174 మండలాల్లో వడగాల్పులు, 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోపక్క.. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో రామగుండం, భద్రచాలం పరిధిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, వృద్ధులు గర్భీణీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక రేపు తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. -
చల్లబడిన వాతావరణం.. నాలుగు రోజులు వర్షాలు
-
తెలంగాణకు చల్లటి కబురు.. రెండు రోజులు వర్షాలే..
సాక్షి, హైదరాబాద్: వేసవి ఎండతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందిన తెలిపింది. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఆరో తేదీ వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. ఈనెల 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. @CEO_Telangana @TelanganaCMO @SpokespersonECI @ECISVEEP @TelanganaCS @DCsofIndia @IASassociation @IasTelangana @tg_weather @metcentrehyd #ECISVEEP #CEO_Telangana pic.twitter.com/DWngGDsOSh — IMD_Metcentrehyd (@metcentrehyd) April 3, 2024 మరోవైపు.. తెలంగాణలో ఈ ఎండా కాలంలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత బుధవారం నమోదైంది. ఖమ్మంతోపాటు భద్రాద్రి కొత్తగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్‌నినో పరిస్థితులు జూన్ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎకువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. నిజామాబాద్‌లో 41.2, ఆదిలాబాద్‌లో 41.3, మెదక్, రామగుండం, నల్లగొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. -
ఉక్కపోత పెరుగుతోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలకు సమాంతరంగా రాత్రి ఉష్ణోగ్రతలు సైతం అదేస్థాయిలో పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వేగంగా నపమోదవుతోంది. శుక్రవారం రాష్ట్రంలోని గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ... గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 38.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 16.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని చాలాచోట్ల గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. మెదక్‌లో సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కాగా... ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో 2 డిగ్రీల సెల్సియస్, మిగతా చోట్ల ఒక డిగ్రీ సెల్సియస్ చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోత కూడా పెరుగుతోంది. -
ఆ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు... తీవ్రమైన చలిగాలులు!
జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, బీహార్.. ఈ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలిగాలులు అలముకున్నాయి. గత కొద్ది రోజులుగా ఎత్తయిన ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో మైదాన ప్రాంతాల్లోనూ చలిగాలులు తీవ్రమయ్యాయి. మరో రెండు మూడు రోజుల వరకు ఈ వాతావరణం నుంచి ఎలాంటి ఉపశమనం ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో ఢిల్లీలోని పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దృశ్యమానత తక్కువగా ఉండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం పంజాబ్‌లోని అమృత్సర్, రాజస్థాన్‌లోని చురులో పొగమంచు కారణంగా విజిబులిటీ కనిష్టంగా ఉంది. జమ్మూ కశ్మీర్లో దట్టమైన పొగమంచు కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనుంది. శ్రీనగర్‌లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం 2024 జనవరి ఒకటి నుండి మూడు వరకు రాష్ట్రం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల వర్షం, మంచు కురుస్తుంది. ప్రస్తుతం కశ్మీర్లో చలిగాలులు వీస్తుండటంతో చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా నమోదైంది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 2.1 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. పహల్గామ్లో మైనస్ 3.9 డిగ్రీల సెల్సియస్, గుల్మార్గ్లో మైనస్ 3.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లేహ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 7.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యం పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఆదివారం సాయంత్రం 4 గంటలకు 411గా నమోదైంది. ఇది తీవ్రమైన విభాగంలోకి వస్తుంది. శనివారం ఏక్యూఐ 450గా నమోదయ్యింది. ఇది కూడా చదవండి: ఇక్కడి ఆస్తులకు జియో ట్యాగింగ్ తప్పనిసరి! -
అమృత్‌సర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు.. ఎంతంటే..
దేశంలోని పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం మైదాన ప్రాంతాల్లో చలి తీవ్రతను మరింత పెంచుతోంది. ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రతపెరిగింది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కూడా ఏర్పడుతోంది. వాతావరణ శాఖ ‘ఎక్స్’ హ్యాండిల్లో అందించిన సమాచారం ప్రకారం హర్యానా, పంజాబ్, చండీగఢ్, అస్సాం, మేఘాలయలో రాబోయే ఐదు రోజుల పాటు ఉదయం దట్టమైన పొగమంచు ఏర్పడనుంది. డిసెంబర్ 21 వరకు ఇదేవిధమైన వాతావరణం ఉండనుంది. కాగా గత 24 గంటల్లో హర్యానా, పంజాబ్, చండీగఢ్, యూపీ, ఢిల్లీ, వాయువ్య రాజస్థాన్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బీహార్, మధ్యప్రదేశ్‌లలో ఐదు నుంచి 10 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. గత 24 గంటల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 3.6 డిగ్రీలుగా నమోదైంది. యూపీలోని బరేలీలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని రేవా, ఉమారియాల్లో 6.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలావుండగా గత 24 గంటల్లో దక్షిణ తమిళనాడులో 39 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ తమిళనాడులోని చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ బులెటిన్‌లో తెలిపింది. డిసెంబర్ 19న కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 7.1 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఈ సీజన్లో సగటు ఉష్ణోగ్రత కంటే ఒక డిగ్రీ తక్కువ. మంగళవారం పాక్షికంగా ఆకాశం మేఘావృతమై, పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా జమ్మూకశ్మీర్‌లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉత్తర కాశ్మీర్‌లోని గుల్మార్గ్లో మైనస్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది కూడా చదవండి: లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి రాహుల్, ప్రియాంక పోటీ? -
మంచుకురిసే వేళలో.. వాతావరణశాఖ హెచ్చరికలు!
దేశంలోని పర్వత ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. మైదానాలను చల్లని గాలులు చుట్టుముడుతున్నాయి. ఉత్తర భారతదేశంలోని పలుచోట్ల ఉదయం పూట దట్టంగా పొగమంచు కమ్ముకుంటోంది. హర్యానా, పంజాబ్, చండీగఢ్, త్రిపుర, యూపీలోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 14, 15 తేదీల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 14న అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలకు వాతావరణశాఖ ఇదే విధమైన హెచ్చరిక జారీ చేసింది. గడచిన 24 గంటల్లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో 6 నుండి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 6 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్లోనూ చలి తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా ఉంది. మరో రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తిరిగి పడిపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నగరంలోని గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) అత్యంత పేలవమైన కేటగిరీలో నమోదైంది. డిసెంబర్ 16, 17 తేదీల్లో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 17న కేరళలో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో మంచు కురుస్తోంది. గడచిన 24 గంటల్లో హిమాచల్‌లోని కులు, కిన్నౌర్, లాహౌల్, స్పితి జిల్లాల్లోని ఎత్తయిన ప్రాంతాలు, పర్వత శ్రేణులలో మంచు కురిసింది. ఇది కూడా చదవండి: సీఎం సొంతూళ్లో సంబరాలు... రెస్టారెంట్లో చాయ్ ఫ్రీ! -
హైదరాబాద్‌లో వర్షం.. రానున్న మూడు రోజుల పాటు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం వర్షం పడుతోంది. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, కర్మన్‌ఘాట్, చంపాపేట్, సంతోష్‌నగర్, ఉప్పల్, తార్నాక, మెహదీపట్నం, అమీర్‌పేట, ఎస్సానగర్, కూకట్పల్లి, బేగంపూట, సికింద్రాబాద్‌లో మోస్తరు వర్షం పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారులపై రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఉదయాన్నే కార్యాలయాలు, పాఠశాలలకు బయలుదేరిన విద్యార్థులు, వాహనదారులు వర్షానికి ఇబ్బందులు పడ్డారు. కాగా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం నుంచి ఈ నెల 26 వరకు వానలు పడే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో డీఆర్ఎఫ్, మున్సిపల్ సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్/విశాఖ: ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం రేపటి కల్లా బలపడి అల్పపీడనంగా మారనుంది. ఈ క్రమంలో.. మరో రెండు మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాలకు అలర్ట్‌లు జారీ చేసింది వాతావరణ శాఖ. తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌కు భారీ వర్షసూచన చేయడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ► తెలంగాణలో.. నిన్నటి నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్‌లో వాగులు పొంగిపొర్లి.. పలు గ్రామాలకు రాకపోకలకు స్తంభించాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో.. రెండు గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. MASSIVE DOWNPOURS triggering in Nirmal, Nizamabad, Jagitial belt to cover Kamareddy, Sircilla, Karimnagar, Sangareddy, Medak, Siddipet in coming 2hrs Chances looks highly favourable for morning rains in HYD. Will continue to update. Better prefer public transport this morning — Telangana Weatherman (@balaji25_t) September 4, 2023 ► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను.. మళ్లీ వర్షాలు ప్రజలకు దడపుట్టిస్తున్నాయి. ఈ ఉదయం నుంచి ఆదిలాబాద్ కేంద్రంలో భారీ వాన కురుస్తుండగా.. రోడ్లు జలమయం అయ్యాయి. ఇప్పటికే రాకపోకలు నిలిచిపోగా.. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ► భూపాలపల్లిలోనూ నిన్నటి నుంచి వాన కురుస్తుండడంతో.. ఓపెన్ కాస్ట్ పనులకు అంతరాయం కలుగుతోంది. ► నిజామాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. డిచ్‌పల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. ► ఉమ్మడి మెదక్‌లోనూ భారీ వర్షం కురుస్తోంది. గరిష్టంగా 13 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతంలో.. రేపు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బలంగా గాలులు వీస్తాయని, ఎల్లుండి సైతం భారీ వానలు ఉంటాయని అప్రమత్తం చేస్తోంది. కర్నూలు: జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక వర్షం నేపథ్యంలో.. రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయయి. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జోన్ పరిధిలో(సెప్టెంబర్ 4 వ తేది) కర్నూల్ APSP 2 వ బెటాలియన్ లో సోమవారం జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను భారీ వర్షం కారణంగా వాయిదా వేస్తున్నట్లు కర్నూల్ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలను సెప్టెంబరు 21 తేదికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు: ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి వరద పెరుగుతోంది. ఇన్ ఫ్లో 13,897 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 2,774 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 17.610 టీఎంసీలు కాగా.. జలాశయం పూర్తి కెపాసిటీ 78 టీఎంసీలు. అనంతపురం: తాడిపత్రిలో భారీ వర్షం కురుస్తోంది. పలు వాగులు వంకలు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. -
తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండగా.. మూడు రోజులపాటు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాగల మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురవనున్నాయి. రేపు(శుక్రవారం), ఎల్లుండి(శనివారం) అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాలలో రేపు(శుక్రవారం) భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే రెండు రోజులపాటు ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక రాజధాని హైదరాబాద్ నగరంలో వచ్చే రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
అల్పపీడనం బలహీనపడడంతో రాష్ట్రంలో ఉక్కపోత
-
వాతావరణశాఖ హెచ్చరిక..ఏపీలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్
-
ఏపీలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
-
అల్పపీడనంగా మారుతున్న ‘బిపర్జోయ్’.. ఆ ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ
న్యూఢిల్లీ: గుజరాత్ తీరప్రాంత జిల్లాలను అతలాకుతలం చేసిన బిపర్జోయ్ తుపాను తాజాగా రాజస్తాన్‌పై ప్రతాపం చూపుతోంది. దీని ప్రభావం కారణంగా రాజస్థాన్, గుజరాత్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బిపార్జోయ్ తుఫాను ప్రస్తుతం అల్పపీడనంగా మారుతోందని తెలిపింది. ముఖ్యంగా దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్‌లోని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మత్స్యకారులు వెటకు వెళ్లద్దని హెచ్చరికలు జారీ చేశారు. భారత వాతావరణ విభాగం (IMD) డైరెక్టర్ జనరల్, మృత్యుంజయ్ మహపాత్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం నుంచి బుధవారం వరకు తూర్పు, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాల పురోగతికి ఈ పరిస్థితులు అనుకూలంగా మారుతాయని తెలిపారు. బైపోర్‌జోయ్ గుజరాత్‌లోని తీరప్రాంతాల్లో విధ్వంసాన్ని సృష్టించింది ఆ ప్రాంత ప్రజల రోజూవారి జీవనాన్ని స్తంభింపచేసింది. ముఖ్యంగా కచ్ జిల్లాలో ఇది ఎక్కువ ప్రభావం చూపింది. In 1999, a Super Cyclone that struck #Odisha claimed 10,000+ lives…back then, #india had only PSLV rocket& 4 sats Today, India has 50+ sats & 4 rockets, #BiparjoyCyclone barrels into #Gujarat and there’s 2 casualties That’s the power of #space #tech for you 🇮🇳🚀#isro #imd pic.twitter.com/2zhpyslRg5 — Sidharth.M.P (@sdhrthmp) June 16, 2023 తెలుగు రాష్ట్రాలపై ప్రభావం.. సాధారణంగా ఈపాటికే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొట్టాలి. కానీ, ఎర్రటి ఎండలు మాత్రం మే నెలను తలపిస్తున్నాయి. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను.. రుతుపవనాలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే కొనసాగుతుండగా.. వర్షాలు ఇంకా ఆలస్యంగా కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. Fresh visuals of #BiparjoyCyclone hitting Kutch coastal areas of Gujarat with a wind velocity of approximately 145 kmph during #LANDFALL#Gujaratcyclone #BiparjoyUpdate #BiparjoyNews pic.twitter.com/IbshQG4LYW — BN Adhikari, IIS(Rtd) (@AdhikariBN) June 15, 2023 The Depression (Remnant of Cyclonic Storm ‘Biparjoy’) over central parts of South Rajasthan & neighbourhood at 2330 IST of 17th June, about 60 km SSW of Jodhpur. Very likely to continue to move ENE-wards and maintain the intensity of Depression till forenoon of 18th June. pic.twitter.com/CMb5sfee8H — India Meteorological Department (@Indiametdept) June 17, 2023 -
ఏపీలో హై అలర్ట్.. రాబోయే ఐదు రోజులూ అప్రమత్తంగా ఉండాల్సిందే..!
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 302 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి, బుచ్చయ్యపేట, చోడవరం, కె.కోటపాడు, కశింకోట, కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం, సబ్బవరం మండలాలు, కాకినాడ జిల్లా కోటనందూరు, తుని మండలాలు, విజయనగరం జిల్లా జామి, కొత్తవలస మండలాలు, విశాఖలోని పద్మనాభం మండలంలో వడగాడ్పుల తీవ్రత ఉంటుందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వడగాడ్పులు, అకాల వర్షాలు, పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్ల కింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చదవండి: ప్రమాదాన్ని ముందే పసిగట్టిన గజరాజు.. గోవిందరాజు స్వామి ఆలయంలో ఏం జరిగింది? -
Temperature : విజయవాడలో మండుతున్న ఎండలు (ఫొటోలు)
-
వామ్మో తుఫాను.. ఇక్కడ వర్షాలు..
-
ఏపీలో దంచికొడ్తున్న వానలు
-
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ద్రోణి ప్రభావంతో..
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడడం లేదు. తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు సోమవారం ఉదయం నుంచి ఇరు రాష్ట్రాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కూడా. తెలంగాణలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయ్యింది. భారీ వానలు, వడగండ్ల వానలు కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజధాని హైదరాబాద్‌లోనూ భారీ వాన సూచన మేరకు అప్రమత్తంగా ఉండాలని నగరవాసులకు జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేస్తోంది. యెల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు.. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,నిర్మల్. నిజామాబాద్ కరీంనగర్‌తో పాటు పెద్దపల్లి సూర్యాపేట, మహబూబ్‌నగర్‌తో పాటు నాగర్‌కర్నూల్, నారాయణపేట రాబోయే రెండు మూడు రోజుల్లో.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో. అలాగే.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. అమరావతి: ఇక ఏపీలో నేడు(సోమవారం), రేపు(మంగళవారం) అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ క్రమంలో.. సోమవారం ఉదయం నుంచి పలుచోట్ల వర్షం పడుతోంది. విజయవాడ, ఏలూరులో ఓ మోస్తరు వర్షం కురుస్తుండగా.. పలు జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది వాతావరణ కేంద్రం. CONVERGENCE MOVING AWAY Finally the peak spell of unseasonal rains ending in Telangana. All the MASSIVE RAINS will shift to Andhra Pradesh during next 3days. Telangana too will definetely see rains, but only scattered ones, not widespread heavy Hyderabad - Scattered rains only pic.twitter.com/Up5NdMNMwK — Telangana Weatherman (@balaji25_t) May 1, 2023 My apartment cellar flooded after such huge downpour. Might be same situation in many other areas too. Hope people are safe. Rains to gradually reduce now. The worst is over. Only scattered rains to continue till morning. One of the record breaking spell of rain in recent yrs 🙏 pic.twitter.com/dUddwRKeLU — Telangana Weatherman (@balaji25_t) April 30, 2023 Panjagutta views in #HyderabadRains 🌧 pic.twitter.com/zEgs97sIqn — Mahendar Vanaparthi Ⓜ️ (@MahendarBRS) May 1, 2023 Many areas in #Tolichowki flooded due to heavy rains that lashed for an hour. Traffic snarls, power cuts reported.#HyderabadRains pic.twitter.com/s56lkccaJn — Toofan News (@ToofanNewsHyd) April 30, 2023 అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా పంట నష్టం వాటిల్లగా.. మరోవైపు జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. శనివారం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షంతో.. మళ్లీ నగరం నీట మునిగింది. పలు కాలనీల్లోకి నీరు చేరగా.. చెట్లు నేలకూలాయి. పలు వాహనాలు నాశనం అయ్యాయి. గాలులకు, వానకి విద్యుత్, రవాణా వ్యవస్థలకు, మంచి నీటి సరఫరాకు విఘాతం ఏర్పడింది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీవర్షం.. వర్షపాత నమోదు ఇలా షేక్‌పేట లో 10.6 సెం.మీ ఖాజగూడ లో 9.6 సెం.మీ రామంతపూర్ లో 8.1 సెం.మీ మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ లో 8.1 సెం.మీ శ్రీనగర్ కాలనీ 8 సెం.మీ మాదాపూర్ 7.3 సెం.మీ తార్నాక లో 7.1 సెం.మీ జూబ్లీహిల్స్ 6.9 సెం.మీ మైత్రివనం 6.9సెం.మీ బంజారాహిల్స్ 6.9 సెం.మీ ఇదీ చదవండి: చిన్నారి మౌనిక ఘటన మరువక ముందే.. కుండపోతకు మరో విషాదం -
హైదరాబాద్‌లో కుండపోత వాన.. హెచ్చరికలు జారీ
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని Hyderabad Rains మరోసారి వరుణుడు ముంచెత్తాడు. పొద్దుపొద్దున్నే ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వాన నగరవాసుల్ని పలకరించింది. రోడ్లు, లోతట్టు పప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరవాసులకు జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. అమీర్‌పేట, కోఠి, పంజాగుట్ట, కూకట్పల్లి, ఎల్బీనగర్, హయత్‌నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బేగంపేట్, వారసిగూడ, అడ్డగుట్ట తదితర ప్రాంతాల్లో ఇలా.. నగరంతో పాటు నగర శివారు జిల్లాల్లోనూ వర్ష ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు వడగండ్ల వాన హెచ్చరికలూ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రజలకు సూచిస్తోంది. ☔ #HyderabadRains #Hyderabad pic.twitter.com/SsDkwSiJ34 — Shaandaar Hyderabad (@swachhhyd) April 29, 2023 #HyderabadRains Always wanted to do this.. pic.twitter.com/l0Q9nohShT — Ankush Tweets (@ankushbidayat7) April 29, 2023 తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు, వడగండ్ల వాన ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం జంట నగరాలు వానకి తడిచి ముద్దైంది. తెల్లవారినా కూడా మబ్బులు కమ్ముకుని చిమ్మచీకట్లు అలుముకోగా.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పలు ప్రాంతాల్లో కురుస్తోంది. #Early this morning, it raining in #HyderabadRains. pic.twitter.com/8KwJ5O1meN — innocent Banda (@Baag786) April 29, 2023 Ala vidhwamsam modalu #HyderabadRains , just miss 😄 pic.twitter.com/Y7DMLOZTqQ — Sunny (@Dr_S_Chanamolu) April 29, 2023 Heavy rain at #Manikonda #Hyderabad #HyderabadRains pic.twitter.com/fm7ODi7k6m — BOSS Fan (@chintu002) April 29, 2023 రాళ్ల వాన(వడగండ్ల) నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు జిల్లాల్లోనూ భారీ వర్షాలు, వడగండ్లకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు రామచంద్రపురం ఆమీన్పూర్ లో భారీ వర్షం కురుస్తోంది. మహాబూబ్‌నగర్‌లో పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతోంది. రంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్ జిల్లాలకు వడగండ్లతో కూడిన భారీ వాన హెచ్చరికలు జారీ అయ్యాయి. -
హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. తెలంగాణలో కొనసాగుతున్న వర్షప్రభావం
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం సహా తెలంగాణలోని జిల్లాలను వరుణుడు ముంచేశాడు. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బుధవారం ఉదయం కూడా పలు చోట్ల వాన పడుతోంది. ఒకవైపు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంట నష్టం జరగ్గా.. మరోవైపు హైదరాబాద్‌కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. భారీ ఈదురుగాలులతో దంచికొట్టడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయ్యి రంగంలోకి దిగింది. అయినప్పటికీ ఇప్పటికీ పలు ప్రాంతాలు నీటిలోనే ఉండిపోయాయి. రామచంద్రాపురంలో అత్యధికంగా 6 సెం.మీ. వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, బేగంపేట, కూకట్పల్లి, గాజులరామారం తదితర ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. సికింద్రాబాద్, కాప్రా, మల్కాజ్గిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అకాల వర్షాలతో, వడగండ్ల వానతో తీవ్ర పంట నష్టం వాటిల్లుతోంది. మరో నాలుగు రోజులపాటు వర్షా ప్రభావ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగండ్ల వానలు పడొచ్చని చెబుతోంది. కాబట్టి, ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం కోరుతోంది. -
అలర్ట్: తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణం
సాక్షి, విశాఖపట్నం: మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు పగటిపూట రోకండ్లు పగిలే ఎండ.. మరోవైపు విపరీతమైన ఈదురు గాలులు, అకాల వర్షాలు ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. వాతావరణంలో తీవ్ర మార్పులు ఉంటాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. రాబోయే ఐదురోజుల్లో ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపింది. అంతేకాదు.. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో కొన్ని చోట్ల కుండపోత వానలు కురుస్తాయని తెలిపింది. 40-50 కిలోమీటర్ల వేగంతో గాలిదుమారం వీస్తుందని, అలాగే క్రికెట్ బాల్ సైజ్‌లో వడగండ్ల వానకు ఆస్కారం ఉందని హెచ్చరించింది. మరోవైపు పగటి పూట ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోంది. గాలి విచ్ఛిన్నం, ద్రోణుల ప్రభావంతో వాతావరణంలో ఈ తరహా మార్పులు సంభవిస్తుయని పేర్కొంది వాతావరణ కేంద్రం. -
తెలంగాణాలో మండుతున్న ఎండలు
-
ఏపీలో దంచికొడుతున్న ఎండలు - అల్లాడిపోతున్న ప్రజలు ( ఫొటోలు)
-
హైదరాబాదీలకు అలర్ట్.. ఈదురు గాలులతో భారీ వర్షం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మెహదీపట్నం, మణికొండ, షేక్ పేట్, మాసబ్ ట్యాంక్, టోలిచౌకి, అత్తాపూర్, రాజేంద్రనగర్‌లో వర్షం కురుస్తోంది. కొన్నిచోట్ల ఈదురు గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 16 వరకు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏడు గంటల పాటు ఆ రూట్లు బంద్ -
వాతావరణ సమాచారం ఇక నిరంతరం
సాక్షి, విశాఖపట్నం: కచ్చితమైన వాతావరణ అంచనాల్లో భారత వాతావరణ విభాగానికి (ఐఎండీకి) ప్రపంచ దేశాల్లో పేరుంది. ఇప్పుడు తాజాగా అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఐఎండీ మరింత ముందుకెళ్తోంది. వాతావరణ సమాచారాన్ని విస్తృతం చేయడంపైనా దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రాడార్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రస్తుతమున్న రాడార్ కేంద్రాలను ఆధునీకరించడంతోపాటు కొత్త రాడార్ కేంద్రాలను కూడా ఏర్పాటుచేస్తోంది. తూర్పు తీర ప్రాంతంలో అత్యదిక సామర్థ్యం కలిగిన ఎస్–బ్యాండ్ డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు విశాఖపట్నం, మచిలీపట్నం, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్నాయి. వీటి పరిధి 500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఆయా కేంద్రాల పరిధిలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్ల స్థితిగతులు, వాటి తీవ్రత, ప్రభావం, గమనం, గాలుల తీవ్రత, వర్షపాతం వంటి వాటిని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా అంచనావేస్తూ ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని తెలియజేస్తాయి. వాయుగుండాలు, తుపానులు తీరానికి ఎంత దూరంలో ఉన్నాయో, ఎంత ఎత్తులో ఉన్నాయో, ఎక్కడ తీరాన్ని దాటుతాయో గుర్తిస్తాయి. అంతేకాదు.. రాడార్ కేంద్ర స్థానం నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మేఘాల తీరుతెన్నులనూ రికార్డు చేస్తాయి. స్వదేశీ పరిజ్ఞానంతోనే.. ఈ నేపథ్యంలో.. ఐఎండీ ఇప్పుడు కోల్‌కతా, చెన్నై సహా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, మచిలీపట్నం డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న డాప్లర్ రాడార్ పరికరాలు, యంత్ర సామగ్రికి బదులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్ర పరికరాలను అమర్చనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న డాప్లర్ రాడార్ స్టేషన్లు విదేశీ టెక్నాలజీతో ఏర్పాటుచేసినవే. అయితే, ఆధునీకరణలో భాగంగా ఏర్పాటయ్యేవి మాత్రం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే ఉండనున్నాయి. వీటిలో సింగిల్ యాంటెన్నాలకు బదులు డ్యూయెల్ పోలరైజ్డ్ యాంటెన్నాలు ఏర్పాటుచేస్తారని భావిస్తున్నారు. త్వరలో పాతవాటి స్థానంలో కొత్తవి అమర్చనున్నారు. ఇవీ ప్రయోజనాలు.. ప్రస్తుతమున్న డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు ప్రతి గంటకూ వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నాయి. ఆధునీకరణలో భాగంగా కొత్త యంత్ర పరికరాలను ఏర్పాటుచేస్తారు. వీటితో ఇకపై నిరంతరం రాడార్ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఫలితంగా అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది. అంతేకాదు.. వాతావరణ పరిస్థితులను బట్టి మరింత కచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి వినియోగించుకుంటారు. రెండు దశాబ్దాల క్రితం నాటివి.. నిజానికి.. విశాఖపట్నం, మచిలీపట్నం డాప్లర్ వెదర్ రాడార్ కేంద్రాలు దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటయ్యాయి. ఇప్పుడు వాటిలో పనిచేస్తున్న యంత్ర పరికరాలకు అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తవి అమరిస్తే మరి కొన్నేళ్లపాటు అవాంతరాల్లేకుండా కచ్చితత్వంతో కూడిన వాతావరణ సమాచారం నిరంతరం అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
అబ్బా.. చలి చంపుతోంది!
సాక్షి, హైదరాబాద్/కోహీర్(జహీరాబాద్): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని హెచ్చరించింది. ఈశాన్యం వైపు నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్న నేపథ్యంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 4.6 డిగ్రీల సెల్సియస్‌గా నమో దైంది. రాష్టంలో ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొమురం భీమ్ జిల్లా సిర్పూర్(యు)లో 4.8 డిగ్రీలు రెండో అత్యల్ప ఉష్ణోగ్రత కాగా, రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి, వికారాబాద్ జిల్లా మర్పల్లి 5 డిగ్రీలతో మూడో స్థానంలో నిలిచాయి. చలి తీవ్రత పెరగడంతో ఉదయం 8 గంటల వరకు ప్రజలు బయటికి రాలేకపోతున్నారు. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో... కనిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ గజగజలాడుతోంది. సోమవారం తెల్లవారుజామున శివరాంపల్లిలో కనిష్టంగా 7.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కాగా నగరం మొత్తంగా సరాసరిన 11.3 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేసింది. ఉదయం 10దాటినా తొలగని మంచు పాల్వంచ రూరల్: కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల సమీపాన ఉండే గ్రామాల్లో ఆదివాసీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాయంత్రం ఐదు గంటల నుంచే చలి మొదలవుతుండటం, ఉదయం 10 గంటల వరకూ మంచు తెరలు వీడకపోవడంతో రాత్రంతా నెగడు (చలిమంటలు) వద్దే గడుపుతున్నారు. పడుకునే సమయాన కూడా పక్కన నెగడుకు తోడు దుప్పట్లు కప్పుకుని నిద్రిస్తున్నారు. కొత్తగూడెం జిల్లాలోని చిరుతానిపాడులో, పెద్దకలశ, రాళ్లచెలక, బుసురాయి, ఎర్రబోరు తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. -
Telangana: చలి.. చలి!
సాక్షి, హైదరాబాద్: చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పతనమవుతున్నాయి. నాలుగైదు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. గురువారం నాటి ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఖమ్మంలో 33.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 11 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. చాలాచోట్ల సాధా రణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదు కావడం రాష్ట్రంలో చలి తీవ్రతను స్పష్టం చేస్తోంది. రా నున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని, తగు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతటా తక్కువే.. ప్రస్తుతం సీజన్లో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే చాలా తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధా రణ కనిష్ట ఉష్ణోగ్రతలతో పోలిస్తే గురు వారం హన్మకొండలో 4.4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. మెదక్‌లో 4.9 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్‌లో 3.5 డిగ్రీల సెల్సియస్, నల్లగొండలో 3.3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిజామాబాద్, అదిలాబాద్, రామగుండంలోనూ సాధారణం కంటే రెండు డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది. జాగ్రత్తగా ఉండాలి.. రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తు లో వేగంగా గాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడానికి తోడు ఈశాన్య దిశల నుంచి వచ్చే గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. దూర ప్రయాణాలు చేసేవారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, హృద్రోగులు, గర్భిణులు, చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. -
గజగజ మొదలైంది! రాష్ట్రంలో ఒక్కసారిగా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాత్రిపూట బయటికి రావాలంటే గజగజ వణికే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఈనెల ప్రారంభం నుంచి శీతాకాలం ప్రారంభమైనప్పటికీ వరుస వర్షాలతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదయ్యాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోపగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతుండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం ఒక్కసారిగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకట్రెండు చోట్ల మినహా మిగతా ప్రాంతాల్లో 20 డిగ్రీల సెల్సియస్‌లోపే నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు కూడా ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణం కంటే తక్కువగా... బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 13.6 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతలకు ఒక డిగ్రీ అటుఇటుగా నమోదుకాగా, కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే భారీగా తగ్గాయి. హనుమకొండలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 4.2 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదైంది. హైదరాబాద్‌లో 5.6, మెదక్‌లో 5.4. నల్లగొండలో 3.6 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. 29 నుంచి ‘ఈశాన్య’ వర్షాలు నైరుతి రుతుపవనాలు దాదాపు దేశమంతటా ఉపసంహరణ అయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు రెండు మూడు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈనెల 29న బంగాళాఖాతం మీద, దక్షిణ ద్వీపకల్ప భారతదేశం మీదుగా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భావిస్తోంది. వీటి ప్రభావంతో ఆగ్నేయ ద్వీపకల్ప భారతంలో ఈనెల 29 నుంచి ఈశాన్య రుతుపవన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రానికి ఈశాన్య, తూర్పు దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు తప్ప ఎలాంటి హెచ్చరికలు లేవని చెప్పింది. -
అండమాన్ సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం
-
మూడురోజుల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుప వనాల ఉపసంహరణ పూర్తికాగా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతోపాటు బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి కూడా రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. రానున్న మూడురోజులు మెజార్టీ ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ పూర్తయ్యేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఈ నెల 18న ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రెండ్రోజులు ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబా బాద్, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రెండ్రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉష్ణోగ్రతలు సాధారణస్థితిలోనే ఉంటాయని వివరించింది. -
Telangana: మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాల సీజన్ మొదలైనప్పటికీ నైరుతి రుతుపవనాలు ఇంకా రాష్ట్రం నుంచి ఉపసంహరణ కాలేదు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు నమోదవుతాయని, బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమో దుకావొచ్చంది. కొన్నిచోట్ల 7 సెంటీమీటర్లకు పైబడి వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. -
HYD: హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలో వర్షం మళ్లీ మొదలైంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, యూసఫ్‌గూడ, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, ఉప్పల్, బోడుప్పల్, బేగంపేట్, సికింద్రాబాద్, ఆల్వాల్.. ఇలా చాలా చోట్ల సోమవారం పొద్దుపొద్దున్నే చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వాన పడుతోంది. ఆకాశం భారీగా మేఘావృతం అయి ఉండడంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. దసరా సెలవుల తర్వాత విద్యాసంస్థలు మొదలు అవుతుండడం, మరోవైపు ఆఫీస్ వేళలు కావడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం సైతం ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. శనివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం.. నగరాన్ని ముంచెత్తింది. అయితే ఆదివారం కాస్త ఉపశమనం ఇవ్వడంతో వరుణుడి గండం తొలగిందని అంతా అనుకున్నారు. అయితే.. మరో రెండు రోజులపాటు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్ష ప్రభావం కనిపిస్తోంది. కామారెడ్డి, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు అధికారులు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు (ఆది, సోమ) పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రానికి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వెల్లడించింది. ఈ గాలుల ప్రభావంతో దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. -
మళ్లీ ముసిరిన వాన
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంపై వాన ముసురుకుంది. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలూ నమోదయ్యా యి. దసరా పండుగ రోజూ మధ్యాహ్నం నుంచి వాన ప్రతాపం చూపించింది. దీనితో సాధారణ జనజీవనం స్తంభించింది. ప్రజలు ఇళ్లకే పరిమి తమయ్యారు. నైరుతి సీజన్ ముగిసి ఈశాన్య రుతుపవనా ల సీజన్ మొదలైనా.. రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంకా కొనసా గుతోందని వాతావరణ నిపుణు లు తెలిపారు. దీనికితోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం మధ్యా హ్నం మొదలైన వాన లు మధ్యలో కాస్త తెరిపినిస్తూ.. గురువారం రాత్రి వరకు కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లో అత్యధికంగా 12.18 సెంటీమీటర్లు, చుక్కాపూర్లో 11.70 సెంటీమీటర్లు వర్షపాతం నమోంది. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట్ జిల్లాలతోపాటు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో చాలాచోట్ల భారీ వర్షం పడింది. హిమాయత్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరగడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్ (గండిపేట)కు వరద వస్తోంది. పాలమూరులోని రాయచూర్ రహదారిపై వర్షపునీటిలో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు తడిసిముద్దయిన పాలమూరు కుండపోత వానలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో తడిసి ముద్దయింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో ఇళ్లు నీట మునిగాయి, రోడ్లపై భారీగా వరద నిలిచింది. బండర్‌పల్లి వాగు పొంగడంతో మహబూబ్ నగర్–రాయచూర్ ప్రధాన రహదారి భారీగా వరద చేరింది. జిల్లావ్యాప్తంగా సగటున 3.13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో వందల ఎకరాల పంటలు నీటమునిగాయి. ఇక నాగర్‌కర్నూల్ జిల్లాలో దుందుభి, నల్లవాగు, పెద్దవాగు ప్రమాదకర స్థాయిలో పారు తున్నాయి. భారీగా పంటలకు నష్టం జరిగింది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి చెరువుకు గండిపడింది. మంత్రి నిరంజన్‌రెడ్డి నీట మునిగిన పంటలు, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ధారూరు మండలం నాగారం వాగులో కొట్టుకుపోయిన కారు వికారాబాద్‌లో కుండపోత వికారాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి మొదలైన వాన గురువారం రాత్రివరకు కురుస్తూనే ఉంది. దీనితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొడంగల్‌లో చెరువు కట్ట తెగిపోవడంతో కుమ్మరి గేరి, బాలాజీనగర్ కాలనీలు నీట మునిగాయి. మరికొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. మూసీ, కాగ్నా, వాటి ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. ధారూరు మండలం నాగరం సమీపంలోని వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. కొంతదూరంలో కారు చెట్టుకు తట్టుకోవటంతో అందులోని ఇద్దరు చెట్లకొమ్మలు పట్టుకుని బయటపడ్డారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గీలో మహాదేవలింగేశ్వర స్వామి ఆలయం నీట మునిగింది. వికారాబాద్ జిల్లా జీవన్గీలో మహాదేవలింగేశ్వర స్వామి ఆలయాన్ని చుట్టుముట్టిన కాగ్నానది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ.. రెండు రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. దసరా వేడుకలకు ఇబ్బంది ఎదురైంది. మధిరలో రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఏన్కూరు, సత్తు పల్లి, నేలకొండపల్లి మండలాల్లోనూ రహదారులపై వరద పారింది. వర్షాలతో పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటి ల్లుతోందని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనూ చాలా ప్రాంతాల్లో వానలు పడ్డాయి. వాన ధాటికి కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన సగ్గిల శ్రీనివాస్ ఇల్లు కూలిపోయింది. మరో 2 రోజులూ వానలు కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, విదర్భ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా మరో రెండు రోజులు వానలు కురుస్తాయ ని వాతావరణ శాఖ తెలిపింది. వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు.. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. -
Telangana Rain Alert: రానున్న మూడురోజులు అతిభారీ వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడురోజులు అక్కడక్కడ అతిభారీ వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తు తం రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ ద్రోణి బికనీర్, కోటా, రైసెన్, రాయ్‌పూర్, దిఘా మీదుగా ఆగ్నేయ దిశ నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉంది. ఇది సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉపరితల ద్రోణికి అనుబంధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లోని ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి సగటున 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వివరించింది. ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో గత రెండ్రోజులుగా భారీ వర్షా లు నమోదవుతుండగా.. రానున్న మూడు రోజులు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి సీజన్ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్టు తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు మరింత జోరందుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల రెండో వారంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి, అతిభారీ, అత్యంత భారీ వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం నైరుతి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 40.42 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయానికి 74.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సగటు సాధారణ వర్షపాతం కంటే 84 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఇక నైరుతి సీజన్ పూర్తయ్యే నాటికి రాష్ట్రవ్యాప్తంగా 72.5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటికే అంతకు మించి వర్షపాతం నమోదు అయింది. ఈ నేపథ్యంలో సీజన్ ముగిసే నాటికి రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని వెల్లడించింది. చాలాచోట్ల వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర – దక్షిణ ద్రోణి మంగళవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా కొమరం ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతుంది. తమిళనాడు కోస్తాతీరం, పరిసర ప్రాంతాల్లోని ఆవర్తనం, మంగళవారం ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలోని పశ్చిమ మధ్య, పరిసర ప్రాంతాల్లోని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, రాష్ట్రంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా మంగళపల్లెలో 12.5 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా తూఫ్రాన్‌పేటలో 8.3 సెంటీమీటర్లు, కందువాడలో 7.5 సెంటీమీటర్లు, ఇల్లెందులో 7.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉంది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది -
IND VS WI: మూడో వన్డేకు పొంచి ఉన్న వాన గండం..!
విండీస్‌తో 3 వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని జోరుమీదున్న టీమిండియాకు వరుణుడు అడ్డుకట్ట వేసేలా ఉన్నాడు. ఇవాళ (జులై 27) ట్రినిడాడ్ వేదికగా జరుగబోయే మూడో వన్డేకు వాన గండం పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్నటి నుంచే మ్యాచ్‌కు వేదిక అయిన పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఆకాశం మేఘావృతమైందని, మ్యాచ్ సమయానికి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్‌లో పేర్కొంది. దీంతో మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఒకవేళ మ్యాచ్ మొదలైనా మధ్యమధ్యలో వరుణ ఆటంకాలు తప్పవని, 50 ఓవర్ల ఆట సాధ్యమయ్యే అవకాశాలు చాలా తక్కువని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు తప్పి, 50 ఓవర్ల పాటు సజావుగా సాగాలని టీమిండియా కోరుకుంటుంది. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి కాన్ఫిడెంట్‌గా ఉన్న ధవన్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి విండీస్‌ను వైట్‌వాష్ చేయాలని భావిస్తుంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లో చివరి వరకు పోరాడి ఓడిన విండీస్ సైతం ఈ మ్యాచ్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకుంటుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక జట్ల విషయానికొస్తే.. టీమిండియా ఈ మ్యాచ్‌లో రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా తుది జట్టులోకి రావచ్చు. మరోవైపు విండీస్ రెండో వన్డేలో కొనసాగించిన జట్టునే కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ తప్పించాల్సి వస్తే గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న అకీల్ హొసెన్పై వేటు వేసే ఆస్కారం ఉంది. చదవండి: Ind Vs WI: విండీస్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! -
తెలంగాణకు అతిభారీ వర్షాల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలతో పాటు సంబంధిత విభాగాల అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు పడే అవకాశం ఉంది. ► గత వర్షాలు-వరదల నుంచి కోలుకుంటున్న టైంలోనే హఠాత్తుగా భారీ వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో శుక్రవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో.. నగరం బీభత్సంగా మారింది. ► తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ కాగా, వరినాట్ల పనులకు వెళ్లే కూలీలు పరిస్థితిని చూసుకుని ముందుకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. ► ఇక ఏపీలోనూ పలు ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉండడం రాష్ట్ర విపత్తు శాఖ అప్రమత్తం అయ్యింది. ► తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు.. పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ► నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జూలై 26వ తేదీ వరకు ప్రకటించింది. ► చాలా ప్రాంతాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండగా.. రహదారులతో పాటు రోడ్లు కాలనీలు సైతం మునిగిపోయాయి. ► రోడ్లపై నీళ్లు నిలిచిపోవడం, మ్యాన్‌హోల్స్ తెరిచి ఉండడం, ట్రాఫిక్ జామ్ సమస్య, అతివేగంతో వెళ్లి రోడ్లపై జారి పడే ప్రమాదం, కరెంట్ ప్రమాదాలు.. ఇలా పలు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు సంబంధిత అధికారులు. ► జడివానలోనూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటూ.. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూస్తున్నారు. వరంగల్‌లో విషాదం వరంగల్: వర్షానికి మండీబజార్‌లో ఓ పాత భవనం కూలిపోయింది. పాత భవనం కూలి.. పక్కనే ఉన్న షెడ్‌పై పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో మహిళ గాయపడగా.. చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ► తెలంగాణలో పలు జిల్లాల్లో 20 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదు అయ్యింది. మెదక్, జనగామ, మహబూబాబాద్, సంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. మెదక్ పాతూరులో అత్యధికంగా 26 సెంమీ వర్షపాతం నమోదు అయ్యింది. ► యాదాద్రి.. గుండాల-నూనెగూడెం బ్రిడ్జి మీద నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిపేశారు అధికారులు. ఆలేరు మండలంలో రత్నవాగు ప్రవాహం ఎక్కువ అవుతోంది. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ► సూర్యాపేట జి.కొత్తపల్లి వద్ద పాలేరు వాగు ప్రవాహం ఉధృతంగా ఉంది. వాగు అవతలి 22 మంది వ్యవసాయ కూలీలు చిక్కుకుపోయి.. రాత్రంతా పొలం గట్లపైనే గడిపారు. పడవ సాయంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్లందరినీ రక్షించారు. ఇక జనగామ చీటూరు-గోపు వాగులో చిక్కుకున్న 14 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇదీ చదవండి: మళ్లీ ముసురుకుంది.. అలర్ట్‌గా ఉండండి- సీఎం కేసీఆర్ -
హైదరాబాద్ ప్రజలకు ముఖ్యగమనిక
సాక్షి, హైదరాబాద్: నగర ప్రజలకు కీలక సూచన చేశారు ట్రాఫిక్ పోలీసులు. నగరంతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల ఇవాళ ఉదయం నుంచి వాన దంచికొడుతోంది. ఆగి ఆగి కొడుతున్న వానతో జనం ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇయ్యాల(శుక్రవారం), రేపు(శనివారం) భారీ వర్షాలు ఉంటాయని చెప్పింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతోంది జీహెచ్ఎంసీ. అలాగే వర్షం తెరిపి ఇవ్వగానే ఆగమాగం బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు ట్రాఫిక్ పోలీస్ విభాగం. కొద్ది సమయం తర్వాతే బయటకు రావాలని.. అప్పుడే ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడొచ్చని తెలిపారు. భారీ వర్షాలతో నగరం రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉంది. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవచ్చు కూడా. అందుకే నిమ్మలంగా బయటకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు. అలాగే.. విద్యార్థులు, వ్యాపారాలు చేసుకునేవాళ్లు, ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో పలు జిల్లాలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. Today #HyderabadRains In #Charminar 🌧️🌊 #TelanganaRains #TelanganaRain #HyderabadRain #CharminarRain #TelanganaFloods #HyderabadFloods pic.twitter.com/rPvUvoJTZl — SYED SARWAR (@sab_kee_jaan) July 22, 2022 #Telangana Rainfall Forecast:22JULY 👉 Due to U.A.C over Odisha, Entire Telangana will See Widespread Rains.(Some Heavy/Very Heavy Over East & South Telangana Districts)#HyderabadRains:100% 👉Heavy Rains expected During Afternoon -Early Morning. pic.twitter.com/2C2tjrvgyq — Hyderabad Rains (@Hyderabadrains) July 22, 2022 -
Telangana: నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి 4.5 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. బుధవారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదయ్యాయని పేర్కొంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 22.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రానున్న రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. -
Telangana: అక్కడక్కడా భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రుతుపవ నాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు పడమర ద్రోణి ఉత్తర మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా దక్షిణ ఒడిశా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళా ఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి విస్త రించి ఉంది. దీంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపు లతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గత 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 11 సెంటీమీటర్లు, అశ్వా పురంలో 10 సెంటీమీటర్లు, దుమ్ముగూడెంలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
నేడు పలుచోట్ల భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్రమట్టం వద్ద ఉన్న ఉపరితల ద్రోణి మంగళవారం బలహీనపడింది. దీంతో కిందిస్థాయి గాలులు నైరుతి దిక్కు నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో బుధవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్నిచోట్ల రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. ఇదిలావుండగా, గత 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లలో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. గోవిందరావుపేట, భీమినిలలో 11 సెంటీమీటర్లు, ఘన్పూర్, తాడ్వాయి, భీమదేవరపల్లిలలో 10 సెంటీమీటర్లు, జగిత్యాల, ధర్మసాగర్, చేవెళ్ల, దిండిగల్, చిగురుమామిడి, ఖానాపూర్, చెన్నారావుపేట, హసన్‌పర్తి ప్రాంతాల్లో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
Telangana Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు..!
-
Telangana: రెండు రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశంఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి అంతర్గత తమిళనాడు వరకు కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ద్రోణి ఆదివారం విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 3.4 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదైంది. వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 19వ తేదీ నాటికి 8.28 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 5.76 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. రాష్ట్రంలోని 2 జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం ఉండగా... మరో 20 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. 7 జిల్లాల్లో సాధారణ, 2 జిల్లాల్లో అధికం, మరో రెండు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం రుతుపవనాలు రాష్ట్రమంతటా వ్యాప్తి చెందుతుండటంతో త్వరలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. -
తెలంగాణలో భారీ వర్షాలు నీట మునిగిన కాలనీలు
-
హైదరాబాద్ లో భారీ వర్షం
-
ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. రెండు, మూడు రోజుల్లో..
సాక్షి, అమరావతి: రాయలసీమలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు నెమ్మదిగా రాష్ట్రమంతా విస్తరిస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలకు, తర్వాత నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్రలో విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాయలసీమలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. కోస్తా జిల్లాల్లో మాత్రం పలుచోట్ల ఎండల తీవ్రత కొనసాగుతోంది. చదవండి: AP: అందరి చూపు మనవైపే.. దేశంతోనే పోటీ పడుతున్నాం.. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడుతున్నా, ఎక్కువ ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దిలా ఉండగా మంగళవారం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 41 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జాజులకుంటలో 34, అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గాదిరాయిలో 22.5, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం మంగోలులో 21, పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో 13.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కొండాయిగూడెంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
అగ్ని‘గుండం’.. రామగుండంలో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మంగళవారం మండిపోయింది. అత్యధికంగా రామగుండంలో 44.8డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 43.8డిగ్రీలు నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణల మీదుగా రాయలసీమ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాగల మూడు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
ఢిల్లీలో గాలివాన దుమారం
-
మరో ఐదురోజుల్లో రుతుపవనాలు ఏపీలో ప్రవేశించే అవకాశం
-
ఇక భగభగలు...
సాక్షి, విశాఖపట్నం/అనకాపల్లి: నడి వేసవిలో వచ్చిన అసని తుఫాన్ ఆ రోజుల్లో చల్లదనం పంచినా.. ఇప్పుడు మాత్రం దాని ప్రభావంతోనే భానుడు భగభగమంటున్నాడు. వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి మొత్తం అసని తుఫాన్ ఊడ్చేయడంతో.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సూర్యుడు నడి నెత్తిన చుర్రుమంటున్నాడు. అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల్ని విలవిల్లాడేలా చేస్తున్నాయి. భానుడి భగభగలకు తోడుగా.. వేడి గాలులు వీస్తుండటంతో..సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా విశాఖ నగరం, అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాలు ఉడికిపోయాయి. మిట్టమధ్యాహ్న సమయంలో వేడిగాలులు సెగపుట్టించాయి. ఈ పరిస్థితులు ఇకపై కొనసాగుతాయని దీనికి తోడు రోహిణి కార్తెలు సమీపిస్తున్న నేపథ్యంలో మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మే 25 నుంచి రోహిణి కార్తెలు మొదలై.. జూన్ 8 వరకూ కొనసాగనున్నాయి. ప్రజలంతా.. -
రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు
-
రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అసని తుపాను ప్రభావం రాష్ట్రంపై లేకున్నా వాతావరణంలో మార్పులు జరుగుతాయ ని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గొచ్చని, రానున్న మూడ్రోజులు చాలా చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు, కొన్నిచోట్ల సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందంది. సోమవారం ఆదిలాబాద్‌లో గరిష్టంగా 42.2 డిగ్రీలు, హకీంపేట్‌లో కనిష్టంగా 23.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. -
అలర్ట్: వర్ష సూచన.. ఆ సమయంలో ఇళ్లలోంచి బయటకు రాకండి
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజుల్లో నగరంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నగరంలో గరిష్టంగా 39.2 డిగ్రీలు, కనిష్టంగా 29.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని ప్రకటించింది. 20న ‘మ్యూజియం’ ఉచిత సందర్శన చార్మినార్: అంతర్జాతీయ మ్యూజియం వారోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 20న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాలార్జంగ్ మ్యూజియం తెరిచి ఉంటుందని... ఆ రోజు చిన్నారులు, అనాథ పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ ఎ.నాగేందర్ రెడ్డి తెలిపారు. ఉచిత ప్రవేశం కోసం ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు లిస్టు అందజేయాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: ఇలా ఎన్ని పేర్లు మారుద్దాం? -
Telangana Weather: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ పరిస్థితులు నెలకొన్నాయి. మరో నాలుగు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, అప్రమ్తతంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు చోట్ల గరిష్టంగా 47 డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రాష్ట్రంలో వడగాడ్పులు, తీవ్ర ఉక్కపోతతో జనం కుతకుతలాడుతున్నారు. రాత్రిపూట కూడా ఉక్కపోతగా ఉంటుండటంతో ఇబ్బందిపడుతున్నారు. సాధారణంగా మే నెలలో మధ్యలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయికి చేరుతాయి. కానీ నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని.. ఇదే పరిస్థితి ఇంకొన్నిరోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్‌లలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. చెదురుముదురు వర్షాలు ఇక తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రెండు మూడు రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయాచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. -
వేడెక్కుతున్న మన్యం
సాక్షి,పాడేరు : చల్లని ప్రాంతమైన జిల్లాలో ఎండ తీవ్రత నెలకొంది. శుక్రవారం సూర్యోదయం తరువాత నుంచి ఎండ చుర్రుమంది. పాడేరులో 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఏజెన్సీ వ్యాప్తంగా ఎండ తీవ్రత నెలకొనడంతో అన్ని వర్గాల ప్రజలు ఉష్ణ తాపంతో ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ, ఉపాధిహామీ పనులకు వెళ్లే గిరిజనులతో పాటు పశువుల కాపరులు కూడా అధిక ఎండతో అవస్థలు పడ్డారు. పాడేరు వారపుసంతలో కూడా ఎండతో గిరిజనులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం వరకు వేడిమి వాతావరణం నెలకొంది. మండల కేంద్రాలు ప్రధాన జంక్షన్లు, గ్రామాల్లో శీతల పానీయాల అమ్మకాలు జోరందుకున్నాయి. -
4 రోజులు 40 డిగ్రీలకుపైనే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయ్. సోమవారం 40 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపరితల ద్రోణి ప్రభావం, పలుచోట్ల కురిసిన తేలికపాటి వానలతో వాతావరణం చల్లబడటంతో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 39 డిగ్రీల మధ్యనే నమోదయ్యాయి. వాతా వరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతల పెరుగుదల వేగంగా కనిపిస్తోంది. సోమవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా ఆదిలాబాద్‌లో 43.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సగటున 40డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతాయని అంచనా వేసింది. కాగా, ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరఠ్వాడల మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. -
అగ్నిగుండంలా అనకాపల్లి
అనకాపల్లి: భానుడు సెగలు కక్కుతున్నాడు. ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో 40.5 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఎండవేడి, ఉక్కపోత కారణంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం భయపడుతున్నారు. సాయంత్రం యలమంచిలి పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, చిరుజల్లులు పడడంతో వాతావరణం చల్లబడింది. -
మండే కాలం
సీతంపేట: ఎండలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. దీంతో రోజువారీ నమోదయ్యే ఉష్ణోగ్రతల్లో భారీగా తేడా కనిపిస్తోంది. సగటు ఉష్ణోగ్రత 35 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుండడంతో బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండడంతో వాతావరణం వేడెక్కిపోతోంది. సాయంత్రం 4 గంటల వరకు ఇదే పరిస్థితి ఉండడంతో ప్రజలు ఉక్కపోతతో బాధపడుతున్నారు. మరికొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రాణపాయం లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఎండల్లో తిరిగితే సన్(హీట్) స్ట్రోక్ (వడదెబ్బ), హీట్ సింకోప్(తల తిరగడం), హీట్ ఎక్సాషన్( అలసట), హీట్ క్రాంప్స్(కండరాలు, పిక్కలు లాగడం)తో పాటు పలు చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ ప్రమాదకరం.. ప్రజలు వేసవిలో ఎక్కువగా వడదెబ్బ బారిన పడతా రు. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ఎండలో ఎక్కువసేపు తిరిగి, తగినంత లవణాలున్న నీరు తీసుకోకపోతే అపస్మారక స్థితికి చేరుతారు. తీవ్ర జ్వరం, మూత్రం రాకపోవ డం వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బకు గురైనట్లు తొలుత గుర్తించాలి. కొందరిలో ఫిట్స్ లక్షణాలు కూడా కనిపిస్తుండడం గమనార్హం. పార్కిన్సన్(తల ఊపడం) వ్యాధికి సంబంధించి మందులు వాడే వా రు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. బయట ఆహారం తీసుకోవడం ద్వారా డయేరియా సోకే అవకాశం ఉంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల కిడ్నీలపై కూడా ప్రభావం పడుతుంది. శరీరమంతా యాసిడ్ ఏర్పడి అవయవాలపై ప్రభా వం చూపుతాయి. అధిక వేడిమితో చమట కాయలు రావడం, గడ్డలు కట్టడం, సన్‌బర్న్ (చర్మం కమిలిపోవడం) వంటి సమస్యలు వస్తాయి. శరీరంపై దద్దుర్లు సైతం ఏర్పడతాయి. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి.. ఎండ కారణంగా స్పృహ కోల్పోయి పడిపోయిన వ్యక్తులకు చల్లటి గాలి తగిలేలా ఫ్యాన్ లేక కూలర్ ముందు సేదతీరేలా చేయాలి. తడిగుడ్డతో శరీరం తుడవాలి. తర్వాత దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఐవీ ప్లూయిడ్స్ ఇవ్వడంతో పాటు ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి. దీని ద్వారా మనిషి ప్రాణాపా య స్థితి నుంచి గట్టెక్కుతాడు. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. ♦సాధ్యమైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగరాదు. ♦ఎటువంటి కార్యక్రమాలనైనా ఎండ తక్కువగా ఉన్న సమయాల్లో చేసుకోవాలి. ♦కాటన్, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ♦జీన్స్, బ్లాక్ షర్టులు వేసుకోకపోవడం మంచిది. ♦బయటకు వెళ్లేటప్పుడు టోపీ, గొడుగును వెంట తీసుకెళ్లాలి. ♦శరీరానికి ఎండ తగలకుండా దుస్తులు ధరించాలి. ♦సన్‌స్క్రీన్ లోషన్లు వాడడం మంచిది. ♦తరచుగా నీరు, లవణాలు తీసుకోవాలి. ♦నీటితో పాటు కొబ్బరి బొండాలు, కాయగూరలు, పండ్లు తీసుకోవాలి. ♦కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ♦రోడ్లపై విక్రయించే, వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. ♦ఆయిల్ ఫుడ్, టీ, కాఫీ వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. అప్రమత్తంగా ఉండాలి.. వేసవిలో అప్రమత్తంగా ఉండాలి. ఎండల్లో తిరగకూడ దు. ఎండలోకి వెళ్లినప్పుడు తప్పనిసరిగా గొడుగు వేసుకోవాలి. వాటర్ బాటిల్ వెంట తీసుకువెళ్లాలి. మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటివి తీసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించడం చాలా మంచిది. –బి. శ్రీనివాసరావు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ, సీతంపేట, ఐటీడీఏ -
వడదెబ్బ.. తస్మాత్ జాగ్రత్త
మంచిర్యాలటౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మార్చి మాసంలోనే ఎండలు తీవ్రంగా మండుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరిగి పోతుండడంతో బయటకు వెళితే ముచ్చెమటలు పడుతున్నాయి. ఇక వచ్చేది ఏప్రిల్, మే నెలల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో, ఎండలపై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రత నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరగనున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారినపడి చిన్నా,పెద్దా అల్లాడిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అసలు వడదెబ్బ అంటే ఏమిటి? దాని లక్షణాలు... నివారణ మార్గాలు మీ కోసం. వడదెబ్బ అంటే.. ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైతే శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై ప్రాణాపా య పరిస్థితి ఏర్పడడాన్ని వడదెబ్బ అంటారు. వేడి వాతావరణం లేదా చురుకైన పనులతో కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలతో శరీర ప్రాథమిక అవయవాలు విఫలమయ్యేలా చేస్తుంది. లక్షణాలివీ... కాళ్ల వాపులు రావడం, కళ్లు తిరగడం, శరీర కండరాలు పట్టుకోవడం, తీవ్ర జ్వ రం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక చెమట పట్ట డం, తల తిరిగి పడిపోవడం వంటి వి జరిగితే వెంటనే స్థానిక ఆసుపత్రికి త రలించి వైద్యం అందించాలి. ప్రాథమిక చికిత్స ►వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడకు తీసుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్‌తో ఒళ్లంతా తుడవాలి. వదులుగా ఉన్న నూలు దుస్తులు వేయాలి. ►ఫ్యాను గాలి/ చల్లని గాలి తగిలేలా ఉంచాలి. ►ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరిబోండాం లేదా చిటికెడు ఉప్పు, చక్కర కలిపిన నిమ్మరసం, గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణము (ఓ.ఆర్.ఎస్) తాగించవచ్చు. ►వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలి. బారిన పడకుండా ►వేసవి కాలంలో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది. రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి. భోజనం మితంగా చేయాలి. ►ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీడన/చల్లని ప్రదేశంలో ఉండేందుకు ప్రయత్నించండి. ►గుండె/ఊపిరితిత్తులు/మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారి శరీరాలకు అధిక సూర్యరశ్మి ప్రభావించే వారి శరీరం త్వరగా డీ హైడ్రేషన్‌కు గురై వ్యాధి తీవ్రతలు అధికంగా ఉంటాయి. ►ఆల్కాహాల్/సిగరేట్/కార్పొనేటెడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. ►ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్, తలకు టోపీ వంటివి ధరించండి. ►వేసవిలో ఉదయం/సాయంత్రం సమయాల్లో బయటికి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. ►వేడి వాతావరణంలో శారీరక శ్రమ కార్యక్రమాలు చేయడం మంచిది కాదు. ఒకవేళ చేస్తే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఒక 5 నిమిషాలు నీడలో ఉండేలా చూసుకోవాలి. ►ఆహారంలో ఎక్కువగా ద్రవపదార్థాలు ఉండేలా చూసూకోవాలి. ►ప్రయాణాల్లో సోడియం, ఎలక్ట్రోలైట్ వంటి ద్రావణాలను తాగడం మంచిది. చేయకూడని పనులు ►మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదు. ►రోడ్లపై చల్లని రంగు పానీయాలు తాగవద్దు. ►రోడ్లపై విక్రయించే కలుషిత ఆహారం తినకుండా, ఇంట్లో వండుకున్నవే తినాలి. ►మాంసాహారం తగ్గించి, తాజా కూరగాయల్ని ఎక్కువగా ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం మేలు ►నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చ, కీర, కర్బూజ, తాటి ముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో కడుపు నిండినట్లుగా ఉండి, డైట్ కంట్రోల్ అవుతుంది. ►శీతల పానీయాలు, అధికంగా షుగర్ వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా, కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. ►వేసవిలో ఆకలి తక్కువగాను, దాహం ఎక్కువగాను ఉంటుంది. డైట్ పాటించాలి. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి. అత్యవసరమైతేనే బయటకు.. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడం ఒక్కటే వడదెబ్బ నివారణకు ఏకైక మార్గం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అత్యవసరం అయితే మాత్రమే తలకు టోపి ధరించి వెళ్లాలి. చెమట రూపంలో శరీరంలోని లవణాలు బయటకు పోతాయి. అందుకే లవణాలతో కూడిన ద్రవాన్ని తీసుకోవాలి. కొబ్బరి నీరు, ఉప్పు, చెక్కర, నిమ్మరసంతో కలిపిన నీటిని తాగాలి. – డాక్టర్ కొమ్మెర వినయ్, జనరల్ ఫిజిషీయన్, జిల్లా ఆసుపత్రి వైద్యుడు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలను ఎండ వేడికి బయటకు పంపించవద్దు. 3 లీటర్లకు పైగా నీటిని తాగాలి. నవజాత శిశువులను పూర్తిగా కప్పి ఉంచకుండా, పల్చటి గుడ్డతో సగం వరకు కప్పి ఉంచాలి. పుట్టిన బిడ్డకు 6నెలల వరకు తల్లిపాలనే ఇవ్వాలి. ఇంట్లోనే ఉండే పిల్లలకు వేడి తగలకుండా, చల్లగా ఉండేలా జాగ్రత్తలను తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులను వేయాలి. కాచి చల్లార్చిన నీరు, ఫిల్టర్ నీటినే పిల్లలకు ఇవ్వాలి. – డాక్టర్ బొలిశెట్టి కళ్యాణ్‌కుమార్, పిల్లల వైద్యుడు, జిల్లా ఆసుపత్రి -
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
-
ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్
-
పెరగనున్న చలి గాలుల తీవ్రత: వాతావరణ శాఖ
-
వాయు గుండం ప్రభావం: భారీ నుంచి అతి భారీ వర్షాలు..
AP Rain Forecast: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి - చెన్నై సమీపంలో తీరందాటిందని తెలిపింది. అయితే, వాయు గుండం ప్రభావంతో.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ సమీపంలో విస్తారంగాను, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో.. తీరంవెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. వేటకు వెళ్లకూడదని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు. కాగా, ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహయ కార్యక్రమాలు చేపట్టాయని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. (చదవండి: కాకినాడ యాంకరేజి పోర్టు: ఎక్స్‌పోర్ట్‌లో నెంబర్ 1 ) -
తెలంగాణకు తెలికిపాటి వర్షాలు
-
నెల్లూరు, తిరుమలలో కుండపోత వర్షం..
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవగా, నెల్లూరు, తిరుమలలో కుండపోతగా కురిశాయి. నెల్లూరులో.. గంటపాటు ఆగకుండా వాన పడటంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. నగరంలోని నర్తకి, కనకమహల్, గాంధీబొమ్మ, వీ ఆర్ సి, ముత్తుకూరు బస్టాండ్, హరనాథపురం సెంటర్లలో రోడ్లపైకి వర్షపునీరు వచ్చేయటంతో పాదచారులు, వాహన చోదకులు అవస్థలు పడ్డారు. అయితే, ఎండవేడి, ఉక్కపోతతో అల్లాడి పోతున్న జనం వర్షాలతో వాతావరణం చల్లబడి హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో.. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటుగా దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు తడిసిముద్దయిపోతున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాఢ వీధులు, లడ్డూ వితరణ కేంద్రాల్లో వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో వర్షపు నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు టిటిడి సిబ్బంది. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో, మొదటి, రెండవ ఘాట్ రోడ్డులలో ప్రయాణించే ప్రయాణికులను అప్రమత్తం చేస్తోంది టిటిడి విజిలెన్స్. కాగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించడంతో ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. చదవండి: పర్యాటకానికి 'జల'సత్వం -
విస్తరిస్తున్న అల్పపీడనం.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన
సాక్షి ,మహారాణిపేట (విశాఖ దక్షిణ): తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం విస్తరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కూడా ఏర్పడింది. రాగల 24 గంటల్లో దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకుంటుంది. అల్పపీడనం కారణంగా గంటకు 40- 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్లు వంగి ఉంది. అలాగే తూర్పు–పడమర ద్రోణి సగటు సముద్రమట్టం కంటే 4.5, 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య విస్తరించి ఉంది. ఇప్పుడు అల్పపీడనానికి సంబంధించి ఉపరితల ఆవర్తనం గుండా వెళుతోంది. ఇది లక్షద్వీప్ ప్రాంతం, ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ అరేబియా సముద్రం మధ్య బంగాళాఖాతం ఉత్తర భాగంలో ఉన్న ఇతర అల్పపీడనం ప్రాంతంతో సంబంధం కలిగి ఉందని వాతావరణ కేంద్ర అధికారులు చెప్పారు. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఏపీలో పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చదవండి: ఆర్టీసీ బస్సుకు నిప్పంటించిన యువకుడు! -
రేపు అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపు(ఆదివారం) అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రేపు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణ దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. చదవండి: Heavy Rain: హైదరాబాద్‌లో ఉరుములు.. మెరుపులు.. -
Telangana: మరో రెండు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతోనే గురు, శుక్రవారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
రోడ్లు జలమయం.. భారీగా నిలిచిన ట్రాఫిక్
-
తెలంగాణలో జడివాన.. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని వానలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా భారీ వర్షాలతో జిల్లాలు అతలాకుతలం అవుతుండగా.. మరో 3,4 రోజులు కుండపోత వానలు కురవనున్నాయి. ఉత్తర తెలంగాణతో పాటు ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల ఊర్లకు ఊర్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లు నీటమునిగాయి. రహదారులు, వంతెనలపై వరద ప్రవాహాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆది, సోమవారాల్లో వరదలో కొట్టుకుపోయి.. నలుగురు మృతిచెందగా, మరికొందరు గల్లంతయ్యారు. హైదరాబాద్‌లో ఆరెంజ్ అలర్ట్ హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం నుంచే వానలు పడుతున్నాయి. వాతావరణం పూర్తిగా మేఘావృతమైంది. సోమవారం కుత్బుల్లాపూర్, షాపూర్‌నగర్‌లలో 4.1, కంచన్‌బాగ్‌లో 4 సెంటీమీటర్ల వర్షం పడింది. మరిన్ని రోజులు వానలు పడే నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి.. లోతట్టు, ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. రానున్న ఐదు రోజుల్లో.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మరికొద్దిరోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్నిప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్ధిపేట, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీగా.. మంచిర్యాల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. మూడు, నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. అప్రమత్తంగా ఉండండి: సీఎస్ రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణశాఖ సూచనలకు అనుగుణంగా.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నీటి పారుదల, విద్యుత్ శాఖల అధికారులు జాగ్రత్తగా పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగులు పని ప్రదేశంలోనే అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎక్కడికక్కడ పరిస్థితులను నిశితంగా పరిశీలించాలని.. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వానలు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం, బెజ్జూర్, సిర్పూర్(టి), తిర్యాణి, ఆసిఫాబాద్ మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు కుండపోత కురిసింది. దహెగాం మండలంలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమురంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండటంతో మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు జడివాన కురిసింది. ఖిలా వరంగల్‌లో ఏకంగా 14 సెంటీమీటర్లు, లింగాల ఘన్పూర్, పాలకుర్తిలలో 12.3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. వరంగల్ నగరంలోని 33 కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లు, గుడిసెల్లోకి నీరు చేరడంతో సామగ్రి నీటమునిగింది. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా సగటున 7.9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. వాగులు పొంగిపొర్లుతున్నాయి. సుమారు ఏడు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సిద్దిపేట–హన్మకొండ మార్గంలో బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు వంతెనపై లారీ చిక్కుకుపోయింది. స్థానికులు లారీ డ్రైవర్‌ను రక్షించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సోమవారం భారీ వర్షాలు కురిశాయి. లోయర్ మానేర్ డ్యాం (ఎల్ఎండీ)కి భారీగా వరద వస్తుండటంతో 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సిరిసిల్ల నుంచి సిద్దిపేట రహదారి తంగళ్లపల్లి నీట మునిగి.. రాకపోకలు ఆగిపోయాయి. వేములవాడలో భారీ వర్షంతో రాజన్న ఆలయం ఎదుట భారీగా నీళ్లు నిలిచాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఐదు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో సింగితం రిజర్వాయర్, కౌలాస్, పోచారం ప్రాజెక్టులు నిండిపోయాయి. మద్నూర్ మండలంలో పెసర, మినుము పంటలు నీటమునిగాయి. ఇద్దరు మృతి.. మరో ఇద్దరు గల్లంతు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కుర్రారం శివారులోని దోసల వాగుదాటుతూ ఓ బైక్ వాగులో పడిపోయింది. ఆ బైకు నడుపుతున్న శ్రవణ్ బయటపడగా.. జనగామ జిల్లా చిన్నమడూరుకు చెందిన సింధూజ (26), రాజాపేట మండలం బొందుగులకు చెందిన హిమబిందు (23) వాగులో కొట్టుకుపోయారు. నిజానికి శ్రవణ్, సింధూజ, హిమబిందుతోపాటు సింధూజ తల్లిదండ్రులు, మరికొందరు బంధువులు కలిసి బొందుగుల గ్రామానికి వెళుతున్నారు. ఈ ముగ్గురూ బైక్‌పై వెళ్తుండగా మిగతావారు కారులో ఉన్నారు. ఆ కారు మొదట వాగు దాటింది. వెనకాల బైక్ మీద వస్తున్నవారు వాగులో పడిపోయారు. తమ కళ్లముందే ఇద్దరు యువతులు కొట్టుకుపోవడంతో.. కుటుంబ సభ్యులు, బంధువుల హతాశులయ్యారు. కాగా.. సోమవారం సాయంత్రం పారుపెల్లి వాగు సమీపంలో సింధూజ మృతదేహం లభించింది. హిమబిందు ఆచూకీ దొరకలేదు. హన్మకొండ కాకాజీ కాలనీలో వరద నీరు నిండటంతో డ్రైనేజీ ఉందని గుర్తించలేక ఓ యువకుడు మృతి చెందాడు. అతడిని వరంగల్ నగరంలోని శివనగర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఓరం క్రాంతికుమార్ (28)గా గుర్తించారు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం దానాపూర్‌కు చెందిన టేకం దోబీరావు (33) ఆదివారం అర్ధరాత్రి జండగూడ వాగులో గల్లంతయ్యాడు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేటకు భూపతిరెడ్డి, మరొకరితో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం వద్ద వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. కొంతదూరంలో చెట్టును పట్టుకుని నిలబడగా>.. స్థానికులు రక్షించారు. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం పారుపల్లి వాగు ప్రవాహంలో రాగుల బాలరాజు, చిన్నం బాలరాజు అనే గొర్రెల కాపరులు చిక్కుకుపోగా పోలీసులు వారిని కాపాడారు. సిద్దిపేట మండలం మిట్టపల్లి శివారులోని వాగులో ఓ కారు చిక్కుకుంది. అందులో ప్రయణిస్తున్న సిద్దిపేట వాసులు కూడవెళ్లి భాను, మురం భానులను పోలీసులు రక్షించారు. నవ వధువు కన్నుమూసింది వరుడి అక్క కూడా మృతి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. జిల్లాలోని మోమిన్‌పేట్ నుంచి రావులపల్లికి వస్తున్న పెళ్లికారు ఆదివారం సాయంత్రం తిమ్మాపూర్ వద్ద వరదలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. కారులో వధువు ప్రవళిక (19), వరుడు నవాజ్‌రెడ్డి, ఆయన అక్కలు రాధిక, శ్వేత, ఆమె కుమారుడు శశాంక్‌రెడ్డి, డ్రైవర్ రాఘవేంద్రరెడ్డి ఉన్నారు. వీరిలో నవాజ్‌రెడ్డి, రాధిక ఆదివారమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రవళిక, శ్వేతల మృతదేహాలు సోమవారం ఉదయం లభించాయి. శశాంక్‌రెడ్డి ఆచూకీ ఇంకా దొరకలేదు. పరారైన డ్రైవర్.. వాగులో కారు కొట్టుకుపోయిన కొంతసేపటికే డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి సురక్షితంగా బయటపడ్డాడు. ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన అతను.. భయంతో పరారయ్యాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు.. సోమవారం సాయంత్రం పట్టుకున్నారు. కాగా.. కారు కొట్టుకుపోయిన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్.. సోమవారం ఉదయమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రవళిక, శ్వేత మృతదేహాలను స్వయంగా తరలించారు. వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి వికారాబాద్ జిల్లా పులుమామిడి వద్ద ఆదివారం సాయంత్రం వాగులో కొట్టుకుపోయిన చాకలి శ్రీనివాస్ మృతిచెందాడు. ఘటనా స్థలానికి సమీపంలోని చెట్ల పొదల్లో సోమవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట–లింగన్నపేట మధ్య మానేరువాగు ఉప్పొంగి వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. సోమవారం సాయంత్రం కామారెడ్డి నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరద తాకిడికి వంతెనపై అదుపుతప్పింది. ఒక టైర్ కిందికి దిగి ఆగిపోయింది. త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్ సీటు పక్కన ఉండే కిటికీలోంచి ప్రయాణికులను రక్షించారు. -
ఏపీ: ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనం మీదుగా ఏర్పడిన రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఈ నెల 30,31 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయి. సోమవారం విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. గడిచిన 24 గంటల్లో సత్తెనపల్లిలో 8.3 సెం.మీ, కాకుమానులో 8.0, గుంటూరులో 7.9, రాజాంలో 7.5, నిజాంపట్నంలో 7.1, పొన్నూరులో 6.3, నాగాయలంకలో 5.8, మార్తూరులో 5.5, తెనాలిలో 5.4, తెర్లాంలో 5.3, నిడుబ్రోలులో 5.1, ఎస్.కోటలో 5.0 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇవీ చదవండి: గత టీడీపీ సర్కారు నిర్వాకం: వైద్య రంగంలో భారీ కుంభకోణం.. బడికి వెళ్లకుంటే.. వలంటీర్ వస్తారు! -
అల్పపీడనం: ఏపీలో రేపు భారీ వర్షాలు..
సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తులశాఖ పేర్కొంది. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉంటుందని.. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారుల సూచించారు. -
ఉపరితల ఆవర్తనం.. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు..
అమరావతి: పశ్చిమ,మధ్య బంగాళ ఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ప్రాంతీయ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో, కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే విధంగా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
అల్పపీడన ప్రభావంతో 48 గంటల్లో భారీ వర్షాలు
-
తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ వానలు
-
ఉత్తర కోస్తా, జార్ఖండ్, బిహార్ మీదుగా ఉపరితల ద్రోణీ
-
నేటి నుంచి ఏపీలో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ దిశ నుంచి కోస్తాంధ్ర మీదుగా గాలులు వీస్తుండటంతో కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు ఈ నెల 12న బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా మచిలీపట్నం, గుంటూరు మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫలితంగా ఆదివారం నుంచి కోస్తా, రాయలసీమల్లో అడపాదడపా వానలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. 13వ తేదీ తరువాత వర్షాలు ఊపందుకుంటాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాయలసీమలో ఒకట్రెండు చోట్ల, దక్షిణ కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. -
అల్పపీడనం ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉంటుంది
-
ఏపీ తెలంగాణాలో నేడు,రేపు విస్తారంగా వర్షాలు
-
అమెరికాలో భానుడి భగభగలు
వాషింగ్టన్ ‘మేము దుబాయ్‌లో ఉన్నామా? అమెరికాలో ఉన్నామా? మండే ఎండల్ని భరించడం ఎలా? ఎన్ని ఏసీలు వేసినా చల్లబడడం లేదేంటి?’ ఇప్పుడు పశ్చిమ అమెరికా నగరవాసుల్ని కదిలిస్తే ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎండవేడి తట్టుకోలేక జనం విలవిల్లాడిపోతున్నారు. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్, ఒరేగాన్, సలేమ్, సియాటిల్ నగరాల్లో ఎండలు దారుణంగా ఉన్నట్టు నేషనల్ వెదర్ సర్వీసు వెల్లడించింది. రోజురోజుకీ ఈ నగరాల్లో ఎండలు పెరిగిపోతున్నాయి. 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ‘‘పశ్చిమ అమెరికాలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర అమెరికాలో కూడా ఎండలు దంచికొట్టే అవకాశాలున్నాయి.వాతావరణం మార్పుల వల్ల పెరిగిపోతున్న ఈ ఎండల్ని ఎదుర్కోవడానికి ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి’’ అని వాషింగ్టన్ గవర్నర్ జే ఇన్స్లీ చెప్పారు. అత్యవసరమైతే తప్ప ఏసీ గదులు వీడి బయటకు రావద్దని అమెరికా నేషనల్ వెదర్ సర్వీసు హెచ్చరికలు జారీ చేసింది. నీళ్లు ఎక్కువగా తాగాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ వాడకం పెరిగిపోవడంతో బ్లాక్ఔట్లు సంభవిస్తున్నాయి. వాషింగ్టన్, ఒరేగాన్‌లో ఎండవేడి తట్టుకోలేక డజనుకి పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. కాలిఫోర్నియా–ఒరేగాన్ సరిహద్దుల్లో కార్చిచ్చులు ఏర్పడి 600 హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైంది. మండే ఎండలకు, గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులకి ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈస్థాయి ఎండల్ని ఎప్పుడూ చూడలేదన్నారు. కెనడాలో 84 ఏళ్ల రికార్డులు బద్దలు కెనడాలో కూడా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మండే ఎండలకు రికార్డులు బద్దలైపోతున్నాయి. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో రికార్డు స్థాయిలో ఏకంగా 49.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత నాలుగైదు రోజుల్లోనే వడగాడ్పులకు తాళలేక వెన్కౌర్ ప్రాంతంలో 200 మందికి పైగా మృతి చెందారు. 84 ఏళ్ల తర్వాత కెనడాలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. బ్రిటీష్ కొలంబియా, అల్బెర్టా, సస్కాచ్వాన్, యూకన్ వాయవ్య ప్రాంతాల్లో మరో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని కెనడా వాతావరణ శాఖ హెచ్చరించింది. హీట్ డోమ్ కారణం..! ఫసిఫిక్ మహాసముద్రంలో వాతావరణంలోని మార్పుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి వల్ల హీట్ డోమ్ ఏర్పడడంతో అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి కెనడాలోని ఆర్కిటిక్ ప్రాంతాల వరకు ఎండలు భగభగలాడుతున్నట్టుగా బెర్కెలే ఎర్త్‌కి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త జెకె హస్ఫాదర్ చెప్పారు. గత 50 ఏళ్ల కాలంలో ఫసిఫిక్ సముద్రంలోని వాయవ్య ప్రాంతం సగటున 1.7 డిగ్రీ లు వేడెక్కిందని, అందుకే ఈ స్థాయిలో ఎండలు మండుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఏపీ: ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. జార్ఖండ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుంచి ఇంటీరియర్ ఒడిశా మీదుగా దక్షిణ కోస్తా వరకూ ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చదవండి: పేదలందరికీ సొంతిళ్లు.. ఇదీ నా కల: సీఎం జగన్ ఆగస్టు 7న ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ -
మరింత బలపడుతున్న అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల మధ్య కేంద్రీకృతమై ఉన్న ఈ అల్పపీడనం శనివారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఒడిశా మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదలవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం తుపానుగా మారే అవకాశం లేదని చెప్పారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో 2 రోజులు పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు వర్షాలు పడతాయని తెలిపారు. ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని, పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడంతో వాటి ప్రభావంతో కూడా వర్షాలు ఎక్కువగా కురిసే పరిస్థితి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 15వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని సూచించింది. -
Arabian Sea: వాయుగుండంగా మారిన అల్పపీడనం
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం దక్షిణ గుజరాత్ తీరప్రాతానికి 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా అల్పపీడనం బలపడి ఈ నెల 16 నాటికి తుపాన్‌గానూ, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర, అతి తీవ్ర తుపాన్‌గా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న నాలుగు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడున్నాయని పేర్కొంది. ఈ తుపానుకు 'తౌక్టే' అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది. 'తౌక్టే' తీవ్ర తుపానుగా మారి ఈనెల 18న గుజరాత్ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా తౌక్టే' తుపాన్ ప్రభావంతో కేరళలో భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ, యానాం, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రపై తుపాను ప్రభావం ఉండనుందని, అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో ‘తౌక్టే’ ప్రభావం అరేబియా సముద్రంలో లక్షద్వీప్ వద్ద అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ గుజరాత్ తీర ప్రాంతానికి 920 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుఫాన్.. మరో 12 గంటల్లో తీవ్రమైన తుఫానుగా రూపాంతరం చెందనుందని వాతావరణ కేంద్ర తెలిపింది. ఆ తర్వాత అతి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉందని. గుజరాత్ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను ప్రభావంతో ఏపీ, తెలంగాణ, రాయలసీమ పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయని, ఋతుపవనాల రాకకు ఇది శుభ సంకేతమని వాతావరణ శాఖ పేర్కొంది. చదవండి: తుఫాన్ అలర్ట్: దూసుకొస్తున్న ‘తౌక్టే’ -
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఉత్తర తమిళనాడు వరకు 0.9 కి మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి మంగళవారం బలహీన పడింది. ఈ రోజు ఉపరితల ద్రోణి సముద్ర మట్టం నుండి 0.9 కిమీ వరకు ఇంటీరియర్ తమిళనాడు నుండి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా మరత్వడా వరకు ఏర్పడింది. మంగళవారం ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ తెలంగాణ, నైరుతి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాలలో వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు, ఎల్లుండి (7, 8 తేదీల్లో) పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్ పేట్, వానపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. చదవండి: గోదావరి జలాలు విడుదల చేసిన సీఎం కేసీఆర్ రాజన్న సిరిసిల్ల: టిఫిన్ బాక్స్ బాంబు కలకలం -
పొంచి ఉన్న మరో ముప్పు
సాక్షి, చెన్నై: నివర్ తుపాన్ నీలినీడలు జనాన్ని వీడేలోగా మరో ముప్పు పొంచి ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. డిసెంబర్ 11వ తేదీన వాయుగుండం లేదా తుపాన్ తమిళనాడు సముద్రతీరాన్ని కుదిపేయగలదని సమాచారం. బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాన్ ఈనెల 26వ తేదీ తెల్లవారుజామున పుదుచ్చేరికి సమీపంలో తీరందాటుతూ పరిసరాలను అతలాకుతలం చేసింది. శుక్రవారం కొద్దిగా తెరపి ఇవ్వడంతో పుదుచ్చేరి, తమిళనాడు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇదిలాఉండగా బంగాళాఖాతం ఆగ్నేయంలో మరో 48 గంటల్లో కొత్తగా అల్పపీడన ద్రోణి ఏర్పడనుందని, ఈ అల్పపీడన ద్రోణి మరో 24 గంటల్లో వాయుగుండంగా మారి తమిళనాడువైపు పయనించగలదని చెన్నై వాతావరణ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ బాలచంద్రన్ శుక్రవారం తెలిపారు. ఈ ప్రకటనతో జనం మరోసారి ఉలిక్కిపడ్డారు. నివర్ తుపాన్ తీరందాటిన ప్రభావంతో ఈనెల 30వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని ముందుగానే ప్రకటించారు. అయితే, కొత్తగా ఏర్పడనున్న వాయుగుండం వల్ల డిసెంబర్ 3వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. అయితే ఈ వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందే అవకాశం లేదని ఆయన స్పష్టం చేయగా, 11వ తేదీ నాటికి తుపానుగా మారి తమిళనాడు సముద్రతీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొనడం గమనార్హం. సముద్రతీరాల్లో శీతోష్ణస్థితి అధికంగా ఉన్నందున తుపానుగా మారే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రముఖ వాతావరణ నిపుణులు ప్రదీప్‌జాన్ అంటున్నారు. వాయుగుండం ఏర్పడుతుంది, అది తుపానుగా మారకుండా బలహీనపడవచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. వాయుగుండం ఖాయమని తెలుస్తున్నందున వచ్చేనెల 11వ తేదీ వరకు బలమైన వర్షాలు పడతాయని ఆయన చెప్పారు. చదవండి: (రోజంతా గజగజ..) -
నివర్ ఎఫెక్ట్: ఏపీలో కుండపోత వర్షాలు
సాక్షి, నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను కారణంగా జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కోట, వాకాడు, చిట్టుమూడు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష ప్రభావంతో రహదారులపై చెట్లు విరిగిపడటంతో పలుచోట్ల విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో చెరువులన్ని నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నివర్ తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. చదవండి: తీవ్రరూపం దాల్చిన నివర్ తుఫాన్ అతి తీవ్ర తుఫానుగా మారనున్న నివర్ నైరుతి బంగాళాఖాతంలో నివర్ తుపాను ప్రభావం కొనసాగుతుంది. కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 180 కిలోమీటర్లు దూరంలో పుదుచ్చేరికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తీవ్ర తుపానుగా కొనసాగుతున్న నివర్ మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తుపాను కరైకల్- మహాబలిపురం మధ్య ఈ అర్థరాత్రి లేదా రేపు ఉదయం తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ఈ అర్ధ రాత్రి లేదా రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది. చదవండి:నివర్ తుపాను.. అప్రమత్తంగా ఉందాం సాక్షి, వైఎస్సార్ కడప : నివర్ తుపాను వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఎస్పీ కార్యాలయ ఆవరణంలో ట్రయిల్ రన్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు 'నివర్' తుపానును ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో సంసిద్ధంగా మూడు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ సబ్ డివిజన్లో ఒక రెస్క్యూ బృందం ఏర్పాటు చేసినట్లు, బృందాలకు అవసరమైన అత్యవసర లైటింగ్ సామాగ్రి, లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, తాళ్లను ఏఆర్ పోలీసు అధికారులు అందజేశారు. (చదవండి: తిరుమలపై ‘నివర్’ ప్రభావం) సాక్షి, చిత్తూరు : నివర్ తుపాను ప్రభావం జిల్లాపై కూడా ఉండటంతో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈదురు గాలులతోపాటు బారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దాదాపు 68 చెరువుల వద్ద అధికారులను అలెర్ట్ చేశామన్నారు. 16 సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించినట్లు, నిరాశ్రయులకు పాఠశాల భవనాలలో అసరా కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. అధిక వర్షపాతమున్న ప్రాంతాలలో ప్రజలు బయటకు రావద్దని సూచించారు. నివర్ తుపాను ప్రభావం నేపథ్యంలో వరదయ్యపాలెం మండలంలో 100 మంది నిరాశ్రయులైన గిరిజనులను ముందస్తుగా గుర్తించి పునరావాస కేంద్రంలకు తరలించినట్లు తెలిపారు. నివర్ తుపానుతో రేణిగుంటలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మల్లెమడుగు రిజర్వాయర్ నిండు కుండలా తలపిస్తోంది. దీంతో మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. -
ఏపీ: రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో నిన్న(ఆదివారం) ఏర్పడిన అల్పపీడనం బలపడి, వాయుగుండంగా మారింది. గడిచిన 6 గంటల్లో వాయువ్య దిశగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి పాండిచేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 550 కి.మీ. చైన్నైకి ఆగ్నేయ దిశగా 590 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయ్యిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది బలపడి రాగల 24 గంటల్లో తుఫానుగా మారి, వాయువ్య దిశగా ప్రయాణించి, కారైకాల్, మహా బలిపురం, ప్రాంతాల మధ్య తీరాన్ని 25 నవంబర్‌న సాయంత్రం తీవ్ర తుఫానుగా గంటకు 100-110 కి.మీ. గాలి వేగంతో దాటవచ్చని పేర్కొంది. చదవండి: తుఫానుగా బలపడనున్న వాయుగుండం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనను భారత వాతావరణ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచిఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయలసీమ : ఈరోజు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. -
కొనసాగుతున్న అల్పపీడనం..భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం : నైఋతి బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటలలో ఇది నైఋతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం మరో 24 గంటలలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ తుపాను వాయువ్య దిశగా పయనించి తమిళనాడు - పుదుచ్చేరి తీరాల వద్ద కరైకల్ - మహాబలిపురంల మధ్య ఈ నెల 25న తీరం దాటే అశకాశం ఉంది. రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : ఉత్తర కోస్తాంధ్ర: ఆది, సోమవారాల్లో ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు మెరుపులు తోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర : ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. సోమవారం దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. మంగళవారం దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు మెరుపులు తోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ : సోమవారం రాయలసీమలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. మంగళవారం రాయలసీమలో ఉరుములు మెరుపులు తోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
మరో మూడు రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : రాబోయే మూడు రోజుల పాటు హైదరబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ శాఖ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల కుటుంబాలను ఖాళీ చేయించాలని ఆదేశించారు. గత వారం రోజుల నుంచి నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదా, బురదతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న వర్ష సూచనపై నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనంతో రాగల 24 గంటల్లో తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి, మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. -
కుండపోత.. గుండెకోత..
సాక్షి, హైదరాబాద్: వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిశాయి. సోమవారం రాత్రి మొదలై బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన ఎడతెరపిలేని వానలతో రాష్ట్రం గజగజలాడింది. బుధవారం ఉదయం తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ అప్పటివరకు కురిసిన వానలతో హైదరాబాద్ సహా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ప్రధాన రహదారులు మొదలు అనుసంధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద ధాటికి చాలాచోట్ల రోడ్లు కొట్టుకుపోయి రవాణా వ్యవస్థ స్తంభించింది. పట్టణాల్లోని కాలనీలు, పల్లెల్లోని ఇళ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ సంఖ్యలో చెరువులు నీటితో నిండి అలుగెత్తగా, ఏళ్లుగా నిండని చెరువులు సైతం జలకళను సంతరించుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావం మాత్రం కొనసాగుతోంది. దీంతో ఆగ్నేయ దిశగా ఈదురుగాలులు వీస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం తోడవడంతో పలుచోట్ల బుధవారం సాయంత్రం కూడా వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం నాటికి రాష్ట్రంలో సగటున 5.77 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మూడు నెలల్లో కురవాల్సిన వర్షపాతం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగే ఈశాన్య రుతుపవనాల సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 12.49 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ఈ సీజన్లో అక్టోబర్‌లో మూడో వంతు వర్షాలు.. నవంబర్, డిసెంబర్లలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. కానీ రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలు సీజన్లో కురవాల్సిన మొత్తం రికార్డును ఇప్పుడే నమోదు చేశాయి. బుధవారం ఉదయం నాటికే ఏకంగా 12.77 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మూడు నెలల్లో కురిసే వానలు కేవలం సీజన్ ప్రారంభమైన రెండు వారాల్లోనే నమోదు కావడం గమనార్హం. గతేడాది ఇదే సమయం నాటికి 5.87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సీజన్ ముగిసే నాటికి కేవలం 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నైరుతి సీజన్లో కూడా సాధారణ వర్షపాతం కంటే 45 శాతం అధికంగా నమోదయ్యాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో 72 సెంటీమీటర్ల వర్షపాతానికి గాను 107.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 18 జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఈశాన్య రుతుపవనాల సీజన్లో ఇప్పటివరకు 18 జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. మరో 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా, 6 జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. బుధవారం ఉదయం వరకు కురిసిన వర్షాల్లో మేడ్చల్ జిల్లాలో అధికంగా 17.8 సెంటీమీటర్లు, హైదరాబాద్‌లో 17.6 సెం.మీ., సంగారెడ్డిలో 12.817 సెం.మీ., రంగారెడ్డిలో 13.51 సెం.మీ., మెదక్‌లో 10.917 సెం.మీ., సిద్దిపేట జిల్లాలో 10.617 సెం.మీ. నమోదైంది. కాగా, తీరం దాటిన వాయుగుండం క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఆగ్నేయ దిశగా ప్రయాణించి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలగుండా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లాలకు వర్ష సూచన అతిభారీ వర్షాలు: జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, ములుగు, నారాయణపేట. భారీ వర్షాలు: పెద్దపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం. సాధారణ వర్షాలు: ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల. -
వానలే.. వానలు
సాక్షి, హైదరాబాద్ : వారం రోజులుగా వానలే వానలు. రాష్ట్రమంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నెలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ నెల తొలివారంలో వర్షాల తీవ్రత కాస్త తగ్గింది. ఈ నెల పదో తేదీ వరకు అక్కడక్కడా తేలికపాటి వర్షాలే కురవగా 12వ తేదీ నుంచి మళ్లీ ఊపందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సగటున ప్రతీ రోజు వానలు కురిసి నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతు న్నాయి. సెప్టెంబర్‌లో రాష్ట్రంలో సగటు వర్షపాతం 12.7 సెంటీమీటర్లు నమోదు కావాల్సి ఉంది. ఈ లెక్కన ఈ నెల 19వ తేదీ నాటికి వర్ష పాతం 8.18 సెంటీమీటర్లు కురవాల్సి ఉండగా.. శనివారం నాటికి ఏకంగా 14.8 సెంటీమీటర్లు కురి సింది. సగటు వర్షపాతానికి రెట్టింపు, నెల సాధా రణ వర్షపాతం కంటే 20 శాతం అధికంగా వానలు కురిసినట్లు వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. మరో నాలుగు రోజులు వానలు... రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడుగా ఈ నెల 20న ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది 24 గంటలు గడిచిన తర్వాత వాయవ్య బంగాళాఖాతం వైపు బలపడనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉన్నట్లు వెల్లడించింది. చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు సైతం కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. -
ఈ ప్రాంతాలకు పిడుగు హెచ్చరిక
సాక్షి, విజయవాడ: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల సమీపంలో ఉపరితల ఆవర్తనం కోనసాగుతున్నందున ఈశాన్య బంగాళఖాతంతో రాగల రెండు రోజుల్లో అల్ఫపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కె కన్నబాబు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల రాగల 3 రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కృష్ణానది వరద ఉధృతి దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముంద్రంలో వేటకు వెళ్లరాదని కమిషనర్ కన్నబాబు సూచించారు. ఈ ప్రాంతాలకు కమిషనర్ పిడుగు హెచ్చరిక.. అదే విధంగా కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలకు పిడుగు కూడా పిడుగు హెచ్చరిక చేశారు. కృష్ణా జిల్లాలోని నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యాపేట, ఆగిరిపల్లి, నూజివీడు, బాపులపాడు, మైలవరంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, రంగంపేట, పెద్దాపురం, రాజనగరం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గోర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించారు. వర్షం పడుతున్న సమయంలో సురక్షితమైన భవనాలల్లో ఆశ్రయం పోదాలని ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు. రాగల 3 రోజుల పాటు వాతావరణ వివరాలు: సెప్టెంబర్ 19న: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం. సెప్టెంబర్ 20: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు.మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం. సెప్టెంబర్ 21: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా,కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం. -
20న మరో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈనెల 20న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినప్పటికీ రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 50 సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ జామ్.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం హైదరాబాద్‌లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సాయంత్రం వేళ కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. సాయంత్రం వేళ కురిసిన వర్షంతో నగరంలో సుమారు 50 సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. ప్రధాన రహదారులపై వర్షపు నీటిలో వాహనాలు భారంగా ముందుకు కదిలాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వరద నీటితో పలు బస్తీలవాసులు నానా అవస్థలు పడ్డారు. -
హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: రానున్న మూడు గంటల్లో తెలంగాణలో చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, అంతేగాక పలు చోట్లు పిడుగు పడే అవకాశం కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దోని జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడితే 040 29555500, 040 21111111కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అదే విధంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలల్లో భారీ వర్షం కురిసే అన్ని ప్రాంతాల్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీం, ఎమర్జెన్సీ బృందాలను ఆయన అప్రమత్తం చేశారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలంగాణలో దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 2.1 కిమీ ఎత్తు వరకు కొనసాగుతోంది. తూర్పు-పశ్చిమ షేర్ జోన్లో పెనిన్సులర్ 6.0 అక్షాంశం వెంబడి భారతదేశం మీదుగా 4.5కిమీ నుంచి 5.8 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతోంది. అంతేగాక ఉత్తర కోస్తా ఆంధ్రతో పాటు దాని పరిసర ప్రాంతాలలో 3.1కిమీ నుంచి 3.6 కిమీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇక ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా సెప్టెంబరు 20వ తేదీన వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. (హైదరాబాద్ వర్షాలు: కొట్టుకొచ్చిన మొసళ్లు) ఆదిలాబాద్, కోమురంభీం-ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట, జిల్లాలలో ఇవాళ ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శుక్రవారం కూడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం మాత్రం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. -
ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనిని ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో మంగళవారం ఉదయం బలహీనపడి అదే ప్రాంతంలో మధ్యాహ్నం వరకు తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్ళే కొలది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 15°N అక్షాంశం వెంబడి తూర్పు-పశ్చిమ షేర్ జోన్ మీదుగా 3.1 కిమీ నుంచి 5.8 కిమీ ఎత్తు వరకు తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కొస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లోని పలు చోట్ల ఈరోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు(బుధవారం) ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గురువారం ఉత్తర కోస్తా ఆంధ్రా, దక్షిణా కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉండగా.. తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయలసీమ: ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు(బుధవారం) రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉండగా.. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి(గురువారం) రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. -
నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!
సాక్షి, హైదరాబాద్ : ఉత్తరాంధ్ర–ఒడిశా తీరాలకు దగ్గర్లో వాయవ్య, పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీంతో గురువారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం–ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్–పట్టణ, వరంగల్–గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లా ల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. -
భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించడం, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగానూ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమ, కోస్తాంధ్ర మొత్తం విస్తరించాయని, దీనివల్లే బుధవారం నుంచి విస్తారంగా వానలు కురుస్తున్నాయని ఐఎండీ అమరావతి కేంద్రం సంచాలకులు స్టెల్లా గురువారం విజయవాడలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. గురువారం దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని, రాబోయే 36 గంటల్లో తెలంగాణకు నైరుతి విస్తరిస్తుందని ఐఎండీ పేర్కొంది. నైరుతి రుతుపవనాలతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వేసవి తాపాన్నుంచి ప్రజలు ఊరట చెందారు. కాగా, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో చెరువును తలపిస్తున్న పంట పొలాలు ఉత్తరాంధ్రలో భారీ వర్షం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. రణస్థలం మండలం జె.ఆర్.పురం ఎస్సీ కాలనీలో పిడుగుపడి భవిరి నర్సింహులు (64) అనే వృద్ధుడు మృతి చెందాడు. భామిని మండలం దిమ్మిడిజోలలో పిడుగులు పెద్దఎత్తున పడ్డాయి. విజయనగరం జిల్లాలోని విజయనగరం, నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, గంట్యాడ మండలాల్లో భారీ వర్షం పడింది. కాగా పలు మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. చెరువుల్లా పంటపొలాలు కర్నూలు జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీగా వర్షం పడింది. నంద్యాలలో అత్యధికంగా 98.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఒకే రోజు జిల్లా మొత్తం మీద 25.2 మి.మీ. వర్షపాతం నమోదు కావడం విశేషం. పలు ప్రాంతాల్లో పంట పొలాలు చెరువులను తలపించాయి. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ ప్రకాశం జిల్లాలో బుధ, గురువారాల్లో జోరు వాన కురిసింది. ఏళ్ల తరబడి నీటి జాడ తెలియని వాగులు సైతం జలకళతో కళకళలాడుతున్నాయి. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కుండపోత వర్షం కురిసింది. గిద్దలూరు ప్రాంతంలోని ఎర్రవాగు ఉగ్రరూపం దాల్చింది. వాగు ఉధృతికి గుంటూరు–దొనకొండ రైల్వే ట్రాక్ కింద భాగం మొత్తం కొట్టుకొని పోయింది. బేస్తవారిపేట మండలం జగ్గంబొట్ల కృష్ణాపురం, రాచర్ల మండలం సోమిదేవిపల్లి గ్రామాల మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో ఆ లైన్లో నడిచే అన్ని రైళ్లను రద్దు చేసి మరమ్మతులు చేపట్టారు. సగిలేరు పొంగి పొర్లుతోంది. 15 చెరువులు నిండుకుండల్లా మారాయి. వర్షానికి పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లాలో మోస్తరు వాన గుంటూరు జిల్లాలో గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. సగటున 2.39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భట్టిప్రోలు తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. పాతగుంటూరు పరిధిలోని ముగ్దుం నగర్లో వృద్ధురాలు మెహరున్నీసా (85) వర్షం వల్ల పెంకుటిల్లు కూలటంతో మృతిచెందింది. ఆమె కుమార్తె రిహానాకు గాయాలు అయ్యాయి. -
చురుగ్గా నైరుతి రుతుపవనాలు
-
అరేబియా సముద్రంలో అల్పపీడనం!
-
నేడు, రేపు పలుచోట్ల వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : రాగల 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపు లు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవ కాశం ఉందని తెలిపింది. ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీంతో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. తగ్గిన ఉష్ణోగ్రతలు... రాష్ట్రంపై భానుడి ప్రతాపం కాస్త తగ్గింది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. శనివారం ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 40 డిగ్రీల సెంటీగ్రేడ్, హన్మకొండ, రామగుండంలో 35 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
రాష్ట్రంలో పెరిగిన వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత పెరిగింది. బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం, నిర్మల్ జిల్లా సోన్, జగిత్యాల జిల్లా మెట్పల్లి, మేడిపల్లి, రాయికల్, రాజన్నసిరిసిల్ల జిల్లా మల్లారం, ఆదిలాబాద్ జిల్లాలోని బేల, ఆదిలాబాద్ కలెక్టరేట్, పెద్దపల్లి జిల్లా రామగుండం, శ్రీరాంపూర్, నిజామాబాద్ జిల్లా నందిపేట్, ఆర్మూర్‌లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల రెండ్రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా 42 నుంచి 44 డిగ్రీలు నమోదవుతాయని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
నిప్పుల కుంపటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగాడ్పులు, ఎండల తీవ్రత తగ్గడంలేదు. మంగళవారం మళ్లీ పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. అనేకచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ సహా ఆ జిల్లాలోని జైనాడ్, బేలా, తలమడుగు, తంసి, నిర్మల్ జిల్లా మమ్డా, లక్ష్మణ్‌చంద, మంచిర్యాల జిల్లా వెల్గనూర్, జన్నారం, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఇస్సపల్లెలలో 46 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వడగాడ్పులు వీచడంతో జనం విలవిల్లాడిపోయారు. నిజామాబాద్, రుద్రంగి, కొల్లూరు, సోన్ఐబీ, భోరాజ్, మెట్పల్లి, శ్రీరాంపూర్లలో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడా వడగాడ్పులు వీయడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రామగుండం, నల్లగొండ, మెదక్‌లలో 44 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల మూడ్రోజులు వడగాడ్పులు.. రాగల మూడ్రోజులు ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. బుధవారం దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ఉన్న మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. మరోవైపు దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రాగల మూడ్రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. -
నేడు, రేపు వడగాడ్పులు..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం, బుధవారం రెండు రోజులు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలా బాద్, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, జగి త్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, మహబూబా బాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మంగళవారం కొన్నిచోట్ల, బుధవారం అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. దంచికొట్టిన ఎండలు.. సోమవారం పలు ప్రాంతాల్లో వడగాడ్పులతోజనం అవస్థలు పడ్డారు. నిర్మల్ జిల్లా కడ్డెం పెద్దూరు, సోన్ ఐబీ, మమ్డా, పొంకల్, లక్ష్మణ్ చంద, పాత ఎల్లాపూర్, నిజామాబాద్ జిల్లా కల్దుర్కి, చిన్నమావంది, ఆదిలాబాద్ సహా అదే జిల్లా తంసి, కామారెడ్డి జిల్లా పాత రాజంపేటల్లో 46 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ముత్తారం మంథని, తానూరు, బీరవల్లి, బేలా, లింగాపూర్, వడ్డాయల్, కుబీర్, తాండ్రలలో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 43, హైదరాబాద్, హన్మకొండలలో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో 40 డిగ్రీలు నమోదైంది. బంగాళాఖాతంలోకి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లోని మరికొన్ని చోట్లకు ఈ నెల 27న నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. -
రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగ
-
నిప్పుల వాన
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ‘అగ్గి’రాజుకుంది! ప్రచండ భానుడి ఉగ్రరూపానికి తెలంగాణ విలవిల్లాడింది. ఎండ వేడికితోడు ఉత్తరాది నుంచి వీస్తున్న వడగాడ్పులతో వివిధ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా మంచిర్యాల, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోనూ 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డయింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ వేడి, ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రాత్రిపూట కూడా ఆ వేడి తగ్గలేదు. ఎండ తీవ్రతకు ఉపాధి హామీ కూలీలు, చిరు వ్యాపారులు అల్లాడిపోయారు. రోహిణి కార్తె కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని, 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత దాటితే ఆయా ప్రాంతాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు అధికమవుతున్నందున వడగాల్పుల తీవ్రత సైతం పెరగనున్నట్లు తెలిపింది. ఉత్తర భారతం నుంచి రాష్ట్రంపైకి వేడిగాలులు, పొడిగాలులు వస్తున్నాయని, ముఖ్యంగా రాజస్తాన్ నుంచి ఈ గాలులు వస్తుండటంతో తెలంగాణలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. అలాగే ఉంపన్ తుపాను వెళ్లిపోవడంతో తేమ కూడా దాంతోపాటు వెళ్లిపోయిందని, ఫలితంగా రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ రెండు కారణాలతో రాష్ట్రంలో వడగాడ్పులు వీస్తున్నాయన్నారు. అయితే గతేడాది కంటే ఈసారి వడగాడ్పులు నమోదైన రోజులు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈసారి ఇప్పటివరకు మూడు రోజులే వడగాడ్పులు నమోదయ్యాయని వివరించారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీల నుంచి 6.4 డిగ్రీలు అధికంగా నమోదు కావడం లేదా 45–46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాడ్పులుగా లెక్కిస్తామన్నారు. 47 డిగ్రీలు, ఆపైన ఉష్ణోగ్రతలు నమోదైతే తీవ్ర వడగాడ్పులుగా లెక్కిస్తామని పేర్కొన్నారు. నేడు, రేపు తీవ్ర వడగాడ్పులు... రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పలుచోట్ల వడగాడ్పుల తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగనున్నట్లు పేర్కొంది. ఆ ద్రోణి వస్తే తేమ గాలులు వస్తాయని, అప్పుడు కాస్తంత వేడి తగ్గుతుందని తెలిపింది. కేటీపీపీలో 51 డిగ్రీలు? గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఆదివారం 51 డిగ్రీల సెల్సియస్ రికార్డు ఉష్ణోగ్రత నమోదైనట్లు కేటీపీపీలోని ఉష్ణోగ్రత పట్టిక చూపింది. కానీ ఈ వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ధ్రువీకరించలేదు. -
సూరీడే కాదు గాలీ సుర్రుమంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడు భగభగమన్నాడు. శుక్రవారం నాలుగు చోట్ల తీవ్ర వడగాడ్పులు, పలుచోట్ల వడగాడ్పులు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాడ్పులుగా ప్రకటిస్తారు. 47 డిగ్రీలు, ఆపైన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే తీవ్ర వడగాడ్పులుగా ప్రకటిస్తారు. ఆ ప్రకారం శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపాలెం మండలం పెంట్లాం, నల్లగొండ జిల్లా అనుములు హాలియా మండలం హాలియా, అదే జిల్లా కనగల్, పెద్దపల్లి జిల్లా మంథనిలలో ఏకంగా 47 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. అలాగే ఖమ్మం, కొల్వి, ధర్మపురి, దామరచర్ల, దుమ్ముగూడెం, మొగుళ్లపల్లి, జైనా, జూలూరుపాడు, ఏన్కూరు, పాత ఎల్లాపూర్, సోన్ ఐబీ, మామిడాల, జన్నారం, భోరాజ్, నామాపూర్, బొమ్మిరెడ్డిపల్లె, ఉర్లుగొండల్లో 46 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్‌లలో 45 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం, హన్మకొండ, మహబూబ్‌నగర్, మెదక్, రామగుండంలలో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాలులతో రాష్ట్రంలో జనం ఇబ్బందులు పడ్డారు. అనేకమంది విలవిలలాడిపోయారు. నేడు, రేపు వడగాడ్పులు.. ఉత్తర బంగ్లాదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో శని, ఆదివారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్లగొండ, సూర్యాపేట.. మొత్తంగా 17 జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. -
మూడ్రోజులు వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సూర్యుడు భగ్గుమంటున్నాడు. రెండ్రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలుచోట్ల 40 నుంచి 46 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. గురువారమైతే ఖమ్మంలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కరోనా నేపథ్యంలో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ప్రజలకు ఎండ తీవ్రత ఇబ్బంది పెడుతోంది. కార్మికులు, కూలీలు ఎండకు ఇక్కట్లు పడుతు న్నారు. ఒకవైపు కరోనా భయం వెంటాడుతుంటే, మరోవైపు ఎండ తీవ్రతతో జ్వరాలు వచ్చే అవకాశాలూ ఉన్నాయి. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వారిని పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాతా వరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా వడ దెబ్బ తగలకుండా జాగ్ర త్తలు తీసుకోవాలని విన్నవిస్తు న్నారు. వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలో అక్కడ క్కడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటిం చింది. ఉంపన్ తుపాను వెళ్లిపోవడంతో గాలిలో తేమ కూడా లేకుండా పోయిందని, దీంతో పొడిగాలులు వీస్తున్నాయని, ఫలితంగా ఎండ తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. ఈ మూడ్రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీలు నమోదయ్యే పరిస్థితి ఉందన్నారు. -
బంగాళాఖాతంలోకి ‘నైరుతి’ ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు ఆదివారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ దీవుల్లో మిగిలిన ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉం దని పేర్కొంది. సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవ కాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. మంగళవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అలాగే రాగల మూడ్రోజులు అక్కడక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అతి తీవ్ర తుపానుగా ‘అంఫన్’ దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ‘అంఫన్’తుపాను ఉత్తర దిశగా ప్రయాణించి మరింత తీవ్రమై ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు అతి తీవ్ర తుపానుగా మారింది. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో పారదీప్ (ఒడిశా)కు దక్షిణ దిశగా 960 కిలోమీటర్లు, డిగా (పశ్చిమ బెంగాల్)కు దక్షిణ నైరుతి దిశగా 1,110 కిలోమీటర్లు, ఖేపుపర (బంగ్లాదేశ్)కు దక్షిణ నైరుతి దిశగా 1,230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి రాగల 24 గంటల్లో అత్యంత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఇది తదుపరి 12 గంటల్లో ఉత్తర దిశగా ప్రయాణించి తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా వాయవ్య బంగాళాఖాతం మీదుగా వెళ్లి పశ్చిమ బెంగాల్–బంగ్లాదేశ్ తీరాల వద్ద డిగా (పశ్చిమబెంగాల్), హతియా దీవుల (బంగ్లాదేశ్) మధ్య ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని రాజారావు వెల్లడించారు. -
రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుక్కుగుడా, సర్దార్ నగర్ రవీర్యాల, మంఖల్, ఇమామగుడా, హర్షగుడా, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో అంధకారం అలుముకుంది. 13న అల్పపీడనం అలుముకునే అవకాశం మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు పశ్చిమ విదర్భ, మరఠ్వాడ, దక్షిణ మధ్య మహారాష్ట్ర, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కిమీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న సుమత్రా తీర ప్రాంతాలలో మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావం వలన ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న అండమాన్ సముద్రం ప్రాంతాలలో సుమారుగా మే 13వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 కిమీ) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 41 నుండి 43 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంది. -
తెలంగాణ: రాగల మూడు రోజులు వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా తెలంగాణలో రాగల మూడురోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ శనివారం తెలిపింది. ఈ రోజు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో ఈరోజు, రేపు అక్కడక్కడా గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. (చదవండి: వైద్యురాలికి ఘన స్వాగతం.. భావోద్వేగం) ‘దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 24 గంటలలో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. తదుపరి 48 గంటలలో అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి క్రమంగా మే 6 వరకు ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈశాన్య మరఠ్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది’అని వాతావరణ శాఖ డైరెక్టర్ పేర్కొన్నారు. (చదవండి: ప్రమాద ఘంటికలు) -
నేడు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు తెలంగాణలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అలాగే గురువారం కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు.