సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం వర్షం పడుతోంది. కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, కర్మన్‌ఘాట్, చంపాపేట్, సంతోష్‌నగర్, ఉప్పల్, తార్నాక, మెహదీపట్నం, అమీర్‌పేట, ఎస్సానగర్, కూకట్‌పల్లి, బేగంపూట, సికింద్రాబాద్‌లో మోస్తరు వర్షం పడింది.
దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారులపై రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఉదయాన్నే కార్యాలయాలు, పాఠశాలలకు బయలుదేరిన విద్యార్థులు, వాహనదారులు వర్షానికి ఇబ్బందులు పడ్డారు.
కాగా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం నుంచి ఈ నెల 26 వరకు వానలు పడే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో డీఆర్‌ఎఫ్, మున్సిపల్ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment