rains in hyderabad
-
హైదరాబాద్‌లో వర్షం.. రానున్న మూడు రోజుల పాటు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం వర్షం పడుతోంది. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, కర్మన్‌ఘాట్, చంపాపేట్, సంతోష్‌నగర్, ఉప్పల్, తార్నాక, మెహదీపట్నం, అమీర్‌పేట, ఎస్సానగర్, కూకట్పల్లి, బేగంపూట, సికింద్రాబాద్‌లో మోస్తరు వర్షం పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారులపై రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఉదయాన్నే కార్యాలయాలు, పాఠశాలలకు బయలుదేరిన విద్యార్థులు, వాహనదారులు వర్షానికి ఇబ్బందులు పడ్డారు. కాగా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం నుంచి ఈ నెల 26 వరకు వానలు పడే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో డీఆర్ఎఫ్, మున్సిపల్ సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. -
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం దాకా భగభగ మండిన ఎండలతో అల్లాడిన హైదరాబాద్ వాసులకు అకస్మాత్తుగా వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం లభించింది. భాగ్యనగరంలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌లో వర్షం పడింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదగా ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కాగా, శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా లక్కవరంలో 46.1 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా జూన్ మొదటి వారమంతా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి వాయవ్య. పశ్చిమ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు చెప్పింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 42.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. చదవండి: అవన్నీ గుండెపోట్లు కావు.. గుండెపోటు ఎవరికి వస్తుంది? -
మౌనిక మృతి.. ‘బయటకెళ్తే ఇంటికొస్తారనే నమ్మకం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో నగరంలోని కళాసిగూడలో పాల ప్యాకెట్ కోసం చిన్నారి మౌనిక మ్యాన్‌హోల్‌లో పడిపోయి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇదే క్రమంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు.. కళాసిగూడ ఘటనలో జీహెచ్ఎంసీ చర్యలకు సిద్దమైంది. వర్క్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్‌పై సస్పెన్షన్ విధించింది. ఇక, ఈ ఘటనపై పూర్తి విచారణ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక, చిన్నారి మృతిపై బీజేపీ నేతలు స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మౌనిక మృతికి జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమే కారణం. కాంట్రాక్టర్లకు జీహెచ్ఎంసీ సరిగా బిల్లులు ఇవ్వడం లేదు. మౌనిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. రోడ్లు తవ్వినప్పుడు కనీసం జాగ్రత్తలు పాటించడం లేదు. శాఖల మధ్య సమన్వయం లేదు’ అంటూ విమర్శలు గుప్పించారు మరోవైపు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ పైన మెరుగు.. లోపల మురుగు. బయటకు వెళ్లినవారు ఇంటికొస్తారనే నమ్మకం లేదు. చిన్నారి ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: Hyderabad Rains: మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి -
Rain in Hyderabad: హైదరాబాద్‌లో వర్షం (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలుచోట్ల వడగండ్ల వాన
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణశాఖ తెలిపిన విధంగా ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల వడగండ్ల వాన కురుస్తోంది. ఇక, హైదరాబాద్‌లో గురువారం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నగరంలోని నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఇక, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, కామారెడ్డి, వికారాబాద్ జిల్లా జిల్లాలో వడగండ్ల వర్షం పడుతోంది. పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా అల్పపీడన ద్రోణి కారణంగా గంటకు 40 కిలోమీటర్ల బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో, వాతావరణ శాఖ నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జహీరాబాద్‌లో వడగళ్ల వాన#Telangana #Zaheerabad #TelanganaRains #HyderabadRains @HiHyderabad #Rain pic.twitter.com/NLT1R7vasY — Mothe Vikramreddy (@MVRBRS) March 16, 2023 #Hyderabad #HyderabadRains pic.twitter.com/PS9AR84u9i — R Rajinikanth (@RRajinikanthGo2) March 16, 2023 Hailstorm reported in Kohir, Sangareddy district with -
ఇది బెంగళూరు కాదు సార్.. హైదరాబాదే!
వైరల్: నగరంలో బుధవారం రాత్రి కురిసిన జడివాన.. రోడ్లను జలమయం చేసేసింది. మరోవైపు వరద నీరు, డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వీధులన్నీ చెరువులను తలపించాయి. చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు చేరుకుని.. నగర వాసులు నానా ఇబ్బందులు పడ్డారు. చాలాచోట్ల ద్విచక్ర వాహనాలు, ఆటోలు కొట్టుకుని పోగా.. మరికొన్ని చోట్ల కార్లు, ఆటోలు నీట మునిగి పాడైపోయాయి. ఇక హైదరాబాద్ వరదలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. గతంలో హైదరాబాద్ వరదలపై బీజేపీ నేతలు సెటైర్లు వేయడాన్ని ఉద్దేశిస్తూ.. మొన్న బెంగళూరు వరదలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్‌గా స్పందించిన సంగతి తెలిసిందే. మన నగరాలు రాష్ట్రాలకు ఆర్థిక ఇంజిన్ల లాంటివి. అవి దేశ వృద్ధిని నడిపిస్తాయి. అర్బనైజేషన్ (పట్టణీకరణ), సబ్-అర్బనైజేషన్ వేగవంతంగా జరుగుతున్న వేళ.. అందుకు తగినట్లు నగరాలను అప్‌గ్రేడ్ చేసేందుకు తగినంత పెట్టుబడులు కేటాయించకపోతే మౌలిక వసతులు కుప్పకూలిపోతాయిపట్టణ ప్రణాళిక పాలనలో మనకు సంస్కరణలు చాలా అవసరం అంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని ట్యాగ్ చేశారు కేటీఆర్. అయితే బెంగళూరు ఏకధాటి వర్షాల కంటే.. ఇప్పుడు ఒక్కరాత్రిలో అదీ కొన్నిగంటలపాటు కురిసిన వర్షానికి రోడ్లు జలమయం కావడంపై సెటైర్లు పేలుస్తున్నారు కొందరు నెటిజన్లు. చిన్నపాటి వర్షానికే మునిగిపోయే హైదరాబాద్ రోడ్లను ఎందుకు బాగు చేయటం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని పక్కరాష్ట్రాలకు బోధిస్తున్న మంత్రి కేటీఆర్.. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో రోడ్లు, డ్రైనేజీల దుస్థితి గురించి ఏం చేస్తున్నారంటూ వీడియోలతో సహా నిలదీస్తున్నారు. ఇది బెంగళూరు, అహ్మదాబాద్, ఏ వెనిసో అంతేకంటే కాదని.. హైదరాబాదేనని.. ముందు ఇక్కడి సంగతి చూడాలంటూ సెటైర్లు పేలుస్తున్నారు. #ktr #KCR congratulations for bringing river in Hyderabad. CM wants to be PM.@bandisanjay_bjp @Sagar4BJP @TigerRajaSingh #BRSParty https://t.co/4SI1V5PkBb — Bhanu Charan (@nirvaanbeta) October 13, 2022 Singapore, Dallas, Istanbul 👇👇 #HyderabadRains #TwitterTillu https://t.co/Mc0pnunCO0 — PNR (@PNR2043) October 13, 2022 @KTRTRS - saying again, pehle Hyd dekho, Ahmedabad nahi #HyderabadRains https://t.co/L06dVhALn0 — Nikhil Surana (@Nikhil2707) October 13, 2022 Situation out of Control.. Washed Away in Seconds... #HyderabadRains pic.twitter.com/ImEnyOYeB0 — Laddu_9999🇮🇳🇮🇳 (@Laddu_9999) October 13, 2022 Hyderabad Mayor's Have Changed But No changes against Monsoon.. No Action plan accordingly since Year's They are Discussing But No solution.. See the Two Wheeler How He Flushed Out.. #HyderabadRains pic.twitter.com/z6VBtTAa1L — Laddu_9999🇮🇳🇮🇳 (@Laddu_9999) October 13, 2022 Visuals from last night. Many vehicles washed away in Borabanda n at Yousufguda #Hyderabad after continuous #Rain for couple of hours. #HyderabadRains pic.twitter.com/o83T4wkzHu — Nellutla Kavitha (@iamKavithaRao) October 13, 2022 Hyderabad to Venice in one day! Development I must say! Thank you @KTRTRS You didn't make it Dallas but Venice is fine.. 🤣🤣🤣#HyderabadRains https://t.co/AwGxZGPST7 — Chinnu Rao.. #ProudHindu 🇮🇳 (@bubblebuster26) October 13, 2022 Terrible visuals of rain water lashing away vehicles coming in from Borabanda and Yousufguda area #HyderabadRains #hyderabad pic.twitter.com/IzT4Oe5Mvf — Siraj Noorani (@sirajnoorani) October 12, 2022 Situation at Meenakshi Enclave, #Suchitra 1.30am Flooded after a moderately heavy rainfall in #Hyderabad. ⛈️⛈️☔️#HyderabadRains #Telangana pic.twitter.com/nguQSPyeRN — Siraj Noorani (@sirajnoorani) October 12, 2022 అన్నా @trsharish ఒక పదివేల బోట్లు హైదరాబాద్ ప్రజలకు ఇవ్వు అన్నా.... Cc @nazir28 #HyderabadRains https://t.co/JzT3sMahXC pic.twitter.com/ZgxwnBNWwS — 🇰 🇰 🇷 (@KKMUSK_003) October 13, 2022 -
Hyderabad Alert: రాగల 24 గంటల్లో భారీ వర్షసూచన..
సాక్షి, హైదరాబాద్: ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో నగరంలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాల కారణంగా ఆరెంజ్ అలర్ట్‌ను జారీచేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ, పోలీసు విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరికలు జారీచేసింది. ఆవర్తనం ప్రభావంతో బుధవారం నగరంలో మళ్లీ కురిసిన జడివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. వందలాది బస్తీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు సమస్యలపై బల్దియా కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు జనం నానా అవస్థలు పడ్డారు. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతున వరద నీరు పోటెత్తింది. రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా మచ్చబొల్లారంలో 9.3, ఎల్బీనగర్లో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా జియాగూడ, రాజేంద్రనగర్‌లలో 4.8 సెం.మీ చొప్పున నమోదైంది. వాహనదారులు, ప్రయాణికుల కష్టాలు.. సాయంత్రం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి బయలుదేరిన వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకొని ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. భారీ వర్షానికి మూసీ నదికి వరద పోటెత్తింది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను వేరే మార్గాల్లో మళ్లించారు. చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి నల్లగొండ క్రాస్ రోడ్డు వరకు భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. వర్షం సమయంలో అవసరమైతేనే బయటకు రావాలని నగరవాసులకు పోలీసులు హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో దంచికొట్టింది.. మచ్చబొల్లారం, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, మలక్‌పేట, మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్, జియాగూడ, పురానాపూల్, బహదూర్ పురా, ఫలక్‌నూమా, చాంద్రాయణగుట్ట, అఫ్జల్‌గంజ్, లక్డీకాపూల్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, సికింద్రాబాద్, కూకట్పల్లి, బాలానగర్, బోయిన్పల్లి, శేరిలింగంపల్లి, చిలకలగూడ, తిరుమలగిరి, మారేడుపల్లి, ప్యాట్నీ సెంటర్, బేగంపేట్, సోమాజిగూడ, రాంనగర్, తార్నాక, ఓయూ, అంబర్‌పేటలతో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. చదవండి: ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్ గంటల తరబడి ట్రాఫిక్‌జాం జడివాన కారణంగా నగరంలో ట్రాఫిక్‌జాం సిటీజన్లకు చుక్కలు చూపించింది. వరద నీరు పోటెత్తడంతో సాయంత్రం 6 నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పలు ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రహదారులపై నిలిచిన వరద నీటిని తొలగించేందుకు, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు, బల్దియా అత్యవసర బృందాలు నానా కష్టాలు పడ్డాయి. -
హైదరాబాద్ లో భారీ వర్షం
-
హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్‌లో పలు చోట్ల సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వేడి, ఎండ తీవ్రత నుంచి నగర వాసులు కాస్త ఉపశమనం పొందారు. నగరంలోని కూకట్పల్లి,బాచుపల్లి,నిజాంపేట, జీడిమెట్ల, షాపూర్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాహదారులు జలమయవడంతో.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చదవండి: రాష్ట్రానికి నైరుతి.. -
హైదరాబాద్‌లో చిరుజల్లులు.. రాగల 48 గంటల పాటు వర్షాలు..
సాక్షి, హైదరాబాద్: నగరంలో గత రెండు రోజుల నుంచి అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో శనివారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నగరంలో శనివారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్, పంజగుట్టతోపాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగాతాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చదవండి: కుండపోత వర్షాలతో హైదరాబాద్ మునక.. ఏటా ఇదే సీన్.. అయినా! కాగా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ విభాగం అధిపతి కే నాగరత్న తెలిపారు.. హైదరాబాద్ సహా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటిందని.. దీని ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని తెలిపారు. ప్రభావంతో రాగల 48 గంటల్లో హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని, యాదాద్రి భువనగిరి, నల్గొండలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. -
కుండపోత వర్షాలతో హైదరాబాద్ మునక.. ఏటా ఇదే సీన్.. అయినా!
సాక్షి, హైదరాబాద్: వానకాలం..చలికాలం...ఇలా సీజన్‌తో సంబంధం లేకుండా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏటా గ్రేటర్ సిటీ నిండా మునుగుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి నవంబర్ 19 వరకు సరాసరిన 21.8 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో సాధారణం కంటే 50 శాతానికి పైగా అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. అల్పపీడనం, వాయుగుండం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం, ఇలా పలు కారణాలతో ప్రతి నెలా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కుండపోతగా వర్షపాతం... జీహెచ్ఎంసీ పరిధిలోని 28 మండలాల్లో అల్వాల్, కుత్భుల్లాపూర్, పటాన్చెరు మినహా..ఈ ఏడాది జూన్ నుంచి నవంబరు 19 వరకు సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో ఏకంగా 50 శాతానికంటే అధిక వర్షపాతం నమోదవడం విశేషం. విశ్వవ్యాప్తంగా వాతావరణ పరంగా చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులు, ఎల్‌నినో, లానినో ప్రభావాలు, గతితప్పిన రుతుపవనాలు, సముద్రంలో తరచూ ఏర్పడుతున్న అల్లకల్లోల పరిస్థితులు, అల్పపీడనాలు, వాయుగుండాలు, తీవ్ర తుపానులు కూడా సీజన్‌తో సంబంధం లేకుండా అకాల వర్షాలకు కారణమౌతున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. వరద నీరు వెళ్లే దారేదీ... నగరంలో గంట వ్యవధిలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసినా.. నిండా మునుగుతోంది. సుమారు 300 బస్తీలు ఏటా ముంపునకు గురవుతున్నట్లు బల్దియా లెక్కలు చెబుతున్నాయి. గతంలో ముంపు సమస్యల పరిష్కారానికి ముంబై ఐఐటీ నిపుణులు, కిర్లోస్కర్ కమిటీ సూచనలు, తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నిపుణులు చేసిన సూచనల అమలుపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఏటా ఇవే సీన్లు పునరావృతమౌతుండడం గ్రేటర్ పిటీ. నాలాల ఆక్రమణల పరిస్థితీ అలాగే ఉంది. -
క‘న్నీటి’ రాత్రి: ఏడాది గడిచినా మానని గాయాలు
సాక్షి, శంషాబాద్: అది ఓ కాళ రాత్రి.. ఇంకా చెప్పాలంటే కొన్ని కుటుంబాలకు కన్నీటిని మిగిల్చింది ఆ రాత్రి. వందేళ్ల తర్వాత నగర చరిత్రలో అతి భారీ వర్షం కురిసి గతేడాది అక్టోబరు 13న నగర శివారులోని పలు ప్రాంతాలను నిలువునా ముంచేసింది. కొందరు ప్రాణాలను కోల్పోతే మరికొందరికి నిలువున నీడలేకుండా చేసింది. చదవండి: భూమ్మీదే కాదు.. అక్కడా వరదలు ముంచెత్తాయి! కుండపోతగా వర్షం నగరంతో పాటు రాజేంద్రనగర్ ప్రాంతంలో 25 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్షాలతో గగన్‌పహాడ్‌లోని అప్పాచెరువు తెగి దిగువ ప్రాంతమైన ఫకీర్ గుట్టలో నివాసం ఉంటున్న సాధిక్ కుటుంబంలో ఒకరు మినహా మిగిలిన వారంతా మృతిచెందారు. రెండు బస్సులు, పదికి పైగా కార్లు వరదలో కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు. చదవండి: బ్లేడ్‌తో చేయి కోసుకుని, తల పగులగొట్టుకొని, కప్పు పెంకులు నమిలి.. దెబ్బతిన్న జాతీయ రహదారి 44వ జాతీయ రహదారి సైతం వరద ఉదృతితో పూర్తిగా దెబ్బతింది. గతంలో ఎన్నడు లేనంతగా రహదారిపై తొలిసారి రాకపోకలను రెండు రోజులపాటు నిషేదించి ప్రత్యామ్నాయ మార్గాలవైపు వాహనాలను అధికారులు దారి మళ్లించారు. అదృశ్యమైన విదేశీయుడు అర్థరాత్రి సమయంలో మెహిదీపట్నం నుంచి క్యాబ్‌లో బయలుదేరిన సుడాన్ దేశీయుడు మహ్మద్ మావియా గగన్‌పహాడ్ వరద ఉధృతిలోనే కొట్టుకుపోయినట్లు అతడి స్నేహితులు అనుమానిస్తున్నారు. తమ స్నేహితుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరలేదని అతడిఫోన్ కూడా స్విచ్ఛాప్ అయిందని ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో కూడా నేటి వరకు అతడి గురించి స్పష్టమైన సమాచారం దొరకకపోవడంతో మిస్సింగ్ కేసుగానే ఉండిపోయింది. చదవండి: ‘పండగ పూటా పస్తులేనా?.. మేమేం పాపం చేశాం’ -
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, పంజాగుట్ట, బేగంపేట్, లక్డికాపూల్, వనస్థలిపురం, హైటెక్ సిటీ, ఎల్బీనగర్, అంబర్‌పేట, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే గత పది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అతలాకుతలమైంది. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో నగరంలోని ఆయా ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే డ్రైనేజీలన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. నాలాలు కూడా పొంగిపొర్లుతున్నాయి. ప్రతి రోజూ కురుస్తున్న వర్షాలతో ప్రజలు భయానికి గురికావాల్సి వస్తోంది. పలుప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు జగద్గిరిగుట్ట 8.5 సెం.మీ, షాపూర్ 7.6సెం.మీ, జీడిమెట్ల 7.5సెం.మీ, గాజుల రామరం 7.4సెం.మీ, జహీరాబాద్ 6.5సెం.మీ, దూలాపల్లి 6సెం.మీ గా ఉన్నాయి. -
ఇన్‌ఫ్లో చా‘నిల్’
సాక్షి,హైదరాబాద్ : ఒకవైపు క్యుములోనింబస్ మేఘాలు కుమ్మే శాయి. కుండపోతకు నగరం గజగజలాడింది. మరోవైపు నగర దాహార్తిని తీర్చే జంటజలాశయాలు వెలవెలబోయాయి. నగరంలోని ఏ రోడ్డుపై చూసినా నడుంలోతు వరకు నీరే... కానీ, ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లలో కనీసం ఒక్క అడుగైనా నీటిమట్టం పెరగలేదు. రహదారులన్నీ గోదారులయ్యాయి. కానీ, నీటికాల్వలన్నీ మూసుకుపోయాయి. ఇదీ సోమవారం కనిపించిన దృశ్యాలు. జూబ్లీహిల్స్, షేక్‌పేట్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యన 6.7 సెం.మీ. కుంభవృష్టి కురిసింది. శేరిలింగంపల్లి, మాదాపూర్ ప్రాంతాల్లోనూ రెండు గంటల్లో 6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల క్యుములోనింబస్ ప్రభావంతో కొన్నిచోట్ల కుండపోత వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. గతేడాది కంటే తక్కువే ఉస్మాన్‌సాగర్(గండిపేట్) గరిష్టమట్టం 1,790 అడుగులకుగాను ప్రస్తుతం 1,762.300 అడుగులమేర మాత్రమే నీటినిల్వలున్నాయి. హిమాయత్‌సాగర్ గరిష్టమట్టం 1,763.500 అడుగులకుగాను ప్రస్తుతం 1,741 అడుగుల మేర నీటినిల్వలున్నాయి. ఈ సీజన్లో జూన్–సెపె్టంబర్ మధ్యకాలంలో జలాశయాల ఎగువ ప్రాంతాల్లోని చేవెళ్లలో 26 శాతం, శంకర్పల్లి మండలంలో 37 శాతం తక్కువ వర్షపాతం నమోదవడం కూడా నీటిమట్టాలు పెరగకపోవడానికి మరో కారణమని జలమండలి అధికారులు చెబుతున్నారు. హిమాయత్ సాగర్ రోజురోజుకూ చిన్నబోతూ... జంటజలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన జీవో 111 పరిధిలో ఉన్న సుమారు 84 గ్రామాల నుంచి జంటజలాశయాలకు వరదనీటిని చేర్చే కాల్వలు(ఇన్‌ఫ్లో చానల్స్) కబ్జాకు గురవడం, ఇటుకబట్టీలు, ఇసుక మాఫియాకు అడ్డాలుగా మారడం, ఫాంహౌస్‌లు, ఇంజనీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారడంతో దారులు మూసుకుపోయాయి. దీంతో జలాశయాలు రోజురోజుకూ చిన్నబోతున్నాయి. దాహార్తి తీర్చడానికి.. నిత్యం ఈ రెండు జలాశయాల నుంచి జలమండలి 113 మిలియన్ లీటర్ల నీటిని నగర తాగునీటి అవసరాలకు తరలిస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం జంటజలాశయాల్లో ప్రస్తుతం డెడ్‌స్టోరేజి నిల్వలున్నాయి. పానీ పరేషాన్ లేదు గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న నాగార్జునసాగర్(కృష్ణా), ఎల్లంపల్లి(గోదావరి) జలాశయాల్లోకి ఇటీవల భారీగా వరదనీరు రావడంతో ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాలతో నిండుకుండల్లా మారాయి. నగరానికి నిత్యం కృష్ణా మూడు దశలు, గోదావరి మొదటి దశసహా జంటజలాశయాల నుంచి మొత్తంగా 2,115 మిలియన్ లీటర్ల నీటిని సేకరించి శుద్ధి చేసి నగరంలోని 9.80 లక్షల నల్లాలకు కొరత లేకుండా సరఫరా చేస్తున్నాం. గ్రేటర్‌కు మరో ఏడాదివరకు పానీ పరేషాన్ ఉండబోదని భావిస్తున్నాం. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
భారీగా వర్షం.. మెట్రో సర్వీసులపైనా ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. వరుసగా రెండోరోజూ కుండపోతగా వర్షం కురుస్తుండటంతో హైదరాబాద్ నగరం స్తంభించిపోయింది. జీనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయి.. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వర్షం సృష్టించిన బీభత్సంతో చాలాచోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. ఎర్రమంజిల్ వద్ద రోడ్డు పూర్తిగా వరదనీటిలో మునిగిపోయి.. నిండు చెరువును తలపిస్తోంది. వర్షం ప్రభావం నగరంలోని మెట్రో రైలు సర్వీసులపైన పడింది. భారీగా వర్షం కురుస్తుండటంతో ఎల్బీనగర్-అమీర్‌పేట్-మియాపూర్ మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మెట్రోట్రాక్‌పై వర్షపు నీరు చేరడంతో గంటకుపైగా రైళ్లు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
భారీ వర్షం.. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మంత్రి కేటీఆర్ సైతం ట్రాఫిక్‌లో ఇరుకున్నారు. భారీ వర్షంతో బంజారాహిల్స్ కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అటుగా వెళ్తున్న మంత్రి కేటీఆర్ వాహనం సైతం ట్రాఫిక్‌లో నిలిచిపోయింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దయిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం కాస్తా తెరపి ఇచ్చినా.. సాయంత్రానికి మళ్లీ భారీ వర్షం మొదలైంది. ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్, అబిడ్స్, కోఠీ, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్, మీర్పేట్, వనస్థలిపురం, ఎల్బీనగరలో భారీ వర్షం కురుస్తోంది. కాగా వర్షాలపై జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది. భారీ వర్షాలతో ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 13 డిజాస్టర్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. నగరంలో మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారుల తెలిపారు.రానున్న రెండు గంటల పాటు ఉద్యోగులు కార్యాలయాల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మెట్రో సర్వీసులకు అంతరాయం భారీ వర్షం కారణంగా ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్, మియాపూర్ రూట్లో మెట్రో సర్వీసులకి అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటకు పైగా రైళ్లు నిలిచిపోయాయి. ట్రాక్‌పైకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం..!
సాక్షి, హైదరాబాద్ : వేసవితో అల్లాడుతున్న నగరవాసులను మళ్లీ వర్షం పలుకరించింది. మంగళవారం సాయంత్రం నగరంలో పలుచోట్ భారీ వర్షం కురుస్తోంది. వర్షంతోపాటు భారీగా ఉరుములు, మెరుపులు చోటుచేసుకోవడం.. గాలులు బలంగా వీస్తుండటం నగరవాసులను కలవరపెడుతోంది. మాదాపూర్, కూకట్పల్లి, గచ్చీబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో వర్షం కురుస్తోంది. దీంతో ఆఫీసుల, వివిధ పనుల నుంచి ఇంటికివెళ్లే వారు రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్నారు. ఆకస్మిక వర్షం పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీనికితోడు గాలి దుమారం రేగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం ప్రాంతాల్లోనూ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా విద్యుత్ నిలిచిపోయింది. -
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా..
సాక్షి, హైదరాబాద్ : క్యుములోనింబస్ మేఘాల కారణంగా రుతుపవనాలు రాకముందే వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్ నగరంలో సోమవారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పలుచోట్ల వర్షాలు కురిశాయి. దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, కర్మన్‌ఘాట్ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. తర్వాత వాతావరణం మేఘాలు కమ్ముకుని, కొన్నిచోట్ల వర్షం పడింది. పలుచోట్ల బలమైన గాలులు వీచాయి. నగరంలో ఇంకా మేఘాలు కమ్ముకున్నాయి. కాగా, తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. రానున్న నాలుగైదు రోజుల వరకు ఇదే రకమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకేరోజు భిన్న వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
హైదరాబాద్‌లో ఎన్నెన్ని వింతలో.. !
సాక్షి, హైదరాబాద్: చినుకు పడితే.. వణికిపోయే పరిస్థితి హైదరాబాద్ వాసిది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు నగరవాసులకు చుక్కలు చూపించాయి. ప్రత్యక్ష నరకమంటే ఎలా ఉంటుందో రుచిచూపించాయి. వరుస వర్షాలు.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రాఫిక్ జామ్‌లు, చెరువులను తలపిస్తున్న రోడ్లు, నీటమునిగిన కాలనీలు.. పాలకులు భాగ్యనగరాన్ని విశ్వనగరం చేస్తామని చెప్తున్నా.. చిన్న వానలకే అతలాకుతలం అయ్యే పరిస్థితి నెలకొంది. తాజా వర్షాలకు నగరంలో పలు వింతలు చోటుచేసుకున్నాయి. నగరం రోడ్ల మీద ఎప్పుడైనా పడవల్లో ప్రయాణించారా? కానీ ఆ లోటును తాజా వర్షాలు తీర్చాయి. సరదాగా కాకపోయినా తాజా వానలకు పడవలో తప్ప బయట కాలుపెట్టలేని పరిస్థితి. దీంతో నీటిమునిగిన రామాంతపూర్లాంటి పలు ప్రాంతాల్లో సిటీ జనులు పడవల్లో బయటకు వచ్చారు. ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉండే సిటీ రోడ్లపై పడవల్లో ప్రయాణిస్తూ.. 'ఇదేమీ లాహిరి.. ఇదేమీ అలజడి' అంటూ పాడుకున్నారు. అక్కడెక్కడో ఉన్న వెనీస్ నగరం హైదరాబాద్‌కు వచ్చేసినట్టు ఫీలయ్యారు. ఒకే రోజు.. నాలుగు కాలాలు! కాలం మారింది. కాలాలు మారిపోయాయి. ఒకప్పుడు వానకాలం తర్వాత చలికాలం, చలికాలం తర్వాత ఎండాకాలం వరుసగా వచ్చేవి. కానీ, ఇప్పుడిది కలికాలం కదా.. అన్నీ ఒకే రోజు కనిపిస్తున్నాయని నగరవాసులు చమత్కరిస్తున్నారు. తాజా వర్షాలకు నగర వాతావరణంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షాలు.. ఇలా భిన్నమైన పరిస్థితి.. ఇలా ఒకే రోజు భిన్న కాలాలు చూసే అదృష్టం హైదరాబాద్‌లోనే ఉంటుందంటూ నెటిజనులు.. సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో జోకులు పేలుస్తున్నారు. నగరంలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు వసంతకాలం, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండాకాలం, సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు వర్షాకాలం, రాత్రి 10 గంటల ఉదయం 6 గంటల వరకు చలికాలం.. ఇలా ఒకేరోజు నాలుగు కాలాలను చూసే అదృష్టం నగరవాసికి దొరుకుతుందని ఛలోక్తులు విసురుతున్నారు. -
జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ఆదేశాలు!
సాక్షి, హైదరాబాద్: సోమవారం కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అల్లాడిపోయింది. దీనికితోడు మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ బీ జనార్దన్‌రెడ్డి నగర పరిధిలోని ఏసీపీలకు, సిబ్బందికి కీలక సూచనలు జారీచేశారు. వరుస వర్షాల నేపథ్యంలో నగరంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, జీహెచ్ఎంసీ సూచనలు తప్పకుండా పాటించాలని నిర్దేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ సిబ్బంది, ఏసీపీలకు కమిషనర్ ఈ కింది కీలక ఆదేశాలు జారీచేశారు. మీ పరిధిలోని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ముఖ్యంగా శిథిలమైన భవనాలు, దెబ్బతిన్న కట్టడాలపై సత్వరమే చర్య తీసుకోండి. ప్రమాదకర స్థితిలో ఉన్న శిథిలమైన భవనాలను ఖాళీచేయించడం, సీల్ చేయడం లేదా కూల్చివేయండి. శిథిలమైన పురాతన కాంపౌండ్ వాల్స్, రిటైనింగ్ వాల్స్‌పై చర్య తీసుకోండి పురాతన ప్రభుత్వ పాఠశాల భవనాలను తనిఖీ చేయండి. వాటి పరిసరాల్లో ఎవరైనా ఉంటే ఖాళీ చేయించండి సెల్లార్ (గ్రౌండ్ ఫ్లోర్) తవ్వకాలను అనుమతించకండి. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోండి. ఏసీపీలందరూ సెల్లార్ సైట్‌ను తనిఖీ చేయాలి. ఇప్పటికే సెల్లార్‌ను తవ్వి ఉంటే.. నేలను గట్టిపరచడం, నేయిలింగ్ వంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా యజమానులకు సూచించండి. సెల్లార్లను మరింతగా తవ్వకుండా నిలువరించండి. కొండప్రాంతాలైన బంజారాహిల్స్, జుబ్లీహిల్స్ మొదలైన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టండి. కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలను తప్పించేవిధంగా ప్రజలను అప్రమత్తం చేసి.. కొండ దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని తరలించేందుకు వీలుగా చర్యలు తీసుకోండి. శిథిలమైన భవనాలకు నోటీసు బోర్డులు తగిలించండి. ప్రజలు వాటివద్దకు వెళ్లకుండా ఉండేలా బ్యారికేడ్లు పెట్టండి. పురాతన భవనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడండి. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది, యంత్రాలు అందుబాటులో ఉండేలా చూసుకోండి. కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే అలర్ట్ మెసేజ్‌లు, ఐఎండీ, మీడియా నుంచి అందే వాతావరణ రిపోర్ట్స్ పట్ల అలర్ట్‌గా స్పందించండి. -
హైదరాబాద్‌లో వర్షాలు.. తాజా అప్డేట్!
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు ముంచెత్తిన హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం కూడా పరిస్థితి కుదుటపడలేదు. సోమవారం కురిసిన భారీ వర్షాల ధాటికి నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. చాలాచోట్ల వరదనీరు రోడ్లపై పొంగిప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రోడ్ల మీద వర్షపునీరు భారీగా చేరడంతో పలుచోట్ల అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీనికితోడు వర్షపునీరు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రధాన మార్గాల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కేబీఆర్ పార్క్-పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా బేగంపేట నుంచి సికింద్రాబాద్ వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ఎల్బీనగర్-కోఠి మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడం నగరవాసులను ఇబ్బందులకు గురిచేసింది. గడ్డి అన్నారం డివిజన్లోని కోదండరాం నగర్ నీటమునగడంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ ఉన్న ఎస్సీ హాస్టల్లోకి నీరు చేరింది. దీంతో హాస్టల్లోని విద్యార్థులకు స్థానిక కార్పొరేటర్ భవానీ ప్రసాద్ ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. మసాబ్ ట్యాంక్, అహ్మద్ నగర్, మణికొండ పంచవటీ కాలనీలో భారీగా రోడ్లపై నీరు చేరడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు. నాలాకు గండి హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్ సమీపంలోని అహ్మద్‌నగర్‌లో నాలాకు గండి పడటంతో... మురుగు నీరంతా బస్తీల్లోకి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది, స్థానికులు మరమత్తులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడి పరిస్థితిని మా కరస్పాండెంట్ సిద్ధేశ్వర్ అందిస్తారు. ఓయూలో సెలవు సోమవారం సాయంత్రం హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు ముంచెత్తడంతో ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా మంగళవారం సెలవు ప్రకటించింది. నగరంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు యూనివర్సిటీకి సెలవు ప్రకటిస్తున్నామని, మంగళవారం జరగాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేశామని, వాయిదా వేసిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని ఓయూ ఒక ప్రకటనలో తెలిపింది. -
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్ ఇక్కట్లు!
సాక్షి, హైదరాబాద్ : నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వానతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు విస్తరించడంతో భారీ వాన కురుస్తోంది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మేఘాలు భారీగా విస్తరించి ఉన్నాయని, మరో మూడు గంటల పాటు హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. హబ్సీగూడ, తార్నాక, నాచారం, పెద అంబర్ పేట్, ముషీరాబాద్, నారాయణగూడ, ట్యాంక్ బండ్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీ వాన కురుస్తోంది. వానకు తోడు ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. ఇక మేడ్చల్ జిల్లాలోని కీసర, నాగారం, దమ్మాయిగూడ, కాప్రా, కుషాయిగూడ, చర్లపల్లి, ఈసీఐఎల్, ఏఎస్ రావు నగర్, నెరెడ్ మెట్ ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వాన కురుస్తుంది. ఉప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జాం! భారీ వర్షాలతో ఉప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో నల్లచెరువు కట్టపై 13 చెట్లు నేలకూలాయి. చెరువు పొంగి రోడ్లపైకి నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రాంతంలో రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి. నల్లచెరువు పొంగిపొర్లుతుండటంతో చెంగిచర్ల వైపు రహదారి పూర్తిగా మునిగిపోయింది. దీంతో అటు నుంచి వచ్చే భారీ వాహనాలు, ట్రక్కులు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లడం సురక్షితమని అధికారులు సూచిస్తున్నారు. -
‘అవార్డులపై శ్రద్ధ...సమస్యలపై లేదు’
హైదరాబాద్: చిన్నపాటి వర్షానికే గ్రేటర్ హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారుతోందని, మంత్రి కేటీఆర్‌కు ఈ విషయం కనబడటం లేదా అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. హైదరాబాద్‌ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్న కేసీఆర్, కేటీఆర్ మాటలు ఎటు పోయాయి అని నిలదీశారు. కేటీఆర్‌కు అవార్డులు తీసుకోవడంపై ఉన్న శ్రద్ధ.. సమస్యల పరిష్కారంపై లేదని దుయ్యబట్టారు. మంత్రి కేటీఆర్ గాలిమాటలు మాని, పరిష్కారాలపై దృష్టి పెట్టాలని కోరారు. సీఎం కేసీఆర్‌కు ధైర్యం ఉంటే అన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరపాలని సవాల్ విసిరారు. ఒక్క నల్లగొండే కాదు ఫిరాయింపులకు పాల్పడిన నలుగురు ఎంపీ, 25 ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో అప్పుడు తెలుస్తుందని అన్నారు. ఒకే దేశం, ఒకే పన్ను అన్న ప్రధానమంత్రి మోదీ... డీజిల్ ,పెట్రోల్‌పై వేర్వేరుగా జీఎస్టీ ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. -
ఇలా అయితే మనది గ్లోబల్ సిటీ కాదు: కేటీఆర్
నగరంలోని రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నా చిన్నపాటి వర్షానికే రోడ్లు పాడైపోతున్నాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నగరంలో రోడ్ల పరిస్థితిపై ఆయన సోమవారం ఉదయం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్ల పరిస్థితి కారణంగా.. 9 గంటలకు సమావేశానికి రావాల్సిన తాను 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చానని తెలిపారు. అంబులెన్సుకు కూడా దారి ఇవ్వకపోతే మనది గ్లోబల్ సిటీ కాదని ఆయన చెప్పారు. ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోతున్నామని, అవసరమైతే చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అన్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం ఎందుకు ఉంటోందని ప్రశ్నించారు. రోడ్లు వేసిన వెంటనే వాటికి తూట్లు పొడుస్తున్నారని గుర్తుచేశారు. ఇకమీదట రోడ్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. -
హైద్రాబాద్‌లో వడగండ్ల వాన