సాక్షి, హైదరాబాద్: నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. వరుసగా రెండోరోజూ కుండపోతగా వర్షం కురుస్తుండటంతో హైదరాబాద్ నగరం స్తంభించిపోయింది. జీనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయి.. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వర్షం సృష్టించిన బీభత్సంతో చాలాచోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. ఎర్రమంజిల్ వద్ద రోడ్డు పూర్తిగా వరదనీటిలో మునిగిపోయి.. నిండు చెరువును తలపిస్తోంది. వర్షం ప్రభావం నగరంలోని మెట్రో రైలు సర్వీసులపైన పడింది. భారీగా వర్షం కురుస్తుండటంతో ఎల్బీనగర్-అమీర్‌పేట్-మియాపూర్ మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మెట్రోట్రాక్‌పై వర్షపు నీరు చేరడంతో గంటకుపైగా రైళ్లు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment