Metro Rail Corporation
-
మెట్రో రెండో దశ పనులకు గ్రీన్‌సిగ్నల్.. కారిడార్-9లో ఎయిర్‌పోర్టు-ఫోర్త్ సిటీ
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెండో దశ పనుల్లో భాగంగా ఐదు మార్గాల్లో పనులు జరుగనున్నాయి. మొత్తం ఐదు మార్గాల్లో మెట్రో నిర్మాణం కానుంది. ఆరు కారిడార్లలో 116.4 కిలో మీటర్ల మేర కొత్త మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రెండో దశ నిర్మాణానికి రూ.24,269 కోట్ల అంచనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మెట్రో నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.7,333కోట్లు. కేంద్రం వాటాగా రూ.4,230 కోట్లుగా ఉండనుంది.హైదరాబాద్‌లో మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త మార్గాల పనులకు పరిపాలన అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది. ఈ క్రమంలోనే రెండో దశ నిర్మాణానికి రూ.24,269 కోట్ల అంచనాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ పనులు జరుగనున్నాయి. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా(30 శాతం) రూ.7,333కోట్లు. కేంద్రం వాటాగా(18 శాతం) రూ.4,230 కోట్లు కేటాయింపులు చేసింది. అలాగే, అప్పుగా రూ.11,693 కోట్లు, ప్రైవేటు సంస్థల నుంచి రూ.1,033 కోట్లు(52 శాతం నిధులు) సేకరించనున్నారు.కారిడార్లు ఇలా.. కారిడార్-4లో నాగోల్-శంషాబాద్(36.8 కి.మీ)కారిడార్-5లో రాయదుర్గం-కోకాపేట. కారిడార్-6లో ఎంజీబీఎస్-చాంద్రాయాణగుట్ట. కారిడార్-7లోమియాపూర్-పటాన్చెరు, కారిడార్-8లో ఎల్బీనగర్-హయత్‌నగర్. కారిడార్-9లో ఎయిర్‌పోర్టు-ఫోర్త్ సిటీ.(40 కిలోమీటర్లు). -
షాకింగ్ ఘటన: రైల్వే పట్టాలపై కూలిన డ్రోన్
ఢిల్లీ మెట్రో స్టేషన్లో అనుహ్య ఘటన చోటు చేసుకుంది. మెట్రో రైలు పట్టాలపై ఒక డ్రోన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై హెచ్చరికలు జారీ చేసి ఢిల్లీ మెట్రో జసోలా విహార్ స్టేషన్‌ను కొద్దిసేపు తాత్కాలికంగా మూసేశారు. ఈ మేరకు పోలీసులు ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. విచారణలో ఈ డ్రోన్ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందినదని అధికారులు తెలిపారు. తనిఖీల్లో డ్రోన్‌లో కొన్ని మందులు దొరికాయని తెలిపారు. మందులను పంపేందుకు కంపెనీ డ్రోన్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అయినా హై సెక్యూరిటీ ఉన్న ప్రాంతాల్లో డ్రోన్లు ముప్పు పొంచి ఉందని అలాంటి ప్రదేశాల్లో ఎలాంటి డ్రోన్లు ఉపయోగించకూడదని అధికారులు తెలిపారు. అయినా అధికారుల అనుమతి లేకుండా వాటిని ఉపయోగించడం చట్టం విరుద్ధమని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మెట్రో స్టేషన్‌ని పునః ప్రారంభించారు. భద్రతా కారణాల దృష్ట్యా జసోలా విహార్ షాహీన్ బాగ్ నుంచి బొటానికల్ గార్డెన్ మధ్య మెట్రో రైలు సేవలు అందుబాటులో లేవని, మిగిలిన లైన్లో యథావిధిగా సేవలు కొనసాగుతున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ట్వీట్ చేసింది. (చదవండి: జమ్మూ కశ్మీర్లో భారీగా మారణాయుధాలు పట్టివేత) -
Hyderabad Metro: మెట్రోను ఆదుకుంటాం!
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రయాణికులు తగ్గి నష్టాల్లో కూరుకుపోయిన హైదరాబాద్ మెట్రో రైల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ఈ దిశగా ఏమేం అవకాశాలు ఉన్నాయో అన్వేషిస్తామని.. మెట్రో రైలు తిరిగి గాడినపడేలా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. మెట్రో రైల్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ అధికారులు మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కరోనా, లాక్డౌన్లతో మెట్రోకు నష్టాలు, పేరుకుపోతున్న రుణాలు, వడ్డీల భారాన్ని వివరించి.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వల్ల అన్నిరంగాల తరహాలోనే మెట్రో రైల్ కూడా ఇబ్బందుల్లో పడిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దినాదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని, భవిష్యత్తులో మరింతగా విస్తరించాల్సి ఉందని చెప్పారు. అన్ని రంగాలను ఆదుకున్నట్టే హైదరాబాద్ మెట్రోను కూడా గాడిలో పెట్టడానికి తోడ్పడతామని హామీ ఇచ్చారు. ఎటువంటి విధానాలు అవలంబించడం ద్వారా మెట్రోకు మేలు చేయగలమో విశ్లేషిస్తామని, మెట్రో తిరిగి పుంజుకోవడంతోపాటు సేవల విస్తరణకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీనకి సంబంధించి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో.. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్, పురపాలక శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మెట్రో రైల్‌ను ఆదుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలపై అధ్యయనం చేసి, త్వరగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ఆదేశించారు. జాప్యంతో వ్యయం పెరిగి.. హైదరాబాద్ మెట్రో రోజుకు రూ.కోటి నష్టంతో నడుస్తోంది. మూడు మార్గాల్లో 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉన్నా.. ప్రయాణికుల ఆదరణ అంతంతగానే ఉంది. తొలుత రూ.16 వేల కోట్ల అంచనాతో మెట్రో చేపట్టినా.. నిర్మాణం రెండేళ్లు ఆలస్యం కావటంతో వ్యయం 19 వేల కోట్లకు పెరిగింది. ఈ మేరకు పెరిగిన నిర్మాణ వ్యయాన్ని చెల్లించాలని మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రభుత్వాన్ని కోరింది. ఇక కరోనా కారణంగా రూ.300 కోట్లు నష్టం వాటిల్లినట్టు ఎల్అండ్టీ చెప్తోంది. -
మెట్రో రైల్ కార్యాలయం ప్రారంభం
-
స్టీల్‌ప్లాంట్ నుంచి భోగాపురం వరకూ మెట్రో రైలు
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభం అయ్యాయి. నగరంలో ఎల్ఐసీ భవన్ మూడో అంతస్తులో రీజనల్ కార్యాలయాన్ని మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ ఆదివారం ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే అదీప్ రాజ్, జీవీఎంసీ కమిషనర్ సృజన పాల్గొన్నారు. అధికారులు.. మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్‌ను మంత్రులకు వివరించారు. (పోలవరానికి నిధులు రాబట్టండి) కాగా విశాఖలో 79,91 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో కారిడార్, 60.29 కిలోమీటర్ల మేర మోడ్రన్ ట్రామ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచే ఈ ప్రాజెక్ట్‌ను అధికారులు పరిశీలించేందుకు సన్నద్ధం అవుతున్నారు. వచ్చే రెండు నెలల్లో మెట్రో ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం కానున్నాయి. డీపీఆర్‌లపై కన్సల్టెంట్లతో చర్చలు, ఇతర అంశాలపై చర్చించాలనే ఉద్ధేవంతో విశాఖలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. స్టీల్‌ప్లాంట్ నుంచి భోగాపురం వరకూ మెట్రో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘మొదట గాజువాక నుంచి కొమ్మాది వరకూ మెట్రో అనుకున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న అవసరాల దృష్ట్యా మెట్రో దూరాన్ని పెంచమని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మెట్రో రైలు స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ దూరం పెంచి డీపీఆర్ తయారు చేస్తున్నాం. యూఎంటీసీ (Umtc) సంస్థకు మెట్రో డీపీఆర్ తయారు చేయమని చెప్పాం. నవంబర్ మొదటి వారంలో డీపీఆర్ ఇస్తామని చెప్పారు. దసరా కావడంతో మెట్రో రైల్ కార్యాలయం ప్రారంభించాం. డీపీఆర్ తయారు చేశాక ముఖ్యమంత్రి ఆమోదంతో టెండర్లు పిలుస్తాం. విశాఖ మెట్రోకు కేంద్ర సహాయ సహకారాలు అవసరం. విశాఖను దేశంలో గొప్ప నగరంగా అభివృద్ధి చేయాలని చూస్తునాం’ అని అన్నారు. విశాఖ చరిత్రలో మర్చిపోలేని రోజు .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి ఆలోచన, విజన్‌తో విశాఖకు మెట్రో కేటాయించారు. విశాఖకు మెట్రో రైల్ వస్తే ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారిపోతాయి. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేసింది. ప్రతిపక్ష పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి అని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ట్రాఫిక్ పెరిగే కొద్దీ కోచ్ లు పెంచుకోవచ్చు.. మెట్రో రైల్‌ఎండీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. లైట్ మెట్రోతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ట్రాఫిక్ పెరిగే కొద్దే కోచ్‌లు పెంచుకోవచ్చని, లైట్ మెట్రోకు కిలోమీటర్‌కు 200 కోట్ల రూపాయిలు ఖర్చు అవుతుందని తెలిపారు. -
‘రెయిన్ బో’.. ఇది ప్రత్యేకంగా వారి కోసమే
లక్నో: నోయిడా మెట్రో రైల్ కార్పోరేషన్(ఎన్ఎమ్ఆరస్సీ) బుధవారం ‘ఆక్వా’ లైన్‌లోని (ఈ లైన్ నోయిడా స్టేషన్ నుంచి గ్రేటర్ నోయిడా స్టేషన్‌కు వెళుతుంది) ‘సెక్టార్ 50’ స్టేషన్‌ను ట్రాన్స్జెండర్లకు కేటాయించింది. దాని పేరును ‘రెయిన్ బో’గా మార్చింది. ఈ మేరకు ఎన్ఎమ్ఆర్సీ మేనేజింగ్ డైరెక్టర్ రీతూ మహేశ్వరి బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘వ్యక్తులు, ఎన్జీఓల సలహాల తర్వాత.. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని ఉద్దేశించి ‘సెక్టార్ 50’ స్టేషన్ పేరును ‘రెయిన్ బో’గా మార్చాం. ట్రాన్స్జెండర్లు సాధికరత సాధించాలనే గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. వారి కాళ్ల మీద వారు నిలబడేందుకు ఎన్ఎమ్ఆర్సీ ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఈ స్టేషన్లో వారి కోసం ప్రత్యేక సదుపాయాలు, వసతులు ఏర్పాటు చేస్తాం’ అన్నారు. (మీ ముద్దు మాకొద్దు) అంతేకాక అక్కడ దిగి, ఎక్కే ట్రాన్స్‌జెండర్ ప్రయాణికులకు కూడా ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయని రీతూ మహేశ్వరి తెలిపారు. అంతేకాక నోయిడా మెట్రోలో ఉన్న ట్రాన్స్‌జెండర్ స్టాఫ్ అందరినీ అక్కడికి బదలీ చేస్తామన్నారు. అందులోని వివిధ విభాగాలలో, కౌంటర్లలో ట్రాన్స్జెండర్లే ఉంటారని తెలిపారు. ఇది పూర్తిగా వారి కోసం కేటాయించిన స్టేషన్ అన్నారు. అయితే తొలుత ఈ ‘సెక్టార్ 50’ స్టేషన్ పేరును ‘షీ మ్యాన్’గా మారుస్తూ.. నోయిడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీర్మానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమయ్యింది. ఈ నిర్ణయం పట్ల ట్రాన్స్జెండర్లు నిరసన వ్యక్తం చేయడంతో చివరకు ‘రెయిన్ బో’గా మార్చారు. -
మీకు ఇలాంటి సంఘటన ఎదురైందా ?
-
వైరల్ వీడియో: ఇలాంటి వ్యక్తిని మీరు చూశారా!
ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం మెట్రో రైల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. మెట్రో అందుబాటులోకి రావడంతో ఎంతోమంది ఉద్యోగులకు ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి. మెట్రో ద్వారా కొన్ని లక్షల మంది తమ గమ్యస్థానాలకు వేగంగా చేరుకుంటున్నారు. అయితే మెట్రోలో కొందరి ప్రవర్తనల వల్ల ఇబ్బందికర సంఘటనలను ఎదుర్కొన్నాల్సి వస్తుంది. అలాగే వారి చేసే చేష్టలు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. (వివాదాస్పద ట్వీట్.. రంగోలి ట్విటర్ ఖాతా తొలగింపు ) తాజాగా ఇలాంటి ఓ ఫన్నీ వీడియోనే ఇండియా టుడే మీడియా సంస్థ తమ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. మెట్రోలో ఒంటరిగా ఉన్న ఓ యువతి తన ఇష్టారీతిగా వ్యవహరిస్తుంది. పిచ్చి పిచ్చిగా పాటలు పాడుతూ, ఫోన్లో గట్టి గట్టిగా అరుస్తూ చుట్టు ఉన్న వాళ్లకు ఇబ్బంది కల్గిస్తుంది. రద్దీగా ఉన్న మెట్రోలో కూర్చోడానికి అబద్దాలను సాకులుగా చెబుతూ అందరి చేత నవ్వూల పూలు పూయిస్తుంది. అయితే ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీసిందో తెలీదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మీకు కూడా మెట్రోలో ఇలాంటి సంఘటనలు ఎదురయ్యే ఉంటాయి. మరి ఈ వీడియోను చూసి ఓసారి వాటిని గుర్తు తెచ్చుకోండి. (‘మా ఆవిడకి నా పని నచ్చలేదు’ ) చిన్నారుల అద్భుత ప్రదర్శన.. వీడియో వైరల్ -
పింక్ స్టేషన్లు
నిన్నటి నుంచి నోయిడా మెట్రో రైల్ కార్పోరేషన్.. ఆక్వా లైన్లో ఉన్న (ఇందులోకి నోయిడా, గ్రేటర్ నోయిడా వస్తాయి) మొత్తం 21 స్టేషన్లలో శానిటరీ ప్యాడ్స్‌ని ఉచితంగా అందుబాటులో ఉంచడం ప్రారంభించింది. అంతేకాదు, ఈ స్టేషన్లలో రెండింటిని ‘పింక్ స్టేషన్స్’గా మార్చారు. పింక్ స్టేషన్లలో తల్లి బిడ్డకు పాలివ్వడానికి, డయపర్స్ మార్చడానికి ప్రత్యేకమైన గదులు, వసతులు ఉంటాయి. అక్కడ మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారు. నోయిడా లోని ‘సెక్టార్ 29’, గ్రేటర్ నోయిడాలోని ‘పరీ చౌక్’ స్టేషన్లకు ఈ పింక్ స్టేషన్ హోదాను ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా మెట్రో రైల్ కార్పోరేషన్ మహిళా ప్రయాణికుల కోసం మెరుగుపరిచిన సదుపాయాలివి. -
ఇక రాత్రి 11 గంటల వరకు మెట్రో
-
ఇక రాత్రి 11 గంటల వరకు మెట్రో
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైల్ ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి మెట్రో రైళ్లు రాత్రి 11 గంటల వ రకు నడువనున్నాయి. నగరంలో సుమారు 1000 సిటీ బస్సులను ఆర్టీసీ రద్దు చేస్తున్న నేపథ్యంలో మెట్రో రైలు వేళల్లో మార్పులు చేసినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఇక నుంచి అన్ని టెర్మినళ్ల నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి ఆఖరు స్టేషన్ కు 11.50 గంటలకు చేరుకుంటాయి. అలాగే ఉదయం 6 గంట లకు బదులుగా 6.30 గంటలకు మెట్రో రైళ్లు ప్రారంభమవుతాయని తెలిపారు. రాత్రి ఆలస్యంగా ఇళ్లకు చేరుకునే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. -
ఆర్టీసీ సమ్మె: రాత్రి 11.30 వరకు మెట్రోరైళ్లు..!
సాక్షి, హైదరాబాద్: వరుసగా రెండోరోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటంతో నగరంలోని మెట్రో స్టేషన్లలో రద్దీ పెరిగింది. ఆదివారం ప్రయాణికులతో మెట్రో స్టేషన్లన్నీ కిటకిటలాడాయి. ఆర్టీసీ సమ్మెతో బస్సులు తిరగకపోవడం, ప్రైవేటు వాహనాల్లో భారీగా చార్జీలు వసూలు చేస్తుండటంతో నగరవాసులు మెట్రోరైలుపై పెద్ద ఎత్తున ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా రాత్రి 11.30 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రతి మూడు నిమిషాలకు ఒకటి చొప్పున ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ మెట్రో నడుపుతోంది. -
భారీగా వర్షం.. మెట్రో సర్వీసులపైనా ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. వరుసగా రెండోరోజూ కుండపోతగా వర్షం కురుస్తుండటంతో హైదరాబాద్ నగరం స్తంభించిపోయింది. జీనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయి.. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వర్షం సృష్టించిన బీభత్సంతో చాలాచోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. ఎర్రమంజిల్ వద్ద రోడ్డు పూర్తిగా వరదనీటిలో మునిగిపోయి.. నిండు చెరువును తలపిస్తోంది. వర్షం ప్రభావం నగరంలోని మెట్రో రైలు సర్వీసులపైన పడింది. భారీగా వర్షం కురుస్తుండటంతో ఎల్బీనగర్-అమీర్‌పేట్-మియాపూర్ మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మెట్రోట్రాక్‌పై వర్షపు నీరు చేరడంతో గంటకుపైగా రైళ్లు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
తక్కువ ఖర్చు.. ఎక్కువ సౌకర్యాలు
మూడు కారిడార్లు ఇవే.. 1. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి రైల్వేస్టేషన్, రామవరప్పాడు రింగు రోడ్డు మీదుగా గన్నవరం విమానాశ్రయం వరకూ 26 కి.మీ. 2. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకూ 12.5 కి.మీ. 3. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి కేసీ కెనాల్ జంక్షన్ మీదుగా అమరావతి వరకూ 24 కి.మీ. సాక్షి, అమరావతి: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును సాధ్యమైనంత తక్కువ వ్యయంలో ఎక్కువ సౌకర్యాలతో ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును భారీ వ్యయంతో చేపట్టాలని నిర్ణయించి ప్రణాళికలు రూపొందించినా అవి కార్యరూపం దాల్చలేదు. మీడియం మెట్రో రైలు వ్యవస్థను రూ.7,200 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు మెట్రో శ్రీధరన్ నేతృత్వంలోని డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్) సవివర నివేదిక రూపొందించి ఇవ్వగా, దానిపై టెండర్లు కూడా పిలిచి నిర్మాణ సంస్థను ఖరారు చేసే దశలో అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాము చెప్పిన సంస్థకే నిర్మాణ బాధ్యతను అప్పగించాలని అప్పటి ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసినా శ్రీధరన్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం మీడియం మెట్రో రైలు ప్రతిపాదనను ఉపసంహరించుకుని లైట్ మెట్రోను ముందుకు తెచ్చింది. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) ఆధ్వర్యంలో లైట్ మెట్రో రైలు వ్యవస్థపై సవివర నివేదిక తయారు చేసే బాధ్యతను జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థకి అప్పగించగా విజయవాడలో రెండు, విజయవాడ నుంచి అమరావతికి మరో కారిడార్ నిర్మించేలా ప్రణాళిక రూపొందించింది. సీఎం సూచనలకు అనుగుణంగా మార్పులు.. ఈ ప్రణాళికపై ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏఎంఆర్‌సీ అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. గతంలో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి రైల్వేస్టేషన్, రామవరప్పాడు రింగు రోడ్డు మీదుగా గన్నవరం విమానాశ్రయం వరకూ 26 కి.మీ. మేర ఒక కారిడార్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకూ 12.5 కి.మీ. మేర మరో కారిడార్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి కేసీ కెనాల్ జంక్షన్ మీదుగా అమరావతి వరకూ 24 కి.మీ. మేర మూడో కారిడార్ నిర్మించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేశారు. మూడో కారిడార్‌ను భూగర్భంలో నిర్మించాలనే ప్రతిపాదనపై వెడల్పైన రోడ్లు ఉండగా భూగర్భ మార్గం అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. నేల మీద కి.మీ.కు రూ.120 కోట్లు ఖర్చయ్యే పరిస్థితి ఉండగా భూగర్భ మార్గంలో కి.మీ.కు రూ.450 కోట్లు అవుతుంది కాబట్టి నేల మీదే మెట్రో మార్గానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఎలివేటేడ్ రైలు మార్గంలో ఎక్కడా విద్యుత్ లైన్లు, వైర్లు బయటకు కనపడకుండా చూడాలని సూచించారు. దేశంలో మిగతా మెట్రో రైలు కారిడార్ల కంటే మరింత మెరుగ్గా, డిజైన్లు ఆకర్షణీయంగా, అత్యాధునికంగా ఉండేలా ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో ఎక్కువ వ్యయం కాకుండా చూడాలని ఆదేశించారు. రెండు మూడు దశల్లో మెట్రో రైలు రెండు, మూడు దశల్లో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా డీపీఆర్‌ను సవరించే బాధ్యతను కేఎఫ్‌డబ్ల్యూ సంస్థకే అప్పగించాం. నెల రోజుల్లో ఈ సంస్థ డీపీఆర్‌ను ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పీపీపీ విధానంలో చేపట్టాలా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టాలా అనే దానిపై డీపీఆర్ వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. – రామకృష్ణారెడ్డి, ఎండీ, అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ -
మెట్రో రైలు కింద దూకి వ్యక్తి ఆత్మహత్య
కోల్కత్తా: కదులుతున్న మెట్రో రైలు కిందకు దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని డమ్‌డమ్ మెట్రో రైల్వే స్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. రైలు పట్టాలపైకి దూకగానే ట్రైన్ ఆపి.. అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లామని, కానీ అతను అప్పటికే మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తిని ప్రకాశ్ షా (40)గా అధికారులు గుర్తించారు. కాగా అతని మృతికి కారణాలు తెలిసిరాలేదని మెట్రో సీపీఆర్ఓ ఇద్రాణి ముఖర్జీ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టామని వెల్లడించారు. కాగా వ్యక్తి ఆత్మహత్య కారణంగా ఆ మార్గంలో రెండు గంటల పాటు మెట్రో సేవలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. -
పొల్యూషన్.. సిగ్నల్‌లో కన్ఫ్యూజన్
సాక్షి, హైదరాబాద్: డ్రైవర్ అవసరం లేని సాంకేతికత.. ఉప్పల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ రూమ్ నుంచే రెండు ప్రధాన రూట్లలో మెట్రో రైళ్ల రాకపోకల నియంత్రణ.. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ (సీబీటీసీ) వ్యవస్థకు ఇప్పటివరకున్న మంచిపేరు. ఫ్రాన్స్.. లండన్.. సింగపూర్ వంటి విశ్వనగరాల్లో అమల్లో ఉన్న ఈ సాంకేతికత ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో మన మెట్రో రైళ్లకు తరచూ బ్రేకులు వేస్తోంది. ట్రాఫిక్ రద్దీ పెరిగి వాతావరణంలో దుమ్ము, ధూళికాలుష్యం పెరగడంతో ఒక్కసారిగా మెట్రో రైళ్లు దూసుకెళ్లే రూట్లలో రెడ్‌లైట్లు ఆన్ అవుతున్నాయి. దీంతో కొన్ని సార్లు మెట్రో రైళ్లు ఉన్న ఫళంగా నిలిచిపోతున్నాయి. అంతేకాదు గంటకు 60 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్లే రైళ్ల వేగం కాస్తా.. 25 కిలోమీటర్లకు పడిపోతోంది. తాజాగా మంగళవారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యన ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో ఇదే దుస్థితి తలెత్తింది. ఈ రూట్లో 25 రెడ్‌సిగ్నల్స్ ఒకేసారి ఆన్ అయ్యాయి. ఈ పరిణామంతో పలు స్టేషన్ల వద్ద రైళ్లు నిలిచిపోగా.. రైళ్ల వేగం 25 కేఎంపీహెచ్‌కు పడిపోయింది. దీంతో రంగంలోకి దిగిన మెట్రో సిబ్బంది ఈ రెడ్‌లైట్‌లను మ్యాన్యువల్‌గా ఆఫ్ చేయాల్సి వచ్చింది. సాంకేతిక సమస్య ఇలా.. వాతావరణ మార్పులతో పాటు.. ట్రాఫిక్ రద్దీలో కొన్ని రోజుల్లో దుమ్ము, ధూళి కాలుష్యం ఘనపు మీటరు గాల్లో 100 మైక్రోగ్రాములను మించుతోంది. ఈ స్థాయిలో కాలుష్యం నమోదైన ప్రతిసారి మెట్రో రూట్లలో ఏర్పాటుచేసిన రెడ్‌సిగ్నల్స్ ఆన్ అవుతున్నాయి. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం వంద మైక్రోగ్రాముల లోపల ఉంటేనే సీబీటీసీ సాంకేతికత పనిచేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే వాయు కాలుష్యం పెరిగిన ప్రతిసారీ రెడ్‌లైట్లు ఆన్ అవుతుండటంతో మెట్రో రైలు రిస్టిక్టెడ్ మోడ్ (నియంత్రిత స్థాయి)కు వస్తోంది. దీంతో కొన్నిసార్లు రైళ్లు నిలపాల్సి రావడం.. చాలాసార్లు రైళ్ల వేగం 60 నుంచి 25 కేఎంపీహెచ్‌కు పడిపోతోంది. సీబీటీసీ సాంకేతికత అత్యాధునికమైనదేకాదు.. ఇది అత్యంత భద్రమైనదని మెట్రో అధికారులు చెబుతున్నా.. హైదరాబాద్‌లో వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని హెచ్ఎంఆర్ అధికారులు ఈ సాంకేతికతను తయారు చేసిన థేల్స్(ఫ్రాన్స్)కంపెనీకి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడం గమనార్హం. మెట్రో జర్నీలో సాంకేతిక ఇబ్బందులివే.. ► టికెట్ వెండింగ్ యంత్రాలు నూతన రూ.50, రూ.100, రూ.10 నోట్లను స్వీకరించట్లేదు. ► 4 పాత కరెన్సీ నోట్లతో కలిపి ఒక కొత్త నోటును యంత్రంలో పెడితే పాతనోట్లు కూడా యంత్రంలోనే ఉండిపోతున్నాయి. ► స్టేషన్ మధ్యభాగంలో ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ యంత్రాలుండే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద స్మార్ట్ కార్డులను స్వైప్‌చేస్తే కొన్ని సార్లు యంత్రాలు మొరాయిస్తున్నాయి. ► ప్లాట్‌ఫాంపైకి వెళ్లే సమయంలో సెక్యూరిటీ చెక్ వద్ద మొబైల్‌ను కూడా స్కానింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తుండటంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► మెట్రో అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీ ప్రతీ రూట్లో ప్రతి 6 నిమిషాలకో రైలు అని ప్రకటించినా సమయం కొన్ని సార్లు 10–12 నిమిషాలకు పైగా పడుతోంది. ► పార్కింగ్ లాట్ వద్ద బైక్‌లకు నెలవారీ పాస్ వెల రూ.250 వసూలు చేస్తున్నారు. ఈ రుసుము అధికంగా ఉండటంతో సిటీజన్లు మెట్రో పార్కింగ్ లాట్లకు దూరంగా ఉంటున్నారు. ► మెట్రో కారిడార్‌లో పిల్లర్లకు లైటింగ్ లేకపోవడంతో ఈ రూట్లలో రాత్రి వేళల్లో కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. ► మెట్రో గమనంలో సడెన్బ్రేక్లు వేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
మెట్రో, బస్సుల్లో ఉచిత ప్రయాణం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మెట్రో, బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ప్రకటన చేసింది. ఈ ఖర్చును ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరంలేదని.. వెంటనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా ఏడాది చివరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల జరుగునున్న విషయం తెలిసిందే. దానిని దృష్టిలో ఉంచుకుని పలు పథకాలకు ఆప్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగానే మహిళలకు ఉచిత రవాణ సౌకర్యాన్ని కల్పించింది. కాగా అంతకు ముందు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లోట్ ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సీనియర్ అధికారులను కలిసి వారితో చర్చించారు. ఉచిత ప్రయాణానికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించారు. అలాగే కొత్త ప్రతిపాదన వల్ల మెట్రో ఆదాయంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలియజేయాలని కోరారు. ఢిల్లీ మెట్రోలో ప్రతి రోజూ దాదాపు 30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణం వల్ల ఆదాయంపై ఎంత మేరకు ప్రభావం పడుతుందో కచ్చితంగా చెప్పలేమని, మహిళా ప్రయాణికులు ఎంత మందో తెలుసుకోవడానికి కొత్తగా సర్వే చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఢిల్లీలో ప్రజలు మెట్రోలో కన్నా బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. బస్సుల్లో నిత్యం దాదాపు 42 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అయితే బస్సుల్లో ప్రయాణించే మహిళల వాటా 20 శాతం కన్నా ఎక్కువగా ఉండకపోవచ్చు. -
మెట్రో పిల్లర్‌లో చీలిక.. ఆందోళనలో ప్రయాణికులు
శివాజీనగర(కర్ణాటక): బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డు ట్రినిటీ సర్కిల్ మెట్రో పిల్లర్‌లో కనిపించిన చీలికను సరిచేసిన కొన్ని నెలల అనంతరం తాజాగా మరో చోట చీలిక కనిపించింది. సౌత్ ఎండ్ సర్కిల్ పిల్లర్ ఒకటిలో చీలిక కనిపించిన సమాచారం మెట్రో రైలు ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. అయితే బీఎంఆర్సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సేఠ్ ఈ విషయంపై రైలు ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. శుక్రవారం ఉదయం బసవనగుడి సమీపంలో ఉన్న సౌత్ ఎండ్ సర్కిల్లో పిల్లర్‌లో చీలిక కనిపించిందన్న సమాచారం క్షణంలోనే అన్ని వైపుల వ్యాపించి ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. తక్షణమే స్థలానికి చేరుకున్న బీఎంఆర్సీఎల్ అధికారులు మెట్రోలోని ఈ స్థలంలో ఏ చీలిక కనిపించలేదని స్పష్టం చేసి ప్రయాణికుల్లో ధైర్యాన్ని నింపారు. మెట్రో రెండో విడత పిల్లర్ యొక్క ఒక బేరింగ్ మాత్రం కిందకు పడింది. దానిని తక్షణమే సరిచేశారు. మెట్రో రైలు మార్గంలో అన్ని పిల్లర్లలో బేరింగ్లు కిందకు పడటం సాధారణంగా జరుగుతుంది. దీనిని అప్పుడప్పుడు సరిచేస్తామని, అదే విధంగా ఈ భాగంలో బేరింగ్‌ను సరిచేస్తామని బీఎంఆర్సీఎల్ ప్రజా సంప్రదింపుల అధికారి యశ్వంత్ తెలియజేశారు. ఇంతకు ముందు ట్రినిటీ సర్కిల్ మెట్రో పిల్లర్‌లో చీలిక ఏర్పడటంతో ఆ మార్గంలో రైలు ప్రయాణాన్ని రద్దు చేసి మరమ్మతులు చేపట్టిన విషయం తెల్సిందే. -
మెట్రో ప్రయాణీకులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. నగర వాసుల మెట్రో ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ ఉచిత షటిల్ బస్సు సర్వీసులను ఎల్అండ్టీ మెట్రో సంస్థ ప్రారంభించనుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ కనెక్టివిటీలో భాగంగా స్టేషన్ల నుండి ఆఫీసులవరకు కనెక్టివిటీ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా దుర్గం చెరువు మెట్రో స్టేషన్ నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలిలోని వివిధ ఐటీ కంపెనీలకు షటిల్ బస్సు సర్వీసులు అందుబాటులో తీసుకొచ్చారు. -
పట్టాభిషేకం
పట్టాభిషేకం పెద్ద మాట. ఏదో పెద్ద పొజిషన్లో కూర్చోబెట్టినట్లు!కానీ.. నలుగురూ తిరిగేచోటబిడ్డకు పాలిచ్చే చోటును కల్పించడమైనామహిళకు పట్టాభిషేకమే. ఇదొకటే కాదు.. మహిళా ఉద్యోగులకు, మహిళా ప్రయాణికులకుకొచ్చి మెట్రో ఇచ్చిన ఇంపార్టెన్స్‌ని చూస్తుంటే.. మహిళా సంక్షేమం పట్టాలు ఎక్కినట్లే ఉంది! అది కేరళలోని ‘అలువ’లో ఉన్న కొచ్చి మెట్రో ట్రైన్ స్టేషన్. ‘‘నీకు తెలుసా ఈ ట్రైన్‌ని లేడీ నడుపుతోంది’’.. స్టేషన్లో ఆగి ఉన్న మెట్రో రైలును చూపిస్తూ ఒకామె తోటి స్వీపర్‌తో చెప్తోంది. ‘లోకో పైలట్‌గా మహిళ.. అని గత కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం కదా’ అనుకుంటూ కౌంటర్ వైపు నడిచారు ప్రయాణికులు. అక్కడ.. టికెట్ కౌంటర్లు నడుపుతున్న వాళ్లు కూడా మహిళలే. ‘ఆల్ ఉమన్ రైల్వే స్టేషనా’ అనుకుంటూ ముందుకు నడుస్తుంటే.. మరో వైపు ఎంక్వైరీ డెస్క్. అందులో ఓ ట్రాన్స్‌జెండర్ ప్రయాణికులకు వివరాలు చెబుతున్నారు. మరోవైపు ప్రయాణికుల్లోని బిడ్డ తల్లులు తమ ఇంట్లో గదిలోకి వెళ్లినంత సౌకర్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ ‘పాడ్’లలోకెళ్లి పాపాయికి పాలిచ్చి తిరిగి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఒక్క అలువ మెట్రో స్టేషన్లో కనిపించే సన్నివేశం మాత్రమే కాదు. కేరళలో కొచ్చి మెట్రో స్టేషన్లన్నింటిలోనూ దాదాపుగా మహిళా సౌకర్యాలు, సదుపాయాలే. ఉమెన్ ఫ్రెండ్లీ స్టేషన్లు బ్రెస్ట్ ఫీడింగ్ పాడ్.. తల్లి కూర్చుని బిడ్డను పడుకోబెట్టడానికి వీలయిన చక్కటి సీటు, ఫ్యాన్, ఫోన్ చార్జింగ్ పాయింట్లతో చాలా సౌకర్యంగా ఉంది. వీటిని ఉపయోగించుకోవడానికి అదనంగా చార్జి ఏమీ ఉండదు. బిడ్డకు పాలిచ్చే తల్లుల కోసం ఇలాంటి ఏర్పాటు చేయడానికి కారణం చంటి పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకే అంటారు సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సుమి నాదరాజన్. ‘‘కేరళలో చదువుకున్న మహిళలు ఎక్కువ. అలాగే ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఎక్కువే. ఈ పరిణామం పిల్లలకు పాలివ్వడం మీద చూపిస్తోంది. బహిరంగ ప్రదేశాలు పిల్లలకు పాలివ్వడానికి అనువుగా లేకపోవడంతో పాలివ్వగలిగిన తల్లులు కూడా పోతపాలు పడుతున్నారు. చంటి పిల్లలు ఇంట్లో ఉన్న సమయం మినహా మిగిలిన రోజంతా పోతపాల మీదే పెరగాల్సి వస్తోంది. ఆరోగ్యకరమైన భావితరం కోసం మా వంతు బాధ్యతగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. అవసరాన్ని బట్టి ఫీడింగ్ పాడ్ల సంఖ్యను పెంచుతాం కూడా’’ అన్నారు నాదరాజన్. ‘‘ఈ స్టేషన్లలో పని చేసే వాతావరణం బాగుంది. మహిళలకు చాలా సురక్షితంగా ఉంది. చక్కటి వర్క్ ఎన్విరాన్మెంట్ కావడంతో ఉద్యోగ బాధ్యతలను బాగా ఆస్వాదిస్తున్నాం. మాకొచ్చే జీతం మా జీవితాల్లో మంచి మార్పుకు కారణమవుతోంది’’.. అంటారు మెట్రో ఉద్యోగిని రజిత. ఎకో ఫ్రెండ్లీ కొచ్చి మెట్రో ట్రైన్ వ్యవస్థలో క్లీనింగ్ ఉద్యోగం నుంచి సీనియర్ మేనేజ్మెంట్ విధుల వరకు మహిళలే కీలకం. మేనేజింగ్ డైరెక్టర్ కూడా మహిళే. అందుకే ఆ స్టేషన్ ఉమెన్ ఫ్రెండ్లీగా ఉంది. మొత్తం పదమూడు వందల మంది మెట్రో ఉద్యోగుల్లో ఎనభై శాతం మహిళలే. అన్నింటికంటే కీలకమైన నిర్ణయం రైళ్లనునడిపే లోకో పైలట్లుగా వీలయినంత ఎక్కువ మంది మహిళలను నియమించడం. కొచ్చి మెట్రో రైళ్లలో 39 మంది లోకో పైలట్లున్నారు. వారిలో ఏడుగురు మహిళలు. ఉద్యోగుల నియామకంలోనే కాదు, స్టేషన్ల రూపకల్పనలోనే సమగ్రాభివృద్ధి కనిపిస్తుంది. స్టేషన్ నిర్వహణకు అవసరమయ్యే కరెంట్‌లో 35 శాతం సోలార్ ఎనర్జీ ఉపయోగిస్తున్నారు. స్టేషన్ చుట్టూ రెండు వందలకు పైగా పిల్లర్లున్నాయి. వాటికి నిలువెత్తు గార్డెన్ (వర్టికల్ గార్డెన్) పెంచారు. మున్సిపల్ వేస్ట్ నుంచి తయారైన కంపోస్టు ఎరువును ఈ వర్టికల్ గార్డెన్‌కు వాడుతున్నారు. ఈ విధులన్నిటినీ నిర్వహించేవారు ఎక్కువమంది మహిళలే. మెట్రో ఉపాధి కొచ్చి మెట్రో రైల్ వ్యవస్థ.. అందులో ఉద్యోగాలు చేసే మహిళలతోపాటు స్వయం సహాయక బృందాల మహిళలకు కూడా మంచి ఉపాధినిస్తోంది. కేరళలో మహిళల స్వయం సహాయక బృందాలను ‘కుదుంబశ్రీ’ బృందాలుగా వ్యవహరిస్తారు. ఈ మహిళలు తమ ఇళ్లలో చక్కటి, పరిశుభ్రమైన భోజనం వండి స్టీలు బాక్సుల్లో సర్ది తెస్తారు. లంచ్ బాక్సులు మధ్యాహ్నానికి రైల్వే ఉద్యోగులకు అందుతాయి. ఈ స్కీమ్ ఉభయతారకంగా ఉంది. ఉద్యోగులకు మంచి ఇంటి భోజనం అందుతుంది, అదే సమయంలో స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు ఆదాయ మార్గంగానూ ఉంది. మెట్రో స్టేషన్లను ప్లాస్టిక్ రహితంగా పర్యావరణ హితంగా మార్చే ప్రయత్నంలో భాగమే స్టీలు బాక్సులను ఉపయోగించాలనే నిబంధన. ఎక్కువ భోజనాల ఆర్డర్ ఉన్న మహిళలు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో రైల్లో ప్రయాణిస్తూ ప్రతి స్టేషన్లో బాక్సులను డెలివరీ చేస్తారు. మధ్యాహ్నం మూడు నుంచి ప్రతి స్టేషన్లో ఆగుతూ తమ బాక్సులను కలెక్ట్ చేసుకుంటారు. ఏ షిఫై్టనా ఓకే సాధారణంగా మహిళలను ఉద్యోగంలో చేర్చుకోవడానికి మగబాస్లు మొదటగా చెప్పే అభ్యంతరం ‘వాళ్లు నైట్ షిఫ్ట్‌లు చేయలేరు’ అని. ‘చేయలేరు’ అని మా తరఫున మీరు తీర్పు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తోంది ఈ తరం మహిళ. ఏ షిఫ్టులో పని చేయడానికైనా మేము సిద్ధమేనంటున్నారు. ‘‘నేను నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాను. అంతగా ఇష్టపడిన పని చేసేటప్పుడు., ఫలానా షిఫ్టులో పని చేయను, ఫలానా షిఫ్టు అయితేనే చేయగలుగుతాను అని కండిషన్లు ఎలా పెడతాను. డ్రైవర్‌గా ప్రమోషన్ అందుకోవడం నా లక్ష్యం’’ అంటున్నారు అసిస్టెంట్ లోకో పైలట్ హిమ. మంజీర సమాజం కలుపుకోవాలి ట్రాన్స్జెండర్లకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలిచ్చిన ఘనత కూడా కొచ్చి మెట్రోదే. ఇందులో 60 మంది ట్రాన్స్జెండర్లు ఉద్యోగం చేస్తున్నారు. ‘‘ట్రాన్స్జెండర్ల పట్ల సమాజం దృష్టి కోణం మారాల్సిన అవసరం ఉంది. సమాజం చూపులు మారాలంటే వాళ్లు కూడా సభ్యసమాజంలో అందరితోపాటు కలిసి అన్ని పనుల్లో కనిపించాలి. వృత్తి ఉద్యోగాల్లో వాళ్లతో కలివిడిగా మెలగడం, వాళ్ల సర్వీస్ పొందడం ద్వారా ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను తమలో ఒకరిగా కలుపుకోగలుగుతుంది సమాజం. అందుకే ఈ ప్రయత్నం’’ అన్నారు కొన్నాళ్ల క్రితం వరకు మెట్రో మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించిన ఎలియాస్ జార్జ్. ముప్పై ఆరేళ్ల కార్తీక రాఘవన్ బయో కెమిస్ట్‌గా ఉద్యోగం మానేసి మెట్రో రైల్ ఉద్యోగంలో చేరారు. ‘‘బయో కెమిస్ట్‌గా ల్యాబ్‌లో రోజంతా ప్రాణం లేని వస్తువులతోనే గడపాలి. నాకు మనుషుల మధ్య ఉద్యోగం చేయాలని ఉండేది. ఏ ఉద్యోగానికి అప్లయ్ చేద్దామన్నా విద్యార్హతలు, అనుభవంతోపాటు తప్పనిసరిగా ఓ కాలమ్ ఉంటుంది. అది జెండర్ కాలమ్. అందులో మగ లేదా ఆడ అనే గడులు మాత్రమే ఉంటాయి. ఏదో ఒకటి టిక్ చేయాలి. మెట్రో రైల్ నోటిఫికేషన్ కాలదోషం పట్టిన నిబంధనలను తుడిచేసింది. మాలాంటి వాళ్లందరికీ ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పిస్తూ నిబంధనలను సరళీకరించింది. దాంతో నా చదువుకు సంబంధం లేని ఉద్యోగమైనా సరే, సంతోషంగా అప్లయ్ చేశాను. హ్యాపీగా ఉన్నాను’’ అన్నారు కార్తీక. -
మెట్రో గర్ల్
పుట్టి పెరిగిన ఊరిలో సైకిల్‌పై బయటికి వెళ్లేందుకే భయపడిన అమ్మాయి హైదరాబాద్‌కే మణికిరీటం లాంటి మెట్రో రైలును ధైర్యంగా నడిపిస్తోంది! ఒంటరిగా చౌరస్తా వరకు వెళ్లే సాహసం చేయని ఆ యువతి.. రోజుకు వేలమంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తోంది. ఏడాది క్రితం హైద్రాబాద్‌లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రాగా అందులో పైలట్‌గా ఎంపికైన వారిలో హన్మకొండలోని కొత్తూరు ప్రాంతానికి చెందిన ఓదెల లక్ష్మీప్రసన్న ఒకరు. అత్యాధునిక సాంకేతికతతో నడుస్తున్న మెట్రో రైలునే ఏడాదిగా మచ్చలేకుండా నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు లక్ష్మిప్రసన్న. హన్మకొండ పట్టణంలోని కొత్తూరు ప్రాంతానికి చెందిన ఓదెల నాగరాజు, శోభారాణిలకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురైన లక్ష్మీప్రసన్న పదవ తరగతి వరకు స్థానికంగా ఉన్న సెయింట్ జోసెఫ్ (తోటబడి)లో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ వాగ్దేవి కళాశాలలో చదివారు. ఆ తర్వాత 2016లో వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని బిట్స్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంటివద్దే పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. సంతోషంగా ఉంది సాధారణ మధ్య తరగతి కుటుంబంలో నుంచి మెట్రో రైలు పైలట్‌గా విధులు నిర్వహించే అరుదైన గౌరవం దక్కడం నాకు సంతోషంగా ఉంది. రోజుకు 6నుంచి 8గంటల పాటు మెట్రో రైలు నడుపుతుంటాను. ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సరైన సమయానికి చేరుస్తున్నానని చెప్పేందుకు గర్విస్తున్నాను. ఆడపిల్లలను భారంగా భావిస్తున్న నేటి సమాజంలో నా ఆకాంక్షలను గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రుల గొప్ప మనసు ముందు నాది చాలా చిన్న ఉద్యోగమే అనిపిస్తుంది. – లక్ష్మీప్రసన్న, పైలట్ మొదటి బ్యాచ్‌లోనే! స్నేహితుల సమాచారంతో హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభమయ్యే మెట్రో రైలు సంస్థలో ఉద్యోగాలకోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలుసుకున్న లక్ష్మీప్రసన్న మెట్రోరైలులో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ సంస్థ నిర్వహించిన రాతపరీక్షకు హాజరై అన్నింటిలోనూ ప్రతిభ కనబరిచి అర్హత సాధించారు. 2017 జూన్ 12న మెట్రో పైలట్‌గా ఉద్యోగ నియామకపు ఉత్తర్వులను అందుకున్నారు. మెట్రో రైలు ఉద్యోగ నియామకాల్లో మొదటి బ్యాచ్‌లో పైలట్‌గా ఎంపికైన సుమారు నలభై మంది అమ్మాయిల్లో లక్ష్మి ప్రసన్న ఒకరు. ఐదు నెలల శిక్షణ మెట్రో రైలు సంస్థలో ఉద్యోగానికి ఎంపికైన లక్ష్మి ప్రసన్న సహచరులతో కలిసి హైద్రాబాద్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్లో ఐదు నెలల పాటు శిక్షణ పొందారు. అత్యాధునిక సాంకేతికతతో నడిచే మెట్రో రైలు నిర్వహణపై కియోలిస్ కంపెనీ అందించిన శిక్షణను సద్వినియోగం చేసుకున్నారు. 2017 నవంబర్ 29న ప్రారంభమైన మెట్రోరైలు సేవల్లో నాటి నుంచి నేటివరకు దిగ్విజయంగా తన విధులను నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఎల్బినగర్– మియాపూర్ మధ్య మెట్రో రైలును నడిపిస్తున్నారు. – గజ్జి రమేష్, సాక్షి, హన్మకొండ -
ముందుగా రైలెక్కితే నూడుల్స్ ఫ్రీ!
టోక్యో: ‘ఫ్రీగా నూడుల్స్ తినాలనుందా? అయితే కాస్త ముందుగా వచ్చి మా మెట్రో రైలు ఎక్కండి.. ఒక్కటి కాదు, రెండు రకాల నూడుల్స్ బౌల్స్‌ను ఫ్రీగానే ఇస్తాం. ఎంచక్కా ప్రశాంతంగా కూర్చొని, తింటూ వెళ్లొచ్చు’ అంటూ తాజాగా ఓ ప్రకటన చేసింది టోక్యో మెట్రో. ఇంతకీ ఈ ప్రకటన ఎందుకు చేసిందో తెలుసా? టోక్యో మెట్రోలో రోజుకు 72 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఉదయం ఆఫీసుకు వెళ్లే సమయంలో రద్దీ విపరీతంగా ఉంటుంది. సామర్థ్యానికి దాదాపు రెండింతలు ప్రయాణిస్తారు. ఎంతగా ఇరుక్కుని నిలబడతారంటే కాలూచేయీ ఆడించడం కూడా కష్టమే. అలా కాకుండా ఉదయమే కొంచెం ముందుగా ఆఫీసుకు బయలుదేరేవారి సంఖ్యను పెంచేందుకే టోక్యో మెట్రో ఫ్రీఫుడ్ ఆఫర్ ప్రకటించింది. అందరూ ఒక్కసారిగా ఎగబడకుండా కనీసం కొందరైనా ఫ్రీ నూడిల్స్ కోసం ముందుగా ప్రయాణిస్తే తర్వాత ఆఫీసు వేళల్లో రద్దీ తగ్గుతుందనేది ఆలోచన. ముందస్తు ప్రయాణికుల సంఖ్య 2,500 వరకు ఉంటే వారికి ఉచితంగా ఒక్కొక్కరికి సోబా నూడిల్ బౌల్ ఇస్తారు. ఆ సంఖ్య 3,000 దాటితే సోబాతోపాటుగా టెంపూరా బౌల్ ఇస్తారు. అంటే డబుల్ బొనాంజా అన్నమాట. -
ఈ వాహనంపై రయ్ రయ్
సనత్‌నగర్: ‘మెట్రో’లో నగర అందాలను వీక్షిస్తూ గగన విహార అనుభూతులను పొందిన అనంతరం గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ–కార్లు, ఈ– బైక్‌లు సిద్ధంగా ఉంటున్నాయి. విధులు ముగించుకుని మళ్లీ మెట్రోస్టేషన్ వద్ద వాహనాన్ని వదిలి అదే మెట్రోలో సాగిపోయే వెసులుబాటు ప్రస్తుతం మెట్రో ప్రయాణికులకు ఊరటనిస్తోంది. ఈ కార్లు, బైక్‌లు, సైకిళ్లు అమీర్‌పేటతో పాటు మెట్రో రాకపోకలు జరుగుతున్న నాగోలు– అమీర్‌పేట, అమీర్‌పేట– మియాపూర్ మార్గాల్లోని సగానికి పైగా స్టేషన్లలో అందుబాటులోకి వచ్చాయి. అద్దె కూడా చాలా తక్కువ ఉండడంతో ఆయా వాహనాలకు ప్రయాణికుల నుంచి భారీగానే స్పందన వస్తోంది. అమీర్‌పేటలో ‘ఈ– బైక్స్’ అమీర్‌పేట మెట్రోస్టేషన్ కేంద్రంగా ఈ– బైక్స్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఆగస్ట్ 15 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కి.మీటర్‌కు రూ.4 మేర చార్జీ వసూలు చేయాలని నిర్ణయించారు. రాత్రివేళల్లో రూ.1 చెల్లించి వాహనాలను తీసుకువెళ్లవచ్చు. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మున్ముందు మరిన్ని మెట్రోస్టేషన్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎన్డీఎస్ ఎకో మోటార్స్ డైరెక్టర్ దీపికారెడ్డి తెలిపారు. ‘డ్రైవ్‌జీ’ సేవలు.. బాలానగర్, కూకట్పల్లి, అమీర్‌పేట మెట్రోస్టేషన్లలో ప్రస్తుతం ‘డ్రైవ్‌జీ’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 125 యాక్టివా వాహనాలను ‘డ్రై వ్‌జీ’ సంస్థ మెట్రోస్టేషన్లలో అందుబాటులో ఉంచింది. మూడు స్టేషన్లలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగుతుండగా, మరో వారం రోజుల్లో మెట్టుగూడ, తార్నాక, ప్రకాష్‌నగర్, జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్లలో డ్రై వ్‌జీ యాక్టివా వాహనాలను మెట్రో ప్రయాణికుల ముంగిటకు తీసుకురాన్నట్లు సంస్థ నిర్వాహకుడు దిలీప్ తెలిపారు. కి.మీటర్‌కు రూ.3 చొప్పున, గంటకు అద్దె రూ.6 చొప్పున వసూలు చేస్తున్నారు. డ్రైవ్‌జీ వాహనాలను బుక్ చేయాలంటే ‘డ్రైవ్ జీ’ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మియాపూర్మెట్రోస్టేషన్ వద్ద ‘ఈ– కార్స్’ మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద ‘జూమ్‌కార్’ సంస్థ 25 ఎలక్ట్రికల్ కార్లు (ఈ–కార్స్) అందుబాటులో ఉంచింది. గంటకు రూ.40ల మేర రుసుం వసూలు చేస్తున్నారు. ఒకవేళ కిలోమీటర్ల విషయానికొస్తే మొదటి 20 కి.మీటర్ల వరకు ఉచితంగానే ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తుండగా, ఆ తర్వాత నుంచి కి.మీటరుకు రూ.8 చొప్పున వసూలు చేస్తారు. ఒక్క మియాపూర్ స్టేషన్ కేంద్రంగా రోజుకు 100 మంది ఈ–కార్స్‌ను వినియోగించుకుంటున్నట్లు సంస్థ నిర్వాహకులు సంతోష్‌రెడ్డి చెప్పారు. రిమ్జిమ్ రిమ్జిమ్సైకిల్వాలా.. పర్యావరణహిత బైక్‌లే కాదు.. సైకిళ్లను కూడా మెట్రోస్టేషన్లలో అందుబాటులో ఉంచారు. జూమ్‌కార్ సంస్థ బేగంపేట, రసూల్‌పురా, ప్యారడైజ్, మెట్రో స్టేషన్లలో ఒక్కో స్టేషన్లో 20 చొప్పున ‘పెడల్’ కంపెనీ సైకిళ్లను అందుబాటులో ఉంచింది. అరగంట సమయానికి రూ.3 వసూలు చేస్తున్నారు. రోజుకు 800 మందికి పైగా ఈ సైకిళ్లను నియోగించుకుంటున్నారు. వీటితో పాటు జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ, మియాపూర్, కూకట్పల్లి మెట్రోస్టేషన్లలో హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ సహకారంతో స్మార్ట్ బైక్‌లను అందుబాటులో ఉంచారు. పర్యావరణపరిరక్షణకుపెద్దపీట... మెట్రో ప్రయాణం అంతా పర్యావరణహితంగా జరగాలన్నది హెచ్ఎంఆర్ ప్రధానోద్దేశం. ఇందుకోసం ఆయా స్టేషన్ల నుంచి ఈ–కార్స్, ఈ– బైక్స్‌ను అందుబాటులో ఉంచాం. – సారిక,హెచ్ఎంఆర్ ఉద్యోగి. సమయం కలిసివస్తోంది మెట్రో రాకతో నగరంలో రవాణా సౌకర్యం కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండాపోయింది. మెట్రో దిగగానే బైక్‌లు, కార్లను తీసుకుని తమ గమ్యస్థానానికి వెళ్ళే వెసులుబాటు ఉండడం వల్ల ఎంతో సమయం కలిసివస్తోంది. – సాయికుమార్, వినియోగదారుడు ఛార్జీలు చాలాతక్కువ.. ఈ– బైక్స్, కార్ల చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆటో, క్యాబ్‌లో వెళ్లాలంటే కనీసం రూ.50– రూ.100పైమాటే. అదే ఇక్కడి వాహనాలతో రూ.20లోపే పని ముగిసిపోతుండడం సంతోషదాయకం. – జునైదు, వినియోగదారుడు. -
అమరావతి మెట్రోకి జైకా ఝలక్!
రుణ సాయానికి జపాన్ సంస్థ విముఖత సాక్షి, హైదరాబాద్ : అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్టుకు బాలారిష్టాలు తప్పడం లేదు. అడుగడుగునా బ్రేకులు పడుతుండటంతో రెండు కారిడార్లుగా నిర్మించాలనుకున్న ఈ ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. తాజాగా ఆ మెట్రోకి జపాన్ రుణ సంస్థ జైకా ఝలక్ ఇచ్చింది. తొలి దశలో 26 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం నిర్మించేందుకు కేంద్రానికి గతంలోనే ఏపీ సర్కారు ప్రతిపాదనలు పంపింది. మెట్రో ప్రాజెక్టు సలహాదారుగా శ్రీధరన్‌ను నియమించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మెట్రో రైలు డీపీఆర్‌లో సాంకేతిక వివరాలు, భద్రతకు సంబంధించిన అంశాలు విమానయాన, దక్షిణ మధ్య రైల్వే అనుమతులు లేకపోవడాన్ని కేంద్రం తప్పు పట్టింది. తాజాగా మెట్రోకు రుణమిచ్చే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) పలు ఆంక్షలు పెట్టింది. మొత్తం ప్రాజెక్టుకు అవసరమయ్యే రూ. 8 వేల కోట్లలో రూ. 4 వేల కోట్లకు పైగా నిధులు అతి స్వల్ప వడ్డీ రేటు 0.3 శాతంతో జైకా రుణం సమకూర్చనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఢిల్లీలో జైకా ప్రతినిధులతో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు సమావేశమైన సందర్భంలో జపాన్ ప్రతినిధులు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా అమరావతి మెట్రోకి కన్సల్టెంట్‌గా ఉన్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)ను తప్పించాలని, ఇరువురికి ఆమోదయోగ్యమైన మరో కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని జైకా ప్రతినిధులు సూచించినట్లు తెలిసింది. అమరావతి మెట్రోకి రుణమిచ్చేందుకు ఇష్టం లేకపోవడంతోనే ఈ తరహా సూచనలు జైకా ప్రతినిధులు చేసినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. -
వారంలో విజయవాడ మెట్రోకు టెండర్లు
-
వారంలో విజయవాడ మెట్రోకు టెండర్లు
మీడియాకు వెల్లడించిన ఏపీ సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సివిల్ టెండర్లను వారంలో పిలుస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిం చారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోపు పనులు ప్రారంభించాలని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కి సూచించి నట్లు తెలిపారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు బాధ్యతల్ని కూడా డీఎంఆర్‌సీకే అప్పగిస్తున్నట్లు చెప్పారు. రెండు ప్రాజెక్టుల్ని 2018 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని కోరామన్నారు. శనివారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్‌తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సీఎం.. రాష్ట్రంలోని రెండు మెట్రో రైలు ప్రాజెక్టులపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు సవివర నివేదికను శ్రీధరన్ ఇచ్చారని, త్వరలో దానిపై కేబినెట్లో చర్చించి ఆమోదిస్తామన్నారు. 42.55 కిలోమీటర్ల మేర తొలి దశలో విశాఖ ప్రాజెక్టు నిర్మాణమవుతుందని తెలిపారు. దీనికి రూ. 12,725 కోట్లు ఖర్చవుతుందని డీఎంఆర్సీ తన నివేదికలో పేర్కొందన్నారు. ఈ ప్రాజెక్టుకు 30.22 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉందన్నారు. జనాభా నిబంధన సడలిస్తాం: వెంకయ్య కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, మెట్రో రైళ్లకు అనుమతివ్వాలంటే 20 లక్షల జనాభా ఉండాలనే నిబంధనను విజయవాడ, విశాఖ విషయంలో సడలిస్తామని చెప్పారు. దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ర్యాంకింగ్ లేకపోవడం వల్లనే స్మార్ట్ సిటీగా విజయవాడను ఎంపిక చేయలేక పోయామన్నారు. సమావేశంలో మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్, డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్, మంత్రి నారాయణ, విశాఖ ఎంపీ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని ఆదుకోండి : ఏపీ సీఎంకు వినతి సమస్యలు పరిష్కరించాలని పలువురు శనివా రం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రాలు సమర్పించారు. పేదలు, సామాన్యులను కలిసేందు కు సీఎం అవకాశం ఇవ్వడంలేదని విమర్శలొచ్చిన నేపథ్యంలో శనివారం నుంచి రోజూ 12 నుంచి 1 గంట వరకూ సందర్శకులను ఆయన కలుస్తున్నారు. తమ గ్రామంలో రోడ్లు, మురికి కాలువలు లేవని పలువురు మహిళలు సీఎంకు ఫిర్యాదు చేశారు. కాగా కళాశాలలు, యూనివర్సిటీల్లో లోపాలు గుర్తించేం దుకు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ఏకీకృత వ్యవస్థ అత్యవసరం
రవాణా విధానంపై డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్ న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అన్ని రవాణా సంస్థలను నియంత్రించగల ఏకీకృత రవాణా ప్రాధికార సంస్థ లేకపోవడంతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ఎండీ మంగూసింగ్ అన్నారు. సమర్థంగా పనిచేసే ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తే పర్యావరణ, ఆర్థిక సంబంధిత సమస్యల పరిష్కారం సులువవుతుందని చెప్పా రు. ‘ఢిల్లీ రోడ్లపై సగటు వేగం ఒకే అంకెకు మిం చడం లేదు. మనం ఎడ్లబళ్ల కాలంవైపు వెళ్తున్నాం. అసమర్థ రవాణా వ్యవస్థే ఈ పరిస్థితికి కారణం. ఇందుకు ఏకీకృత రవాణా సంస్థ ఏర్పా టు అత్యవసరం’ అని డీఎం ఆర్సీ ఎండీ అన్నా రు. పట్టణ సామూహిక రవాణా, మెట్రో, లైట్రైల్పై చర్చ కోసం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) శుక్రవారం నగరంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో మంగూసింగ్ మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. చాలా దేశాల్లో నగర, మున్సిపల్ రవాణా సంస్థల నిర్వహణ బాధ్యత స్థానిక మేయర్ల చేతుల్లో ఉంటుందని తెలిపారు. ‘ఢిల్లీ నగరాన్ని ఎవరు నియంత్రిస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. అన్నింటి కంటే పెద్ద సమస్య ఇది. సమర్థంగా పనిచేసే ఏకీకృత రవాణా వ్యవస్థ ఏర్పాటే దీనికి పరిష్కారం’ అని మంగూసింగ్ అన్నారు. తమ సంస్థ డీఎంఆర్సీ ప్రతినిత్యం 26 లక్షల మందికి సమర్థంగా సేవలు అందిస్తోందని ప్రశంసించారు. అందుకే జైపూర్, కొచ్చి, హైదరాబాద్, లక్నో, పుణే వంటి నగరాలు తమ సంస్థను ఆదర్శంగా తీసుకొని మెట్రో మార్గాలను నిర్మిస్తున్నాయని అన్నారు.