ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం మెట్రో రైల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. మెట్రో అందుబాటులోకి రావడంతో ఎంతోమంది ఉద్యోగులకు ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి. మెట్రో ద్వారా కొన్ని లక్షల మంది తమ గమ్యస్థానాలకు వేగంగా చేరుకుంటున్నారు. అయితే మెట్రోలో కొందరి ప్రవర్తనల వల్ల ఇబ్బందికర సంఘటనలను ఎదుర్కొన్నాల్సి వస్తుంది. అలాగే వారి చేసే చేష్టలు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
తాజాగా ఇలాంటి ఓ ఫన్నీ వీడియోనే ఇండియా టుడే మీడియా సంస్థ తమ ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. మెట్రోలో ఒంటరిగా ఉన్న ఓ యువతి తన ఇష్టారీతిగా వ్యవహరిస్తుంది. పిచ్చి పిచ్చిగా పాటలు పాడుతూ, ఫోన్లో గట్టి గట్టిగా అరుస్తూ చుట్టు ఉన్న వాళ్లకు ఇబ్బంది కల్గిస్తుంది. రద్దీగా ఉన్న మెట్రోలో కూర్చోడానికి అబద్దాలను సాకులుగా చెబుతూ అందరి చేత నవ్వూల పూలు పూయిస్తుంది. అయితే ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీసిందో తెలీదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మీకు కూడా మెట్రోలో ఇలాంటి సంఘటనలు ఎదురయ్యే ఉంటాయి. మరి ఈ వీడియోను చూసి ఓసారి వాటిని గుర్తు తెచ్చుకోండి.