Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Pulivendula Vontimitta ZPTC bypolls August 11th News Updates1
విచ్చలవిడిగా పులివెందుల గ్రామాల్లోకి టీడీపీ మూకలు

పులివెందుల రూరల్‌, ఒంటిమిట్ట మండలాల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. రేపు(ఆగస్టు 12న) ఈ రెండు జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ రెండు స్థానాలకు 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే అధికార పార్టీ టీడీపీ అరాచకాలు, వైఎస్సార్‌సీపీ ప్రతిఘటనలతో పులివెందుల ఉప ఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది. వైఎస్సార్ జిల్లావిచ్చలవిడిగా పులివెందుల గ్రామాల్లోకి దూరుతున్న టీడీపీ మూకలుకొత్తపల్లిలో ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది మోహరింపుటీడీపీ జమ్మలమడుగు ఇంఛార్జి భూపేష్ రెడ్డి ఆద్వర్యంలో మరో వంద మంది నల్లపురెడ్డిపల్లిలోకి చొరబాటుతుమ్మలపల్లిలో ముసలిరెడ్డిపల్లి రఘు ఆధ్వర్యంలో మరో వందమందిరేపు దొంగ ఓట్లు, కొట్లాటలకు వీరిని వినియోగించనున్న టీడీపీఅయినా ఏమాత్రం స్పందించని పోలీసులు ఈసీ కార్యాలయం వద్ద మీడియాతో మాజీమంత్రి జోగిరమేష్చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కైమా కైమా చేసేస్తున్నాడుదీన్ని ఎన్నిక అంటారా? చంద్రబాబుచంద్రబాబు నీకసలు సిగ్గుశరం ఉందాఓటరు స్లిప్పులు తీసుకుని డబ్బులు పంచుతున్నారుగతంలో నంద్యాలలో కూడా ఇలాగే చంద్రబాబు వ్యవహరించాడుపులివెందులలో అసలు ప్రజాస్వామ్యమే లేదుఏడాదిలోనే చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందిపులివెందులలో గెలిచానని సంకలు గుద్దుకోవాలని చూస్తున్నాడుప్రతీ పోలింగ్ కేంద్రం... లోపలా... బయట... సీసీ కెమెరాలు పెట్టాలని కోరాంపులివెందుల, ఒంటిమిట్టలో మొత్తం తన ప్రభుత్వాన్ని చంద్రబాబు మోహరించాడుఎన్ని కుట్రలు చేసినా పులివెందులలో గెలిచేది వైసీపీనేరాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎన్నిక జరిగినా ఎగిరేది వైసీపీ జెండానేచంద్రబాబూ.. ఇంత దిగజారాలా?: పేర్ని నానిఈసీ కార్యాలయం వద్ద మీడియాతో మాజీమంత్రి పేర్ని నానిపులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయి వ్యవహరిస్తోందిప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారుకొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె,ఎర్రిపల్లి, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారుఓటుకి పదివేలు ఆశచూపిస్తున్నారుఓటరు స్లిప్పులు ఇవ్వకపోతే బెదిరిస్తున్నారుగన్ మెన్ ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌కే రక్షణ లేదుఅవినాష్ రెడ్డితో పాటు 150 మంది పై కేసులు పెట్టారుదాడులు చేస్తాం.. కేసులు పెడతామని బెదిరిస్తున్నారుపోలీసులు.. షాడో పార్టీలున్నా కళ్లకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారురికార్డుల ప్రకారమే పోలీసులున్నారు.. కానీ ఎవరినీ పట్టుకోరుచంద్రబాబు 10 వేలు ఇచ్చి పంపిస్తే అందులో టీడీపీ వాళ్లే 5 వేలు నొక్కేస్తున్నారురేపు ఉదయం లోపు మళ్లీ ఓటరు స్లిప్పులు పంచాలికాల్ సెంటర్ పెట్టాలి.. స్లిప్పులు ఇవ్వమని బెదిరించినా చర్యలు తీసుకోవాలిఎన్నికల కమిషన్ రేపు ఒక్కరోజైనా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలిపులివెందులలో టీడీపీ దౌర్జన్యాలపై ఫిర్యాదురాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ నేతలుపులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలు,దౌర్జన్యాల పై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వైసిపి నేతలుఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్న టీడీపీ నేతలుఓటరు స్లిప్పులు తీసుకుని డబ్బులిస్తున్న టీడీపీ నేతలుఓటరు స్లిప్పులు ఇవ్వకపోతే బెదిరిస్తున్న టీడీపీ నేతలుటీడీపీ ప్రలోభాల పై ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నికి వినతిపత్రం అందించిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి,మొండితోక అరుణ్ కుమార్, కల్పలతా రెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్,జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, హఫీజ్ ఖాన్,, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లుపులివెందులలోనే కూటమి నేతల తిష్టపులివెందుల మండలంలోనే కూటమి నేతలుఎన్నికల ప్రచార గడువు ముగిసినా పల్లెల్లో తిష్ట వేసిన టీడీపీ నేతలుఎర్రబెల్లి, నల్లపురెడ్డిపల్లె గ్రామాల్లో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, పుత్తా చైతన్య రెడ్డిఅయినా పట్టించుకొని పోలీసులుఎస్‌ఈసీ వద్దకు వైసీపీ నేతలుమరికొద్ది సేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న వైసీపీ నేతలుపులివెందుల జడ్పీటిసి ఎన్నికల్లో టిడిపి ప్రలోభాలు, దౌర్జన్యాల పై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు వైసీపీ నేతల రాక నేపధ్యంలో ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద బారికేడ్లతో పోలీసులు బందోబస్తుటీడీపీ నేతల కుట్రలపై ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్ఓటరు స్లిప్పులను టీడీపీ నేతలు తీసుకోవటంఫై వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ ఆగ్రహంకొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారుఇవ్వకపోతే బెదిరిస్తున్నారుమూడురోజులుగా ఎన్నికల కమిషన్ దృష్టికి పదేపదే తీసుకెళ్లాంఅయినా ఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర వీడటం లేదుటీడీపీ వారు ఇంటింటికీ వెళ్ళి డబ్బులు పంచుకున్నారుడబ్బులిచ్చి ఓటర్ల స్లిప్పులను వెనక్కు తీసుకుంటున్నారుదీని వలన ఎవరి ఓటు ఎక్కడ ఉందో ఓటరికి అర్థం కాదుతాను ఏ బూతులో ఓటు వేయాలో కూడా ఓటరుకి అర్థం కాని పరిస్థితి వచ్చిందిఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర పోతోందిఓటరుకి తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం కల్పించాలిప్రతి ఒక్క ఓటరికీ మళ్లీ స్లిప్‌లను అందించాలిఈ రాత్రికి మొత్తం 10,601 ఓటర్లకు స్లిప్పులను ఇవ్వాలిఎర్రిపల్లిలో రాత్రే టీడీపీ నేతలు స్లిప్పులను తీసుకున్నారుఈరోజు మరికొన్ని గ్రామాలలో తీసుకోబోతున్నారుమా పార్టీ మండల నాయకుల ఇళ్లకు కూడా వెళ్లి స్లిప్పులు అడుగుతున్నారునల్లపరెడ్డిపల్లి గ్రామానికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారుఆ వచ్చినవారికి ఈ స్లిప్పులను ఇచ్చి దొంగ ఓటు వేయించబోతున్నారురిగ్గింగ్ చేసినట్టు కెమెరాలో కనపడకుండా ఇలాగ ప్లాన్ చేశారునిరంతరాయంగా ఇలా దొంగ ఓట్లు వేయటానికి మనుషులను దించారుదీనిపై ఎన్నికల కమిషన్ స్పందించాలిపోలింగ్‌ బూత్‌ల మార్పు.. హైకోర్టులో విచారణఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ లంచ్ మోషన్ పిటిషన్పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూతులు మార్పులు సవాలు చేస్తూ పిటిషన్మధ్యాహ్నం విచారణ చేయనున్న ఏపీ హైకోర్టుఎన్నికల సంఘానికి పోలింగ్ బూత్‌ల మార్పుపై ఆదేశాలు ఇవ్వాలని కోరిన పిటిషన్పులివెందులలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది: కారుమూరితణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుస్వతంత్రం వచ్చిన తరువాత ఇటువంటి మెజార్టీలు ఎక్కడా చూడలేదు.ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం అక్రమ మార్గంలో గెలిచింది.తణుకు నియోజకవర్గంలో ఆరిమిల్లి రాధాకృష్ణకు 72 వేల ఓట్లు ఈవీఎం ట్యాపరింగే.ఎలక్షన్ జరిగిన తర్వాత ఈవీఎం ట్యాపరింగ్లు జరిగిందని చెప్పిన మొదటి వ్యక్తి నేనే.ప్రజా సంక్షేమాన్ని అమలు చేసిన జగన్ మోహన్ రెడ్డి ఏమి చేయలేదని ప్రజలు ఓట్లు వేయలేదని నాయకులు చెబుతున్నారు .కేవలం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి మాత్రమే గెలిచారు.పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది.పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురుపులివెందులలో వైఎస్సార్సీపీ నేతలపై దాడి సందర్భంలో నిర్వహించిన ర్యాలీపై పోలీసుల కేసువైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి సహా 150 మందిపై కేసు పెట్టిన పోలీసులుహైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీఎవ్వరినీ అరెస్ట్ చేయవద్దని పోలీసులను సోమవారం ఆదేశించిన హైకోర్టుపులివెందుల ఆగని పోలీసుల దాష్టీకంపులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల దాష్టీకంవైఎస్సార్సీపీ నేతల అక్రమ నిర్బంధంఆరుగురిని ఆదివారం ఉదయం నుంచి పీఎస్‌లోనే ఉంచిన ఖాకీలుపులివెందుల అప్‌గ్రేస్‌ పీఎస్‌లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న బాధితులుపోలీసుల అదుపులో అర్జున్ (మొట్నుతలపల్లి), మస్తాన్ వలి (చంద్రగిరి), హరి (మల్లికార్జునపురం), మైసూరారెడ్డి (లక్షుంవారిపల్లి), రవి ప్రకాష్ రెడ్డి, నాయక్ (కనంపల్లి)ఎన్నికల నేపధ్యంలో కీలకంగా ఉన్న నాయకులను వేధిస్తున్నారంటున్న వైఎస్సార్సీపీపోలింగ్ టీడీపీకి అనుకూలంగా మార్చడానికే అక్రమ నిర్బంధం అంటున్న వైఎస్సార్సీపీఒంటిమిట్టలో..ఒంటిమిట్టలో పోలింగ్‌ ఏర్పాట్లపై అధికారుల స్పందనమీడియాతో మాట్లాడిన రిటైనింగ్ అధికారి రామలింగయ్య రేపు 7 గంటల నుండి 5గంటల వరకు పోలింగ్ప్రతి పోలింగ్ స్టేషన్‌కి నలుగురు అధికారులుబ్యాలెట్ బాక్స్ లు, ఎలక్షన్ మెటీరియల్ అందిస్తున్నాం..సెక్యూరిటీతో పాటు పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలిస్తున్నాం..రేపు పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం మౌలానా అబ్దుల కలాం ఆజాద్ యూనివర్సిటీ లో భద్రపరుస్తాం14వ తేదీ కౌంటింగ్ ఉంటుందిపులివెందుల మండలంలో నేడు..స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ సిబ్బందికి పులివెందుల ఉప ఎన్నిక బ్యాలెట్ బాక్స్ ల పంపిణి ప్రారంభంజెడ్పీటీసీ ఉపఎన్నిక కు కావాల్సిన బ్యాలెట్ బాక్స్ ల పంపిణి చేస్తున్న ఎన్నికల అధికారులుపోలింగ్ సిబ్బంది కి బూత్‌లవారీగా ఎలక్షన్ సామగ్రి, బ్యాలెట్ బాక్సుల పంపిణిపులివెందుల జడ్పీటీసీ స్థానానికి 15 పోలింగ్ బూత్‌లు ఏర్పాటుపోలింగ్ బూత్‌ల సిబ్బందికి ఎలక్షన్ సామగ్రి పంపిణిరోజుకో కుట్ర.. కూటమి కుయుక్తిజెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కూటమి ప్రభుత్వ అడ్డదారులువైఎస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్టులు, నిర్బంధాలుఅదే సమయంలో ఓటర్లకూ వేధింపులుపోలింగ్ బూత్‌ల మార్పు తో ఓటర్లకు ఇబ్బందిఒక గ్రామంలోని ఓటర్లకు మరో గ్రామంలో పోలింగ్ కేంద్రంపోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, ఓటర్లు నిలువరించే ప్రయత్నాలు చేస్తారని వైఎస్సార్సీపీ పిర్యాదుప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీ, గవర్నర్‌లకు వినతిటార్గెట్‌ వైసీపీ కేడర్‌పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సాక్షిగా టీడీపీ అరాచకాలు ఇప్పటికే దాడులు, హత్యయత్నాలతో అట్టుడుకుతున్న పులివెందులగ్రామాల్లో కీలక వైఎస్సార్సీపీ నాయకులను తప్పుడు కేసుల్లో అరెస్ట్వందల మందిపై బైండోవర్ కేసులుపోలింగ్ రోజు వైఎస్సార్సీపీ నాయకులు కనపడకుండా కుట్రలుకూటమి కుట్రలతో రణరంగంగా మారిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికపులివెందుల, ఒంటిమిట్ట మొత్తం 750 మందిపై బైండోవర్‌ కేసుఒక్క పులివెందుల మండలంలోనే 500 మందిపై బైండోవర్ కేసులు52 మందిపై ఎస్సీ ఎస్టీ కేసులు, 9 మంది వైఎస్సార్సీపీ నాయకులను రిమాండ్ కు పంపిన పోలీసులుకోడ్‌ ఉల్లంఘించి మరీ.. ప్రచార సమయం ముగిసిన కొనసాగుతున్న టీడీపీ పాలిటిక్స్ ఒంటిమిట్టలో ఏదేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కూటమి కీలక నేతలుఆదివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసిన ప్రచారంఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతర్ చేసిన కూటమి ప్రభుత్వ నేతలు ఆరు గంటల టైంలోనూ హరిత హోటల్ లో మకాం వేసిన టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ...ముఖ్య నేతలకు వత్తాసు పలుకుతున్న పోలీసులుపులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలు.. రేపే పోలింగ్‌పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు ముగిసిన ప్రచారంరేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలుపులివెందులలో 10,601 ఓట్లు, ఒంటిమిట్టలో 24,600 ఓట్లుపులివెందులలో భారీ బందోబస్తుసెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న పోలీసులుపులివెందులలో ఐదు, ఒంటిమిట్టలో నాలుగు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపుప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద డ్రోన్లతో నిఘారెండు మండలాలు, జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటుపోలింగ్‌ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని పోలీసుల హెచ్చరిక

Jr NTR Strong Counter To TDP Leader Nara Lokesh2
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్‌ కౌంటర్‌ లోకేష్‌కేనా?

పబ్లిక్‌ ఫంక్షన్లలో సాధారణంగా ఆచితూచి మాట్లాడతాడు తారక్‌. తన ఫ్యాన్స్‌కోసం మహా అయితే కాలర్‌ ఎగరేస్తాడు అంతే. ఏ మాత్రం వివాదాస్పద వ్యాక్యల జోలికి పోడు. కానీ ఈ సారి ఓ గట్టి స్టేట్‌మెంట్‌నే వదిలాడు తారక్‌. అదేంటంటే "స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దీవెనలు ఉన్నంత కాలం నన్ను ఎవరూ ఆపలేరు" అనేది జూ. ఎన్టీఆర్‌ కామెంట్‌. మామూలుగా అయితే ఈ మాటను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు పనిగనిగట్టుకుని 'నన్ను ఎవరూ ఆపలేరు' అని తారక్‌ అనడానికి ఓ కారణం ఉంది.సరిగ్గా 2 రోజుల క్రితం మంత్రి నారా లోకేష్‌ ఓ ట్వీట్‌ చేశాడు. అందులో తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ని పొగిడాడు. కూలీ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని ఆకాంక్షించాడు. కానీ ఎన్టీఆర్‌ను, వార్‌ 2 సినిమా గురించి మాత్రం లోకేష్‌ ఎక్కడా ప్రస్తావించలేదు.రజినీకాంత్‌ 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా లోకేష్‌ ఈ ట్వీట్‌ చేశాడు. కానీ అదే టైమ్‌లో జూ. ఎన్టీఆర్‌ కూడా తన 25 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ ప్రస్తావన మాత్రం లోకేష్‌ ఎక్కడా తీసుకురాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తారక్‌ ఇలా తన స్టైల్‌లో కౌంటర్‌ ఇచ్చాడని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు.ఇక చాలా కాలంగా అటు నారా కుటుంబానికి, ఇటు నందమూరి బాలకృష్ణ కుటుంబానికి జూ. ఎన్టీఆర్‌ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Internet praise lady cops gallant act of clearing way for ambulance in busy traffic3
అపర్ణకు జనం సెల్యూట్!

తిరువనంతపురం: ఈ రోజుల్లో పోలీస్ డ్యూటీ అంటే కేవలం చట్టాన్ని అమలు చేయడం మాత్రమే కాదు.. మానవత్వానికి ప్రతిరూపంగా నిలవడం కూడా. తాజాగా కేరళకు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారిణి అందుకు నిదర్శనంగా నిలిచారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు ప్రయత్నం చేయడమే కాదు.. రోడ్డు మధ్యలో పరుగెత్తుతూ వాహనాలను పక్కకు జరుపుతూ సంకేతాలు ఇచ్చారు. ఆమె చేసిన ఈ చర్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో ఆగస్టు 9న కేరళలోని త్రిసూర్ జిల్లాలో జరిగింది. త్రిసూర్‌ జిల్లాకు చెందిన ఓ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ అంబులెన్స్ జూబ్లీ మిషన్‌ ఆస్పత్రి వైపు వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో పోలీసు వాహనంలో వెళ్తున్న స్టేషనల్‌ హౌస్‌ ఆఫీసర్‌ అపర్ణా లవకుమార్ ఆ అంబులెన్స్‌ను గమనించారు. వెంటనే పోలీసు వాహనం నుంచి మెరుపు వేగంతో బయటకు వచ్చారు. అంబులెన్స్ ముందు పరుగెత్తుతూ ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. దీంతో అంబులెన్స్‌ సకాలంలో ఆస్పత్రికి చేరడం,రోగికి చికిత్స అందడంపై అపర్ణా లవకుమార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.అపర్ణా మానవత్వం చూపించిన ఘటనలో కోకొల్లలు. 2019లో త్రిసూర్ రూరల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తుండగా ఐదోతరగతి చదువుతున్న చిన్నారి బాధడను చూడలేక ఆమె తన జుట్టును పూర్తిగా తీసేసి కేన్సర్‌ పేషెంట్ల కోసం దానం చేశారు. పోలీస్ శాఖ నియమాల ప్రకారం జుట్టు పూర్తిగా తీసేసుకోవడానికి అనుమతి అవసరం. ఆమె నిర్ణయాన్ని త్రిసూర్ రూరల్ డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్ విజయ్ కుమార్ స్వాగతించారు.2008లో ఓ మృతదేహాన్ని విడుదల చేయించేందుకు ఆసుపత్రి బిల్లులు చెల్లించేందుకు తన బంగారు గాజులను ఇచ్చారు. ఇలా విధులు నిర్వహిస్తున్న అపర్ణా లవకుమార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. Big Salute to #Kerala police woman ASI Aparna Lavakumar. In Thrissur, she ran ahead of a stalled ambulance in heavy traffic, personally urging vehicles aside so that the emergency vehicle with the patient could proceed safely. Aparna was previously praised for pawning her gold… https://t.co/RoUqXSzwAv pic.twitter.com/mip2MMLO7k— Ashish (@KP_Aashish) August 11, 2025

Kadapa MP Avinash Reddy Alleges EC Blind Acts TDP Vote Chori Pulivendula4
ఈసీ మొద్దు నిద్ర.. పులివెందులలో టీడీపీ ఓట్ల చోరీ: వైఎస్‌ అవినాష్‌రెడ్డి

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం అధికార టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను వైఎస్సార్‌సీపీ నేత, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఎండగట్టారు. టీడీపీ నేతలు ఓటర్ల స్లిప్పులను సేకరిస్తు‍న్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన ఆయన.. ఈసీ తీరుపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ.... పోలింగ్‌ బూత్‌లను మార్చడంపై స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. దీని వలన ఎవరి ఓటు ఎక్కడ ఉందో ఓటరికి అర్థం కాదు. తాను ఏ బూతులో ఓటు వేయాలో కూడా ఓటరుకి అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఓటరుకి తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం కల్పించాలి... కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారు. టీడీపీ వారు ఇంటింటికీ వెళ్ళి డబ్బులు పంచుకున్నారు. డబ్బులిచ్చి ఓటర్ల స్లిప్పులను వెనక్కు తీసుకుంటున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు. ఎర్రిపల్లిలో రాత్రే టీడీపీ నేతలు స్లిప్పులను తీసుకున్నారు. ఈరోజు మరికొన్ని గ్రామాలలో తీసుకోబోతున్నారు. .. మా పార్టీ మండల నాయకుల ఇళ్లకు కూడా వెళ్లి స్లిప్పులు అడుగుతున్నారు. మూడురోజులుగా ఎన్నికల కమిషన్ దృష్టికి పదేపదే తీసుకెళ్లాం. అయినా ఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర వీడటం లేదు. ప్రతి ఒక్క ఓటరికీ మళ్లీ స్లిప్‌లను అందించాలి. ఈ రాత్రికి మొత్తం 10,601 ఓటర్లకు స్లిప్పులను ఇవ్వాలి. నల్లపరెడ్డిపల్లి గ్రామానికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారు. ఆ వచ్చినవారికి ఈ స్లిప్పులను ఇచ్చి దొంగ ఓటు వేయించబోతున్నారు. ిగ్గింగ్ చేసినట్టు కెమెరాలో కనపడకుండా ఇలాగ ప్లాన్ చేశారు. నిరంతరాయంగా ఇలా దొంగ ఓట్లు వేయటానికి మనుషులను దించారు. దీనిపై మొద్దు నిద్ర వీడి.. ఎన్నికల కమిషన్ స్పందించాలి అని డిమాండ్‌ చేశారాయన. ఇదిలా ఉంటే.. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్‌ మంగళవారం ఉదయం నుంచి జరగనుంది.

New Twist In Yemen kerala Nurse Nimisha Priya Case5
Nimisha Priya Case: ‘నిమిషకు వెంటనే శిక్ష అమలుపరచండి’

కేరళ నర్సు నిమిష ప్రియ కేసు.. వారానికో మలుపు తిరుగుతోంది. మరణ శిక్ష అమలుకు ఒక్కరోజు ముందు.. అంటే జులై 15న వాయిదా పడ్డట్లు యెమెన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిమిష తల్లి విజ్ఞప్తి, మతపెద్దల జోక్యంతో శిక్ష అమలును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు రషద్‌ అల్‌ అలిమి ఉత్తర్వులు వెలువరించారు. అయితే..అప్పటి నుంచి బాధిత కుటుంబంతో నిమిష తల్లి, మధ్యవర్తులు జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. బ్లడ్‌ మనీ ప్రైవేట్‌​ వ్యవహారం కావడంతో భారత విదేశాంగ శాఖ దూరంగా ఉంటోంది. దీంతో నిమిష ప్రియ కేసులో చర్చలు ఎలా కొనసాగుతున్నాయో అనే గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్‌ అబ్దో మెహ్దీ హతమార్చిన కేసులో నిమిష ప్రియకు మరణశిక్ష పడింది. అయితే నిమిషకు వెంటనే మరణశిక్ష అమలు చేయాలని అతని సోదరుడు అబ్దుల్‌ ఫతాహ్‌ మెహ్దీ గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాడు. ఈ మేరకు యెమెన్‌ డిప్యూటీ జనరల్‌ను కలిసి మరణశిక్ష తేదీ అమలుకు తేదీని ఖరారు చేయాలని కోరారు. అదే సమయంలో ఆ దేశ అటార్నీ జనరల్‌కు శిక్షను త్వరగతిన అమలు చేయాలంటూ శుక్రవారం ఓ లేఖ రాశాడు.‘‘మా కుటుంబం అంతా కోరుకునేది ఒక్కటే. ఆమె చేసింది క్రూరమైన నేరానికి పాల్పడింది. ఆ నేరానికి క్షమాపణ ఉండదు.. ఉండబోదు. ఆమెకు తక్షణమే శిక్ష అమలు కావాలి. ఇంక ఆలస్యం చేయకుండా న్యాయం అందించాలి’’ అని ఫేస్‌బుక్‌లోనూ ఫతాహ్ ఓ పోస్ట్‌ చేశాడు. అయితే ఫతాహ్‌ ఇలా డిమాండ్‌ చేయడం ఇదే తొలిసారేం కాదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. వాస్తవానికి నిమిషకు మరణశిక్ష జూన్‌ 7వ తేదీనే అమలు కావాల్సి ఉందని, అయితే దానిని జులై 16వ తేదీకి ాయిదా వేశారు. అప్పట ఇనుంచి అమలు చేయకుండా పెండింగ్‌లో ఉంచారని ఫతాహ్‌ ఆరోపిస్తున్నాడు. నిమిషకు మరణశిక్షలో జాప్యం చేయొద్దని జులై 25న, ఆగస్టు 4వ తేదీల్లో అక్కడి అదికారులకు లేఖ రాశాడు. మరోవైపు.. కేరళ మతపెద్ద, భారత గ్రాండ్ ముఫ్తా కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ చేస్తున్న వరుస ప్రకటనలనూ అబ్దుల్‌ ఫతాహ్‌ ఖండించాడు. మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తవేమీ కావు. మాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. అలాగే మేం ఎదుర్కొన్న ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని మార్చవు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేం. ఇది ఆ మత పెద్దలు అర్థం చేసుకుంటే మంచిది. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోండి. నిమిషకు శిక్ష పడితేనే మా కుటుంబానికి న్యాయం దక్కేది’’ అని అంటున్నాడు. ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ మరణశిక్ష తన దౌత్యం వల్లే వాయిదా పడిందని కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ తాజాగా ప్రకటించారు. అలాగే.. ఈ వ్యవహారంలో కొందరు ఆ ఘనతేనని ప్రకటించుకున్నారని, అవసరమైతే ఆ క్రెడిట్‌ వాళ్లకే కట్టబెట్టడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ప్రకటించారు. మరోవైపు.. నిమిష ప్రియ వ్యవహారంలో భారత ప్రభుత్వం తాము చేయగలిగినదంతా చేశామంటూ ఇదివరకే ప్రకటించింది. అయితే శిక్ష వాయిదా ప్రకటనను అధికారికంగా ధృవీకరించిన విదేశాంగ శాఖ.. ఏదైనా పురోగతి కనిపిస్తే అధికారికంగా తామే ప్రకటిస్తామని, అప్పటిదాకా వదంతులను నమ్మొద్దంటూ స్పష్టం చేస్తూ వస్తోంది.

Sakshi Guest Column On Satya Nadella Speech About Students6
విద్యార్థులకు 'భవిష్యత్‌' పాఠం

అవి మా ముత్తాత పోయిన కొత్తలు. ఆయన ఒక సన్నకారు రైతు. ఆయన పోవడంతో మా ముత్తవ్వ యువ వితంతువుగా మారింది. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమారులు. ఆదాయ వనరు సున్నా. ఇద్దరు పిల్లలను చదివించి, వారికి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో దగ్గరలోని ఓ పట్టణానికి మకాం మార్చారు. ఓ ఇంట్లో పని మనిషిగా చేరారు. చాలీచాలని ఆదాయం ఇద్దరు పిల్లల్లో ఒకరిని చదివించేందుకే సరిపోతుంది. ఇద్దరు పిల్లల మధ్య వయసులో పెద్ద తేడా లేదు. ఆ ఇద్దరిలో ఒక పిల్లాడు బాధ్యతతో మెలిగేవాడుగా కనిపించాడు. రెండవవాడు కాస్త పేచీకోరు. పరిస్థితులకు అనుగుణంగా మసలుకునే పిల్లాడిని, ఆమె పనిలోకి దింపారు. అతను భవన నిర్మాణ పనుల్లో దినసరి కూలీగా మారాడు. కొత్త నైపుణ్యాలను గడించుకుని, ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని అందుకొనే అవకాశం ఎన్నడూ లభించలేదు. మరో పిల్లాడిని స్థానికంగా ఉన్న పాఠశాలకి పంపించగలిగారు. ఆ పిల్లాడే మా తాతయ్య. తక్కువ బాధ్యతతో వ్యవహరించే పిల్లాడిగా ముద్రపడినా, స్కూలు చదువును కొనసాగించగలిగాడు. పోలీసు అధికారి అయ్యాడు. అతని సోదరుడు నాలుగు రాళ్ళు సంపాదించడం ప్రారంభించిన పదేళ్ళ తర్వాత ఉద్యోగంలో చేరినా, ప్రారంభంలోనే ఎక్కువ జీతభత్యాలు తీసుకోగలిగాడు. మా తాత చదువుకోవడం, ఉద్యోగ జీవితం వల్ల, మా నాన్నకు చదువుకొనే అవకాశం లభించింది. ఫలితంగా, నేను నాకు ఇష్టమైన బాటలో అడుగులు వేసేందుకు అవకాశం చిక్కింది. మా తాతకు లభించిన అవకాశం వల్ల, ఆ తరువాత తరాలు కూడా బాగుపడే వీలు చిక్కింది. ప్రతిభావంతులు ప్రతిచోటా ఉన్నారు. కానీ, వారు వెలుగులోకి వచ్చే అవకాశమే ఉండటం లేదు అనే దానికి ఈ వ్యక్తిగత జీవిత వివరాలే ఉదాహరణ. టెక్నాలజీ ఉపకరణం మాత్రమే!ఈ రోజు కార్యక్రమం విద్య, టెక్నాలజీ గురించి! సూటిగా చెప్పాలంటే, రేపటి ప్రపంచాన్ని సృష్టించేవారిగా నేటి విద్యార్థులను తీర్చిదిద్దడానికి సంబంధించినది. సాంకేతికంగా అబ్బురపరచే ప్రగతిని సాధిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. మన జీవితాలలో ప్రతి పార్శ్వాన్ని, ఆర్థిక వ్యవస్థలను, సమాజాలను డిజిటల్‌ టెక్నాలజీలు రూపుదిద్దుతున్నాయి. అయితే, టెక్నాలజీ అంతరాయా లను కూడా సృష్టిస్తోంది. టెక్నాలజీ ఏ కొద్ది మందికోకాక, అందరికీ అవకాశాలను అందివ్వగలదా? అన్నదే అసలైన ప్రశ్న. ఇతరులు సాధించే విజయంపైనే మన విజయం గణనకు వస్తుంది. చదువుకునే అవకాశాన్ని అందరికీ కల్పించడం మన ధ్యేయం కావాలి. నేటి సమాజం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్ళలో అది ఒకటి. ‘మైక్రోసాఫ్ట్‌’ మాజీ పరిశోధకుడు, ‘గీక్‌ హేర్సే’ పుస్తక రచయిత కెంటరో టొయోమ ఆ అంశాన్ని బాగా పట్టుకున్నారు. టెక్నాలజీలో కన్నా ముందుగా సమాజంలో మార్పు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. టెక్నోక్రాట్లు సాధారణంగా టెక్నాలజీ గుణగణాల గురించి గొప్పగా చెప్పేందుకు మొగ్గు చూపుతూంటారు. వ్యవస్థలోని అన్ని రుగ్మతలకూ దానినే విరుగుడుగా భావిస్తూంటారు. దానితో విభేదం ఉన్నవాడిగానే నేనిక్కడికి వచ్చాను. విద్యను రూపాంతరీకరించడానికి టెక్నాలజీ ఒక్కటే సమాధానమనే భ్రమల్లో మనం లేము. విద్యా రంగంలో మార్పు తీసుకొచ్చేందుకు అంకిత భావం కలిగిన పాలకులు, గొప్ప ఉపాధ్యాయులు, ప్రేరణ పొందిన విద్యార్థులు, పాలుపంచుకునే తల్లితండ్రులు, సమాజాలు అవసరం. టెక్నాలజీ వారి సృజనాత్మకతకు, చాతుర్యానికి సాధికారత కల్పించగల ఒక ఉపకరణం మాత్రమే. ప్రపంచం నలుమూలల ఉన్న విద్యార్థులను చూడగలగడం, వారి నుంచి నేర్చుకోగలగడం నా ఉద్యోగ బాధ్యతల్లో నేను ఇష్టపడే అంశాల్లో ఒకటి. గత రెండేళ్ళుగా, నేను 20కి పైగా దేశాలలో విద్యార్థులను కలుసుకునే అవకాశం లభించింది. సియాటిల్‌లో నా కూతుళ్ళు ఏ ఆఫీసు టూల్స్‌ని ఉపయోగిస్తున్నారో అవే టూల్స్‌ని జకార్తా, టెల్‌ అవీవ్‌లలోని విద్యార్థులు కూడా ఉపయోగిస్తున్నారు. ఆ యా తరగతి గదుల్లో కొంత సమయాన్ని వెచ్చించినప్పుడల్లా, ప్రతిసారీ నాలో కొన్ని అంశాలు ముసురుకుంటూ వచ్చాయి. పిల్లలను ఎలా తీర్చిదిద్దాలి?ఒకటి– తరగతి గదిలో టీచర్‌ పనికి టెక్నాలజీ సాయపడాలే గానీ, అవరోధం కాకూడదు. సమయాన్ని వెచ్చించడంలో టీచర్లపై చాలా డిమాండ్లు ఉంటాయి. వారు పాఠ్యాంశాలను ఎంపిక చేయాలి. పరీక్షలు పెట్టాలి. పేపర్లు దిద్దాలి. తరగతుల్లో విద్యార్థు లను అదుపాజ్ఞలలో ఉంచాలి. క్రమశిక్షణ నేర్పాలి. టెక్నాలజీ టీచర్ల జీవితాలను సులభతరం చేసి, విద్యార్థులలో సృజనాత్మకతను రేకెత్తించేదిగా ఉండాలిగానీ, వాటి నుంచి దృష్టి మళ్ళించేదిగా ఉండకూడదు. రెండు– పని స్వరూప స్వభావాలలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక సమస్యను పరిష్కరించేందుకు సమష్టిగా పనిచేస్తున్నారు. సమస్యను విభజించి చూడటంకన్నా ఏక మొత్తంగా చూస్తున్న ధోరణి కనిపిస్తోంది. ఈ రకమైన భవిష్యత్తుకి మనం విద్యార్థులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. తరగతి గదిలో కూడా టీమ్‌ల వారీగా పనిచేయడాన్ని ప్రోత్సహించాలి. సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా నేర్చుకో వడం తరగతి గదిలోనే మొదలవ్వాలి. టీమ్‌ వర్క్‌కి అవి కేంద్రాలు కావాలి. అప్పుడే దేన్నైనా కలసి సృష్టించగల సామర్థ్యం సొంత మవుతుంది. విద్యార్థులను కలసిమెలసి నేర్చుకునేటట్లుగా చేస్తే, వారి విద్యావకాశాలు కూడా మెరుగుపడతాయి. మూడు– రేపటికి తగినట్లుగా మన విద్యార్థులను తయారు చేసి తీరాలి. ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌’ నివేదికను, అది రూపొందించిన ఉద్యోగాల నివేదికను పరిశీలించండి. నేడు పాఠశాలల్లో అడుగు పెడుతున్న విద్యార్థుల్లో 65 శాతం మందికి లభించబోయే ఉద్యో గాలు, ఇపుడు ఉనికిలో ఉన్నవి కావట! ‘కాంపుటేషనల్‌ థింకింగ్‌’, సమస్యను పరిష్కరించగల నైపుణ్యాలు భవిష్యత్తుకు కీలకమని టీచర్లకు తెలుసు. ‘స్టెమ్‌’ పాఠ్య ప్రణాళికను విస్తృతంగా వీక్షించవలసిన అవసరం ఉందని కూడా వారికి తెలుసు. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితాన్ని కలిపి పొందికతో కూడిన అధ్యయన నమూనాగా చేయడాన్ని ‘స్టెమ్‌’గా పిలుస్తున్నారు. చదవడం, రాయడం, డిజైన్, కళలకు తోడు, ‘స్టెమ్‌’ పాఠ్య ప్రణాళికను కూడా తీసుకువస్తే, భవిష్యత్తులో ఈ విద్యార్థులు విజయం సాధించడానికి రంగం సిద్ధం చేసినవాళ్ళం అవుతాం. చివరగా– మా తాతకు లభించిన అవకాశం, మా కుటుంబ గతిని మార్చివేసింది. ఇపుడు నాకు స్ఫూర్తినిస్తున్న అంశం ఈ తరంలోనూ, రాబోయే తరాలలోనూ ప్రతి విద్యార్థికి విద్యావకాశాన్ని ప్రజాస్వామ్యీకరణ చేసేందుకు మనందరం కలసి మెలసి ఎలా ఒకటవాలన్నదే! అందరికీ కృతజ్ఞతలు.

Sakshi Editorial On Parliament and Lok Sabha7
చట్టసభలే సరైన వేదికలు

మన చట్టసభల వల్ల ప్రజలకూ, ప్రజాస్వామ్యానికీ ఏ మేరకు ప్రయోజనం కలుగుతోందన్న అంశంలో ఎవరి అభిప్రాయాలు వారికున్నా... అక్కడి చర్చల సరళి ఇంకా మెరుగుపడాలని, ప్రభుత్వ జవాబుదారీతనం మరింత పెరగాలన్న విషయంలో అందరూ ఏకీభవిస్తారు. గత నెలాఖరున మూడు రోజులపాటు ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై విస్తృత చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలోనూ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజ్యసభలోనూ సమాధానమిచ్చారు. కానీ భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌ శనివారం చేసిన ప్రసంగంలోనూ, అంతక్రితం ఈ నెల 4న సైనిక దళాల ప్రధానాధికారి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది మద్రాస్‌ ఐఐటీలో చేసిన ఉపన్యాసంలోనూ కనబడిన స్పష్టత, వివరాలు చర్చ సందర్భంగా ప్రధాని, కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటనల్లో లేవు. ఇరు దేశాల మధ్యా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం వెనక ఏ ప్రపంచ నాయకుల ఒత్తిళ్లూ లేవని ఇద్దరూ నిర్ద్వంద్వంగా చెప్పటం హర్షించదగ్గదే అయినా, ఆ ఆపరేషన్‌లో మనం సాధించిన విజయాలనూ, ఆ క్రమంలో ఎదురైన సవాళ్లనూ వివరించకపోవటం, అసలు పెహల్గాం భద్రతా లోపాలూ, వాటిపై చర్యలూ వెల్లడించకపోవటం లోటే అనిపిస్తుంది. అనర్గళంగా మాట్లాడగలిగే శక్తివున్నవారెవరో, అవతలి పక్షాన్ని వ్యంగ్యంతో, వెటకారంతో గేలిచేసి చిన్నబుచ్చగలవారెవరో తెలుసుకోవటానికి ప్రజలు చట్టసభల ప్రత్యక్ష ప్రసారాలు చూడరు. వాస్తవాలు తెలుసుకోవా లనుకుంటారు. విపక్షాల సందేహాలకు ప్రభుత్వం సూటిగా, స్పష్టంగా జవాబిచ్చిందా లేదా అనేది గమనిస్తారు. కానీ పార్లమెంటులో జరిగింది వేరు. ఎప్పటిలా పరస్పరం నిందారోపణలు చేసుకోవటంతోనే చాలా సమయం గడిచింది. ‘సిందూర్‌’లో జరిగిందేమిటో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌ చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన అయిదు యుద్ధ విమానాలను కూల్చటంతోపాటు మరో భారీ విమానాన్ని సైతం పడగొట్టామని, దాదాపు 90 గంటల వ్యవధిలో అనుకున్న లక్ష్యాలను సాధించామని ఆయన వివరించారు. మన గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్‌ వ్యవస్థ సక్రమంగా పనిచేయటంతో పాక్‌ సైన్యం పాచికలేమీ పారలేదని, వారి ఎఫ్‌–16లూ, డ్రోన్లూ, క్షిపణులనూ కూల్చేయటంతోపాటు రెండు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలనూ, ఒక వైమానిక స్థావరాన్నీ ధ్వంసం చేశామని ప్రకటించారు. జనరల్‌ ద్వివేది అయితే ప్రభుత్వం రాజకీయ స్పష్టతతో దిశానిర్దేశం చేయటం, విశ్వాసాన్నీయటం, నిర్ణయాన్ని తమకే వదిలేయటం తొలిసారి చూశామని చెప్పారు. ఇటువంటి ప్రకటనలు పార్లమెంటు వేదికపై ప్రభుత్వం వైపుగా వస్తే, వాటిపై విపక్షం ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వెల్లడయ్యేవి. ముఖ్యంగా జనరల్‌ ద్వివేది ప్రసంగం వాస్తవ స్థితేమిటో చెప్పింది. శత్రువుతో ఇప్పుడు నాలుగు రోజుల్లోనే ఘర్షణలు సమసినా... త్వరలోనే మరో యుద్ధం జరిగినా ఆశ్చర్యం లేదని, ఈసారి ఒంటరిగా వస్తారా, వేరే దేశాలతో కలిసి వస్తారా అన్నది కూడా చెప్పలేమని ఆయన అనటం గమనించదగ్గది. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌జీత్, జనరల్‌ ఉపేంద్ర ద్వివేది కూడా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ దేశాన్ని ఏకం చేయటం గురించి ప్రస్తావించారు. దేశ ప్రజానీకమంతా ఒక్కటై నిలబడటం సాధారణ విషయం కాదు. ఇందులో విపక్షాల పాత్రను కొట్టిపారేయలేం. పెహల్గాంలో భద్రతా లోపాలపై తీసుకున్న చర్యలేమిటో చెప్పకపోవటం, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌–పాక్‌ ఘర్షణలు ఆగటం తన ఘనతేనని ప్రకటించటం విపక్షాలకు అభ్యంతరకరం అయింది. ట్రంప్‌ మధ్యలో స్వరం మార్చినా తిరిగి దాన్నే పదే పదే చెబుతున్నారు. అందువల్ల పార్లమెంటు వేదికగా దేశానికి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి జరిగిందేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులపై పడింది. ప్రశ్నిస్తున్న విపక్షాలు పాకిస్తాన్‌తో కుమ్మక్కయ్యాయని ప్రత్యారోపణ చేయటం ఇందుకు ప్రత్యామ్నాయం కాదు. యుద్ధ రంగంలో వ్యూహాలూ, ఎత్తుగడలూ ఎలావుండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి వదిలిపెట్టినా, ఆ క్రమంలో ఏర్పడ్డ సమస్యలను తెలుసుకుని అవసరమైన సూచనలీయటం, జరిగిందేమిటో ప్రజలకు తేటతెల్లం చేయటం దేశ రాజకీయ నాయకత్వం బాధ్యత. మన రక్షణ దళాల చీఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ సింగపూర్‌లో జూన్‌ నెలాఖరున మాట్లాడుతూ మన దళాలు చేసిన కొన్ని ‘వ్యూహాత్మక తప్పిదాల’ కారణంగా జెట్‌ విమానాలు కోల్పోయామని చెప్పటం వివాదాస్పదమైంది. పార్లమెంటులో దానిపై ప్రభుత్వం వైపునుంచి ఎలాంటి వివరణా లేదు. ఇప్పుడు దళాధిపతుల ప్రసంగాల్లోనూ ఆ వివరాల్లేవు. ఈ విషయమై సందేహాలు పోగొట్టడానికి పార్లమెంటే సరైన వేదిక. దాన్నుంచి వెలువడే సందేశం దేశ ప్రజానీకాన్ని ఒక్కటి చేస్తుంది. ఆ సంగతిని అధికార పక్షంతోపాటు విపక్షం కూడా మరువరాదు.

Canada take five balls to chase target in U19 World Cup qualifier8
క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం.. 5 బంతుల్లో మ్యాచ్ ఫినిష్‌

అండర్ -19 వరల్డ్ కప్ అమెరికా క్వాలిఫయర్స్‌లో పెను సంచ‌ల‌నంం నమోదైంది. క్రికెట్ చ‌రిత్ర‌లో తొలిసారిగా ఓ జ‌ట్టు 5 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ఈ అరుదైన రికార్డును కెన‌డా అండ‌ర్‌-19 జ‌ట్టు త‌మ పేరిట లిఖించుకుంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి పరమ్ వీర్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదిక‌గా అర్జెంటీనా అండ‌ర్‌-19, కెన‌డా అండ‌ర్‌-19 జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అర్జెంటీనా కెప్టెన్ తొలుత బ్యాటింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అయితే కెప్టెన్ నిర్ణ‌యానికి అర్జెంటీనా జ‌ట్టు ఏ మాత్రం న్యాయం చేయ‌లేక‌పోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అర్జెంటీనా.. కెన‌డా బౌల‌ర్ల ధాటికి 19.4 ఓవర్లలో కేవలం 23 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కెనడా పేస‌ర్ జగ్మన్‌దీప్ పాల్ 6 వికెట్ల ప‌డ‌గొట్టి ప్ర‌త్య‌ర్ధి ప‌తనాన్ని శాసించాడు. అత‌డితో పాటు డొమినిక్ డైన్‌స్టర్, క్రిష్ మిశ్రా త‌లా రెండు వికెట్లు సాధించారు. అర్జెంటీనా బ్యాటర్లలో ఒక్కరంటే ఒక్కరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. టొమోస్ ర‌స్సీ(6) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అనంత‌రం 23 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కెనడా కేవ‌లం 5 బంతుల్లోనే చేధించింది. ఓపెనర్ ధర్మ్ పటేల్ (1 నాటౌట్) తొలి బంతికి సింగిల్ తీయగా.. మరో ఓపెనర్ యువరాజ్ సమ్రా(22 నాటౌట్) నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు.కాగా యూత్ వ‌న్డే క్రికెట్‌లో అత్యల్ప స్కోర్ రికార్డు మాత్రం స్కాట్లాండ్ పేరిట ఉంది. 2004 అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆస్ట్రేలియాపై స్కాట్లాండ్ 22 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 3.5 ఓవర్లలో ఛేదించింది.చదవండి: Jos Buttler: తండ్రి మ‌ర‌ణం.. స్టార్ క్రికెట‌ర్ భావోద్వేగం

Uttar Pradesh Police encounters list since 2017 full details PN9
రోజుకు ఐదు ఎన్‌కౌంట‌ర్లు.. క్రిమిన‌ల్స్ గుండెల్లో రైళ్లు

యూపీ పోలీసుల పేరు చెబితే అక్క‌డి నేర‌స్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. జ‌నాన్ని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తూ త‌మ‌కు ఎదురే లేద‌న్నట్టుగా ఇన్నాళ్లూ చెల‌రేగిపోయిన క్రిమిన‌ల్స్ ఆట క‌టిస్తున్నారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ర‌క్ష‌క భ‌టులు. తామున్న‌ది శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడ‌టానికేన‌ని, నేరాలు చేసిన వారు ఎంత‌టివారైనా వ‌దిలిపెట్ట‌బోమ‌ని తేల్చి చెబుతున్నారు. త‌మ‌దైన శైలిలో కిరాత‌కుల పీచ‌మ‌ణుస్తున్నారు. ఇందుకు అధికారిక లెక్క‌లే ప్ర‌త్య‌క్ష సాక్ష్యం.ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో యోగి ఆదిత్య‌నాథ్ (Yogi Adityanath) సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు స‌గ‌టున రోజుకు దాదాపు ఐదు ఎన్‌కౌంట‌ర్లు జ‌రిగిన‌ట్టు అధికార గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. యూపీ పోలీసుల డేటా ప్ర‌కారం.. 2017, మార్చి 20 నుంచి ఈ ఏడాది ఆగ‌స్టు 6 వ‌ర‌కు రాష్ట్రంలో 15,140 ఎన్‌కౌంట‌ర్లు చోటుచేసుకున్నాయి. ఫ‌లితంగా 243 మంది క్రిమిన‌ల్స్ హ‌త‌మ‌య్యారు. 9,668 మందికి గాయాల‌య్యాయి. 31 వేల మందిపైగా నిందితులు అరెస్ట‌య్యారు. విధి నిర్వ‌హ‌ణ‌లో 18 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 1720 మంది గాయ‌ప‌డిన్న‌ట్టు యూపీ పోలీసుల అధికారిక డేటా వెల్ల‌డించింది.నో కాంప్ర‌మైజ్రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిక్ష‌ణ‌లో రాజీప‌డ‌బోమ‌ని, నేరాలు చేసే వారి ప‌ట్ల అత్యంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని యూపీ డీజీపీ రాజీవ్ కృష్ణ (Rajeev Krishna) స్ప‌ష్టం చేశారు. తాము చేప‌ట్టిన ప్ర‌తి చ‌ర్య కూడా నిష్ప‌క్ష‌పాతంతో పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంద‌న్నారు. మానవ హ‌క్కుల‌ను గౌర‌విస్తూనే చ‌ట్టానికి లోబ‌డి వ్య‌వ‌హ‌రించామ‌ని ఆయ‌న చెప్పారు. ఎదురు కాల్పుల స‌మ‌యంలో జాతీయ మాన‌వ హ‌క్కుల మార్గ‌ద‌ర్శ‌కాల‌ను యూపీ పోలీసులు పాటించారు. గ్యాంగ్‌స్ట‌ర్‌, మాఫియా డాన్‌ల‌ను ఉక్కుపాదంతో అణిచివేస్తాం. ఇదిలాగే కొనసాగుతుంద‌ని అన్నారు. నేర‌స్థుల‌ను ప‌ట్టుకునే క్ర‌మంలో త‌మ పోలీసులు ఎంతో దైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించార‌ని, విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు త్యాగం చేశార‌ని, కొంత‌మంది గాయ‌ప‌డ్డార‌ని తెలిపారు.వెస్ట్‌లోనే హ‌య్య‌స్ట్‌యూపీ పోలీసుల అధికారిక లెక్క‌ల ప్ర‌కారం.. మొత్తం ఎన్‌కౌంట‌ర్లలో స‌గానికి పైగా ప‌శ్చిమ యూపీలోని పోలీసు క‌మిష‌న‌రేట్లు, జోన్స్ ప‌రిధిలోనే చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. మీర‌ట్ జోన్‌లో అత్య‌ధిక ఎన్‌కౌంట‌ర్లు (4,282) చోటుచేసుకున్నాయి. అగ్రా జోన్ (2,326), బ‌రేలీ (2,004) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒక్క మీర‌ట్ జోన్‌లోనే 81 మంది ఎన్‌కౌంట‌ర్ల‌లో హ‌త‌మ‌య్యాయి. 2,951 మంది గాయ‌ప‌డ‌గా, 4,568 మంది అరెస్ట‌య్యారు. ఇదే స‌మ‌యంలో ల‌క్నో జోన్‌లో 806 ఎన్‌కౌంట‌ర్ల‌లో 17 మంది నేర‌స్థులను పోలీసులు మ‌ట్టుబెట్టి 1,781 మందిని ప‌ట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా 166 మంది పోలీసులు గాయ‌ప‌డ్డారు. గౌత‌మ్ బుద్ధ న‌గ‌ర్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 1,084, కాన్పూర్ జోన్‌లో 671 ఎన్‌కౌంట‌ర్లు జ‌రిగాయి.ప‌బ్లిక్ సేఫ్టీ ఫ‌స్ట్‌పోలీసు క‌మిష‌న‌రేట్ల వారీగా చూస్తే.. గౌత‌మ్ బుద్ధ న‌గ‌ర్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో అత్య‌ధిక ఎన్‌కౌంట‌ర్లు జ‌రిగాయి. త‌ర్వాతి స్థానిల్లో ఘ‌జియాబాద్ (696), ఆగ్రా (430), వార‌ణాసి(124), ల‌క్నో (132) నిలిచాయి. నేర‌స్థుల‌ను ప‌ట్టుకోవ‌డానికి వెళ్లిన‌ప్పుడు త‌మ‌పైకి కాల్పులు జ‌ర‌ప‌డంతో ఎన్‌కౌంట‌ర్లు జ‌రిగిన‌ట్టు సీనియ‌ర్ పోలీసు అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. ప్ర‌జలకు ర‌క్ష‌ణ‌ క‌ల్పిస్తూ శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌ట‌మే త‌మ ప్ర‌థ‌మ క‌ర్త‌వ్య‌మ‌ని చెప్పారు.చ‌ద‌వండి: కోట్లు కుమ్మ‌రిస్తున్నారు... ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదు! క్రిమిన‌ల్స్ ఫినిష్‌యూపీ ఎన్‌కౌంట‌ర్ల‌లో క‌రుడు గ‌ట్టిన పలువురు నేర‌స్థులు హ‌త‌మ‌య్యారు. డీఎస్పీతో స‌హా 8 మంది పోలీసుల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న వికాస్ దూబేను ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ట్టుబెట్టారు. 60 క్రిమిన‌ల్ కేసులున్న అత‌డి త‌ల‌పై రూ. 5 ల‌క్ష‌ల రివార్డు ఉంది. మ‌రో క్రిమిన‌ల్‌ ష‌కీల్ అహ్మ‌ద్‌పై 25 కేసులుండ‌గా, అత‌డి త‌లపై రూ. 2.5 ల‌క్ష‌ల రివార్డు ఉంది. 10 క్రిమిన‌ల్ కేసులు ఎదుర్కొన్న క‌మ‌ల్ బ‌హ‌దూర్‌పై కూడా రూ. 2.5 ల‌క్ష‌ల రివార్డు ఉంది. ల‌క్ష్మ‌ణ్ యాదవ్ రూ. 1.5 ల‌క్ష‌ల రివార్డు ఉంది. వీరిని ఎన్‌కౌంట‌ర్ల‌లో పోలీసులు హ‌త‌మార్చ‌డంతో ఆయా ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకున్నారు.

Revised Income Tax Bill Passed In Lok Sabha Without Debate10
కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లుకు ఆమోదం: అమల్లోకి ఎప్పుడంటే?

ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ.. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లు 2025కు తాజాగా ఆమోదం లభించింది. బైజయంత్ పాండా నేతృత్వంలోని 31 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ చేసిన అనేక సిఫార్సుల ఆధారంగా ఇందులో మార్పులు చేశారు.సుమారు నాలుగు నెలల పాటు తీవ్రంగా సమీక్షించిన తర్వాత, కమిటీ 285 కంటే ఎక్కువ సిఫార్సులతో 4,500 పేజీలకు పైగా నివేదికను రూపొందించింది. ఈ సూచనల ఉద్దేశ్యం చట్టం భాషను సరళీకృతం చేయడం, నిబంధనలలో స్పష్టత తీసుకురావడం & పన్ను చెల్లింపుదారులకు సమ్మతిని సులభతరం చేయడం. ఇప్పుడు ప్రభుత్వం ఈ మార్పులను కలుపుకొని కొత్త ముసాయిదాను సమర్పించింది.ప్రస్తుతమున్న 1961 చట్టాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించిన కొత్త ఆదాయపు పన్ను బిల్లు, రాష్ట్రపతి ఆమోదం కోరే ముందు రాజ్యసభకు వెళుతుంది. ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత, కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది.పాత vs కొత్త బిల్లు మధ్య తేడాలుపాత ఆదాయపు పన్ను చట్టం, 1961.. దశాబ్దాలుగా అమలులో ఉంది. అయితే అందులోని భాష, నిర్మాణం వంటివన్నీ సామాన్యులకు కొంత గందరగోళంగా ఉన్నాయి. దీనిని పూర్తిగా మార్చాలనే ఉద్దేశ్యంతో కొత్త బిల్లును తీసుకువచ్చారు.ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో మొత్తం 47 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త బిల్లులో.. అధ్యాయాల సంఖ్యను కేవలం 23కి తగ్గించారు. దీనివల్ల చదవడం, అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఈ మార్పు ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, నిపుణులకు ఉపశమనం కలిగిస్తుంది.ఇకపై మునుపటి సంవత్సరం & అసెస్‌మెంట్ సంవత్సరం వంటి పదాలకు బదులు "పన్ను సంవత్సరం" అనే పదం వాడుకలోకి వస్తుంది.2025 కొత్త పన్ను బిల్లులో ఇంతకు ముందు ఉన్న శ్లాబులు, రేట్లు అలాగే ఉంటాయి. ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, ఆదాయపన్ను శ్లాబులలో కూడా ఎలాంటి మార్పు లేదు.కొత్త బిల్లులో, సంక్లిష్టమైన చట్టపరమైన భాషకు బదులుగా, పన్నును సులభంగా లెక్కించగల సూత్రాలు, పట్టికలను ఇవ్వడం జరిగింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు ఎంత పన్ను చెల్లించాలో.. ఎలా చెల్లించాలో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.ఇదీ చదవండి: ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50వేలు: స్పందించిన ఆర్‌బీఐ గవర్నర్

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement