రవాణా విధానంపై డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అన్ని రవాణా సంస్థలను నియంత్రించగల ఏకీకృత రవాణా ప్రాధికార సంస్థ లేకపోవడంతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ఎండీ మంగూసింగ్ అన్నారు. సమర్థంగా పనిచేసే ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తే పర్యావరణ, ఆర్థిక సంబంధిత సమస్యల పరిష్కారం సులువవుతుందని చెప్పా రు.
‘ఢిల్లీ రోడ్లపై సగటు వేగం ఒకే అంకెకు మిం చడం లేదు. మనం ఎడ్లబళ్ల కాలంవైపు వెళ్తున్నాం. అసమర్థ రవాణా వ్యవస్థే ఈ పరిస్థితికి కారణం. ఇందుకు ఏకీకృత రవాణా సంస్థ ఏర్పా టు అత్యవసరం’ అని డీఎం ఆర్సీ ఎండీ అన్నా రు. పట్టణ సామూహిక రవాణా, మెట్రో, లైట్‌రైల్‌పై చర్చ కోసం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) శుక్రవారం నగరంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో మంగూసింగ్ మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. చాలా దేశాల్లో నగర, మున్సిపల్ రవాణా సంస్థల నిర్వహణ బాధ్యత స్థానిక మేయర్ల చేతుల్లో ఉంటుందని తెలిపారు.
‘ఢిల్లీ నగరాన్ని ఎవరు నియంత్రిస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. అన్నింటి కంటే పెద్ద సమస్య ఇది. సమర్థంగా పనిచేసే ఏకీకృత రవాణా వ్యవస్థ ఏర్పాటే దీనికి పరిష్కారం’ అని మంగూసింగ్ అన్నారు. తమ సంస్థ డీఎంఆర్సీ ప్రతినిత్యం 26 లక్షల మందికి సమర్థంగా సేవలు అందిస్తోందని ప్రశంసించారు. అందుకే జైపూర్, కొచ్చి, హైదరాబాద్, లక్నో, పుణే వంటి నగరాలు తమ సంస్థను ఆదర్శంగా తీసుకొని మెట్రో మార్గాలను నిర్మిస్తున్నాయని అన్నారు.
ఏకీకృత వ్యవస్థ అత్యవసరం
Published Fri, Mar 21 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 5:00 AM
Advertisement
Advertisement