
ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో అనుహ్య ఘటన చోటు చేసుకుంది. మెట్రో రైలు పట్టాలపై ఒక డ్రోన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై హెచ్చరికలు జారీ చేసి ఢిల్లీ మెట్రో జసోలా విహార్ స్టేషన్‌ను కొద్దిసేపు తాత్కాలికంగా మూసేశారు. ఈ మేరకు పోలీసులు ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
విచారణలో ఈ డ్రోన్ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందినదని అధికారులు తెలిపారు. తనిఖీల్లో డ్రోన్‌లో కొన్ని మందులు దొరికాయని తెలిపారు. మందులను పంపేందుకు కంపెనీ డ్రోన్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అయినా హై సెక్యూరిటీ ఉన్న ప్రాంతాల్లో డ్రోన్లు ముప్పు పొంచి ఉందని అలాంటి ప్రదేశాల్లో ఎలాంటి డ్రోన్‌లు ఉపయోగించకూడదని అధికారులు తెలిపారు.
అయినా అధికారుల అనుమతి లేకుండా వాటిని ఉపయోగించడం చట్టం విరుద్ధమని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మెట్రో స్టేషన్‌ని పునః ప్రారంభించారు. భద్రతా కారణాల దృష్ట్యా జసోలా విహార్ షాహీన్ బాగ్ నుంచి బొటానికల్ గార్డెన్ మధ్య మెట్రో రైలు సేవలు అందుబాటులో లేవని, మిగిలిన లైన్లో యథావిధిగా సేవలు కొనసాగుతున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment