Drone
-
మహిళా సాధికారతకు డ్రోన్ల దన్ను
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇప్పటికే వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వాలు..తాజాగా డ్రోన్ల ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని నిర్ణయించాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో స్వయం సహాయక సంఘాలను (ఎస్‌హెచ్‌జీ) ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా..వ్యవసాయ రంగంలోనూ డ్రోన్ల వినియోగంలో వీరికి అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. వ్యవసాయ రంగానికి, రైతులకు సహాయ సహకారాలు అందించేందుకు వీలుగా, సబ్సిడీ రేట్లపై ఈ సంఘాలకు డ్రోన్ల అందజేతకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్టు సాధించే విజయాలు, మహిళా సాధికారతకు డ్రోన్ల అందజేత ఏ మేరకు దోహదపడుతుందనే అంశాన్ని పరిశీలించిన తర్వాత మిగతా జిల్లాలకు విస్తరించాలనే ఆలోచనతో ఉన్నారు. ఒక్కో మండలంలో ఒక్కో ఎస్హెచ్జీకి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మండలానికి చెందిన ఒక గ్రూపును ఎంపిక చేసి జాతీయ పథకం కింద అమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలుస్తోంది. ఎస్‌హేచ్‌జీల్లోని మహిళా సభ్యులకు ఉపాధి అవకాశాల కల్పన ద్వారా ఆర్థిక స్వావంబనతో పాటు రైతులకు తోడ్పాటును అందించాలనేది ఈ పథకం ముఖ్యోద్దేశం. వ్యవసాయ రంగంలో డ్రోన్ల సాంకేతికత వినియోగానికి కేంద్రం ప్రాచుర్యం కల్పిస్తున్న నేపథ్యంలో ఎస్‌హేచ్‌జీలకు 80 శాతం సబ్సిడీతో డ్రోన్లను అందజేయనున్నారు. కేంద్రం ఒక్కో డ్రోన్‌కు రూ.10 లక్షల చొప్పున కేటాయిస్తుండగా...అందులో 80 శాతం అంటే రూ.8 లక్షలు సబ్సిడీగా కవర్ కానుంది. మిగతా రూ.2 లక్షలు మండల మహిళా సంఘాలు భరించాల్సి ఉంటుంది. డ్రోన్లను సరైన పద్ధతుల్లో ఉపయోగించేలా ఎస్‌హేచ్‌జీలకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. డ్రోన్లు కేటాయించిన తర్వాత మహిళా సంఘాలు వీటిని రైతులకు అద్దెకు అందుబాటులో ఉంచుతాయి. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది. కూలీల సమస్యకు చెక్ డ్రోన్లతో వరి, మామిడి, పత్తి, ఇతర పంటలకు ఎరువులు, పురుగు మందులు చల్లించడం ద్వారా రైతులకు కూలీల సమస్య ఏర్పడకుండా ఉంటుంది. ఇతర కార్యక్రమాలకు కూడా ఉపయోగిస్తారు. గతేడాది ఓ ప్రైవేట్ ఎన్జీవో సంస్థ...నిర్మల్ జిల్లాలోని కుబీర్ మండలానికి చెందిన ఇద్దరు మహిళలకు డ్రోన్లను అందజేయగా.. వాటిని వారు విజయవంతంగా నిర్వహిస్తూ రాబడిని పెంచుకున్న ఉదంతాన్ని ఓ అధికారి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌హేచ్‌జీలకు డ్రోన్లను అందజేయడం వల్ల మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు మహిళా సాధికారతకు అవకాశాలు మెండుగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. -
డ్రోన్ లేడీ!
ఆసక్తి ఉంటే అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగవచ్చని... ప్రత్యేక గుర్తింపు పొందవచ్చని నిరూపించారు వైఎస్సార్ జిల్లా కమలాపురం మున్సిపాలిటీలోని కె.అప్పాయపల్లె గడ్డ వీధికి చెందిన నామాల జ్యోత్స్న. పొదుపు సంఘంలో క్రియాశీలకంగా ఉన్న ఆమె డ్రోన్ పైలట్‌గా ఎదిగారు. తొమ్మిది మండలాల్లోని పొలాలకు డ్రోన్ ద్వారా పురుగుమందులు పిచికారి చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. స్థానికంగా డ్రోన్ మహిళగా గుర్తింపు పొందారు. –కమలాపురంరూ.3లక్షల వరకు వచ్చాయినేను కలలో కూడా డ్రోన్ పైలట్ అవుతానని అనుకోలేదు. ఇప్పటి వరకు కమలాపురం, చెన్నూరు, వల్లూరు, సీకే దిన్నె, కడప, వేముల, సిద్ధవటం, మైదుకూరు, ఖాజీపేట మండలాల్లో డ్రోన్ ద్వారా పురుగుమందులు పిచికారి చేశాను. ఎకరాకు రూ.400 తీసుకుంటున్నా. తొమ్మిది మండలాల్లో 58 రోజుల్లో దాదాపు 700 ఎకరాల్లో పురుగుమందులు పిచికారి చేశా. రూ.3లక్షల వరకు ఆదాయం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. – నామాల జ్యోత్స్న, కె.అప్పాయపల్లె, కమలాపురం, వైఎస్సార్ జిల్లాపొదుపు సంఘం నుంచి ఢిల్లీ వరకుదేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని పంట పొలాల్లో డ్రోన్ల ద్వారా పురుగుమందులు పిచికారి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో వైఎస్సార్ జిల్లా ఒకటి. వైఎస్సార్ జిల్లా నుంచి కమలాపురానికి చెందిన జ్యోత్స్నను డ్రోన్ పైలట్‌గా ఎంపిక చేశారు. ఆమె కమలాపురంలోని ‘నికితా’ పొదుపు సంఘం లీడర్‌గా ఉన్నారు. గ్రూప్ లీడర్‌గా బాగా పనిచేస్తున్న జ్యోత్స్నను డీఆర్డీఏ అధికారులు గుర్తించి కరోనా కాలంలో క్రిషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ద్వారా కమలాపురంలో మినీ నర్సరీని ఏర్పాటు చేయించారు. ఆమె బంతి, నిమ్మ, గుమ్మడి, వంగ, మిర్చి, వరి నారు పెంచి రైతులకు విక్రయిస్తున్నారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా తన పొలంలో పంటలు పండించి ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహిళలను డ్రోన్ పైలట్లుగా తయారు చేసేందుకు ప్రవేశ పెట్టిన ‘లక్పతి దీదీ’ పథకానికి కూడా జ్యోత్స్నను అధికారులు ఎంపిక చేశారు. ఆమె 2023 డిసెంబర్ 11 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. లక్పతి దీదీ పథకాన్ని 2024 మార్చిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. గుంటూరులో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఆమెకు సర్టిఫికెట్‌తోపాటు డ్రోన్ అందజేశారు. మార్చి 27న అధికారికంగా ఆమె ఇంటికి డ్రోన్ వచ్చింది. ఇప్పటి వరకు ఆమె 58 రోజులపాటు డ్రోన్ ఉపయోగించి పురుగుమందులు పిచికారి చేసి రూ.3లక్షల వరకు ఆదాయం పొందారు.స్వాతంత్య్ర దిన వేడుకలకు హాజరు..ఢిల్లీలో 2024 ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకలను తిలకించేందుకు డ్రోన్ పైలట్లకు కేంద్రం ప్రత్యేక ఆహ్వానం పంపింది. వైఎస్సార్ జిల్లా నుంచి జ్యోత్స్న వెళ్లి స్వాతంత్య్ర దిన వేడుకలను తిలకించారు. ఇది తన జీవితంలో మరపురాని ఘట్టమని ఆమె తెలిపారు. కడపలో 2024, జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో డీఆర్డీఏ తరఫున ఆమె డ్రోన్ ఎగురవేసి రూ.25వేలు నగదు బహుమతి పొందారు. -
న్యూక్లియర్ రియాక్టర్‌పై పేలిన డ్రోన్..ఏమైందంటే..
కీవ్:ఉక్రెయిన్‌లో చెర్నోబిల్ అణుప్రమాదం లాంటి మరో దుర్ఘటన తృటిలో తప్పింది. చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రంలో ఉన్న రియాక్టర్ 4 రక్షణ కవచాన్ని డ్రోన్ ఢీకొట్టి పేలింది. శుక్రవారం(ఫిబ్రవరి14)న జరిగిన ఈ ఘటనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధృవీకరించారు. డ్రోన్‌లో పేలుడు పదార్థాలతో కూడిన భారీ వార్‌హెడ్ ఉన్నట్లు సమాచారం.ఇది ఉగ్రవాద చర్య అని ఈ దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు.రియాక్టర్ రక్షణ కవచాన్ని ఢీకొట్టి పేలిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించారు.మంటలను ఆర్పివేశారు.అయితే ఈ ప్రమాదంలో రియాక్టర్ నుంచి రేడియేషన్ లీకవలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) తెలిపింది.During the night of 13-14 Feb, at around 01:50, IAEA team at the Chornobyl site heard an explosion coming from the New Safe Confinement, which protects the remains of reactor 4 of the former Chornobyl NPP, causing a fire. They were informed that a UAV had struck the NSC roof. pic.twitter.com/Ee5NSRgDo8— IAEA - International Atomic Energy Agency ⚛️ (@iaeaorg) February 14, 2025 రియాక్టర్ వద్ద రేడియేషన్ స్థాయిలు స్థిరంగా ఉన్నట్లు ప్రకటించింది.కాగా,1986 ఏప్రిల్ 26న చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రంలోని అణు రియాక్టర్ పేలింది. ఈ ఘటన చరిత్రలోనే అతిపెద్ద అణు ప్రమాదంగా నిలిచిపోయింది. కాగా, మూడేళ్ల నుంచి జరుగుతున్న రష్యా,ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లోని అణు విద్యుత్ కేంద్రాల భద్రత ప్రమాదంలో పడింది. -
రూ.230 కోట్ల డ్రోన్ కాంట్రాక్టులు రద్దు
న్యూఢిల్లీ: దేశీయ డ్రోన్ల తయారీదారులకు భారత సైన్యం షాక్ ఇచ్చింది. రూ.230 కోట్ల విలువైన డ్రోన్ల కొనుగోలు కాంట్రాక్టులను రద్దు చేసింది. ఆయా డ్రోన్లలో చైనా విడిభాగాలు ఉన్నట్లు తేలడమే ఇందుకు కారణం. తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట మోహరించడానికి 400 డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత సైన్యం తొలుత నిర్ణయించింది. ఇందులో 200 మీడియం–అల్టిట్యూడ్ డ్రోన్లు, 100 హెవీవెయిట్ డ్రోన్లు, 100 లైట్‌వెయిట్ డ్రోన్లు ఉన్నాయి. సైన్యానికి డ్రోన్లు సరఫరా చేయడానికి పలు కంపెనీలు ముందుకొచ్చాయి. ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నాయి. అయితే, చైనాలో తయారైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను ఈ డ్రోన్ల తయారీలో ఉపయోగిస్తున్నట్లు వెల్లడయ్యింది. ఇలాంటి వాటితో దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఆయా కాంట్రాక్టులకు రద్దు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. అయితే, దేశ భద్రతకు సంబంధించిన పరికరాల్లో చైనా విడిభాగాలు అమర్చడం ఇదే మొదటిసారికాదు. గతంలోనూ ఇలాంటి ఉదంతాలు బహిర్గతమయ్యాయి. మన రక్షణ వ్యవస్థలో చైనా హార్డ్‌వేర్ గానీ, సాఫ్ట్వేర్ గానీ ఉపయోగించడానికి వీల్లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్(డీజీఎంఐ) గతంలో రెండుసార్లు హెచ్చరికలు జారీ చేసింది. చైనా తప్ప ఇతర దేశాల విడిభాగాలను డ్రోన్లలో ఉపయోగించేందుకు అనుమతి ఉందని అధికారులు అంటున్నారు. -
మొదటిసారి మెషిన్స్ మధ్య యుద్ధం: వీడియో వైరల్
ఏఐ రోబోట్స్ వచ్చిన తరువాత.. టెక్నాలజీలో కీలక మార్పులు సంభవించాయి. ప్రస్తుతం చాలా రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా సాగుతోంది. అదే సమయంలో డ్రోన్ల వినియోగం కూడా విరివిగానే ఉంది. వీటిని వ్యవసాయ, వాణిజ్య మొదలైన రంగాల్లో ఉపయోగిస్తున్నాయి. ఇటీవల ఈ రెండింటి (డ్రోన్, ఏఐ రోబోట్) మధ్య ఓ చిన్న యుద్ధం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. ఒక రోబోట్ డాగ్ (Robotic Dog), ఎగురుతున్న డ్రోన్ (Drone) మీద దాడి చేయడం చూడవచ్చు. రోబోట్ డాగ్ మీద అమర్చిన బాణాసంచాతో దాడి చేస్తూనే ఉంది. ఆ సమయంలో డ్రోన్ కూడా రోబోటిక్ కుక్కను చుట్టుముట్టింది. కానీ అది మాత్రం డ్రోన్ ఎటువైపు వెళ్తే.. అటువైపు బాణ పరంపర కురిపించింది.రోబోటిక్ కుక్కను, డ్రోన్‌ను ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక్కడ కనిపించే డ్రోన్ డీజేఐ టీ-సిరీస్ అగ్రికల్చర్ మోడల్, రోబోటిక్ డాగ్ హాంగ్జౌకు చెందిన రోబో డెవలపర్ యూనిట్రీ రోబోటిక్స్ ఉత్పత్తి చేసిన గో సిరీస్ అని తెలుస్తోంది. మెషీన్స్ మధ్య మొదటిసారి జరిగిన యుద్ధం అంటూ ఒక ఎక్స్ యూజర్ వీడియో షేర్ చేశారు.ఇదీ చదవండి: లవ్‌లో బ్రేకప్ అయినవాళ్లకే జాబ్.. ప్రముఖ కంపెనీ ఆఫర్నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో యుద్దాలు ఇలాగే ఉంటాయని ఒకరు అన్నారు. ఇలాంటి సంఘటనలు భయాన్ని కలిగిస్తాయని మరొకరు, చాలా దేశాల్లో ఇలాంటి టెక్నాలజీలు వాడుకలో ఉన్నాయని ఇంకొకరు అన్నారు. అయితే వీడియోలో కనిపించే ఈ సంఘటన చైనాలో జరిగినట్లు సమాచారం.The First War of Machines: Video of a battle between a drone and a robot dog goes viral in ChinaThe firefight was conducted using fireworks. It is unclear whether the devices were being controlled by someone, and the location of the footage remains undisclosed. pic.twitter.com/1vrdlVND0l— NEXTA (@nexta_tv) January 27, 2025 -
Mahakumbh: అద్భుతం.. అమోఘం.. డ్రోన్ షో
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. శుక్రవారం ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 7లో అద్భుతమైన డ్రోన్ ప్రదర్శన నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ నిర్వహించిన ఈ ప్రదర్శనలో వందలాది డ్రోన్ల సహాయంతో ఆకాశంలో వివిధ దృశ్యాలను ప్రదర్శించారు.డ్రోన్ షోలో దేవతలు అమృత కలశాన్ని సేవిస్తున్నట్లు చూపారు. అలాగే సముద్ర మథనానికి సంబంధించిన దివ్య శకటం ఎంతో అందంగా కనిపించింది.డ్రోన్ సహాయంతో ఆకాశంలో కనిపించిన మహా కుంభమేళా చిత్రంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ లోగో అందరినీ ఆకర్షించింది. సంగమ ప్రదేశంలో స్నానం చేస్తున్న సాధువు, శంఖం ఊదుతున్న సన్యాసి చిత్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయి.అసెంబ్లీ భవనంపై రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం డ్రోన్ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యూపీ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక శకటం ఈ కార్యక్రమానికి మరింత అందాన్ని చేకూర్చింది.జనవరి 24 నుండి 26 వరకు జరగనున్న అద్భుతమైన డ్రోన్ ప్రదర్శన మహాకుంభమేళా ప్రాంతాన్ని మరింత శోభాయమానం చేసింది. ఈ ప్రదర్శనలో సనాతన సంప్రదాయ వారసత్వానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించారు.ఇది కూడా చదవండి: Maha Kumbh-2025: 104 నాగసాధు అభ్యర్థనలు రద్దు.. 12 అఖాడాల నిర్ణయం -
డోన్లతో ఉత్తరాల బట్వాడా.. 10 నిముషాల్లో డెలివరీ
ధర్మశాల: ఉత్తరాల బట్వాడాలో పోస్టల్శాఖమరో ముందడుగు వేసింది. హిమాచల్ పోస్టల్ విభాగం డ్రోన్ల సాయంతో మారుమూల, మంచు ప్రాంతాలకు ఉత్తరాలను బట్వాడా చేయనుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పోస్టల్‌శాఖ అప్పర్ సిమ్లాలో డ్రోన్ ద్వారా ఉత్తరాలను డెలివరీ చేసే ట్రయల్‌ను ప్రారంభించింది.డ్రోన్ల సాయంతో సబ్ పోస్టాఫీసు నుండి బ్రాంచ్ పోస్టాఫీసులకు ఐదు నుంచి పది నిమిషాల్లో ఉత్తరాలు డెలివరీ అవుతున్నాయి. గతంలో ఇలా ఉత్తరాలు చేరడానికి ఒక రోజు పట్టేది. ఈ ట్రయల్ విజయవంతం అయిన దరిమిలా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పోస్టల్ విభాగం హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి ఇతర మారుమూల ప్రాంతాలకు కూడా ఉత్తరాలను బట్వాడా చేసే అవకాశం ఏర్పడనుంది.హిమాచల్ తపాలా శాఖ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య డ్రోన్ల ద్వారా సబ్ పోస్టాఫీస్ హట్కోటి నుంచి నందపూర్, కథాసు, ఆంటి, జాధగ్ బ్రాంచ్ పోస్టాఫీసులకు ఉత్తరాలను పంపుతోంది. ఒకేసారి ఏడు కిలోగ్రాముల వరకు భారాన్ని మోయగల ఈ డ్రోన్ ఐదు నుండి పది నిమిషాల్లో ఏడు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు ఉత్తరాలను చేరవేసి, తిరిగివస్తోంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఉత్తరాల డెలివరీకి సంబంధించిన పూర్తి డేటాను ఆన్లైన్లో ఉంచుతున్నారు. డ్రోన్ ట్రయల్స్ కోసం ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోస్టల్‌శాఖ అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: Republic Day 2025: అందమైన ఈ శకటాలను చూసితీరాల్సిందే -
డ్రోన్ తప్పుకుంది.. కోడి గెలిచింది!
సాక్షి, అమరావతి: టెక్నాలజీ పేరుతో హడావుడి చేయడంలో రాష్ట్ర పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబును మించిపోయారు. చంద్రబాబు మాట్లాడితే డ్రోన్ల ప్రస్తావన చేస్తుంటారు. ఆయన కంటే తామేమి తక్కువ తినలేదన్నట్టుగా పోలీసులు ఈసారి కోడి పందాల కట్టడికి డ్రోన్లను రంగంలోకి దించారు. ప్రతి యేటా సంక్రాంతికి ముందు కోడి పందాల కట్టడి పేరుతో పోలీసులు హడావుడి చేయడం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది సంక్రాంతి కోడి పందేలను అడ్డుకుంటామని విజయవాడ పోలీస్ కమిషనరేట్‌తోపాటు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పోలీసులు డ్రోన్లను ఎగుర వేశారు.బరుల గుర్తింపు, వాటి వద్ద నిర్వాహకుల ఏర్పాట్లను వాటితో చిత్రీకరించారు. పలు ప్రాంతాల్లో కోళ్లకు కత్తులు కట్టే వారిని, నిర్వాహకులను అదుపులోకి తీసుకుని బైండోవర్ చేశారు. కోడి పందేలు చట్ట రీత్యా నేరం అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతోపాటు మైక్ ప్రచారాన్ని నిర్వహించారు. రెండు రోజులుగా కొన్ని చోట్ల కోడి పందేల బరులను ట్రాక్టర్లతో దున్నించి ధ్వంసం చేశారు. ఇంతా చేసి చివరకు చేతులెత్తేయాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రం నుంచి ఆయా ప్రాంతాల్లో బరులు సిద్ధమైపోతుండటం గమనార్హం.సీన్ కట్ చేస్తే..కోడి పందేల నిర్వాహకులు పోలీసుల ఎత్తుకు పై ఎత్తు వేస్తూ అధికార పార్టీ నేతలను రంగంలోకి దించి వారి ఆశీస్సులతో ఏర్పాట్లు పూర్తి చేశారు. చిన్నపాటి బరుల నుంచి భారీ బరుల వరకు వందల సంఖ్యలో సిద్ధం చేశారు. భోగి రోజునే పందేలు మొదలుపెట్టి మూడు రోజులపాటు అడ్డు అదుపు లేకుండా నిర్వహించుకునేలా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా కోడి పందేలకు బ్రాండ్‌గా నిలిచిన భీమవరం, ఐభీమవరం, వెంప, ఏలూరు, అమలాపురం, కోనసీమ కొబ్బరి తోటల్లో భారీ బరులు సిద్ధం చేశారు. ఒక్కొక్క బరిని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల ఖర్చుతో తీర్చిదిద్దారు.బరుల్లో భారీ స్క్రీన్లు, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయగా, బరులకు ఆనుకుని మద్యం బెల్ట్ షాపులు, గుండాట, పేకాట నిర్వహించుకునే ఏర్పాట్లతోపాటు కూల్ డ్రింక్స్, బిర్యానీ, కోడి పకోడి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందేలను చూసేందుకు, బెట్టింగ్‌లు వేసేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పందేల రాయుళ్లు ఈ ప్రాంతాలకు తరలి వస్తున్నారు. వారి కోసం భీమవరం తదితర పట్టణాల్లో మూడు నెలల ముందు నుంచే లాడ్జీలు, హోటళ్లు బుక్ చేశారు. పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లకు తోడు చేపల చెరువుల వద్ద మకాంలను కూడా సిద్ధం చేశారు. ఇప్పటి దాకా ఇంత చేసిన పోలీసులు ఆ మూడు రోజులు మాత్రం గప్చిప్ అని నిర్వాహకులు బాహాటంగా చెబుతున్నారు. -
రష్యాలో ఎత్తయిన భవనాలపై డ్రోన్ దాడులు
-
కొఠారి ఇండస్ట్రియల్‌లో ఎఫ్జేకు వాటా
చెన్నై: నాన్‌లెదర్ ఫుట్‌వేర్, డ్రోన్ల తయారీ కంపెనీ కొఠారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్లో ఖతార్ సంస్థ ఎఫ్‌జే గ్లోబల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 10 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. కంపెనీ బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు కొఠారి ఇండస్ట్రియల్ పేర్కొంది.వెరసి కొఠారి ఇండస్ట్రియల్‌లో దోహా బ్యాంక్, ఖతార్ ఎయిర్వేస్ సంస్థల ప్రమోటర్ ఎఫ్‌జే గ్లోబల్ 70,56,000 షేర్లను సొంతం చేసుకోనుంది. రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరునూ రూ. 25 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు కొఠారి వెల్లడించింది. మరోపక్క అధీకృత మూలధనాన్ని రూ. 25 కోట్ల నుంచి రూ. 75 కోట్లకు పెంచేందుకు సైతం బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ తెలియజేసింది.అయితే ప్రమోటర్ రఫీఖ్ అహ్మద్ కంపెనీలో 47 శాతం వాటాను నిలుపుకునేందుకుగాను మరిన్ని పెట్టుబడులు చేపట్టనున్నట్లు పేర్కొంది. కాగా.. ఫుట్‌వేర్ తయారీ సంస్థ ఫీనిక్స్ కొఠారి ఫుట్‌వేర్‌లో అహ్మద్ 30 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు సైతం బోర్డు అనుమతించినట్లు కొఠారి ఇండస్ట్రియల్ వెల్లడించింది. బీఎస్ఈలో కొఠారి ఇండస్ట్రియల్ 2% బలపడి రూ. 72.5 వద్ద ముగిసింది. -
జగన్ హయాంలో ఏపీకి అత్యధిక డ్రోన్లు
సాక్షి, అమరావతి: గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డ్రోన్స్ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టారు. గత ఆర్థిక ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రానికి అత్యధికంగా డ్రోన్స్ మంజూరు చేయించారు. ఈ విషయాన్ని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నమో డ్రోన్ దీదీ పథకం కింద స్వయం సహాయక సంఘాలకు మూడేళ్ల కాలంలో 15 వేల డ్రోన్స్ సమకూర్చడం ద్వారా స్థిరమైన వ్యాపారం, జీవనోపాధికి మద్దతు అందించాలని గత ఆర్థిక ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డ్రోన్ దీదీ పథకం కింద దేశవ్యాప్తంగా 1,094 డ్రోన్స్‌ను స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేసింది. వీటిలో ఏపీకి 108 డ్రోన్స్‌ను సమకూర్చింది. దేశంలో మొత్తం డ్రోన్స్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. దేశంలో మొత్తం 500 డ్రోన్స్ సమకూర్చగా.. ఏపీకి అత్యధికంగా 96 డ్రోన్స్ ఇచ్చింది. ఏపీ తరువాత కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఎక్కువ డ్రోన్స్ మంజూరయ్యాయి. గుర్తింపు పొందిన రిమోట్ పైలట్ శిక్షణ కేంద్రాల ద్వారా స్వయం సహాయక సంఘాలకు 15 రోజుల పాటు శిక్షణ కూడా నిర్వహిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రధానంగా పురుగు మందుల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. మహిళా రైతులకు శిక్షణలో డ్రోన్ ఫ్లైయింగ్, డ్రోన్ నియమాలపై అవగాహన కూడా కల్పిస్తున్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగం శిక్షణలో డ్రోన్ తయారీ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థల నిపుణులు ఉంటారు. -
భవిష్యత్తు యుద్ధాలు వాటితోనే: మస్క్ ఆసక్తికర ట్వీట్
వాషింగ్టన్: భవిష్యత్తులో యుద్ధాలు జరిగే తీరుపై ప్రముఖ బిలియనీర్, టెస్లా కార్ల కంపెనీ అధినేత ఇలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎఫ్-35 వంటి ఆధునిక ఫైటర్ జెట్ల కంటే డ్రోన్ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో మస్క్ ఒక పోస్ట్ చేశారు.భవిష్యత్తులో యుద్ధాలన్నీ డ్రోన్లతోనే జరుగుతాయన్నారు.యుద్ధాల్లో మానవ సహిత ఫైటర్ జెట్లు పైలట్లను చంపేస్తున్నప్పటికీ కొంతమంది ఎఫ్-35 వంటి మనుషులు నడిపే యుద్ధ విమానాలను తయారుచేస్తున్నారని విమర్శించారు. అయితే ఈ యుద్ధ విమానాలు ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా లేవని మస్క్ తెలిపారు. కాగా,ఎఫ్-35 ఫైటర్ జెట్లు ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధవిమానాలు. వీటిలో అధునాతన టెక్నాలజీతో కూడిన ఫీచర్లు,రాడార్ కంటపడకుండా ఉండే స్టెల్త్ వ్యవస్థలు ఉన్నాయి.అయితే వీటి ఖర్చు,నిర్వహణ భారం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్-35 ఫైటర్ జెట్లపై మస్క్ ట్వీట్ చర్చనీయాంశమవుతోంది.The F-35 design was broken at the requirements level, because it was required to be too many things to too many people. This made it an expensive & complex jack of all trades, master of none. Success was never in the set of possible outcomes.And manned fighter jets are… https://t.co/t6EYLWNegI— Elon Musk (@elonmusk) November 25, 2024 -
మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ వైద్య సేవలు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో డ్రోన్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం ఎయిమ్స్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రోన్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిన అధికారులు, సిబ్బందిని ప్రధాని మోదీ అభినందించారు. ముందుగా మంగళగిరి మండలం నూతక్కి పీహెచ్సీలో చికిత్స పొందుతున్న మహిళ నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రోన్ ద్వారా ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు.పరీక్ష అనంతరం మహిళకు అవసరమైన చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్, సీఈవో మధుబానందకర్ మాట్లాడుతూ.. ఎయిమ్స్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతక్కి పీహెచ్‌సీకి 9 నిమిషాల్లోనే డ్రోన్ చేరుకొని.. బ్లడ్ శాంపిల్స్ సేకరించిందని చెప్పారు. తద్వారా వేగంగా చికిత్స అందించడానికి అవకాశం లభించిందన్నారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని గర్భిణులకు ఉచితంగా డ్రోన్‌తో వైద్య సేవలందిస్తామన్నారు. అత్యవసర సమయాల్లో డ్రోన్ వైద్య సేవలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎయిమ్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విజయవాడలో డ్రోన్ ప్రదర్శన (ఫోటోలు)
-
డ్రోన్స్‌పై ఎక్కువ ఆంక్షలు వద్దు
సాక్షి, అమరావతి/భవానీపురం (విజయవాడపశ్చిమ) : డ్రోన్స్ తయారీ, వినియోగంలో ఎక్కువ ఆంక్షలు పెట్టవద్దని, పరిమితమైన నియంత్రణ ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. డ్రోన్స్ టెక్నాలజీ భవిష్యత్‌లో గేమ్ ఛేంజర్ అవుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రెండు రోజులు జరిగే అమరావతి డ్రోన్స్ సమ్మిట్–2024ను చంద్రబాబు మంగళవారం మంగళగిరిలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్స్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 20,000 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తామన్నారు. అమరావతిని డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతామన్నారు. డ్రోన్స్ తయారీదారులు, ఆవిష్కర్తలకు వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించేలా 15 రోజుల్లో సమగ్ర విధానాన్ని తెస్తామని చెప్పారు. డ్రోన్ ప్రాజెక్టుల కోసం రాష్ట్రాన్ని టెస్టింగ్ క్షేత్రంగా ఉపయోగించుకోవాలని సూచించారు. తయారీదారులకు తానే అంబాసిడర్‌గా ఉంటానని, మార్కెట్‌ను ప్రోత్సహిస్తానని అన్నారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనలో డ్రోన్స్ కీలకం కానున్నాయని తెలిపారు. రోడ్లు, ట్రాఫిక్, చెత్త నిర్వహణలో డ్రోన్లు వినియోగిస్తామన్నారు. నేరాలు చేసే వారిపై డ్రోన్స్ ద్వారా నిఘా పెడతామన్నారు. సదస్సులో భాగంగా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో, ఐఐటీ తిరుపతితో రెండు ఒప్పందాలు చేసుకున్నారు. ఏపీ డ్రోన్స్ ముసాయిదా విధానాన్ని విడుదల చేశారు.ప్రపంచంలో భారత దేశాన్ని డ్రోన్ హబ్‌గా తయారు చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర పౌర వియానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.అన్నీ నేనే తెచ్చా1995లో హైదరాబాద్‌కు ఐటీ తీసుకువచ్చింది తానేనని చంద్రబాబు చెప్పారు. పైసా పెట్టుబడి లేకుండా పీపీపీ విధానంలో హైటెక్ సిటీని నిర్మించినట్లు తెలిపారు. దేశంలో మొబైల్ టెక్నాలజీని, తొలిసారిగా ఎమిరేట్స్ విదేశీ విమానాన్ని నేరుగా హైదరాబాద్‌కు రప్పించింది తానేనని చెప్పారు.సార్... బూట్లు..అమరావతి డ్రోన్స్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో జ్యోతి వెలిగించే సమయంలో సీఎం చంద్రబాబు బూట్లు ధరించే ఉన్నారు. ఆయన కొవ్వొత్తితో జ్యోతి వెలిగించబోగా.. పక్కనే ఉన్న పెట్టుబడులు, మౌలిక సదుపాయల కార్యదర్శి సురేష్ కుమార్ దగ్గరకు వెళ్లి బూట్లు చూపెట్టారు. దీంతో చంద్రబాబు వెనక్కి వచ్చి బూట్లు విప్పి జ్యోతి ప్రజ్వలన చేశారు. -
మళ్లీ డ్రోన్లు కనిపిస్తే యుద్ధమే
ప్యాంగాంగ్: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. దక్షిణ కొరియా మిలిటరీ డ్రోన్ అవశేషాలు శనివారం తమ భూభాగంలో కనిపించాయని, మరోసారి కనిపిస్తే యుద్ధ ప్రకటన తప్పదని ఉత్తరకొరియా హెచ్చరించింది. దక్షిణ కొరియా ఈ నెలలో మూడు సార్లు ప్యాంగ్యాంగ్పై డ్రోన్లను ఎగురవేసిందని ఆరోపించిన ఉత్తర కొరియా, మరోసారి అదే జరిగితే బలప్రయోగంతో ప్రతిస్పందిస్తామంది. -
బొంగుతో డ్రోన్.. ఇదో కొత్తరకం
బొంగులో చికెన్ గురించి తెలుసు గాని, ఈ బొంగుతో డ్రోన్ ఏంటనుకుంటున్నారా? ఈ ఫొటోలో కనిపిస్తున్నది బొంగుతో తయారైన డ్రోన్. సాధారణంగా యంత్రాల తయారీకి లోహాలను వాడతారు. బెంగళూరుకు చెందిన మెకానికల్ ఇంజినీర్, ప్రోడక్ట్ డిజైనర్ దీపక్ దధీచ్ అందరికంటే కొంచెం భిన్నంగా ఆలోచించే రకం.సుస్థిరమైన పదార్థాలతో రోబోటిక్ యంత్రాలను తయారు చేయవచ్చనే ఆలోచనతో అతడు అచ్చంగా వెదురు బొంగులతో ఈ డ్రోన్‌ను రూపొందించాడు. స్క్రూలు, నట్లు వంటివి తప్ప ఈ డ్రోన్లోని మిగిలిన భాగాలన్నింటినీ చీల్చిన వెదురు బొంగులతో తయారు చేశాడు.ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ వస్తువుల తయారీకి ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ కలపను ప్రధాన పదార్థంగా వినియోగించలేదు. వెదురుబొంగులతో పూర్తిగా పనిచేసే డ్రోన్‌ను తయారు చేసిన ఘనత దీపక్ దధీచ్‌కే దక్కుతుంది. దీని తయారీకి అతడికి వెయ్యి రూపాయల లోపే ఖర్చు కావడం విశేషం. -
ఇది సర్కారు షో.. కూల్చెయ్..
భవానీపురం (విజయవాడ పశ్చిమ): ప్రభుత్వం నిర్వహించనున్న ‘షో’కి అడ్డం వస్తుందని ప్రజాధనంతో నిర్మించిన ప్రహరీని అధికారులు కూల్చేశారు. విజయవాడలో కృష్ణానది తీరాన పున్నమిఘాట్లో ఈ నెల 22వ తేదీ సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ షో, కల్చరల్ ఈవెనింగ్ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాలకు అడ్డువస్తుందని అప్కాస్ట్ రీజనల్ సైన్స్ సెంటర్ ప్రహరీని కూల్చేశారు. భవానీపురం కరకట్ట సౌత్ రోడ్‌లోని పున్నమిఘాట్‌కు ఆనుకుని ఆక్రమణకు గురైన ఎకరానికిపైగా స్థలాన్ని అప్కాస్ట్ గత మెంబర్ సెక్రటరీ డాక్టర్ వై.అపర్ణ సర్వే చేయించి స్వా«దీనం చేసుకున్నారు.సుమారు రూ.40 లక్షలకుపైగా ఖర్చుపెట్టి ఈ స్థలానికి ప్రహరీ నిర్మించారు. అప్కాస్ట్ సరిహద్దుకు వెనుక (పున్నమిఘాట్ లోపల) ఉన్న ప్రైవేట్ వ్యక్తులు తమ స్థలానికి దారిలేకుండా ప్రహరీ నిర్మించారంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పున్నమిఘాట్లో డ్రోన్ షో నిర్వహించాలని నిర్ణయించింది.దీనికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ఈ కార్యక్రమానికి అడ్డువస్తుందని అప్కాస్ట్ రీజనల్ సైన్స్ సెంటర్ ప్రహరీని గురువారం రాత్రి జేసీబీతో కూల్చేశారు. కూల్చేసిన శిథిలాలను తిరిగి సైన్స్ సెంటర్ ఆవరణలోనే పడేశారు. గోడ కూలుస్తున్నామని అప్కాస్ట్ అధికారులకు సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. దీనిపై అప్కాస్ట్ ఏవో పద్మను అడగగా.. తాను మాట్లాడతానని అటవీ, పర్యావరణశాఖ స్పెషల్ సీఎస్ అనంతరాము చెప్పినట్లు తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే పున్నమిఘాట్ పరాదీనం గత కృష్ణా పుష్కరాల సమయంలో (2016) అప్పటి టీడీపీ ప్రభుత్వం రివర్ ఫ్రంట్ కింద కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరించి నిర్మించిన పున్నమిఘాట్లో సింహభాగం పరా«దీనం అయింది. పున్నమిఘాట్ నిర్మాణం పూర్తయిన తరువాత ఆ స్థలం తమదంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు మేరకు పున్నమిఘాట్లో ప్రధానంగా నిలిచిన స్థలాన్ని వారికి స్వాదీనం చేశారు. తరువాత స్థల యజమానులు ప్రహరీ నిర్మించుకున్నారు. గతంలో ఇక్కడ నిర్వహించిన ఎయిర్ షోకి ఈ స్థలమే కేంద్రబిందువుగా నిలిచింది. ఆ స్థలానికి (పున్నమిఘాట్) సంబంధించి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తులకు మధ్య ధర విషయంలో సయోధ్య కుదిరి ఉంటే ఈ రోజు డ్రోన్ షో నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యేవి కాదని స్థానికులు పేర్కొంటున్నారు. -
చర్లపల్లి కేంద్ర కారాగారంపై డ్రోన్ చక్కర్లు
సాక్షి, సిటీబ్యూరో: కరుడుగుట్టిన నేరగాళ్లు, మావోయిస్టులు, ఉగ్రవాదులను ఖైదు చేసే చర్లపల్లి కేంద్ర కారాగారంపై అనధికారికంగా ఎగిరిన డ్రోన్ మిస్టరీ వీడలేదు. ఈ ఉదంతం జరిగి ఐదు నెలలు కావస్తున్నా కేసు కొలిక్కి రాలేదు. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు సైతం రంగంలోకి దిగినా ఫలితం దక్కట్లేదు. రెక్కీ, రీల్స్, గంజాయి డ్రాప్ కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు అత్యంత గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. అర్ధరాత్రి రెండుసార్లు.. చర్లపల్లి కేంద్ర కారాగారంలోని హైసెక్యూరిటీ బ్యారెక్, ప్రిజనర్స్ బ్యారెక్స్ కేంద్రంగా ఈ ఏడాది మే 21న ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. తెల్లవారుజామున 12.20 గంటలకు ఓసారి, ఒంటి గంట ప్రాంతంలో మరోసారి జైలు పైన ఈ డ్రోన్ ఎగిరింది. ఈ విషయాన్ని వాచ్ టవర్‌లో విధులు నిర్వర్తిస్తున్న జైలు వార్డర్లతో పాటు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు (టీఎస్ఎస్పీ) సిబ్బంది గుర్తించారు. ఈ బ్యారెక్స్‌తో పాటు స్టాఫ్ క్వార్టర్స్, జైలు ప్రాంగణంలోనూ ఈ డ్రోన్ తిరిగినట్లు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఫిర్యాదుతో చర్లపల్లి పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వివిధ కోణాల్లో సాగుతున్న దర్యాప్తు... ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తుండగా... కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే పలు బృందాలు జైల్లో డ్రోన్ ఎగిరిన ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. ఈ వ్యవహారంలో ప్రధానంగా మూడు కోణాలను అధికారులు అనుమానిస్తున్నారు. ఈ జైల్లో ఉన్న ఖైదీనికి తప్పించడానికి ఏదైనా కుట్ర జరుగుతోందా? అనే కోణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ స్కెచ్‌లో భాగంగానే జైలు ప్రాంగణం రెక్కీ కోసం డ్రోన్ వినియోగించి ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో పాటు సోషల్‌మీడియా క్రేజ్ ఉన్న ఆకతాయిలు ఎవరైనా తమ ఖాతాల్లో పోస్టు చేయడానికి చర్లపల్లి జైలు నైట్వ్యూని డ్రోన్ ద్వారా షూట్ చేశారా? అనేదీ దర్యాప్తు చేస్తున్నారు.బంతి పోయి డ్రోన్ వచి్చందా..? ఈ రెండు కోణాలతో పాటు గంజాయి సరఫరా అంశాన్నీ పోలీసులు, నిఘా వర్గాలు పరిగణలోకి తీసుకున్నాయి. వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలకు బయట నుంచి గంజాయి సరఫరా జరుగుతోందనే ఆరోపణలు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి. గతంలో కొందరు ఖైదీల వద్ద ఈ సరుకు పట్టుబడినట్లూ తెలుస్తోంది. ఒకప్పుడు గంజాయి ప్యాకెట్లను చిన్న బంతుల్లో పెట్టి, నిర్దేశిత ప్రాంతంలో ప్రహరీ గోడ పై నుంచి జైల్లోకి విసిరేవాళ్లు. నిఘా పెంచడం, వాట్ టవర్ల ఏర్పాటు సహా అనేక చర్యలు తీసుకున్న జైల్ అధికారులు దీనిని కట్టడి చేశారు. దీంతో ఖైదీలకు గంజాయి లేదా మరో పదార్థం, వస్తువు అందించడానికి వారి సంబం«దీకులు ఎవరైనా ఇలా డ్రోన్ వాడి ఉంటారనీ అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలోనూ ముందుకు వెళ్తున్నారు. కష్ట సాధ్యమవుతున్నమూలాల వేట...ఈ కేసును కొలిక్కి తీసుకురావడానికి పోలీసులు, నిఘా వర్గాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఖైదీల ప్రొఫైల్, సోషల్‌మీడియాలోని వీడియోలు అధ్యయనం చేయడంతో పాటు సాంకేతికంగా ముందుకు వెళ్తున్నారు. అయితే డ్రోన్‌కు సిమ్‌కార్డు వంటివి ఉండకపోవడం, పూర్తిగా రిమోట్ కంట్రోల్‌తో పని చేసేది కావడంతో ఎలాంటి ఆధారం లభించట్లేదు. ఫలితంగా ఈ డ్రోన్‌కు మూలం ఎవరనేది తేలట్లేదు. జైలుతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో మే 1 నుంచి నమోదైన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. జైలు పరిసరాల్లో నివసించే వారి వివరాలు సేకరించి, విశ్లేషించినా ఎలాంటి క్లూ లభించలేదు. గడిచిన ఏడాది కాలంలో ఆన్లైన్, ఆఫ్లైన్లలో జరిగిన డ్రోన్ల క్రయవిక్రయాల పైనా దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు అమెరికాతో భారత్ కీలక ఒప్పందం
దేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేసే దిశగా అమెరికా, భారత్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మన సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. వీటి విలువ రూ. 32,000 కోట్లు కాగా ఈ డీల్ కింద భారతదేశంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎమ్ఆర్ఓ) సదుపాయాన్ని నెలకొల్పడంతో పాటు యూఎస్ నుంచి మొత్తం 31 MQ-9B హై ఆల్టిట్యూడ్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు గత వారం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) అనుమతి ఇచ్చింది. మొత్తం 31 డ్రోన్లలో 15 భారత నావికాదళానికి వెళ్తాయి. మిగిలినవి వైమానిక దళం, ఆర్మీల మధ్య సమంగా విభజించనున్నారు.కాగా డెలావేర్లో జరిగిన క్వాడ్ లీడర్స్ సదస్సు సందర్భంగా డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య చర్చలు జరిగిన నెలలోపే ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతేగాక ఈ డీల్ మొత్తం విలువ రూ.34,500 కోట్లకు పెరగే అవకాశం ఉంది. చెన్నై సమీపంలోని ఐఎన్ఎస్ రాజాలి, గుజరాత్‌లోని పోర్బందర్, ఉత్తరప్రదేశ్‌లోని సర్సావా మరియు గోరఖ్‌పూర్‌తో సహా నాలుగు సాధ్యమైన ప్రదేశాలలో భారతదేశం డ్రోన్లను ఉపయోగించనుంది.అయితే చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉంచేందుకు ఈ డ్రోన్లు అవసరమని భారత్ భావిస్తోంది. ఈ డ్రోన్లు గరిష్టంగా గంటకు 442 కిమీ వేగంతో, దాదాపు 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతాయి. సుమారు 40 గంటలకుపైగా గాల్లో ఉండగలవు. నాలుగు హెల్ఫైర్ క్షిపణులను, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలవు. ఇప్పటికే భారత్ వీటిల్లో మరోరకమైన సీగార్డియన్ డ్రోన్లను వినియోగిస్తోంది. వీటిని కూడా జనరల్ అటామిక్స్ నుంచి లీజ్‌పై భారత్ తీసుకొంది. ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్టు ముగియగా.. మన నౌకాదళం మరో నాలుగేళ్లపాటు దీనిని పొడిగించింది. -
ఇండియా-చైనా సరిహద్దుల్లో డ్రోన్ కదలికలు: హిమాచల్ మంత్రి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న ఇండియా-చైనా సరిహద్దుల్లో డ్రోన్ కదలికలను గుర్తించినట్లు హిమాచల్ ప్రదేశ్ మంత్రి జగత్ సింగ్ నేగి తెలిపారు. సరిహద్దుల్లో పొరుగు దేశం చైనా.. డ్రోన్లను నిఘా, గూఢచర్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బోర్డర్లో డ్రోన్ల కదలికల విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కిన్నౌర్ జిల్లాలోని షిప్కి లా , రిషి డోగ్రీ గ్రామాల్లో డ్రోన్ కార్యకలాపాలను గుర్తించాం. సరిహద్దు ప్రాంతానికి సమీపంలో తరచుగా డ్రోన్లు ఎగురుతున్నట్లు గత వారంలో కూడా గుర్తించాం. షిప్కిలా, రిషిడోగ్రి గ్రామాల్లో వాస్తవ నియంత్రణ రేఖ వరకు రహదారి నిర్మాణం పురోగతిలో ఉంది. ..పొరుగుదేశం చైనా ఈ డ్రోన్ల ద్వారా నిఘా, గూఢచర్యానికి పాల్పడే అవకాశాన్ని తోసిపుచ్చలేం. డ్రోన్లను పోలీసులు, ఆర్మీ సిబ్బంది సైతం చూశారు. చైనా డ్రోన్లు భారత గగనతలంలోకి చొరబడటం చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి’ అని అన్నారు.ఇక.. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్, లాహౌల్, స్పితి గిరిజన జిల్లాలు చైనాతో 240 కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాయి. -
22న డ్రోన్ సమ్మిట్
సాక్షి, అమరావతి: పౌర సేవల్లో డ్రోన్లను వినియోగించేలా డ్రోన్ టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్–2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. రాష్ట్రాన్ని డ్రోన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఈ డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. ఆదివారం ఎన్టీఆర్ అడ్మిని్రస్టేటివ్ బ్లాక్‌లోని ఫైబర్ నెట్ కార్యాలయంలో డ్రోన్ సమ్మిట్ లోగోను, వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 22న మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సును సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. డ్రోన్ సమ్మిట్‌కు దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు, 400 మంది డ్రోన్స్ రంగంలో అనుభవం ఉన్న సంస్థ ప్రతినిధులు హాజరవుతారన్నారు. రాష్ట్రంలో డ్రోన్స్ రంగంలో ఉత్సాహం చూపే అన్ని వర్సిటీలు, విద్యాసంస్థల సహకారం కూడా తీసుకుంటున్నామని తెలిపారు. సదస్సులో భాగంగా 22న కృష్ణా తీరంలో దేశంలోనే తొలిసారిగా సుమారు 5 వేల డ్రోన్లతో భారీ డ్రోన్ షో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. నమోదు చేసుకోండి డ్రోన్ సమ్మిట్ సందర్భంగా ఔత్సాహికుల కోసం 8 అంశాలపై అమరావతి డ్రోన్ హ్యాకథాన్ నిర్వహిస్తున్నామని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు. ఇందులో పాల్గొనదలచిన వారు ఈ నెల 15లోపు https://amaravatidronesummit.com లో నమోదు చేసుకోవచ్చన్నారు. -
డ్రోన్ల వినియోగంతో పెరిగిన సాగు ఉత్పత్తి
న్యూఢిల్లీ: డ్రోన్ టెక్నాలజీ కంపెనీ ఐవోటెక్ వరల్డ్ ఏవిగేషన్, రైతుల కోపరేటివ్ సొసైటీ ఇఫ్కో మధ్య భాగస్వామ్యం.. సాగు ఉత్పాదకత పెంపునకు తోడ్పినట్టు ఈ సంస్థలు ప్రకటించాయి. 2023 డిసెంబర్లో ఈ సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా 500 డ్రోన్లను రైతులకు సమకూర్చాయి. సాగులో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డ్రోన్ల సాయాన్ని అందించాయి. ఇది 11 రాష్ట్రాల పరిధిలో 500 రైతులపై సానుకూల ప్రభావం చూపించినట్టు ఈ సంస్థలు వెల్లడించాయి.అగ్రిబోట్ డ్రోన్ కస్టమర్లకు ఈ సంస్థలు ఇటీవలే ప్రత్యేక పరిమిత కాల ఆఫర్‌ను కూడా ప్రకటించాయి. దీని కింద రైతులకు ఎలాంటి గరిష్ట విస్తీర్ణం పరిమితి లేకుండా ఇఫ్కో డ్రోన్లను అందిస్తుంది. పంటల నిర్వహణ, సామర్థ్యాలను పెంచడం దీని ఉద్దేశ్యమని ఇవి తెలిపాయి. ఒక డ్రోన్ ఆరు ఎకరాలకు ఒక గంటలో స్ప్రే చేసే సామర్థ్యంతో ఉంటుందని, ఒకటికి మించిన బ్యాటరీ సెట్‌తో ఒక రోజులో ఒక డ్రోన్‌తో 25 ఎకరాలకు స్ప్రే చేయొచ్చని తెలిపాయి. -
డ్రోన్ల కలకలం.. ఆగిన మెట్రో రైళ్లు
న్యూఢిల్లీ: డ్రోన్ల కలకలం కారణంగా ఢిల్లీ మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తమ్ నగర్ ఈస్ట్- ఉత్తమ్ నగర్ వెస్ట్ మెట్రో స్టేషన్ల మధ్య ట్రాక్‌లపై అధికారులు డ్రోన్‌ను గుర్తించారు. ఈ నేపధ్యంలో దాదాపు 30 నిమిషాల పాటు మెట్రో సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.ఢిల్లీ మెట్రోలోని బ్లూ లైన్లో బుధవారం ఉత్తమ్ నగర్ ఈస్ట్- ఉత్తమ్ నగర్ వెస్ట్ మెట్రో స్టేషన్ల మధ్య ట్రాక్‌పై డ్రోన్ పడి ఉండటాన్ని చూశామని, ఫలితంగా 30 నిమిషాల పాటు మెట్రో సేవలు దెబ్బతిన్నాయని ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు. ట్రాక్‌లపై నుంచి ఆ డ్రోన్‌ను తొలగించేంత వరకూ మెట్రో సేవలు నిలిచిపోయాయి. అధికారులు పరిస్థితిని చక్కదిద్దాక మెట్రో సేవల పునరుద్ధరణ జరిగింది.ఇదేవిధంగా బుధవారం రాత్రి 8 గంటలకు జనక్‌పురి మెట్రో లైన్‌కు ఎగువన అనుమానాస్పద డ్రోన్ కనిపించడంతో ఆ మార్గంలో మెట్రోను నిలిపివేశారు. దీంతో కాసేపు మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనల గురించి ఢిల్లీ మెట్రో అధికారులు మాట్లాడుతూ డ్రోన్లు కనిపించిన బ్లూ లైన్లో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు. సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాత బ్లూ లైన్లో మెట్రో సేవలను పునరుద్ధరించామన్నారు. ఇది కూడా చదవండి: శోభాయమానంగా ఇంద్రకీలాద్రి -
మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు.. కుదిరిన డ్రోన్ డీల్
న్యూయార్క్: మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ డెలావెర్‌లో విల్లింగ్టన్లోని అధ్యక్షుడు జో బైడెన్ నివాసానికి చేరుకొని భేటీ అయ్యారు. ఇరునేతలు తొలి రోజు సమావేశంలో భారతదేశం, అమెరికా మధ్య బిలియన్ డాలర్ల డ్రోన్ ఒప్పందంపై సంతకం చేశాయి. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. ఇక.. డ్రోన్ డీల్‌పై కూడా ఇరువురు నేతలు పూర్తిస్తాయిలో చర్చించుకున్నారు.President Biden welcomes progress on India's procurement of MQ-9B aircraft; lauds effort to advance cooperation in space, cyberRead @ANI Story | https://t.co/ZD0J1mpVfi#PMModi #JoeBiden #Delaware #US pic.twitter.com/ZGJPsHBQ83— ANI Digital (@ani_digital) September 21, 2024 భారతదేశం అమెరికా నుంచి 31 ఎంక్యూ-9బీ స్కై గార్డియన్ సీ గార్డియన్ డ్రోన్లను కొనుగోలు చేసే ప్రక్రియలో ఉంది. ఈ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు అయ్యే ఖర్చు దాదాపు 3 బిలియన్ డాలర్లు ఉండనుంది. ముఖ్యంగా చైనా సరిహద్దు వెంబడి సాయుధ బలగాల నిఘా యంత్రాంగాన్ని పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.#PMModiInUS | India and the US today firmed up multi-billion dollar drone deal as PM Modi met Joe Biden on the first day of his three-day visit to the US. @VishnuNDTV's big takeaways from PM Modi, President Biden bilateral meeting pic.twitter.com/Nl0YqEBtgN— NDTV (@ndtv) September 22, 2024క్రెడిట్స్: NDTV (@ndtv)ఇక.. ఈ ఒప్పందానికి సంబంధించి దాదాపు ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. గత ఏడాది(2023) జూన్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ అమెరికా నుంచి ప్రభుత్వం నుంచి MQ-9B స్కై గార్డియన్ , సీ గార్డియన్ సాయుధ డ్రోన్ల సేకరణ ఫ్రెమ్ వర్క్‌కు ఆమోదం తెలిపింది. డ్రోన్ల కొనుగోలుతో పాటు, భారత నావికాదళం ఈ ఏడాదిలో మరో రెండు ప్రధాన రక్షణ ఒప్పందాలను కూడా కుదుర్చుకోవాలని యోచిస్తోంది. మరో 3 స్కార్పెన్ జలాంతర్గాములు, 26 రాఫెల్-ఎమ్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది.చదవండి: ఉక్రెయిన్‌పై ఏం చేద్దాం? -
వచ్చేస్తోంది.. పేద్ద డ్రోన్
శంషాబాద్: అత్యవసరాల్లో ట్రాఫిక్ కష్టాలుండవు.. అనుకున్న సమయానికి మీ కార్గో చేరిపోతుంది. ఎమర్జెన్సీలో తీసుకెళ్లాల్సిన వైద్య సంబంధిత వస్తు వులు, ఆర్గాన్స్ కూడా గ్రీన్ చానల్ ఏర్పాట్లు లేకుండా గమ్యానికి చేరిపోతాయి. దీనికి మరెంతో దూ రం లేదు. 2026లో మార్కెట్లోకి రాబోతున్న అతి పేద్ద డ్రోన్‌తో ఇవన్నీ సాకారమవుతాయి. హైదరాబాద్ యువ ఇంజనీర్లు దీన్ని సిద్ధం చేశారు. ఇప్పటికే ట్రయల్‌రన్‌లో సక్సెస్ కావడంతో డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులతో త్వరలో నే అందుబాటులోకి రానుంది. దీనిని ఆదిభట్లలోని బ్లూజే ఏరోస్పేస్ వ్యవస్థాపకులు ఉత్తమ్‌కుమార్, అమర్దీప్ నేతృత్వంలోని ఏరోనాటికల్ ఇంజనీర్ల బృందం తయారు చేసింది. నోవాటెల్ హోటల్లో ‘కోల్డ్‌చైన్ అన్బ్రోకెన్–2024’సదస్సులో దీనిని ఏర్పాటు చేశారు. ‘పర్యావరణహితంగా తయారు చేసిన ఈ పైలట్‌రహిత డ్రోన్ 100 కిలోల కార్గోను 300 కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానానికి గంటన్నర సమయంలో తీసుకెళ్తుంది. ఇంత సామర్థ్య మున్న డ్రోన్ తయారీ దేశంలో ఇదే మొదటిది. 2029 నాటికి పదిమంది ప్రయాణికులతోపాటు వేయి కేజీల బరువు, వేయి కి.మీ. దూరం ప్రయాణించే డ్రోన్‌ను తయారుచేసేందుకు కృషిచేస్తున్నాం’అని ఉత్తమ్‌కుమార్ ‘సాక్షి’తో తెలిపారు. ప్రత్యేకతలు..డ్రోన్ బరువు 400 కేజీలు మోసుకెళ్లే సామర్థ్యం 300 కి.మీ.వేగం గంటకు 200 కి.మీ.ప్రయాణించే ఎత్తు భూమికి 1000 అడుగుల ఎత్తులోఇంధనం హైడ్రోజన్, విద్యుత్ (కాలుష్యరహితంగా) -
వంట గది నుంచి పంట పొలాల్లోకి...
‘అయిదు వేళ్లు కలిస్తేనే ఐకమత్యం’ అనేది ఎంత పాత మాట అయినా ఎప్పటికప్పుడు కొత్తగా గుర్తు తెచ్చుకోదగ్గ మాట. కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లాలో ఎంతోమంది మహిళలు ‘ప్రకృతి’ పేరుతో స్వయం సహాయక బృందాలుగా ఏర్పడుతున్నారు. ‘ప్రకృతి’ చేసిన మహత్యం ఏమిటంటే... వంటగదికి మాత్రమే పరిమితమైన వారిని పంట నొలాల్లోకి తీసుకువచ్చింది. డ్రోన్ పైలట్‌గా మార్చి కొత్త గుర్తింపు ఇచ్చింది. జెండర్ ఈక్వాలిటీ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వరకు రకరకాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేసింది. పిల్లలు పెద్ద చదువులు చదివేలా చేసేలా చేసింది.సినిమాల్లో చూడడం తప్ప ఎప్పుడూ చూడని విమానంలో ప్రయాణం చేయించింది....‘మీ గురించి చెప్పండి’ అని సుధా దేవదాస్‌ను అడిగారు ప్రధాని నరేంద్ర మోది. తన వ్యక్తిగత వివరాలతో పాటు తమ స్వయం సహాయక బృందం ‘ప్రకృతి’ గురించి ప్రధానికి వివరంగా చెప్పింది సుధ.మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన ‘లఖ్పతి దీదీస్’ కార్యక్రమంలో పాల్గొనడానికి కేరళ నుంచి వచ్చింది సుధ. ‘లఖ్‌పత్ దీదీస్’ డ్రోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు కేరళ నుంచి ఎంపికైన ఇద్దరు మహిళల్లో సుధ ఒకరు. సుధ త్రిసూర్‌లోని కుఝూర్ గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్. కేరళ నుంచి ‘డ్రోన్ పైలట్’ అయిన తొలి మహిళా పంచాయతీ మెంబర్‌గా సుధ ప్రత్యేక గుర్తింపు సాధించింది.‘ఈ శిక్షణా కార్యక్రమాల పుణ్యమా అని డ్రోన్లను ఎగరవేయడం మాత్రమే కాదు ఆండ్రాయిడ్ ఫోన్లు అంటే ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించాలి, పంట పొలాల్లో ఉపయోగించే ఎరువులు, మందులు... ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాం’ అంటుంది సుధ.‘ఇప్పుడు నన్ను అందరూ డ్రోన్ పైలట్ అని పిలుస్తున్నారు’ ఒకింత గర్వంగా అంటుంది సుధ. సుధలాంటి ఎంతో మంది మహిళల జీవితాలను మార్చిన స్వయం సహాయక బృందం ‘ప్రకృతి’ విషయానికి వస్తే... ‘ప్రకృతి’లో 30 సంవత్సరాల వయసు మహిళల నుంచి 63 సంవత్సరాల వయసు మహిళల వరకు ఉన్నారు. ‘ప్రకృతి’లోని పన్నెండు మంది సభ్యులు ‘గ్రామిక’‘భూమిక’ పేరుతో విధులు నిర్వహిస్తారు. ఒక్కో గ్రూప్‌లో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు గృహ నిర్మాణం, పిల్లల చదువు, పెళ్లిలాంటి ఎన్నో విషయాలలో ప్రజలకు సహాయపడతారు.‘ప్రకృతి వల్ల మా జీవన విధానం పూర్తిగా మారి΄ పోయింది’ అంటుంది 51 సంవత్సరాల సుధ. ఆమె పెద్ద కుమారుడు ఎం.టెక్., చిన్న కుమారుడు బీటెక్. చేశారు. ‘పై చదువుల కోసం పెద్ద అబ్బాయి కెనడా, చిన్న అబ్బాయి ΄ పోలాండ్ వెళుతున్నాడు’ సంతోషం నిండిన స్వరంతో అంటుంది సుధ. కొన్ని నెలల క్రితం ‘ప్రకృతి’ బృందం కేరళ నుంచి ఇండిగో విమానంలో బెంగళూరుకి వెళ్లింది. ఆ బృందంలోని ప్రతి ఒక్కరికి ఇది తొలి విమాన ప్రయాణం. అది వారికి ఆకాశమంత ఆనందాన్ని ఇచ్చింది.సాధారణ గృహిణి నుంచి గ్రామ వార్డ్ మెంబర్‌గా, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ‘కుటుంబశ్రీ’లో రకరకాల విధులు నిర్వహిస్తున్న కార్యకర్తగా, జెండర్ ఈక్వాలిటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లకు సంబంధించి మహిళలకు శిక్షణ ఇచ్చే రిసోర్స్ పర్సన్‌గా, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్(ఎఫ్‌పీవో) డైరెక్టర్‌గా, డ్రోన్ పైలట్‌గా రకరకాల విధులు నిర్వహిస్తున్న సుధ ఎంతోమంది గృహిణులకు రోల్‌మోడల్‌గా మారింది.‘మహిళలు ఆర్థికంగా సొంత కాళ్లమీద నిలబడినప్పుడు ఎంతో ఆత్మస్థైర్యం వస్తుంది. అది ఎన్నో విజయాలను అందిస్తుంది. ఎవరు ఏమనుకుంటారో అనే భయాలు మనసులో పెట్టుకోకుండా మనకు సంతోషం కలిగించే పని చేయాలి’ అంటుంది సుధా దేవదాస్. -
ఈమె.. డ్రోనాచార్యులే
‘నేను బాగుండాలి’ అని ఎంతోమంది అనుకుంటారు. కొందరు మాత్రం ‘అందరూ బాగుండాలి... అందులో నేనుండాలి’ అనుకుంటారు. ప్రీత్ సంధూ రెండో కోవకు చెందిన మహిళ.అగ్రీ–డ్రోన్ స్టార్టప్ ‘ఏవీపీఎల్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన కలను నెరవేర్చుకోవడమే కాదు వందలాదిమందికి ఉద్యోగావకాశాలను కల్పించింది. ఎంతో మందికి మైక్రో–ఎంటర్ప్రెన్యూర్లుగా కొత్త జీవితాన్ని ఇచ్చింది. హరియాణాలోని హిస్సార్‌కు చెందిన జ్యోతి మాలిక్ ఆదర్శవాద భావాలతో పెరిగింది. స్వతంత్రంగా ఉన్నతస్థాయికి ఎదగాలనేది ఆమె కల. ముంబైలో చదువుకోవడంతో ఆమె కలలకు రెక్కలు వచ్చాయి. ఉద్యోగంలో చేరింది. అయితే తన సంతోషం ఎంతోకాలం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండేళ్ల తరువాత ఉద్యోగం కోసం వస్తే నిరాశే ఎదురైంది. ‘ఈ జీవితం ఇంతేనా!’ అనే నిరాశామయ కాలంలో ‘ఏవీపీఎల్’ జ్యోతి మాలిక్‌కు మైక్రో–ఎంటర్‌ప్రెన్యూర్‌గా కొత్త జీవితాన్ని ఇచ్చింది.‘ఇప్పుడు నేను ఇండిపెండెంట్. ఎవరైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తమ కలను నిజం చేసుకోవచ్చు’ అంటుంది ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో జ్యోతిమాలిక్.అమృత్‌సర్‌లోని ఖాల్సా కాలేజిలో చదువుకున్న ప్రీత్ సంధూకు కల్పనా చావ్ల రోల్ మోడల్. రాకెట్లు అంటే ఆసక్తి. కాలేజీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అగ్రి–డ్రోన్ స్టార్టప్ ‘ఏవీపీఎల్’ను మొదలుపెట్టింది.వ్యాపార, వ్యవసాయ రంగాలకు అవసరమైన డ్రోన్ ఆపరేషన్లలో నైపుణ్యం కోసం గ్రామీణ ప్రాంతాలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది ఏవీపీఎల్. ది రిమోట్ పైలట్ సర్టిఫికెట్(ఆర్పీసీ), అగ్రికల్చర్ స్ప్రే కోర్సులు గ్రామీణ ప్రాంతాలలో ఎంతోమందికి ఉపకరించాయి. ఈ కోర్సులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడానికే పరిమితం కాలేదు. విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా చేశాయి. మైక్రో–ఎంటర్‌ప్రెన్యూర్‌గా అడుగు వేయడానికి ఉపకరించాయి. ‘ఫీట్ ఆన్ ది స్ట్రీట్’ నినాదంతో ‘ఏవీపీఎల్’ 12 రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాలు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాయి. ప్రీత్ సంధూ నాయకత్వంలో ‘ఏవీపీఎల్’ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్మెంట్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. ‘ఏవీపీఎల్’ శిక్షణా కార్యక్రమాల వల్ల ఒక్క హరియాణాలోనే 800 మంది డ్రోన్ ఎంటర్ప్రెన్యూర్లుగా మారారు.‘ఆశావాదమే కాదు అవసరమైన సమయంలో ఆత్మవిశ్లేషణ కూడా అవసరం’ అంటుంది ప్రీత్.ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో తమ స్కిల్లింగ్ వెంచర్‌లోని లోపాలను విశ్లేషించింది.‘మా కంపెనీ తరఫున ఎంతోమందికి శిక్షణ ఇచ్చాం. ఇక అంతకుమించి ఆలోచించలేదు. అయితే చాలామందికి గ్రామీణ నేపథ్యం ఉండడం వల్ల పట్టణాల్లో ఉండలేక తిరిగి సొంత ఊళ్లకు వెళ్లి΄ోయేవారు. ఈ నేపథ్యంలో అసలు వారు పట్టణం ఎందుకు రావాలి? గ్రామాల్లోనే ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది ప్రీత్.‘మన దేశంలో పట్టణాల్లోనే కాదు ఎక్కడైనా సరే ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చు’ అనే ఆమె నమ్మకం నిజమైంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన నవీన సాంకేతిక పరిజ్ఞానంతో రూ΄÷ందించిన శిక్షణ కార్యక్రమాలు, రిమోట్ పైలట్ సర్టిఫికెట్, అగ్రికల్చర్ స్ప్రే కోర్సుల ద్వారా యువతరం ఊరు దాటి పట్టణం వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది.‘1.5 లక్షల విలేజ్ ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేయాలనేది మా లక్ష్యం. డ్రోన్లు వారి జీవితాలను మార్చివేస్తాయి అనే నమ్మకం నాకు ఉంది’ అంటుంది ‘ఏవీపీఎల్’ కో–ఫౌండర్, సీయీవో ప్రీత్ సంధూ. -
Russia-Ukraine war: నిప్పులు చిమ్మే డ్రాగన్ డ్రోన్
తమ భూభాగాన్ని దురాక్రమించిన రష్యా సైన్యంతో నెలల తరబడి అలుపెరగక పోరాడుతున్న ఉక్రెయిన్ బలగాల చేతికి కొత్త అస్త్రమొచ్చింది. రష్యా స్థావరాలపై భారీ స్థాయిలో మంటలు చిమ్ముతూ, పొగ వెదజల్లే కొత్త తరహా డ్రోన్‌ను ఉక్రెయిన్ యుద్ధరంగంలోకి దింపింది. అటవీప్రాంతాల్లో నక్కిన రష్యా సైనికులు, వారి యుద్ధట్యాంకులపైకి బుల్లి డ్రోన్లు ఏకధాటిగా నిప్పులు వెదజల్లుతున్న వీడియోను ఉక్రెయిన్ రక్షణ శాఖ ‘ఎక్స్’లో విడుదలచేయడంతో ఈ డ్రోన్ల సంగతి అందరికీ తెల్సింది. రణరీతులను మార్చేస్తున్న అధునాతన డ్రాగన్ డ్రోన్ గురించి అంతటా చర్చమొదలైంది. ఏమిటీ డ్రాగన్ డ్రోన్? చైనాలో జానపథ గాథల్లో డ్రాగన్ పేరు ప్రఖ్యాతిగాంచింది. నిప్పులు కక్కుతూ ఆకాశంలో చక్కర్లు కొట్టే డ్రాగన్ గురించి అందరికీ తెలుసు. అచ్చం అలాగే నిప్పులను వెదజల్లుతూ ఆకాశంలో దూసుపోతుంది కాబట్టే ఈ డ్రోన్‌కు డ్రాగన్ అని పేరు పెట్టారు. సంప్రదాయక డ్రోన్లకు భిన్నంగా పనిచేస్తున్న ఈ డ్రోన్లతో రష్యా బలగాలకు నష్టం పెద్దగా ఉంటుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటి? థర్మైట్ ఈ డ్రోన్‌లో ఉన్న ఏకైక ఆయుధం. అత్యధికంగా మండే స్వభావమున్న ఖనిజాన్ని, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్ పొడి, ఇంకొంచెం ఇనుప రజను మిశ్రమాన్ని మందుగుండుగా వాడతారు. అయితే మిగతా డ్రోన్లలాగా ఇది పేలే బాంబును లక్ష్యంగాపైకి జాడవిడచదు. తనలోని మిశ్రమాన్ని మండించి తద్వారా విడుదలయ్యే మంటను కొంచెం కొంచెంగా అలా దారి పొడవునా వెదజల్లుకుంటూ పోతుంది. ఊపిరి ఆడకుండా దట్టమైన పొగను సైతం వెదజల్లుతుంది. ద్రవరూపంలోకి వారిన ఖనిజం మండుతూ ఏకంగా 4,000 డిగ్రీ ఫారన్‌హీట్ వేడిని పుట్టిస్తుంది. ఇంతటి వేడి శత్రు స్థావరాలను కాల్చేస్తుంది. ఈ ద్రవఖనిజం మీద పడితే మిలటరీ గ్రేడ్ ఆయుధాలు ఏవైనా కరిగిపోతాయి. సముద్రతీర ప్రాంతాల్లో నీటి అడుగున నక్కిన శత్రువుల ఆయుధాలను ఇది కాల్చేస్తుంది. ఎందుకంటే ఇది నీటిలో కూడా మండగలదు. ఇది మీద పడితే సైనికుల శరీరం, ఎముకలు కాలిపోతాయి. మరణం దాదాపు తథ్యం. ఒకవేళ తృటిలో తప్పించుకున్నా మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు థర్మైట్ ఆయుధంతోపాటు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంపైకి దూసుకెళ్లడం ఈ డ్రాగన్ డ్రోన్ ప్రత్యేకత. సంప్రదాయక రక్షణ ఉత్పత్తులతో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదకరమైందని బ్రిటన్‌లోని యుద్ధవ్యతిరేక దౌత్య సంస్థ ‘యాక్షన్ ఆన్ ఆర్మ్డ్ వయలెన్స్’ పేర్కొంది. దాడి చేయడంతో పాటు నిఘా పనులూ ఇవి ఒకే సమయంలో పూర్తిచేయగలవు. ఎందుకంటే వీటికి స్పష్టమైన కెమెరాలను బిగించారు. యుద్ధట్యాంక్, సైనికుడు, మరేదైనా స్థావరం.. ఇలా శత్రువుకు సంబంధించిన దేనిపై దాడి చేస్తుందో కెమెరాలో ఉక్రెయిన్ బలగాలు స్పష్టంగా చూడొచ్చు.అంకుర సంస్థ చేతిలో.. ఈ డ్రాగన్ డ్రోన్‌ను ఉక్రెయిన్‌లోని స్టార్టప్ సంస్థ ‘స్టీల్ హార్నెట్స్’ తయారుచేసినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ తయారుచేసిన శక్తివంతమైన థరై్మట్ సాయంతో 4 మిల్లీమీటర్ల మందమైన లోహ ఉపరితలానికి సైతం కేవలం 10 సెకన్లలో రంధ్రం పడుతుందని తెలుస్తోంది. యుద్దం మొదలైననాటి నుంచి ఉక్రెయిన్‌కు అన్ని రకాల ఆయుధాలు అందిస్తూ అమెరికా ఆదుకుంటోంది. అమెరికా తన అమ్ములపొదిలోని థర్మైట్ గ్రనేడ్లను ఉక్రెయిన్‌కు ఇస్తోందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అమెరికా ఇస్తేగనక రష్యా సైతం ఇలాంటి ఆయుధాలనే ప్రయోగించడం ఖాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మూడేళ్ల చిన్నారిని రక్షించడంలో డ్రోన్ సాయం..!
మూడేళ్ల చిన్నారి డ్రోన్ సాంకేతికతో విజయవంతంగా రక్షించారు అధికారులు. ఇలాంటి రెస్క్యూఆపరేషన్లో డ్రోన్ సాంకేతికత సమర్థవంతంగా ఉపయోగపడుతుందనే విషయం ఈ సంఘటనతో తేటతెల్లమయ్యింది.అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని విస్కాన్సిన్లో ఆల్టోలో అనే ప్రాంతంలో మూడేళ్ల చిన్నారి దట్టమైన మొక్కజొన్న పొలంలో తప్పిపోయాడు. అదికూడా రాత్రి సమయం కావడంతో అతడి ఆచూకి కష్టతరంగా మారింది. సమాచారం పోలీసులకు అందడంతో రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభించారు. అది రాత్రి సమయం కావడం, దీనికితోడు దట్టమైన మొక్కజొన్న అడవి తదితర కారణాల వల్ల చిన్నారి జాడ కనిపెట్టడం సాధ్యం కాలేదు. దీంతో ఫాండ్ డు లాక్ కౌంటీ షెరీఫ్ పోలీసులు మొక్కజొన్న క్షేత్రాన్ని స్కాన్ చేసేందుకు థర్మల్ డ్రోన్‌ని మోహారించారు.దీనిలోని ఇన్ఫ్రారెడ్ కెమెరా హీట్ సిగ్నేచర్లు చిన్నారి ఉన్న ప్రదేశాన్ని గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. ఆరడగుల పొడవైన కాండాలతో నిండిన మొక్కజొన్న పొలాన్ని డ్రోన్ సర్వే చేయడంతో వీడియో తీయడం ప్రారంభించిన నలుపు తెలుపు ఆకృతి నమునాలను ఇచ్చింది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక ఆకారం మొక్కజొన్న గుండా కదలడం ప్రారంభించింది. స్క్రీన్‌పై ఏకరీతి నమునాకు అంతరాయం కనిపించడంతో..ఇది తప్పిపోయిన చిన్నారి కదలికలని నిర్థారణ చేశారు. వెంటనే ఆ ప్రదేశానికి చేరుకునేలా అధికారులను అప్రమత్తం చేశారు. ఆ తర్వాత బాలుడిని సురక్షితంగా ఆ మొక్కజొన్న పొలం నుంచి రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ ఘటన సాంకేతికత ప్రాముఖ్యతను హైలెట్ చేసింది. అలాగే దట్టమైన మొక్కజొన్న పొలం, రాత్రి సమయం వల్ల చిన్నారి ఆచూకి కనిపెట్టడం అంత సులభం కాలేదు. ఒకవేళ సాంకేతిక సాయం లేనట్లయితే గంటలకొద్ది సమయం పట్టొచ్చు లేదా చిన్నారికి అనుకోని ఆపద ఏదైనా ఎదురయ్యే ప్రమాదం కూడా లేకపోలేదని అన్నారు షెరీఫ్ కార్యాలయం అధికారులు.(చదవండి: సైన్సుకే సవాలుగా శాంతి దేవి పునర్జన్మ రహస్యం: విస్తుపోయిన శాస్త్రవేత్తలు..!) -
ఆకాశంలో ఆపద్బంధు!
వరదల్లో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగినా ఫలితం కానరాని వేళ... డ్రోన్లు అండగా నిలుస్తున్నాయి. బాధితుల ఆచూకీ గుర్తించడం, వారికి ఆహారం, తాగునీరు, లైఫ్ జాకెట్లు చేరవేయడంతో డ్రోన్ల సాయం తీసుకుంటున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో వచి్చన వరదలో వీటిపాత్ర కీలకంగా మారింది. 20 కేజీల బరువును మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ డ్రోన్లతో బాధితులకు లైఫ్ జాకెట్లు, ఆహారం, తాగునీరు చేరవేశారు. – ఖమ్మం మయూరిసెంటర్ఆ తొమ్మిది మందికి.. గత ఆదివారం మున్నేరుకు వచ్చిన భారీ వరదతో ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిపై తొమ్మిది మంది చిక్కుకుపోయారు. వరద భారీగా పెరగడంతో బ్రిడ్జిపై ఓ పక్క ఎత్తయిన స్థలానికి చేరి బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ఉదయం 9గంటలకు వరదనీరు మరింత పెరగడంతో బ్రిడ్జిపైకి చేరుకున్న వీరిని రక్షించేందుకు ఎలాంటి మార్గం కానరాలేదు. మధ్యాహ్నం 2గంటల సమయాన అధికారులు రెండు డ్రోన్లు పంపి వీరి పరిస్థితిని తెలుసుకున్నారు.అనంతరం డ్రోన్ల ద్వారానే లైఫ్ జాకెట్లు, ఆహారం, తాగునీరు పంపించారు. రాత్రి వరకు సహాయక చర్యలు ప్రారంభం కాకపోవడంతో కుటుంబ సభ్యులు అదే డ్రోన్ల సాయంతో బ్యాటరీ లైట్లు చేరవేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వారు డ్రోన్ అందించిన లైఫ్ జాకెట్లు, ఆహారం, తాగునీటితో బాధితులు గడిపారు. అక్కడ కూడా..కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద పాలేరు అలుగుల ప్రాంతంలో షేక్ యాకూబ్ , సైదాబి, షరీఫ్ వరదలో చిక్కుకున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వారి నివాసాన్ని వరద చుట్టుముట్టడంతో ఇంటి పైభాగంలో ఉండిపోయారు. వారి వద్దకు వెళ్లే పరిస్థితి లేకపోగా సాయం చేసే అవకాశం కనిపించలేదు. వీరికి డ్రోన్ ద్వారా లైఫ్ జాకెట్లు, ట్యూబ్‌లు, ఆహారం, తాగునీరు అందించాలనే ఆలోచనకు వచ్చారు. ఆ వెంటనే మోతె నుంచి డ్రోన్లు తెప్పించి యాకూబ్ కుటుంబ సభ్యులకు లైఫ్‌జాకెట్లు, ఆహారం, తాగునీరు పంపించారు. అయితే, జాకెట్ ధరించిన షరీఫ్ ప్రాణాలను దక్కించుకోగా.. యాకూబ్, సైదాబీలు మాత్రం వరదలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. -
అందరికీ ఆహారం అందించలేకపోయాం
సాక్షి, అమరావతి : వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరికీ ఆహారం అందించలేకపోయామని సీఎం చంద్రబాబు చెప్పారు. సోమవారం రాత్రి 11.30గంటలకు విజయవాడలోని ఎన్డీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ముందు వచ్చిన వాళ్లు ఎక్కువ ఫుడ్ ప్యాకెట్లు తీసుకోవడం వల్ల తర్వాత వారికి ఇవ్వలేకపోయామన్నారు. సింగ్‌నగర్ ప్రాంతంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు కనీసం నీళ్లు లేక అలమటించిపోతున్నారన్నారు.బుడమేరుకు గండ్లు పడిన విషయాన్ని తమ ప్రభుత్వం గుర్తించలేకపోయిందని, అందుకే సింగ్‌నగర్ ప్రాంతం మునిగిందన్నారు. తన ఇంట్లోకి నీళ్లు రావడాన్ని రాజకీయం చేస్తున్నారని, నీళ్లు వస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన ఇల్లు మునగకుండా ఉండేందుకు విజయవాడను ముంచానడం ఏమిటని నిలదీశారు. సహాయక చర్యలు విఫలమవడానికి కొందరు అధికారులే కారణమన్నారు. డ్రోన్ డ్రామా..! సర్వే డ్రోన్లతో ఆహార పంపిణీ అంటూ హడావుడిమధ్యాహ్నం 12.30 గంటలు.. విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణం.. ఓ వ్యక్తి హడావుడిగా డ్రోన్‌తో కలెక్టర్ కార్యాలయంలోకి ప్రవేశించాడు. ఖాళీ ప్రాంగణంలో డ్రోన్‌ను కిందకు దింపి ఓ అధికారిని పరిచయం చేసుకున్నాడు. డ్రోన్ కంపెనీ యజమానితో ఫోన్ ద్వారా మాట్లాడించాడు. తమ డ్రోన్లను సర్వే కోసం వినియోగిస్తామని, వరద ప్రాంతాల్లో ఫొటోలు తీసేందుకు చక్కగా పనికొస్తాయని, రెండు కిలోల వరకు మాత్రమే బరువు మోస్తాయని యజమాని పేర్కొనడంతో వరద ప్రాంతాలకు ఆహారం, మంచినీళ్లు, మందులు సరఫరా చేసేందుకు డ్రోన్లు కావాలని ఆ అధికారి కోరారు. అనంతరం ఓ ప్లాస్టిక్ బక్కెట్లో దాదాపు కిలో పురికొసలు వేసి తాడు ద్వారా డ్రోన్‌కు కట్టి ఎగురవేశారు.కాసేపటికి పెట్టుబడులు, మౌలిక వసతుల కార్యదర్శి రంగ ప్రవేశం చేశారు. వాటి పనితీరును గమనించిన ఆయన చిన్న బరువుకే ప్లాస్టిక్ బక్కెట్ ఊగిపోతోందని, వరద ప్రాంతాల్లో బలమైన గాలులను తట్టుకుంటుందా? అని సందేహం వ్యక్తం చేశారు. ఇంతలో సీఎం చంద్రబాబు అరగంట తర్వాత వచ్చి డ్రోన్ ప్రయోగాన్ని వీక్షించారు. అంతే.. డ్రోన్లు ఎనిమిది నుంచి పది కేజీలు బరువు మోసుకెళ్తాయని, వాటి ద్వారా మందులు, మంచినీళ్లు, ఆహారం సరఫరా చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన డ్రోన్ల డ్రామా ఇదీ!! -
వైఎస్ జగన్ కృష్ణ లంక డ్రోన్ విజువల్స్
-
వీడియో: రష్యాపై విరుచుకుపడుతున్న ఉక్రెయిన్.. 9/11 తరహాలో దాడులు
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా రష్యాలోని సరాటోవ్‌లోని 38 అంతస్తుల అత్యంత ఎత్తయిన భవనం వోల్గా స్కైపైకి ఉక్రెయిన్ డ్రోన్ దూసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భవనంలోని పలు అపార్ట్మెంట్లు దెబ్బతిన్నాయి. వోల్గా స్కై కాంప్లెక్స్ ఎత్తు 128.6 మీటర్లు. ఈ ప్రాంతంలో ఇదే అత్యంత ఎత్తయిన భవనం. డ్రోన్ శిథిలాలు భవనంపై చెల్లాచెదురుగా పడివున్నాయని అధికారులు చెబుతున్నారు. A large drone recently crashed into the 38-story Volga Sky residential complex, the tallest building in Saratov, Russia, causing significant damage and injuring at least two people.#russia #Ukraine pic.twitter.com/iWU96hPpok— Bhoopendra Singh 🇮🇳 (@bhoopendratv007) August 26, 2024ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో డ్రోన్ స్ట్రైక్ కారణంగా వాటి శిథిలాలు కింద చెల్లాచెదురుగా పడ్డాయని ప్రాంతీయ గవర్నర్ రోమన్ బుసార్గిన్ తెలిపారు. ఈ తాజా దాడి రష్యాలో భద్రతాపరమైన ఆందోళనలను లేవనెత్తింది. ఈ ఉదంతానికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అయిన వీడియోలు డ్రోన్ దాడి కారణంగా ఎంత నష్టం వాటిల్లిందనేది చూపిస్తున్నాయి. 2001, సెప్టెంబరు 11న యునైటెడ్ స్టేట్స్‌లోని ట్విన్ టవర్స్‌పై అల్-ఖైదా వైమానిక దాడులు జరిపింది. వాటిని 9/11 దాడులుగా పేర్కొంటారు.🇺🇦#Ukraine 🇷🇺#Russia #Saratov #Engels #UkraineRussiaWar️️ #UkraineWar #UAV Russian media reports that at least twenty cars were damaged when a drone flew into the 38-story Volga Sky residential complex in the city of Engels in the Saratov region.The attack began at… pic.twitter.com/S9eRX8dbxQ— 🛰️ Wars and news 🍉 (@EUFreeCitizen) August 26, 2024 -
తూనీగలా తిరుగుతూ నిఘా!
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: తూనీగలా తిరుగుతూ నిఘా పెడు తుంది.. సీతాకోక చిలుకలా కదులుతూ పరిస్థితులను కళ్లకు కడుతుంది... గద్దలా ఎగు రుతూ ఎప్పటికప్పుడు ఫొటో లు, వీడియోలు పంపుతుంది.. ఐఐటీ హైద రాబాద్ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్న బయో ఇన్స్పైర్డ్ ఫ్లాపర్ డ్రోన్ సాంకేతికత ప్రత్యేకత ఇది. పక్షులు, కీటకాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక తరహా డ్రోన్లపై ఐఐటీహెచ్ పరిశోధనలు చేస్తోంది. ఆయా ప్రాంతాల్లోని భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వాటిని డిజైన్ చేస్తోంది. అటవీ ప్రాంతాలు, కొండలు, చెరువులు, సరస్సులు, దూర ప్రాంతాల్లో సైతం తిరిగేందుకు అనువుగా వాటిని రూపొందిస్తోంది. డ్రోన్లు ఎగిరినట్లు బయో ఇన్స్పైర్డ్ డ్రోన్లు దేశ సరిహద్దుల్లో సైతం నిఘా పెట్టడానికి ఉపయోగించుకోవచ్చని, భద్రతా అవసరాలకు వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.డ్రోన్లకు కాస్త భిన్నంగా.. డ్రోన్ టెక్నాలజీకి కాస్త భిన్నంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. డ్రోన్లు బ్యాటరీల సాయంతో పనిచేస్తుంటాయి. అయితే ఒకసారి వాటి చార్జింగ్ అయిపోతే తిరిగి చార్జ్ చేస్తేనే తిరిగి పనిచేస్తాయి. కానీ తూనీగ మాదిరిగా ఉండే బయో ఇన్స్పైర్డ్ డ్రోన్‌లో రెక్కలు కొట్టుకోవడం ద్వారా వచ్చే శక్తితో దాటంతట అదే చార్జ్ అయ్యేలా డిజైన్ చేస్తున్నారు. అలాగే గద్ద ఆకారంలో తయారు చేసిన ఫ్లాపర్ దూరప్రాంతాలకు సైతం ఎగురుకుంటూ వెళ్లి ఆధునిక కెమెరాల ద్వారా అక్కడి పరిసరాలను వీడియో రికార్డు చేస్తుంది. కంట్రోల్ యూనిట్ ద్వారా దీని గమ్యాన్ని మార్చొచ్చు. తక్కువ ఎత్తు నుంచి ఈ డ్రోన్లను ఎగరేయడం వీలవుతుందని.. దీనివల్ల ఇతర దేశాల రాడార్ల నిఘాకు అవి చిక్కవని పరిశోధకులు చెబుతున్నారు.నాలుగేళ్లుగా పరిశోధనలు..దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ హెచ్లో టీఐహెచ్‌ఏఎన్ (టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నేవిగేషన్) అనే పరిశోధన విభాగం ఉంది. ఇందులో యూఏవీ (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్), ఆర్ఓవీ (రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్) రకాల అటానమస్ వాహనాలను అభివృద్ధి చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా వాటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఏరోస్పేస్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ వంటి బ్రాంచీలకు చెందిన ఎంటెక్, పీహెచ్డీ విద్యార్థులు ఈ పరిశోధన విభాగంలో పనిచేస్తున్నారు.నిఘా, భద్రత అవసరాలకు ఉపయోగపడేలాబయో ఇన్స్పైర్డ్ డ్రోన్లపై పరిశోధనలు కొనసాగు తున్నాయి. ఇవి ప్రొటోటైప్ (నమూన దశ) స్టేజీలో ఉన్నాయి. కొన్ని డ్రోన్ల పరిశోధనలు చివరి దశకు చేసుకుంటున్నాయి. పక్షులు, తూనీగ వంటి వాటిని స్ఫూర్తిగా తీసుకొని బయో ఇన్స్పైర్డ్ డ్రోన్లను తయారు చేస్తున్నాం. దేశ నిఘా, భద్రతా అవసరాలకు ఎంతగానో ఉపయోగపడేలా వాటిని అభివృద్ధి చేస్తున్నాం.– సంతోష్‌రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్, టీఐహెచ్‌ఏఎన్ -
రోహింగ్యా ముస్లింలపై డ్రోన్ దాడి.. 200 మంది మృతి?
బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు అదుపులోకి రావడం లేదు. ఇప్పుడు ఆ దేశం ముందు మరో సవాలు నిలిచింది. తాజాగా మయన్మార్ నుంచి పెద్ద సంఖ్యలో రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపధ్యంలో మయన్మార్ నుండి బంగ్లాదేశ్‌కు తరలివస్తున్న రోహింగ్యా ముస్లింలపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.. మృతుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఈ ఉదంతం సంచలనంగా మారింది. బురదతో కూడిన పొలంలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు పడి ఉండడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఈ మృతదేహాల చుట్టూ సూట్‌కేసులు, బ్యాక్‌ప్యాక్‌లు పడి ఉన్నాయి.వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు ప్రత్యక్ష సాక్షులు ఈ డ్రోన్ దాడుల గురించి మీడియాకు తెలిపారు. బంగ్లాదేశ్ సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్న కుటుంబాలపై ఈ దాడి జరిగిందని వారు పేర్కొన్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం ఈ దాడి రోహింగ్యా పౌరులపై జరిగిన అత్యంత పాశవిక దాడి. ఈ దాడుల వెనుక అరకాన్ ఆర్మీ హస్తం ఉందని రాయటర్స్ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను అరకాన్ ఆర్మీ ఖండించింది. ఈ దాడిపై మయన్మార్ సైన్యం, మిలీషియా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఏ ప్రాంతానికి చెందనది? ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే వివరాలు ఇంకా నిర్ధారణ కాలేదు. -
మేడిగడ్డ బ్యారేజ్ డ్రోన్ వీడియోపై కేసు నమోదు
-
మేడిగడ్డ బ్యారేజ్ డ్రోన్ వీడియో వైరల్.. కేసు నమోదు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజ్ డ్రోన్ వీడియోపై కేసు నమోదైంది. గత నెల 26న మేడిగడ్డ బ్యారేజ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్, పార్టీ ముఖ్య నాయకులు సందర్శించారు.ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు.. డ్రోన్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇరిగేషన్ ఏఈఈ ఫిర్యాదుతో మహదేవ్పూర్ పీఎస్‌లో కేసు నమోదైంది.. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
‘పీఎల్ఐ శాశ్వత సబ్సిడీ కాదు’
డ్రోన్ పరిశ్రమ పురోగతికి కేంద్రం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం ఎంతో ఉపయోగపడుతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే ఈ పథకాన్ని ప్రభుత్వ శాశ్వత సబ్సిడీగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. న్యూదిల్లీలో పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పీఎల్ఐ పథకాన్ని పరిశ్రమలు శాశ్వత సబ్సిడీగా పరిగణించకూడదు. ఆయా రంగాలను ఈ సబ్సిడీపై ఆధారపడేలా చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఇది వాటి పురోగతికి అందించే ప్రోత్సాహకం మాత్రమే. డ్రోన్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సాంకేతిక పురోగతి రైతులకు అధిక నాణ్యత గల పంటలను అందించాలి. పంటల దిగుబడిని పెంచేలా సహకరించాలి. అందుకు అనువుగా మరిన్ని పరిశోధనలు జరగాలి. గ్రామ స్థాయిలో డ్రోన్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసి మహిళా సాధికారత కల్పించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం ప్రధానమంత్రి ‘నమో డ్రోన్ దీదీ’ పథకం ఎంతో ఉపయోగపడుతోంది. ఎన్డీఏ కూటమి మూడో టర్మ్ పరిపాలనలో మూడు రెట్లు వేగంతో పని చేస్తాం. మూడు రెట్ల ఫలితాన్ని అందిస్తాం. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అదానీ-హిండెన్‌బర్గ్ నివేదిక వెనక చైనా హస్తం‘గ్రామ స్థాయిలో డ్రోన్ల వాడకం వల్ల సహకార రంగం, స్వయం సహాయక బృందాలు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీఓ)లకు ఆదాయం సమకూరుతుంది. వీటికి డ్రోన్లు అందించేందుకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ) ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ పరిశ్రమలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి 2024 ప్రథమార్థంలో 18 ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లకు అనుమతులిచ్చాం. 2023లో 17 కంపెనీలు మార్కెట్లో లిస్ట్ అయ్యాయి’ అని మంత్రి పేర్కొన్నారు. -
మగ్గంలా పనిచేసే రోబో గురించి.. ఎప్పుడైనా విన్నారా!?
ఈ రోబో మగ్గంలా పనిచేస్తుంది. అయితే నూలు దుస్తులు, పట్టు వస్త్రాలు కాదు, ఊలు దుస్తులు నేస్తుంది. ఇది ఊలు దుస్తులను చకచకా నేసి, కోరుకున్న డిజైన్లలో అల్లేస్తుంది. ఈ రోబో మగ్గాన్ని డచ్ డిజైనర్ క్రిస్టీన్ మీండెర్స్మా రూపొందించారు..త్రీడీ ప్రింటర్లు పొరలు పొరలుగా వస్తువులను ముద్రించిన పద్ధతిలోనే ఈ రోబో మగ్గం పొరలు పొరలుగా ఊలు దుస్తులను నేస్తుంది. ఈ రోబో మగ్గానికి ‘ఫ్లాక్స్ వోబో’ అని పేరు పెట్టారు. ఊలు పరిశ్రమలో నేసే ముందు ఊలును నీటితో తడుపుతారు. అయితే, ఈ రోబో మగ్గానికి నేరుగా ఊలు అందిస్తే చాలు, ఏమాత్రం తడపాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి దీనిని నమూనాగా రూపొందించారు. త్వరలోనే పారిశ్రామిక స్థాయిలో దీని ఉత్పత్తిని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.హైడ్రోజన్ బైక్..పెట్రోల్‌తో నడిచే బైక్‌లకు పోటీగా ఇటీవలి కాలంలో లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ బైక్‌ల వాడకం పెరిగింది. లిథియం అయాన్ బ్యాటరీలను మించిన సామర్థ్యం కలిగిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచే బైక్‌లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ‘హైడ్రోరైడ్ యూరోప్ ఏజీ’ కంపెనీ రకరకాల మోడల్స్‌లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది.వీటికి 180 హైడ్రోజన్ సెల్‌తో పాటు, 25 సెంటీమీటర్ల పొడవైన హైడ్రోజన్ కంటెయినర్ ఉంటుంది. కంటెయినర్‌లోని హైడ్రోజన్ 1 మెగాపాస్కల్ పీడనంతో ఉంటుంది. ఈ హైడ్రోజన్ నుంచి ఇందులోని ఫ్యూయల్ సెల్ విద్యుత్తును తయారుచేసుకుంటుంది. ఒక కంటెయినర్‌ను పూర్తిగా నింపి అమర్చుకుంటే, ఈ బైక్‌పై ఏకధాటిగా 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ బైక్‌కు అమర్చుకునే విధంగా హైడ్రో జనరేటర్ కూడా ఉంటుంది.ఒకవేళ మార్గమధ్యంలో కంటెయినర్‌లోని హైడ్రోజన్ ఖాళీ అయిపోతే, ఈ జనరేటర్లో 200 మిల్లీలీటర్ల డిస్టిల్డ్ వాటర్‌ను నింపుకుంటే చాలు. దీని నుంచి ఉత్పత్తయ్యే హైడ్రోజన్ దాదాపు ఐదారు గంటల ప్రయాణానికి తగినంత ఇంధనంగా సరిపోతుంది. అయితే, హైడ్రోరైడ్ యూరోప్ ఏజీ’ కంపెనీ నేరుగా విక్రయానికి పెట్టకుండా.. యూరోప్‌లోని ఎంపిక చేసిన నగరాల్లో కస్టమర్లకు అద్దెకు ఇస్తోంది.ఉభయచర డ్రోన్..ఇప్పటి వరకు గాల్లోకి ఎగిరే డ్రోన్లు మాత్రమే తెలుసు. అయితే, కెనడియన్ కంపెనీ ‘ఏరోమావో’ ఉభయచర డ్రోన్‌ను రూపొందించింది. ఇది గాలిలో ఎగరడమే కాదు, నీటిలోనూ ప్రయాణించగలదు. ఈ డ్రోన్‌ను ‘వీటీ నాట్–వీటీఓఎస్ఎల్’ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ బ్రాండ్ పేరుకు అర్థమేమిటంటే, ‘వెర్టికల్ టేకాఫ్ అండ్ షార్ట్ ల్యాండింగ్’. మ్యాపుల చిత్రణ, మనుషులు చొరబడలేని ప్రదేశాల్లో కూడా సర్వే జరపడం, వ్యవసాయ అవసరాలకు, నిఘా పనులకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు.గాల్లోకి ఎగిరేటప్పుడు దీని గరిష్ఠ వేగం గంటకు 85 కిలోమీటర్లు అయితే, నీటిలో ప్రయాణించేటప్పుడు గంటకు 55 కిలోమీటర్లు. రీచార్జబుల్ బ్యాటరీతో ఇది పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసినట్లయితే, గంటన్నర సేపు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. దీని ధర 11,170 డాలర్లు (రూ.9.31 లక్షలు). -
సాంకేతిక కేంద్రంగా ఇట్స్ ఫ్లో టైం
ప్రపంచంలో ఏదో ఒక మూల నిత్యం సరికొత్త ఆవిష్కరణలు పరిచయమవుతూనే ఉంటాయి. అయితే ఆ ఆవిష్కరణలు అందరికీ చేరడానికి చాలా సమయమే పడుతోంది. ఈ క్రమంలో వాటిని విద్యార్థుల చెంతకు చేర్చాలన్నా.. దానిపై అవగాహన కల్పించాలన్నా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండాలి. రోబోల తయారీ నుంచి 3డీ ప్రింటింగ్ వరకూ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నుంచి డ్రోన్ వినియోగం వరకూ వాటి తయారీ విధానం, వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పనితీరును తదితర టెక్నాలజీని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో కొంత మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ముందడుగేశారు.. ఇంతకీ ఆ విద్యార్థులు ఏం చేశారు? వారి ఉద్దేశం ఏంటి? ఆ విశేషాలేంటో తెలుసుకుందాం..! ⇒ఇంజినీరింగ్ విద్యార్థుల నూతన ఆవిష్కరణ⇒విద్యార్థుల చెంతకు ‘సాంకేతిక’ చదువు⇒‘ఫ్లో’ పేరుతో కొత్త తరహా ప్రయత్నం⇒గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితం⇒సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహనే లక్ష్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలి్పంచాలి.. దాని వినియోగం విద్యార్థుల చెంతకు చేర్చాలి.. ఇదీ పలువురి ఇంజినీరింగ్ విద్యార్థుల సంకల్పం.. అనుకున్నదే తడవుగా సాయం కోసం పలువురిని సంప్రదించారు.. వారి సంకల్పానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వంతపాడారు.. ఆయన సాయంతో ఓ బస్సులో అన్ని సదుపాయాలతో అత్యాధునిక సాంకేతికతను వివరించే నమూనాలతో ల్యాబ్ ఏర్పాటు చేశారు. దీనికి ‘ఫ్లో’ (ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్)ను సిద్ధం చేశారు. దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఫ్లో ఒక వరంగా మారనుంది... ఇదే ఫ్లో లక్ష్యం... భవిష్యత్తులో రోబోలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి. వాటిని తయారు చేయడం ఎలా? అందుకు అవసరమైన టెక్నాలజీ ఏంటి? రోబోలకు ఎందుకు అంత ప్రాధాన్యత? తయారు చేసిన రోబోలు ఎలా పనిచేస్తాయి? వాటిని వినియోగించడం ఎలా?.. తదితర అంశాలపై క్షుణ్ణంగా వివరిస్తారు. ప్రాక్టికల్‌గా బస్‌లోని రోబోలను చూపిస్తూ విద్యార్థులకు అవగాహన కలి్పస్తారు. వాతావరణ వ్యవస్థపై... ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఎంత వేడి (ఎన్ని డిగ్రీలు) ఉంది. రేపు వాతావరణం ఎలా ఉండబోతోంది. వర్షం ఎపుడు కురుస్తుందనే ముందస్తు సమాచారం. వర్షం కొలమానం, తుఫాను హెచ్చరిక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది. గాలులు ఎటు నుంచి ఎటువైపు ప్రయాణిస్తున్నాయి. వంటి వాతావరణ సమాచారం మనకు ముందుగానే తెలుస్తుంది. అయితే అది ఎలా సాధ్యమవుతుంది? దానికి వినియోగించే సాంకేతిక పరిజ్ఞానం, తదితర అంశాలపై ఫ్లో బస్‌లో విద్యార్థులకు వివరిస్తారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ)... ప్రస్తుత ఇంటర్నెట్ వ్యవస్థ ప్రపంచాన్ని మన చేతుల్లో పెడుతోంది. చిటికెలో సమాచారాన్ని చేరవేస్తోంది. కార్యాలయంలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్న ఫ్యాన్, ఏసీ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం వంటివి చేయగలడు. కార్యాలయం, ఇల్లు, పొలం దగ్గర సీసీ కెమెరాల ద్వారా ఎక్కడో కూర్చుని అక్కడ ఏం జరుగుతుందో పర్యవేక్షించగలడు. ఇంట్లో సెన్సార్ వ్యవస్థతో మనం స్విచ్ ఆన్ చేయకుండానే లైటు వెలుగుతుంది. డోర్ తెరుచుకుంటుంది. రానున్న రోజుల్లో అందుబాటులోకి రానున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తదితర విషయాలు తెలియజేస్తారు. డ్రోన్ వినియోగం.. ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీకి మార్కెట్లో అత్యంత ఆదరణ ఉంది. వీడియోల, ఫొటోల చిత్రీకరణ, వ్యవసాయ పనుల నుంచి మొదలు వివాహాది శుభకార్యాలు, దేశ సరిహద్దుల్లో భద్రత వరకూ డ్రోన్స్ విరివిగా వినియోగిస్తున్నారు. డ్రోన్ తయారీ విధానం, వినియోగం, ఉపయోగాలపై అవగాహన కలి్పస్తారు. 3డీ ప్రింటింగ్.. 3డీ ప్రింటింగ్ అనేది అత్యాధునిక టెక్నాలజీ. గ్లాస్‌పైన, చెక్క, పింగానీ వస్తువులు, ఇలా ఎక్కడైనా చక్కని ఆకృతితో మనకు నచ్చిన చిత్రాన్ని ప్రతిబింబించేలా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది..ఈ అత్యాధునిక 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి భవన నిర్మాణాలను సైతం చేసేలా వృద్ధి చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీకి మంచి ప్రాముఖ్యత ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘ఫ్లో’ బస్‌లో ఉచిత ప్రవేశం కల్పిస్తారు. పాఠశాల ఉపాధ్యాయులు ఫ్లో టీంను సంప్రదిస్తే వారి షెడ్యూల్ ఆధారంగా ఏ రోజు వీలుంటుందనేదీ ఉపాధ్యాయులకు తెలియజేస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం పాఠశాలకు బస్ వచ్చి అందుబాటులో ఉన్న సాంకేతిక అంశాలపై అవగాహన కలి్పస్తారు. ప్రయివేటు పాఠశాలలు సైతం ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవచ్చు. అయితే పాఠశాల యాజమాన్యం నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆ లోటును భర్తీ చేసేందుకే.. కేంద్ర ప్రభుత్వం 2020లో జాతీయ విద్యాపాలసీ (ఎన్ఈపీ)ని అమల్లో తెచి్చంది. ప్రతి పాఠశాలలో అత్యాధునిక టెక్నాలజీని విద్యార్థులకు బోధించాలని చెబుతోంది. ఆ సమయంలో కోవిడ్ రావడంతో కాస్త నెమ్మదించినా, తరువాత కాలంలోనూ ఆశించిన ఫలితాలు లేవు. పాఠశాలల్లో నిష్ణాతులైన శిక్షకులు లేకపోవడం, పరికరాలు అందుబాటులో లేకపోవడం, ఇతర సమస్యలు అడ్డంకిగా మారాయి. ఈ పరిస్థితుల నుంచి అధిగమించడానికి ‘ఫ్లో’ ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.ఏఆర్, వీఆర్.. ఆగ్మెంట్ రియాలిటీ(ఏఆర్), వర్చువల్ రియాలిటీ(వీఆర్) ప్రస్తుత ట్రెండ్ ఇది.. ఎక్కడో ఉన్న వ్యక్తి, ప్రాంతం మన కళ్లముందున్న అనుభూతిని కలి్పస్తాయి. ఈ వ్యవస్థను ఉపయో గించి ప్రస్తుతం ప్రచారం.. గేమింగ్.. టూరిజం.. వంటి రంగాలు మంచి జోష్‌లో నడుస్తున్నాయి.. అదే ఆగ్మెంట్ రియాలిటీ టెక్నాలజీతో.. మరో వైపు వర్చువల్‌గానూ (వీఆర్) వేరే ప్రాతంలో ఉన్న వ్యక్తితో నేరుగా మాట్లాడే అవకాశం కలి్పస్తోంది.. ఈ రెండు వ్యవస్థల పనితీరును వివరిస్తారు.టెక్ టూల్స్ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్, డ్రిల్లింగ్ మెషీన్, మైక్రో ఓవెన్, రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే ఫ్యాన్, ఇంట్లో ఉపయోగించే ఇతర ఎల్రక్టానిక్ పరికరాలు ఎలా పనిచేస్తాయి. మన జీవితంలో వాటి పాత్ర ఎంతవరకూ ఉంటుంది. వాటి తయారీ విధానం, వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు తెలియజేస్తారు.పదివేల మందికి అవగాహన... చిన్నప్పటి నుంచి సైన్స్ పట్ల ఆసక్తి ఎక్కువ. నేషనల్ కాంగ్రెస్ సైన్స్ ప్రోగ్రాంలో పాల్గొనేవాడిని. ఎన్నో బహుమతులు వచ్చాయి. ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ గ్రూప్ తీసుకున్నా. కళాశాలలో బోధన సంతృప్తిగా అనిపించలేదు. 2020లో రోబోటిక్స్‌పై స్టార్టప్ ప్రారంభించాం. ఎఫ్‌ఎల్‌ఓడబ్ల్యూ (ఫ్లో) ప్రారంభించడానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సాయమందించారు. యూఎస్, ఎస్‌ఎస్‌ఐఐఈ నుంచి సుమారు కోటి రూపాయలు నిధులు సమకూరాయి. కొత్త ఇన్నోవేటివ్స్ చేపడుతున్నాం. మేము మొత్తం 18 మంది బృందంగా ఏర్పడి నడిపిస్తున్నాం. త్వరలోనే ఏపీలోనూ ఫ్లో బస్ అందుబాటులోకి వస్తుంది. – మధులాష్ బాబు, సీఈవో ఎడోద్వజ సంస్థ -
సిటీ స్కై డ్రోన్స్ ఫ్లై
సాక్షి, హైదరాబాద్: ఎంటర్టైన్మెంట్ నుంచి ఫంక్షన్ల షూటింగ్ దాకా.. మందుల అత్యవసర సరఫరా నుంచి రోడ్డుపై ట్రాఫిక్‌ను పర్యవేక్షించేదాకా.. డ్రోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. మరెన్నో రంగాలు, అవసరాలకూ డ్రోన్లు విస్తరిస్తున్నాయి. పదులు, వందల్లో కాదు.. రోజూ వేల సంఖ్యలో డ్రోన్లు గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. సరదాగా వాడే చిన్న చిన్న కెమెరా డ్రోన్ల నుంచి ఓ స్థాయిలో బరువులు, వస్తువులు మోసుకెళ్లే భారీ డ్రోన్ల దాకా దూసుకుపోతున్నాయి. దీంతో వాహనాలను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలాగైతే తప్పనిసరో అలా డ్రోన్లను ఎగరవేసేందుకు డ్రోన్ పైలట్ శిక్షణ తప్పనిసరి అయ్యే పరిస్థితి నెలకొంది. అధికారికంగా, అనధికారికంగా రాష్ట్రంలో సుమారు 3 వేల డ్రోన్లు వినియోగంలో ఉన్నట్టు అధికారుల అంచనా.యాచారంలో డ్రోన్ అకాడమీ..ఇప్పటివరకు డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇస్తున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ (టీఎస్‌ఏఏ) త్వరలోనే డ్రోన్ల తయారీ, నిర్వహణ సేవలను సైతం అందించనుంది. నగర శివార్లలోని యాచారం మండలంలో డ్రోన్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం 20 ఎకరాల భూమి ని కేటాయించింది. భూమి సర్వే పనులు పూర్తయ్యాయి. మౌలిక వసతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి.మరో ఏడాదిలో డ్రోన్ పోర్ట్ అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఆపరేషనల్ మేనేజర్ సామల రాహుల్‌రెడ్డి తెలిపారు. ఇక్కడ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంధనంతో నడుస్తూ, 150–200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యమున్న భారీ డ్రోన్లను నడిపే పైలట్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. వీటిని రక్షణ, నేవీ రంగాల్లో భద్రత కోసం వినియోగిస్తారని తెలిపారు. ఈ డ్రోన్లు 120 నుంచి 150 కిలోల వరకు బరువు ఉంటాయని వివరించారు.డ్రోన్లతో ట్రాఫిక్ నిర్వహణ..జంక్షన్లు, రద్దీ సమయంలో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ‘మావిక్ 3 పీఆర్ఓ’ డ్రోన్‌ను సైబరాబాద్ పోలీసులు వినియోగిస్తున్నారు. దీనికి ఉండే నాలుగు అత్యాధునిక కెమెరాల సాయంలో ఏరియల్ ఫొటోలు, వీడియోలను చిత్రీకరిస్తూ రియల్ టైమ్‌లో ప్రసారం చేసే సామర్థ్యం ఈ డ్రోన్ సొంతం. దీంతో ట్రాఫిక్ పోలీసు బృందాలు ఆయా సమస్యలను వేగంగా పరిష్కరించే వీలు కలుగుతుంది. వాహనదారులు సులభంగా, వేగంగా ప్రయాణం చేయడానికి వీలుంటుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం, హనుమాన్ జయంతి, బోనాలు, శ్రీరామనవమి, షాబ్–ఈ–బరాత్ వంటి ర్యాలీలు, జాతరల సమయంలో డ్రోన్లను వినియోగిస్తూ నిఘా పెడుతున్నారు.ఔషధాల సరఫరా కోసంనగర శివార్లలోని బీబీనగర్‌లో ఉన్న ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రెండు డ్రోన్లను వినియోగిస్తోంది. మారుమూల గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు క్షయవ్యాధి మందులను, టీబీ పరీక్షల కోసం కఫం నమూనాలను సైతం డ్రోన్లతో తరలిస్తున్నారు. ఈ ప్రాంతాలకు రోడ్డు మార్గంలో రెండు గంటలకుపైగా సమయం పడితే.. డ్రోన్‌తో కేవలం పది, ఇరవై నిమిషాల్లోపే అత్యవసర ఔషధాలను చేరవేస్తున్నారు. ప్రతిరోజు ఎయిమ్స్ క్యాంపస్‌లోని హ్యాంగర్ నుంచి యాదాద్రి జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు 8 కిలోల బరువు మోసే సామర్థ్యమున్న డ్రోన్‌తో మందులను సరఫరా చేస్తున్నారు.వ్యవసాయ పనుల్లోనూ ఎంతో లాభంవ్యవసాయ కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో విద్యావంతులైన కొందరు రైతులు డ్రోన్ల వినియోగం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. డ్రోన్ల వినియోగం, నిర్వహణ సేవలపై పలు డ్రోన్ తయారీ సంస్థలు, రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ డ్రోన్ అకాడమీ సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. సాధారణంగా ఎకరం పొలంలో పురుగు మందు పిచికారీకి ఒక రోజు సమయం పడుతుంది.పైగా రూ.700–1,000 వరకు ఖర్చు అవుతుంది. డ్రోన్‌తో పిచికారీ రూ.500–600 ఖర్చుతోనే 10 నిమిషాల్లో పూర్తవుతుంది. పైగా పురుగు మందు వల్ల చర్మ, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉండదు. పైగా డ్రోన్‌కు అమర్చే కెమెరాలతో పంటలను ఫొటో తీయడం, చీడ పురుగుల స్థాయిని గుర్తించడం తేలికవుతుంది. ఇక్రిశాట్ సంస్థ పంట రకాలను, దశలను అధ్యయనం చేయడానికి డ్రోన్లను వినియోగిస్తోంది. కృత్రిమ మేధ, మెషీన్ లెరి్నంగ్ టెక్నాలజీల సాయంతో విశ్లేషిస్తోంది.వాతావరణ మార్పుల పరిశీలనకూ..నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) వాతావరణ పరిశోధన, అంచనాల కోసం డ్రోన్లను వినియోగిస్తోంది. వివిధ సెన్సర్లతో కూడిన డ్రోన్‌తో ఆకాశంలో అంతెత్తు వరకు వెళ్లి.. భూమి ఉపరితలం, వాతావరణ పరిస్థితుల డేటాను సేకరిస్తుంది. ఆ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వాతావరణ అంచనాలు, హెచ్చరికలను జారీ చేస్తున్నారు.అటవీశాఖ పరిధిలోనూ..అటవీ ప్రాంతాలు, తోటలు, నీటి మట్టం పర్యవేక్షణకు అటవీ శాఖ డ్రోన్లను వినియోగిస్తోంది. కాగజ్‌నగర్ అటవీ డివిజన్లో ఏనుగు ఇద్దరు రైతులను తొక్కి చంపిన ఘటనలో ఆ ఏనుగు కదలికలను పర్యవేక్షించేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగించారు. అలాగే పులుల సంచారాన్ని గుర్తించేందుకూ డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ పైలట్ లైసెన్స్ తీసుకోవాలిలైసెన్స్ లేకుండా కమర్షియల్ డ్రోన్లను వినియోగించడం నేరంవాహనాలు నడిపేందుకు ఎలాగైతే డ్రైవింగ్ లైసెన్స్ కావాలో అలాగే డ్రోన్‌ను ఎగరవేసేందుకు కూడా సర్టిఫికెట్ కావాల్సిందే. వాణిజ్య అవసరాల కోసం డ్రోన్ వినియోగించే ప్రతీ ఒక్కరికీ ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)’ అనుమతి పొందిన సంస్థ నుంచి డ్రోన్ పైలట్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఆ లైసెన్స్ లేకుండా కమర్షియల్ డ్రోన్లను వినియోగించడం చట్టరీత్యా నేరం. ఈ సర్టిఫికెట్‌కు పదేళ్ల కాల పరిమితి ఉంటుంది. తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి.ఫీజు రూ. 38వేలు...నాలుగేళ్లలో తెలంగాణ డ్రోన్ అకాడమీ నుంచి 600 మందికిపైగా విద్యార్థులు డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొందారు. ఐదు రోజుల కోర్సు ఉంటుంది. ఫీజు రూ.38 వేలు. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ శిక్షణ కోసం వస్తున్నారు. ఇప్పటివరకు శిక్షణ పొందినవారిలో 30 మందికిపైగా మహిళా డ్రోన్ పైలట్లు ఉండటం గమనార్హం.డ్రోన్లతో స్టార్టప్‌లు పెడుతున్నారువయసు,లింగ భేదాలతో సంబంధం లేకుండా చాలా మందిడ్రోన్ పైలట్ శిక్షణపై ఆసక్తి చూపిస్తున్నారు. డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలి, నిర్వహణ ఎలా అనే అంశాలపై నైపుణ్యం కోసం మా దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. తర్వాత సొంతంగా డ్రోన్లతో స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నవారూ ఉన్నారు. -
ట్రాఫిక్‌పై డ్రోన్ కన్ను
సాక్షి, హైదరాబాద్: నిత్యం బిజీగా ఉండే రోడ్డు.. మధ్యలో ఓ కారు మొరాయించి నిలిచిపోయింది. దాంతో ట్రాఫిక్ జామ్ మొదలైంది. ఆ ప్రాంతానికి పైన గాల్లో ఎగురుతున్న ‘డ్రోన్’ద్వారా పోలీసులు ఇది చూశారు. వెంటనే ట్రాఫిక్ రిలీఫ్ వ్యాన్ వచి్చ, మొరాయించిన కారును అక్కడి నుంచి తరలించింది. వాహనాలన్నీ సాఫీగా ముందుకు సాగిపోయాయి. అంటే భారీగా ట్రాఫిక్ జామ్ కాకముందే.. సమస్య పరిష్కారమైపోయింది. ఇదేదో చాలా బాగుంది కదా. ఇకపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ చిక్కులకు ఇలా సింపుల్‌గా చెక్ పడిపోనుంది. తొలుత సైబరాబాద్ పరిధిలో.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో దీనికి సంబంధించి ‘థర్డ్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్’అందుబాటులోకి వచ్చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ఐకియా, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, హఫీజ్‌పేట, హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం తదితర ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఆదివారం ఈ డ్రోన్‌ను వినియోగించారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు, వాహనాల రద్దీ ఎక్కడ ఎక్కువగా ఉంది? జంక్షన్ల వద్ద వాహనాల వేగం ఎలా ఉంది? ఎక్కడైనా నీరు నిలిచి ఉందా? అనే అంశాలతోపాటు రోడ్డు ప్రమాదాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఏదైనా సమస్య ఏర్పడితే ట్రాఫిక్ పోలీసు బృందాలు వెంటనే స్పందించి పరిష్కరించవ చ్చు. వాహనాలు సు లభంగా, వేగంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. ఎలా పనిచేస్తాయంటే..? థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ, రేడియో ఫ్రీక్వెన్సీల సాయంతో ఈ డ్రోన్ సైబరాబాద్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి 150–170 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఈ డ్రోన్‌కు ఉండే మూడు అత్యాధునిక కెమెరాలతో, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్‌లు, వాహనాల రద్దీ, కదలికలను చిత్రీకరిస్తుంది.రియల్ టైమ్‌లో కంట్రోల్ సెంటర్‌కు పంపిస్తుంది. కంట్రోల్ సెంటర్ సిబ్బంది ట్రాఫిక్ పరిస్థితి, రద్దీని విశ్లేíÙంచి, ఏదైనా సమస్య ఉంటే గమనించి క్షేత్రస్థాయిలోని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇస్తారు. తద్వారా ట్రాఫిక్‌ను క్రమబదీ్ధకరిస్తారు. గాలిలో ఏకధాటిగా 45 నిమిషాల పాటు తిరగగలిగే సామర్థ్యమున్న ఈ డ్రోన్ 15 కిలోమీటర్ల దూరం వరకు హెచ్డీ క్వాలిటీ వీడియోను పంపించగలదు. ఇతర కమిషనరేట్లలో.. సైబరాబాద్ పోలీసుల ట్రాఫిక్ నిర్వహణ కోసం డ్రోన్లను వినియోగించాలని గతంలోనూ ఆలోచన చేశారు. అప్పుడప్పుడు డ్రోన్లను అద్దెకు తీసుకొచ్చి వినియోగించేవారు. తాజాగా కార్పొరేట్ సామాజిక సేవ (సీఎస్ఆర్) కింద ‘సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)’నిధులతో సొంతంగా ఒక డ్రోన్‌ను కొనుగోలు చేశారు. దీని ఫలితాలను బట్టి మరిన్ని డ్రోన్లను సమకూర్చుకోనున్నారు.ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం, హనుమాన్ జయంతి, బోనాలు, శ్రీరామనవమి, షాబ్–ఈ–బరాత్ వంటి ర్యాలీలు, జాతరల సమయంలో డ్రోన్లను వినియోగిస్తూ నిఘా పెడుతున్నారు. ఇకపై ట్రాఫిక్ పర్యవేక్షణ కోసమూ వినియోగించనున్నారు. హైదరాబాద్‌లో డ్రోన్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ‘డీ–కెమో’విభాగం ఉంది. దీనికి డీసీపీ/ఏసీపీ ర్యాంకు అధికారి హెడ్‌గా ఉంటారు.ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ డ్రోన్ ఆపరేషన్ ప్రాథమిక దృష్టి ముఖ్యంగా ఐటీ కారిడార్ మీద ఉంటుంది. ఇక్కడ అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడంలో ట్రాఫిక్ పోలీసులకు డ్రోన్ సాయం అందిస్తుంది. ఈ మేరకు డ్రోన్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నాం. – అవినాష్ మహంతి,పోలీస్ కమిషనర్, సైబరాబాద్‘ట్రాఫిక్’కు వాడే డ్రోన్ ప్రత్యేకతలు ఇవీ:డ్రోన్ పేరు: మావిక్ 3 ప్రో ధర: రూ.5.5 లక్షలు బరువు: ఒక కిలో బ్యాటరీ: 5 వేల ఎంఏహెచ్. సుమారు 4 గంటల బ్యాకప్ గరిష్ట ఎత్తు: భూమి ఉపరితలం నుంచి 400 మీటర్లు విజిబులిటీ: 5 కిలోమీటర్ల దూరం వరకు గరిష్ట వేగం: సెకన్‌కు 8 మీటర్లు. గాలి, వర్షం లేకపోతే వరి్టకల్‌గా సెకన్‌కు 21 మీటర్ల వేగంతో ఎగరగలదు. స్టోరేజ్ 8 జీబీ నుంచి 1 సామర్థ్యం: టీబీ వరకు ఉంటుంది. -
సాగులో యంత్రాలేవీ?
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. సంప్రదాయ సాగు నుంచి ఆధునిక శైలిలో పంటలు పండించే పద్ధతి పెరుగుతోంది. యంత్రాలకు తోడు డ్రోన్లు వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. విత్తనాలు వేయడం నుంచి ఎరువులు చల్లడం వరకు అన్ని రంగాల్లో డ్రోన్లు గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు డ్రోన్లు అందుబాటులో ఉంచాలని ఆగ్రోస్ నిర్ణయించినా, ఆచరణలో మాత్రం అమలుకావడంలేదు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా వాటిని అందుబాటులోకి తెచ్చి రైతులకు అద్దెకు ఇవ్వాలని భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలుంటే, వాటన్నింటిలోనూ డ్రోన్లు అందుబాటులో ఉంచాలనుకున్నారు. కానీ ఇప్పటికీ డ్రోన్లతోపాటు వ్యవసాయ యంత్రాలను కూడా రైతులకు సబ్సిడీపై ఇవ్వడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణపై మార్గదర్శకాలను ఖరారు చేయడంలోనే వ్యవసాయశాఖలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్న విమర్శలున్నాయి. దుక్కు యంత్రాలు కూడాఇచ్చే దిక్కులేదా? రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. వ్యవసాయంలో విస్తీర్ణ పరంగా దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఉత్పత్తి కూడా అదే స్థాయిలో ఉంది. ఇప్పుడు వానాకాలం సీజన్ మొదలై రైతులు విత్తనాలు చల్లుతూ, దుక్కులు చేస్తున్నారు. ఈ కీలకమైన సమయంలో రైతులు వ్యవసాయ పనిముట్ల కోసం ఎదురు చూస్తున్నారు. దుక్కు యంత్రాలు, తైవాన్ స్ప్రేయర్ వంటివి సైతం రైతులకు సబ్సిడీపై ఇచ్చే దిక్కు కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఒక్కో డ్రోన్ రూ.10 లక్షలు... ఇప్పటివరకు వ్యవసాయ యాంత్రీకరణలో ఇకపై డ్రోన్లను కూడా ఇవ్వాలని నిర్ణయించారు. డ్రోన్ ఆధారిత స్ప్రే పద్ధతుల వల్ల తక్కువ మొత్తంలో నీరు, పురుగుమందులు అవసరమవుతాయి. విత్తనాలు చల్లడంలో డ్రోన్లను వినియోగించడం వల్ల కచ్చితత్వం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎరువులను డ్రోన్ల ద్వారా చల్లితే ప్రతీ మొక్కకు చేరుతుందని భావిస్తున్నారు. ఒక్కో డ్రోన్ ధర రూ.10 లక్షలు అవుతుందని అంచనా వేశారు. అయితే సీజన్ మొదలైనా సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల సరఫరాపై స్పష్టత రాలేదు. కూలీలు దొరక్క రైతుల అవస్థలు దుక్కు యంత్రాలను బయట మార్కెట్లో కొనాలంటే ధరలు భరించడం కష్టం. మరోవైపు కూలీల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాది నుంచి కూలీలను తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సబ్సిడీపై యంత్రాలను ఇవ్వాలి. 2018 వరకు భారీగా ట్రాక్టర్లు సహా వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై ప్రభుత్వమే ఇచ్చింది. వ్యవసాయ యంత్రాలు తీసుకునే ఎస్సీ, ఎస్టీలకు ట్రాక్టర్లు సహా కొన్నింటిపై 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేసింది. ఐదేళ్లుగా ఈ పథకం నిలిచిపోవడంతో రైతు లు ఇబ్బందులు పడుతున్నారు. కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏమయ్యాయి? వరి సాగు భారీగా ఉండటంతో రాష్ట్రంలో కోత యంత్రాలకు కొరత ఏర్పడుతోంది. ఒక్కసారే కోతకు రావడంతో మిషిన్లు అందుబాటులో లేక అనేక సార్లు వడగండ్లకు, వర్షాలకు పంట నష్టపోతున్నారు. దీంతో ఓలా, ఊబర్ మాదిరి వ్యవసాయానికి సంబంధించిన భారీ కోత, నాటు మిషిన్లు బుక్ చేసుకుంటే అద్దెకు పంపించేలా కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని గతంలో వ్యవసాయశాఖ చెప్పింది. అయితే ఇంతవరకు కస్టమ్ హైరింగ్సెంటర్లు ఎలా ఉండాలి? ఎవరి ఆధ్వర్యంలో నడిపించాలనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. -
గ్రామీణ యువతకు కిసాన్ డ్రోన్స్
సాక్షి, అమరావతి: సాగులో సూక్ష్మ ఎరువుల వినియోగం పెంచడం ద్వారా కూలీల వెతలకు చెక్ పెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో భారత ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) అందిస్తున్న కిసాన్ డ్రోన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే 60 మంది నిరుద్యోగ యువత, పొదుపు సంఘాలకు శిక్షణ ఇచ్చి డ్రోన్లను అందజేసింది. రానున్న వ్యవసాయ సీజన్లో మరో 65 కిసాన్ డ్రోన్స్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.తొలి దశలో రాష్ట్రంలో 160 డ్రోన్స్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. డిమాండ్‌ను బట్టి మరింత మందికి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గతేడాది 60 డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలను అందించింది. ఈ ఏడాది మరో 65 మందికి ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకోసం ఎంపిక చేసిన నిరుద్యోగ యువతకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తోంది. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై.. 18–50 సంవత్సరాల మధ్య వయసు వారు శిక్షణకు అర్హులు.మహిళలకు 15 రోజుల శిక్షణఆసక్తి, అర్హత ఉన్న వారికి 15 రోజులపాటు చెన్నైలోని దక్ష, మైసూర్‌లోని జనరల్ ఏరోనాటిక్స్ సంస్థల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కోసం రూ.50 వేలు ఖర్చవుతుండగా.. రూ.15 వేలు అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.35 వేలు ఇఫ్కో భరిస్తుంది. అదే పొదుపు సంఘాల మహిళలకైతే శిక్షణ ఉచితంగానే అందిస్తుంది. ఇప్పటికే ఇఫ్కో ద్వారా 70 మంది గ్రామీణ యువతతోపాటు 12 మంది పొదుపు సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి కాగానే డ్రోన్ పైలట్ లైసెన్స్ జారీ చేస్తున్నారు.రూ.15 లక్షల విలువైన డ్రోన్, ఎలక్ట్రిక్ వాహనంలైసెన్స్ పొందిన అభ్యర్థులకు రూ.15 లక్షల విలువైన అత్యాధునిక డ్రోన్‌తో కూడిన ఎలక్ట్రిక్ ఆటోలను అందిస్తున్నారు. యూనిట్ వ్యయంలో రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లిస్తే చాలు. ఎలక్ట్రిక్ వెహికల్‌పై రెండు రోజులపాటు క్షేత్రస్థాయి శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇందుకోసం మరో రూ.16 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 20 వేల ఎకరాల్లో పిచికారీ లేదా ఐదేళ్ల తర్వాత గానీ డ్రోన్, ఎలక్ట్రిక్ వాహనం అభ్యర్థుల పేరిట బదిలీ అయ్యేలా ఏర్పాటు చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఈ మేరకు ఇఫ్కోతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.జూన్‌లో అర్హుల గుర్తింపు2024–25 సీజన్లో మరో 65 మందికి కిసాన్ డ్రోన్స్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ మొదటి వారం నుంచి అర్హులైన వారిని గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వారికి దశల వారీగా శిక్షణ ఇచ్చిన తర్వాత ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో కిసాన్ డ్రోన్స్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.స్వయం ఉపాధి పొందుతున్నాంనేను బీ ఎస్సీ కంప్యూటర్స్ చేశా. ఇఫ్కో ద్వారా మద్రాస్ ఐఐటీలో డ్రోన్ పైలట్‌గా శిక్షణ పొందా. ఇఫ్కోతో చేసుకున్న ఒప్పందం మేరకు రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించగా.. ఆ సంస్థ నాకు రూ.15 లక్షల విలువైన కిసాన్ డ్రోన్, ఎలక్ట్రికల్ వాహనం ఇచ్చింది. రైతు పొలాల్లో అద్దె ప్రాతిపదికన పురుగు మందులు, నానో ఎరువులు పిచికారీ చేసినందుకు ఎకరాకు రూ.300 తీసుకుంటున్నా. – కయ్యూరు మహేష్, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లాఖర్చు తగ్గుతోందిఇఫ్కో ద్వారా శిక్షణ పొంది కిసాన్ డ్రోన్ తీసుకున్నాం. గతంలో ఎకరాకు పిచికారి చేయాలంటే రూ.500 నుంచి రూ.600 వరకు కూలీలకు చెల్లించాల్సి వచ్చేది. కూలీలు దొరక్క చాలా ఇవ్వండి పడేవాళ్లం. కిసాన్ డ్రోన్‌తో 25 ఎకరాల వరకు పిచికారి చెయగలుగుతున్నాం. ఇప్పుడు కేవలం 4–5 నిముషాల్లో ఎకరా విస్తీర్ణంలో పిచికారీ పూర్తవుతోంది. వృథా కూడా ఏమీ ఉండటం లేదు. ఎకరాకు రూ.300 వరకు ఆదా అవుతోంది. – కొక్కిరాల వెంకట సుబ్బారావు, దుగ్గిరాల, బాపట్ల జిల్లారైతు ఖర్చులు తగ్గించడమే లక్ష్యంనిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించాలన్న సంకల్పంతోనే ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా, డీఏపీ ఎరువులకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వాటి వినియోగం పెరగాలంటే డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. గతేడాది 60 మందికి శిక్షణ ఇవ్వగా.. ఈ ఏడాది మరో 65 మందికి కిసాన్ డ్రోన్స్‌తో కూడిన ఎలక్ట్రికల్ వాహనాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం – టి.శ్రీధర్‌రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
డిప్యూటీ సీఎం బూడి హత్యకు కుట్ర
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు ఇంటి వద్ద డ్రోన్ కెమెరాతో నలుగురు రెక్కీ నిర్వహించడం వివాదాస్పదమైంది. గ్రామస్తులు వారిని పట్టుకుని, తమ నేత బూడి ముత్యాలనాయుడుç ßæత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులకు అప్పగించారు. ముత్యాలనాయుడు ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ జోక్యం చేసుకోవడంతో వివాదం ముదిరింది.రాత్రి వరకు హైడ్రామా నడిచింది. దేవరాపల్లి మండలం తారువలోని బూడి ఇంటి చుట్టూ శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారు. అరగంటకు పైగా ముత్యాలనాయుడు ఇంటి పరిసరాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు డ్రోన్ ఆపరేటర్లను ఆరా తీశారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ డి.నాగేంద్ర గ్రామానికి చేరుకుని డ్రోన్, బీజేపీ జెండా సహా హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ ఆపరేటర్ చిలకల పాండురంగారావు, అసిస్టెంట్ ఆపరేటర్ పొట్టి సాయికృష్ణ, చొప్ప గంగాధర్, కొమర అప్పారావులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. తన హత్యకు కుట్ర పన్నారని, అనుమతులు లేకుండా తన ఇంటి చుట్టూ డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారని ముత్యాలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రమేష్ ఎదురుదాడి విషయం తన అనుచరుల ద్వారా తెలుసుకున్న సీఎం రమేష్ డ్రోన్ ఆపరేటర్లను తారువ గ్రామస్తులపై ఎదురు ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. సాయంత్రం 4 గంటల సమయంలో అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో దేవరాపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన బూడి వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముత్యాలనాయుడు ఇంటి వద్దకు వెళ్లేందుకు సీఎం రమేష్ సిద్ధం కాగా.. పోలీసులు నిరాకరించారు. రౌడీమూకల మాదిరిగా పోలీసులను నెట్టుకుంటూ తన వెంట ఉన్న పచ్చ దండుతో రమేష్ తారువకు వెళ్లారు. ముత్యాలనాయుడి మరో ఇంటి వద్దకు (ఆ ఇంట్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముత్యాలనాయుడి కుమారుడు రవికుమార్ ఉంటున్నారు) వెళ్లగా.. రమేష్ వస్తున్న విషయం తెలుసుకుని ముత్యాలనాయుడు ఆ ఇంటి వద్ద తన అనుచరులతో బైఠాయించారు. ఈ ఇల్లు కూడా తన పేరిట ఉందని, ఎవరొస్తారో చూస్తానని హెచ్చరించారు. విషయం తెలుసుకుని అవాక్కయిన సీఎం రమేష్ తన అనుచరులతో కలిసి హనుమాన్ ఆలయం ముందు మెట్లపై కూర్చుండి పోయారు. తారువ గ్రామస్తులు, వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని తమ ఊళ్లో రౌడీ రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు వెళ్లిపోవాలని కోరడంతో సీఎం రమేష్ పోలీసు జీపు ఎక్కారు. దీంతో రమేష్ ఎక్కిన జీపునకు అడ్డంగా గ్రామస్తులు బైఠాయించారు. గూండాగిరీ చేసిన సీఎం రమేష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో అరగంటకు పైగా సీఎం రమేష్ ఎక్కిన పోలీసు వాహనం నిలిచిపోయింది. ఆ వాహనాన్ని గ్రామస్తులు చుట్టముట్టడంతో సీఎం రమే‹Ù, అతని అనుచరవర్గం భయంతో వణికిపోయారు. పోలీసులు అతికష్టంపై రమేష్ ఎక్కిన వాహనాన్ని ముందుకు పంపించగా.. గ్రామస్తులు మాత్రం ఊరి పొలిమేర దాటే వరకు వెంబడించారు. -
రంగంలోకి డ్రోన్లు.. పోలింగ్ బూత్‌లలో పటిష్ట నిఘా
డెహ్రాడూన్: రానున్న లోక్‌సభ ఎన్నికలకు పటిష్ట నిఘాను ఏర్పాటు చేస్తున్నారు ఉత్తరాఖండ్ పోలీసులు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలు, వాటి సమీప పరిసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఇక్కడ మొత్తం 5 లోక్‌సభ స్థానాలున్నాయి. అన్నింటికీ ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది. "2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలలో అత్యంత మారుమూల ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లు, పరిసర ప్రాంతాలను ఉత్తరాఖండ్ పోలీసులు డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తారు" అని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఉత్తరాఖండ్‌లోని క్లిష్ట భౌగోళిక పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాలలో సీసీటీవీ కెమెరాలు, నిఘా, ఫోటో, వీడియోగ్రఫీ వంటి వాటి కష్ట సాధ్యమని పేర్కొంది. ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘాను పర్యవేక్షించనున్నారు. ఈ డ్రోన్లు పంపిన ప్రత్యక్ష దృశ్యాలను స్కాన్ చేయడానికి రాష్ట్ర పోలీసులు తాత్కాలిక కంట్రోల్ రూమ్‌ను కూడా ప్రారంభించారు. "డ్రోన్ పంపిన చిత్రాలు, వీడియోలను ఎప్పకప్పుడు పర్యవేక్షిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, కార్యకలాపాలు గుర్తించిన వెంటనే ఆ సమాచారం పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్న ఎన్నికల కార్యకలాపాల కేంద్రానికి వెళ్తుంది" అని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వివరించింది. -
డ్రోన్ షో ద్వారా ‘హీరమండి: ది డైమండ్ బజార్’ ప్రత్యేక విడుదల తేదీ (ఫొటోలు)
-
సీఎం వైఎస్ జగన్ బస్ యాత్ర డ్రోన్ విజువల్స్
-
పక్షుల నియంత్రణకు స్ప్రేడ్రోన్
విమానాల రాకపోకలకు పక్షులు తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తున్నాయి. దీంతో తూర్పు నౌకాదళంలోని వైమానిక బృందం వినూత్న విధానాల్ని అమల్లోకి తీసుకొచ్చింది. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం, నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్‌ఎస్‌డేగా పక్కపక్కనే ఉన్నాయి. వీటి పక్కనే మడ అడవులు విస్తరించి ఉన్నాయి. అక్కడ నుంచి పక్షులు రాకపోకలు పెరుగుతుండటంతో.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నేవల్ ఫ్లైట్స్ కూడా ఎగిరేందుకు అంతరాయం కలుగుతున్న తరుణంలో ఈ సమస్యని పరిష్కరించేందుకు నేవల్ ఏవియేషన్ అధికారులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. స్ప్రే డ్రోన్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐఎన్ఎస్ డేగా నుంచి వీటి ఆపరేషన్స్ నిర్వహించి.. పక్షులు ఎగరనీయకుండా నియంత్రించనున్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న చెట్లపై నీటిని స్ప్రే చేస్తే.. రన్‌వే సమీపంలోకి పక్షులు రాకుండా నిలువరించగలమనీ.. తద్వారా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడదని తూర్పు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. – సాక్షి, విశాఖపట్నం -
అద్దంకి సిద్ధం సభలో డ్రోన్ కలకలం
సాక్షి, బాపట్ల: ఆదివారం అద్దంకి మేదరమెట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలో డ్రోన్ కలకలం రేగింది. మంత్రి అంబటి రాంబాబు ప్రసంగిస్తున్న సమయంలో.. సభా ప్రాంగణంలో ఒకవైపు డ్రోన్ ఎగురుతూ కనిపించింది. అప్రమత్తమైన నిర్వాహకులు వెంటనే డ్రోన్ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు అనుమతి లేకుండా డ్రోన్ ఎగురుతోందని, ఎవరో దాన్ని నియంత్రిస్తున్నారని సభా వేదికపై నుంచే ప్రకటించారు. ఆ సమయంలో సభకు హాజరైన వారు ఒక దిక్కుకు చూడటం కనిపించింది. అయితే ఆ అవాంతరం ఒకట్రెండు నిమిషాలకు మించి జరగలేదు. డ్రోన్ విషయాన్ని ప్రకటించిన తరువాత అంబటి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక కాసేపటికే మైక్ అందుకుని ‘‘ఏయ్ పప్పూ... ఎక్కడో దూరంగా ఉండి.. డ్రోన్‌ను పంపించడం కాదు.. దమ్ముంటే ఇక్కడికి రా. కార్యకర్తల నినాదాలతోనే ఈ షర్ట్ తడిచిపోవడం ఖాయం’’ అంటూ వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నారా లోకేష్‌ను ఉద్దేశించి సవాలు విసిరారు. -
‘నమో డ్రోన్ దీదీ’ అంటే ఏమిటి? ఎవరికి ప్రయోజనం?
వ్యవసాయం ఎంతో శ్రమతో కూడుకున్నది. అయితే ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో ఇది సులభతరంగా మారుతోంది. మరోవైపు వ్యవసాయరంగంలో మహిళల ప్రాధాన్యత పెంచేందుకు ప్రభుత్వం నూతన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపధ్యంలో రూపొందినదే ‘నమో డ్రోన్ దీదీ’ పథకం. వ్యవసాయ పనులకు ‘నమో డ్రోన్ దీదీ’ పథకం మరింత సహయకారిగా మారింది. ఈ పథకాన్ని దేశంలో తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దీనిని విస్తరించబోతోంది. ఈ నేపధ్యంలోనే ఈ పథకంలో భాగస్వాములైన 300 మంది మహిళలు మార్చి 11న ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట తమ అనుభవాలను పంచుకోనున్నారు. అలాగే వారు డ్రోన్‌ను ఎగురవేసే విధానాన్ని కూడా నాటి కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం న్యూఢిల్లీలోని పూసా సెంటర్లో నిర్వహించనున్నారు. ఆరోజు ప్రధాని మోదీ వెయ్యమంది మహిళలకు డ్రోన్లను అందజేయనున్నారు. డ్రోన్‌తో పాటు బ్యాటరీతో పనిచేసే వాహనాన్ని కూడా మహిళలకు ఇవ్వనున్నారు. గుజరాత్‌లోని భరూచ్ జిల్లాకు చెందిన కృష్ణ హరికృష్ణ పటేల్ డ్రోన్ దీదీగా పనిచేస్తున్నారు. డ్రోన్ల సాయంతో 45 నిమిషాల్లో వ్యవసాయ పనులు పూర్తి చేయవచ్చని తెలిపారు. డ్రోన్ ఆపరేట్ చేస్తూ పంటలను పర్యవేక్షించడం, పురుగుమందులు, ఎరువులు పిచికారీ చేయడం, విత్తనాలు వెదజల్లడం లాంటి పనులు సులభంగా చేయవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం 450 మంది డ్రోన్ దీదీలు 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని వ్యవసాయ కార్యకలాపాలలో తమ సేవలను అందిస్తున్నారు. ఈ ఏడాది వెయ్యి మంది మహిళలను డ్రోన్ దీదీలుగా తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డ్రోన్ పైలట్లుగా మారాలనుకుంటున్న గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. లైసెన్స్ పొందిన డ్రోన్ దీదీ ఒక సీజన్లో రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. -
Sharmila Yadav: డ్రోన్ దీదీ
హరియాణాకు చెందిన షర్మిల యాదవ్ పెద్ద చదువులు చదువుకోవాలని కల కన్నది. అయితే ఇంటర్మీడియేట్ పూర్తికాగానే ‘ఇక చాలు’ అన్నారు తల్లిదండ్రులు. పెళ్లి అయిన తరువాత కుటుంబ బాధ్యతల్లో తలమునకలైనప్పటికీ షర్మిలకు చదువుపై ఉన్న ఇష్టం మాత్రం పోలేదు. ‘డ్రోన్ సిస్టర్’ ప్రోగ్రాంలో భాగంగా మహిళలకు డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇస్తున్నారని తెలుసుకున్న షర్మిల ట్రైనింగ్ కోర్సులో చేరింది. ఫస్ట్ టెస్ట్‌లో ఫెయిల్ అయింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ‘మరో ప్రయత్నం చెయ్యి’ అని ప్రోత్సహించారు. సెకండ్ టైమ్ టెస్ట్ పాస్ అయిన షర్మిల ఇప్పుడు సర్టిఫైడ్ డ్రోన్ పైలట్‌గా గుర్తింపు పొందింది. ఎలాంటి టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా మాస్టరింగ్ కంట్రోల్స్, హైట్ అండ్ స్పీడ్ రీడింగ్, స్మూత్ టేక్–ఆఫ్, ల్యాండింగ్స్...మొదలైన సాంకేతిక విషయాలపై అవగాహన ఏర్పర్చుకుంది. ఇప్పుడు ఆమెను అందరూ ‘డ్రోన్ దీదీ’ అని పిలుస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించిన పనుల్లో డ్రోన్ పైలట్‌గా చేతి నిండా పనితో మంచి ఆదాయన్ని అర్జిస్తోంది. వ్యవసాయ భూముల్లో షర్మిల యాదవ్ డ్రోన్ ఆపరేట్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
వావ్.. మేదరమెట్ల సిద్ధం సభా ప్రాంగణం డ్రోన్ విజువల్స్
వైఎస్సార్సీపీ జెండాలతో.. అశేష జన వాహిని నడుమ సీఎం జగన్ నినాదాలతో గత మూడు సిద్ధం సభలు హోరెత్తడం చూశాం. ఇక ఆఖరి సిద్ధం సభ అంతకు మించి ఉండబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం నాడు బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్లలో వైఎస్సార్సీపీ సిద్ధం సభ జరగబోతోంది. గత ఐదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో చెబుతూనే.. రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తామో సీఎం జగన్ ఈ వేదిక నుంచి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అలాగే.. ఎన్నికలకు ఈ వేదిక నుంచే సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం డ్రోన్ విజువల్స్ నెట్టింట పలువురిని ఆకట్టుకుంటున్నాయి.. -
కోనసీమలో డ్రోన్ హబ్ ప్రారంభం
సాక్షి,అమలాపురం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ హాబ్ను కలెక్టర్ శుక్లా మంగళవారం ప్రారంభించారు. అమలాపురం స్టేడియంలో 21 ఫ్లయింగ్ డ్రోన్లను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ..రూ.2 కోట్లతో దేవగుప్తం పీఏసీఎస్ 21 డ్రోన్లను కొనుగోలు చేసిందన్నారు. ఒక్కొక్క డ్రోన్ 6–8 నిమిషాల్లో ఒక ఎకరానికి స్ప్రేయింగ్ ప్రక్రియను పూర్తి చేస్తుందని తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్‌గా కొనుగోలు చేసిన ఈ డ్రోన్స్‌ను అద్దె ప్రాతిపదికన రైతులకు అందుబాటులో తెస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు స్పేయర్ ఎకరాకు రూ.వెయ్యి ఖర్చుతో పిచికారీ చేస్తున్నారని, డ్రోన్ టెక్నాలజీతో ఎకరాకు రూ.300 అవుతుందన్నారు. రైతులు బృందంగా ఏర్పడితే రూ.10 లక్షలు విలువైన వ్యవసాయ డ్రోన్‌ను కొనుగోలు చేయవచ్చన్నారు. దేవగుప్తం పీఏసీఎస్ చైర్మన్, రాష్ట్ర అగ్రి మిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి) మాట్లాడుతూ ప్రతి మండలంలో ఒక డ్రోన్ ఉండేలా ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు. వైఎస్సార్ హార్టీకల్చర్ వర్సిటీ సభ్యుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినా««ద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సర్వర్ డ్రోన్ సుందరం
కాఫీ హోటల్ ఏదైనా సర్వర్ గారు సుందరమే అయి ఉంటాడని గతంలో అనుకునేవారు. ఎందుకంటే టిఫిన్ హోటల్స్ తమిళులే నడిపేవారు కాబట్టి. ఇప్పుడు సర్వర్ గారి అడ్రస్ గల్లంతయ్యేలా ఉంది. మనుషులకు జీతాలు ఇవ్వడం కంటే ఒక డ్రోన్‌తో మేనేజ్ చేయొచ్చని కోల్‌కతా రెస్టరెంట్ డిసైడ్ అయ్యింది. వాన కోసం ఆకాశం వైపు చూడొచ్చుగాని కాఫీ కోసం కూడా చూడొచ్చా? చూడొచ్చు. ఆకాశం నుంచి కాఫీ ఎగిరొచ్చి చేతికి అందుతుంది. ఇది కోల్‌కతా సాల్ట్‌లేక్ సిటీ ఏరియాలోని ‘కోల్‌కతా 64’ అనే రెస్టరెంట్ వారు తమ కస్టమర్లను ఆకర్షించడానికి వేసిన సాంకేతిక ఎత్తుగడ. ఆకర్షణ. రెస్టరెంట్ లోపల కూచున్న వారికి సర్వర్లు కాఫీ అందించినా బయట తమకు తోచిన చోటులో కూచుని కాఫీని ఆస్వాదించాలంటే డ్రోన్ సుందరం గారే కాఫీని అందిస్తారు. ఈ వీడియో ఇన్‌స్టాలో ప్రత్యేక్షం కాగానే ‘ఇదేదో బాగానే ఉంది’ అని చాలామంది మెచ్చుకుంటున్నారు. అయితే ఈ యంత్రం మనిషిని మాయం చేస్తున్నట్టే. మన దేశంలో మధ్యతరగతి జీవులకు కాఫీ హోటళ్లు, అందులో పని చేసే సర్వర్లు జీవితంలో భాగం. అందుకే సినిమాల్లో, సాహిత్యంలో సర్వర్లు కనపడతారు. కె.బాలచందర్ తీసిన ‘సర్వర్ సుందరం’లో నగేశ్ నటించి పేరు గడించాడు. ‘శుభలేఖ’లో చిరంజీవి కూడా ‘వెయిటర్’ అనబడు ‘సర్వరే’. ఇటీవలి కాలంలో ఆనంద్ దేవరకొండ నటించిన ‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’ టిఫిన్ సెంటర్ నేపథ్యంలో ఓనర్ కమ్ సర్వర్‌గా హీరో చేసే స్ట్రగుల్‌ను చూపుతుంది. ఏమైనా ఈ డిజిటల్ ఏజ్‌లో ‘మాయమవుతున్నాడమ్మ మనిషి’ అనుకోక తప్పదు. -
ఏం టెక్నాలజీ గురూ.. ఇకపై గొడుగుల్ని చేత్తో పట్టుకునే పనిలేదు!
ఎండ ధాటిని తట్టుకోవడానికైనా, వానలో తడవకుండా ఉండటానికైనా గొడుగు తప్పనిసరి అవసరం. చాలా దూరం నడవాల్సి వచ్చేటప్పుడు గొడుగును చేత్తో పట్టుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది. ఒక్కోసారి గాలి జోరు పెరిగేటప్పుడు చేతిలోని గొడుగును నియంత్రించడం కాస్త కష్టంగా కూడా ఉంటుంది. ఇకపై అలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ఇది ఎగిరే గొడుగు. దీన్ని చేత్తో పట్టుకోవాల్సిన పనిలేదు. ఎక్కడకు వెళ్లినా మనల్నే అనుసరిస్తూ తల మీద నీడపడుతుంది. తలకు ఎండధాటి తాకనివ్వదు, వానకు తడవనివ్వదు. ఇది ఆషామాషీ గొడుగు కాదు, ‘ఫ్లైయింగ్ అంబ్రెల్లా డ్రోన్’. త్రీడీ ప్రింటింగ్ ద్వారా ముద్రించిన కార్బన్ ఫైబర్ గొట్టాలు తదితర విడిభాగాలతో దీనిని రూపొందించారు. కాబట్టి ఇది చాలా తేలికగా ఉంటుంది. వాయిస్ కంట్రోల్ ద్వారా జీపీఎస్ టెక్నాలజీతో బయటకు వెళ్లినప్పుడల్లా ఇది నిరంతరం తలకు నీడ పడుతూ ఉంటుంది. యూరోపియన్ సాఫ్ట్వేర్ కాన్ఫరెన్స్ ‘ఐ బిల్డ్ స్టఫ్’కు చెందిన నిపుణులు ఈ ఎగిరే గొడుగును ప్రయోగాత్మకంగా రూపొందించారు. -
30 కిలోల ఆహారంతో ఇంటిపై కూలిన డ్రోన్!
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఆహారాన్ని తరలిస్తున్న ఒక డ్రోన్ కలకలం సృష్టించింది. సౌత్ సిటీలోని జి బ్లాక్ మీదుగా ఆహారాన్ని తీసుకువెళుతున్న ఆ డ్రోన్ హఠాత్తుగా ఒక ఇంటిపై పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 30 కిలోల బరువున్న ఆహార పదార్థాలు ఆ ఇంటిపై పడటంతో పాటు ఇంటి బాల్కనీ, డిష్ యాంటెన్నా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో ఎవరూ ఇంటి బాల్కనీలో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. అకస్మాత్తుగా హౌస్ నంబర్ జి-68 పైనుండి పెద్ద శబ్దం వచ్చింది. ఇంటి యజమాని బయటకు వచ్చి చూసేసరికి డ్రోన్ శిథిలాలు, మరికొన్ని వస్తువులు అక్కడ పడి ఉన్నాయి. ఆహార సరఫరా కోసం డ్రోన్ల ట్రయల్ జరుగుతున్నదని. ఇందుకోసం అధికారుల నుంచి అనుమతులు కూడా తీసుకున్నట్లు ఆ కంపెనీ ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. ఇంటికి జరిగిన నష్టానికి పరిహారం అందజేస్తామని ఆ కంపెనీ తెలిపింది. మరోవైపు ఈ ప్రాంతంలో ప్రధాని పర్యటన సందర్భంగా డ్రోన్లను ఎగురవేయడంపై జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. ఇదే సమయంలో డ్రోన్లను ఎగురవేసేందుకు ఆ కంపెనీకి అనుమతి ఎలా లభించిందనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అయితే నిషేధ ఉత్తర్వుల గురించి తెలుసుకున్న డ్రోన్ పైలట్ ఈ భవనంపై అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉదంతంపై ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం డ్రోన్లోని సాంకేతిక లోపం కారణంగా అది కూలిపోయింది. ఈ ఘటనపై సెక్టార్ 50 పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ పాడైన డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నమన్నారు. అలాగే సదరు కంపెనీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ ఇచ్చేందుకు ఇస్రో అనుబంధ ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)’తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (టీఎస్‌ఏఏ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్‌ల సమక్షంలో టీఎస్‌ఏఏ సీఈవో ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాశ్ చౌహాన్లు దీనిపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఎన్ఆర్ఎస్సీ శాస్త్రవేత్తలు డ్రోన్ పైలటింగ్, డ్రోన్ డేటా మేనేజ్మెంట్, డేటా అనాలసిస్, ప్రాసెసింగ్, మ్యాపింగ్‌లపై ఏవియేషన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న డ్రోన్ పైలట్లకు 15 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ అధికారులకు కూడా శిక్షణ: సీఎం అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిందని, పొలాల్లో ఎరువులు, పురుగుమందులు చల్లేందుకు రైతులు డ్రోన్లను వినియోగిస్తున్నారని ఈ భేటీలో అధికారులు వివరించారు. కొన్నిచోట్ల స్వయం సహాయక సంఘాలు డ్రోన్లను ఉపాధి మార్గంగా ఎంచుకున్నాయని తెలిపారు. దీంతో ఉన్నతస్థాయి నుంచి తహసీల్దార్ల వరకు ప్రభుత్వ అధికారులకు కూడా డ్రోన్లపై అవగాహన కలిగేలా శిక్షణను ఇవ్వాలని రేవంత్ సూచించారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. దేశంలోనే వినూత్నంగా తెలంగాణలో డ్రోన్లపై శిక్షణ కోర్సు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. శాటిలైట్, రిమోట్ సెన్సింగ్, అంతరిక్ష వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఎన్ఆర్ఎస్సీ.. డ్రోన్ టెక్నాలజీని సాంకేతికపరంగా మరింత పకడ్బందీగా వినియోగించుకునేందుకు శిక్షణలో భాగస్వామ్యం అవుతోందని వివరించారు. దేశంలో 12సార్లు బెస్ట్ ఏవియేషన్ అవార్డు అందుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సేవలను కొనియాడారు. శిక్షణకు స్థలం కేటాయించండి ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లోనే డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇస్తున్నామని, అక్కడ నెలకొన్న రద్దీ దృష్ట్యా హైదరాబాద్ పరిసరాల్లో ప్రత్యేకంగా డ్రోన్ పైలట్ల శిక్షణ కోసం స్థలం కేటాయించాలని ఏవియేషన్ అకాడమీ అధికారులు సీఎం రేవంత్‌ను కోరారు. దీనిపై స్పందించిన సీఎం.. డ్రోన్ పోర్టు ఏర్పాటుకు ఎంత స్థలం అవసరం? ఏమేం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే వివరాలు తెలుసుకున్నారు. పైలట్ల శిక్షణతోపాటు డ్రోన్ తయారీ కంపెనీలు ట్రయల్స్ నిర్వహించుకునేందుకు డ్రోన్ పోర్టు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. డ్రోన్ పోర్టుకు అవసరమైన 20 ఎకరాలను ఫార్మాసిటీ వైపు అన్వేíÙంచాలని అధికారులను ఆదేశించారు. ఏవియేషన్ నిబంధనల ప్రకారం అభ్యంతరం లేని ప్రాంతంలో ఈ స్థలం కేటాయించాలని సూచించారు. వరంగల్ ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ వరంగల్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని.. పాడైన పాత రన్‌వేలను కొత్తగా నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వరంగల్ ఎయిర్‌పోర్టు నుంచి వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని.. ఏవైనా అడ్డంకులు ఉంటే పరిష్కరించాలని సూచించారు. కొత్తగూడెం, భద్రాచలం పరిసర ప్రాంతంలోనూ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందని, అక్కడున్న అవకాశాలను పరిశీలించి ఎయిర్‌పోర్టు అథారిటీతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. సీఎంతో నెదర్లాండ్స్ రాయబారి భేటీ సాక్షి, హైదరాబాద్: భారత్‌లో నెదర్లాండ్స్ రాయబారి మెరిసా గెరార్డ్స్ బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఇరుదేశాల సంబంధాలపై మాట్లాడుకున్న ఇద్దరూ తెలంగాణలో అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చించారని సీఎంవో వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో వ్యవసాయ రంగాభివృద్ధికి అపార అవకాశాలు, అగ్రికల్చర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో నెదర్లాండ్స్ భాగస్వామ్యం తదితర అంశాలు వీరిద్దరి భేటీలో చర్చకు వచ్చాయి. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఏకధాటిగా 40 గంటలు ఎగిరే డ్రోన్.. ఇంకెన్నో ప్రత్యేకతలు
అమెరికా, భారత్ మధ్య ‘ఎంక్యూ-9బీ ప్రిడేటర్ డ్రోన్ల’పై ఒప్పందం చివరి దశకు చేరుకుంది. దాదాపు 4 బిలియన్ల డాలర్ల(రూ.33 వేలకోట్లు) విలువైన ఒప్పందంలో భారత్‌కు ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్ల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈ డీల్ అమెరికా-భారత వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేయనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎంక్యూ-9బీ ప్రిడేటర్ డ్రోన్ల ప్రత్యేకతలు ఇవే.. సముద్రపు నిఘా కోసం సీ గార్డియన్ డ్రోన్లు, భూసరిహద్దు పరిరక్షణ నిఘా కోసం స్కై గార్డియన్ డ్రోన్లను ప్రత్యేకంగా వినియోగించుకోవచ్చు. ఈ సాయుధ డ్రోన్లకు ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయి. ఫైటర్జెట్లు చేయగలిగే పనులు సైతం ఇవి చేస్తాయి. వీటికి హెల్ఫైర్ క్షిపణులు అమర్చి ఉంటాయి. శత్రువులను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, మందుగుండు సామగ్రితో విధ్యంసం సృష్టిస్తాయి. ఈ డ్రోన్లను నిఘా సామర్థ్యం ఉంటుంది. మానవతా సహాయం, విపత్తుల సమయంలో రక్షణ చర్యలు, గాలింపు చర్యలు, గాలో ముందస్తు హెచ్చరికలు, ఎలక్ట్రానిక్ వార్‌పేర్, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ల్లో ఈ డ్రోన్లను ఉపయోగించవచ్చు. మాదకద్రవ్యాల అక్రమరవాణా, పైరసీ వంటి పరిస్థితులను ఎదుర్కొవడానికి కూడా ఈ డ్రోన్లను మోహరించవచ్చు. ఇదీ చదవండి: జనవరిలో ‘తయారీ’కి కొత్త ఆర్డర్ల బూస్ట్ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏకధాటిగా 30 నుంచి 40 గంటలపాటు ఈ డ్రోన్లు గాల్లో ఎగరగలవు. 40,000 అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం వీటికి ఉంటుంది. -
అణు డ్రోన్‌ను పరీక్షించిన ఉత్తరకొరియా
సియోల్: ఉత్తరకొరియా అణ్వాయుధాల సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. తాజాగా పశ్చిమ సముద్ర జలాల్లో అణు దాడి చేసే సామర్థ్యమున్న డ్రోన్‌ను పరీక్షించినట్లు శుక్రవారం ప్రకటించింది. పోర్టులు, యుద్ధ నౌకలను ధ్వంసం చేసే సామర్థ్యం ఈ డ్రోన్‌కు ఉందని తెలిపింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌లు కలిసి ఈ వారంలో జెజు దీవికి సమీపంలో చేపట్టిన భారీ సైనిక విన్యాసాలకు స్పందనగానే తామీ పరీక్ష జరిపినట్లు చెప్పుకుంది. గత ఏడాది మొదటిసారిగా ఈ డ్రోన్‌ను పరీక్షించినట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పర్యవసానాలుంటాయని హెచ్చరించింది. -
మారుత్ డ్రోన్స్, స్కైడ్రైవ్ ఎంవోయూ
హైదరాబాద్: మారుత్ డ్రోన్స్, స్కైడ్రైవ్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. వ్యాపారాభివృద్ధితోపాటు, ఎలక్ట్రిక్ వెరి్టక్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటాల్) ఎయిర్‌క్రాఫ్ట్ (ఎయిర్ ట్యాక్సీ/ఫ్లయింగ్ ట్యాక్సీ) విభాగంలో అవకాశాల అన్వేషణకు ఇది వీలు కల్పించనుంది. తప్పనిసరి మినహాయింపులు, సరి్టఫికెట్లను సొంతం చేసుకోవడంతోపాటు, ప్రభుత్వ మద్దతు పొందడం, పైలట్, మెకానిక్‌లకు శిక్షణ, కీలక భాగస్వాముల గుర్తింపు విషయంలో మారుత్ డ్రోన్స్‌కు ఈ సహకారం తోడ్పడనుంది. మారుత్ డ్రోన్స్ ఇప్పటికే డ్రోన్ల కోసం అన్మ్యాన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఈ ఎంఎవోయూతో ఎయిర్‌ట్యాక్సీ కార్యకలాపాల్లోకీ విస్తరించనుంది. -
డ్రోన్ దాడులను ఖండించండి
ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో పోలీసులు జరిపిన డ్రోన్ దాడులను ఖండించాలని మావో యిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో సమత ఆదివారం లేఖ విడుదల చేశారు. ఆదివాసీ గ్రామాలైన మెట్టగూడ, ఎర్షన్పల్లి, బొట్టెంతోగు గ్రామాల్లోని పొలాలు, ఇళ్ల సమీపాల్లో ఈనెల 13న పోలీసులు డ్రోన్ల ద్వారా పెద్ద ఎత్తున బాంబులు వేశారని, నాలుగైదు కిలోమీటర్ల పరిధిలో పలు చోట్ల పెద్ద ఎత్తున అలజడి సృష్టించారని సమత పేర్కొన్నారు. ఇలాంటి దాడులను అన్ని వర్గాల ప్రజలు ఖండించాలని కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాక అటవీ ప్రాంతాలపై దాడులు అధికమయ్యాయని, అటవీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను దోచుకునే క్రమంలో అడ్డంకిగా ఉన్న ఆదివాసీలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకే క్యాంపులు ఏర్పాటు చేస్తూ వేల సంఖ్యలో పోలీసులను మోహరింపజేస్తున్నారని ఆరోపించారు. అటవీ సంపదను దోచుకెళ్లేందుకు అడవులను ధ్వంసం చేసి రోడ్లు, సెల్ టవర్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ఆదివాసీ గ్రామాలపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరపడం, అమాయకులను కొట్టడం, జైళ్లల్లో నిర్బంధించడం వంటి దుశ్చర్యలు సరైనవి కావని హితవు పలికారు. బీజాపూర్ జిల్లా మద్వేడి గ్రామంలో పోలీసు కాల్పుల్లో అరు నెలల పాప మృతి చెందగా, ఆమె తల్లికి గాయాలయ్యాయని, వైద్యం పేరుతో అదుపులోకి తీసుకొని జైళ్లో బంధించారని విమర్శించారు. ఈ దాడులన్నీ సీఎం విష్ణుదేవ్‌సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్‌శర్మ ఆదేశాల మేరకు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రజాప్రతినిధులు డ్రోన్ దాడులను ఖండించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇవి చదవండి: ప్రాణం తీసిన చైనా మాంజా! -
‘కిసాన్ డ్రోన్స్’ వచ్చేశాయ్
సాక్షి, అమరావతి: సాగులో కూలీల వెతలకు చెక్ పెట్టడమే కాకుండా తగిన మోతాదులో ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయడం ద్వారా సాగు ఖర్చుల్ని తగ్గించే ప్రధాన లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఆర్బీకే స్థాయిలో డ్రోన్స్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఆర్బీకే స్థాయిలోని సీహెచ్‌సీల్లో రైతులు, నిరుద్యోగ యువతకు ఉచితంగా డ్రోన్ పైలట్ శిక్షణ కూడా ఇస్తోంది. ఏపీ బాటలోనే ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. తొలి దశలో దేశవ్యాప్తంగా 2,500 డ్రోన్స్‌ను వినియోగంలోకి తీసుకు రావాలని ఇఫ్కో సంకల్పించింది. ఆంధ్రప్రదేశ్‌కు 160 డ్రోన్స్ ఇవ్వాలని నిర్ణయించగా.. ఇప్పటికే 70 డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలను అందించింది. మార్చి నెలాఖరు నాటికి మిగిలిన యూనిట్లను కూడా విడుదల చేయనుంది. మహిళలకు ఉచిత శిక్షణ ఏపీకి కేటాయించిన ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను నిరుద్యోగ యువతకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు కేటాయిస్తారు. వీటిని పొందగోరే అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామీణ యువతకు ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల వయసు 18–50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 15 రోజుల పాటు చెన్నైలోని దక్ష, మైసూర్‌లోని జనరల్ ఏరోనాటిక్స్ సంస్థల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ కోసం రూ.50 వేలు ఖర్చవుతుండగా.. రూ.15 వేలు అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.35 వేలు ఇఫ్కో భరిస్తుంది. అదే పొదుపు సంఘాల మహిళలకైతే శిక్షణ ఉచితంగానే అందిస్తుంది. శిక్షణ పూర్తికాగానే డ్రోన్ పైలట్ లైసెన్స్ జారీ చేస్తారు. లైసెన్స్ పొందిన అభ్యర్థులకు రూ.15 లక్షల విలువైన డ్రోన్‌తో కూడిన ఎలక్ట్రిక్ ఆటోలను అందిస్తారు. యూనిట్ అంచనా వ్యయంలో రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్‌పై 2 రోజుల పాటు ఆన్‌ఫీల్డ్ ట్రైనింగ్ కోసం అభ్యర్థులు మరో రూ.16 వేలు చెల్లించాల్సి ఉంటుంది. 20 వేల ఎకరాల్లో పిచికారీ చేస్తే ఓనర్షిప్ డ్రోన్ పొందిన అభ్యర్థులు కనీసం 20వేల ఎకరాల్లో పిచికారీ చేయడం గానీ.. ఐదేళ్ల పాటు నిర్వహించిన తర్వాత గానీ డ్రోన్, ఎలక్ట్రిక్ వాహనం ఓనర్ షిప్‌ను అభ్యర్థుల పేరిట బదిలీ అవుతుంది. ఎంపికైన అభ్యర్థులు ఈ మేరకుఇఫ్కోతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇఫ్కో ద్వారా 60 మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో 10 మంది స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు కూడా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి 70 డ్రోన్స్‌తో కూడిన ఎలక్ట్రికల్ వెహికల్స్ చేరుకున్నాయి. మార్చి నాటికి మిగిలిన వారికి సమకూర్చేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది. సూక్ష్మ ఎరువుల వినియోగం పెంచడమే లక్ష్యం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించాలన్న సంకల్పంతోనే ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా, డీఏపీ ఎరువులకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వాటి వినియోగం పెరగాలంటే డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. భవిష్యత్‌లో డిమాండ్‌ను బట్టి మరింత మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు డ్రోన్స్ అందుబాటులోకి తీసుకొస్తాం.– టి.శ్రీధర్‌రెడ్డి, ఏపీ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
డ్రోన్లు నడపాలనుకుంటున్నారా? ఉచిత శిక్షణ ఇదిగో!
అభివృద్ధి చెందిన దేశాలు చాలా పంటల్లో వందశాతం యాంత్రీకరణను సాధించాయి. సాగును సరళతరం చేస్తూ ‘స్మార్ట్ వ్యవసాయం’ దిశగా పరుగులు తీస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. ఇండియా అభివృద్ధికి వ్యవసాయరంగ పురోగతి అత్యంత కీలకం. ప్రపంచ ఆహార భద్రత నానాటికీ సంక్లిష్టంగా మారుతోంది. వాతావరణ మార్పులవల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గుతున్నాయి. ఇందుకోసం సాగులో యంత్రీకరణను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్పత్తుల పెంపే లక్ష్యంగా అనేక దేశాలు, సంస్థలు కృషి చేస్తున్నాయి. డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, కృత్రిమ మేధ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా పనిచేసే వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకుని, ఉత్పాదకతను పెంచుకోవడంలో ఇవి కీలకంగా మారుతున్నాయి. ఇండియా కన్నా చైనాలో వ్యవసాయ యోగ్యమైన భూమి తక్కువ. దిగుబడి మాత్రం అధికం. అభివృద్ధి చెందిన దేశాలు సాగు రంగంలో పరిశోధనలు, అభివృద్ధిపై అధికంగా దృష్టి సారిస్తున్నాయి. వ్యవసాయంలో పూర్తి యంత్రాలను అమలు చేస్తున్నాయి. భారత్‌లోనూ ఇటీవలి కాలంలో సాగులో డ్రోన్లు, రోబోల వాడకం ప్రారంభమైంది. అందుకుతోడుగా హైదరాబాద్‌కు చెందిన మారుత్ డ్రోన్స్ అనే అంకురసంస్థ వ్యవసాయంలో వినియోగించే డ్రోన్లను తయారుచేసేందుకు డీజీసీఏ అనుమతులు పొందింది. డ్రోన్స్ ద్వారా ఉపాధి పొందాలనుకునే సర్వీస్ ప్రొవైడర్లకు, నూతన సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయంలో దిగుబడి పెంచుకోవాలనుకునే రైతులతోపాటు స్వయంగా ఉపాధి పొందాలనుకునే మహిళలకు రెండు వారాల్లోనే డ్రోన్ లైసెన్సులు అందజేస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 500 మందికి పైగా.. ఇతర రాష్ట్రాల్లో 300 మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. కంపెనీ తయారుచేసిన ‘ఏజీ 365ఎస్ కిసాన్డ్రోన్’ (మల్టీయుటిలిటీ అగ్రికల్చర్ స్మాల్ కేటగిరీ డ్రోన్) ద్వారా మరింత మందికి శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. 25 కేజీల కంటే తక్కువ బరువు ఉండే ఈ డ్రోన్ ఫ్లైయింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు తాజాగా డీజీసీఏ అనుమతి పొందింది. పదేళ్ల గడువుతో లైసెన్సు.. తాజా డీజీసీఏ నిబంధనల ప్రకారం డ్రోన్ ఫ్లయింగ్ చేయాలంటే 18 ఏళ్ల వయసు, పాస్‌పోర్టు తప్పనిసరిగా ఉండాలి. దాదాపు రెండు వారాల్లో ఫ్లైయింగ్‌లో మెలకువలు పొందిన తర్వాత ఇన్స్ట్రక్టర్లు, అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించిన అనంతరం పదేళ్ల వ్యవధి ఉన్న లైసెన్సులు జారీ చేస్తారు. దేశంలోనే ప్రథమం ‘ఏజీ 365 కిసాన్డ్రోన్’...చిన్న, మధ్యస్థ విభాగంలో బ్యాటరీతో పనిచేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు ప్రేమ్ కుమార్ అన్నారు. ఏజీ 365 డ్రోన్‌ను 1.5లక్షల ఎకరాల్లో విస్తృతంగా పరీక్షించినట్లు చెప్పారు. దీన్ని వ్యవసాయంలో, డ్రోన్ శిక్షణ కోసం వినియోగించేందుకు ‘రిమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఆర్పీటీఓ)’ అనుమతి లభించిందన్నారు. ఇలా రెండు ధ్రువీకరణలు అందుకున్న దేశంలోని తొలి డ్రోన్ ఇదేనని చెప్పారు. ఈ డ్రోన్‌కు 22 నిముషాల పాటు ఎగిరే సామర్థ్యం ఉంది. దీంతో పంట పొలాల్లో మందు పిచికారీ సులభం అవుతుంది. రైతులకు పొలాల వద్దే శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: చివరకు ఏఐలోనూ లింగవివక్ష! కేంద్రప్రభుత్వ నిర్ణయం ప్రకారం స్వయంఉపాది పొందాలనుకునే మహిళలు, మహిళా రైతులకు రెండువారాలపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయిన మహిళలు రోజూ డ్రోన్లను నడుపుతూ రూ.1500 వరకు సంపాదించే అవకాశం ఉన్నట్లు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌తో డ్రోన్ కొనుగోలు చేయాలనుకునే రైతులకు తక్కువ వడ్డీకే రూ.10లక్షల వరకు, సర్వీస్ ప్రొవైడర్లకు రూ.2కోట్ల వరకు రుణాలు అందిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 50-100 శాతం సబ్సిడీ కూడా లభించే అవకాశం ఉందన్నారు. అయితే ఆ రుణాలు ఎలా పొందాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. -
రైతు బాగు నచ్చని బాబు బ్యాచ్
-
AP: రైతు బాగు నచ్చని బాబు బ్యాచ్..
ఏదైనా వాహనం నడపాలంటే ఆ యజమానికి తగిన శిక్షణ అవసరం. కనీస శిక్షణ, నిర్వహణపై అవగాహన లేకుండా వాహనం కొన్నా, మూలన పెట్టడం తప్ప చేసేది ఏమీ ఉండదు. ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా ఈనాడు రామోజీరావు కథనాలు అచ్చేసి ప్రజల మీదకు వదిలేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా డ్రోన్స్ ఎగురుతోందెక్కడ? అంటూ రైతులను తప్పుదోవ పట్టించేలా ఓ కథనాన్ని ప్రచురించారు. సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్ లేకుండా డ్రోన్ యూనిట్లు ఏర్పాటు చేయడం కుదరదన్న విషయం అందరికీ తెలిసిందే.ఇందుకోసం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కిసాన్ డ్రోన్స్ కోసం ఎంపిక చేసిన రైతులకు, నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తోంది. మరో వైపు అధిక సామర్థ్యంతో కూడిన డ్రోన్స్ రైతులకు అందుబాటులోకి తీసుకు రావాలన్న సంకల్పంతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే తొలుత పైలెట్ శిక్షణ పూర్తి చేయడం, తర్వాత డ్రోన్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు, మరీ ముఖ్యంగా ఎక్కువ సామర్థ్యం కలిగిన డ్రోన్స్‌ను రైతులకు అందించాలన్న సంకల్పంతో పటిష్ట ప్రణాళిక అమలుచేస్తోంది. రాష్ట్రంలో రైతు బాగుపడితే చూడలేని చంద్రబాబు, రామోజీ బ్యాచ్‌కి ప్రభుత్వ చర్యలు కంటగింపుగానే ఉంటాయి. అందుకే రామోజీ కుటిల రాతలు. అసలు ఈ కథనంలో వాస్తవం ఎంత.. ఈ నాలుగున్నరేళ్లలో ఈ ప్రభుత్వం యాంత్రీకరణకు ఏ స్థాయిలో పెద్ద పీట వేసిందో ఒక్కసారి పరిశీలిద్దాం.. సీఎం జగన్ పాలనలో ఎంపిక, కొనుగోలు, నిర్వహణ అంతా పారదర్శకమే ఆధునిక యంత్ర పరికరాలను తక్కువ అద్దెకు సన్న, చిన్నకారు రైతుల ముంగిట తీసుకు రావడం ద్వారా సాగు వ్యయం తగ్గించి వారికి నికర ఆదాయం పెంచాలన్న సంకల్పంతో సీఎం జగన్ ప్రభుత్వం గ్రామ స్థాయిలో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు సంఘటితంగా ఏర్పాటు చేసుకున్న గ్రూపులకే యంత్ర పరికరాలను అందించింది. ఇందులో దళారులెవరూ ఉండరు. 2021–22లో శ్రీకారం చుట్టిన వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా విత్తు నుంచి కోత వరకు గ్రామ స్థాయిలో ప్రతి రైతుకు ఉపయోగపడేలా అత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్బీకే, క్లస్టర్ స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు సంఘాల (సీహెచ్‌సీ)కు 40 శాతం సబ్సిడీతో ఈ యంత్రాలని సమకూర్చింది. ఆర్బీకే స్థాయిలో రూ.15 లక్షల విలువైనవి, క్లస్టర్ స్థాయిలో రూ.25 లక్షల విలువైన కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో కూడిన పరికరాలను ఇచ్చింది. వీటి వ్యయంలో 40 శాతం సబ్సిడీ ఇవ్వగా, 10 శాతం సంబంధిత రైతు సంఘాలు సమకూర్చుకుంటే మిగిలిన 50 శాతం బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కూడా ప్రభుత్వమే కల్పించింది. ఇప్పటివరకు రూ.1052.42 కోట్ల అంచనాతో 10,444 ఆర్బీకే, 492 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 6,362 ట్రాక్టర్లు, 492 కంబైన్డ్ హార్వెస్టర్లతో పాటు 31,356 ఇతర యంత్రాలను సమకూర్చింది. సబ్సిడీ మొత్తం రూ.366.25 కోట్లను నేరుగా సీహెచ్‌సీ రైతు సంఘాల ఖాతాల్లో జమ చేసింది. వీటి ఎంపిక, కొనుగోలు, నిర్వహణ బాధ్యతలను రైతు సంఘాలకే అప్పగించింది. ఇందులో ప్రభుత్వం లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఉండదు. అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. ఎక్కడా పైసా అవినీతి ఉండదు. పైగా, మార్కెట్ అద్దె కంటే తక్కువ అద్దెకు వారి ప్రాంతంలో డిమాండ్ ఉన్న పరికరాలను సంఘాలే ఎంపిక చేసుకొంటాయి. అంతేకాదు.. నచ్చిన కంపెనీల నుంచి, నచ్చిన పరికరాలను కొనుక్కొనే స్వేచ్ఛనిచ్చింది. దీంతో రైతులు వారికి అవసరమైన యంత్రాలను నాణ్యత, మన్నికను పరిశీలించి మరీ కొనుక్కున్నారు. ప్రైవేటుగా యంత్ర పరికరాలకు వసూలు చేస్తున్న అద్దె కంటే తక్కువ అద్దెకు రైతులకు అందుబాటులో ఉంచారు. గ్రామంలోనే కాదు మండల స్థాయిలో ఎక్కడి నుంచైనా రైతుకు అవసరమైన యంత్రాలను బుక్ చేసుకున్న 15 రోజుల్లో పొందేందుకు వీలుగా వైఎస్సార్ యంత్ర సేవా యాప్‌ని తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా రైతు సంఘాల రుణాల చెల్లింపులను కూడా పర్యవేక్షిస్తున్నారు. 2021 జనవరి నుండి ఇప్పటి వరకు 26 జిల్లాల్లో 5.15 లక్షల మంది రైతులు ఈ కేంద్రాల ద్వారా యంత్ర సేవలు పొందారు. వీరు 14.68 లక్షల ఎకరాల్లో యంత్రాలను వినియోగించారు. అద్దె రూపంలో సీహెచ్‌సీలు ఇప్పటి వరకు రూ.87.64 కోట్లు ఆర్జించాయంటే ఏ స్థాయిలో పారదర్శకంగా ఈ కార్యక్రమం అమలవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిత్తశుద్ధితో కిసాన్ డ్రోన్స్ ఏర్పాటుకు కసరత్తు రైతుల పెట్టుబడులను మరింతగా తగ్గించడమే లక్ష్యంగా ఆర్చీకే స్థాయిలో వ్యవసాయ డ్రోన్లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. తొలి విడతగా 2023–24లో 2వేల గ్రామాల్లో 40 శాతం రాయితీతో డ్రోన్లు ఏర్పాటు చేస్తోంది. వాణిజ్య పంటలు, ఒకే పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే మండలాలను జిల్లాకు 3 చొప్పున ఎంపిక చేసింది. ఈ మండలాల్లో కనీసం 3 గ్రామాల్లో డ్రోన్స్‌తో కూడిన యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఐదారుగురు రైతులతో సంఘాలు (సీహెచ్‌సీ) కూడా ఏర్పాటు చేసింది. తొలుత ఈ సంఘాల్లోని ఎంపిక చేసిన రైతులను డ్రోన్ పైలెట్లుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. వీరితోపాటు గ్రామ స్థాయిలో డ్రోన్ పైలెట్‌గా ఉత్సాహవంతులైన నిరుద్యోగ యువతకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, తాడేపల్లిలోని డ్రోగో డ్రోన్ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి 369 మంది రైతులకు, 160 మంది యువతకు మొత్తం 529 మందికి శిక్షణ ఇచ్చారు. మరోపక్క డ్రోన్ల ఎంపికకు కసరత్తు చేపట్టారు. పౌర విమానయాన శాఖ ధ్రువీకరణ పొందిన వివిధ కంపెనీల డ్రోన్ల పనితీరును వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా పరీక్షించి రైతులకు ఉపయోగపడే వాటి ఎంపిక జరుగుతోంది. అధిక సామర్థ్యం కల్గిన డ్రోన్ల కోసమే.. కనీసం 10 లీటర్ల ట్యాంక్‌తో కూడిన డ్రోన్లు 10 నుంచి 22 నిముషాలు మాత్రమే ఎగురగలవని గుర్తించారు. వీటి కంటే మెరుగైన డ్రోన్స్‌ను రైతులకు అందించే సంకల్పంతో ఎక్కువ సమయం ఎగిరే డ్రోన్లను గుర్తించి అదే యూనిట్ ధరకు సరఫరా చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇలా రైతులకు పూర్తి స్థాయిలో సమర్ధవంతంగా సేవలందించే డ్రోన్లను తయారు చేసేందుకు వ్యవసాయ వర్శిటీకి చెందిన అప్సరా డ్రోన్ టెక్నాలజీ సెంటర్ ద్వారా పైలెట్ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలా డ్రోన్స్ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే, వాస్తవాలను తెలుసుకోకుండా పనిగట్టుకొని రైతులను రెచ్చగొట్టేలా కుట్రపూరిత కథనాలు అచ్చేయడం ఈనాడుకే చెల్లింది. బాబు హయాంలో రైతు రథాల పేరిట అంతా దోపిడీయే చంద్రబాబు సీఎంగా ఉండగా రైతు రథాల పేరిట వ్యవసాయ యాంత్రీకరణ ఓ ఫార్సుగా నడిచింది. ఈ పథకం కొంతమందికే పరిమితమయ్యేది. అందులోనూ అనేక అవకతవకలు, అవినీతే. 2014–2019 మధ్య కేవలం 3,584 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. వీటిలో రైతులు తక్కువ, దళారులెక్కువ. వీటి ద్వారా రూ.239.16 కోట్ల సబ్సిడీతో కూడిన ట్రాక్టర్లు పంపిణీ చేశారు. రుణ సహాయానికి రైతే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఏ కంపెనీ యంత్రం లేదా పరికరం ఏ డీలర్ వద్ద ఎంత రేటుకు కొనాలో కూడా టీడీపీ నేతలే నిర్ణయించేవారు. సబ్సిడీ మొత్తాన్ని నేరుగా డీలర్లకే జమ చేసేవారు. టీడీపీ నేతలు, డీలర్లు కుమ్మక్కై మార్కెట్ రేటు కంటే 30 శాతం ఎక్కువకు అమ్మి, ఆ సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. రైతు రథాల పేరిట రూ.100 కోట్లకుపైగా సబ్సిడీ సొమ్మును టీడీపీ నేతలు స్వాహా చేశారు. పైగా, రైతులకు నాసిరకం యంత్రాలు ఇచ్చారు. అవి నాలుగు రోజులకే మరమ్మతులకు గురైతే, రైతులే బాగు చేయించుకోవాల్సి వచ్చేది. -
డ్రోన్ సాయంతో మందుల తరలింపు?
బీబీనగర్: గ్రామీణ రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను బీబీనగర్ ఎయిమ్స్ వైద్యశాలకు తరలించి, వాటి ఆధారంగా తిరిగి రోగులకు అవసరమయ్యే మందులను డ్రోన్ విమానంలో తరలించేలా అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి భువనగిరిలోని ఓ మార్కెట్ ఆవరణలో నుంచి చిన్నపాటి డ్రోన్‌లో మందులను అమర్చి కంప్యూటర్ ద్వారా నియంత్రిస్తూ ఎయిమ్స్‌కు పంపినట్లు సోషల్ మీడియాలో బుధవారం ఓ వీడియో వైరల్ అయింది. దీనిపై ఎయిమ్స్ అధికారులు, డ్రోన్ విమానాన్ని తరలించిన ప్రాజెక్టు నిర్వాహకులను వివరాలను అడిగినప్పటికీ వెల్లడించకపోవడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎయిమ్స్ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా వైద్య శిబికాలె నిర్వహిస్తున్నారు. రోగుల నుంచి వివిధ పరీక్షల నమూనాలను సేకరించి వారికి సిబ్బంది నేరుగా మందులను పంపిణీ చేస్తారు. కానీ, ఇప్పుడు డ్రోన్ విమానం ద్వారా ఎయిమ్స్‌కు మందులు, శాంపిల్స్ తరలించేలా ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
చిన్నసైజు హెలికాప్టర్ కనిపిస్తుంది..తుఫాన్ బాధితుల్ని కాపాడటంలో
తుఫానులనూ తట్టుకోగల డ్రోన్ చిన్నసైజు హెలికాప్టర్లా కనిపించే ఈ డ్రోన్ వాతావరణంలోని ఎలాంటి మార్పులనైనా తట్టుకుంటూ ఇట్టే దూసుకుపోగలదు. చెక్ కంపెనీ ‘థండర్ ఫ్లై’ ఈ డ్రోన్‌ను ‘టీఎఫ్–జీ1’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యవసర వస్తువులను గమ్యానికి చేరవేయడానికి వీలుగా ‘థండర్ ఫ్లై’ ఇంజినీర్లు దీనిని రూపొందించారు. తుఫానుల్లో సైతం ఈ డ్రోన్ చెక్కుచెదరకుండా ప్రయాణించగలదు. రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ డ్రోన్‌ను ఒకసారి పూర్తిగా చార్జ్ చేసుకుంటే, గంటకు పైగా నిరంతరాయంగా ప్రయాణించగలదు. ఇది ఐదు కిలోల వరకు బరువున్న వస్తువులను ఒక చోటు నుంచి మరొక చోటుకు సురక్షితంగా తీసుకుపోగలదు. తుఫానుల్లో చిక్కుకు పోయిన వారికి ఆహారం, ఔషధాలు వంటి అత్యవసర వస్తువులను చేరవేయడానికి ఇది బాగా ఉపయోగపడగలదు. థండర్ ఫ్లై వెబ్సైట్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. దీని ధర 9,999 డాలర్లు (రూ.8.33 లక్షలు). రోటరీ బ్లేడ్లు అదనంగా కావాలను కుంటే, మరో 499 డాలర్లు (రూ.41,611) చెల్లించాల్సి ఉంటుంది. -
పంజాబ్‌లోకి పాక్ డ్రోన్..ఎందుకొచ్చిందంటే..?
ఫిరోజ్‌పూర్: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా మబోక్ గ్రామంలో పాకిస్థాన్‌కు చెందిన ఒక డ్రోన్‌ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్‌కూల్చివేసింది.ఈ డ్రోన్ చైనాలో తయారైనట్లు బీఎస్ఎఫ్ గుర్తించింది.కూల్చివేసిన డ్రోన్‌తో చిన్న పార్సిల్లు రవాణా చేయవచ్చని బీఎస్ఎఫ్ తెలిపింది. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో డ్రోన్ కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాం. డ్రోన్‌ను గుర్తించిన వెంటనే దానిని కూల్చివేశాం. పంజాబ్‌కు డ్రగ్స్ సప్లై చేసేందుకు డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ నుంచి ఇప్పటికే చాలా ప్రయత్నాలు జరిగాయి. డ్రోన్ల ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది’ అని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. వారం రోజుల క్రితమే పాకిస్థాన్‌కు చెందిన ఒక డ్రోన్‌ను బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు కలిసి సంయుక్త ఆపరేషన్‌లో కూల్చివేశారు. 𝐏𝐚𝐤𝐢𝐬𝐭𝐚𝐧𝐢 𝐝𝐫𝐨𝐧𝐞 𝐫𝐞𝐜𝐨𝐯𝐞𝐫𝐞𝐝 𝐛𝐲 𝐁𝐒𝐅 After a Pakistani drone violated Indian airspace and was intercepted by #BSF troops with firing. @BSF_Punjab troops launched a search operation, recovering a Pakistani drone (DJI Mavic 3 Classic - Made in China) from a… pic.twitter.com/HBo2ZZvcU4 — BSF PUNJAB FRONTIER (@BSF_Punjab) December 9, 2023 ఇదీచదవండి..బీజేపీ సీఎంల ఎంపికపై గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు -
త్వరలోనే ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం
న్యూఢిల్లీ: ఎక్కువసేపు గాల్లో చక్కర్లు కొడుతూ క్షిపణులతో దాడి చేయగల అత్యాధునిక ఎంక్యూ–9బీ ప్రిడేటర్ రకం 31 సాయుధ డోన్ల కొనుగోలుకు సంబంధించి అమెరికాతో భారత్ వచ్చే ఏడాది మార్చికల్లా ఒప్పందాన్ని ఖరారుచేసుకోనుంది. కొనుగోలు కోసం భారత్ పంపిన ‘అభ్యర్థన లేఖ’ను అమెరికా రక్షణ శాఖ ఆమోదించిన నేపథ్యంలో త్వరలోనే అమెరికా, భారత ఉన్నతాధికారులు తుది దశ చర్చలు జరపనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో గగనతలంలో నిరంతర నిఘా, మెరుపు దాడుల కోసం ఈ డ్రోన్లను భారత్ వినియోగించనుంది. ఈ భారీ డ్రోన్ సరిహద్దులతోపాటు శత్రు దేశాల సైనిక వాహనాలపై నిఘాతోపాటు వాటిని వెంటాడి క్షిపణులతో దాడిచేయగలదు. ఏకబిగిన 35 గంటలపాటు గాల్లోనే ఉండగలదు. 450 కేజీల బరువైన బాంబులు అమర్చిన క్షిపణులను మోసుకెళ్లగలదు. ఇంతటి అత్యాధునికమైన డ్రోన్లను త్రివిధ దళాల్లో దశలవారీగా ప్రవేశపెట్టాలని భారత్ తలపోస్తోంది. అందులోభాగంగానే ఈ డీల్ కుదుర్చుకుంటోంది. అమెరికా రక్షణరంగ దిగ్గజ సంస్థ జనరల్ ఆటమిక్స్ ఈ డ్రోన్లను తయారుచేస్తోంది. 31 డ్రోన్లకు మొత్తంగా రూ.25,000 కోట్లు అవుతుందని అంచనా. అయితే ఒక్కో డ్రోన్‌ను ఎంతకు కొనాలనే ధర, ఇతరత్రా విషయాలు ఇంకా ఖరారుకాలేదు. తుది చర్చల్లో వీటిపై నిర్ణయాలు తీసుకునే వీలుంది. డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన తొలి అనుమతిని లోని రక్షణరంగ కొనుగోళ్ల మండలి ఆమోదించిన విషయం విదితమే. -
అమెరికా ఎంక్యూ–9 డ్రోన్ పేల్చివేత
సనా: ఇప్పటికే ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణలతో పశి్చమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్లు అమెరికా సైన్యంపై దాడులు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్‌ను హౌతీ మిలిటెంట్లు పేలి్చవేశారు. యెమెన్ ప్రాదేశిక జలాల్లో బుధవారం ఈ సంఘటన జరిగిందని అమెరికా సైన్యం వెల్లడించింది. హౌతీ దుశ్చర్య నేపథ్యంలో పశి్చమాసియాలో అమెరికా సేనలు అప్రమత్తమయ్యాయి. హౌతీకి ఇరాన్ ప్రభుత్వం అండగా ఉండడం గమనార్హం. -
అస్తిపంజరం డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను మీరెప్పుడైనా చూశారా?
దేవుడున్నాడన్నది ఎంత నిజమో దెయ్యాలు ఉన్నాయన్నది కూడా అంతే నిజం. కూడా దెయ్యాలకూ కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి. అదే హలోవీన్ ఫెస్టివల్. ఈ పండగను పురస్కరించుకొని రకరకాల వికృత వేషాలు చూస్తుంటాం. తాజాగా దుబాయ్‌లో అస్తిపంజరం డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. భారతీయ సాంప్రదాయంలో పలు పండగలకు ప్రత్యేకమైన విశిష్టతలున్నాయి. అదే విధంగా దెయ్యాలకూ స్పెషల్‌గా పండగలున్నాయి. అదేనండీ మన హలోవీన్ పండగ. ఐర్లాండులో పుట్టిన ఈ పండగ తర్వాతి రోజుల్లో ప్రపంచ దేశాలకూ పట్టింది. హాలోవీన్ అనే స్కాట్లాండ్ పదం ఆల్ హాలో ఈవ్ నుంచి వచ్చింది. 1846లో ఏర్పడిన తీవ్రమైన కరువు కారణంగా ఉత్తర అమెరికాకు వలస వెళ్లిన ఐర్లాండు ప్రజలు.. ఈ సంప్రదాయాన్ని పరిచయం చేశారు. దీన్ని సాంహైన్ పండుగ అని కూడా అంటారు. 2,000 సంవత్సరాల కిందట ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో నివసించిన సెల్ట్స్ జాతి ప్రజలు నవంబరు 1ని కొత్త సంవత్సరంగా జరుపుకునేవారు. దానికి ఒకరోజు ముందే హాలోవీన్ వేడుకలు నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది.పండుగ రోజున మంటలను వెలిగించి, దెయ్యాలను పారదోలాలనే ఉద్దేశంతో ప్రజలు విచిత్రమైన వస్త్రధారణలో ఉంటారు. హలోవీన్ పండ అంటే ప్రాణం ఉన్నవారికి, మరణించినవారికి మధ్య సరిహద్దులు తొలగిపోతాయని అప్పటి ప్రజలు నమ్మేవారు. పూర్వం ‘హాలోవీన్’ రోజున పశువులను బలి ఇచ్చి, వాటి ఎముకలను కాల్చేవారు. ఈ రోజున చెడు ఆత్మలను అనుకరిస్తూ.. దెయ్యాలు, మంత్రగత్తుల్లా వేషాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. హలోవీన్ డే వస్తుందంటే చాలు ప్రజలు పలు హర్రర్ సినిమాల్లోని భయానక పాత్రలను అనుసరిస్తూ వికృత వేషాల్లో కనిపిస్తారు. తాజాగా దుబాయ్‌లో హలోవీన్ డేను పురస్కరించుకొని భారీ డ్రోన్ షోను నిర్వహించారు. ఇందులో ఓ అస్తిపంజరం డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. -
జై భజరంగ భళీ!
ఆకాశంలోకి చూస్తే గాల్లో ఎగురుతున్న హనుమంతుడు కనిపిస్తే ఎంత వింత! ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఇలాంటి దృశ్యమే కనిపించి ప్రజలను ఆశ్చర్యానందాలకు గురి చేసింది. ఆ నగరంలోని ఒక ఉత్సవ కమిటీ వాళ్లు గాల్లో ఎగురుతున్నట్లు ఉండే హనుమాన్ రూపాన్ని డ్రోన్‌కు బిగించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. కొన్ని సంవత్సరాల క్రితం పంజాబ్‌లోని లుథియానాలో ఇలాంటి దృశ్యమే కనువిందు చేసింది. దానినుంచి స్ఫూర్తి పొంది ఈ వీడియో చేశారేమో తెలియదుగానీ ప్రజలు మాత్రం ఆకాశానికేసి చూస్తూ ‘జై భజరంగభళీ’ అంటూ నినదించారు. -
తుది దశకు డ్రోన్ సర్వే
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీ సర్వేలో కీలకమైన డ్రోన్ సర్వే (డ్రోన్లతో భూముల కొలత) తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 97 శాతం సర్వే పూర్తయింది. మిగిలిన 3 శాతాన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేయడానికి సర్వే, సెటిల్మెంట్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలోని 17,595 గ్రామాలకు గాను, డ్రోన్ సర్వే సాధ్యం కాని 4,135 గ్రామాలను మినహాయిస్తే 13,460 గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఈ గ్రామాల్లో డ్రోన్లు, విమానాల ద్వారా సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 13,075 గ్రామాల్లో దాదాపు 1.75 కోట్ల ఎకరాల్లో సర్వే పూర్తయింది. ఇంకా కేవలం 385 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి కావాల్సి ఉంది. వీటిలో శ్రీకాకుళం, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని ఎక్కువ గ్రామాల్లో సర్వే జరగాల్సి ఉంది. ఈ నెలాఖరుకు మొత్తం గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని సర్వే శాఖ అధికారులంటున్నారు. ఇది పూర్తయితే రీ సర్వేలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేసినట్లవుతుంది. మొత్తం 1.80 కోట్ల ఎకరాలను కొలిచినట్లవుతుంది. ఇది ఒక రికార్డుగా అధికారులు చెబుతున్నారు. వేగంగా పూర్తి చేసేందుకు... వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఏరియల్ సర్వే కోసం డ్రోన్లతోపాటు విమానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. సర్వే ఆఫ్ ఇండియాతోపాటు ప్రైవేట్ డ్రోన్ ఏజెన్సీలకు ఈ బాధ్యతను అప్పగించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 వేలమంది సర్వేయర్లను నియమించడంతోపాటు సొంతంగా 30 డ్రోన్లు కొనుగోలు చేసి సర్వేయర్లకు పైలెట్లుగా శిక్షణ ఇచ్చి సర్వే చేయిస్తోంది. దీంతో సర్వే అత్యంత వేగంగా పూర్తవుతోంది. -
సాగులో.. సాంకేతికత.. ప్రయొజనాలు అధికం
సంగారెడ్డి: పంట సాగులో ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు కూలీల సమస్యను అధిగమించి అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా డ్రోన్లను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎరువులు, పురుగు మందుల పిచికారీకి కూలీలు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు కూలీల సమస్యను అధిగమించి అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు సాంకేతికత బాట పడుతున్నారు. మందులు పిచికారీ చేసేందుకు డ్రోన్లు చాలా ఉపయోగపడుతున్నాయి. సంగారెడ్డి జిల్లాతో ఇప్పటికే చాలా మంది రైతులు డ్రోన్లను వినియోగించడం విశేషం. డ్రోన్ వినియోగంతో ప్రయోజనాలెన్నో .. ఎకరా విస్తీర్ణంలో పురుగు మందుల పిచికారీ ఆరు నిమిషాల్లో పూర్తవుతుంది. ఎరువులకై తే 12 నిమిషాల సమయం పడుతుంది. అంతే కాకుండా రోజుకు 2530 ఎకరాల్లో పిచికారీ చేసేందుకు వీలు ఉంటుంది. మనుషులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. డ్రోన్ ద్వారా ఎరువులు, పురుగు మందులు ఒకేసారి పిచికారీ చేయడం ద్వారా సులభంగా, చీడపీడల నివారణ అవుతుంది. ఎత్తు పల్లాలతో కూడిన పంట పొలాల్లోనూ సులభంగా మందులు చల్లవచ్చు. డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారీకి ఎకరాకు రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చవుతుంది. అదే కూలీకై తే రూ.800 రూ.1500) వరకు చెల్లించాల్సి వస్తుంది. రిమోట్ సాయంతో పనిచేసే ఈ డ్రోన్ల వల్ల పురుగు మందుల వృథా తగ్గడమే కాకుండా తగినంత ఎత్తు నుంచి పిచికారీ చేయడంతో సాగుకు సక్రమంగా మందు అందుతుంది. -
ఫార్మా, డ్రోన్లు, టెక్స్టైల్స్ పీఎల్ఐలో మార్పులు
న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్స్, డ్రోన్లు, టెక్స్టైల్స్ రంగాలకు సంబంధించి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) కింద కేంద్రం మార్పులు చేయనుంది. ఈ రంగాల్లో తయారీ, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా రాయితీలను పెంచనుంది. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి అనధికారికంగా వెల్లడించారు. 2021 నుంచి ఇప్పటివరకు 14 రంగాలకు పీఎల్ఐ పథకం కింద కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించి, దరఖాస్తులను సైతం స్వీకరించింది. మంత్రిత్వ శాఖల మధ్య అంతర్గతంగా కొనసాగిన సంప్రదింపుల్లో భాగంగా ఈ రంగాలకు సంబంధించి సవరణలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్టు సదరు సీనియర్ అధికారి తెలిపారు. దీనికి త్వరలోనే కేబినెట్ ఆమోదం పొందనున్నట్టు పేర్కొన్నారు టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు నిర్వచనం మార్చనున్నట్టు చెప్పారు. అలాగే, డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాలకు కేటాయించిన రూ.120 కోట్లను పెంచనున్నట్టు వెల్లడించారు. వైట్ గూడ్స్ (ఏసీ, ఎల్ఈడీ లైట్లు) రంగాలకు పీఎల్ఐ కింద నగదు ప్రోత్సాహకాలను ఈ నెల నుంచే విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. 2023 మార్చి నాటికి రూ.2,900 కోట్లను ఇవ్వాల్సి ఉందన్నారు. పీఎల్ఐ కింద వైట్ గూడ్స్, వైద్య పరికరాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఆహారోత్పత్తులు తదితర 14 రంగాలకు కేంద్రం రూ.1.97 లక్షల కోట్లను ప్రకటించింది. అయితే, కొన్ని రంగాలకు సంబంధించి పెద్దగా పురోగతి కనిపించలేదు. దీంతో కొన్ని రంగాలకు సంబంధించి మార్పులు చేయాల్సి రావచ్చని కేంద్ర వాణిజ్య శాఖ అధికారి లోగడ సంకేతం ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలు, టెక్స్టైల్స్ ఉత్పత్తులు, స్పెషాలిటీ స్టీల్ రంగాల్లో పీఎల్ఐ పట్ల పెద్దగా స్పందన లేకపోవడంతో మార్పులకు కేంద్రం పూనుకున్నట్టు తెలుస్తోంది. -
వచ్చే నెలలో 614 కిసాన్ డ్రోన్స్
సాక్షి, అమరావతి: వ్యవసాయరంగంలో కిసాన్ డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా తొలిదశలో వచ్చే నెలలో 614 కిసాన్ డ్రోన్లను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతోంది. తొలిదశలో గుర్తించిన 614 మండలాల్లో ఒక్కో కస్టమ్ హైరింగ్ కేంద్రానికి ఒక డ్రోన్ వినియోగంలోకి తీసుకువచ్చేందుకు తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. పట్టణ, గిరిజన, ఉద్యాన మండలాలను మినహాయించి మిగతా 614 మండలాల్లో ఒక్కోకస్టమ్ హైరింగ్ సెంటర్‌కు ఒక డ్రోన్ చొప్పున వినియోగంలోకి తీసుకువచ్చేందుకు జిల్లాల వారీగా ప్రణాళికలను రూపొందించినట్లు సీఎస్ స్పష్టం చేశారు. ప్రతీ కిసాన్ డ్రోన్ కస్టమ్ హైరింగ్ కేంద్రానికి ఒక శిక్షణ పొందిన సరి్టఫైడ్ డ్రోన్ పైలెట్‌ను కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే 416 మండలాలకు సంబంధించి కిసాన్ డ్రోన్ పైలెట్లను శిక్షణ కోసం ప్రతిపాదించారని, మిగతా 198 మండలాలకు సంబంధించి కిసాన్ డ్రోన్ పైలెట్ల శిక్షణ కోసం త్వరగా ప్రతిపాదనలను పంపించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు సీఎస్ సూచించారు. రాష్ట్రంలో డ్రోన్ శిక్షణ కేంద్రాలు రెండు ఉన్నాయని, ఈ కేంద్రాలకు నెలకు 100 మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉందని సీఎస్ తెలిపారు. ఇప్పటికే 376 కిసాన్ డ్రోన్ పైలెట్లకు శిక్షణ ఇవ్వడం పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మరో 184 మంది డ్రోన్ పైలెట్లకు త్వరలో శిక్షణ ఇవ్వడం పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా గుంటూరు లాంలోని వ్యవసాయ డ్రోన్ పరిశోధనా కేంద్రంలోను, అలాగే తాడేపల్లిలోని డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కిసాన్ డ్రోన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్నారు. వివిధ వ్యవసాయ కార్యకలాపాలతో ముడిపడి ఉన్న మానవ శ్రమను తగ్గించడంతో పాటు, వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, ఉత్పత్తిని పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పంటల అంచనా, భూ రికా>ర్డుల డిజిటలైజేషన్, పురుగుమందులు, పోషకాలను పిచికారీ వంటి పనులకు డ్రోన్లు వినియోగించనున్నారు. డ్రోన్ల వినియోగంతో రైతులకు వ్యయం తగ్గి, ఆదాయం పెరుగుతుంది. -
విమానం ఎక్కాలన్న సరదా ఇప్పుడు తీరినట్లుంది..
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా వద్దికేరె గ్రామం సమీపంలో తపస్07 ఎ–14 రకం డ్రోన్ కుప్పకూలింది. చిత్రదుర్గం వద్ద డీఆర్డీఓ ఏరోనాటికల్ టెస్టింగ్ రేంజ్ (ఏటీఆర్) ఉంది. నిత్యం ఇక్కడ డ్రోన్లు, మానవ రహిత విమానాల పరీక్షలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఈ డ్రోన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుండగా చెళ్లకెర తాలూకా హిరియూరు వద్ద పొలంలో పెద్ద శబ్ధంతో కుప్పకూలింది. దాని భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. డీఆర్డీవో అధికారులు, పోలీసులు ధ్వంసమైన డ్రోన్‌ను అక్కడి నుంచి తరలించారు. సాంకేతిక లోపంతోనే అది కూలిందని, విచారణ జరుపుతున్నామని డీఆర్డీవో అధికారులు చెప్పారు. -
పొలాల్లో కుప్పకూలిన డీఆర్డీఓ డ్రోన్.. దృశ్యాలు వైరల్..
బెంగళూరు: రక్షణ శాఖ(డీఆర్డీఓ)కు చెందిన డ్రోన్ కుప్పకూలింది. కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో పంట పొలాల్లో ఈ మానవ రహిత డ్రోన్ కూలిపోయింది. ప్రమాద ఘటనకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాద ప్రదేశానికి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు గుమిగూడారు. #WATCH | A Tapas drone being developed by the DRDO crashed today during a trial flight in a village of Chitradurga district, Karnataka. DRDO is briefing the Defence Ministry about the mishap and an inquiry is being carried out into the specific reasons behind the crash: Defence… pic.twitter.com/5YSfJHPxTw — ANI (@ANI) August 20, 2023 డీఆర్డీఓ మానవ రహిత డ్రోన్లపై పరిశోధనలో భాగంగా.. ఆదివారం తాపస్ అనే డ్రోన్‌ను ట్రయల్ రన్ చేశారు. ఈ క్రమంలో అది కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. దీనిపై రక్షణ శాఖ దర్యాప్తు చేపడుతోంది. ప్రమాద స్థలంలో డ్రోన్ ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: చంద్రయాన్-3: చంద్రుడికి అడుగు దూరంలో ఇస్రో ‘విక్రమ్’.. ఇక చివరి ఘట్టం అదే -
సెక్రటేరియట్లో మెగా డ్రోన్ షో.. చూశారా?
-
నిర్మాణ రంగంలో డ్రోన్ నైపుణ్యాల శిక్షణ.. ప్రముఖ సంస్థల ఎంఓయూ
గౌహతి: నిర్మాణ రంగంలో డ్రోన్ నైపుణ్యాలను పెంపొందించేందుకు భారతదేశంలోని ప్రముఖ డ్రోన్ పైలట్ శిక్షణా సంస్థ ఇండియా డ్రోన్ అకాడమీ (IDA), నిర్మాణ పరిశ్రమ నైపుణ్యాభివృద్ధి సంస్థ కన్స్ట్రక్షన్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (CSDCI) అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. శుక్రవారం (ఆగస్ట్ 11) గౌహతిలో జరిగిన కార్యక్రమంలో ఐడీఏ సీఈవో దేవిరెడ్డి వేణు, సీఎస్‌డీసీఐ సీఈవో నరేంద్ర దేశ్‌పాండే ఎంవోయూ పత్రాలను మార్చుకున్నారు. నేషనల్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్ (NOS), నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (NSQF) స్థాయిల ప్రకారం నిర్మాణ కార్మికులు, నిపుణులకు నాణ్యమైన డ్రోన్ శిక్షణ అందించడం ఈ ఎంఓయూ లక్ష్యం. కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ), బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ), నేషనల్ హైవేస్ బిల్డర్స్ ఫెడరేషన్ (ఎన్‌హెచ్‌బీఎఫ్), కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ద్వారా ప్రమోట్ చేసిన సీఎస్డీసీఐతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని దేవిరెడ్డి అన్నారు. సీఎస్‌డీసీఐ, ఐడీఏ ద్వారా దేశవ్యాప్తంగా 3500 మంది పైలట్లకు శిక్షణ ఇవ్వబోతోందని, డ్రోన్ పైలట్ శిక్షణా కార్యక్రమాల కోసం పౌర విమానయాన శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి గుర్తింపు పొందినట్లు ఆయన చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఉపాధి కల్పనలో ఒకటైన నిర్మాణ పరిశ్రమలో నైపుణ్యాల అభివృద్ధికి సీఎస్‌డీసీఐ కట్టుబడి ఉందని సీఈవో నరేంద్ర దేశ్‌పాండే తెలిపారు. నిర్మాణ ప్రాజెక్టుల సామర్థ్యం, భద్రత, నాణ్యతను మెరుగుపరచడానికి డ్రోన్లకు అపారమైన సామర్థ్యం ఉందని, నిర్మాణ కార్మికులకు డ్రోన్ నైపుణ్యాలను అందించడానికి సీఎస్‌డీసీఐ ఐడీఏతో చేతులు కలపడం సంతోషంగా ఉందన్నారు. డ్రోన్ శిక్షణా కోర్సులను అందించడానికి, అసెస్మెంట్లు, సర్టిఫికేషన్లను నిర్వహించడానికి, ట్రైనీలకు ప్లేస్మెంట్ సహాయం అందించడానికి రెండు సంస్థలు పరస్పరం కలిసి పని చేసేందుకు ఈ ఎంఓయూ అనుమతిస్తుంది. రెండు సంస్థల మధ్య అవగాహన, వనరుల మార్పిడిని కూడా సులభతరం చేస్తుంది. ఏరియల్ సర్వే, ఇన్స్పెక్షన్, మ్యాపింగ్, మానిటరింగ్, డాక్యుమెంటేషన్ వంటి వివిధ పనులను చేయగల నైపుణ్యం కలిగిన డ్రోన్ పైలట్ల సమూహాన్ని సృష్టించడం ద్వారా ఈ ఎంఓయూ నిర్మాణ రంగానికి ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. -
అజిత్ దక్ష టీమ్‌తో ఇండియన్ ఆర్మీ డీల్.. రూ.165 కోట్లకు ఒప్పందం
కోలీవుడ్ స్టార్ అజిత్ నటనతో పాటు ఇతర రంగాల్లోనూ ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఈయన గతంలో రైఫిల్ షూట్ విన్ అయ్యారు. బైక్ రైడింగ్‌లో పాల్గొంటూ ప్రపంచ యాత్ర చేస్తున్నారు. అదే విధంగా ఏరోనాటికల్ రంగంలోనూ ఆసక్తి కలిగి ఉన్నారు. చైన్నె ఎంఐటీ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఆయన సలహదారుడిగా ఉన్నారు. ఈయన నేతృత్వంలో ఏరోనాటికల్ విద్యార్థుల బృందం డ్రోన్లను తయారు చేస్తోంది. గత కరోనా కాలంలో వీరు తయారు చేసిన డ్రోన్లు ప్రభుత్వ సేవలకు ఉపయోగపడ్డాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అజిత్ సలహదారుడిగా వ్యవహరించిన దక్ష టీమ్ 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన అంతర్జాతీయ డ్రోన్ల పోటీల్లో పాల్గొని అవార్డులను గెలుచుకుంది. తాజాగా ఈ టీమ్‌తో ఇండియన్ ఆర్మీ డీల్ కుదుర్చుకుంది. 200 డ్రోన్లు తయారు చేసివ్వమంటూ రూ.165 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అజిత్ సినిమాల విషయానికి వస్తే ఆయన చివరగా తునివు(తెలుగులో తెగింపు) చిత్రంలో నటించారు. విడాముయర్చి సినిమాకు సంతకం చేసిన ఆయన తన బైక్ టూర్ ముగియగానే షూటింగ్లో పాల్గొననున్నారు. అనిరుధ్ రవించందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా త్రిష హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. అర్జున్, అర్జున్ దాస్ కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నట్లు తెలుస్తోంది. #AK's passion once again benefits the nation - The #AjithKumar mentored #Daksha team has got the order to supply 200 drones worth 165 crore rupees to the Indian Army in the next 12 months 👏#Ajithkumar #VidaaMuyarchi pic.twitter.com/fZVIQR5bwj — KERALA AJITH FANS CLUB (@KeralaAjithFc) August 8, 2023 చదవండి: జైలర్ సినిమా రివ్యూ -
డ్రోన్ పైలట్‌గా డీజీసీఏ లైసెన్స్ పొందిన కేరళ తొలి మహిళ!
కేరళలోని మలప్పురానికి చెందిన రిన్ష పట్టకకు గాలిలో ఎగురుతున్న డ్రోన్లను చూడడం అంటే సరదా. ఆ సరదా కాస్తా ఆసక్తిగా మారింది. డ్రోన్లకు సంబంధించిన ఎన్నో విషయాలను సివిల్ ఇంజనీర్ అయిన తండ్రి అబ్దుల్ రజాక్‌ను అడిగి తెలుసుకునేది. ప్లస్ టు పూర్తయిన తరువాత బీటెక్ అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్న టైమ్‌లో విరామ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచిస్తుప్పుడు రిన్షకు తట్టిన ఐడియా డ్రోన్ ఫ్లయింగ్ ట్రైనింగ్ కోర్సు. తండ్రితో చెబితే ఆయన ‘బాగుంటుంది’ అని ఓకే చెప్పి ప్రోత్సహించాడు. శిక్షణ కోసం కాసర్గోడ్లోని ఏఎస్ఏపీ కేరళ కమ్యూనిటీ స్కిల్ పార్క్‌లో చేరింది. క్లాసులో తాను ఒక్కతే అమ్మాయి! ఈ స్కిల్పార్క్లో యువతరం కోసం ఆటోమోటివ్ టెక్నాలజీ, కంప్యూటర్ హార్డ్‌వేర్, హాస్పిటాలిటీ, రిటైల్ మేనేజ్మెంట్కు సంబంధించి ఎన్నో వొకేషనల్కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డ్రోన్ ఫ్లయింగ్ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. కోర్సులో భాగంగా బేసిక్ ఫ్లైట్ ప్రిన్సిపల్స్ నుంచి డ్రోన్ ఫ్లయింగ్ రూల్స్ వరకు ఎన్నో నేర్చుకుంది రిన్ష. ఏరియల్ సర్వైలెన్స్, రెస్క్యూ ఆపరేషన్స్, అగ్రికల్చర్, ట్రాఫిక్, వెదర్ మానిటరింగ్, ఫైర్ ఫైటింగ్‌లతోపాటు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డెలివరీ సర్వీస్... మొదలైన వాటిలో డ్రోన్లకు ప్రాధాన్యత పెరుగుతోంది. మన దేశంలో డ్రోన్స్ ఆపరేట్ చేయడానికి డీజీసీఏ డ్రోన్ రిమోట్ పైలట్ సర్టిఫికెట్ తప్పనిసరి. డీజీసీఏ లైసెన్స్ పొందిన కేరళ తొలి మహిళా డ్రోన్ పైలట్‌గా చరిత్ర సృష్టించిన రిన్ష ఇలా అంటోంది... ‘రెస్క్యూ ఆపరేషన్స్ నుంచి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు ఎన్నో రంగాలలో డ్రోన్లు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. డీజీసీఏ డ్రోన్ రిమోట్ పైలట్ సర్టిఫికెట్ అందుకున్నందుకు గర్వంగా ఉంది’ ‘రిన్ష విజయం ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నారు స్కిల్పార్క్ ఉన్నతాధికారులు. (చదవండి: బార్బీ కాస్త హిజార్బీ! నాలా లేదన్న ఆలోచనే.. ఈ సరికొత్త బార్బీ! -
డ్రోన్లతో అటవీ భూమిలో 10 వేల సీడ్ బాల్స్.. మారుత్ డ్రోన్స్ ఒప్పందం
ఆగ్రా/ఫిరోజాబాద్: ’హరా బహారా’ నినాదం కింద అడవుల పెంపకం కార్యక్రమాన్ని విస్తృతం చేసేలా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ మారుత్ డ్రోన్స్ చేతులు కలిపింది. డ్రోన్ల ద్వారా ఆగ్రాకు సమీపంలో 10 ఎకరాల అటవీ భూమిలో 10,000 సీడ్ బాల్స్‌ను వెదజల్లింది. తమ సీడ్కాప్టర్స్ ద్వారా 2030 నాటికి 100 కోట్ల మొక్కలు నాటాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు ప్రేమ్ కుమార్ విస్లావత్ తెలిపారు. వృక్షారోపణ్ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే ప్రక్రియను నిర్వహించేందుకు ఔత్సాహిక ఎంట్రప్రెన్యూర్లు, డ్రోన్ టెక్నాలజీ తోడ్పడగలవని ఉత్తర్‌ప్రదేశ్ అటవీ శాఖ మంత్రి దారా సింగ్ చౌహాన్ తెలిపారు. -
ఆకాశమే హద్దు..!
సత్యసాయి: వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ చూపుతున్నారు. వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా విప్లవమే తీసుకురావచ్చని భావించి దేశంలో ఎక్కడా లేని విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత, రైతులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడంతోపాటు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విస్తృత ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు.. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ (ఏపీడీసీ)ను 2018 నవంబరులో ఏర్పాటు చేశారు. ఎం.మధుసూదన్‌రెడ్డి దీనికి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేయటంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు కార్పొరేషన్ కృషి చేస్తోంది. డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి, తయారీ, నిర్వహణ రంగంలో ఉన్న స్టార్టప్ కంపెనీలకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. డీజీసీఏ నిబంధనల మేరకు డ్రోన్ల నిర్వహణను క్రమబద్ధం చేయటంతో పాటు రక్షణాత్మక చర్యలు చేపడుతోంది. డ్రోన్ టెక్నాలజీలో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నతంగా నిలబెట్టేందుకు కార్పొరేషన్ కృషి చేస్తోంది. అన్ని రంగాల్లోనూ డ్రోన్ల వినియోగం.. రానున్న కాలంలో రైతులంతా డ్రోన్లను వినియోగించే నైపుణ్యం సాధిస్తారని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆళ్ల రవీంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా డ్రోన్ల వినియోగం అన్ని రంగాల్లో పెరిగిపోతోందని చెప్పారు. పరిపాలన, పోలీస్, వ్యవసాయం, గనులు, ఇన్సూరెన్స్, మీడియా, వినోద రంగాల్లో డ్రోన్లను వినియోగించటం ద్వారా మానవ వనరులు, సమయం, డబ్బు ఆదా అవుతోందని, కచ్చితత్వం ఉంటోందని చెప్పారు. డ్రోన్ వినియోగ నిబంధనలను పౌర విమానయాన శాఖ సడలించినందున డ్రోన్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. సమగ్ర భూ సర్వేతో ప్రాధాన్యం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వే కార్యక్రమంలో డ్రోన్లను పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా కిసాన్ డ్రోన్లను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. వచ్చే నెలలో మరో 500 కిసాన్ డ్రోన్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ద్వారా రైతులకు డ్రోన్ల వినియోగంలో శిక్షణ ఇస్తున్నారు. పంటలకు ఎరువులు వేయటం, పురుగు మందులు చల్లడం వంటివి డ్రోన్ల ద్వారా చేపట్టటం ద్వారా వృథాను అరికట్టడంతో పాటు రైతులను ప్రమాదకర పురుగుమందుల బారి నుంచి రక్షించవచ్చు. నిబంధనలు సరళతరం.. డ్రోన్లు లేదా యూఏవీ (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్)ల నిర్వహణను చట్టబద్ధం చేస్తూ 2021 ఆగస్టు 26న పౌర విమానయాన శాఖ కొత్త పాలసీని ప్రకటించింది. 2022లో నిబంధనలను మరింత సరళతరం చేస్తూ పాలసీలో సవరణలు తీసుకువచ్చింది. 2 కిలోల లోపు బరువు ఉన్న వినోదం కోసం ఉపయోగించే డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు ఎలాంటి రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ అవసరం లేదు. డ్రోన్లను ప్రభుత్వం అయిదు కేటగిరీలుగా వర్గీకరించింది. 250 గ్రాములలోపు బరువు ఉండేది నానో డ్రోన్. 250–2 కిలోల మధ్య బరువు ఉంటే మైక్రో డ్రోన్. 2 కిలోల నుంచి 25 కిలోల మధ్య బరువు ఉండేవి చిన్న డ్రోన్లు. 25–150 కిలోల మధ్య బరువు ఉండే డ్రోన్లను మధ్యస్థ డ్రోన్లుగానూ 150 కిలోల పైగా బరువు ఉండేవాటిని పెద్ద డ్రోన్లుగానూ వర్గీకరించారు. అనుమతులు తప్పనిసరి.. నానో, మైక్రో కేటగిరీల్లోని నాన్ కమర్షియల్ డ్రోన్లను మినహాయిస్తే మిగిలిన అన్ని రకాల డ్రోన్ల ఆపరేషన్‌కు డిజిటల్ స్కై ఆన్లైన్ ప్లాట్ ఫాం నుంచి ముందస్తు అనుమతులు పొందాల్సిందే...డ్రోన్ల ద్వారా సరుకుల రవాణా కోసం ప్రభుత్వం ప్రత్యేక కారిడార్లను నిర్దేశిస్తుంది. రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ పొందాలంటే అధీకృత సంస్థలో నిర్దేశిత కాలం పైలెట్ శిక్షణ పొంది ఉండాలి. శిక్షణ సంస్థ నుంచి పొందిన సర్టిఫికెట్తో పాటు నైపుణ్య పరీక్ష తర్వాత నిర్దేశిత ఫీజు చెల్లిస్తే డీజీసీఏ(సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం) పైలెట్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఇది పది సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. కనీసం టెన్త్ పాసై 18 ఏళ్లకుపైబడి 65 సంవత్సరాలలోపు వయస్సు కలిగి, ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలో శిక్షణ పొందిన ఎవరైనా రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ పొందేందుకు అర్హులే. డ్రోన్ల వేగంపై పరిమితులు.. మైక్రో డ్రోన్ భూమికి 60 మీటర్ల ఎత్తుకుపైన, సెకనుకు 25 మీటర్ల వేగానికి మించి ప్రయాణించరాదు. చిన్న డ్రోన్ 120 మీటర్ల ఎత్తుకుపైగా...సెకనుకు 25 మీటర్ల వేగానికి మించి ప్రయాణించరాదు. మధ్యరకం, పెద్ద డ్రోన్లు డీజీసీఏ అనుమతుల మేరకు ఆ పరిధిలోనే ప్రయాణించాలి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లను ఆపరేట్ చేయటం నేరం. పౌరవిమానయాన శాఖ వెబ్‌సైట్‌లోని మ్యాప్‌లో ఆకుపచ్చ రంగు కలిగిన ప్రాంతంలో డ్రోన్లు ప్రయాణించవచ్చు. పసుపురంగు ప్రాంతంలో నిబంధనల మేరకు ప్రయాణించాలి. ఎరుపురంగు సూచించిన ప్రాంతంలో డ్రోన్లను అనుమతించరు. అంతర్జాతీయ విమానాశ్రయాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో, ఇతర ఎయిర్‌పోర్టులకు మూడు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను అనుమతించరు. అంతర్జాతీయ సరిహద్దులకు 25 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను నిషేధించారు. హోం మంత్రిత్వ శాఖ నిర్దేశించిన కీలక ప్రాంతాల్లో డ్రోన్ల ఆపరేషన్‌కు ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. రాష్ట్ర రాజధాని ప్రాంతాల్లో సెక్రటేరియట్ కాంప్లెక్సుకు మూడు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను అనుమతించరు. వీటితో పాటు నిషేధిత, ప్రమాదకర ప్రాంతాల్లో డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. -
కొత్త అగ్రి డ్రోన్ మోడల్‌కు డీజీసీఏ సర్టిఫికేషన్
న్యూఢిల్లీ: దేశీయంగా రూపొందించిన కొత్త అగ్రి–డ్రోన్ ’అగ్రిబాట్ ఏ6’కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి ’టైప్ సర్టిఫికెట్’ లభించినట్లు ఐవోటెక్వరల్డ్ ఏవిగేషన్ సంస్థ తెలిపింది. నిర్దేశిత సాంకేతిక, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్దిష్ట ఉత్పత్తి ఉన్నట్లు ధృవీకరిస్తూ డీజీసీఏ ఈ సర్టిఫికెట్‌ను అధికారికంగా జారీ చేస్తుంది. క్రితం మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఆవిష్కరించిన మోడల్ పరిమాణంలో 30 శాతం చిన్నదిగా ఉంటుందని సంస్థ సహ వ్యవస్థాపకుడు దీపక్ భరద్వాజ్ తెలిపారు. అధునాతన డిజైన్ అయినప్పటికీ కొత్త ఉత్పత్తి రేటును పెంచలేదని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,000 పైచిలుకు డ్రోన్లను విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు భరద్వాజ్ పేర్కొన్నారు. -
పెరిగిన డ్రోన్ పైలెట్లు!
దేశంలో ఈ ఏడాది జూలై 1 నాటికి 5,072 మంది పైలెట్లు సాక్షి, అమరావతి: ఏడాది వ్యవధిలోనే దేశంలో డ్రోన్ పైలెట్లు 1,365 శాతం మేర పెరిగారని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్లో వెల్లడించింది. సాధారణ సేవల నుంచి అత్యవసర సేవల వరకు అంతటా డ్రోన్ల వినియోగం పెరుగుతోందని పేర్కొంది. గత ఏడాది జూలై 1 నాటికి దేశవ్యాప్తంగా కేవలం 346 మంది సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్లుండగా.. ఈ ఏడాది జూలై 1 నాటికి ఆ సంఖ్య 5,072కు పెరిగిందని ఆ శాఖ తెలిపింది. 427 మంది సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్లతో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉంది. అత్యధికంగా తమిళనాడులో ఉన్నారు. ఆ తరువాత స్థానంలో మహారాష్ట్ర ఉంది. అనేక రంగాల్లో వినియోగం.. ఇక డ్రోన్స్ వినియోగం వ్యవసాయంతో పాటు వ్యాక్సిన్ డెలివరీ, నిఘా, శోధన, రక్షణ, రవాణా, మ్యాపింగ్ రంగాల్లో ఉందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా వీటిని ఉపయోగించనున్నట్లు పేర్కొంది. మరోవైపు.. డ్రోన్స్ రిమోట్ పైలెట్ శిక్షణ కోసం వివిధ రాష్ట్రాల్లో 60 సంస్థలకు అనుమతులు మంజూరు చేశారు. ఏపీ విషయానికొస్తే గుంటూరులో రెండు సంస్థలకు, హిందూపురంలో ఒక సంస్థకు కేంద్రం అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగంలో వీటి వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు చర్యలు చేపట్టింది. అలాగే, వచ్చే నెలలో 500 కిసాన్ డ్రోన్స్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. రైతుల ఖర్చులు తగ్గించేందుకు.. డ్రోన్ రిమోట్ పైలెట్ల శిక్షణకు రైతులతో పాటు గ్రామాల్లోని నిరుద్యోగ యువతను రాష్ట్ర ప్రభుత్వం ఎంపికచేసి వారికి శిక్షణ ఇప్పిస్తోంది. మానవ శ్రమను తగ్గించడంతో పాటు, వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి.. ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డ్రోన్ల వినియోగం పెంచడం ద్వారా పంటల అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్, పురుగు మందులు, పోషకాలను పిచికారీ చేయడానికి ఉపయోగిస్తారు. తద్వారా రైతుల ఉత్పాదకత వ్యయం తగ్గి, ఆదాయం పెరుగుతుంది. -
నిప్పుకు ఇక చెక్
సాక్షి, అమరావతి: అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఆకాశం నుంచి ఎగురుకుంటూ డ్రోన్లు వచ్చేస్తాయ్. మంటలు చెలరేగిన భవనాల్లోకి చకచకా వెళ్లి మంటల్ని అదుపుచేసే రోబోలు సైతం రాబోతున్నాయ్. త్వరలో రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధునాతన సాధనా సంపత్తిని సంతరించుకోనుంది. అగ్ని ప్రమాదాలకు తక్షణం చెక్ పెట్టే లక్ష్యంతో రాష్ట్ర అగ్నిమాపక వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. అందుకోసం రాష్ట్ర విపత్తుల స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), అగ్నిమాపక వ్యవస్థలకు ఆధునిక పరికరాలను సమకూర్చేందుకు ప్రణాళికను ఆమోదించింది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులు రూ.295 కోట్లతో కార్యాచరణ చేపట్టింది. ఇరుకైన ప్రదేశాలు.. ఎత్తైన భవనాల్లోకీ వెళ్లేలా.. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న కొద్దీ నగరాలు, పట్టణాల జనాభా అధికంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా నగర, పట్టణ ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. పెద్దపెద్ద ఆకాశ హార్యా్మలు, పలు కంపెనీలు నిర్మాణం సర్వసాధారణంగా మారింది. అటువంటి ఎత్తైన భవనాలు, కంపెనీల కార్యాలయాలతోపాటు నగరాలు, పట్టణాల్లో ఇరుకైన ప్రదేశాల్లో పొరపాటున అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మంటలను అదుపు చేయడం సవాల్‌గా మారింది. ఫైర్ ఇంజిన్లు, ఇతర అగ్నిమాపక వాహనాలు, పరికరాలను ప్రమాదం సంభవించిన ప్రదేశానికి తీసుకువెళ్లి మంటలను అదుపు చేయడం అంత సులభం కాదు. అటువంటి పరిస్థితుల్లో కూడా కనిష్ట సమయంలో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక శాఖను ఆధునికీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి మొత్తం రూ.295 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందులో 50 శాతం నిధులతో ఆధునిక అగ్నిమాపక పరికరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో అగ్నిమాపక డ్రోన్లు, రోబోలతోపాటు ఎత్తైన భవనాల్లో చెలరేగే మంటలను అదుపు చేసేందుకు ఉపయోగించే హైడ్రాలిక్ ప్లాట్ఫారాలతోపాటు 16 రకాల ఆధునిక పరికరాలు ఉండటం విశేషం. మరో 30 శాతం నిధులతో కొత్త అగ్నిమాపక కేంద్రాల నిర్మాణం, 20 శాతం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలుగా గుర్తించి వాటిని వినియోగించనుంది. కొనుగోలు చేయనున్న పరికరాలు ♦ అగ్ని మాపక డ్రోన్లు, అగ్నిమాపక రోబోలు ♦హైడ్రాలిక్ ప్లాట్‌ఫారాలు, టర్న్ టేబుల్ ల్యాడర్లు ♦ ఇరుకు ప్రదేశాల్లోకి వెళ్లగలిగే అగ్నిమాపక మోటారు సైకిళ్లతో కూడిన మిస్ట్ ఫైటింగ్ యూనిట్లు ♦ హజ్మత్ వ్యాన్లు, అత్యవసర వైద్య సహాయం అందించే మెడికల్ కంటైనర్లు ♦ లైట్ రెస్క్యూ టెండర్లు, మినీ వాటర్ టెండర్లు ♦ క్విక్ రెస్పాన్స్ మల్టీ పర్సస్ వాహనాలు, రెస్క్యూ బోట్లు ♦ వాటర్ బ్రౌజర్లు, హై ప్రెజర్ పంపులతో కూడిన రెస్క్యూ వాహనాలు ♦ ఫైర్ ఫైటింగ్ ఫిటింగ్స్, సిబ్బందికి రక్షణ కల్పించే పరికరాలు -
డ్రోన్లతో వెదసాగు సక్సెస్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వరిసాగులో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ ముందుకు సాగుతోంది. దేశంలోనే మొదటిసారిగా వ్యవసాయ డ్రోన్ల వినియోగంపై రైతులకు, గ్రామీణ యువతకు అవగాహన కల్పిస్తూ, వ్యవసాయంలో రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపును నిజం చేస్తోంది. ఇప్పటివరకు 10 ప్రధాన పంటల్లో డ్రోన్లతో పురుగుమందులు చల్లడానికి ప్రామాణికాలను తయారుచేసి, శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా వెదపద్ధతి(విత్తనాలు వెదజల్లడం)లో విత్తనాలు చల్లే ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాలు సకాలంలో పడకపోవడంతో రైతులు సకాలంలో వరినాట్లు వేయలేకపోతున్నారు. ఖరీఫ్ సాగు ఆలస్యం అవుతోంది. దీంతో రైతులు వెదసాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వరిసాగులో 21 శాతం వరకు వెదపద్ధతిలోనే జరుగుతున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వెదపద్ధతిలో గత ఏడాది 100 ఎకరాల్లో వరి, మినుము, పచ్చి రొట్ట సాగుచేశారు. దుక్కి దున్నిన తరువాత నుంచి అన్ని పంటల్లో డ్రోన్లతో అన్ని రకాల పనులు చేసుకోవచ్చని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతను జోడించి డ్రోన్లతో వరి విత్తనాలను వెదజల్లించాలని వర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. సమయం, డబ్బు ఆదా డ్రోన్లతో వెదపద్ధతిలో తక్కువ విత్తనాలు సరిపోతాయి. సమయం, డబ్బు ఆదా అవుతాయి. మొదటి ఏడాది ఫలితాలను విశే్లషించిన తర్వాత వెదపద్ధతిలో విత్తనాలను నాటడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని గుర్తించారు. రెండో సంవత్సరం ఫలితాలు ఆశాజనకంగా వస్తే దుక్కి నుంచి కోత వరకు డ్రోన్లను ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ట్రాక్టర్లు, చేతితో చల్లే పద్ధతిలో ఎకరానికి 16 నుంచి 30 కిలోల వరకు విత్తనాలు వినియోగిస్తున్నారు. అదే డ్రోన్ ద్వారా చల్లితే 8 నుంచి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి. గత ఏడాదిగా డ్రోన్ల సాయంతో విత్తనాలు చల్లడం, ఎరువులు (యూరియా, డీఏపీ) వేయడం, పురుగుమందుల పిచికారీలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఎకరం పొలంలో మూడు నిమిషాల్లో విత్తనాలు చల్లవచ్చు. 50 కిలోల రసాయనిక ఎరువును ఎనిమిది నిమిషాల్లో చల్లవచ్చు. ఎకరా విత్తనాలు విత్తుకునేందుకు రూ.400 నుంచి రూ.500 ఖర్చవుతుంది. విత్తనాల్లో 25 శాతం ఆదా అవుతాయి. పురుగుమందుల వ్యయం 25 శాతం తగ్గడమేగాక చల్లే ఖర్చులో రూ.400 ఆదా అవుతాయి. గత ఏడాది వెదపద్ధతిలో చేసిన సాగు ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వడంతో ఈ విధానంపై పరిశోధనలను ముమ్మరం చేసింది. డీజీసీఏ అనుమతితో శిక్షణ దేశంలో ఎక్కడా లేనివిధంగా డ్రోన్లను వినియోగించడంతోపాటు డీజీసీఏ అనుమతి తీసు కుని వ్యవసాయ డ్రోన్ పైలట్లకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శిక్షణ ఇస్తోంది. వర్సిటీలోని శిక్షణ కేంద్రంలో ఇప్పటివరకు 217 మంది రైతులు, గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి సరి్టఫికెట్లు అందజేసింది. మరో వందమంది వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చింది. తిరుపతి, పులివెందులలో డ్రో¯Œ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు అధునాతన సాంకేతికత ఆధునిక వ్యవసాయ విధానాలను రైతులకు అందించేందుకు దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ల ద్వారా వ్యవసాయాన్ని ప్రయోగాత్మంగా చేపట్టి మంచి ఫలితాలను సాధించాం. వెదపద్ధతిలో వరిసాగు, పురుగుమందులు, ఎరువుల పిచికారీలో మంచి ఫలితాలు వచ్చాయి. మరికొంత సాంకేతికతను రైతులకు అందించేందుకు రోబో టెక్నాలజీపై ప్రయోగాలు చేపట్టాం. అధునాతన సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాం. – డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, వీసీ, ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ -
డ్రోన్ సాగు సూపర్!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయమంటే దుక్కి దున్నడం నుంచి పంట కోత దాకా ఎన్నో పనులు.. తీరిక లేని శ్రమ.. కూలీల కొరత ఓ వైపు, సమయాభావం మరోవైపు ఇబ్బందిగా మారిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో రైతన్నలకు వ్యవ‘సాయం’ కోసం డ్రోన్లతో ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టి పెట్టింది. కేవలం పురుగు మందులు పిచికారీ చేయడానికే పరిమితం కాకుండా.. విత్తనాలు, ఎరువులు చల్లడం.. పంటలో చీడపీడలు, తెగుళ్లను, పూత, కాత పరిస్థితిని గుర్తించేలా ఫొటోలు తీయడం.. దిగుబడి ఏ మేరకు వచ్చే అవకాశం ఉందనే అంచనా వేసేందుకు వీలైన సమాచారం సేకరించడానికి వీలుగా డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. డ్రోన్లను సరైన తీరులో వినియోగించడం ద్వారా.. సాగులో పురుగు మందులు, ఎరువుల వృధాను అరికట్టవచ్చని, కూలీల కొరతకు చెక్‌పెట్టవచ్చని వర్సిటీ అధికారులు చెప్తున్నారు. వరిలో విత్తనాలు వెదజల్లేలా.. డ్రోన్ల ద్వారా వరి విత్తనాలను వెదజల్లి సాగు చేసే విధానాన్ని వ్యవసాయ వర్సిటీ అభివృద్ధి చేస్తోంది. దీనిపై పరిశోధన కొనసాగుతోందని, త్వరలో రైతులకు అందుబాటులోకి తెస్తామని వర్సిటీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వరి నారు పెంచడానికి కొన్ని రోజులు పడుతుందని, తర్వాత నారు తీసి నాట్లు వేయడానికి సమయం పడుతుందని.. ఇదే సమయంలో కూలీల కొరత, ఖర్చు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేస్తే బాగుంటుందని, దీనికి డ్రోన్ సాంకేతికతను వినియోగించేలా పరిశోధన చేస్తున్నామని వివరించారు. డ్రోన్‌తో రోజుకు ఏకంగా 30 ఎకరాల్లో ఐదు వరుసల్లో వరి విత్తనాలను వెదజల్లవచ్చని చెప్తున్నారు. దీనివల్ల రైతులకు కూలీల ఖర్చు తగ్గుతుందని, సమయం కలిసివస్తుందని అంటున్నారు. కలుపు మందును కూడా డ్రోన్ల సాయంతో చల్లేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంటున్నారు. డ్రోన్లపై శిక్షణ కోసం అకాడమీ రాష్ట్రంలో నిరుద్యోగులకు, ఆసక్తి కలిగిన వారికి డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని.. ఇందుకోసం డ్రోన్ అకాడమీని నెలకొల్పాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని.. వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర రంగాల్లో డ్రోన్లను ఎలా వాడాలో శిక్షణ ఇస్తామని అధికారులు తెలిపారు. 18 ఏళ్ల నుంచి 60ఏళ్ల మధ్య వయసున్న వారికి శిక్షణ అవకాశం ఉంటుందని.. ఇందుకోసం తప్పనిసరిగా పాస్‌పోర్ట్ ఉండాలని, కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని వెల్లడించారు. ఆరు రోజులపాటు సమగ్రంగా శిక్షణ ఇచ్చేందుకు రూ.45 వేలు ఫీజు ఖరారు చేశారు. ప్రధానంగా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఉంటుంది. పురుగు మందులు చల్లడంపై ప్రత్యేకంగా.. రాష్ట్రంలో ప్రధానంగా సాగు చేసే వరి, పత్తి, వేరుశనగ, కంది, పొద్దు తిరుగుడు, ఆముదం, సోయాబీన్ పంటల్లో డ్రోన్ల ద్వారా పురుగు మందులను చల్లడంపై ప్రత్యేక శిక్షణ ఉంటుందని వ్యవసాయ వర్సిటీ వెల్లడించింది. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)ను రూపొందించింది. ఉదాహరణకు డ్రోన్ల ద్వారా పురుగు మందు చల్లేటపుడు వాటి రెక్కల నుంచి వచ్చే గాలి వేగానికి వరి చేను విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎంత ఎత్తు నుంచి డ్రోన్లను ఉపయోగించాలి, ఎంత స్థాయిలో మందును విడుదల చేయాలన్నది నిర్ణయించారు. ► ఇక సాధారణ తైవాన్ స్ప్రేయర్ల ద్వారా ఎకరా పంటకు పురుగుమందు పిచికారీ చేయాలంటే 150 లీటర్ల నుంచి 200 లీటర్ల నీటిని వాడుతారు. అదే డ్రోన్ల ద్వారా అయితే కేవలం 20 లీటర్లతో పిచికారీ చేయొచ్చు. ఒక రోజులో ఏకంగా 30 ఎకరాల్లో మందును చల్లవచ్చు. ప్రత్యేక పరికరాలను అమర్చడం ద్వారా.. కాండం మొదట్లోకి పురుగు మందు చేరేలా చేయవచ్చు. ► కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తెచ్చిన నానో యూరియాను కూడా డ్రోన్ల ద్వారా పంటలపై చల్లవచ్చని వ్యవసాయ వర్సిటీ వరి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంగోపాల్ వర్మ తెలిపారు. పురుగు మందులను తక్కువ వ్యవధిలో, పొదుపుగా, సమర్థవంతంగా చల్లడానికి డ్రోన్లతో వీలవుతుందని వివరించారు. అదనపు పరికరాలను అమర్చి.. పంటలకు డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగు మందులు చల్లడానికి సంబంధించి అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని పంటలకు పైపైన స్ప్రే చేస్తే సరిపోతుంది. మరికొన్నింటికి కాండం మొదట్లో చల్లాల్సి ఉంటుంది. దీనితోపాటు పంట పరిస్థితి ఏమిటి? ఏవైనా చీడపీడలు ఆశించాయా? అన్నది తెలుసుకునేందుకు ఫొటోలు తీయాలి. వాటిని వ్యవసాయాధికారికి పంపాలి. ఈ క్రమంలోనే ఆయా అవసరాలకు అనుగుణంగా డ్రోన్లకు ప్రత్యేక పరికరాలను అమర్చాలని అధికారులు భావిస్తున్నారు. ఇక పంటల పూత, కాత ఎలా ఉంది? దిగుబడి ఏమేరకు వచ్చే అవకాశం ఉంది వంటి ప్రతి అంశాన్ని సూక్ష్మస్థాయిలోనూ పర్యవేక్షించేలా డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. రైతులకు సబ్సిడీపై డ్రోన్లు రాబోయే రోజుల్లో గ్రామాల్లో సాగు కోసం డ్రోన్ల వినియోగం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా.. ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరి కోత యంత్రాలు వంటివి ఇవ్వగా.. భవిష్యత్తులో డ్రోన్లను అందజేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. ఒక్కో డ్రోన్ ధర రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వాటిని ఆగ్రోస్ సేవా కేంద్రాల నిర్వాహకులకు సబ్సిడీపై ఇవ్వాలని యోచిస్తున్నారు. డ్రోన్ల సాగులో దేశానికే మార్గదర్శకంగా.. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి తెలంగాణ దేశానికే మార్గనిర్దేశం చేస్తోందని వ్యవసాయశాఖ అధికారులు చెప్తున్నారు. వివిధ పంటల్లో డ్రోన్ల వినియోగం, నిర్వహణకు సంబంధించి జయశంకర్ యూనివర్సిటీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక (ఎస్ఓపీ)నే కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించిందని అంటున్నారు. వ్యవసాయ డ్రోన్ల వినియోగంపై సాధారణ మార్గదర్శకాలివీ.. ► నీటి వనరులు, నివాస ప్రాంతాలు, పశుగ్రాసం పంటలు, ప్రజా వినియోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ మొదలైన వాటికి దూరంగా డ్రోన్లను వినియోగించాలి. ► డ్రోన్ వాడకానికి సంబంధించి గ్రామ పంచాయతీ, సంబంధిత వ్యవసాయ అధికారి కనీసం 24 గంటల ముందుగా అనుమతి ఇస్తారు. ► డ్రోన్ మంచి స్థితిలో ఉందని, సురక్షితంగా ప్రయాణించడానికి సరిపోతుందని ముందే సరిచూసుకోవాలి. ► దానితో పిచికారీ చేసే సమయంలో ఆయా ప్రాంతాల్లోకి జంతువులు, వ్యక్తులు ప్రవేశించకూడదు. ► ఆపరేటర్లు డ్రోన్ ఆపరేషన్, సురక్షితమైన పురుగు మందుల పిచికారీ.. ఈ రెండింటిపై శిక్షణ పొంది ఉండాలి. ► ముందుగానే ప్రతిపాదిత ప్రాంతం, సరిహద్దు, అడ్డంకులు (గోడలు, చెట్లు)ను పరిశీలించి ఆ ప్రకారం డ్రోన్‌ను ఆపరేట్ చేయాలి. ► ప్రభుత్వ సంస్థలు, సైనిక స్థావరాలపై లేదా డ్రోన్లకు అనుమతి లేని జోన్ల మీదుగా ఎగురవేయవద్దు. అనుమతి ఇవ్వని ప్రైవేట్ ఆస్తులపైనా డ్రోన్ ఎగరవేయవద్దు. -
రోజుకు 30 ఎకరాలకు మందుల పిచికారీ.. వ్యవసాయానికి డ్రోగో డ్రోన్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డ్రోన్ల తయారీ, సాంకేతిక సేవల్లో ఉన్న డ్రోగో డ్రోన్స్ మానవరహిత వైమానిక వాహనం (యూఏవీ) క్రిషి 2.0 ఆవిష్కరించింది. ఇది 10 కిలోల బరువు మోయగలదు. రోజుకు 30 ఎకరాల్లో పురుగు మందులను పిచికారీ చేస్తుంది. డ్రోన్ల తయారీకి అవసరమైన ధ్రువీకరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి కంపెనీ అందుకుంది. డ్రోన్లను హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లి కేంద్రంలో తయారు చేస్తారు. ఏడాదికి 3,000 డ్రోన్లను ఉత్పత్తి చేస్తామని డ్రోగో డ్రోన్స్ సీఈవో యశ్వంత్ బొంతు తెలిపారు. డిమాండ్‌నుబట్టి సామర్థ్యం పెంచుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 26 సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. -
కిసాన్ డ్రోన్లకు రైతుల ఆసక్తి
సాక్షి, అమరావతి: వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలిదశలో ఆగస్టులో అన్ని జిల్లాల్లో మొత్తం 500 డ్రోన్లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. రైతులతోపాటు నిరుద్యోగ యువతకు డ్రోన్ పైలెట్ శిక్షణ ఇస్తున్నారు. జిల్లాకు 20 మంది చొప్పున మొత్తం 520 మందికి డ్రోన్ పైలెట్ శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 212 మంది రైతులు, 96 మంది నిరుద్యోగులు డ్రోన్ పైలట్ శిక్షణ పొందేందుకు ప్రతిపాదనలు సమర్పించారు. ఈ మొత్తం 308 మందిలో 203 మందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఆగస్టు కల్లా రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఉన్న కస్టమ్ హైరింగ్ కేంద్రాల్లో 500 డ్రోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినందున మిగతా యూనిట్లకు అవసరమైన వారికి శిక్షణ కోసం ఈ నెల 15వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. కస్టమ్ హైరింగ్ సెంటర్‌కి తప్పనిసరిగా ఒక డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) సర్టిఫైడ్ పైలెట్ ఉండాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా గుంటూరు లాంలోని వ్యవసాయ డ్రోన్ పరిశోధన కేంద్రమైన సెంటర్ ఫర్ అప్సరాకు డ్రోన్ల రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కోర్సుకు డీజీసీఏ అనుమతి ఇచ్చిందని తెలిపారు. అక్కడ ఒక్కో బ్యాచ్‌లో 20 మందికి 12 రోజులు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. తాడేపల్లిలోని డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి డీజీసీఏ అనుమతి ఇచ్చిందని, ఇక్కడ పదిరోజుల శిక్షణ ఇస్తారని ఆయన తెలిపారు. రైతులకు లబ్ధి వ్యవసాయ కార్యకలాపాల్లో మానవశ్రమను తగ్గించడంతో పాటు వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, ఉత్పత్తి పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డ్రోన్ల వినియోగం పెంచుతోంది. పంటల అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్, పురుగుమందులు, పోషకాలు పిచికారీ చేయడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రైతుల ఉత్పాదక వ్యయం తగ్గి ఆదాయం పెరుగుతుంది. -
Delhi: ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్ కలకలం..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ సంచారం కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఢిల్లీలోని మోదీ నివాసంపై ఓ డ్రోన్ కనిపించడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నో ఫ్లయింగ్ జోన్లో డ్రోన్ సంచరించడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ప్రధానికి భద్రతా కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అధికారులు వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. డ్రోన్ సంచరించేప్పుడు ప్రధాని మోదీ ఇంట్లోనే ఉన్నారని భద్రతా సిబ్బంది తెలిపారు. ప్రధాని నివాసంపై పలుమార్లు డ్రోన్ చక్కర్లు కొట్టినట్లు ఎస్పీజీ నుంచి సమాచారం అందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం డ్రోన్ ఘటనపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి డ్రోన్‌ను స్వాధీనం చేసుకోలేదని పేర్కొన్నారు. కాగా పీఎం మోదీ నివాసం నో ఫ్లై జోన్ లేదా నో డ్రోన్ జోన్ కిందకు వస్తుందన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: మోదీ అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ -
చుక్కేసుకుంటారా?. చుక్కల్లోకి చూసి..
-
మూడేళ్లలో లక్ష మంది డ్రోన్ పైలట్లు కావాలి
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయేతర, పారిశ్రామిక రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే మూడేళ్లలో లక్ష మంది డ్రోన్ పైలట్ల అవసరం ఉంటుందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది. డ్రోన్ టెక్నాలజీ దేశానికి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించడంతో పాటు డ్రోన్స్ వినియోగ నిబంధనలను సరళీకృతం చేసినట్లు ఆ శాఖ పేర్కొంది. డ్రోన్స్ డిమాండ్‌కు తగినట్లు నైపుణ్య శిక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే 48 డ్రోన్ శిక్షణ పాఠశాలలకు అనుమతి ఇచ్చామని తెలిపింది. ఇంకా ఈ పాఠశాలల అనుమతికోసం పలు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయంది. 116 ఐటీఐల్లో స్వల్పకాలిక కోర్సులు డ్రోన్స్ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌తో సహా 12 రాష్ట్రాల్లో 116 ఐటీఐల్లో స్వల్పకాలిక కోర్సుల నిర్వహణకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఇప్పటికే అనుమతించింది. ఈ ఐటీఐలు డ్రోన్ సర్వీస్ టెక్నిíÙయన్, డ్రోన్ మాన్యుఫ్యాక్చరింగ్‌తో సహా ఆరు స్వల్పకాలిక నైపుణ్య కోర్సులను నిర్వహించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ అనుమతించింది. వ్యవసాయరంగంలో ప్రోత్సాహం ఖర్చును తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా డ్రోన్స్ వినియోగాన్ని పెంచేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. వ్యవసాయరంగంలో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా స్థానిక యువతకు డ్రోన్స్ వినియోగంలో అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఐటీఐల్లో డ్రోన్స్‌పై నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా రాష్ట్రంలో 10 ఐటీఐల్లో డ్రోన్స్ రంగంలో స్వల్పకాలిక నైపుణ్య శిక్షణకు అనుమతి మంజూరు చేసింది. మరో పక్క కిసాన్ డ్రోన్స్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు వ్యక్తిగతంగాను లేదా ఎఫ్‌పీవోకు బ్యాంకులు అవసరమైన రుణాలను మంజూరు చేయాల్సిందిగా నాబార్డు సూచించింది. పది లీటర్ల సామర్థ్యం గల కిసాన్ డ్రోన్ యూనిట్ వ్యయం ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలుగా ఖరారు చేసినట్లు నాబార్డు పేర్కొంది. ఆ మేరకు రైతులకు రుణాలను మంజూరు చేయాల్సిందిగా బ్యాంకులకు నాబార్డు సూచించింది. డ్రోన్ల తయారీకి ప్రోత్సాహం డ్రోన్స్ ప్రాముఖ్యత నేపథ్యంలో దేశంలోనే వాటి తయారీ, విడి భాగాలు తయారీని ప్రోత్సహించడానికి మూడేళ్లలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద రూ. 120 కోట్లు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. డ్రోన్లు, విడిభాగాలు తయారీలో దేశం స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు ప్రపంచంతో పోటీ పడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. -
అక్రమంగా ప్రవేశిస్తే.. మట్టుపెట్టేలా
సాక్షి, విశాఖపట్నం: శత్రుదేశాల కుయుక్తులను తిప్పికొట్టేందుకు భారత నౌకాదళం ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా యాంటీ డ్రోన్ సిస్టమ్‌తో పాటు నేవీ ఎయిర్‌ఫీల్డ్‌ను మరింత పక్కాగా నిర్వహించే వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చింది. శత్రుదేశాల డ్రోన్లను మట్టుపెట్టేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్(ఎన్ఏడీఎస్)ను ఐఎన్ఎస్ డేగాలో సోమవారం తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా ప్రారంభించారు. భారీ డ్రోన్ల నుంచి తూనీగల పరిమాణంలో ఉన్న మైక్రో డ్రోన్ల వరకు దేనినైనా సరే.. లేజర్ ఆధారిత కిల్ మెకానిజం సహాయంతో గుర్తించి వెంటనే మట్టుపెట్టేలా ఈ వ్యవస్థను రూపొందించారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) సహకారంతో దీనిని తయారు చేశారు. 360 డిగ్రీల కోణంలో.. 10 కిలోమీటర్ల పరిధిలో ఏ డ్రోన్ ఉన్నా.. దాన్ని జూమ్ చేసి.. వివరాలు సేకరించేలా ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు అమర్చారు. రేడియో ఫ్రీక్వెన్సీ, డిటెక్టర్ల సహకారంతో ఆ డ్రోన్లను గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఎవరు ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారనే సమాచారాన్ని క్షణాల్లో సేకరిస్తుంది. సమాచారం వచ్చిన వెంటనే శత్రు డ్రోన్ల సిగ్నల్స్‌ను జామ్ చేసి.. దాన్ని నాశనం చేసేలా ఎన్ఏడీఎస్ పనిచేస్తుంది. యుద్ధ నౌకల్లో ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు భారత నౌకాదళం చర్యలు చేపట్టింది. నేవీ ఎయిర్స్టేషన్లకు రక్షణ కవచం పఠాన్‌కోట్ తరహా ఉగ్రదాడులు పునరావృతం కాకుండా ప్రత్యేక వ్యవస్థను కవచంలా ఏర్పాటు చేసుకోవాలని భారత రక్షణ శాఖ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నేవల్ ఎయిర్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్(ఎన్ఏఐఎస్ఎస్)ను అభివృద్ధి చేశారు. నౌకాదళం ఎయిర్‌స్టేషన్ల పరిధిలోని భద్రతా వ్యవస్థను పూర్తిగా అప్‌గ్రేడ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మల్టీ లేయర్ సెక్యూరిటీ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 6 నేవీ ఎయిర్స్టేషన్లలో ఈ ఎన్ఏఐఎస్ఎస్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గోవాలోని ఐఎన్ఎస్ హన్సా, ముంబైలోని ఐఎన్ఎస్ షిక్రా, అరక్కోణంలోని ఐఎన్ఎస్ రజాలీ, విశాఖలోని ఐఎన్ఎస్ డేగా, పోర్టుబ్లెయిర్‌లోని ఐఎన్ఎస్ ఉత్క్రోష్, కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడను ఎంపిక చేశారు. సోమవారం విశాఖలోని ఐఎన్ఎస్ డేగాలో ఈ కొత్త భద్రతా వ్యవస్థను ప్రారంభించారు. ఈ ఎయిర్‌స్టేషన్‌లో స్మార్ట్ ఫెన్స్‌ను అమర్చారు. దీనిని సీసీ కెమెరాలకు అనుసంధానం చేశారు. ఈ స్మార్ట్ ఫెన్స్ లోపలికి ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్‌తో సహా ఏది ప్రవేశించినా.. వెంటనే కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేస్తుంది. సెకన్ల వ్యవధిలో మొత్తం వ్యవస్థకు సమాచారం అందజేస్తుంది. అనుమతి లేకుండా అక్రమంగా లోపలికి ఎవరు ప్రవేశించాలని భావించినా వారిని మట్టుపెట్టేలా యాంటీ పెనిట్రేషన్, థర్మల్ సెన్సార్లతో పాటు డ్రోన్ల పర్యవేక్షణతో పహారా ఏర్పాటు చేశారు. ఎయిర్‌స్టేషన్‌కు దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ వ్యాపింపజేసి.. శత్రువుల చొరబాట్లను సులువుగా పసిగట్టవచ్చు. చదవండి: బస్సంతా మహిళలే.. మరి మా పరిస్థితి ఏంటి..? -
డ్రోన్ పైలట్ అవుతారా? శిక్షణ కోర్సులు అందించనున్న ఎయిర్‌బస్
ముంబై: యూరోపియన్ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్‌బస్ భారత్‌లో డ్రోన్ పైలట్ల శిక్షణ కోర్సులను అందించనున్నట్లు వెల్లడించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదం పొందిన ఈ సర్టిఫికెట్ కోర్సులు అయిదు రోజుల పాటు ఉంటాయి. సూక్ష్మ, చిన్న కేటగిరీ డ్రోన్ల కోసం ఉద్దేశించిన కోర్సులు బెంగళూరులోని ఎయిర్‌బస్ ట్రైనింగ్ సెంటర్లో జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. డ్రోన్ల నిబంధనలు, ఫ్లయిట్ ప్రాథమిక సూత్రాలు, నిర్వహణ మొదలైన వాటిపై డీజీసీఏ ఆమోదించిన ఇన్స్ట్రక్టర్లు శిక్షణనిస్తారని పేర్కొంది. సిమ్యులేటర్ శిక్షణతో పాటు ప్రాక్టికల్ ఫ్లయింగ్ పాఠాలు కూడా ఉంటాయని వివరించింది. 10వ తరగతి పూర్తి చేసిన, 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇందు కోసం దరఖాస్తు చేసుకునేవారికి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ ఉండాలి. అలాగే శిక్షణ పొందేందుకు, డ్రోన్లను ఆపరేట్ చేయడానికి ఫిట్నెస్ను ధ్రువీకరించే మెడికల్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Palm Payment: ఇదేదో బాగుందే.. వట్టి చేతులు చాలు! పేమెంట్ ఈజీ -
అద్భుతంగా పోలవరం.. డ్రోన్స్ విజువల్స్ మీరు ఓ లుక్కేయండి..(ఫొటోలు)
-
Video: దుర్గంచెరువు వద్ద డ్రోన్ షో.. ఆకాశంలో అద్భుతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలంలో చేపట్టిన ప్రగతిపై ఆకాశంలో డ్రోన్లతో ప్రదర్శన కనువిందు చేసింది. మాదాపూర్‌లోని దుర్గంచెరువు వద్ద సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు. పదిహేను నిమిషాల పాటు డ్రోన్లతో దుర్గంచెరువుపై ఆకాశంలో ఈ ప్రదర్శన సాగింది. 2014–2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. అమరదీపం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, సీఎం కేసీఆర్ చిత్రాలతో కూడిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. దీంతోపాటు దేశంలోనే శాంతి భద్రతలను కాపాడడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసుల ప్రతిభను కూడా ప్రదర్శించారు. ఇటీవల ప్రారంభించిన సచివాలయం, యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు, కాళేశ్వరం ప్రాజెక్టు, దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ టీ హబ్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా, రాష్ట్రంలో ప్రత్యేకతను చాటుకున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్స్, మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీటీమ్స్ ప్రగతిని డ్రోన్ల ద్వారా చిత్రాలతో కూడిన ప్రదర్శన కూడా విశేషంగా ఆలరించింది. ప్రదర్శన ముగిసే వరకు సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. అందరూ ఆసక్తిగా ఈ దృశ్యాన్ని తమ సెల్ఫోన్లలో బంధించారు. ప్రదర్శనను మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, వివేకానంద, ఎమ్మెల్సీ నవీన్‌రావులు, సైబరాబాద్ పోలీసు అధికారులు, సిబ్బంది ఆసక్తిగా తిలకించారు. చదవండి: సీఎం ఆదేశిస్తే డోర్నకల్ నుంచి పోటీ చేస్తా: మంత్రి సత్యవతి రాథోడ్ Drone Show at Durgam Cheruvu by Cyberabad police as part of #తెలంగాణదశాబ్దిఉత్సవాలు #TelanganaTurns10 pic.twitter.com/0Nqa8cy0Eb — Naveena Ghanate (@TheNaveena) June 4, 2023 This drone show with 500 drones is just mind-blowing 👏 Great job @cyberabadpolice 👍#TelanganaTurns10#తెలంగాణదశాబ్దిఉత్సవాలు pic.twitter.com/qlkPwPV7pH — Konatham Dileep (@KonathamDileep) June 4, 2023 -
ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..!
-
ఉక్రెయిన్ ఆత్మస్థయిర్యం పెరిగిందా?
రష్యాతో యుద్ధం ప్రారంభమైనప్పుడు కనిపించినంత బలహీనంగా ఇప్పుడు ఉక్రెయిన్ లేదు. అజేయంగా కనిపిస్తూ రాత్రి పూట మీదపడే రష్యన్ ఆయుధాల నుంచి ఉక్రెయిన్ తనను తాను కాచుకుంటోంది. ఇది కీవ్‌లో వ్యక్తమవుతున్న కొత్త ఆత్మవిశ్వాసంలో కొంతభాగం మాత్రమే. రష్యాలోని తమ స్లీపర్ సెల్స్‌ను క్రియాశీలం చేయడంలో ఉక్రెయిన్ యంత్రాంగం సఫలీకృతం అయినట్లే కనిపిస్తోంది. క్రెమ్లిన్ ఆకాశం మీదుగా ప్రయోగించిన మానవ రహిత డ్రోన్స్ వాస్తవానికి ఉక్రెయిన్ పంచమాంగ దళం పేల్చినవే అయివుండవచ్చని వార్తలు! తూర్పు ఆసియా పర్యటనలో భాగంగా హిరోషిమాలో జెలెన్ స్కీని కలవడానికి మోదీ అంగీకరించడం 15 నెలల యుద్ధం తర్వాత ఉక్రేనియన్ దౌత్యం పురోగమించిందనటానికి సాక్ష్యం. మే 24 నాటికి రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలై 15 నెలలు. అవే శీర్షికలు, అవే చిత్రా లతో విసిగిపోయిన చాలామందికి యుద్ధ అలసట అకస్మాత్తుగా ముగిసిపోయినట్లుగా ఉంది. ఒకే రాత్రి రాజధాని కీవ్‌పై ప్రయోగించిన 30 రష్యన్ క్షిపణుల్లో 29 క్షిపణుల్ని తాము పేల్చివేసినట్లు ఉక్రెయిన్ చేసిన అద్భుత ప్రకటన కారణంగా ఈ అలసట ముగియలేదు. ఈ క్షిపణుల్లో అడ్డుకోడానికి ‘వీల్లేని’ కింజాల్ హైపర్సోనిక్ బాలిస్టిక్ ఆయుధాలు, ఇంకా భూమి, సముద్రం, గగనతలం నుంచి పేల్చిన అదేవిధమైన ఇతర ఆయుధాలు ఉన్నాయి. సముద్రంలోనూ, కీవ్ చరిత్రాత్మక సంప్రదాయ చర్చీల నేపథ్యంలో గగనమార్గాన తాము కూల్చిన క్షిపణుల వీడియోలను, కొన్ని ఫోటోలను ఉక్రెయిన్ ప్రదర్శించినప్పుడు ఆ ప్రకటనలను ప్రపంచం పాక్షికంగానైనా ఎత్తిపట్టింది. యుద్ధం ప్రారంభం నుంచి తన ట్రేడ్ మార్క్ డ్రెస్‌గా మారిన రౌండ్ నెక్ కాలర్ లేని టీ షర్టును ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్ స్కీ వదిలిపెట్టినప్పుడు ఈ యుద్ధకాలపు అలసటకు కాస్త విరామం లభించింది. గత శుక్రవారం జెలెన్స్కీ సైనిక ఛాయలు కలిగిన పోలో షర్టు ధరించి జెడ్డాలో దిగారు. ఇది కుట్టుపని విషయంలో స్వాగతించదగిన మార్పు. డ్రెస్ కోడ్ విషయంలో సంప్రదాయ సున్నితత్వాలకు రాయితీలాగా జెలెన్ స్కీ ధరించిన పోలో షర్ట్ పొడవాటి చేతులను కలిగి తన అరచేతులు, తల, మొహం మినహా చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచింది. అరబ్ లీగ్ సదస్సుకు తగిన మర్యాదను జెలెన్స్కీ ప్రదర్శించారనే చెప్పాలి. గత సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి 77వ సర్వసభ్య సమావేశంలో గుండ్రని నెక్ లైన్, ‘ప్లాకెట్ స్లీవ్’లతో కూడిన ముడతలు పడిన హెన్లీ షర్ట్ ధరించి ప్రసంగించి ప్రోటోకాల్, దౌత్యపరంగా చూపిన అమర్యాదకు ఇది భిన్నం. రష్యన్ గగనతల దాడులను తోసిరాజనడం, రాజధాని కీవ్ వీధుల్లో మడత నలగని దుస్తులు ధరించిన ప్రపంచ దేశాల నేతల ముందు బాగా నలిగిన టీ షర్టులతో కనిపించడం అనేది జెలెన్ స్కీ తనదైన ప్రకటన చేసే విధానం కావచ్చు. కానీ సంవత్సర కాలంగా ఒక పదవిలో ఉన్న అధ్యక్షుడి ఇటువంటి చేష్టలు విసుగు పుట్టించాయి. దేశాధ్యక్షుడు తన కండపుష్టిని అలా ప్రదర్శించడం ప్రమాదకర పరిస్థి తుల్లో జీవిస్తున్న ఉక్రెనియన్ల విశ్వాసాన్ని పెంపొందించవచ్చు లేదా పెంపొందించకపోవచ్చు. కానీ ప్రపంచ ప్రజలకు మాత్రం అది సరైన అభిరుచిగా తోచలేదు. ఇటీవల సంభవించిన మార్పులు కాకతాళీయంగా జరిగినవి కాదు. నిదానంగానే కానీ కచ్చితంగా రష్యా నుండి వచ్చినదానికి ఉక్రె యిన్ తగినట్టుగా స్పందించడం ప్రారంభించింది. గత ఏడాది ఫిబ్ర వరిలో యుద్ధం ప్రారంభమైనప్పుడు రష్యాకు వ్యతిరేకంగా కనిపించినంత బలహీన స్థితిలో ఉక్రెయిన్ ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పటివరకు అజేయంగా కనిపిస్తూ రాత్రి పూట మీదపడే ఆయుధాల నుంచి ఉక్రెయిన్ తనను తాను కాచుకుంటోంది. ఇది కీవ్‌లో వ్యక్తమ వుతున్న కొత్త ఆత్మవిశ్వాసంలో కొంతభాగం మాత్రమే. ఆ డ్రోన్లు రష్యా లోపలి నుండి పేల్చినవే! రష్యాలో నిత్యం ఉనికిలో ఉండే తమ వేలాది ‘స్లీపర్ సెల్స్’ను క్రియాశీలం చేయడంలో జెలెన్ స్కీ యంత్రాంగం సఫలీకృతం అయి నట్లే కనిపిస్తోంది. విశ్వసనీయమైన గణాంకాల ప్రకారం రష్యాలో దాదాపు 60 లక్షలమంది ఉక్రెయిన్ జాతి ప్రజలు నివసిస్తున్నారు. సామీప్యత, ఇంకా రాజకీయాల వల్ల శతాబ్దాల పరస్పర ఏకీకరణ చరిత్ర మిగిల్చిన ఫలితం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో తమ మాతృభూమి కోసం పంచమాంగ దళంగా పనిచేయడానికి రష్యాలోని వేలాది మంది ఉక్రెయిన్ వాసులు సంసిద్ధతతో ఉండటం కద్దు. ఈ నెల మొదట్లో క్రెమ్లిన్ ఆకాశం మీదుగా ప్రయోగించిన మానవ రహిత డ్రోన్స్ వాస్తవానికి రష్యాలోని ఉక్రెయిన్ పంచమాంగ దళం పేల్చినవే అయివుండవచ్చని వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్ భూభాగం నుంచి ఈ డ్రోన్స్‌ను ప్రయోగించి ఉంటే వాటిని రష్యా తప్పకుండా కనిపెట్టే అవకాశం ఉండేది. దేశం లోపలి నుంచి వీటిని పేల్చారు కాబట్టి వాటిని రష్యా కనుగొనలేకపోయిందని చెప్పాలి. రష్యాలో విద్రోహ చర్యలు, ఆస్తి విధ్వంసక చర్యలు పెరుగుతుండటం... రష్యా లోపలి ఉక్రెయిన్ స్లీపర్ సెల్స్ కార్యాచరణ విజయవంతమవుతోందని సూచి స్తోంది. ఈ పరిస్థితి భారత్‌లోకి పాకిస్తాన్ ఎగుమతి చేస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని పోలి ఉంది. చిట్టచివరకు పాశ్చాత్య మిత్ర దేశాల నుంచి జెలెన్ స్కీ అత్యా ధునికమైన ఆయుధ సామగ్రిని అందుకుంటున్నారు కాబట్టి కూడా యుద్ధం ఉక్రెయిన్ వైపునకు తిరుగుతున్నట్లుంది. నాటో సైనిక దళాలు రహస్యంగా యాంటీ మిస్సైల్ బ్యాటరీస్ వంటి హైటెక్ రక్షణ సామగ్రిని నిర్వహిస్తున్నట్లుంది. రష్యా సైనిక లక్ష్యాలను అత్యంత నిర్దిష్టతతో కూల్చడం కూడా నాటో బలగాల జోక్యాన్ని ఎత్తి చూపుతుంది. ఈ యుద్ధం తనకు అనుకూలంగా పరిణమిస్తున్నదానికి సరితూగేట్టుగా జెలెన్స్కీ ఆహార్యం కనబడుతోంది. హూడ్తో కూడిన ముదురు గోధుమ రంగు విండ్చీటర్లో జెలెన్ స్కీ హిరోషిమాలో జరిగిన జి–7 దేశాల సదస్సులో (మే 19–21) పాల్గొనడానికి వచ్చారు. అయితే ఇంకా టైతో కూడిన జాకెట్ ధరించలేదు. అంతకు రెండు రోజుల క్రితం పోలో షర్టులో ఆయన జెడ్డాలో దిగినప్పుడు, ఆయన భార్య, ప్రథమ మహిళ ఒలెనా జెలెన్ స్కా మందపాటి, పాక్షికంగా సైనిక శైలి ఆకుపచ్చ దుస్తులు ధరించి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో అత్యంత ప్రముఖ మీడియా కార్యక్రమంలో ప్రసంగించారు. ఆ డ్రెస్ ఆమె మెడ కింది భాగం నుంచి ఆమె మోకాళ్ల కిందివరకు పాకి ఉంది. ఆ తర్వాత సియోల్ మెట్రోపాలిటన్ ప్రభు త్వంతో ఒక సాంస్కృతిక మార్పిడి ఒప్పందంపై సంతకం చేసినప్పుడు మెరిసే తెల్ల షర్టు, దానికి వ్యత్యాసంగా నల్ల ప్యాంట్స్, దానికి తగిన ట్లుగా నడుముకు బెల్టు, ఏక ఆభరణంతో అత్యంత సొగసుగా ఆమె కనిపించారు. తమ దేశానికి ప్రాణాంతకం కాని సైనిక సహాయం మాత్రమే కావాలంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సక్ యోల్ వైపు వేలు చూపి మరీ ఆమె అడిగిన సమయంలో దక్షిణ కొరియా ప్రజలపై ఆమె గట్టి ముద్ర వేశారు. జెలెన్ స్కీ ఈ నెలలో యూరప్ వ్యాప్తంగా దౌత్య పర్యటనలకు వెళ్లారు. తాము మాత్రం స్వదేశంలోనే ఉంటూ తమ స్థాయి విదేశీ నాయకులను కీవ్‌లోనే కలవడం అనే ఉక్రేనియన్ నాయకుల మును పటి విధానంలో ఆయన మార్పు తెచ్చారు. మే 1వ తేదీ నుంచి ఆయన ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, బ్రిటన్లలో పర్యటించారు. మే మధ్యలో ఆయన వాటికన్ సందర్శన అత్యంత భావోద్వేగపూరితమైనదిగా నిలిచింది. భారత్ శాంతి ప్రణాళిక? ప్రధాని నరేంద్ర మోదీ గత సంవత్సరం ఫిబ్రవరికి ముందు జెలెన్స్కీకి సమయం కేటాయించలేదు. ఉక్రెయిన్ ఒక అస్థిరమైన దేశంగా ఉండేది. భారత్‌కు దాంతో ఉపయోగం లేదు. పైగా ఉక్రెయిన్‌లోని వరుస ప్రభుత్వాలు భారత్‌పై ఉపయోగించేందుకు పాకిస్తాన్ కు ఆయుధాలను విక్రయించడానికి ప్రయత్నించాయి. అయితే, తన తూర్పు ఆసియా పర్యటనలో భాగంగా హిరోషిమాలో జెలెన్ స్కీని కలవడానికి మోదీ అంగీకరించడం, 15 నెలల యుద్ధం తర్వాత ఉక్రేనియన్ దౌత్యం పురోగమించిందనటానికి గుర్తింపుగా నిలిచింది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి తన విధానానికి ఎప్పటికప్పుడు చురుకైన సర్దుబాట్లు చేసుకోవాలని భారతదేశం గుర్తించింది. అయితే ఇదేమైనా భారత శాంతి ప్రణాళికలో భాగమా అని కొన్ని వర్గాలు అనుకుంటున్నాయి. కేపీ నాయర్ వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మామూలు డ్రోన్సే కాదు.. మనుషుల డ్రోన్స్ కూడా వచ్చేశాయి!
-
తెరపైకి ‘ప్రాజెక్ట్ సంజయ్’
న్యూఢిల్లీ: అగ్రరాజ్యాలు సైనికపరంగా అనేక నూతన అస్త్రాలను సమకూర్చుకుంటున్న వేళ..భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. అత్యాధునిక డిజిటల్ యుద్ద క్షేత్రాల్లో పోరాటంలో సైతం పైచేయి సాధించేందుకు ఆర్మీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘ప్రాజెక్ట్ సంజయ్’పేరుతో యుద్ధ క్షేత్రంలోని వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు కచ్చితంగా బేరీజు వేసేందుకు సమీకృత రణక్షేత్ర నిఘా కేంద్రాల (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్‌ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్ల)కు రూపకల్పన చేస్తోంది. ఇందులో ఏర్పాటు చేసే సెన్సర్లు రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని బలగాలకు అందజేస్తాయి. దీని సాయంతో ప్రత్యర్థి బలగాల ఆనుపానులను నిక్కచ్చిగా తెలుసుకునేందుకు వీలుంటుంది. 2025 డిసెంబర్ నాటికి సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్‌ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్లను డజన్ల కొద్దీ ఏర్పాటు చేయనుంది. తాజాగా వ్యూహం అమల్లోకి వస్తే యుద్ధ క్షేత్రంలో కార్యకలాపాలను, నిఘాను విస్తృతం చేసేందుకు వీలవుతుంది. ఫలితంగా ఆర్మీ కమాండర్లు ఫ్రంట్‌లైన్ బలగాల మోహరింపు, యుద్ధ సామగ్రి తరలింపు వంటి విషయాల్లో వెంటవెంటనే మెరుగైన నిర్ణయాలు తీసుకునే వీలుకల్పించడమే దీని లక్ష్యమని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇందులోభాగంగా, పర్వత ప్రాంతాలు, ఎడారులు, మైదాన ప్రాంతాల్లో ఇప్పటికే ట్రయల్స్ పూర్తయ్యాయని పేర్కొన్నాయి. పొరుగుదేశం చైనా చాలా రోజుల నుంచి ఇదే రకమైన వ్యవస్థల ఏర్పాటులో నిమగ్నమై ఉంది. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ వ్యవస్థలను సమకూరుస్తోంది. దేశం 12 లక్షల పటిష్ట ఆర్మీ ‘ఆటోమేషన్, డిజిటైజేషన్, నెట్వర్కింగ్’కోసం ఇప్పటికే పలు పథకాలు అమలవుతున్నాయి. ప్రాజెక్ట్ శక్తి పేరుతో ఇప్పటికే ఏసీసీసీసీఎస్(ఆర్టిలరీ కంబాట్, కంట్రోల్, కమ్యూనికేషన్ సిస్టం) కింద వ్యవస్థల అప్‌గ్రేడ్ చేపట్టారు. దీనిని కూడా కొత్తగా ఏర్పాటయ్యే ప్రాజెక్ట్ సంజయ్‌తో అనుసంధానిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాన కార్యక్రమం... డ్రోన్ వీడియో
-
తెలంగాణ కొత్త సచివాలయం భవనం డ్రోన్ విజువల్స్
-
10వేల గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో భూముల సమస్యలన్నింటికీ చరమగీతం పాడేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీ సర్వేలో ముఖ్య ఘట్టమైన డ్రోన్ సర్వే 10,206 గ్రామాల్లో పూర్తయింది. మొత్తం 13,500 గ్రామాల్లో డ్రోన్లు ఎగరాల్సి వుండగా 75 శాతం గ్రామాల్లో ఎగురవేసి భూముల కొలతను పూర్తిచేశారు. నంద్యాల, శ్రీ సత్యసాయి, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఈ సర్వే చివరి దశకు వచ్చింది. నంద్యాల జిల్లాలో 441 గ్రామాలకు గాను 400 గ్రామాల్లో పూర్తయింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 461 గ్రామాలకు 416, విజయనగరం జిల్లాలో 983కి 906, అనకాపల్లి జిల్లాలో 715కి 661, కాకినాడ 417కి 340, తూర్పుగోదావరిలో 272కి 236, కృష్ణాజిల్లాలో 502కి 460 గ్రామాల్లో సర్వే పూర్తిచేశారు. మిగిలిన జిల్లాల్లోనూ 50–60 శాతానికిపైగా సర్వే పూర్తయింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఏరియల్ సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లతోపాటు దేశంలో ఎక్కడాలేని విధంగా విమానాలు కూడా వినియోగిస్తోంది. సర్వే ఆఫ్ ఇండియాతోపాటు ప్రైవేటు డ్రోన్ ఏజెన్సీలతోనూ సర్వే చేయిస్తోంది. చివరికి ప్రభుత్వం సైతం సొంతంగా 30 డ్రోన్లు కొనుగోలు చేసి సర్వేయర్లకు పైలట్లుగా శిక్షణ ఇచ్చి మరీ సర్వే చేస్తోంది. దీంతో ఈ సర్వే దాదాపు తుదిదశకు వచ్చింది. ఈ ఏడాది జూన్ నాటికి అన్ని జిల్లాల్లో పూర్తిచేయడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ పనిచేస్తోంది. ఏ జిల్లాల్లో డ్రోన్ సర్వే ఇంకా ఎన్ని గ్రామాల్లో చేయాలో దృష్టిపెట్టి సర్వేను పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందించి అమలుచేస్తున్నారు. అల్లూరి జిల్లాలో ఐదుగురికి ప్రత్యేక బాధ్యతలు మరోవైపు.. కొండలు, అటవీ ప్రాంతాలతో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో డ్రోన్ సర్వేకు అవకాశం లేకపోడంతో డీజీపీఎస్ సర్వేను ప్రత్యేక ప్రణాళికతో చేపట్టింది. కొండల్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందకపోవడంతో భూమిపై నుంచే సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాలో 2,980 గ్రామాలు ఉండడం, అక్కడ డ్రోన్ సర్వేకు అవకాశం లేకపోవడం రెవెన్యూ యంత్రాంగానికి సవాలుగా మారింది. రాష్ట్రమంతా రీ సర్వే ఒక ఎత్తయితే ఈ జిల్లాలో మాత్రం మరోలా ఉంది. ఈ జిల్లాలోని గ్రామాలను ఐదు గ్రూపులుగా విభజించి పాడేరు సబ్‌కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీఓ, రంపచోడవరం సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ, అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్లకు వాటిని అప్పగించారు. వీరితో ప్రత్యేకంగా అక్కడ రీ సర్వే చేయిస్తున్నారు. దీంతో అల్లూరి జిల్లాలో డీజీపీఎస్ సర్వే శరవేగంగా జరుగుతోంది. -
అమృత్‌పాల్ కోసం డ్రోన్‌తో గాలింపు
అమృత్‌పాల్ కోసం డ్రోన్‌తో గాలింపు -
2050లో ఆఫీస్ అంటే ఇలా ఉంటుందట!
ఆఫీసు అంటే ఎలా ఉంటుంది?.. వరుసపెట్టి టేబుళ్లు, కుర్చీలు.. కంప్యూటర్లు.. హడావుడిగా పనిచేసుకునే ఉద్యోగులు.. మరి 2050లో ఆఫీస్ ఎలా ఉంటుంది?.. హోలోగ్రామ్ రిసెప్షనిస్ట్.. వర్చువల్/అగుమెంటెడ్ రియాలిటీ మీటింగ్‌లు.. చెప్పిన పనిచేసే రోబోలు.. కాసేపు కునుకు తీయడానికి బెడ్లు.. కాఫీ తెచ్చి ఇచ్చే డ్రోన్లు.. ..మరో 30 ఏళ్లలో అత్యధునిక టెక్నా లజీల సాయంతో ఆఫీసుల రూపురేఖలు, పనివాతావరణం ఎలా మారిపోతాయనే అంశంపై ‘ఫర్నీచర్ ఎట్ వర్క్’ సంస్థ అధ్యయనం చేసి ఈ వివరాలను తెలిపింది. ఉద్యోగుల నుంచి మరింత ‘పని’ ని రాబట్టుకోవడంతోపాటు వారికి ఆరోగ్యం, ఆహ్లాదం అందించేలా ఆఫీ సులు రూపొందుతాయని పేర్కొంది. ►అవసరానికి తగినట్టు సులువుగా మార్చుకోగలిగేలా.. కదిలే గోడలు, ఆధునిక ఫర్నీచర్ వస్తాయి. ►అవసరానికి తగ్గట్టు లైటింగ్, గాలి నాణ్యతను చెక్ చేస్తూ శుభ్రపర్చడం, ఉష్ణోగ్రతను చెక్ చేస్తూ సమానంగా ఉంచడం వంటివి ఆటోమేటిగ్గా జరిగేలా సెన్సర్లతో ఆఫీసు భవనాలు ‘స్మార్ట్’గా మారుతాయి. ►పనితీరు మెరుగుపడేలా ఎప్పటికప్పుడు వర్చువల్ రియాలిటీతో కూడిన శిక్షణ. ►ఆఫీసుకు వచ్చే సందర్శకులకు సమాచారం ఇవ్వగల హోలోగ్రామ్ రిసెప్షనిస్ట్ ►వేలిముద్రల (బయోమెట్రిక్)తో తెరుచుకునే ఫ్రిడ్జ్‌లు ►ఉద్యోగులు లేచి వెళ్లాల్సిన పనిలేకుండా కాఫీ, టీలు తెచ్చే డ్రోన్లు ►ఆఫీసులో గాలి కాలుష్యాన్ని తొలగించేలా గోడలకు నానో పెయింట్లు ►పని అలసట నుంచి చిన్న కునుకుతో సేదతీరేందుకు న్యాపింగ్ బెడ్స్ ►ఒత్తిడిని తగ్గించుకునేందుకు వర్చువల్/అగుమెంటెడ్ రియాలిటీతో కూడిన మెడిటేషన్ గది ►ఒకరినొకరు సంప్రదించుకుంటూ పనిచేయాల్సిన ఉద్యోగుల కోసం ఓపెన్ ఆఫీస్ ►ఆఫీసులోకి వచ్చే ప్రతి ఒక్కరిని గుర్తించే ఫేస్ స్కానింగ్ వ్యవస్థ ►అవసరమైన సమాచారాన్ని చూసేందుకు, సమావేశాల కోసం వర్చువల్/అగుమెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలు ►ఆహ్లాదకరమైన, కాలుష్య రహిత వాతావరణం కోసం మాడ్యులర్ గ్రీన్ వాల్స్ ►పర్యావరణ హితమైన బయోఫిలిక్ ఫర్నీచర్ ►ఎక్కువ ఏకాగ్రతతో పనిచేయాల్సిన ఉద్యోగుల కోసం ‘యాంటీ డిస్ట్రా క్షన్ టెక్నాలజీ’ క్యాబిన్లు ►క్లీనింగ్‌తోపాటు వివిధ రకాల పనుల కోసం రోబోలు ►ఉద్యోగులు, ఆఫీసర్లు నేరుగా కలిసి మాట్లాడుకున్న అనుభూతి వచ్చేలా హోలోగ్రామ్ ఆధారిత వర్చువల్ సమావేశాలు ►చిన్న పిల్ల లున్న ఉద్యో గుల కోసం బేబీ సిట్టర్, ప్రత్యేక రూమ్ ►శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితిని గమనించే రిస్ట్ బ్యాండ్లు – సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
ఈశాన్యంలో విరిసిన జాస్మిన్
రోడ్లు బాగుండవువాతావరణం సరిగా ఉండదు.అదీ గాక గంటల కొద్దీప్రయాణించే సమయం ఉండదు.అలాంటప్పుడు ప్రాణం పోసేమందులు అందాలంటే? డ్రోన్లే దారి.అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిననిక్ జాస్మిన్ మొత్తం ఈశాన్య రాష్ట్రాలకేమొదటి మహిళా డ్రోన్ ఆపరేటర్.గాల్లో మందులు పంపే ఈ సవాలునుఆమె సమర్థంగా స్వీకరించింది. ఈ సన్నివేశం ఎప్పుడూ జరిగేదే. రోడ్డు కూడా సరిగా లేని అటవీ ప్రాంతాల్లో విషజ్వరాలు పాకుతాయి. రోగి కదల్లేడు. అంబులెన్స్ రావడానికి సమయం పడుతుంది లేదా రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యి దగ్గరిలోని ఆస్పత్రికి వెళ్లాలన్నా గంటలు గంటలు పడుతుంది. లేదా ఏదో వాగు పొంగి రోడ్డు బ్లాక్ అవుతుంది. కొండ చరియలో, చెట్ల కొమ్మలో విరిగి పడతాయి. సరైన మందు పడితే రోగి ప్రాణాలు దక్కుతాయి. అప్పుడు ఏం చేయాలి?డ్రోన్ల ద్వారా మందులు చేరవేయడం సరైనదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనకు వచ్చాయి. ఇందుకు అనేక స్టార్టప్ కంపెనీలు, డ్రోన్ల తయారీ సంస్థలు ప్రతిపాదనలు చేశాయి. సేవారంగంలో ఉన్న సంస్థలు కూడా ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతున్నాయి. దాంతో డ్రోన్ల ద్వారా మందుల పంపిణీ రెండేళ్ల క్రితం నుంచి ఉత్సాహంగా జరుగుతోంది. తెలంగాణలోని వికారాబాద్‌లో ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ కార్యక్రమం మొదలెట్టడం అందరికీ గుర్తే. ఈశాన్య రాష్ట్రాలలో డ్రోన్లు ఈశాన్య రాష్ట్రాలలో కొండ ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు ప్రాణాధార మందులు సకాలంలో చేరవేయడం ఎప్పుడూ సవాలే. కొండ దారుల్లో ప్రయాణం ఆలస్యం అవుతుంది. అదీగాక వాహనాలు వెళ్లలేని చోట్ల కూడా ఆదివాసీలు నివాసాలు ఉంటారు. వీళ్లను కాపాడాలంటే సరైన సమయంలో మందులు చేరవేయడం చాలా అవసరం. అందుకే ‘సస్టెయినబుల్ యాక్సెస్ టు మార్కెట్ అండ్ రిసోర్సెస్ ఫర్ ఇన్నోవేటివ్ డెలివరీ ఆఫ్ హెల్త్ కేర్’ (సమృద్) సంస్థ ఐపిఇ గ్లోబల్, నీతి అయోగ్‌లతో కలిసి మరికొన్ని దాతృత్వ సంస్థల భాగస్వామ్యంతో ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ ప్రాజెక్ట్‌లో భాగంగా అక్కడ డ్రోన్ల ద్వారా మందుల పంపిణి మొదలెట్టింది. అరుణాచలప్రదేశ్‌లో సాగుతున్న ఈ కార్యక్రమంలో డ్రోన్ ఆపరేట్ చేస్తున్న తొలి మహిళ నిక్ జాస్మిన్ సేవలు అందిస్తోంది. ఆమె మొదట పారాగ్లైడర్ అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్ జిల్లా నుంచి నిక్ జాస్మిన్ డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేస్తుంది. ఇందుకోసం అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద మందులు నిల్వ చేసే మందులు నిల్వ చేసే ఫ్రీజర్లు, ఫ్రిజ్‌లు ఉన్న మినీ హెలిపాడ్ వంటి స్టేషన్ వద్ద ఆమె విధులు నిర్వర్తించాలి. యాప్ ద్వారా ఫలానా చోటుకు మందులు పంపాలి అనే సందేశం రాగానే స్పందించాలి. ‘డ్రోన్లు 400 అడుగుల ఎత్తు నుంచి ప్రయాణం చేస్తాయి. 20 నుంచి 40 కిలోమీటర్ల దూరం వరకూ కచ్చితంగా ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకుంటాయి. రోజుకు పది ట్రిప్పులు వేయగలవు. మందుల ఉష్ణోగ్రతను మెయిన్‌టెయిన్ చేస్తూ ప్రయాణిస్తాయి. తమ సామర్థ్యాన్ని బట్టి బరువును మోస్తాయి’ అని తెలిపింది నిక్. ‘నేను ఎయిర్‌లైన్స్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. పారాగ్లైడింగ్ చేసేదాన్ని. మెడిసిన్ ఫ్రమ్ ది స్కై కోసం డ్రోన్ ఆపరేటర్ల ఉద్యోగం ఉందని తెలిసి అప్లై చేశాను. నా పారాగ్లైడింగ్ అనుభవం దృష్ట్యా ఉద్యోగం వచ్చింది’ అని తెలిపింది నిక్. ఊరు కదిలి వచ్చింది ఈ ఉద్యోగం కోసం నిక్కు శిక్షణ ఇచ్చారు. ‘డ్రోన్లోని అన్ని భాగాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన మందులు జాగ్రత్తగా ప్యాక్ చేయడం, ప్రీ ఫ్లైట్ పరీక్షలు, గాలి స్థితి, ఆడియో పైలట్ సిస్టమ్, జిపిఎస్ ట్రాక్ ఇవన్నీ సక్రమంగా ఉన్నాయనుకున్నాక డ్రోన్‌ను బయలుదేరదీయాలి’ అని తెలిపింది నిక్. ఆమె ఉద్యోగం మొదలెట్టిన రోజు ఆమెను చూడటానికి ఊరు ఊరంతా వచ్చింది. ‘విమానాలు దగ్గరి నుంచి ఎగరడం మా ఊరి వాళ్లు చూడలేదు. ఒక బుల్లి విమానం లాంటిది పైగా ఒక అమ్మాయి ఎగుర వేయడం వారికి వింత. అందుకని ఊరంతా కదిలి వచ్చి చూసింది’ అని నవ్వింది నిక్.‘ఇది సరదా ఉద్యోగం కాదు. చాలా బాధ్యత. నాకు ఈ ఉద్యోగం ఎంతో నచ్చింది’ అని చెప్పిందామె. -
వేలాది మందిగా రోడ్లపైకి వచ్చిన రైతులు ..వీడియో వైరల్
వేలాది మంది రైతులు ముంబై వైపుగా సైనికుల మాదిరి కవాతు చేస్తున్నట్లుగా కదిలి వచ్చారు. ఈ పాదయాత్ర సీపీఎం ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ మేరకు ఆ రైతులు నాసిక్ జిల్లా దిండోరి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ముంబై చేరుకోవడానికి మునుపే సుమారు 200 కి.మీ పాదయాత్ర పూర్తి చేశారు. ఈ పాదయాత్రలో అసంఘటిత రంగానికి చెందిన అనేక మంది కార్మికులు, ఆశా వర్కర్లు, గిరిజన సంఘాల సభ్యులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. వారంతా తమ డిమాండ్ల నేరవేర్చుకోవడం కోస ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలుస్తోంది. రైతుల డిమాండ్లు ఉల్లి సాగు చేసే రైతులకు క్వింటాల్‌కు రూ. 600/ తక్షణ ఆర్థిక సాయం అందించాలని రైతులు డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఐతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అధిక ఉత్పత్తే ఈ పరిస్థితికి కారణమంటూ క్వింటాల్ ఉల్లికి రూ. 300 నష్ట పరిహారాన్ని ప్రకటించారు. అలాగే 12 గంటల పాటు నిరంతర విద్యుత్‌ని అందించాలని, వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాదు సోయాబీన్, పత్తి, కందిపప్పు ధరలు తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. అధిక వర్షాలు, ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయే రైతులకు తక్షణ సాయం అందించాలని కోరారు. 2005 తర్వాత ఉద్యోగం చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ స్పందన రాష్ట్ర ప్రభుత్వం నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల వద్దకు చేరుకోనుంది. ఈ మేరకు ఇద్దరు క్యాబినేట్ మంత్రులు దాదా భూసే, అతుల్ సేవ్ ముంబైకి వెళ్లే మార్గంలో వారిని కలవనున్నారు. రైతుల ప్రతినిధుల మధ్య సమావేశం జరగాల్సి ఉంది. కానీ రైతులు మాత్రం ప్రభుత్వ ప్రతినిధులు తమను కలవాలని కోరుతున్నారు. ప్రతిపక్ష నేత అజిత్ పవార్, సీపీఎం ఎమ్మెల్యే వినోద్ నికోల్‌లు రైతులతో ప్రభుత్వం మాట్లాడాలని అసెంబ్లీలో అన్నారు. దీనిపై మంత్రి భూసే స్పందిస్తూ..సమావేశం నిర్వహించి రైతులతో అవగాహన కుదుర్చుకుంటామని చెప్పారు. వారికి మొత్తం 14 డిమాండ్లు ఉన్నాయని, చట్టం పరిధిలో సాధ్యమైనంత మేర ప్రభుత్వం వాటిని తప్పక పరిష్కరిస్తుంది. కాగా, ఈ పాదయాత్ర అచ్చం 2018లో నాసిక్ నుంచి ముంబై వరకు సాగిన కిసాన్ లాంగ్ మార్చ్ తరహాలోనే కొనసాగుతోంది. #Maharashtra #KisanLongMarch #FarmerProtest #RedMarch Protesting farmers marching towards #Mumbai with their various demands. @AmanKayamHai_ @AmeyaBhise @CNNnews18 pic.twitter.com/oTBOjZnj2M — Mayuresh Ganapatye (@mayuganapatye) March 15, 2023 (చదవండి: రైడ్ బుక్ చేసుకున్న మహిళకు చేదు అనుభవం..స్పందించిన కంపెనీ) -
నల్ల సముద్రంలో కూలిన అమెరికా డ్రోన్.. రష్యా పనే..
కీవ్: రష్యా యుద్ధ విమానం నల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్‌ను ఢీకొట్టింది. మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో అమెరికా సైన్యం తమ డ్రోన్‌ను కిందకు దించింది. తమ హెచ్చరికలను లెక్కచేయకుండా ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అమెరికా–రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా డ్రోన్‌ను రష్యా ఫైటర్ జెట్ ఢీకొట్టడం సంచలనాత్మకంగా మారింది. తాజా సంఘటన గురించి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు అధ్యక్షుడు జో బైడెన్‌కు తెలియజేశారు. నల్ల సముద్రంపై అంతర్జాతీయ ఎయిర్‌స్పేస్‌లో రష్యాకు చెందిన రెండు ఎస్‌యూ–27 ఫైటర్ జెట్లు ఎలాంటి రక్షణ లేకుండా విన్యాసాలు చేపట్టాయని, అందులో ఒక విమానం అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్‌ను ఢీకొట్టిందని యూఎస్ యూరోపియన్ కమాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. చదవండి: ఆస్ట్రేలియాకు అమెరికా సబ్మెరైన్లు -
విత్తనాలు, పిచికారీ డ్యూటీ డ్రోన్లదే..
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. సంప్రదాయ సాగు నుంచి ఆధునిక పద్ధతిలో పంటలు పండించే విధానాలు పెరుగుతున్నాయి. విత్తనాలు వేయడం నుంచి ఎరువులు చల్లడం వరకు అన్ని ప్రక్రియల్లో డ్రోన్లు గణనీయమైన పాత్ర పోషించనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెయ్యి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో వాటిని అందుబాటులో ఉంచి రైతులకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆగ్రోస్ వర్గాలు వెల్లడించాయి. సేవా కేంద్రాల నిర్వా హకులు డ్రోన్లు కొనుగోలు చేసుకునేందుకు అవసరమైన బ్యాంకు రుణాలను ఆగ్రోస్ ఏర్పాటు చేస్తుంది. వారికి శిక్షణతో పాటు లైసెన్స్ ఇచ్చేందుకు విమానయాన సంస్థతో ఆగ్రోస్ ఒప్పందం చేసుకుంది. డ్రోన్ పైలట్ శిక్షణ తప్పనిసరి ఇప్పటివరకు వ్యవసాయ యాంత్రీకరణలో ట్రాక్టర్లు, స్ప్రేలు, దుక్కిదున్నే యంత్రాలు, వరి కోత మెషీన్లు తదితరాలను ఇచ్చిన వ్యవసాయశాఖ ఇప్పుడు డ్రోన్లను ఇచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. డ్రోన్ ద్వారా స్ప్రే చల్లడం వల్ల తక్కువ మొత్తంలో నీరు, పురుగుమందులు అవసరమవుతాయి. విత్తనాలు చల్లడంలో డ్రోన్లను వినియోగించడం వల్ల కచ్చితత్వం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే యూరియా వంటి ఎరువులను డ్రోన్ల ద్వారా చల్లితే ప్రతీ మొక్కకు చేరతాయని అంటున్నారు. అదీగాక, డ్రోన్లతో పిచికారీ వల్ల రైతులు పురుగు మందుల దు్రష్పభావాలకు గురికాకుండా, అనారోగ్యం బారినపడకుండా ఉండొచ్చని ఆగ్రోస్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో డ్రోన్ ధర రూ. 10 లక్షల వరకు ఉంటుందని అంచనా. వాటిని ఆగ్రోస్ కేంద్రాల నిర్వాహకులకు సబ్సిడీపై ఇస్తారు. అలాగే కొంతమంది రైతులకు కలిపి గ్రూప్‌గా కూడా డ్రోన్ ఇచ్చే అవకాశముంది. ఒకవేళ రైతులు డ్రోన్లను కొనుగోలు చేయాలనుకుంటే సబ్సిడీ కూడా ఇవ్వనున్నారు. సబ్సిడీ మొత్తాన్ని త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిసింది. కాగా, డ్రోన్‌ను తీసుకోవాలంటే కనీసం పదో తరగతి పాసై ఉండాలి. అలాగే డ్రోన్ పైలట్ శిక్షణ తీసుకొని ఉండాలి. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి. ఏవియేషన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఒక్కో డ్రోన్ ధర: సుమారు 10,00,000 రూపాయలు డ్రోన్ అద్దె ఎకరాకు: రూ. 400 డ్రోన్లతో ఎకరాకు తగ్గనున్న ఖర్చు: రూ. 4,000 - 5,000 డ్రోన్లు ఏం చేస్తాయంటే.. ప్రధానంగా డ్రోన్లను విత్తనాలు చల్లడానికి, పురుగు మందులను స్ప్రే చేయడానికి వాడతారు. కొన్ని పంటలకు పైౖపైన స్ప్రే చేస్తే సరిపోతుంది. కొన్నింటికి కాండం మొదళ్లో చల్లాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో పంటలకు ఒక్కో రకంగా ఉంటుంది. ఆ మేరకు డ్రోన్లకు పరికరాలు అమర్చుతారు. అలాగే పంటకు చీడపీడలు ఏమైనా ఆశించాయో తెలుసుకునేందుకు ఫొటోలు కూడా తీస్తాయి. వాటిని వ్యవసాయాధికారికి పంపేలా ఏర్పాటు చేయనున్నారు. అలాగే కాత ఎలా ఉంది? దిగుబడి ఏ మేరకు వచ్చే అవకాశముంది. ఇలా పంటకు సంబంధించిన ప్రతీ అంశాన్ని సూక్ష్మంగా పర్యవేక్షించేలా డ్రోన్లను అందుబాటులోకి తెస్తారు. ఈ మేరకు పలు కంపెనీలతో చర్చించినట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో గ్రామాల్లో డ్రోన్లతో సాగు సులభంగా జరుగుతుందని అంటున్నారు. డ్రోన్లతో సాగు ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. రైతులకు ఆదాయం పెరుగుతుంది ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించాం. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు అద్దెకు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. డ్రోన్ల వినియోగంతో సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. పెద్దసంఖ్యలో కూలీలు చేసే పనిని ఒక డ్రోన్ కొన్ని నిమిషాల్లో చేస్తుంది. కాబట్టి సాగు ఖర్చు తగ్గి రైతులకు ఆదాయం పెరుగుతుంది. -
సర్పంచ్ అంటే అట్లుండాలి! తొలిసారిగా నగదు డెలివరీ చేసే డ్రోన్!
ఇంకా చాలా మూరుమూల ప్రాంతాల్లోని వారు రాష్ట్ర పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను అందుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందులోనూ దివ్యాంగుల పరిస్థితి గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చం అలానే ఇబ్బంది పడుతున్న ఒక దివ్యాంగుడి కోసం స్వయంగా డ్రోన్ కొనుగోలు చేసి మరీ పెన్షన్ అందించి.. తన గొప్ప మనుసును చాటుకుంది ఓ మహిళా సర్పంచ్. వివరాల్లోకెళ్తే.. ఒడిశాలోని నువాపాడా జిల్లాలోని మారుమూల గ్రామంలో హెతారం సత్నామీ అనే శారీరక వికలాంగుడు నివశిస్తున్నాడు. ప్రభుత్వ ఫించను కోసం ప్రతి నెల దట్టమైన అడవి గుండా రెండు కి.మీ పైగా దూరంలో ఉన్న పంచాయతీ వద్దకు వచ్చేందుకు నానాతంటాలు పడుతున్నాడు. ఈసారి సర్పంచ్ చొరవతో అతను ఫించన్‌ను నేరుగా ఇంటి వద్ద తీసుకున్నాడు. ఆ గ్రామ సర్పంచ్ సరోజ్ అగర్వాల దివ్యాంగుడు సత్నామీ పరిస్థితితి గురించి తెలుసుకుని అతని సమస్యను పరష్కరించాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆన్లైన్లో డ్రోన్‌ని కొనుగోలు చేశారు అగర్వాల్. ఈ మేరకు సర్పంచ్ అగర్వాల్ మాట్లాడుతూ..సత్నామీ పుట్టుకతోనే వికలాంగు, కదలలేడు. దీంతో అతని పేరును రాష్ట్ర ఫించన్ పథకంలో నమోదు చేశాం. ఐతే ఫించన్ కోసం ఆ అడవిని దాటి పంచాయతీ వద్దకు రావడానికి చాల కష్టపడుతున్నాడు. ఇతర దేశాలలో డ్రోన్లను ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకుని వెంటనే కొనుగోలు చేసి అతడికి ఫించన్ పంపేందుకు వినియోగించాలని నిర్ణయించుకున్నా. ఐతే సదరు వ్యక్తికి విజయవంతంగా డ్రోన్ సాయంతో డబ్బు డెలివరీ చేయగలిగాం అని సర్పంచ్ చెప్పుకొచ్చారు. డ్రోన్లను కొనుగోలు చేసే సదుపాయం ప్రభుత్వం వద్ద లేనందును సర్పంచే స్వయంగా కొనుగోలు చేయడంతో ఇది సాధ్యమైందని నువాపాడా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ సుబదార్ ప్రధాన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మందులు, కిరాణ సామాగ్రి, ఆహారం, ఇతర వస్తువులను డ్రోన్ల సాయంతో డెలివరీ చేయండ చూశాం. గానీ ఇలా డ్రోన్‌తో నగదు డెలవరీ చేయండం భారత్‌లోనే ప్రపథమం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?.. నా నుంచి అది మాత్రం లాక్కోలేరు: ఉద్దవ్ థాక్రే) -
ఎగిరే ఏసీ! ఇల్లంతా తిరిగేస్తుంది.. సూపర్ గ్యాడ్జెట్
ఏసీ ఉంటే ఆ హాయి వేరే అయినా, ఏసీని అమర్చుకోవడం అంత తేలిక కాదు. నానా తంటాలు పడితే గాని, ఇంట్లోని కోరుకున్న గదిలో ఏసీ అమర్చుకోలేం. ఏసీ అమర్చుకున్న గదిలో తప్ప మిగిలిన గదుల్లో పరిస్థితి మామూలే! ఇల్లంతటికీ ఏసీ కావాలనుకుంటే, గదికో ఏసీ చొప్పున పెట్టించుకోవాలి. దీనంతటికీ ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఇంత ప్రయాస లేకుండానే ఇల్లంతటికీ ఏసీ వాతావరణాన్ని పంచేందుకు ఇటలీకి చెందిన ‘మిరే ఓజ్లెమ్–ఈఆర్’ డ్రోన్ ఏసీని రూపొందించింది. దీనిని ఆన్ చేయగానే, ఇది గాల్లో చక్కర్లు కొడుతూ ఇల్లంతా తిరుగుతుంది. ఇంట్లోని మనుషుల శరీర ఉష్ణోగ్రతను పసిగట్టి, అందుకు అనుగుణంగా గదిలోని ఉష్ణోగ్రతను వెచ్చబరచడం లేదా చల్లబరచడం చేస్తుంది. ఇంట్లోని ప్రతి గదిలోనూ ఇది తిరుగుతూ ఉష్ణోగ్రతలను అవసరానికి అనుగుణంగా మారుస్తూ ఉంటుంది. అలాగే, ఇందులోని ‘అరోమా డిఫ్యూజర్’లో మనకు నచ్చిన సెంటును నింపి పెట్టుకుంటే, ఇంట్లోని వాతావరణాన్ని ఆహ్లాదభరితంగా మార్చడమే కాకుండా, మనసును సేదదీర్చే పరిమళాలను కూడా వెదజల్లుతుంది. మార్కెట్లోకి త్వరలోనే విడుదల కానున్న ఈ డ్రోన్ ఏసీ ధరను ఇంకా ప్రకటించలేదు. (ఇదీ చదవండి: Vivo Y56 5G: వివో వై సిరీస్‌లో మరొకటి.. ధర రూ.20వేల లోపే!) -
Drogo Drones: ఏపీలో డ్రోగో డ్రోన్స్ శిక్షణా కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో .. డ్రోన్ ఆపరేటర్లను తయారు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో శిక్షణ కేంద్రాన్ని డ్రోగో డ్రోన్స్ ప్రారంభించింది. 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెంటర్ ఏర్పాటైంది. రాష్ట్రంలో డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన అనుమతులు పొందిన తొలి ప్రైవేట్ సంస్థ తమదేనని డ్రోగో డ్రోన్స్ ఎండీ యశ్వంత్ బొంతు తెలిపారు. తాడేపల్లిలో రెండు నెలల్లో డ్రోన్స్ తయారీ యూనిట్ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఎన్ఎండీసీ, జీఎండీసీ, ఎంఈఐఎల్, జీఏఐఎల్, ఏపీఎస్‌ఎస్‌ఎల్‌ఆర్ తదితర సంస్థలకు అవసరమైన భూ సర్వేలు చేసినట్లు తెలిపారు. కాగా, పదో తరగతి ఉత్తీర్ణులై, 18 సంవత్సరాలు నిండిన వారు డ్రోన్ ఆపరేటర్‌గా శిక్షణ తీసుకోవచ్చు. డీజీసీఏ రూపొందించిన సిలబస్ ప్రకారం వారంపాటు శిక్షణ ఉంటుంది. బ్యాచ్‌లో 30 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. ఫిబ్రవరి 20 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. -
భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్..
ఇస్తాన్‌బుల్: టర్కీ, సిరియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ భయానక విపత్తులో 5,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 24 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. టర్కీలో భూకంపం తర్వాత దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. పేకమేడల్లా కూలిపోయిన భవనాలు, శిథిలాలను చూస్తుంటే గుండె తరుక్కుపోయేలా ఉంది. భూకంపం తర్వాత టర్కీ హతాయ్ ప్రాంతంలో పరిస్థితిని కళ్లగట్టేలా ఓ హుమానిటేరియన్ రిలీఫ్ ఫౌండేషన్ డ్రోన్ దృశ్యాలను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. A drone video released by Humanitarian Relief Foundation shows the extent of destruction in Hatay province in Turkey, which was rocked by a 7.8 magnitude earthquake pic.twitter.com/L6mbqIkJZp — Reuters Asia (@ReutersAsia) February 7, 2023 చదవండి: భూకంపం వస్తుందని మూడు రోజుల ముందే చెప్పాడు.. కానీ ఎవరూ నమ్మలే -
డ్రోన్ అంటే కెమెరా ఒక్కటే కాదు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘‘పిల్లలూ డ్రోన్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? డ్రోన్ అంటే కెమెరా ఒక్కటే కాదు.. దానితో పొలాల్లో పురుగుమందు స్ప్రే చేయవచ్చు.. అమ్మాయిల భద్రత విషయంలో చర్యలు తీసుకోవచ్చు. గుట్టలు, చెరువులు, కుంటల సరిహద్దులను నిర్ధారించవచ్చు. సరిహద్దుల్లో ఎవరు చొరబడకుండా చూడవచ్చు. భవిష్యత్‌లో మనుషులను తీసుకెళ్లే వాహనం కూడా అవుతుంది’’అంటూ గురుకుల విద్యార్థులతో మంత్రి కేటీఆర్ చిట్‌చాట్ చేశారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, గూడూరు శివారులో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ బాలుర, బాలికల గురుకుల పాఠశాల భవనాలను కేటీఆర్ ప్రారంభించారు. తర్వాత విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ భోజనం చేశారు. ఈ సందర్భంగా కవరేజ్‌లో భాగంగా ఆ వైపు వచ్చిన డ్రోన్‌ను చూసిన కేటీఆర్ దానివల్ల ఏమేం చేయొచ్చో విద్యార్థులకు వివరించారు. చదువుకుని ఏమవుతారని, ఉద్యోగం చేస్తారా? అని ప్రశ్నించారు. ఉద్యోగం చేయడమే కాకుండా పది మందికి ఉద్యోగం కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. ఇక్కడ పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివే పిల్లలను హైదరాబాద్‌లోని టీ–హబ్‌కు తీసుకువెళ్లి చూపించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. తాను నాన్‌వెజ్ బంద్ చేశానని.. అందుకే పప్పు, చారు, పెరుగుతో ముగిస్తున్నానని విద్యార్థులకు చెప్పారు. భారీగా అభివృద్ధి పనుల ప్రారంభం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు, కమలాపూర్ గ్రామాల్లో రూ.49 కోట్ల అంచనాలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతకుముందు మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద శిలాఫలకాలను ఆవిష్కరించారు. తర్వాత కుల సంఘాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. కాగా.. మంత్రి కేటీఆర్ పర్యటన సమయంలో ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కాన్వాయ్‌లోకి చొరబడి నల్లచొక్కాలతో నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
శ్రీవారి ఆలయం డ్రోన్ విజువల్స్‌పై టీటీడీ సీరియస్.. విచారణకు ఆదేశం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి డ్రోన్ దృశ్యాల ఘటనపై టీటీడీ సీరియస్ అయింది. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం మీడియాకు తెలిపారు. వివరాలు.. స్వామి వారి ఆలయానికి సంబంధించినదంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. టీటీడీ భద్రత సిబ్బంది కళ్లుగప్పి... ఓ డ్రోన్ స్వామి వారి ఆలయం పై చక్కర్లు కొట్టినట్టు తెలుస్తోంది. సెక్యూరిటీ పరమైన ఆంక్షలు ఉండి.... స్వామి వారి ఏరియల్ వ్యూ ను బయటకు రాకుండా చూసుకుంటుంది టీటీడీ. అయితే ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్ చేసిన నిర్వాకం మాత్రం ఇప్పుడు కలకలం రేపుతోంది. డ్రోన్ రైడర్ 1 (Dronerider1) అనే యూట్యూబ్ ఛానెల్ లో పోస్టింగ్ తేదీ ప్రకారం నవంబర్ 13 2022లో వీడియో అప్లోడ్ అయినట్లుగా తెలుస్తోంది. అనంతరం అదే వీడియోని ఐకాన్ ఫాక్ట్స్/ఐకాన్ (eyeconfacts/eyecon) అనే యూట్యూబ్ ఛానెల్ లో జనవరి 07, 2023లో పోస్ట్ అయినట్లు డిస్క్రిప్షన్ లో కనపడుతోంది. ఇక గృహశ్రీనివాస (gruhasrinivasa) అనే ఇన్ స్టాగ్రాం అకౌంట్ లో అదే వీడియోని పోస్ట్ చేశారు. క్రిమినల్ కేసులు పెడుతున్నాం.. శ్రీవారి ఆలయంపై భాగంలో గానీ, పరిసరాల్లో గానీ విమానాలు, డ్రోన్ లు తిరిగేందుకు అనుమతులు లేవు.. ఆగమ సలహామండలి సూచన మేరకూ ఆలయంపై విమానాలు, డ్రోన్ లు నిషేధం ఉందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నిన్న సోషల్ మీడియాలో స్వామి వారి ఆలయం డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియో చక్కర్లు కొడుతుందని తెలిసిందని, టీటీడీ విజిలెన్స్ అధికారులు వెంటనే స్పందించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిని గుర్తించడం జరిగిందని అన్నారు. హైదరాబాదుకు చేందిన ఓ సంస్ధ డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియోను పోస్టు చేసినట్లు నిర్ధారణకు వచ్చామని, సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై క్రిమినల్ కేసు పెడుతున్నామని చైర్మన్ స్పష్టం చేశారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల దర్యాప్తుకు ఆదేశించడం జరిగిందన్నారు. డ్రోన్ ద్వారా తీసిన చిత్రాల, స్టిల్ ఫోటో గ్రాఫర్ ద్వారా చిత్రీకరించిన వీడియోనా, లేక పాత చిత్రాలతో త్రిడీ లాగా రూపొందించారా? అన్న దానిపై ఫోరెన్సిక్ ల్యాబ్ కి టెస్టింగ్ కోసం పంపామని అన్నారు. రాబోయే నాలుగు, ఐదు రోజుల్లోనే దీనిపై ఓ క్లారీటీకి వస్తుందని, స్టిల్ కెమెరాతో ఫోటోలను మార్పింగ్ చేసి చిత్రీకరించినట్లు ప్రాధమిక విచారణలో వెల్లడైందని, త్వరలోనే దీనిపై వాస్తవాలు వెలికి తీసి భక్తుల ముందు ఉంచుతామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రధాన అర్చకుల స్పందన.. డ్రోన్ వివాదంపై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు కూడా స్పందించారు. డ్రోన్ కెమెరాలతో శ్రీవారి ఆలయ ఏరియల్ వ్యూ ను బంధించినట్లు సామాజిక మాధ్యమాలలో ప్రసారం అవుతుందని, సంప్రదాయంలో భాగంగా కొన్ని నియమనిబంధనలు అమలు చేస్తున్నామని, గుర్తు తెలియని వ్యక్తులు నియమనిబంధనలు అతిక్రమించి డ్రోన్ ద్వారా దేవాలయాన్ని చిత్రీకరించారని ప్రధాన అర్చకులు పేర్కొన్నారు. దివ్య శక్తితో వెలసిన స్వామి వారి ఆలయంపై ఎగురరాదని కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు. తిరుమల క్షేత్రం అంతా డ్రోన్స్, విమానాలను ప్రయాణించరాదనే నిబంధనలు ఆగమశాస్త్రం చెపుతోందన్నారు. చదవండి: టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు -
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం: లభించని ఆ ముగ్గురి ఆచూకీ.. డ్రోన్లతో సెర్చ్ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ మినిస్టర్స్ రోడ్‌లోని రాధా ఆర్కేడ్‌లో ఉన్న డెక్కన్ కార్పొరేట్ అగ్నిప్రమాదంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ దుర్ఘటనలో గల్లంతైన ముగ్గురి ఆచూకీ శుక్రవారం కూడా లభించలేదు. భవనంలోకి అడుగుపెట్టడానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో విక్టిమ్ లోకేషన్ కెమెరాతో (వీఎల్సీ) కూడిన డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. రాధా ఆర్కేడ్‌లో గల్లంతైన డెక్కన్ కార్పొరేట్ ఉద్యోగులు జునైద్, వసీం, జహీర్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాలని పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు శుక్రవారం ఉదయం ఉపక్రమించారు. వీరి సెల్ఫోన్ల లాస్ట్ లోకేషన్స్ గురువారం ఉదయం భవనం వద్దే ఉండగా...ఆ తర్వాత స్విచ్ఛాఫ్ అయ్యాయి. మరోపక్క ప్రమాదానికి కారణాలు విశ్లేషించడానికి క్లూస్‌టీమ్‌ను లోపలకు పంపాలని భావించారు. అయితే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ దట్టమైన పొగ, భరించలేని వేడి ప్రతికూలంగా మారాయి. వీటి కారణంగా నేరుగా, లేడర్ ద్వారా ప్రయత్నించినా బృందాలు భవనంలోకి అడుగుపెట్టే పరిస్థితి కనిపించలేదు. స్పష్టత లేదు... ఈ నేపథ్యంలోనే రెండో అంతస్తులో భవనం వెనుక వైపు రెండు చోట్ల మృతదేహాలు ఉన్నట్లు ఆనవాళ్లను శుక్రవారం సాయంత్రం గుర్తించారు. అయితే ఇవి స్పష్టంగా కనిపించకపోవడంతో ఔనా? కాదా? అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దీంతో డ్రోన్ కెమెరా చిత్రీకరించిన వీడియోను ఇంప్రొవైజేషన్ విధానంలో విశ్లేషించడానికి ల్యాబ్‌కు పంపించారు. మొదటి అంతస్తులో కొంత వరకు లోపలికి వెళ్లిన డ్రోన్ అక్కడ మెట్ల మార్గం, శ్లాబ్ కూలి ఉన్నట్లు గుర్తించింది. భవనం మొత్తం శిథిలాలు, కాలిపోయిన వస్తువులు ఉండటంతో పాటు బూడిద సుమారు రెండు అడుగుల మేర పేరుకుపోయినట్లు గుర్తించారు. పది గంటలకు పైగా మంటల్లో ఉన్న ఈ ఆరంతస్తుల భవనం స్ట్రక్చరల్ స్టెబిలిటీని నిర్థారించాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. దీంతో వరంగల్ నిట్ నిపుణుల బృందంతో కలిసి పరిశీలించారు. నిట్ డైరెక్టర్ రమణ రావు, జీహెచ్ఎంసీ అధికారులు క్రేన్ సహాయంతో భవనం పై అంతస్తుల వరకు వెళ్లి పరిశీలించి మంటల్లో కాలిపోయిన కొన్ని శిథిలాలను సేకరించారు. భవనం పూర్తిగా బలహీనంగా మారిందని దీన్ని పూర్తిగా విశ్లేషించిన తర్వాత మాత్రమే పూర్తి వివరాలు చెప్పగలుగుతామని రమణరావు అన్నారు. బయటే బస్తీల జనం.. ఈ భవనాన్ని ఆనుకుని ఉన్న కాచిబోలిలో సుమారు 15 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బస్తీలో చాలా ఇళ్లకు శుక్రవారం కూడా తాళాలు కనిపించాయి. భవనం వెనుక ఉన్న ఉత్తమ్ టవర్స్‌లో కిమ్స్ ఆస్పత్రి నర్సింగ్ హాస్టల్ ఉంది. ఇక్కడ నుంచి నర్సులను ఖాళీ చేయించారు. ఈ భవనాన్ని కూల్చిన తర్వాతే చట్టుపక్కల వారికి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరోపక్క ఈ భవనం కూల్చివేత పనులు ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారని తెలిసింది. శుక్రవారం సాయంత్రం దీన్ని పరిశీలించిన ఆ సంస్థ బృందం కూల్చివేత పూర్తి చేయడానికి మూడు–నాలుగు రోజులు పడుతుందని అభిప్రాయపడింది. గల్లంతైన వారు గుజరాత్ నుంచి వలసవచ్చిన వాళ్లు కావడంతో శుక్రవారం ఉదయానికి వారి కుటుంబీకులు నగరానికి చేరుకున్నారు. తమ వారి కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న వీరికి రెండు మృతదేహాలు కనిపించాయనే వార్త శరాఘాతమైంది. అవి ఎవరివో, కనిపించని మూడో వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వసీం సోదరుడు ఇమ్రాన్, జునైద్ సోదరుడు ఆసిఫ్ రోజంతా భవనం ముందే గడిపారు. చీకటి పడటంతో శుక్రవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ ఆపేసిన అధికారులు శనివారం మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. అగ్నిప్రమాదం తీరు తెన్నులు, భవనం లోపలి పరిస్థితులను గమనించిన ఓ పోలీసు అధికారి ‘ఆ ముగ్గురూ బతికే అవకాశాలు లేవు. ఇన్ని గంటల మంటలు, ఇంత వేడి, ఫైర్ ఇంజన్లు చల్లిన నీళ్లు..ఇవన్నీ పరిశీలిస్తుంటే వారి ఎముకలు దొరికే అవకాశమూ తక్కువే’ అని వ్యాఖ్యానించారు. డ్రోన్ల సాయంతో... లోపలికి వెళ్లలేక వెనక్కు వచ్చిన టీమ్స్ డ్రోన్ కెమెరాల సాయం తీసుకోవాలని స్పష్టం చేశాయి. దీంతో అధికారులు ఓ ప్రైవేట్ సంస్థను సంప్రదించి వీఎల్‌సీతో కూడిన డ్రోన్లను రప్పించారు. వేడి కారణంగా ఈ డ్రోన్లు సైతం లోపలకు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. భవనం ముందు భాగంతో పాటు నాలుగు వైపుల నుంచి డ్రోన్ ఎగురవేసి అనువైన, ఖాళీగా ఉన్న భాగాల నుంచి లోపలి ప్రాంతాన్ని పరిశీలించారు. -
అగ్రరాజ్యాలకు దీటుగా.. సాగర జలాల్లో ఇక నిరంతర నిఘా!
సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆధునికీకరించుకుంటూ డిఫెన్స్ సెక్టార్ కీలకంగా వ్యవహరిస్తోంది. కేవలం నౌకాదళం, ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడమే కాకుండా... సాంకేతికతను అందిపుచ్చుకుంటూ... అగ్రరాజ్యాలకు దీటుగా బలాన్ని, బలగాన్ని పెంచుకుంటోంది. వైరి దేశాల కవ్వింపు చర్యలకు సరైన సమాధానం ఇచ్చేందుకు నిరంతరం నూతన రక్షణ వ్యవస్థలతో సామర్థ్యాన్ని పెంపొందించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సాగర జలాల్లో నిరంతరం పహారా కాసేలా ఇండియన్ కోస్ట్ గార్డ్ తొలిసారిగా మానవ రహిత మల్టీకాప్టర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇండియన్ కోస్ట్‌గార్డ్(ఐసీజీ) హెలికాప్టర్లకు బదులుగా... సరికొత్త సాంకేతికతతో మల్టీకాప్టర్లను తన అమ్ములపొదిలో చేర్చుకుంది. నిరంతరం పహారా కాసే సామర్థ్యం ఉన్న ఈ మల్టీకాప్టర్ డ్రోన్లు... కోస్ట్‌గార్డ్ రక్షణ వ్యవస్థకు కీలకంగా మారనున్నాయి. వెర్టికల్‌గా టేకాఫ్‌తోపాటు ల్యాండింగ్ కూడా అయ్యేలా ఇవి పనిచేస్తాయి. కోస్ట్‌గార్డ్ నౌకల్లోనూ, ఆఫ్‌షోర్ స్టేషన్ల నుంచి వీటిని ప్రయోగించొచ్చు. మూడేళ్లలో 100 మల్టీకాప్టర్లు.. ప్రస్తుతం కోస్ట్ గార్డ్.. తొలి విడతగా 10 మల్టీకాప్టర్లను కొనుగోలు చేసుకుంది. వీటిని విశాఖ, కోల్‌కతా ప్రాంతాల్లోని ఐసీజీ ప్రధాన స్థావరాలకు కేటాయించాలని నిర్ణయించింది. తీరప్రాంత నిఘా, భద్రత వ్యవస్థలను మరింత పటిష్టం చేసేలా.. సరిహద్దు ప్రాంతాల్లో ఈ మల్టీకాప్టర్ డ్రోన్లు రాత్రి, పగలు పహారా కాస్తాయి. నిఘాకు మాత్రమే కాకుండా... ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు రెస్క్యూ ఆపరేషన్లలోనూ, యాంటీ పైరసీ, యాంటీ స్మగ్లింగ్, ఆయిల్స్పిల్, కాలుష్య నియంత్రణ ఆపరేషన్స్ మొదలైనవాటికి కూడా వీటిని వినియోగించనున్నారు. ఏడాది నుంచి ఇండియన్ కోస్ట్‌గార్డ్ తీర ప్రాంత భద్రతపై మరింత పట్టు సాధించింది. యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌తో కలిసి నిర్వహించిన ఏడు జాయింట్ ఆపరేషన్లలో రూ.1,900 కోట్ల విలువైన 350 కిలోల హెరాయిన్ దేశంలోకి రాకుండా స్వా«దీనం చేసుకుంది. ఈ ఆపరేషన్లలో పాక్, ఇరాన్ దేశాలకు చెందిన చొరబాటుదారుల్ని కూడా అదుపులోకి తీసుకుంది. ఇకపై భద్రత వ్యవస్థను మరింత స్మార్ట్‌గా పటిష్టం చేసేందుకు మల్టీకాప్టర్లను వినియోగించాలని కోస్ట్‌గార్డ్ నిర్ణయించింది. ఇందుకోసం 2025 నాటికి మరో 100 మల్టీకాప్టర్ డ్రోన్లను కొనుగోలు చేసే దిశగా అడుగులేస్తోంది. -
సర్వేతో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: దేశంలో వందేళ్ల తర్వాత నిర్వహిస్తున్న భూముల సర్వేతో కొత్త చరిత్రను లిఖిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రీ సర్వే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని, ఈ మహాయజ్ఞం ఫలాలు ప్రజలకు కచ్చితంగా అందాలని స్పష్టం చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (భూముల సమగ్ర రీసర్వే) పథకంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. తొలివిడత గ్రామాల్లో జనవరికి పత్రాలు ‘రీ సర్వే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం. వందేళ్ల తర్వాత మళ్లీ సర్వే చేస్తున్నాం అంటే నిజంగానే కొత్త చరిత్ర లిఖిస్తున్నట్లే. సర్వేలో కచ్చితంగా నాణ్యత ఉండాలి. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంత మంది సర్వేయర్లు, సిబ్బంది మన వద్ద అందుబాటులో ఉన్నందున వేగంగా చేయగలుగుతున్నాం. తొలివిడత సర్వే పూర్తైన 2 వేల గ్రామాలకు సంబంధించి భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం జనవరి నాటికి పూర్తి కావాలి’ అని సీఎం సూచించారు. మరో 2 వేల గ్రామాల్లో.. సర్వే పూర్తైన రెండు వేల గ్రామాల్లో ఇప్పటివరకు 2 లక్షల మ్యుటేషన్లు, 92 వేల ఫస్ట్ టైం ఎంట్రీస్ జరిగాయని, 7,29,000 మందికి భూహక్కు పత్రాలు అందజేశామని అధికారులు తెలిపారు. 4.30 లక్షల సబ్ డివిజన్లు పూర్తి కాగా 19 వేల భూ వివాదాలు పరిష్కారమయ్యాయని వివరించారు. ఫలితంగా ప్రజలకు రూ.37.57 కోట్ల మేర డబ్బు ఆదా అయిందని వెల్లడించారు. మరో 2 వేల గ్రామాల్లో రీసర్వే ప్రక్రియకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను అధికారులు సీఎంకు తెలియచేశారు. 2023 ఫిబ్రవరి 15 నాటికి సర్వే పూర్తి చేసి అదే నెల చివరికల్లా భూహక్కు పత్రాలను కూడా అందజేస్తామని చెప్పారు. గ్రామ సచివాలయం యూనిట్‌గా.. సమగ్ర సర్వేను సకాలంలో పూర్తి చేసేందుకు సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం జగన్ సూచించారు. గ్రామ సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకుని కావల్సినంత మంది సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో తగినంత సిబ్బందిని సమకూర్చుకుని ఖాళీలున్న చోట వెంటనే నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. సమస్యలు పరిష్కారమైన లబ్ధిదారులకు వ్యక్తిగత లేఖలు.. ‘ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ‘22 ఏ’ భూములు, ఇతర సమస్యలను పరిష్కరించి హక్కు పత్రాలు అందజేసిన లబ్ధిదారులకు లేఖలు రాయాలి. వారికి జరిగిన మేలును వివరిస్తూ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత లేఖలు పంపాలి. సర్వే రాళ్ల ఉత్పత్తి వేగాన్ని పెంచాలి. రాళ్ల తయారీ వేగం పెరిగేలా భూగర్భ గనుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇందులో ఎలాంటి జాప్యానికి తావుండరాదు’ అని సీఎం జగన్ స్పష్టం చేయగా మార్చి కల్లా సర్వేకు అవసరమైన రాళ్లు సిద్ధంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టణ ప్రాంతాల్లో సర్వేపై.. అర్బన్ ప్రాంతాల్లోనూ భూముల సర్వేను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 4,119 వార్డు సచివాలయాల్లో సర్వే బృందాల ఏర్పాటు, శిక్షణ ఇప్పటికే పూర్తైందని అధికారులు తెలిపారు. హద్దుల మార్కింగ్, రోవర్ల సహాయంతో జీసీపీ ఐడెంటిఫికేషన్ ప్రక్రియను 2023 జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. ఇప్పటివరకు 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 1,16,685 ప్రభుత్వ, పోరంబోకు ల్యాండ్ పార్సిల్స్‌కు సంబంధించి 3,37,702 ఎకరాలను గుర్తించినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. 2023 జూలై నాటికి పట్టణ ప్రాంతాల్లో సమగ్ర సర్వే హక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్థ జైన్, పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్, సీసీఎల్ఏ కార్యదర్శి ఇంతియాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, మైనింగ్ శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
షాకింగ్ ఘటన: రైల్వే పట్టాలపై కూలిన డ్రోన్
ఢిల్లీ మెట్రో స్టేషన్లో అనుహ్య ఘటన చోటు చేసుకుంది. మెట్రో రైలు పట్టాలపై ఒక డ్రోన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై హెచ్చరికలు జారీ చేసి ఢిల్లీ మెట్రో జసోలా విహార్ స్టేషన్‌ను కొద్దిసేపు తాత్కాలికంగా మూసేశారు. ఈ మేరకు పోలీసులు ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. విచారణలో ఈ డ్రోన్ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందినదని అధికారులు తెలిపారు. తనిఖీల్లో డ్రోన్‌లో కొన్ని మందులు దొరికాయని తెలిపారు. మందులను పంపేందుకు కంపెనీ డ్రోన్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అయినా హై సెక్యూరిటీ ఉన్న ప్రాంతాల్లో డ్రోన్లు ముప్పు పొంచి ఉందని అలాంటి ప్రదేశాల్లో ఎలాంటి డ్రోన్లు ఉపయోగించకూడదని అధికారులు తెలిపారు. అయినా అధికారుల అనుమతి లేకుండా వాటిని ఉపయోగించడం చట్టం విరుద్ధమని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మెట్రో స్టేషన్‌ని పునః ప్రారంభించారు. భద్రతా కారణాల దృష్ట్యా జసోలా విహార్ షాహీన్ బాగ్ నుంచి బొటానికల్ గార్డెన్ మధ్య మెట్రో రైలు సేవలు అందుబాటులో లేవని, మిగిలిన లైన్లో యథావిధిగా సేవలు కొనసాగుతున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ట్వీట్ చేసింది. (చదవండి: జమ్మూ కశ్మీర్లో భారీగా మారణాయుధాలు పట్టివేత) -
న్యూ ఇండియా అష్యూరెన్స్ నుంచి డ్రోన్లకు బీమా..
ముంబై: డ్రోన్లకు కూడా బీమా కవరేజీ అందించేలా న్యూ ఇండియా అష్యూరెన్స్ (ఎన్ఐఏ) కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. తద్వారా ఎన్ఐఏ ఈ తరహా పాలసీలను అందించే తొలి ప్రభుత్వ రంగ బీమా సంస్థగా నిల్చింది. పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌ల నుంచి సోలో ఫ్లయింగ్ గ్లైడర్లు మొదలైన వాటికి ఈ పథకం వర్తిస్తుంది. డ్రోన్ ఓనర్లు, ఆపరేటర్లు, తయారీ సంస్థలకు కవరేజీ అందించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 15 యాడ్ ఆన్ కవర్స్ కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్, టాటా ఏఐజీ జనరల్ తదితర సంస్థలు డ్రోన్ పాలసీలను అందిస్తున్నాయి. -
వైరల్ వీడియో : సముద్రంలో ఎగురుతున్న డ్రోన్‌ను పట్టుకున్న ఎలిగేటర్
-
తవాంగ్ ఘర్షణ: ఎటునుం‘చైనా’.. హెచ్చరిస్తున్న ఛాయా చిత్రాలు..
కయ్యాలమారి చైనా దుందుడుకుగా వ్యవహరిస్తూ ఈశాన్య రాష్ట్రాలపై గురి పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఇటీవల ఘర్షణల అనంతరం టిబెట్‌లోని వైమానిక స్థావరాల్లో భారీ సంఖ్యలో డ్రోన్లు, యుద్ధ విమానాలను మోహరించి మనపై కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు చేసింది. మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ మక్సర్ తీసిన హై రిజల్యూషన్ ఉప గ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం తేటతెల్లమైంది. మన వైమానిక దళం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కొంది. గగనతలంలో నిరంతరం యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తూ డ్రాగన్ దేశం కార్యకలాపాలను గట్టిగా అడ్డుకుంటామని చాటి చెప్పింది. భవిష్యత్‌లో చైనా నుంచి ఎటు నుంచైనా ముప్పు పొంచి ఉందని ఈ ఛాయా చిత్రాలు హెచ్చరిస్తున్నాయి. బాంగ్డా వైమానిక కేంద్రం డబ్ల్యూజెడ్–7 ‘‘సోరింగ్ డ్రాగన్’’ డ్రోన్, ఈ డ్రోన్‌ని గత ఏడాది చైనా అధికారికంగా వైమానిక దళంలోకి ప్రవేశపెట్టింది. 10 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలదు. నిఘా వ్యవస్థకు ఈ డ్రోన్ పెట్టింది పేరు. భారత్‌లో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించడానికి క్రూయిజ్ క్షిపణులు పని చేసేలా డేటాను ప్రసారం చేసే సామర్థ్యం కూడా ఈ డ్రోన్ కలిగి ఉంది. ఈ తరహా డ్రోన్లు భారత్ వద్ద లేవు. ఇక డిసెంబర్ 14నాటి ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో బాంగ్డాలో ఫ్లాంకర్ టైప్ యుద్ధ విమానాలు రెండు మోహరించి ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు భారత్ దగ్గర ఉన్న ఎస్‌యూ–30ఎంకేఐ మాదిరిగా పని చేస్తాయి. లాసా వైమానిక కేంద్రం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకి 260 కి.మీ. దూరం నాలుగు జే–10 యుద్ధవిమానాలను సిద్ధంగా ఉంచింది. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీలో ఈ యుద్ధ విమానాలు అత్యంత విశ్వసనీయమైనవిగా గుర్తింపు పొందాయి. 1988 నుంచి వీటిని వాడుతున్న చైనా ఆర్మీకి ఈ యుద్ధ విమానాలు బాక్ బోన్ అని చెప్పొచ్చు. ఇక లాసాలో మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించిన పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తోంది. రెండో రన్‌వే నిర్మాణం శరవేగంగా సాగుతోంది. షిగాట్సే వైమానిక కేంద్రం సిక్కిం సరిహద్దుకి 150కి.మీ. దూరం ఇక్కడ చైనా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ)లను మోహరించింది. టిబెట్‌లో మొత్తం రక్షణ వ్యవస్థనే ఆధునీకరిస్తోంది. ఆధునిక యుద్ధ విమానాలైన జే–10సీ, జే–11డీ, జే–15 విమానాలు కూడా మోహరించి ఉన్నాయి. ఇవన్నీ గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ వినియోగించే జెట్స్‌ను అడ్డుకునే అవకాశాలున్నాయి. బలం పెంచుకుంటున్న ఇరుపక్షాలు 2017లో డోక్లాం సంక్షోభం తర్వాత భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఆయుధాలపరంగా, సదుపాయాలపరంగా బలం పెంచుకుంటున్నాయి. వివాదాస్పద జోన్లలో భారత్ సైన్యం కదలికల్ని అనుక్షణం అంచనా వేయడానికి చైనా వైమానిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. సరిహద్దుల్లో చైనా మోహరిస్తున్న ఆధునిక యుద్ధ విమానాలు, ఇతర కొత్త ప్రాజెక్టులు, నిర్మాణాలు డ్రాగన్ బలాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయని టిబెట్ ప్రాంతంలో ఆ దేశ మిలటరీ కార్యకలాపాలను నిరంతరం ట్రాక్ చేసే మిలటరీ అనలిస్ట్ సిమ్ టాక్ అభిప్రాయపడ్డారు. టిబెట్, తూర్పు లద్దాఖ్ మీదుగా చైనా బలగాలను అనుసంధానం చేయడానికి కొత్త మార్గాలను నిర్మించే పనిలో డ్రాగన్ దేశం ఉందని చెప్పారు. అస్సాం, బెంగాల్లో మైదాన ప్రాంతాలైన తేజ్‌పూర్, మిసామరి, జోర్హాట్, హషిమారా, బాగ్డోగ్రాలో దశాబ్దాలుగా భారతీయ యుద్ధ విమానాల నిర్వహణ మన దేశానికి ఎంతో కలిసొస్తోంది. కొండ ప్రాంతాల్లోని టిబెట్ వైమానిక స్థావరాల నిర్వహణలో చైనాకు యుద్ధ విమానాల బరువుపై పరిమితులున్నాయి. మనకది లేకపోవడం కలిసొచ్చే అంశమని విశ్లేషకులు అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శత్రు డ్రోన్లను చీల్చి చెండాడే ‘గద్దలు’.. ఆర్మీ నయా అస్త్రం
న్యూఢిల్లీ: సైనికల బలగాల కన్నుగప్పి దేశంలోకి ఆయుధాలు, మాదకద్రవ్యాలను డ్రోన్ల ద్వారా చేరవేస్తున్నాయి శత్రు దేశాలు. డ్రోన్ల ద్వారానే దాడులకు పాల్పడుతున్న సంఘటనలూ ఇటీవల వెలుగు చూశాయి. ఈ క్రమంలో శత్రు డ్రోన్లను నివారించేందుకు కొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది భారత సైన్యం. తొలిసారి శత్రు డ్రోన్లను ధ్వంసం చేసేందుకు గద్దలకు శిక్షణ ఇస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఔలీలో అమెరికా, భారత్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న యుద్ధ అభ్యాస్ ప్రదర్శనలో ఈ అస్త్రాన్ని భారత సైన్యం ప్రదర్శించింది. ఈ సైనిక ప్రదర్శన సందర్భంగా ‘అర్జున్’ అనే గద్ద శత్రు దేశాల డ్రోన్లను ఏ విధంగా నాశనం చేస్తుందనే విషయాన్ని చూపించారు. శత్రు దేశాలకు చెందిన డ్రోన్లు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, ధ్వంసం చేసేందుకు గద్దతో పాటు ఓ శునకానికి సైతం శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో డ్రోన్ శబ్దం వినబడగానే సైన్యాన్ని శునకం అప్రమత్తం చేసింది. అలాగే.. డ్రోన్ ఎక్కడి నుంచి వెళ్తుందనే విషయాన్ని గద్ద గుర్తించింది. ఇలాంటి పక్షులను శత్రు డ్రోన్లను గుర్తించి, ధ్వంసం చేసేందుకు ఉపయోగించటం ఇదే తొలిసారి. అయితే, సైనికపరమైన చర్యల కోసం గద్దలు, శునకాలను వినియోగిస్తున్నట్లు భారత సైన్యం తెలిపింది. పంజాబ్, జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దుల గుండా దేశంలోకి ప్రవేశించే డ్రోన్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రక్రియ దోహదబడుతుందని పేర్కొంది. Here comes India's first anti #drone Kite (a bird) which can destroy a quadcopter in air. #IndianArmy #YUDHABHYAS22 pic.twitter.com/OByAwWuJop — Haresh 🇮🇳 (@HARESHRJADAV3) November 29, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే.. బీజేపీ ఆగ్రహం -
AP: ఇక రైతులే డ్రోన్ పైలట్లు
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల్లో కిసాన్ డ్రోన్స్ (డ్రోన్స్ అండ్ సెన్సార్ టెక్నాలజీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఆర్బీకేలకు కేటాయించే డ్రోన్లను రైతులే నడిపేలా.. రైతు గ్రూపుల్లో డ్రోన్ పైలట్‌గా ఎంపిక చేసిన వారికి ఈ నెల 28వ తేదీ నుంచి శిక్షణకు శ్రీకారం చుడుతోంది. మండలానికి 3 చొప్పున తొలి దశలో 2 వేల ఆర్బీకేల్లో కిసాన్ డ్రోన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా.. తొలిదశలో 1,961 ఆర్బీకేలను గుర్తించారు. వీటిలో ఇప్పటికే 738 ఆర్బీకేల పరిధిలో ఐదుగురు సభ్యులతో రైతు గ్రూపులను ఏర్పాటు చేశారు. మిగిలిన ఆర్బీకేల పరిధిలో డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డీజీసీఐ నిబంధనల మేరకు శిక్షణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఐ) నిబంధనల మేరకు వ్యవసాయ డ్రోన్ పైలట్‌గా శిక్షణ పొందాలంటే 18–65 ఏళ్ల వయసు కలిగి, వ్యవసాయ డిప్లొమా లేదా వ్యవసాయ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా కనీసం ఇంటర్మీడియెట్ తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్తో విధిగా పాస్‌పోర్టు కలిగి ఉండాలి. రైతు గ్రూపుల్లో ఈ అర్హతలు కలిగిన వారిని డ్రోన్ పైలట్లుగా ఎంపిక చేశారు. ఇటీవలే వ్యవసాయ, సంప్రదాయ డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చేందుకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రిమోట్ పైలట్ ట్రైనింగ్ కోర్సు (ఆర్పీటీసీ)కు డీజీసీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 28 నుంచి బ్యాచ్‌కు 20 మంది చొప్పున 12 రోజులపాటు రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఎన్జీ రంగా వర్సిటీ ప్రత్యేక పాఠ్యప్రణాళికను తయారు చేసింది. 10 ప్రధాన పంటల సాగులో డ్రోన్ల వినియోగంపై విధివిధానాలను రూపొందించింది. 4 రోజులపాటు క్లాస్ రూమ్ సెషన్స్, రెండ్రోజుల పాటు అనుకరణ, అసెంబ్లింగ్, మరమ్మతు, నిర్వహణలపై శిక్షణ ఇస్తారు. 6 రోజులపాటు ఫీల్డ్‌లో డ్రోన్ నిర్వహణపై ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. శిక్షణకు ఇద్దరు టెక్నికల్, ఐదుగురు ఫీల్డ్ ఫ్యాకల్టీని సిద్ధం చేశారు. ఇందుకోసం ఒక్కో రైతుకు రూ.17 వేలు ఖర్చవుతుందని అంచనా వేయగా.. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. శిక్షణ అనంతరం ఆయా రైతులకు డీజీసీఐ ద్రువీకరణతో కూడిన సర్టిఫికెట్ కూడా అందజేయనున్నారు. మార్చిలోగా తొలిదశ కిసాన్ డ్రోన్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు ఆర్బీకే స్థాయిలో సాధ్యమైనంత త్వరగా కిసాన్ డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. 50 శాతం గ్రూపుల ఎంపిక పూర్తయింది. మిగిలిన గ్రూపుల ఎంపిక సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చాం. ఎంపిక చేసిన రైతులకు ఈ నెల 28 నుంచి ఏపీ ఎన్జీ రంగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో డ్రోన్ పైలట్ శిక్షణకు శ్రీకారం చుడుతున్నాం. మార్చిలోగా తొలి దశలో నిర్దేశించిన 2వేల ఆర్బీకేల్లో కిసాన్ డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకు రావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయశాఖ దశల వారీగా శిక్షణ వ్యవసాయ, సంప్రదాయ డ్రోన్లపై శిక్షణ ఇచ్చేందుకు ఇటీవలే డీజీసీఐ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న కిసాన్ డ్రోన్స్ కోసం ఎంపిక చేసిన రైతులకు సోమవారం నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నాం. బ్యాచ్‌కు 20 మంది చొప్పున దశల వారీగా 2వేల మందికి శిక్షణ ఇస్తాం. – డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి, వీసీ, ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ -
డ్రోన్లతో కుక్కలను దింపి దాడులు.. దెబ్బకు శత్రువు ఆటకట్టు
చైనీస్ మిలటరీ ఒక సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది. ఇంతవరకు మిషన్గన్తో కూడిన రోబో శునకాలను చూశాం. ఐతే వాటినే రణరంగంలోకి దింపి శత్రువుపై ఆకస్మకి దాడులు చేయించే టెక్నాలజీకి నాంది పలకింది చైనా రక్షణ శాఖ. ఈ మేరకు డ్రోన్ సాయంతో మిషన్గన్తో కూడిన రోబో శునకాలను శత్రువు ఉండే ప్రాంతంలో వదిలేస్తారు. అది వెంటనే తన టార్గెట్‌ని ఏర్పాటు చేసుకుంటూ దాడులు చేయడం ప్రారంభించింది. ఇది శత్రువులకు సైతం అర్థంకాని విధంగా వ్యూహాత్మక ఆకస్మిక దాడులు చేస్తోంది. దీంతో శత్రువుని సులభంగా మట్టి కరిపించగలమని చైనీస్ మిలటరీ చెబుతోంది. అంతేకాదు ఆ రోబో కుక్క నాలుగు కాళ్లపై నుంచుని గన్ని ఓపెన్ చేసి తన టార్గెట్‌ని చూసుకుంటూ దాడులు నిర్వహిస్తోంది. అందుకు సంబంధించిన వీడీయోని చైనా మిలటరీ అనుబంధంగా ఉండే కెస్ట్రెల్ డిఫెన్స్ బ్లడ్-వింగ్‌కి సంబంధించిన విబో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Has anyone watched the War of the Worlds cable series! Chinese military contractor created a video showing off its terrifying new military technology, revealing a robot attack dog that can be dropped off by a drone. https://t.co/wW9kYR70N0 pic.twitter.com/grrWutK8ge — Shell (@EwingerMichelle) October 27, 2022 (చదవండి: మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే సంస్థను కొనుగోలు చేసిన తొలిమహిళ) -
నీటి అడుగున అద్భుతాల్ని క్లిక్ మనిపించే డ్రోన్ కెమెరా
నీటి అడుగున ఉండే వింతలను కళ్లారా చూడాలని, వాటి ఫొటోలు తీసుకోవాలని చాలామందికి కోరికగా ఉన్నా, నేరుగా నీటిలోకి దూకడానికి తటపటాయిస్తారు. సరదాగా స్విమ్మింగ్ పూల్లోనో, చిన్నపాటి చెరువులోనో ఈతలు కొట్టేవాళ్లు కూడా సముద్రంలోకి దిగాలంటే వెనుకంజ వేస్తారు. మరి నీటి అడుగున ఉన్న వింత విడ్డూరాలను ఫొటోలు తీసుకోవడమెలా? ఇదిగో, ఈ ఫొటోలో కనిపిస్తున్న బుల్లి డ్రోన్ ఉంటే భేషుగ్గా నీటి అడుగున ఉండే వింత విడ్డూరాల ఫొటోలు సులభంగా తీసుకోవచ్చు. గ్రీస్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘బెంటిక్స్’ ఈ మినియేచర్ అండర్‌వాటర్ డ్రోన్‌ను రూపొందించింది. ఇది లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే, నీటి అడుగున గంటన్నరసేపు నిక్షేపంగా చక్కర్లు కొడుతూ ఫొటోలు, వీడియోలు తీసి దీనికి అనుసంధానమైన యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు పంపగలదు. దీనిని రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించవచ్చు. దీని పొడవు 11.8 అంగుళాలు, వెడల్పు 9.8 అంగుళాలు, ఎత్తు 5.9 అంగుళాలు. బరువు ఐదు కిలోలు మాత్రమే! దీనిని ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు. ‘బెంటిక్స్’ ప్రస్తుతం దీనిని నమూనాగా రూపొందించింది. ఆసక్తిగల సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తే, మార్కెట్లోకి తీసుకొచ్చేలా దీని ఉత్పాదన భారీ స్థాయిలో ప్రారంభిస్తామని ‘బెంటిక్స్’ ప్రతినిధులు చెబుతున్నారు. -
డ్రోన్ల వ్యాపారంలోకి ధోని..!
వ్యవసాయ రంగంలో రైతులకు సాయం అందించేందుకు గాను ప్రముఖ డ్రోన్ల తయారీ సంస్థ గరుడ ఏరోస్పేస్ సరికొత్త కెమెరా డ్రోన్‌ను తయారు చేసింది. 'ద్రోణి' అని నామకరణం చేసిన ఈ డ్రోన్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అధికారికంగా లాంచ్ చేశాడు. వ్యవసాయంలో మందుల పిచికారి కోసం బ్యాటరీ సాయంతో నడిచే ఈ డ్రోన్‌ను వినియోగించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ డ్రోన్ రోజుకు సుమారు 30 ఎకరాలలో నిరాటంకంగా మందుల పిచికారి చేస్తుందని వారు వివరించారు. ద్రోణి ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి వస్తుందని వారు వెల్లడించారు. ద్రోణి ఆవిష్కరణ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. కోవిడ్ లాక్డౌన్ సమయంలో తాను కూడా వ్యవసాయం చేశానని గుర్తు చేశాడు. ద్రోణి వ్యవసాయ రంగంలో అద్భుతాలు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ సంస్థకు ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సంస్థలో ధోని పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, చెన్నై ప్రధాన కార్యాలయంగా ఉన్న గరుడ ఏరోస్పేస్ సంస్థ వ్యవసాయ పురుగు మందుల స్ప్రేయింగ్‌తో పాటు సోలార్ ప్యానెల్ క్లీనింగ్, ఇండస్ట్రియల్ పైప్‌లైన్ తనిఖీలు, మ్యాపింగ్, సర్వేయింగ్, పబ్లిక్ అనౌన్స్మెంట్స్, డెలివరీ సర్వీసెస్ కోసం డ్రోన్ సొల్యూషన్లను అందిస్తుంది. -
సర్వేశ్వర నేత్రం.. పరిష్కారం కానున్న భూ వివాదాలు
సాక్షి, నరసరావుపేట: దశాబ్దాలుగా అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డులను ప్రక్షాళించి, రైతులకు సంపూర్ణ భూహక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష రీసర్వే పల్నాడు జిల్లాలో జోరుగా సాగుతోంది. చెదలు పట్టిన భూ రికార్డులు, ఎవరి భూములు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితిలో అడ్డూఅదుపూలేని అక్రమాలు ఓ వైపు, న్యాయపరమైన చిక్కులు మరోవైపు. వీటన్నింటికీ పరిష్కారం చూపి రైతులు భూవివాదాల నుంచి బయటపడేలా రాష్ట్ర ప్రభుత్వం భూ స్వచ్ఛీకరణకు రీ సర్వే ద్వారా శ్రీకారం చుట్టింది. సర్వే తర్వాత ప్రతి రైతుకూ హద్దులు నిర్ణయించడంతోపాటు రాళ్లను పాతి ప్రత్యేక నంబర్లను కేటాయించనుంది. 1904 తర్వాత... ఆంగ్లేయుల పాలనలో 1904లో చివరి సారిగా పూర్తి స్థాయిలో భూ సర్వే జరిపి రికార్డులు పొందుపరిచారు. ప్రతి 30 ఏళ్లకు ఓసారి సర్వే అండ్ రీ సెటిల్మెంట్ జరగాల్సి ఉన్నా, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ పూర్తిస్థాయిలో చేయలేదు. రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టేలా రికార్డుల స్వచ్ఛీకరణతోపాటు భూ రీసర్వేకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించడంతో దశాబ్దాలుగా ఉన్న భూ చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. డ్రోన్ల ద్వారా సర్వే.. రాళ్లతో హద్దులు సర్వే చేపడుతున్న గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. రికార్డులను ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మొదటగా డ్రోన్ కెమెరాలతో పాయింట్లను గుర్తిస్తున్నారు. ఆ పాయింట్లు, రోవర్ ఆధారంగా పొలాల్లోకి దిగి మాన్యువల్ సర్వే చేపడుతున్నారు. ప్రతి సర్వే నంబర్‌కు హద్దులు గుర్తించి రాళ్లు పాతుతున్నారు. ప్రస్తుతం 10 వేల హద్దు రాళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని అక్టోబర్ 15నాటికి పాతనున్నారు. 26 గ్రామాల్లో కొత్త హక్కుపత్రాలు జిల్లాలో ల్యాండ్ అండ్ సర్వే అధికారులతోపాటు రెవెన్యూ అధికారులు సమన్వయంతో సర్వే ప్రక్రియ చేపడుతున్నారు. మొదటి దశలో జిల్లాలో 81 రెవెన్యూ గ్రామాల్లో 1,98,680 ఎకరాలను క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1,38,024 ఎకరాల సర్వే పూర్తయింది. తొలివిడతగా 26 గ్రామాల్లోని 7,145 మంది రైతులకు అక్టోబర్ 2 నుంచి కొత్త హక్కు పత్రాలు అందజేయనున్నారు. జిల్లాలో రెండు డ్రోన్లు, 51 రోవర్ల సహాయంతో రీ సర్వే జరుగుతోంది. 300 మంది విలేజ్ సర్వేయర్లను పది బృందాలుగా ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికీ ఓ సర్వేయర్, ముగ్గురు డెప్యూటీ సర్వేయర్లు పనిచేస్తున్నారు. పూర్తిస్థాయిలో స్వచ్ఛీకరణ వందేళ్ల తర్వాత తొలిసారి పూర్తిస్థాయిలో భూముల రీ సర్వే జరుగుతోంది. ఎవరు సాగు చేస్తున్నారు, హద్దులేంటి, ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా అన్న విషయాలను సమగ్రంగా పరిశీలించి రికార్డులను స్వచ్ఛీకరిస్తున్నాం. పూర్తి పాదర్శకంగా, వివాదాలు పరిష్కారమయ్యేలా సర్వే జరుగుతోంది. ఒక్కో రెవెన్యూ గ్రామంలో భూ సర్వే పూర్తికావడానికి 3, 4 నెలలు పడుతోంది. సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్టోబర్ 2 నుంచి క్యూఆర్ కోడ్ కలిగిన భూహక్కు పత్రాలు, మ్యాప్‌లను రైతులకు అందజేయనున్నాం. ఆయా గ్రామాల్లో గ్రామ సచివాలయాల్లోనే భూముల క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. – శ్యాం ప్రసాద్, జాయింట్ కలెక్టర్, పల్నాడు జిల్లా -
రోబోటిక్ ‘లైఫ్‌బాయ్’తో సెకన్లలో సహాయం
బీచ్ రోడ్డు(విశాఖ తూర్పు): ఇటీవల సముద్రంలో రాకాసి అలలకు చిక్కుకుని అనేక మంది మృత్యువాత పడ్డారు. వీరిలో చాలా మంది సరైన సమయంలో సహాయం అందకపోవడం వల్లనే కెరటాలకు బలైపోయారన్న వాదన ఉంది. ఇప్పుడు అటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు లైఫ్‌బాయ్ పేరుతో రోబోటిక్ బోట్లు(వాటర్ డ్రోన్లు) అందుబాటులోకి వచ్చాయి. వీటి సహాయంతో సముద్రంలో మునిగిపోతున్న వారిని సెకన్ల వ్యవధిలో రక్షించి ఒడ్డుకు చేర్చవచ్చు. 25 కేజీల బరువు గల ఈ డ్రోన్ 28 కిలోమీటర్ల స్పీడ్‌తో 2 కిలోమీటర్ల మేర సముద్రంలోకి వెళ్లి ఆపదలో ఉన్న 200 కేజీల వరకు బరువు ఉన్న వ్యక్తులను రక్షిస్తాయి. సేఫ్ బీచ్‌గా విశాఖ తీరం ఆర్కే బీచ్‌లో ఉన్న రోబోటిక్ బోట్(వాటర్ డ్రోన్లు)లను శుక్రవారం కలెక్టర్ మల్లికార్జున, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ పరిశీలించారు. వాటి పని తీరు, ఎలా రక్షిస్తుంది అనేది వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ సాగర తీరాన్ని సేఫ్ బీచ్‌గా రూపుదిద్దుతామన్నారు. జీవీఎంసీ సహకారంతో 39 మంది గజ ఈతగాళ్లను బీచ్‌లో నియమించామని, వారికి అవసరమైన లైఫ్ జాకెట్లు, ఇతర సామగ్రిని సమకూర్చినట్టు చెప్పారు. ఇదీ చదవండి: గుడ్ న్యూస్: అందుబాటులోకి అదనపు బెర్తులు, సీట్లు -
డ్రోన్ పైలట్లుగా సర్వేయర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న భూముల రీ సర్వే కోసం ప్రభుత్వ సర్వేయర్లే డ్రోన్ పైలట్లుగా మారారు. ఇలా సర్వేయర్లే డ్రోన్లను ఆపరేట్ చేస్తూ భూములను సర్వే చేయడం దేశంలోనే మొదటిసారి. సామర్లకోటలోని సర్వే శిక్షణ అకాడెమీలో ఎంపిక చేసిన సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నారు. రీ సర్వే కోసం ప్రభుత్వం మొదట సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుని డ్రోన్లను ఉపయోగించడం ప్రారంభించింది. కొన్ని ప్రైవేటు డ్రోన్ ఏజెన్సీలతోనూ సర్వే చేయిస్తోంది. మొదట్లో ఆ డ్రోన్లను ఆపరేట్ చేసే సంస్థల పైలట్లకు సర్వేయర్లు కో–పైలట్లుగా పని చేశారు. రీ సర్వేను మరింత వేగంగా నిర్వహించేందుకు ప్రభుత్వమే ఇటీవల సొంతంగా 20 డ్రోన్లు కొనుగోలు చేసింది. ప్రైవేటు డ్రోన్లతోపాటు వీటిని ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్లకు పైలట్లుగా ప్రభుత్వ సర్వేయర్లే ఉండాలని సర్వే శాఖ భావించింది. ఇందుకోసం ప్రతి జిల్లా నుంచి ముగ్గురు, నలుగురు సర్వేయర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారు. డ్రోన్లు విక్రయించిన సంస్థ నిపుణులే సామర్లకోట వచ్చి తొలి విడతగా 94 మందికి వారం రోజులు శిక్షణ ఇచ్చి సరిఫికెట్లు కూడా ఇచ్చారు. డ్రోన్‌ను సర్వేకు సిద్ధం చేయడం (అసెంబ్లింగ్), ఆపరేషన్, సర్వే అయిన తర్వాత డేటాను స్వీకరించడం (క్యాప్చర్ చేయడం), ఆ డేటాను హైదరాబాద్‌లోని సర్వే ఆఫ్ ఇండియాకు పంపించేవరకు మొత్తం బాధ్యత పైలట్లదే. సర్వే శాఖ డ్రోన్లతోనే రోజుకు 2,470 ఎకరాలు సర్వే చేస్తున్నారు. తాజాగా మరో 10 డ్రోన్లను సర్వే శాఖ కొనుగోలు చేసింది. వాటిని ఆపరేట్ చేసేందుకు మరో 20 మంది సర్వేయర్లకు బుధవారం నుంచి సామర్లకోటలో శిక్షణ ప్రారంభమయ్యింది. విడాల్ ఏవియేషన్ సంస్థ నిపుణులు ఈ శిక్షణ ఇస్తున్నారు. సర్వేయర్లు డ్రోన్ ఫ్లై చేయడం గర్వకారణం ప్రభుత్వ సర్వేయర్లు డ్రోన్ల ద్వారా రీ సర్వేలో భూములు కొలవడం గర్వించదగ్గ విషయం. సర్వే శాఖలో 25 సంవత్సరాలుగా పని చేస్తున్నా. చైన్లు, క్రాస్లు పట్టుకుని లాగుతూ సర్వే చేసేవాళ్లం. ఇప్పుడు మా సర్వేయర్లు డ్రోన్ పైలట్లుగా మారి రీ సర్వే చేస్తున్నారు. వారికి అప్పగించిన పనిని సమర్ధంగా చేస్తున్నారు. – డీఎల్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ -
సాంకేతిక తంత్రం...ఆధునిక యంత్రం
సాక్షి రాయచోటి: మారుతున్న కాలానికి తోడు ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వస్తున్న నూతన విప్లవాత్మక మార్పులను రైతుల ముంగిటకు తెస్తూ అధిక దిగుడులకు కృషి చేస్తోంది. మరోవైపు రైతు భరోసా కేంద్రాలను పల్లె ముంగిటకు తెచ్చి ఎల్లప్పుడూ రైతులకు సలహాలు, సూచనలతోపాటు అవసరమైన సమస్యలు తీర్చేలా కొత్త ఒరవడి సృష్టించారు. ప్రస్తుతం వ్యవసాయ పద్ధతుల్లో సులువైన రీతులను కనుగొంటూ వ్యవసాయాన్ని పండుగ చేసేలా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన డ్రోన్లను రైతన్నలకు సబ్సిడీపై అందించి తోడ్పాటును ఇస్తున్నారు. కిసాన్ డ్రోన్లు పురుగు మందుల పిచికారీతోపాటు.. విత్తనాలు, ఎరువులు చల్లడం తదితర అనేక ఉపయోగాలు ఉన్నాయి. మండలానికి మూడు డ్రోన్లు అన్నమయ్య జిల్లాలో 30 మండలాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలానికి మూడు డ్రోన్లను అందించాలని వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా ఐదుగురు రైతులు గ్రూపుగా ఏర్పడి దరఖాస్తు చేసుకోవాలి. అందులో చదువుకున్న వారు (టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ) ఒకరు ఉండాలి. ఎందుకంటే డ్రోన్ ఆపరేట్ చేసేందుకు చదువుకున్న వ్యక్తికి నెల రోజులపాటు శిక్షణ ఉంటుంది. ఆపరేట్ చేసే విధానం నేర్పించడంతోపాటు ప్రత్యేకంగా కోర్సుకు సంబంధించి లైసెన్స్ సర్టిఫికెట్ అందించనున్నారు. 2022–23 సంవత్సరానికి సంబంధించి అన్నమయ్య జిల్లాలో మండలానికి మూడు చొప్పున 90 డ్రోన్లు అందించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. డ్రోన్‌తో అనేక ప్రయోజనాలు జిల్లాలో రైతన్నలకు డ్రోన్ల ద్వారా అనేక ప్రయోజనాలు అందనున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయవచ్చు. అలాగే కూలీల అవసరం కూడా తగ్గిపోతుంది. ఎత్తుగా పెరిగే అరటి, చీనీ, జామ, నేరేడు, సపోట తదితర పంటలకు మరింత అనువుగా ఉంటుంది. వర్షం కురిసినా.. తేమ ఉన్నా.. డ్రోన్‌తో పిచికారీ చేయడంగానీ.. చెట్లకు స్ప్రే సత్తువ అందించడానికి డ్రోన్ ప్రయోజనకరంగా మారనుంది. ఇంకా విత్తనం చల్లేందుకు కూడా అవకాశం ఉంటుంది. సబ్సిడీతో డ్రోన్ అందజేత జిల్లాకు కేటాయించిన డ్రోన్ యంత్రాల విషయంలో భారీగా సబ్సిడీ వర్తించనుంది. ఒక్కో డ్రోన్ విలువ దాదాపు రూ. 10 లక్షలుగా నిర్ణయించారు. అందులో 10 శాతం రైతుల వాటా చెల్లించాలి. మిగిలిన 90 శాతంలో 40 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. అంటే రూ. 10 లక్షలు విలువజేసే డ్రోన్ యంత్రంపై రూ. 4 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. అదే డిగ్రీ, డిప్లొమా (అగ్రికల్చర్) చదివిన వారికి 50 శాతం మేర రాయితీని కల్పించారు. 164 ఆర్బీకేలలో ట్రాక్టర్లకు అవకాశం జిల్లాలో మొత్తం 30 మండలాల్లో 400 ఆర్బీకేలు ఉండగా 236 ఆర్బీకేల పరిధిలో రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లను అందించారు. అయితే పలు మండలాల్లోని 164 ఆర్బీకేల పరిధిలో సబ్సిడీపై అందించే ట్రాక్టర్లకు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ప్రభుత్వం రైతులకు మరో అవకాశం కల్పించింది. రూ. 15 లక్షల విలువైన ట్రాక్టర్‌తోపాటు పరికరాలు అందించనున్నారు. రైతు వాటా 10 శా తం పోను 40 శాతం సబ్సిడీ ఉంటుంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో రైతులు ఐదుగురు గ్రూపుగా ఏర్పడి ఆర్బీకేల పరిధిలో దరఖాస్తు చేసుకోవాలి. మండలానికి మూడు చొప్పున జిల్లాకు 90 వరకు అందించేందుకు అవకాశం ఉంది. ఈనెల 31వ తేదీలోగా ఆర్బీకేలలో సంప్రదించాలి. ఒక్కొక్క డ్రోన్ విలువ రూ. 10 లక్షలు కాగా ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోంది. డీసీసీ బ్యాంకు ద్వారా డ్రోన్‌కు అందించే రుణాలను తిరిగి కంతుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. డ్రోన్‌తో రైతులకు చాలా ప్రయోజనం ఒనగూరనుంది. ఆసక్తిగల రైతులు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే జిల్లాకు సబ్సిడీపై అందించే ట్రాక్టర్లు, పరికరాలకు సంబంధించి కూడా 164 ఆర్బీకేల పరిధిలో రైతులు దరఖాస్తు చేసుకుంటే అర్హులకు అందించనున్నాం. – ఉమామహేశ్వరమ్మ, జిల్లా వ్యవసాయశాఖాధికారి, రాయచోటి, అన్నమయ్య జిల్లా -
Predator drone deal: అమెరికా నుంచి అత్యాధునిక డ్రోన్లు
న్యూఢిల్లీ: అమెరికా నుంచి అత్యాధునిక ఎంక్యూ–9బీ ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన సంప్రదింపులు పురోగతిలో ఉన్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం రూ.300 కోట్ల విలువైన 30 ఎంక్యూ–9బీ డ్రోన్లు అందితే వీటిని చైనా సరిహద్దులతోపాటు హిందూమహా సముద్రం ప్రాంతంపై నిఘాకు వినియోగించనున్నట్లు వెల్లడించాయి. ఎంక్యూ–9 రీపర్ డ్రోన్ ఆధునిక వెర్షనే ఎంక్యూ–9బీ. గత నెలలో అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోని ఓ ఇంట్లో ఉన్న అల్‌ఖైదా నేత అల్ జవహరిని హతమార్చేందుకు వాడింది ఎంక్యూ–9 రీపర్ డ్రోన్‌నే కావడం గమనార్హం. జనరల్ ఆటమిక్స్ అభివృద్ధి చేసిన ఎంక్యూ–9 బీ ప్రిడేటర్ల కోసం రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు తుది దశకు వచ్చాయన్న వార్తలను రక్షణ శాఖ వర్గాలు తోసిపుచ్చాయి. ప్రస్తుతం చర్చలు పురోగతిలో ఉన్నాయని స్పష్టం చేశాయి. వీటి ఖరీదు,, ఆయుధాల ప్యాకేజీ, సాంకేతికత భాగస్వామ్యానికి సంబంధించిన కొన్ని అంశాలపై చర్చలు నడుస్తున్నాయని తెలిపాయి. ఇదే విషయాన్ని జనరల్ ఆటమిక్స్ గ్లోబల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ వివేక్ లాల్ కూడా ధ్రువీకరించారు. చర్చల వివరాలను రెండు దేశాల ప్రభుత్వాలే వెల్లడిస్తాయన్నారు. ఎంక్యూ–9బీ గార్డియన్ రకం రెండు డ్రోన్లను 2020 నుంచి భారత్ తమ నుంచి లీజుకు తీసుకుని భూ సరిహద్దులు, హిందూ మహాసముద్రంపై నిఘాకు వినియోగిస్తోందన్నారు. ఈ హంటర్–కిల్లర్ డ్రోన్లు 450 కిలోల బరువైన బాంబులతోపాటు నాలుగు హెల్ఫైర్ క్షిపణులను మోసుకెళ్లగలవు. -
కిసాన్ డ్రోన్లపై కసరత్తు!
సాక్షి, విశాఖపట్నం: రానురాను వ్యవసాయానికి పెట్టుబడి పెరిగిపోతోంది. కూలీల కొరత కూడా అధికమవుతోంది. వీటన్నిటిని అధిగమించి సాగు చేయడం అన్నదాతకు తలకు మించిన భారమవుతోంది. ఇలా వ్యవసాయం గిట్టుబాటు కాక రైతాంగం ఎంతగానో సతమతమవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే రైతులకు వివిధ యంత్రాల పనిముట్లను రాయితీపై అందిస్తోంది. తాజాగా పంటలకు పురుగు మందులను పిచికారీ చేయడానికి కిసాన్ డ్రోన్లను అందుబాటులోకి తెస్తోంది. వీటిని రైతులకు సబ్సిడీపై సరఫరా చేయనుంది. ఇందుకోసం జిల్లాల వారీగా రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) పరిధిలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. ఈ పనిని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టారు. ప్రాథమికంగా మండలానికి మూడు చొప్పున కిసాన్ డ్రోన్లను మంజూరు చేయనున్నారు. ఒకే పంట విస్తీర్ణం ఎక్కువగా ఉండే ప్రాంతాలను డ్రోన్ల వినియోగానికి వీలుగా ఉంటుందని భావించి అలాంటి వాటిని తొలుత ఎంపిక చేస్తున్నారు. కిసాన్ డ్రోన్లు మంజూరుకు నిబంధనల ప్రకారం ఐదుగురు రైతులు గ్రూపుగా ఏర్పడాల్సి ఉంటుంది. వీరిలో ఒకరు కనీసం పదో తరగతి/ఇంటర్మీడియట్ విద్యార్హతను కలిగి ఉండాలి. ఈయనకు డ్రోన్ వినియోగంలో శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన రైతుకు సర్టిఫికెట్ కూడా ఇస్తారని విశాఖపట్నం జిల్లా వ్యవసాయ అధికారి కె.అప్పలస్వామి ‘సాక్షి’కి చెప్పారు. డ్రోన్లపై రైతులకు అవగాహన.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కొద్ది రోజుల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు కిసాన్ డ్రోన్లపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నెలా మొదటి శుక్రవారం ఆయా గ్రామాల్లో వీటితో ఒనగూరే ప్రయోజనాలను వారికి వివరిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి, ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాలు మినహా మిగిలినవి అర్బన్ ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో పద్మనాభం మండలంలోనే అధికంగా పంటలు పండిస్తున్నారు. అందువల్ల విశాఖపట్నం జిల్లాలో పంటల సాగు తక్కువగానే జరుగుతోంది. దీంతో విశాఖ జిల్లాలో 57 ఆర్బీకేలున్నప్పటికీ ఇప్పటివరకు కిసాన్ డ్రోన్ల కోసం ఐదు గ్రూపులు మాత్రమే ముందుకు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 22 మండలాల్లో 66 రైతు గ్రూపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అక్కడ గిరి ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 38 గ్రామాలు కిసాన్ డ్రోన్ల మంజూరుకు అనువైనవని గుర్తించారు. అలాగే అనకాపల్లి జిల్లాలో 24 మండలాలకు గాను 72 గ్రామాలను ఇందుకు ఎంపిక చేసినట్టు ఆ జిల్లా వ్యవసాయ అధికారి లీలావతి చెప్పారు. రైతు గ్రూపుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ నెలాఖరుకల్లా పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి సెప్టెంబర్‌లో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇస్తారు. శిక్షణ అయ్యాక డ్రోన్ల కొనుగోలుకు వీలవుతుంది. ఉద్యాన పంటలకు సైతం.. సాధారణంగా పంటలకు సోకిన తెగుళ్ల నివారణకు పురుగు మందులను స్ప్రేయర్లలో నింపి పంటపై స్ప్రే చేస్తారు. వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలకు సోకే తెగుళ్ల నివారణకు పురుగు మందులను ఈ డ్రోన్ల ద్వారా పిచికారి చేసేందుకు వీలుంది. డ్రోన్ల ద్వారా పిచికారి చేసే మందు నానో డోసుల్లో ఉంటుంది. దానిని తగిన మోతాదులో నింపి డ్రోన్‌లో ఉంచి వదిలితే పంటపై జెట్ స్పీడ్‌లో స్ప్రే చేసుకుంటూ వెళ్తుంది. డ్రోన్ ఖరీదు రూ.10 లక్షలు.. ఒక్కో కిసాన్ డ్రోన్ ఖరీదు సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 40 శాతం ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. 50 శాతం సొమ్మును బ్యాంకుల ద్వారా రుణం లభిస్తుంది. మిగతా 10 శాతం సొమ్మును గ్రూపు రైతులు సమకూర్చుకోవలసి ఉంటుంది. పంటలకు పురుగు మందులు పిచికారీ చేసుకోదల్చుకున్న వారికి అద్దె ప్రాతిపదికన డ్రోన్లను ఇస్తారు. చాన్నాళ్లుగా పంటల చీడపీడల నివారణకు కూలీలతో పురుగు మందులను స్ప్రే చేయిస్తున్నారు. ఈ పనికి కూలీలు ముందుకు రాని పరిస్థితి ఉంది. దీంతో రైతులు అధిక మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇది రైతుకు ఆర్థిక భారమవుతోంది. డ్రోన్లు అందుబాటులోకి వస్తే రైతులకు కూలీల బెడద తప్పుతుంది. ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలుగుతుంది. -
4,500 గ్రామాల్లో ఎగిరిన డ్రోన్లు
సాక్షి, అమరావతి: భూముల చరిత్రను తిరగరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీ సర్వే చురుగ్గా సాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 17,460 గ్రామాల్లోని 1.22 లక్షల చదరపు కిలోమీటర్లకు గాను.. 4,547 గ్రామాల్లోని 25 వేల చదరపు కిలోమీటర్లలో డ్రోన్ సర్వే పూర్తయింది. 22.43 లక్షల ఎకరాల భూములను కొలిచారు. డ్రోన్ల ద్వారా తీసిన ఫొటోలను మెరుగు పరిచి ఇచ్చే ఓఆర్ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్)లు 2,101 గ్రామాలకు సంబంధించినవి సర్వే బృందాలకు అందాయి. ఈ బృందాలు వాటిని, క్షేత్ర స్థాయిలో భూములను పోల్చి చూస్తూ రీ సర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి ఈ జనవరి నాటికి కేవలం 1,118 గ్రామాల్లో మాత్రమే డ్రోన్ సర్వే పూర్తయింది. కరోనా కారణంగా గత సంవత్సరం సుమారు వెయ్యి గ్రామాల్లో మాత్రమే డ్రోన్ సర్వే చేయగలిగారు. కానీ ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ నిర్దేశించడం, సీఎం వైఎస్ జగన్ రీ సర్వేపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో 7 నెలల్లో 3,500 గ్రామాల్లో డ్రోన్ సర్వేను పూర్తి చేయగలిగారు. ఇంకా వేగంగా చేసేందుకు డ్రోన్ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నారు. ప్రస్తుతం 20 డ్రోన్లు వినియోగిస్తుండగా, సెప్టెంబర్ నుంచి కొత్తగా మరో 20 డ్రోన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 18 లక్షల ఎకరాల్లో క్షేత్ర స్థాయి నిజ నిర్ధారణ ► డ్రోన్ సర్వే ద్వారా ఇచ్చిన ఓఆర్‌ఐలను సంబంధిత రైతుల సమక్షంలో భూమిపైన సరిహద్దులతో పోల్చి చూసే గ్రౌండ్ ట్రూతింగ్ (క్షేత్ర స్థాయి నిజ నిర్ధారణ) ప్రక్రియ సుమారు 1,600 గ్రామాల్లో పూర్తయింది. ఈ గ్రామాల్లో 18 లక్షలకుపైగా ఎకరాల్లో గ్రౌండ్ ట్రూతింగ్‌ను పూర్తి చేశారు. ► ఈ సంవత్సరం జనవరి నాటికి కేవలం 310 గ్రామాల్లో 2.6 లక్షల ఎకరాల్లో మాత్రమే గ్రౌండ్ ట్రూతింగ్‌ను చేయగలిగారు. కానీ ఆగస్టు నాటికి 1,600 గ్రామాల్లో 18 లక్షల ఎకరాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిందంటే సర్వే ఎంత వేగంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. 1,100 గ్రామాల్లో సరిహద్దుల నిర్ధారణ ► గ్రౌండ్ ట్రూతింగ్ తర్వాత చేపట్టే గ్రౌండ్ వాలిడేషన్ (సరిహద్దుల నిర్థారణ) 1,100 గ్రామాల్లో పూర్తయింది. 9 లక్షల ఎకరాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. జనవరి నాటికి 260 గ్రామాల్లో మాత్రమే గ్రౌండ్ వాలిడేషన్ చేశారు. ఆ తర్వాత సర్వే వేగం పుంజుకోవడంతో తక్కువ సమయంలోనే 800 గ్రామాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ► మరోవైపు రీ సర్వే సుమారు వెయ్యి గ్రామాల్లో పూర్తయింది. ఈ గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు 13 నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. ఈ గ్రామాల్లో 8 లక్షల ఎకరాలకు సంబంధించి సర్వే పూర్తవడంతో ఆ గ్రామాల్లో కొత్త భూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. జనవరి నాటికి 110 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి కాగా, ప్రస్తుతం వెయ్యి గ్రామాల్లో పూర్తయింది. ► గ్రౌండ్ వాలిడేషన్ పూర్తయ్యాక ఇప్పటి వరకు రైతులు, భూ యజమానుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల అభ్యంతరాలు వచ్చాయి. మొత్తం 5.50 లక్షలకుపైగా ల్యాండ్ పార్సిల్లో కేవలం 3 శాతం మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. వాటిలో 95 శాతానికిపైగా అభ్యంతరాలను మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు పరిష్కరించాయి. -
బాలుడి ప్రాణాలు కాపాడిన డ్రోన్
డ్రోన్స్... వీడియో, ఫొటోషూట్స్, వివిధ సరుకుల డెలివరీ చేయడమే కాదు మనుషుల ప్రాణాలనూ కాపాడుతున్నాయి. స్పెయిన్‌లో ఓ లైఫ్‌గార్డ్ డ్రోన్ బాలుడి ప్రాణాలు కాపాడింది. వాలెన్సియా బీచ్‌లో సాధారణ తనిఖీల్లో ఉన్న డ్రోన్ పైలట్ మిగెల్ ఏంజిల్ పెడ్రెరో అలల ధాటికి ఓ బాలుడు కొట్టుకుపోతుండటం గమనించాడు. అది గుర్తించిన పెడ్రెరో వెంటనే డ్రోన్ ద్వారా లైఫ్‌గార్డ్ వెస్ట్‌ను కిందికి విసిరాడు. కానీ పెద్ద పెద్ద అలల తాకిడికి అది ఆ అబ్బాయిని చేరడం కష్టమైంది. కొద్ది ప్రయత్నం తరువాత ఎట్టకేలకు వెస్ట్‌ను అందుకున్న బాలుడు... దాని సహాయంతో కోస్ట్‌గార్డ్ బోట్ వచ్చేంతవరకూ ప్రాణాలు నిలుపుకోగలిగాడు. అనంతరం బోట్లో వచ్చిన కోస్ట్‌గార్డ్స్ బాలుడిని అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. 24 గంటల తరువాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ట్విట్టర్లో ‘అవర్ వరల్డ్’పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. -
డ్రోన్ సాగు వచ్చేస్తోంది
కాశినాయన: రైతులు ఆధునిక వ్యవసాయంపై అడుగులు వేస్తున్నారు. ఈ దిశగా రైతులను ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో డ్రోన్ సాగును అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. రైతులకు రాయితీపై డ్రోన్లను ఇవ్వాలని నిర్ణయించింది. తొలి దశలో మండలానికి మూడు డ్రోన్ల చొప్పున పంపిణీ చేయనుంది. డ్రోన్ల వలన రైతులకు కలిగే లాభాలు వ్యవసాయం సులభతరం కోసం ప్రభుత్వం రాయితీపై డ్రోన్లను పంపిణీ చేస్తుంది. జిల్లాలోని 51 మండలాల్లో మండలానికి మూడు చొప్పున మంజూరు చేసింది. ఆయా గ్రామాల్లోని ఆర్బీకేలలో అధికారులు డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. పురుగు మందులు, పోషకాలు పిచికారి చేయడానికి డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. మందుల పిచికారికి 5 మంది చేసే పనిని డ్రోన్ ఒక్కటే చేస్తుంది. అంతేకాకుండా నీరు, మందు ఖర్చును, సమయాన్ని తగ్గించవచ్చు. పొలంలో మొక్కలన్నింటికి సమానంగా మందును పిచికారి చేయవచ్చు. డ్రోన్‌కు అనుసంధానం చేసి స్మార్ట్‌ఫోన్ ద్వారా పొలంలో కావాల్సిన చోట డ్రోన్ కెమెరాను తిప్పుతూ ఫొటోలు కూడా తీయవచ్చు. రాయితీ ఇలా రైతు సహకార సంఘాల ద్వారా డ్రోన్ కొనుగోలు కోసం 40 శాతం వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, మహిళా రైతులు ఇందుకు అర్హులు. వారు పదవ తరగతి పాసై ఉండాలి. వ్యవసాయ గ్రాడ్యుయేట్లకు (అగ్రికల్చర్, హార్టికల్చర్ బీఎస్సీ) 50 శాతం రాయితీ ఇస్తుంది. కాగా ఒక్కో డ్రోన్ ధర రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందని వ్యవసాయాధికారులు వివరిస్తున్నారు. డ్రోన్లు కావాల్సిన రైతులు మండల వ్యవసాయాధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. ఖర్చు తగ్గుతుంది రైతులు తమ పొలాలకు పురుగు మందును పిచికారీ చేసేందుకు ఖర్చు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది. మందు పిచికారి పంటకు ఒకే విధంగా పడుతుంది. మండలానికి మూడు డ్రోన్లు మంజూరయ్యాయి. ఎక్కువగా ఒకే పంట సాగు చేసే గ్రామాలకు తొలి విడతలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కోడిగుడ్లపాడు, కొండ్రాజుపల్లె, రంపాడు ఆర్బీకేల పరిధిలో ఒకే పంటను ఎక్కువ మోతాదులో సాగు చేయడం వలన వారికి ప్రాధాన్యత ఇస్తున్నాం. మలి విడతలో ప్రతి ఆర్బీకేకు డ్రోన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. – జాకీర్‌షరీఫ్, వ్యవసాయాధికారి, కాశినాయన మండలం -
వైరల్ వీడియో: ప్రమాదంలో బాలుడు.. ప్రాణాలు కాపాడిన డ్రోన్
-
డ్రోన్ల కోసం ఆకాశంలో ‘హైవే’!
రైళ్లు ప్రత్యేకంగా తమకంటూ ఉన్న పట్టాలపై పరుగెడుతుంటాయి.. కార్లు, బస్సుల్లాంటి వాహనాలు వేగంగా దూసుకెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ వేలు కడుతుంటారు. ప్రమాదాలు జరగకుండా రెడ్ సిగ్నళ్లు పెడుతుంటారు. మరి ఆకాశంలో ఎగురుతూ వెళ్లే డ్రోన్ల పరిస్థితి ఏమిటి? అవి ఢీకొట్టుకోకుండా వెళ్లేదెలా? రోజురోజుకూ డ్రోన్ల వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి సందేహాలె వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యూకేలో డ్రోన్ల కోసం ప్రత్యేకంగా ‘సూపర్ హైవే’ను ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోకుండా అత్యాధునిక టెక్నాలజీని ఇందులో వినియోగించనున్నారు. ఆ ప్రాజెక్ట్ స్కైవే విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ కొన్నేళ్లుగా డ్రోన్ల వినియోగం పెరిగిపోతోంది. కిరాణా సరుకుల నుంచి మందుల దాకా నేరుగా డ్రోన్లతో ఇళ్ల వద్దకు డెలివరీ ఇచ్చేలా ఇప్పటికే అమెజాన్ వంటి సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మరి ఎవరికివారు ఇష్టారాజ్యంగా డ్రోన్లను ఎగురవేస్తే పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. డ్రోన్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడమే కాదు.. విమానాలు, హెలికాప్టర్లు వంటి వాటికీ ప్రమాదకరంగా మారుతాయి. విద్యుత్, సెల్‌ఫోన్ టవర్లు, అతి ఎత్తయిన భవనాలను ఢీకొట్టడం వంటి సమస్యలూ ఉంటాయి. ఈ నేపథ్యంలో నేలపై రోడ్లు ఉన్నట్టుగానే.. డ్రోన్ల కోసం నిర్ణీత మార్గం ఏర్పాటు చేసేందుకు యూకేకు చెందిన ఆల్టిట్యూడ్ ఏంజిల్, బీటీ తదితర సంస్థలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఆ మార్గంలో డ్రోన్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోకుండా ‘డీఏఏ (డిటెక్ట్ అండ్ అవాయిడ్)’ టెక్నాలజీని వినియోగించనున్నాయి. 265 కిలోమీటర్ల పొడవున.. యూకే ఆగ్నేయ ప్రాంతంలో 265 కిలోమీటర్ల పొడవున ‘డ్రోన్ సూపర్ హైవే’ను ఏర్పాటు చేసేందుకు యూకే ప్రభుత్వం ఇటీవల అనుమతులు మంజూ రు చేసింది. కీలక నగరాలైన రీడింగ్, ఆక్స్ఫర్డ్, మిల్టన్ కీన్స్, కేంబ్రిడ్జ్, కొవెంట్రీ, రగ్బీ నగరాల మీదుగా ఈ డ్రోన్ హైవే సాగనుంది. 2024 జూన్ నాటికి ఈ ‘డ్రోన్ సూపర్ హైవే’ ఏర్పాటును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దీనికి ఎంత ఖర్చవుతుందనే అంచనాలను వెల్లడించలేదు. ఏమిటీ డీఏఏ టెక్నాలజీ? గాల్లో ఎగురుతూ వెళ్లే డ్రోన్లు, ఇతర యూఏవీ (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్)లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. అవి ఒకదానికొకటి ఢీకొట్టుకోకుండా చేసేందుకు ఆల్టిట్యూడ్ ఏంజిల్ సంస్థ ‘డీఏఏ’ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. దీనిలో భాగంగా డ్రోన్లు ప్రయాణించే ప్రాంతాల్లో నిర్ణీత దూరంలో పెద్ద టవర్లను నిర్మించి, పలు రకాల పరికరాలను అమర్చుతారు. వీటికి యారో టవర్స్ అని పేరుపెట్టారు. ఈ వ్యవస్థ ఎంతెంత పరిమాణంలో ఉన్న డ్రోన్లు.. ఎటువైపు నుంచి, ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాయనేది గుర్తించి.. మిగతా డ్రోన్లకు సమాచారం ఇస్తుంది. ఢీకొట్టుకునే అవకాశమున్న డ్రోన్లకు వాటి మార్గం మార్చుకోవడం, మరికాస్త ఎత్తుకు ఎగరడం లేదా కిందికి దిగడం, వేగం తగ్గించుకోవడం, పెంచుకోవడం వంటి సూచనలు చేస్తుంది. డ్రోన్లలో మార్పులు అవసరం లేదు డ్రోన్ హైవేల్లో ప్రయాణించేందుకు, యారో టవర్లకు అనుసంధానం కావడం కోసం.. డ్రోన్లలో అదనపు పరికరాలేమీ అమర్చాల్సిన అవసరం లేదని ఆల్టిట్యూడ్ ఏంజిల్ సీఈవో రిచర్డ్ పార్కర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ అద్భుతాలు సృష్టిస్తుందని.. డ్రోన్ హైవేలు రవాణాలో కీలకపాత్ర పోషిస్తాయని భావిస్తున్నామని తెలిపారు. -
తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు ఈ ఏడాది సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రైతులను పూర్తిగా ఆధునిక సాగు పద్ధతుల వైపు మళ్లించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే ట్రాక్టర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరికోత యంత్రాలు, రొటవేటర్లు, పవర్ టిల్లర్లు తదితరాలు సబ్సిడీపై అందజేస్తోంది. దీంతో ఇప్పటికే ట్రాక్టర్ల వినియోగం పెరిగిపోయింది. రైతులు పురాతన, సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి ఆయా యంత్రాలను, పరికరాలను ఉపయోగిస్తున్నారు. దీనికి మరింత ఊతం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వ్యవసాయ యాంత్రీకరణ కోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో రైతులకు డ్రోన్లు అందజేసే దిశగా వ్యవసాయ శాఖ అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో ఖరారు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పిచికారీ కష్టాలకు చెక్ ►ప్రస్తుతం డ్రోన్లను ఫొటోలు తీయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే వ్యవసాయానికి వాడే డ్రోన్లు రైతుకు అనేక రకాలుగా ఉపయోగపడేలా చూస్తారు. ►ప్రధానంగా పురుగు మందులను పిచికారీ (స్ప్రే) చేయడానికి ఉపయోగిస్తారు. డ్రోన్ ఆధారిత స్ప్రే పద్ధతుల వల్ల నీరు, పురుగుమందులు తక్కువ మొత్తంలో అవసరమవుతాయి. ►పురుగు మందుల్ని రైతులే స్వయంగా పిచికారీ చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలకు గురి అవుతున్నారు. దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. డ్రోన్ పిచికారీ వీటన్నిటి నుంచి రైతుల్ని కాపాడుతుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. ►కొన్ని పంటలకు మొక్కల పైన స్ప్రే చేస్తే సరిపోతుంది. కొన్నింటికి కాండం మొదల్లో చల్లాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో పంటకు ఒక్కో రకంగా ఉంటుంది. ఆ మేరకు డ్రోన్లకు అదనపు పరికరాలు సమకూరుస్తారు. చీడపీడలపై నిఘా ►పంటకు చీడపీడలు ఏమైనా ఆశించాయా తెలుసుకునేందుకు కూడా డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఈ నేపథ్యంలో పంటల్ని ఫొటోలు తీయడం, వాటిని వ్యవసాయాధికారికి పంపడం చేసేలా కూడా పరికరాలు అమర్చాలని భావిస్తున్నారు. ►అలాగే కాత ఎలా ఉంది?, దిగుబడి ఏమేరకు వచ్చే అవకాశముంది?, ఇలా పంటకు సంబంధించిన ప్రతి అంశాన్నీ సూక్ష్మంగా పరిశీలిస్తూ పర్యవేక్షించేందుకు వీలుగా సాగు డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పలు కంపెనీలతోనూ చర్చించినట్లు తెలిసింది. పైలట్ శిక్షణ తప్పనిసరి.. ►డ్రోన్లను ఎవరికి పడితే వారికి ఇవ్వరు. పదో తరగతి పాసై ఉండాలి. డ్రోన్ పైలట్ శిక్షణ తీసుకొని ఉండాలి. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి. ఏవియేషన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. రైతుకైనా, రైతు కుటుంబంలో సభ్యులు ఎవరికైనా ఇస్తారు. ►నిరుద్యోగ యువతీ యువకులు కస్టమ్ హైరింగ్ సెంటర్ నడుపుతున్నట్లయితే వారికి ఇస్తారు. ప్రస్తుతం వ్యవసాయ యంత్రాలను ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీతో ఇస్తున్నారు. ఇతర వర్గాలకు 50 శాతం సబ్సిడీతో ఇస్తున్నారు. అయితే డ్రోన్లకు ఎంతమేరకు సబ్సిడీ ఇవ్వాలన్నది ఇంకా ఖరారు కాలేదు. 24 గంటల ముందు అనుమతి తప్పనిసరి ►డ్రోన్లకు సంబంధించి గ్రామ పంచాయతీ, సంబంధిత వ్యవసాయ అధికారి కనీసం 24 గంటల ముందుగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ►ఆపరేటర్లు డ్రోన్ ఆపరేషన్, సురక్షితమైన పురుగు మందుల పిచికారీ.. ఈ రెండింటిపై శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆపరేషన్‌కు ముందు 8 గంటల్లోపు మద్యం తీసుకోకూడదు. ►డ్రోన్ ఉపయోగించడానికి తగిన మంచి స్థితిలో ఉందని నిర్ధారించుకోవాలి. మొబైల్ పరికరాలను దూరంగా ఉంచాలి. ఆ సిగ్నల్స్ డ్రోన్లకు అడ్డుపడవచ్చు. కాబట్టి మొబైల్ పరికరాలను దూరంగా ఉంచాలి. నీటివనరులు, నివాసాలకు దూరంగా.. ►నీటివనరులు, నివాస ప్రాంతాలు, పశుగ్రాస పంటలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ మొదలైన వాటికి దూరంగా డ్రోన్ కార్యకలాపాలు నిర్వహించాలి. ►డ్రోన్లతో పిచికారీ చేసే సమయంలో ఆయా ప్రాంతాల్లోకి జంతువులు, వ్యక్తులు ప్రవేశించకూడదు. ►డ్రోన్ ఉపయోగించే ప్రాంతం నుంచి 100 మీటర్ల కంటే తక్కువ దూరంలో పురుగుమందులను పిచికారీ చేయకూడదు. ►ప్రభుత్వ సంస్థలు, సైనిక స్థావరాలు లేదా అనుమతి లేని జోన్ల మీదుగా డ్రోన్లను ఎగుర వేయకూడదు. అనుమతి లేని ప్రైవేట్ ఆస్తులపై కూడా డ్రోన్ ఎగరకూడదు. అవసరమైతే బుక్ చేసుకునేలా.. ►ఒక్కో డ్రోన్ ధర రూ.10 లక్షలు అవుతుందని అంచనా వేశారు. వాటిని రైతులకు సబ్సిడీపై ఇస్తారు. అయితే చాలావరకు ఒక్కో రైతుకు ఒక్కో డ్రోన్ అవసరం ఉండదు. పైగా ధర ఎక్కువ. ఈ నేపథ్యంలో కొంతమంది రైతుల బృందానికి ఒక డ్రోన్ ఇవ్వాలని భావిస్తున్నారు. ►తొలుత ప్రయోగాత్మకంగా మండలానికి ఒకటి చొప్పున ఇస్తారు. డిమాండ్‌ను బట్టి క్రమంగా వీటి సంఖ్యను పెంచుతారు. తర్వాత కస్టమ్ హైరింగ్ సెంటర్ల (యంత్ర పరికరాలు అద్దెకిచ్చే కేంద్రం)లోనూ అందుబాటులో ఉంచుతారు. రైతులు తమకు అవసరమైనప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. -
తొక్కకున్నా వెళ్లిపోయే సైకిల్ ట్రాఫిక్‌లో ఎగిరే వాహనం!
►మెట్రోరైలు దిగి స్టేషన్ పక్కనే ఉన్న సైకిల్ స్టాండ్ నుంచి ఓ సైకిల్ తీసుకుని ఇంటికి చేరుకోవడం, తర్వాత ఆ సైకిల్ ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే తిరిగి మెట్రోస్టేషన్ చేరుకోవడం.. వింతగా ఉంది కదా. ►ట్రాఫిక్‌లో ఇరుక్కున్న మన వాహనం ఉన్న ఫళంగా గాలిలోకి ఎగిరి ముందున్న వాహనాలను దాటుకుంటూ గాలిలో అలాఅలా తేలిపోతూ గమ్యస్థానానికి చేరుకుంటే ఎంత బాగుంటుంది.. ►గమ్యస్థానం ఫీడ్ చేస్తే చాలు.. డ్రైవర్ ప్రమేయం లేకుండా కారు దానంతట అదే మనల్ని మనం చేరుకోవాల్సిన చోటుకు తీసుకెళుతుంది. ఊహించుకోవడానికి ఎంత బాగుంది కదా.. కానీ ఈ ఊహలన్నీ హైదరాబాద్ ఐఐటీకి చెందిన ప్రత్యేక పరిశోధన విభాగం.. టీఐహెచ్‌ఏఎన్ (టెక్నాలజీ ఇన్నొవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్)) నిజం చేస్తోంది. కలలు సాకారం చేస్తోంది. మానవ ప్రమేయం లేకుండా నిర్దేశిత ప్రాంతానికి వెళ్లే సైకిల్‌ను రూపొందించింది. రోడ్డుపై వెళుతూ అవసరమైతే గాల్లోకి ఎగిరిపోయే ప్యాసింజర్ కార్గో డ్రోన్ (కారు లాంటి వాహన)పై కూడా పరిశోధనలు చేస్తోంది. రోడ్డు సౌకర్యం ఉండని కొండ ప్రాంతాలకు సరుకులు, అత్యవసరమైన మందులు చేరవేయడం వంటి అవసరాలకు వినియోగించే అటానమస్ డ్రోన్లపై పరిశోధన కొనసాగిస్తోంది. దీనికి రిమోట్ గానీ, ఆపరేటర్ గానీ అవసరం లేదు. గమ్యస్థానాన్ని ఫీడ్ చేస్తే అదే తీసుకెళుతుంది. అలాగే డ్రైవర్ అవసరం లేని అటానమస్ వాహనంపై కూడా ప్రయోగాలు చేస్తోంది. ఇలాంటి వాటికెన్నిటికో కేంద్రంగా మారిన హైదరాబాద్ ఐఐటీలో మానవ రహిత వాహనాలపై పరిశోధనల్లో భాగంగా టిహాన్ ఏర్పాటు చేసిన అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్‌ను (డ్రైవర్ రహిత వాహనాలు ప్రయోగాత్మకంగా నడిపే రోడ్డు) కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డ్రైవర్ రహిత వాహనాల్లో ప్రయాణించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నూతన ఆవిష్కరణలకు వేదిక భవిష్యత్ సాంకేతిక ఆవిష్కరణలకు భారత్‌ను ఒక గమ్యస్థానంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జితేంద్రసింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ‘నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్‌డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్’పథకం కింద 25 టెక్నాలజీ ఇన్నొవేషన్ హబ్‌లను (సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాలు) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచంలో నాలుగో తరం నూతన ఆవిష్కరణలకు భారత్ వేదిౖకైందన్నారు. వ్యవసాయం, అత్యవసర రంగాల్లో ఇప్పటికే డ్రోన్లు వాడుతున్నారని, డ్రైవర్ లేకుండా అటానమస్ నావిగేషన్ ద్వారా వాటంతట అవే తమ గమ్యస్థానాలకు చేరుకునేలా పరిశోధనలు జరిపిన హైదరాబాద్ ఐఐటీని ఆయన ప్రశంసించారు. దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఐఐటీల్లో హైదరాబాద్ ఐఐటీ పరిశోధనల్లో ముందు వరుసలో ఉందని చెప్పారు. దేశంలోనే తొలి అటానమస్ వెహికల్ టెస్ట్‌బెడ్ హైదరాబాద్ ఐఐటీలో ఏర్పాటు చేసిన అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్ (ఏరియల్ అండ్ టెరస్ట్రియల్) దేశంలోనే మొదటిదని ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు. సుమారు రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ టెస్ట్‌బెడ్‌పై మానవ రహిత వాహనాల పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. భారత దేశంలో ఉన్న పరిస్థితులు అంటే.. గ్రామీణ ప్రాంత రోడ్లు, మల్టీ లేన్లు, వర్షం పడుతున్నప్పుడు.. ఇలా రకరకాల పరిస్థితుల్లో ఈ డ్రైవర్ రహిత వాహనాల పనితీరుపై పరీక్షలు చేస్తున్నామన్నారు. మానవ రహిత ప్యాసింజర్ డ్రోన్లు సుమారు 1.50 క్వింటాళ్ల బరువున్న సరుకులను మోసుకెళ్లగలవని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్, ఐఐటీ పాలకమండలి చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, టీఐహెచ్‌ఏఎన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి -
ఫ్యూచర్ నెక్సెస్ సూపర్ సక్సెస్
ములుగు(గజ్వేల్): సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో ఒడిశా సెంచూరియన్ యూనివర్సిటీ సహకారంతో శనివారం ది ఫ్యూచర్ నెక్సెస్ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ 4.0పై నిర్వహించిన రోడ్ షో విజయవంతమైంది. హైడ్రోఫోనిక్స్, బయో ఎరువులు, సేంద్రియ వ్యవసాయం, రిమోట్ సెన్సింగ్ అభ్యసన, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలు, వివిధ నైపుణ్యాలు, డొమైన్ కోర్సుల గురించి అవగాహన కల్పించేలా స్టాల్స్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రీన్‌టెక్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్ధి అనే అంశంపై బెంగళూరు సున్మోక్ష పవర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అతుల్ బిహారీ భట్నాగర్ మాట్లాడారు. అనంతరం వ్యవసాయం, అటవీ రంగంలో డ్రోన్ ప్రయోజనాలు అర్థమయ్యేలా సెంచూరియన్ అధ్యాపకులు డ్రోన్ ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహిం చారు. ములుగు ఎఫ్‌సీ ఆర్ఐ డీన్, సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, ఉద్యానవన వర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్, ఉద్యానవన విశ్వ విద్యాలయ కంట్రోలర్ కిరణ్‌కుమార్, ములుగు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏడీఎస్ కిషన్‌రావు, సివికల్చర్ డీఎఫ్ఓ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్, గజ్వేల్, సిద్దిపేట తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యార్థులు, ఎఫ్సీఆర్ఐ విద్యార్థులు పాల్గొన్నారు. -
యుద్ధంలో ఒక్కసారిగా మారిన సీన్.. రష్యా బలగాల గజగజ
Ukraine War: రష్యా, తూర్పు ఉక్రెయిన్‌ని బాంబులతో దద్దరిల్లేలా చేసింది. వరుసగా ఒక్కొక్క నగరాన్ని కైవసం చేసుకుంటూ దాదాపు 70 శాతం నియంత్రణలో తెచ్చుకోవడమే కాకుండా నిరాటంకంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. రష్యా బలగాలు డోనెట్స్ నదిపై ఉన్న మూడు బ్రిడ్జిలను కూల్చి ఉక్రెయిన్ బలాగాలను నగరంలో ప్రవేశించకుండా అడ్డుకున్నాయి. పైగా లొంగిపోండి లేదా చచ్చిపోండి అంటూ రష్యా బలగాలు నినాదాలు చేశాయి. ఈ తరుణంలో ఇవాళ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఉక్రెయిన్ తన యుద్ధ వ్యూహాన్ని మార్చేసింది. శత్రుదేశాన్ని మట్టికరిపించేలా మెదటి ప్రపంచ యుద్ధం తరహాలో ఆపరేషన్ చేపట్టింది. శత్రు దాడులనుంచి రక్షణకోసం ఏర్పాటు చేసుకునే కందకాలానే(దాడుల నుంచి రక్షణ కోసం భూమిలో ఏర్పాటు చేసుకునే ఇరుకైన గుంత) లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మొదలు పెట్టాయి ఉక్రెయిన్ బలగాలు. ఈ మేరకు ఉక్రెయిన్ బలగాలు కందకంలో ఉంటున్న రష్యా బలగాలపై డ్రోన్లతో నేరుగా దాడులు చేసింది. ఈ దాడులు విజయవంతం కావడంతో ఉక్రెయిన్ దళాలు జోష్‌తో ముందుకు వెళ్తున్నాయి. ఊహించని ఈ దాడులతో రష్యా బలగాలు అతలాకుతలం అవుతున్నాయి. కింగ్ డేనియల్ పేరుతో 24వ మెకనైజ్డ్ బ్రిగేడ్ ఉక్రెయిన్ సైనికులు ఆక్రమణదారులకు చుక్కలు చూపిస్తాం అంటూ... 'స్లేవ్ ఉక్రెయిన్'(ఉక్రెయిన్ బానిస)... 'గ్లోరి టూ ఉక్రెయిన్' (ఉక్రెయిన్ కీర్తీ) వంటి నినాదాలతో దాడులు చేశారు. రష్యా ఫిబ్రవరి 24న ఉక్రెయిన పై దాడులకు తెగబడటంతో ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. అతి చిన్న పోరుగు దేశం పై ఎందుకు యుద్ధం అన్నా వినలేదు. కానీ ఇప్పుడు ఆ చిన్నదేశం ఉక్రెయిన్‌తో ఊహించని ప్రతిఘటనను రష్యా ఎదుర్కొంటోంది. అంతేకాదు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా మేజర్ జనరల్ వంటి ఆర్మీ అధికారుల నుంచి దిగ్గజ షూటర్ల వరకు పెద్ద సంఖ్యలో యుద్ధవీరులను కోల్పోయింది కూడా. ఈ మేరకు ఉక్రెయిన బలగాలు డ్రోన్లతో రష్యా కందకాలపై దాడుల నిర్వహిస్తున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 24th Mechanized Brigade dropping the VOG-17 grenade straight in the Russian trench pic.twitter.com/kRsudUj7px — ТРУХА⚡️English (@TpyxaNews) June 11, 2022 (చదవండి: ఇంత దారుణమేంటి పుతిన్.. స్పెషల్ బాడీగార్డుతో అలాంటి పనేంటి..?) -
‘డ్రోన్ హబ్‌గా భారత్.. ఉద్యోగాలకు కొదవ లేదు’
వ్యవసాయం, రక్షణ, క్రీడలు ఇలా అనేక రంగాల్లో రాబోయే రోజుల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించబోతున్నాయని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. న్యూ ఢిల్లీలో జరుగుతున్న భారత్ డ్రోన్ మహోత్సవ్ వేడుకలను ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. మే 27, 28 తేదీల్లో ఈ వేడుకల్లో 16 వేల మంది డెలగేట్స్ పాల్గొంటున్నారు. డెబ్బైకి పైగా వచ్చిన ఎగ్జిబిటర్లు తమ డ్రోన్ల సామర్థ్యాలు, నైపుణ్యాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. డ్రోన్ల సెక్టార్లో ప్రస్తుతం కనిపిస్తున ఆశావహ పరిస్థితులను చూస్తోంటే.. భవిష్యత్తులో ప్రపంచానికి భారత్ డ్రోన్ హబ్‌గా మారుతుందన్నారు ప్రధాని మోదీ. రాబోయే రోజుల్లో అనేక ఉద్యోగాలు ఈ సెక్టార్లో లభిస్తాయంటూ మోడీ నమ్మకం వ్యక్తం చేశారు. డోన్ల ఉపయోగంతో పరిస్థితులు ఎలా మారిపోతాయో చెప్పేందుకు పీఎం సమిత్వ యోజనా పథకం ఓ ఉదాహారణ అన్నారు. ఈ పథకం ద్వారా ఇండియాలో ఉన్న ప్రాపర్టీలన్నింటీని డిజిటల్ మ్యాపింగ్ చేయగలిగామన్నారు. ఇందులో ఇప్పటి వరకు 67 లక్షల డిజిటల్ ప్రాపర్టీ కాపీలను ప్రజలకు అందించామన్నారు. త్వరలోనే డిఫెన్స్, విపత్తు నిర్వాహాణ విభాగాల్లో డ్రోన్ల వాడకం పెంచబోతున్నట్టు ప్రధాని వెల్లడించారు. చదవండి: ఎలన్ మస్క్ కొంప ముంచే పనిలో చైనా.. ఏకంగా శాటిలైట్లను నాశనం చేస్తామని ప్రకటన! -
డ్రోన్ట్ వర్రీ!... మునిగిపోతున్నవారిని క్షణాల్లో కాపాడే డ్రోన్
రాకాసి అలలు.. ఎన్నో కుటుంబాల్లో మరణ శాసనం రాసి సముద్రమంత దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. ఆరాటంగా వచ్చే కెరటాలను ఆప్యాయంగా హత్తుకునేలోపు పర్యాటకుల జీవితాల్లో తీరం విషాదాన్ని నింపుతున్నాయి. గజ ఈతగాళ్లు ఉన్నా.. మునిగిపోతున్నవారిని చేరేలోపే మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. ఈ పరిస్థితులకు చెక్ చెప్పేందుకు విశాఖ వాసులు సరికొత్త డ్రోన్‌ను ఆవిష్కరించారు. సైఫ్‌సీస్ పేరుతో రూపొందించిన ఈ పరికరం మృత్యు అలలను ఎదిరించి మునిగిపోతున్న వారి ప్రాణాలు కాపాడగలదు. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రయల్ రన్‌ను పర్యాటక శాఖ నిర్వహించింది. సాక్షి, విశాఖపట్నం: సముద్ర తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఎవరికైనా ఈత కొట్టాలనిపిస్తుంటుంది. కానీ రాకాసి అలలు మింగేస్తాయని భయం అందరిలోనూ ఆందోళన రేకెత్తించినా.. అక్కడి పరిస్థితులు వాటిని లెక్కచెయ్యనీయవు. ఫలితంగా ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. పుష్కర కాలంలో సుమారు 600 మంది అలలకు బలయ్యారు. ఇందులో 60 శాతం మంది 15 నుంచి 30 ఏళ్లలోపువారే ఉండటం బాధాకరమైన విషయం. నగర పరిధిలోని అన్ని బీచ్పాయింట్లలో ఉండే లైఫ్‌గార్డులు సముద్రంలో మునిగిపోతున్న చాలా మందిని ప్రాణాలతో కాపాడారు. అయితే అలల ఉధృతికి లోపలకు కొట్టుకుపోతున్న వారి వద్దకు లైఫ్‌గార్డులు వెళ్లేలోపే కొందరు మృత్యువాతపడుతున్నారు. ఇటువంటి వారిని కాపాడేందుకు విశాఖకు చెందిన ఓ బృందం సైఫ్‌సీస్ పేరుతో డ్రోన్‌ను తయారు చేసింది. దగ్గరలోనే లోతు.. వదులుగా ఇసుక మిగిలిన సముద్ర తీరాలతో పోలిస్తే విశాఖ తీరం రూపురేఖలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు మచిలీపట్నం దగ్గర సముద్రంలో చాలా దూరం వెళ్తే గానీ లోతుండదు. గోవా దగ్గర సముద్రంలో దాదాపు కిలోమీటర్ దూరం వరకూ నడిచి వెళ్లొచ్చు. కానీ విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద పది మీటర్ల ముందుకెళ్తే చాలు లోతు ఎక్కువైపోతుంది. ముఖ్యంగా ఆర్కే బీచ్‌కు దక్షిణ, ఉత్తరం వైపు రెండు నుంచి మూడు మీటర్ల లోతుంటుంది. కొన్నాళ్లుగా కోత ప్రభావంతో ఈ లోతు మరింతగా పెరుగుతూ వస్తోంది. ఆర్కే బీచ్‌తో పాటు భీమిలి, రుషికొండ, తొట్లకొండ, సాగర్‌నగర్ దగ్గర లోతుతో పాటు ఇసుక ఎక్కువ వదులుగా ఉంటుంది. కెరటం వచ్చి వెనక్కు వెళ్లే సమయంలో ఇసుక ఎక్కువగా జారిపోతుంటుంది. దీన్ని అంచనా వెయ్యలేక పోవడంతో కాళ్లు పట్టుకోల్పోయి లోతులోకి జారిపోయి గల్లంతయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సముద్రంలో ప్రమాదాల్లో ఉన్న వారిని కాపాడేందుకు ఈ సైఫ్‌సీస్ డ్రోన్లు ఉపయోగపడతాయి. సైఫ్ సీస్.. ఇలా రక్షిస్తుంది.. సాధారణంగా లైఫ్‌గార్డ్ సెకనుకు మీటరు నుంచి మీటరున్నర దూరం ఈదుతూ వెళ్లగలరు. 30 మీటర్ల దూరంలో పర్యాటకుడు మునిగిపోతుంటే.. అక్కడికి చేరుకోవడానికి కనీసం 25 సెకన్ల సమయం లైఫ్గార్డుకు పడుతుంది. కానీ.. గజఈతగాడి కంటే ఐదు రెట్లు వేగంగా ఈ మానవ రహిత డ్రోన్లు దూసుకెళ్తుంది. 30 మీటర్ల దూరాన్ని కేవలం 5 నుంచి 6 సెకన్ల వ్యవధిలోనే చేరుకొని బాధితుడిని రక్షించగలదు. అంటే లైఫ్గార్డు కంటే 7 రెట్లు వేగంగా స్పందిస్తుంది. లైఫ్గార్డు ఒకసారి ఒక వ్యక్తిని మాత్రమే రక్షించగలరు. కానీ.. సైఫ్‌సీస్ 200 కిలోల బరువు వరకూ ఎంత మంది ఉంటే అందర్ని ఒడ్డుకు తీసుకురాగలదు. గంటకు 15 కిలో మీటర్ల వేగంతో అలలను చీల్చుకుంటూ ముందుకు వెళ్లగల సామర్థ్యం దీని సొంతం. పూర్తిగా రిమోట్ ద్వారా ఒడ్డున నిలబడే ఆపరేట్ చేస్తూ.. మునిగిపోతున్న వారి వద్దకు ఈ డ్రోన్లను క్షణాల్లో పంపించవచ్చు. దాదాపు 3 కిలోమీటర్ల వరకూ దీన్ని పంపించవచ్చు. ఇందులో ఉండే బ్యాటరీలు 90 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ అవుతుంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే గంట పాటు పనిచేస్తాయి. స్టాండ్ బై మోడ్ 5 నుంచి 6 గంటల వరకూ ఉంటుంది. 22 కేజీల బరువుండే ఈ డ్రోన్‌ను పట్టుకుంటే మళ్లీ జారిపోకుండా గ్రిప్ ఉంటుంది. ఒక్కో డ్రోన్ ఖరీదు రూ.6 లక్షల వరకూ ఉంటుంది. 3 కిలోమీటర్ల దూరం వరకూ దీనిని కంట్రోల్డ్‌గా ఆపరేట్ చెయ్యవచ్చు. భారత ప్రభుత్వ ప్రశంసలు విశాఖ బృందం చేసిన ఈ సైఫ్‌సీస్ డ్రోన్‌కు అన్ని రాష్ట్రాల నుంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డిఫెన్స్ ఎక్స్‌పోలో సైఫ్సీస్ని ప్రదర్శించారు. ప్రధాని మోదీ దీని పనితీరుని తెలుసుకొని బృంద సభ్యులను అభినందించారు. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పర్యాటక అవసరాల కోసం వీటిని కొనుగోలు చేసుకున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ.. కొద్ది నెలల క్రితం సైఫ్‌సీస్ డ్రోన్ ట్రయల్ రన్‌ను నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులకు పంపించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రోత్సహిస్తే.. ప్రాణాలు కాపాడతాం.. మూడేళ్ల పాటు శ్రమించి సైఫ్‌సీస్ డ్రోన్‌ని ఇండియన్ నేవీ స్పెసిఫికేషన్స్‌తో తయారు చేశాం. సైఫ్సీస్ని డీఆర్డీవో–ఎన్ఎస్టీఎల్ అప్రూవ్ డిజైన్‌తో రూపుదిద్దుకుంది. లైఫ్‌గార్డుల కంటే వేగంగా చేరుకోవడం వల్ల సముద్రంలో మునిగిపోతున్న వారిని కాపాడగలం. 100 శాతం ఆటోమేటిక్‌గా రోబోటిక్ ప్రోబ్స్తో దీన్ని తయారు చేశాం. పలు రాష్ట్రాల్లో చాలా మంది ప్రాణాలను కాపాడుతోంది. ఏపీలో ప్రోత్సహిస్తే వైజాగ్ బీచ్‌లో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడగలమన్న విశ్వాసం మాకు ఉంది. – అలీఅస్గర్ కలకత్తావాలా, సైఫ్‌సీస్ కో–ఫౌండర్ (చదవండి: సీపోర్టు టు ఎయిర్‌పోర్టు 'సువిశాల రహదారి') -
విల్ స్మిత్ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ?
Police Visits Will Smith Home Over Drone Sighting Report: హాలీవుడ్ స్టార్ హీరో, ఆస్కార్ గ్రహిత విల్ స్మిత్ ఆస్కార్ 2022 వేదికపై చేసిన పని ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్‌పై విల్ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ 2022 అవార్డుల ప్రదానం సందర్భంగా బెస్ట్ డ్యాక్యుమెంటరీ ఫీచర్‌కు అవార్డు ఇచ్చేందుకు అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ స్టేజ్‌పైకి ఎక్కాడు. అప్పుడు ఏదో మాట్లాడుతూ అనారోగ్యంతో గుండు చేయించుకున్న విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్‌పై క్రిస్ జోక్ వేశాడు. దీంతో అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన విల్ స్మిత్ ఆగ్రహంతో క్రిస్ రాక్ దవడ పగలకొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. చదవండి: అతనిలా నేను కూడా చెంపచెల్లుమనిపిస్తా.. కంగనా షాకింగ్ కామెంట్స్ అయితే తాజాగా విల్ స్మిత్ ఇంటిని లాస్ ఏంజిల్స్ పోలీసులు సందర్శించారు. విల్ ఇంటి ఆవరణలో డ్రోన్ కనిపించినట్లు పోలీసులకు ఎవరో సమాచారం ఇచ్చారట. అందుకే విల్ స్మిత్ కాలాబాసాన్ మాన్షన్‌ను పోలీసులు సందర్శించినట్లు సమాచారం. అయితే విల్ ఇంటి ఆవరణలో ఎక్కడా ఎలాంటి డ్రోన్‌ను పోలీసులు గుర్తించలేదట. పోలీసులు వెళ్లే సరికే డ్రోన్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వారు భావించినట్లు తెలుస్తోంది. అలాగే డ్రోన్ గురించి పోలీసులకు ఎవరూ సమాచారం అందించారో కూడా స్పష్టత లేదు. బహుశా ఇరుగుపొరుగు వారు ఎవరైనా కాల్ చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. డ్రోన్‌ను గుర్తించడానికి, ఎవరైనా ఫొటోగ్రాఫర్స్ ఉన్నారా ? లేదా అసలు అక్కడా ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే వారి బృందాన్ని పంపినట్లు పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు. చదవండి: ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ ఘటన.. చెంప పగలకొట్టిన విల్‌స్మిత్ -
Ukraine Russia War: మరో 10 రోజుల్లో... రష్యా ఖల్లాస్!
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలు పెట్టి మూడు వారాలు గడుస్తోంది. యుద్ధ వ్యయం ఇప్పటికే తడిసి మోపెడవుతోంది. ఈ భారానికి ప్రపంచ దేశాల ఆంక్షలు తోడై ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా వెళ్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై దండయాత్రలో పాల్గొంటున్న రష్యా సైనికులు కూడా ఆత్మ స్థైర్యం కోల్పోయి అసహనంలోకి కూరుకుపోతున్నారు. భీకరమైన దాడుల నేపథ్యంలో రష్యా వనరులు క్రమంగా కరిగిపోతున్నాయా? వీటన్నింటికీ మించి... యుద్ధమిలాగే కొనసాగితే మరో పది రోజుల్లో రష్యా ఆయుధ భాండాగారం ఖాళీ అయిపోనుందా? అవుననే అంటున్నారు అమెరికా సైనిక నిపుణులు... – మాస్కో/కీవ్ ఉక్రెయిన్‌పై రష్యా ఇప్పటివరకు ఎన్నో ప్రమాదకరమైన ఆయుధాల్ని వాడింది. క్లస్టర్ బాంబులు, వాక్యూమ్ బాంబులు కూడా ప్రయోగించింది. అయినా ఉక్రెయిన్ ఇప్పటికీ శక్తికి మించి పోరాడుతూనే ఉంది. ఈ స్థాయి ప్రతిఘటన రష్యా ఊహించనిదే. ఈ నేపథ్యంలో, రష్యా దగ్గరున్న ఆయుధాలు మరో పది రోజులు, మహా అయితే రెండు వారాల కంటే సరిపోకపోవచ్చని అమెరికా లెఫ్ట్‌నెంట్ జనరల్ బెన్ హోడ్జెస్ అంటున్నారు. ఆ తర్వాత దాడి చేయడానికి చెప్పుకోదగ్గ ఆయుధాలంటూ ఏమీ మిగలకపోవచ్చన్నారు. దీనికి తోడు రష్యా సైనికులు కూడా బాగా అలిసిపోయారని విశ్లేషించారు. చైనాను రష్యా సాయుధ సాయం అర్థిస్తోందన్న వార్తలు ఇందుకు బలం చేకూర్చేవేనంటున్నారు. డ్రోన్లతో రష్యాకు చెక్ ఉక్రెయిన్‌పైకి రష్యా వందలాది 9కె720 ఇస్కాండర్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. 500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ శక్తిమంతమైన క్షిపణులతో ఇళ్లు, ఆస్పత్రులు, పాఠశాలలపై ప్రయోగించి ధ్వంస రచన సాగించింది. 3ఎం–14 కాలిబర్ ఉపరితల దాడికి వినియోగించే క్రూయిజ్ క్షిపణిని కూడా ప్రయోగించింది. ఏకంగా 2,500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణుల్ని భారీగా వాడుతోంది. 6 కి.మీ. దూరంలో ఏమున్నా సర్వనాశనం చేసే టీఒఎస్–1 బురాటినో హెవీ ఫ్లేమ్ థ్రోయర్ అనే ప్రాణాంతక ఆయుధ వ్యవస్థనూ రంగంలోకి దించింది. ఇక టి–90, టి–72 బీఎం3 యుద్ధ ట్యాంకులు సరేసరి. కానీ రష్యా దాడుల్ని ఉక్రెయిన్ అనూహ్యంగా డ్రోన్లతో సమర్థంగా అడ్డుకుంటోంది. టర్కీ తయారీ టీబీ2 డ్రోన్లను విస్తృతంగా వినియోగిస్తోంది. భూ ఉపరితలం మీదుగా రష్యా సైనికుల ఆనవాళ్లు గుర్తించి అడ్డుకుంటోంది. ‘‘మా సైన్యం అపారమైన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తోంది. చెచెన్యాలో ఏళ్ల తరబడి రెండు యుద్ధాలు చేసిన దాని కంటే ఈ 20 రోజుల యుద్ధంలో రష్యా ఎక్కువగా నష్టపోయింది’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. తమపై రష్యా భూతల యుద్ధం దాదాపుగా ముగిసినట్టేనన్నారు. 15 వేల మందికి పైగా మృతి ? రష్యా సైనికుల మృతిపైనా రకరకాల లెక్కలు ప్రచారంలో ఉన్నాయి. 5 వేల నుంచి 9 వేల మంది రష్యా సైనికులు మరణించారని అమెరికా లెక్కలు వేస్తుంటే, 15 వేల మందికి పైగా ప్రాణాలు తీశామని ఉక్రెయిన్ చెబుతోంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో పలు ప్రాంతాల్లో లక్షన్నర సైన్యాన్ని యుద్ధానికి చాలా ముందునుంచే రష్యా మోహరించడం తెలిసిందే. కానీ యుద్ధానికి వారిని ముందస్తుగా పూర్తిస్థాయిలో సిద్ధం చేయపోవడంతో సైనికుల్లో అసహనం అంతకంతకు పెరిగిపోతోంది. ఉక్రెయిన్‌లో విపరీతమైన చలి, ఆహారం, అత్యవసరాల లేమి తదితరాలు వారి పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. మే కల్లా యుద్ధం సమాప్తం! రష్యా వనరులన్నీ కరిగిపోతున్నందున తమతో సంధి మినహా మరో మార్గం లేదని ఉక్రెయిన్ ధీమాగా ఉంది. ‘మే తర్వాత యుద్ధం చేయడానికి రష్యా దగ్గర ఏమీ మిగలదు. రెండు మూడు రోజుల నుంచి వారం లోపు మాతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటుంది’ అని అంటోంది. దీన్ని రష్యా కొట్టిపారేస్తోంది. త్వరలో లక్ష్యాన్ని చేరుకుంటామని అధ్యక్షుడు పుతిన్ వ్యక్తిగత భద్రతా ఇన్చార్జి విక్టర్ జోలోటోవ్ అన్నారు. యుద్ధంలో ఇప్పటిదాకా రష్యాకు సాయుధ నష్టం (ఉక్రెయిన్ వెల్లడించిన మేరకు...) యుద్ధ ట్యాంకులు - 404 సాయుధ వాహనాలు - 1279 యుద్ధ విమానాలు - 81 హెలికాప్టర్లు - 95 శతఘ్నలు - 140 రాకెట్ లాంచర్లు - 64 డ్రోన్లు - 9 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వెపన్స్ - 36 నౌకలు - 3