22న డ్రోన్‌ సమ్మిట్‌ | Biggest drone show in country with 5 thousand drones at Krishna coast | Sakshi
Sakshi News home page

22న డ్రోన్‌ సమ్మిట్‌

Published Mon, Oct 7 2024 5:27 AM | Last Updated on Mon, Oct 7 2024 5:27 AM

Biggest drone show in country with 5 thousand drones at Krishna coast

మంగళగిరిలో రెండు రోజుల సదస్సు 

కృష్ణా తీరం వద్ద 5 వేల డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ షో 

ఇన్‌ఫ్రా–ఇన్వెస్ట్‌మెంట్‌ కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌

సాక్షి, అమరావతి: పౌర సేవల్లో డ్రోన్లను వినియో­గించేలా డ్రోన్‌ టెక్నాలజీపై అవ­గాహన కల్పించేందుకు ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌–­2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. రాష్ట్రాన్ని డ్రోన్‌ క్యాపిటల్‌­గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఈ డ్రోన్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్యదర్శి ఎస్‌.­సురేష్‌ కుమార్‌ తెలిపారు. ఆదివారం ఎన్టీఆర్‌ అడ్మిని్రస్టేటివ్‌ బ్లాక్‌లోని ఫైబర్‌ నెట్‌ కార్యాలయంలో డ్రోన్‌ సమ్మిట్‌ లోగోను, వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 22న మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ సదస్సు­ను సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. డ్రోన్‌ సమ్మిట్‌కు దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు, 400 మంది డ్రోన్స్‌ రంగంలో అనుభ­వం ఉన్న సంస్థ ప్రతినిధులు హాజరవుతారన్నారు. రాష్ట్రంలో డ్రోన్స్‌ రంగంలో ఉత్సా­హం చూపే అన్ని వర్సిటీలు, విద్యాసంస్థల సహకారం కూడా తీసుకుంటున్నామని తెలిపారు. సదస్సు­లో భాగంగా 22న కృష్ణా తీరంలో దేశంలోనే తొలిసారిగా సుమారు 5 వేల డ్రోన్లతో భారీ డ్రోన్‌ షో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.  

నమోదు చేసుకోండి 
డ్రోన్‌ సమ్మిట్‌ సందర్భంగా ఔత్సాహికుల కోసం 8 అంశాలపై అమరావతి డ్రోన్‌ హ్యాకథాన్‌ నిర్వహిస్తున్నామని ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.దినేష్ కుమార్‌ తెలిపారు.  ఇందులో పాల్గొనదలచిన వారు ఈ నెల 15లోపు https://amaravatidronesummit.com లో నమోదు చేసుకోవచ్చన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement