మోదీ-బైడెన్‌ ద్వైపాక్షిక చర్చలు.. కుదిరిన డ్రోన్‌ డీల్‌ | PM Modi And Joe Biden Holds Bilateral Talks On Drone Deal | Sakshi
Sakshi News home page

మోదీ-బైడెన్‌ ద్వైపాక్షిక చర్చలు.. కుదిరిన డ్రోన్‌ డీల్‌

Published Sun, Sep 22 2024 7:21 AM | Last Updated on Sun, Sep 22 2024 9:05 AM

PM Modi And Joe Biden Holds Bilateral Talks On Drone Deal

న్యూయార్క్‌: మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ డెలావెర్‌లో విల్లింగ్టన్‌లోని అధ్యక్షుడు జో బైడెన్‌ నివాసానికి చేరుకొని భేటీ అయ్యారు. ఇరునేతలు తొలి రోజు సమావేశంలో భారతదేశం, అమెరికా మధ్య బిలియన్ డాలర్ల డ్రోన్ ఒప్పందంపై సంతకం చేశాయి. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. ఇక.. డ్రోన్ డీల్‌పై కూడా ఇరువురు నేతలు పూర్తిస్తాయిలో చర్చించుకున్నారు.

 

భారతదేశం అమెరికా నుంచి 31 ఎంక్యూ-9బీ స్కై గార్డియన్  సీ గార్డియన్ డ్రోన్‌లను కొనుగోలు చేసే ప్రక్రియలో ఉంది. ఈ డ్రోన్‌లను కొనుగోలు చేసేందుకు అయ్యే ఖర్చు దాదాపు 3 బిలియన్ డాలర్లు ఉండనుంది. ముఖ్యంగా చైనా సరిహద్దు వెంబడి సాయుధ బలగాల నిఘా యంత్రాంగాన్ని పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

క్రెడిట్స్‌: NDTV (@ndtv)

ఇక.. ఈ ఒప్పందానికి సంబంధించి దాదాపు ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. గత ఏడాది(2023) జూన్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ అమెరికా నుంచి ప్రభుత్వం నుంచి  MQ-9B స్కై గార్డియన్ , సీ గార్డియన్ సాయుధ డ్రోన్‌ల సేకరణ ఫ్రెమ్‌ వర్క్‌కు ఆమోదం తెలిపింది. డ్రోన్‌ల కొనుగోలుతో పాటు, భారత నావికాదళం ఈ ఏడాదిలో మరో రెండు ప్రధాన రక్షణ ఒప్పందాలను కూడా కుదుర్చుకోవాలని యోచిస్తోంది. మరో 3 స్కార్పెన్ జలాంతర్గాములు, 26 రాఫెల్-ఎమ్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది.

చదవండి: ఉక్రెయిన్‌పై ఏం చేద్దాం?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement