యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. శుక్రవారం ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 7లో అద్భుతమైన డ్రోన్ ప్రదర్శన నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ నిర్వహించిన ఈ ప్రదర్శనలో వందలాది డ్రోన్ల సహాయంతో ఆకాశంలో వివిధ దృశ్యాలను ప్రదర్శించారు.
డ్రోన్ షోలో దేవతలు అమృత కలశాన్ని సేవిస్తున్నట్లు చూపారు. అలాగే సముద్ర మథనానికి సంబంధించిన దివ్య శకటం ఎంతో అందంగా కనిపించింది.
డ్రోన్ సహాయంతో ఆకాశంలో కనిపించిన మహా కుంభమేళా చిత్రంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ లోగో అందరినీ ఆకర్షించింది. సంగమ ప్రదేశంలో స్నానం చేస్తున్న సాధువు, శంఖం ఊదుతున్న సన్యాసి చిత్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయి.
అసెంబ్లీ భవనంపై రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం డ్రోన్ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యూపీ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక శకటం ఈ కార్యక్రమానికి మరింత అందాన్ని చేకూర్చింది.
జనవరి 24 నుండి 26 వరకు జరగనున్న అద్భుతమైన డ్రోన్ ప్రదర్శన మహాకుంభమేళా ప్రాంతాన్ని మరింత శోభాయమానం చేసింది. ఈ ప్రదర్శనలో సనాతన సంప్రదాయ వారసత్వానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించారు.
ఇది కూడా చదవండి: Maha Kumbh-2025: 104 నాగసాధు అభ్యర్థనలు రద్దు.. 12 అఖాడాల నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment