picture
-
2.1 గోల్డ్ కొట్టేశారు!
అహ్మదాబాద్: వీళ్లు అలాంటిలాంటి మోసగాళ్లు కాదు.. దొంగనోట్ల కట్టలు. అవీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మతో ఉన్నవి అక్షరాలా రూ.1.30 కోట్లు..ఓ బడా బంగారం వ్యాపారికి అంటగట్టి ఏకంగా 2.1 కిలోల బంగారంతో ఉడాయించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వాళ్లు ఓ నకిలీ హవాలా ఆఫీసును సైతం ఏర్పాటు చేసుకున్నారు. మోసం తెలుసుకునేలోపే పత్తా లేకుండా పోయారు. బాలీవుడ్‌ను సైతం తలదన్నే ట్విస్టులున్న ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి మెహుల్ ఠక్కర్‌కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు ప్రశాంత్ పటేల్ అని, స్థానికంగా ఉన్న ఫలానా నగల దుకాణం మేనేజర్‌ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ దుకాణం మెహుల్‌కు తెలిసిందే కావడంతో ఆయన నిజమేననుకున్నాడు. పటేల్ 2.1 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా, కొంత బేరసారాల తర్వాత రూ.1.60 కోట్లకు డీల్ కుదిరింది. అతడిచి్చన సమాచారం మేరకు సెప్టెంబర్ 24వ తేదీన ఠక్కర్ తన మనుషులకు 2.1 కిలోల బంగారమిచ్చి పంపించారు. చెప్పిన ప్రకారం వాళ్లు ఓ హవాలా దుకాణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వీరి కోసం ముగ్గురు వ్యక్తులున్నారు. దుకాణంలోని నోట్ల లెక్కింపు మిషన్‌తో తీసుకువచి్చన 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించడం మొదలైంది. తాము రూ.1.30 కోట్లే తెచ్చామని, మిగతా రూ.30 లక్షలు పక్కనే మరో దుకాణం నుంచి తెస్తామంటూ ముగ్గురిలో ఇద్దరు బంగారం బిస్కెట్లను తీసుకుని వెళ్లారు. అయితే, ఆ నోట్లపై మహాత్మా గాం«దీకి బదులు నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. రిజర్వు బ్యాంక్ ఇండియా స్థానంలో తప్పుగా ‘రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’అని ఉంది. ఠక్కర్ సిబ్బంది ఇదంతా గమనించి, అనుమానించారు. ఇదేమని, అక్కడే ఉన్న మూడో వ్యక్తిని ప్రశ్నించారు. కౌంటింగ్ మిషన్ తెమ్మంటే తెచ్చానే తప్ప, వారెవరో, ఆ నోట్ల విషయమేంటో నాకూ తెలియదు’అంటూ అతడు చావు కబురు చల్లగా చెప్పాడు. బంగారం బిస్కెట్లతో వెళ్లిన పెద్దమనుషులు తిరిగి రాలేదు. దీంతో, సిబ్బంది ఆ విషయాన్ని ఠక్కర్ చెవిన వేశారు. ఆయన గుండె ఆగినంత పనైంది..! ఇదేమిటని ఆరా తీయగా ఆ హవాలా దుకాణాన్ని రెండు రోజుల క్రితమే ఎవరో తెరిచారని తేలింది. దీంతో, మెహుల్ ఠక్కర్ తననెవరో బకరాను చేశారని గ్రహించి, నవ్‌రంగ్‌పుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
సాక్షి, అమరావతి: భూముల సమగ్ర సర్వే ద్వారా భూమి రికార్డులను ఆధునీకరించి వాటిపై ప్రజలకు శాశ్వత భూ హక్కులు కల్పించేదే ల్యాండ్ టైట్లింగ్ చట్టం. దీనివల్ల రికార్డుల భద్రత, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత, ఆస్తుల రక్షణకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తాయి.చట్టం ముఖ్య ఉద్దేశంప్రస్తుతం భూమి హక్కులు అంటే కనీసం 30 రికార్డులు చూసుకోవాలి. అన్ని వివరాలూ స్పష్టంగా ఉన్నా, 30 పత్రాలు బాగున్నా ఏదో ఒక విధంగా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దీంతో ఏ భూమినైనా వివాదాస్పదంగా మార్చొచ్చు. వివాదంలో ఉన్న భూమిని తిరిగి భూ యజమాని తన పేరు మీదకు తెచ్చుకోవాలంటే కోర్టుకే వెళ్లాలి. ఏళ్లకు ఏళ్లు వేచి చూడాలి. కింది కోర్టు, పైకోర్టు అంటూ తిరగాలి. ఈ అవస్థలన్నింటినీ తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందా?ల్యాండ్ టైట్లింగ్ చట్టం గెజిట్ జారీ అయినా ఇంకా అమల్లోకి రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఏదైనా అమలులో ఉన్నట్లు లెక్క. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అసెంబ్లీలో బిల్లు పాసైంది. దీనికి టీడీపీ కూడా మద్దతు తెలిపింది. రీ సర్వే ఇంకా జరుగుతుండటంతో నోటిఫికేషన్ జారీ చేయలేదు. చట్టం అమల్లోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ అథారిటీ ఏర్పడుతుంది. ఆ అథారిటీ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అప్పిలేట్ అధికారులు, ట్రిబ్యునళ్లను నియమిస్తుంది. ఇంకా అథారిటీయే ఏర్పడలేదు. కాబట్టి టైటిల్ రిజిస్ట్రేషన్, అప్పిలేట్ అధికారులను నియమించలేదు. ఆ అధికారులుగా ఎవరు ఉండాలనే విషయాన్ని కూడా ఇంకా నిర్ణయించలేదు. అసలు చట్టమే ఉనికిలో లేదు. ఎందుకంటే దాని అమలుకు ఎటువంటి మార్గదర్శకాలు, నిబంధనలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. చట్టం అమలుకు నోటిఫికేషన్ జారీ చేసి అందుకనుగుణంగా నిబంధనలు, మార్గదర్శకాలతో జీవో జారీ అయితేనే అమల్లోకి వచ్చినట్లు లెక్క. అదేమీ లేకుండానే చట్టం అమలైపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు.ఈ చట్టం వల్ల వచ్చే లాభంల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం ఒకసారి మీ భూమి రికార్డుల్లోకి ఎక్కితే అదే తుది రికార్డు అవుతుంది. ఇతర రికార్డులు, కాగితాల కోసం తిరగాల్సిన అవసరం ఉండదు. ఎవరూ ఆ భూమిని లాక్కోలేరు. దౌర్జన్యం చేయలేరు. తప్పుడు పత్రాలు సృష్టించే అవకాశం ఉండదు. ఆ భూమి ఇతరుల పేర్ల మీదకు మారినా, మీకు తెలియకుండా మీ భూమి కోల్పోయినా, మీ ప్రమేయం లేకుండా రికార్డు మార్చినా ప్రభుత్వం నష్ట పరిహారం ఇస్తుంది. అంటే ప్రజల భూములకు ప్రభుత్వమే రక్షణ, భద్రత కల్పిస్తుంది.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చరిత్రమన దేశంలో భూ రికార్డులు, లావాదేవీలు ఇప్పటివి కావు. 1526 నుంచి 1707 వరకు పాలించిన మొఘల్ చక్రవర్తుల కాలం నుంచి వస్తున్నాయి. ఆ తర్వాత బ్రిటిషర్లు కొన్ని నియమాలు పెట్టి భూ రికార్డులు తయారు చేశారు. వాటినే ఇప్పటికీ మనం ఉపయోగిస్తున్నాం. 75 సంవత్సరాలుగా దేశంలో భూ రికార్డుల ప్రక్షాళన జరగలేదు. వందల ఏళ్ల నాటి రికార్డులు కావడంతో ఇప్పటి పరిస్థితులకు సరిపోక భూ కబ్జాలు, తప్పుడు పత్రాలు సృష్టించడం, భూ వివాదాలు, సరిహద్దు సమస్యలు, సివిల్ కేసులు జనాన్ని పట్టి పీడిస్తున్నాయి.* 1986– తొలిసారిగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఆలోచన చేసింది. దీనిపై అధ్యయనం కోసం ప్రొఫెసర్ డీసీ వాధ్వా ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. సుదీర్ఘ అధ్యయనం చేశాక ఆయన 1989లో గ్యారెంటీయింగ్ టైటిల్ ఆఫ్ ల్యాండ్‌ను రూపొందించారు. కానీ అది అమలుకు నోచుకోలేదు.* 2008ల్యాండ్ టైట్లింగ్ చట్టం మళ్లీ తెర మీదకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ)ను ప్రవేశపెట్టింది. కెనడా, యూకే వంటి యూరోపియన్ దేశాల్లో అమలు చేస్తున్న టోరెన్స్ విధానాన్ని అమలు చేయాలని భావించింది. రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి. కానీ అమలు చేయలేదు.* 2010అప్పటి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ల్యాండ్ టైటిల్ యాక్ట్–2010ని రూపొందించింది. విధి విధానాలు ఖరారు చేసి డ్రాఫ్ట్‌ను ఆన్లైన్లో పెట్టింది. రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయాలని ఆదేశించింది. కానీ అమలు జరగలేదు.* 2013యూపీఏ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు చేసే ఉద్దేశంతో నిపుణుల కమిటీ నియమించింది. ఈ కమిటీ టైట్లింగ్ చట్టానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది.* 2019ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను అమలు చేయాలని భావించింది. ఆ దిశగా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రూపొందించింది. ఇందుకోసం నీతి ఆయోగ్ ముసాయిదా చట్టాన్ని రూపొందించి 2019 నవంబర్ 25న దాన్ని విడుదల చేసింది. ‘ది మహారాష్ట్ర టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్’ తరహాలో దీన్ని రూపొందించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో ఇదే చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచించి చట్టం గెజిట్ విడుదల చేసింది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్– ఇతను రిజిస్ట్రేషన్ల పత్రాలను పరిశీలించి సరిగా ఉన్నాయో లేదో చూస్తారు. తప్పుడు పత్రాలు ఉంటే వెంటనే తిరస్కరిస్తారు.– భూ యజమాని ఇచ్చిన సమాచారాన్ని బట్టి పబ్లిక్ నోటీసు ఇస్తారు. ఆ భూమిపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని ప్రజలను కోరతారు. ఇందుకు నిర్దిష్ట సమయం ఇస్తారు. – ఈ నోటీసుపై ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే వాటిని పరిశీలించి ఆ భూమి ఎవరిదో రికార్డుల ప్రకారం అక్కడే నిర్ధారిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన, చుట్టుపక్కల అభ్యంతరాలను స్వీకరిస్తారు.– ఆ భూమిపై ఎలాంటి వివాదాలూ లేకపోతే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే రిజిస్ట్రేషన్ నిలిపివేసి, పై అధికారులకు సమాచారం ఇస్తారు. అప్పిలేట్ అథారిటీ వద్దకు వెళ్లమని సూచిస్తారు.అప్పిలేట్ అథారిటీ– భూ లావాదేవీలు, సమస్యలను ఈ అథారిటీ పరిష్కరిస్తుంది. అప్పిలేట్ అధికారిగా జేసీ ఆ పైస్థాయి అధికారులు ఉంటారు. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉండదు.– టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సేవలు సంతృప్తిగా లేకపోయినా, అన్యాయం జరిగిందని భావించినా, తప్పుడు వివరాలు ఎక్కించారని తెలిసినా అప్పిలేట్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు.– ఈ అథారిటీ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను పర్యవేక్షిస్తుంది. వారి విధులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తుంది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తుంది.– టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి భూమి వివరాలను తప్పుగా ఎంట్రీ చేసినా, మీకు అన్యాయం జరిగినా అప్పిలేట్ అథారిటీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఆ ల్యాండ్ రికార్డ్‌పై అనుమానం ఉంటే అథారిటీ ఆఫీసర్ సుమోటోగా ఫిర్యాదును స్వీకరించి విచారణకు ఆదేశిస్తారు.– భూమి రికార్డులను మార్చే అధికారం కేవలం అప్పిలేట్ అథారిటీ లేదా కోర్టుకు మాత్రమే ఉంటుంది. టైట్లింగ్ రిజిస్ట్రేషన్ అధికారి ప్రమేయం ఏమాత్రం ఉండదు.కోర్టు..– అప్పిలేట్ అథారిటీ వద్ద అన్యాయం జరిగిందని భావిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చు. హైకోర్టులో మీ కేసును వెంటనే పరిష్కరించడానికి ఒక బెంచ్‌ను ఏర్పాటు చేస్తారు.– అప్పిలేట్ అథారిటీపై వచ్చిన కేసులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు ఈ బెంచ్ పరిష్కరిస్తుంది. తద్వారా సత్వర న్యాయం అందుతుంది.– హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్. దీన్ని అప్పిలేట్ అథారిటీ అమలు చేస్తుంది. ఈ తీర్పును మార్చే అధికారం అప్పిలేట్ అథారిటీ లేదా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు ఉండదు.ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రయోజనాలు– ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితోపాటు ఆ భూమి ఏ శాఖ పరిధిలోనిదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఈ రిజిస్టర్లో నమోదు చేస్తారు.– ఇప్పటివరకు వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం ద్వారా పరిష్కారమవుతాయి. ఇప్పుడు జారీ చేసే రికార్డే ఫైనల్ రికార్డు. ఒకవేళ ఈ రికార్డులో మీకు అన్యాయం జరిగితే హైకోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక బెంచ్ ఉంటుంది.– మీ భూమికి ప్రభుత్వం గ్యారెంటీగా నిలవడం వల్ల భరోసా పెరుగుతుంది. పొరపాటున మీకు అన్యాయం జరిగితే ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిస్తుంది. – ఈ చట్టం వల్ల భూ యజమానులకు భరోసా దక్కుతుంది. ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని చాలా రాష్ట్రాలు చాలా కాలంగా ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. ఈ చట్టం అమలైతే రాష్ట్రంలో భూవివాదాలు 90 శాతం మేర కనుమరుగవుతాయి.– ఒక భూమికి క్లియర్ టైటిల్ ఉంటే అమ్మకాలు, కొనుగోళ్లు పెరుగుతాయి. శాశ్వత భూ హక్కు చట్టం ద్వారా బ్యాంకుల్లో సులువుగా రుణాలు పొందవచ్చు. ఈ చట్టం వల్ల జీడీపీ కూడా పెరుగుతుందని శాస్త్రీయ లెక్కలు చెబుతున్నాయి.– మీ భూమిని మరొకరు దౌర్జన్యంగా లాక్కునే అవకాశం ఉండదు. తప్పుడు పత్రాలు సృష్టించే మార్గాలు మూసుకుపోతాయి. మీ భూమిపై మరొకరి ఆజమాయిషీ ఉండదు.– ల్యాండ్ టైట్లింగ్ చట్టం వల్ల మీ భూములకు శాశ్వత హక్కులు లభిస్తాయి. ఎలాంటి కబ్జాలకు ఆస్కారం ఉండదు. ఈ చట్టం వల్ల సరిహద్దు వివాదాలు, రికార్డుల తగాదాలు, గొడవలు తగ్గుతాయి. – ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్, అప్పిలేట్ ఆఫీసర్‌గా ప్రభుత్వ అధికారులనే నియమిస్తారు. ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం కానీ, ప్రలోభాలు కానీ ఉండవు. ఒకవేళ మీకు అన్యాయం జరిగినట్లు భావిస్తే నేరుగా హైకోర్టు బెంచ్‌ను ఆశ్రయించవచ్చు. అక్కడి తీర్పు ఆధారంగా మీ రికార్డులు మీరు పొందవచ్చు. నష్టపరిహారం కూడా తీసుకోవచ్చు.– భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం అవుతుంది. మీ భూమి రికార్డుల్లోకి ఎక్కించేటప్పుడు మీ గ్రామంలోకి వచ్చి బహిరంగ ప్రకటన ఇస్తారు. మీ భూమి చుట్టుపక్కల రైతులతో మాట్లాడతారు. ఎలాంటి వివాదాలు లేకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ వివాదం ఉంటే డిస్ప్యూట్ రిజిస్టర్ కింద నమోదు చేసి, ఈ కేసును పరిష్కరిస్తారు.– ప్రస్తుతం ఉన్న భూ రికార్డుల వల్ల భూములకు భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరు కబ్జా చేస్తారనే భయం ప్రజల్లో ఉంది. ఎవరు ఎక్కడి నుంచి తప్పుడు పత్రాలు సృష్టిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ సమస్యకు చెక్ పెడుతుంది. -
సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో గల సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతోంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. ఈ చిత్రంలో కార్మికులందరూ సురక్షితంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అమెరికన్ ఆగర్ యంత్రంతో సిల్క్యారా టన్నెల్ నుండి ఎస్కేప్ టన్నెల్ తయారు చేసే పనులు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీకి చెందిన మెకానికల్ బృందం అమెరికన్ అగర్ యంత్రంలోని భాగాలను మార్చింది. యంత్రాన్ని ఆపరేట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. శిథిలాలలో ఆరు పైపులు అమర్చిన తర్వాత మొదటిసారిగా కార్మికులకు ఘన ఆహారాన్ని పంపిణీ చేశారు. పైపు ద్వారా కెమెరాను కూడా లోనికి పంపించారు. దీంతో లోపల చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. లోపల చిక్కుకుపోయిన కార్మికులతో అధికారులు మాట్లాడి, వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు తొలిసారిగా వేడి కిచిడీ పంపిణీ! #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | First visuals of the trapped workers emerge as the rescue team tries to establish contact with them. The endoscopic flexi camera reached the trapped workers. pic.twitter.com/5VBzSicR6A — ANI (@ANI) November 21, 2023 -
సొగసైన మోడ్రన్ లుక్‌లో మానుషి చిల్లర్ అందాల ఫోటోలు
-
ఛత్తీస్‌గఢ్ చిన్నారికి ప్రధాని మోదీ లేఖ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తన చిత్రం గీసిన చిన్నారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేకంగా లేఖ రాశారు. గురువారం ప్రధాని మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆకాంక్ష అనే చిన్నారి తన చిత్రం గీసి తీసుకువచ్చింది. ప్రధాని మోదీ ఆ చిన్నారిని గమనించి, వేదికపైకి పిలిపించుకున్నారు. వివరాలడిగి ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు. శనివారం చిన్నారి ఆకాంక్షకు ఆయన ఒక లేఖ రాశారు. నేటి బాలికలే దేశ ఉజ్వల భవిత అని పేర్కొన్నారు. నువ్వు తీసుకువచ్చిన స్కెచ్ నాకు చాలా బాగా నచ్చింది. నాపై నువ్వు చూపిన అభిమానం, ప్రేమకు ధన్యవాదాలు. నీకు ఎల్లప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి. భవిష్యత్తులో నువ్వు విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. రాబోయే 25 ఏళ్లు మీలాంటి చిన్నారులకు ముఖ్యమైన రోజులు కానున్నాయి. ఈ కాలంలో ముఖ్యంగా దేశయువతతోపాటు మీలాంటి పుత్రికలు భారత్ కలలను నెరవేరుస్తారు. దేశ భవిష్యత్తుకు కొత్త దిశను అందిస్తారు’అని ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు. -
హీరోలా ఉన్న ఈ బిజినెస్మెన్ ఎవరో గుర్తుపట్టారా?
భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, ప్రముఖ పారిశ్రామిక వేత్త 'రతన్ టాటా' (Ratan Tata) ఈ రోజు ఎలా ఉంటాడనేది అందరికి తెలుసు. అయితే ఒకప్పుడు యువకుడుగా ఉన్న సమయంలో ఎలా ఉండేవాడని చాలా మందికి తెలియకపోవచ్చు. టాటా గ్రూప్ ఉన్నతికి ఎంతో కృషి చేసిన ఈయన యంగేజ్‌లో హీరోలా ఉండటం ఇక్కడ చూడవచ్చు. కరోనా సమయంలో దేశ ప్రజల కోసం వేల కోట్లు వెచ్చించిన ఈ నిరాడంబరురుని సేవను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలను కూడా ప్రధానం చేసింది. సామాన్య ప్రజలకు సైతం కారు అందుబాటులో ఉండాలనే సదుద్దేశ్యంతో నానో కారుని ప్రవేశపెట్టిన ఘనత కూడా ఈయన సొంతమే. ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్ ప్రస్తుతం టాటా నానో ఎలక్ట్రిక్ కారుగా విడుదలకావడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. రతన్ టాటా కలల కారు ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదలైతే బడా సంస్థలకు కూడా గట్టిపోటీ ఇస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు. ఎనిమిది పదుల వయసు దాటిన తరువాత కూడా దేశం కోసం ఆలోచించే మహానుభావుడు రతన్ టాటా అనటంలో ఎటువంటి సందేహం లేదు. -
పర్ఫెక్ట్ టైమింగ్: కెమెరాకు చిక్కిన మూడు తలల చీతా!
అత్యంత వేగవంతమైన పరుగుకు చీతా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. అది పరిగెడున్నప్పుడు చూస్తే అది గాలితో పోటీ పడుతున్నదేమో అని అనిపిస్తుంది. ఇంతటి వేగం కలిగిన చీతాకు అడ్డుపడే ఏ జీవి అయినా ప్రాణాలతో మిగలదని చెబుతుంటారు. ప్రపంచంలో చీతాల జాతి మెల్లమెల్లగా అంతరించిపోతున్నదని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఆఫ్రికాలోని కొన్ని అడవుల్లో చీతాలు విరివిగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు మీరు పైనున్న ఫొటోలో చీతాకు సంబంధించిన అద్భుతమైన ఫొటోను చూశారు. దీనిని ఒక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో క్యాప్చర్ చేశారు. ఈ ఫొటోను చూసిన వారంతా ఆ ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకోవడంతోపాటు, అతను ఎంతో ధైర్యవంతుడైన క్రియేటర్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఫొటో కోసం 7 గంటల శ్రమ ఈ అద్భుతమైన ఫొటోను విబుల్డన్కు చెందిన వరల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ పాల్ గోల్డ్‌స్టీన్ తన కెమెరాలో బంధించారు. ఈ చీతా కెన్యాలోని మాసై మారా నేషనల్ పార్కులో కనిపించింది. పాల్ గోల్డ్ ఈ ఫొటో గురించి ఒక మీడియా హౌస్‌లో మాట్లాడుతూ తాను ఈ ఫొటో తీసేందుకు 7 గంటల పాటు వర్షంలో తడిసి ముద్దయ్యానని తెలిపారు. ఈ ఫొటోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ‘ఆ క్షణంలో మంత్రముగ్ధుడనయ్యాను. అవును.. ఇందుకోసం ఏడు గంటలు వర్షంలో తడిశాను’ అనే కాప్షన్ రాశారు. ‘వారేవాహ్.. ఏం టైమింగ్‌రా బాబూ’ ఈ పొటోను పరీక్షగా చూస్తే ఒకే చిరుతకు మూడు తలలు ఉన్నాయని, అవి వేర్వేరు దిశల్లో చూస్తున్నాయని అనిపిస్తుంది. పొటోగ్రాఫర్ పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫొటోను చూసినవారంతా ‘వారేవాహ్.. ఏం టైమింగ్‌రా బాబూ’ అని ఆ ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకుంటున్నారు. నిజానికి అవి మూడు చీతాలు. అవి ఒక దగ్గరే వేర్వేరు యాంగిల్స్‌లో కూర్చున్నాయి. అది ఫొటోగ్రాఫర్ కంటపడింది. ఇది కూడా చదవండి: ఇదేమిటో తెలుసా? 90ల నాటి పిల్లలైతే ఇట్టే చెబుతారు! -
ఈ చిత్రంలో దాగున్న చిన్నారిని గుర్తుపట్టగలరా?
ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో నీలి ఆకాశంలో రాతిబండలు కనిపిస్తున్నాయి. కాని దానిలో రెండు గోధుమ రాళ్ల మధ్య ఓ చిన్నారి దాక్కుంది. అది కూడా పర్పుల్ కలర్(ఊదారంగు) టాప్ ధరించి రెండు చేతులు పైకి ఎత్తి ఉన్నట్లు కనిపిస్తుంది. చాలా ఓపికతో కనిపెటండి. మొదట చూస్తున్నప్పుడూ కాస్త గందరగోళం కనిపించిన కొద్ది సేపటి తర్వాత ఆ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. ట్రై చేయండి. ఈ చిత్రానికి వేల వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా తెలివిగా ట్రై చేసి కనుక్కొండి. లేదంటే కింద క్లియర్‌గా కనిపించే ఇమేజ్‌లో చూడండి మీకే తెలుస్తుంది ఆ చిన్నారి ఎక్కడ ఉన్నది. (చదవండి: స్కూల్ నిర్మించడం కోసం ఆ రైతు ఏం చేశాడంటే..) -
గేర్‌బాక్స్ మీ చేతుల్లోనే ఉంది సార్!
గేర్‌బాక్స్ మీ చేతుల్లోనే ఉంది.. మీ ఇష్టం సార్! -
అబ్బా కారు భలే ఉందంటూ ఫోటోలు దిగుతున్నారు..సడెన్‌గా ఓనర్ వచ్చి...
అందరికీ కార్లు కొనుక్కునేంత స్తోమత ఉండొద్దు. ఐనా ఎక్కడైన మంచి ఖరీదైన కారు పార్కింగ్ వద్ద ఉంటే నేరుగా వెళ్లి ఫోటోలు తీసుకుని మురిసిపోతాం. ఔనా! చాలామంది అలానే చేస్తారు. కొంతమంది పట్టుదలగా ఎప్పటికైనా కారు కొనాలని లక్ష్యం పెట్టుకుని మరీ నెరవేర్చుకున్న వారు లేకపోలేదు. ఐతే అందరికీ అలా సాధ్యం కాకపోవచ్చు. ఏ షోరూంలోనో లేక స్నేహితులు లేదా బంధువుల వద్ద కారు ఉంటే చక్కగా వాళ్లని అడగి అందులో కాసేపు కూర్చొని సరదా తీర్చకుంటాం. అచ్చం అలానే ఇద్దరూ అబ్బాయిలు రోడ్డు పక్కకు పార్క్ చేసి ఉన్న అందమైన కారు చూసి ముచ్చట పడ్డారు. వెంటనే ఆ కారు వద్దకు వచ్చి ఫోటోలు తీసుకోవడం ప్రారంభించారు. ఇంతలో సడెన్‌గా ఆ కారు ఓనర్ వచ్చాడు. ఐతే సహజంగా ఏ ఓనర్ అయినా ఎవర్రా! అది అని అరిచి వెళ్లిపోయేలా చేస్తాడు. కానీ ఇతను ఏకంగా కారు కీ ఇచ్చి ఎక్కి కూర్చొని ఫోటోలు దిగమని ప్రోత్సహించాడు. అందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రాంలో అన్షుబాత్రా పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సదరు ఓనర్ని మీది చాలా విశాల హృదయం అని ఒకరు, మంచి వ్యక్తి అంటూ మరోకరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Batra King ☆ (@_anshubatra_) (చదవండి: షాకింగ్ ఘటన:రెస్టారెంట్లోకి దూసుకొచ్చిన టెంపో..ముగ్గురికి గాయాలు) -
నాగ చైతన్య - శోభిత ... హ్యాపీ స్టేటస్
-
Anasuya Latest Photos: వావ్ అనిపించిన అనసూయ లేటెస్ట్ ఫొటోలు
-
యంగ్ లుక్‌లో అదిరిపోయిన మాధవన్
తమిళం, హిందీ, తెలుగు సినిమాల్లో నటించిన హీరో మాధవన్ అభిమానుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తన సినిమా అప్డేట్స్తోపాటు కుటుంబానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసే మాధవన్ అప్పుడప్పుడు పాతకాలం నాటి ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను సర్ఫ్రైజ్ చేస్తుంటారు. తాజాగా అలాంటి మరో ఫోటోనే అభిమానులతో పంచుకున్నారు. గతంలో భార్య సరితా బిర్జితో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇద్దరూ చాలా యంగ్ లుక్‌లో కనిపిస్తున్న ఈ ఫోటో నెటిజన్ల మనుసు దోచుకుంటుంది. ‘క్యూట్ కపూల్, అందంగా ఉన్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (మాధవన్ ఆనందం.. తనయుడి గెలుపు) కాగా ఎనిమిదేళ్ల రిలేషన్షిప్ అనంతరం 1999లో మాధవన్, సరితా వివాహం చేసుకున్నారు. వీరికి 14 ఏళ్ల కుమారుడు వేదాంత్ ఉన్నాడు. ఇక అనుష్య ముఖ్య పాత్రలో వస్తున్న ‘నిశ్శబ్దం’లో మాధవన్ ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అలాగే భారతీయ ఇస్రో మాజీ శాస్త్రవేత్త, ఏరోస్పేస్ ఇంజనీర్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న రాకెట్రీ చిత్రంలోనూ మాధవన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో నంబి నారాయణ్ పాత్రతో పాటు సినిమాకు డైరెక్టర్, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. (చిత్రం పేరు మాత్రమే నిశ్శబ్దం..) View this post on Instagram 5000 years ago ... 🙈🙈🤪🤪😄😄 A post shared by R. Madhavan (@actormaddy) on Oct 24, 2019 at 4:04am PDT View this post on Instagram When The biggest thrill for my boy was to sit on his fathers shoulders. Those were the days. Now I think he can lift me like this on his shoulders. A post shared by R. Madhavan (@actormaddy) on Nov 21, 2018 at 10:00am PST View this post on Instagram Just saw my Graduation yearbook from Canada. A little blown by what I wrote for Ambition (AMB) 28 years ago.. the Universe conspires..ha ha ha 🙏🙏🙏😱😱😁😁 A post shared by R. Madhavan (@actormaddy) on Dec 24, 2017 at 9:56am PST -
ఆమెకు బెస్ట్ మమ్మీ అవార్డు ఇవ్వాలి!
చిన్న పిల్లలు గీసే చిత్రాలు ఎలాగుంటాయి? అబ్బో అసలు ఏం గీశారో ఆ చిన్ని మేధావులకు తప్ప మనలాంటివారికి అంతుచిక్కదు. తీరా వాళ్లు మేము గీసింది ఇదీ అని వివరించి చెప్తేగానీ తెలియదునుకోండి. అదేవిధంగా ఓ చిన్నారి కూడా ఆర్టిస్టు అవతారమెత్తి తన తల్లి బొమ్మ గీద్దామనుకుంది. అనుకున్నదే తడవుగా కుంచె పట్టి ఓ చిత్రాన్ని ఆవిష్కరించింది. ఇది చూసిన ఆమె తల్లి ఎస్క్ర్టాండ్ తనను తాను పోల్చుకోలేక అయోమయానికి లోనైంది. ఏమైతేనేం.. తన గారాలపట్టి గీసిన బొమ్మ తనకు అద్భుత చిత్రకావ్యమే అనుకుని దాన్ని భద్రంగా దాచుకుంది. అరుదైన కానుకగా దాన్ని ఫ్రేము చేయించి మరీ పెట్టుకుంది. సరిగ్గా పదేళ్ల తర్వాత అంటే ఈమధ్యే ఆమె ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. కానీ ఈసారి ఆ తల్లి అచ్చంగా కూతురు గీసిన బొమ్మలానే ఉంది. తన మేకప్ వేసుకుని మరీ ఫొటోలో ఉన్నట్టుగా రావడానికి ఎంతగానో కష్టపడింది. అనంతరం పెయింటింగ్‌తో పాటు కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ తల్లిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘మీ కూతురు గీసిన బొమ్మను ఫ్రేము కట్టించి మరీ దాచుకోవడం నిజంగా అద్భుతం’ అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. దానికి ఆమె స్పందిస్తూ ‘ఇది వెలకట్టలేని ఆస్తి, నాకు మాత్రమే దక్కిన అరుదైన బహుమానం’ అని చెప్పుకొచ్చింది. ‘ఆమెకు బెస్ట్ మమ్మీ అవార్డు ఇవ్వాలి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా ఈ చిత్రాన్ని గీసిన చిన్నారికి ఇప్పుడు పంతొమ్మిదేళ్లు. -
వివేక వాణి
ఒక బొమ్మను దేవుడని మనం పూజించవచ్చు. కానీ, దేవుణ్ణి బొమ్మగా భావించకూడదు. అదేవిధంగా ప్రతిమలో భగవంతుడున్నాడని తలచడం తప్పుకాదు. భగవంతుడు ప్రతిమ అనుకోవడం తప్పు.గ్రంథాల వల్ల మతాలు రూపొందడం లేదు. కానీ, మతాలు గ్రంథాలకు కారణమవుతున్నాయి. ఈ సంగతి మనం విస్మరించకూడదు. ఏ గ్రంథమూ భగవంతుణ్ణి సృష్టించలేదు. భగవంతుడే అనేక ఉద్గ్రంథాల రచనకు దివ్యప్రేరణ కలిగించాడు. -
అక్షరాలకు అందని అభిమానం
-
కోటేష్ చిత్రానికి ఉగాది పురస్కారం
నంద్యాల: ఏపీ బాషా, సాంస్కృతిక శాఖ, ఆర్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ప్రదానం చేస్తున్న ఉగాది పురస్కారాలకు ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ఎంపికయ్యారు. ఈయన చిత్రీకరించిన ఆనందతాండవం కళంకారి చిత్రానికి ఈ పురస్కారం దక్కింది. ఈ మేరకు తనకు లేఖ అందిందని కోటేష్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పురస్కారాలకు 36 మందిని ఎంపిక చేయగా కర్నూలు జిల్లా నుంచి కోటేష్ ఒక్కరికే జాబితాలో స్థానం లభించడం విశేషం. ఉగాది సందర్భంగా ఈ నెల 29వతేదీన కోటేష్‌కు పురస్కారం అందిస్తారు. -
కోనసీమలో కొలువైన చిత్ర కళా ప్రదర్శన
నేడు 400 మంది చిత్రకారులకు పురస్కారాలు, సత్కారాలు అమలాపురం టౌన్ (అమలాపురం) : కోనసీమ చిత్ర కళా పరిషత్ 27వ జాతీయ స్థాయి చిత్ర కళా ప్రదర్శనలు అమలాపురంలోని సత్య సాయి కల్యాణ మండపంలో శనివారం నుంచి మొదలయ్యాయి. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు చిత్ర కళల పండుగు జరగనుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 500 మంది చిత్రకారులు గీసిన అపురూప చిత్రాలు ఇక్కడ ఒకే వేదికపై కొలువుదీరాయి. జిల్లా నలుమూలల నుంచి ఈ చిత్ర ప్రదర్శనలు చూసేందుకు కళాభిమానులు తరలివచ్చారు. ఈ ప్రదర్శనలను అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్, అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మెట్ల రమణబాబు ప్రారంభించారు. కోనసీమ చిత్ర కళా పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి కొరసాల సీతారామస్వామి ఆధ్వర్యంలో ఈ జాతీయ స్థాయి చిత్ర కళా ప్రదర్శనలు ఏర్పాటయ్యాయి. పరిషత్ జాతీయ స్థాయిలో పెద్దలు, పిల్లలకు నిర్వహించిన చిత్రకళా పోటీల్లో ప్రత్యేక నగదు అవార్డులు, బంగారు పతకాలకు ఎంపికైన చిత్రాలు ప్రదర్శనలో ఉంచడంతో చిత్ర కళాభిమానులకు కనువిందు చేశాయి. ప్రముఖ చిత్రకారుడు, సినీ పబ్లిసిటీ ఆర్టిస్ట్ కడలి సురేష్ కుంచె నుంచి జాలు వారిన రాయాయణంలోని పలు ఘట్టాలకు చెందిన దృశ్యాలు దాదాపు 15 ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. అవి కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నేడు 400 మంది చిత్రకారుల రాక కోనసీమ చిత్ర కళాపరిషత్ జాతీయ చిత్ర కళా పోటీల్లో విజేతలైన 400 మంది చిత్రకారులు ఆదివారం ఉదయం అమలాపురంలోని చిత్ర కళా వేదిక అయిన సత్యసాయి కల్యాణ మండపానికి రానున్నారు. ఒక్కొక్క చిత్రకారుడికి పరిషత్ తరపున పురస్కారం ప్రదానం చేయటమే కాకుండా సాదరంగా సత్కరించనున్నారు. రూ.30 వేల నుంచి రూ.వెయ్యి వరకూ ప్రకటించిన దాదాపు 50 నగదు పురాస్కారాలు, 350 మంది బాల చిత్రకారులకు బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు. పరిషత్ గౌరవ అధ్యక్షునిగా రాజప్ప, అధ్యక్షునిగా రమణబాబు ఈ పరిషత్ అధ్యక్షునిగా మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు వ్యవహరించే వారు. ఆయన మరణం తర్వాత ఆ పదవీ బాధ్యతలను మెట్ల తనయుడైన మెట్ల రమణబాబుకు అప్పగించారు. అలాగే పరిషత్ గౌరవ అధ్యక్షునిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కొత్తగా బాధ్యతలు చేపట్టారు. -
చర్ఖా తిప్పినా చరిత్ర మారదు
రెండో మాట ఆధునిక చర్ఖాను తిప్పుతున్న వ్యక్తిగా కాలం చేసిన ఆ గాంధీజీ ఉండతగడని భావించారు. ఆ స్థానంలో కుర్తా, పైజమా, కోటు ధరించిన ‘2017 మోదీ’ ముఖచిత్రంతో క్యాలండర్లూ, డైరీలూ ముద్రించేశారు. దీన్ని సమర్థిస్తూ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ ఛైర్మన్ వీకే సక్సేనా చిత్రవిచిత్రమైన ప్రకటన చేయడం మరింత విడ్డూరం. ఆయన ఉద్దేశంలో, గాంధీ ఫొటో గతంలోనూ ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ క్యాలండర్లో కూడా కన్పించలేదు. అందువల్ల ఒక్క గాంధీ ఫొటోనే ఖాదీ బోర్డు క్యాలండర్లో ప్రచురించాలని ఎక్కడా లేదట. జాతిపిత గాంధీజీ ఫొటోను తొలగించి, ఆ స్థానంలో ఇంతవరకు ఏ భారత ప్రధాని ఫొటోగానీ, రాష్ట్రపతి ఫొటోగానీ అలంకరించిన దాఖలాలు లేవు. నేటి ప్రధాని నరేంద్ర మోదీ మొదట దేశ తొలి ఉపప్రధాని, దేశీయాంగ మంత్రి సర్దార్ పటేల్‌తో పోల్చుకుని; ఇప్పుడు తానే గాంధీజీగా భావించుకునే స్థితికి దిగారు. – అభిషేక్ మను సింఘ్వి (13–1–‘17) కాంగ్రెస్ అధికార ప్రతినిధి గాంధీజీ చర్ఖానే ఎవరో దొంగిలించుకుపోతున్నారు, జాగ్రత్త సుమా!’ – తుషార్ గాంధీ (తాజా ట్వీట్లో) ఈ ఘటన (మోదీ ఫొటోతో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్– కేవీఐసీ, క్యాలెండర్ దర్శనం ఇచ్చాక)కు ముందు ప్రజలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, పత్రికలు పసిగట్టిన మరొక వార్తనూ, నిశిత వ్యాఖ్యనూ కూడా మనం గుర్తు చేసుకోవాలి. అది–గడచిన నవంబర్ 8న ఆకస్మికంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం. 85 శాతం నగదు లావాదేవీల మీద ఆధారపడిన ప్రజలు ఉన్న ఆర్థిక వ్యవస్థను ఆ నిర్ణయంతో బీజేపీ పాలకులు ఒక్కసారిగా కుప్పకూల్చారు. ఈ పరిణామం గురించి ఆర్థిక బహుమానాలకు అర్హులైన వారి జాబితాకు రేటింగ్ నిర్ణయించే ప్రసిద్ధ మ్యాగజైన్ ఫోర్బ్స్ చేసిన వ్యాఖ్య గమనించదగినది. అందులో స్టీవ్ ఫోర్బ్స్ ఇలా వ్యాఖ్యానించాడు, ‘ఎలాంటి చట్టబద్ధ ప్రక్రియతోనూ నిమిత్తం లేకుండా భారత ప్రజల సంప దను భారీ స్థాయిలో మోదీ ప్రభుత్వం దొంగిలించింది. ప్రజాస్వామ్యబ ద్ధంగా ఎన్నికైన ఏ ప్రభుత్వానికైనా ఇలాంటి చర్య విస్మయకరం.’ ఈ వివాదం కొద్దిగా కూడా చల్లారక ముందే ఇప్పుడు స్వరాజ్య చిహ్నమైన చర్ఖాను బీజేపీ తన సొంత ఆస్తిని చేసుకునే ప్రయత్నంలో ఉంది. హిందూ మతోన్మాదీ, ఆరెస్సెస్ ప్రచారక్ అయిన ఏ హంతకుని చేతిలో మహాత్ముడు ప్రాణాలు కోల్పోయాడో, అలాంటి మహాత్ముని చేతిలో స్వాతంత్య్ర సాధనకు ఉద్దీపనగా వెలుగొందిన చర్ఖా అది. దానినే బీజేపీ కబళించే యత్నంలో ఉంది. అంతేనా! ఈ తరహా యత్నాలు మరిన్ని జరుగు తున్నాయి. కోటు, బూటు, సూటు మార్పే విలాసంగా కులుకుతున్న పాలక శక్తులు గాంధీనే కాదు; విప్లవనేత భగత్‌సింగ్‌ను, సర్వమానవ సమాన త్వాన్నీ; హైందవంలోని భౌతికవాదాన్నీ ఆధ్యాత్మికతను సమపాళ్లలో ఆచ రిస్తూ ‘హేతువాదానికి నిలబడని మతాన్ని స్వీకరించరాద’ని, ఆఖరికి మతా లన్నీ నశించి మానవత్వమే జయం పొందుతుందని ఉద్ఘాటించిన వివేకానం దుడిని కూడా తమ సొంతం చేసుకోవడాని ప్రయత్నిస్తున్నాయి. ఆఖరికి ఎన్ని కల ప్రచార సభలలో గాంధీజీతో పాటు వీరి బొమ్మలను కూడా పెడుతు న్నారు. ఇదొక ముసుగు. ఆ ముసుగులోనే భారతీయ బహుళ సంస్కృతిలో అంతర్భాగమైన భాషా మైనారిటీలనూ, వివిధ జాతుల మధ్య సమైక్యతా శక్తినీ, సెక్యులరిజాన్నీ విభజన రాజకీయాలతో నిర్వీర్యం చేస్తున్నారు. తీర్పు దారి తీర్పుదీ, మోదీ దారి మోదీది! ఒక తాజా ఉదాహరణ చూద్దాం. ఎన్నికలలో కుల,మత, వర్గ ప్రసక్తిని లేవదీసి పార్టీలు గానీ, అభ్యర్థులు గానీ ఓట్లు అభ్యర్థించడాన్ని నిషేధిస్తూ ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేశాయి. అయినా మోదీ ఈ అంశం లోనూ తన పాక్షికతను బయటపెట్టారు. ‘కులం’పేరిట ఓట్లు అభ్యర్థించడాన్ని మాత్రమే ఆయన వ్యతిరేకించడం గమనార్హం. అంతేగానీ సుప్రీంకోర్టు ఆదే శించిన రీతిలో మత ప్రస్తావనకు దూరంగా ఉండేందుకు మోదీ యత్నించడం లేదు. పైగా, మత రాజకీయాల కోసం, ఎన్నికల ప్రచారం కోసం స్వాతంత్య్ర సమరయోధులను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేతప్ప, ఆ మహనీయులు ప్రవచించిన దేశ సమైక్యతా దీక్ష, లౌకిక రాజధర్మం, రాజ్యాంగబద్ధ రాజనీతిజ్ఞత, శాస్త్రీయ దృక్పథం వంటివి ప్రజలలో పాదు కొల్పాలని భావించడం లేదు. వారూ పాటించడం లేదు. అందుకే, ‘మతమ నేది విషంగా మారకూడదు. ఎందుకంటే మతం లేదా పూజా పునస్కారం అనేవి వ్యక్తిగతమైనవి. తాను విశ్వసించే, తనకు నచ్చిన సృష్టికర్తను ఆవా హనం చేసుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది’ అని గాంధీజీ అన్నారు. అంతే గానీ, విభిన్న మతాల మధ్య, భాషా–మైనారిటీల మధ్య తంపులు పెట్టి తమాషా చూడమని చెప్పలేదు, వాటితో పబ్బం గడుపుకోమని అనలేదు. గాంధీజీ స్థానం అజరామరం ఖాదీ వస్త్రాల అమ్మకాలను పెంచడానికి చర్ఖా తిప్పుతూ (రాట్నం ఆడిస్తూ) కొత్త వేషంలో కనిపించే మోదీ చిత్రాన్నో, ఛాయాచిత్రాన్నో ( గాంధీజీ బొమ్మ స్థానంలో) ఈసారి చూపాలన్న కొత్త ఆలోచన (కొత్తది కాదు, పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే) ‘జాతీయ ఖాదీ గ్రామీణోద్యోగ కమిషన్’కు ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే, ఆధునిక చర్ఖాను తిప్పుతున్న వ్యక్తిగా కాలం చేసిన ఆ గాంధీజీ ఉండతగడని భావించారు. ఆ స్థానంలో కుర్తా, పైజమా, కోటు ధరించిన ‘2017 మోదీ’ ముఖచిత్రంతో క్యాలండర్లూ, డైరీలూ ముద్రించేశారు. దీన్ని సమర్థిస్తూ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ ఛైర్మన్ వీకే సక్సేనా చిత్రవిచిత్రమైన ప్రకటన చేయడం మరింత విడ్డూరం. ఆయన ఉద్దేశంలో, గాంధీ ఫొటో గతంలో కూడా ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ క్యాలండర్లో కూడా కన్పించలేదు. అందువల్ల ఒక్క గాంధీ ఫొటోనే ఖాదీ బోర్డు క్యాలండర్లో ప్రచురించాలని ఎక్కడా లేదట. అదే కారణంగా చర్ఖా మీద నూలు ఒడుకుతున్న మోదీ ఈసారి ఫొటోను ప్రచురించామని ఆయన వివరించారు. ప్రాణానికీ, ధనానికీ ప్రమాదం వాటిల్లిందని భావించే వ్యక్తి ఆ రెండింటినీ కాపాడుకునే ప్రయత్నంలో అబద్ధాలు (బొంకు) ఆడితే తప్పు లేదని ప్రాచీన కవి వాక్కు. నోట్ల రద్దు అనే స్వయంకృతాపరాధం వల్ల ఏర్ప డిన సంక్షోభం సందర్భంగా ‘నాకు ప్రాణహాని ఉంద’ని ప్రకటించుకున్న పాలకుడిది ప్రచారమైనా అయి ఉండాలి, లేదా మోసమైనా అయి ఉండాలి. పైగా ఈ ధోరణి ఒక మతోన్మాది చేతిలో మహాత్మాగాంధీ బలై 70 ఏళ్లు కావస్తున్న సందర్భంలో ప్రస్ఫుటమవుతోంది. ఇలాంటి సందర్భంలో ఆ క్యాలండర్లో గాంధీ స్థానంలో ఖాదీ దుస్తుల మోదీ ప్రవేశించడం చిత్రాతి చిత్రం కాదా?! జాతీయోద్యమ కాలంలోనే ‘చర్ఖా’ ప్రతీకగా వెలసిన కాంగ్రెస్ జెండాకు అర్థాన్ని, పరమార్థాన్ని వివరించిన వ్యక్తి గాంధీజీ. కానీ అడుగడు గునా గాంధీని, ఆయన ఆలోచనా ధారతో రూపుదిద్దుకున్న పతాకాన్నీ, చర్ఖానూ అవమానించిన మతతత్వవాదులు సావర్కార్, గోల్వాల్కర్, నాథూరాం గాడ్సేలేనని మరచిపోరాదు. వీరిలో ఒకరు గాంధీజీనే హత్య చేయగా, మిగతావారు జాతీయ జెండానే వ్యతిరేకించినవారు. ఆ సంద ర్భంగా జాతీయ జెండాలో ‘చక్రం’ ఉండాలా, లేక ‘చర్ఖా’ ఉండాలా అన్న వివాదం తలెత్తింది. జెండాలో ఉన్న చక్రం ‘సుదర్శన చక్రం’గా కొందరు భావించగా, గాంధీజీ అది ‘చర్ఖా’గానే ఉండాలనీ, చర్ఖా (రాట్నం) మానవ శ్రమకు, ఉత్పత్తి క్రమంలో కార్మిక శ్రమకు, శాంతికి చిహ్నమనీ గాంధీజీ భావించారు. కాగా ‘సుదర్శన’ చక్రం అనేది విధ్వంసక ఆయుధమనీ; ‘హింసకు, అశాంతికి కారణమైన శక్తి’కి నిదర్శనమనీ గాంధీజీ వర్ణించారు. గాంధీజీ తొలి సత్యాగ్రహ యాత్ర చంపారన్ ఉద్యమానికి ‘చర్ఖా’యే ప్రతీకగా నిలిచింది. కనుక మహాత్ముడి స్థానాన్ని ఏ రాజకీయ పక్షానికి చెందిన చిల్లర నేతలూ భర్తీ చేయజాలరు. ఆ త్యాగధనులు ఊహించలేదు కుత్సితాలతో స్నేహం కట్టిన వాళ్లకు మనసులో ఒకటి, చేతల్లో ప్రవర్తన వేరొ కటి తీరుగా ఉంటుంది. ‘కులం’ మాట ఎత్తొద్దు అన్న వ్యక్తికి, ‘మతం మాట ఎత్తొద్దు’ అనడానికి మాత్రం నోరు పెగలదు. ‘నవంబర్ 8’ నిశిరాత్రి దేశం మీదకు వచ్చిన నోట్ల రద్దు చర్య ‘సంక్షేమానికి’ ఆదర్శవంతమైన బాటలు నిర్మిస్తుందనుకున్నారు. కానీ మోదీ అనాలోచిత ప్రయోగం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ బలహీనపడి, నిలకడకన్నా ఒక స్తబ్దతకు, ఆపై క్రమేణా తీవ్ర సంక్షోభానికి దారి తీయవచ్చునని స్వదేశీ, విదేశీ నిపుణులు వరసవారీ హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికల నేపథ్యంలో కూడా ‘దేశ ప్రజలు నోట్ల రద్దువల్ల ప్రశాంతంగా నిద్రపోతున్నారు’ అని మోదీ ప్రకటించ సాహసిం చారు. తాను చేస్తున్న ప్రయోగం అంతా (క్యాబినెట్‌తో, దేశ జీవనాడి అయిన ఆర్బీఐతో సంబంధం లేకుండా) అవినీతిని, నల్లధనాన్ని, ఉగ్రవాదాన్ని అరి కట్టడం కోసం కాగా, ప్రతిపక్షాలు మాత్రం అవినీతిపరులతో చేతులు కలు పుతున్నాయని మోదీ నమ్మింపజూశారు. అదే తరుణంలో ఇన్‌కమ్‌ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డాక్యుమెంట్లలో తేదీలతో సహా దొరికిన ఆధారాల మేరకు ‘నాటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ’కి బిర్లా, సహారా గ్రూప్‌ల నుంచి ఇన్ని కోట్లు ముట్టాయన్న ఆరోపణలు వచ్చాయి. వీటికి మోదీ ప్రత్యక్షంగా, అక్షర సత్యంగా ఈ రోజుదాకా తిప్పికొట్టకుండా ఉండటం ప్రజల్లో ‘అవినీతి’ని గురించిన ఆరోపణలపై అనుమానాలు వైదొలగడం లేదు. అంతేగాదు, ‘దేశం కోసం ప్రతిదీ– నా ఇల్లూ, వాకిలీ, కుటుంబాన్నీ త్యాగం చేశాను’ అని నోట్ల రద్దు తర్వాత ఎందుకు అనవలసి వచ్చిందో ఆయన చెప్పలేదు. ఈ చాయం గల విన్నపాలు ఎందుకు అవసరమైనాయో కూడా తెలియదు. ఆదిలో పాలనా రథం ఎక్కుతూనే మోదీ నర్మగర్భంగా ఒక ముందస్తు షరతు పెట్టారు. అది–‘నాది కనిష్ఠ ప్రభుత్వంగా ఉంటుంది, కానీ గరిష్ఠ పాలనగా ఉంటుంది’ (మినిమమ్ గవర్నమెంట్ అండ్ మాక్సిమమ్ గవర్నెన్స్). మరోమాటలో చెప్పాలంటే క్యాబినెట్ ప్రభుత్వం అనేది నామ మాత్రంగా ఉంటుంది. కానీ గరిష్ట పాలనా విధానం నా చేతుల్లో ఉంటుంది అని. అందుకే పేద, మధ్య తరగతి ప్రజల నగదు లావాదేవీలకు ఎసరుపెట్టి, సంపన్న వర్గాల ప్రయోజనాలకు వెసులుబాటు కల్పించారు. బ్యాంకుల ముందు, ఎటీఎంల ముందు పేదలు, ఉద్యోగ వర్గాల వారూ చిన్నా చితకా పనులు మానుకుని నాలుగు డబ్బులు (తమవే) డ్రా చేసుకోడానికి సాగి లపడ్డారేగానీ ఒక్క ప్రజా ప్రతినిధిగానీ, మంత్రిగానీ, లక్షాధికారులు, కోటీశ్వరులు, అంబానీ, ఆదానీ లాంటి మహా కోటీశ్వరులుగానీ–ఒక్కరంటే ఒక్కరూ–ఈ క్యూలలో నిలబడ్డారా? ప్రజల బాధల గురించి గానీ, ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం గురించిగానీ అభిప్రాయాలు ముద్దుగా తెలుసుకోడా నికైనా.. కనీస మర్యాదకైనా ఈ క్యూల ముందుకు వచ్చారా? గాంధీజీ, వేలాది త్యాగధ నులూ స్వాతంత్య్ర సాధన కోసం ధన, మాన ప్రాణాలు త్యాగం చేశారేగానీ సామాన్య ప్రజాబాహుళ్యంపైనే ఇలాంటి క్రూరమైన దాడులను గానీ, అది కూడా దేశ పాలకుల నుంచి ఇలాంటి దాడులను గానీ వారు ఊహించలేదు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మహిళ గర్భంలో పిండమా? కారా?
శాన్ ఫ్రాన్సిస్కో: భార్య కడుపులో బిడ్డకు బదులు చిన్న కారు ఉందని తెలిస్తే.. అదీ రకరకల కార్లంటే పడి చచ్చే పురుషుడికి తన భార్య గర్భంలో పిండానికి బదులు ఒక స్పోర్ట్స్ కారు కనిపిస్తే...వినడానికి వింతగా ఉంది కదూ. కానీ అమెరికాకు చెందిన సోషల్ మీడియా రెడ్ ఇట్ అనే వెబ్ సైట్ లో ఒక వ్యక్తి ఇలాంటి అనుభవాన్ని నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. 24 వారాల తన భార్య గర్భంలో శిశువుకు బదులు ఒక బేబీ కార్ కనిపించిందని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన అల్ట్రాసౌండ్ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. తమ దంపతులకు కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) ద్వారా ఇప్పటికే ఆరు నెలల పాప ఉందని, దీంతో ఇప్పట్లో పిల్లలు కావాలని అనుకోలేదని తెలిపాడు. అయితే అద్భుతమైన రీతిలో సహజంగానే తన భార్య మళ్లీ గర్భం దాల్చిందని రాశాడు. ఈ క్రమంలో ఆమెకు స్కానింగ్ రిపోర్టు ఫోటోలో చిన్న కారు కనిపించడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు. దీంతో ఆ ఫోటో..ఆకథనం వైరల్ గా మారింది. నెటిజన్లు దీనపై భిన్న మైన కమెంట్లు చేశారు. ఆటోమొబైల్ జోక్స్ పేల్చారు. ఆ కుటుంబంలోకి ది ఫాస్ట్ అండ్ ది ఫీటస్ వస్తోందని ఒకరు.. ది ఆల్ న్యూ ఫోర్ట్ ఫీటస్ అని మరొకరు.. న్యూ ఎడిషన్ కారు కోసం ఆల్ ది బెస్ట్ ... దె హావ్ ఎ స్మూత్ రైడ్..ఇలా రకరకాల కామెంట్ల వెల్లువ హోరెత్తుతోంది. అయితే దీనిపై అటు నిపుణుల నుంచిగానీ.. ఇటు డాక్టర్ల వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. -
హల్ చల్ చేస్తున్న ఐశ్వర్య, ఆరాధ్యల ఫోటో
నటుడు అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ఫ్యాన్ క్లబ్ పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన ముద్దుల కూతురు ఆరాధ్యను ఒడిలో కూర్చోపెట్టుకొని ఉంది. తన నాలుగేళ్ల కూతురుకు ఐష్ ఆప్యాయంగా ముద్దుపెడుతున్న ఈ ఫోటో చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా ఇటీవల తల్లి ఐష్ కోసం ఆరాధ్య చేసిన ఓ సంఘటనను కూడా సోషల్ మీడియాలో గుర్తు తెచ్చుకుంటున్నారు. 'సరబ్జిత్' షూటింగ్లో బిజీగా ఉంటున్న ఐశ్వర్య కాస్త అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం, గొంతు నొప్పితో ఆమె బాధపడుతుండటంతో సరబ్జిత్ షూటింగ్‌కు ఓ వారం రోజులు విరామం ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఐశ్వర్య ప్రతిరోజూ ఆరాధ్య స్కూలు వదిలే సమయానికి వెళ్లి తనను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లేవారు. తల్లి ఆరోగ్యాన్ని రెండు రోజులుగా గమనిస్తున్న ఆరాధ్య స్కూల్లో విరామ సమయంలో 'గెట్ వెల్ సూన్' కార్డు తయారు చేసిందట. ఎప్పటిలానే సాయంత్రం అమ్మ స్కూల్ గేట్ వద్దకు రాగానే తన చిట్టి చిట్టి చేతులతో తయారుచేసిన 'గెట్ వెల్ సూన్' కార్డును అమ్మకిచ్చిందట. అంతే ఐశ్వర్య ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. పిల్లలను తీసుకెళ్లడానికి స్కూల్ వద్దకు చేరుకున్న ఇతర తల్లిదండ్రులు కూడా ఆరాధ్య ఆలోచనకు తెగ ముచ్చటపడ్డారు. ఆరాధ్య విషయంలో నేను చాలా అదృష్టవంతురాలినంటూ మురిసిపోతుంది ఐశ్వర్య. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ ఫొటో మార్ఫింగ్, ఇద్దరి అరెస్ట్
కార్గాన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఫోటోను మార్ఫింగ్ చేసిన ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ భగవత్ ఫోటోను అభ్యంతరకంగా మార్పులు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం, ఆ ఫోటో సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేయడం మధ్యప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. 22 ఏళ్ళ షాఖిర్, 20 ఏళ్ళ వసీమ్ అనే యువకులు మోహన్ భగవత్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి భికన్ గోన్ పట్టణంలోని స్థానిక సోషల్ నెట్ వర్కింగ్ గ్రూప్‌లో పోస్టు చేశారు. కాగా ఆ ఫొటోను మార్చి 16న పోస్టు చేసినట్లు గుర్తించామని, వారిద్దరినీ అరెస్టు చేసినట్లు ఏఎస్పీ అంతర్ సింగ్ కనేష్ వెల్లడించారు. మరోవైపు మోహన్ భగత్ మార్ఫింగ్ ఫొటోపై ఆర్ఎస్ఎస్, బిజెపి కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరికీ వ్యతిరేకంగా ఐటీ చట్టం సెక్షన్ 67, భారత శిక్షాస్మృతి 505 (2) సెక్షన్లకింద భికాన్ గాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. కోర్టు వారిద్దర్ని ఈనెల 30 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే నిందితులు మాత్రం తమకు ఆ ఫొటో మరో గ్రూప్ నుంచి వచ్చిందని, కేవలం దాన్ని తాము పోస్టు చేసినట్లు చెప్తున్నారని ఏఎస్పీ పేర్కొన్నారు. -
పచ్చబొట్టేసిన అభిమానం
అమ్మపై అభిమానాన్ని మరోసారి ప్రదర్శించారు తమిళనాడు వాసులు. అన్నాడీఎంకే అధినేత్రి... తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 68వ పుట్టినరోజు తమకు చిరకాలం గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో సుమారు వెయ్యిమంది తమ చేతులపై ఆమె చిత్రాన్ని, 'అమ్మ' అనే పేరును పచ్చబొట్టు పొడిపించుకొని ప్రత్యేకాభిమానం చాటారు. జయలలిత పుట్టినరోజు వారోత్సవాలు మంగళవారం మొదలైన సంగతి తెలిసిందే. ఉత్సవాల్లో భాగంగా ప్రజలు ఆమెపై ప్రత్యేక అభిమానం చూపించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా వేలచ్చేరి ఎమ్మెల్యే అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సహా వేలమంది జనం క్యూకట్టి మరీ తమ చేతులపై టాటూలు వేయించుకున్నారు. అమ్మకు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలంటే ఇదో మంచి అవకాశం అని, అందులో భాగంగా వచ్చిన ఆలోచనే పచ్చబొట్టు కార్యక్రమానికి నాంది పలికిందని అశోక్ తెలిపారు. సుమారు 600 మంది కార్యక్రమంలో పాల్గొంటారని భావించామని, అయితే వేలకొద్దీ జనంతోపాటు సీనియర్ మంత్రి పన్నీర్ సెల్వం కూడా వచ్చి అమ్మ టాటూ వేయించుకునేందుకు ఆసక్తి చూపించడం ఆనందం కలిగించిందన్నారు. వలంటీర్లు కూడా స్వచ్ఛందంగా తమ చేతులపై తమిళంలో అమ్మ అని, జయలలిత చిత్రాలను.. పచ్చబొట్టుగా వేసుకున్నారని అశోక్ తెలిపారు. -
విద్యా బాలన్ రాయని డైరీ
పిక్చర్ పోయింది. నో రిగ్రెట్స్. నాకు బాగుంది. ఎయిటీస్‌లో రావలసిన మూవీ అన్నారు. నిరూపారాయ్ అండ్ హర్ స్టైల్ ఆఫ్ సినిమా అన్నారు. వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ మనీ అన్నారు. ఎన్ని అననివ్వండి, వేస్ట్ ఆఫ్ లవ్ అనగలమా?! అసలు లవ్ లేకనే కదా.. జీవితంలో ఇంతింత వేస్టేజీ. డర్టీ పిక్చర్ ఒక టేస్ట్. కహానీ ఒక టేస్ట్. హమారీ అధూరి కహానీ.. అదీ ఒక టేస్ట్. అన్ఫినిష్డ్ మౌన రాగం! ‘ష్.. అబ్బా.. భరించలేం’ అనుకుంటూ థియేటర్ బయటికి వచ్చి గుండె నిండా గాలి పీల్చుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. లోపలే ఉండిపోయినవాళ్లని తలచుకుంటూ ‘అంత ఉబ్బ రింపులో ఎలా కూర్చున్నారబ్బా’ అని ఆశ్చర్యపోవడం మాత్రం ఇన్సెన్సిబుల్. లేచి వెళ్లిపోయే హక్కు ఉన్నట్లే.. కూర్చుని ఉండిపోయే హక్కు. ఉదయం అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకుంటున్నాను. ‘చీరలో నువ్వు భలే ఉంటావోయ్’ అన్నారు సిద్ధార్థ వెనగ్గా వచ్చి. ఆయనకే కాదు, చీరలో నాక్కూడా నేను భలే ఉంటాను. ఐ వాజ్ బార్న్ టు వేర్ ఎ శారీ. చీర నాకు ఒంటికి చుట్టుకున్నట్టు ఉండదు. మనసుకు కట్టుకున్నట్టు ఉంటుంది. ‘కానీ విద్యా.. చీరలో మీరు ఔట్డేటెడ్గా కనిపిస్తున్నారేమో ఎప్పుడైనా ఆలోచించారా..’ అని ఫంక్షన్స్‌కి వెళ్లినప్పుడు ఒకరిద్దరైనా అంటుంటారు. చీర లెస్ మోడర్న్ అని, లెస్ గ్లామరస్ అని, ఎప్పుడూ ఇలా చీర కట్టుకుని కనిపిస్తే గ్లామర్ రోల్స్ రావని వారి ఉద్దేశం కావచ్చు. చిన్నగా నవ్వుతాను. ‘చీరలో మీరు సూపర్‌గా ఉన్నారండీ’ అంటారు ఇంకెవరో అటువైపుగా వెళుతూ. నాకు తెలుసు అది నా చిరునవ్వు అందం కాదు. నా చీర అందం. నా చిరునవ్వుకి నా చీర తెచ్చిపెట్టిన అందం. స్క్రీన్ మీద చీర ఎప్పుడు ఔట్‌డేట్ అయిందో నాకు తెలీదు. స్త్రీని ఎప్పటికీ అప్డేట్గా ఉంచేది మాత్రం చీరొక్కటే. ఇంకో డ్రెస్‌కు ఆ శక్తి లేదు. మనుషుల జడ్జ్మెంట్స్ ఒకోసారి చాలా క్రూయల్‌గా ఉంటాయి. ఎలా ఉన్నా, ఎలా లేకున్నా ఏదో ఒకటి అనేస్తారు. సినిమాల్నైనా అంతే, మనుషుల్నైనా అంతే. ఆడవాళ్లనైతే వాళ్ల అప్పియరెన్స్‌తో జడ్జ్చేసి పారేస్తారు. అక్కడ బాగోలేదని, ఇక్కడ బాగోలేదనీ, ఇలా ఉంటే బాగుండేదని, అలా లేకుంటే బాగుండేదనీ. తిండి లేక చచ్చిపోయినట్టు... గ్లామర్ కోసం సమాజం పడి చచ్చిపోతున్నట్టుగా ఉంటాయి వీళ్ల మాటలు! అందానికి డెఫినిషన్స్ ఏమిటి? డెకరేషన్స్ ఏమిటి? ఎవరు ఎలా ఉంటే అదే అచ్చమైన అందం. అచ్చమైన దాన్ని ‘అందం’గా సొసైటీ యాక్సెప్ట్ చెయ్యలేకపోవచ్చు. వదిలేయడమే. షేక్స్పియర్ టు రోబీ ఠాగోర్... ఎంతమంది ఎన్ని రాయలేదూ! వాళ్లెంత పువ్వుల్లాంటి కల్పనలు అల్లినా... రియాలిటీనే కదా ఆ సొగసైన అల్లికలను పట్టి ఉంచేది. రియాలిటీలో అందం ఉంది. రియాలిటినీ అంగీకరించడంలోనూ అందం ఉంది. మాధవ్ శింగరాజు -
ఫేస్బుక్లో సర్వేపల్లి అరుదైన చిత్రం
కొత్తపేట: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భం గా సర్వేపల్లి రాధాకృష్ణన్ అరుదైన చిత్రాన్ని శుక్రవారం ఫేస్బుక్లో పెట్టినట్లు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన అద్దంకి బుద్ధచంద్రదేవ్(ఏబీసీ దేవ్) తెలిపారు. ప్రి యదర్శినీ బాలవిహార్ వ్యవస్థాపకుడు అద్దం కి కేశవరావు ఎన్నో అరుదైన చిత్రాలు, గ్రంథా లను సేకరించి తన లైబ్రరీలో భద్రపరిచారు. వాటిల్లో 1962లో రాధాకృష్ణన్ శాలువా కప్పుకుని కుర్చీలో కూర్చున్న ఒరిజినల్ ఫొటోను ఫేస్బుక్ ఫాలోవర్ల కోసం పోస్టు చేసినట్టు కేశవరావు తనయుడు ప్రియదర్శినీ బాలవిహార్ సెక్రటరీ, కరస్పాండెంట్ దేవ్ తెలిపారు.