యంగ్‌ లుక్‌లో అదిరిపోయిన మాధవన్‌ | Hero Madhavan Shares Throwback Picture With Wife Saritha | Sakshi
Sakshi News home page

నెటిజన్ల మనసు దోచుకుంటున్న మాధవన్‌ యంగ్‌ లుక్‌

Mar 18 2020 4:08 PM | Updated on Mar 18 2020 4:23 PM

Hero Madhavan Shares Throwback Picture With Wife Saritha - Sakshi

తమిళం, హిందీ, తెలుగు సినిమాల్లో నటించిన హీరో మాధవన్‌ అభిమానుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తన సినిమా అప్‌డేట్స్‌తోపాటు కుటుంబానికి సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే మాధవన్‌ అప్పుడ‌ప్పుడు పాత‌కాలం నాటి ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను సర్‌ఫ్రైజ్‌ చేస్తుంటారు. తాజాగా అలాంటి మరో ఫోటోనే అభిమానులతో పంచుకున్నారు. గతంలో భార్య సరితా బిర్జితో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇద్దరూ చాలా యంగ్‌ లుక్‌లో కనిపిస్తున్న ఈ ఫోటో నెటిజన్ల మనుసు దోచుకుంటుంది. ‘క్యూట్‌ కపూల్‌, అందంగా ఉన్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. (మాధవన్‌ ఆనందం.. తనయుడి గెలుపు)

కాగా ఎనిమిదేళ్ల రిలేషన్‌షిప్‌ అనంతరం 1999లో మాధవన్‌, సరితా వివాహం చేసుకున్నారు. వీరికి 14 ఏళ్ల కుమారుడు వేదాంత్‌ ఉన్నాడు. ఇక అనుష్య ముఖ్య పాత్రలో వస్తున్న ‘నిశ్శబ్దం’లో మాధవన్‌ ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అలాగే భారతీయ ఇస్రో మాజీ శాస్త్రవేత్త, ఏరోస్పేస్ ఇంజనీర్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న రాకెట్రీ చిత్రంలోనూ మాధవన్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో నంబి నారాయణ్‌ పాత్రతో పాటు సినిమాకు డైరెక్టర్‌, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. (చిత్రం పేరు మాత్రమే నిశ్శబ్దం..)

5000 years ago ... 🙈🙈🤪🤪😄😄

A post shared by R. Madhavan (@actormaddy) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement