R Madhavan
-
అప్పట్లో నేను చాక్లెట్ బాయ్.. నా భార్య భయపడిపోయేది: హీరో
హీరోలను పిచ్చిగా ప్రేమించే అభిమానులెందరో! అయితే వారిలో లేడీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అది చూసి తన భార్య తెగ భయపడేదంటున్నాడు హీరో మాధవన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను యాక్టర్ అవుతానంటే నా భార్య సరిత ఎంతో భయపడిపోయింది. కెరీర్ ప్రారంభంలో నన్ను చాక్లెట్ బాయ్ అని పిలిచేవారు. లేడీ ఫ్యాన్స్ ఎక్కువుండేవారు.నా పేరెంట్స్‌ను అడిగాఅది చూసి నా భార్య అభద్రతాభావానికి లోనయ్యేది. అప్పుడు నేను నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి మీ బంధాన్ని ఏళ్లతరబడి సంతోషంగా కొనసాగించడానికి కారణమేంటన్నాను. అందుకు వాళ్లు.. మేము మా జీవితాన్ని కలిసి కొనసాగించాలనుకున్నాం. అలాంటప్పుడు ఏదో జరిగిపోతుందని ఎందుకు భయపడటం? అని బదులిచ్చారు.జాయింట్ అకౌంట్ తీసుకున్నాంఅంతా మంచే జరుగుతుందన్న పాజిటివ్ ఆలోచనతో ఉండేవారు. పైగా అమ్మానాన్న ఇద్దరికీ జాయింట్ అకౌంట్ ఉంది. నేను కూడా అదే ఫాలో అయ్యాను. సరిత, నేను కలిసి జాయింట్ అకౌంట్ తీసుకున్నాం. దీనివల్ల.. నేనేదో తప్పు చేస్తున్నాను, ఎవరికోసమో ఏదో ఖర్చు పెడుతున్నానన్న భయం ఆమెకు ఉండదు. నాపై నమ్మకం మరింత బలపడుతుంది. మేము కొన్న ఆస్తులు, కార్లు కూడా ఇద్దరి పేర్లపై ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. కాగా ఆర్ మాధవన్, సరిత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు. -
మొక్కని దేవుడు లేడు.. మనోవేదనకు గురయ్యా..: మాధవన్
ఎన్నో అనుకుంటాం.. కానీ కొన్నే జరుగుతాయి. సినీతారలు కూడా తము నటించే ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలని తాపత్రయపడతారు. కానీ అన్నీ హిట్లు కావు, కొన్నే విజయాన్ని అందుకుంటాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా అనుకున్నంత ఆడకపోతే ఆ బాధ వర్ణణాతీతం. తనకూ ఇలాంటి పరిస్థితి ఎదురైందంటున్నాడు హీరో మాధవన్.రెండున్నర దశాబ్దాలకు రీరిలీజ్గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో మాధవన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన ఐకానిక్ మూవీ 'రెహనా హై తేరే దిల్ మే' జ్ఞాపకాలను పంచుకున్నాడు. ఈ మూవీ రిలీజై 25 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ ఏడాది ఆగస్టులో రీరిలీజ్ చేశారు.మనోవేదనకు లోనయ్యా..సినిమా సంగతులను గుర్తు చేసుకుంటూ.. సినిమా రిలీజవగానే పెద్ద స్పందన లభించలేదు. ఫ్లాప్ అవడంతో నా మనసు ముక్కలైంది. ఈ చిత్ర విజయం కోసం నేను మొక్కని దేవుడు లేడు, ఎక్కని గుడిమెట్లు లేవు. అయినా కూడా సక్సెస్ కావడంతో మనోవేదనకు లోనయ్యా.. తలరాతలో రాసిపెట్టుండాలని, అలాగే అదృష్టం కూడా కలిసిరావాలని తెలుసుకున్నాను. రెహనా హై తేరీ దిల్ మే మూవీ విశేషాలుపాతికేళ్ల తర్వాత అదే మూవీ మళ్లీ రిలీజవడం, అప్పటికంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం మాత్రం ఎంతో సంతోషాన్నిచ్చింది అన్నాడు. రెహనా హై తేరీ దిల్ మే మూవీ 2001లో విడుదలైంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన మిన్నాలే అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రంతోనే హీరో మాధవన్, హీరోయిన్ దియా మీర్జా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించాడు.చదవండి: అవార్డ్ విన్నింగ్ సినిమా.. నెట్టింట లీకైన ఇంటిమేట్ సీన్స్ -
హీరో భార్యనని చెప్పారు.. అంతా అతని వల్లే: నటి
మలయాళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కావ్య. తనదైన నటనతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే నటిగా ఎంత ఫేమస్ అయిందో.. అంతే వేగంగా రూమర్స్‌తో వార్తల్లోనూ నిలిచింది. తాను ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు స్టార్ హీరోను పెళ్లి చేసుకున్నానంటూ ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది. తాను తమిళ నటుడు మాధవన్ భార్యనని ప్రచారం జరిగిందని తెలిపింది. కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ అవార్డు వేదికలో నటుడు మాధవన్‌తో కలిసి ఈ విషయాన్ని వెల్లడించింది. కావ్య మాధవన్ మాట్లాడూతూ..'హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన టైంలో ఓ సినిమా షూటింగ్ కోసం ఊటీ వెళ్లా. నా అసలు పేరు కావ్య మాధవన్. అక్కడి ప్రజలకు నేనంతగా తెలియదు. కానీ నేను మొదటిసారిగా తమిళనాడుకు వచ్చా. అయినా అక్కడ ప్రజలు నన్ను అదేపనిగా చూస్తూనే ఉన్నారు. నన్ను చూసేందుకు ఇంతమంది ఎందుకు వస్తున్నారో నాకు మొదట్లో అర్థం కాలేదు. దానికి కారణం ఆ సినిమా హీరో జయసూర్యనే. తాను మాధవన్ భార్యనని అక్కడున్న వారందరికీ అతనే చెప్పాడంటా. దీంతో అందరూ నన్ను చూసేందుకు తరలివచ్చారని' తెలిపింది. తనపేరులో మాధవన్ అని ఉండడంతో అందరూ నిజంగానే ఆయన భార్యనే అనుకున్నారని కావ్య వెల్లడించింది. -
విలాసవంతమైన ఫ్లాట్ కొన్న నటుడు.. ఎన్ని కోట్లంటే?
ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ముంబయిలోని బాంద్రా కుర్లా ప్రాంతంలో ఉండే విలాసవంతమైన ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నారు. ఈ లగ్జరీ ఫ్లాట్ విలువ దాదాపు రూ.17.5 కోట్లతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. జూలై 22న ఖరారు ఈ ఆస్తిని తనపేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మాధవన్ కొన్న అత్యాధునిక సౌకర్యాలు, ఇండోర్ ప్లే ఏరియా లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.కాగా.. ఆర్ మాధవన్ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ప్రస్తుతం శశికాంత్ డైరెక్షన్లో టెస్ట్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో నయనతార, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటు గోపాలస్వామి దొరైస్వామినాయుడు బయోపిక్‌లో కనిపించనున్నారు. అంతే కాకుండా శంకరన్ నాయర్ బయోపిక్‌లో అతిథి పాత్ర, సైన్స్-ఫిక్షన్ చిత్రం జీలో కీ రోల్ పోషిస్తున్నారు. -
నేను కోట్ల కొద్దీ డబ్బులు గుమ్మరించింది దానికే!: హీరో
హీరో ఆర్ మాధవన్ ఎక్కువ డబ్బు పెట్టి కొన్నదేంటో తెలుసా? యాచ్.. అదేంటనుకుంటున్నారా? ఇదొక భారీ పడవలాంటిది. ఇందులోపల ఇంటి మాదిరిగా అన్నిరకాల వసుతులు కూడా ఉంటాయి. దీని గురించి మాధవన్ మాట్లాడుతూ.. నేను చాలా డబ్బులు ఖర్చు చేసింది నా ఇంటి కోసమే! చాలా ఖరీదైన ఇంటిని నేను కొనుగోలు చేశాను. నిజానికి ముగ్గురే ఉండే ఇంటికి అంత పెద్ద ఇల్లు అవసరమే లేదనుకోండి. ఇల్లును పక్కన పెడితే అదే రేంజ్లో ఖర్చు చేసి కొన్నదేదైనా ఉందా? అంటే అది యాచ్(పెద్ద పడవలాంటిది). లైసెన్స్ దొరికింది ఓడ కొనాలంటే కెప్టెన్ లైసెన్స్ కావాలి. ఆ లైసెన్స్ సంపాదించాలని ఎప్పటినుంచో అనుకున్నాను. కరోనా సమయంలో చేయడానికి పనేం లేదు కాబట్టి పరీక్ష రాశాను. పాసయ్యాను, లైసెన్స్ పొందాను. ఇందుకు ఆరునెలలు పట్టింది. ఇప్పుడు నేను 40 అడుగుల ఎత్తైన యాచ్ లేదా పడవను నేను ఈజీగా డీల్ చేయగలను. దానికోసమే యాచ్‌ను కొన్నాను.. అందులో ప్రయాణిస్తుంటే భలే మజా వస్తుంది. నేను అందులో కూర్చుని కథలు రాసుకుంటాను. బోలెడన్ని కథలు రాస్తూ.. అవసరమైనప్పుడు బయటకు వెళ్లి సముద్రాన్ని చూస్తాను. నాకు కావాలనుకున్నప్పుడు ఎక్కడో ఓ చోట పార్క్ చేసి డాల్ఫిన్స్ ఎగురుతూ ఉంటే చూసి ఆనందిస్తాను. అలా సముద్రాన్ని చూసి బోలెడన్ని కథలు రాసుకుంటాను. నా జీవితంలో ఈ పడవ కొనడమే నేను తీసుకున్న గొప్ప నిర్ణయం. ప్రస్తుతం దాన్ని దుబాయ్‌లో ఉంచాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే 30 -40 అడుగుల ఎత్తైన యాచ్ కొనాలంటే దాదాపు ఐదు లక్షల డాలర్స్ నుంచి రెండు మిలియన్ల డాలర్స్ (భారత కరెన్సీలో నాలుగున్నర కోట్ల నుంచి పదహారు కోట్ల మేర) అవుతుందని తెలుస్తోంది! చదవండి: 56 ఏళ్ల వయసులో నటుడి డేటింగ్.. విడిపోయామంటూ పోస్ట్.. -
మూడునెలలుగా ట్రెండింగ్‌లో ఉన్న సిరీస్.. ఏదో తెలుసా?
ఏ సినిమా అయినా ఓటీటీలోకి రాగానే కొద్దోగొప్పో గుర్తింపు వస్తుంది. సినిమా బాలేదంటే రెండు, మూడు రోజుల్లోనే దాన్నెవరూ పట్టించుకోరు. అదే బాగుందంటే మాత్రం వెంటనే టాప్ 10లో ట్రెండింగ్ అవుతుంది. అయితే కొత్త సినిమా రాగానే కాస్త వెనకబడిపోతుంది. కానీ ఇక్కడ చెప్పుకునే ఓ వెబ్ సిరీస్ మాత్రం రోజులు, వారాలుగా కాదు ఏకంగా మూడు నెలల నుంచి టాప్ 10లో ట్రెండ్ అవుతోంది. ఏదో మన దేశంలో మాత్రమే అనుకునేరు.. కానే కాదు.. ఏకంగా 36 దేశాల్లో వంద రోజులుగా టాప్ 10లో ట్రెండింగ్ అవుతోంది.. అంతలా క్లిక్ అయిన వెబ్ సిరీస్ మనదే.. ఇంతకీ అదె అనుకుంటున్నారా? ద రైల్వే మ్యాన్. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తయిన భోపాల్ గ్యాస్ లీక్ ఘటన ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. ఆర్ మాధవన్, కేకే మీనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. శివ్ రావలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ గతేడాది నవంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు విపరీత ఆదరణ దక్కడంతో సిరీస్ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ సిరీస్‌కు ఈ రేంజ్లో క్రేజ్ రావడం నిజంగా గ్రేట్ అంటున్నారు వెబ్ వీక్షకులు. చదవండి: చివరి రోజు షూటింగ్.. అమ్మ ఇక లేదంటూ ఫోన్ కాల్.. నిర్మాతకు చెప్తే.. -
సినీ అవార్డులు.. ఉత్తమ నటిగా జ్యోతికకు పురస్కారం
చెన్నై: ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక వర్గాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏటా అవార్డులతో సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కాగా గత కొన్నేళ్లుగా ఈ వేడుకలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో 2015 ఏడాదికి గాను ఉత్తమ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలో ఘనంగా నిర్వహించారు. 2015వ సంవత్సరానికిగానూ.. ఈ వేడుకల్లో తమిళ భాషాభివృద్ధి శాఖ, సమాచార మంత్రి స్వామినాథన్, మంత్రి సుబ్రమణ్యం, మైలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేలు, చైన్నె మహానగరం, ఉప మేయర్ మహేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని అవార్డు గ్రహీతలకు జ్ఞాపికలతో పాటు బంగారు పతకాలను, నగదు బహుమతులను అందించారు. 2015కు గాను ఉత్తమ చిత్రంగా తనీ ఒరువన్, ద్వితీయ ఉత్తమ చిత్రంగా పసంగ –2, తృతీయ ఉత్తమ చిత్రంగా ప్రభాకు అవార్డులు అందించారు. ఉత్తమ నటుడిగా హీరో మాధవన్ అలాగే మహిళల ఔన్నత్యాన్ని పెంపొందించేలా రూపొందిన 36 వయదినిలే చిత్రానికి ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారు. ఇరుది చుట్రు చిత్రానికి గాను హీరో మాధవన్‌కు ఉత్తమ నటుడి అవార్డు, 36 వయదినిలే చిత్రానికి గాను జ్యోతికకు ఉత్తమ నటి అవార్డు, వై రాజా వై చిత్రానికి గాను నటుడు గౌతమ్ కార్తీక్‌కు ప్రత్యేక జూరీ అవార్డు ప్రదానం చేశారు. అలాగే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గాన్ని అవార్డులతో సత్కరించారు. కమిటీ ఏర్పాటు చేశాం.. ఈ సందర్భంగా సమాచార శాఖ మంత్రి స్వామి నాథన్ మాట్లాడుతూ.. 2015వ సంవత్సరానికిగానూ 39 మంది కళాకారులకు ఈ వేదికపై అవార్డులను అందించామన్నారు. ఇకపోతే 2016 నుంచి 2023 వరకు చలన చిత్ర అవార్డుల ఎంపిక కోసం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఎంపికైన కళాకారులకు అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. చదవండి: 'ప్రేమలు' మూవీ రివ్యూ -
ఉత్తమ సినిమా, హీరో.. అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం
రాష్ట్ర చలనచిత్ర అవార్డులను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 2015 చిత్రాలకు గాను ఈ అవార్డులను ఇవ్వనున్నారు. ఉత్తమ నటుడు, నటి, సాంకేతిక విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారిక తమిళనాడు ప్రభుత్వం 2015 ఫిల్మ్ అవార్డులను మార్చి 6న అందించనుంది. ఇందులో 'తని ఒరువన్' చిత్రానికి గాను అత్యధికంగా అవార్డులను సొంతం చేసుకుంది. జయం రవి, అరవింద్ సామీ, నయనతార ప్రధానంగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ హిట్‌ను అందుకుంది. ఉత్తమ చిత్రంగా 'తని ఒరువన్' ఎంపిక అయింది. దీంతో పాటుగా పసంగ 2, ప్రభ, పూతిచ్చుచుటు, 36 వయదిలిలే కూడా ఉత్తమ సినిమాలుగా ఎంపికయ్యాయి. తని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో 'ధృవ'గా రామ్ చరణ్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే.. సూర్య- అమలపాల్ జోడీగా నటించిన పసంగ-2 మూవీ తెలుగులో 'మేము' అనే పేరుతో విడుదలైంది. జ్యోతిక నటించిన 36 వయదిలిలే అనే సినిమా కూడా తెలుగులో '36 వయసు'లో అనే పేరుతో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఉత్తమ నటుడిగా 'ఇరుది సుట్రు' చిత్రానికి గాను నటుడు 'మాధవన్' ఎంపికయ్యారు. ఈ సినిమాను వెంకటేశ్ 'గురు' పేరుతో రీమేక్ చేశారు. 36 వయదిలిలే చిత్రానికి గాను 'జ్యోతిక' ఉత్తమ నటిగా ఎంపికైంది. 'వై రాజా వై' చిత్రానికి గాను గౌతమ్ కార్తీక్‌కు ఉత్తమ నటుడిగా ప్రత్యేక అవార్డు లభించింది. 'ఇరుది చుట్టు' చిత్రానికి గానూ రితికా సింగ్‌కు ఉత్తమ నటిగా ప్రత్యేక అవార్డు లభించింది. ఉత్తమ విలన్‌గా 'తని ఒరువన్'లో నటించిన అరవింద్ సామీకి దక్కగా.. ఉత్తమ కథా రచయితగా 'తని ఒరువన్' చిత్రానికి మోహన్ రాజా ఎంపికయ్యారు. పాపనాశం, ఉత్తమ విలన్ చిత్రాలకు గాను జిబ్రాన్ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు గెలుచుకున్నారు. 'తని ఒరువన్' చిత్రానికి గానూ రామ్‌జీ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ ఎం.జి ఆర్. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు కూడా పలు అవార్డులను ప్రరభుత్వం అందించనుంది. అవార్డుల ప్రధానోత్సవం మార్చి 6వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమం రాజా అన్నామలైపురంలో ఉన్న ముత్తమిలిప్ అసెంబ్లీలో జరుగుతుంది. తమిళనాడు అభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం.యు.సామినాథన్ అధ్యక్షతన ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు గ్రహీతలకు బంగారు పతకాలు, చెక్కు, జ్ఞాపికలు, ఉత్తమ చిత్రాల నిర్మాతలకు సర్టిఫికెట్లు అందజేస్తారు. -
'షైతాన్'ట్రైలర్‌తో మెప్పించిన అజయ్ దేవగన్
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'షైతాన్'. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రాన్ని వికాస్ భల్ దర్శకత్వం వహించారు. మార్చి 8న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో ట్రైలర్ కొనసాగుతుంది. సరదాగా సాగిపోతున్న కబీర్ (అజయ్) కుటుంబంలోకి ఓ అనుకోని అతిథి ప్రవేశిస్తాడు. అపరిచిత (మాధవన్) వ్యక్తిగా వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి చిక్కులు ఎదురయ్యాయి. అతని నుంచి అజయ్ దేవగన్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది అసలు కథ. ఆసక్తికర సన్నివేశాలతో విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. మాధవన్ విలన్‌గా ఈ చిత్రంలో కనిపిస్తాడు. జియో స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, అభిషేక్ పాఠక్ సంయక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గుజరాతికి చెందిన 'వష్' (Vash) సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. -
వేసవిలో మ్యాచ్‌ను ప్లాన్ చేసుకున్న నయనతార
‘ది టెస్ట్’ను పూర్తి చేశారు నయనతార. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సింగర్ శక్తి శ్రీగోపాలన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు, ఈ వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా ఈ సినిమాను గత ఏడాది నవంబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వేసవికి వాయిదా వేశారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
ఆ హీరోయిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా..: ప్రముఖ హీరో
స్టార్ హీరో ఆర్. మాధవన్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేనాటికే హీరోయిన్ జూహీ చావ్లాను పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉండేదని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని అతడి తల్లికి కూడా చెప్పాడట. 1988లో వచ్చిన 'ఖయామత్ సే ఖయామత్ టక్' అనే సినిమా చూశాక ఆమెకు ఫిదా అయిపోయానంటున్నాడు మాధవన్. జూహీ చావ్లా ఆ సినిమా చూసి ఫిదా ప్రస్తుతం ఈ హీరో 'ద రైల్వే మెన్' వెబ్ సిరీస్‌లో నటించాడు. ఇందులో జూహీ చావ్లా కూడా యాక్ట్ చేసింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో మాధవన్ మాట్లాడుతూ.. 'అదృష్టం బాగుండి ఈ సిరీస్‌కు జూహీ చావ్లా ఓకే చెప్పారు. ఇక్కడ మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. 'ఖయామత్ సే ఖయామత్ టక్' సినిమా చూసినప్పుడు అమ్మ.. నేను ఈ హీరోయిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. అప్పుడు నాకున్న ఏకైక లక్ష్యం ఆమెను పెళ్లాడటమే!' అని చెప్పుకొచ్చాడు. కాగా ద రైల్వే మెన్ సిరీస్‌లో ముందుగా మాధవన్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత జూహీ చావ్లాను ఈ సిరీస్‌లో భాగం చేశారు. భార్య సరితాతో మాధవన్ ఇండస్ట్రీకి పరిచయం ఇకపోతే 'ఖయామత్ సే ఖయామత్ టక్' సినిమా 1988లో రిలీజైంది. అప్పటికి మాధవన్ తన కెరీర్ ప్రారంభించనేలేదు. అతడు 1993లో 'బనేగి అప్నీ బాత్' అనే టీవీ షో ద్వారా తొలిసారి స్క్రీన్‌పై కనిపించాడు. బుల్లితెరపై పలు షోలలో పార్టిసిపేట్ చేసిన అనంతరం 1997లో 'ఇన్ఫెర్నో' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. దీనికంటే ముందు ఓ బాలీవుడ్ సినిమాలో ఒక పాటలో క్లబ్ సింగర్‌గా కనిపించాడు. తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళ, కన్నడ భాషల్లో నటించాడు. ఇతడు 1999లో సరితా బిర్జీ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాధవన్ నటించిన పలు సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. చదవండి: తెలుగులో ఆ స్టార్ హీరో టార్చర్ పెట్టాడు.. అతడి వల్లే 20 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరం: నటి -
భోపాల్ గ్యాస్ లీకేజీపై వెబ్ సిరీస్.. ఓటీటీలో ఎప్పుడు? ఎక్కడంటే?
భోపాల్ గ్యాస్ లీక్.. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తు. 1984 డిసెంబర్ 2, 3 తేదీలలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) ప్లాంట్‌లో గ్యాస్ లీకేజీ ప్రమాదం సంభవించింది. మిథైల్ ఐసోసైనైడ్ అనే విషపూరిత రసాయనం విడుదలవడంతో చాలామంది ఊపిరాడక చనిపోయారు, వేలమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ గ్యాస్ లీకేజీ మరో 6 లక్షల మందిపై ప్రభావం చూపించింది. ఈ విషపూరిత రసాయన ప్రభావం కొన్ని తరాల పాటు కనిపించింది. ఈ దుర్ఘటన జరిగి దాదాపు 39 ఏళ్లు కావస్తోంది. ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని ఓ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. అదే 'ద రైల్వే మెన్'. ఆర్ మాధవన్, కేకే మీనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ నాలుగు భాగాలుగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేశారు. భోపాల్ గ్యాస్ లీక్ జరిగినప్పుడు రైల్వే ఉద్యోగులు సహృదయంతో అక్కడి వారికి సాయం చేసేందుకు వెళ్లారు. వందలమంది ప్రాణాలు కాపాడారు. దాన్ని ఈ సిరీస్‌లో చూపించబోతున్నామని డైరెక్టర్ శివ్ రావలి తెలిపాడు. ఈ థ్రిల్లర్ సిరీస్ నవంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: వెంకటేశ్ కూతురి నిశ్చితార్థం.. చిరంజీవి, మహేశ్ బాబు హాజరు -
మాధవన్ పోస్టుకు ప్రధాని మోదీ స్పందన
బెంగళూరు: హీరో మాధవన్ పోస్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కర్ణాటకలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంపై మాధవన్ ప్రశంసలు కురిపించారు. ఇటీవలే అక్కడ ప్రారంభమైన రెండవ టెర్మినల్ పనులను ప్రస్తావించారు. అద్భుతంగా ఉన్నాయంటూ ట్విట్టర్ వేదికగా ఎయిర్‌పోర్టు దృశ్యాలను అభిమానులతో పంచుకున్నారు. 'దేశంలో మౌలిక సదుపాయాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. కెంపెగౌడ అయిర్పోర్టులో ఉన్నాను. నమ్మశక్యం కావడం లేదు. ప్రపంచంలోనే అద్భుతమైన మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయి. ఇందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది' అని మాధవన్ అన్నారు. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు నాలుగు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ పోస్టుపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. 'భారత్ అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు' అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ఎంతో అద్భుతమైనదని మోదీ అన్నారు. ప్రపంచ దేశాల విమానాశ్రయాలకు పోటీగా నిలుస్తుందని అన్నారు. ఇదీ చదవండి: మీడియా ముందు నోరు జాగ్రత్త.. నేతలకు సోనియా హితవు -
8 ఏళ్ల తర్వాత మళ్లీ జత కడుతున్న మాధవన్- కంగనా
హీరో మాధవన్, హీరోయిన్ కంగనా రనౌత్ కాంబినేషన్లో కొత్త చిత్రం రాబోతోంది. అలైప్పాయుదే సినిమా ద్వారా కోలీవుడ్‌కు కథానాయకుడిగా పరిచయమై చాక్లెట్ బాయ్‌గా గుర్తింపు పొందాడు మాధవన్. ఆ తర్వాత అన్ని రకాల పాత్రలు పోషిస్తూ ఆల్ రౌండర్‌గా రాణిస్తున్నాడు. మరోపక్క బాలీవుడ్లో సంచలన నటిగా ముద్ర వేసుకుంది కంగనా రనౌత్. తమిళంలో తలైవి చిత్రంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించి ఆమె ఇక్కడ పాపులర్ అయ్యారు. వీరిద్దరూ బహుభాషా నటులే. దర్శకులుగానూ అవతారం ఎత్తారు. ఇకపోతే మాధవన్, కంగనా రనౌత్ కలిసి 2011లో నటించిన హిందీ చిత్రం తను వెడ్స్ మను మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఇదే జంట మళ్లీ దానికి సీక్వెల్లో నటించింది. సుమారు 8 ఏళ్ల తర్వాత ఈ జంట ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నట్లు తాజా సమాచారం. అయితే ఈ సారి ఈ జంట నటింబోతోంది తమిళ చిత్రంలో కావడం విశేషం. ఈ చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థ అధినేత రవీంద్రన్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా అయోద్ది చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి పనిచేసే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: ఐటం పాప బాగా రిచ్.. నైట్ డ్రెస్కే రూ.90,000 -
జోస్ అలుకాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మాధవన్
ముంబై: ఆభరణాల విక్రయ సంస్థ జోస్ అలుకాస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా జాతీయ నటుడు ఆర్ మాధవన్‌ను నియమించుకుంది. ఇప్పటికే ఈ బ్రాండ్‌కు ప్రముఖ నటి కీర్తి సురేశ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇరు నటులు అంగీకార పత్రంపై సంతకాలు చేశారు. దేశ సినిమా రంగంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తులు సంస్థ ప్రకటనల్లో నటించి తమ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువ చేస్తారని గ్రూప్ చైర్మన్ జోస్ అలుకాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపార రంగంలో నిజాయితీకి మారుపేరుగా నిలిచిన బ్రాండ్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని మాధవన్ అన్నారు. ఆధునిక ప్రపంచంలో ఆభరణాల పట్ల పెరుగుతున్న మహిళల అభిరుచులను జోస్ అలుకాస్ తీర్చిందని నటి కీర్తి సురేష్ తెలిపారు. ఇదీ చదవండి: UPI Charges: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. ఎన్పీసీఐ వివరణ -
ఆమిర్‌ను ట్రోల్ చేసిన టీమిండియా క్రికెటర్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఇతర క్రికెటర్లు బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్‌ను ట్రోల్ చేయడం ఆసక్తి కలిగించింది. 2009లో రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, ఆర్. మాధవన్, శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన త్రీ ఇడియట్స్(3 Idiots) సినిమా గుర్తుందిగా. భారతీయ విద్యావ్యవస్థపై సెటైర్లు, ర్యాంకుల పేర్లతో విద్యార్థులు సంఘర్షణకు గురవ్వడం లాంటివి చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో. ఇండియన్ బ్లాక్బాస్టర్గా నిలిచిన 'త్రీ ఇడియట్స్' సినిమా అప్పట్లో ఒక సంచలనం. 2016లో ఆమిర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ 'త్రీ ఇడియట్స్'కు సీక్వెల్ ఉంటుందని.. రాజ్‌కుమార్ హిరానీ నాకు చిన్న హింట్ ఇచ్చారని పేర్కొన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చిత్రం పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ఆమిర్, మాధవన్, శర్మన్ జోషిలు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకే వేదికను పంచుకోవడం ఆసక్తి రేపింది. త్రీ ఇడియట్స్‌కు సీక్వెల్ ఉంటుందని చెప్పడానికే ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకున్నారు అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు. కానీ వారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ తాము క్రికెట్ ఆడబోతున్నట్లు ఆమిర్ పేర్కొన్నాడు. పనిలో పనిగా టీమిండియా క్రికెటర్ల ఆటతీరును తప్పుబడుతూ ట్రోల్ చేశారు. తాము క్రికెట్లోకి ఎంటర్ ఇస్తున్నామని.. ఎందుకంటే క్రికెటర్లు మా బిజినెస్(అడ్వర్టైజ్మెంట్)లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి అంటూ ఆమిర్ పేర్కొన్నాడు. అయితే ఇదంతా కేవలం ఫన్నీ కోసమే. మార్చి 31న ప్రారంభం కానున్న ఐపీఎల్ 16వ సీజన్‌కు సంబంధించి ఒక ప్రమోషన్ వీడియోను షూట్ చేశాడు. డ్రీమ్ ఎలెవెన్, ఐపీఎల్ కోసం ఈ వీడియోను షూట్ చేశారు. మేం యాక్టింగ్‌లో బిజీగా ఉన్నప్పటికి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాం అని ఆమిర్, మాధవన్, శర్మన్‌లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోనూ చూసిన టీమిండియా క్రికెటర్లు ఆమిర్ ఖాన్‌ను ఫన్నీగా ట్రోల్ చేశారు. రోహిత్ శర్మ స్పందిస్తూ.. ''సినిమాలో క్రికెట్ ఆడినంత మాత్రానా క్రికెటర్ అయిపోడు''.. ''ఒక హిట్ సినిమాకు రెండేళ్లు తీసుకుంటే హిట్‌మ్యాన్‌లు అయిపోలేరు'' అంటూ ట్రోల్ చేశాడు. ''మాటలు చెప్పడం ఈజీ.. ఆడడం కష్టం.. ఎప్పుడు తెలుసుకుంటావు ఆమిర్ జీ'' అంటూ అశ్విన్ ఫన్నీ కామెంట్ చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. ''ఒక్క బౌన్సర్‌తో మీ ముగ్గురు గ్రౌండ్‌లోనే కుప్పకూలడం ఖాయం'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. #3Idiots ka Press Conference... Cricket Pe?!?! This #Cricket season, #SabKhelenge! . . .#Dream11 @ImRo45 @hardikpandya7 @ashwinravi99 @TheSharmanJoshi pic.twitter.com/r0NSoz8IOj — Dream11 (@Dream11) March 25, 2023 చదవండి: ఒక్కడికి సీరియస్‌నెస్ లేదు; థర్డ్ అంపైర్‌కు మెంటల్ ఎక్కించారు -
5 స్వర్ణాలు సహా మొత్తం 7 పతకాలు సాధించిన నటుడు మాధవన్ తనయుడు
Khelo India Games 2023: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆర్ మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. అతని కుమారుడు, భారత అప్ కమింగ్ స్విమ్మర్ వేదాంత్ మాధవన్ ఖేలో ఇండియా గేమ్స్-2023లో పతకాల వర్షం కురిపించాడు. ఈ పోటీల్లో మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగిన వేదాంత్.. 5 స్వర్ణ పతాకలు, 2 రజత పతకాలు సహా మొత్తం 7 పతకాలను కైవసం చేసుకున్నాడు. VERY grateful & humbled by the performances of @fernandes_apeksha ( 6 golds,1 silver,PB $ records)& @VedaantMadhavan (5golds &2 silver).Thank you @ansadxb & Pradeep sir for the unwavering efforts & @ChouhanShivraj & @ianuragthakur for the brilliant #KheloIndiaInMP. So proud pic.twitter.com/ZIz4XAeuwN — Ranganathan Madhavan (@ActorMadhavan) February 12, 2023 100, 200, 1500 మీటర్ల రేసులో స్వర్ణ పతకాలు సాధించిన వేదాంత్.. 400, 800 మీట్లర రేసులో రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. వేదాంత్ కొలనులో బంగారు చేపలా రెచ్చిపోయి పతకాలు సాధించడంతో అతను ప్రాతినిధ్యం వహించిన మహారాష్ట్ర మొత్తంగా 161 పతకాలు (56 స్వర్ణాలు, 55 రజతాలు, 50 కాంస్యాలు) సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. బాలుర విభాగంలో కూడా అత్యధిక పతకాలు సాధించిన మహారాష్ట్ర టీమ్ మరో ట్రోఫీని సాధించింది. With gods grace -Gold in 100m, 200m and 1500m and silver in 400m and 800m . 🙏🙏🙏👍👍 pic.twitter.com/DRAFqgZo9O — Ranganathan Madhavan (@ActorMadhavan) February 12, 2023 కొడుకు వేదాంత్ ప్రదర్శనతో ఉబ్బితబ్బిబైపోతున్న మాధవన్.. అతనికి, మహారాష్ట్ర టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పలు ట్వీట్లు చేశాడు. వేదాంత్, ఫెర్నాండెస్ అపేక్ష (6 గోల్డ్, 1 సిల్వర్) ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. వీరి ప్రదర్శన వెనుక తిరుగలేని కృషి చేసిన కోచ్ ప్రదీప్ సర్, చౌహాన్ శివ్‌రాజ్‌లకు ధన్యవాదాలు. ఖేలో ఇండియా గేమ్స్‌ను ఘనంగా నిర్వహించిన కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ గారికి కృతజ్ఞతలు అంటూ తొలి ట్వీట్ చేశాడు. CONGRATULATIONS team Maharashtra for the 2 trophy’s .. 1 for boys team Maharashtra in swimming & 2nd THE OVERALL Championship Trophy for Maharashtra in entire khelo games. pic.twitter.com/rn28piOAxY — Ranganathan Madhavan (@ActorMadhavan) February 12, 2023 ఆ తర్వాత ట్వీట్లో మాధవన్ తన కుమారుడు సాధించిన పతకాల వివరాలను పొందుపరిచాడు. మరో ట్వీట్లో టీమ్ మహారాష్ట్ర, ఆ రాష్ట్ర బాయ్స్ టీమ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ఇటీవల కాలంలో కొలనులో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న వేదాంత్ దుబాయ్‌లో ఒలింపిక్స్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. వేదాంత్ కోసం మాధవన్ తన ఫ్యామిలీ మొత్తాన్ని దుబాయ్‌కు షిఫ్ట్ చేశాడు. కాగా, గతేడాది డానిష్ ఓపెన్‌లో బంగారు పతకం గెలవడం ద్వారా వేదాంత్ తొలిసారి వార్తల్లోకెక్కాడు. -
ఆ హీరోతో తొలిసారి కలిసి నటించనున్న నయనతార
తమిళసినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు ప్రచారం తెరపైకి వచ్చింది. ఈమె నటిగానే కాకుండా, ప్రేమలోనూ, బ్రేకప్స్‌లోనూ, సహజీవనంలోనూ, పెళ్లి విషయంలోనూ, చివరికి తల్లి కావడంలోనూ సంచలనమే. అసలు వీటన్నింటినీ గమనిస్తే.. నయనతార ముందు పుట్టి ఆ తర్వాత సంచలనం అనే పదం పుట్టిందేమో అనిపిస్తోంది. మొదట్లో గ్లామర్‌తో తన సినీ పయనాన్ని పదిలం చేసుకున్న ఈమె ఆ తర్వాత నటనతో అందలం ఎక్కిందని చెప్పవచ్చు. ప్రస్తుతం లేడీ సపర్ స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ కథల్లోనే నటిస్తోంది. మధ్య మధ్యలో హీరోలతోన జతకడుతూ ఆ వర్గం ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. ఆ మధ్య తెలుగులో చిరంజీవితో కలిసి నటించిన గాడ్ ఫాదర్ ఈమెకు మంచి పేరే తెచ్చిపెట్టింది. కాగా నయనతార సెంట్రిక్ పాత్రలో నటించిన కనెక్ట్, అలాగే జయంరవితో జత కట్టిన ఇరైవన్ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం తొలి బాలీవుడ్ చిత్రం జవాన్‌లో నటిస్తున్నారు. షారుక్ ఖాన్ కథానాయకుడు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షటింగ్ తుది దశకు చేరుకుంది. దీంతో ఈమె మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. శశికాంత్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నటుడు వధవన్కు జంటగా నటించడానికి నయనతార ఓకే చెప్పినట్లు సమాచారం. ఇందులో నటుడు సిద్ధార్థ్ కూడా ముఖ్య పాత్రను పోషించనున్నట్లు తెలిసింది.. అయితే ఈ చిత్రానికి సంబంధింన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. -
రాకెట్రీ సినిమా కోసం హీరో మాధవన్ ఇల్లు అమ్మేశాడా?
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్. హీరో ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ సినిమా అందరికీ చేరువవ్వాలని ఎంతగానో తాపత్రయపడ్డాడు మ్యాడీ. అనుకున్నట్లే అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో విజయవంతంగా దూసుకుపోయి చిత్రయూనిట్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. అయితే మాధవన్ రాకెట్రీ సినిమా బడ్జెట్ కోసం నిధులు సేకరించే క్రమంలో తన ఇంటినే అమ్మేశాడంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. నిజానికి రాకెట్రీ సినిమాకు తొలుత మాధవన్ దర్శకుడు కాదని, ఓ ప్రముఖ డైరెక్టర్ ఈ సినిమాను చేయాల్సి ఉండగా అప్పటికే చేతిలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో రాకెట్రీ నుంచి తప్పుకున్నాడని, దీంతో మ్యాడీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడరి సదరు కథనం పేర్కొంది. మరోవైపు అతడి కొడుకు వేదాంత్ స్విమ్మింగ్‌లో దేశం తరపున పాల్గొని బంగారు పతకాలు సాధించాడంటూ మ్యాడీ కుటుంబాన్ని కీర్తించింది. తాజాగా దీనిపై హీరో మాధవన్ స్పందించాడు.. 'ఓరి దేవుడా.. నేనేదో గొప్ప త్యాగం చేశానని మీరు నన్ను ఆకాశానికి ఎత్తేయొద్దు. ఎందుకంటే నేను నా ఇల్లే కాదు, దేన్నీ కోల్పోలేదు. దేవుడి దయ వల్ల రాకెట్రీ సినిమాలో పాలుపంచుకున్న అందరూ ఈ ఏడాది ఎక్కువ ఆదాయపన్ను చెల్లించనున్నారు. అంత గొప్పగా, గర్వించదగ్గ లాభాలు వచ్చాయి. నేను ఇప్పటికీ నా ఇంటిని ప్రేమిస్తున్నాను, అదే ఇంట్లో నివసిస్తున్నాను కూడా!' అని ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాడు మ్యాడీ. Oh Yaar. Pls don’t over patronize my sacrifice. I did not lose my house or anything. In fact all involved in Rocketry will be very proudly paying heavy Income Tax this year. Gods grace 😃😃🙏🙏🇮🇳🇮🇳🇮🇳We all made very good and proud profits. I still love and live in my house .🚀❤️ https://t.co/5L0h4iBert — Ranganathan Madhavan (@ActorMadhavan) August 17, 2022 చదవండి: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఈ రెండు చిత్రాలకు సీక్వెల్ తీసే ధ్యైర్యం చేస్తారా? -
కోల్‌కతా థియేటర్లో ‘రాకెట్రీ’ ప్రదర్శన నిలిపివేత.. ఫ్యాన్స్‌కి మాధవన్ విజ్ఞప్తి
స్టార్ హీరో మాధవన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. స్యయంగా మాధవన్ దర్శకత్వం వహించి నటించిన ఈ సినిమా జూలై 1న విడుదలైంది. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటుంది ఈ మూవీ. చదవండి: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది ఇందులో మాధవన్ యాక్టింగ్, డైరెక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గొప్ప సినిమా చేశావంటూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉంటే కోల్‌కతాలోని ఓ థియేటర్లో రాకెట్రీ మూవీ ప్రదర్శనను మధ్యలో నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. షో మొదలైన కొద్ది సమయం తర్వాత ఫ్యాన్స్‌కు, థియేటర్ యాజమాన్యానికి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మూవీ ప్రదర్శనను మధ్యలోనే నిలిపివేశారు. అనంతరం ఈ సంఘటనపై మాధవన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. కాస్తా నెమ్మదించాలని ఫ్యాన్స్‌ను కోరాడు. చదవండి: కోబ్రా ఆడియో లాంచ్‌లో విక్రమ్ సందడి, పుకార్లపై ఫన్నీ రియాక్షన్ ఈ సందర్భంగా థియేటర్లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కూడా మాధవన్ షేర్ చేశాడు. ఈ వీడియోలో కొంతమంది ఆడియన్స్.. థియేటర్ యాజమాన్యంతో గోడవ పడుతూ కనిపించారు. చూస్తుంటే వారిమధ్య పెద్ద వాగ్వాదమే చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో మాడీ ట్వీట్ చేస్తూ... ‘ఏం జరిగిందో తెలియదు. మీరు గొడవ పడటం వెనక అసలైన కారణమే ఉండోచ్చు. కానీ మీరు కాస్తా శాంతించండి. ఇతరుల పట్ల ప్రేమతో వ్యవహరించండి. ఇది నా విజ్ఞప్తి. షో తిరిగి మొదలవుతుంది’ అంటూ రాసుకొచ్చాడు. There must have been a genuine reason and cause . Pls do be calm and show some love ppl. Humble request. The show will be in soon.all the love 🚀🚀🙏🙏❤️❤️ https://t.co/MPPMh6e9b3 — Ranganathan Madhavan (@ActorMadhavan) July 10, 2022 -
తొలిసారిగా అది చూపించబోతున్నాం: మాధవన్
R Madhavan Says Nambi Narayanan Is James Bond: ‘‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ సినిమాకి ఆరేళ్లు పట్టింది. సాధారణంగా స్పేస్ సినిమాల్లో రాకెట్స్‌ను, స్పేస్ షిప్స్‌ను చూస్తుంటాం. కానీ ఏ సినిమాలోనూ రాకెట్ ఇంజిన్‌ను చూపించి ఉండరు. తొలిసారి మా సినిమాలో చూపించబోతున్నాం’’ అని హీరో ఆర్. మాధవన్ అన్నారు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్‌గా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’. ఆర్. మాధవన్ లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించారు. మాధవన్, సరితా మాధవన్, వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆర్. మాధవన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మన దేశానికి చెందిన రాకెట్రీ సీక్రెట్స్‌ను నంబి నారాయణన్ పాకిస్థాన్‌కి అమ్మేశారనే నేరం కింద ఆయన్ని అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టారు. కానీ సీబీఐ దర్యాప్తులో ఆయన నిరపరాధిగా నిరూపించబడ్డారు ? అదే ఈ చిత్రకథ. ఆయన లైఫ్ నాకు పేదవాడి జేమ్స్ బాండ్ స్టోరీలా అనిపించింది. చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. ఏడాదిన్నర పాటు ఈ కథను తయారు చేశాను. సైన్స్, టెక్నాలజీ రంగంలో చాలామంది మేధావులున్నారు. వారి గురించి ఈ ప్రపంచానికి తెలియజేయాలనే ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ సినిమా చేశాను. ఈ సినిమాకి నేను ప్రోస్థటిక్ మేకప్స్ ఉపయోగించలేదు. నంబి నారాయణన్‌లా కనిపించటానికి బాగా కష్టపడ్డాను. ‘బాహుబలి’ వంటి గొప్ప సినిమాను చేయడానికి ఆ టీమ్ ఎంత కష్టపడ్డారో ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ కోసం మా టీమ్ కూడా అంతే కష్టపడింది’’ అని మాధవన్ తెలిపారు. చదవండి: తెరపైకి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ.. -
మాధవన్‌ను చూసి ఒక్కసారిగా షాకైన సూర్య, వీడియో వైరల్
వైవిధ్యమైన పాత్రలు, కథలతో అలరిస్తుంటాడు మాధవన్. తాజాగా ఆయన రాకెట్రీ అనే బయోపిక్‌తో రాబోతున్నాడు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాన్ని ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో మాధవన్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. పాత్ర కోసం మ్యాడీ తనని తాను పూర్తిగా మేకోవర్ చేసుకున్నాడు. అచ్చం నంబి నారాయణ్‌లా తెల్ల జుట్టు, కళ్లద్దాలతో కనిపించనున్నాడు. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే అయితే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన స్టార్ హీరో సూర్య షూటింగ్ చూసేందుకు నంబి నారాయణ్‌తో కలిసి సెట్‌కు వెళ్లిన ఓ దృశ్యం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. సెట్లోకి అడుగుపెట్టగానే నంబి నారాయణన్ గేటప్ ఉన్న మాధవన్‌ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఒక్క క్షణం ఎవరూ నిజమైన నంబి నారాయణ్ అని గుర్తు పట్టలేదనేంతగా ఓ షాకింగ్ లుక్ ఇచ్చాడు. ఇక సెట్స్‌లోని సూర్య, నారాయణ్ రాగానే కూర్చి నుంచి లేచి ఇరువురి స్వాగతం పలికాడు మ్యాడీ. అనంతరం సూర్యను తన స్నేహితుడు అంటూ నారాయణ్‌కు పరిచయం చేశాడు. చదవండి: కొత్త కారు కొన్న బిగ్‌బాస్ బ్యూటీ, ధరెంతో తెలుసా? ఇక ఆయన సూర్యను పలకరిస్తూ.. మీ సినిమాలు చాలా బాగుంటాయని, మీ నటన అద్భుతమని కొనియాడారు. అంతేకాదు మీ నాన్నగారు(శివకూమార్) దర్శకత్వం కూడా తనకు బాగా నచ్చుందని చెప్పడంతో సూర్య ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా తమిళం, తెలుగులో చేస్తున్న సూర్య పాత్రలో హిందీలో షారుక్ ఖాన్ పోషిస్తున్నాడు. ఇక నంబి నారాయణ్ భార్య పాత్రలో సీనియర్ నటి సిమ్రాన్ కనిపించనుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 1న విడుదలకు సిద్ధమవుతుంది. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) -
హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు..
R Madhavan Gets Trolled For Claiming ISRO Used Hindu Calendar For Mars Mission: దక్షిణాది భాషల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్. ఆయన తాజాగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం రాకెట్రీ. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కింది ఈ చిత్రం. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, స్టార్ హీరో సూర్య కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లో భాగంగా చిత్రబృందం మీడియా సమావేశాలకు హాజరవుతోంది. ఈ క్రమంలోనే మాధవన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రోల్స్ ఎదుర్కొంటున్నాయి. ఓ ప్రెస్ మీట్లో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించినప్పుడు, అది అంగారక కక్ష్యలోకి చేరేందుకు ఇస్రోకు పంచాగం ఉపయోగపడిందని మాధవన్ అన్నాడు. 'ఇస్రోవాళ్లు పంచాంగం చూసి పెట్టిన ముహుర్త బలం వల్లే భారత మార్స్ మిషన్ అవాంతరాలను అధిగమించి కక్ష్యలోకి చేరింది. గ్రహాల స్థితిగతులన్నీ పంచాంగాల్లో నిక్షిప్తమై ఉంటాయి.' అని మాధవన్ వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా నెటిజన్స్ ట్రోలింగ్‌తో ఏకిపారేస్తున్నారు. (చదవండి: చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట ?) When panjakam plays a important role in Mars mission #Madhavan #MarsMission #science #technology #sciencefiction pic.twitter.com/tnZOqYfaiN — கல்கி (@kalkyraj) June 23, 2022 'సైన్స్ అందరికీ అర్థమయ్యే విషయం కాదు. అలా అని సైన్స్ తెలియకపోవడం కూడా పెద్ద సమస్య కాదు. కానీ అసలు విషయం తెలుసుకోకుండా ఇలా మాట్లాడే బదులు సైలెంట్‌గా ఉండటం మంచిది', 'మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా ?', 'ఇవేం పిచ్చి మాటలు' అంటూ వరుస కామెంట్లతో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. అయితే ఈ ట్రోలింగ్‌పై తాజాగా మాధవన్ స్పందించాడు. 'పంచాంగాన్ని తమిళంలో పంచాంగ్ అని అనడం నా తప్పే. ఈ విమర్శలకు నేను అర్హుడినే. నేను అజ్ఞానినే. అయితే ఈ మాటల వల్ల మనం కేవలం 2 ఇంజిన్ల సహాయంతో మార్స్ మిషన్‌లో విజయం సాధించామనే నిజం కాకుండా పోదు. ఇది ఒక రికార్డు. వికాస్ ఇంజిన్ ఒక రాక్‌స్టార్.' అని ట్వీట్ మాధవన్ ట్వీట్ చేశాడు. (చదవండి: 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు) 🙏🙏I deserve this for calling the Almanac the “Panchang” in tamil. Very ignorant of me.🙈🙈🙈🤗🚀❤️Though this cannot take away for the fact that what was achieved with just 2 engines by us in the Mars Mission.A record by itself. @NambiNOfficial Vikas engine is a rockstar. 🚀❤️ https://t.co/CsLloHPOwN — Ranganathan Madhavan (@ActorMadhavan) June 26, 2022 (చదవండి: 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్..) -
నా తండ్రి గుర్తింపుతో బతకాలని లేదు: వేదాంత్ షాకింగ్ కామెంట్స్
R Madhavan Son Vedaant Shocking Comments: నటుడు, హీరో ఆర్ మాధవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెలి, సఖీ వంటి ప్రేమకథ చిత్రాల్లో నటించి లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు మాధవన్. ఈ క్రమంలో అతడికి సౌత్‌లో విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం సినిమాల్లో అతిథి పాత్రలు, ప్రతి కథానాయకుడిగా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్ తండ్రి బాటలో నడవకుండ స్పోర్ట్స్‌లో రాణిస్తోన్న సంగతి తెలిసిందే. స్విమ్మింగ్‌లో ఇప్పటికే అతడు జాతీయ, అంతర్జాతీయ పథకాలు సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. చదవండి: షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన అనుపమకు షాకిచ్చిన ఫ్యాన్స్ ఇటీవల జరిగిన డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్లో రెండు(గోల్డ్, సిల్వర్) పథకాలు సాధించి మెరిశాడు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో వేదాంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. తన తండ్రి నీడలోనే బతకాలనుకోవడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘నేను హీరో మాధవన్ కొడుకుగానే ఉండిపోవాలనుకోవడం లేదు. ఆయన నీడలోనే బతకాలి, ఎదగాలని లేదు. నాకంటూ సొంతంగా ఓ గుర్తింపు ఉండాలనుకుంటున్నా’ అని వ్యాఖ్యానించాడు. చదవండి: హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్‌పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. అలాగే ‘నా తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను సంరక్షిస్తూనే ఉన్నారు. నాకు కావాల్సినవన్ని సమకూరుస్తున్నారు. నా కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా నా కోసమే దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యారు. 2026లో జరగబోయే ఒలింపిక్స్ కోసం నన్ను సన్నద్ధం చేస్తున్నారు. దానికోసం దుబాయ్‌లో నేను శిక్షణ తీసుకోవాల్సి ఉంది. అందుకోసం నాన్న, అమ్మ కూడా నాతో పాటు దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యారు’ అంటూ వేదాంత్ చెప్పుకొచ్చాడు. ఇక కొడుకు మాటలకు మాధవన్ మురిసిపోయాడు. వేదాంత్ సినిమా రంగంలోకి రాకపోవడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, తనకు ఏది ఇష్టమో అదే చేయమన్నానని, తనకి పూర్తి స్వేచ్చా ఇవ్వడం తండ్రిగా తన బాధ్యత అని మాధవన్ పేర్కొన్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'బంగారు' వేదాంత్.. డానిష్ ఓపెన్‌లో రెండో పతకం సాధించిన మాధవన్ కొడుకు
కొపెన్‌హగెన్ (డెన్మార్క్): డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్లో భారత స్విమ్మర్ వేదాంత్ మాధవన్ మరోసారి మెరిశాడు. నిన్న (ఏప్రిల్ 17) పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో రజతం సాధించిన వేదాంత్.. ఇవాళ (ఏప్రిల్ 18) 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో బంగారు పతకం సాధించాడు. వేదాంత్ 800 మీటర్ల లక్ష్యాన్ని 8 నిమిషాల 17:28 సెకెన్లలో పూర్తి చేశాడు. వేదాంత్ రజతం పతకం నెగ్గి రోజు తిరగకుండానే పసిడి సాధించడం విశేషం. సినీ నటుడు మాధవన్ కుమారుడైన వేదాంత్ (16) ఇటీవలి కాలంలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వరుస పతాకలు సాధిస్తూ సత్తా చాటుతున్నాడు. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) గతేడాది జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో నాలుగు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించిన వేదాంత్.. లాత్వియా ఓపెన్‌లో కాంస్యం, తాజాగా డానిష్ ఓపెన్‌లో బంగారు, రజత పతకాలు సాధించాడు. వేదాంత్ అంతర్జాతీయ వేదికలపై వరుస పతకాలు సాధిస్తుండటంతో అతని తండ్రి మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. మరోవైపు వేదాంత్ సాధించిన విజయాల పట్ల యావత్ భారత చలనచిత్ర సీమ ఆనందం వ్యక్తం చేస్తుంది. దక్షిణాదికి చెందిన మాధవన్.. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. కాగా, డానిష్ ఓపెన్‌లో కొడుకు సాధించిన ఘనతకు సంబంధించిన వీడియోను మాధవన్ స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశాడు. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో కరోనా కల్లోలం.. విదేశీ ఆటగాడికి పాజిటివ్..?