‘టాలీవుడ్‌కు స్వాగతం’ | Savyasachi Team Letter To R Madhavan | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 17 2018 12:19 PM | Last Updated on Tue, Apr 17 2018 1:26 PM

Savyasachi Team Letter To R Madhavan - Sakshi

సవ్యసాచి షూటింగ్‌లో మాధవన్‌, చందూ మొండేటి

కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో ఆకట్టుకున్న మాధవన్‌ తెలుగులో నటిస్తున్న తొలి సినిమా సవ్యసాచి. పలు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే అయినా ఇంత వరకు మాధవన్‌ స్ట్రయిట్‌ తెలుగు సినిమా మాత్రం చేయలేదు. నాగచైతన్య హీరోగా చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు ఈ మ్యాన్లీ హీరో. ఇప్పటికే సవ్యసాచి సినిమాలో మాధవన్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీ కరణ పూర్తయ్యింది. ఈ సందర‍్భంగా చిత్రయూనిట్ మ్యాడీకి ఓ లేఖ రాశారు.

‘17 ఏళ్ల క్రితం మీతో ప్రేమలో పడ్డాం. వీడియో జాకీగా ప్రారంభమై నటుడిగా ఎదిగిన మీ ప్రస్థానం మాలాంటి ఎంతో మందికి స్ఫూర్తి. కేవలం మీ నటనకే కాదు మీ మాటలకు కూడా మేం అభిమానులం. దర్శకుడిగా విజన్‌ను గౌరవించే ఓ గొప్ప నటుడితో కలిసి పనిచేయటం ఆనందంగా ఉంది. మిమ్మల్ని తెలుగు తెరకు పరిచయం చేయడానికి చాలా సమయం పట్టింది. మీ అంగీకారంతో టాలీవుడ్‌కు మిమ్మల్ని పరిచయం చేయటమే కాదు, మా సినిమా కూడా సగం విజయం సాధించింది. సవ్యసాచి యూనిట్ తరుపున టాలీవుడ్‌కు స్వాగతం’ అంటూ ఓ లేఖ రాశారు. సవ్యసాచి సినిమా నటించటంపై మాధవన్ కూడా ఆనందం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement