‘బలరాముడంటే రాముడికి చుట్టమా’ | Naga Chaitanya New Comedy Teaser | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 1 2018 10:15 AM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

Naga Chaitanya New Comedy Teaser - Sakshi

అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకుడు. ఇన్నాళ్లు యాక్షన్‌ సినిమాగానే ప్రమోట్‌ చేసిన చిత్రయూనిట్ తాజాగా ఓ కామెడీ టీజర్‌ను రిలీజ్ చేశారు. సుబధ్ర పరిణయం నాటాకానికి సంబంధించిన ఈ టీజర్‌ కడుపుబ్బా నవ్విస్తోంది.

నాగ చైతన్య అర్జునుడిగా కనిపించగా వెన్నెల కిశోర్‌ కృష్ణుడిగా అలరించాడు. హైపర్‌ ఆది, సుదర్శన్‌, విధ్యుల్లేఖ రామన్‌, వైవ హర్ష ఇతర పౌరాణిక పాత్రల్లో తమవంతు కామెడీ పండించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో చైతూకు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీరవాణి సంగీతమందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement