Chandoo Mondeti
-
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే హిట్ అయిన కథలకు కొనసాగింపుగా రెండు లేదా మూడు భాగాలుగా సినిమా తీయడానికి, అదేవిధంగా ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పడానికి ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. పైగా సీక్వెల్స్ చిత్రాలకు అటు ప్రేక్షకుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లో ఫుల్ క్రేజ్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఫుల్‌గా ఉంటున్నాయి.దీంతో సీక్వెల్స్ తీయడానికి దర్శక–నిర్మాతలు, హీరోలు ఏమాత్రం ఆలోచించకుండా సై అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలు మూడో భాగంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండగా, మరికొన్ని చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అదే విధంగా ఇంకొన్ని సినిమాలకు మూడో భాగం ఉంటుందని ప్రకటించారు మేకర్స్. ‘ట్రిపుల్ ట్రీట్’ అంటూ ముచ్చటగా మూడో భాగంతో రానున్న ఆ సీక్వెల్స్ విశేషాలేంటో చూద్దాం. పుష్పరాజ్... తగ్గేదే లే హీరో అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్‌లది హిట్ కాంబినేషన్ . వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఆర్య’ (2004) సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఆర్య 2’ (2009) కూడా విజయం సాధించింది. దాదాపు పన్నెండేళ్ల గ్యాప్ అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. రష్మికా మందన్న హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. పుష్పరాజ్‌గా తన నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్‌గా ఇదే కాంబోలో వచ్చిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగంపై అంచనాలు తారస్థాయిలో ఉండేవి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గేదే లే అంటూ బ్లాక్‌బస్టర్ అందుకుంది ‘పుష్ప 2: ది రూల్’. 2024 డిసెంబరు 5న రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1800 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక ఈ సీక్వెల్లో మూడో భాగం ఉంటుందని ‘పుష్ప 2: ది రూల్’ ప్రమోషన్స్‌లో హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.మూడో భాగానికి ‘పుష్ప: ది రోర్’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారనే వార్తలు వినిపించాయి. అదేవిధంగా అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలకు సీక్వెల్‌గా ‘ఆర్య 3’ మూవీ ఉంటుందట. ఈ విషయాన్ని కూడా సుకుమార్ ఓ సందర్భంలో చెప్పారు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకులు త్రివిక్రమ్, అట్లీ సినిమాలు కమిట్ అయ్యారు. ఆ రెండు సినిమాల తర్వాతే సుకుమార్ కాంబినేషన్లో మూవీ ఉంటుందని ఊహించవచ్చు. మరి ‘పుష్ప’ మూడో భాగం, ‘ఆర్య 3’.. ఈ రెండిట్లో ఏది ముందుగా సెట్స్‌పైకి వెళుతుందనేది తెలియాలంటే చాలా సమయం పట్టవచ్చని ఫిల్మ్‌నగర్ టాక్. అర్జున్ సర్కార్ వస్తున్నాడు‘క్రిమినల్స్ ఉంటే భూమ్మీద పదడుగుల సెల్లో ఉండాలి... లేకుంటే భూమిలో ఆరడుగుల గుంతలో ఉండాలి’, ‘జనాల మధ్య ఉంటే అర్జున్... మృగాల మధ్య ఉంటే సర్కార్’ అంటున్నారు నాని (Nani). ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020), అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్: ది సెకండ్ కేస్’ (2022) వంటి హిట్ చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను (Sailesh Kolanu) మూడో భాగాన్ని కూడా తెరకెక్కించారు. తొలి రెండు భాగాలను వాల్ పోస్టర్ సినిమాపై నిర్మించిన నాని ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరోగా నటించడం విశేషం. ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటించారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్‌పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నాని కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. దీంతో తొలి, మలి భాగాల్లానే మూడో భాగంతోనూ హ్యాట్రిక్ హిట్ అందుకుంటామనే బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్. కాగా ‘హిట్’ ఫ్రాంచైజీలో మొత్తం ఏడు భాగాలు ఉంటాయని డైరెక్టర్ శైలేష్ కొలను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నాలుగురెట్ల నవ్వులు హీరో వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)లది సక్సెస్ఫుల్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా ఈ జనవరి 14న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించి వెంకటేశ్ కెరీర్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే.. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. 2019 జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో నవ్వులు పూయించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ‘ఎఫ్ 2’ కాంబినేషన్లోనే ఆ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. 2022 మే 27న విడుదలైన ‘ఎఫ్ 3’ కూడా మంచి విజయం సాధించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన తొలి, ద్వితీయ భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. కాగా ఈ ఫ్రాంచైజీలో ‘ఎఫ్–4’ మూవీ ఉంటుందని ‘ఎఫ్ 3’ చిత్రం ఎండింగ్లో ప్రకటించారు మేకర్స్. అయితే ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కలేదు. కానీ, ఈ గ్యాప్‌లో వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ అందుకుంది.ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు అనిల్ రావిపూడి. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాతే ‘ఎఫ్ 4’ సెట్స్‌కి వెళ్లే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. ‘ఎఫ్–2’, ‘ఎఫ్–3’లతో పోలిస్తే ‘ఎఫ్ –4’లో నవ్వులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయట. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్‌తో పాటు మరో అగ్ర హీరో కూడా నటిస్తారని సమాచారం. మరి... ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టేదెప్పుడో తెలియాలంటే వేచి చూడాలి. ఓదెల 3 హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అశోక్ తేజ ద్వితీయ భాగానికి కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి.మధు నిర్మించిన ఈ మూవీ గురువారం (ఏప్రిల్ 17న) విడుదలైంది. తొలిసారి నాగసాధువు భైరవి పాత్రలో తమన్నా నటించారు. ప్రేతాత్మ తిరుపతిగా వశిష్ఠ నటించారు. ఈ మూవీలో తమన్నా నటన హైలైట్‌గా నిలిచింది. ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఓటీటీలో విడుదలైనా మంచి హిట్‌గా నిలవడంతో ‘ఓదెల 2’పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొంది. కాగా ఈ సినిమాకి కొనసాగింపుగా ‘ఓదెల 3’ ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించడం విశేషం.తొలి, మలి భాగాలకు మించి... హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందు మొండేటిలది సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా ‘కార్తికేయ’ (2014) సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ‘కార్తికేయ 2’ 2022 ఆగస్టు 13న విడుదలై పాన్ ఇండియా హిట్ అందుకుంది. అంతేకాదు... రూ. 100కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడం విశేషం. ఈ కోవలోనే ‘కార్తికేయ 3’ ఉంటుందని దర్శకుడు చందు మొండేటి, నిఖిల్ సిద్ధార్థ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కార్తికేయ, కార్తికేయ 2’ సూపర్ హిట్స్ కావడంతో ‘కార్తికేయ 3’పై అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, క్రేజ్ నెలకొన్నాయి. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీ తొలి, ద్వితీయ భాగాలకు మించి అద్భుతంగా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. నాగచైతన్య హీరోగా ‘తండేల్’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న చందు మొండేటి ప్రస్తుతం ‘కార్తికేయ 3’కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పై పని చేస్తున్నారు. అదేవిధంగా నిఖిల్ ప్రస్తుతం ‘స్వయంభూ’ సినిమా చేస్తున్నారు. మరి ‘కార్తికేయ 3’ పట్టాలెక్కే సమయం ఎప్పుడు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. టిల్లు క్యూబ్‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాలతో ప్రేక్షకులను తనదైన యాటిట్యూడ్, మేనరిజమ్‌తో నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ ఫ్రాంచైజీలో రూపొందనున్న మూడో చిత్రం ‘టిల్లు క్యూబ్’. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్‌గా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. 2024 మార్చి 29న రిలీజైన ఈ మూవీ తొలి భాగం మంచి హిట్‌గా నిలిచింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ రూ.వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సిద్ధు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ సినిమా తెరకెక్కనున్నట్లు యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి తొలి, మలి భాగాలకు దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ, మల్లిక్ రామ్ కాకుండా కల్యాణ్ శంకర్(మ్యాడ్ ఫేమ్) దర్శకత్వం వహించనుండటం విశేషం. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు... ‘టిల్లు క్యూబ్’లో హీరో పాత్రను సూపర్ హీరోగా చూపించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ‘టిల్లు క్యూబ్’ చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలున్నాయి. మూడో పొలిమేరలో... ‘సత్యం’ రాజేశ్ కీలక పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర’ (2021), ‘మా ఊరి పొలిమేర 2’ (2023) సినిమాలు మంచి విజయం సాధించాయి. చేతబడి నేపథ్యంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు హిట్ అయ్యాయి. కాగా ఈ ఫ్రాంచైజీలో 'పొలిమేర 3’ (Polimera 3 Movie) రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తొలి, మలి భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ‘సత్యం’ రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి నిర్మిస్తున్నారు. చిత్రయూనిట్ విడుదల చేసిన ‘పొలిమేర 3’ వీడియో గ్లింప్స్ చూస్తే మొదటి, ద్వితీయ భాగంతో పోలిస్తే ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు మరిన్ని ఉంటాయని తెలుస్తోంది.మూడోసారి మత్తు వదలరా... ‘మత్తు వదలరా’, ‘మత్తు వదలరా 2’ చిత్రాల ఫ్రాంచైజీలో రూపొందనున్న చిత్రం ‘మత్తు వదలరా 3’. శ్రీ సింహా కోడూరి, నరేశ్ అగస్త్య, సత్య లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2019లో విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. తొలి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రానా రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించారు. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా 2024 సెప్టెంబరు 13న విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ ఫ్రాంచైజీలో ‘మత్తు వదలరా 3’ కూడా ఉంటుందని ప్రకటించింది చిత్రయూనిట్. అయితే వెంటనే షూటింగ్ ఉండదని దర్శకుడు రితేష్ రానా ప్రకటించారు. మరి ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నవ్వులు మూడింతలు సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం 2023 అక్టోబరు 6న రిలీజై ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ‘మ్యాడ్’ కాంబినేషన్లోనే ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. తొలి భాగం హిట్‌తో ద్వితీయ భాగంపై అంచనాలు నెలకొన్నాయి. ఈ మార్చి 28న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సక్సెస్‌మీట్‌కి హీరో ఎన్టీఆర్ రావడం విశేషం. కాగా ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలకు సీక్వెల్‌గా ‘మ్యాడ్ 3’ కచ్చితంగా ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. అయినప్పటికీ ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు సమయం పడుతుందని స్పష్టం చేశారు. పై సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా మూడో భాగం రానున్నాయి.చదవండి: నలుగురికిపైగా హీరోయిన్లు.. అందులో తమన్నా కూడా! -
తండేల్ మా నమ్మకాన్ని నిలబెట్టింది: చందు మొండేటి
‘‘తండేల్’ సినిమా షూట్ అప్పుడు ఎన్ని కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తుందనే ఆలోచన మా యూనిట్‌కి లేదు. కానీ ఈ చిత్రం మా అందరికీ మంచి గౌరవాన్ని తీసుకొస్తుందని బలంగా నమ్మాం. ప్రేక్షకులు అంతే గౌరవంతో గొప్ప ఘన విజయాన్ని ఇచ్చారు. మా నమ్మకాన్ని ‘తండేల్’ నిలబెట్టింది.అలాగే కలెక్షన్లలో వంద కోట్లకు చేరువ కావడం సంతోషంగా ఉంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి(Chandoo Mondeti)తెలిపారు. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం‘తండేల్’(Thandel Movie). చందు మొండేటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ నేపథ్యంలో శనివారం చందు మొండేటి పంచుకున్న విశేషాలు.⇒ పాకిస్తాన్ వాళ్లు మన తెలుగు సినిమాలు చూస్తారు. అక్కడి జైలులో ఒక సెంట్రీ అల్లు అర్జున్‌గారి ఫ్యాన్. ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుంది అంటూ అక్కడ ఖైదీలుగా ఉన్న మన 22 మంది మత్య్సకారులతో ఆ సెంట్రీ అన్నారట. ఈ విషయాన్ని ఆ 22 మంది నాతో చెప్పారు. ‘తండేల్’ బయోపిక్ కాదు. వాస్తవిక ఘటనలతో కూడుకున్న కాల్పనిక ప్రేమకథ. అందుకే పాత్రలకి రియల్ పేర్లు పెట్టలేదు. ⇒ ‘తండేల్’ కథని తొలిసారి విన్నప్పుడు పాక్ నేపథ్యంలో చేద్దామనుకున్నాను. కానీ, కథలో అందమైన భావోద్వేగం ఉంది. అలాగే ప్రేమకథలో ఎడబాటు, విరహం చాలా ప్రత్యేకం. ఇద్దరు ప్రేమికులు ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయాలంటే నెల రోజులు ఆగాలి. ఈ పాయింట్ నాకు బాగా అనిపించింది. అందుకే ఈ చిత్రాన్ని మేం భావోద్వేగాలతో కూడిన అందమైన, స్వచ్ఛమైన ప్రేమకథ అనే ప్రమోట్ చేశాం. పాకిస్తాన్ ఎపిసోడ్ ఇంకా ఉంటే బాగుండేదనే ఫీలింగ్‌ని కొందనే ప్రేక్షకులు వ్యక్త పరిచారు. ఆ ఫీలింగ్ ఉన్నప్పటికీ ఈ మూవీలోని ప్రతి అంశానికి ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారు. ⇒ నాగచైతన్య సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టారు కాబట్టే ‘తండేల్’ సక్సెస్‌కి మించిన ప్రశంసలు ఆయన నటనకి వస్తున్నాయి. నాగచైతన్య కెరీర్లో తొలి వంద కోట్ల సినిమా ‘తండేల్’. ఈ క్రెడిట్ నిర్మాతలు అరవింద్, వాసుగార్లు, చైతన్య, దేవిశ్రీలతో పాటు యూనిట్‌కి దక్కుతుంది. నా అక్షర రూపానికి వారంతా విజువల్‌ని ఇచ్చారు.‘తండేల్’ సక్సెస్ తర్వాత ‘థ్యాంక్యూ చందు. వి లవ్ యూ’ అని నాగార్జునగారు అనడం నాకు గొప్ప ప్రశంస. ‘తండేల్ దర్శకుడి సినిమా’ అని రాఘవేంద్రరావుగారు చెప్పడం మరచిపోలేని ప్రశంస. ఇక మా ‘తండేల్’ పైరసీ బారిన పడినప్పుడు గుండెల్లో గునపంతో పోడిచినట్లు, మన పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయినంత బాధగా అనిపించింది. నా తర్వాతి చిత్రం ‘కార్తికేయ 3’. సూర్యగారితో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తాను. -
శ్రీకాకుళంలో ‘తండేల్’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ‘తండేల్’ మూవీ యూనిట్ (ఫొటోలు)
-
‘తండేల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
300 కోట్ల బడ్జెట్.. హీరోగాసూర్య లేదా చరణ్, నో చెప్పిన దర్శకుడు!
చిత్ర పరిశ్రమలో విజయానికే విలువెక్కువ. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే..ఫ్లాప్ ఇస్తే మరో చాన్స్ రావడానికి చాలా సమయం పడుతుంది. గతంలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసినా సరే.. ప్లాప్ డైరెక్టర్‌తో సినిమా తీసేందుకు నిర్మాతలు కాస్త ఆలోచిస్తారు. అదే ఒక్క హిట్ పడితే చాలు కోట్ల అడ్వాన్స్ ఇచ్చి మరీ బుక్ చేసుకుంటారు. బడ్జెట్‌తో సంబంధం లేకుండా మాక్కూడా బ్లాక్ బస్టర్ అందించని ఎంత డబ్బులైనా ఇచ్చేస్తారు. కార్తికేయ 2 తర్వాత దర్శకుడు చందూ మొండేటి(Chandoo Mondeti )కి కూడా ఇలాంటి ఆఫరే వచ్చిందట. 300 కోట్ల బడ్జెట్ ఇస్తా.. రామ్ చరణ్, సూర్య లాంటి హీరోలను సెట్ చేస్తా భారీ సినిమా చెయ్ అని నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) అన్నారట.కానీ ఆయన మాత్రం తండేల్(Thandel) కథనే చేస్తానని, అది కూడా నాగచైతన్యతోనే చేస్తానని చెప్పడంతో వారి ఆలోచనను విరమించుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా చందు మొండేటి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.‘కార్తికేయ-2 తర్వాత గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయాల్సి వచ్చినపుడు.. తండేల్ కథ నా ముందుకు వచ్చింది. అయితే అల్లు అరవింద్, బన్నీవాసు ఆ కథ సినిమాకు సెట్ కాదని అనుకున్నారు. కార్తికేయ-2ను నేను హ్యాండిల్ చేసిన తీరు గురించి చెబుతూ పెద్ద సినిమా చేద్దామన్నారు. ‘మన దగ్గర సూర్య ఉన్నాడు, అలాగే రామ్ చరణ్ సైతం అందుబాటులో ఉన్నాడు. 300 కోట్ల దాక బడ్జెట్ ఇస్తాం. భారీ సినిమా ప్లాన్ చెయ్’ అని చెప్పారు. నీ నేను మాత్రం ‘తండేల్’ కథే ఎందకు చేయకూడదు అన్నాను. ఆ కథే నాకు ఎక్కువ నచ్చి దాన్నే చేయడానికి రెడీ అయ్యాను’ అని చందూ మొండేటి అన్నారు.ఇక తండేల్ విషయానికొస్తే.. కార్తికేయ 2 తర్వాత చందు దర్శకత్వం వహించిన చిత్రమిది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నాగచైతన్య ‘తండేల్’ HD మూవీ స్టిల్స్
-
Karthikeya 2 Movie Review: ‘ కార్తికేయ2 ’ మూవీ రివ్యూ
టైటిల్ : కార్తికేయ2 నటీనటులు : నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనమ్, కేఎస్ శ్రీధర్, శ్రీనివాసరరెడ్డి నిర్మాణ సంస్థ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం: చందూ మొండేటి సంగీతం : కాల భైరవ సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని విడుదల తేది: ఆగస్ట్ 13, 2022 వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడ్డాడు. ఆయన కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ‘కార్తికేయ’. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా అదే టీమ్‌తో ‘కార్తికేయ2’ తీశాడు. ఎన్నో అవంతరాల తర్వాత నేడు(ఆగస్ట్ 13) ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో కార్తికేయ2 పై హైప్ క్రియేట్ అయింది. ఈ భారీ అంచనాల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా ద్వాపర యుగానికి, ద్వారక నగరానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ తిరుగుతుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కాలికి ధరించిన కంకణం.. నేటి కలియుగంలోని ఎన్నో అంతుచిక్కని సమస్యలకు పరిష్కారం చూపుతుందని ఆర్కియాలజిస్ట్ రావు తెలుసుకుంటాడు. ఆ కంకణం గురించి అశ్వేషిస్తున్న రావు హత్య చేయబడతాడు. అదే సమయంలో తల్లి (తులసి)తో కలిసి ద్వారక దర్శనానికి వచ్చిన డాక్టర్ కార్తిక్(నిఖిల్)ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆర్కియాలజిస్ట్ రావును కార్తిక్‌కే హత్య చేశాడని తప్పుడు కేసు నమోదు చేస్తారు. పోలీసు స్టేషన్లో ఉన్న కార్తిక్‌ని రావు రావు మనవరాలు ముగ్ధ (అనుపమా పరమేశ్వరన్) తప్పిస్తుంది. అసలు కార్తిక్‌ని ముగ్ఢ ఎందుకు తప్పించింది? ఆమె కార్తిక్‌తో చెప్పిన విషయం ఏంటి? శ్రీకృష్ణుడి కంకణం కనిపెట్టాలని కార్తిక్ ఎందుకు డిసైడ్ అవుతాడు? ఈ క్రమంలో కార్తిక్‌కు డాక్టర్ శాంతను (ఆదిత్యా మీనన్) నుంచి ఎటువంటి ప్రమాదాలు ఎదురయ్యయాయి? అధీరుల తెగకు చెందిన వ్యక్తులు కార్తిక్‌ని చంపేందుకు ఎందుకు ప్రయత్నించారు. చివరకు కార్తిక్ కంకణ రహస్యాన్ని కనిపెట్టాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. దర్శకుడు చందూ మొండేటి మొదటి నుంచి చెబుతున్నట్లుగా ‘కార్తికేయ’ చిత్రానికి, కార్తికేయ2 కు ఎలాంటి సంబంధం లేదు. కేవలం హీరో, అతని తల్లి పాత్రలు అలా ప్రవర్తిస్తాయి. కార్తికేయలో మిస్టరీ, థ్రిల్లర్ అంశాలు ఉంటే.. ఇందులో అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దైవం, సైన్స్ రెండింటిని కలిపి ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌లో మొత్తం సాదాసీదాగా సాగుతున్నప్పటికీ.. సెకండాఫ్‌పై మాత్రం క్యూరియాసిటీ పెంచుతుంది. అధీరుల వంశానికి చెందిన ఓ వ్యక్తి కార్తిక్‌పై దాడి చేయడం.. దానికి కారణం ఏంటో యానిమేషన్ ద్వారా చూపించడం ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. శ్రీకృష్ణ కంకణం అన్వేషణని ఆసక్తికరంగా తెరపై చూపించాడు. గోవర్థన గిరి గుహలో లభించిన ఆధారంతో కంకణాన్ని కనిపెట్టడం.. దానిని తీసుకొచ్చేందుకు కార్తిక్ చేసిన ప్రయత్నం రక్తి కట్టిస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని క్లైమాక్స్ వరకు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కథ పరంగా చూస్తే కార్తికేయ2 చాలా సాదారనమైనది..కానీ కథనం మాత్రం కొత్తగా ఆకట్టుకునేలా ఉంటుంది. కార్తికేయలో మాదిరి ఇందులో భయపడే సీన్స్ పెద్దగా ఉండవు. అలాగే హీరోని ఢీకొట్టేందుకు బలమైన విలన్ లేకపోవడంతో కొన్ని సన్నివేశాలు చప్పగా సాగాయనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే విలన్, అధీరుల తెగకు చిక్కిన ప్రతీసారి హీరో సింపుల్‌గా తప్పించుకోవడం లేదా ఆ సీన్‌ని హడావిడిగా ముంగించి వేరే సీన్లోకి తీసుకెళ్లడంతో థ్రిల్ మూమెంట్స్ మిస్ అవుతారు. శ్రీకృష్ణుడి గొప్పదనం గురించి అనుపమ్ ఖేర్‌తో చెప్పించే డైలాగ్స్ ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఫోకస్ అంతా కృష్ణతత్వం మీదే పెట్టినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. కమర్షియల్ హంగుల కోసం సాంగ్స్, కామెడీని జోడించకుండా ఉత్కంఠభరితంగా కథను నడిపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే... డాక్టర్ కార్తికేయ పాత్రలో నిఖిల్ ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రని అల్రెడీ కార్తికేయ చిత్రంలో పోషించిన అనుభవం ఉండటం అతనికి కలిసొచ్చింది. కార్తికేయ మాదిరే కార్తికేయ 2 కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. ఇక ముగ్ధ పాత్రకి అనుపమ పరమేశ్వరన్ న్యాయం చేసింది. కార్తిక్‌ని కాపాడే రెండు సీన్స్ అనుపమా క్యారెక్టర్ని గుర్తిండిపోయేలా చేస్తాయి. ఇక బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా.. గుర్తిండిపోయే పాత్ర చేశారు. శ్రీకృష్ణుడి గొప్పతనం గురించి ఆయన చెప్పే డైలాగ్స్ థియేటర్స్‌లో ఈలలు వేయిస్తాయి. కార్తిక్ మామగా శ్రీనివాస్‌రెడ్డి, ట్రాలీ డ్రైవర్‌గా వైవా హర్ష తమదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రవీణ్, సత్యలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం కాల భైరవ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ రెండూ బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
నాగార్జునతో 'విక్రమ్' లాంటి సినిమా చేయాలని ఉంది: డైరెక్టర్
Chandoo Mondeti About Karthikeya 2 Movie: 2014లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన చందూ మొండేటికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత ప్రేమమ్, సవ్యసాచి, బ్లడీ మేరీ సినిమాలతో తనదైన శైలీలో పలకరించాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇప్పుడు తాజాగా 'కార్తికేయ'కు సీక్వెల్‌గా 'కార్తికేయ 2' వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో యంగ్ హీరో నిఖిల్, బ్యూటీఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్స్‌కు మంచి స్పందన లభించింది. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వినూత్నంగా కాంటెస్ట్ పేరుతో ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు డైరెక్టర్ చందూ మొండేటి, హీరో నిఖిల్. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది చిత్రబృందం. చదవండి: బికినీలో గ్లామర్ ఒలకబోస్తున్న హీరోయిన్ వేదిక.. నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన ''నాకు కింగ్ నాగార్జున అంటే చాలం ఇష్టం. ఆయనతో ఓ పోలీస్ కథపై చర్చలు జరుగుతుంటాయి. ఒకవేళ ఇప్పుడు ఈ మూవీ సక్సెస్ అయితే నాగార్జునతో 'విక్రమ్' లాంటి సినిమా చేయాలని ఉంది'' అని చందూ మొండేటి తెలిపారు. అలాగే హోస్ట్ అడిగిన 'నువ్వొక చిన్న సైజు విజయ్ మాల్య అట కదా' అనే ప్రశ్నకు 'ఏంటీ స్కాములా.. దొంగతనం కూడా చేశామంటారు' అని చందూ జవాబివ్వగా.. 'అదంతా ఒకప్పుడు' అని నిఖిల్ అన్నాడు. 'కార్తికేయ 2'లో చాలా పాములుంటాయని, 'భార్యలకు అబద్ధాలు చెప్పకపోతే, ఇన్నికాపురాలు ఉంటాయా' అంటూ చందూ చెప్పుకొచ్చాడు. ' అంటే కొన్నిసార్లు చిరాగ్గా ఉన్న సమయంలో కూడా డు యు లవ్ మీ' అని అంటారని నిఖిల్ చెప్పడంతో ఇంటర్వ్యూ ప్రోమో ముగిసింది. -
త్వరలో సెట్స్ మీదకు ‘కార్తికేయ 2’
2014 లో యువకథానాయకుడు నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘కార్తికేయ’ చిత్రం విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచే ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ రూపొందనుందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికది నిజమవుతోంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాను ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని కథానాయకుడు నిఖిల్ పుట్టినరోజు (జూన్ 1) సందర్భంగా అధికారికంగా వెల్లడి చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. ‘నిఖిల్ హీరోగా దర్శకునిగా నా తొలి చిత్రం కార్తికేయ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో మా కాంబినేషన్లో రూపొందనున్న కార్తికేయ 2 చిత్రం పై అంచనాలు అధికంగానే ఉంటాయన్న ది వాస్తవం. దీనికి తగినట్టుగానే ఈ చిత్రం ఉంటుంది. కార్తికేయకు కొనసాగింపుగా కార్తికేయ 2 ఉంటూనే కథా ,కథనాల విషయంలో సరికొత్తగా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ సీక్వెల్ ఈచిత్రం’ అన్నారు. కార్తికేయ 2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. చిత్రంలోని ఇతర నటీ, నట సాంకేతికవర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాత,దర్శకులు తెలిపారు. తమ కథానాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. -
‘సవ్యసాచి’ మూవీ రివ్యూ
టైటిల్ : సవ్యసాచి జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : నాగ చైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, వెన్నెల కిశోర్ సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి దర్శకత్వం : చందూ మొండేటి నిర్మాత : నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సీ.వీ.మోహన్ అక్కినేని వారసుడిగా వెండితెర అరంగేట్రం చేసిన నాగచైతన్య కెరీర్ స్టార్టింగ్ నుంచి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. లవర్ బాయ్‌గా సూపర్ హిట్లు సాధించిన ఈ స్టార్ వారసుడు యాక్షన్ హీరోగా మాత్రం ప్రతీ సారి ఫెయిల్ అయ్యాడు. అయినా మరోసారి అదే జానర్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు చైతూ. తనకు ప్రేమమ్ లాంటి బిగ్ హిట్ అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేశాడు. మరి ఈ సినిమా అయినా చైతూకు యాక్షన్ హీరోగా సక్సెస్ ఇస్తుందా..? కథ ; కులు వ్యాలీలో ఓ బస్సు ప్రయాణంతో సినిమా ప్రారంభమవుతుంది. ఏ మాత్రం పరిచయం లేని 21 మంది ఆ బస్సులో ప్రయాణిస్తుంటారు. కానీ ఆ బస్సులో ఉన్న అందరికి కామన్ పాయింట్ వారందరికీ అరుణ్ అనే వ్యక్తి తెలుసు. అనుకోకుండా ఆ బస్సు ప్రమాదానికి గురవుతుంది. ప్రమాదంలో ఒక్క విక్రమ్ ఆదిత్య( నాగచైతన్య) తప్ప బస్సులో ఉన్న అందరూ చనిపోతారు. విక్రమ్ ఆదిత్య.. వానిషింగ్ ట్విన్ సిండ్రమ్‌తో ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనకు ఆనందం వచ్చినా కోపం వచ్చినా తన ఎడమ చేయి తన కంట్రోల్ లో ఉండదు. యాడ్ ఫిలిం మేకర్ అయిన విక్రమ్‌కు అక్క (భూమిక) కూతురు మహాలక్ష్మి అంటే ప్రాణం. తన అమ్మే మళ్లీ మహాలక్ష్మీగా పుట్టిందని నమ్ముతుంటాడు విక్రమ్. ఓ యాడ్ ఫిలిం పని మీద విక్రమ్ న్యూయార్క్ వెళ్లి వచ్చే సరికి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి బావ, మహాలక్ష్మి చనిపోతారు. అక్క హాస్పిటల్లో ఉంటుంది. అన్ని సవ్యంగా ఉన్న సమయంలో విక్రమ్ ఆదిత్య జీవితంలో తుఫాన్ మొదలవుతుంది. ప్రమాదంలో అక్క కూతురు మహాలక్ష్మి చనిపోలేదని, తన దగ్గరే ఉందని ఓ అజ్ఞాత వ్యక్తి(మాదవన్) విక్రమ్‌కి ఫోన్ చేసి చెప్తాడు. అసలు పాపను అతను ఎందుకు కిడ్నాప్ చేశాడు..? విక్రమ్‌కి అజ్ఞాత వ్యక్తికి మధ్య వైరం ఏంటి..? బస్సు ప్రమాదానికి ఈ కథకు సంబంధం ఏంటి..? ఈ సమస్యల నుంచి విక్రమ్ ఆదిత్య ఎలా బయటపడ్డాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; సినిమా ప్రధానంగా నాగచైతన్య, మాధవన్‌ల చుట్టూనే తిరుగుతుంది. ఇద్దరు తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. ప్రతీ సినిమాకు నటుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్న చైతూ ఈ సినిమాలోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎడమ చేయి తన మాట వినని పరిస్థితుల్లో ఒక వ్యక్తి పడే ఇబ్బందులను చాలా బాగా చూపించాడు. కామెడీ, రొమాన్స్, ఎమోషనల్ సీన్స్‌తో పాటు యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు చైతూ. తొలిసారిగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసిన మాధవన్ కు ఇది మంచి లాంచ్ అనే చెప్పాలి. తాను ఎలాంటి పాత్రనైనా పండించగలనని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మాధవన్. సైకో విలన్‌గా మాధవన్ నటన, పలికించిన హావ భావాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే మాధవన్ పాత్రను ఇంకాస్త ఎలివేట్ చేస్తే బాగుండన్న భావన కలుగుతుంది. హీరోయిన్గా పరిచయం అయిన నిధి అగర్వాల్ కేవలం లవ్ స్టోరి, పాటలకే పరిమితమైంది. భూమిక తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్, సుదర్శన్, సత్య తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే డిఫరెంట్ పాయింట్‌ను ఎంచుకున్న దర్శకుడు చందూ మొండేటి యాక్షన్ ఎమోషనల్ అంశాలతో మంచి కథను రెడీ చేసుకున్నాడు. అయితే ఆ కథను తెర మీద ఆవిష్కరించటంలో కాస్త తడబడినట్టుగా కనిపిస్తుంది. సినిమాను ఇంట్రస్టింగ్ పాయింట్‌తో మొదలు పెట్టినా.. తరువాత ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలతో నడిపించాడు. హీరోకు ఉన్న ఎడమ చేతి ప్రాబ్లమ్‌కు సంబంధించిన సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో లేవు. ప్రీ ఇంట్రర్వెల్ వరకు అసలు కథ మొదలు కాకపోవటం నిరాశకలిగిస్తుంది. ఇంటర్వెల్ తరువాత కథ వేగం అందుకుంటుదనుకున్న సమయంలో మరోసారి కాలేజ్ ఫ్లాష్ బ్యాక్ బ్రేక్ వేస్తుంది. ఈ సీన్లో సుభద్రా పరిణయం నాటకం, నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయత్తు పాటు ఆకట్టుకున్నా కథనం ఎమోషనల్‌గా సాగుతున్న సమయంలో ఈ సీన్స్ ఇబ్బంది పెడతాయి. మాధవన్ లాంటి నటుడు ఉన్న పూర్తిగా ఉపయోగించుకోలేదనే భావన కలిగిస్తుంది. విలన్ క్యారెక్టర్‌ను మరింతగా ఎలివేట్ చేస్తే బాగుండేది. హీరో, విలన్ల మధ్య జరిగే మైండ్ గేమ్ ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా స్పీడందుకుంటుంది. నాగచైతన్య యాక్షన్ సీన్స్, మాధవన్ పర్ఫామెన్స్ సూపర్బ్. కీరవాణి సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. పాటల పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతం యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌కు మరింత హైప్ తీసుకువచ్చింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; నాగచైతన్య, మాధవన్ నటన యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ ; లవ్ ట్రాక్ రొటీన్ టేకింగ్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘బలరాముడంటే రాముడికి చుట్టమా’
అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకుడు. ఇన్నాళ్లు యాక్షన్ సినిమాగానే ప్రమోట్ చేసిన చిత్రయూనిట్ తాజాగా ఓ కామెడీ టీజర్‌ను రిలీజ్ చేశారు. సుబధ్ర పరిణయం నాటాకానికి సంబంధించిన ఈ టీజర్ కడుపుబ్బా నవ్విస్తోంది. నాగ చైతన్య అర్జునుడిగా కనిపించగా వెన్నెల కిశోర్ కృష్ణుడిగా అలరించాడు. హైపర్ ఆది, సుదర్శన్, విధ్యుల్లేఖ రామన్, వైవ హర్ష ఇతర పౌరాణిక పాత్రల్లో తమవంతు కామెడీ పండించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో చైతూకు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీరవాణి సంగీతమందించారు. -
‘సవ్యసాచి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
నాగచైతన్య ‘సవ్యసాచి’ ట్రైలర్ లాంచ్
-
ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో సవ్యసాచి
అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ సవ్యసాచి. నవంబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తొలిసారిగా మాధవన్ ఈ సినిమాతో విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. తన ఎడమ చేతి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే పాత్రలో హీరో నాగచైతన్య కనిపిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ నటుడు మాధవన్, భూమిక ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కార్తీకేయ, ప్రేమమ్ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. -
‘సవ్యసాచి’ టైటిల్ సాంగ్
అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ సవ్యసాచి. కార్తీకేయ, ప్రేమమ్ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. నవంబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. పూర్తిగా సంస్కృత పదాలతో సాగిన ఈ పాటకు కీరవాణి స్వరాలు అందించగా ఆయన తండ్రి శివశక్తి దత్తా, రామకృష్ణ కోడూరితో కలిసి సాహిత్యమందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ నటుడు మాధవన్, భూమిక ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
‘సవ్యసాచి’ మరో పాట : ఒక్కరంటే ఒక్కరూ..
అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ సవ్యసాచి. కార్తీకేయ, ప్రేమమ్ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. నవంబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా సినిమాలో కీలకమైన అమ్మ పాటను రిలీజ్ చేశారు. తన కొడుకు ఎడమ చేయి అతని మాట వినకుండా కొడుకును ఇబ్బందులకు గురి చేస్తుంటే ఆ తల్లి పడే ఆవేదనే ఒక్కరంటే ఒక్కరు అంటూ సాగే పాట. కీరవాణి సంగీతమందించిన ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యమందించగా శ్రీనిధి తిరుమల ఆలపించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ నటుడు మాధవన్, భూమిక ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
‘సవ్యసాచి’ వర్కింగ్ స్టిల్స్
-
ఫైనల్ స్టేజ్‌లో ‘సవ్యసాచి’
అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ సవ్యసాచి. కార్తీకేయ, ప్రేమమ్ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇపాటికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే గ్రాఫిక్స్ విషయంలో ఆలస్య కావటంతో రిలీజ్‌ను వాయిదా వేశారు. ఈ లోగా శైలజా రెడ్డి అల్లుడు సినిమాను పూర్తి చేసిన చైతూ ఆ సినిమాతో ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శైలజా రెడ్డి అల్లుడు సినిమా పనులు పూర్తి కావటంతో తిరిగి సవ్యసాచితో బిజీ అయ్యాడు చైతూ. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్న చిత్రయూనిట్ త్వరలో ఆకరిపాట చిత్రీకరణ కోసం ఫారిన్ వెళ్లనున్నారు. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. చైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. -
అసలు సవ్యసాచి అంటే ఎవరు?
సాక్షి, సినిమా : రెండు చేతుల్ని సమర్థంగా.. శక్తివంతంగా వాడేవాళ్లనే సవ్యసాచి అంటారు. అదే టైటిల్‌ను నాగ చైతన్య కొత్త చిత్రానికి ఫిక్స్ చేయగా.. ఇప్పుడు ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను మేకర్లు విడుదల చేశారు. మహాభారతంలో అర్జునుడి అయిదో పేరు సవ్యసాచి. ఎందుకంటే అర్జునుడు రెండు చేతులతో ఒకే వేగంతో విలువిద్య ప్రదర్శించగలడు. అలాగే ఈ చిత్రంలో హీరో రెండు చేతులను సమర్థవంతంగా వాడి పరిస్థితులను, ప్రత్యర్థులను ఎదుర్కొంటాడు అంటూ ఓ సందేశంతో పోస్టర్‌ను వదిలారు. బ్యాక్ గ్రౌండ్లో చేతులు.. వాటిపై రాతలు... సీరియస్‌గా ఉన్న చైతూ లుక్ ఆకట్టుకునేలా ఉంది. మైత్రి మూమీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండగా.. నాగ చైతన్య సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా.. మాధవన్, భూమికలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
నిఖిల్ కూడా లవ్ ఫెయిల్యూరే..
రోజా పువ్వు ప్రేమకు సంకేతం. ఎవరైనా వారి ప్రేమను ప్రేమికుల రోజున ఒక రోజా పువ్వు ఇచ్చి తెలియజేస్తారు. యంగ్ హీరో నిఖిల్ కూడా లవ్ ఫెయిల్యూర్రే. నిఖిల్ గర్ల్‌ఫ్రెండ్ తన ప్రేమను తిరస్కరించింది. ఇది నిజజీవితంలో కాదు. కిరాక్ పార్టీ అనే మూవీలో. యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న కిరాక్ పార్టీలోని ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ప్రేమికుల రోజున విడుదల చేశారు. ఆ పోస్టర్లో నిఖిల్ దిగులుగా, వంగిపోయినా రోజా పువ్వుతో కనిపించారు. ఈ సినిమాలో హీరో లవ్ ఫెయిల్యూర్ పాత్రలో నటిస్తున్నారు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’ని తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా కథానాయికలుగా నటిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తుండడం విశేషం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న నిఖిల్‌కు ఈ సినిమా మరో విజయాన్ని అందిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
‘కిరాక్ పార్టీ’ ప్రీ టీజర్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’ని తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా కథానాయికలుగా నటిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తుండడం విశేషం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ప్రీ టీజర్‌ను రిలీజ్ చేశారు. జనవరి 22న తొలి పాటను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాతో మరో హిట్ గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉన్నాడు నిఖిల్. -
పెళ్లి తరువాత తొలిసారి సెట్స్‌కు..!
ఇటీవల ఒక్కటైన టాలీవుడ్ లవ్ కపుల్ నాగచైతన్య, సమంతలు తిరిగి షూటింగ్‌లకు హాజరవుతున్నారు. సమంత ఇప్పటికే రంగస్థలం యూనిట్ తో జాయిన్ అవ్వగా ఈ రోజు నుంచి నాగచైతన్య కూడా షూటింగ్‌కు హాజరయ్యాడు. చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతూకు జోడిగా నిథి అగర్వాల్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్నఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణీ స్వరాలందిస్తున్నారు. ఈరోజు షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని కన్ఫమ్ చేస్తూ సవ్యసాచి సెట్లో యూనిట్‌తో కలిసి దిగిన ఫొటోను తన సోషల్‌మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన చైతూ ‘తిరిగి పని ప్రారంభించాం’ అంటూ కామెంట్ చేశాడు. సవ్యసాచి సినిమా సెట్స్ మీద ఉండగానే మారుతి దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభించనున్నాడు ఈ అక్కినేని అందగాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమాకు ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. సవ్యసాచి తొలి షెడ్యూల్ పూర్తయిన తరువాత శైలజా రెడ్డి అల్లుడు సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. Back to work ! #Savyasachi pic.twitter.com/ymZkj82YUL — chaitanya akkineni (@chay_akkineni) 8 November 2017 -
నాగచైతన్యతో కోలీవుడ్ సీనియర్ హీరో..!
యుద్ధం శరణం సినిమాతో నిరాశపరిచిన యంగ్ హీరో నాగచైతన్య, తన నెక్ట్స్ సినిమాను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. తనకు ప్రేమమ్ లాంటి ఘనవిజయాన్ని అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాఛి సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు చైతూ. ఇప్పటికే రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కొత్త తరహా కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలకపాత్రలో కోలీవుడ్ నటుడు మాధవన్ నటించనున్నాడు. సఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మాధవన్ తరువాత కూడా డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించినా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. త్వరలో తొలిసారిగా ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
'సవ్యసాచి'గా నాగచైతన్య
ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల సక్సెస్ తో మంచి ఫాంలో ఉన్న నాగచైతన్య వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకత్వంలో యుద్ధం శరణం సినిమాను పూర్తి చేసిన చైతూ.. మరో సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు. తనకు ప్రేమమ్ లాంటి ఘన విజయాన్ని అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు సవ్యసాచి అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈ రోజు (బుధవారం) సినిమా టైటిల్ లోగోనూ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ చూస్తే సినిమా యాక్షన్ జానర్ లో సాగుతుందని తెలుస్తోంది. సెప్టెంబర్ లో సవ్యసాచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చాలా కాలంగా మాస్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న చైతన్య, వరుసగా రెండు మాస్ యాక్షన్ సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. Excited to be back with Chandoo and @MythriOfficial supporting us .. my next is #Savyasachi .. shoot starts this September pic.twitter.com/qfZvQrxywA — chaitanya akkineni (@chay_akkineni) 16 August 2017 -
దిల్ రాజు బ్యానర్లో హిట్ సినిమా సీక్వల్
ఈ శుక్రవారం కేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్, తరువత చేయబోయే సినిమాలను కూడా వరుసగా లైన్లో పెట్టాడు. ఇప్పటికే రెండు రీమేక్‌లకు కమిట్ అయిన ఈ యంగ్ హీరో తన హిట్ సినిమాకు సీక్వల్‌ను కూడా లైన్లో పెట్టాడు. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలతో విజయం సాధిస్తున్న నిఖిల్ తన సూపర్ హిట్ సినిమా కార్తికేయకు సీక్వల్‌ను రెడీ చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ కార్తికేయ. ఈ సినిమాకు సీక్వల్ చేసే ఆలోచన ఉందంటూ హీరో, డైరెక్టర్ చాలా కాలంగా చెపుతున్నారు. అయితే నిఖిల్ అప్పటికే కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉండటం, చందూ కూడా ప్రేమమ్‌తో మరో హిట్ సాధించటంతో కార్తికేయ సీక్వల్ డిలే అవుతూ వచ్చింది. ఈ గ్యాప్‌లో చందూ ఇతర హీరోలతో సినిమా చేయాలని భావించినా ఏదీ సెట్స్ మీదకు రాలేదు. దీంతో మరోసారి నిఖిల్‌తో కార్తికేయ సీక్వల్‌ను సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు దర్శకుడు చందూ మొండేటి. హీరో నిఖిల్ కార్తికేయ సీక్వల్‌ను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశాడు. ప్రస్తుతం కేశవ ప్రమోషన్లో బిజీగా ఉన్న నిఖిల్, చందూ దర్శకత్వంలో కార్తికేయ సీక్వల్ ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని తెలిపాడు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా కార్తికేయకు పర్ఫెక్ట్ సీక్వల్ అని, ఆ సినిమా ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే రెండో భాగం మొదలవుతుందని తెలిపాడు. అయితే టాలీవుడ్లో సీక్వల్ సినిమాలు హిట్ అయిన దాఖలాలు చాలా తక్కువు మరి బాహుబలి తరుహాలో ఆ సెంటిమెంట్‌ను కార్తికేయ కూడా బ్రేక్ చేస్తుందేమో చూడాలి. -
పోలీస్ పాత్రలో కింగ్..?
ప్రస్తుతం సీనియర్ హీరోలలో ఫుల్ ఫాంలో ఉన్న స్టార్ కింగ్ నాగార్జున. యంగ్ జనరేషన్ జోరు పెంచటంతో కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి ప్రయోగాత్మక చిత్రాలతో అలరిస్తున్న నాగ్ త్వరలో ఓ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్కు రెడీ అవుతున్నాడట. ఇటీవల ఊపిరి సినిమాతో అలరించిన మన్మథుడు, ప్రస్తుతం చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఓం నమోవేంకటేశాయ సినిమాలో పరమ భక్తుడు హాథీరాం బాబాగా నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కాస్త చేంజ్ కోసం ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నాడు నాగ్. అందుకే చందూ మొండేటి దర్శకత్వంలో ఓ పోలీస్ కథతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. కార్తీకేయ, ప్రేమమ్ సినిమాల సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న చందూ, తన నెక్ట్స్ సినిమాను నాగ్ లాంటి సీనియర్ హీరోతో చేస్తే తన రేంజ్ కూడా పెరుగుతుందని భావిస్తున్నాడట. మరి ప్రయోగాల మూడ్‌లో ఉన్న నాగ్, చందూ కథకు ఓకె చెప్తాడో లేదో చూడాలి. -
'థ్రిల్లర్ సినిమా చేద్దామనుకున్నాం'
కార్తీకేయ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు చందూ మొండేటి తన రెండో సినిమాతో భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. మలయాళంలో ఘన విజయం సాధించిన ప్రేమమ్ సినిమాను అదే పేరుతో నాగచైతన్య హీరోగా రీమేక్ చేసిన చందూ మొండేటి, ఆడియోతో పాటు ట్రైలర్లతోనూ ఆకట్టుకుంటున్నాడు. అయితే కార్తికేయ సినిమా తరువాత నాగచైతన్యను కలిసిన చందూ, థ్రిల్లర్ సినిమాను చేయాలని భావించాడు. కానీ అదే సమయంలో ప్రేమమ్ సినిమా చూడటంతో ఆ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దసరా సందర్భంగా అక్టోబర్ 7న రిలీజ్ అవుతున్న ప్రేమమ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగచైతన్య సరసన శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఎస్.నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం ఇచ్చిన హీరో నాగచైతన్య, నిర్మాత నాగవంశీలకు కృతజ్ఞతలు తెలిపిన చందూ మొండేటి, ప్రేమమ్ సినిమా దర్శకుడిగా తన బాధ్యతను పెంచిందన్నాడు. -
కొత్త కథలుంటే చెప్పమని అందరూ అడుగుతున్నారు : చందు మొండేటి
‘‘సినిమా విడుదలకు ముందు రిజల్ట్ కోసం టెన్షన్‌గా ఎదురు చూశా. ప్రేక్షకుల స్పందన తెలిశాక హమ్మయ్య అనుకున్నా’’ అని దర్శకుడు చందు మొండేటి అన్నారు. నిఖిల్, స్వాతి జంటగా ఆయన దర్శకత్వం వహించిన ‘కార్తికేయ’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అటు ప్రేక్షకుల్ని ఇటు సినీ పరిశ్రమ వారిని చిత్రం ఆకట్టుకుంటోందంటూ చందు ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. మాది కొవ్వూరు. కానీ, పెరిగిందంతా చెన్నయ్‌లోనే. బీటెక్ చదివాను. సినిమాలంటే ఇష్టమే కానీ.. డెరైక్టర్ అవ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అయితే, సినిమా పరిశ్రమలోనే స్థిరపడాలనుకున్నాను. లైట్‌మేన్‌గా చేరితే.. కెమెరామేన్ కావొచ్చనీ, కథలు రాసుకుంటే రచయితగా స్థిరపడొచ్చనీ అనుకున్నాను. నేను కథ చెప్పే విధానం చూసి, నా స్నేహితులు ‘నీలో డెరైక్టర్ లక్షణాలున్నాయి’ అనేవారు. కానీ, పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు. ఓసారి హైదరాబాద్‌లో 10, 15 రోజులుందామని వచ్చాను. ఆ సమయంలోనే సుకుమార్‌గారి ‘ఆర్య’ విడుదలైంది. ‘కొత్త పాయింట్‌తో తీశాడు’ అంటూ ఎక్కడ చూసినా సుకుమార్‌గారి గురించే! కొత్తగా తీస్తే, దర్శకుడికి ఇంత పేరొస్తుందా అనిపించింది. అప్పటికే నా దగ్గర కొత్త పాయింట్స్ ఉండటంతో డెరైక్టర్ అవుదామనుకున్నా. ఇక్కడ కొంతమంది స్నేహితుల ద్వారా సుధీర్ వర్మ, నిఖిల్‌లతో పరిచయం ఏర్పడింది. అప్పుడు నిఖిల్ కీలక పాత్రలో ఓ సినిమా ఆరంభమైతే, నేనూ, సుధీర్ దర్శకత్వ శాఖలో చేరాం. ఆ చిత్రం ఆగినా, మా స్నేహం మాత్రం కొనసాగుతోంది. ఆ తర్వాత పరశురామ్ దగ్గర ‘యువత’కి చేశాను. అలాగే రెండు, మూడు సినిమాలకు రచయితగా వ్యవహరించాను. అప్పుడు ‘కార్తికేయ’ కథతో దర్శకుడు కావాలనుకున్నాను. ‘స్వామి రారా’వంటి వినూత్న కథాంశంతో సుధీర్ హిట్ సాధించడంతో బలమైన కథలకు ఆదరణ ఉంటుందనే నా నమ్మకం ఇంకా పెరిగింది. నిఖిల్ ‘కార్తికేయ’ కథ వినడం, తనకు నచ్చడంతో వెంటనే మొదలుపెట్టాం. ‘కార్తికేయ’ విడుదల తర్వాత ఎంతోమంది ప్రముఖులు ఫోన్ చేసి, అభినందించారు. అల్లు అర్జున్, వినాయక్‌గారు, సుకుమార్‌గారు, సుప్రియ, అశ్వనీదత్‌గారి కుమార్తె ప్రియాంకా దత్ ఫోన్ చేసి, అభినందించారు. ఏవైనా కొత్త కథలుంటే చెప్పమని అందరూ అడుగుతున్నారు. నా దగ్గర నాలుగైదు కథలున్నాయి. వాటిలో ఒకటి నాగార్జునగారికి సరిగ్గా సరిపోతుంది. నేను ఆయన అభిమానిని. అందుకే, ఆయనకు తగ్గ కథ రెడీ చేశాను. ఇకపై డబ్బు తెచ్చిపెట్టే సినిమాలే తీస్తా. ‘కార్తికేయ’ విడుదలయ్యాక, ఆదరణ బాగుండడంతో ఇంకా థియేటర్లు పెంచాం. ఈ విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో నా తదుపరి చిత్రాలను కూడా వినూత్న కథాంశాలతోనే చేస్తా.