
యుద్ధం శరణం సినిమాతో నిరాశపరిచిన యంగ్ హీరో నాగచైతన్య, తన నెక్ట్స్ సినిమాను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. తనకు ప్రేమమ్ లాంటి ఘనవిజయాన్ని అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాఛి సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు చైతూ. ఇప్పటికే రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
కొత్త తరహా కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలకపాత్రలో కోలీవుడ్ నటుడు మాధవన్ నటించనున్నాడు. సఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మాధవన్ తరువాత కూడా డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించినా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. త్వరలో తొలిసారిగా ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.