Savyasachi
-
విలన్‌గా మరో మూవీ.. క్లారిటీ ఇచ్చిన హీరో
హీరోలుగా మంచి ఫాంలో ఉన్న నటులు కూడా ఇటీవల ప్రతినాయక పాత్రల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తాజాగా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు విలన్‌గా పరిచయం అయ్యాడు మాధవన్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాదించకపోయినా మాధవన్ నటనకు మంచి పేరు వచ్చింది. దీంతో మరిన్ని సినిమాల్లో మాధవన్ ప్రతినాయక పాత్రల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో మాధవన్ విలన్‌గా నటిస్తున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై స్పందించిన మాధవన్ తాను రవితేజ సినిమాలో నటించటం లేదని.. ఆ వార్తల్లో నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. -
‘బలరాముడంటే రాముడికి చుట్టమా’
అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకుడు. ఇన్నాళ్లు యాక్షన్ సినిమాగానే ప్రమోట్ చేసిన చిత్రయూనిట్ తాజాగా ఓ కామెడీ టీజర్‌ను రిలీజ్ చేశారు. సుబధ్ర పరిణయం నాటాకానికి సంబంధించిన ఈ టీజర్ కడుపుబ్బా నవ్విస్తోంది. నాగ చైతన్య అర్జునుడిగా కనిపించగా వెన్నెల కిశోర్ కృష్ణుడిగా అలరించాడు. హైపర్ ఆది, సుదర్శన్, విధ్యుల్లేఖ రామన్, వైవ హర్ష ఇతర పౌరాణిక పాత్రల్లో తమవంతు కామెడీ పండించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో చైతూకు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీరవాణి సంగీతమందించారు. -
‘సవ్యసాచి’లో నాగ్ సూపర్ హిట్ సాంగ్
అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. నవంబర్ 2 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ ట్రైలర్లతో సందడి చేస్తున్న సవ్యసాచి టీం తాజాగా సాంగ్ టీజర్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో నాగార్జున సూపర్ హిట్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది’ పాటను రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాట వీడియో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఒరిజినల్ పాట లోని ఫ్లేవర్ ఏ మాత్రం మిస్ కాకుండా ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా ట్యూన్ చేశారు కీరవాణి. చైతూ కూడా సూపర్బ్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నాడు. చైతూ లుక్స్, కాస్ట్యూమ్స్ కూడా పాటకు మరింత ప్లస్ అయ్యాయి. నిధి అగర్వాల్ గ్లామర్ లుక్స్ తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశారు. చైతూ హీరోగా ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. తన ఎడమ చేతిమీ నియంత్రణ లేని పాత్రలో చైతూ నటన ఆకట్టుకుంటుందంటున్నారు చిత్రయూనిట్. -
ఆనందంతో పాటు భయం కూడా...
‘‘చాలా తక్కువ టైమ్‌లో మంచి సక్సెస్ వచ్చిందన్న ఆనందంతో పాటు ఆ సక్సెస్‌ను నిలబెట్టుకోవాలనే భయం కూడా ఉంది’’ అన్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్. ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ సినిమాలతో వరుస హిట్స్‌ను సాధించి మంచి ఫామ్‌లో ఉన్నారు ఈ నిర్మాతలు. తాజాగా వీరి బ్యానర్లో నాగచైతన్య హీరోగా రూపొందిన సినిమా ‘సవ్యసాచి’. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయిక. మాధవన్, భూమిక కీలక పాత్రలు చేసిన ఈ సినిమా నవంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నవీన్, మోహన్, రవిశంకర్ చెప్పిన విశేషాలు... ∙గతేడాది సెప్టెంబర్‌లో ‘సవ్యసాచి’ సినిమా గురించి చందూ మొండేటి చెప్పారు. నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లాం. నాగచైతన్య బాగా చేశారు. కామెడీ, డ్రామా, యాక్షన్ ఇలా అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి. బడ్జెట్ పరంగా కంఫర్టబుల్‌గానే ఉన్నాం. మాధవన్‌గారికి కూడా ఈ సినిమా కథ బాగా నచ్చి నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్‌కు ముందు తమన్నానే అనుకున్నాం. కానీ కథానుసారంగా సడన్‌గా తమన్నా వస్తే బాగుండదమో అని ఆలోచించాం. అందుకే కుదర్లేదు. ‘సవ్య సాచి’ సినిమాను తమిళంలో డబ్ చేయడం లేదు. కానీ తెలుగు వెర్షన్‌ను అక్కడ రిలీజ్ చేస్తున్నాం. ∙నాగచైతన్య ‘సవ్యసాచి’, రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటొనీ’ సినిమాలను వెంట వెంటనే విడుదల చేస్తున్నాం అంటే సరైన డేట్స్ లేకనే. ఈ ఏడాది నవంబర్ 29న ‘2.ఓ’ చిత్రం ఉంది. డిసెంబర్ 7వ తేదీ తెలంగాణ ఎన్నికలు. ఒకవేళ 14 రిలీజ్ చేస్తే... డిసెంబర్ 21న 4సినిమాలు ఉన్నాయి. జనవరిలో పెద్ద సినిమాలు ఉన్నాయి. వేరే డేట్స్ లేకనే. ఇలా రిలీజ్ చేస్తున్నాం. ∙మంచి సినిమా తీయడమే కాదు.. మంచి డేట్‌కు రిలీజ్ చేసుకోవాలి. ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని 2015 జూలై 17న రిలీజ్ అనుకున్నాం. కానీ ఆగస్టు 7న చేశాం. ‘జనతా గ్యారేజ్’ సినిమాను 2016 ఆగస్టు 11న అనుకున్నాం. కానీ ఆ తేదీకి ఆడియో రిలీజ్ చేసి సినిమాను 2016 సెప్టెంబర్ 1కి రిలీజ్ చేశాం. ‘రంగస్థలం’ ఈ ఏడాది సంక్రాంతికి అనుకున్నాం. కానీ మార్చి 30కి రిలీజ్ చేశాం. డిలే సెంటిమెంట్ అని కాదు. అలా జరిగిందంతే. ∙మేం ముగ్గురం విజయవాడ నుంచే వచ్చాం. మేం ఎప్పటినుంచో స్నేహితులం. ‘శ్రీమంతుడు’ ముందు నుంచే హీరోలకు మైత్రీవారు బాగా అడ్వాన్స్‌లు ఇస్తున్నారన్న టాక్ ఉంది. మేం డైరెక్టర్‌ను ఫాలో అవుతాం. మా సంస్థలో యాక్టర్స్, డైరెక్టర్స్ రిపీట్ అవుతున్నారంటే... వాళ్లకు కంఫర్ట్‌గా ఉంది. సేమ్ టైమ్ మాకూ కంఫర్ట్‌గా ఉంది. చందూ మొండేటితో మరో సినిమా ఉంది. కొరటాల శివగారు (శ్రీమంతుడు, జనతా గ్యారేజ్), సుకుమార్‌గారు (రంగస్థలం) చెప్పిన కథలు విన్నప్పుడు బాగా నచ్చాయి. ∙తొలుత పెద్ద సినిమాలే తీద్దాం అనుకున్నాం. అయితే మార్కెట్‌ను గమనిస్తే మధ్య స్థాయి సినిమాలు కూడా మంచి కలెక్షన్స్‌ను రాబడుతున్నాయి. 2016లో మిడిల్ లెవల్ సినిమాలు కూడా చేద్దాం అనుకున్నాం. 2017లో ఎగ్జిక్యూట్ చేశాం. ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ∙అన్నదమ్ములు సాయిధరమ్ తేజ్, వైష్టవ్ తేజ్ సినిమాలను కావాలని ప్లాన్ చేయలేదు. ప్రస్తుతానికి మా బ్యానర్లో దాదాపు పది సినిమాలు ఉన్నప్పటికీ సెట్స్‌లో ఉన్నది రెండు, మూడు సినిమాలే. ఇక్కడ ఎక్కువ సినిమాలు చేస్తుండటం వల్ల ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూషన్‌ను ఆపేశాం. ∙‘చిత్రలహరి’ని నానితో అనుకున్నాం కానీ కుదర్లేదు. నాని మంచి ఆర్టిస్టు. భవిష్యత్‌లో ఆయనతో సినిమా ఉంటుంది. తమిళ ‘తేరి’ తెలుగు రీమేక్‌ను హీరో రవితేజ, దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌లతో చేయబోతున్నాం. ‘తేరి’లో చిన్న ప్లాట్ మాత్రమే తీసుకున్నాం. త్రివ్రికమ్–పవన్ కల్యాణ్‌గారి కాంబినేషన్లో ఓ సినిమా ఉండొచ్చు. ∙చిన్న సినిమాల ఆలోచన కూడా ఉంది. కోటి రూపాయల బడ్జెట్లో రితేష్ అనే డైరెక్టర్‌తో ఓ సినిమా ప్లాన్ చేశాం. అతి త్వరలో స్టార్ట్ అవుతుంది. మా సక్సెస్‌లో దేవిశ్రీప్రసాద్ ఉన్నారు. నెక్ట్స్ ఇయర్ మా బ్యానర్లో రిలీజయ్యే ఓ 4 సినిమాలకు ఆయనే సంగీత దర్శకుడు. ప్రస్తుతానికి బాలీవుడ్ ఆలోచన లేదు. సొంత స్టూడియో అంటే పెద్ద పని. ఆ ఆలోచన కూడా లేదు. వెబ్ సిరీస్ కోసం అమేజాన్ వాళ్లు అడిగారు. చర్చలు జరుగుతున్నాయి. మళ్లీ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో సినిమాలు ఉంటాయి. -
హలోబ్రదర్తో సంబంధం లేదు
‘‘దర్శకుడిగా నాకు థ్రిల్‌తో కూడుకున్న డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలే నచ్చుతుంటాయి. అవే ప్రేక్షకులకు చెప్పాలని ప్రయత్నిస్తుంటాను’’ అని చందూ మొండేటి అన్నారు. నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చందూ మొండేటి పలు విశేషాలు పంచుకున్నారు. ► ‘ట్విన్ వానిషింగ్ సిండ్రోమ్’కి సంబంధించిన ఓ ఆర్టికల్‌ని మా ఫ్రెండ్ చూపించాడు. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ పాయింట్‌ని నా కథలో మిళితం చేసి చైతన్య, మైత్రీ నిర్మాతలకు చెప్పాను. అందరూ బాగా ఎగై్జట్ అయ్యారు. కొత్తగా ఉంటుందని అనుకున్నాం. అప్పుడే ‘సవ్యసాచి’ అనే టైటిల్ అయితే బావుంటుందనుకున్నాను. ► హీరోకు తెలియకుండానే తన ఎడమ చేయి పని చేస్తుందనే పాయింట్‌ని ట్రైలర్లో చూసి, ‘హలో బ్రదర్’ సినిమాతో పోలుస్తున్నారేమో. కానీ అలాంటిదేమీ లేదు. వీలున్న చోట మాత్రమే ఈ పాయింట్‌ని చూపించాం. కేవలం ఈ ఒక్క పాయింట్ చుట్టూనే కథ తిరగదు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్స్, ఫైట్స్, మంచి లవ్ స్టోరీ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. ► మాధవన్ ప్యాన్ ఇండియా యాక్టర్. ఆయన ఫస్ట్ సినిమా నుంచి చూస్తే అన్నీ విభిన్న సినిమాలే ఉంటాయి. నేను ఓ 45 నిమిషాలు కథ చెప్పగానే బావుంది చేద్దాం అనడంతో నమ్మకం వచ్చింది. ఆ తర్వాత కీరవాణి గారు తోడయ్యారు. ఆయన మార్క్ సంగీతం అందిచారు. ► లెగసీ ఉన్న హీరో మన సినిమాలో ఉన్నప్పుడు వాళ్ల ఫ్యామిలీ వాళ్ల పాటలు పెడితే అభిమానులకు, ప్రేక్షకులకూ సరదాగా ఉంటుంది. ‘నిన్ను రోడ్డు మీద చూసినది...’ రీమిక్స్ సాంగ్ సెకండ్ హాఫ్‌లో వస్తుంది. చైతూ ఫుల్ జోష్‌తో చేశాడు. సాంగ్ టీజర్లో మీరు చూసింది శ్యాంపిలే. ముందుగా ఈ పాటకు తమన్నాని అనుకున్నాం. కానీ మా స్క్రిప్ట్‌కు తగట్టుగా కుదర్లే దని నిధితో చేశాం. నిధీ కూడా మంచి డ్యాన్సర్. ► మేమేదో కొత్త పాయింట్ తీశాం అని చెప్పడం లేదు. ఆల్రెడీ ఉన్న ఓ విషయాన్ని మళ్లీ చూపిస్తున్నాం. ప్రేక్షకులకు కూడా ఓ కొత్త అనుభూతి ఇస్తుందని నమ్మాం. ‘మున్నా మైఖేల్’ చిత్రం చూసి నిధిని సెలెక్ట్ చేసుకున్నాం. బాగా చేసింది. నిర్మాతలు అడిగింది అడిగినట్టు ఇచ్చారు. ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉంచుతారు. భూమికగారి పాత్ర నిడివి తక్కువైనా చాలా బాగుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ వల్ల చిత్రం ఆలస్యం అయింది. ► ముందు ‘చాణక్య’ అనే కథ కోసం చైతన్య, నేనూ కలిశాం. కానీ అది చేయడం కుదర్లేదు. ‘ప్రేమమ్’ రీమేక్ చేశాం. ‘సవ్యసాచి’ సినిమా కోసం చైతన్య చాలా కష్టపడ్డాడు. ► నెక్ట్స్ ‘కార్తికేయ 2 ’ లైన్ ఉంది. ఆ పాయింట్‌ని డీల్ చేసే సామర్థ్యం నాకింకా రాలేదనుకుంటున్నాను. నాగార్జునగారి కోసం ఓ స్క్రిప్ట్ రెడీగా ఉంది. కానీ నెక్ట్స్ ఏ సినిమా ఉంటుందో చెప్పలేను. -
‘సవ్యసాచి’ సెన్సార్ పూర్తి!
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమాలకు ఇది కలిసొచ్చే కాలమే. కొత్త ప్రయోగాలతో ముందుకు వస్తే.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ తరుణంలో నాగచైతన్య సవ్యసాచితో రాబోతున్నాడు. తన మాట వినని ఎడమచేతితో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు.. అసలు ఆ కథేంటి అన్న ఆసక్తికర అంశాలతో ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. రీసెంట్గా విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్‌తో సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. మాధవన్, భూమిక, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించగా చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా నవంబర్ 2న థియేటర్లలో సందడి చేయనుంది. -
యాక్షన్ డ్రామాగా సవ్యసాచి
అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. చైతూ హీరోగా ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిథి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ ట్రైలర్లతో ఆకట్టుకున్న సవ్యసాచి టీం తాజాగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. తన ఎడమ చేతిమీ నియంత్రణ లేని పాత్రలో చైతూ నటన ఆకట్టుకుంటుందంటున్నారు చిత్రయూనిట్. -
‘సవ్యసాచి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
అందుకోసమే చైతుకు అమ్మాయిలు ఫోన్ చేసేవారట!
‘తాతగారు మెదలుపెట్టిన ప్రయాణం ఇది. నాన్నగారికి, సుమంత్ అన్నకు, నాకు, అఖిల్‌కు, సమంతకు ఇలా మా అందరికీ మీ ప్రేమాభిమానాలు, సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. తరాలు మారినా తరగని ప్రేమను అందిస్తున్నారు. కొన్నిసార్లు మిమ్మల్ని నిరుత్సాహపరిచాను, కొన్నిసార్లు ఎనర్జీ ఇచ్చాను. కానీ మనం అందరం ఇలా కలసి ఉండటం నాకు ముఖ్యం’’ అన్నారు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిÔ¶ ంకర్, మోహన్ చెరుకూరి నిర్మించారు. కీరవాణి సంగీత దర్శకుడు. ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘ఈ వేడుకకు వచ్చినందకు కొరటాల శివగారికి, రౌడీ విజయ్‌కు థ్యాంక్స్. ఉదయం లేవగానే ఓ చెడు వార్త వినాల్సి వచ్చింది. మా కుటుంబానికి చాలా సపోర్ట్‌గా ఉన్న శివప్రసాద్‌గారు మనల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం అందరి కంటే చందు ఎక్కువగా కష్టపడ్డాడు. యునిక్ పాయింట్‌కి కమర్షియల్ పాయింట్స్ కలిపి మంచి సినిమా తయారు చేశాడు. కీరవాణిగారు తాతగారితో, నాన్నతో చేశారు. ఆయనతో కలసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీతో నాన్న పంచుకున్న జ్ఞాపకాలు ఎప్పుడూ మాతో పంచుకుంటారు. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నన్ని రోజులు అమ్మాయిలు ఫోన్ చేసి, షూటింగ్‌కి రావచ్చా? మాధవన్‌ని చూడొచ్చా అని అడిగేవాళ్ళు. ‘చెలి’ చూసినప్పటి నా ఫ్రెండ్స్ ఇంకా మిమ్మల్ని అభిమానిస్తూనే ఉన్నారు. మీరు ఈ సినిమా అంగీకరించడంతో మా నమ్మకం ఇంకా పెరిగింది. మాధవన్ ఓ సినిమాని ఊరికే అంగీకరించరని మాకు తెలుసు. ఏదో కొత్తదనం లేకపోతే ఆయన ఒప్పుకోరు. ని«ధీ.. నువ్వు ఇక్కడ ఉండటానికి ఎన్ని కలలు కన్నావో అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. భూమికగారు, ఇలా అందరికీ థ్యాంక్స్. మైత్రీ బ్యానర్ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకువెళ్లారు. మిమ్మల్ని (అభిమానులు) ఆనందపరచడం కోసం నిజాయితీగా పని చేస్తాను. నా కెరీర్లో ఇది పెద్ద సినిమా. కాంబినేషన్‌ని నమ్మి కాదు కంటెంట్‌ని నమ్మి సినిమా తీశారు. ఇలాంటి నిర్మాతలు మనకు కావాలి. ఈ సినిమా నిరుత్సాహపరచదు’’ అన్నారు. కీరవాణి మాట్లాడుతూ – ‘‘నాగార్జునగారితో పని చేయడం ఎంత ఎంజాయ్ చేశానో చైతన్యతో పని చేయడం కూడా అంతే ఆనందించాను. రచయితలు అందరూ చక్కటి సాహిత్యం అందించారు. నిర్మాతలు ప్రతీది అడిగి తెలుసుకున్నారు. అడిగింది ఇచ్చారు’’ అన్నారు. ‘‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ ఇలా ప్రతీ సినిమాకు నేర్చుకుంటూ, మెరుగుపరుచుకుంటూ వస్తున్నాం. శివ గారికి, విజయ్ దేవరకొండకి ఈ ఈవెంట్‌కి వచ్చినందుకు థ్యాంక్స్. చైతన్యతో ఇంకో లవ్ స్టోరీ సినిమా చేయాలని ఉంది. మాధవన్గారూ.. తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్. ‘బాహుబలి’ తర్వాత కీరవాణిగారు ఈ సినిమానే చేశారు’’ అని నిర్మాతలు అన్నారు. మాధవన్ మాట్లాడుతూ– ‘‘మైత్రీ మూవీస్ వాళ్ల వల్ల స్ట్రయిట్ తెలుగు సినిమా చేశాను. వాళ్లు సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతున్నారు. ఈ సినిమా కూడా సూపర్‌గా ఉంటుంది. సినిమాకు పని చేసిన వాళ్లందరూ సహృదయులు. ముఖ్యంగా నాగ చైతన్య. నేను మీ ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్‌ని చైతన్యా. నీతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. చందూతో పని చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మైత్రీ బ్యానర్ నా ఫ్యామిలీ లానే. పెద్ద హిట్ సాధిస్తారనుకుంటున్నాను. పవర్ఫుల్ టైటిల్‌తో వస్తున్నారు. టీమ్‌కు ఆల్ ది బెస్ట్. చైతన్య చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ –‘‘మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రెండు సినిమాలు చేస్తున్నాను. వాళ్ల ప్యాషన్ అద్భుతం. మాధవన్‌గారిని తెలుగులో చూడటం ఆనందంగా ఉంది. చందూ మరో మంచి సినిమా తీశాడని అనుకుంటున్నాను. చైతన్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన హ్యాండ్‌షేక్, నవ్విన తీరుకే నచ్చేశారు. ఇండస్ట్రీలో ఎవరు చైతన్య గురించి మాట్లాడినా మంచి విషయాలే చెబుతారు. వ్యక్తిగా అంత మంచివాడు’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన టీమ్‌కి థ్యాంక్స్. చైతూతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మాధవన్‌గారితో పని చేయడం మర్చిపోలేను’’ అన్నారు నిధి అగర్వాల్. రామకృష్ణ, మోనికా, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కెమెరామేన్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నాగచైతన్య ‘సవ్యసాచి’ ట్రైలర్ లాంచ్
-
కాంబినేషన్‌ని కాదు.. కంటెంట్‌ని నమ్మారు
నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, మోహన్ సీవీయం, రవిశంకర్‌లు నిర్మించారు. ‘కార్తికేయ, ప్రేమమ్’ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యం.యం. కీరవాణి సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు సుకుమార్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ చాలా బావుంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇటువంటి సినిమా ఇంతవరకు రాలేదనుకుంటున్నాను. చాలా వెరైటీ సబ్జెక్ట్. ఇలాంటి సబ్టెక్ట్తో సినిమా చేయటం చందు అదృష్టం. కీరవాణి గారి సంగీతం గురించి నా స్నేహితుడు దేవీశ్రీ ప్రసాద్ ఎంతో గొప్పగా చెబు తుంటాడు. స్పూన్ కిందపడితే వచ్చే శబ్దం కూడా ఏ రాగమో కీరవాణిగారు చెబుతారని, ఆయన అంతటి సంగీత జ్ఞాని అని మేమిద్దరం మాట్లాడుకుంటాం. నిర్మాతల గురించి చెప్పాలంటే ముగ్గురూ మూడు పనులను పంచుకొని చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తారు. నా ‘100 పర్సెంట్ లవ్’ టైమ్‌లో హీరో చైతూ, నేను రెగ్యులర్‌గా 100 పర్సెంట్ టచ్‌లో ఉండేవాళ్లం. ఇప్పుడు సామ్ (సమంత)తో ఉన్నందువల్ల 99 పర్సెంట్ మాత్రమే టచ్‌లో ఉన్నాడు (నవ్వూతూ). ట్రైలర్లో చైతూ చాలా అందంగా ఉన్నాడు’’ అన్నారు. కీరవాణి మాట్లాడుతూ– ‘‘చందూతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ జర్నీలో ఎన్నో సార్లు తిట్టాను, కసురుకున్నాను కూడా. తన మంచి కోసమే అనుకునేంత మంచి గుణం అతనిది’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మేము ‘ప్రేమమ్’ చేసే టైమ్‌లో వేరే కంట్రీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు చిన్న లైన్లో ఈ కథ చెప్పాడు చందూ. చాలా బావుంది అన్నాను. మా కాంబినేషన్ కంటే కంటెంట్‌ను నమ్మి చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌కు థ్యాంక్స్. ఏ సినిమాకైనా ట్రైలర్ విడుదలైనప్పుడు మెసేజ్‌లు వచ్చేవి. కానీ ఈ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజవ్వగానే కాంప్లిమెంట్స్ వచ్చాయి’’ అన్నారు. ‘‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 27న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించబోతున్నాం. నవంబర్ 2న సినిమాని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు చిత్రనిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని. -
ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో సవ్యసాచి
అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ సవ్యసాచి. నవంబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తొలిసారిగా మాధవన్ ఈ సినిమాతో విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. తన ఎడమ చేతి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే పాత్రలో హీరో నాగచైతన్య కనిపిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ నటుడు మాధవన్, భూమిక ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కార్తీకేయ, ప్రేమమ్ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. -
‘సవ్యసాచి’ టైటిల్ సాంగ్
అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ సవ్యసాచి. కార్తీకేయ, ప్రేమమ్ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. నవంబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. పూర్తిగా సంస్కృత పదాలతో సాగిన ఈ పాటకు కీరవాణి స్వరాలు అందించగా ఆయన తండ్రి శివశక్తి దత్తా, రామకృష్ణ కోడూరితో కలిసి సాహిత్యమందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ నటుడు మాధవన్, భూమిక ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
‘సవ్యసాచి’ మరో పాట : ఒక్కరంటే ఒక్కరూ..
అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ సవ్యసాచి. కార్తీకేయ, ప్రేమమ్ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. నవంబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా సినిమాలో కీలకమైన అమ్మ పాటను రిలీజ్ చేశారు. తన కొడుకు ఎడమ చేయి అతని మాట వినకుండా కొడుకును ఇబ్బందులకు గురి చేస్తుంటే ఆ తల్లి పడే ఆవేదనే ఒక్కరంటే ఒక్కరు అంటూ సాగే పాట. కీరవాణి సంగీతమందించిన ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యమందించగా శ్రీనిధి తిరుమల ఆలపించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ నటుడు మాధవన్, భూమిక ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
‘సవ్యసాచి’ వర్కింగ్ స్టిల్స్
-
సవ్యసాచిలో సగాన్ని
‘ఒకే రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములు అంటారు. ఒకే రక్తం, ఒకే శరీరం పంచుకు పుడితే అద్భుతం అంటారు. వరసకు కనిపించని అన్నని, కడదాకా ఉండే కవచాన్ని. సవ్యసాచిలో సగాన్ని’ అంటున్నారు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధీ అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. మాధవన్ విలన్‌గా నటించారు. ఈ చిత్రం టీజర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రెండు చేతులను ఒకే బలంతో ఉపయోగించగలిగే సవ్యసాచిగా నాగచైతన్య కనిపించనున్నారు. టీజర్ చూస్తుంటే మంచి సైంటిఫిక్ కాన్సెప్ట్‌ను కమర్షియల్ చిత్రానికి జోడించినట్టున్నారు దర్శకుడు చందు. ‘‘నేను బాగా ఎగై్జట్ అయిన కాన్సెప్ట్ ఇది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని నాగచైతన్య పేర్కొన్నారు. నవంబర్ 2న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి యం.యం. కీరవాణి సంగీత దర్శకుడు. -
సవ్యసాచి టీజర్.. సూపర్ కాన్సెప్ట్
‘మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే.. అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే అది అద్భుతం అంటారు’ అంటూ నాగ చైతన్య చెప్పే వాయిస్ ఓవర్‌తో రిలీజ్ అయిన సవ్యసాచి టీజర్ ఆకట్టుకుంటోంది. సోమవారం విడుదలైన ఈ టీజర్‌ను చూస్తే ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ‘కనిపించని అన్నని.. కడదాకా ఉండే కవచాన్ని.. ఈ సవ్యసాచిలో సగాన్ని’ అంటూ చైతు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. టీజర్‌ను డైలాగ్‌ను బట్టి చూస్తే పైకి కనిపించని.. ఒకే శరీరంతో ఉన్న కవలల కథ ఆధారంగా ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందినట్టుగా తెలుస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్ కథానాయిక. భూమిక, మాధవన్ కీలక పాత్రలు చేశారు. -
సవ్యసాచి టీజర్ విడుదల
-
గురువారం గుమ్మడికాయ
ఈ నెలలో ‘శైలజారెడ్డి అల్లుడి’గా ప్రేక్షకులను మెప్పించిన నాగచైతన్య తన నెక్ట్స్ చిత్రం ‘సవ్యసాచి’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ‘సవ్యసాచి’. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయిక. భూమిక, మాధవన్ కీలక పాత్రలు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. నిజానికి ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం చిన్న ప్యాచ్‌వర్క్ కోసం షూటింగ్ జరుపుతున్నారు. ఇది కూడా రేపటితో పూర్తి అవుతుంది. దీంతో ఈ గురువారం గుమ్మడికాయ కొడతారు ‘సవ్యసాచి’టీమ్. అన్నట్లు ఇంకో మాట... ఈ సినిమా కోసం ‘అల్లరి అల్లుడు’లో నాగార్జున, రమ్యకృష్ణ చేసిన ‘నిన్ను రోడ్డుమీద చూసినది లగాయితు’ అనే సాంగ్‌ను రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను నాగచైతన్య, నిధీ అగర్వాల్‌పై చిత్రీకరించారు. ఈ చిత్రం నవంబర్ 2న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించనున్న చిత్రం అక్టోబర్ 6న ఆరంభం కానుందట. -
ఫైనల్ స్టేజ్‌లో ‘సవ్యసాచి’
అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ సవ్యసాచి. కార్తీకేయ, ప్రేమమ్ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇపాటికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే గ్రాఫిక్స్ విషయంలో ఆలస్య కావటంతో రిలీజ్‌ను వాయిదా వేశారు. ఈ లోగా శైలజా రెడ్డి అల్లుడు సినిమాను పూర్తి చేసిన చైతూ ఆ సినిమాతో ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శైలజా రెడ్డి అల్లుడు సినిమా పనులు పూర్తి కావటంతో తిరిగి సవ్యసాచితో బిజీ అయ్యాడు చైతూ. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్న చిత్రయూనిట్ త్వరలో ఆకరిపాట చిత్రీకరణ కోసం ఫారిన్ వెళ్లనున్నారు. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. చైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. -
డబుల్ ధమాకా
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవి శంకర్ సినీ లవర్స్‌కు ఒకే రోజు డబుల్ ధమాకా ఇచ్చారు. రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, నాగచైతన్య ’సవ్యసాచి’ సినిమాల విడుదల తేదీలను ఒకే రోజున అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. ‘‘ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మా బ్యానర్లో విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం మంచి హిట్ సాధించింది. మా సక్సెస్ఫుల్ జర్నీలో భాగస్వాములైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన ఈ విజయాలు మా బాధ్యతను మరింత పెంచుతున్నాయి. అలాగే మా సంస్థ నుంచి వస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘సవ్యసాచి’ సినిమాల రిలీజ్ డేట్స్‌ను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాను అక్టోబర్ 5న, నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సవ్యసాచి’ సినిమాను నవంబర్ 2న విడుదల చేయబోతున్నాం’’ అని పేర్కొన్నారు మైత్రీమూవీ మేకర్స్ ప్రతినిధులు. -
జ్ఞాపకాల గుర్తులు
సిల్వర్ స్క్రీన్‌పై భూమిక కథానాయికగా మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆరిస్ట్గానూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కానీ భూమికలో ఓన్లీ యాక్టింగ్ ప్రతిభ మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. స్కూబా డైవింగ్ కూడా బాగా చేస్తారు. ‘‘రీసెంట్గా స్కూబా డైవింగ్ చేసా. ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. ఆ జ్ఞాపకాల గుర్తులు’’ అంటూ స్కూబా డైవింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారామె. ఇక సినిమాల విషయానికొస్తే... చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’, సమంత లీడ్ రోల్ చేసిన ‘యు టర్న్’ సినిమాలోనూ భూమిక నటిస్తున్నారు. -
మస్త్ బిజీ
నాగచైతన్య మల్టీటాస్కింగ్ చేస్తున్నారు. ఓ వైపు ‘సవ్యసాచి’ మరోవైపు ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలను కంప్లీట్ చేస్తూ, మస్త్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘సవ్యసాచి’ సినిమా డబ్బింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. నవీన్ ఎర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ కథానాయిక. 10 రోజుల పాటు కొన్ని సీన్స్, అలాగే ఐటమ్ సాంగ్ మినహా సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా స్పీడ్‌గా కంప్లీట్ చేస్తోందట చిత్రబృందం. ఈ సినిమా కోసం ‘అల్లరి అల్లుడు’ సినిమాలోని ‘నిన్ను రోడ్డు మీద చూసినది.....’ సాంగ్‌ని రీమిక్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తమన్నా, నాగచైతన్యలపై ఈ సాంగ్‌ను జూన్ లాస్ట్ వీక్‌లో షూట్ చేయనున్నారట. సో.. సినిమాకు సంబంధించిన ఆఖరి ఘట్టంలోకి అడుగుపెట్టేసారన్నమాట ఈ సవ్యసాచి. మాధవన్, భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యం.యం.కీరవాణి స్వరకర్త. ఈ సినిమాను జూలై లాస్ట్ వీక్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ప్రేమమ్’ లాంటి హిట్ తర్వాత దర్శకుడు చందుతో నాగచైతన్య చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. -
‘అందుకే చైతూ సినిమా పక్కన పెట్టేశాం’
అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్ లాంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ. ఇటీవల జెంటిల్మన్ సినిమాతో తన కెరీర్లోనూ బిగెస్ట్ కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నారు. తరువాత అమీతుమీ సినిమాతో మరో మంచి విజయం అందుకున్న మోహనకృష్ణ ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా సమ్మోహనం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాకన్నా ముందే నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కించాల్సి ఉన్నా ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. జెంటిల్మన్ సక్సెస్ తరువాత మోహనకృష్ణ దర్శకత్వంలో నటించేందుకు స్టార్ హీరోలు కూడా ఆసక్తి కనబరిచారు. సాయి కొర్రపాటి నిర్మాతగా నాగచైతన్య హీరోగా ఓ సినిమాను ప్రకటించారు. అయితే పూర్తి యాక్షన్ కథాంశంగా కావటంతో అప్పటికే నాగచైతన్య యాక్షన్ జానర్లో సవ్యసాచి సినిమాకు ఓకె చెప్పటంతో మోహనకృష్ణ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారట. ఈ విషయాన్ని సమ్మోహనం ప్రమోషన్ కార్యక్రమాల్లో దర్శకుడు వెల్లడించారు. త్వరలోనే మరో మంచి కథతో నాగచైతన్య హీరోగా సినిమా చేస్తానని చెప్పారు ఇంద్రగంటి మోహనకృష్ణ. సుధీర్ బాబు, అదితిరావు హైదరీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సమ్మోహనం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సవ్యసాచి రిలీజ్‌పై కన్ఫ్యూజన్
అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య ఒకేసారి రెండు సినిమాలు చేసేస్తున్నాడు. ఇప్పటికే చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి షూటింగ్ దాదాపుగా పూర్తికాగా, మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్ జరుగుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం సవ్యసాచి ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఆలస్యం కావటంతో కాస్త వాయిదా పడింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటంతో ఆలస్యమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఓ సంస్థ గ్రాఫిక్స్ వర్క్ కొంత మేర పూర్తి చేసినా ఆ వర్క్ సంతృప్తికరంగా ఉండకపోవటంతో మరో సంస్థతో తిరిగి చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందించకపోయినా... విడుదల మాత్రం ఆలస్యమవుతుందన్న విషయం తెలుస్తోంది. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మాధవన్ నెగెటివ్ రోల్ లో కనిపించనున్నారు.