సవ్యసాచికి సీనియర్ సపోర్ట్ | keeravani To Compose Music for Naga Chaitanya Savyasachi | Sakshi
Sakshi News home page

సవ్యసాచికి సీనియర్ సపోర్ట్

Published Thu, Oct 5 2017 1:37 PM | Last Updated on Thu, Oct 5 2017 2:38 PM

Naga Chaitanya Savyasachi

యుద్ధం శరణం సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నాగచైతన్య, ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. సమంతతో పెళ్లి తరువాత షార్ట్ గ్యాప్ తీసుకొని తిరిగి సినిమాలతో బిజీ అయ్యేలా ఇప్పటికే షెడ్యూల్ ప్లాన్ చేశాడు. చైతూ హీరోగా ప్రేమమ్ లాంటి ఘనవిజయం అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేయనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కొంతకాలంగా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమాకు సంగీతమందించనున్నాడట. అక్కినేని ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉండటంతో కీరవాణి ఈ సినిమాకు సంగీతమందించేందుకు అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే చిత్రయూనిట్ మాత్రం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయాన్ని ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement