తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'సవ్యసాచి' | Savyasachi first schedule completed | Sakshi
Sakshi News home page

తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'సవ్యసాచి'

Published Sun, Nov 19 2017 3:02 PM | Last Updated on Sun, Nov 19 2017 3:08 PM

Savyasachi first schedule completed - Sakshi - Sakshi

పెళ్లి తరువాత నాగచైతన్య నటిస్తున్న సినిమా సవ్యసాచి. ప్రేమమ్ సినిమాతో నాగచైతన్యకు బిగెస్ట్ హిట్ అందించిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. ఒక వ్యక్తి రెండు చేతుల్లో ఒక చెయ్యి అతని మాట వినకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈసినిమాతో నిధి అగర్వాల్ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో నాగచైతన్య డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడట. సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలంధిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి యాక్షన్ హీరో ఇమేజ్ కోసం కష్టపడుతున్న నాగచైతన్యకు ఈ సినిమాతో ఆ కోరిక తీరుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement