మరో స్పెషల్‌ సాంగ్‌లో మిల్కీ బ్యూటీ | Tamannah Specail Song In Naga Chaitanya Savyasachi | Sakshi
Sakshi News home page

Published Wed, May 23 2018 12:04 PM | Last Updated on Wed, May 23 2018 12:50 PM

Tamannah Specail Song In Naga Chaitanya Savyasachi - Sakshi

అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. చైతూకు ప్రేమమ్‌ లాంటి సూపర్‌ హిట్ అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబధించిన ఆసక్తికర అప్‌ డేట్‌ ఒకటి టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ మాస్‌ మసాలా స్పెషల్‌ సాంగ్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుందట. గతంలో అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవ కుశ సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్ చేసిన తమన్నా ఇప్పుడు నాగచైతన్య సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement