Tamannah
-
మంచు విష్ణు కన్నప్పలో మిల్కిబ్యూటీ..
-
సినిమా పూర్తై ఎనిమిదేళ్లు.. ఓటీటీకి వస్తోన్న ప్రశాంత్ వర్మ మూవీ!
మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన చిత్రం దటీజ్ మహాలక్ష్మి . ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పటికే దాదాపు ఎనిమిదేళ్లు పూర్తవుతోంది. అయితే తాజాగా ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి హనుమాన్ ఫేమ్ ప్రశాంత వర్మ దర్శకత్వం వహించారు. కాగా.. కంగన రనౌత్ బాలీవుడ్ మూవీ క్వీన్ ఆధారంగా దటీజ్ మహాలక్ష్మి మూవీని 2014లో ప్రకటించారు. 2016లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సౌత్ రీమేక్ రైట్స్ విషయంలో నెలకొన్న వివాదం కారణంగా రిలీజ్ కాలేదు. సినిమా విడుదల కాకపోవడంతో ఈ సినిమా గురించి ఆడియన్స్ కూడా మర్చిపోయారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయి ఇప్పటికే ఎనిమిదేళ్లు కావడంతో థియేటర్లో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఆదరించడం కష్టమేనని భావించినట్లు తెలుస్తోంది. అందుకే నెట్‌ఫ్లిక్స్ తో నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ తేదీపై క్లారిటీ రానుంది. కాగా.. ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ కీలక పాత్రలో కనిపించారు. అయితే గతంలోనూ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలొచ్చాయి. -
తమన్నా భాటియా నటన గురించి మెగాస్టార్ చిరంజీవి
-
'మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ'.. అంటోన్న మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించిన తాజాగా చిత్రం భోళా శంకర్. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రంలో సుశాంత్ కీలకపాత్రలో పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘భోళా మేనియా ’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. (ఇది చదవండి: భోళా శంకర్: మెగాస్టార్, నందమూరి ఫ్యాన్స్ కోసం భలే స్కెచ్!) తాజాగా మరో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 'మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ' అంటూ సాగే మరో లిరికల్ సాంగ్ రిలీజైంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్లలో సందడి చేయనుంది. అన్నా, చెల్లి అనుబంధాలతో ముడిపడి ఉన్న ఓ మాస్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతమందించారు. (ఇది చదవండి: పెళ్లి కాకుండానే రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన నటి!) A delightful melody that weaves a beautiful tapestry of emotions this rainy season❤️#MilkyBeauty Lyrical song out now❤️🔥 - https://t.co/qXFH0C7ghG#BholaaShankar 🔱@SagarMahati thumping musical 🥁 A film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial… pic.twitter.com/qw0fkamyVd — Chiranjeevi Konidela (@KChiruTweets) July 21, 2023 -
హద్దులు దాటేస్తున్న తమన్నా.. 'లస్ట్ స్టోరీస్ 2'లో కూడా!
తమన్నా గుర్తుకు రాగానే మిల్కీ బ్యూటీ, సూపర్ హీరోయిన్, డ్యాన్సులు బాగా చేస్తుంది... తెలుగు ప్రేక్షకులకు నిన్న మొన్నటివరకు ఇవే తెలుసు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే సినిమాల వరకు తనకు తాను కొన్ని హద్దులు పెట్టుకుని, వాటిని తూచ తప్పకుండా పాటించింది. ఇప్పుడేమో వాటిని బ్రేక్ చేసేసింది. ఇదంతా కూడా ఓటీటీల వల్లే జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు 'లస్ట్ స్టోరీస్ 2'లోనూ అలానే రెచ్చిపోయింది. తమన్నాకు ఏమైంది? సినిమాల్లో హీరోయిన్ గా చేసినన్నీ రోజులు.. ముద్దు, రొమాంటిక్ సీన్లకు తమన్నా దూరంగా ఉంది. ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో సినిమాలు, సిరీస్ లు చేసింది గానీ తనకు తాను పెట్టుకున్న రూల్స్ బ్రేక్ చేయలేదు. కానీ ఈ మధ్య 'జీ కర్దా' వెబ్ సిరీస్ లో మాత్రం రెచ్చిపోయింది. బూతు సీన్లు, బూతు డైలాగ్స్ తో మనం చూస్తున్నది తమన్నానేనా అనేంతలా గీత దాటేసింది. కెరీర్ లాస్ట్ స్టేజీకి వచ్చేసిందో ఏమో మరి? లేదంటే డబ్బు కోసమే ఇదంతా చేస్తుందా అని సందేహం వస్తోంది. (ఇదీ చదవండి: ఆ బిజినెస్‌లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?) ట్రైలర్ లో ఏముంది? నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్‌ల్లో 'లస్ట్ స్టోరీస్' ఓ సంచలనం. శృంగారం, దానికి సంబంధించిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ ని నేరుగా మాట్లాడేయటం అప్పట్లో అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రెండో భాగాన్ని తీసుకొస్తున్నారు. జూన్ 29 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు. తొలి భాగాన్ని పోలినట్లే ఇందులోనూ పలు పాత్రలు ఉన్నాయి. పెళ్లి చేసుకోబోయే జంట, ఓ వివాహిత, ఓ మధ్య వయసు జంట, ఓ సింగిల్ అమ్మాయి, ఓ పనిమనిషి పాత్రలు ఇందులో కీలకం. ఆర్.బాల్కీ, కొంకన్ సేన్ శర్మ, సుజోయ్ ఘోష్, అమిత్ రవీంద్రనాథ్ శర్మ నాలుగు ఎపిసోడ్స్ కు దర్శకత్వం వహించారు. విజయ్ తో తమన్నా తమన్నా నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది. ఈ మధ్యనే బహిరంగంగా ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ సిరీస్ షూటింగ్ టైంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. రియల్ కపుల్ కాస్త రీల్ పైనా రెచ్చిపోయారు. ఈ సిరీస్ లో విజయ్ పాత్రకు ఆల్రెడీ పెళ్లి అవుతుంది. అయినాసరే తమన్నా పాత్రతో రిలేషన్ పెట్టుకుంటాడు. వీళ్ల బంధం చివరకు ఏమైందనేది తెలియాలంటే సిరీస్ వచ్చేవరకు ఆగాలి. ఇదే సిరీస్ లో అగ్ని పర్వతం, టెస్ట్ డ్రైవ్ పదాలతో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. ట్రైలర్ లేదా సిరీస్ చూడాలనుకుంటే మాత్రం బీ కేర్‌ఫుల్! (ఇదీ చదవండి: మేనేజర్ మోసం.. రష్మిక షాకింగ్ నిర్ణయం!) -
తమన్నాతో డేటింగ్.. అందుకే బయటకు చెప్పలేదు: విజయ్ వర్మ
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో జంటగా నటించారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా, కాజోల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ చాలాసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సీక్రెట్‌గా ఉన్న బంధాన్ని మిల్కీ బ్యూటీ తాజాగా బయట పెట్టేసింది. దీంతో ఇన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించింది తమన్నా భాటియా. తాజాగా విజయ్ వర్మ సైతం తమ రిలేషన్‌షిప్‌పై స్పందించారు. ( ఇది చదవండి: స్టార్ హీరోయిన్ కూతురు ఆడుకుంటున్న బ్యాగు ధరెంతో తెలుసా?) ప్రస్తుతం లస్ట్ స్టోరీస్-2 ప్రమోషన్లతో బిజీగా ఉన్న విజయ్ వర్మ ఓ యూట్యూబ్ ఛానెల్‌తో చిట్‌చాట్ సందర్భంగా తమన్నాతో రిలేషన్‌పై నోరు విప్పారు. తమ ప్రేమ గురించి ఇన్ని రోజులు బయటకు చెప్పకపోవడానికి గల కారణాలు వెల్లడించారు. విజయ్ వర్మ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ప్రజలకు నా ప్రొఫెషనల్ కెరీర్‌కు సంబంధించిన విషయాలు మాత్రమే చెప్పాలనుకున్నా. సరైన సమయం వచ్చినప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి మీతో చెబుదామనుకున్నా.' అని అన్నారు. కాగా.. ఇప్పటికే విజయ్‌తో ప్రేమలో ఉన్నానని.. లస్ట్ స్టోరీస్-2 సెట్స్‌లోనే లవ్‌లో పడినట్లు మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చింది. విజయ్ తోడుగా ఉంటే హ్యాపీగా ఉంటానని తెలిపింది. - కె.తారక రామ కుమార్ ( ఇది చదవండి: స్టార్ హీరో మనవరాలు డేటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!) -
తమన్నాకు రజినీకాంత్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
మిల్కీబ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన నటనతో మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది భామ. అప్పట్లోనే అందం తిన్నానండీ అందుకే ఇలా ఉన్నానండీ అనే పాటను రాయడానికి ఒక గీత రచయితకు ప్రేరణగా నిలిచిన అందగత్తె నటి తమన్నాను అందుకే మిల్కీబ్యూటీ అంటారు. వెండితెరపై అందాల ఆరబోతలో తనకు తానే సాటి అనిపించుకునే తమన్నా అవకాశం వచ్చినప్పుడల్లా తనలోని నటనను చాటుకుంటూనే ఉన్నారు. (ఇది చదవండి: సుశాంత్ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!) 2005 నుంచి ఇప్పటి వరకు హీరోయిన్గా నటిస్తూ నాటౌట్‌గా నిలిచారు. ప్రస్తుతం తమన్నా చేతిలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలతో కలిపి ఐదారు చిత్రాలు ఉన్నాయి. అందులో రజనీకాంత్‌తో కలిసి నటించిన జైలర్ చిత్రం ఆగస్టు 10న విడుదలకు సిద్ధమవుతుండగా, ఆ మరుసటిరోజునే అంటే ఆగస్టు 11న తెలుగులో చిరంజీవితో నటించిన భోళాశంకర్ చిత్రం తెరపైకి రానుంది. ఈమె నటిస్తున్న తమిళ చిత్రం అరణ్మణై–4, మలయాళం చిత్రం బాంద్రా, హిందీ చిత్రం బోల్ చుడియన్ చిత్రాలు సెట్‌పై ఉన్నాయి. ఈ 33 ఏళ్ల ఈ పరువాల సుందరి ఇంకా తన అందాలను మెరుగుపరుచుకునే పనిలోనే ఉన్నారు. అలా లేటెస్ట్గా తీయించుకున్న ఫొటోలను ఈ అమ్మడు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ గ్లామరస్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే రజనీకాంత్ సరసన నటించిన జైలర్ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. రజనీకాంత్ తనను కలిసిన వారికి రాఘవేంద్రస్వామి విగ్రహాన్ని, ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని బహూకరించడం ఆనవాయితీ. అదేవిధంగా నటి తమన్నాకు ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని బహూకరించారట. ఈ విషయాన్ని తమన్నా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ జైలర్ చిత్ర షూటింగ్ సమయంలో రజనీకాంత్ తనకు ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఆయన సంతకంతో బహూకరించారని అది తనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. (ఇది చదవండి: థియేటర్లో లైంగిక వేధింపులు.. ఒక్కసారిగా మైండ్ బ్లాంక్: స్టార్ హీరోయిన్) -
Lust Stories 2 teaser: కారు కొనడానికేమో టెస్ట్ డ్రైవ్, మరీ పెళ్లికి ..?
నీనా గుప్తా, కాజోల్, మృణాల్ ఠాకూర్, తమన్నా, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం లస్ట్ స్టోరీస్-2. ఈ మూవీకి అమిత్ రవీందర్నాథ్ శర్మ, కొంకణ సెన్ శర్మ, ఆర్ బాల్కీ, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. (ఇది చదవండి: చిన్న సూట్‌కేసుతో ముంబై వచ్చా.. చేతిలో డబ్బుల్లేక: నటి) ఈ చిత్రంలో సీనియర్ నటి నీనా గుప్తా ప్రధాన పాత్రలో నటించారు. టీజర్ ప్రారంభంలో నీనా గుప్తా మాటలు టీజర్‌పై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఒక కారు కొనడానికి ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తాం.. మరీ పెళ్లికి ముందు ఇలాగే చేయకూడదా అని అడిగింది. నీనా మాటలకు కాజోల్ నవ్వుతూ కనిపించింది. కాగా.. ఈ చిత్రంలో అంగద్‌కు జోడీగా మృణాల్, విజయ్ వర్మకు జంటగా తమన్నా నటిస్తున్నారు. ఈ టీజర్లో విజయ్, తమన్నా కూడా రొమాంటిక్‌గా కనిపించారు. కాగా.. విశాల్ భరద్వాజ్ వెబ్ సిరీస్ చార్లీ చోప్రా & ది మిస్టరీ ఆఫ్ సోలాంగ్ వ్యాలీలో కూడా నీనా నటిస్తున్నారు. కాజోల్ కూడా ది గుడ్ వైఫ్ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. (ఇది చదవండి: లలితా జ్యువెలరీలో దోపిడి, చివరకు ఎయిడ్స్‌తో.. ఆ దొంగ కథే జపాన్?) Love or lust… you decide. #LustStories2 Coming soon, only on @NetflixIndia! 🤩 #LustStories2OnNetflix#RBalki @konkonas @sujoy_g @iAmitRSharma @Neenagupta001 @mrunal0801 @Imangadbedi @TillotamaShome @AmrutaSubhash @itsKajolD #KumudMishra @RSVPMovies… pic.twitter.com/bo7tq7R3kr — Tamannaah Bhatia (@tamannaahspeaks) June 6, 2023 -
మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. డేటింగ్‌పై మొదలైన చర్చ!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన భామ.. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో నటుడు విజయ్ వర్మతో కలిసి గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ రోజు తమన్నాను విజయ్ ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరిపై పలుసార్లు డేటింగ్లో ఉన్నారని రూమర్స్ వినిపించాయి. అయితే తాజాగా మరోసారి ఈ జంట కెమెరా కంటికి చిక్కింది. ఓ డిన్నర్ పార్టీ నుంచి బయటకు వస్తూ జంటగా కనిపించడంతో లవ్‌బర్డ్స్ అంటూ మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. (ఇది చదవండి: నా తమన్నాతో తిరుగుతున్నావా?.. విజయ్ వర్మపై నటుడి కామెంట్స్ వైరల్!) శుక్రవారం రాత్రి ముంబయిలోని బాంద్రాలో డిన్నర్ పార్టీలో తళుక్కున మెరిశారు. ఇద్దరు కూడా బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపించారు. దీంతో మరోసారి ఈ జంట డేటింగ్ గురించి బీటౌన్‌లో చర్చ మొదలైంది. కాగా.. విజయ్ వర్మ ఇటీవలే రిలీజైన దహాద్ వెబ్ సిరీస్‌లో కనిపించారు. ప్రస్తుతం ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో కనిపించనున్నారు. ఇందులో కరీనా కపూర్ ఖాన్, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ సరసన భోళాశంకర్‌లో నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. (ఇది చదవండి: ఆ విషయంలో నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తా: అనుపమ) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నా తమన్నాతో తిరుగుతున్నావా?.. విజయ్ వర్మపై నటుడి కామెంట్స్ వైరల్!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన భామ.. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో నటుడు విజయ్ వర్మతో కలిసి గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ రోజు తమన్నాను విజయ్ ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అప్పటి నుంచి ఈ జంట ఎక్కడా చూసిన కనిపించడంతో డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. చాలా సార్లు విమానాశ్రయాల్లో ఇద్దరు కెమెరాలకు చిక్కడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా మరోసారి ఇద్దరు కలిసి కారులో వెళ్తూ కనిపించారు. దీంతో మిల్కీ బ్యూటీ- విజయ్ వర్మ డేటింగ్ రూమర్స్ మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. (ఇది చదవండి: ఆ సినిమా ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసింది: మధుబాల) అయితే తాజాగా వీరిద్దరి రిలేషన్‌పై విజయ్ వర్మ స్నేహితుడు, సహానటుడు గుల్షన్ దేవయ్య క్రేజీ కామెంట్స్ చేశారు. విజయ్ వర్మ తన ఇన్‌స్టాలో 'దహాద్' థ్రిల్లర్ వెబ్ సిరీస్ టీజర్‌ను పోస్ట్ చేశారు. ఈ టీజర్ చూసిన గుల్షన్.. తమన్నాతో విజయ్ వర్మ డేటింగ్‌పై ఫన్నీగా పోస్ట్ చేశారు. గుల్షన్ తన కామెంట్లో రాస్తూ..' నా తమన్నాతో నువ్వు తిరుగుతున్నావ్. నాకు సరైన బుద్ధి చెప్పావ్ విజయ్. ఇంకా నా పరువు తీయనందుకు నీకు చాలా థ్యాంక్స్. లేకపోతే ఏం జరిగేదో.. హే రామ్' అంటూ పోస్ట్ చేశారు. అయితే ఇది కావాలనే విజయ్ వర్మను ఆటపట్టించేందుకు చేశాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. (ఇది చదవండి: అమెరికాలో లయ.. ఎలాంటి జాబ్ చేస్తుందో తెలుసా?) అయితే ఈ జంట తమ రిలేషన్‌పై ఇప్పటివరకు స్పందించలేదు. కాగా.. తమన్నా, విజయ్ మొదటిసారిగా 'లస్ట్ స్టోరీస్ 2' సినిమాలో కలిసి నటించబోతున్నారు. కాగా.. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'దహాద్'లో విజయ్ వర్మ, సోనాక్షి సిన్హా, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ మే 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్‌ను మే 3న రిలీజ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Vijay Varma (@itsvijayvarma) -
IPL 2023 Opening Ceremony : ఐపీఎల్ ప్రారంభ వేడుకలు అదరహో (ఫొటోలు)
-
ఐపీఎల్ ఆరంభ వేడుకలు: దుమ్ములేపిన తమన్నా, రష్మిక.. తెలుగు పాటలతో
IPL2023OpeningCeremony: ఐపీఎల్-2023 సీజన్ ఆరంభం వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సహా కార్యదర్శి జై షా తదితరులు హాజరయ్యారు. Photo Credit : IPL Twitter నటి మందిరా బేడి ఐపీఎల్ యాంకర్‌గా పునరాగమనం చేసింది. ఆరంభ వేడుకులకు ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఇక నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. Photo Credit : IPL Twitter కాగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ తన గానా బజానాతో అభిమానులను అలరిస్తున్నాడు. అర్జిత్ సింగ్‌తో పాటు పాన్ ఇండియా బ్యూటీలు రష్మిక మంధాన, మిల్కీ బ్యూటీ తమన్నాలు తమ డాన్స్‌తో ఫ్యాన్స్‌ను ఉర్రుతలూగించారు. Photo Credit : IPL Twitter Photo Credit : IPL Twitter ఊ అంటావా అంటూ తమన్నా మాస్ స్టెప్పులు హీరోయిన్ తమన్నా భాటియా ఐపీఎల్-2023 ఆరంభ వేడుకల్లో తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. టమ్ టమ్ అంటూ ట్రెండింగ్ పాటకు స్టెప్పులేసిన తమన్నా.. ఊ అంటావా మామా అంటూ ఉర్రూతలూగించింది. Photo Credit : IPL Twitter సామీ గర్ల్ రష్మిక కూడా.. పుష్ప క్రేజ్‌తో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోన్న రష్మిక మందన్నా సామీ సామీ అంటూ ప్రేక్షకులకు వినోదం పంచింది. శ్రీవల్లి పాటతో పాటు గంగూభాయ్ కతియావాడీలోని డోలీడా పాటకు అదరగొట్టే స్టెప్పులేసింది. Photo Credit : IPL Twitter 𝙈𝙚𝙡𝙤𝙙𝙞𝙤𝙪𝙨! How about that for a performance to kick off the proceedings 🎶🎶@arijitsingh begins the #TATAIPL 2023 Opening Ceremony in some style 👌👌 pic.twitter.com/1ro3KWMUSW — IndianPremierLeague (@IPL) March 31, 2023 𝘿𝙖𝙯𝙯𝙡𝙞𝙣𝙜 𝙖𝙨 𝙚𝙫𝙚𝙧!@tamannaahspeaks sets the stage on 🔥🔥 with her entertaining performance in the #TATAIPL 2023 opening ceremony! pic.twitter.com/w9aNgo3x9C — IndianPremierLeague (@IPL) March 31, 2023 -
స్టైల్ ఐకాన్ అవార్డ్స్ లో మెరిసిన తారలు
-
డేటింగ్ రూమర్స్.. ఫీలింగ్స్ అర్థం చేసుకోగలనన్న మిల్కీ బ్యూటీ
తమన్నా బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అటు బాలీవుడ్.. ఇటు సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మిల్కీ బ్యూటీగా అభిమానులను అలరించింది. తెరపై తన అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి తమన్నాపై డేటింగ్ గాసిప్స్ గుప్పుమంటున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్లో ఉందంటూ ఒక్కసారిగా రూమర్స్ హల్ చల్ చేశాయి. అయితే తాజాగా దీనిపై మిల్కీ బ్యూటీ స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన తమన్నా ఇవన్నీ చాలా ఫన్నీగా అనిపిస్తాయని తెలిపింది. తమన్నా మాట్లాడుతూ.. 'సౌత్‌లో ఎవరికైనా ఓ టైటిల్ ఉంటుంది. అందుకే మిల్కీ బ్యూటీ అని పిలుస్తారు. నా కలర్ వల్ల అలా పిలుస్తారనుకుంటా. ఒక నటిగా నేను ఫ్యాన్స్ ఫీలింగ్స్ అర్థం చేసుకోగలను. నేను కొంతమంది ఫ్యాన్స్‌తో కూడా మాట్లాడాను. కొందరు అభిమానులు నేను లవ్‌లో ఉన్నట్లు కామెంట్స్ చేస్తుంటారు. వాటిని నేను కూడా చదివా. అవీ చాలా ఫన్నీగా అనిపించాయి. ఇవన్నీ ఎవరు రాస్తున్నారు? ప్రతి ఒక్కరికీ జీవితం ఉంటుంది. నా జీవితంలో చాలా ప్రేమ పొందా. ప్రతి విషయంలో నెగెటివిటీ పెరిగిపోయింది. ' అంటూ తనపై వస్తున్న రూమర్స్‌ను సింపుల్‌గా కొట్టిపారేసింది. -
వాలంటైన్స్ డే: తమన్నా-విజయ్ వర్మ రిలేషన్‌పై క్లారిటీ వచ్చేసింది?
ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెరపై తన అందం, అభినయం, డాన్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తుంది. అలా మిల్కీ బ్యూటీగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే ఇప్పటికీ గాసిప్స్‌కు దూరంగా ఉన్న తమన్నా ఈ ఏడాది న్యూఇయర్ నుంచి డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లోకి ఎక్కింది. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో నటుడు విజయ్ వర్మకు లిప్‌లాక్ ఇచ్చి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. దీంతో అతడితో తమన్నా రిలేషన్లో ఉందంటూ ఒక్కసారిగా గాసిప్స్ గుప్పుమన్నాయి. దీనిపై ఇప్పటి మిల్కీ బ్యూటీ దీనిపై స్పందించకపోవడం గమనార్హం. అయితే తమన్నా రిలేషన్ స్టేటస్‌పై అభిమానులంతా సందేహంలో ఉన్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాలంటైన్స్ డే సందర్భంగా తమన్నాతో డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు నటుడు విజయ్. ప్రేమికుల రోజును పురస్కరించుకుని విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ ఓ పోస్ట్ షేర్ చేశాడు. అందులో ఎదురెదురుగా నిలుచుని ఉండి, ఇద్దరి కాళ్ల మధ్యలో హార్ట్ ఎమోజీని జత చేసి ఫొటో పోస్ట్ చేశాడు. అయితే ఈ ఫొటోలో వారి ముఖాలు కనపడకుండ జాగ్రత్త పడ్డాడు. విజయ్ ఎదురుగా ఉన్నది తమన్నా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు ఈ వ్యక్తి వేసుకున్న షూ, జాకెట్ ఆధారంగా అది తమన్నానే అంటూ పట్టేశారు నెటిజన్లు. గతంలో తమన్నా అచ్చం అలాంటి షూ, చేతిలో జాకెట్ పట్టుకుని ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాలంటైన్స్ డే రోజు స్పెషల్ పోస్ట్ షేర్ చేసి పరోక్షంగా తమన్నాతో రిలేషన్ రూమర్స్‌పై స్పష్టత ఇచ్చాడని నెటిజన్లంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇదే విషయాన్ని కన్ఫాం చేస్తూ తమన్నా ఫ్యాన్ పేజీలో ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ కూడా షేర్ చేశారు. దీంతో ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా తమన్నా ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్ చిత్రంతో బిజీగా ఉండగా.. తమిళం, హిందీలో పలు చిత్రాలు చేస్తోంది. Exclusive Confirmed 👌🏻 Happy Valentine's day to #VijayVarma Live in partner @tamannaahspeaks parents arent in favour of Tamanna living with Vijay and getting married with him after few months. Her parents tried hard to change decision but she's behaving adamant. Look at choice pic.twitter.com/KJ07mDK1oM — ♥️Sneha Tamannaah 😘 💫 (@Tamannaahspeakk) February 14, 2023 -
నా జీవితంలో ఇలా జరుగుతుందని ఊహించలేదు: తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్లలో ఒకరు. ఇటీవలే 'గుర్తుందా శీతాకాలం' సినిమాతో అభిమానులను పలకరించింది. నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన చిత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో బిజీ అయిపోయింది అమ్మడు. మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్, తమిళ స్టార్ రజినీకాంత్‌తో జైలర్ చిత్రంలో కనిపించనుంది భామ. ఇటీవల ఈ రెండు సినిమాలపై గురించి ఆసక్తికర విషయాలను పంచకుంది భామ. ఇద్దరు అగ్రహీరోలతో నటిస్తానని నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదని అన్నారు. తమన్నా మాట్లాడుతూ.. ' రజినీకాంత్ సర్ పక్కన నటిస్తానని నేనెప్పుడు అనుకోలేదు. ఈరోజు నాకల నిజమైంది. ఆయన సెట్లో చూసే రోజు వెయిట్ చేశా. గతంలో చిరంజీవితో సైరా నరసింహారెడ్డిలో నటించా. కానీ మళ్లీ భోళా శంకర్ చిత్రంలో నటించే అవకాశం దక్కడం నా అదృష్టం. ఆయనతో కలిసి డ్యాన్స్ చేసేందుకు ఆతృతగా ఉన్నా.' అంటూ చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ. కాగా.. హిందీలోనూ పలు సినిమాల్లో నటిస్తోంది ముద్దుగుమ్మ. మలయాళంలో తెరకెక్కుతున్న బాంద్రా చిత్రంలో కనిపించనుంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు పలు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. -
ఈ సంక్రాంతికి సెలబ్రెటీల సందడి చూశారా?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందడి కనిపిస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లు ఎలాంటి సందడి లేకుండ నిరాండబరం జరుపుకున్నారు. ఇక పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో సాధారణ ప్రజల నుంచి సనీ సెలబ్రెటీల వరకు మకర సంక్రాంతి కుటుంబాలతో కలిసి స్పెషల్‌గా సెలబ్రెట్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువకు సినీ సెలబ్రెటీల తమ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: ‘నేను అలా అనకూడదు.. కానీ హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు’ హీరోహీరోయిన్లు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ సంక్రాంతి స్పెషల్ పోస్ట్స్ షేర్ చేస్తున్నారు. మహేశ్ బాబు కూతురు సితార, అల్లు అర్జున్ ముద్దు తనయ అల్లు అర్హ, స్నేహరెడ్డివ నుంచి తమన్నా, నివేతా థామస్, విజయ్ దేవరకొండ సంక్రాంతి విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ఈ సంక్రాంతికి తారల సందడి ఎలా ఉందో ఓ సారి ఇక్కడో లుక్కేయండి! View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
ఇక నా పని అయిపోయిందనుకున్నా... అదే నా కోరిక : తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నాది నటిగా రెండు దశాబ్దాల పయనం. ఈ సుదీర్ఘ పయనంలో కథానాయకిగా తమన్నా అన్ని రకాల పాత్రలను చేశారు. నట ప్రయాణం బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వయా టాలీవుడ్లో సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. 35 ఏళ్ల ఈ బ్యటీ ఇప్పటికీ వెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. కాగా ఇటీవల పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న తమన్నా భాటియా ఒక భేటీలో పేర్కొంటూ తాను ముంబయిలో ప్లస్–2 చదువుకుంటున్న రోజుల్లోనే సినీ రంగ ప్రవేశం చేశానని చెప్పారు. అప్పుడు తన వయసు 15 ఏళ్లని, మొదటిగా సాంద్ సా రోషన్ షహానా అనే హిందీ చిత్రంలో నటింనట్లు పేర్కొన్నారు. అది ప్లాఫ్ అయ్యిందని, ఆ తరువాత అదే ఏడాది తెలుగులో నటింన శ్రీ చిత్రం కూడా సక్సెస్ కాలేదని చెప్పారు. దీంతో తన పని అయిపోయిందని భావించానన్నారు. అలాంటి సమయంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, ఆ చిత్రం ఘన విజయంతో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయన్నారు. అలా తెలుగు, తమిళం భాషల్లో పలు ప్రముఖ హీరోలతో నటించి గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పారు. మధ్యలో ఐటెం సాంగ్స్‌లో కూడా నటించే అవకాశాలు వస్తున్నాయన్నారు. ఇంకా మంచి మంచి కథా పాత్రల్లో నటించి అభిమానులను సంతోషపరచాలన్నదే తన కోరికని తమన్నా పేర్కొన్నారు. -
ఫ్యాన్స్‌తో తమన్నా మాస్ డాన్స్, వీడియో వైరల్
మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీ మూవీతో తెలుగు తెరపై మెరిసిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక డాన్స్‌లోనూ హీరోలకు పోటీ పడుతూ స్టెప్పులేస్తుంది. ప్రస్తుతం హీరోయిన్గా పలు చిత్రాలు చేస్తూ వీలు చిక్కినపడల్లా స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో తమన్నా ఫ్యాన్స్‌తో కలిసి డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెటింట వైరల్‌గా మారింది. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌కి ముఖ్య అతిథికి హాజరైన తమన్నా అక్కడ అభిమానులతో మాస్ స్టెప్పులేసింది. చదవండి: పెద్దింటి కోడలు కాబోతున్న యంగ్ హీరోయిన్ వర్ష! ఇటీవల చెన్నైలో ‘మెటా క్రియేటర్స్ డే’ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా అటెండ్ అయిన తమన్నా.. తళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలో ‘వాతీ కమింగ్’ సాంగ్ కి మాస్ స్టెప్పులేసి అదరగొట్టింది. ఆ వేడుకకు హాజరైన ఓ నెటిజన్.. తమన్నా డ్యాన్స్ వీడియోని ట్విట్టర్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఇటీవల బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ చిత్రాలతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో ఆమె నటించిన గుర్తుందా సీతాకాలం మూవీ విడుదల కావాల్సి ఉంది. చదవండి: విజయ్‌తో స్వయంవరం? జాన్వీ కపూర్ షాకింగ్ రియాక్షన్ .@tamannaahspeaks Vibes for #vaathicoming at #Metacreatorday event at Chennai. pic.twitter.com/lPuZn7ON4F — Abєєѕ (@AbeesVJ) October 27, 2022 -
హీరోయిన్ తమన్నా బౌన్సర్ల దాడి.. వీడియో వైరల్
టాలీవుడ్ బ్యూటీ తమన్నా బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులపై రెచ్చిపోయారు. కొందరు తమన్నా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించగా.. మీడియా ప్రతినిధులతో బౌన్సర్లు వాగ్వావాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కెమెరామెన్లకు గాయాలయ్యాయి. తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రెస్మీట్లో ఈ సంఘటన జరిగింది. అనంతరం విషయం తెలుసుకున్న చిత్ర బృందం మీడియాకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. (చదవండి: Tamannaah Bubbly Bouncer: కోటీశ్వరుడికి ‘బబ్లీ బౌన్సర్’గా తమన్నా..) హీరోయిన తమన్నా టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'బబ్లీ బౌన్సర్'. ఈ సినిమాలో సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్ కీలక పాత్రల్లో నటించారు. వాస్తవిక సంఘటన ఆధారంగా దర్శకుడు మధుర్ భండార్కర్ తెరకెక్కించిన ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో సెప్టెంబరు 23న విడుదలవుతోంది. విశేషమేమిటంటే ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా ఉంటుంది. మధూర్ బండార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా లేడీ బౌన్సర్‌గా నటించారు. ఇది కామెడీతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ మూవీ నేరుగా ఓటీటీ విడుదల చస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. -
‘జైలర్’లో తమన్నా పాత్ర అలా ఉంటుంది!
ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట జైలర్. అన్నాత్తే తరువాత రజనీకాంత్ నటిస్తున్న చిత్రమిది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. బీస్ట్ చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. బీస్ట్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో జైలర్ చిత్రం రజనీకాంత్ అభిమానులను కాస్త సంకటంలో పడేయటానికి కారణం ఇదేనని ప్రచారం జరుగుతోంది. చదవండి: పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్‌ఫ్రెండ్ కావాలి: సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్ అయితే తలైవా ఈసారి పక్కా మాస్ చూపించబోతున్నారని, చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ చూసిన తరువాత ఆ నమ్మకం కలుగుతోందని అభిమానులు చెబుతున్నారు. చిత్ర షూటింగ్ ఇప్పుడే మొదలైంది. చిత్రంలో రజనీకాంత్‌తో పాటు ఐశ్వర్యారాయ్, తమన్నా, ప్రియాంక మోహన్, శాండల్ ఉడ్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ప్రముఖులు నటిస్తున్నారు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఇందులో ఆయన రెండు పాత్రలను దర్శకుడు కొత్తగా డిజైన్ చేసినట్లు సమాచారం. చదవండి: లైగర్ మూవీ ఫ్లాప్ అయితే? విలేకరి ప్రశ్నకు విజయ్ షాకింగ్ రియాక్షన్ లేకపోతే ఇందులో రజనీకాంత్ సరసన ఎవరు నటిస్తున్నారు? అన్నది ఆసక్తిగా మారింది. చిత్రంలో తమన్నా నటిస్తున్న పాత్ర చిన్న పాత్రేనని తాజా సమాచారం. ఇంకా చెప్పాలంటే పేట చిత్రంలో త్రిష పాత్ర మాదిరి జైలర్ చిత్రంలో తమన్నా అప్పుడప్పుడు వచ్చి కనిపించి మెరిపిస్తుందట. ఇందులో నిజం ఎంత అనేది పక్కన పెడితే చాలా గ్యాప్ తరువాత తమ అభిమాన నటిని చూడబోతున్నామని సంబరం పడే తమన్నా అభిమానులకు మాత్రం ఇది నిరాశపరిచే అంశం అవుతుంది. -
ఆ అనుభూతి ఉత్సాహాన్నిచ్చింది: తమన్నా
హీరోయిన్లు ఒక స్థాయికి చేరుకున్న తరువాత పెళ్లి, ఇతర విషయాలపై దృష్టి పెడుతారు. దానికోసం వారు దేవాలయాలు సందర్శిస్తూ ఆధ్యాత్మిక బాట పడుతుంటారు. దీనికి సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఉదాహరణ. పెళ్లికి ముందు నయన్ గుళ్లు గోపురాలు తిరిగి పూజలు నిర్వహించారు. తాజాగా నయన్ బాటలోనే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఆధ్యాత్మిక చింతన బాట పట్టారని తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన ఈ అమ్మడు టాప్ హీరోయిన్గా ఎదిగారు. ఇంతవరకు పెళ్లి ఊసెత్తని ఈ గుజరాతి భామ షూటింగ్ విరామ సమయంలో ఆలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. అంతేకాదు ఇటీవల హిమాలయ ప్రాంతాలను కూడా చుట్టివచ్చారు. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల మూవీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే! ప్రసిద్ధి చెందిన వైష్ణవీ దేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక పయనం తనకు మంచి అనుభూతి, ఉత్సాహాన్ని కలిగించిందని చెప్పారు. దీనితో పాటు ఆమె ఈశా యోగా మైదానానికి వెళ్లి ధ్యానం చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అందులో ఈశ యోగి మైదానంలో తాను గడిపిన మూడు రోజులు జీవితంలో మధురమైనవని పేర్కొన్నారు. ఆరోగ్య పరంగానూ పలు మంచి విష యాలు జరిగాయని, ప్రపంచం ఎంతో ఆశీర్వకరమైన దంటూ అనుభవపూర్వకంగా తెలిసిందన్నారు. -
తమన్నా-సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
టాలెంటెడ్ హీరో సత్యదేశ్, తమన్నా జంటగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. డైరెక్టర్ నాగశేఖర్ దర్వకత్వం వహించిన ఈ మూవీ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉండగా కరోనా, పెద్ద సినిమాల విడుదలతో వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసి ప్రకటించారు. గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని జూలై 15న విడుదల చేయబోతున్నామంటూ తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. చదవండి: సోషల్ మీడియాలో అశ్లీల కామెంట్స్, పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ అయితే ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిలైయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్ లైఫ్ చాలామందికి ఓ మధుర జ్ఞాపకంలా ఉంటుంది. జీవితంలో సెటిలయ్యాక తమ కాలేజ్ డేస్, యూత్‌ఫుల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుని ఆనందపడతారు. అలాంటి సంఘటనల సమాహారంతో ‘గుర్తుందా శీతాకాలం’ రూపొందింది. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భావన రవి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్.ఎస్. రెడ్డి, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరోయిన్ మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. చదవండి: అల్లు అర్జున్‌పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు Embrace the Magical Love Journey 💞#GurtundaSeetakalam is releasing worldwide on July 15th 🥰#GurtundaSeetakalamOnJuly15@ActorSatyaDev @tamannaahspeaks @nagshekar @akash_megha @SriVedaakshara @kaalabhairava7 @IAmKavyaShetty @nagshekarmov @anandaudioTolly pic.twitter.com/VyuFQYyFXe — Sri Vedaakshara Movies (@SriVedaakshara) June 9, 2022 -
చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకున్నా: తమన్నా
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. ‘శ్రీ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా స్టార్ హీరోలందరి సరసన నటించిన అగ్ర నటిగా పేరు తెచ్చుకుంది. దక్షిణాదిలో ఆమె నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయిన తన నటనతో మెప్పిస్తూ వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంది. సౌత్‌లో హీరోయిన్గా బిజీ ఉన్న క్రమంలో తమన్నాకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో అజయ్ దేవగన్ సరసన ‘హిమ్మత్ వాలా’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ మిల్కీ బ్యూటీ. చదవండి: కాన్స్ చిత్రోత్సవాల్లో ఐశ్వర్యరాయ్.. బ్యూటిఫుల్, దేవత అంటూ ప్రశంసలు అదే సమయంలో సౌత్ స్టార్ హీరోయిన్గా రాణిస్తుండంతో ఈ మూవీతో బాలీవుడ్లో కూడా మంచి హిట్కొట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం రిలీజ్ అనంతరం దారుణంగా పరాజయం పొందింది. దీంతో ఆ తర్వాత తమన్నాకు బాలీవుడ్లో పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న తమన్నా హిందీ ఆఫర్స్‌పై స్పందించింది. తాను చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటున్నానని, ప్రస్తుతం చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేసుకుంటున్నానని చెప్పింది. చదవండి: త్రివిక్రమ్, మహేశ్ సినిమాలో మరో స్టార్ హీరో! సౌత్ సినిమాలు బాలీవుడ్లో బాగా ఆడుతున్నాయని పేర్కొన్నా తమన్నా దక్షిణాది సినిమాలపై ఎలాంటి కంప్లెయింట్స్ లేవని చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం తమన్నా తెలుగులో నటించిన ఎఫ్ 3 మూవీ మే 27న విడుదుల కాబోతోన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు గుర్తుందా సీతాకాలం సినిమాలు చేస్తోంది. హిందీలో ‘బోలే చుడియాన్’, ‘బబ్లీ బౌన్సర్’, ‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’ చిత్రాల్లో నటిస్తుండగా..షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్‌లో కీ రోల్ పోషిస్తోంది. ఇటీవలే వరుణ్ తేజ్ నటించిన గని సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది మిల్కీ బ్యూటీ. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఎఫ్ 3’ మూవీలోని తమన్నా ఇంట్రెస్టింగ్ లుక్ వైరల్!
Tamanna Bhatia Goddess Look Photos: గ్లామర్‌కి చిరునామా అన్నట్లుగా ఉంటారు మిల్కీ బ్యూటీ తమన్నా. ఇప్పటివరకూ చేసిన క్యారెక్టర్లు ఆమెకు ‘గ్లామరస్ హీరోయిన్’ పేరునే తెచ్చాయి. అలాంటి తమన్నా పూర్తి సంప్రదాయబద్ధంగా.. అది కూడా అమ్మవారిలా దర్శనమిస్తే కచ్చితంగా హాట్ టాపిక్ అవుతుంది. అమ్మవారిలా అలంకరించుకుని, అరిటాకులో ఇడ్లీ, దోసె ఆరగిస్తున్న ఫొటోలను షేర్ చేసింది. దీనికి ‘‘ఇలా అరిటాకులో తింటుంటే నాకు నేను దేవతలా అనిపిస్తున్నాను. అరిటాకు మనకు సులభంగా దొరుకుతుంది. పర్యావరణానికి కూడా మంచిది. మన మూలాలకు వెళ్లినట్లుగా అనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. చదవండి: బాలయ్య, నేను తొమ్మిది రోజులు మైనింగ్ ఏరియాలో కష్టపడ్డాం : శ్రీకాంత్ ఇక తమన్నా ఫొటోలు చూసి, ఆమె అభిమానులు ‘మీరు దేవత, జై మాతా, జై తమన్నా మాతా, అన్నపూర్ణ, మీరు అందరి దేవత’ అని కామెంట్లు పోస్ట్ చేశారు. హఠాత్తుగా తమన్నా ఇలా అమ్మవారి గెటప్ వేయడానికి కారణం ఏంటంటే... ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఎఫ్ 3’మూవీలో లుక్ అని, ఈ గెటప్‌తో వెంకిని తమన్నా ఓ ఆటాడుకునే సన్నివేశమని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన ఫొటో అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా లుక్ అదుర్స్ అని చెప్పొచ్చు. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
‘భోళా శంకర్’లో తమన్నా ఫిక్స్, హాట్‌టాపిక్‌గా మిల్కీ బ్యూటీ రెమ్యునరేషన్
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా ‘భోళా శంకర్’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళ మూవీ ‘వేదాళం’ రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోంది. నవంబర్ 11న ఈ మూవీ పూజ కార్యక్రమం జరగనుందని, నవంబర్ 15 నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు ఇటీవల చిత్ర బృందం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో చిరుకు జోడి కట్టనుంది ఎవరన్నది ఆసక్తిగా మారింది. మొదట నయనతార పేరు వినిపించగా కొద్ది రోజుల నుంచి తమన్నా పేరు తెరపై వచ్చింది. చదవండి: అల్లు అర్జున్‌కి షాకిచ్చిన సజ్జనార్, లీగల్ నోటీసులు జారీ తాజాగా మేకర్స్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. తమన్నా హీరోయిన్గా ఖరారు చేసినట్లు తాజాగా మూవీ యూనిట్ అధికారిక ప్రుకటన వెలువరిచింది. అలాగే తమన్నా కూడా తన ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు తమన్నా ట్వీట్ చేస్తూ.. ‘మెగా మాసివ్ సినిమా భోలా శంకర్‌లో నటిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. చిరంజీవి గారితో కలిసి మరోసారి నటించడానికి ఎంతో ఆతృతగా ఉంది. దర్శకుడు మెహర్ రమేశ్ గారు దీనిని నిజం చేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చింది. చదవండి: ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ విషయంపై స్పందించిన కాజల్ ఇప్పటికే తమన్నా సైరా నరసింహ రెడ్డిలో చిరుతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తమన్నా రెమ్యునరేషన్‌పై కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర కోసం తమన్నా సంప్రదించగా మిల్కీ బ్యూటీ ఏకంగా రూ. 3 కోట్లు డిమాండ్ చేసిందని, చిత్ర యూనిట్ కూడా దాని అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇక భోళా శంకర్ సినిమా విషయానికొస్తే ఈ సినిమాను తమిళంలో సంచలన విజయం సాధించిన వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరుకి చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. Honored and ecstatic to be a part of the MEGA MASSIVE MOVIE #BholaaShankar 🔱 Can't wait to share the screen with @KChiruTweets sir once again! Bring it on @MeherRamesh Gaaru! 😎@AnilSunkara1 @KeerthyOfficial @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/YV0fIm3uVp — Tamannaah Bhatia (@tamannaahspeaks) November 9, 2021 -
లేడీ బాస్‌గా రీతూ వర్మ, మూతి ముడుచుకున్న నిహారిక
నలుపు అంటే ఇష్టం అంటున్న ఐశ్వర్య రాజేశ్ చీరకట్టులో బాలీవుడ్ భామ జాన్వి కపూర్ హాట్ హాట్ ఫోజులతో కవ్విస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా తండ్రి కమల్ హాసన్, చెల్లి అక్షర హాసన్‌తో శుృతి హాసన్ View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Madonna Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
1979 లోభూమి నాశనం అవుతుందన్నారు..అసలేం జరిగిందంటే..
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ కందెరావ్ దర్శకత్వంలో డా. రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను హీరోయిన్ తమన్నా విడుదల చేశారు. ‘‘1979లో సాగే పీరియాడికల్ మూవీ ఇది. అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని అప్పట్లో వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. ఆ సమయంలో కరీంనగర్ జిల్లా బండ లింగపల్లిలో ఉండే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను వినోదాత్మకంగా చూపిస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాత: నిత్యామీనన్, కెమెరా: ఆదిత్య జవ్వాది, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
Tamannaah: నార్మల్ కావడానికి రెండు నెలలు పట్టింది.
కరోనా నుంచి తమన్నా ఎలా కోలుకున్నారు? కరోనా సెకండ్ వేవ్ గురించి తమన్నా అభిప్రాయం ఏంటి? డిజిటల్ కంటెంట్ గురించి ఈ బ్యూటీ ఏమంటున్నారు? తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడం ఎలా అనిపించింది? వంటి విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే తమన్నా పంచుకున్న విశేషాల్లోకి వెళదాం. కొన్ని రోజులుగా సంభవిస్తున్న హృదయవిదారక ఘటనలను వింటుంటే మనసుకు ఎంతో బాధగా ఉంది. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో ఎన్నో క్లిష్టతరమైన సమస్యలను ఎదుర్కొన్నాం. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ ప్రాణాంతకంగా మారి, అందర్నీ భయపెడుతోంది. వేల సంఖ్యలో నమోదవుతున్న మరణాలు నన్ను తీవ్రంగా కలచివేస్తున్నాయి. గత ఏడాది కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో ఆగస్టులో నా తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. తర్వాత అక్టోబరులో నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అంటే.. మా తల్లిదండ్రులకు కరోనా వచ్చిన నెల రోజుల తర్వాతే నాకు పాజిటివ్ వచ్చింది. కానీ సెకండ్ వేవ్‌లో ఇలా కాదు. ఒక కుటుంబంలోని ఒకరికి కరోనా సోకితే, ఆ కుటుంబంలోని మిగతావారికి వెంటనే పాజిటివ్ వస్తోంది. అది కూడా విభిన్నమైన లక్షణాలతో కరోనా సోకుతుండటం విచారకరం. అందుకే కరోనా నియంత్రణ చర్యలను పాటించండి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. థియేటర్స్ తిరిగి ఓపెన్ చేసేవరకు వ్యూయర్స్ డిజిటల్ కంటెంట్‌నే ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. సినిమా, వెబ్ సిరీస్‌లు అనేవి డిఫరెంట్ జానర్స్. కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. మన వినోదపు సంస్కృతిలోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ది పెద్ద స్థాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో డిజిటల్ రిలీజ్ తప్పదు. ఇటీవల నేను నటించిన వెబ్ సిరీస్ ‘నవంబరు స్టోరీస్’కు వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ వెబ్ సిరీలో అనురాధా గణేశన్ పాత్ర చేశాను. దర్శకురాలు ఇంద్రా సుబ్రమణియన్ బాగా డైరెక్ట్ చేశారు. కథకు తగ్గట్లు మానవీయ భావోద్వేగాలను వీలైనంత సింపుల్‌గా, సహజంగా చిత్రీకరించడం ప్లస్ అయ్యింది. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల్లో ‘సీటీమార్’ ఒకటి. ఈ చిత్రంలో తెలంగాణ కబడ్డీ కోచ్ జ్వాల రెడ్డి పాత్రలో కనిపిస్తాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ఇంతకుముందు నేను చేసిన ఓ తెలుగు సినిమాకు డబ్బింగ్ చెప్పాను. దర్శకుడు సంపత్ నంది ప్రోత్సాహంతో ‘సీటీమార్’లో తెలంగాణ యాసతో డబ్బింగ్ చెప్పగలిగాను. ముందు కొంచెం చెప్పాను. బాగుండటంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. తర్వాత మొత్తం చెప్పేశాను. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తిరిగి నార్మల్ కావడానికి నాకు రెండు నెలలు పట్టింది. అవి చాలా క్లిష్టతరమైన పరిస్థితులు. ఆ సమయంలో వ్యాయామాలు చేయడం చాలా కష్టంగా అనిపించింది. కొన్ని సందర్భాల్లో అయితే చాలా నీరసంగా ఉండేది. కష్టంగా అనిపించేది. కోవిడ్ తర్వాత నా శరీరం పనిచేసే, స్పందించే తీరును అర్థం చేసుకుని, అందుకు తగ్గట్లు నేను నడుచుకోవడం వల్లే తొందరగా కోలుకోగలిగాను. 2018లో సూపర్‌హిట్ సాధించిన హిందీ చిత్రం ‘అంధా ధున్’ తెలుగు రీమేక్ ‘మాస్ట్రో’లో నటిస్తున్నాను. హిందీలో టబు చేసిన పాత్రను తెలుగులో నేను చేస్తున్నాను. హిందీ వెర్షన్ నాకు బాగా నచ్చింది. కానీ ‘అంధా ధున్’ తెలుగు రీమేక్ సైన్ చేసిన తర్వాత ఒరిజినల్ వెర్షన్‌ను నేను ఒక్కసారి కూడా చూడలేదు. నటనలో నా శైలిని కోల్పోతానేమోనని చూడలేదు. టబు మంచి నటి. అయితే ఈ పాత్రకు సంబంధించి తెలుగులో కొన్ని మార్పులు ఉన్నాయి. వయసు, కథనం దృష్ట్యా నా పాత్రలో మార్పులు ఉన్నాయి. అందుకే ‘మాస్ట్రో’ రిలీజ్ తర్వాత టబూతో నాకు పోలికలు పెడితే నేను పెద్దగా బాధపడను. ఇంకా ‘ఎఫ్ 3’, ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాల్లోనూ నటిస్తున్నాను. -
సందీప్ వంగ డైరెక్షన్లో మహేష్!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్‌ను దుబాయ్‌లో పూర్తి చేసుకుని ఇటీవల చిత్ర యూనిట్ భారత్‌కు తిరిగి వచ్చింది. అక్కడ మహేష్ బాబుతో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరించినట్లు సమచారం. త్వరలోనే హైదరాబాద్‌లో ఈ మూవీ రెండవ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ గ్యాప్‌లో మహేష్ ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో నటించనున్నాడు. అయితే అది మూవీ కాదు. ఓ యాడ్ షూటింగ్ అట. హ్యావెల్స్ అనే ఎలక్రిక్ కంపెనీ ప్రకటనలో మహేష్ నటించనున్నాడు. ఈ ప్రకటనకు సంబంధించి షూటింగ్ ఈ రోజు జరగనుంది. అయితే ఈ యాడ్‌ను సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో మహేష్‌తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తోంది. త్వరలోనే ఈ యాడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. చదవండి: మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేశ్ బాబు మహేష్‌బాబుకు జైకొట్టిన నాగచైతన్య -
త్రిబుల్ ధమాకా
శింబు హీరోగా, తమన్నా, శ్రియ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అఅఅ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కుసుమ ఆర్ట్స్ పతాకంపై యాళ్ళ కీర్తి నిర్మాణ సారథ్యంలో యాళ్ళ వెంకటేశ్వరరావు (కృపావరం) తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా యాళ్ళ వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. శింబు మూడు పాత్రల్లో కనిపిస్తారు. తమన్నా, శ్రియల పాత్రలు బాగుంటాయి. తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా అన్ని హంగులు ఉంటాయి. డైలాగ్స్, పాటలు ఆడియన్స్‌ని మెప్పిస్తాయి. అందరూ మా సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుతున్నాను’’ అన్నారు. ఈ సమావేశంలో జక్కుల నాగేశ్వరరావు, బాలాజీ నాగలింగం, బొప్పన గోపీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: జక్కుల నాగేశ్వరరావు, సహ నిర్మాతలు: యాళ్ళ మేరీ కుమారి, యాళ్ళ రాహుల్. -
ధనుష్‌తో మరోసారి జోడి కడుతున్న తమన్నా
తమిళంలో ధనుష్, అతని సోదరుడు, దర్శకుడు సెల్వరాఘవన్ది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో ‘పుదుపేటై్ట (ధూల్‌పేట్), మయక్కమ్ ఎన్న (మిస్టర్ కార్తీక్)’ వంటి సినిమాలు ఈ కాంబినేషన్లో వచ్చాయి. తాజాగా మరో కొత్త సినిమా కోసం ఈ ఇద్దరూ కలిశారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా ‘నాన్ వరువేన్’ (నేను వస్తాను) టైటిల్‌తో ఓ గ్యాంగ్‌స్టర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా తమన్నాని అడిగితే, ప్రాజెక్ట్‌లోకి ‘నేను వస్తాను’ అంటూ ఓకే అన్నారని కోలీవుడ్ టాక్. తమన్నాతో కథాచర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. గతంలో ‘పడిక్కాదవన్’ (2009), ‘వేంగై’ (2011) చిత్రాల్లో జంటగా నటించారు ధనుష్, తమన్నా. పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ జోడీగా నటించనుండటం విశేషం. -
నిజామాబాద్‌లో మలబార్ గోల్డ్ షోరూం
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిజామాబాద్ పట్టణంలో తన నూతన షోరూంను సోమవారం ప్రారంభించింది. సినీ నటి తమన్న చేతుల మీదుగా షోరూం ఆరంభమైంది. తక్కువ బరువుతో ఆకర్షణీయంగా ఉండే ఫ్యాషనబుల్, ఫ్యూజన్, ట్రెడిషనల్ ఆభరణాలను ‘మైన్’ పేరిట అందిస్తుండగా.. ‘ఎరా’ పేరిట కళాత్మకంగా ఉండే అన్–కట్ డైమండ్స్‌ను ఇక్కడ అందిస్తున్నట్లు గ్రూప్ చైర్మన్ ఎం.పీ అహ్మద్ అన్నారు. ప్రారంభోత్సవ ఆఫర్ కింద ప్రతి రూ.15వేల కొనుగోలుపై ఒక బంగారు నాణాన్ని ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. -
సాయి పల్లవి, తమన్నాకు వరుణ్ ఛాలెంజ్!
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను సినీ నటుడు వరుణ్ తేజ్ కొణిదెల స్వీకరించాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వరుణ్ తేజ్ తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటాడు. దీనికి సంబంధించిన ఆయన శనివారం ట్వీటర్లో పోస్ట్ చేశారు. గ్రీన్ ఛాలెంజ్‌కు నామినేట్ చేసిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి, అక్కినేని అఖిల్‌కు ధన్యవాదాలు తెలిపాడు. కొంచెం బిజీగా ఉన్నా..కానీ మంచి పనికోసం కొంచెం ఆలస్యంగానైనా స్పందించాల్సిందేనని ట్వీట్ చేశారు. అంతేకాదు హరా హైతో భరా హై హ్యాష్ ట్యాగ్ తో గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హీరోయిన్లు సాయి పల్లవి, తమన్నాలను నామినేట్ చేశాడు. మరి ఈ మెగా ప్రిన్స్ చాలెంజ్‌ను ఈ సాయి పల్లవి, తమన్నా ఎపుడు స్వీకరిస్తారో వేచి చూడాలి. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వనమిత్ర అవార్డ్‌ను ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన వారందరికీ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం వనమిత్ర బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అవార్డ్స్ ఇవ్వాలని ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా రూపొందించిన అవార్డ్స్‌ను రాజ్యసభ ఎంపీ, సంస్థ ప్యాట్రన్ సంతోష్ కుమార్ గతనెలలో (గురువారం, సెప్టెంబర్ 5) ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. Thanks for nominating me @MPsantoshtrs garu & @AkhilAkkineni8 for the #GreenIndiaChallenge Been a bit busy. But it’s never too late to do a good deed! Taking this initiative forward by nominating @Sai_Pallavi92 & @tamannaahspeaks to take this up#HaraHaitohBharaHai pic.twitter.com/Epoer8QERf — Varun Tej Konidela (@IAmVarunTej) October 5, 2019 -
తమన్నా ప్లేస్‌లో అవికానా!
బుల్లితెరపై సత్తా చాటిన ఓంకార్ తరువాత రాజుగారి గది సినిమాతో వెండితెర మీద కూడా దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ఏకంగా నాగార్జున, సమంత లాంటి స్టార్స్‌తో రాజుగారి గది 2 సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా రిజల్ట్ బెడసి కొట్టింది. అందుకే తదుపరి సినిమాకు లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల తన తమ్ముడు అశ్విన్ హీరోగా రాజుగారి గది 3 చిత్రాన్ని ప్రారంభించాడు ఓంకార్. హారర్ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తుందని ప్రకటించారు. కానీ ఓ బాలీవుడ్ సినిమా కోసం తమన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. దీంతో చేసేదేమి లేక మరో హీరోయిన్‌తో సినిమాను కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే తమన్నా లాంటి గ్లామరస్ స్టార్‌ను తీసుకోవాలనుకున్న ప్లేస్‌లో ఇప్పుడు ఉయ్యాల జంపాల ఫేం అవికా గోర్‌ను తీసుకున్నారట. అవికా టాలీవుడ్‌ను వదిలేసి చాలా కాలం అవుతుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో కనిపించినా అది అతిథి పాత్రే. మరి ఈ సమయంలో అవికా రాజుగారి గది 3కి ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి. -
అత్యంత ఖరీదైన దుస్తులు అవే!!
టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ‘లక్ష్మీ’ గా ఆమె అలరించనున్నారు. ఈ క్రమంలో సినిమాలో తన క్యాస్టూమ్స్ గురించి ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘ బాహుబలి తర్వాత నా కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహారెడ్డి. 18 వ శతాబ్దపు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే దుస్తులు ధరించాను. డిజైనర్లు సుస్మిత(చిరంజీవి కుమార్తె), అంజూ మోదీ నా కోసం ప్రత్యేకమైన లెహంగాలు రూపొందించారు. నా జీవితంలో నేను ధరించిన అత్యంత ఖరీదైన దుస్తులివే’ అంటూ తమన్నా మురిసిపోయారు. కాగా తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా.. చిరంజీవి ప్రధాన పాత్రలో సైరా నరసింహారెడ్డి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను... రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
‘ఆ బయోపిక్‌లో నటించాలనుంది’
ఆమె అంటే తనకెంత ఇష్టమో అంటున్నారు నటి తమన్నా. 15 ఏళ్ల ప్రాయంలోనే నటిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ నటిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దశాబ్దంన్నరగా కథనాయకిగా, అదీ చెక్కు చెదరని అందాలతో అగ్రనాయకిగా రాణిస్తున్న అతి కొద్ది మంది నటీమణుల్లో తమన్నా ఒకరు. మొదట్లో అందాలనే నమ్ముకుని నిలదొక్కుకున్న ఈ మిల్కీబ్యూటీకి బాహుబలి చిత్రం నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె ప్రభుదేవాతో రెండోసారి నటించిన దేవి–2 చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఇక మూడోసారి అదే నటుడితో జత కట్టిన హిందీ చిత్రం ఖామోషి త్వరలోనే తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో ఆయనతో రొమాన్స్ చేస్తున్నారు. ఇటీవల ఒక భేటీలో తమన్నా పేర్కొంటూ నటి శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఆమె బయోపిక్‌లో నటించాలన్న కోరిక ఉందని తెలిపారు. ఈ మధ్య బయోపిక్‌ల కాలం నడుస్తున్న విషయం తెలిసిందే. అలా తెరకెక్కిన చాలా చిత్రాలు సక్సెస్ అయి కాసుల వర్షం కురిపించాయి కూడా. ఉదాహరణకు క్రికెట్ క్రీడాకారుడు ధోనీ జీవిత చరిత్రతో తెరకెక్కిన ఎంఎస్.ధోని, దివంగత శృంగార తార సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ది దర్టీపిక్చర్, నటుడు సంజయ్‌దత్ బయోపిక్‌గా తెరకెక్కిన సంజూ, నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన మహానటి వంటి చిత్రాలు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణను పొందిన విషయం తెలిసిందే. తాజాగా దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవిత చరిత్రను ఇద్దరు దర్శకులు ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ఒక చిత్రంలో జయలలిత పాత్రలో తలైవిగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, మరో చిత్రంలో నిత్యామీనన్ ది ఐరన్ లేడీగా నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి తమన్నాకు బయోపిక్ చిత్రంపై కన్ను పడినట్లుంది. గత ఏడాది దుబాయిలో అకాల మరణం పొందిన అందాల నటి శ్రీదేవి జీవిత చరిత్రను ఆమె భర్త, నిర్మాత బోనీకపూర్ సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుందో, ఏమోగానీ నటి తమన్నా ఆ చిత్రంలో అవకాశం కొట్టేయాలనుకుని చెప్పిందో కాదో గానీ, నటి శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టం అని, ఆమె బయోపిక్‌లో నటించాలన్న కోరిక చాలా కాలంగా ఉందని చెప్పారు. తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ నేమ్, ఫేమ్ ఉన్న తమన్నాకు అలాంటి అవకాశం ఇచ్చే విషయమై బోనీకపూర్ ఆలోచిస్తారో లేదో చూడాలి. ఆయన ఇప్పటికే మలయాళీ చిన్నది కీర్తీ సురేశ్‌ను ముంబైకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. నటుడు అజిత్‌ను హిందీలోకి తీసుకెళ్లడానికి ఆసక్తిగా ఉన్నారు కూడా. కాబట్టి తదుపరి తమన్నాపై కూడా కాస్త దృష్టి పెడితే ఆమె కోరిక తీరుతుంది. -
మిల్కీ బ్యూటీ వేదాంతం
నటి తమన్నా ఈ మధ్య వేదాంతం మాట్లాడుతున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో ఎక్కువగా గ్లామర్ పాత్రలకు మాత్రమే ఓటు వేశారు తమన్నా. కాగా నటిగా తనలోని ప్రతిభను నిరూపించుకునే అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూసిన ఈ బ్యూటీకి బాహుబలి చిత్రం రూపంలో అలాంటి అవకాశం వచ్చింది. అందులో వీరనారి అవంతికగా అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు. నిజం చెప్పాలంటే ఆ తరువాత అలాంటి మరో అవకాశం తమన్నాకు ఇప్పటికీ రాలేదనే చెప్పాలి. కాగా ఈ బ్యూటీ డాన్సింగ్‌స్టార్ ప్రభుదేవాతో నటించిన దేవి 2 చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ప్రస్తుతం విశాల్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నారు. హిందిలోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న భారీ చారిత్రక కథా చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇదీ నటనకు అవకాశం ఉన్న పాత్రనేనని ప్రచారంలో ఉంది. అంతే కాదు ఈ సినిమాలో తమన్నా ఒక పాటలో అందాలారబోయనుందనే ప్రచారం హోరెత్తుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఈ మిల్కీబూటీ వేదాంతం గురించి మాట్లాడుతున్నారు. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో దశాబ్ధానికి పైగా నటిస్తున్న తమన్నా షూటింగ్ లేని సమయాల్లో పుస్తకాలను ఎక్కువగా చదువుతున్నారట. దీని గురించి ఇటీవల ఒక భేటీలో తెలుపుతూ పుస్తకాలు చదవడం అంటే తనకు చాలా ఆసక్తి అని చెప్పారు. అందులోనే వేదాంత పుస్తకాలను అధికంగా చదువుతానని తెలిపారు. కాగా అంతటితో ఆగకుండా ఈ బ్యూటీ మంచి తత్వంలో కూడిన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో రోజుకొక్కటి చొప్పున పోస్ట్ చేస్తున్నారు. అయితే వాటిని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదట. కారణం తమన్న వేదాంతపు వ్యాఖ్యలు హిందీలో ఉంటున్నాయి. కాబట్టి హిందీ భాష తెలిసిన వారే తమన్న తత్వాలను అర్థం చేసుకోగలుగుతారు. దీంతో ఎవరైనా తమన్నా వేదాంతపు వ్యాఖ్యలను తెలుగు, తమిళం భాషల్లోకి అనువదిస్తే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు. కొందరైతే తమన్నకిప్పుడే ఈ వేదాంతం గొడవ ఏమిటీ అని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ఈ బ్యూటీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. -
ప్రభుదేవా, తమన్నా రేర్ రికార్డ్!
డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హార్రర్ థ్రిల్లర్ అభినేత్రి 2. సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే జోడి కలిసి నటించిన మరో హార్రర్ థ్రిల్లర్ మూవీ ఖామోషీ. చక్రి తోలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బాలీవుడ్ మూవీ కూడా మే 31న ప్రేక్షకుల ముందు రానుంది. ఇలా ఒకే జంట కలిసి నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావటం అరుదైన రికార్డ్ అంటున్నారు సినీ విశ్లేషకులు. అభినేత్రి 2 కూడా దేవీ 2 పేరుతో బాలీవుడ్ లో రిలీజ్ అవుతోంది. ఇలా ఒకే రోజు ఒకే జంట నటించిన ఒకే జానర్ సినిమాలు రెండు ప్రేక్షకుల ముందుకు రావటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. -
మిల్కీబ్యూటీ కొత్త అవతారం
నటి తమన్నా కొత్త అవతారం ఎత్తారు. నిజం చెప్పాలంటే బాహుబలి వంటి ఒకటి రెండు చిత్రాల్లో తనలోని నటనా ప్రతిభను చాటుకునే అవకాశం వచ్చినా, చిత్రాన్నంతా తనపై వేసుకుని మోసే సత్తా కలిగిన అవకాశం 10 ఏళ్లు దాటిన తన కెరీర్లో లభించలేదనే చెప్పాలి. అగ్రనటీమణులగా రాణిస్తున్న నయనతార, అనుష్క లాంటి వారు అలాంటి పాత్రల్లో తామేమిటో నిరూపించుకున్నారు. త్రిష కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటించారు. అయితే వాటిలో తను సక్సెస్‌ను అందుకోలేకపోయారు. నటి అంజలి కూడా కథానాయకి ప్రధాన పాత్ర కలిగిన చిత్రాల్లో నటించి మెప్పించారు. తాజాగా నటి తమన్నా ఆ కోవలో చేరిపోయారు. ఇటీవల తెలుగు చిత్రం ఎఫ్2 హిట్ కావడంతో చాలా ఖుషీగా ఉన్న ఈ మిల్కీబ్యూటీకి మరింత జోష్‌ను అందించేలా వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్‌లో మంచి ఫేమ్‌లో ఉన్నారు. తమన్నా, ప్రభుదేవా జంటగా నటించిన దేవి 2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం విశాల్‌తో ఒక చిత్ర షూటింగ్లో ఉన్నారు. తరువాత మరో చిత్రంలోనూ ఆయనతో రొమాన్స్ చేయడానికి ఓకే చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంలోనూ నటించే అవకాశం తమన్నాను వరించింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని అదే కన్గళ్ చిత్రం ఫేమ్ రోహిన్ వెంకటేశన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరో అంటూ ఎవరూ ఉండరట. అయితేనేం హీరోలు లేని కొరతను తీర్చేస్తున్న కమెడియన్ యోగిబాబు ఉండనే ఉన్నాడు. ఇటీవల ఇతను లేని చిత్రమే లేదని చెప్పవచ్చు. ఇప్పుడు తమన్నా చిత్రంలోనూ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా మునీశ్కాంత్, సత్యన్, కాళీ వెంకట్, బుల్లితెర ఫేమ్ టీఎస్కే ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ప్రతి మనిషికీ ఏదో ఒక సమస్య ఉంటుందన్నారు. అలా నటి తమన్నాకు ఒక సమస్య ఎదురవుతుందని, దాన్ని ఆమె తన మిత్రబృందంతో కలిసి ఎలా ఛేదించి బయట పడిందన్న ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. హర్రర్ కథాంశంతో కూడిన ఈ చిత్రానికి వినోదాన్ని జోడించి తెరపై ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. చెన్నైలో కొంతభాగం షూటింగ్‌ను చేసి ప్రస్తుతం కోడైకెనాల్‌లో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. -
నా బలం నేనే!
నా బలం నేనే అని అంటోంది నటి తమన్నా. ఇటీవల కోలీవుడ్‌లో చెప్పుకోదగ్గ సక్సెస్‌లు లేకపోయినా అవకాశాలు మాత్రం బ్రేక్ పడలేదీయమ్మడికి. ప్రభుదేవాతో జత కట్టిన దేవి–2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఇక తమిళంలో విశాల్‌తో రెండు చిత్రాల్లో నటించడానికి ఒప్పందం చేసుకుంది. అందులో ఒకటి ఇటీవలే ప్రారంభమైంది. హిందీలోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. ఇలా నటిగా దశాబ్దంన్నర దాటినా బిజీగా ఉండడం సాధారణ విషయం కాదు. తన 15 ఏళ్ల సినీ అనుభవాన్ని గుర్తు చేసుకున్న ఈ మిల్కీబ్యూటీ.. వెండితెరపైనేకాదు షూటింగ్ సెట్లోనూ హుషారుగా ఉండడం తన నైజం అని పేర్కొంది. పనిలోనూ ఎనర్జీగా పూర్తి అంకిత భావంతో చేస్తానని చెప్పింది. తన బలం ఇదేనని అంది. చేసే పని ఏదైనా ఫలితం గురించి ఆశించకుండా ఇష్టంగా చేయాలంది. అప్పుడే రాత్రులు షూటింగ్ చేసినా అలసట అనిపించదని చెప్పింది. ఇంకా చెప్పాలంటే తనకు తానే బలం అని పేర్కొంది. కెమెరా ముందు ప్రతిభను చాటాల్సింది తానేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎలాంటి నెగిటివ్ థింగ్స్కు తన మనసులో స్థానం ఉండదని చెప్పింది. అందుకే ధైరంగా ఉండగలుగుతున్నానని అంది. తాను 10వ తరగతి పూర్తి చేసి నటిగా రంగప్రవేశం చేశానని చెప్పింది. 15 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో అనుభవాలు పొందానని అంది. ప్రముఖ కథానాయకిగా రాణిస్తూ ఐటమ్ సాంగ్‌లకు అంగీకరించడం గురించి విమర్శిస్తున్నారని, అవకాశాలు లేకపోవడంతోనే అలాంటి పాటలకు సై అంటోందని రకరకాల ప్రచారం చేస్తున్నారని అంది. అయితే బాలీవుడ్లో ప్రముఖ హీరోయిన్లు సింగిల్ సాంగ్స్‌కు అభ్యంతరం చెప్పరని, తాను సింగల్ సాంగ్స్‌లో నటించడానికి కారణం డాన్స్ అంటే తనకు ఇష్టం అని తమన్నా చెప్పుకొ చ్చింది. -
ముచ్చటగా మూడోసారి..
ముచ్చటగా మూడోసారి నటి తమన్నాను హర్రర్ చిత్రం వదలడం లేదు. వరుసగా మూడోసారి హర్రర్ చిత్రం చేయడానికి ఈ మిల్కీబ్యూటీ రెడీ అవుతోంది. అంతేకాదు కొంతకాలం డల్‌గా ఉన్న ఈ అమ్మడి కెరీర్ ఇప్పుడు స్వీడ్ అందుకుంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో సక్సెస్‌లు లేకపోయినా అవకాశాలు వరస కట్టడం నిజంగా తమన్నా లక్కీనే. అదీ మూడు పదులు దాటిన ఈ వయసులోనూ హీరోయిన్గా బిజీగా ఉండడం అరుదైన విషయమే. ప్రస్తుతం తమన్నా ప్రభుదేవాకు జంటగా నటించిన దేవి–2 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 12న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తదుపరి విశాల్‌తో వరుసగా రెండు చిత్రాల్లో నటించడానికి రెడీ అవుతోంది. వీటితో పాటు మరో అవకాశం తమన్నాను వరించిందన్నది తాజా సమాచారం. ఇది హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటోందని తెలిసింది. దీనిని యువ దర్శకుడు రోహిన్ వెంకటేశన్ తెరకెక్కించబోతున్నారు. ఈయన ఇంతకుముందు కలైయరసన్, శివదా జంటగా నటించిన అదే కంగళ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ హర్రర్ కథా చిత్రంలో తమన్నాతో పాటు యోగిబాబు, మన్సూర్ అలీఖాన్, భగవతి పెరుమాళ్ నటించనున్నారు. దీనికి జిబ్రాన్ సంగీతాన్ని అందించనున్నారు. డాని డైమండ్ ఛాయాగ్రహణం అందించనున్న ఈ చిత్ర షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నట్లు తెలిసింది. తమన్నా ఇంతకుముందు ప్రభుదేవాతో జతకట్టిన దేవి హర్రర్ నేపథ్యంలో తెరకెక్కి ఫర్వాలేదనే టాక్‌ను తెచ్చుకుంది. ప్రస్తుతం అదే జంట దేవి–2లో నటించారు. ఇదీ హర్రర్ కథా చిత్రమే. తాజాగా మూడోసారి ఈ బ్యూటీ హర్రర్ కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతోందన్న మాట. -
ఆ హీరోతో కిస్ సీన్లు ఓకే..!
‘నేను రొమాంటిక్ సన్నివేశాల్లో నటించానే కానీ ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. ముద్దు సీన్లు నా పాలసీలో, కాంట్రాక్టులో ఉండవు కూడా. అయితే ఈ నియమం మాత్రం బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు వర్తించదు’ అని అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఇప్పటివరకు తన సినీ ప్రయాణాన్ని, తన అభిమాన నటుల గురించి ఓ అవార్డుల వేడుకలో మీడియాతో పంచుకుంది. హృతిక్ రోషన్‌కు తాను అతి పెద్ద అభిమానని, ఆయనలో ఉండే నిజాయతీ, నిబద్ధత నాకెంతో ఇష్టంమని తమన్నా తన అభిమానాన్ని వ్యక్తపరిచారు. తమన్నా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రం.. బాలీవుడ్లో కంగన నటించిన ‘క్వీన్’ సినిమాకు రీమేక్‌గా రాబోతోంది. ఈ సినిమాతో పాటు ‘సైరా నరసింహారెడ్డి’, ‘అభినేత్రి 2’, ‘కన్నే కళైమనే’, ‘ఖామోషీ’ చిత్రాలతోనూ ఆమె బిజీగా ఉన్నారు. -
విరాట్‌తో ఎఫైర్.. స్పందించిన తమన్నా
మిల్కీబ్యూటీగా తన అందం, నటనతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది తమన్నా. చాలాకాలం తరువాత ‘ఎఫ్2’ రూపంలో ఓ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది తమన్నా. ఈ సినిమాతో మళ్లీ ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చేసింది తమన్నా. ఈ మూవీ హిట్ కావడంతో మరికొన్ని ప్రాజెక్ట్‌లు తమన్నాను వరించాయి. అయితే ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో విరాట్‌తో ఎఫైర్‌పై ప్రశ్నలు వేయగా.. ఆ విషయంపై మొదటిసారిగా తమన్నా స్పందించింది. తాను విరాట్ కోహ్లీతో కలిసి గతంలో ఓ యాడ్‌లో పనిచేశానని. అటు తరువాత మళ్లీ విరాట్‌ను ఇంతవరకు కలవలేదని, తనతో ఎలాంటి సంబంధం లేదని, డేటింగ్ చేయలేదని సమాధానమిచ్చారు. తమన్నా ప్రస్తుతం మహాలక్ష్మీ (క్వీన్ రీమేక్)తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దంగా ఉంది. -
గాసిప్స్ మంచిదే!
గాసిప్స్ మంచిదే అనగానే మరక మంచిదే అనే వాణిజ్య ప్రకటన గుర్తుకొస్తోంది కదూ! అవును ఇదో రకం ప్రచార టెక్నిక్. ఇవాళ నెగిటివ్ ప్రచారమే వినియోగదారుల్లోకి చొచ్చుకుపోతోంది. నటి తమన్నా అలాంటి టెక్నిక్‌నే అమలు పరుస్తోంది. ఈ మిల్కీబ్యూటీకి నటిగా సీనియారిటీ పెరిగిపోతోంది కదా ఆ మాత్రం వాడకపోతే ఎలా? అదీ గాక ఇప్పుడు ఈ అమ్మడికి ప్రచారం చాలా అవసరం. నటిగా దశాబ్దాన్ని దాటేసిన తమన్నా మొదట్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుని ఉంటుందంటారు? అవన్నీ అనుభవాలేకదా! అయితే తమన్నా గురించి ఎప్పుడూ ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా నెగిటివ్ ప్రచారం. తమన్నాకు అవకాశాలు లేవని, ఫ్లాప్‌ల నటి అని, ఇక మూటా ముల్లు సర్దుకోవలసిందేనంటూ రకరకాల ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఇలాంటి ప్రచారానికి మరొకరైతే బాధ పడడమో, ఫైర్ అవడమో జరుగుతుంది. కానీ ఈ పంజాబీ బ్యూటీ కాస్త భిన్నం కదా! గాసిప్స్ మంచిదే అంటోంది. అందుకు కారణం కూడా చెబుతోంది. నా నట కెరీర్ అంతం కాబోతోంది లాంటి ట్విట్స్, గాసిప్స్ వంటివి చదవడం తనకు చాలా ఇష్టం అని పేర్కొంది. నాపనైపోయింది అని అన్నప్పుడు తనకింకా ఉత్సాహం కలుగుతోందని అంది. ఎందుకంటే అప్పుడు తానింకా కొత్త నటిగా ఫీల్ అవుతానని చెప్పింది. అది తనకు ఇంకా శ్రమించేలా చేస్తుందని పేర్కొంది. అయినా అలాంటి ఫ్లాప్ ముద్రలో తాను ఉన్నప్పుడే బాహుబలి చిత్ర అవకాశం వచ్చిందని పేర్కొంది. ఒక నటిగా నట జీవితం ఇక చాలు అని భావించినప్పుడే తన వృత్తి పరమైన జీవితం ముగుస్తుందని అంది. అయితే తనలోని నటికి మాత్రం ఎప్పటికీ విశ్రాంతి ఉండదని నటి తమన్నా పేర్కొంది. తమన్నా ఉదయనిధితో నటించిన కన్నే కలైమానే చిత్రంలో నటనకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ప్రభుదేవాతో దేవి–2 చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. ఇక త్వరలో నటుడు విశాల్‌తో జత కట్టడానికి రెడీ అవుతోంది. అదేవిధంగా తెలుగులోనూ అవకాశాలు ఆశాజనకంగానే ఉన్నాయి. సో ఈ అమ్మడు వదంతులను ఎంజాయ్ చేస్తూ మరింత ఉత్సాహంతో నటించేస్తోందన్నమాట. -
జయలలిత స్ఫూర్తితోనే..!
తమిళసినిమా: ప్రతి విషయానికి ఎవరో ఒకరు, ఏదో ఒకటి స్ఫూర్తిగా నిలుస్తుంది. అలా ఒక చిత్ర హీరోయిన్ పాత్రకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్ఫూర్తి అయ్యారు. ఈ విషయాన్ని దర్శకుడు శీనూ రామస్వామి స్వయంగా వెల్లడించారు. ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం కన్నె కలైమానే. ఉదయనిధిస్టాలిన్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 22వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శీనూరామస్వామి మాట్లాడుతూ ధర్మదురై చిత్రాన్ని పూర్తి చేసి విజయ్‌సేతుపతి హీరోగా మామనిదన్ చిత్రాన్ని చేయాలని భావించగా, విజయ్‌సేతుపతి వేరే చిత్రాలతో బిజీగా ఉన్నారని తెలిపారు. అలాంటి సమయంలో రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నుంచి షణ్ముగమూర్తి తనను కలిశారన్నారు. దాని ఫలితమే కన్నె కలైమానే అని చెప్పారు. ఆ సమయంలో ఆయన పెట్టిన ఒకే ఒక్క కడింషన్ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ ఉండాలన్నారు. అయితే అందుకు ఈ చిత్రంలో అవకాశం లేదని చెప్పానన్నారు. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్ కలిసి ఫర్వాలేదు తాను చూసుకుం టాను అని చెప్పారన్నారు. అలా ఆయన హీరో యిన్‌కు ప్రాధాన్యత ఉన్న చిత్రంలో నటించడానికి ముందుకొచ్చిన ధైర్యానికి ధన్యవాదాలన్నారు. ఇందులో నటి తమన్నాది చాలా «దైర్యం కలిగిన అమ్మాయి పాత్ర అని చెప్పారు. ధైర్యవంతురాలంటే ఎలా ఉండాలన్నదానికి తన మనసులో మెదిలింది దివంగత ముఖ్యమంత్రి జయలలిత రూపమేనన్నారు. ఆమె నడక, చీర కట్టు, బొట్టు ఎలా ఉండాలన్నది జయలలిత పాత ఫొటోల ను ఇంటర్నెట్లో చూసి, ఆమెను స్ఫూర్తిగా తీ సుకుని తమన్న పాత్రను తీర్చిదిద్దానని చెప్పా ý‡ు. కార్యక్రమానికి నటుడు విజయ్ సేతుపతి అతిథిగా విచ్చేయగా ఉదయనిధిస్టాలిన్, తమ న్నా తదితర చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
నిర్మాతలుగా స్టార్ హీరోయిన్లు..!
స్టార్ హీరోలు నిర్మాతలుగా మారి వారి సినిమాలను సొంత బ్యానర్లో నిర్మించడమే కాకుండా.. చిన్న సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే వీరి బాటలోనే హీరోయిన్లు కూడా నడుస్తున్నట్లు కనపిస్తోంది. కాజల్ అగార్వాల్, తమన్నాలు నిర్మాతలుగా మారబోతోన్నారని సమాచారం. కాజల్ అగర్వాల్, తమన్నాలు భాగస్వామ్యులుగా అ! ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించబోతోన్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా కల్కి చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తైయిన తరువాత ఈ చిత్రం పట్టాలెక్కనుందని టాక్ వినిపిస్తోంది. మరి నిర్మాతలుగా మారుతున్న ఈ హీరోయిన్లకు అదృష్టం కలిసి వస్తుందో లేదో చూడాలి. -
గోపీచంద్‌తో తమన్నా..?
‘పంతం’ సినిమాతో పలకరించిన గోపీచంద్‌కు.. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని మాత్రం ఇవ్వలేకపోయింది. కొంతకాలంగా సరైన విజయాలు లేక డీలా పడ్డ ఈ హీరో.. తాజాగా మరో సినిమాను పట్టాలెక్కించాడు. సరిహద్దుల్లో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తూ చిత్రయూనిట్ బిజీగా ఉంది. యాక్షన్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు కొంతమందిని పరిశీలిస్తుండగా.. ‘ఎఫ్2’తో ఇటీవలె పెద్ద సక్సెస్కొట్టిన తమన్నా అయితే బాగుంటుందని మేకర్స్ ఆమెను సంప్రదించారట. తమన్నా కూడా ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది. మొదటి సారిగా జోడీ కడుతున్న ఈ జంట తెరపై హిట్‌పెయిర్‌గా నిలుస్తారో లేదో వేచి చూడాలి. అనిల్ సుంకర నిర్మించే ఈ సినిమాకి, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. తమిళ దర్శకుడు తిరు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. -
‘మణికర్ణిక’ వివాదంపై తమన్నా.!
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను కుదిపేస్తున్న వివాదం మణికర్ణిక. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమాకు తరువాత కంగనా దర్శకత్వ బాధ్యతలు తీసుకోవటంతో వివాదం మొదలైంది. కంగనా తన పాత్రను ఎలివేట్ చేసుకునేందుకు ఇతర పాత్రలను తగ్గించిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వివాదంలో కొంతమంది క్రిష్‌కు మద్దతు తెలుపుతుండగా మరికొందరు కంగనానే కరెక్ట్ అంటున్నారు. తాజాగా ఈ వివాదంపై మిల్కీబ్యూటీ తమన్నా స్పదించారు. ‘నటనపరంగా కంగనాకు వంక పెట్టడానికి లేదు. ఆమె ఎంత గొప్ప నటో అందరికీ తెలిసి విషయమే. క్రియేటివ్ పీపుల్ ఆలోచనలు వేరుగా ఉంటాయి. అయితే ఎవరి ఆలోచన ఎలా ఉన్నా ఫైనల్‌గా అవి సినిమాకు మంచి చేసేవిగా ఉండాలి. ప్రతీ ఒక్కరు సినిమా సక్సెస్ కోసమే పనిచేయా’లన్నారు. అయితే ఈ వివాదంలో ఎవరిది తప్పన్న విషయాన్ని సూటిగా చెప్పేందుకు తమన్నా ఇష్టపడలేదు. -
విశాల్‌తో మరోసారి..!
విశాల్‌తో మిల్కీబ్యూటీ మరోసారి రొమాన్స్‌కు రెడీ అవుతోందా? దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈ అమ్మడికి కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయనే ప్రచారం హోరెత్తుతున్న విషయం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్‌తో నటించిన కన్నెకలైమానే చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలాకాలంగా విడుదల కోసం ఎదురుచూస్తోంది. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు టైమ్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. తమన్నా తమిళంలో నటించిన చివరి చిత్రం అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్. శింబుతో జత కట్టిన ఈ చిత్రం ఫ్లాప్ అవడంతో తమన్నాను కోలీవుడ్ పక్కన పెట్టిందనే అనుకున్నారు. అలాంటిది ప్రస్తుతం ఈ జాణ ప్రభుదేవాతో దేవి–2లో రొమాన్స్ చేస్తోంది. తాజాగా మరో అవకాశం తమన్నా తలుపు తట్టిందనే టాక్ వినిపిస్తోంది. నటుడు విశాల్‌తో మరోసారి జత కట్టబోతోందని సమాచారం. విశాల్ ప్రస్తుతం అయోగ్య చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు.ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరిలో పూర్తి చేసుకుంటుంది. దీంతో విశాల్ తదుపరి సుందర్.సీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. వీరి కాంబినేషన్లో ఇప్పుటికే రెండు చిత్రాలు రూపొందాయన్నది గమనార్హం. అయితే అందులో తొలి చిత్రం మదగజరాజా ఇప్పటికీ తెరపైకి రాలేదు. ఇక అంబల చిత్రం విడుదలై సక్సెస్ అయ్యింది. తాజాగా మూడోసారి కలుస్తున్న విశాల్, సుందర్.సీ కూటమిలో తమన్నా చేరనుందని తెలిసింది. ఈ చిత్ర షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుందని తెలిసింది. తమన్నా ఇంతకు ముందు సండైకత్తి చిత్రంలో విశాల్‌తో రొమాన్స్ చేసింది. -
‘సైరా’ లో లక్ష్మిగా తమన్నా
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను... రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సౌత్ టాప్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్నా మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) తమన్నా పుట్టిన రోజు సందర్భంగా సైరా టీం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మిల్కీ బ్యూటీకి బర్త్‌డే విషెస్ తెలియజేసింది. సినిమాలో ఆమె పాత్ర పేరును లక్ష్మిగా పరిచయం చేసిన సైరా టీం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా 2019 సమ్మర్లో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కురెడీ అవుతున్న ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు జగపతిబాబు, సుధీప్, విజయ్ సేతుపతి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘ఎన్టీఆర్’లో జయప్రదగా మిల్కీబ్యూటీ?
స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చర్రిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. బాలకృష్ణ స్వయంగా నిర్మించి, నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాన్ని సమం చేస్తూ ఈ రెండు భాగాలను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రలో నటిస్తున్న రకుల్‌ప్రీత్ సింగ్ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. శ్రీదేవి, జయప్రద లాంటి ఎంతో మంది హీరోయిన్లు ఎన్టీఆర్‌తో కలిసి నటించి హిట్ పెయిర్‌గా నిలిచారు. అయితే ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం.. జయప్రద పాత్రలో మిల్కీబ్యూటీ తమన్నా నటించనున్నట్లు వినికిడి. మరి ఈ విషయం అధికారికంగా తెలియాలంటే చిత్రబృందం ప్రకటించేవరకు ఎదురు చూడాల్సిందే. ఎన్టీఆర్ కథనాయుకుడు జనవరి 9న, ఎన్టీఆర్ మహానాయకుడు జనవరి 24న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
చిరు-కొరటాల మూవీలో తమన్నా!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తరువాత చిరు కొరటాల కాంబినేషన్లో సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో చిరుకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లతో నటించిన తమన్నా చిరుతో పూర్తిస్థాయి చిత్రంలో నటించేందుకు రెడీ అవుతోందన్న మాట. ‘రచ్చ’ సినిమా రిలీజ్ సమయంలో.. తమన్నాతో కలిసి నటించాలని ఉందని చిరు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమన్నా ‘సైరా’లో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
సందడి చేసిన మిల్కీబ్యూటీ
భీమవరంలో సినీ హీరోయిన్ (మిల్కీబ్యూటీ) తమన్నా సోమవారంసందడి చేశారు. హ్యాపీ మొబైల్ షోరూమ్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా అభిమానుల కోరిక మేరకు సినిమా పాటకు స్టెప్వేసి అలరించారు. భీమవరం: సినీ హీరోయిన్ తమన్నా భాటియా భీమవరంలో సోమవారం సందడి చేసింది. పట్టణంలోని హ్యాపీ మొబైల్ షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా అభిమానుల కోరిక మేరకు సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షోరూం ప్రారంభోత్సవం తనతో పాటు తన అభిమానితో కలిసి చేయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగువారి ప్రేమాభిమానాలు ఎప్పటి మర్చిపోలేనని చెప్పారు. తెలుగు క్షుణ్నంగా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. భీమవరం పట్టణం మళ్లీమళ్లీ రావాలనిపించేలా ఉందన్నారు. తాను ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలసి సైరా చిత్రంలోను, దటీజ్ మహాలక్ష్మి చిత్రంలోను నటిస్తున్నట్టు వెల్లడించారు. చిరంజీవితో కలసి నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనకు తెలుగుసినీ పరిశ్రమలో రామ్‌చరణ్, ప్రభాస్, రాణా అంటే ప్రత్యేకమైన అభిమానమని పేర్కొన్నారు. డ్యాన్స్‌లో ప్రభుదేవా తనకు గురువని చెప్పారు. హ్యాపీ మొబైల్స్‌లో అత్యధిక డిస్కౌంట్‌తో విక్రయాలు చేయడంతో పాటి ప్రతి కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థ అధినేత కృష్ణపవన్ మాట్లాడుతూ కస్టమర్లకు సంతోషాన్నివ్వడమే తమ లక్ష్యమన్నారు. భీమవరంలోని పీపీ రోడ్డులో 30వ షోరూంను ప్రారంభించామని తెలిపారు. తొలి ఏడాదిలోనే 200 నూతన షోరూమ్‌లు ఏర్పాటు చేయాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వివరించారు. భారీ డిస్కౌంట్లతో సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటా సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి వార్తలపై స్పందించిన మిల్కీ బ్యూటీ
పెళ్లి వార్తలపై వరుసగా వస్తున్న రూమర్స్‌కు హీరోయిన్ తమన్నా చెక్ పెట్టారు. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు. ఇలాంటి పుకార్లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్న వారిపై మిల్కీ బ్యూటీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్విటర్లో స్పందించారు. ‘ఒక రోజు నటుడు, మరొకరోజు క్రికెటర్, ఇప్పుడేమో డాక్టర్.. నేనేమి భర్తల షాపింగ్ చేయటం లేదు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిరాధారమైన వార్తలను సహించే ప్రసక్తే లేదు. ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. నా పేరెంట్స్ కూడా పెళ్లి ఆలోచనల్లో లేరు. ప్రేమను ప్రేమిస్తా కానీ ఇలాంటి పుకార్లను కాదు. సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం చట్ట ప్రకారం, గౌరవప్రదంగానూ మంచిది కాదు. నా పెళ్లి గురించి ఏదైనా వార్త ఉంటే నేనే అభిమానులతో పంచుకుంటా’ అంటూ తమన్నా ట్వీట్ చేశారు. చదవండి: పెళ్లి పీటలెక్కనున్న స్టార్ హీరోయిన్..? -
షూటింగ్ పూర్తిచేసుకున్న ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’
మెడీయంటి ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై మిల్క్‌బ్యూటీ తమన్నా ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘దట్ ఈజ్ మాహాలక్ష్మీ’. బాలీవుడ్ సూపర్ హిట్ ‘క్వీన్’ సినిమాకి ఇది రిమేక్. కాగా తాజాగా జరిగిన యూరప్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఒకే సమయంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో సిద్దు జొన్నలగడ్డ, జీవీఎల్ నరసింహ రావు మరియు మాస్టర్ సంపత్ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో రిలీజ్ చేయడానికి చిత్రబృందం సన్నాహకాలు చేస్తుంది. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్న తరువాత యూనిట్ సభ్యులతో విభేదాల కారణంగా ఆయన తప్పుకున్నారు. తరవుత ‘అ’ ఫేం ప్రశాంత వర్మ ఈ ప్రస్టీజియస్ రీమేక్‌ను పూర్తి చేశారు. -
పెళ్లి పీటలెక్కనున్న స్టార్ హీరోయిన్..?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సౌత్ సినిమా సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ నటించిన తమన్నా కొద్దిరోజులుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగుపెట్టి పుష్కార కాలానికి పైగానే పూర్తయ్యింది. ఇన్నేళ్లలో గ్లామరస్ బ్యూటీగా ఆకట్టుకున్న తమన్నాకు నటిగా ప్రూవ్ చేసుకునేందుకు మాత్రం అవకాశాలు దక్కలేదు. కొంత కాలంగా సరైన అవకాశాలు లేకపోవటంతో పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెట్టారు తమన్నా. ఇప్పటికే ఆమె కుటుంబం సభ్యులు వరుడ్నికూడా ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఓ డాక్టర్‌తో త్వరలోనే తమన్నా వివాహం జరుగునుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై తమన్నా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ క్వీన్ రీమేక్‌తో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎఫ్ 2 సినిమాల్లో నటిస్తున్నారు. -
‘ఎఫ్2’లో ఎంట్రీ ఇచ్చిన భామలు
హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టిస్టారర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్‌లు షూటింగ్లో జాయిన్ కాగా, నేడు జరిగిన షూటింగ్లో ఇద్దరు భామలు కూడా ఎంట్రీ ఇచ్చారు. వెంకీకి జోడిగా తమన్నా, వరుణ్‌కు జోడిగా మెహ్రీన్ నటిస్తుండగా.. వీరిద్దరు కూడా ప్రస్తుతం షూటింగ్లో పాల్గొన్నారు. షూటింగ్ విరామ సమయంలో తమన్నాతో కలిసి దిగిన ఫోటోను మెహ్రీన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఎఫ్2 (ఫన్ అండ్ ఫస్ట్రేషన్) మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. Fun begins with this beauty 😍😘 @tamannaahspeaks #F2 pic.twitter.com/aTSdZvBc9j — Mehreen Pirzada (@Mehreenpirzada) July 10, 2018 -
హిట్టుకో లాంగ్వేజ్ ఉంటుంది
కథలున్నాయి.. కథలు లేకపోవడం ఏంటి? కానీ కథ హిట్టయితేనే కదా తీద్దామనుకుంటారు. హిట్ అవుతుందని ముందే తెలియాలి కదా తీయడానికి. ‘సపోజ్... ఫర్ సపోజ్’... ఇప్పుడు మేం 7 కథలు చెబుతాం. ఈ ఏడు కథలూ ఏడుగురు ప్రొడ్యూసర్లకి ఏడుగురు తెలుగు డైరెక్టర్లు చెబుతారనుకుందాం. ఒక్క చేప అయినా ఎండుతుందన్న నమ్మకం ఉంటుందంటారా? అందుకే చేప తెచ్చి ఎండబెట్టడం కంటే ఎండిన చేప తెచ్చుకుంటే రాజుగారు.. (అంటే ప్రొడ్యూసర్‌గారు) ‘‘చేపా చేపా ఎందుకు ఎండ లేదు’’ అని అడిగే ప్రసక్తే రాదు. తెలుగు కథకుల్లో ప్రతిభ లేక కాదు. ఆ ప్రతిభ కాంతికి చేప ఎండుతుందో లేదో అన్న నమ్మకం లేక పరభాష హిట్ సినిమాలు తెచ్చుకుని 7 రీమేకులు చేస్తున్నారు. స్ట్రయిటా, డబ్బింగా, రీమేకా అనేది కాదు. సినిమా బాగుంటే ఎవరూ ఎవర్నీ ఎండగట్టక్కర్లేదు. భాష ఏదైతేనేమి! హిట్ అవ్వడానికో గ్రామర్ ఉంటుంది. అదే హిట్ లాంగ్వేజ్. త్రీ థ్రిల్లర్స్ గతేడాది తమిళంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొని ఫైనల్లీ స్క్రీన్ మీదకొచ్చింది ‘మెర్సల్’. సూపర్ డూపర్ హిట్. తెలుగులో ‘అదిరింది’ పేరుతో అనువాదమై, టైటిల్‌కి తగ్గట్టే అనిపించుకుంది. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన సినిమా ఇది. అంతకు ముందు సంవత్సరం ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘తేరి’. అంటే.. మెరుపు. స్పార్క్ అనీ, వివేకం అనీ.. ఇలా కొన్ని అర్థాలున్నాయి. ‘రాజా రాణి’ అనే మంచి లవ్ కమ్ రొమాంటిక్ మూవీతో దర్శకుడయ్యారు అట్లీ. ఆ వెంటనే ‘తేరి’లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ తీశారు. మాస్ హీరో విజయ్‌కి తగ్గట్టే అట్లీ మంచి మాస్ స్టోరీ రెడీ చేశారు. కథ సింపుల్. చాలా సినిమాల్లో చూసిందే. సిన్సియర్ పోలీసాఫీసర్ తన డ్యూటీని బాధ్యతగా చేస్తుంటే భార్య, తల్లిని చంపేస్తారు. కూతురి కోసం అన్నీ వదిలేసి వేరే ఊరెళ్లిపోతాడు. అతను చనిపోయినట్లుగా కలరింగ్ ఇస్తాడు. కానీ, బతికున్న విషయం బయటపెట్టకుండా సంఘ విద్రోహ శక్తులను మట్టుబెడతాడు. ఈ కథకు అట్లీ ఇంట్రస్టింగ్ స్క్రీన్‌ప్లే రాసుకుని, తీశారు. సినిమాలో స్పార్క్ ఉందని, మంచి యాక్షన్ థ్రిల్లర్ అని ఆడియన్స్ కితాబులిచ్చేశారు. ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవు తోంది. రవితేజ హీరోగా నటిస్తున్నారు. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. విశేషం ఏంటంటే.. ‘తేరి’ సినిమా తెలుగులో ‘పోలీసోడు’గా అనువాదమైంది. జనాలు బాగానే చూశారు. మరి రీమేక్ ఎందుకు? అంటే.. మక్కీకి మక్కీ తీయడంలేదు. కథలో 70 శాతం మార్పులు చేశారట. ప్రస్తుతం ‘అమర్ అక్బర్ ఆంటోని, తేరి’ రీమేక్ రెండింటినీ ఒకేసారి చేస్తున్నారు రవితేజ. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక, తమిళం నుంచి తెలుగుకి రాబోతున్న మరో మూవీ ‘కణిదన్’ కూడా యాక్షన్ థ్రిల్లరే. అప్‌కమింగ్ హీరో, ‘హృదయం’ ఫేమ్ మురళి తనయుడు అథర్వ హీరో. కణిదన్ అంటే గణిత శాస్త్ర నిపుణుడు అని అర్థం. అయితే సినిమాలో హీరోకి, మ్యాథ్స్‌కి సంబంధం ఉండదు. అతను జర్నలిస్ట్. కాకపోతే శత్రువుల లెక్కని తెలివిగా తేల్చుతాడు. ఓ చిన్న టీవీ చానల్లో రిపోర్టర్‌గా చేసే హీరోకి బీబీసీ వంటి పెద్ద చానల్లో ఉద్యోగం దక్కించుకోవాలనే ఆరాటం ఉంటుంది. ఆ టైమ్ వచ్చినప్పుడు లైఫ్ వేరే టర్నింగ్ తీసుకుంటుంది. నకిలీ పత్రాలు సృష్టించి, చదువు కోసం బ్యాంక్ లోన్ తీసుకున్నావ్ అంటూ పోలీసులు అరెస్ట్ చేస్తారు. బెయిల్ మీద బయటకు వచ్చి, నకిలీ పత్రాల ముఠా లెక్కలు తేల్చుతాడు హీరో. ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో ‘ముద్ర’గా రీమేక్ అవుతోంది. ఇందులో నిఖిల్ హీరో. తెలుగు ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గట్టుగా పలు మార్పులు చేసి, ‘ముద్ర’ తీస్తున్నారు. తమిళ మాతృక దర్శకుడు టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్నారు. నిఖిల్, లావణ్యా త్రిపాఠీ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా ఇది. తెలుగులో రీమేక్ అయిన మరో తమిళ చిత్రం ‘సదురంగ వేటై్ట’. అంటే... చెస్ అన్నమాట. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. అందర్నీ మోసం చేస్తాడు హీరో. డబ్బు తప్ప హీరోకి మరో ధ్యాస ఉండదు. పెద్ద పెద్ద స్కామ్‌లను అవలీలగా చేసేస్తాడు. చివరికి ప్రేయసిని కూడా మోసం చేసేస్తాడు. అయితే కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేయడంతో మోసానికి గురైన ప్రేయసి ఆదుకుంటుంది. ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఫైనల్లీ లైఫ్ అంటే మనీ మాత్రమే కాదు... మెనీ థింగ్స్ ఉన్నాయని తెలుసుకుంటాడు. ‘జ్యోతిలక్ష్మి’ ఫేమ్ సత్యదేవ్ హీరోగా తెలుగులో ఈ చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’ పేరుతో రీమేక్ అయింది. గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వంలో రమేశ్ పిళ్లై నిర్మించిన ఈ సినిమా వచ్చే నెల రిలీజ్ కానుంది. తెలుగులో రీమేక్ అవుతోన్న ‘తేరి’, ‘కణిదన్’, ‘సదురంగ వేటై్ట’.. మూడూ థ్రిల్లర్స్ కావడం విశేషం. ఈ త్రీ థ్రిల్లర్స్ తమిళంలోలానే ఇక్కడా హిట్టవుతాయనే అంచనాలు ఉన్నాయి. 2 జానర్స్ పెళ్లి కుదురుతుంది. ఇంకో 24 గంటలు గడిస్తే మెడలో తాళి పడిపోతుంది. రాణీ మెహ్రాకి ఎన్నో కలలు. ఆనందంలో తేలుతున్న ఆమెతో ‘నీకు, నాకు కుదరదు. నీ సంప్రదాయపు అలవాట్లతో నేను మ్యాచ్ కాలేను’ అంటాడు కాబోయే భర్త విజయ్. రాణి అవాక్కవుతుంది. ఆ తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి, పెళ్లి జరిగాక భర్తతో కలసి హనీమూన్ వెళ్లడానికి బుక్ చేసుకున్న టికెట్స్ తీసుకుని ఒంటరి ప్రయాణం మొదలుపెడుతుంది. ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటుంది. ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి అయిపోతుంది. మోడ్రన్‌గా మారిన రాణి గురించి తెలుసుకుని, పెళ్లి చేసుకుందాం అని కబురు పెడతాడు విజయ్. మర్నాడు అతని ఇంటికి వెళుతుంది రాణి. ‘యస్’ చెప్పడానికి వచ్చిందనుకుంటాడు. ఎంగేజ్మెంట్ రింగ్ ఇచ్చేసి, ధీమాగా వెళ్లిపోతుంది రాణి. కంగనా రనౌత్ కెరీర్‌కి మైల్స్టోన్ లాంటి సినిమా ‘క్వీన్’. ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళంలో రీమేక్ అవుతోంది. తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మి’ పేరుతో రీమేక్ అవుతోన్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. ముందు నీలకంఠ దర్శకత్వంలో ఆరంభమైంది. ఆ తర్వాత ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు. ‘దటీజ్ మహాలక్ష్మి’ ఎమోషనల్ జానర్ అయితే.. ‘2 స్టేట్స్’ లవ్ జానర్. అబ్బాయి నార్త్.. అమ్మాయి సౌత్. హీరో పానీ పూరి బ్యాచ్. హీరోయిన్ పులిహోర బ్యాచ్. హీరో భల్లే భల్లే... బాంగ్రా డ్యాన్స్‌లో బెస్ట్. హీరోయిన్ సరిగమప టైప్. అయినా లవ్‌లో పడ్డారు. ‘సెట్ కాదు’ అని పెద్దలు అనేశారు. హీరోయిన్ ఇంటికి హీరో వెళతాడు. ఆ తర్వాత హీరో ఇంటికి హీరోయిన్ వెళుతుంది. పెద్దల మనసు గెలుచుకోవాలని పిల్లల ప్రయత్నం. గెలుచుకుంటారు. అయితే పెళ్లి తంతు ముగిసేవరకూ ‘మా ఆచారం.. మా ఆచారం’ అంటూ పెద్దల గొడవలు. ఎలాగైతేనేం లవర్స్ ఒకటయ్యారు. సింపుల్‌గా హిందీ ‘2 స్టేట్స్’ కథ ఇది. చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించారు. తెలుగులో అడవి శేష్ హీరోగా నటిస్తున్నారు. ఈ లవ్‌స్టోరీ ద్వారా జీవితా రాజశేఖర్ల కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్గా పరిచయం కానున్నారు. వెంకట్ కుంచమ్ దర్శకత్వంలో ఎమ్ఎల్వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఓ భాషలో హిట్టయిన ఈ లవ్‌స్టోరీ తెలుగు ప్రేక్షకుల ప్రేమ కూడా పొందుతుందని నమ్మొచ్చు. థ్రిల్లర్ టర్న్ అదో ఫ్లైఓవర్. అంత పొడవాటి ఫ్లై ఓవర్ మీద వెళ్లే బదులు మధ్యలో ఉండే డివైడర్స్ని దాటేస్తే టైమ్ కలిసొస్తుందని.. కొందరు ఆ డివైడర్స్ని పక్కకు తప్పించి, యు టర్న్ చేసుకుని వెళ్లిపోతుంటారు. ఇలా యు టర్న్ తీసుకున్నవాళ్లు హత్యకు గురవు తుంటారు. అవి చేస్తున్నదెవరు? అని తెలుసుకోవడానికి ఓ జర్నలిస్ట్ చేసే ప్రయత్నమే యు–టర్న్. పవన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ కన్నడ సినిమా సూపర్ హిట్. తెలుగులో జర్నలిస్ట్ రోల్‌ను సమంత చేస్తున్నారు. పవన్ కుమార్ దర్శకత్వంలోనే శ్రీనివాస్ చిట్టూరి ‘యు టర్న్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ థ్రిల్లర్ తెలుగులోనూ థ్రిల్ చేస్తుందని ఊహించవచ్చు. ఏబీసీడీ.. కామెడీ ఇద్దరు కుర్రాళ్లు... కజిన్స్. బాధ్యతల్లేవ్, బాధల్లేవ్. ఒక కుర్రాడి తండ్రి బిలియనీర్. కజిన్‌తో కలసి లైఫ్‌ని ఎంజాయ్ చేయడమే ఆ కుర్రాడి లైఫ్. ఖరీదు గల కార్లు, పబ్బులు.. ఎంజాయ్మెంట్స్ పీక్స్‌లో ఉంటుంది. ఇలా అయితే కొడుకు జీవితం పాడవుతుందని గ్రహించిన తండ్రి వెకేషన్ అంటూ ఇండియా పంపిస్తాడు. తనతో పాటు కజిన్ కూడా ఇండియా ప్రయాణం అవుతాడు. వీళ్లు ఇండియాలో అడుగుపెట్టే లోపు మొత్తం క్రెడిట్, డెబిట్ కార్డ్స్‌ని బ్లాక్ చేస్తాడు తండ్రి. అక్కణ్ణుంచి మనీ కష్టాలు మొదలవుతాయి. లైఫ్ తెలుసుకుంటారు. కామెడీ వేలో సాగే మలయాళ సినిమా ‘ఏబీసీడీ’ కథ ఇది. అంటే.. ‘అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ అన్నమాట. అదే పేరుతో తెలుగులో అల్లు శిరీష్ హీరోగా రీమేక్ అవుతోంది. కొత్త దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫన్ జర్నీ తెలుగులోనూ ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. – డి.జి. భవాని -
‘నా నువ్వే’ మూవీ రివ్యూ
టైటిల్ : నా నువ్వే జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : కల్యాణ్ రామ్, తమన్నా, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళీ, ప్రవీణ్ సంగీతం : శరత్ దర్శకత్వం : జయేంద్ర నిర్మాత : మహేష్ ఎస్. కోనేరు, కిరణ్ ముప్పవరపు, విజయ్ కుమార్ వట్టికూటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన కల్యాణ్ రామ్ ఇన్నాళ్లు అదే ఇమేజ్ను కంటిన్యూ చేస్తూ సినిమాలు చేస్తూ వచ్చాడు. కెరీర్లో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా వరుస సినిమాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే తొలిసారిగా తన ఇమేజ్ను పక్కన పెట్టి పూర్తి క్లాస్ మూవీగా తెరకెక్కిన నా నువ్వేతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కల్యాణ్ రామ్. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన నా నువ్వే అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంది..? మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి కల్యాణ్ రామ్ చేసిన ప్రయోగం ఏ మేరకు ఫలించింది..? కథ ; నా నువ్వే డెస్టినీని నమ్మే అమ్మాయి.. నమ్మని అబ్బాయిల ప్రేమకథ. వరుణ్ (కల్యాణ్ రామ్) పెద్దగా నమ్మకాలు లేని మోడ్రన్ కుర్రాడు. అమెరికాలో ఉద్యోగం రావటంతో ఫ్రెండ్స్‌ని, బామ్మని వదిలేసి అమెరికా ప్రయాణం అవుతాడు. కానీ ఏవేవో కారణాల వల్ల మూడు సార్లు వరుణ్ ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది. మీరా (తమన్నా) డెస్టినీని విపరీతంగా నమ్మె అమ్మాయి. అనుకోకుండా తన దగ్గరకు వచ్చిన బుక్ లో వరుణ్ ఫొటో చూసి ఇంప్రెస్ అవుతుంది. ఆ ఫొటో చూసినప్పుడలా తనకు లక్ కలిసి వస్తుండటంతో ఫొటో చూసే వరుణ్‌తో ప్రేమలో పడుతుంది. ఎలాగైన వరుణ్‌కు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంది. అనుకున్నట్టుగానే వరుణ్ కలిసి తన ప్రేమ గురించి చెపుతుంది. అయితే మీరా నమ్మే డెస్టినీకి ఓ టెస్ట్ పెట్టిన వరుణ్ చివరకు మీరాతో ప్రేమలో పడతాడు. మీరా తండ్రి (తనికెళ్ల భరణి) వారి ప్రేమకు అడ్డు చెప్తాడు. అనుకోని పరిస్థితుల్లో వరుణ్, మీరాకు దూరమవుతాడు. వరుణ్‌ను తిరిగి కలుసుకునేందుకు మీరా ఏం చేసింది..? వరుణ్, మీరాలు ఎందుకు దూరమయ్యారు..? చివరకు ఎలా కలిశారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఇన్నాళ్లు మాస్ యాక్షన్ రోల్స్ లో కనిపించి కల్యాణ్ రామ్ సాఫ్ట్, స్టైలిష్ లుక్ లో మెప్పించాడు. నటన పరంగానూ ఆకట్టుకున్నాడు. మీరా పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. గ్లామర్ షోతో కుర్రకారును ఫిదా చేసిన తమన్నా నటనలోనూ ఫుల్ మార్క్స్ సాధించింది. రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ తమన్నా నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పోసాని కృష్ణమురళీ తెర మీద కనిపించింది తక్కువ సేపే అయిన ఉన్నంతలో తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. హీరోయిన్ తండ్రి తనికెళ్ల భరణీ తనకు అలవాటైన రొటీన్ పాత్రలో కనిపించారు. ప్రవీణ్, వెన్నెల కిశోర్, సురేఖ వాణి, ప్రియదర్శి తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ ; కల్యాణ్ రామ్ లాంటి మాస్ హీరోతో రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కించిన దర్శకుడు జయేంద్ర అనుకున్న స్థాయిలో అలరించలేకపోయాడు. డెస్టినీ చుట్టూ రాసుకున్న కథలో ఎమోషన్స్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. విడిపోయిన హీరో హీరోయిన్లు ఎలా కలుస్తారన్న క్యూరియాసిటీ కలిగించినా.. ప్రేక్షకుడు కథలో లీనమయ్యే స్థాయి ఎమోషనల్ సీన్స్ లేకపోవటం నిరాశకలిగిస్తుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్లకు కామెడీ కూడా కీలకం. అయితే దర్శకుడు ఎక్కడా కామెడీ మీద దృష్టి పెట్టలేదు. వెన్నెల కిశోర్, ప్రవీణ్, ప్రియదర్శి లాంటి కమెడియన్స్ ఉన్నా వారిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. శరత్ సంగీతమందించిన పాటలు పరవాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. యాడ్ ఫిలిం మేకర్ అయిన జయేంద్ర పాటలను యాడ్ ఫిలింస్ లా గ్రాఫిక్స్ నేపథ్యంలో ప్లాన్ చేశారు. అయితే ఆ ప్రయత్నం కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. పీసీ శ్రీరాం లాంటి లెజెండరీ సినిమాటోగ్రాఫర్ ఉన్నా.. ఆయన మ్యాజిక్ కూడా ఎక్కడా కనిపించలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పూర్తి క్లాస్ సినిమా కావటంతో ఓ సెక్షన్ ఆడియన్స్ ను అలరించినా.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. ప్లస్ పాయింట్స్ : తమన్నా గ్లామర్ కొన్ని ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : స్లో నేరేషన్ లవ్ స్టోరిలో ఉండాల్సిన ఫీల్ కనిపించకపోవటం ఎంటర్టైన్మెంట్ లేకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
భరతనాట్యం నేర్చుకుంటున్న తమన్నా
కొణిదెల ప్రొడక్షన్స్‌పై మెగా పవర్‌స్టార్ రాంచరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం సైరా. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. మెగాస్టార్ రేంజ్‌కు తగ్గట్టు ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఇటీవలే మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ త్వరలో రెండో షెడ్యుల్ మొదలుపెట్టబోతోందని తెలుస్తోంది. చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తున్నారు. కాగా ఓ కీలకపాత్రకు మిల్కీబ్యూటీ తమన్నాను తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసం తమన్నా ప్రస్తుతం భరతనాట్యం నేర్చుకుంటున్నట్లు సమాచారం. బాహుబలి తర్వాత తెలుగులో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
‘నా నువ్వే’ మరింత ఆలస్యం..!
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నా నువ్వే. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో తమన్నా హీరోయిన్ గా నటించారు. చాలా రోజులు క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో విడుదల వాయిదా పడింది. దీంతో సినిమాను వారం రోజులు ఆలస్యంగా జూన్ 1న రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే చిత్రయూనిట్ అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం నా నువ్వే రిలీజ్ మరింత ఆలస్యం కానుందట. జూన్ 8న లేదా.. 14న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాని కారణంగానే విడుదల ఆలస్యమవుతుందని తెలుస్తోంది. -
మరో స్పెషల్ సాంగ్‌లో మిల్కీ బ్యూటీ
అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. చైతూకు ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ మాస్ మసాలా స్పెషల్ సాంగ్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుందట. గతంలో అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవ కుశ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన తమన్నా ఇప్పుడు నాగచైతన్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. -
కల్యాణ్ రామ్ కొత్త సినిమా వాయిదా..?
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా నువ్వే. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు. తమిళ దర్శకుడు జయేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే రోజు రవితేజ నేటటిక్కెట్టు రిలీజ్ అవుతుండటంతో పాటు సమ్మర్లో రిలీజ్ అయిన పలు చిత్రాలు ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తుండటంతో నా నువ్వేను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. వారం ఆలస్యంగా జూన్ 1న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
మిల్కీబూటీ ‘స్నేక్ డాన్స్’ వీడియో వైరల్
ఈ కాలంలో హీరోలకు ధీటుగా డాన్స్ చేసే హీరోయిన్ ఎవరూ... అంటే టక్కున గుర్తుకు వచ్చే సమాధానం మిల్కీబ్యూటి తమన్నా. ఈ టాలెంట్ వల్లే ఆమెకు పలు సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించే అవకాశం దక్కుతుంది. కొద్దిరోజుల క్రితం వచ్చిన ఎన్టీఆర్ ‘జైలవకుశ’ సినిమాలో ‘స్వింగ్ జర’ పాటకు యంగ్ టైగర్‌కు ధీటుగా ఈ బ్యూటీ చేసిన డాన్స్ చూస్తే ఈ విషయాన్ని అంగీకరించక తప్పదు. ఆమెకు పారిస్‌కు చెందిన ప్రముఖ డీజే(డిస్క్ జాకీ) స్నేక్ ఓ ఛాలెంజ్ విసిరారు. తాను నటించిన ‘మెజెంటా రిడిమ్’ పాటకు డ్యాన్స్ చేయాలని తమన్నాతో ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్‌కు తమన్నా ఒప్పుకోవడమే కాక బ్రహ్మండంగా డాన్స్ చేసి మరి ఛాలెంజ్ నెగ్గారు. వెస్ట్రన్, ఇండియన్ స్టెప్పులతో తమన్నా వేసిన ఈ డాన్స్‌కు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. ‘డీజే స్నేక్ కోసం ‘మెజెంటా రిడిమ్’ ఛాలెంజ్‌కు ఒప్పుకొన్నా. జూయీ వైద్య ఈ పాటకు డాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు’ అని క్యాప్షన్ ఇచ్చారు. దాదాపు లక్ష మందికిపైగా ఈ వీడియోను లైక్ చేశారు. తమన్నా, స్నేక్ మంచి స్నేహితులు. ‘మెజెంటా రిడిమ్’ పాటను కంపోజ్ చేయడానికి ఇటీవల స్నేక్ హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో తమన్నా స్నేక్కు స్వయంగా దగ్గరుండి ‘బాహుబలి’ సినిమాను చూపించారు. స్నేక్ ఈ సినిమా చూసి ‘భారతీయ సంస్కృతి, డాన్స్‌లు నాకెంతో స్ఫూర్తినిస్తాయి’ అని పేర్కొన్నారు. కల్యాణ్ రామ్‌కు జోడీగా తమన్నా నటించిన ‘నా నువ్వే’ చిత్రం త్వరలో విడుదలకానుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2’, ‘క్వీన్’ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. -
వెంకీకి జోడిగా మిల్కీ బ్యూటీ
గురు సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చేశాడు విక్టరీ వెంకటేశ్. కానీ ఈ మూవీ వచ్చి ఏడాది గడుస్తున్నా... వెంకీ నుంచి కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఆచితూచి స్ర్కిప్ట్స్కు ఓకే చెప్పడమే దీనికి కారణం అని తెలుస్తోంది. డైరెక్టర్ తేజతో ఓ సినిమా ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) మల్టిస్టారర్‌లో వరుణ్‌తేజ్,వెంకటేశ్‌లు నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు అంటూ చాలా మంది పేర్లే వినిపించాయి. కానీ తాజాగా దిల్ రాజు అధికారికంగా ప్రకటించేశారు. వెంకీకి జోడిగా మిల్కీ బ్యూటిని, వరుణ్‌కు జోడిగా మెహరీన్‌ను తీసుకున్నుట్లు సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. జూన్‌లో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. అనిల్ రావిపూడి ఈ సినిమాను ఆద్యంతం వినోదంగా తెరకెక్కించనున్నట్లు సమాచారం. -
అదే బ్యానర్లో మరో సినిమా
త్వరలో నా నువ్వే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న కల్యాణ్ రామ్.. తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశాడు. ఏప్రిల్ 25న కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాను కూడా నా నువ్వే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే నిర్మించనున్నారు. జల్సా, దూకుడు, ఆగడు లాంటి చిత్రాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండేలు హీరోయిన్లుగా నటించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న నా నువ్వే మేలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతోంది. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘నా నువ్వే’
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా నువ్వే. ఇటీవల ఎంఎల్ఏగా ఆకట్టుకున్న నా నువ్వేలో క్లాస్ లుక్‌లో అలరించనున్నాడు. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లెజెండరీ టెక్నీషియన్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మే 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్, కూల్ బ్రీజ్ సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. -
నేను మారిపోయా!
తమిళసినిమా : నేనిప్పుడు చాలా మారిపోయాను అంటోంది మిల్కీబ్యూటీ తమన్నా. యోగా టీచర్ అనుష్క సినీరంగప్రవేశం చేసినా, తన పూర్వవృత్తిని మరచిపోలేదు. తన యోగా సరంజామాను షూటింగ్ స్పాట్స్‌కు తీసుకెళ్లి నటుడు ఆర్య వంటి సహ నటులకు యోగాను నేర్పించేవారు. దాని ఫలితం గ్రహించిన పలువురు తారలిప్పుడు యోగా బాట పట్టారు. అందులో నటి తమన్నా ఒకరు. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ యుక్తవయసు అమ్మాయిలానే కనిపించే తమన్నా తన అందానికి యోగా ముఖ్య కారణం అంటున్నారు. హైదరాబాద్‌లోని భరత్ ఠాకూర్ యోగా ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్నారట. దీని గురించి ఈ బ్యూటీ తెలుపుతూ తానెప్పుడూ చిన్నపిల్లలా ప్రవర్తించేదానినని, అయితే ఎప్పుడైతే భరత్ ఠాకూర్ యోగా ఇన్స్టిట్యూట్లో చేరానో అప్పటి నుంచి చాలా మారిపోయానని చెప్పారు. ఆ ఇన్స్టిట్యూట్లో ట్రైనర్ రుషి అంతగా యోగా శిక్షణను ఇచ్చారని తెలిపారు. యోగాలో శిక్షణ మాత్రమే కాకుండా శారీరకంగా, మానసికంగా ఎలా ఉత్సాహంగా ఉండాలన్న విషయాలను నేర్పించారని చెప్పారు. బాహుబలి చిత్రంలో నటిస్తుండగా ఆయనతో స్నేహం ఏర్పడిందని తెలిపారు. అప్పటి నుంచి తాను యోగాలో శిక్షణ పొందుతున్నానని చెప్పారు. నిజం చెబుతున్నా యోగాలో శిక్షణ పొందిన తరువాత తాను చాలా అదృష్టవంతురాలిననే భావన కలుగుతోందని అన్నారు. ఇప్పుడు షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా యోగా మానుకోనని తమన్నా అంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా కన్నె కలైమానే చిత్రంలో నటిస్తున్నారు. -
క్వీన్ రీమేక్‌లో కొత్త ట్విస్ట్
బాలీవుడ్లో ఘనవిజయం సాదించిన క్వీన్ సినిమాను సౌత్ లో రీమేక్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నో మార్పులు చేర్పులు తరువాత తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే కన్నడ వర్షన్ షూటింగ్ పూర్తికావస్తుండగా తెలుగు, తమిళ భాషల్లో త్వరలో ప్రారంభం కానుంది. అంతా ఓకే అనుకుంటున్నసమయంలో ఈ టీంకు మరో షాక్ తగిలింది. హిందీలో లిసా హెడెన్ నటించిన పాత్రకు తెలుగు తమిళ భాషల్లో అమీజాక్సన్‌ను తీసుకున్నారు. అయితే ఈ సినిమాల షూటింగ్ సమయంలో అమీకి ఓ ఇంగ్లీష్ వెబ్ సీరీస్ లో ఆఫర్ రావటంతో క్వీన్ రీమేక్ నుంచి తప్పుకుంది. దీంతో చిత్రయూనిట్ ఆ పాత్రకు మరో నటిని ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఈ ‘క్వీన్’ పేరుతోనే తెరకెక్కుతున్న తెలుగు రీమేక్‌లో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా ‘పారిస్ పారిస్’ పేరుతో తెరకెక్కుతున్న తమిళ రీమేక్‌లో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. -
సంగీత్ వేడుకలో తమన్నా
-
సంగీత్ వేడుకలో తమన్నా
ముంబై: టాలీవుడ్ అందాల తార తమన్నా భాటియా సోదరుడి మెహందీ ఫంక్షన్లో తళుక్కున మెరిసింది. తమన్నా సోదరుడు, అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఆనంద్ భాటియా వివాహం కృతికా చౌదరితో త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో జూన్29న శుక్రవారం ముంబైలో అత్యంత ఉత్సాహంగా సంగీత్ వేడుక జరిగింది. ఈ సంగీత్ వేడుకలో అమ్మడు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలించింది. మెహిందీ చేతులతో మురిసిపోతూ, గార్జియస్ తమన్నా అభిమానులకు కనువిందు చేసింది. ప్రస్తుతం తమన్నా ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నా అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ భాషలలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రధానంగా బాహుబలి మొదటి భాగంలో అవంతిక పాత్ర ద్వారా పలువురిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
హీరోయిన్ కోసం ప్రభాస్..!
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ప్రస్తుతం రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సాహో షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాతో ఓ బాలీవుడ్ సినిమాకు ప్రభాస్ ఓకె చెప్పాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే బాలీవుడ్లో ప్రభాస్ చేయబోయేది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదట. తనకు కావల్సిన ఓ హీరోయిన్ కోసం అతిథి పాత్రలో నటించేందుకు అంగీకరించాడు బాహుబలి. మిల్కీ బ్యూటి తమన్నా లీడ్ రోల్లో తమిళ సూపర్ హిట్ సినిమా కొలైయుథిర్ కాలంను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాహుబలి స్టార్ ప్రభాస్ కొద్ది నిమిషాల పాటు కనిపించనున్నాడన్న వార్త ఇప్పుడు సౌత్‌తో పాటు నార్త్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఖండించకపోయినా.. నిజమే అన్న క్లారిటీ కూడా ఇవ్వలేదు. మరి నిజంగా ప్రభాస్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడో లేదో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
క్వీన్ రీమేక్‌లో కాజల్..?
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ నటుడు దర్శకుడు త్యాగరాజన్ క్వీన్ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకోగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ముందుగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాను స్టార్ చేయాలని భావించిన త్యాగరాజన్, రేవతి దర్శకత్వంలో తమన్నా లీడ్ రోల్లో క్వీన్‌ను రీమేక్‌కు ప్లాన్ చేశాడు. అయితే తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంలో ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారన్న ప్రచారం జరిగింది. కానీ త్యాగరాజన్ మాత్రం క్వీన్ రీమేక్‌ను ఎలాగైన ముందుకు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు. అందుకే ముందుగా కన్నడ లో రమేష్ అరవింద్ దర్వకత్వంలో పరుల్ యాదవ్ లీడ్ రోల్ లో సినిమాను స్టార్ట్ చేశాడు. తరువాత తమన్నా ప్లేస్‌లో మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ రీమేక్‌లో నటించేందుకు అంగీకరించింది. రేవతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం కాజల్‌తో చర్చలు జరుపుతున్నారట. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
'క్వీన్' రీమేక్ ఆగిపోలేదట..!
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ నటుడు దర్శకుడు త్యాగరాజన్ క్వీన్ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకోగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ముందుగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాను స్టార్ చేయానలి భావించిన త్యాగరాజన్, రేవతి దర్శకత్వంలో తమన్నా లీడ్ రోల్లో క్వీన్‌ను రీమేక్ చేయడానికి ప్లాన్ చేశాడు. అయితే తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంలో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారన్న ప్రచారం జరిగింది. కానీ త్యాగరాజన్ మాత్రం తమన్నా తప్పించి క్వీన్ రీమేక్ ను ముందుకు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు. అందుకే ముందుగా కన్నడ రీమేక్ ను ప్రారంభిస్తున్నాడు. పరుల్ యాదవ్ లీడ్ రోల్ లో రమేష్ అరవింద్ దర్శకత్వంలో సినిమా ప్రారంభిస్తున్నాడు. తరువాత తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఒకేసారి సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. -
అతనితో నయన సై అంటుందా?
నేటి హీరోయిన్లు కథకు ప్రాముఖ్యత, పాత్రల్లో నటనకు అవకాశం ఉండాలి అని పైకి చెప్పినా పారితోషికానికి ప్రాధాన్యంఇస్తారన్నది చాలా సార్లు రుజువైంది. అవును డబ్బే ముఖ్యం అని కొందరు బహిరంగంగానే అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి. వర్ధమాన నటి కీర్తీసురేశ్ అతి కొద్ది కాలంలోనే మూడు కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తోందన్న వార్తలు వింటున్నాం. ఇందంతా ఎందుకు చెప్పాల్సొస్తోందంటే, ప్రస్తుతం లేడీసూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నటి నయనతారతోనే కథానాయకుడిగా తన తొలి చిత్రం ఉంటుందని ఒక యువ వ్యాపారవేత్త వెల్లడించారు. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార టాప్ హీరోలతో పాటు, యువ స్టార్ హీరోలతోనూ, వర్ధమాన హీరోలతోనూ నటించడానికి సై అంటున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ యువ వ్యాపారవేత్త కలను నిజం చేస్తారా? ఇంతకీ ఈ వ్యాపారవేత్త ఎవరన్నది చెప్పలేదు కదూ‘ప్రముఖ వాణిజ్య సంస్థ శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ ఆ మధ్య తన సంస్థ ప్రమోషన్ కోసం రూపొందించిన వాణిజ్య ప్రకటనలో ప్రముఖ నటీమణులు తమన్నా, హన్సికలతో కలిసి నటించారు. ఆయనకిప్పుడు సినిమా ఆశపుట్టిందట. తను కథానాయకుడిగా నటించే తొలి చిత్రంలో నయనతారనే నాయకి అవుతుందని ఆయనే స్వయంగా వెల్లడించారు. మరి ఈ విషయం నయనతార చెవిన పడిందా?ఆయనతో నటించడానికి ఈ బ్యూటీ సై అంటుందా? ఎస్ అంటే ఎంత పారితోషకం డిమాండ్ చేస్తారు? ఈ వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఇప్పటికే ఈ అమ్మడు నాలుగు కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు సినీ వర్గాల టాక్. -
మూగ, చెవిటి పాత్రలో స్టార్ హీరోయిన్
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లందరూ లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టిపెడుతున్నారు. అలా కుదరని పక్షంలో ఉన్నంతలో తమ పాత్రతో నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనుష్క, నయనతార లాంటి స్టార్ హీరోయిన్స్ పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌లో సక్సెస్ సాధించగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే ప్రయత్నాల్లో ఉంది. సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న తమన్నా ఇప్పుడు నటిగా ప్రూవ్ చేసుకోవాలని తాపత్రేయపడుతోంది. అందుకే అభినేత్రి సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవటంతో తమన్నా కష్టం వృథా అయ్యింది. అయితే తాజాగా మరో ఛాలెంజిగ్ రోల్‌కు ఓకె చెప్పింది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం బాహుబలి 2 ప్రమోషన్లో బిజీగా ఉన్న తమన్నా, ఈ పనులన్ని పూర్తయ్యాక, బాలీవుడ్ దర్శకుడు వసు భగ్నాని నిర్మాణంలో ఓ సినిమా చేయనుంది. ఈ సినిమాలో తమన్నా మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తుందట. ఈ సినిమాతో నటిగా తాను అనుకున్న ఇమేజ్ వస్తుందన్న నమ్మకంతో ఉంది తమ్ము. అంతేకాదు మరోసారి ప్రభుదేవా దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించానన్న తమన్నా, ఆ సినిమాతో తన క్యారెక్టర్ అభిమానులకు షాక్ ఇస్తుందని తెలిపింది. -
రీమేక్ సినిమాకు ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్
గత ఏడాది టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన చిన్న సినిమా పెళ్లిచూపులు. రాజ్ కందుకూరి నిర్మాణంలో తరుణ్ భాస్కర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూవర్మలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెళ్లిచూపులు ఘనవిజయం సాధించటంతో ఇతర ఇండస్ట్రీల నుంచి రీమేక్ హక్కుల కోసం భారీ ఆఫర్లు వచ్చాయి. ఫైనల్ గా తమిళ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇప్పటినుంచే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాడు. విష్ణు విశాల్, తమన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కార్టూన్ లా డిజైన్ చేశారు. సినిమా థీమ్ కు తగ్గట్టుగా మొబైల్ క్యాంటీన్ ముందు హీరో హీరోయిన్ల కార్టూన్ బొమ్మలతో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తమిళలో 'పొన్ ఒరు కండేన్' ( ఒక అమ్మాయిని చూశా) పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెంథిల్ వీరాస్వామి దర్శకుడు. -
బాహుబలి బ్యూటీకి ఒక్క ఆఫర్ కూడా లేదట..!
వెండితెరపై ఇక కెరీర్ ముగిసిపోయిందనుకుంటున్న సమయంలో బాహుబలి సినిమాతో తిరిగి సూపర్ ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపించింది మిల్కీ బ్యూటి తమన్నా. వరుసగా బాహుబలి, ఊపిరి, బెంగాల్ టైగర్ లాంటి సినిమాలు సక్సెస్ సాధించటంతో తమన్నా కెరీర్ తిరిగి గాడిలో పడినట్టే కనిపించింది. అదే సమయంలో అభినేత్రి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా వర్క్ అవుట్ కాలేదు. దీంతో మరోసారి తమన్నా కెరీర్ కష్టాల్లో పడింది. త్వరలో బాహుబలి 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోన్న తమన్నా, చేతిలో ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. విక్రమ్, శింబు లాంటి హీరోలతో తమిళ నాట సినిమాలు చేస్తున్నా.. ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు మాత్రం మిల్కీ బ్యూటి దగ్గరకు రావటం లేదు. బాహుబలి సినిమాతో కెరీర్ మలుపు తిరుగుతుందని భావించిన తమన్నాకు తెలుగు తెర మీద నిరాశే ఎదురవుతోంది. -
ఐటమ్ సాంగ్‌కు అరకోటిపైనే ..
ఐటమ్ సాంగ్‌లతో పాపులర్ అయినా వ్యాంపు గీతాల్లో నటించడానికి ఒకప్పుడు ప్రత్యేకంగా నర్తకీమణులు ఉండేవారు. ఇప్పుడు కథానాయికలే అలాంటి పాటలకు చిందేసేస్తున్నారు. ఇంతకు ముందు కథానాయికలు ప్రత్యేక గీతాల్లో నటిస్తే ఇమేజ్ డామేజ్ అవుతుందని భయపడేవారు. మరి కొందరు అలా నటించి కెరీర్‌ను పాడు చేసుకున్న వారు లేకపోలేదు. ఈ తరం నటీమణులు అలాంటి ఆలోచన గానీ, భయానికిగానీ తావివ్వడం లేదు. ఇమేజ్ను పణంగా పెట్టి అందుకు భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటి టాప్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్‌లో నటించినా వారి స్టార్డమ్కు ఎలాంటి భంగం కలగడం లేదని చెప్పవచ్చు. నటి నయనతార, శ్రుతిహాసన్, తమన్నా, కాజల్‌అగర్వాల్ లాంటి టాప్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్లకుసై అంటున్నారు. అందుకు ఒక చిత్రంలో హీరోయిన్‌కు అందే పారితోషికం ఒక్క ఐటమ్ సాంగ్‌కే ముట్టడం ప్రధాన కారణం కావచ్చు. ఆ మధ్య నటి నయనతార శివకాశి అనే చిత్రంలో విజయ్‌తోనూ, సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన శివాజీ చిత్రంలోనూ సింగిల్ సాంగ్‌లో ఆడి భారీ మొత్తంలో పారితోషికం పొందారు. అదే విధంగా శ్రీయ, చార్మీ,అంజలి వంటి నాయికలు ఐటమ్ సాంగ్‌కు రెడీ అంటున్నారు. ఇటీవల కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న జాగ్వర్ అనే చిత్రంలో శ్రుతిహాసన్ నిరాకరించిన ఐటమ్ సాంగ్‌లో నటించడానికి మిల్కీబ్యూటీ తమన్న సై అన్నారట. అందుకు తను కోటి రూపాయలు డిమాండ్ చేయగా దర్శక నిర్మాతలు బేరసారాలాడగా చివరికి 75 లక్షలకు బేరం కుదిరిందని సమాచారం. ఇక నటి కాజల్ అగర్వాల్ టాలీవుడ్ చిత్రం జనతా గ్యారేజ్‌లో సింగిల్ సాంగ్‌లో చిందేయడానికి అక్షరాలా అర కోటి పుచ్చుకున్నట్లు టాక్. ఇలా టాప్ హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్‌కు సిద్ధం అంటుంటే ఇంకా ప్రత్యేక గీతాల్లో ఆడే నర్తకీమణులకు అవకాశాలెక్కడ ఉంటాయి. అయితే వ్యాపారపరంగా ప్లస్ అవుతుందని దర్శక నిర్మాతలే భారీ మొత్తాలను చెల్లించి టాప్ హీరోయిన్లను ఐటమ్ బాంబ్లుగా మారుస్తున్నారన్న వాదనలో నిజం లేకపోలేదు. ఇక ప్రేక్షకులు కూడా టాప్ హీరోయిన్ల శృంగార భరిత నృత్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారన్నది గమనార్హం. ఇప్పుడిది ట్రెండ్‌గా మారిందనవచ్చు.