అక్షయ్ ను చూసి మైమరిచిపోయాను: తమన్నా
హిమ్మత్ వాలా రీమేక్ బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందడంతో తమన్నా ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో నటిస్టున్న 'ఇట్స్ ఎంటర్ టైన్ మెంట్'పై గంపెడాశలు పెట్టుకుంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని తమన్నా తెలిపింది. కెమెరా ముందు అక్షయ్ నటన ను చూసి తాను మైమరిచిపోయానని తమన్నా ప్రశంసల వర్షం కురిపించింది.
ఈ చిత్రంలో అక్షయ్ నటన కన్నులకు పండగే అని తెలిపింది. అక్షయ్ తో నటించడం ఓ గొప్ప అనుభూతి అని తెలిపింది. 'ఇట్స్ ఎంటర్ టైన్ మెంట్' చిత్రం షూటింగ్ బ్యాంకాక్ లో జరిగిందని తెలిపింది. బాలీవుడ్ లో సాజిద్ ఖాన్ రూపొందిస్తున్న 'హమ్ షకల్స్' చిత్రంలో సైఫ్ ఆలీ ఖాన్ సరసన మరో చిత్రంలో తమన్నా నటిస్తోంది.