హీరోయిన్ కోసం ప్రభాస్..! | Prabhas guest role in Tamannah Bollywood Movie | Sakshi
Sakshi News home page

హీరోయిన్ కోసం ప్రభాస్..!

Jun 27 2017 3:15 PM | Updated on Sep 5 2017 2:36 PM

హీరోయిన్ కోసం ప్రభాస్..!

హీరోయిన్ కోసం ప్రభాస్..!

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ప్రస్తుతం రన్ రాజా రన్ ఫేం సుజిత్

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ప్రస్తుతం రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సాహో షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాతో ఓ బాలీవుడ్ సినిమాకు ప్రభాస్ ఓకె చెప్పాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే బాలీవుడ్లో ప్రభాస్ చేయబోయేది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదట. తనకు కావల్సిన ఓ హీరోయిన్ కోసం అతిథి పాత్రలో నటించేందుకు అంగీకరించాడు బాహుబలి.

మిల్కీ బ్యూటి తమన్నా లీడ్ రోల్లో తమిళ సూపర్ హిట్ సినిమా కొలైయుథిర్ కాలంను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాహుబలి స్టార్ ప్రభాస్ కొద్ది నిమిషాల పాటు కనిపించనున్నాడన్న వార్త ఇప్పుడు సౌత్తో పాటు నార్త్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఖండించకపోయినా.. నిజమే అన్న క్లారిటీ కూడా ఇవ్వలేదు. మరి నిజంగా ప్రభాస్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడో లేదో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement