guest role
-
అతిథి పాత్రకు సై?
అందం, అభినయం పరంగా తెలుగు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ తెలుగు సినిమా అంగీకరించి దాదాపు రెండేళ్లయింది. ప్రస్తుతం తమిళంలో ‘కాదలిక్క నేరమిల్లయ్, డియర్ ఎక్సెస్’ సినిమాలు చేస్తున్నారు. ఇవి తెలుగులోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. మరి... నిత్యా మీనన్ స్ట్రయిట్ తెలుగు సినిమా సంగతి ఏంటి? అంటే... ఆమె ఓ తెలుగు సినిమా అంగీకరించారనే ప్రచారం జరుగుతోంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తమ్ముడు’ సినిమాలో అతిథి పాత్రకు సై అన్నారట నిత్య. గతంలో నితిన్, నిత్యా మీనన్ జంటగా నటించిన ‘ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అలా హిట్ పెయిర్ అనిపించుకున్నారు. తాజాగా నితిన్ హీరోగా రూ΄÷ందుతున్న ‘తమ్ముడు’లో సప్తమీ గౌడ కథానాయికగా నటిస్తున్నారు. నటి లయ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో ఉన్న కీలకమైన అతిథి పాత్రకు నిత్యా మీనన్‌ని తీసుకున్నారని సమాచారం. -
టైగర్‌లో యంగ్ టైగర్?
యంగ్ టైగర్.. హీరో ఎన్టీఆర్‌ని ఫ్యాన్స్ అలానే పిలుచుకుంటారు. ఈ యంగ్ టైగర్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘టైగర్ 3’ సినిమాలో నటించనున్నారా? అంటే అవునంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్న ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రం షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. అయితే ‘వార్ 2’ కంటే ముందే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘టైగర్ 3’లో ఎన్టీఆర్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్. ‘టైగర్ జిందా హై’ చిత్రానికి సీక్వెల్‌గా మనీష్ శర్మ దర్శకత్వంలో ‘టైగర్ 3’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో క్లయిమాక్స్‌లో ఎన్టీఆర్ కనిపిస్తారని భోగట్టా. కాగా ‘టైగర్ 3’, ‘వార్ 2’ రెండు చిత్రాలను యశ్ రాజ్ ఫిల్మ్ప్ నిర్మిస్తుండటం విశేషం. -
వెండితెరపై స్టార్స్‌ను కలిపిన సూపర్ హిట్ కథలు
కొన్ని కథల్లో అతిథి పాత్రలకు కూడా ‘స్టార్’ రేంజ్ యాక్టర్లు కావాల్సి వస్తుంది. కథలో ఆ పాత్రలకు అంత ప్రాధాన్యం ఉంటుంది. ఆప్రాధాన్యాన్ని గ్రహించి అతిథి పాత్రలకు స్టార్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. అలా కొన్ని క్రేజీ కాంబినేషన్స్‌ని కొన్ని కథలు కలిపాయి. ఆ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. కల్కి కలిపింది ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ‘మహానటి’ వంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్‌హాసన్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇలా ఇద్దరు లెజెండరీ నటులను, ఒక స్టార్ డైరెక్టర్ని ‘కల్కి’ కలిపింది. భారతీయ ఇతిహాసం మహాభారతం స్ఫూర్తితో మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని ΄ోలిన పాత్రలో కనిపించనున్నారని టాక్. అమితాబ్ క్యారెక్టర్ మహాభారతంలోని అశ్వథ్థామ పాత్రను ΄ోలి ఉంటుందని భోగట్టా. అలాగే కమల్‌హాసన్ విలన్ పాత్ర ΄ోషిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళిది అతిథి పాత్ర. ఆయన ఎలాంటి పాత్రలో కనిపిస్తారనేది తెలియాల్సి ఉంది. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాని జనవరి12 విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కన్నప్పలో శివుడు? మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో స్టార్ హీరో ప్రభాస్ నటించనున్నారు. ఈ మూవీకి ‘మహాభారత’ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించ నున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నటుడు, నిర్మాత మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల శ్రీకాళహస్తిలోప్రారంభమైంది. శివ భక్తుడైన కన్నప్ప, ఆయన భక్తి నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. కన్నప్పగా మంచు విష్ణు నటించనున్నారు. శివుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని టాక్. కోలీ స్టార్‌తో టాలీ స్టార్ ‘సార్’ వంటి హిట్ సినిమా తర్వాత తమిళ హీరో ధనుష్ తెలుగులో నటిస్తున్న రెండో స్ట్రయిట్ ఫిల్మ్ ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్). శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించనున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో తెలుగు స్టార్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించనున్నారు. నాగార్జున పుట్టినరోజుని (ఆగస్టు 29) పురస్కరించుకుని ‘డీ 51’ చిత్ర నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు ఈ చిత్రంలో ఆయన నటించనున్న విషయాన్ని వెల్లడించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో నాగార్జున పాత్రకి చాలాప్రాధాన్యం ఉందని టాక్. ప్రస్తుత సమాజంలో నెలకొన్న అసమానతల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందట. ఈ చిత్రంలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తారు. వార్కి సిద్ధం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియాని మించిన స్థాయిలో స్టార్డమ్ సొంతం చేసుకున్నారు హీరో ఎన్టీఆర్. ఇప్పటివరకూ తెలుగు సినిమాలు మాత్రమే చేసిన ఆయన తొలిసారి పరభాషా చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందనున్న ‘వార్ 2’ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘వార్’ (2019) సినిమాకు సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందనుంది. -
కల్కికి అతిథిగా...
దర్శకుడిగా ఎక్కువగా కెమెరా వెనకాల ఉండే రాజమౌళి అప్పుడప్పుడూ నటుడిగా కెమెరా ముందుకు వస్తుంటారు. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘సై’, ‘మగదీర’, ‘బాహుబలి: ది బిగినింగ్’ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల్లో సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు రాజమౌళి. ఇతర దర్శకుల చిత్రాలైన ‘రెయిన్ బో’, ‘మజు్న’ల్లో అతిథి పాత్రల్లో కనిపించారు. తాజాగా ‘కల్కి 2898ఏడీ’ చిత్రంలో అతిథిగా కనిపించేందుకు రాజమౌళి అంగీకరించారని సమాచారం. ప్రభాస్ హీరోగా నాగ్ అశి్వన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నేడు ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరించేలా నాగ్ అశ్విన్ ప్లాన్ చేశారని తెలిసింది. ఈ ఒక్క రోజుతో రాజమౌళి పాత్ర చిత్రీకరణ పూర్తవుతుందని భోగట్టా. ఇక దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ వచ్చే ఏడాది విడుదల కానుంది. -
మెగాస్టార్ సినిమాలో అక్కినేని హీరో.. ఆ పాత్రకు ఓకే!
చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150 మినహాయిస్తే ప్రతి సినిమాలో యంగ్ హీరో సపోర్ట్ తీసుకుంటున్నాడు.సైరా సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తే... ఆచార్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించాడు. ఇక గాడ్ ఫాదర్ సత్యదేవ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. చిరంజీవి స్టామినా ఎంటో బాక్సాఫీస్‌కి చూపించిన వాల్తేరు వీరయ్యలో రవితేజతో కలిసి నటించాడు మెగాస్టార్. ఈ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా భోళా శంకర్. ఈ సినిమాలో కూడా ఓ యంగ్ హీరో నటించనున్నాడు. ఈ ఛాన్స్ అక్కినేని హీరో దక్కించుకున్నాడు. వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత చిరంజీవికి.. ప్రేక్షకులు తన నుంచి ఏమి కోరుకుంటున్నారో బాగా అర్థమైనట్లుంది. అందుకే తను మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా మాస్ ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య సక్సెస్ కావటంతో.. భోళాశంకర్‌పై హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా తమిళ్ హీరో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరు తనదైన స్టైల్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఖుషి సినిమాలోని ఇంటర్వెల్ సీన్‌ను చిరంజీవి- శ్రీముఖి మధ్య రీ క్రియేట్ చేసి షూట్ చేసినట్లు ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే చూడాలని ఉంది సినిమాలోని రామ్మా చిలకమ్మ హిట్ సాంగ్‌ను కూడా భోళాశంకర్‌లో రీమిక్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్గా తమన్నా నటిస్తోంది. సిస్టర్‌గా కీర్తి సురేశ్ కనిపించనుంది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి మరో యంగ్ హీరోతో కలిసి సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సారి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం అక్కినేని హీరో సుశాంత్‌కు దక్కింది. కాళిదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్.. ప్రజెంట్ హీరోగా సినిమాలు చేస్తూనే.. ప్రత్యేక పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. అలా వైకుంఠపురంలో సినిమాలో నటించిన సుశాంత్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఇలా తనదైన పాత్రలు చేస్తూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న సుశాంత్ రవితేజ రావణసుర మూవీలో కూడా ఓ ఇంపార్టెంట్లో రోల్ చేయనున్నారు. రావణసుర సినిమాలో రవితేజతో పాటు.. సుశాంత్ రోల్ కూడా కీలకంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. తాజాగా చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్‌లో సుశాంత్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేశ్ లవర్‌గా సుశాంత్ కనిపించబోతున్నాడట. అయితే వేదాళం మూవీలో ఈ క్యారెక్టర్ చాలా చిన్నగా ఉంటుంది. అయితే తెలుగులో సుశాంత్ కోసం ఈ పాత్ర లెంగ్త్ కొంచెం పెంచారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సుశాంత్ ఈ మూవీలో నటించేందుకు ఓకే చెప్పాడట. ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందని టాక్ వినిపిస్తోంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టులో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే చిరంజీవి సినిమాలో సుశాంత్ నటించనున్నాడనే విషయం తెలియటంతో అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. -
‘గెస్ట్’గా వచ్చేస్తున్న స్టార్ హీరోలు!
ఒక స్టార్ సినిమాలో మరో స్టార్ కనిపిస్తే.. ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్‌కి పండగే పండగ. అలా కాకుండా ఓ మామూలు బడ్జెట్ సినిమాలో ఒక స్టార్ గెస్ట్‌గా కనిపించినా ఆ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. ఇలా ఫ్యాన్స్ పండగ చేసుకునే ‘గెస్ట్’ రోల్స్‌లో కొందరు స్టార్స్ కనిపించనున్నారు. ఈ ‘స్టార్ గెస్ట్’ల గురించి తెలుసుకుందాం. గ్రౌండ్లో తలైవర్ క్రికెట్ గ్రౌండ్లో అతిథిగా ‘లాల్ సలామ్’ అంటున్నారు తలైవర్ (నాయకుడు) రజనీకాంత్. తమిళ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ముఖ్య తారలుగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘లాల్ సలామ్’. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో రజనీకాంత్ గెస్ట్ రోల్ చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో రజనీకాంత్‌కు చెల్లెలి పాత్రలో నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ నటించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అతిథిగా ఖైదీ ‘జైలర్’ కోసం రజనీకాంత్‌కు గెస్ట్ అయ్యారు మోహన్‌లాల్. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్‌లాల్ గెస్ట్ రోల్ చేశారు. ఇందులో ఆయన ఓ ఖైదీ పాత్రలో కనిపిస్తారట. ఆల్రెడీ మోహన్‌లాల్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. భాయ్‌కి గెస్ట్ సిల్వర్ స్క్రీన్‌పై సల్మాన్ భాయ్‌కి గెస్ట్ అయ్యారు రామ్‌చరణ్. సల్మాన్ ఖాన్, వెంకటేశ్, పూజా హెగ్డే, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రంజాన్ సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ఓ గెస్ట్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్, వెంకటేశ్‌లపై చిత్రీకరించిన ఓ పాటలో రామ్‌చరణ్ గెస్ట్‌గా కనిపిస్తారు. నిర్మాతే అతిథి! సూర్య కెరీర్లో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశమే హద్దురా..!) ఒకటి. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీలో రీమేక్ అవుతోంది. బాలీవుడ్ కిలాడి అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సుధానే హిందీ రీమేక్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ వెర్షన్లో హీరోగా నటించిన సూర్య హిందీ రీమేక్‌కి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు... ఈ రీమేక్‌లో సూర్య ఓ గెస్ట్ రోల్ కూడా చేశారు. కబ్జా కోసం... ఉపేంద్ర ‘కబ్జా’కు సాయం చేశారు శివ రాజ్‌కుమార్. ఉపేంద్ర, సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఓ గెస్ట్ రోల్ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ‘స్టార్ గెస్ట్’ లిస్ట్‌లో మరికొందరు స్టార్స్ ఉన్నారు. -
సల్మాన్ ఖాన్ చిత్రంలో రామ్ చరణ్ !
Is Ram Charan Cameo Role In Salman Khan Movie: ప్రస్తుతం స్టార్డమ్ ఉన్న హీరోలు అతిథి పాత్రల్లో తళుక్కున్న మెరుస్తూ కనువిందు చేస్తున్నారు. తమ అభిమాన హీరోలు ఇతర కథానాయకుల సినిమాల్లో నటిస్తుండటంతో వారిపై ఫ్యాన్స్‌కు అభిమానం మరింతగా పెరిగిపోతోంది. అంతేకాకుండా వారు తళుక్కుమన్న కొద్దిసేపు కొంచెం ఎఫెక్టివ్‌గా ఉంటే చాలు అందరికిమించి సినీ లవర్స్ ఎక్కువ పండుగ చేసుకుంటున్నారు. ఇటీవల కమల్ హాసన్ 'విక్రమ్' మూవీలో సూర్య 'రోలెక్స్'గా అదరగొట్టడం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కనిపించింది 3 నిమిషాలే అయిన ఆడియెన్స్‌కు మాములు థ్రిల్ ఇవ్వలేదు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు అతిథి పాత్రలో మెరవనున్న విషయం తెలిసిందే. మరి ఈ పాత్రతో సల్మాన్ ఏ మేర అదరగొడతాడో వేచి చూడాలి. ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ సినిమాలో చిన్న కెమియో చేసినట్లు సమాచారం. అది కూడా సల్లూ భాయ్ సినిమాలో. అవును సల్మాన్ ఖాన్ 'కభీ ఈద్ కభీ దివాలీ' చిత్రంలో రామ్ చరణ్ కనిపించనున్నట్లు బీటౌన్‌లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో తెలుగు స్టార్ హీరో వెంకటేశ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ కూడా ఇందులో ఓ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఈ సినిమాలోని పాట షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో సల్లూ భాయితో కలిసి చెర్రీ స్టెప్పులేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం ధ్రువీకరించాల్సి ఉంది. ఈ సినిమాకు పర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. చదవండి: స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! కాగా రామ్ చరణ్ తండ్రి చిరంజీవి సినిమాలో సల్మాన్ గెస్ట్ రోల్ చేస్తుంటే, సల్లూ భాయి మూవీలో చెర్రీ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం విశేషం. ఇటీవల 'ఆర్ఆర్ఆర్' సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. -
మెగా హీరో సినిమా.. కీలక పాత్రలో రానా?
సాక్షి, హైదరాబాద్: ‘భల్లాలదేవ’ రానా దగ్గుబాటి ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘అరణ్య’ ఈ సంక్రాంతికి విడుదలకానుంది. మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో రానా కనిపించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రాబోతున్న మెగా థ్రిల్లర్ సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా దర్శకుడు క్రిష్ ‘పంజా’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో వైష్ణవ్‌కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. (చదవండి: రానా సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చేశాడుగా !) ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం క్రిష్ రానాను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్‌తో తనకున్న అనుబంధం నేపథ్యంలో రానా వెంటనే ఒకే చెప్పినట్లు సమాచారం. ఇక అంతా ఒకే అయితే భల్లాలదేవ.. మెగా హీరో వైష్ణవ్ సినిమాలో పవర్ ఫుల్ గెస్ట్ పాత్రతో ప్రేక్షకులను అలరించనున్నాడు. అడవి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రకుల్ గిరిజన యువతిగా నటిస్తోంది. ప్రస్తుతం ‘పంజా’ హైదరాబాద్‌లోని వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుగుతోంది. రానా ‘విరాటపర్వం’, ‘1945’ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. యాక్షన్ ఎంటటైనర్తో రూపొందిన ‘అరణ్య’ 2021 సంక్రాంతికి విడుదల కానుండగా.. ‘1945’ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు రానా. (చదవండి: ఏం జరిగినా పని ఎప్పటికీ ఆగదు: రకుల్) -
గెస్ట్ రోల్ కోసం కాజల్ భారీ పారితోషకం
కాజల్ అగర్వాల్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 13 ఏళ్లు కావొస్తున్న ఇంకా తన చేతి నిండా సినిమాలు ఉన్నాయి. హీరోయిన్ రోల్సే కాకుండా ఈ చందమామ అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో ఐటమ్ సాంగ్స్‌తో పాటు, గెస్ట్ రోల్స్ కూడా చేస్తోంది. యంగ్స్టార్లతో పాటు సీనియర్ యాక్టర్లతో కూడా కాజల్ జత కట్టింది. చాలా మంది హీరోలతో, హీరోయిన్స్‌తో, డైరెక్టర్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో అప్పుడప్పుడు వారి సినిమాల్లో గెస్ట్రోల్స్ కూడా చేయడానికి కాజల్ ఒప్పుకుంటుంది. అయితే చేసేది గెస్ట్ రోల్, కనబడేది కొద్దిసేపే అయినా కాజల్ మాత్రం తన పారితోషకం విషయంలో అస్సలు తగ్గడం లేదు. తాజాగా రానా నటిస్తున్న హిందీ సినిమా ‘హాథీ మేరే సాథీ’ చిత్రంలో కాజల్ అరగంట పాటు వుండే ఒక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈ ముద్దుగుమ్మ 70 లక్షల పారితోషకం తీసుకున్నట్లు ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కాజల్ ఆదివాసి యువతిలా కనిపించనుంది. ఆదివాసీల సంప్రదాయానికి తగ్గట్టుగానే కాజల్ బ్లౌజ్ వేసుకోకుండా కేవలం చీరకట్టులోనే కనిపించనుందంట. రానా, కాజల్ కలిసి నటించిన నేనే రాజు నేను మంత్రి సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో వీరిద్దరి కాంబినేషన్ సూపర్ ఉందంటూ ప్రేక్షకులు కితాబిచ్చారు. మరి కాజల్, రానా మరోసారి కలిసి నటిస్తున్న హాథీ మేరే సాథీ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ సినిమా తెలుగులో 'అరణ్య' తమిళంలో 'కాదన్' హిందీలో 'హాథీ మేరే సాథీ', గా ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: మెగాస్టార్ తదుపరి చిత్రం ఆ డైరెక్టర్‌తోనే ! -
పవన్ చిత్రంలో మెగాపవర్ స్టార్?
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్-క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ పీరియాడికల్ మూవీ గురించి నిత్యం ఏదో ఒక వార్త టాలీవుడ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మెగా ఫ్యాన్స్ ఆనందంలో తేలియాడుతున్నారు. అంతేకాకుండా ఆ వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ వార్త ఏంటిందంటే.. పవన్-క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారట. (పవన్ ‘వకీల్ సాబ్’: మరో లీక్) అయితే అది ఫుల్ లెంగ్త్ రోల్ కాదంట కేవలం అతిథి పాత్రలో చెర్రీ మెరవనున్నాడట. అంతేకాకుండా కనిపించేది కొద్దిసేపే అయినా చాలా పవర్ ఫుల్‌గా ఉండనుందట చరణ్ పాత్ర. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ వార్త నిజమైతే మెగా అభిమానులకు శుభవార్తే. ఇప్పటికే రామ్‌చరణ్ తన తండ్రి చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ‘ఆచార్య’ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. (జానీ మాస్టర్‌కు స్పెషల్ బర్త్ డే విషెస్) ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ తెలుగు రీమేక్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో పవన్ నటిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మేజర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే లాక్డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ నిరవధిక వాయిదాపడింది. ఇక క్రిష్ సినిమా విషయానికి వస్తే హైదరాబాద్‌లో ఓ భారీ సెట్ వేసినట్లు సమాచారం. అయితే పవన్ లేకుండానే తొలి షెడ్యూల్ షూటింగ్‌కు క్రిష్ ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మొగలాయిల కాలం నాటి ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందబోతుందని, ఇందులో పవన్ రాబిన్‌హుడ్ తరహాలో పవర్ఫుల్ దొంగలా దర్శనమివ్వబోతున్నారని లీకువీరులు పేర్కొన్న విషయం తెలిసిందే. (చెర్రీ ఆసక్తికర ట్వీట్.. వైరల్) -
దోస్త్ మేరా దోస్త్
బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్, బాద్షా షారుక్ ఖాన్ ఫ్రెండ్షిప్ గురించి తెలిసిందే. ఒకప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇప్పుడు మాత్రం దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహంగా ఉంటున్నారు. ఈ మధ్య ఒకరి సినిమాల్లో మరొకరు అతిథి పాత్రల్లో కనిపించడం కనిపిస్తోంది. సల్మాన్ ‘ట్యూబ్‌లైట్’ సినిమాలో మెజీషియన్ పాత్రలో షారుక్ కనిపిస్తే, ‘జీరో’ సినిమాలో ఓ పాటలో షారుక్‌తో కలిసి స్టెప్పులేశారు సల్మాన్. తాజాగా మరోసారి సల్మాన్ సినిమాలో షారుక్ గెస్ట్ రోల్లో కనిపిస్తారట. ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్’కి సీక్వెల్‌గా సల్మాన్‌ఖాన్ నటిస్తున్న చిత్రం ‘దబాంగ్ 3’. ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో షారుక్ ఖాన్ పాత్ర కనిపిస్తుందట. ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌తో ‘దబాంగ్ 3’ షూటింగ్ నడుస్తోంది. అతిథి కాదు విలన్! షారుక్ ఖాన్ కెరీర్ స్టార్టింగ్‌లో విలన్‌గా ఆకట్టుకున్నారు. నెగటివ్ షేడ్స్ క్యారెక్టర్స్‌లో ఆయన నటించిన ‘బాజీగర్, డర్’ సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. రీసెంట్గా అట్లీ– విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ స్పోర్ట్స్ డ్రామాలో షారుక్ గెస్ట్ రోల్లో కనిపిస్తారనే చర్చ కొంతకాలంగా నడుస్తోంది. తాజాగా వినిపిస్తున్నదేంటంటే ఈ సినిమాలో షారుక్ గెస్ట్ కాదట, విలన్‌గా నటిస్తారట. క్లైమాక్స్‌లో మాత్రమే కనిపించే ఈ పాత్ర సినిమాకే హైలైట్‌గా ఉండబోతోందని సమాచారం. -
చిన్ని రోల్లో చిన్నోడు
ముంబై ఇండస్ట్రీ సర్కిల్లో తైముర్ అలీఖాన్ తెలియనివారుండరు. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ముద్దుల తనయుడు తైముర్ అలీఖాన్. బయట కనిపిస్తే ఫోటోగ్రాఫర్లకు పని పెడుతుంటాడు ఈ బుడతడు. వారానికొక్కసారైనా తన కొత్త స్టిల్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాడు. ఆ మధ్య తైముర్ బొమ్మలను తయారు చేసి కేరళలో అమ్మారు కూడా. రెండేళ్లు నిండిన ఈ బుడతడు తాజాగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అయ్యాడు. అక్షయ్ కుమార్, కరీనా కపూర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘గుడ్ న్యూస్’లో చిన్న గెస్ట్ రోల్ చేయనున్నాడట ఈ చిన్నోడు. పది నిమిషాల పాటు సినిమాలో కనిపిస్తాడట. తన పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేశాడట తైముర్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మరి కొన్ని సినిమాల్లో కనిపిస్తాడా? వేచి చూడాలి. -
అతిథి పాత్రలో మహేష్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మహేష్ 25వ సినిమాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు సూపర్ స్టార్. ఈ సినిమాలతో పాటు ఓ చిన్న సినిమాలో గెస్ట్ రోల్లో నటించేందుకు కూడా మహేష్ ఆసక్తికనబరుస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తన సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న మహేష్, త్వరలో ఇతర హీరోలతో లో బడ్జెట్ సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రొడక్షన్ వ్యవహారాలను మహేష్ సతీమణి నమ్రత చూసుకుంటున్నారు. అయితే తొలి ప్రయత్నంగా ఓ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో 30 నిమిషాల పాటు కనిపించే ఓ కీలక పాత్రను మహేష్ బాబుతో చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నారట నమ్రత. తమ బ్యానర్లో తెరకెక్కుతున్న తొలి సినిమా కావటంతో మహేష్ కూడా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చేందుకు ఓకె చెప్పే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి మహేష్ ఒప్పుకుంటాడా లేదా తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
సల్మాన్‌కు అతిథిగా..
‘నా సినిమాకి నువ్వు.. నీ సినిమాకి నేను’ అతిథులం అన్నట్లు ఉంది సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్‌ల వైఖరి. గతేడాది వరుణ్ ధావన్ నటించిన ‘జుద్వా 2’ సినిమాలో సల్మాన్‌ఖాన్ గెస్ట్ రోల్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. 1997లో సల్మాన్‌ఖాన్ హీరోగా చేసిన ‘జుద్వా’ సినిమాకు ‘జుద్వా 2’ సీక్వెల్ అని తెలిసిందే. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘భారత్’ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి వరుణ్ ధావన్ అబుదాబీ వెళ్లారని బాలీవుడ్ టాక్. అంటే వరుణ్, సల్మాన్‌కు బదులు తీర్చుతున్నారన్నమాట. ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో దిశా పాట్నీ, జాకీ ష్రాఫ్, టబు, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు చేస్తున్నారు. కొరియన్ మూవీ ‘ఓడ్ టు మై ఫాదర్’కి ‘భారత్’ రీమేక్. ఈ సినిమా మూడో షెడ్యూల్ అబుదాబీలో జరుగుతోంది. మరి.. వరుణ్ ధావన్ అతిథి పాత్రలో కనిపించేది పాటలోనా? లేక సీన్‌లోనా? అన్న విషయాన్ని మాత్రం టీమ్ బయట పెట్టడం లేదు. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్స్ ఢిల్లీ, పంజాబ్‌లో జరగనున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ కానుంది. -
అతిథి పాత్రలో ఐశ్వర్య?
‘ఎందిరిన్’ సినిమాలో చిట్టి (రోబో) ఐశ్వర్యా రాయ్‌ని గాఢంగా ప్రేమించాడు. ఇప్పుడు ‘2.0’ సినిమా కోసం మళ్లీ చిట్టి వస్తున్నాడు. పనిలో పనిగా తన గార్ల్‌ఫ్రెండ్‌ని కూడా చూసుకునే అవకాశం చిట్టికి ఉందట. అదేనండీ.. ‘2.0’ సినిమాలో ఐశ్వర్యా రాయ్ కూడా ఓ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారని చెబుతున్నాం. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ముఖ్యతారలుగా నటించిన సినిమా ‘2.0’. 2010లో వచ్చిన ‘ఎందిరిన్’ (తెలుగులో ‘రోబో’) సినిమాకు ఇది సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తొలి పార్ట్‌లో హీరోయిన్గా నటించిన ఐశ్వర్యా రాయ్ సీక్వెల్లో ఓ గెస్ట్ రోల్ చేశారని తాజా కోలీవుడ్ టాక్. ఆ సంగతలా ఉంచితే.. ఇటీవల విడుదల చేసిన టీజర్లో అక్షయ్ కుమార్‌కు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉందని ఆయన ఫ్యాన్స్ ఫీలయ్యారట. అందుకే అక్షయ్ కుమార్‌కు సంబంధించిన ఓ చిన్న టీజర్‌ను రిలీజ్ చేయాలని దర్శక–నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఇలా చేస్తే నార్త్‌లో కూడా ‘2.0’ సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చే అవకాశం కూడా ఉందనే ఆలోచనలో ఉన్నారట. దాదాపు 500 కోట్లతో లైకాప్రొడక్షన్స్ నిర్మించిన ‘2.0’ సినిమా ఈ ఏడాది నవంబర్ 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
అతిథిగా అనూ
టాలీవుడ్లో వరుస అవకాశాలతో జోరుమీదున్నారు అనూ ఇమ్మాన్యుయేల్. ఆమె నటించిన ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో నటిస్తున్నారు ఈ మలయాళ బ్యూటీ. రవితేజ–శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో కూడా అనూనే కథానాయిక. అయితే.. డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారామె. హీరోయిన్గా బిజీగా ఉన్న ఈ బ్యూటీ తొలిసారి ఓ చిత్రంలో అతిథి పాత్ర చేస్తున్నారట. విజయ్ దేవరకొండ, ‘ఛలో’ ఫేమ్ రష్మిక మండన్నా జంటగా దర్శకుడు పరశురామ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘గీతాగోవిందం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ అతిథి పాత్ర చేస్తున్నారని టాక్. కథలో ముఖ్యమైన రోల్‌కి అనూ అయితే కరెక్ట్‌గా సరిపోతారన్నది చిత్రబృందం ఆలోచనట. సినిమాలో పది నిమిషాలు ఉండే ఈ పాత్ర కోసం చిత్రవర్గాలు ఆమెను సంప్రదించడంతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. -
బుల్లితెరపై బిల్ గేట్స్
హాలీవుడ్ లో అత్యంత ప్రజాధరణ పొందిన టీవీ సీరీస్ గా గుర్తింపు తెచ్చుకున్న ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ తాజా సీరీస్‌లో ఓ ప్రముఖ వ్యక్తి అతిథి పాత్రలో నటించనున్నారు. దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ ఈషోలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆయన షోలోనూ తన నిజ జీవిత పాత్ర బిల్గేట్స్గానే కనిపించనున్నారట. కార్యక్రమంలో భాగంగా జరిగే ఓ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. బిల్‌గేట్స్ తో పాటు ఈ షోలో స్టీఫెన్ హాకింగ్స్, స్టాన్లీలు కూడా అతిథులుగా కనిపించనున్నారు. ఈ కార్యక్రమం వచ్చే నెలలో ప్రసారం కానుంది. బిల్ గేట్స్ 2001లోనూ ఫ్రైసర్ అనే టీవీ షోలో నటించారు. ఇప్పటికే ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ పదకొండు సీజన్ లు పూర్తి చేసుకుంది. 12వ సీజన్ మార్చిలో ప్రారంభం కానుంది. ఈ సీజన్లో పలువురు ప్రముఖులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. -
సమంత మాయ కొద్దిసేపేనా?
సాక్షి, సినిమా : టాలీవుడ్ సక్సెస్ఫుల్ జోడీ సమంత-నాగ చైతన్య వివాహం తర్వాత తిరిగి కలిసి నటించబోతున్నారన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ ఈ తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్టు దాదాపు ఖరారు కాగా, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది. ఇందులో సమంత కేవలం అతిథి పాత్రలోనే నటించబోతోందంట. ఈ చిత్రంలో కాసేపు కనిపించే ఓ పాత్ర కోసం దర్శకుడు నటీమణుల కోసం వెతుకుతుండగా.. సామ్ పేరును చైతూ సూచించినట్లు తెలుస్తోంది. ఆ లెక్కన్న హీరోయిన్ రోల్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. రొమాంటిక్ ట్రాక్‌తో శివ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడంట. ప్రస్తుతం సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు చిత్రాలతో బిజీగా ఉన్న చైతూ అవి పూర్తికాగానే శివ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. మరోవైపు సమంత రంగస్థలం, మహానటిలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైపోయింది. -
అజ్ఞాతవాసి : అది పబ్లిసిటీ స్టంటేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో రిలీజ్ ముందే ఓ ప్రచారం చాలా బలంగా జరిగింది. సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో నటించనున్నాడని ఆయన పాత్రే కథను మలుపు తిప్పుతుందన్న టాక్ వినిపించింది. చిత్రయూనిట్ కూడా ఈ ప్రచారాన్ని ఏ దశలోనూ ఖండించలేదు. అధికారికంగా వెంకటేష్ అతిథి పాత్ర చేస్తున్నట్టుగా ప్రకటించకపోయినా, రూమర్ ఖండిచకపోయే సరికి పవన్ వెంకీల జోడి మరోసారి తెర మీద సందడి చేయటం ఫిక్స్ అని భావించారు ఫ్యాన్స్. అయితే సినిమాలో వెంకటేష్ కనిపించలేదు. దీంతో వెంకటేష్ అతిథి పాత్రలో కనిపిస్తున్నాడన్న రూమర్ పబ్లిసిటీ కోసం చేసుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు వెంకీ కనిపించే సీన్స్ కొద్ది రోజుల తరువాత యాడ్ చేస్తారని కొత్త ప్రచారం మొదలైంది. -
ఈ ఇద్దరిలో నానీకి గెస్ట్ ఎవరు?
కంటిన్యూస్‌గా ఏడు హిట్స్‌తో నాని ఫుల్ జోరుగా ఉన్నారు. ఈ సక్సెస్ఫుల్ హీరో డేట్స్ కోసం నిర్మాతలు వెయిట్ చేస్తుంటే, నాని మాత్రం తనకు తానే డేట్స్ ఇచ్చుకున్నారట. అదేంటీ అనుకుంటున్నారా? మరేం లేదు. నాని నిర్మాతగా మారుతున్నారని సమాచారం. నాలుగేళ్ల క్రితం ‘డి ఫర్ దోపిడి’ సినిమాకి నాని జస్ట్ భాగస్వామిగా వ్యవహరించిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయి నిర్మాతగా మారనున్నారని టాక్. నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. మరో విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు, ఓ గెస్ట్ రోల్‌కు కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ల పేర్లను పరిశీలిస్తున్నారని భోగట్టా. ఆల్రెడీ నాని సరసన ‘అలా మొదలైంది’, ‘సెగ’ చిత్రాల్లో నిత్య నటించారు. కాజల్ అగర్వాల్ మాత్రం నటించలేదు. మరి.. నాని హీరోగా నటించి, నిర్మించనున్న చిత్రంలో ఈ ఇద్దరిలో ఎవరు గెస్ట్ రోల్ చేస్తారు? ఎవరు నాయికగా నటిస్తారు? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వీళ్ల ప్లేస్‌లో వేరే తారలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. -
హీరోయిన్ కోసం ప్రభాస్..!
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ప్రస్తుతం రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సాహో షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాతో ఓ బాలీవుడ్ సినిమాకు ప్రభాస్ ఓకె చెప్పాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే బాలీవుడ్లో ప్రభాస్ చేయబోయేది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదట. తనకు కావల్సిన ఓ హీరోయిన్ కోసం అతిథి పాత్రలో నటించేందుకు అంగీకరించాడు బాహుబలి. మిల్కీ బ్యూటి తమన్నా లీడ్ రోల్లో తమిళ సూపర్ హిట్ సినిమా కొలైయుథిర్ కాలంను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాహుబలి స్టార్ ప్రభాస్ కొద్ది నిమిషాల పాటు కనిపించనున్నాడన్న వార్త ఇప్పుడు సౌత్‌తో పాటు నార్త్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఖండించకపోయినా.. నిజమే అన్న క్లారిటీ కూడా ఇవ్వలేదు. మరి నిజంగా ప్రభాస్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడో లేదో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
అతిథి పాత్రలో సీఎం..
బెంగళూరు: రాజకీయాల్లో తీరిక లేకుండా గడిపే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అప్పుడప్పుడు ఆటవిడుపుగా సినిమాలు చూస్తుంటారు. ఈసారి రాజకీయాల నుంచి ఉపశమనం పొందేందుకు కొత్తగా తెరకెక్కుతున్న కన్నడ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. కవితా లంకేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సమ్మర్ హాలిడేస్ అనే చిన్న పిల్లల చిత్రంలో సీఎం పది నిమిషాల నిడివి కలిగిన అతిథి పాత్రకు అంగీకరించారు. గిరిజనుల సమస్యలపై ఉద్యమాలు చేసే పిల్లలకు సహాయం చేసే ముఖ్యమంత్రి పాత్రలో సిద్ధారామయ్య కనిపించనుండడం విశేషం. అదే విధంగా కన్నడ సినీ నటుడు రమేశ్ నేతృత్వంలో ఓ ప్రైవేటు కన్నడ ఛానల్లో ప్రసారమవుతున్న వీకెండ్ విత్ రమేశ్ కార్యక్రమంలో కూడా సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నగరంలో అబ్బయ్య నాయుడు స్టూడియోలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు షూటింగ్ సాగింది. బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి కే.జే. జార్జ్ సీఎంతో పాటు స్టూడియోకు వచ్చారు. ఈ సందర్భంగా స్టూడియో చుట్టుపక్కల పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కాళహస్తీశ్వరగా...
హీరోగా వందకు పైగా సినిమాలు... ‘అభినవ కన్నడ కంఠీరవ’గా కర్ణాటక ప్రేక్షకుల కితాబులు... వెరసి తండ్రి రాజ్కుమార్కి తగ్గ తనయుడు అనిపించుకున్నారు కన్నడ హీరో శివరాజ్ కుమార్. త్వరలో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారీయన. నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో అతిథి పాత్ర చేశారాయన. ఈ చిత్రంలో కాళహస్తీశ్వర పాత్రలో కనిపించనున్నారు. నేడు శివరాజ్ కుమార్ తల్లి పార్వతమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆ లుక్‌ని విడుదల చేశారు. ఈ నెల 16న తిరుపతిలో పాటల్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. హేమమాలిని, శ్రీయ, కబీర్‌బేడి నటించిన ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, పాటలు: సీతారామశాస్త్రి, కెమేరా: జ్ఞానశేఖర్, సంగీతం: చిరంతన్ భట్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరావు. -
ఐ వాంట్ గెస్ట్ రోల్స్ అంటున్న వెంకీ
-
నిప్పు రా..!
నిప్పు రా.. తాకరా... అంటూ ‘కబాలి’లో రజనీకాంత్ తెరపై కనిపించగానే అభిమానులు పరమానందపడిపోయారు. అచ్చంగా రజనీ స్టైల్‌కి తగ్గ పాట అది. రజనీ తనదైన స్టైల్లో నడుస్తుంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ‘కబాలి’ విడుదలై నెల రోజులు పైనే అయ్యింది. ఇప్పుడీ పాట గురించిన ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? మరేం లేదు. ‘నెరుప్పు డా’ పేరుతో రూపొందనున్న ఓ తమిళ చిత్రంలో రజనీ అతిథి పాత్ర చేయనున్నారట. నెరుప్పు డా అంటే నిప్పు రా అని అర్థం. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ తనయుడు, నటుడు ప్రభు కొడుకు విక్రమ్ ప్రభు హీరోగా రూపొందనున్న చిత్రం ఇది. ఇందులో హీరో ఫైర్ సర్వీస్‌లో పని చేస్తుంటాడు. రజనీ అభిమాని. ఓ సన్నివేశంలో హీరోకి తన అభిమాన సూపర్ స్టార్ కనిపిస్తాడట. ఆ సీన్ రజనీ చేస్తే బాగుంటుందని చిత్రబృందం భావించింది. శివాజీ కుటుంబంతో రజనీకి మంచి అనుబంధం ఉంది. ‘జస్టిస్ గోపీనాథ్’, ‘నాన్ వాళవైప్పేన్’, ‘పడిక్కాదవన్’, ‘నరసింహా’... ఇలా నాలుగైదు చిత్రాల్లో శివాజీ కాంబినేషన్లో రజనీ నటించారు. ప్రభుతో ‘గురు శిష్యన్’, ‘చంద్రముఖి’ చిత్రాల్లో నటించారు. అదే కుటుంబానికి చెందిన విక్రమ్ ప్రభు సినిమా కాబట్టి, గెస్ట్ రోల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. నూతన దర్శకుడు బి. అశోక్‌కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. -
ఇంపార్టెంట్ గెస్ట్!
మీకు తెలుసా? నయనతార అతిథి పాత్రలో నటిస్తున్నారు. కానీ, ఎవ్వరికీ ఈ ఖబర్ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఒక్కో సినిమాకి కోట్లలో పారితోషికం అందుకునే నయన ఓ సినిమాలో అతిథి పాత్రలో నటించడానికి అంగీకరించడం, అది కూడా ఎవ్వరికీ చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తమిళ దర్శకులు ‘‘ఏ.ఆర్.మురుగదాస్ (‘కత్తి’), పా.రంజిత్ (‘మద్రాస్’) నా కథలు చోరీ చేశా’’రంటూ వార్తల్లో నిలిచిన వివాదాస్పద రచయిత మింజుర్ గోపీ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రంలోనే నయనతార అతిథి పాత్ర చేస్తున్నారు. కథ, పాత్రను మలిచిన విధానం ఆమెకు బాగా నచ్చాయట. దళిత హక్కుల కోసం పోరాడే కలెక్టర్ పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. నయన పాత్ర నిడివి అతిథి పాత్ర కంటే కాస్త ఎక్కువ ఉంటుందట. చాలా ఇంపార్టెంట్ రోల్ అని వినికిడి. ‘కాక్కా ముట్టై’తో తమిళ ప్రేక్షకులకు సుపరిచితులైన బాలలు విఘ్నేశ్, రమేశ్‌లు ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే, నయనతారపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట. -
బోయపాటికి అతిథి దొరికాడు
సరైనోడు సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరిన దర్శకుడు బోయపాటి శ్రీను. తన కెరీర్లో ఇప్పటి వరకు స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చిన ఈ మాస్ యాక్షన్ స్పెషలిస్ట్, తన నెక్ట్స్ సినిమాను మాత్రం ఓ యంగ్ హీరోతో చేయబోతున్నాడు. సరైనోడు సినిమా కన్నాముందే అంగీకరించిన ప్రాజెక్ట్ కావటంతో కాదనలేక కంటిన్యూ అవుతున్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు బోయపాటి. అయితే ఈ యంగ్ హీరో సినిమాకు తన రేంజ్ హీరోయిజం యాడ్ చేసే పనిలో ఉన్నాడు. అందుకే సాయి శ్రీనివాస్‌తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలను ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటింపచేయాలని ప్లాన్ చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్రకు సీనియర్ హీరో వెంకటేష్ అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. గతంలో తులసి సినిమా కోసం వెంకటేష్, బోయపాటిలు కలిసి నటించారు. వెంకటేష్‌కు బెల్లంకొండతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఈ సినిమాలో గెస్ట్ అపీయరెన్స్ ఇవ్వడానికి అంగకీరించాడట. త్వరలోనే ఇతర నటీనటులను సాంకేతిక నిపుణులను వెల్లడించనున్నారు. -
మావయ్యకు గెస్ట్‌గా..!
మెగాస్టార్ చిరంజీవి ‘కత్తిలాంటోడు’ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించనున్న ఈ చిత్రం ఇక సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం. ఇందులో అనుష్క కథానాయిక అనీ, క్యాథరిన్ ఐటమ్ సాంగ్ చేయనుందనీ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వాటి సంగతెలా ఉన్నా ఈ చిత్రంలో చాన్స్ వస్తే, నటిస్తానని అల్లు అర్జున్ అంటున్నారు. ‘‘మావయ్య సినిమాలో అవకాశం రావాలే గానీ అతిథి పాత్ర అయినా చేయడానికి రెడీ’’ అని బన్నీ పేర్కొన్నారు. అప్పట్లో ‘శంకర్‌దాదా జిందాబాద్’లో ఓ పాటలో మావయ్యతో కలిసి చిందేశారు బన్నీ. ఆ తర్వాత ఆయనతో కలిసి నటించలేదు. ఒకవేళ చిరు తాజా చిత్రంలో గెస్ట్ రోల్ ఉండి, అది బన్నీకి దక్కితే అప్పుడీ స్టైలిష్ స్టార్ దిల్ ఖుష్ అయిపోతుంది. -
తెలుగు సినిమాలో బాలీవుడ్ యాక్షన్ స్టార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సౌత్ ఇండస్ట్రీ మీద మనుసు పడ్డాడు. ఇప్పటికే ఓ భారీ ప్రాజెక్ట్‌లో విలన్‌గా నటిస్తున్న అక్షయ్ తెలుగులోనూ నటించడానికి అంగీకరించాడు. ఎయిర్ లిఫ్ట్ సినిమాతో విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్న అక్షయ్, ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అదే జోష్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రోబో 2లో నెగెటివ్ రోల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా కోసం రెడీ అయ్యే పనిలో బిజీగా ఉన్నాడు. రోబో సినిమాతో పాటు ఓ తెలుగు సినిమాలో కూడా నటించడానికి అంగీకరించాడు అక్షయ్. యంగ్ హీరో రానా తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న పోస్టర్ బాయ్స్ సినిమాలో అతిథి పాత్రలో నటించడానికి అంగీకరించాడు. రానా, అక్షయ్‌లు బేబి సినిమాలో కలిసి నటించారు. ఆ స్నేహంతో రానా సినిమాలో నటించడానికి అంగీకరించిన అక్షయ్, మంచి కథ దొరికితే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయడానికి కూడా రెడీ అంటున్నాడు. -
బాగా బిజీ.. అతిథి పాత్రలే చేస్తా
చెన్నై: నటనకు పూర్తి సమయాన్ని కేటాయించేంత తీరిక తనకు లేదని అలనాటి అందాల హీరోయిన్ అమల అక్కినేని అన్నారు. తనకు ఇప్పటికే చాలా బాధ్యతలు ఉన్నాయని, వాటిని సమర్ధవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత్రిగా, హైదరాబాద్ బ్లూ క్రాస్ సహ-స్థాపకురాలిగా తన నెత్తిమీద చాలా బాధ్యతలున్నాయి. ఈ బాధ్యతలతో తాను చాలా సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. అప్పుడప్పుడు కొన్నిచిత్రాల్లో గెస్ట్ రోల్స్ మాత్రం చేస్తున్న తాను.. ఇకముందు కూడా అదే కంటిన్యూ చేస్తానని వెల్లడించారు. షూటింగ్ పేరుతో కుటుంబాన్ని, బాధ్యతలను వదిలి తిరగడం కూడా తనకు సాధ్యం కాదన్నారు. అందుకే అతిథి పాత్రలకే ప్రాధాన్యం ఇస్తానన్నారు. కథ, పాత్ర నచ్చితే అతిథి పాత్రల్లో నటించేందుకు తనకు అభ్యంతరం లేదని తెలిపారు. అలా సినీ పరిశ్రమ, మీడియాతో టచ్‌లో ఉంటూ తనను తాను ఎడ్యుకేట్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమను, మీడియాను ఈ రెంటినీ వదిలే ఉద్దేశం లేదన్నారు. ప్రముఖ దర్శకులు నటించమని తనను అడుగుతూ ఉంటారని.. ఇది తనకు చాలా సంతోషాన్నిస్తుందన్నారు. అలా కమల్ సార్ తనకు కాల్ చేసి మలయాళం డైరెక్టర్ టి.రె. రాజీవ్ కుమార్ ద్వారా వినిపించిన కథ తన మనసుకు బాగా హత్తుకుందన్నారు. ఈ ప్రాజెక్ట్ పది రోజుల షూటింగ్ నిమిత్తం ఫిబ్రవరిలో అమెరికా వెళ్లనున్నట్టు ఆమె తెలిపారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అమల.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో మెరిసింది. తర్వాత అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం'లో ఓ సీన్లో కనిపించారు. మహేష్ భట్ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ ‘హమారీ అధూరీ కహానీ' చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తాజాగా కమల్ హీరోగా తెరకెక్కబోతున్న 'అమ్మా నాన్న ఆట' సినిమాలో అమల అతిథి పాత్ర పోషిస్తున్నారు. రాజీవ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జరీనా వహబ్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. -
కేవలం అతిధి పాత్రలే..చాలా బిజీ
చెన్నై: నటనకు పూర్తి సమయాన్ని కేటాయించేంత తీరిక లేదని అలనాటి అందాల హీరోయిన్, అమల అక్కినేని అన్నారు. తనకు ఇప్పటికే చాలా బాధ్యతలు ఉన్నాయని, వాటిని సమర్ధవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేతగా హైదరాబాద్ బ్లూ క్రాస్ సహ-స్థాపకురాలిగా తన నెత్తిమీద చాలా బాధ్యతలున్నాయి. ఈ బాధ్యతలతో తాను ఇపుడు చాలా సంతృప్తిగానే ఉన్నానని తెలిపారు. అయితే అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో గెస్ట్ రోల్స్ మాత్రం చేస్తున్న తాను ఇకముందు కూడా అదే కంటిన్యూ చేస్తానని వెల్లడించారు. అలాగే షూటింగ్ పేరుతో, కుటుంబాన్ని, బాధ్యతలను వదిలి ఇతర నగరాలు తిరగడం కూడా తనకు సాధ్యం కాదన్నారు. అందుకే పూర్తికాలంకాకుండా కేవలం అతిధి పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానన్నారు. కథ, పాత్ర నచ్చితే అతిధి పాత్రల్లో నటించేందుకు తనకు అభ్యంతరం లేదని తెలిపారు.అలా సినీ పరిశ్రమ, మీడియాతో టచ్‌లో ఉంటూ తనను తాను ఎడ్యుకేట్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమను, మీడియాను ఈ రెంటినీ వదిలే ఉద్దేశం లేదన్నారు. ప్రముఖ దర్శకులు నటించమని తనను అడుగుతూ ఉంటారని.. ఇది తనకు చాలా సంతోషాన్నిస్తుందన్నారు. సం.రానికి కనీసం ఇద్దరు దర్శకులు తనకు ఫోన్ చేసి నటించే ఉద్దేశం ఉందా అని అడుగుతారని పేర్కొన్నారు. అలా కమల్ సార్ తనకు కాల్ చేసి మలయాళం డైరెక్టర్ టి.రె. రాజీవ్ కుమార్ ద్వారా వినిపించిన కథ తన మనసుకు బాగా హత్తుకుందన్నారు. ఈ ప్రాజెక్ట్ పదిరోజుల షూటింగ్ నిమిత్తం ఈ ఫిబ్రవరిలో అమెరికా వెళ్లనున్నట్టు ఆమె తెలిపారు. కాగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జునను పెళ్లాడిన తర్వాత అమల అక్కినేని దాదాపుగా సినిమాలకు దూరంగా ఉంది. ఆ మధ్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్' సినిమాలో మెరపులు మెరిపించింది. అనంతరం అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం'లోనూ ఓ సీన్లో నూ కనిపించారు. మహేష్ భట్ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ ‘హుమారి ఆధురి కహాని' చిత్రంలో నటనకుగాను విమర్శకుల ప్రశంసలందుకున్నారు. తాజాగా కమల్ హీరోగా తెరకెక్కబోతున్న 'అమ్మా నాన్న ఆట' సినిమాలో అమల ఈ సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నారు. మలయాళ దర్శకుడు రాజీవ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జరీనా వహబ్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. -
ఆ సినిమాలో గెస్ట్ పాత్ర దొరికినా అదృష్టమే: రాంచరణ్
తన తండ్రి చిరంజీవి నటించే 150వ సినిమాలో గెస్ట్ పాత్ర దొరికినా అదృష్టమేనని హీరో రాంచరణ్ అన్నాడు. ఈ సినిమాకు చెర్రీ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక బృందం ఉందని, ప్రకటన చేయడానికి రెండు రోజుల ముందే తాను మొత్తం స్క్రిప్టు విన్నానని తెలిపాడు. అభిమానుల అంచనాలకు ఈ సినిమా రీచ్ అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఇది పూర్తి యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ అయిన కథ అని రాంచరణ్ వివరించాడు. నిర్మాతగా తన మొదటి సినిమా చేయడానికి ఎంతోమంది ప్రెజర్ ఫీలయ్యారని, కానీ పూరీ జగన్నాథ్ ఒక్కడే కాన్ఫిడెంట్‌గా ఉన్నారని చెప్పాడు. పూరీకి ఈ కథమీద మంచి పట్టుందని, టోటల్‌గా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అవుతుందని చెర్రీ అన్నాడు. -
ఆ చిత్రంలో అతిథి నేనే
చిత్ర పరిశ్రమలో అంతు పట్టని ఒక పెద్ద ప్రశ్నార్థకం... ఇక్కడ ఎవరు ఎలా ప్రవర్తిస్తారో ..? ఎలా స్పందిస్తారో..? తెలియదు. కానీ, తనకు పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టిన నటి పాత్రల్లో నటించడానికి సంకోచిస్తారు. ఇంకా చెప్పాలంటే భయపడతారు కూడా. అలాగని అందర్నీ ఒకేలా జమకట్టలేం. నటి మల్లిక తమళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో నటించి మంచి గుర్తిం పు పొందారు. అలాంటి ఆమె నటిగా రాణించాలంటే, ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనాలో అనే విషయాన్ని బహిరంగంగా వెల్లడించి పరిశ్రమలో కలకలం రేపారు. ఆమె ఇప్పుడు తెర వెనుక వెళ్లి సినిమాకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్నారు. తన అనుభవాలు ఏమోగానీ, సినిమా పరిశ్రమలో సహాయ నటీమణులు ఎదుర్కొనే సమస్యలను యథార్థంగా తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందులో హీరోయిన్గా భావన నటిస్తున్నట్టు వెల్లడించారు. ఈ వార్త చెవిన పడగానే, అయ్యయ్యో అంటూ భావన విస్మయంలో పడ్డారు. అయ్యయో...స్నేహం కోసం నటి మల్లిక కోరగా ఆమె దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించానని భావన పేర్కొన్నారు. అయితే, ఆ చిత్రంలో తాను హీరోయిన్ మాత్రం కాదు అని ఓ చిన్న అతిథి పాత్రను పోషించనున్నట్టు స్పష్టం చేశారు. తనను హీరోయిన్ పాత్రగా చిత్రీకరించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రస్తుతం తాను మలయాళంలో బిజీగా ఉన్నట్టు తెలిపారు. కాగా, పులి చిత్రంలో నటించమని చిత్ర యూనిట్ తనను అడిగారని, అయితే, తాను వారికి ఎలాంటి నిర్ణయాన్ని చెప్పలేదని భావన పేర్కొన్నారు. -
కల నెరవేరింది
ప్రతి ఒక్కరూ కలలు కనాలి. వాటిని సాకారం చేసుకోవడానికి కృషి చేయాలి ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం పలికిన హితవు. అచ్చం అలానే నటి రాయ్‌లక్ష్మి చాలా కలలు కన్నారు. వాటిలో కొన్ని బాలీవుడ్‌తో పాటు, టాలీవుడ్‌లోనూ నటించాలని, హిందీ చిత్రంలో నటించనున్నానని, హాలీవుడ్ అవకాశం వచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. హాలీవుడ్‌లోకి ఎప్పుడు ప్రవేశిస్తుందోగాని ఈ భామ బాలీవుడ్ కల నెరవేరబోతోంది. అది చిన్న వేషం అయినా మంచి పాత్ర అని కూడా రాయ్‌లక్ష్మి చెబుతున్నారు. ఇంతకీ ఈ బ్యూటీకి బాలీవుడ్ అవకాశం కల్పించిందెవరో తెలుసా, నటి ఆసిన్‌ను బాలీవుడ్‌కు పంపించిన కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాసనే. తమిళంలో కత్తి వంటి సంచలన విజయం సాధించిన చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన తాజాగా అకిరి పేరుతో హిందీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది తమిళంలో అనూహ్య విజయాన్ని సాధించిన మౌనగురు చిత్రానికి రీమేక్. ఇందులో సోనాక్షి సిన్హా హీరోయిన్. ఆమె తండ్రి సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రాయ్‌లక్ష్మికి నటించే అవకాశం రావడం విశేషం. దీని గురించి రాయ్‌లక్ష్మి చెబుతూ కాస్ట్యూమ్స్ డిజైనర్ ఒకరు తన పేరును దర్శకుడు మురుగదాస్‌కు సూచించడంతో తనకీ అవకాశం వచ్చిందని తెలిపారు. పాత్ర కూడా బాగుండడంతో కాదనకుండా ఒప్పేసుకున్నట్లు చెప్పారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించడం సంతోషం అని రాయ్‌లక్ష్మి అన్నారు. -
అతిథులుగా సూర్య, జ్యోతిక
నిజ జీవితంలో విడదీయరాని బంధంతో మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా పేరు తెచ్చుకుంటున్న సూర్య, జ్యోతికలు తెరపై అతిథులుగా మెరవడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఒకప్పుడు హిట్ పెయిర్‌గా వెలిగిన ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత సంసార జీవితానికే పరిమతమైన జ్యోతిక ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యారు. సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ ముఖానికి రంగేసుకోవడానికి తయారయ్యారు. మలయాళంలో మంచి విజయం సాధించిన హౌ ఓల్డ్ ఆర్ యూ చిత్రం తమిళ రీమేక్‌లో జ్యోతిక నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుపుకుంటోంది. పాండిరాజ్ దర్శకత్వంలో తన భర్త సూర్యతో కలిసి జ్యోతిక అతిథిగా మెరవడానికి సిద్ధం అవుతున్నారు. పసంగ, మెరినా వంటి బాల చిత్రాలతో విజయాలు సాధించిన పాండిరాజ్ మరోసారి బాలల ఇతివృత్తంతో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని నటుడు సూర్య తన 2డి పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన ఒక ప్రముఖ నటి అతిథిగా నటించనున్నారనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడా పాత్రను జ్యోతిక పోషించడానికి రెడీ అవుతున్నారట. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. జ్యోతిక హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రం పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే విధంగా సూర్య మాస్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో సూర్య, జ్యోతిక పాండిరాజ్ దర్శకత్వంలో అతిథులుగా మార్చిలో నటించనున్నారని సమాచారం. -
గెస్ట్ రోల్లో పవన్ కళ్యాణ్!
అక్కినేని కుటుంబం నుంచి వస్తున్న మరో నట వారసుడి అఖిల్ తొలి చిత్రంపై టాలీవుడ్లో రోజుకో హాట్ న్యూస్ హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు యంగ్ హీరో నితిన్ నిర్మాతగా వ్యవహరించడం ఓ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. అఖిల్ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండేందుకు దర్శక నిర్మాతలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దాంతో తనయుడి చిత్రంలో తండ్రి అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదండోయ్... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నాడట. అయితే గెస్ట్ రోల్స్‌పై దర్శక నిర్మాతలు మాత్రం పెదవి విప్పటం లేదు. మరోవైపు ఈచిత్రాన్ని ... సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకు ఎక్కించే యోచనలో ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ...అఖిల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఇటీవలే ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభించారు. మరోవైపు అఖిల్ సరసన నటించే హీరోయిన్గా నటించేది ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. -
నాకు ఆ ఆలోచన లేదు
ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదంటోంది కాజల్ అగర్వాల్. అయితే ఈ అమ్మడిపై పలు రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. చెల్లెలికి పెళ్లి అయిపోవడంతో తాను ఆ ముచ్చటకి తొందరపడుతోందని, ప్రస్తుతం వరుడివేటలో ఉన్నట్లు అలాగే పారితోషికం విషయంలో చాలా డిమాండ్ చేస్తున్నట్లు పలు వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలను కాజల్ ముందుంచితే... ఏ భాషా చిత్రాలకు ప్రాముఖ్యత నిస్తున్నారు? తమిళం, తెలుగు భాషలకే ప్రాధాన్యతనిస్తున్నాను. ఈ రెండు భాషల్లో నటించడం వలన ఆత్మ సంతృప్తి పొందుతున్నాను. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో నాలుగు చిత్రాలు చేస్తున్నాను. వీటితో పాటు ఒక హిందీ చిత్రం చేస్తున్నాను. మగధీర చిత్రం తరువాత తెలుగులో బలం పుంజుకున్నాను. ఆ చిత్రంతోనే నా మార్కెట్ అధికరించింది. తమిళ చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదట? అందులో నిజం లేదు. నేను నటించిన చిత్రాలన్నింటినీ నావిగానే భావిస్తాను. వాటి ప్రచార బాధ్యత నాపై ఉంటుంది. అలాంటి బాధ్యతలను నేనెప్పుడూ కావాలని విస్మరించలేదు. కొన్ని సమయాల్లో ఇతర చిత్రాల షూటింగ్లలో బిజీగా ఉండి ప్రచారాల్లో పాల్గొన ఉండకపోవచ్చు. దీనిని సాకుగా చూపి కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. తెలుగులో శ్రుతిహాసన్ నాయకిగా నటించిన ఎవడు చిత్రంలో గెస్ట్ పాత్ర పోషించడానికి కారణం? నిజానికి ఎవడు చిత్రంలో నేనే కథానాయకిగా నటించాల్సింది. నా కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో శ్రుతిహాసన్ నటించారు. ఇక ఆ చిత్రంలో గెస్ట్ రోల్ పోషించడానికి కారణం ఆ చిత్ర దర్శకుడు వంశీ నాకు మంచి మిత్రుడు. అదే విధంగా రామ్‌చరణ్ కుటుంబంతో నాకు సత్సంబంధాలున్నాయి. అందువలనే గెస్ట్ రోల్ చేయమంటే కాదనలేకపోయాను. పారితోషికం కూడా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారనే ప్రచారంగురించి? నిజం చెప్పాలంటే నాకు పారితోషికం ఒక పెద్ద విషయం కాదు. కథ, పాత్రల పైనే దృష్టి సారిస్తున్నాను. కథ నచ్చితే వెంటనే ఒప్పుకుంటున్నాను. ఇక పారితోషికం అంటారా? నా శ్రమకు తగ్గ పారితోషికం నిర్మాతలే ఇస్తున్నారు. నేనెవర్నీ అధిక పారితోషికం డిమాండ్ చేయడం లేదు. ఉదాహరణకు నాకు ఐదు కోట్లు పారితోషికం ఇమ్మంటే ఎవరైనా ఇస్తారా? నా మార్కెట్‌కు తగ్గ పారితోషికం నిర్మాతలు ఇస్తున్నారు. మీ సక్సెస్‌కు ఎవరు కారణం? ఖచ్చితంగా ప్రేక్షకులే. వారు నన్ను ఆరాధిస్తున్నారు. అభిమానుల ఆదరాభిమానాలను ఎప్పటికీ మరువలేను. నా ఈ స్థాయికి వారే కారణం. సినిమా ద్వారా మీరు నేర్చుకుంది? ఒక్కో చిత్రం ఒక్కో అనుభవం. అలా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇంకా చెప్పాలంటే నా తెలివిని మెరుగు పరచుకున్నాను. సినిమా జీవితం సంతృప్తి నిచ్చిందా? చాలా సంతృప్తిగా వున్నాను. ఇప్పటి వరకు నేను నటించిన చిత్రాలన్నీ బాగానే ఆడాయి. మంచి కథలు, వైవిధ్యభరిత పాత్రలు అమరాయి. ప్రతి చిత్రానికి అంకిత భావంతో పని చేశాననే తృప్తి ఉంది. సమాజసేవపై ఆసక్తి వుందా? ఆసక్తి మెండుగా ఉంది. సాధ్యమైనంత వరకు ఇతరులకు సాయం చేస్తున్నాను. సేవా సంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలకు, నిధులు సేకరించే కార్యక్రమాలు చేపట్టాలనే ఆసక్తి ఉంది. అయితే ప్రస్తుతం అందుకు సమయం చాలడం లేదు. భవిష్యత్తులో తప్పకుండా చేస్తాను. -
దానికి అభ్యంతరం లేదు
అతిథి పాత్రకు అభ్యంతరం లేదు, ఆంక్షలు లేవు అంటోంది నటి సోనియా. ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న నూతన చిత్రంలో అతిథి పాత్రలో మెరవనుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటి సోనియా చాలా ఆసక్తికరమైన అతిథి పాత్రను పోషిస్తోందట. ఈ తెలుగమ్మాయి తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. అంతేకాదు తెలుగు, కన్నడ భాషల్లోను నటిగా గుర్తింపు పొందింది. తమిళంలో ఇంతకుముందు ఇనిదు ఇనిదు, పైయ్యా చిత్రంలో నటించింది. విజయ్ సేతుపతితో నటిస్తున్న చిత్రం తనకు మూడో తమిళ చిత్రం అంటున్న సోనియూ మాట్లాడుతూ, ఇక్కడి అవకాశాలను ఎంజాయ్ చేస్తున్నానంటోంది. తమిళ చిత్రాల్లో నటించడం విభిన్న అనుభవంగా పేర్కొంది. ఇతర భాషా చిత్రాలతోను సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. తెలుగులో హ్యాపీడేస్, వినాయకుడు లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందినట్లు చెప్పింది. కన్నడంలోను అక్కడి సూపర్‌స్టార్ పునిత్ రాజ్‌కుమార్ సరసన నటించినట్లు తెలిపింది. ఆ తరువాత కూడా కన్నడంలో పలు అవకాశాలు వచ్చాయని అయితే మంచి పాత్రలు చేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. మలయాళ చిత్రాలు చర్చల్లో వున్నట్లు చెప్పింది. భాష ఏదైనా అతిథి పాత్ర అయినా అంగీకరించి నటించేస్తున్నట్లు తెలిపింది. అలాంటి పాత్రలకు అభ్యంతరాలు, ఆంక్షలు ఉండవని చెప్పింది. ఇలా నటిస్తూపోతే ముందు ముందు వారే నటనకు అవకాశం వున్న పాత్రల్లో నటించే అవకాశాలు కల్పిస్తారనే ధీమాను సోనియా వ్యక్తం చేస్తోంది. -
కిక్ ఇచ్చే పాత్ర!
ఈ మధ్యకాలంలో ప్రత్యేక పాటలకు, అతిథి పాత్రలకు పరిమితమైన హంసా నందిని ‘రియల్ స్టార్’లో కథానాయికగా నటించారు. స్వర్గీయ శ్రీహరి టైటిల్ రోల్లో సి. రామచంద్రయ్య సమర్పణలో ర్యాలి శ్రీనివాసరావు దర్శకత్వంలో కొండపల్లి యోగానంద్, కట్టెల లక్ష్మణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కీలక పాత్ర చేశారు. ఈ నెలాఖరున ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘నిజజీవితంలో శ్రీహరి అందరివాడు అనిపించుకున్నారు. అందుకే ‘అందరివాడు’ అనేది ఈ చిత్రాన్ని ట్యాగ్‌లైన్‌గా పెట్టాం. హంసా నందిని పాత్ర కిక్ ఇచ్చే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పెద్దిరాజు, సహనిర్మాతలు: కె.వై.గిరిరాజ్, పులగం శ్రీనివాస్ ముదిరాజ్. -
ఇప్పుడు నన్నంతా గోల్డెన్ లెగ్ అంటున్నారు!
ఒకే ఒక్క సినిమా చాలు... కెరీర్ టర్న్ కావడానికి. హంసానందిని విషయంలో అదే జరిగింది. వంశీ సినిమా ‘అనుమానాస్పదం’తో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన హంసానందినికి ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు. కానీ, ‘ఈగ’లో చేసిన అతిథి పాత్ర ఆమె కెరీర్‌కి మంచి మలుపయ్యింది. ఆ తర్వాత ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’, ‘లెజెండ్’ చిత్రాల్లో ఈ బ్యూటీ చేసిన అతిథి పాత్రలు, ప్రత్యేక పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన ‘లౌక్యం’లో హంస అతిథి పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించడంతో నన్నందరూ ‘గోల్డెన్ లెగ్’ అంటున్నారని హంసా నందిని చెబుతూ -‘‘ ‘లౌక్యం’లో నా పాత్ర గురించి చెప్పి, బ్రహ్మానందంగారికి భార్యగా చేయాలని దర్శకుడు శ్రీవాస్ అన్నప్పుడు థ్రిల్ అయ్యాను. బ్రహ్మాజీ.. అదేనండీ.. బ్రహ్మానందంగారు ఎంత మంచి నటుడో తెలిసిందే. తాను నవ్వకుండా ఎదుటి వ్యక్తిని నవ్విస్తారు. ఇక, గోపీచంద్ అయితే చాలా కూల్ పర్సన్. నేను నటించిన సినిమాలను నేను పుట్టిన ఊరు పుణేలో చూస్తుంటాను. అక్కడ తెలుగువాళ్లు ఎక్కువమంది ఉన్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఇష్టపడి చూస్తున్నారు’’ అని చెప్పారు. ప్రత్యేక పాటలు చేయడం తేలిక కాదని చెబుతూ - ‘‘నేను చేసే పాటల్లో నా లుక్, కాస్ట్యూమ్స్ అసభ్యంగా లేకుండా క్లాస్‌గా ఉండేలా జాగ్రత్త తీసుకుంటాను. అందుకే, ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ప్రతి పాట చిత్రీకరణ ముందు ఆరేడు రోజులు కసరత్తులు చేస్తాను’’ అని చెప్పారు. ‘రుద్రమదేవి’లో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నానని, ఇది పూర్తిగా నటనకు అవకాశం ఉన్న పాత్ర అని హంసా నందిని తెలిపారు. ఈ మధ్యకాలంలో పూర్తి స్థాయి కథానాయిక పాత్రలొచ్చినప్పటికీ, కథలు బాగా లేకపోవడంవల్ల అంగీకరించలేదని ఆమె తెలిపారు. -
గెస్ట్ రోల్లో తాప్సీ
తొలిసారిగా 3 చిత్రంతో మెగాఫోన్ పట్టి వై దిస్ కొలెవైరి పాటతో బహుళ ప్రాచుర్యం పొందిన దర్శకురాలు ఐశ్వర్య ధనుష్. ఈమె సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురన్న విషయం తెలిసిందే. 3 చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా తాజాగా విజయమే లక్ష్యంగా చాలా కసిగా తెరకెక్కిస్తున్న చిత్రం వై రాజావై యువక్రేజీ నటుడు గౌతమ్ కార్తిక్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాఆనంద్ హీరోయిన్గా నటిస్తున్నారు. నటి తాప్సీ ఇప్పుడు అదనంగా వచ్చి చేరారు. ఇందులో ఈ బ్యూటీ అతిథి పాత్రను చేస్తున్నారట. దీని గురించి తాప్సీ మాట్లాడుతూ తానిప్పటి వరకు అతిథి పాత్రలో నటించింది లేదన్నారు. అయితే దర్శకురాలు ఐశ్వర్య ధనుష్‌తో ఉన్న స్నేహం కారణంగా ఈ చిత్రంలో నటించడానికి ముందు అంగీకరించినా కాస్త సందేహంతోనే కథ విన్నానన్నారు. అయితే ఐశ్వర్య కథ నెరేట్ చేసిన తరువాత నో అని చెప్పలేకపోయానన్నారు. అంతగా తన పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని తాప్సీ తెలిపారు. -
‘కొలవెరి’అనిరుథ్ యాక్టింగ్..!
‘3’ చిత్రానికి అనిరుథ్ స్వరపరచిన పాటలకు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘వై దిస్ కొలవెరి...’ పాట జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యింది. ఆ పాట తర్వాత కొలీవుడ్లో చాలామంది అనిరుథ్ని ‘కొలవెరి బోయ్’ అని పిలుస్తున్నారు. సంగీతదర్శకునిగా బిజీగా ఉన్న ఈ కొలవెరి బోయ్ వెండితెరపై కనిపించబోతున్నారు. ‘ఆక్కో’ అనే చిత్రంలో అతిథి పాత్ర చేస్తున్నారాయన. వాస్తవానికి ఈ చిత్రంలో హీరోగా నటించమని అనిరుథ్ని దర్శకుడు శ్యామ్ అడిగారట. అయితే, లీడ్ రోల్స్ చేయడానికి సుముఖంగా లేకపోవడంతో అనిరుథ్ ఈ ఆఫర్‌ని తిరస్కరించారు. కానీ, కథ నచ్చడంతో గెస్ట్ రోల్ చేయడానికి సమ్మతించారు. అలాగే, ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార గీతంలో కూడా కనిపించడంతో పాటు, అన్ని పాటలకూ స్వరాలు అందిస్తున్నారు అనిరుథ్. -
మనోగళం: ఎప్పుడూ అదే కల వస్తూంటుంది!
ఎదుటివారిలో నచ్చేది/నచ్చనిది! నచ్చేది నిజాయితీ, అందరినీ ప్రేమించే తత్వం. నచ్చనిది అబద్ధాలాడటం, హిపోక్రసీ. మిమ్మల్ని అత్యంత భయపెట్టేది? బల్లి అంటే చచ్చేంత భయం. అదనే కాదు, పాకే జీవులు వేటిని చూసినా హడలిపోతాను. అత్యంత సంతోషపడిన సందర్భం? ఓసారి షూటింగుకు ముంబై వెళ్లాను. ఆ సమయంలోనే ముంబైలో బాంబ్ పేలింది. పేలుడు గురించి తెలియగానే బోనీ చాలా కంగారు పడిపోయాడు. మొదట నేను బస చేసిన హోటల్‌కి వెళ్లాడట. నేను షూటింగుకి స్టూడియోకి వెళ్లానని తెలిసి కంగారుగా అక్కడికి వచ్చాడు. నన్ను చూసినప్పుడు తన ముఖంలో కనిపించిన ఆనందాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేదు. గుర్తొస్తేనే చాలా సంతోషమనిపిస్తుంది. బాధపెట్టిన విమర్శ? విమర్శలు అంతగా బాధపెట్టవు కానీ పుకార్లు బాధపెడుతుంటాయి. బోనీని ప్రేమించకముందే నేను ప్రేమలో ఉన్నానని, ఎవరినో పెళ్లి చేసుకోబోతున్నానని, రహస్యంగా చేసేసుకున్నాననీ రాసేవారు. అప్పుడు చాలా బాధనిపించేది. ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం? కెరీర్ మొదలైన కొత్త. ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాను. ఓ గాజు టేబుల్ మీదికి నెమ్మదిగా దూకాలి. కానీ నేను చాలా వేగంగా దూకేశాను. అంతే, ఒక్కసారిగా అద్దం పగిలిపోయింది. అందరూ కంగారు పడటం చూసి ‘నేను బాగున్నాను, టెన్షన్ పడొద్దు’ అన్నాను. కానీ వాళ్ల ముఖాల్లో ఎక్స్ప్రెషన్ చూశాక అర్థమయ్యింది ఏం జరిగిందో. నా కాళ్లలో గాజు పెంకులు గుచ్చుకుపోయాయి. రక్తంతో నా కాళ్లు, దుస్తులు తడిచిపోయాయి. అది నేను గమనించలేదు. మీ గురించి ఎవరికీ తెలియని ఒక విషయం? నాకు చిత్రలేఖనమంటే ఇష్టం. కానీ పెళ్లయ్యాక దానికి దూరమయ్యాను. పిల్లలు పెద్దవాళ్లయ్యాకే మళ్లీ మొదలుపెట్టాను. అలసటగానో విసుగ్గానో అనిిపిస్తే, వెంటనే బ్రష్ పట్టుకుంటాను. అది నాకు ఎంతో నాకు రిలీఫ్‌నిస్తుంది. మీరు మిస్ అయ్యానని ఫీలయ్యేది...? చదువు. నేను చాలా బాగా చదివేదాన్ని. అయితే చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చేయడంతో రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమయ్యేది. సినిమాల్లో బిజీ అయిపోయాక తప్పనిసరి పరిస్థితుల్లో చదువుకి ఫుల్స్టాప్ పెట్టేశాను. మీరు నమ్మే సిద్ధాంతం? నువ్వు నువ్వుగా ఉండు. ఎవరి కోసమూ నీలో లేనిదాన్ని, నువ్వు కానిదాన్ని చూపించే ప్రయత్నం చేయకు. వెంటాడే కల? నా చుట్టూ బోలెడు పాములు ఉంటాయి. వాటి మధ్యలో నేను బెదురుగా నిలబడి ఉంటాను. ఈ కల చాలాసార్లు వస్తూంటుంది. ముఖ్యంగా ఒంట్లో బాలేనప్పుడు! మీరు ఎంతో పదిలంగా దాచుకున్న వస్తువు...? నేపాల్‌లో ‘ఖుదాగవా’ షూటింగ్లో ఉన్నప్పుడు నన్ను ఎంతగా మిస్సవుతుందో చెబుతూ అమ్మ ఒక ఉత్తరం రాసింది. తింటున్నావా, జాగ్రత్తగా ఉంటున్నావా అంటూ ఎన్ని ప్రశ్నలు వేసిందో! తన ప్రేమకు ప్రతిరూపంగా అనిపించే ఆ ఉత్తరాన్ని ఫ్రేమ్ కట్టించి దాచుకున్నాను. దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది. వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. దేవుడు మిమ్మల్ని స్వర్గానికి ఆహ్వానిస్తే, అక్కడ ఎవరిని కలుసుకోవాలనుకుంటారు? అమ్మానాన్నల్ని!