టైగర్‌లో యంగ్‌ టైగర్‌?  | Tiger 3 Star Salman Khan To Share Screen With Jr. NTR In War 2? Here's What We Know - Sakshi
Sakshi News home page

టైగర్‌లో యంగ్‌ టైగర్‌? 

Published Wed, Oct 4 2023 12:28 AM | Last Updated on Wed, Oct 4 2023 9:11 AM

Tiger 3 star Salman Khan to share screen with Jr NTR in War 2 - Sakshi

ఎన్టీఆర్‌

యంగ్‌ టైగర్‌.. హీరో ఎన్టీఆర్‌ని ఫ్యాన్స్‌ అలానే  పిలుచుకుంటారు. ఈ యంగ్‌ టైగర్‌ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న ‘టైగర్‌ 3’ సినిమాలో నటించనున్నారా? అంటే అవునంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. హృతిక్‌ రోషన్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించనున్న ‘వార్‌ 2’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్‌. ఈ చిత్రం షూటింగ్‌ నవంబర్‌లో ప్రారంభం కానుంది.

అయితే ‘వార్‌ 2’ కంటే ముందే ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో ఒకరైన సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న ‘టైగర్‌ 3’లో ఎన్టీఆర్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్‌. ‘టైగర్‌ జిందా హై’ చిత్రానికి సీక్వెల్‌గా మనీష్‌ శర్మ దర్శకత్వంలో ‘టైగర్‌ 3’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో క్లయిమాక్స్‌లో ఎన్టీఆర్‌ కనిపిస్తారని భోగట్టా. కాగా ‘టైగర్‌ 3’, ‘వార్‌ 2’ రెండు చిత్రాలను యశ్‌ రాజ్‌ ఫిల్మ్ప్‌ నిర్మిస్తుండటం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement