Tiger 3 Movie
-
రిలీజ్ డేట్ గందరగోళం.. సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ
మరో యాక్షన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఈ మూవీ కోసం జరిగిన గందరగోళం మరో దాని విషయంలో జరగలేదని చెప్పొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫలానా తేదీన స్ట్రీమింగ్ అవుతుందన్నట్లు వార్తలొచ్చాయి. కాదుకాదు ఇప్పట్లో రాదని మరో పోస్టర్ వైరల్ అయింది. ఇప్పుడవన్నీ కాదన్నట్లు అసలు ఏ మాత్రం సౌండ్ చేయకుండా సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? (ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'టైగర్ 3'. దీపావళి కానుకగా నవంబరు 12న థియేటర్లలో విడుదల చేశారు. యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా దీన్ని తీశారు. కాకపోతే దీని ముందు చిత్రాలైన 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' తరహాలో ఇది అలరించలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర చతికిలపడిపోయింది. ఈ క్రమంలోనే ఓటీటీలోకి త్వరగా వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నవంబరు 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. డిసెంబరు తొలివారంలోనే ఓటీటీలోకి వచ్చేయాల్సింది. కానీ దాన్ని అలా వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు జనవరి 7న స్ట్రీమింగ్ అవుతుందన్నట్లు చెప్పారు. కానీ చివరి నిమిషంలో 'కమింగ్ సూన్' అన్నట్లు మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇలా కాస్త కన్ఫ్యూజ్ చేశారు. కానీ ఇప్పుడేమో సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకొచ్చారు. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. విచిత్రమైన విషయం ఏంటంటే.. థియేటర్లలో, ఓటీటీలో ఇలా రెండు చోట్ల ఈ సినిమా ఆదివారమే రిలీజైంది. (ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న ఆ తెలుగు సినిమా.. డేట్ ఫిక్స్) Locked, loaded and ready! 📷 Aa raha hai Tiger…#Tiger3OnPrime, watch now only on @PrimeVideoIN#KatrinaKaif | @emraanhashmi | #ManeeshSharma | @yrf pic.twitter.com/xgLHdQRqcf — Salman Khan (@BeingSalmanKhan) January 6, 2024 -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్
మరో వారం వచ్చేసింది. మరో 10 రోజుల్లో 'సలార్' మూవీ థియేటర్లలోకి రాబోతుంది. దీంతో ఈ వీక్.. చెప్పుకోదగ్గ మూవీస్ ఏం థియేటర్లలో రిలీజ్ కావట్లేదు. దీంతో ఆటోమేటిక్‌గా మూవీ లవర్స్ దృష్టి ఓటీటీలపై పడుతుంది. సరిగ్గా దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థ రెడీ అయిపోయాయి. అలా ఈ వారం ఏకంగా 32 మూవీస్.. ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో పలు తెలుగు చిత్రాలు కూడా ఉండటం విశేషం. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. కార్తీ 'జపాన్', సల్మాన్ 'టైగర్ 3' చిత్రాలు మాత్రమే అందరికీ ఆసక్తి కలిగిస్తున్నాయి. మిగతావన్నీ కూడా ఇంగ్లీష్, హిందీ సిరీసులు-సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇందులో స్ట్రెయిట్ మూవీస్ ఏం లేనప్పటికీ వీకెండ్ వచ్చేసరికి కొత్తగా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీస్ రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ లిస్ట్ (డిసెంబరు 10 నుంచి 17 వరకు) అమెజాన్ ప్రైమ్ టైగర్ 3 (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 12 డెత్స్ గేమ్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 15 రీచర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 15 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫలిమి (మలయాళ మూవీ) - డిసెంబరు 15 ద ఫ్రీలాన్సర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - డిసెంబరు 15 నెట్‌ఫ్లిక్స్ జపాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 11 కెవిన్ హర్ట్ & క్రిస్ రాక్: హెడ్ లైనర్స్ ఓన్లీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 12 సింగిల్ ఇన్ఫెర్నో సీజన్ 3 (కొరియన్ సిరీస్) - డిసెంబరు 12 అండర్ ప్రెజర్: ద యూఎస్ ఉమెన్స్ వరల్డ్‌కప్ టీమ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 12 1670 (పోలిష్ సిరీస్) - డిసెంబరు 13 కార్ మాస్టర్స్ రష్ టూ రిచెస్: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 13 ఇఫ్ ఐ వర్ లూయిస్ సోంజా (పోర్చుగీస్ సిరీస్) - డిసెంబరు 13 యాస్ ద క్రో ఫ్లైస్: సీజన్ 2 (టర్కిష్ సిరీస్) - డిసెంబరు 14 ద క్రోన్ సీజన్ 6: పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 14 యూ యూ హకూషో (జపనీస్ సిరీస్) - డిసెంబరు 14 క్యారోల్ & ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 15 చికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 15 ఫేస్ టూ ఫేస్ విత్ ఈటీఏ: కన్వర్జేషన్స్ విత్ ఏ టెర్రరిస్ట్ (స్పానిష్ సినిమా) - డిసెంబరు 15 ఫమిలియా (స్పానిష్ మూవీ) - డిసెంబరు 15 ఐ లవ్ లిజీ (తగలాగ్ చిత్రం) - డిసెంబరు 15 శేషన్ మైక్-ఇల్ ఫాతిమా (మలయాళ మూవీ) - డిసెంబరు 15 యో! క్రిస్మస్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 15 ద రోప్ కర్స్ 3 (మాండరిన్ మూవీ) - డిసెంబరు 17 వివాంట్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 17 జియో సినిమా ద బ్లాకెనింగ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 16 ద సోవనీర్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 17 లయన్స్ గేట్ ప్లే డిటెక్టివ్ నైట్: ఇండిపెండెన్స్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 15 ఆపిల్ ప్లస్ టీవీ ద ఫ్యామిలీ ప్లాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 15 జీ 5 కూసే మునిస్వామి వీరప్పన్ (తమిళ సిరీస్) - డిసెంబరు 14 బుక్ మై షో ద పర్షియన్ వెర్షన్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 12 టేలర్ స్విఫ్ట్-ద ఈరస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 13 లైలాస్ బ్రదర్స్ (పర్షియన్ చిత్రం) - డిసెంబరు 15 వింటర్ టైడ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 15 (ఇదీ చదవండి: లేటు వయసులో పెళ్లి చేసుకున్న జైలర్ నటుడు, ఫోటోలు వైరల్) -
అంతా ఆ మూవీ వల్లే.. దేవర డిజప్పాయింట్ అయ్యాడా...?
-
అనుకున్న టైం కంటే ముందే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా!
మరో స్టార్ హీరో సినిమా.. నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. యాక్షన్ స్టోరీతో తీసిన ఈ చిత్రం.. ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించేస్తుందని ఆశపడ్డారు. కానీ రియాలిటీలో తేడా కొట్టేసింది. దీంతో అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రానుంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎప్పుడు రాబోతుంది? (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) యాక్షన్ సినిమాలకు ఈ మధ్య గిరాకీ బాగా పెరిగింది. 'పఠాన్', 'జవాన్' లాంటి చిత్రాలు రూ.1000 కోట్ల మార్క్ క్రాస్ చేశాయి. తాజాగా 'యానిమల్' కూడా ఆ నంబర్ దాటేస్తుందనిపిస్తోంది. అయితే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' కూడా ఇలాంటి అంచనాలతోనే మొన్నీమధ్య దీపావళికి(నవంబరు 12న) థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ ఆశించిన స్పందన రాలేదు. వసూళ్లు కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. ఉత్తరాదిలో కాస్తోకూస్తో కలెక్షన్స్ బాగానే వచ్చాయి కానీ తెలుగు సినిమా, వసూళ్లు.. రెండూ దెబ్బకొట్టేశాయి. దీంతో ఇప్పుడీ మూవీని నెల రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారు. 'టైగర్ 3' చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. లెక్క ప్రకారం 6-8 వారాల తర్వాత ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ రిజల్ట్ తేడా కొట్టేయడంతో డిసెంబరు 12నే ఓటీటీ స్ట్రీమింగ్ ఫిక్స్ చేశారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) -
అలాంటి సీన్స్‌లో నటించిన భార్య.. భర్త రియాక్షన్ ఇదే
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ జోడీగా నటించిన భారీ యాక్షన్ చిత్రం టైగర్- 3.. విడుదలైన మొదటిరోజే ఈ చిత్రంపై డివైడ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ పరంగా సుమారు రూ. 450 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. స్పై యూనివర్స్‌లో భాగంగా గత రెండు చిత్రాల్లో తొలి మహిళా స్పైగా మెప్పించిన కత్రినా కైఫ్.. టైగర్ 3 చిత్రంలో కూడా అదిరిపోయే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. టర్కీ హమామ్‌లో కత్రినా కైఫ్‌పై చిత్రీకరించిన టవల్ ఫైట్ ఇప్పటికీ ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో కత్రినా బోల్డ్ టవల్ ఫైట్ సీక్వెన్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. ఇది అందరి దృష్టినీ బాగా ఆకర్షిస్తోంది. ఇందులో బాత్ టవల్స్ ధరించిన ఉన్న కత్రినతో పాటు మరో లేడీ.. ఇద్దరు తలపడుతూ కనిపించారు. ఈ క్రమంలోనే ఒకరి టవల్‌ను మరొకరు లాగేసుకుని.. ఫైనల్‌గా తమ నేక్డ్ బాడీని కవర్ చేసుకున్నట్లుగా కనిపించారు. ఈ బోల్డ్ ఫైటింగ్ సీక్వెన్స్ సినిమాకు భారీగా బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ ఈ సీన్స్‌పై స్పందించాడు. ఈ ఫైట్ సీన్ తర్వాత తన భార్యను చూసి భయపడుతున్నట్లు ఆయన చెప్పాడు. 'నేను ఈ సినిమా నా భార్య కత్రినాతో కలిసి మొదటిరోజే చూశాను. ఇందులో యాక్షన్ సీన్స్‌లలో ఆమె చాలా అద్భుతంగా చేసింది. టవల్ ఫైట్ సీన్ వచ్చినప్పుడు నేను షాక్ అయ్యాను. తను ఈ సీన్ కోసం పడిన కష్టానికి ఫలితం దక్కింది అనుకున్నాను. ఈ సీక్వెన్స్ తర్వాత ఆమె వైపు చూసి ఇలా అన్నాను 'ఇక నుంచి నేను నీతో గొడవపడకపోవడమే మంచి అని అనుకుంటున్నాను. లేదంటే నువ్వు టవల్ సాయంతో నన్ను కొట్టావంటే ఇక అంతే.' అని ఫన్నీగా చెప్పాను. బాలీవుడ్లో కత్రినా అద్భుతమైన యాక్షన్ నటిగా భావిస్తున్నాను. ఇలాంటి కష్టమైన యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె పడుతున్న శ్రమకు నేను నిజంగా గర్వపడుతున్నాను.' అని ఆయన చెప్పుకొచ్చారు. -
స్టేజీపై ఇద్దరు హీరోల ముద్దులాట, వీడియో చూశారా?
సినిమా సక్సెస్ అయిందంటే ఆ సంతోషమే వేరు. చిత్రయూనిట్ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే! పెట్టిన పెట్టుబడి వెనక్కు వచ్చేసినట్లే! అందుకే ఆ ఆనందాన్ని సక్సెస్ మీట్ల ద్వారా జనాలతో పంచుకుంటారు. విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఆ మధ్య విజయాల్లేక అల్లాడిపోయిన బాలీవుడ్ ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతోంది. అందులో తాజాగా టైగర్ 3 కూడా చేరింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ యాక్షన్ మూవీ జనాలకు విపరీతంగా నచ్చేసింది. ఆరు రోజుల్లోనే అన్ని కోట్లు మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 12న విడుదలవగా బాక్సాఫీస్‌పై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. నవంబర్ 17న చిత్రయూనిట్ అభిమానుల కోసం ముంబైలో ఓ స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సల్మాన్, కత్రినాతో పాటు ఇందులో విలన్‌గా నటించిన మరో హీరో ఇమ్రాన్ హష్మీ సైతం పాల్గొన్నాడు. వీరు టైగర్ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ అభిమానుల్లో జోష్ నింపారు. సల్మాన్ ముద్దులు.. వీడియో వైరల్ తర్వాత సల్మాన్ మాట్లాడుతూ.. 'ఈ మూవీలో కత్రినా ఉంది. తనతో నేను చేసిన కొన్ని రొమాంటిక్ సీన్లు కూడా ఉన్నాయి. సినిమాలో ఇమ్రాన్.. ఆతిష్ పాత్రలో లేకపోతే ఇలా జరిగి ఉండేది' అంటూ సరదాగా అతడి దగ్గరకు వెళ్లి ముద్దులు పెట్టాడు. సల్మాన్-ఇమ్రాన్ బ్రొమాన్స్ చూసిన జనాలు ఘొల్లుమని నవ్వారు. ముద్దు సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఇమ్రాన్ హష్మీ గురించి సల్లూ భాయ్ మాట్లాడుతూ.. 'నేను ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. కానీ ఇమ్రాన్‌కు అది బాగా అలవాటు.. దాన్ని మిస్ అవుతున్నాడేమో. అందుకే ఆ వెలితిని పూడ్చేశా' అని సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న స్టార్ డైరెక్టర్ కూతురు? వైద్య వృత్తిలోకి ఎంటర్? -
‘టైగర్ 3’ ప్రదర్శనకు హాజరైన సల్మాన్, కత్రినా (ఫోటోలు)
-
నయన్, అలియా, కత్రినాలకు ఝలక్: అరంగేట్రంలోనే వందల కోట్లతో అదరగొడుతున్న అమ్మడు
2023లో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. అలా అడుగుపెట్టిందో లేదో ఇలా బాక్సాఫీసు వసూళ్లతో దూసుకు పోతోంది. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోయిన్లు కత్రినా కైఫ్, నయనతార, అలియా భట్లను వెనక్కి నెట్టేసింది. డెబ్యూలోనే షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో చాన్స్ దక్కించుకొని.. నెక్ట్స్ ఎవరితో అనే ఆసక్తికర చర్చకు తెర లేపింది. ఇంతకీ ఎవరా నటి? ఈ కథనంలో తెలుసుకుందాం! ఆమె ఎవ్వరో కాదు స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌తో పెంపుడు తల్లిగా నటించి అందరి దృష్టినీ ఆకర్షించిన రిధి డోగ్రా. 2007 నుండి నటిస్తోంది. తొలుత టీవీ తెరపై వెలిగిపోయింది. ఇటీవల ఓటీటీ స్టార్‌గా రాణిస్తోంది. కానీ దాదాపు 16 సంవత్సరాల తర్వాత అట్లీ దర్శకత్వంతో వచ్చిన జవాన్ మూవీతో బాలీవుడ్ భారీ బేక్ బ్రేక్ వచ్చింది. ఈ సినిమా ఏకంగా రూ.1150 కోట్ల కలెక్షన్లతో సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. దీంతో షారూక్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది. దీనికి తోడు ఇటీవల విడుదలైన టైగర్-3 సక్సెస్ ఆమెకు మరింత స్టార్డమ్ తెచ్చిపెట్టింది. మనీష్ శర్మ దర్వకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ , ఇమ్రాన్ హష్మీ లాంటి టాప్ స్టార్ల సరసన స్పై థ్రిల్లర్ టైగర్ 3లో నటించింది. దీపావళి కానుకగా నవంబర్ 10న సినిమా థియేటర్లలో విడుదలై ఈ మూవీ తొలివారంలోప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లకుపైగా వసూలు చేసిందని టాక్.దీంతో తొలి ఏడాదిలోను 1500 కోట్ల క్లబ్లో చేరిందీ అమ్మడు. మరో వెయ్యికోట్లపై కన్ను ఈ ఏడాదికి ఇంతకుముందెన్నడూ చేయలేదు అంటూ ఒక ఆసక్తికర విషయాన్ని ట్విటర్లో షేర్ చేసింది రిధి. జవాన్ మూవీ కలెక్షన్లు వెయ్యి కోట్లను దాటి నందుకు కృతజ్ఞతగా, అలాగే టైగర్ -3 కూడా వెయ్యి కోట్ల మార్క్‌కు చేరాలని ప్రార్థిస్తూ ఈ దీపావళికి వెయ్యి దీపాలు వెలిగించింది. With a heart full of gratitude and joy this diwali I decided to do something I had never done before coz what’s happened has never happened before !! 🤩🤩🤩🤩 Lit a 1000 🪔 for 1000 crore on #jawan whilst praying for a 1000 crore for #tiger3 pic.twitter.com/8b3MP5wD7q — Ridhi Dogra (@iRidhiDogra) November 14, 2023 ఎవరీ రిధి డోగ్రా 1984 సెప్టెంబర్ 22న పుట్టింది. న్యూ ఢిల్లీలోని షేక్ సరాయ్‌లోని అపీజే స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి కమలా నెహ్రూ కాలేజీ నుండి సైకాలజీ పట్టా అందుకుంది. ఝూమ్ జియా రేతో తన టీవీ అరంగేట్రం. హిందీ హై హమ్ (2009), YRF టెలివిజన్ రిష్తా డాట్ కామ్,సెవెన్ (2010), లాగీ తుజ్సే లగన్ (2010), మర్యాద…లేకిన్ కబ్ తక్? (2010-12), సావిత్రి (2013), యే హై ఆషికీ (2014), దియా ఔర్ బాతీ హమ్ (2015), వో అప్నా సా (2017-18), ఖయామత్ కీ రాత్ (2018) లతో ఆకట్టుకుంది. 2013లొ డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే 6, ఖత్రోన్ కే ఖిలాడి 6 (2014) తో పాపులర్ అయింది. వెబ్‌లో సంచలనం సైకలాజికల్ థ్రిల్లర్ అసూర్తో రిధి ఓటీటీ అరంగేట్రం చేసింది. ఈ షో స్ట్రీమింగ్ ఇటీవలే దాని రెండవ సీజన్ కూడా సక్సెస్‌పుల్‌గా ముగిసింది. ముంబై డైరీస్, బద్దమీజ్ దిల్ , వెల్కమ్ టు యువర్ డార్క్ సైడ్ అండ్ ది మ్యారీడ్ వుమన్ అనే వెబ్ సిరీస్‌లలో అద్భుతమైన పాత్రలు పోషించింది. ఉత్తమనటిగా అవార్డు కొట్టేసింది. దీపికాకు దీటుగా 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్ దీపికా పదుకొనే. ఆమె నటించిన పఠాన్ , జవాన్ రెండు చిత్రాలు ఏకంగా రూ.2200 కోట్లు రాబట్టాయి. దీపికా తరువాత రిధి డోగ్రా నిలుస్తోంది. నయనతార (రూ. 1150 కోట్లు), త్రిష కృష్ణన్ (రూ. 962 కోట్లు), అమీషా పటేల్ (రూ. 691 కోట్లు), రమ్య కృష్ణన్ (రూ. 610 కోట్లు), అలియా భట్ , కత్రినా కైఫ్ (ఇద్దరూ రూ. 350 కోట్లు) స్టార్లను దాటి పైకి ఎగబాకింది రిధి. 2011లో నటుడు రాకేశ్ బాపట్‌ను పెళ్లాడింది. కానీ మనస్పర్థల కారణంగా 2019లో భర్త నుంచి విడిపోయింది. -
ఓటీటీకి సల్మాన్ ఖాన్ టైగర్-3.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం టైగర్-3. దీపావళి కానుకగా ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రెండు రోజుల్లో వంద కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్లింది. దీంతో సల్మాన్ ఖాతాలో మరో హిట్ పడిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. (ఇది చదవండి: బిగ్‌బాస్: ఆమెకు ప్రెగ్నెన్సీ టెస్ట్.. టెన్షన్లో ఆ కంటెస్టెంట్) ఈ మూవీ త్వరలోనే ఓటీటీకి రానుందని లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీకి రానున్నట్లు సమాచారం. ఎందుకంటే గత రెండు రోజులుగా ఈ సినిమా కలెక్షన్స్ తగ్గడమే కారణమని భావిస్తున్నారు. అంతే కాకుండా ఈ వారంలోనే వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లు జరగడంతోనే కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు మేకర్స్ అంచనా వేస్తున్నారు. కాగా.. గతంలో రిలీజైన టైగర్ సిరీస్ సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించగా.. మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించారు. (ఇది చదవండి: స్టార్స్‌ను భయపెడుతోన్న డీప్ ఫేక్.. తాజాగా మరో స్టార్ హీరోయిన్!) -
టైగర్ 3 కలెక్షన్స్ సునామి 2 రోజుల్లో 100 కోట్లు..!
-
టైగర్-3 దూకుడు.. రెండు రోజుల్లోనే వంద కోట్లు!
కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం టైగర్ 3. ఈ చిత్రాన్ని టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్ చిత్రాలకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. మనీష్ శర్మ దర్శకత్వం వహించగా.. యష్‌రాజ్‌ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌లో సినిమాటిక్ టైమ్‌లైన్‌లో వచ్చిన ఐదో సినిమా ఇది. దీపావళి కానుకగా నవంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం, పండుగ రోజు కావడంతో ఏకంగా రూ.44.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. రెండో రోజు కూడా అదే రేంజ్లో దూసుకెళ్లింది. రెండో రోజు రూ.57.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో కేవలం విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 102 కోట్ల వసూళ్లు సాధించింది. కాగా.. సినిమా రిలీజ్ రోజే సల్మాన్ ఫ్యాన్స్ థియేటర్లో హంగామా చేశారు. మాలేగావ్‌లోని సినిమా హాలులో మూవీ ఆడుతుండగానే టపాసులు కాల్చి హల్ చల్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు సమాచారం. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సల్మాన్ ఖాన్ సైతం స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. (ఇది చదవండి: ‘టైగర్-3’ ట్విటర్ రివ్యూ) సల్మాన్ ఖాన్ తన ట్వీట్లో రాస్తూ.. 'టైగర్ 3 సినిమా ప్రదర్శన సమయంలో థియేటర్లో బాణాసంచా కాల్చడం గురించి విన్నా. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. మనం ఇతరులను రిస్క్‌లో పెట్టకుండా సినిమాను ఎంజాయ్ చేద్దాం. సురక్షితంగా ఉందాం.' అంటూ పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటించారు. కాగా.. ఈ చిత్రం హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లోనూ విడుదలైంది. #Tiger3 becomes #SalmanKhan's 17th consecutive 100cr Grosser, Highest for any Indian star🔥. #KatrinaKaif #Tiger3BoxOffice pic.twitter.com/fyRaOcy6C0 — MASS (@Freak4Salman) November 14, 2023 -
థియేటర్ లోపల పటాసులు కాల్చిన స్టార్ హీరో ఫ్యాన్స్
సెలబ్రిటీలంటే పడి చచ్చేవాళ్లు చాలామంది ఉన్నారు. వారి సినిమా రిలీజైందంటే చాలు పండగ చేసుకుంటారు. కానీ కొన్నిసార్లు వీళ్ల వల్ల అవతలివారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా అదే జరిగింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం టైగర్ 3. కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతగానో ఎదురు చూస్తున్న తమ అభిమాన హీరో సినిమా రిలీజవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. థియేటర్ల ముందు భారీ కటౌట్లు పెట్టి టపాకాయలు పేల్చి నానా హంగామా చేశారు. థియేటర్లో బాణసంచా కాల్చడం నిషేధం.. అయినా కానీ కొందరు అత్యుత్సాహంతో థియేటర్ లోపల బాణసంచా కాల్చి రచ్చ చేశారు. కొందరు ఇలా పటాసులు కాల్చడాన్ని ఎంజాయ్ చేస్తూ విజిల్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'దీపావళి పండగను సల్మాన్ సినిమాతో సెలబ్రేట్ చేసుకున్నాం.. ఇది కదా మాకు కావాల్సింది' అని సల్లూభాయ్ అభిమానులు చెప్తుండగా.. ఇలా థియేటర్లో బాణసంచా కాల్చడాన్ని ప్రభుత్వం నిషేధించింది. అయినా సరే దాన్ని ఎవరూ పట్టించుకోకుండా ఇతరులకు అసౌకర్యానికి గురి చేస్తున్నారు అని మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టైగర్ 3కి తొలిరోజే భారీ వసూళ్లు ఇలా చేయడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. పొరపాటున సీట్లకో, కార్పెట్కో నిప్పు అంటుకుంటే జరగరాని నష్టం జరుగుతుందని, దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహిస్తున్నారు. మహారాష్ట్ర మాలేగావోన్లోని మోహన్ సినిమా థియేటర్లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన టైగర్ 3 సినిమాలో ఇమ్రాన్ హష్మీ కీలకపాత్రలో నటించాడు. షారుక్ ఖాన్ అతిథి పాత్రలో మెరిశాడు. టైగర్ 3 సినిమా సల్మాన్‌కు భారీ ఓపెనింగ్స్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా కేవలం ఇండియాలోనే తొలి రోజు రూ.44 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. మరి రానున్న రోజుల్లో ఏమేరకు కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి! As Usual 💥 Salman Khan Fanclub Malegaon continues the TREND of Bursting Crackers in Theatres on Salman Khan's Entry, Though It is not advised but Fans ka emotion kon Samjhe 💀💥 #Tiger3review #Tiger3 pic.twitter.com/HIoVWKEWBp — YOGESH (@i_yogesh22) November 12, 2023 Crackers Burst In Maharashtra's Malegaon Theater During Shah Rukh Khan Entry Scene In #Tiger3#Pathaanpic.twitter.com/4wbCFzGfys — Javed (Fan) (@JoySRKian_2) November 13, 2023 చదవండి: అన్నపూర్ణ స్టూడియోకి ఎందుకు దూరమయ్యానంటే: వెంకట్ అక్కినేని -
'టైగర్ 3'లో అదంతా అబద్ధమే.. ఇదో కొత్తరకం మోసం!
సినిమా చూసే ప్రేక్షకుడంటే చాలామంది దర్శకనిర్మాతలకు లోకువ. అందుకే పిచ్చి పిచ్చి సినిమాలు తీసి కొందరు మెంటలెక్కిస్తుంటారు. అది కాదన్నట్లు థియేటర్ వరకు ప్రేక్షకుడిని రప్పించేందుకు పబ్లిసిటీలో లేనిపోని జిమ్మిక్కులన్నీ చేస్తుంటారు. దీపావళి కానుకగా ఆదివారం థియేటర్లలోకి వచ్చిన సల్మాన్ 'టైగర్ 3' విషయంలో అలాంటిదే చేశారు. కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇంతకీ ఏంటి విషయం? గత నెలలో విజయ్-లోకేశ్ కనగరాజ్ కాంబోలో 'లియో' సినిమా రిలీజైంది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. కంటెంట్ పరంగా ఓకే అనిపించుకుంది. కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేశాడని చెప్పి, విడుదలకు కొన్నిరోజుల ముందు హడావుడి చేశారు. తీరా థియేటర్లలో సినిమా చూస్తే అదంతా ఉత్తిదే అని తేలింది. (ఇదీ చదవండి: హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' కంటెస్టెంట్) ఇకపోతే బాలీవుడ్ స్పై యూనివర్స్‌లోని సినిమా అయిన 'వార్ 2'లో మన తెలుగు హీరో జూ.ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇదే యూనివర్స్‌లో తీసిన 'టైగర్ 3' మూవీలోనూ ఎన్టీఆర్ అతిథి పాత్ర చేశాడని.. గత కొన్నిరోజుల నుంచి బాలీవుడ్ మీడియా తెగ రాసిపడేశారు. తీరా చూస్తే ఎన్టీఆర్ లేడని క్లారిటీ వచ్చేసింది. హృతిక్ కూడా ఓ సీన్ లో చూపించారు కానీ పెద్దగా సినిమాకు ప్లస్ అయితే కాలేదని అంటున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత తెలుగు హీరోల రేంజు పెరిగింది. దీంతో పక్క ఇండస్ట్రీలో పలువురు నిర్మాతలు.. దీన్ని వేరేలా ఉపయోగించుకుని తెలుగు ప్రేక్షకుల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే మనోళ్లు సదరు నిర్మాతల కంటే తెలివైనోళ్లు కాబట్టి 'లియో'లో రామ్ చరణ్, 'టైగర్ 3'లో ఎన్టీఆర్ లాంటి వార్తల్ని లైట్ తీసుకుంటున్నారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందా? మరి అలా!) -
‘టైగర్-3’ ట్విటర్ రివ్యూ
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టైగర్-3’. యష్‌రాజ్‌ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌లో సినిమాటిక్ టైమ్‌లైన్‌లో విడుదలవుతున్న ఐదో సినిమా ఇది. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటించింది. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా నేడు(నవంబర్ 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ‘టైగర్ 3’పై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలకు సీక్వెల్‌గా వచ్చిన టైగర్ 3 ఎలా ఉంది? సల్మాన్-కత్రినా కైఫ్‌ల కెమిస్ట్రీ తెరపై ఎలా పండింది? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ‘టైగర్-3’ చిత్రానికి ఎక్స్(ట్విటర్)లో మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది సినిమా అదిరిపోయిందని చెబుతుంటే.. మరికొంతమంది బాగోలేదని కామెంట్ చేస్తున్నారు. ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలతో పోలుస్తూ ఆ స్థాయిలో ఆకట్టుకోలేదంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్ల బాగున్నప్పటికీ కథనం ఊహకందేలా సాగుతుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #Tiger3 ~ 🐯 ROARING BLOCKBUSTER 🔥 Maneesh Sharma's BOND meets BOURNE is Action packed cracker heavy on emotions & higher stakes. Daddy of all Spy - SALMAN KHAN's Grand comeback 💪Peak villainism of @emraanhashmi 💯 & sizzling Katrina 🔥 Best film of Spy Universe. (4.5☆/5) pic.twitter.com/Qb6WO0y01o — Prince Prithvi (@PrincePrithvi) November 11, 2023 టైగర్ 3 రోరింగ్ బ్లాక్ బస్టర్. మనీష్ శర్మ జేమ్స్ బాండ్, బౌర్న్ చిత్రాల తరహాలో ఎమోషన్స్‌తోపాటు యాక్షన్ ప్యాక్ట్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. స్పై థ్రిల్లర్ చిత్రాలకు బాస్‌గా ఈ చిత్రం ఉంది. సల్మాన్‌కు మంచి కమ్ బ్యాక్ మూవీ. ఇమ్రాన్ హష్మీ విలనిజం, కత్రినా కైఫ్ యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొట్టారు. స్పై యూనివర్స్‌లో బెస్ట్ సినిమా అని కామెంట్ చేస్తూ ఓ నెటిజన్ 4.5 రేటింగ్ ఇచ్చాడు. #Tiger3Review : Disappointing #SalmanKhan seems lethargic and trying too hard. The aura is missing and the screen presence looks animated#SRK lifts the movie on his entry but the movie drags again after his cameo. Katrina Kaif plays her part#Tiger3 will wrap under 250 cr. pic.twitter.com/Q4gEUr7nI3 — Pratham (@JainnSaab) November 11, 2023 టైగర్ 3 మూవీ డిస్పపాయింట్ చేసింది. సల్మాన్ ఖాన్ చాలా నీరసంగా కనిపించాడు. సినిమాలో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కనిపించలేదు. షారుక్ సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాడు. కానీ సాగదీసినట్టుగా ఉండడంతో ఆకట్టుకోలేకపోయింది. కత్రినా తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. OneWordReview...#Tiger3 : BLOCKBUSTER. Rating: ⭐️⭐️⭐️⭐️½ Tiger is a WINNER and more than lives up to the humongous hype… #ManeeshSharma immerses us into the world of Mass Spy film,delivers a KING-SIZED ENTERTAINER A MUST WATCH #Tiger3Review #SalmanKhan #HappyDiwali… pic.twitter.com/uDLdoaHu9s — 𝐆𝐲𝐚𝐧𝐞𝐧𝐝𝐫𝐚 𝐬𝐢𝐧𝐠𝐡 (@Gyan84s) November 12, 2023 ‘ఒక్క మాటలో చెప్పాలంటే టైగర్ 3 బ్లాక్ బస్టర్. ఈ మాస్ స్పై చిత్రాన్ని మనీష్ శర్మ అద్భుతంగా డీల్ చేశాడు. ఒక కింగ్-సైజ్ ఎంటర్టైనర్ను అందించాడు’అని కామెంట్ చేస్తూ 4.5 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. #Tiger3 Routine plot that goes overboard at times saved by terrific making. Emotions works to an extend. SRK - Salman sequence worth though it gives over the top feels. Ends with a banger from Kabir 🔥 Watch out for Katrina and her perfo👌 Sallu 👏👏 • #Tiger3Review DWIALII 🏆 pic.twitter.com/kDN79L4G33 — Akhil Das (@thanatos__x4) November 11, 2023 Salman looks sooooooooo handsome in Tiger3🔥🔥🔥 don’t wanna give spoilers but it’s one of his best in recent times. And He’s the only one who can make me cry❤️🫶#Tiger3 #Tiger3FirstDayFirstShow #SalmanKhan pic.twitter.com/mSjEnAbGy9 — ShinChan😎❤️ (@ShikatuZukishi) November 12, 2023 #Tiger3 interval: bro What a film🔥boom It’s truly personal this time🔥Tiger abhi bhi zinda hai #SalmanKhan #KatrinaKaif #EmraanHashmi @BeingSalmanKhan 100/100⚡⚡⚡⚡, — @iamjhon (@rah42961) November 12, 2023 -
సల్మాన్ 'టైగర్-3'ని ఢీ కొడుతున్న తెలుగు డైరెక్టర్
బాలీవుడ్లో టాప్ హీరోలలో ఒకరైన సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'టైగర్-3' విడుదలకు రెడీగా ఉంది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలకు ఇది సీక్వెల్‌గా రానుంది. ఇందులో సల్మాన్ ఖాన్‌కు ఏమాత్రం తగ్గకుండా కత్రీనా కైఫ్ కూడా భారీ యాక్షన్స్ సీన్స్‌లలో మెప్పించింది. దీపావళి కానుకగా భారీ అంచనాల మధ్య టైగర్-3 నవంబర్ 12న విడుదల కానుంది. టైగర్-3కి పోటీగా ఈ సారి తమిళ సినిమాలు జపాన్, జిగర్ తండా డబుల్ ఎక్స్ చిత్రాలు మాత్రమే పోటీలో ఉన్నాయి. నేడు (నవంబర్ 10)న ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ మరాఠీలో మన తెలుగు డైరెక్టర్ తీసిన 'నాళ్- భాగ్ 2' సినిమా కూడా నేడు రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద సల్మాన్ టైగర్-3 ను ఢీ కొట్టేందుకు రెడీ అయింది. మరాఠీలో 2018లో వచ్చిన 'నాళ్' అనే బ్లాక్ బస్టర్ సినిమాకి ఇది సీక్వెల్‌గా వస్తుంది. ఈ సినిమాతో సుధాకర్ రెడ్డి జాతీయ అవార్డు అందుకున్నాడు. అప్పట్లో అక్కడ ఈ సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో పార్ట్-2 మీద అంచనాలు పెరిగాయి. నాళ్-2 చిత్రాన్ని జీ -స్టూడియోస్ నిర్మించింది. ఈ సినిమా మొదటి పార్ట్‌కు జాతీయ అవార్డు దక్కడంతో మహారాష్ట్ర డిస్ట్రిబ్యూటర్లు కూడా నాళ్-2 మూవీకి సపోర్ట్‌గా ఉంటూ కావాల్సిన మల్టీప్లెక్సులు, థియేటర్లను ఏర్పాటు చేస్తున్నారట. అక్కడ సల్మాన్ ఖాన్ టైగర్-3 చిత్రానికి పోటీగా మన తెలుగోడు డైరెక్ట్ చేసిన చిత్రం బరిలో ఉంది. సుధాకర్ రెడ్డి ఎవరు..? ఎక్కంటి సుధాకర్ రెడ్డిది అంధ్రప్రదేశ్‌లోని గుంటురు జిల్లా.. హైదరాబాదులోని జేఎన్టీయూలో థియేటర్ ఆర్ట్స్ లో డిగ్రీ చేశాడు. తెలుగులో పౌరుడు, మనసారా, మధుమాసం, దళం, జార్జ్ రెడ్డి వంటి సినిమాలతో పాటు పలు ఉత్తరాది చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. అమితాబ్ బచ్చన్ 'ఝుండ్' సినిమాకు కెమెరామెన్‌గా పనిచేశాడు. 2018లో 'నాళ్' (మరాఠి) సినిమాతో డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమాకే జాతీయ అవార్డు దక్కడంతో మహారాష్ట్రలో ఆయన పేరు మారు మ్రోగిపోయింది. నాల్ సినిమా కథకు మూలం ఎంటి? నాల్.. మారాఠీలో 2018లో విడుదలైన ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. నాల్ అంటే బొడ్డుతాడు అని అర్థం. తల్లీబిడ్డల పేగు బంధం ఇతివృత్తంతో దర్శకుడు సుధాకర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఓ మనిషికి తల్లితో, బాల్యంతో, గ్రామంతో ఉండే అనుభూతులను ఇందులో చిత్రీకరించారు. -
ప్రతి కణం కణం...
టైగర్, జోయాల ప్రేమ బలమైనది. ప్రేయసి మీద తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ‘మెరిసే నీ కనులే.. ముసిరే నీ కనులే..’, ‘ప్రతి కణం.. కణంలో...’ అంటూ పాట అందుకున్నారు టైగర్. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘టైగర్ జిందా హై’కి సీక్వెల్‌గా రూపొందిన ‘టైగర్ 3’లోని పాట ఇది. టైగర్‌గా సల్మాన్ ఖాన్, జోయాగా కత్రినా కైఫ్ నటించగా మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చొప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని రెండో పాట ‘ప్రతి కణం కణం..’ను మంగళవారం రిలీజ్ చేశారు. ‘‘ఈ పాట టైగర్, జోయాల అన్యోన్యతను ఆవిష్కరించే విధంగా ఉంటుంది. ఆ కెమిస్ట్రీని సిల్వర్ స్క్రీన్‌పై చూసి, అనుభూతి చెందాల్సిందే. అందుకే వీడియోను ముందుగా రిలీజ్ చేయలేదు’’ అన్నారు ఆదిత్యా చొప్రా. ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. -
రష్మిక వీడియోలానే మరో స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కానీ ఆ వీడియో భారత సంతతికి చెందిన అమ్మాయి జరా పటేల్‌గా గుర్తించారు. గత నెల ఆమె తన ఇన్‌స్టాలో ఈ వీడియోను షేర్ చేసింది. అయితే కొందరు దుండగులు డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో రష్మిక ఫేస్ వచ్చేలా చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే ఈ వీడియోను అగ్రనటులు సైతం ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమితాబ్ బచ్చన్ డిమాండ్ చేశారు. ఇది చూశాక చాలా భాదపడ్డానని రష్మిక ట్వీట్ చేసింది. అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్‌కు సంబంధించిన డీప్ ఫేక్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం టైగర్-3 చిత్రంలో బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ సీన్లో వచ్చే కత్రినా ఫోటోను డీప్ ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్.. మరో హాలీవుడ్ మిచెల్ లీతో టవల్ ఫైట్ సీన్లో కనిపించింది. ఈ సీన్ సినీ ప్రేక్షకుల దృష్టిని విపరీతంగా ఆకట్టుకంది. అయితే తాజాగా ఈ ఫైట్ సీన్లోని కత్రినా ఫోటోను ఏఐ సాయంతో మార్ఫింగ్ చేసినట్లు కనిపిస్తోంది. రెండు రోజుల్లోనే ఇద్దరు స్టార్ హీరోయిన్లపై ఇలాంటి సంఘటనలు జరగడం ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారి తీసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సినీతారలు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. -
టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్‌కు అన్ని రోజులు పట్టిందా?
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తోన్న చిత్రం టైగర్-2. టైగర్ ఫ్రాంచైజీలో ఏక్తా టైగర్ వంటి సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన మరో చిత్రం టైగర్- 3. యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పణలో మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబరు 12న విడుదల కానుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్లో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చూపించారు. ఇందులో కత్రినా కైఫ్ కూడా భారీ యాక్షన్ సీన్స్‌లలో అదరగొట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తుండటం విశేషం. అయితే ఈ ట్రైలర్లో చూపించిన బాత్ టవల్ ఫైట్ హైలెట్‌గా కనిపించింది. (ఇది చదవండి: ప్రముఖ నిర్మాతను రెండో పెళ్లి చేసుకోనున్న నటి ప్రగతి) తాజాగా మూవీ ప్రమోషన్స్ ఆ సీన్‌తోనే షురూ చేసింది చిత్రబృందం. ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోన్న ఆ సీన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఈ సీక్వెన్స్‌తో రూ.1000 కోట్లు ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫైట్ చేసింది ఆమెనే.. అయితే ఈ బాత్ టవల్ ఫైటింగ్ సీక్వెన్స్‌లో.. కత్రినాతో ఫైట్ చేసింది ప్రముఖ హాలీవుడ్ నటి మిచెల్ లీ. తాజాగా ఆమె ప్రత్యేకంగా దీని గురించి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఈ సీన్ కోసం తామిద్దరం ఎంతో కష్టపడినట్లు చెప్పుకొచ్చింది. తామిద్దరు కలిసి రెండు వారాల పాటు ప్రాక్టీస్ చేసినట్లు ఆమె తెలిపింది. బాడీ కవర్ అయ్యేలా టవల్స్‌ను హ్యాండిల్ చేయడం బిగ్ ఛాలెంజ్‌గా అనిపించిందని పేర్కొంది. (ఇది చదవండి: గయ్యాళి గుండమ్మకు వందేళ్లు.. నమ్మినవాళ్లే మోసం చేయడంతో..!) అంతే కాకుండా ఓ చిన్న సీన్ భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడం, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడంపై ఆశ్చర్యం కలగలేదని చెప్పింది మిచెల్. ఇలా జరుగుతుందని తాను ముందే ఊహించానని తెలిపింది. అసలీ ఫైట్ సీక్వెన్స్ సన్నివేశాన్ని ఎలా చేయాలి, కొత్తగా ఎలా చేస్తే ప్రేక్షకులకు మరింత బాగా కనెక్ట్ అవుతుందనే దానిపై రెండు వారాల పాటు రీసెర్చ్ కూడా చేసినట్లు చెప్పింది. ఈ టైగర్-3 దీపావళి కానుకగా నవంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. Katrina’s Towel fight is gonna get #Tiger3 1000CR. 💥💥💥💥 #Tiger3Trailer #KatrinaKaif #SalmanKhan pic.twitter.com/mBIv6LPG3J — SuperNest (@supernest_) October 16, 2023 -
డ్యాన్స్ అంటే ఇష్టం.. ఫ్యాన్స్ కోసం ఎంతైనా కష్టపడతా: హీరోయిన్
ఒక సినిమా హిట్టయిందంటే వెంటనే దాని సీక్వెల్ గురించి చర్చ మొదలవుతుంది. చివరకు కథ రెడీ అయితే సీక్వెల్ పట్టాలెక్కడం ఖాయం. అలా బాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ మూవీ టైగర్‌కు గతంలో సీక్వెల్ తెరకెక్కింది. తాజాగా టైగర్ 2కి సీక్వెల్‌గా టైగర్ 3 తెరకెక్కుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి లేకే ప్రభు కా నామ్ సాంగ్ రిలీజైంది. ప్రీతమ్ కంపోజ్ చేసిన ఈ పాటను అర్జిత్ సింగ్, నిఖిత గాంధీ పాడారు. తెలుగు, తమిళ వర్షన్స్ మాత్రం బెన్నీ దయాల్, అనూశ మణి పాడారు. ఇక ఈ పాటలో కత్రినా స్టెప్పులకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. హిందీ వర్షన్ యూట్యూబ్‌లో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ పాటకు వస్తున్న స్పందనపై కత్రినా స్పందించింది. ఒక ఆర్టిస్టుగా నాకు ఎక్కడలేని ప్రేమాభిమానాలు అందిస్తున్నారు. లెకె ప్రభు కా నామ్ పాటను ఎంతో హిట్ చేశారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. జనాలు మా నటనతో పాటు పాటలు, డ్యాన్సులు కూడా చూస్తారు. ఆ రెండు కూడా సినిమాలో భాగమే. పాటల వల్ల కూడా జనాలు సినిమాకు కనెక్ట్ అవుతుంటారు. అందుకే ఏ పాట అయినా దానికి ఎంతో బాగా డ్యాన్స్ చేయాలని ప్రయత్నిస్తుంటాం. ప్రేక్షకులను నిరాశపర్చకూడదని కష్టపడుతుంటాం' అని చెప్పుకొచ్చింది. కాగా టైగర్ 3 మూవీ దీపావళి కానుకగా నవంబర్ 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. చదవండి: భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన.. 39 ఏళ్ల తర్వాత వెబ్ సిరీస్‌గా.. ఏ ఓటీటీలో అంటే? -
రొమాంటిక్ టైగర్
సిల్వర్ స్క్రీన్‌పై సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌ల రొమాంటిక్ కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంటుందంటారు సినీ ప్రియులు. ‘టైగర్’ ఫ్రాంచైజీలో ‘ఏక్తా టైగర్’ వంటి సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన మరో చిత్రం ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం నవంబరు 12న విడుదల కానుంది. ఈ సినిమాలోని సల్మాన్, కత్రినా కాంబినేషన్లోని రొమాంటిక్ సాంగ్ ‘లేకే ప్రభు కా నామ్’ పాట పూర్తి లిరికల్ వీడియోను ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రీతమ్ స్వరపరచిన ఈ పాటను ఆర్జిత్ సింగ్ పాడారు. సల్మాన్‌కి ఆర్జిత్ సింగ్ పాడిన తొలి పాట ఇది. -
నువ్వు మొదలుపెట్టావ్.. నేను ముగిస్తాను!
‘దేశంలోని శాంతికి, దేశంలోని శత్రువులకు మధ్య ఎంత దూరం ఉంటుంది. కేవలం ఒక మనిషంత’ అంటూ మొదలువుతుంది ‘టైగర్ 3’ తెలుగు ట్రైలర్. సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్, ఇమ్రాన్ హాష్మి ప్రధాన పాత్రధారులుగా మనీష్శర్మ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన స్పై ఫిల్మ్ ‘టైగర్ 3’. యశ్‌రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లోని ‘టైగర్ జిందా హై’, ‘వార్’, ‘పఠాన్’ చిత్రాల్లోని ఘటనలకు కొనసాగింపుగా ‘టైగర్ 3’ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. తాజాగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘టైగర్ 3’ ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను నవంబరు 12న విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ వెల్లడించింది. ‘టపాసులు కాల్చడం నవ్వు మొదలు పెట్టావ్.. నేను ముగిస్తాను’, ‘టైగర్‌కు శ్వాస ఉన్నంత వరకు, ఈ టైగర్ ఓటమిని ఒప్పుకోడు’ అంటూ సల్మాన్‌ఖాన్ చెప్పే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘ఏక్తా టైగర్’, ‘టైగర్ జిందాహై’ చిత్రాల తర్వాత ‘టైగర్’ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమా ‘టైగర్ 3’. -
సల్మాన్ ఖాన్ టైగర్ 'ట్రైలర్ -3' విడుదల.. దుమ్ములేపిన కత్రినా
రెండు చిత్రాలతో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంట ప్రేక్షకులను మెప్పించిడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ కొల్లగొట్టాయి. ఆ చిత్రాల్లో టైగర్‌గా సల్మాన్ సాహసాలు, జోయాగా కత్రినా గ్లామర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. తాజాగా టైగర్-3 మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సీక్వెల్ చిత్రానికి మనీశ్ శర్మ దర్శకుడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పణలో రానున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదొక ప్రతీకార యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది. టైగర్ తన శత్రువులను వేటాడేందుకు ప్రాణాపాయకరమైన మిషన్‌ను ఎలా సాగిస్తాడో చూపించేదే ఈ సినిమా కథాంశం. సల్మాన్ ఖాన్ సీక్రెట్ ఇండియన్ రా ఏజెంట్ అని, అతను తన దేశాన్ని, ఫ్యామిలీని కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో అతను ఉగ్రవాదులకు సహాయం చేసినట్లు ప్రచారం జరగడంతో తన నిజాయితీని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనేది ప్రధాన కథాంశంగా తెలుస్తోంది. ట్రైలర్లో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ను దర్శకుడు చూపించారు. ఇందులో కత్రినా కైఫ్ కూడా భారీ యాక్షన్ సీన్స్‌లలో అదరగొట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తుండటం విశేషం. నవంబర్ 12న దివాళి కానుకగా టైగర్-3 విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. -
టైగర్‌లో యంగ్ టైగర్?
యంగ్ టైగర్.. హీరో ఎన్టీఆర్‌ని ఫ్యాన్స్ అలానే పిలుచుకుంటారు. ఈ యంగ్ టైగర్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘టైగర్ 3’ సినిమాలో నటించనున్నారా? అంటే అవునంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్న ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రం షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. అయితే ‘వార్ 2’ కంటే ముందే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘టైగర్ 3’లో ఎన్టీఆర్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్. ‘టైగర్ జిందా హై’ చిత్రానికి సీక్వెల్‌గా మనీష్ శర్మ దర్శకత్వంలో ‘టైగర్ 3’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో క్లయిమాక్స్‌లో ఎన్టీఆర్ కనిపిస్తారని భోగట్టా. కాగా ‘టైగర్ 3’, ‘వార్ 2’ రెండు చిత్రాలను యశ్ రాజ్ ఫిల్మ్ప్ నిర్మిస్తుండటం విశేషం. -
సల్మాన్ ఖాన్ టైగర్ సందేశం వచ్చేసింది
బాలీవుడ్ స్టార్స్ సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాల్లో మెప్పించారు. ఈ ప్రాంఛైజీలో భాగంగా వస్తున్న చిత్రమే టైగర్-3. గత రెండు చిత్రాలతో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంట ప్రేక్షకులను మెప్పించింది. ఆ చిత్రాల్లో టైగర్‌గా సల్మాన్ సాహసాలు, జోయాగా కత్రినా గ్లామర్ వహ్వా అనిపించాయి. ఇప్పుడు ఆ సిరీస్‌లో తదుపరి చిత్రంగా టైగర్ సందేశ్ పేరుతో మేకర్స్ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సీక్వెల్ చిత్రానికి మనీశ్ శర్మ దర్శకుడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పణలో రానున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదొక ప్రతీకార యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది. టైగర్ తన శత్రువులను వేటాడేందుకు ప్రాణాపాయకరమైన మిషన్‌ను ఎలా సాగిస్తాడో చూపించేదే ఈ సినిమా కథాంశం. (ఇదీ చదవండి: ప్రభాస్ వల్ల ఇబ్బందుల్లో చిక్కుకున్న ముగ్గురు టాప్ హీరోలు) టైగర్ తన దేశం కోసం, తన కుటుంబం కోసం తన పేరును దాచి ఒక స్పైగా పనిచేస్తాడు. తాజాగా విడుదలైన టైగర్ సందేశ్‌లో సల్మాన్ చెబుతున్న డైలాగ్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇందులోని యాక్షన్ సీన్స్ అదిరిపోయే రేంజ్లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. నవంబరు 10న దిపావళికి ఈ చిత్రం విడుదల అవుతుందని టైగర్ మేకర్స్ ప్రకటించారు.