టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్‌కు అన్ని రోజులు పట్టిందా? | Salman Khan And Katrina Kaif Latest Movie Tiger 3 Bath Towel Fight Scene Has Been Viral, Know Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Tiger 3 Bath Towel Scene: కత్రినా బాత్‌ టవల్ సీన్.. ఆమెతో ఫైట్ చేసింది ఎవరో తెలుసా?

Published Sat, Oct 28 2023 7:42 AM | Last Updated on Sat, Oct 28 2023 8:28 AM

Salman Khan and katrina kaif latest Movie Tiger 3 Bath Towel Scene Viral - Sakshi

సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం టైగర్-2. టైగర్‌ ఫ్రాంచైజీలో ఏక్తా టైగర్‌ వంటి సినిమాల తర్వాత సల్మాన్‌ ఖాన్, కత్రినా కైఫ్‌ నటించిన మరో చిత్రం టైగర్‌- 3. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో మనీష్‌ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు.    ఈ చిత్రం నవంబరు 12న విడుదల కానుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు.

ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్‌లో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చూపించారు. ఇందులో కత్రినా కైఫ్ కూడా భారీ యాక్షన్ సీన్స్‌లలో అదరగొట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తుండటం విశేషం. అయితే ఈ ట్రైలర్‌లో చూపించిన బాత్ టవల్ ఫైట్ హైలెట్‌గా కనిపించింది. 

(ఇది చదవండి: ప్రముఖ నిర్మాతను రెండో పెళ్లి చేసుకోనున్న నటి ప్రగతి)

తాజాగా మూవీ ప్రమోషన్స్ ఆ సీన్‌తోనే షురూ చేసింది చిత్రబృందం. ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోన్న ఆ సీన్‌  సోషల్​ మీడియాలో సెన్సేషన్​ క్రియేట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఈ సీక్వెన్స్‌తో రూ.1000 కోట్లు ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఫైట్‌ చేసింది  ఆమెనే..

అయితే ఈ బాత్​ టవల్ ఫైటింగ్​ సీక్వెన్స్‌లో..  కత్రినాతో ఫైట్ చేసింది ప్రముఖ హాలీవుడ్ నటి మిచెల్ లీ. తాజాగా ఆమె ప్రత్యేకంగా దీని గురించి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఈ సీన్​ కోసం తామిద్దరం ఎంతో కష్టపడినట్లు చెప్పుకొచ్చింది. తామిద్దరు కలిసి రెండు వారాల పాటు ప్రాక్టీస్​ చేసినట్లు ఆమె తెలిపింది. బాడీ కవర్​ అయ్యేలా టవల్స్‌ను హ్యాండిల్​ చేయడం బిగ్​ ఛాలెంజ్‌గా అనిపించిందని పేర్కొంది.

(ఇది చదవండి: గయ్యాళి గుండమ్మకు వందేళ్లు.. నమ్మినవాళ్లే మోసం చేయడంతో..!)

అంతే కాకుండా ఓ చిన్న సీన్​ భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడం, సోషల్​ మీడియాలో ట్రెండింగ్​ అవ్వడంపై ఆశ్చర్యం కలగలేదని చెప్పింది మిచెల్. ఇలా జరుగుతుందని తాను ముందే ఊహించానని తెలిపింది. అసలీ ఫైట్​ సీక్వెన్స్​ సన్నివేశాన్ని ఎలా చేయాలి, కొత్త‌గా ఎలా చేస్తే ప్రేక్షకులకు మరింత బాగా క‌నెక్ట్ అవుతుంద‌నే దానిపై రెండు వారాల పాటు రీసెర్చ్ కూడా చేసిన‌ట్లు చెప్పింది. ఈ టైగర్-3 దీపావళి కానుకగా నవంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement