scenes
-
దీపావళి మర్నాడు.. హింగోట్ యుద్ధంలో 15 మందికి గాయాలు
ఇండోర్: మనదేశంలో విభిన్న సంప్రదాయాలు కనిపిస్తాయి. వీటిలో కొన్ని ఎంతో వింతగా అనిపిస్తాయి. ఇటువంటి వింత సంప్రదాయం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కొనసాగుతోంది. దీపావళి మర్నాటి రోజున ఇండోర్ జిల్లా గౌతమ్‌పురాలో సంప్రదాయం పేరుతో కళంగి- తుర్రా సమూహాల మధ్య హింగోట్ యుద్ధం శుక్రవారం జరిగింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ యుద్ధాన్ని వీక్షించేందుకు ఇండోర్, ఉజ్జయిని, ధార్, దేవాస్ సహా సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రంలో దీపావళి మర్నాడు ఈ తరహా యుద్ధం జరిగే ఏకైక ప్రదేశం గౌతమ్‌పురా. ఈ యుద్ధంలో 15 మందికి పైగా యోధులు మరియు ప్రేక్షకులు గాయపడ్డారు.ఇండోర్ హింగోట్ యుద్ధం చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం స్టేడియం ప్రాంతంలో 25 అడుగుల ఎత్తులో నెట్‌ను ఏర్పాటు చేశారు. యుద్ధభూమిలో భద్రతను దృష్టిలో ఉంచుకుని, 300 మందికి పైగా పోలీసులను మోహరించారు. దీంతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.గౌతమ్పురాను గౌతమ ఋషి నగరంగా పరిగణిస్తారు. ఏళ్ల తరబడి సాగుతున్న హింగోట్ యుద్ధం ఎలాంటి ప్రచారం లేకుండానే ఉత్కంఠభరితంగా సాగుతుంటుంది. రాష్ట్రంలోని పలు నగరాల నుంచి వేలాది మంది ప్రేక్షకులు హింగోట్ యుద్ధాన్ని వీక్షించేందుకు తరలివస్తుంటారు. ఈ సారి ఈ యుద్ధాన్ని చూసేందుకు వచ్చేవారితో మైదానం మొత్తం నిండిపోయింది. హింగోట్ యుద్ధంలో ముందుగా ఇరువర్గాల యోధులు డప్పుల మోతతో ఊరేగింపుగా వచ్చారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తలపై శిరస్త్రాణం, చేతుల్లో కవచాలు, నిప్పుల బాణాలు భుజాలకు తగిలించుకుని యోధులు మైదానంలోకి రావడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రారంభంలో 50 నుండి 60 మంది యోధులు ముఖాముఖి తలపడ్డారు. సుమారు గంటపాటు జరిగిన ఈ యుద్ధం రాత్రి 7.30 గంటలకు ముగిసింది. ఇది కూడా చదవండి: 1,101 మంది మహిళలు.. ఒకే రంగు చీరతో కాళీ పూజలు -
విజయ్ సినిమాలో ఎంఎస్ ధోని.. ఆ సీన్ చూశారా?
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం 'ది గోట్'(గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రోజో ది గోట్ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ఉదయం 4 గంటలకే చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ షోలు మొదలయ్యాయి. మొదటి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ వస్తోంది. దీంతో థియేటర్ల వద్ద విజయ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.అయితే ఈ మూవీలో ఓ సీన్లో భారత మాజీ కెప్టెన్ ధోని కనిపించడంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా కేరింతలు కొడుతూ.. తలా అంటూ నానా హంగామా చేశారు. ఆ సీన్లో ఎంఎంస్ ధోని ఐపీఎల్ బ్యాటింగ్‌కు వెళ్తూ కనిపించగా.. విజయ్ బైక్ రైడ్ చేస్తూ కనిపించారు. ఈ సీన్‌తో విజయ్, ధోని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఐపీఎల్లో చెన్నై టీమ్‌కు మహేంద్ర సింగ్ ధోని ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ధోనికి పెద్దఎత్తున వీరాభిమానులు ఉన్నారు.కాగా.. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. హీరో, విలన్ పాత్రల్లో ఆయన మెప్పించనున్నారు. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్.. 2026లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ముందు ఇదే చివరి చిత్రం కానుంది. #Dhoni cameo 🔥🔥#Kanguva FL 💪💪🔥🔥#Trisha cameo#ThalaAJITH cameo 💥💥#Sivakarthikeyan cameo 🥱#goat#GOATFDFS#TheGreatestOfAllTime#ThalapathyVijay pic.twitter.com/VmYr3UOhOX— pushparaj(🔥🔥 ) (@Pushparaaj_AA) September 5, 2024 -
అల్లు అర్జున్ పుష్ప-2.. నెట్టింట లీకైన క్లైమాక్స్ సీన్!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ మూవీ డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుంది. మరో నెల రోజుల పాటు షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో మేకర్స్ ఈ మూవీని పోస్ట్‌పోన్ చేశారు. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పుష్ప చిత్రంలో శ్రీవల్లిగా మెప్పించిన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పుష్ప 2 క్లైమాక్స్ సీన్ వీడియో అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఈ వీడియో పుష్ప-2 చిత్రానికి సంబంధించిందా? లేదా ?అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్ నెటిజన్ తీరుపై మండిపడుతున్నారు. దీంతో సినిమా నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని అల్లు అర్జున్ అభిమానులు కోరుతున్నారు.మరికొందరు ఫ్యాన్స్ ఈ వీడియోనూ డిలీట్ చేయాలంటూ అతనికి రెక్వెస్ట్లు పెడుతున్నారు. ఎందుకిలా లీక్ చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఈ వీడియో డిలీట్ చేయండి బ్రో అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో డిలీట్ చేయకపోతే కొందరి ఉద్యోగాలు కూడా పోతాయని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నెట్టింట వైరలవుతోన్న వీడియో ఒరిజినలా, కాదా అన్నది తెలియాలంటే మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. #Pushpa2 Climax Fight Scene 😉Enjoy pandagowww 💥🥵😎@alluarjun #Pushpa2TheRule pic.twitter.com/EyGDhWtvzu— Jaisai Nimmala (Allu Arjun Die Hard Fan) (@NimmalaJaisai23) July 30, 2024 -
చీకట్లోనూ స్పష్టంగా చూపిస్తుంది..
రాత్రివేళ చీకట్లో దగ్గరగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా చూడటం సాధ్యం కాదు. చీకట్లో భూతద్దాలను ఉపయోగించినా ఫలితం ఉండదు. ఈ బైనాక్యులర్ చేతిలో ఉంటే మాత్రం చీకట్లోనూ దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడటం సాధ్యమవుతుంది. జపాన్‌కు చెందిన కెమెరాల తయారీ కంపెనీ ‘యాషికా’ ఇటీవల ఈ నైట్‌విజన్ బైనాక్యులర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల రీచార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులోని ఫిక్స్డ్ ఆప్టికల్ జూమ్‌ను ఉపయోగిస్తే, దూరంగా ఉన్న వస్తువులు మూడురెట్లు దగ్గరగా కనిపిస్తాయి. డిజిటల్ ఆప్టికల్ జూమ్‌ను ఉపయోగిస్తే, ఐదురెట్లు దగ్గరగా కనిపిస్తాయి. డిజిటల్ కెమెరాల మాదిరిగానే దీనికి నాలుగు అంగుళాల హై డెఫినిషన్ డిస్ప్లే ఉంటుంది. దీని ద్వారా చీకట్లో 600 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుల రంగులను సైతం స్పష్టంగా చూడవచ్చు. ఇందులోని 512 జీబీ ఎక్స్టర్నల్ మెమరీకార్డ్‌లో చూసిన దృశ్యాలను రికార్డు చేసుకోవచ్చు. ఇది బైనాక్యులర్‌గా మాత్రమే కాకుండా, వీడియో కెమెరాగా కూడా పనిచేస్తుంది. దీని ధర 169 డాలర్లు (రూ. 14,050) మాత్రమే! ఇవి చదవండి: మొక్కల నుంచి వచ్చే సంగీతాన్ని వినొచ్చు తెలుసా! -
'బుల్లెట్ అలా ఎలా బయటికి వస్తుంది బ్రో'.. ఆ సీన్‌పై సైంధవ్ డైరెక్టర్ క్లారిటీ!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైంధవ్. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. వెంకటేశ్ నటిస్తోన్న 75వ మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 13న విడుదలవుతోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెంచేసింది. ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ చిత్రంగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ట్రైలర్లో ప్రతి సీన్లో బుల్లెట్ల వర్షం కురిపించారు వెంకీమామ. ఇందులో ఓ సీన్ అయితే ఏకంగా పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. బుధవారం మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సీన్స్‌ను తలపించింది. అయితే ఒక్క సెకన్ కూడా చూపించని ఆ సీన్ పైనే ఇప్పుడు చర్చ మొదలైంది. ట్రైలర్లో ఓ రౌడీ నోట్లో తుపాకీ పెట్టిన వెంకటేశ్ అతన్ని కాల్చగా.. ఆ బుల్లెట్ ఏకంగా అతని మలద్వారం నుంచి బయటకు వచ్చినట్లు చూపించారు. తల వెనుక భాగం నుంచి రావాల్సిన బుల్లెట్ అలా ఎలా వెళ్లిందటూ నెటిజన్స్ షాకింగ్‌కు గురయ్యారు. అంతే కాకుండా ఆ సీన్‌పై మీమ్స్ ఇక చెప్పాల్సిన పనిలేదు. గ్రాఫిక్స్ చేసి మరీ సీన్స్ వైరల్ చేస్తున్నారు. అయితే తాజాగా నెట్టింట వస్తున్న డైరెక్టర్ శైలేశ్ కొలను స్పందించారు. ఆ వీడియోను చూసిన ఆయన చాలా ఫన్నీగా ఉందంటూ ట్వీట్ చేశారు. బుల్లెట్ మలద్వారం నుంచి బయటకు వచ్చే విషయమై పూర్తి వివరణ ఇచ్చారు. శైలేశ్ తన ట్వీట్లో రాస్తూ.. 'హాహ్హా.. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఏ విషయమైనా చెప్పడానికి నేను ఇష్టపడతా. మామూలుగా నోట్లో తుపాకీ పెట్టి కాలిస్తే బుల్లెట్ తల వెనుక వైపు నుంచి బయటకు వస్తుంది. కానీ ఒక వ్యక్తిని ఒక కచ్చితమైన దిశలో కూర్చోబెట్టి.. గన్ బ్యారెల్‌ను వీలైనంతగా అతడి నోటి లోపలికి పెట్టి.. సుమారు 80 డిగ్రీల కోణంలో కాలిస్తే.. అతని అవయవాలను చీల్చుకుంటూ బుల్లెట్ బయటకు వస్తుంది.' అని రాసుకొచ్చారు. అంతే కాకుండా.. 'మీరు ఆ బొమ్మలో చూపించినట్లు బుల్లెట్ శ్వాస కోశం, అన్నవాహిక, కాలేయం, పాంక్రియాస్, కొన్నిసార్లు గుండెను గాయం చేస్తుంది. ఆ తర్వాత పెద్ద, చిన్న ప్రేగులను చీల్చుకుంటూ మలద్వారం నుంచి బయటకు వస్తుంది. ఇలా షూట్ చేయడానికి చాలా నేర్పు కావాలి. సైకో స్పెషల్ స్కిల్ ఇది. థియేటర్లో ప్రేక్షకులను అలరించేందుకు మాత్రమే ఈ మాస్ మూమెంట్ క్రియేట్ చేశాం. కానీ మీరు షేర్ చేసిన వీడియో చాలా ఫన్నీగా ఉంది బ్రదర్..' అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరోవైపు డైరెక్టర్ శైలేశ్ వివరణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Hahaha this is funny af. Since I like explaining things, let me start this, generally if you shoot someone in the mouth the bullet should exit from the back of the head, but if you make the person sit in a specific angle and shove the barrel of the gun enough into the mouth and… https://t.co/BLrZXrK7Da — Sailesh Kolanu (@KolanuSailesh) January 4, 2024 -
సందీప్ రెడ్డి యానిమల్.. ఆ సీన్ కూడా కాపీనేనా?
రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం ‘యానిమల్’. డిసెంబర్ 1న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఈ మూవీపై మొదట చాలామంది విమర్శలొచ్చాయి. అయితే విమర్శలతో పాటు ప్రశంసలు కూడా అదేస్థాయిలో వచ్చాయి. అయితే ఈ చిత్రంలో ఫైట్ సీన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. (ఇది చదవండి: 'యానిమల్' సినిమా చూసి నా కూతురు ఏడ్చేసింది.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్) అయితే తాజాగా బాబీ డియోల్, రణ్‌బీర్ కపూర్ క్లైమాక్స్ ఫైట్ సీన్‌పై కాపీ విమర్శలు వైరలవుతున్నాయి. 2001లో వచ్చిన ఆషిక్ మూవీలోని సీన్‌ను కాపీ కొట్టారంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆషిక్ మూవీ వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు. నేను పొరపాటున రాంగ్ యానిమల్ మూవీ సీన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఆషిక్ చిత్రంలో బాబీ డియోల్ హీరోగా నటించారు. అయితే గతంలోనూ యానిమల్‌పై కాపీ ఆరోపణలు వచ్చాయి. యానిమల్ ట్రైలర్‌ను విడుదలైన వెంటనే హువా మైన్ పాటలో రష్మిక, రణబీర్ ఫ్లైట్ సీన్‌ను 50 షేడ్స్ ఆఫ్ గ్రే చిత్రం కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అంతే కాకుండా మరో ఫైట్ సీక్వెన్స్ కొరియన్ చిత్రం నుండి కాపీ చేశారంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలు ఎదురైనా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రీ, శక్తి కపూర్, సురేష్ ఒబెరాయ్, ప్రేమ్ చోప్రా బాలీవుడ్ తారలు నటించారు. #Animal#AnimalReview #AnimalMovie #RanbirKapoor𓃵 #SandeepReddyVanga Ranbir and Bobby Fight Scene Glimpse 🔥🔥🔥🔥 pic.twitter.com/ylMpVhIZov — ASHISH kushwaha (@ASHISHk18033956) December 2, 2023 -
త్రిషపై సంచలన కామెంట్స్.. లియో నటుడిపై సినీతారల ఆగ్రహం!
నటి త్రిషై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్‌పై కోలీవుడ్ తారలు ఫైరవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలసుకుందాం. విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం లియో. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో మన్సూర్ అలీ ఖాన్ కీలకపాత్రలో కనిపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మన్సూర్ త్రిషపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అతను చేసిన అసభ్యకరమైన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. 'లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటించా. కానీ సినిమాలో ఒక్క బెడ్రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నా. నేను ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను బెడ్రూమ్కు తీసుకెళ్తానని అనుకున్నా. ఇంతకుముందు సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. సినిమాల్లో ఇది నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదు.' అంటూ కామెంట్స్ చేశారు. దీంతో మన్సూర్ అలీ ఖాన్‌పై పలువురు తారలు మండిపడుతున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి సినిమాల్లో ఎందుకు అవకాశాలిస్తున్నాంటూ నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. The thing about men like Mansoor Ali Khan - they have always been talking like this. Never been condemned, with other men in power, money and influence laughing along; eeyy aamaa da macha correct ra maccha sorta thing. Robo Shankar said something on how he wants allowed to touch… pic.twitter.com/ZkRb2qxmMl — Chinmayi Sripaada (@Chinmayi) November 18, 2023 -
బెడ్ రూమ్ సీన్.. కుదరదని మొహం మీదే చెప్పేశా: హీరోయిన్
టాలీవుడ్లో మీకు మాత్రమే చెప్తా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ భా వాణి భోజన్. అయితే ఈ మూవీతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత నటించిన తమిళ చిత్రం ఓ మై కడవలేతో గుర్తింపు తెచ్చుకుంది. మొదట బుల్లితెర నటిగా 2010లో కెరీర్ ప్రారంభించిన వాణి ప్రస్తుతం హీరోయిన్గా బిజీ అయిపోయింది. ఇప్పటివరకు ఈ అమ్మడుకు పెద్ద హిట్ పడలేదు. (ఇది చదవండి: అలా కనిపించడం చాలా కొత్తగా అనిపించింది: సీతారామం బ్యూటీ) కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ కోలీవుడ్‌లో మంచి సక్సెస్ కోసం పోరాడుతోంది. మధ్యలో సరైన అవకాశాలు లేకపోవడంతో వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపింది. దాదాపుగా స్టార్ హీరోయిన్ హోదా కోసం 13 ఏళ్లుగా కష్టపడుతోంది. ప్రస్తుతం కోలీవుడ్‌పైనే దృష్టి సారించింది భామ. తాజాగా ఆమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మరో చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా.. వాణిభోజన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఆమె మాట్లాడుతూ కథకు అవసరం లేకపోయినా కొన్ని సన్నివేశాల్లో నటించాలని ఒత్తిడి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఒక చిత్రంలో అనవసరంగా బెడ్రూం సన్నివేశంలో నటించాలని చెప్పారని వివరించింది. అదీ ముందుగా ఎలాంటి సమాచారం లేకుండా చేయమని అడిగాగు. దీంతో తాను అలాంటి సన్నివేశంలో నటించనని మొహం మీదే చెప్పేశానని తెలిపింది. తనకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదని.. నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేయడమే ముఖ్యమని పేర్కొంది. అయితే తరచూ గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ హల్ చల్ చేస్తోంది. గతంలో ఈ ముద్దుగుమ్మ ఇదివరకే ఒక నటుడితో ప్రేమ, సహజీవనం అంటూ రూమర్స్ కూడా వచ్చాయి. (ఇది చదవండి: ఓటీటీలోకి 'భగవంత్ కేసరి' సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్?) -
రామ్-బోయపాటి స్కంద మూవీ.. యాక్షన్ ఓకే.. రీ ఎంట్రీ ఎలా?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. జీ స్టూడియోస్‌తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇటీవలే ఓటీటీలో వచ్చిన స్కంద మూవీ ప్రేక్షకుల ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. నవంబర్ రెండో తేదీ నుంచే డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: రాహుల్ సిప్లిగంజ్‌తో లవ్.. రతికా పేరేంట్స్ ఏమన్నారంటే?) సినిమా అన్నాక చిన్న చిన్న పొరపాట్లు జరగడం చూస్తుంటాం. ఎడిటింగ్‌లో అప్పుడప్పుడు కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతుంటాయి. ప్రస్తుతం రామ్ నటించిన స్కంద చిత్రంలోనూ అలాంటిదే జరిగింది. అయితే ఈ మూవీలోని ఓ సీన్ విషయంలో జరిగిన అతిపెద్ద పొరపాటు తాజాగా బయటకొచ్చింది. ఓటీటీలో సినిమా చూసిన ఓ ప్రేక్షకుడు.. ఆ సీన్‌ను కట్ చేసి ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే ఆ సీన్లో జరిగిన ఆ పెద్ద పొరపాటు ఏంటో తెలుసుకుందాం. సినిమా కథలో భాగంగా ఏపీ సీఎం కూతురిని (అజయ్ పుర్కర్) తీసుకురావడానికి.. తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి(శరత్ లోహితస్వ) వద్దకు రామ్ వెళ్తాడు. అదే సమయంలో ఫుల్ మాస్ యాక్షన్ సీన్ ఫైట్ జరుగుతుంది. అక్కడ రామ్ పవర్ఫుల్ డైలాగ్ కూడా చెబుతాడు. అయితే ఆ సీన్లో ఓ ముసలోడి పిస్టల్ తీసుకుని.. నిన్ను వదలను.. చంపేస్తా అంటూ రామ్ వైపు తుపాకి గురి పెడతాడు. అయితే రామ్ అదే తుపాకితీ అతన్ని కాల్చి పడేస్తాడు. కానీ ఆ తర్వాత వచ్చే సీన్లో చనిపోయిన ముసలోడు సీఎం వెనుక కనిపిస్తాడు. అదేంటి చనిపోయిన వ్యక్తి మళ్లీ సినిమాలో కనిపించడమేంటి? ఈ చిన్న మిస్టేక్ బోయపాటి గమనించలేకపోయాడా? అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత భారీ యాక్షన్ చిత్రంలో ఇలాంటి పొరపాటు ఏంటని సోషల్ మీడియా వేదికగా బోయపాటిని ఆడేసుకుంటున్నారు. (ఇది చదవండి: అంత అందంగా లేనన్నారు, వంక పెట్టారు: హీరోయిన్) స్కంద కాదు ఇది బోయపాటి గాడి బొంద🤦♂️ pic.twitter.com/p49ggMdbMQ — ఇవివి పంచ్ లు🤙 (@evvpunchlu333) November 2, 2023 -
టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్‌కు అన్ని రోజులు పట్టిందా?
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తోన్న చిత్రం టైగర్-2. టైగర్ ఫ్రాంచైజీలో ఏక్తా టైగర్ వంటి సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన మరో చిత్రం టైగర్- 3. యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పణలో మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబరు 12న విడుదల కానుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్లో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చూపించారు. ఇందులో కత్రినా కైఫ్ కూడా భారీ యాక్షన్ సీన్స్‌లలో అదరగొట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తుండటం విశేషం. అయితే ఈ ట్రైలర్లో చూపించిన బాత్ టవల్ ఫైట్ హైలెట్‌గా కనిపించింది. (ఇది చదవండి: ప్రముఖ నిర్మాతను రెండో పెళ్లి చేసుకోనున్న నటి ప్రగతి) తాజాగా మూవీ ప్రమోషన్స్ ఆ సీన్‌తోనే షురూ చేసింది చిత్రబృందం. ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోన్న ఆ సీన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఈ సీక్వెన్స్‌తో రూ.1000 కోట్లు ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫైట్ చేసింది ఆమెనే.. అయితే ఈ బాత్ టవల్ ఫైటింగ్ సీక్వెన్స్‌లో.. కత్రినాతో ఫైట్ చేసింది ప్రముఖ హాలీవుడ్ నటి మిచెల్ లీ. తాజాగా ఆమె ప్రత్యేకంగా దీని గురించి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఈ సీన్ కోసం తామిద్దరం ఎంతో కష్టపడినట్లు చెప్పుకొచ్చింది. తామిద్దరు కలిసి రెండు వారాల పాటు ప్రాక్టీస్ చేసినట్లు ఆమె తెలిపింది. బాడీ కవర్ అయ్యేలా టవల్స్‌ను హ్యాండిల్ చేయడం బిగ్ ఛాలెంజ్‌గా అనిపించిందని పేర్కొంది. (ఇది చదవండి: గయ్యాళి గుండమ్మకు వందేళ్లు.. నమ్మినవాళ్లే మోసం చేయడంతో..!) అంతే కాకుండా ఓ చిన్న సీన్ భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడం, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడంపై ఆశ్చర్యం కలగలేదని చెప్పింది మిచెల్. ఇలా జరుగుతుందని తాను ముందే ఊహించానని తెలిపింది. అసలీ ఫైట్ సీక్వెన్స్ సన్నివేశాన్ని ఎలా చేయాలి, కొత్తగా ఎలా చేస్తే ప్రేక్షకులకు మరింత బాగా కనెక్ట్ అవుతుందనే దానిపై రెండు వారాల పాటు రీసెర్చ్ కూడా చేసినట్లు చెప్పింది. ఈ టైగర్-3 దీపావళి కానుకగా నవంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. Katrina’s Towel fight is gonna get #Tiger3 1000CR. 💥💥💥💥 #Tiger3Trailer #KatrinaKaif #SalmanKhan pic.twitter.com/mBIv6LPG3J — SuperNest (@supernest_) October 16, 2023 -
అది శృంగార సీన్ ఎలా అవుతుంది?.. మండిపడ్డ మెహ్రీన్
కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మెహ్రీన్ పీర్జాదా. తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ టాలీవుడ్ స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించింది. గతేడాది ఎఫ్3 సినిమాతో ప్రేక్షకులను అలరించిన మెహ్రీన్.. ఈ ఏడాదిలో ఓటీటీలోనూ అరంగేట్రం చేసింది. ఇటీవలే ఆమె నటించిన సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. అయితే ఈ సిరీస్‌లో ఆమె ఓ అత్యాచార సన్నివేశంలో నటించింది. అయితే ఈ సీన్ ప్రస్తుతం వివాదానికి దారితీసింది. ఆ సన్నివేశాన్ని కొందరు శృంగార సీన్‌గా అభివర్ణించడంపై మెహ్రీన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా రాయడం తనకు తీవ్ర బాధ కలిగించిందని ట్వీట్ ద్వారా వెల్లడించింది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!) మెహ్రీన్ ట్వీట్లో రాస్తూ.. 'ఢిల్లీ సుల్తాన్‌లో వైవాహిక అత్యాచారాన్ని చిత్రీకరించే ఓ సన్నివేశం ఉంది. మనదేశంలో ఇది తీవ్రమైన సమస్య. ఇలాంటి సమస్యను మీడియాలో చాలా మంది శృంగార సీన్‌గా అభివర్ణించడం నాకు బాధ కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలకు ఇది తీవ్రమైన సమస్య. ఈ విషయాన్ని ఇలా చెప్పడం సమస్యను చిన్నదిగా చూపించినట్లు అవుతుంది. సోషల్ మీడియాలోని వ్యక్తులు ఇలా చేయడం నన్ను కలవరపెడుతోంది. ఇలాంటి వారు తమకు సోదరీమణులు, కుమార్తెలు కూడా ఉన్నారన్న విషయం అర్థం చేసుకోవాలి. వారు తమ నిజ జీవితంలో అలాంటి బాధను ఎప్పటికీ ఎదుర్కోవద్దని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. మహిళలపై ఇలాంటి క్రూరత్వం, హింస అనే ఆలోచన చాలా అసహ్యకరమైనది.' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా నటుడిగా ఆ పాత్రకు న్యాయం చేయడం నా పని అని తెెలిపింది. మిలన్ లుథ్రియా సర్ నేతృత్వంలోని సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ బృందం చాలా కష్టతరమైన సన్నివేశాల షూటింగ్ సమయంలో నటులుగా మేం చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నామని పేర్కొంది. నేను చేసే పాత్ర మహాలక్ష్మి అయినా, సంజన అయినా, హనీ అయినా నా ఫ్యాన్స్ కోసం ప్రతి పాత్రలోనూ ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించింది. (ఇది చదవండి: అలాంటి పాత్రల్లో నటించను.. అదే నా కోరిక : మృణాల్ ఠాకూర్) Recently I made my OTT Debut in the web series, “Sultan of Delhi” on Disney Hotstar. I hope my fans have enjoyed watching the series. Sometimes scripts demand certain actions which might go against your own morals. As a professional actor who considers acting an art and at the… — Mehreen Pirzada👑 (@Mehreenpirzada) October 17, 2023 -
బాహుబలి కంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ చేశాను – సత్యరాజ్
‘‘వెపన్’లాంటి సినిమా తీయాలంటే డైరెక్టర్,ప్రొడ్యూసర్స్, సినిమాటోగ్రాఫర్, వీఎఫ్ఎక్స్.. ఇలా సాంకేతిక నిపుణులే కీలకం. వాళ్ల తర్వాత యాక్టర్స్‌కు ప్రాధాన్యత అని నా అబిప్రాయయం. ‘బాహుబలి’ కంటే ‘వెపన్’లో ఎక్కువ యాక్షన్ సీన్స్ చేశా. గుహన్ సరికొత్త విజన్‌తో తీశారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు సత్యరాజ్. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వెపన్’. మన్సూర్ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ‘‘సరికొత్త సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది’’ అన్నారు వసంత్ రవి. ‘‘మా బ్యానర్లో వస్తోన్న తొలి చిత్రమిది’’ అన్నారు మన్సూర్. ‘‘ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులున్నాయి’’ అన్నారు గుహన్ సెన్నియప్పన్. -
ఇటీవల యాక్షన్ షూట్లో దెబ్బతిన్న హీరోస్ వీళ్లే..
స్క్రీన్‌పై విలన్లను హీరో రఫ్ఫాడిస్తుంటే ఫ్యాన్స్‌కి కిక్కో కిక్కు.. కానీ ఆ యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు స్టార్స్‌కి తగిలే గాయాలు ఒక్కోసారి ఆపరేషన్‌కి దారితీస్తాయి. ఇక ఇటీవల యాక్షన్ షూట్లో పరేషాన్ అయిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. టైగర్‌కి గాయం ఐదు కేజీల డంబెల్‌ని అమాంతంగా ఎత్తగలిగే సల్మాన్ ఖాన్‌కి ఇటీవల ఐదు కేజీల కన్నా తక్కువ బరువు ఉన్న వస్తువులు ఎత్తడం కష్టమైంది. దానికి కారణం ‘టైగర్ 3’ సినిమా. ఈ చిత్రం కోసం నెలన్నర క్రితం ఓ రిస్కీ యాక్షన్ సీన్ చేస్తుండగా సల్మాన్ గాయపడ్డారు. ‘‘ప్రపంచాన్నే మన భుజం మీద మోస్తున్న ఫీలింగ్‌లో ఉన్నప్పుడు.. ఆ ప్రపంచాన్ని వదలండి.. ఇప్పుడు కనీసం ఐదు కిలోల డంబెల్ ఎత్తడం కూడా కష్టమవుతోంది’’ అని భుజానికి అయిన గాయం తాలూకు నొప్పిని తగ్గించే పట్టీ వేయించుకుని ఉన్న ఫొటోను షేర్ చేశారు సల్మాన్. అంతే.. ‘టైగర్ (సల్మాన్‌ని ఉద్దేశించి)కి ఏమీ కాదు... తగ్గిపోతుంది’ అంటూ ఫ్యాన్స్ స్పందించారు. కింగ్ ఖాన్.. నోస్ సర్జరీ షారుక్ ఖాన్ని ఆయన ఫ్యాన్స్ కింగ్ ఖాన్ అని పిలుచుకుంటారు. ఈ కింగ్ ఖాన్ ఫ్యాన్స్‌కి కిక్ ఇవ్వడానికి రిస్కీ ఫైట్స్ చేస్తుంటారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఓ చిత్రం కోసం యాక్షన్ సీన్ చేస్తూ, గాయపడ్డారు షారుక్. ముక్కుకి బలమైన గాయం కావడంతో సర్జరీ జరిగిందనే వార్త మంగళవారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో శస్త్ర చికిత్స జరిగిన అనంతరం షారుక్ ముంబై చేరుకున్నారట. ‘‘రక్త స్రావం ఆగడానికి ముక్కుకి చిన్నపాటి శస్త్ర చికిత్స చేశాం. కంగారుపడాల్సిన అవసరంలేదు’’ అని షారుక్ వ్యక్తిగత సిబ్బందికి డాక్టర్లు తెలియజేశారని బాలీవుడ్ టాక్. విక్రమ్.. రిస్కీ పోరాటమ్ విలక్షణ పాత్రలకు చిరునామా విక్రమ్. తాజాగా విక్రమ్ ఓ కొత్త లుక్‌లో నటిస్తున్న చిత్రం ‘తంగలాన్’. ఈ చిత్రం కోసం రిస్కీ ఫైట్ షూట్లో పాల్గొనే ముందు విక్రమ్ రిహార్సల్స్ చేశారు. అప్పుడు జరిగిన ప్రమాదంలో ఆయన పక్కటెముక విరిగింది. వెంటనే విక్రమ్‌ను ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల క్రితం ఈ ప్రమాదం జరిగింది. కోలుకున్నాక ఆయన తిరిగి షూట్లో పాల్గొనడంతో సినిమా పూర్తయింది. పృథ్వీ.. మూడు నెలల విశ్రాంతి మలయాళ పరిశ్రమలో ఓ స్టార్ హీరోగా, దర్శకుడిగా దూసుకెళుతున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విలయత్ బుద్ధ’. పది రోజుల క్రితం ఈ సినిమా కోసం ఒక యాక్షన్ సీన్‌ని ఆర్టీసీ బస్సులో చిత్రీకరిస్తున్నప్పుడు పృ«థ్వీరాజ్ కింద పడటంతో దెబ్బ తగిలింది. బలమైన గాయం కావడంతో కాలికి సర్జరీ చేయాలని వైద్యులు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స అనంతరం దాదాపు మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని పృథ్వీరాజ్‌కి సూచించారు. వరుణ్.. మూడు వారాల విశ్రాంతి వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది కానిస్టేబుల్’. ఈ చిత్రం కోసం ఇటీవల ఓ ఫైట్ సీన్ తీస్తున్న సమయంలో గాయపడ్డారు వరుణ్ సందేశ్. ఈ ప్రమాదంలో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయింది. దీంతో ఆయన్ని హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స అనంతరం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలంటూ వరుణ్‌కి సూచించారు వైద్యులు. వరుణ్ సందేశ్ గాయపడటంతో ‘ది కానిస్టేబుల్’ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. -
షేన్ వార్న్ బయోపిక్ రొమాంటిక్ సీన్ షూట్లో ఏం జరిగిందో చూడండి..!
-
అప్సర కేసులో పోలీసులు కీలక నిర్ణయం సాయి కృష్ణను..!
-
అలాంటి సీన్స్ చూసి నా భార్య ఫీలైంది: మనోజ్ భాజ్‌పేయి
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి తెలుగువారికి కూడా సుపరిచితమే. అల్లు అర్జున్ హీరోగా నటించిన హ్యాపీ సినిమాతో తన హావభావాలతో అదరగొట్టాడు. టాలీవుడ్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం తాను నటించిన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హైని మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మనోజ్ తన భార్య గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (ఇది చదవండి: అమ్మా, నాన్న చనిపోతే.. వారే అంతా పంచుకున్నారు: తేజ) అయితే తన భార్య షబానా తన సినిమా చూసి అవమానంగా భావించిందని మనోజ్ తెలిపారు. తెరపై హీరోయిన్లతో రొమాన్స్ చేసే సీన్స్ చేయడం తనకు ఇష్టం లేదని.. డబ్బు కోసం సినిమాలు చేయడం మానేయండని సలహా కూడా ఇచ్చిందని వెల్లడించారు. తన భార్య సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లగా.. కొంతమంది అమ్మాయిలు ఇదొక చెత్త సినిమా అన్నారని చెబుతూ బాధపడిందన్నారు. (ఇది చదవండి: అవార్డులు కొల్లగొట్టిన ఆలియా భట్ మూవీ..!) దయచేసి మీరు ఇలాంటి పాత్రలు చేయవద్దని.. కేవలం మంచి పాత్రలనే ఎంచుకోవాలని సూచించింది. కాగా.. మనోజ్ సత్యమేవ జయతే, బాఘీ 2 వంటి చిత్రాలలో కూడా కనిపించాడు. సత్యమేవ జయతే సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో తన ఫన్నీ క్యారెక్టర్ చూసి భార్య నవ్విందని మనోజ్ చెప్పుకొచ్చారు. -
'దసరా' డిలీటెడ్ సీన్.. కీర్తి సురేశ్ దడ పుట్టించేసిందిగా!
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ దసరా. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీలో కీర్తి, నాని నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సినీ ప్రముఖులు సైతం వీరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కీర్తి సురేశ్ పాత్రలో జీవించింది. అచ్చ తెలంగాణ యాసలో తన మాటలతో అభిమానులను కట్టిపడేసింది. ఈ చిత్రంలో తనకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషం. అయితే తాజాగా కీర్తి సురేశ్ తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియో తనపాత్రకు తానే డబ్బింగ్ చెబుతూ కనిపించింది. ఈ సీన్ సినిమా నుంచి తొలగించినట్లు కీర్తి వెల్లడించింది. కీర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ..' దసరా మూవీలో తొలగించిన సీన్ ఇది. ఆ సీన్‌కు నేనే డబ్బింగ్ చెప్పా. డబ్బింగ్ చెబుతున్నప్పుడు నన్ను చూసి అంతా టెన్షన్ పడ్డారు. డబ్బింగ్ ఒక అద్భుతమైన కళ.' అంటూ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో కీర్తి సురేశ్ తెలుగు డబ్బింగ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అచ్చ తెలుగులో.. అది తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పిన మహానటి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
సీన్ మధ్యలో సిబ్బంది.. అలా కూడా తీస్తారా?
సినిమాల్లో తప్పులు దొర్లడం మనం సాధారణంగా చూస్తుంటాం. కొన్ని సీన్లలో అనుకోకుండా పొరపాట్లు చేస్తుంటారు. అలాగే ఓ హాలీవుడ్లో వెబ్‌సిరీస్‌లోనూ అదే జరిగింది. ఓ సీన్ చిత్రీకరించేటప్పుడు సిబ్బంది కూడా ఆ సీన్లో కనిపించారు. అది గమనించని మేకర్స్ ఎపిసోడ్‌ను అలాగే రిలీజ్ చేశారు. ఇది గమనించిన ఫ్యాన్స్ ఆ సీన్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. హెచ్‌బీవో వారి ది లాస్ట్ ఆఫ్ అస్ వెబ్ సిరీస్ ఇప్పటికే భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రెండో సీజన్ కొనసాగుతోంది. అయితే ఆదివారం రిలీజైన కొత్త ఎపిసోడ్లో కొన్ని సన్నివేశాల్లో ఏకంగా సిబ్బంది కనిపించారు. ఓ అభిమాని వాటిని గుర్తించి ఆ సీన్ ఫోటోలు, వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు. అవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఏంటీ ఇలా కూడా సీన్స్ తెరకెక్కిస్తారా? అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ది లాస్ట్ ఆఫ్ అస్ కొత్త ఎపిసోడ్ - 'కిన్లో' జోయెల్ (పెడ్రో పాస్కల్), ఎల్లీ (బెల్లా రామ్సే), జోయెల్ సోదరుడు టామీ (గాబ్రియేల్ లూనా)తో తిరిగి కలుసుకుంటారు. ఈ ఎపిసోడ్‌కు మంచి ఆదరణ లభించగా.. ఇందులో అనేక మంది సిబ్బంది ఉన్నట్లు ఒక టిక్‌టాక్ యూజర్ గుర్తించాడు. ఈ సీన్లో జోయెల్, ఎల్లీ మంచుతో కప్పబడిన వంతెనపై నడుస్తున్నప్పుడు అక్కడ మిగతా సిబ్బంది కూడా కనిపించారు. జూమ్ చేసినప్పుడు ఆ సంఖ్య ఎక్కువగా కనిపించింది. Did NOT notice this until I saw the story on CNET and this tweet. Not a massive "flub" like a Starbucks cup in GoT. Actually I was more focused on how did they get this shot and the shot before this. (Drone?? If so, it was a very cool super steady shot.) #tlou #TheLastOfUsHBO pic.twitter.com/Xx6lopZULR — AC (@ACinPhilly) February 22, 2023 -
స్టార్ నటుడు చెంప చెళ్లుమనిపించిన జయప్రద? క్లారిటీ ఇచ్చిన దలీప్ తాహిల్
నటి జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటోంది. ఇదిలా ఉంటే ఆమె స్టార్ నటుడు దలీప్ తాహిల్ చెంప చెళ్లుమనిపించిందంటూ తరచూ బాలీవుడ్లో వార్తల చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ వార్తలపై తాజాగా నటుడు దలీప్ తాహిల్ స్పందించాడు. ఈ సందర్భంగా జయప్రద తనని కొట్టినట్లు వస్తున్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చాడు. 1986లో అమితాబ్ బచ్చన్-జయప్రద జంటగా ‘ఆఖ్రే రాస్తా’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో దలిప్ తాహిర్ విలన్‌గా చేశాడని, ఇందులో ఆయన జయప్రదను అత్యాచారం చేసే ఓ సన్నివేశం ఉందట. ఈ సీన్ షూటింగ్ సమయంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో జయప్రద ఆయనను చెంప దెబ్బ కొట్టినట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. తాజాగా దీనిపై ఆయన వివరణ ఇచ్చాడు. ‘‘జయప్రదతో కలిసి ఓ అభ్యంతరకర సన్నివేశంలో నటించానని, ఆ సీన్ షూటింగ్ సమయంలో ఆమె నన్ను కొట్టినట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను నేను కూడా విన్నాను. నేను కొంచెం దూకుడుగా వెళ్లానని, ఆమె నా చెంప చెళ్లు మనిపించినట్టు అందులో ఉంది. అసలు నేను జయప్రదతో కలిసి ఏ సినిమాలోనూ నటించనేలేదు. ఇది వాస్తవం. ఆమెతో కలిసి నటించాలనే ఆసక్తి ఉన్నా, ఆ అవకాశం మాత్రం రాలేదు. అలాంటప్పుడు ఇక అలాంటి సీన్ చేసే అవకాశమే లేదు కదా? ఈ కథనాలు రాసే వ్యక్తి పట్ల నాకు శత్రుత్వం లేదు. కానీ ఆ సీన్ చూపిస్తే సంతోషిస్తాను. సోషల్ మీడియాలో అసలు లేనివి కూడా పుట్టిస్తున్నారు’’ అంటూ దలీప్ తాహిల్ అసహనం వ్యక్తం చేశాడు. చదవండి: నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి నాన్నా: మహేశ్ ఎమోషనల్ ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్ -
అరుంధతి మూవీలో సీన్‌ను రీ కనస్ట్రక్ట్ చేసి మరీ... ఆత్మహత్యా యత్నం
తాగుడికి, మత్తుపదార్థాలకు అడిక్ట్ అవ్వడం గురించి విన్నాం. అలాగే సినిమాలకు అడిక్ట్ అయ్యే వాళ్లు గురించి కూడా తెలుసు. చాలావరకు హిరో లేదా హిరోయిన్ మాదిరిగా ప్రవర్తించడం వంటి పిచ్చి చేష్టలు చేస్తారని తెలుసు. కానీ ఆ సినిమాలో కథనాయిక ఎలా చనిపోయాడో అలా చనిపోవాలని మాత్రం అనుకోరు. ఐతే ఈ వ్యక్తి మాత్రం తన చూసిన సినిమాలో కథనాయకి ఎలా చనిపోయిందో అలానే చనిపోవాలని నిర్ణయించుకుని కన్నవాళ్లకు తీరని వేదన మిగల్చాడు.. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....కర్ణాటకలోని ఓ గ్రామంలోని 23 ఏళ్ల రేణుకా ప్రసాద్ అనే వ్యక్తి పదోతరగతి వరకు బాగా చదువుకున్నాడు. ఆ తర్వాత అతనికి సినిమాలంటే మోజు ఎలా పెరిగిందో తెలియదు గానీ దానికి అడిక్ట్ అయిపోయాడు. ఎంతలా అంటే ఆ సినిమాలో వాళ్లు ఏం చేస్తే అలా చేసేయాలనేంతగా వ్యామోహం పెంచేసుకున్నాడు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి ఇంటర్ కూడా చదవడం మానేశాడు. అతనికి అరుంధతి సినిమా అంటే మహా ఇష్టమట. ఏకంగా 15 సార్లు ఆ సినిమాని చూశాడని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఐతే ఆ సినిమాలో అనుష్క విలన్ పశుపతి నుంచి తన సంస్థానంలోని మనుషులను కాపాడుకోవడానికి ఎలా అయితే సాధువుల వద్దకు వెళ్లి ఎలా తనకు తానుగా చనిపోతుందో అలా తాను చనిపోవాలనుకున్నాడు. ఈ విషయం గురించి తన తల్లిదండ్రులతో పదే పదే చెప్పేవాడు కూడా. దీంతో వాళ్లు అతన్ని అది సినిమాని నిజంగా అలా చేయడం కుదరదని పలుమార్లు వారించారు కూడా. ఈ మేరకు సదరు వ్యక్తి తాను చెప్పినట్టుగానే సినిమా కథానియికిలా 20 లీటర్లు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటాడు. తాను చనిపోతున్న దాన్ని కూడా వీడియో తీసి మరీ వివరించాడు. అయితే స్థానికులు అతను మంటల్లో కాలిపోవడం చూసి రక్షించి ఆస్పత్రికి తరలించారు. కానీ సదరు వ్యక్తి 60 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో పోరాడుతూ.. ఆస్పత్రిలోనే మరణించాడని పోలీసులు తెలిపారు. (చదవండి: భార్య గర్భవతి.. మరో అమ్మాయితో టచ్‌లో భర్త.. చివరకు..) -
రామారావు ఆన్‌డ్యూటీ సీన్స్ లీక్...
-
అనంతపురంలో బ్లఫ్ మాస్టర్ సీన్
-
సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు
-
ఆకాశంలో వింత దృశ్యాలు.. నిమిషాల వ్యవధిలోనే
బత్తలపల్లి(అనంతపురం జిల్లా): సోమవారం తెల్లవారుజామున బత్తలపల్లి పరిసరాల్లో ఆకాశంలో వింత దృశ్యాలు గోచరించాయి. తూర్పున కాంతి వంతంగా కనిపించిన ఓ దృశ్యం కాసేపటికి రూపం మారి అదృశ్యమైంది. అలాగే దక్షిణాన శక్తివంతమైన వెలుగుతో మరో దృశ్యం గోచరించింది. తొలుత చిన్నదిగా కనిపించినా... నిమిషాల వ్యవధిలోనే పెద్దదిగా మారి మాయమైంది. ఈ దృశ్యాలను స్థానికులు సెల్ఫోన్లలో చిత్రీకరించారు. చదవండి: ఎక్కువరోజులు ఉండలేను.. హైదరాబాద్ వచ్చేస్తా.. సీన్ కట్ చేస్తే.. -
షూటింగ్ : అలాంటి సీన్లు చేయడానికి నో పర్మిషన్
ముంబై : మహారాష్ట్రలో అంతకంతకూ కరోనా కేసులు పెరుగుతూ, సినిమా షూటింగులు ఆగిపోతున్న నేపథ్యంలో అక్కడి సినీ కార్మికుల సమాఖ్య సరికొత్త షూటింగ్ మార్గదర్శకాలను జారీ చేసింది. అవి కచ్చితంగా అమలయ్యేలా చూసేందుకు ఓ పర్యవేక్షక బృందాన్ని కూడా ఏర్పాటుచేసింది. షూటింగ్లో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, గుంపులతో కూడిన దృశ్యాల చిత్రీకరణ ఆపేయడం లాంటి కోవిడ్–19 షూటింగ్ నియమావళిని కచ్చితంగా అమలయ్యేలా ఈ బృందం చూస్తుంది. మహారాష్ట్రలో, మరీ ముఖ్యంగా ముంబయ్‌లో కరోనా కేసులతో సినీ, టీవీ రంగంపై పెను ప్రభావం పడడంతో పశ్చిమ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఎఫ్.డబ్లు్య.ఐ.సి.ఇ) ఈ నిర్ణయం తీసుకుంది. అక్షయ్ కుమార్,ఆలియా భట్, విక్కీ కౌశల్, భూమి ఫెడ్నేకర్ సహా పలువురు ముఖ్యతారలు కరోనా బారిన పడడంతో ఇప్పటికే ‘రామ్ సేతు’, ‘గంగూబాయ్ కాఠియావాడీ’, ‘మిస్టర్ లేలే’ లాంటి పలు చిత్రాల షూటింగులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎఫ్.డబ్లు్య.ఐ.సి.ఇ. కార్యనిర్వాహక సభ్యులు శుక్రవారం నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో సమావేశమయ్యారు. ప్రభుత్వం పేర్కొన్న జాగ్రత్తలను సినీ, టీవీ పరిశ్రమ బాధ్యతాయుతంగా అనుసరిస్తుందంటూ హామీ ఇచ్చారు. ఈ నెలాఖరు దాకా అమలులో ఉండే సరికొత్త షూటింగ్ మార్గదర్శకాల ప్రకారం ఇకపై జనసమూహంతో కూడిన సన్నివేశాలనూ, పెద్ద సంఖ్యలో డ్యాన్సర్లున్న పాటలనూ చిత్రీకరించరాదు. అలాగే, ప్రీ–ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్–ప్రొడక్షన్లలో పాల్గొనేవారంతా జాగ్రత్తలు పాటించాలి. సమాఖ్యకు చెందిన పర్యవేక్షక బృందం షూటింగ్ లొకేషన్లు, పోస్ట్–ప్రొడక్షన్ స్టూడియోలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ, మార్గదర్శకాలను పాటిస్తున్నదీ, లేనిదీ చూస్తుంది. వ్యక్తులు కానీ, సంస్థలు కానీ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్య తీసుకుంటారు. అలాగే, ప్రతి శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం దాకా మహారాష్ట్ర సర్కార్ వారాంతపు లాక్డౌన్ పెట్టినందు వల్ల ఇకపై అక్కడ షూటింగులన్నీ మిగతా రోజుల్లోనే చేయనున్నారు. -
దేవతలు పంపిన రాయబారి!
కెంపరాజ్ నిర్మాణ, దర్శకత్వంలో భానుమతి ప్రధాన పాత్ర పోషించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘నారద మునీంద్రులకు నమస్కారం. విశేషములు ఏమైనా కలవా?’’ నారదుడిని అడిగారు అగ్నిదేవుడు, వరుణదేవుడు, దేవేంద్రుడు, యమధర్మరాజు. ‘‘త్రిభువనసుందరి, విదర్భ రాజకుమారి స్వయంవరమే ఒక అపూర్వవిశేషం. ఆమె రూపలావణ్యాల ముందు రంభ, ఊర్వశీ, మేనక దిగదుడుపు’’ అని చెప్పాడు నారదుడు. ‘‘అయితే నేను ఆమెను వివాహమాడతాను’’ అన్నారు ఆ నలుగురిలో ఒకరు. ‘‘అదిమాత్రం సాధ్యం కాదు’’ అని చెప్పాడు నారదుడు. ‘‘ఎందువల్ల?’’ మూకుమ్మడిగా అడిగారు ఆ నలుగురు. ‘‘ఆమె ఏనాడో నలసార్వభౌముడిని మనసారా ప్రేమించి అతనినే వివాహమాడాలని త్రికరణశుద్ధిగా నిర్ణయించుకుంది’’ అసలు విషయం చెప్పాడు నారదుడు. ‘‘మునీంద్రా! స్వయంవరంలో నా ముఖం చూసిన తక్షణం నన్నే వరిస్తుంది’’ ధీమాగా అన్నాడు యమధర్మరాజు. ‘‘ఆమె దృఢసంకల్పం మార్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు’’ తనకు తెలిసిన సత్యాన్ని చెప్పాడు నారదుడు. ‘‘మాకంటే అతడే ఎక్కువా?’’ నలమహారాజును దృష్టిలో పెట్టుకొని అడిగాడు దేవేంద్రుడు. ‘‘ఎక్కువో తక్కువో మీరే నిశ్చయించుకోండి’’ అని ఆ బాధ్యత వారి భుజాల మీదే పెట్టి అక్కడి నుంచి కదిలాడు నారదుడు. అగ్నిదేవుడు, వరుణదేవుడు, దేవేంద్రుడు, యమధర్మరాజులు నలమహారాజు ముందు ప్రత్యక్షమయ్యారు. ‘‘తాము ఎవరో తెలుసుకోవచ్చా?’’ అడిగాడు నలుడు. ‘‘వీరు వరుణదేవుడు’’ ‘‘వీరు అగ్నిదేవుడు’’ ‘‘వీరు దేవేంద్రుడు’’ ‘‘వీరే యమధర్మరాజు’’ పరిచయాలు పూర్తయ్యాయి. ‘‘ఆహా! దేవతామూర్తులా... అనేక జన్మల పుణ్యఫలం వల్ల కూడా లభించని మీ దర్శనభాగ్యంతో నా జన్మ చరితార్థం అయింది. ఏ సేవలు చేసి మిమ్మల్ని రంజింప చేయాలో ఆజ్ఞాపించండి’’ సంతోషంగా అడిగాడు నలమహారాజు. ‘‘నలరాజా! నీవల్ల మాకో ఉపకారం కావాలి’’ అడిగాడు దేవేంద్రుడు. ‘‘కామధేనువు, కల్పవృక్షం పెరట్లో ఉన్న మీకు సామాన్య మానవుడి వల్ల కావలసిన ఉపకృతి ఏముంటుంది స్వామి! నన్ను పరీక్షిస్తున్నారా? పరిహసిస్తున్నారా!’’ అడిగాడు నలమహారాజు. ‘‘పరీక్ష కాదు పరిహాసం కాదు. చేస్తానని వాగ్దానం చెయ్యి’’ అడిగాడు యమధర్మరాజు. ‘‘ఎందుకా సందేహం? ఇక ఆనతి ఇవ్వండి’’ అని అడిగాడు నలమహారాజు. ‘‘చక్రవర్తీ! నువ్వు దమయంతిని చూశావా?’’ అడిగాడు దేవేంద్రుడు. ‘‘లేదు స్వామి!’’ అని బదులిచ్చాడు నలుడు. ‘‘నిన్నే వరించి వివాహమాడబోతున్నదట’’ ఒకింత ఈర్ష్యతో అన్నాడు వరుణుడు. ‘‘అయితే నేను చాలా అదృష్టవంతుడిని. ఆమె అనురాగానికి పాత్రుడిని కావడం తమవంటి అమరుల ఆశీర్వాద ఫలితం. నా జన్మ పావనం అయింది’’ అని సంతోషంలో తేలిపోయాడు నలమహారాజు. ‘‘చక్రవర్తీ! సంతోషంతో మైమరచిపోతున్నావు. మరచిపోవాల్సింది దమయంతిని’’ కఠినంగా అన్నాడు యమధర్మరాజు. ‘‘దమయంతి సౌందర్యం గురించి మేము ఆలకించాం. ఆమెను వరించాలనుకుంటున్నాం. ఆమెను సమీపించి మాలో ఏ ఒకరినైనా వరించమనే సందేశం అందించాలి. చెప్పి ఒప్పించాలి’’ అన్నాడు దేవేంద్రుడు. ‘‘స్వామీ! ఏమిటీ పరీక్ష? నేను దమయంతిని గాఢంగా ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నన్ను ఈ కార్యభారానికి వినియోగించడం సమంజసమా?’’ బాధగా అన్నాడు నలమహారాజు. ‘‘వాగ్దానం చేశావు. మాట నిలుపుకోవడం నీవంతు’’ గుర్తు చేశాడు యమధర్మరాజు. ‘‘దమయంతిపై మరులుగొన్న చక్రవర్తికి తన వాగ్దానం జ్ఞాపకం ఉంటుందా?’’ వెటకారంగా నవ్వాడు దేవేంద్రుడు. ‘‘హరిశ్చంద్రునితోనే సత్యం స్వర్గానికి వేంచేసింది’’ అంటూ దేవేంద్రుడి వెటకారానికి శ్రుతి కలిపాడు వరుణదేవుడు. ‘‘క్షమించండి. ఆడి తప్పే అధముడిని కాదు’’ అన్నాడు నలమహారాజు. ఈ మాటతో దేవతల కళ్లు సంతోషంతో వెలిగాయి. ‘‘కానీ అంతఃపురంలో నివసించే రాకుమారిని ఏకాంతంలో సందర్శించడం ఎలా సాధ్యం?’’ తన మనసులోని సందేహాన్ని దేవతల ముందు పెట్టాడు నలుడు. అప్పుడు వారు అతని చేతిలో ఒక ముద్రిక పెట్టి.... ‘‘ఇదిగో శంబరీ ముద్రిక. దీనిని ధరించి అదృశ్యరూపుడవై అంతఃపురంలో ప్రవేశించు. నీ ధర్మం, మా వాంఛ నెరవేరుతుంది’’ చెప్పారు దేవతలు. శంబరీ ముద్రిక సహాయంతో దమయంతి ఏకాంత మందిరంలోకి ప్రవేశించాడు నలమహారాజు. అతడిని చూసి ‘‘ఎవరు మీరు?’’ అని ఆశ్చర్యపోయింది దమయంతి. ‘‘నేను దేవదూతను. నీతో ఏకాంతంగా సంభాషించడానికి రాచమర్యాదను ఉల్లంఘించాను’’ చెప్పాడు నలుడు. ‘‘ఏకంత ప్రసంగమా? ఏమది?’’ అడిగింది దమయంతి. ‘‘ఈ కమనీయ విగ్రహం, చందమామలాంటి ముఖం, అందాలు చిందే నీ చిరునవ్వులు అపూర్వం, అనిర్వచనీయం. సురలకు కూడా అలభ్యమైన ఈ సుందరాకృతి, సుగుణసంపత్తి...’’ చెప్పుకుపోతున్నాడు నలుడు. ‘‘చాలించండి మీ వర్ణన’’ మధ్యలోనే ఆపేసింది దమయంతి. ‘‘ఈ వర్ణన విని ఇంద్రుడు, అగ్ని, యముడు, వరణుడు ముగ్ధులై మైమరిచి...’’ అంటుండగానే మళ్లీ అడ్డుపడి– ‘‘మీరు మైమరచిపోతున్నారే’’ అన్నది దమయంతి. ‘‘వారు మైమరచిపోయి నీ ప్రేమభిక్ష కోరుతున్నారు. వారి వలపు వేడుకోలు విన్నవించమని నన్ను రాయబారిగా పంపారు. మహత్తరశక్తులు కలిగిన దేవతలు బలాత్కారంగా నిన్ను తీసుకువెడితే చేయగలిగింది ఏముంది?’’ అన్నాడు నలుడు. ‘‘ప్రాణత్యాగం చేస్తాను. నా మనసును ఏనాడో ఆ నలసౌర్వభౌమునికే అర్పించాను’’ దృఢంగా చెప్పింది దమయంతి. ‘‘ఒకవేళ నలసార్వభౌముడే నీ ప్రేమను నిరాకరిస్తే?’’ ఆమె కళ్లలోకి చూస్తూ సూటిగా అడిగాడు నలుడు. -
తోట రాసుకున్న కమ్మని కవితలే ఈ పూలట!
కళను గుండెకు హత్తుకున్న సినిమాలోని దృశ్యాలు ఇవి.కవిత్వం పైరగాలితో కలిసి గజ్జెకట్టిన ఈ సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం.. పచ్చని పొలాల దగ్గర కూర్చొని రాసుకుంటున్నాడు కాశీ.అక్కడికి కీర్తన వచ్చింది.‘‘నేను కొన్ని స్వరాలు రాశాను. నువ్వు నాట్యం చేయాలి’’ అన్నాడు కీర్తనను చూస్తూ.‘‘ఏ రాగం?’’ అని అడిగింది ఆమెచిలిపిగా.‘‘అనురాగం’’ అన్నాడు అంతకంటే చిలిపిగా.‘‘తెలిసో తెలియకో ఏదో రాసుకుంటే రాగం అడుగుతావా?’’ అంటూనే స్వరాలవీణ మీటాడు కాశీ.పచ్చని పంటపొలాలు ప్రేక్షకులయ్యాయి. గాలికి తలలు ఊపుతూ బ్రహ్మాండం అంటున్నాయి.‘‘వండర్ఫుల్. బ్యూటిఫుల్. ఈ ఏకాంత ప్రదేశంలో మీ నాట్యం చాలా బాగుంది. గోదావరి ప్రవాహంలాస్పాంటేనియస్ ఉంది’’ అన్నాడు అతడు.అతడు కాశీ కాదు...శ్రావణ్!శ్రావణ్ గొప్ప చిత్రకారుడు.కళ ఉన్న వాళ్లను నెత్తిన మోసే మంచివాడు.‘‘ఈవిడ కీర్తన. పరమేశ్వరశాస్త్రిగారి అమ్మాయి’’ అని ఒకవైపు కీర్తనను పరిచయం చేస్తూనే ‘‘నా పేరు కాశీ’’ అని పరిచయం చేసుకున్నాడు.కొన్ని మాటలైన తరువాత ‘‘కమాన్ లెట్స్ గో. రండి’’ అని తన ఇంటికి ఆ ఇద్దరిని తీసుకెళ్లాడు శ్రావణ్.‘‘దిసీజ్ మై వరల్డ్. నేను అమెరికాలో ఉండగా ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద వ్యాసాలు రాశాను’’ అని చెప్పుకొని పోతున్నాడు శ్రావణ్. గోడకు ఉన్న శ్రావణ్ చిత్రాలను చూస్తూ, ఆ తన్మయంలో...‘‘రంగుల కవితల్లాగా ఉన్నాయి’’ అన్నాడు కాశీ.‘‘మీకు పోయెట్రీ అంటే ఇష్టమా?’’ కాశీ మాటల ధోరణిని గమనిస్తూ అడిగాడు శ్రావణ్.‘‘ఇష్టమా? ప్రాణం! ఇవి చూడండి’’ అంటూ కాశీ చేతులోని కాగితాలను శ్రావణ్‌కు ఇచ్చింది కీర్తన.‘వానవేణి తోటినీలవీణ మీటినీలినింగి పాటే ఈ చేలట!కాళిదాసులాంటిఈ తోట రాసుకున్నకమ్మని కవితలే ఈ పూలట!’‘‘ఫెంటాస్టిక్...కవి జీవితాన్ని రెండు ముక్కల్లో చెప్పారు. యస్, కళాకారుడికి కావల్సింది ఇన్స్పిరేషన్ ప్లస్ అభినందన’’ అని పులకరించిపోయాడు శ్రావణ్.‘‘కాశీ ప్రతి పలుకులో కవిత్వం ఉంటుంది.కానీ అది తానొక్కడికే పరిమితం’’ అన్నది కీర్తన.‘‘ఇట్స్ ఏ క్రైమ్. ప్రపంచం కవిని గుర్తించకపోవడం ఎంత నేరమో... కవి ప్రపంచాన్ని పట్టించుకోకపోవడం అంతే నేరం’’ హితబోధలాంటిది చేశాడు శ్రావణ్.‘‘ఏదో ఆవేశం వచ్చినప్పుడు గుండె గొంతుకలో పుట్టిన మాటే పాటైపోతుంది. దానికి ప్రేరణ ఇస్తుంది కీర్తన’’ అని తనను తాను తగ్గించుకున్నాడు కాశీ.‘‘ఈజ్ ఇట్. డిఫెనిట్గా అలాంటి ఎంకరేజ్మెంట్ ఉండాలి. నాకు అలాంటి తోడు లేకపోవడం వల్లే ఇన్నాళ్లు నా ఘోషను కన్నీటిరంగుల్లో కలిపి కాన్వాస్ ఎక్కించాను’’ మనసులో మాట చెప్పాడు శ్రావణ్. సముద్రపు ఒడ్డున ఆశ్రమంలాంటి ఇల్లు అది.‘‘అమ్మా’’ అంటూ ఇంట్లోకి వచ్చాడు కాశీ.అమ్మ పలక లేదు. అలిగింది!‘‘ఇప్పుడు సముద్రం కూడా నీలాగే గంభీరంగా ఉంటే నవ్వు గుర్తొచ్చి వచ్చేశాను.కొంతసేపటికి నీలాగే తాడంత పైకి లేచి వెంటనే తగ్గిపోయింది. గంగమ్మ తల్లికి కోపం వస్తే దండం పెడితే తగ్గిపోతుంది. మరి మా అమ్మకో!’’ అని అమ్మను ఐసు చేసే ప్రయత్నం చేశాడు కాశీ.‘‘అన్నం పెడతావా! నువ్వు తిన్నావా?’’ అని అడిగాడు.‘‘ఆ...కడుపు నిండిపోయింది’’ అంటూ అలకను కంటిన్యూ చేసింది ఆ తల్లి.‘‘నువ్వు తినలేదని నాకు తెలుసులే. నేనొక్కడినే తినేస్తా. అయినా నీ కోపం ఎంతసేపు’’ అంటూ అటు వెళ్లి తినడం మొదలుపెట్టాడు.రాగం తీస్తున్నప్పుడు గొంతుకేదో అడ్డం పడి దగ్గాడు.అంతే...ఆ తల్లి కొడుకు దగ్గరికి పరుగెత్తుకు వచ్చింది.‘‘గొంతుకు అడ్డం పడితే ప్రమాదం రా. ఇదిగో నీళ్లు తాగు’’ అని గ్లాసు చేతికి ఇచ్చింది.‘‘తల్లివి నువ్వుండగా ఆ యముడు కూడా అడ్డం పడలేడు’’ అని నవ్వాడు కాశీ. యముడు అమ్మను తీసుకెళ్లాడు.‘‘అమ్మనే కాదు నా జీవితాన్నే తీసుకెళ్లాడు’’ అని దుఃఖంలో మునిగిపోయాడు కాశీ.పక్కన కూర్చొని ధైర్యం చెబుతున్నాడు శ్రావణ్...‘‘చూడు కాశీ... జీవితం అశాశ్వతం.అంతా ఒకప్పుడు పోవాల్సిందే అనే చెత్త ఫిలాసఫీని నేను మాట్లాడను. ఎందుకంటే అది ఫ్యాక్ట్ కాబట్టి. నువ్వు ఒక కళాకారుడివి. నీ బాధనంతా ఆర్ట్‌లో ట్రాన్స్‌ఫార్మ్ చేసి ప్రజలకు వినిపించు.వాళ్లనిస్పందింపజెయ్. నీ రాతలు తమకు అర్థం కాకపోయినా ఆ రాతలన్నీ గొప్పవని, నవ్వు గొప్పవాడివవుతావని నీ తల్లి కలలు కన్నది. ఆ కలను నిజం చెయ్’’కాశీలో ఎలాంటి చలనం లేదు.మౌనం, నిర్లిప్తత, కొండంత నిరాశ.... అతడి పక్కన పీఠ వేసుకొని కూర్చున్నాయి.దూరంగా పిల్లలు సముద్రమంత సంతోషాన్ని కళ్లలో నింపుకొని ఇసుకలో ఆడుకుంటున్నారు.‘‘వాళ్లను చూస్తే నాకు ఆనందంగా ఉంది. ఎప్పుడూ సముద్రంలా సంతోషంగా ఉండాలి’’ కాశీలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశాడు శ్రావణ్.అప్పుడు కాశీ ఇలా అన్నాడు:‘‘సముద్రం ఎప్పుడూ ఉప్పొంగుతుంది. కానీ అది సంతోషమో, విషాదమో తెలుసుకోవడం కష్టం’’ -
అచ్చోసిన అబద్ధం!
ఇవ్వాళ ఒక అబద్ధం చెప్పడానికి అలవాటు పడినవాడు...రేపు వంద అబద్ధాలు చెప్పడానికైనా వెనకాడడు. వ్యసనాల బారిన పడ్డవాడు మొదట సుఖంగా ఉన్నట్లు అనిపించినా ఆ తరువాత అతడి జీవితం ఎలా కష్టాలమయమవుతుందో చెప్పే చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇవి. సినిమా పేరు చెప్పుకోండి చూద్దాం... ఆ కుర్రాడు రిటైర్డ్ జడ్జీగారి చిన్న కొడుకు.దేవుని ఎదుట ప్రమాణం చేసినా చేయకపోయినా....అన్నీ అబద్ధాలే చెబుతాడు.నమ్మినవాళ్లకు నమ్మినన్ని అబద్ధాలు!ఈ కుర్రాడు ఒక్క రోజూ కూడా కాలేజీకి డుమ్మా కొట్టడు. కారణం చదువు మీద శ్రద్ధ కాదు. అమ్మాయిల మీద శ్రద్ధ!అందుకే ఈ కుర్రాడు మరియు అతని అనుచరగణం ఎప్పుడు బయటికి వెళతారో అని చూస్తుంటాడు లెక్చరర్.అదిగో ఆ క్లాస్ వైపు చూడండి...‘‘అందరికీ ప్రెజెంట్ అని వేశాను’’ అన్నారు లెక్చరర్‌గారు అప్పుడే వచ్చిన ఆ కుర్రగ్యాంగ్ను చూస్తూ.‘‘థ్యాక్సండీ’’ అని లెక్చరర్గారికి కృతజ్ఞతలు చెప్పి స్నేహితుల వైపు తిరిగి..‘‘అటెండెన్స్ అయిపోయింది. ఇక మనం వెళదాం’’ అని పిలుపునిచ్చారు అబ్బయిగారు.‘‘అటెండెన్స్ అయిపోగానే అదృశ్యమైపోతే మాస్టారుగారు రోదిస్తారురా’’ వెక్కిరింపు గొంతుతో అన్నాడు ఆ గుంపులో ఒకడు.‘‘ఆయనేం ఫీల్ అవ్వరురా. హాయిగా పండగలా ఫీలై పాఠాలు చెబుతారు’’ అసలు నిజాన్ని ఆవిష్కరించాడు మరొకడు.‘‘నిజంగానా, అయితే రాండ్రా వెళ్లిపోదాం’’ అని అమాయకపు ముఖం పెట్టాడు జడ్జిగారి అబ్బాయి.ఒకడు వెళుతూ వెళుతూ లెక్చరర్గారిని ఇలా ఆశీర్వదించాడు...‘‘పాఠాలు బాగా చెప్పి మంచి పేరు సంపాదించుకోండి. అప్పుడే ప్రమోషన్ వచ్చి ప్రిన్సిపల్ అవుతారు’’‘‘వెళ్లొస్తాం సార్’’ అన్నాడు ఒకడు లెక్చరర్‌కి నమస్కరిస్తూ.‘‘మీదే ఆలస్యం’’ అన్నారు లెక్చరర్.గుంపు క్లాస్ విడిచి బయటికి వెళ్లింది. ‘హమ్మయ్య’ అనుకున్నారు లెక్చర్గారు మరియు విద్యార్థులు.వాళ్లు కాలేజీ నుంచి సరాసరి క్లబ్బుకు వెళ్లారు.ఏ అర్ధరాత్రో ఇంటికి తిరిగొచ్చారు అబ్బాయిగారు.‘‘అదేనమ్మా నడిరోడ్డు మీద లారీ కొట్టీ బామ్మ రోడ్డు మీద రక్తంలో మెడ తెగిన కోడిలా గిలగిలా కొట్టుకుంటుంటే’’‘‘శివా శివా... ఇక చెప్పకురా బాబు. ఆ ఘోరాన్ని వినలేను. ఇంతకీ ఆమె ప్రాణాలతో ఉందా?’’ అడిగింది పార్వతి.‘‘నేనే లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది. అర్ధరాత్రి అయినా అమ్మ తిట్టినా సరే అని బామ్మగారిని హాస్పిటల్లో చేర్పించాను. రక్తం తక్కువైతే నా రక్తం ఇచ్చా. దేవతలాంటి ఈ తల్లి రక్తం పంచుకు పుట్టాను. ఇందులో కాస్త అమ్మకు ఇవ్వాలనుకున్నాను. తప్పంటావా అమ్మ?’’ నాటకీయంగా మెలికలు తిరిగారు అబ్బాయిగారు.ఆ పిచ్చితల్లి నిజంగానే నమ్మింది!‘‘తప్పేముంది బాబూ! ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడం లక్ష పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఒకటే. కానీ నువ్వు ఇలా ఆలస్యంగా వచ్చావని మీ నాన్నకు తెలిస్తే కారణం ఏమైనా సరే ఆయన మండిపడతారు’’ ఒకవైపు కొడుకును మెచ్చుకుంటూనే రాబోయే ప్రమాదాన్ని గురించి చెప్పింది పార్వతి.ఆ ప్రమాదం దగ్గరికి రానే వచ్చింది.‘‘మండిపడతారు కాదు పడుతూనే ఉన్నాను’’ అన్నారు తల్లికొడుకుల దగ్గరికి వచ్చిన జడ్జిగారు చుట్టకాలుస్తూ.‘‘కాలం విలువ తెలియకుండా వీడు తిరగడం, ఏంట్రా అని అడిగే లోపల ఏదో హరికథ, బుర్రకథ వినిపించడం నువ్వు నమ్మడం’’ అంటూ భార్యపై కన్నెర్రచేశారు జడ్జిగారు.‘‘బుర్రకథ ఏమిటండీ! ఎవరో బామ్మ చనిపోబోతుంటే..’’ అని ఆ పార్వతమ్మ అమాయకంగా అంటుంటే...పుత్రుడుగారు అందుకున్నారు... ‘‘అదేనమ్మా...బామ్మగారి బుర్ర బద్దలైపోయింది కదా. అందుకే బుర్రకథ అంటున్నారు నాన్నాగారు’’‘‘నోర్ముయ్. నువ్వు చెప్పే అబద్ధాలు మీ అమ్మలాగే నేను నమ్ముతాననుకుంటున్నావా?’’ అంతెత్తున లేచారు జడ్జిగారు. ‘‘దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను.అబద్ధం చెప్పను. నిజంగా ఒక బామ్మగారికి యాక్సిడెంట్ జరిగింది’’ నాన్నను నమ్మించబోయాడు కొడుకు.‘‘ఛస్తే నమ్మను’’ అన్నారు ఆయన ముఖం అదోలా పెట్టి.‘‘రిటైర్డ్ జడ్జిగారు కదమ్మా. కోర్టులో ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పే సాక్షులను చూసీ చూసీ నాదీ అబద్ధమే అనుకుంటున్నారు’’ అని లేని బాధను తెచ్చుకున్నారు అబ్బాయిగారు. అమ్మ చేతిని తన చేతిలో తీసుకొని...‘‘అమ్మా...అన్నం పెడుదువుగాని రా’’ అన్నాడు.‘‘వాడికి పెట్టాల్సింది అన్నం కాదు గడ్డి. చదువు, సంధ్య వదిలి, పరువు మర్యాద మరిచి పశువులా తిరిగేవాడికి గడ్డి పెట్టాలి గడ్డి’’ అని ఉరిమారు జడ్జిగారు.‘‘అర్ధరాత్రి ఇంటికి వచ్చిన బిడ్డను తిండి తిన్నావా? లేదా? అని అడగడం మానేసి ఇంతసేపు చీవాట్లు పెట్టడం చాలక గడ్డిపెట్టాలట. పాపం పసివాణ్ణి చేసి అస్తమానం మాటలు అనడమే మీ పని’’ అంటూ పార్వతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.‘‘ఊరుకోమ్మా...ప్రపంచంలో ప్రతి మహాత్ముడు మొదట్లో పదిమంది చేత ఇలా మాటలు పడ్డవారే. వీటిని పట్టించుకోకు’’ అంటూ తనకు తానే మహాత్ముడి హోదా ఇచ్చేసుకున్నారు అబ్బాయిగారు.‘‘ఛీ...నువ్వెందుకు పట్టించుకుంటావురా. అసలు నీకు సిగ్గు, అభిమానం ఉండి ఛస్తేగా’’ అని కొడుకును తిట్టి ఆ తిట్లలో సగం భార్యకు ఇలా పంచారు జడ్జిగారు.‘‘పసివాడు పసివాడు అని గారాబం చేసి పనికిమాలినవాడిని తయారుచేశావు’’పెద్దకొడుకు, రెండో కొడుకును గుర్తు తెచ్చుకుంటూ ఇలా అన్నారు...‘‘ఆ పెద్దవాళ్లిద్దరూ నా పెంపకంలో పెరిగారు కాబట్టి పరువు దక్కించే పద్ధతిలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. మరి వీడు?’’‘‘అవుతాడు నాన్నాగారు అవుతాడు. వీడు గొప్పవాడవుతాడు. తొందరపడవద్దు’’ అన్నారు అబ్బాయిగారు.‘‘నువ్వా! నాకు కొరివి పెట్టేలోగా నా పేరు ప్రతిష్ఠలకు నిప్పెడతావు. నేను బూడిదయ్యేలోగా ఈ ఇంటిపేరు మట్టిపాలు చేస్తావు’’ అని గట్టిగా అరిచారు జడ్జిగారు.‘‘అబ్బా! వేళాపాళా లేకుండా ఏమిటండీ ఆ అపశకునపు మాటలు’’ అని భర్తను సముదాయించడానికి ప్రయత్నించింది పార్వతమ్మ. -
నక్కజిత్తుల నాగన్న
రాజస్థాన్ ఎడారుల్లో, సట్లెజ్ నదీ తీరంలో, సిమ్లా మంచుకొండల్లో చిత్రించిన తొలి తెలుగు కౌబాయ్ చిత్రంలోని సన్నివేశాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... తమలో తామే ఏదో గొణుక్కుంటున్నాయి నదిలో నీళ్లు. నది ఒడ్డున రాళ్లు ఎప్పటిలాగే గంభీరంగా ఉన్నాయి. ఉన్నట్టుండి పెద్దగా కేకలు. ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిని కట్టేసి తీసుకువస్తున్నారు.‘నడు’ ‘నడు’ అంటూ మెడపట్టి గెంటుతున్నారు.‘‘పొడుస్తారెందుకయ్యా...నడుస్తున్నాగా. పొడిస్తేగానీ నడవకపోవడానికి నేనేమన్నా దున్నపోతునా?’’ ఉక్రోషంగా అంటున్నాడు నల్లచారల పంట్లాం వ్యక్తి.‘‘నీకంటే అదే నయం’’ అన్నాడు ఆ ముగ్గురిలో ఒకడు.మరొకడేమో...‘‘నీలాంటి పచ్చినెత్తురు తాగే బందిపోటుకు ఒకటే శిక్ష’’ అన్నాడు.‘‘ఏమిటీ మాటి మాటికి డొక్కలో పొడవడమా’’ వ్యంగ్యాలు పోయాడు నల్లచారల పంట్లాం.‘‘కాదు. ఉరి తీయడం’’ అని తేల్చి చెప్పాడు ఆ ముగ్గురిలో ఒకడు.‘‘తల్లి ముండమొయ్య...ఎంత సులభంగా చెప్పావయ్యా! నేనేమన్నా కావాలని దొంగతనం చేస్తున్నానా? ఈలోకంలో డబ్బు ఉంటేగానీ జరగదు. అందుకని దారి వెంట పోతున్న డబ్బుగల ముసాఫీర్లను ఆపుతాను. మీ దగ్గర ఉన్న డబ్బంతా ఇస్తారా? లేకపోతే చంపమంటారా? అంటాను. వాళ్లు ఉన్నదంతా ఎప్పుడు ఇచ్చింది లేదు.నేను అన్నమాట తప్పింది లేదు’’ తన తోడేలు ముఖం మీద మేకతోలు కప్పుకుంటూ అన్నాడు నల్లచారల పంట్లాం. ‘‘అన్నమాట మేమూ తప్పం. మా బాబాయ్‌ని చంపిన వాడి చర్మం వొలిపిస్తామని మేమూ అనుకున్నాం. మా ఊళ్లో నట్టనడివీధిలో అనుకున్నంత పని చేస్తాం’’ పండ్లు పటపటమని కొరికాడు ఆ ముగ్గురిలో ఒకడు. ఇంతలో అటువైపు నుంచి పిడుగులాంటి మాట...‘‘అతడిని వదిలేయండి’ అతను కౌబాయ్‌లా ఉన్నాడు.‘‘ఈ నక్క జిత్తుల నాగన్న గురించి నీకు తెల్వదు పోవయ్యా’’ అని విసుక్కున్నాడు ఆ ముగ్గురిలో ఒకడు.‘‘వీడి సంగతి మీ కంటే నాకే ఎక్కువ తెలుసు’’ అన్నాడు ఆ కౌబాయ్.‘‘ఏందబ్బాయా...నా సంగతి నీకు కూడా తెలుసా ఏమిటి!’’ అని గర్వంగా ఫీలైపోయాడు నక్కజిత్తుల నాగన్న.‘‘వదిలేయండి’’ మరోసారి అడిగాడు కౌబాయ్.‘‘పట్టుకుంది వదిలేయడానికి కాదు. వీడి ప్రాణం తియ్యనిదే వదిలిపెట్టం. నువ్వు వీడి చుట్టమైతే చెప్పు నీ సంగతి కూడా తేల్చుతాం’’ అని బెదిరించబోయారు ఆ ముగ్గురు. అంతే...ఎముకల్లో సున్నం లేకుండా బాది వాళ్లను పరుగెత్తించాడు కౌబాయ్.నక్కజిత్తుల నాగన్న ఆనందనానికి అవధులు లేవు. పట్టరాని ఆనందంతో అన్నాడు...‘‘తస్సదియ్య. భలే మొనగాడివిలే. నీ పేరేమిటి అబ్బాయా? దీపం పెట్టి తలుచుకుంటాను’’‘‘దీపాలు ఆర్పడమేకానీ పెట్టడం నీకు చాతకాదని నాకు తెలుసులే’’ అని నాగన్న పరువును నది ఒడ్డుకు ఈడ్చాడు కౌబాయ్.‘‘అబ్బా! తల్లిముండమొయ్య. నా జాతకం నీకు బాగా తెలుసన్నమాట’’ నీళ్లు నమిలాడు నాగన్న.నాగన్న గురించి కౌబాయ్‌కి ఎంతగా తెలుసంటే. అతని మాటలోన్లే వినండి...‘‘నిన్ను సజీవంగా పట్టిస్తే వెయ్యి వరహాలిస్తామని నూజివీడు సంస్థానంలో ప్రకటించిన విషయం తెలుసు. రెండు వేలిస్తామని గుంటూరు సర్కారులో చాటింపు వేయించిన విషయం తెలుసు. మూడువేలిస్తామని కర్నూల్ సుభాలో దండోరావేయించిన విషయం తెలుసు’’ ఇది విని ఆందోళనపడాల్సిందిపోయి, తెగ ఆనందపడుతూ తబ్బిబ్బైపోతూ అన్నాడు నాగన్న... ‘‘అబాయా! చూసావా మన ధర ఎట్టా పెరిగిపోతుందో. ఏనుగు బతికినా వెయ్యివరహాలే చచ్చినా వెయ్యివరహాలే’’ ఇంతలోనే అతనికి చేతికున్న కట్లు గుర్తుకొచ్చాయి. ‘‘అదిసరేగానీ చాకు ఉంటే కాస్త కట్లు కోసేయ్ అబాయా. మా చెడ్డ బాధగా ఉంది’’ అని బతిమిలాడుకున్నాడు.విప్పడం మాట దేవుడెరుగు...ఆ చేతులకు కొత్త కట్లు కట్టాడు కౌబాయ్.డంగైపోయాడు నాగన్న!‘‘ఉన్న కట్లు విప్పడం మానేసి...కొత్త కట్టు కడుతున్నవేమిటి అబాయా...ఇది నీకు మంచిది కాదు అబాయా’’ అన్నాడు ఆవేదనగా.‘‘నువ్వు నోర్ముయ్ అబ్బాయా’’ అన్నాడు కౌబాయ్.ప్రమాదాన్ని శంకించిన నాగన్న షేకైపోతూ...‘‘అబాయా...నన్ను పట్టుకెళ్లి ఠాణాలో అప్పగించి ఉరితీయాలనుకుంటున్నావా? నీకు పుణ్యం ఉంటుంది అబాయా...నన్ను వదిలిపెట్టు అబాయా’’ అని బతిమిలాడుకున్నాడు.కౌబాయ్ వింటేగా!అనుకున్నంతా జరిగింది.‘‘ఇదిగో మీకు కావలసిన గజదొంగ నాగన్న’’ అని నాగన్నను ఠాణాలో హాజరు పరిచాడు కౌబాయ్.నాగన్న తలను పైకెత్తి చూసి, నిర్ధారించుకొని...‘‘అద్భుతం. ఇంతవరకు ఎవరు పట్టుకోలేని వాడిని పట్టుకున్నావు’’ అని కౌబాయ్‌కు కితాబు ఇచ్చి–‘‘నీ పేరు ఏమిటి?’’అడిగాడు పోలీసు అధికారి.‘‘అదనవసరం. మీరిస్తానన్న వెయ్యివరహాలిస్తే నా దారిన నేను పోతాను’’ సూటిగా పాయింట్లోకి వచ్చాడు కౌబాయ్.‘మంచిది’ అంటూనే పోలీసు అధికారి చప్పట్లు కొట్టాడు. వరహాల మూట వచ్చింది, దాన్ని కౌబాయ్‌కి ఇచ్చాడు పోలీసు అధికారి. కోపం పట్టలేక తిట్లు, శాపనార్థాలు అందుకున్నాడు నాగన్న...‘‘నమ్మించి పుట్టిముంచుతావా కొడుకో. నువ్వు పురుగులబడి ఛస్తావురా కొడుకో. నీ కాష్టం వానొచ్చి ఆరిపోతుందిరా కొడుకో. నిన్ను నక్కలు పీక్కుతింటాయిరా కొడుకో’’‘‘నాగన్న అనే ఈ ముద్దాయి ఎన్నో దారిదోపిడీలు దొంగతనాలు చేశాడు. రాజ్యాన్ని, ప్రజల్ని భయకంపితుల్ని చేశాడు. బంధించడానికి వచ్చిన సిపాయిల్ని మోసం చేసి తప్పించుకు పారిపోయాడు. ఇట్లాంటి ద్రోహులు సజీవంగా ఉంటే సమాజశ్రేయస్సుకు హాని కలుగుతుందని నిర్ణయించి ఈ ముద్దాయిని ఉరి తీయవలెనని శాసించడమైనది’’ అని ప్రకటించాడు న్యాయమూర్తి.ఉరికంబం మీద నక్కజిత్తుల నాగన్న.కానీ, న్యాయమూర్తి ఒకటి తలిస్తే...కౌబాయ్ మరొకటి తలిచాడు. అప్పగించిన చేతులతోనే నాగన్నను విడిపించుకొని పారిపోయాడు. నాగన్న ప్రాణాలను రక్షించాడు. -
ఇంకేమి సేయవలరా డింగరీ!
కాశీమజిలీ కథల్లో నుంచి పుట్టుకొచ్చిన కమ్మని కథ ఇది.నాటక రూపంలోనే కాదు చలనచిత్రంగా కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.పింగళి వారి డైలాగులు పటాసుల్లా పేలాయి.కాలాలకతీతంగా కనుల విందు, వీనుల విందు చేస్తున్న సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం... మాంత్రికుడు పెద్ద గొంతుతో అరుస్తున్నాడు...‘‘ఆమ్ అహమ్... అష్టభైరవిని కట్టా. కామ్ కహామ్.... కాలభైరవిని కట్టా...తాం తదనమ్ తంటామారిని గెంటా... ఇక మంత్రబలం చూపించే మనోబలం చూపించే...’’ బెల్లం చుట్టూ ఈగల్లా జనం పోగయ్యారు.‘‘జనమూ.... జనమూ... నేపాళమాంత్రికునికి వందనాలు అనండి. డింగిళ్లు అనండి’’ జనాల్ని చూస్తూ అరిచాడు మాంత్రికుడి అసిస్టెంట్ డింగరి.‘‘వందనాలు... వందనాలు’’ అని అరిచారు జనాలు.‘‘యువకులంతా ముందుకు రండి.... యువతులంతా ముందుకు రండి’’ అంటూ యువతీ యువకులను ముందువరసలోకి తెచ్చిన మాంత్రికుడు వృద్ధులు, వయసు మళ్లిన వాళ్లపై నిర్లక్ష్యపు చూపు విసిరి...‘‘నడుములు వంగిన నాయకులంతా గడబిడ సేయక వెనక ఉండండి’’ అని ఆదేశించినంత పని చేశాడు. ఆ తరువాత...‘‘అరేయ్ డింగరీ’’ అని అరిచాడు.‘‘ఏం గురూ’’ అని దగ్గరకు వచ్చాడు అసిస్టెంటు.‘‘జనం కోరేది మనం సేయడమా? మనం చేసేది జనం చూడటమా? ఏరా డింగరి’’ పొడవాటి గెడ్డాన్ని నిమురుకుంటూ అడిగాడు మాంత్రికుడు.‘‘మన కన్నే మన చెవే మన మాటే మన జనం. జనమంతా నేనే. మనం కోరతాం. మీరు సేయండి... గాగీ గూగీ మోటా టీటూ వీళ్లందరికీ టోపీలు పెట్టండి’’ అని జనాలను చూపిస్తూ అడిగాడు డింగరి.‘బోలెడంత ఆశ్చర్యం! ‘‘ఇంకేమీ సేయవలరా డింగరీ’’ అడిగాడు మాంత్రికుడు. నేల మీద ఉన్న రాయిని చూపిస్తూ...‘‘రాతిని కోతి చేయండి గురువు గారు’’ అడిగాడు అసిస్టెంటు.‘‘హాంఫట్’’ అంటూ అలాగే చేశాడు మాంత్రికుడు.మళ్లీ బోలెడంత ఆశ్చర్యం.రాతి కోతిగా మారిందిఅంతమాత్రాన చిలిపివాడైన డింగరి ఊరుకుంటాడా!‘‘కోతిని నాతిని చేయండి’’ అని అడిగాడు.మాంత్రికుడు ‘హాంఫట్’ అన్నాడో లేదో కోతి కాస్తా అందమైన యువతిగా మారింది. ‘‘మహాజనానికి మరదలు పిల్లా... గలగలలాడే గజ్జెల కోడి’’ అని ఆ యువతిని చిలిపిగా చూశాడు మాంత్రికుడు. ఈ చూపుల బాణం సోకి కాలికి గజ్జె కట్టింది ఆ యువతి...‘వగలోయ్ వగలోయ్తళుకు బెళుకుల వగలోయ్’ అనిపాడుతూ నృత్యం చేసి జనాల మనసులను కిలోలకొద్దీ దోచుకుంది.ఈలోపే ఎవరో వస్తున్న అలికిడి వినిపించి. జరగండి.. జరగండి... అనే మాటలు వినిపిస్తున్నాయి.వచ్చింది ఎవరో కాదు.... సాక్షాత్తు రాణిగారి తమ్ముడు.ఈ తమ్ముడుంగారు మాంత్రికుడి వైపు కోపంగా చూస్తూ, చేతిలోని కత్తి అటూ ఇటూ తిప్పుతూ...‘‘ఏయ్ ఎవడివయ్యా నువ్వు?’’ అని ఆరా తీశాడు.‘‘నేపాళమాంత్రికుడు’’ అని అరిచాడు మాంత్రికుడి అసిస్టెంటు.‘‘నేపాళమంత్రికుడా! తప్పు తప్పు... భూపాళం పగిలేను. ప్రమాదం. పన్ను ఇచ్చుకోండి’’ అనే డైలాగుతో తనకు రాబోయే కష్టాలు,కన్నీళ్లను మేళతాళాలతో ఆహ్వానించాడు రాణిగారి తమ్ముడు.మాంత్రికుడుగారు గుర్రుమన్నాడు.‘‘ఎవడ్రా వీడు?’’ అని కూడా అన్నాడు.‘‘రాణిగారి తమ్ముడుగారండీ’’ జనంలో నుంచి ఎవరో చెప్పారు.‘‘మాకు ఎవరైనా ఒకటే’’ అని ఆ యువకిశోరాన్ని తీసిపారేస్తూ ‘హాంఫట్’ అని అరిచాడు. అంతే!తమ్ముడుంగారి నెత్తి మీద కిరీటంతో పాటు... మూతి మీద మీసం కూడా ఎటో ఎగిరిపోయింది. ఆడరూపం వచ్చేసింది‘భామలారా ఓ యమ్మలారా... తాళలేనే నే తాళలేనే’ అని విచిత్రమైన గొంతుతో గెంతులు కూడా వేశాడు... సారీ వేసింది. చేసిన తప్పు తెలుసుకున్న తమ్ముడుంగారు–మాంత్రికుడి కాళ్ల మీద పడి...‘‘మాంత్రికుడోయ్... మాంత్రికుడోయ్.... నన్ను రక్షించండి రక్షించండి’’ అని వేడుకున్నాడు.‘‘బుద్ధి కలిగి ఉంటావురా’’ అంటూ తమ్ముడుంగారిని చూస్తూ కన్నెర్ర చేశాడు మాంత్రికుడు. ‘‘ఉంటాను బాబు ఉంటాను. నన్ను మామూలు వీరుడ్ని చేయండి’’ సారీ చెబుతూనే... వీరుడ్ని చేయమని వరం అడిగాడు.‘‘విద్యలు వినోదాలు కాదురా... వివేకం కలిగి ఉండాలి’’ మీసం మెలేస్తూ ఉపదేశించాడు మాంత్రికుడు.తమ్ముడుంగారికి మళ్లీ మూమూలు రూపం వచ్చేసింది. ‘హమ్మయ్య’ అనుకున్నాడు నూటొక్క సారి!మాంత్రికుడు డింగరిని పిలిచి...‘‘ఒరేయ్ డింగరి, మహాజనం మన భక్తులు.ఇదిగో అక్షయఘటం. ఎవరికి ఏది కావాలో కోరుకోమను’’ అరిచాడు.ఒక వృద్ధుడు అరటిపండు అడిగాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ అక్షయఘటంలో నుంచి అరటిపండు వచ్చింది. ఒకావిడ కుంకుమభరిణఅడిగింది. అలాగే వచ్చేసింది. పండ్లు అడిగిన వాడికి పండ్లు, వరహాలు అడిగిన వాడికి వరహాలు వచ్చాయి. అడిగిన వారికి అడిగినంత.తోటరాముడిలో అంతులేని ఆశ్చర్యం.తాను ఏ ఆశయ సాధన కోసం అయితే ఇంటి నుంచి బయలుదేరాడో ఆ ఆశయాన్ని నెరవేర్చుకోవాలంటే మాంత్రికుడి చేతిలో ఉన్న అక్షయఘటం తన చేతిలో ఉంటే చాలు అని అనుకున్నాడో లేదో, దాన్ని మాంత్రికుడి చేతి నుంచి లాక్కొని వెనక్కి తిరిగి చూడకుండా పరుగందుకున్నాడు తోటరాముడు. -
రేపొద్దున్న నీ కొడుకు డాక్టరైతే...
‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం’ అని చెప్పిన ఈ సినిమాలో పదునైన డైలాగులు ఉన్నాయి. కంటతడి పెట్టించే సన్నివేశాలు ఉన్నాయి. ఈ సిల్వర్‌జూబ్లీ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... చెప్పాపెట్టకుండా పట్నం నుంచి ఊడిపడ్డ కొడుకు ఆనంద్‌ను చూసి...‘‘అదేంట్రా ఇలావచ్చావు? ఉత్తరం ముక్కయినా రాయలేదు’’ అని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ.‘‘అది కాదమ్మా’’ అని ఆనంద్ ఏదో చెప్పబోతుండగానే రంగయ్య ఇలా విసురు విరిశాడు...‘‘ఆ... ఏముంది. రాసి ఉంచుకున్న ఉత్తరాలన్నీ అయిపోయి ఉంటాయి. అందుకనే సరాసరి వాడే వచ్చేశాడు’’‘‘మీరు ఊరుకుందురూ... ఎప్పుడు బయలుదేరాడో ఏమో పదబాబూ స్నానం చేసిరా... భోజనం చేద్దువుగానీ’’ అని కొడుకు వైపు మురిపెంగా చూసింది సీతమ్మ.అందరూ భోజనాలకు కూర్చున్నారు.సీతమ్మ కొడుక్కి కొసరి కొసరి వడ్డిస్తోంది.‘‘వద్దమ్మా చాలు’’ అంటున్నాడు ఆనంద్.‘‘వద్దంటే ఎలారా? బావకు ఇష్టమని ఎంతో రుచిగా చేసింది సుగుణ’’ అన్నది సీతమ్మ.సుగుణ బావ ఆనంద్‌ను ఆశ్చర్యంగా చూస్తూ...‘‘అత్తయ్యా చూశావా! బావ ఇదివరలా ములక్కాడలు శుభ్రంగా నమిలి తినడం లేదు. ఇప్పుడు చూడు అసలు తినడమే మరిచిపోయాడు’’ అంటూ బావ వైపు జాలిగా చూసింది సుగుణ.‘‘అది మరిచిపోవడం కాదమ్మా... ఫ్యాషను ఫ్యాషను. ఇదేం చూశావు. పట్నంలో చూడాలి సోకు. ముష్ఠోడికి కాణీ ధర్మం చేయడానికి మనసొప్పదుగానీ హోటళ్లో సగం ఇడ్లీ తిని సగం పారేస్తారు. ఫ్యాషను ఫ్యాషను’’ అని పట్నపు పోకడలను వెక్కిరించాడు రంగయ్య. ‘‘హోటలు కూడు నీకు కూడా వంటబట్టినట్లుందే’’ కొడుకు వైపు చిలిపిగా చూస్తూ అన్నది సీతమ్మ.‘‘రేపొద్దున్న నీ కొడుకు డాక్టరైతే మనమంతా హోటల్ కూడు తినాల్సిందే’’ అన్నాడు రంగయ్య పళ్లెంలో చారు పోసుకుంటూ.‘‘ఏ... ఎందుకు?!’’ అని ఆశ్చర్యపోయింది సీతమ్మ.‘‘మీరంతా వంట చేసి కందిపోతారేమోనని’’ అన్నాడు రంగయ్య. ఆయన భారీ మీసాల మీద వ్యంగ్యం సన్నగా మెరిసింది.ఆ తరువాత అసలు విషయంలోకి వచ్చి...‘‘ఆ... తమరు ఎందుకొచ్చినట్లో?’’ కొడుకు వైపు చూస్తూ అడిగాడు రంగయ్య.‘‘కన్నకొడుకుని పట్టుకొని ఏమిటండీ ప్రశ్న?’’ మూతి మూడిచింది సీతమ్మ.‘‘పిచ్చిముఖమా! వాడు ఉత్తినే రాలేదే...ఏదో పెద్ద మొత్తం పట్టడానికి వచ్చి ఉంటాడు’’ కొడుకు రాకలోని మర్మం గురించి చెప్పకనే చెప్పాడు రంగయ్య.‘పెద్ద మొత్తం’ అనేమాట వినబడగానే...‘‘ఆ... వాడు తినడానికా!’’ అన్నది సీతమ్మ.‘‘ఆ మాట నేనన్నానా’’ అని బదులిచ్చాడు రంగమ్మ.‘చిన్నమొత్తమైనా... పెద్ద మొత్తమైనా అది చదువు కోసమే కదా... జల్సాలకు కాదు కదా’ అనేది ఆ పిచ్చితల్లి ఉద్దేశం.‘‘అసలు నేను కాలేజీ మానాలనుకుంటున్నాను’’ బాంబు పేల్చాడు ఆనంద్.‘ ఏ ఎందుకని?’’ కన్నెర్ర చేశాడు రంగయ్య.‘‘మిమ్మల్ని ఈరకంగా బాధ పెట్టడం ఇష్టం లేక’’ ముఖం అదోరకంగా పెట్టి అన్నాడు ఆనంద్.‘‘మరి ఇన్నాళ్లు చదివిన చదువు ఏంకావాలి?’’ అమాయకంగా అడిగింది సీతమ్మ. ‘‘వాడి కోసం చదువుతున్నాడా! నాకు డబ్బు ఎక్కువై చదివిస్తున్నాను’’ అని ఆనంద్‌కు వేడి వేడి చురక అంటించి భార్యను చూస్తూ బాధగా అన్నాడు...‘‘మన సాధకబాధకాలు వాడికి తెలిస్తేగా’’ భర్త కోపం కట్టలు తెంచుకుంటుంది అని గ్రహించిన సీతమ్మ...‘‘అబ్బా! మీరుండండీ’’ అంది.‘‘లేకపోతే ఏంటే వాడు మాట్లాడేది? ఉత్తరం రాయడం పాపం డబ్బులు పంపిస్తూనే ఉన్నాంగా. ఇబ్బంది పెట్టింది ఎప్పుడని!’’ కోపంతో ఊగిపోయాడు రంగయ్య.‘‘మీరు పంపేది కాలేజీ ఫీజులకీ, పుస్తకాలకే సరిపోతుంది. ఇంకా ఏం అక్కర్లేదా ఏంటి?’’ అంటూ మూతిముడిచాడు ఆనంద్.‘‘ ఏం కావాలో చెప్పరాదు?’’ అనే ప్రశ్న తండ్రి నోటి నుంచి రాగానే....‘‘తోటివాళ్లంతా స్కూటర్లు, కార్ల మీదే వస్తారు. ఎప్పుడూ సూట్ల మీదే ఉంటారు’’ అడగకుండానే ఆశించేదాని గురించి అడగానే అడిగాడు ఆనంద్.‘‘వాళ్లంతా లక్షాధికారులురా’’ అనే ఒక్క మాటతోనే కొడుకు నోరు కట్టేసే ప్రయత్నం చేశాడు రంగయ్య. ఆనంద్ ఊరుకుంటేగా!‘‘కనీసం సూటు కుట్టించుకునే స్థోమత కూడా లేనప్పుడు చదవడం దేనికి?’’ అన్నాడు.చదువు అనేది సూట్లు కుట్టించుకోవడం కోసమే అన్నట్లు!ఇదే మాట రంగయ్య అన్నాడు...‘‘ఏరోయ్ పెద్దోళ్లతో తిరుగుతున్నావు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు! మన స్థితి ఏంటో తెలుసుకో. సూట్లు బూట్లు వేసుకుంటేనే కాదురా చదువు... బుర్ర ఉండాలిరా బుర్ర’’ తింటున్న అన్నాన్ని మధ్యలోనే వదిలేసి కోపంగా లేచాడు రంగయ్య. తండ్రి లాగే తాను కూడా భోజనం మధ్యలోనే లేవబోయాడు ఆనంద్.‘‘ఒరేయ్ ఏంట్రా ఇది? అన్నం తినకుండా లేస్తావా? నీ ముందు అలా అంటారేగానీ నీ గురించి ఎంత మురిసిపోతారో తెలుసా! తిను నాయనా తిను’’ అంటూ కొడుకు అలక మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేసింది సీతమ్మ. ఒకవైపు రంగయ్య కోపంతో గుర్రుమంటున్నాడు. మరోవైపు దిగులు ముఖంతో మంచంపై కూర్చున్నాడు ఆనంద్.ఈ పరిస్థితి చూసి...‘‘డబ్బు ఏమైనా సర్దుబాటు అవుతుందేమో... అలా తులసమ్మ ఇంటి వరకు వెళ్లొస్తా’’ అని ఉన్నపళంగా బయటికి నడిచింది సీతమ్మ. -
అచ్చం సావిత్రిలా హావభావాలు
మహానటి చిత్రం నుంచి తొలగించిన మరో సన్నివేశాన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఏఎన్నార్, సావిత్రి, జమున నటించిన దొంగరాముడు(1955) చిత్రంలోని రావోయి మా ఇంటికి.. మావోయ్.. మాటున్నది మంచి మాటున్నది... పాట వీడియోను రిలీజ్ చేశారు. సావిత్రి.. ఆర్.నాగేశ్వర రావులపై చిత్రీకరించిన పాట ఇది. కీర్తి సురేష్ అచ్చు సావిత్రిలానే హావభావాలు పలికిస్తూ ఆకట్టుకుంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన మహానటికి నాగ్ అశ్విన్ దర్శకుడు. కీర్తీ సురేష్ లీడ్ రోల్లో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
మహానటి: రావోయి మా ఇంటికి...
-
మహానటి : మిస్సమ్మ సీన్
-
మిస్సమ్మ సీన్‌ను ఎందుకు తీసేశారు?
మహానటి చిత్ర విజయాన్ని టాలీవుడ్ మొత్తం ఆస్వాదిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం నాగ్ అశ్విన్ మరియు నిర్మాతల సాహసాన్ని అభినందిస్తున్నారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటికి తొలి రోజు నుంచే మంచి ఆదరణ లభిస్తోంది. ఇక చిత్ర నిడివి కారణంగా తొలగించిన సన్నివేశాలను మేకర్లు ఒక్కోక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. తాజాగా తమిళ మిస్సమ్మ సినిమాలోని వారాయో వెన్నిలావే (రావోయి చందమామ) సాంగ్ సీన్‌ను విడుదల చేశారు. జెమినీ గణేషన్-సావిత్రి రోల్స్‌లో దుల్కర్-కీర్తి సురేష్‌లపై చిత్రీకరించిన సీన్ ఆకట్టుకునేలా ఉంది. అయితే బాగున్న ఈ సీన్‌ను ఎందుకు తీసేశారని? సినిమాలో ఉంచాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా సాధించటంతోపాటు ఓవర్సీస్లోనూ మహానటి ప్రభంజనం కొనసాగిస్తోంది. సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్వప్న, ప్రియాంక దత్‌లు సంయుక్తంగా నిర్మించారు. -
రక్తకన్నీటికి లైఫ్
తేనెతుట్టను పట్టిన ఈగల్లా రైళ్లని మనుషులు పట్టుకుని వేలాడుతూ తరలిపోతున్న దృశ్యాల ఫొటోలు, దేశ విభజన కాలం నాటివి ఇప్పటికీ కనిపిస్తాయి. ఎముకల గూడులైపోయిన మనుషులు భయంతో, నీరసంతో, పంటిబిగువున నడుస్తున్న ఫొటోలు – ఇవన్నీ అప్పటివే. ఈ భయానక చిత్రాలలో ఎక్కువ భాగం ఒక మహిళా జర్నలిస్టు తీసినవే.ప్రపంచ చరిత్రలో జరిగిన అతి పెద్ద హింసాత్మక వలసలలో ఒకటి మన దేశంలోనే జరిగింది. ఇంకో మాటలో చెప్పాలంటే తరిమివేత. కావళ్లలో, భుజాల మీద వృద్ధులతో, మంచం సవారీ మీద గర్భిణులతో, చంకల్లో ఏడుస్తున్న పసివాళ్లతో, రోజుల తరబడి తిండీతిప్పలు లేక నీరసించిన ముఖాలతో కళ్లల్లో ప్రాణాలు పెట్టుకుని, ఎడ్ల బళ్ల మీద, గాడిదల మీద, చిన్న చిన్న వాహనాల మీద సామగ్రితో అనంతంగా సాగిపోతున్న వ్యథార్త జీవుల యథార్థ దృశ్యాలు ఆ కాలాన్ని విచలితం చేశాయి. చిన్న చిన్న గుంపుల నుంచి ఎనిమిది మైళ్ల పాటు సాగిన వలసలు ఆనాడు కనిపించాయి. ఇది 1947లో జరిగిన భారత విభజన నాటి విషాద దృశ్యమాలిక. కోటీ యాభయ్ లక్షల నుంచి రెండు కోట్ల మంది పాకిస్థాన్ నుంచి భార™Œ కూ, భారత్ నుంచి పాకిస్థాన్‌కూ తరలిపోయారు. ఇరవైరెండు లక్షల మంది ఆచూకీ దొరకలేదు. హిందువులు, ముస్లింలు ఒకరిని ఒకరు చంపుకున్నారు. సిక్కులు, ముస్లింలు ఒకరిని ఒకరు చంపుకున్నారు. ముస్లింలీగ్ నేత జిన్నా 1946లో ఇచ్చిన ‘ప్రత్యక్ష చర్య’ పిలుపుతో ఉపఖండం కనీవినీ ఎరుగుని రీతిలో హత్యాకాండను చూసింది. ఆ సంవత్సరం బెంగాల్ రక్తసిక్తమైంది. 1947లో ఐదు నదులకు పోటీగా పంజాబ్‌లో నెత్తురు పారింది. 1947 ఆగస్ట్ 15కు స్వాతంత్య్రం ఇస్తున్నట్టు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించినా, సరిహద్దుల నిర్ణయం ఆగస్టు 17కు గాని జరగలేదు. ఆ నలభై, యాభై గంటలలో జరిగిన ఘోరాలు భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి మీద అనేక ప్రశ్నలను సంధిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు చేసిన ఘోరాల కంటే ఆ సమయంలో ఇక్కడ జరిగిన ఘోరాలు దారుణమైనవని ఆ యుద్ధంలో పని చేసి వచ్చిన బ్రిటిష్ సైనికులూ పత్రికా విలేకరులూ చెప్పడం విశేషం (భారత, పాక్ విభజనపై వెలువడిన కొన్ని పుస్తకాలను సమీక్షిస్తు ప్రఖ్యాత చరిత్రకారుడు, నవలాకారుడు విలియం డాల్రింపుల్ జూన్ 29, 2015న ‘ది న్యూయార్కర్’ పత్రికకు రాసిన వ్యాసంలో ఇలాంటి విషయాలు చాలా వెల్లడించారు). ఈ రక్తకన్నీటి ధారలను తన కెమెరాతో బంధించిన వారిలో ముఖ్యులు మార్గరెట్ బూర్కి–వైట్. ‘గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్’ పేరుతో ప్రసిద్ధమైన హత్యాకాండ మిగిల్చిన విషాదాన్ని మార్గరెట్ భావి తరాలు మరచిపోలేని విధంగా చిత్రీకరించారు. ఒక సన్నటి సందులో గుట్టలుగా పడి ఉన్న శవాలు, వాటిని పీక్కు తినడం కోసం అక్కడి ఇళ్ల మీద నుంచి చూస్తున్న రాబందులు ఎదురు చూస్తున్న ఫొటో అందరినీ కదిలిస్తుంది. శవాలను బండ్ల మీద నింపుతున్న దృశ్యం, అందులో బండి చక్రం ఆకుల మధ్య నుంచి కనిపిస్తున్న కళ్లు మూత పడని ఒక శవం దేని గురించో ప్రశ్నిస్తున్నట్టే ఉంటుంది. భారత్ నుంచి పాక్‌కూ, పాక్ నుంచి భారత్‌కూ సాగిన వలసలు కూడా దారుణ హింస మధ్యనే సాగింది. వెంటాడి చంపడం, యువతులపై అత్యాచారాలు చేయడం (మొత్తం 75,000 మందికి ఇలాంటి దుస్థితి ప్రాప్తించిందని ఊర్వశి బుటాలియా, తన ‘అదర్ సైడ్ ఆఫ్ ది సైలెన్స్’ పుస్తకంలో చెబుతారు. ఈమె అలాంటి బాధలు పడ్డ పంజాబీ కుటుంబానికి చెందినవారే) సర్వ సాధారణంగా జరిగిపోయింది. ఇలాంటి రక్తపు జాడల వెంట పయనిస్తూ మార్గరేట్ ఫొటోలు తీశారు. మార్గరెట్ (జూన్ 14,1904–ఆగస్ట్ 27,1971) అమెరికా పౌరసత్వం తీసుకున్న పోలెండ్ జాతీయురాలు. తండ్రి జోసెఫ్ వైట్ యూదు జాతీయుడు. తల్లి మిన్నీ బూర్కి ఐరిష్ జాతీయురాలు. తల్లి మీద ప్రేమతో బూర్కి (ఆమె ఇంటిపేరు) పేరును కూడా మార్గరెట్ తన పేరులో చేర్చుకుంది. మార్గరెట్ చిన్నతనం న్యూజెర్సీలో గడిచింది. కెమెరాలంటే ఆసక్తి చూపించే తండ్రి నుంచి ప్రోత్సాహం రావడంతో చిన్ననాడే ఆమె ఫొటోలు తీయడం ఆరంభించారు. తరువాత హెర్పిటాలజీ (పాములు, కప్పల అధ్యయనం, జంతుశాస్త్రంలో ఉపశాస్త్రం) చదువుతుండగా తండ్రి మరణించడంతో, కోర్సు పూర్తి చేయలేదు. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ తరువాత ఆ పత్రిక యజమాని హెన్రీ లూస్ ‘లైఫ్’ పేరుతో ఒక పత్రికను వెలువరించాలని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడే మార్గరెట్‌ను ఆ పత్రికకు ఎంపిక చేశాడు. ఆమె లైఫ్‌లో పనిచేసిన తొలి మహిళా ఫొటోగ్రాఫర్. తొలి సంచిక (నవంబర్ 23, 1936) మీద మోంటానా లోని ఫోర్ట్ పెక్ డ్యామ్ ఫొటో ప్రచురించారు. అది మార్గరెట్ తీసినదే. నిజానికి ఇది ఆమె సాధించిన ఘనతలలో చాలా చిన్నది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రణభూమి దగ్గర ఉండి ఫొటోలు తీసే అవకాశం వచ్చిన మొదటి మహిళ మార్గరెట్. అప్పుడే క్రెమ్లిన్ (రషా) మీద నాజీ సేనలు దాడుల (1941) దృశ్యాలను తన కెమెరాలో బంధించే అవకాశం కూడా ఆమెకే దక్కింది. ఇలాంటి సంక్షుభిత పరిణామాలను చిత్రించేందుకు అనుమతి పొందిన ఏకైక విదేశీయురాలు మార్గరెట్. తన ఫొటో తీయడానికి స్టాలిన్ కూడా ఆమెను అనుమతించాడు. సోవియెట్ పరిశ్రమలను ఫొటోలు తీయడానికి అనుమతి పొందిన తొలి పాశ్చాత్య మహిళ కూడా ఆమే. హిట్లర్ పతనం తరువాత జర్మనీ దుస్థితిని కూడా ఆమె తన ఫ్రేములలో బంధించారు. మహాత్మా గాంధీ ఫొటోలు తీయడానికే మార్గరెట్ మార్చి, 1946లో భారతదేశానికి వచ్చారు. చరఖా ముందు కూర్చుని ఉన్న గాంధీజీ ఫొటో మార్గరెట్ తీశారు. ఇంకా చాలా పోజులలో ఫొటోలు ఉన్నాయి. ఆమె భారతదేశం కోసం తీసిన ఫొటోలు 66. అందులో గాంధీ, జిన్నా, అంబేడ్కర్ వంటి చరిత్రపురుషుల పోర్ట్రెయిట్లు, విభజన విషాదాల ఫొటోలు ప్రధానంగా ఉన్నాయి. అసలు భారత విభజన విషాదాన్ని కెమెరాలో బంధించడానికే ఆమె ఇక్కడికి వచ్చారని అనిపిస్తుంది. ఆమె 1946 మార్చిలో వచ్చారు. అప్పుడే వైస్రాయ్ వేవెల్ను సాగనంపి ఆఖరి ఆంగ్ల వైస్రాయ్ మౌంట్‌బాటన్‌ను ప్రతిష్టించారు. మౌంట్‌బాటన్‌ను ఇక్కడకు పంపించిన కారణమే భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వడానికి. కానీ ఆ క్రమంలో పాకిస్థాన్‌ను విభజించవలసి వచ్చింది. మౌంట్‌బాటన్ రాక తరువాత వరసగా ఘటనలు జరిగిపోయాయి. ఆగాఖాన్ ప్యాలెస్ నుంచి గాంధీని విడుదల చేశారు. జిన్నాతో ఆయన 18 రోజులు చర్చలు జరిపారు. తరువాత జాతీయ నాయకులంతా విడుదలయ్యారు. ఆ తరువాత ఆగస్టులో జిన్నా ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చారు. అక్కడ నుంచి రక్తపాతం మొదలైంది. మార్గరెట్ తన కెమెరాతోను, లీ ఐటింగన్ డైరీ కలంతోను ఆ దారుణ దృశ్యాలకు శాశ్వతత్వం కల్పించారు. ఐటింగన్ 20 ఏళ్ల యువతి. విభజన నాటి ఉద్రేకం, వాతావరణం ఎలాంటిదంటే, సైనికులు పోలీసులు కూడా భయపడుతున్నారు. వారి మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఇంక ఇద్దరు స్త్రీల వల్ల ఎలా అవుతుంది? అని చాలామంది ప్రశ్నించారు. మరీ ముఖ్యంగా రవాణా సౌకర్యం మరీ కష్టమని నిరాశ పరిచారు. కానీ ఆ ఇద్దరు మహిళలు ఒక జీప్ సంపాదించగలిగారు. ఒక ఇంగ్లిష్ సైనికాధికారిని పట్టుకుని కొందరు సైనికులను రక్షణగా కూడా తెచ్చుకున్నారు. రెండు గ్యాలన్ల పరిశుభ్రమైన నీరు, పక్క బట్టలు, ఒక టైప్ రైటర్, ఇక కెమెరా సామగ్రి సరేసరి. వీటిని జీప్‌లో వేసుకున్నారు. ఖాకీ దుస్తులు ధరించి మత కల్లోలాలతో మండుతున్న పంజాబ్‌లో పర్యటన ప్రారంభించారు. లాహోర్ సమీపిస్తున్న కొద్దీ ప్రమాద ఘంటలు మరింత గట్టిగా వినిపించడం మొదలైంది. బాధ, ఉక్రోషం నిండిన కాందిశీకులు గుంపులు గుంపులుగా వస్తున్నారు. కొందిరిని స్థానికులు నిరోధించి హింసాకాండకు దిగుతున్నారు. ఎదురుగా వస్తున్న వేరే వర్గం గుంపుల మీద దాడులు జరుగుతున్నాయి. ముప్పయ్ మంది గుంపు పెద్ద పెద్ద ఆయుధాలు పట్టుకుని జీప్ వైపు వస్తుంటే, ఒక సైనికాధికారి కాల్పులు జరపవలసి వచ్చింది. నదులలో, రైలు పట్టాల పక్కన, బావులలో, దారి పక్కన శవాల గుట్టలను చూశారు. ఆకలితో అసువులు బాసిన బాలలను ఫొటోలు తీశారు. చిత్రం ఏమిటంటే, అలాంటి స్థితిలో కూడా మార్గరెట్లో ఫొటోగ్రాఫర్ మౌలిక లక్షణం చచ్చిపోలేదు. ఒక సిక్కు మతస్థుడు అనారోగ్యంతో ఉన్న ఒక మహిళను తన భుజాల మీద ఎక్కించుకుని నడుస్తున్నాడు. ఏమైందో తెలియదు. ఆ దృశ్యం కెమెరాకు చిక్కలేదు. కానీ ఒక ప్రత్యేక ఎఫెక్ట్ కోసం ఒక్కసారి వెనక్కి వెళ్లి మళ్లీ నడిచి రమ్మని మార్గరెట్ ఆ సిక్కు మతస్థుడిని కోరిందట. ఖాకీ దుస్తులలో ఉన్న మార్గరెట్‌ను చూసి అతడు తీవ్రంగా భయపడుతూ ఆమె చెప్పినట్టు చేశాడట. తరువాత ఆ సిక్కు మతస్థుడు కలసి సాగుతున్న గుంపు మీద ప్రత్యర్థులు దాడి చేశారు. అందులో 103 మంది చనిపోయిన సంగతి మార్గరెట్‌కు తెలిసింది. ‘యుద్ధస్య రమ్యం’ అని ఎవరూ అనరు. కానీ ‘యుద్ధస్య కథా రమ్యం’ అంటారు. అలాగే మార్గరెట్ విభజన విషాద చిత్రాలను మనం ఇప్పటికీ చూస్తున్నాం. పార్కిన్సన్ పెయిన్ వ్యాధితో 1971లో మార్గరెట్ తుదిశ్వాస విడిచారు. భారత స్వాతంత్య్ర సమరం అహింసాయుతంగా మొదలై, దారుణమైన హింసతో ముగిసింది. ఇదొక వైచిత్రి. గాంధీజీ వంటి అహింసామూర్తిని ఫొటోలు తీయడానికి వచ్చిన మార్గరెట్ హింసాత్మక భారతాన్ని చూసింది. - డా. గోపరాజు నారాయణరావు -
షరతులు వర్తిస్తాయి
సాక్షి, సినిమా: హీరోగా అతి వేగంగా దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్. ఈయన హీరోగా తొలి చిత్రం మనంకొత్తిపరవై యావరేజ్‌గా నిలిచింది. ఆ తరువాత నటించిన మెరీనా ఓకే అనిపించుకుంది. వరుత్తపడాద వాలిభన్ సంఘం నుంచి శివకార్తికేయన్ కేరీర్ వేగం పుంజుకుంది. ఇటీవల విడుదలైన వేలైక్కారన్ చిత్రం వరకూ విజయపరంపర కొనసాగుతోంది. తాజాగా నటిస్తున్న సీమరాజా చిత్రం నిర్మాణంలో ఉంది. తదుపరి రెండు చిత్రాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే శివకార్తికేయన్ చిత్రాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నారు. అంతే కాదు కండిషన్స్ విధించడానికి వెనుకాడటం లేదు. ఈయన దర్శకుడు ఎం.రాజేశ్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించారు. ఈ దర్శకుడికొక సెంటిమెంట్ ఉంది. తొలి చిత్రం నుంచి ఒరుకల్ ఒరు కన్నాడీ, బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రాలన్నింటిలోనూ టాస్మాక్ సన్నివేశాలు తప్పనిసరిగా ఉంటాయి. అలాంటిది శివకార్తికేయన్ ఒక టీవీకిచ్చిన భేటీలో ఇంతకు ముందు టాస్మాక్ దృశ్యాలు చాలా ఆలోచింపజేశాయని, ఇకపై అలాంటి సన్నివేశాలు గానీ, స్త్రీలను పరిహాసం చేసే అంశాలు గానీ ఉండవని పేర్కొన్నారు. అయితే ఇది దర్శకుడు రాజేశ్‌కు పెట్టే కండిషన్స్గా సినీవర్గాలు భావిస్తున్నారు. అదే విధంగా టాస్మాక్ సన్నివేశాల సెంటిమెంట్ కలిగిఉన్న దర్శకుడు రాజేశ్కిది షాక్ ఇచ్చే విషయమే అవుతుందని అనుకుంటున్నారు. మరి ఆయన శివకార్తికేయన్‌తో చేసే చిత్రాన్ని ఎలా మలుచుకుంటారో వేచి చూడాలి. -
‘ప్రేమ’పక్షులు
ఇద్దరు ప్రేమికులు ఎలా ముచ్చట్లు చెప్పుకుంటారో..? ఒకరు ఆలస్యంగా వస్తే.. మరొకరు ఎలా చిరుకోపం ప్రదర్శిస్తారు. ఆ తర్వాత వారిని సముదాయించి తాను ఆలస్యంగా రావడానికి కారణాలు చెప్పి ఆ లవర్‌ను కూల్ చేస్తారు. అలాగే ఇక్కడ ఈ చిలుకలను చూస్తే ఇలాంటి కథనే అల్లాలనిపిస్తుంది.. కదూ..? ఓ చిలుక అప్పుడే మరో చిలుక వద్దకు వచ్చింది.. దీంతో ఆలస్యంగా వచ్చినందుకు మరో చిలుకపై చిరుకోపం ప్రదర్శించింది. దీంతో సారీ అంటూ సముదాయించి..బుజ్జగించి ముద్దులు పెట్టుకున్నది. ఈ దృశ్యాలు దానవాయిగూడెం వద్ద ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. – ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టు, ఖమ్మం -
ఇంక నీకు ఆ చాన్స్ లేదులే!
తెలుగులో సూపర్‌హిట్ కామెడీ సినిమాల లిస్ట్‌లో ఎప్పటికీ స్థానం సంపాదించుకునే సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకూ ఆద్యంతం నవ్వించే ఈ సినిమాలో, ఉన్న కొన్ని సెంటిమెంట్ సీన్లను కూడా ఎప్పటికీ మరచిపోలేం. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం.. నందు ఇల్లంతా సందడిగా ఉంది. ఆమె జీవితం ఒక్కసారే ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇదంతా కాస్తంత భయంగా కూడా ఉందామెకు. ఎవరితోనో ఏదో చెప్పాలని మాత్రం అనుకుంటోంది. కానీ ఎవరు వింటారు? ఎవరికి చెప్పుకుంటుంది? నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి. పెళ్లవ్వగానే భర్తతో అమెరికా వెళ్లిపోతుంది. ఇన్ని కొత్త కొత్త సవాళ్లన్నీ ఒక్కసారే మీదపడటంతో ఆలోచనల్లో పడిపోయింది. నందు ఆలోచనలను బ్రేక్ చేస్తూ.. ‘‘ఏంటి నందూ!! ఏంటి అమెరికా కబుర్లూ..?’’ అడిగింది నందు అత్త సుజాత, నిశ్చితార్థం జరిగిన వారానికి ఇంటికి వచ్చిందామె. నందు అత్తపై కోపంగా ఉంది, నిశ్చితార్థానికి రాలేదని. ‘‘నేన్నీతో మాట్లాడను పో!’’ అంది నందు, కోపంగా. అదేరోజు రాత్రి. నందు తన గదిలో పుస్తకం చదువుతూ కూర్చుంది. సుజాత అప్పుడే నందు గదికి వచ్చింది. ‘‘ఏంటి నందూ! ఏం చదువుతున్నావ్?’’ అడిగింది సుజాత. నందు ముఖం తిప్పుకొని మళ్లీ పుస్తకం చదవడంలో పడిపోయింది. ‘‘నాకంటే ఈ పుస్తకం ఎక్కువా నీకు?’’ సుజాత. ‘‘నా ఎంగేజ్మెంట్ కంటే మీ అత్తగారెక్కువా నీకు?’’ ‘‘అది కాదు నందూ..’’ ‘‘నాకు నీ మీద ఇక్కడ దాకా కోపం ఉంది..’’ పీకమీద చెయ్యి పెట్టుకొని చెప్పింది నందు. ‘‘ఆరోజు నేనెంత డిజప్పాయింట్ అయ్యానో తెల్సా! ఇప్పుడొచ్చి మళ్లీ నాతో మాట్లాడవా అని అడుగుతోంది చూడు.. చిన్నప్పట్నుంచీ అత్తా అత్తా అని నీ వెనకే తిరిగేదాన్నిగా.. అందుకే నేనంటే లెక్కే లేదు నీకు..’’ నందు మాట్లాడుతూ పోతోంది. సుజాత ఏం మాట్లాడకుండా అలాగే కూర్చొని చూస్తోంది. కళ్లలో నీళ్లు. నందు, సుజాతకు దగ్గరగా వచ్చి, ‘‘అత్తా! నేను నిన్ను హర్ట్ చేశానా?’’ అడిగింది. ‘‘ఊహూ.. నేనే మిమ్మల్నందర్నీ బాధ పెట్టాను. నీకు తెలీదు నందూ.. పెళ్లయితే చాలా మారతాయి. నీకు తెలీదు. పుట్టింటికి వెళ్లాలంటే ఎన్నో పర్మిషన్లు, కారణాలు, సంజాయిషీలు. ఒక్కోసారి అనిపిస్తుంది.. నా వాళ్లను చూడటానికి నాకిన్ని ఆంక్షలా అని!’’ సుజాత మాటలను మధ్యలోనే ఆపేస్తూ.. ‘‘అత్తయ్యా! మావయ్య నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా?’’ అనడిగింది నందు. ‘‘అలాంటిదేమీ లేదు. మీ మావయ్య చెడ్డవాడు కాదు. అలా అని మంచివాడూ కాదు. మొగుడు. అంతే!’’ అత్తమాటలు నందుకి అర్థమైకానట్లు ఉన్నాయి. ఆలోచనల్లో పడింది. ‘‘నా పెళ్లైన ఇన్నేళ్లలో ఆయన ఒక్కసారైనా నన్ను భోంచేశావా అని అడగలేదంటే నువ్వు నమ్ముతావా?’’ ‘‘ఇదంతా మాకు ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు నువ్వు..’’ ‘‘నా బాధలు చెప్పుకునేంత పెద్దవి కావు. మర్చిపోయేంత చిన్నవీ కావు..’’ సుజాత మాట్లాడుతూ ఉంటే నందు వింటూ, ఆలోచిస్తూ నిలబడింది. చాలా మాట్లాడింది సుజాత. నందుకి ఇవన్నీ కొత్తగానే ఉన్నాయి. పెళ్లంటే తనకున్న భయాన్ని పెంచలేదు, తగ్గించలేదు ఆ మాటలు. పెళ్లంటే అర్థమయ్యేలా చేశాయి అంతే. ‘‘ఈ పెళ్లిళ్లు ఎందుకు అవ్వాలి? మనం ఆడపిల్లలుగా ఎందుకు పుట్టాలి?’’ గట్టిగా ఏడుస్తూ మాట్లాడుతోంది సుజాత. నందు ఆవిడను గట్టిగా హత్తుకొని తనూ ఏడ్చేసింది. నందు, సుజాత పెరట్లో పూలు కోస్తున్నారు. నందు అప్పటికే సుజాతను ఒక ప్రశ్న అడగాలని, అందుకు ఒక మంచి సమయం దొరకాలని చూస్తూంది. ఇదే సరైన సమయం అనుకొని అడిగేసింది.. ‘‘అత్తయ్యా! నువ్వెవ్వరినైనా లవ్ చేశావా?’’ అని. ‘‘పొద్దున్నే నేనే దొరికానా నీకు?’’ సుజాత వెటకారంగా అడిగింది. ‘‘నేను సీరియస్‌గా అడుగుతున్నాను..’’ అంది నందు. సుజాత సిగ్గుపడుతూ, తల పక్కకు తిప్పింది. ‘‘ఆ! చేశావ్లే!!’’ నందు సుజాతను ఆటపట్టించడం మొదలుపెట్టింది. సుజాత నవ్వింది. ‘‘ఎవరు?’’ నందు. ‘‘పేరు తెలియదు. రోజూ నేను కాలేజ్‌కి వెళుతూంటే, సందు చివర ఉండేవాడు.’’ ‘‘ఏం చేసేవాడు?’’ ‘‘చూసి నవ్వేవాడు!’’ ఇద్దరూ నవ్వుకున్నారు. ‘‘అంతేనా?’’ అడిగింది నందు. ‘‘ఏంటి అంతేనా అంటావ్? ఆ మాత్రం నవ్వడానికి సంవత్సరం పట్టింది తెల్సా?’’ నవ్వుతూ సమాధానమిచ్చింది సుజాత. ‘‘తర్వాతా?’’ ‘‘నాకు పెళ్లి కుదిరింది. అతనికి ఆ విషయం తెలిసింది. తర్వాతెప్పుడూ సందు చివర అతను కనబడలేదు.. పాపం మంచోడు!’’ ‘‘పిరికోడు.. అందుకే నీ గురించి డాడీకి చెప్పడానికి భయపడి పారిపోయాడు..’’ ‘‘ఆ విషయం ఇంట్లో తెలిస్తే, చాలా గొడవై ఉండేది తెల్సా?’’ ‘‘అసలు చెప్తే కదా! గొడవయ్యేదో లేదో తెలిసేది!!’’ ‘‘నేను చెప్పలేదని ఎగతాళి చేస్తున్నావా?’’ కాదన్నట్టు తలూపి, ‘‘నేనెవర్నైనా ఇష్టపడితే, ధైర్యంగా ఆ విషయం డాడీతో చెప్పేదాన్నీ అంటున్నా..’’ అంది నందు. ‘‘ఇంక నీకు ఆ చాన్స్ లేదులే!’’ అంది సుజాత గట్టిగా నవ్వుతూ. ఒకర్ని ఇష్టపడే అలాంటి రోజు ఒకటి ముందు రోజుల్లో నిజంగానే వస్తుందని తెలియని నందు, సుజాతతో పాటే నవ్వింది. -
‘అసెంబ్లీలో నోర్మూసుకుని కూర్చోమంది!’
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభలో మంగళవారం సరదా సన్నివేశం చోటుచేసుకుంది. వీధి జంతువులపై సభలో చర్చ నడుస్తుండగా, ఉన్నట్టుండి అంశం భార్యాభర్తల సంభాషణపైకి మళ్లింది. తొలిసారిగా ఎంపికైన బీఎస్పీ ఎమ్మెల్యే అనిల్ సింగ్... చర్చిస్తున్న అంశానికి ఏ మాత్రం సంబంధం లేని, తన భార్య, తాను మాట్లాడుకున్న విషయాలను ప్రస్తావనకు తెచ్చారు. ‘అసెంబ్లీలో నీకు ఎలా ఉందని నా భార్య అడిగింది. అంత బాగా ఏం లేదని నేను చెప్పాను’ అని అనిల్ వ్యాఖ్యానించగా ‘అందుకు నీ భార్య ఏమని స్పందించింది?’ అని స్పీకర్ హృదయ్ నరైన్ దీక్షిత్ నవ్వుతూ అడిగారు. ‘నిశ్శబ్దంగా కూర్చొని అనుభవం పెంచుకోమని చెప్పింది’ అని అనిల్ సమాధానం ఇవ్వడంతో సభ్యులంతా విరగబడి నవ్వారు. ఆ తర్వాత స్పీకర్ మాట్లాడుతూ ‘నువ్వు ఇప్పుడు లేచి సభలో మాట్లాడటం టీవీలో నీ భార్య చూస్తే తిడుతుందేమో’ అనడంతో మరోసారి నవ్వులు పూశాయి. -
సినిమాలో నా సీన్లని తీసేశారు: హీరోయిన్
సినీ పరిశ్రమ అంతటి నిర్దయ గల పరిశ్రమ మరొకటి లేదంటారు. అలాంటి చేదు అనుభవమే తనకు ఎదురైందని వాపోతోంది నటి సోనీ కౌర్. బ్రిటన్‌లోని భారత సంతతికి చెందిన ఆమె.. తాజాగా 'ఏక్ హసీనా థి ఏక్ దీవానా థా' సినిమాలో నటించింది. దర్శకుడు సునీల్ దర్శన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ గతవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా దర్శకుడు తనను మోసం చేశాడని నటి సోనీ కౌర్ వాపోతున్నది. తనను గ్రాండ్‌గా చిత్రపరిశ్రమకు పరిచయం చేస్తానని చెప్పిన దర్శన్ మాట తప్పాడని తెలిపింది. 'సునీల్ దర్శన్ గత ఏడాది నన్ను సంప్రదించారు. దీంతో ఆయనను కలిసేందుకు నేను ముంబై వచ్చాను. ఆయన నాకు సినిమాలో రీటా పాత్రను ఇచ్చారు. కానీ ఈ సినిమా షూటింగ్ పూర్తికావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా ట్రైలర్ ఆవిష్కరణ నుంచి దర్శకుడు నాతో మాట్లాడటం మానేశాడు. సినిమా ప్రీమియర్ గురించి కూడా నాకు తెలుపలేదు. నేను స్వయంగా ప్రొడక్షన్ టీంను సంప్రదించి ప్రీమియర్ గురించి తెలుసుకున్నాను. అయితే, నేను ప్రీమియర్‌కు వచ్చేందుకు టికెట్ కూడా బుక్ చేయలేదు. నేను సొంత ఖర్చుల మీద ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను కలిసేందుకు దర్శకుడు నిరాకరించారు. ఇక నేను సినిమా చూశాను. అందులో నా సీన్లను చాలావరకు తీసేశారు. దర్శకుడు నాకు చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ప్రవర్తించారు' అని ఆమె మీడియాకు తెలిపారు. అయితే, దర్శకుడు ఆమె వాదనను కొట్టిపారేశారు. మీడియా పబ్లిసిటీ కోసమే ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందని దర్శకుడు దర్శన్ పేర్కొన్నారు. -
అభ్యంతరకర దృశ్యాలను తొలగిస్తాం
హైదరాబాద్: ఇంటర్నెట్లో ఉంచిన ట్రైలర్, టీజర్లనుంచి అభ్యంతరాలున్న దృశ్యాలను తొలగిస్తామని వంగవీటి చిత్రం దర్శక, నిర్మాతలు హైకోర్టుకు తెలిపారు. రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన వంగవీటి అనే సినిమా వాస్తవాలకు విరుద్ధంగా ఉందని, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ఆమోదం లేకుండా ట్రైలర్, టీజర్లను ఇంటర్నెట్, యూట్యూబ్, ట్విట్టర్లలో ప్రదర్శిస్తున్నారంటూ దివంగత వంగవీటి రంగా కుమారుడు రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి రాజా ఇలంగో గత మంగళవారంవిచారణ జరపగా వంగవీటి రంగా జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తున్నామని చెబుతున్నా ట్రైలర్‌ను చూస్తే వాస్తవాలను వక్రీకరించేలా ఉందని రాధాకృష్ణ తరపు న్యాయవాది బండి వీరాంజనేయులు కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి విజయవాడ పోలీసు కమిషనర్, సీబీఎఫ్సీ, రాంగోపాల్‌వర్మ, దాసరి కిరణ్‌కుమార్ తదితరులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా, శుక్రవారం విచారణ సందర్భంగా పిటిషనర్ అభ్యంతరాలను పరిశీలించి ఆ దృశ్యాలను తొలగిస్తామని దర్శక, నిర్మాతలు కోర్టుకు తెలిపారు. -
ఆద్యంతం అలరించిన శ్రీకృష్ణలీలలు
చోడవరం : ఆకాశం పైనుంచి దేవ కన్యలు దిగడం... మహావిష్ణువు నాభినుంచి గాలిలో బ్రహ్మదేవుడు కూర్చొని ఉండటం...నెత్తిన గంపలో పిల్లోడిని పెట్టుకొని వసుదేవుడు సముద్రంలో వెళుతుంటే ఏడు శిరసుల పాము వచ్చి తన పడగతో కాపు కాయడం... రాక్షసుని బొడ్డులోంచి తాళాం వచ్చి జైలు తాళాం కప్ప తీయడం.. ఇలాంటి ఎన్నో దృశ్యాలు చూపరులను కట్టి పడేశాయి. ‘సురభి’ నాటకాలంటే సినిమాలను తలపించే భారీ సెట్టింగ్‌లు ఉంటాయని తెలిసిందే. చోడవరం స్వయంభూ గౌరీశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన సురభి నాటకాలు జనాన్ని కట్టి పడేస్తున్నాయి. ఇక్కడ ఐదు నాటకాలు ప్రదర్శించాల్సి ఉండగా శనివారం రాత్రి శ్రీ కృష్ణలీలలు నాటికను మొదటగా ప్రదర్శించారు. భారీ సెట్టింగ్‌లు మధ్య ఈ నాటకంలో సన్నివేశాలు అబ్బురపరిచాయి. మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన శ్రీ కృష్ణావతారంలో తన మేనమామ కంసుడిని వధించడంలో శ్రీ కృష్ణుడు చేసిన లీలలే ఈ కథ వృత్తాంతం. అయితే పురాణాల్లో చదవడం, సినిమాల్లో చూడడం తప్ప నేరుగా బహిరంగ స్టేజిపై ఇంతటి భారీ సెట్టింగ్‌లతో ఇలాంటి నాటికను ప్రదర్శించడంపై జనం ఆనందం వ్యక్తం చేశారు. మంచి టైమింగ్‌తో స్టేజిపై సెట్స్, వేశాలు, వ్యక్తులు మారడం, నెల రోజుల బాలుడి దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్ధుడి వరకు ఈ నాటకంలో పాత్రలు పోషించడం కనువిందు చేశాయి. వేలాది మంది ప్రేక్షకులు తరలి రావడంతో వేదిక ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. మరింత ఉత్కంఠ రేపే సెట్టింగ్‌లతో బాలనాగమ్మ, మాయాబజార్, భక్తప్రహ్లాద, పాతాళబైరవి నాటకాలు వరుసగా 9వతేదీ వరకు ప్రదర్శించనున్నారు. -
కెమేరా కన్ను... చేతిలో పెన్ను... పిన్నవయసు ధ్రువ తారక
ప్రకృతి దృశ్యాలు చూస్తే అతని కళ్లు విశాలమవుతాయి. అతని కెమెరా కన్ను ఆ అద్భుతాలను ‘క్లిక్’మనిపిస్తుంది. వన్యప్రాణుల జీవనశైలిని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది. జాతీయ ఉద్యానాల్లో అతనితో పాటే అతని కెమెరా పరుగులు పెడుతుంది. కెమెరాతో జాతీయ ఉద్యానాల చరిత్రను కళ్లకు కడుతున్న అతని పేరు ధ్రువ్ వాడ్కర్! వయసు పధ్నాలుగేళ్లు. జాతీయస్థాయిలో అత్యంత పిన్నవయస్కుడైన ఫొటోగ్రాఫర్‌గా పేరు సంపాదించుకున్న ఈ టీనేజర్ సింగపూర్ పార్క్‌లలో ఫొటోలు తీసి ‘పార్క్ ఆఫ్ సింగపూర్’ అని ఒక కాఫీటేబుల్ బుక్‌ను రూపొందించాడు. చిన్ననాటి నుంచి ధ్రువ్ చేసిన ‘గ్రీన్ జర్నీ’ పెద్దవారికీ ఓ పాఠంలా ఉపయోగపడుతోంది. పధ్నాలుగేళ్ల ధ్రువ్ వాడ్కర్ హైదరాబాద్‌లో పుట్టి పెరిగాడు. మూడేళ్ల క్రితం వరకు ఇక్కడే చదువుకున్నాడు. తల్లిదండ్రులు సింగపూర్‌లో స్థిరపడడంతో ధ్రువ్ కూడా అక్కడే కెనడియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో టెన్త్ గ్రేడ్ చదువుతున్నాడు. సింగపూర్‌లోని 20 ఉద్యానాలను సందర్శించిన ధ్రువ్ ఇప్పటి వరకు దాదాపు 3000 ఫొటోగ్రాఫ్‌లు తీశాడు. అంతేకాదు పార్క్‌లకు వచ్చే వారిని కలిసి, వారితో మాట్లాడాడు. శ్రద్ధగా వారి అభిప్రాయాలు తెలుసుకున్నాడు. మన ఉద్యానాలకూ, సింగపూర్ ఉద్యానాలకూ ఉన్న తేడా తెలుసుకున్నాడు. వాటన్నింటినీ ఒక చోట పొందుపరచి ‘పార్క్ ఆఫ్ సింగపూర్’ అని ఒక కాఫీ టేబుల్ బుక్‌ను తయారుచేశాడు. అతను చేసిన ‘గ్రీన్ జర్నీ’లో చాలా ఆసక్తికర అంశాలే ఉన్నాయి. ఆకుపచ్చని ప్రయాణం... ‘‘ఏడేళ్లుగా వీలు చిక్కితే మన దేశంతో పాటు సింగపూర్ జాతీయ ఉద్యానాలను సందర్శిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ప్రకృతిని అర్థం చేసుకోవడానికి. విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉద్యానాల చరిత్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫొటోలతో పాటు, సందర్శకుల అభిప్రాయాలనూ సేకరిస్తున్నాను. రికార్డులను శోధిస్తున్నాను. అలా అన్నింటినీ సమకూర్చి ఒక పుస్తకంలో వాటిని పొందుపరిచాను. ఇదంతా ఉద్యానాల అద్భుతాలను, అక్కడి స్థితిగతులను తెలియజేయడానికి. సింగపూర్ పార్కులలో పచ్చదనం చాలా గొప్పగా ఉంటుంది. చుట్టుపక్కల పట్టణ వాతావరణం ఉన్నప్పటికీ విశాలమైన మైదానాలు అబ్బురపరుస్తాయి. ఏ పార్క్ చూసినా శుభ్రంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. అక్కడి ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా పార్క్‌లను తమ నేస్తాలుగా చూస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మన దేశంలోనూ ఎన్నో పార్కులను చూశాను. అక్కడి పార్కులకూ, ఇక్కడి పార్కులకూ ఎంతో తేడా ఉంది. మన దేశంలో పార్కులను కేవలం ఉదయం, సాయంకాల వేళల్లో వాకింగ్‌కు మాత్రమే ఉపయోగిస్తారు’’ అని వ్యాఖ్యానించాడు ధ్రువ్! పన్నెండేళ్ల వయసులో... అత్యంత పిన్నవయసులోనే మన దేశంలోని రణథంబోర్, కన్హా జాతీయ ఉద్యానాల అధికారుల ఆహ్వానం మేరకు వాటిని సందర్శించి, ఫొటోలు తీసి ప్రసిద్ధుల చేత ప్రశంసలు పొందాడీ కుర్రాడు. పన్నెండేళ్ల వయసులో ఢిల్లీలోని వైల్డ్ లైఫ్ సేవర్స్ సొసైటీ, ఎర్త్ మ్యాటర్ ఫౌండేషన్‌కు ధ్రువ్ వాడ్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. మన దేశంలో రణథంబోర్ జాతీయ ఉద్యానంలో ధ్రువ్ తీసిన 75 ఫొటోలతో హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. హైదరాబాద్‌లోని నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏడో తరగతి చదివే సమయంలో తాను తీసిన పులుల ఫొటోలను స్కూల్‌కు అందజేశాడు. ఢిల్లీలో ‘కాల్ ఆఫ్ ద టైగర్’ పేరుతో వన్యప్రాణుల సంరక్షణ సొసైటీ, ఎర్త్ మ్యాటర్స్ ఫౌండేషన్ ఒక పోటీని నిర్వహించింది. అందులో 32 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. వారందరిలో అత్యంత పిన్నవయస్కుడు ధ్రువ్! వారికి దీటుగా ధ్రువ్ తీసిన ఫొటోలు ఎంపికయ్యాయి. హాబీగా ఫొటోగ్రఫీ ధ్రువ్ చిన్నతనమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. అమ్మమ్మ తాతయ్యలతో కలిసి రోజూ దగ్గరలోని పార్క్‌కు వెళ్లేవాడు. అక్కడి పచ్చని గడ్డి మీద గంటలు గంటలు ఆడుకునేవాడు. అలా పార్క్‌లతో అనుబంధం ముడిపడిపోయింది అంటాడు ధ్రువ్. ‘‘ఫొటోగ్రఫీలో ధ్రువ్‌కు ఉన్న ఆసక్తి, అభిరుచిని గమనించిన మా ఆవిడ వాడికి ఏడేళ్ల వయసులో ఒక చిన్న కెమేరా కొనిచ్చింది. అప్పుడు మొదలైన హాబీతో ఇప్పటికీ వాడు క్లిక్ మనిపిస్తూనే ఉన్నాడు’’ అంటూ ఆనందంగా వివరిస్తారు ధ్రువ్ తండ్రి అనంత్ వాడ్కర్. ‘‘నా అభిరుచిని గమనించి అమ్మా నాన్న కన్హా జాతీయ ఉద్యానం, సలీమ్ అలీ బర్డ్ శాంక్చ్యువరీ వంటివాట న్నింటికీ తీసుకెళ్లారు’’ అనే ధ్రువ్ మన దేశంలోనూ పార్కులు అందంగా ఉండాలంటే ఏం చేయాలో తన కాఫీటేబుల్ బుక్‌లో పొందుపరిచాడు. ‘‘చిన్న ప్రయత్నం జగమంతా పచ్చదనం నిండడానికి దోహదం చేస్తుంది. ఆ ప్రయత్నం మనం నిరంతరం చేస్తూనే ఉండాలి’’ అంటాడు ధ్రువ్. ఈ పిన్నవయస్కుడి ఆలోచన ఎందరికో స్ఫూర్తి నిస్తుందని, ఆకుపచ్చని అందాలను కాపాడుకోవడానికి ప్రేరేపిస్తుందని ఆశిద్దాం. - నిర్మలారెడ్డి