
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి తెలుగువారికి కూడా సుపరిచితమే. అల్లు అర్జున్ హీరోగా నటించిన హ్యాపీ సినిమాతో తన హావభావాలతో అదరగొట్టాడు. టాలీవుడ్‌లో ఆయనకు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం తాను నటించిన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హైని మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మనోజ్ తన భార్య గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
(ఇది చదవండి: అమ్మా, నాన్న చనిపోతే.. వారే అంతా పంచుకున్నారు: తేజ)
అయితే తన భార్య షబానా తన సినిమా చూసి అవమానంగా భావించిందని మనోజ్ తెలిపారు. తెరపై హీరోయిన్లతో రొమాన్స్ చేసే సీన్స్ చేయడం తనకు ఇష్టం లేదని.. డబ్బు కోసం సినిమాలు చేయడం మానేయండని సలహా కూడా ఇచ్చిందని వెల్లడించారు. తన భార్య సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లగా.. కొంతమంది అమ్మాయిలు ఇదొక చెత్త సినిమా అన్నారని చెబుతూ బాధపడిందన్నారు.
(ఇది చదవండి: అవార్డులు కొల్లగొట్టిన ఆలియా భట్ మూవీ..!)
దయచేసి మీరు ఇలాంటి పాత్రలు చేయవద్దని.. కేవలం మంచి పాత్రలనే ఎంచుకోవాలని సూచించింది. కాగా.. మనోజ్ సత్యమేవ జయతే, బాఘీ 2 వంటి చిత్రాలలో కూడా కనిపించాడు. సత్యమేవ జయతే సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో తన ఫన్నీ క్యారెక్టర్ చూసి భార్య నవ్విందని మనోజ్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment