కెరీర్‌ ఎందుకు నాశనం చేసుకుంటావ్? అని నా భార్య ప్రశ్నించింది: మనోజ్‌ | Manoj Bajpayee Open About The Family Man Web Series | Sakshi
Sakshi News home page

Manoj Bajpayee: టీవీ సీరియల్ అనుకుని నా భార్య వద్దని చెప్పింది: మనోజ్‌

Published Mon, Jun 5 2023 8:56 AM | Last Updated on Mon, Jun 5 2023 8:57 AM

Manoj Bajpayee Open About The Family Man Web Series - Sakshi

మనోజ్ భాజ్‌పేయి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులోనూ అగ్రహీరోల సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన నటించిన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. మనోజ్‌ భాజ్‌పేయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ 'ది ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్'‌ గురించి మాట్లాడారు.

(ఇది చదవండి: అలాంటి సీన్స్ చూసి నా భార్య ఫీలైంది: మనోజ్ భాజ్‌పేయి)

దర్శకద్వయం రాజ్‌, డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు మనోజ్‌ బాజ్‌పేయి. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సిరీస్‌లో శ్రీకాంత్‌ తివారీగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. అయితే ఈ సిరీస్‌లో నటించడానికి మనోజ్‌ మొదట్లో ఆసక్తి చూపించలేదట. మరోవైపు ఆయన భార్య కూడా ఈ సిరీస్‌ గురించి విని కెరీర్‌ ఎందుకు నాశనం చేసుకుంటావు? అని అడిగిందట. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.

మనోజ్ మాట్లాడుతూ.. 'ది ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌ కోసం రాజ్‌ అండ్‌ డీకే నన్ను ఫోన్‌లో సంప్రదించేందుకు యత్నించారు. ఆ సిరీస్‌లో శృంగారం, హింస మితిమీరి ఉంటాయని భావించి ఇలాంటి ప్రాజెక్ట్‌లు చేయనని వారికి చెప్పేశా. మీరు అనుకున్నట్టుగా ఆ సిరీస్‌ ఉండదు. ఒక్కసారి వచ్చి కలవండి అని చెప్పారు. వారి మాటపై నమ్మకం ఉంచి వాళ్లను కలిశా. స్క్రిప్ట్‌ విన్నాక నాలో ఆసక్తి పెరిగింది. దీంతో ఒకే చెప్పేశా. ఎనిమిది నెలలపాటు ఈ ప్రాజెక్ట్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నా.' అని తెలిపారు. 

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత)

ఆ తర్వాత ఈ విషయం నా భార్యకు తెలిసి వెబ్‌సిరీస్‌ అంటే టీవీ సీరియల్‌ అనుకుని నటించవద్దని చెప్పింది. ఇలాంటి వాటిల్లో నటించి నీ కెరీర్‌ నాశనం చేసుకుంటావు? అని ప్రశ్నించింది. అయితే సిరీస్‌ విడుదలయ్యాక వచ్చిన ఆదరణ చూసి ఆమె ఆనందించిందని తెలిపారు. మనోజ్‌ బాజ్‌పేయి నటించిన చిత్రం సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై. కోర్టు రూమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి అపూర్వ్ సింగ్ కర్కీ దర్శకత్వం వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement