వినాయక చవితికి దూరంగా బాలీవుడ్ బ్యూటీ.. కారణం ఏంటంటే? | Shilpa Shetty Not Celebrate Ganesh Chaturthi This Year Due To Bereavement In The Family, Post Goes Viral | Sakshi
Sakshi News home page

Shilpa Shetty: వినాయక చవితికి దూరంగా శిల్పా శెట్టి.. ఆ కారణం వల్లే!

Aug 25 2025 8:37 PM | Updated on Aug 26 2025 9:31 AM

Shilpa Shetty NOT Celebrate Ganesh Chaturthi This Year Due To Bereavement

బాలీవుడ్ భామ శిల్పా శెట్టి అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఏడాది వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రతి ఏడాది గ్రాండ్గా సెలబ్రేట్ పండుగను జరుపుకోవడం లేదని తెలిపింది. తమ కుటుంబంలో ఒకరి వియోగం కారణంగా వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించింది.

శిల్ప తన ఇన్‌స్టాగ్రామ్లో రాస్తూ.. "ప్రియమైన స్నేహితులారా బాధతో విషయాన్ని పంచుకుంటున్నా. మా కుటుంబంలో ఒకరి వియోగం కారణంగా ఈ సంవత్సరం మేము మా గణపతి వేడుకలను నిర్వహించుకోవడం లేదు. విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము చింతిస్తున్నాం. మా సంప్రదాయం ప్రకారం 13 రోజుల పాటు సంతాప దినాలను పాటించాలి. అందుకే పండుగలు, ఉత్సవాలకు దూరంగా ఉంటాం.' అంటూ పోస్ట్ చేసింది.

k

శిల్పా శెట్టి కెరీర్..

ఇక శిల్పా శెట్టి కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ సీజన్- 5 లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఆమె చివరిసారిగా అమిత్ సాధ్, దిల్నాజ్ ఇరానీ, కుషా కపిల, పవ్లీన్ గుజ్రాల్ నటించిన సుఖీ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం శిల్పా శెట్టి కెడి: ది డెవిల్‌ అనే కన్నడ చిత్రంలో నటించింది. మూవీతో దాదాపు 18 సంవత్సరాల తర్వాత కన్నడలో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో సత్యవతి పాత్రలో అలరించనుంది. ఈ చిత్రంలో ధ్రువ సర్జాతో పాటు సంజయ్ దత్, వి. రవిచంద్రన్, రమేష్ అరవింద్, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement