
సినిమా తారల కెరీర్ విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలపై కూడా జనాలకు ఆసక్తి ఎక్కువ. వాళ్లు తినే తిండి మొదలు.. ధరించే దుస్తుల వరకు ప్రతీది సాధారణ ప్రజలకు వార్తే అవుతుంది. ఇక వాళ్ల పర్సనల్ లైఫ్‌పై కూడా ఫోకస్ ఎక్కువగానే ఉంటుంది. ప్రేమ, పెళ్లి.. ప్రెగ్నెన్సీ.. ఇలాంటి శుభవార్తలను విని ఆనందించే అభిమానులు చాలా మందే ఉన్నారు. అందుకే కొంతమంది స్టార్స్ సోషల్ మీడియా వేదికగా పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు.
మరికొంతమంది అయితే.. వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడించేందుకు అంతగా ఆసక్తి చూపించరు. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్(Vicky Kaushal ) కూడా ఒకరు. ఆయన పర్సనల్ లైఫ్‌ని గోప్యంగా ఉంచేందుకు ఇష్టపడతాడు. ముఖ్యమైన విషయాలను మాత్రమే అభిమానులతో షేర్ చేసుకుంటాడు. తాజాగా ఆయన ఓ గుడ్ న్యూస్‌ని తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. త్వరలోనే ఆయన తండ్రి కాబోతున్నాడు. ఆయన సతీమణి, స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్(Katrina Kaif ) గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తాజాగా ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేస్తూ..‘మా జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభమైంది’ అని రాసుకొచ్చారు.
అప్పుడు అలా..
కత్రినా కైఫ్ గర్భం దాల్చిందని గత కొన్నాళ్ల క్రితమే వార్తలు వచ్చాయి. ఆమె ప్రెగ్నెంట్ అని.. అందుకే బయటకు ఎక్కువ రావడం లేదని బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఇదే విషయాన్ని ఓ సినిమా ఈవెంట్‌ని విక్కీ కౌశల్‌ని అడిగితే.. అలాంటిదేమి లేదని, శుభవార్త ఉంటే తామే చెబుతామని అన్నారు. దీంతో కత్రినా ప్రెగ్నెంట్ రూమర్ మాత్రమే అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఆమె బేబీ బంప్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కత్రినా తన నివాసంలో బేబీ బంప్‌తో ఫోటో షూట్ చేసిన నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచింది. కత్రినా ప్రెగ్నెంట్ విషయం భర్తకే తెలియదా..విక్కీ ఎందుకు అలా చెప్పాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఈ విషయాన్ని ఈ జంట అధికారికంగా వెల్లడించింది. దీంతో అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నాలుగేళ్ల తర్వాత
కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. 2021 డిసెంబర్ 9న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వయసులో కత్రినా కంటే విక్కీ చిన్నవాడు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా మారబోతున్నారు. సినిమాల విషయానికొస్తే.. ‘ఛావా’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్కీ.. ప్రస్తుతం లవ్ అండ్ వార్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. కత్రినా విషయానికొస్తే.. ‘మల్లీశ్వరి’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలకృష్ణతో కలిసి నటించిన అల్లరి ప్రియుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత కత్రినా.. తన మకాంని బాలీవుడ్‌కి మార్చింది.అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. చివరగా 2024లో విజయ్ సేతుపతితో కలిసి ‘మేరి క్రిస్మస్’ చిత్రంలో నటించింది.