కత్రినా కైఫ్‌కు ప్రెగ్నెన్సీ.. విక్కీ కౌశల్ ఏమన్నారంటే? | Vicky Kaushal Responds On Katrina Kaifs Pregnancy Rumours, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Katrina Pregnant Rumours: ఇప్పుడైతే బ్యాడ్‌ న్యూజ్‌ ఎంజాయ్ చేయండి: విక్కీ కౌశల్

Published Mon, Jul 15 2024 7:47 PM | Last Updated on Mon, Jul 15 2024 7:57 PM

Vicky Kaushal Responds On Katrina Kaifs Pregnancy Rumours

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రస్తుతం బ్యాడ్‌న్యూజ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఓ సాంగ్‌ రిలీజ్‌ కాగా.. వీరిద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో అభిమానులను ఆకట్టుకుంది. ఆనంద్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా.. చిత్రబృందం ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా విక్కీ కౌశల్‌  ఢిల్లీ నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మరోసారి ఆయనకు మరోసారి అలాంటి ప్రశ్నే ఎదురైంది. మీ భార్య ప్రస్తుతం గర్భంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? అని విక్కీ కౌశల్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. 'ఇలాంటి విషయాన్ని అభిమానులతో పంచుకునేందుకు చాలా సంతోషిస్తాం.. ఏదైనా ఉంటే మీతోనే ముందుగా పంచుకుంటామని తెలిపారు. ప్రస్తుతానికైతే ఎలాంటి శుభవార్త లేదని.. అవన్నీ కేవలం రూమర్స్‌ అని కొట్టిపారేశారు.

ఇప్పటికైతే బ్యాడ్ న్యూజ్‌ను ఎంజాయ్ చేయండి.. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మీతో తప్పకుండా పంచుకుంటాం అని నవ్వుతూ అన్నారు. కాగా.. ఇటీవల ముంబైలో జరిగిన అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహానికి విక్కీ, కత్రినా కైఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ బేబీ బంప్‌తో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. దీంతో తాజాగా మరోసారి విక్కీ కౌశల్ క్లారిటీ ఇచ్చారు. బ్యాడ్ న్యూజ్ జూలై 19, 2024న థియేటర్లలో విడుదల కానుంది. కాగా..  డిసెంబర్ 9, 2021న రాజస్థాన్‌లోని ఈ జంట వివాహం చేసుకున్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement