
బాలీవుడ్ భామ, హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఆప్ లీడర్ రాఘవ్ చద్ధాను ఆమె పెళ్లాడింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.
ప్రస్తుతం ఆమె అమర్ సింగ్ చమ్కీలా అనే చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన కనిపించనుంది. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో వైట్ కలర్ అవుట్‌ఫిట్‌లో కనిపించింది. తేలికైన దుస్తుల్లో పరిణీతి కనిపించడంతో అభిమానులు ప్రెగ్నెన్సీతో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పెద్దఎత్తున సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న అమర్ సింగ్ బయోపిక్ చమ్కీలా ఏప్రిల్ 12న విడుదల కానుంది. కాగా.. గతేడాది మే నెలలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట.. సెప్టెంబర్‌లో మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ విషయంపై పరిణీతి చోప్రా ఇంత వరకు స్పందించలేదు. ప్రెగ్నెన్సీ అంటూ వస్తోన్న రూమర్స్‌పై స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
Parineeti Chopra's fashion perfection ♥️😍#ParineetiChopra #Fashion #Celebrity #ViralVideo #Trending #BollyTadka24 pic.twitter.com/XUQcZhXAY1
— Bolly Tadka24 (@bollytadka24) March 6, 2024