Raghav Chadha
-
క్రికెటర్‌గా స్టార్ హీరోయిన్ భర్త.. బౌలింగ్‌లో అదుర్స్.. ఎవరో గుర్తుపట్టారా?
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుగ గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ ఉన్న వీరిద్దరు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు. అయితే హీరోయిన్ భర్త కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే. క్రికెట్లో మంచి బౌలర్ కూడా. తాజాగా ఆయన ఓ దేశవాళీ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనురాగ్ ఠాకూర్ బ్యాటింగ్ చేస్తుండగా తన స్పిన్ బౌలింగ్‌తో అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశాడు. కాగా.. ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ వర్సెస్ రాజ్యసభ ఛైర్మన్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.మాల్దీవుస్‌లో వెడ్డింగ్ డే..గతంలోనే ఈ జంట మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు ఈ జంట. తన భర్త రాఘవ్‌తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీరిద్దరూ మాల్దీవుస్‌లో తమ మొదటి పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. -
ఆయన మా ఇంటికి వస్తారనుకోలేదు.. సంతోషంలో హీరోయిన్ (ఫోటోలు)
-
బీజేపీ గెలుపు కాదు.. కాంగ్రెస్ ఓటమి: ఆప్ సెటైర్లు
ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ గెలుపు సొంతం చేసుకుంది. అయితే.. హర్యానా ఫలితాలపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సెటైర్లు వేశారు. హర్యానాలో బీజేపీ గెలుపును అంగీకరించలేనని అన్నారు. బీజేపీ విజయం అనటం కంటే.. కాంగ్రెస్ ఓటమే అధికమని అన్నారు. అధికార బీజేపీ పార్టీకి 39 శాతం ఓట్ల వస్తే.. 61 శాతం ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయని గుర్తు చేశారు.‘‘ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ బీజేపీకి వస్తే నేను ఆ పార్టీ విజయాన్ని అంగీకరించేవాడిని. కానీ, అలా జరగలేదు. హర్యానాలో ఓట్లు బీజేపీకి గెలుపు కోసం పడలేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయి. 39 శాతం ఓట్లు బీజేపీకి పడ్డాయి. అదే బీజేపీకి 61 శాతం వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు. ఇది బీజేపీ గెలుపు కాదు.. కాంగ్రెస్ ఓటమి’’ అని అన్నారు. మరోవైపు.. జమ్ము కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి కాంగ్రెస్ ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగిందని, అందుకే బీజేపీని ఓడించగలిగిందని అన్నారు. ‘‘ జమ్ము కశ్మీర్లో ఇండియా కూటమి ఒక యూనిట్‌గా పోరాటం చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి కూటమిగా బరిలో దిగటంతో బీజేపీ ఓడిపోయింది. కానీ, హర్యానాలో దురదృష్టవశాత్తు.. ఇండియా కూటమి పార్టీలు ఒంటరిగా బరిలో దిగటంతో ఫలితం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వచ్చింది’’ అని అన్నారు.చదవండి: బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్ -
మాల్దీవుస్‌లో పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్..!
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను ప్రేమ వివాహం చేసుకుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుగ గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ ఉన్న వీరిద్దరు చివరికీ ఏడడుగులు వేశారు.(ఇది చదవండి: పెళ్లై నెల కాలేదు.. భర్తతో కాకుండా మరొకరితో హనిమూన్ ఎంజాయ్)ఇటీవల తమ మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు ఈ జంట. ఈ సందర్భంగా పరిణితీ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన భర్త రాఘవ్‌తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీరిద్దరూ మాల్దీవుస్‌లో తమ మొదటి పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by @parineetichopra -
కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా ప్రకటనపై రాఘవ్ చద్దా రియాక్షన్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటనపై ఆప్ నేత రాఘవ్ చద్దా స్పందించారు. రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ అగ్ని పరీక్షను ఎదుర్కునేందుకు సిద్దమయ్యారు.కేజ్రీవాల్ ఈరోజు అగ్నిపరీక్షను ఎదుర్కునేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌కి ఓటు వేయడం ద్వారా ఆయన నిజాయితీని నిరూపించుకుంటారు. అంతేకాదు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన దీవార్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ.. ఢిల్లీ ప్రజలు తమ చేతులపై కేజ్రీవాల్ నిర్దోషి అని రాస్తారని అన్నారు.కాగా, మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం, రెండ్రోజుల తర్వాత తాను సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రజలు తీర్పు చెప్పే వరకు ఆ కుర్చీలో కూర్చోను. ఢిల్లీలో ఎన్నికలకు నెలరోజుల సమయం ఉంది. న్యాయస్థానం నుంచి నాకు న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రజాకోర్టు నుంచి న్యాయం జరిగి ప్రజల ఆజ్ఞ మేరకే నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాను’ అని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: సిద్ద రామయ్య వైపు దూసుకొచ్చిన అగంతకుడు -
ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గించాలి: ఆప్ ఎంపీ
న్యూఢిల్లీ: దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాజ్యసభలో అత్యంత పిన్న వయస్కుడైన చద్దా గురువారం మాట్లాడుతూ.. యువ భారత్‌కు యువ రాజకీయ నాయకులు ఎంతో అవసరమని తెలిపారు. ప్రస్తుతం దేశ జనాభాలో 65 శాతం ప్రజలు 35 సంవత్సరాలలోపే ఉన్నారని పేర్కొన్నారు. జనాభాలో 50 శాతం మంది ప్రజలు 25 ఏళ్ల లోపువారే ఉన్నారని చెప్పారు. ‘‘యువ భారతం మనది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే 25 ఏళ్లు ఉండాలనే నిబంధన ప్రస్తుత కాలానికి సరిపోదు. ప్రస్తుతం దేశ జనాభాలో 50 శాతం మంది ప్రజలు 25 ఏళ్ల లోపువారే ఉన్నారు. ఇక 65 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారే. దేశానికి స్వాతంత్రం వచ్చాక తొలిసారి లోక్‌సభ ఎన్నికైనప్పుడు 26 శాతం మంది సభ్యులు 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారే.ఇక రెండు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 40 ఏళ్లలోపు వారు కేవలం 12 శాతం మంది మాత్రమే ఎన్నికయ్యారు. యువ భారత్‌కు యువ రాజకీయ నాయకులు ఎంతో అవసరం. అందుకే ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలి. ఇదే కేంద్ర ప్రభుత్వానికి నా సూచన. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను’ అని రాఘవ్ చద్దా అన్నారు. #WATCH | In Rajya Sabha, AAP MP Raghav Chadha demands the minimum age for contesting elections in India should be reduced from 25 years to 21 years. He says "India is one of the youngest countries in the world. 65% of our population is less than 35 years old and 50% of our… pic.twitter.com/NjL8p2Qjmb— ANI (@ANI) August 1, 2024 -
ఇల్లమ్మితే... బోలెడు నష్టం!
కేంద్ర బడ్జెట్ 2024లో ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మండిపడ్డారు. ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను తొలగిస్తే.. రియల్ ఎస్టేట్‌లో భారీగా నల్లధనం వచ్చి చేరుతుంది. కాబట్టి దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.ప్రపంచవ్యాప్తంగా, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రోత్సహించారు. అయితే ఇప్పుడు ఇండెక్సేషన్‌ను తొలగించడం ద్వారా పెట్టుబడిదారీ వర్గం వెనుకడుగు వేస్తుంది. ఇండెక్సేషన్‌ను తీసివేయడం అంటే పన్ను విధించడం కాదు.. పెట్టుబడిదారులకు జరిమానా విధించడంతో సమానం అని అన్నారు.2024 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన ప్రతిపాదనలో పాత ఆస్తులను విక్రయించే వ్యక్తులు అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుందని రాఘవ్ చద్దా తెలిపారు.బడ్జెట్లో, ప్రభుత్వం స్థిరాస్తులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. అయితే ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయడానికి ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించింది. ఇండెక్సేషన్‌ను పునరుద్దరించకపోతే.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు తగ్గుతాయి, ప్రజలు తమకు నచ్చిన డ్రీమ్ హోమ్‌లను కొనుగోలు చేయడం సాధ్యం కాదని చద్దా అన్నారు.ఇండెక్సేషన్ అనేది బాండ్లు, స్టాక్‌లు, రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడులను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేసే పద్ధతి. సాధారణంగా ఇందులో పెట్టుబడి ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఉంటాయి. అయితే ద్రవ్యోల్బణం వల్ల వాస్తవ పెట్టుబడి విలువ తగ్గిపోతుంది. ఈ సమయంలో అప్పటికి ఉన్న ధరలకు అనుకూలంగా అడ్జస్ట్ చేయడానికి ఇండెక్సేషన్ ఉపయోగపడుతుంది.Removal of ‘Indexation’ benefit from the Investor is a grave mistake by the Government. I explain in detail. Please watch. pic.twitter.com/AhB7vViy0n— Raghav Chadha (@raghav_chadha) July 25, 2024 -
బీజేపీపై 18 శాతం జీఎస్టీ విధించిన ప్రజలు..ఆప్ ఎంపీ చద్దా సెటైర్లు
ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర బడ్జెట్‌పై సెటైర్లు వేశారు. ఇంగ్లాండ్ తరహాలో భారతీయులు ట్యాక్స్‌లు కడుతుంటే సర్వీసులు మాత్రం సోమాలియా తరహాలో ఉన్నాయని మండిపడ్డారు.రాజ్యసభలో కేంద్ర బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా రాఘవ్ చద్దా మాట్లాడారు. బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని, బీజేపీ మద్దతు దారులు, ఓటర్లతో సహా సమాజంలోని అన్నీ వర్గాల ప్రజల్ని సంతృప్తి పరచడంలో విఫలమైందని పేర్కొన్నారు.సాధారణంగా కేంద్ర బడ్జెట్‌ను సమర్పించినప్పుడు, సమాజంలోని కొన్ని వర్గాలు సంతోషంగా, మరికొన్ని వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేయడం సర్వసాధారణం. అయితే ఈసారి కేంద్రం అన్నీ వర్గాల వారిని అసంతృప్తికి గురి చేసింది. అందులో బీజేపీ మద్దతు దారులు సైతం ఉన్నారని తెలిపారు.అదే సమయంలో కేంద్ర వసూలు చేస్తున్న ట్యాక్స్‌లపై మండిపడ్డారు. గత పదేళ్లుగా ప్రభుత్వం ఆదాయపు పన్ను, జీఎస్టీ, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వంటి పన్నులు విధించి ప్రజల ఆదాయంలో 70-80 శాతం మొత్తాన్ని తీసుకుంటోంది. అందుకు ప్రతిఫలంగా కేంద్రం ప్రజలకు ఎలాంటి ప్రయోజనాల్ని అందిస్తోంది? అని ప్రశ్నించారు. ట్యాక్స్ కడుతున్నందుకు ప్రజలకు ఎలాంటి సేవల్ని అందిస్తున్నారని ప్రశ్నించిన చద్దా.. మేము ఇంగ్లండ్‌లో లాగా పన్నులు చెల్లిస్తాము, కానీ సోమాలియాలో సేవలను పొందుతున్నాము. ప్రభుత్వం మాకు ఎలాంటి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ, రవాణా విద్యను అందిస్తోంది? అని విమర్శలు గుప్పించారు.ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పనితీరుపై స్పందించిన ఆప్ ఎంపీ.. 2019లో బీజేపీ ప్రభుత్వానికి 303 సీట్లు వచ్చాయి. అయితే దేశ ప్రజలు ఆ సీట్లపై 18 శాతం జీఎస్టీ విధించి వాటిని 240కి తగ్గించారని ఎద్దేవా చేశారు. బీజేపీ సీట్ల సంఖ్య తగ్గడానికి ఆర్థిక వ్యవస్థతో పాటు ఆహార ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తలసరి ఆదాయం వంటి అనేక ఇతర కారణాలను పేర్కొన్నారు. ఈ పోకడలు కొనసాగితే భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్య 120 సీట్లకు పడిపోయే అవకాశం ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
మరో ఎంపీ లండన్‌లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సమయంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఇండియాలో లేరని విమర్శలు వస్తున్నాయి. అయితే వాటిపై స్వాతి మలివాల్ స్పందించారు.‘‘ హార్వార్డ్ యూనివర్సిటీలో ఓ సెమినార్ పాల్గొనడానికి నేను మార్చిలో అమెరికా వెళ్లాను. ఆప్ వలంటీర్లు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా. నా సోదరికి కోవిడ్ సోకటం కారణంగా నేను ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. అమెరికాలో ఉన్న భారత్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో టచ్ ఉన్నాను. ...ఆప్ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లడుతూ.. ట్వీట్లు చేస్తూ వచ్చాను. ఆ సమయంలో నేను చేయగలిగింది చేశాను. ఆ సమయంలో పార్టీ కోసం నేను పని చేయలేదనటం చాలా దురదృష్టకరం. మరో రాజ్యసభ ఎంపీ లండన్‌లో ఉన్నా.. నన్ను మాత్రమే ఎందుకు ఇలా ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావటం లేదు’’ అని పేర్కొన్నారు.ఇక కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా భారత్‌లో లేకపోటంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన కంటి శస్త్రచికిత్సకు లండన్ వెళ్లి ఇటీవల భారత్ తిరిగి వచ్చారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల ర్యాలీల్లో రాఘవ్ పాల్గొంటున్నారు. ఇటీవల (మే 13) సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ కేసు నమోదు చేసిన విషయంలో తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కోనసాగుతోంది. ఆమెపై దాడి జరిగినట్లు చేస్తున్న ఆరోపణల వెనక బీజేపీ కుట్ర ఉందని ఆప్ నేతలు విమర్శలు చేస్తున్నారు. -
’ఆప్‘ రాకతో నెలకు రూ. 18 వేలు ఆదా: రాఘవ్ చద్దా
ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రచారపర్వంలో అటు బీజేపీ ఇటు ఆప్, కాంగ్రెస్‌లు దూసుకుపోతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ప్రచారంలో పాల్గొన్న ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మాట్లాడుతూ ఢిల్లీలో తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి కుటుంబం విద్యుత్, తాగునీరు, మందులు, పాఠశాల ఫీజులపై ప్రతి నెలా రూ. 18 వేలు ఆదా చేస్తున్నదని పేర్కొన్నారు.త్వరలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలోని మహిళలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున అందజేయనుందని అన్నారు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుండి ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ తరపున ప్రచారం చేపట్టిన ఆయన.. నిరాడంబరమైన నేపథ్యాలు కలిగిన వారు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులకు చేరుకోవడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.‘ఆప్’ ఎల్లప్పుడూ సాధారణ కుటుంబాలకు చెందిన వారిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేసిందని, కుల్దీప్ కుమార్, తాను దీనికి ఉదాహరణ అని ఆయన అన్నారు. విద్యావంతులు, నిజాయితీ గల ప్రతినిధులను ఎన్నుకోవడానికి గల ప్రాముఖ్యతను రాఘవ్ చద్దా వివరించారు. -
విదేశాల నుంచి ఆప్ ఎంపీ .. సీఎం కేజ్రీవాల్‌తో భేటీ
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఆయన గత కొన్ని నెలలుగా బ్రిటన్‌లో ఉన్నారు. అక్కడ ఆయనకు కంటి శస్త్రచికిత్స జరిగింది. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో రాఘవ్ చద్దా ఇక్కడ లేరు. రాఘవ్ చద్దా గైర్హాజరుపై ప్రతిపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నాయి.ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతల్లో రాఘవ్ చద్దా ఒకరు. ఆయన బహిరంగ వేదికలపై పార్టీకి మద్దతుగా మాట్లాడేవారు. కొన్ని నెలల క్రితం ఆయన కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు బ్రిటన్ వెళ్లారు. ఆ దరిమిలా ఆమ్ ఆద్మీ పార్టీ పలు సమస్యలను ఎదుర్కొంది. మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దీనిపై పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.ఆమ్ ఆద్మీ పార్టీలో గందరగోళం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రాఘవ్ చద్దా విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఇటీవల రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం పీఏ విభవ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను తనను కొట్టారని, సీఎం సభలో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.కాగా స్వాతి ఇదంతా బీజేపీ డైరెక్షన్లో చేస్తున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. స్వాతి మలివాల్ సీఎం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని, వారిని బెదిరించారని ఆప్ నేత అతిషి ఆరోపించారు. -
రాఘవ్ చద్దా కంటి అపరేషన్: విట్రెక్టమీ అంటే ఏమిటి? అంత ప్రమాదమా?
పంజాబ్‌కు చెందిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అత్యవసర కంటి శస్త్రచికిత్సకోసం లండన్‌లో ఉన్నారు. రెటీనాకు రంధ్రం కారణంగా విట్రెక్టమీ సర్జరీకోసం లండన్‌కు వెళ్లినట్టు ఢిల్లీ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. అసలు విట్రెక్టమీ అంటే ఏమిటి? కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందా? ఆ వివరాలు ఒకసారి చూద్దాం.రాఘవ్ చద్దాం రెటీనాలో రంధ్ర కారణంగా కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అందుకే అత్యవసరంగా ఆయనకు ఆపరేషన్ చేశారు. ఇది ప్రమాదకరమే అయినప్పటికీ, శస్త్రచికిత్స బాగానే జరిగిందని ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలుస్తోంది. బయటికి వెళ్లకుండా, ఎండతగలకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులుఘసూచించారనీ, పరీక్షలు, చెకప్ కోసం వారానికి రెండుసార్లు వైద్యుడిని సందర్శించాల్సిఉంటుందనీ ఈ నేపథ్యంలో డాక్టర్లు అనుమతి ఇచ్చినప్పుడే అతను ఇండియా వచ్చే అవకాశం ఉందని బంధువుల సమాచారం.విట్రెక్టమీ అంటే ఏమిటి?జాన్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం, కంటి లోపల రెటీనా వెనుక ఏర్పడిన జెల్ లాంటి పదార్థాన్ని (విట్రస్ జెల్)ని బయటకు తీసివేసేందుకు నిర్వహించే సర్జరీనే విట్రెక్టమీ అంటారు. రెటీనా వెనుక పేరుకున్న పదార్థాన్ని తొలగించి, సెలైన్ ద్రావణంతోగానీ, గ్యాస్ బబుల్‌తో గానీ ఆ ప్రదేశాన్ని భర్తీ చేస్తారు.మధుమేహం కారణంగావచ్చే డయాబెటిక్ రెటినోపతి, రెటీనా డిటాచ్మెంట్, విట్రస్ హెమరేజ్ లేదా తీవ్రమైన కంటి గాయాలు, కంటి ఇన్ఫెక్షన్లు, కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత సమస్యలు, ఇతర కంటి సమస్యల కారణంగా విట్రెక్టమీ అవసరం కావచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసినా, చికిత్స చేయకుండా వదిలివేసినా, అంధత్వానికి దారితీయవచ్చు.కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా కాంతిని సంగ్రహించి, మెదడుకు దృశ్య సంకేతాలను ప్రసారం చేస్తుంది. క్లియర్ విట్రస్ జెల్ కాంతిని రెటీనాకు చేరవేస్తుంది. తద్వారా మనకు దృశ్యాలు కనిపిస్తాయి. అయితే అక్కడ రక్తం గడ్డకట్టడం, గడ్డలు లాంటివి ఈ కాంతిని అడ్డు పడతాయి. ఫలితంగా దృష్టి లోపం ఏర్పడుతుంది. రెటీనాకు ప్రాప్యతను మెరుగుపరచడానికి దానిపై ఒత్తిడిని తగ్గించడానికి విట్రెక్టోమీ చేస్తారు.తద్వారా కంటిచూపు మెరుగవుతుంది. కొన్నిసందర్భాల్లో, కోల్పోయిన దృష్టిని పునరుద్ధరించడంలో సహాయ పడుతుంది.విట్రెక్టమీ: ప్రమాదమా?విట్రెక్టమీ అనేది డయాబెటిక్ ఐ డిసీజ్ (డయాబెటిక్ రెటినోపతి), రెటీనా డిటాచ్మెంట్లు, మాక్యులర్ హోల్స్, మాక్యులర్ పుకర్, విట్రస్ హెమరేజ్‌తో సహా కొన్ని వ్యాధి పరిస్థితులలో కంటి కేంద్ర కుహరం నుండి విట్రస్ను తొలగించే శస్త్రచికిత్సా ప్రక్రియ. ప్రత్యేకంగా రూపొందించిన సాధనాలు, సాంకేతికతలను ఉపయోగించి రెటీనా సర్జన్ చేస్తారు. లోకల్ అనస్థీషియాలో నిర్వహించే డే కేర్ ప్రక్రియ. సాధారణంగా, విట్రెక్టోమీకి సుమారు రెండు గంటలు పడుతుంది, కొన్నిసార్లు,క్లిష్టమైన కేసులకు ఎక్కువ సమయం పడుతుంది. విట్రెక్టమీని ప్రస్తుతం ఆధునిక పద్దతుల్లో 23 గేజ్ ట్రోకార్- కాన్యులా సిస్టమ్ (మైక్రోఇన్సిషన్ సర్జరీ) ద్వారా కుట్లు లేకుండా, వేగంగా చేస్తున్నారు.విట్రెక్టోమీ సాధారణంగా సురక్షితమైనది.కంటిచూపును కాపాడటం కోసం చేసే సర్జరీ. కానీ ఇతర ఆపరేషన్ల మాదిరిగానే రోగి వయస్సు, ఆరోగ్యం , కంటి సమస్య తీవ్రతను బట్టి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ఇన్ఫెక్షన్ రావచ్చుఅధిక రక్తస్రావం అయ్యే ప్రమాదంకంటి లోపల ఒత్తిడి పెరగుతుంది.శస్త్రచికిత్స కారణంగా కొత్త రెటీనా డిటాచ్మెంట్ సమస్యకంటి లెన్స్ దెబ్బతినడంకంటిశుక్లం ఏర్పడే అవకాశంశస్త్రచికిత్స అనంతర కంటి కదలికలో ఇబ్బందులువక్రీభవన లోపంలో మార్పులు (అద్దాలు, లెన్స్ అవసరం)ఈ శస్త్రచికిత్స అసలు సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోవచ్చు కూడా. దీనికి మరో శస్త్రచికిత్స అవసరం కావచ్చు. కాగా హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ చద్దా గత ఏడాది సెప్టెంబర్‌లో ఉదయపూర్‌లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పరిణీతి తన లేటెస్ట్ మూవీ అమర్ సింగ్ చమ్కిలా ప్రమోషన్లో బిజీగా ఉంది. -
ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఎన్నికల ప్రచారానికి గైర్హాజరు కావడంపై ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. రాఘవ్ చద్దా కంటి శస్త్ర చికిత్స కోసం యూకేలో ఉన్నారని తెలిపారు. రాఘవ్ కళ్లకి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. చికిత్స పొందేందుకు యూకే వెళ్లారు. సమస్య తీవ్రమైనదని, సకాలంలో చికిత్స అందించకపోతే అంధత్వం వచ్చే అవకాశం ఉందని రాఘవ్ చద్దా తన చెప్పారంటూ భరద్వాజ్ వెల్లడించారు.రాఘవ్ చద్దా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. కోలుకున్న వెంటనే ఆయన ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. చికిత్స కోసం భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నాటి నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ తరుపున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్ధులకు మద్దతుగా సునీతా కేజ్రీవాల్ ప్రచారం చేయడంతో పాటు ఇతర పరిణామాలపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్పందిస్తూ వస్తున్నారు. -
‘రాఘవ్ చద్దా ఎక్కడ?’.. పోస్ట్ డిలీట్ చేసిన ఎన్సీపీ నేత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన అరెస్ట్‌ను ఆప్ మంత్రులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఇకప్పటికీ స్పందించకపోవటంపై ఎన్సీపీ (శరద్ పవార్) నేత జితేంద్ర అవధ్ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. అయితే ప్రతిపక్షాల కూటమిలో భాగంగా.. ఎన్సీపీ, ఆప్ భాగస్వామ్య పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఎంపీ రఘవ్ చద్దా స్పందించలేదని ఎన్సీపీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. ‘రఘవ్ చద్దా ఎక్కడ?’ అని ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టిన ఎన్సీపీ నేత జితేంద్ర అవధ్ తర్వాత దాన్ని డిలీట్ చేయటం గమనార్హం. శనివారం జితేంద్ర అవధ్ మాట్లాడుతూ.. ‘ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి రాజ్యసభ ఎంపీ రఘవ్ చద్దా కనిపించటం లేదు. ఆ పార్టీ నేతలు కేజ్రీవాల్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. కానీ, ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎంపీ రాఘవ్ చద్దా మాత్రం కనిపించటం లేదు. ఆప్‌కు రాఘవ్ చద్దా కీలకమైన నేత.. ఆయన ఇక్కడ లేకపోవటం, అరెస్ట్‌పై స్పందించకపోవటం కార్యకర్తలను అవనించినట్లే’ అని జితేంద్ర అన్నారు. దూరంగా వేరే దేశంలో ఉన్నంత మాత్రనా ప్రజలతో కనెక్ట్కాలేని రోజుల కాలం కాదు. ఆయన లండన్‌లో ఉన్పటికీ కనీసం స్పందిచకపోవటం చాలా విచిత్రం. ఒక వీడియో సందేశమైనా పార్టీకి, కార్యకర్తలకు పంపాలి. రఘవ్ చద్దా పూర్తిగా కనిపించకుండా, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నా’ అని ఎనన్సీపీ నేత జితేంద్ర అవధ్ అన్నారు. ఇక.. రఘవ్ చద్దా, ఆయన భార్య పరిణితి చోప్రాతో కలిసి లండన్ వెళ్లారు. కంటికి సంబంధించిన చికిత్స కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుసస్తోంది. ఢల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 1తో ఈడీ కస్టడీ ముగియనుంది. -
ప్రియుడితో పెళ్లి.. స్టార్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ..!
బాలీవుడ్ భామ, హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఆప్ లీడర్ రాఘవ్ చద్ధాను ఆమె పెళ్లాడింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె అమర్ సింగ్ చమ్కీలా అనే చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన కనిపించనుంది. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో వైట్ కలర్ అవుట్‌ఫిట్‌లో కనిపించింది. తేలికైన దుస్తుల్లో పరిణీతి కనిపించడంతో అభిమానులు ప్రెగ్నెన్సీతో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పెద్దఎత్తున సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న అమర్ సింగ్ బయోపిక్ చమ్కీలా ఏప్రిల్ 12న విడుదల కానుంది. కాగా.. గతేడాది మే నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. సెప్టెంబర్‌లో మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ విషయంపై పరిణీతి చోప్రా ఇంత వరకు స్పందించలేదు. ప్రెగ్నెన్సీ అంటూ వస్తోన్న రూమర్స్‌పై స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) Parineeti Chopra's fashion perfection ♥️😍#ParineetiChopra #Fashion #Celebrity #ViralVideo #Trending #BollyTadka24 pic.twitter.com/XUQcZhXAY1 — Bolly Tadka24 (@bollytadka24) March 6, 2024 -
‘కేజ్రీవాల్ ఒక అడాల్ఫ్ హిట్లర్’
చంఢీఘర్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చాడు. ఇప్పటికే.. హర్యాణలోని చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేస్తాయని ఇటు ఆప్ నేత రాఘవ్ చద్దా.. అటు కాంగ్రెస్ నేత పవన్ కుమార్ బన్సల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై నేడు కొన్ని గంటల ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేజ్రీవాల్ భేటీ కూడా అయ్యారు. వారి భేటీ ముగిసిన అనంతరమే పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ను నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చాడు. కేజ్రీవాల్ పాలన హిట్లర్ నియంత పాలన వలే ఉంటుందని మండిపడ్డారు. మొదట ఆప్ పార్టీ కార్యాలయాల్లో డా.బీఆర్ అంబేద్కర్, భగత్‌సింగ్‌ల వంటి మహనీయుల ఫొటోలను తొలగించాలని.. వాటి స్థానంలో నియంత అడాల్ఫ్ హిట్లర్ ఫొటోలు పెట్టుకోవాలని దుయ్యబట్టారు. ఆప్ నేతలంగా అడాల్ఫ్ హిట్లర్ వలే ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చంఢీఘర్ మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమిలో భాగంగా కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. ఆప్‌కు మేయర్ పదవి, కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి అని కూడా చర్చించుకున్నారు. అయితే ఇప్పటివరకు ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరూ స్పందించకపోవటం గమనార్హం. ఇక.. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు రావొచ్చని ఇరు పార్టీల కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. చదవండి: Flight Delays: శశి థరూర్‌కు సింధియా కౌంటర్ -
‘ఇండియా కూటమి చారిత్రక గెలుపు నమోదు చేస్తుంది’
న్యూఢిల్లీ: చంఢీఘర్ మేయర్ స్థానాన్ని ఇండియా కూటమి కైవసం చేసుకుంటుందని అమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత రాఘవ్ చద్దా జోష్యం చెప్పారు. ఎప్రిల్/మే నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు చంఢీఘర్ మేయర్ విజయం.. ఇండియా కూటమి విజయానికి నాంది పలకనుందని తెలిపారు. జనవరి 18వ తేదీ జరిగే చంఢీఘర్ మేయర్ ఎన్నికలపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో ఇండియా కూటమి చారిత్రక, నిర్ణయాత్మక గెలుపు సొంతం చేసుకుంటుంది. మొదటి సారిగా ఇడియా కూటమి, బీజేపీ మధ్య పోరు జరగనుంది. మేయర్ ఫలితాలు విడుదలయ్యాక ఇండియా కూటమి-1, బీజేపీ-0గా మారబోతుంది. ఈ గెలుపుతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇండియా కూటమి విజయానికి నాంది పలకనుంది’ అని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. #WATCH | Delhi | AAP MP Raghav Chadha says, "INDIA Alliance will fight the Chandigarh Mayor elections with all its strength and register a historic and decisive victory. Don't consider this an ordinary election. This will be an election where for the first time it will be INDIA… pic.twitter.com/l7d4Ej1kpg — ANI (@ANI) January 16, 2024 ఇండియా కూటమి చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో పూర్తి సామర్థ్యంతో పోరాడి గెలుపొందుతుందని తెలిపారు. ఈ ఎన్నికలను సాధారణ ఎన్నికలుగా భావించమని పూర్తిస్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు తాము ఈ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తామని తెలిపారు. చదవండి: ‘రామ మందిర కార్యక్రమం... మోదీ రాజకీయ కార్యక్రమం’ -
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్ ఎత్తివేత
ఢిల్లీ: ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు ప్రవేశపెట్టిన తీర్మాణంపై ధంఖర్ సానుకూలంగా స్పందించారు. ఎంపీ రాఘవ్ చద్దా ఇప్పటివరకు అనుభవించిన సస్పెన్షన్‌ను తగిన శిక్షగా పరిగణించాలని ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రవేశపెట్టిన తీర్మాణంలో పేర్కొన్నారు. నేటి నుంచి రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను నిలిపివేయడాన్ని సభ పరిశీలించవచ్చని ధంఖర్‌ను కోరారు. AAP MP Raghav Chadha returns to the Parliament as his suspension was revoked by Rajya Sabha Chairman Jagdeep Dhankhar, after 115 days. pic.twitter.com/zDWWk80p2l — ANI (@ANI) December 4, 2023 తన సస్పెన్షన్‌ను రద్దు చేయడంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు. ఛైర్మన్ ధంఖర్ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఛైర్మన్ జగదీప్ ధంఖర్‌కు ధన్యవాదాలు తెలిపారు. "సుప్రీంకోర్టు జోక్యంతో నాపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు అయింది. నన్ను 115 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఆ సమయంలో ప్రజల గొంతును సభలో వినిపించలేకపోయాను. రాజ్యసభ ఛైర్మన్‌కు ధన్యావాదాలు తెలియజేస్తున్నాను" అని వీడియో సందేశంలో చెప్పారు. #WATCH | AAP MP Raghav Chadha's suspension revoked by Rajya Sabha Chairman Jagdeep Dhankhar on the motion moved by BJP MP GVL Narasimha Rao. pic.twitter.com/I0UlbnORTe — ANI (@ANI) December 4, 2023 దేశ రాజధాని ఢిల్లీ (సవరణ) బిల్లు-2023పై ప్రతిపాదిత సెలక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే కొందరు సభ్యుల పేర్లను చేర్చారంటూ గత వర్షాకాల సమావేశాల్లో రాఘవ్ చద్దాను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. రాఘవ్ చద్దాను సస్పెండ్ చేయాలంటూ పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార ఆరోపణలపై ఆయనపై సస్పెన్స్ వేటు పడింది. ఇదీ చదవండి: Madhya Pradesh: దిగ్విజయ్‌కు ఘోర పరాభవం.. -
అవన్నీ ఫేక్.. అలా చేయొద్దంటూ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఈ ఏడాది పెళ్లిబంధంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు సెప్టెంబరు 24, 2023న రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అయితే ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ను ఆస్వాదిస్తున్న బ్యూటీ సోషల్ మీడియా ఫ్యాన్స్, ఫ్యాన్ క్లబ్స్ పేజీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కొందరు తమ అభిమాన నటులను ప్రశంసించుకోవడానికి పలువురు తన పేరును ఉపయోగిస్తున్నారని పరిణీతి మండిపడింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. 'నా పేరుని ఉపయోగించి కొందరు ఫ్యాన్ పేజీలు తమ అభిమాన నటులకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటివీ చాలా నా దృష్టికి వచ్చాయి. నా పేరుతో వస్తున్న ఇలాంటి పోస్టులన్న నకిలీవి. ఇలా ఏ ఒక్కరినీ పొగిడేందుకు నేను ఎలాంటి ఇంటర్వ్యూలూ ఇవ్వడం లేదు. ఇలా మరోసారి జరిగితే కచ్చితంగా ఫిర్యాదు చేస్తా . మీరు ఏదైనా పోస్టు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోండి.' అంటూ కాస్తా ఘాటుగానే ఇచ్చిపడేసింది. కాగా.. 2011లో బాలీవుడ్‌లోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన పరిణీతి చోప్రా ఆ తర్వాత శుద్ధ్ దేశీ రొమాన్స్, కిల్ దిల్, డిష్యూం, కేసరి, సైనా, ది గర్ల్ ఆన్ ది ట్రైన్ చిత్రాల్లో ఆమె నటించారు. పరిణీతి చివరిసారిగా అక్షయ్ కుమార్ నటించిన మిషన్ రాణిగంజ్‌లో కనిపించింది. ఆమె ప్రస్తుతం చమ్కిలా చిత్రంలో దిల్జిత్ దోసాంజ్‌తో స్క్రీన్ పంచుకోనుంది. -
రాజ్యసభ ఛైర్మన్‌కు క్షమాపణలు చెప్పండి: చద్దాకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్కు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ ఛద్దాకు స్పష్టం చేసింది. రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేస్తూ ఛైర్మన్ తీసుకన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఛద్దా సుప్రీంకోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ విషయమై శుక్రవారం చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపి తీర్పునిచ్చింది. ఛద్దా క్షమాపణలను రాజ్యసభ ఛైర్మన్ కూడా సానుభూతితో పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు బెంచ్ సూచించింది. సస్పెన్షన్ కేసులో ఛద్దా నేరుగా ఛైర్మన్‌ను కలిసి క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. సీజేఐ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ శుక్రవారం తీర్పునిస్తూ.... రాజ్యసభ చైర్మన్ అయిన జగ్దీప్ ధన్కర్.. చద్దా క్షమాపణలను సానుభూతితో పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ కేసులో ముందుకు వెళ్లే మార్గాన్ని సృష్టించేందుకు ప్రయత్నించాలని సూచించారు. అయితే ఆప్ ఎంపీ అయిన రాఘవ్ చద్దా తొలిసారి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారని, ఆయన అత్యంత పిన్న వయస్కుడన్న విషయాన్ని ప్రస్తావించారు. కోర్టు ఆదేశాలపై చద్దా తరపు న్యాయవాది షాదన్ ఫరాసాత్ స్పందిస్తూ.. రాజ్యసభ చైర్మన్‌ను క్షమాపణలు కోరడంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. చైర్మన్‌కు కలిసి క్షమాపణలు కోరేందుకు చద్దా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆప్ ఎంపీ క్షమాపణలు చెప్పడం సరైనదేనని కేంద్రం తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా అంగీకరించారు. అనంతరం ఈ కేసులో పురోగతిని నవంబర్ 20న తెలియజేయలన్న సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా కాగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ సీనియర్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నియంత్రణ కోసం ఉద్దేశించిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’ పరిశీలించేందుకు ప్రతిపాదిత సెలక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే అయిదుగురు సభ్యుల పేర్లను చేర్చారన్న ఆరోపణలపై గత వర్షాకాల సమావేశాల్లో రాఘవ్ చద్దాను ఆగస్టు 11న రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి, నివేదిక ఇచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ తెలిపింది. రాఘవ్ చద్దాను సస్పెండ్ చేయాలంటూ పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార వైఖరి ఆరోపణలపై ఆయనపై సస్పెన్స్ వేటు పడింది. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి నివేదిక ఇచ్చేంత వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. దీనిపై రాఘవ్ చద్దా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
అరెస్టు కానున్న నేతలు వీరే: ఆప్
కోల్‌కతా: మమత ఆరోపణలు వాస్తవమేనని ఆప్ పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లోపు విపక్ష ఇండియా కూటమి నేతలందరినీ ఏదోలా జైలుపాలు చేయాలని మోదీ సర్కారు కుట్ర చేస్తోందని ఆ పార్టీ నేత రాఘవ్ ఛద్దా ఆరోపించారు. తొలుత తమ అధినేత కేజ్రీవాల్‌ను అరెస్టు చేయజూస్తోందన్నారు. 2014 నుంచి దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసుల్లో ఏకంగా 95 శాతం విపక్ష నేతలపైనే కావడం మోదీ సర్కారు కక్షపూరిత వైఖరిని అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. ‘‘ఇండియా కూటమి ఆవిర్భావంతో బీజేపీ వణికిపోతోంది. అందుకే విపక్ష కూటమిలోని అగ్ర నేతలందరినీ లక్ష్యంగా చేసుకుందని మాకు విశ్వసనీయ వర్గాల నుంచి ఇప్పటికే సమాచారం అందింది. ‘‘కేజ్రీవాల్ తర్వాత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీలను అరెస్టు చేయడం మోదీ సర్కారు లక్ష్యం. వారి తర్వాత జాబితాలో కేరళ సీఎం పినరయ్ విజయన్, తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్, శివసేన, ఎన్సీపీల అగ్ర నేతలున్నారు’’ అని ఆరోపించారు. -
నోరు నొక్కేందుకే ఈ కుట్ర: భయపడుతూ కూచుంటే ఎలా?
న్యూఢిల్లీ: బాలీవుడ్నటి పరిణీతి చోప్రో భర్త, ఆప్ ఎంపీ, రాఘవ్ చద్దాకు ఊరట లభించింది. ఢిల్లీలోని ప్రభుత్వం బంగ్లాను ఖాళీ చేయాలన్న ట్రయల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు పక్కన పెట్టింది. అయితే ఏప్రిల్ ఆర్డర్‌ను రద్దు చేస్తూ అక్టోబర్ 5న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాఘవ్ చద్దా సవాలు చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో రాఘవ్ చద్దాకు భారీ ఊరట లభించింది. పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ, రాఘవ్ చద్దా తన ప్రభుత్వ బంగ్లాలో ఉండవచ్చని, దానిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తెలిపింది. ఏప్రిల్ 18న సిటీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ అనుప్ జైరామ్ భంభానీతో కూడిన సింగిల్ బెంచ్ సమర్ధించింది. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం ఈ తీర్పుపై స్పందించిన రాఘవ్ చద్దా ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. తన పోరాటం ఇల్లు లేదా దుకాణం గురించి రాజ్యంగ రక్షణ గురించి అని ట్వీట్ చేశారు. యువ ఎంపీగా తన నోరు నొక్కే ప్రయత్నంలో భాగంగా, రాజకీయ కక్షతోనే తన బంగ్లా కేటాయింపు రద్దు చేశారని విమర్శించారు.కోట్లాది మంది భారతీయుల తరపున మాట్లాడేవారిని, ప్రతిపక్షాలను ఉద్దేశ పూర్వకంగా టార్గెట్ చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని విమర్శిస్తూ తాను పార్లమెంటులో రెండు ప్రసంగాలు చేశానని, తన తొలి ప్రసంగం తర్వాత తన అధికారిక వసతి రద్దు చేశారన్నారు.అలాగే రెండో ప్రసంగం తరువాత ఎంపీగా తన సభ్యత్వాన్ని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. నీతిగా, నిజాయితీగా మాట్లాడితే ఏమవుతుందో భయపడుతూంటే ఇక ఏ ఎంపీ పని చేయలేరంటూ తన ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. Ye makan ya dukan ki nahin, Samvidhan ko bachane ki ladhayi hai In the end, truth and justice have prevailed My statement on the Hon'ble Delhi High Court's ruling to set aside the unjust order to evict me from my official residence. pic.twitter.com/fA7BJ2zLYm — Raghav Chadha (@raghav_chadha) October 17, 2023 -
పెళ్లై నెల కాలేదు..
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గత కొద్దిరోజులుగా ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంది. ఆప్ యువ నాయకుడు రాఘవ్ చద్ధాతో ఆమె వివాహం గత నెలలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే. సినిమాల కన్నా.. ఇతర విషయాలతోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా ఆమె మారింది. దీంతో ఆమె నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తుంది.(ఇదీ చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి)ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ పార్టీలు,రెస్టారెంట్లు అంటూ ఎంజాయ్ చేశారు. అలా పలుమార్లు కెమెరాల కంట కనిపిస్తూ ట్రెండ్ అయ్యారు. ఇలా వారిద్దరూ వైరల్ అయ్యాక కొద్దిరోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే పరిణితి చోప్రా పెళ్లి తర్వాత తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రాఘవ్ చద్దాతో పెళ్లి తర్వాత పరిణితి చోప్రా హానీమూన్ ప్లాన్‌ను గ్రాండ్ చేసుకుంటుందని అంతా అనుకున్నారు.కానీ ఎవరూ ఊహించిని విధంగా భర్త లేకుండానే మాల్దీవుల వెకేషన్‌కు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. కానీ ఆమె ఈ వెకేషన్‌కు తన మరదలతో వెళ్లినట్లు ఆమె ఇలా చెప్పుకొచ్చింది. 'నేను హానిమూన్‌కు వెళ్లలేదు. ఈ ఫోటోను నా మరదలు తీసింది. ఇది గర్ల్స్ ట్రిప్' అంటూ బికినీలో ఉన్న ఒక ఫోటో షేర్ చేసింది. దీంతో మరదలితో హనిమూన్ ఏంటి..? కొత్తగా పెళ్లైన వారు జంటగా వెళ్తే ఆ మధుర క్షణాలు చెప్పలేనివి అంటూనే పెళ్లై నెల కాలేదు.. భర్తతో కాకుండా మరొకరితో హనిమూన్ ఎంజాయ్ చేస్తున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by @parineetichopra -
రాజ్యసభ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టుకు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాఘవ్ చద్దాపై నలుగురు ఎంపీలు ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 11న ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. సభా హక్కుల కమిటీ దర్యాప్తు చేసి, నివేదిక ఇచ్చేంత వరకూ ఆయనపై సస్పెన్షన్ వేటు కొనసాగుతుందని రాజ్యసభ స్పష్టం చేసింది. దీనిని రాఘవ్ చద్దా సుప్రీంకోర్టులో తాజాగా సవాలు చేశారు. తన సస్పెన్షన్ రాజ్యసభలోని విధివిధానాలు, ప్రవర్తనా నియమాలతో పాటు రాజ్యాంగంలోని 14, 21 ఆర్టికల్‌ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన సివిల్ రిట్ పిటిషన్లో రాజ్యసభ సెక్రటేరియట్, రాజ్యసభ చైర్మన్‌ను ప్రతివాదులుగా చేర్చారు. తన సస్పెన్షన్ కారణంగా ఆర్థిక స్టాండింగ్ కమిటీ, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశాలకు తాను హాజరు కాలేకపోతున్నట్లు చెప్పారు. కాగా నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార వైఖరి ఆరోపణలపై పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆగస్టు 11న పరాఘవ్ చద్దా రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ(సవరణ) బిల్లు–2023పై ప్రతిపాదిత సెలెక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే తమ పేర్లను చేర్చారంటూ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు నలుగురు ఎంపీలు ఫఙర్యాదు చేశారు. తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాఘవ్ చద్ద సస్పెన్షన్‌పై శుక్రవారం రాజ్యసభ నేత పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో రాఘవ్ చద్దాను సస్పెండ్ చేశారు. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి, నివేదిక ఇచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపింది. -
భర్త కంటే 120 రెట్లు ఎక్కువ: పరిణీతి షాకింగ్ నెట్‌వర్త్, లగ్జరీ కార్లు
Pari-Raghav Chadha Networth బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ వేడుక, ఫోటోలు ఇంటర్నెట్లో లేటెస్ట్ బజ్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మేలో నిశ్చితార్థం చేసుకున్న లవ్బర్డ్స పరి- రాఘవ్ చద్దా లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ముచ్చటగా సాగింది. అలాగే పెళ్లి దుస్తుల్లో సరికొత్త లుక్లోఈ జంట మెరిసిపోయారు. ఈక్రమంలో వారి ఆస్తి ఎంత అనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాఘవ్ కంటే పరిణీతి నెట్‌వర్త్ 120 రెట్లు ఎక్కువ అని టాక్. 2011లో విడుదలైన లేడీస్ వర్సెస్- రికీ బాహ్ల్ సినిమాతో తెరంగేట్రం చేసిన అనేక సినిమాల్లో నటించింది. బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఆమె ఒకరు. సినిమాలతో బ్రాండ్ ఎండార్స్మెంట్లు ద్వారా కోట్ల రూపాయలను సంపాదిస్తుంది. దీంతో పరిణీతి చోప్రా నికర విలువ సుమారు 74 కోట్లుగా అంచనా. పరిణీతి ఆడి డ్రైవ్ చేస్తే, భర్త రాఘవ్ స్విఫ్ట్ డిజైర్‌ను నడుపుతాడు అంటూ సోషల్ మీడియాలోకమెంట్లు వినిపిస్తున్నాయి. (Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి) పలు మీడియా నివేదికల ప్రకారం ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ అయిన క్లెన్స్టాలో మైనారిటీ వాటా, హైదరాబాద్‌కు చెందిన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ తృతీయలో పెట్టుబడులు ఉన్నాయి. ముంబైలోని బాంద్రాలో ఒక అద్భుతమైన అపార్ట్మెంట్ పరిణీతి సొంతం. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో కూడిన ఇంటి ఇంటీరియర్స్ తో అద్భుతంగా కనిపించే ఈ ఇల్లు ధర సుమారు రూ. 22 కోట్లు (బ్యాంకు లాకర్లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్ కొత్త నిబంధనలు తెలుసా?) లగ్జరీ కార్లు పరిణీతికి కూడా ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. రూ. 99.56 లక్షలు జాగ్వార్ XJL,దాదాపు రూ 1.30 కోట్ల లువైన రేంజ్ రోవర్ వోగ్ లగ్జరీ కార్లు పరిణీతి సొంతం. ఇంకా 43.19 లక్షల విలువైన ఆడి క్యూ4, రూ. 69.27 లక్షలు Q7, ఆడి ఏ-6 లాంటివి కూడా ఆమె గ్యారేజ్‌లో ఉన్నాయి. ఆమె ధరించే దుస్తులు, బ్యాగ్‌లు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటాయి. బ్రాండెడ్ బ్యాగ్స్, షూ ఫ్యాన్ 2.05 లక్షల ఖరీదుచేసే లూయిస్ విట్టన్ న్యూ వేవ్ మల్టీ-పోచెట్ బ్యాగ్‌తో కనిపించింది .అలాగే ఒక ఈవెంట్లో ఆమె ధరించిన ఫిగర్-హగ్గింగ్ ఫెండీ దుస్తుల ధర సుమారు 1.64 లక్షలు. అంతేకాదు పరిణీమి షూ ఫ్యాన్ కూడా. జిమ్మీ చూ నుండి బాలెన్సియాగా వరకు అన్ని హై-ఎండ్ బ్రాండ్లంటే మోజు. నటిగానే కాకుండా ఒక అద్భుతమైన గాయని కూడా. ప్లేబ్యాక్ సింగర్‌గా ఐకానిక్ సాంగ్ బతెరి మిట్టి మహిళా వెర్షన్‌తో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆయుష్మాన్ ఖురానా సరసన 2017లో వచ్చిన రొమాంటిక్ డ్రామా మేరీ ప్యారీ బిందులో గాయనిగా విశ్వరూపాన్ని చూపించింది ఇషాక్జాదే (2012), శుద్ధ్ దేశీ రొమాన్స్ (2013), హసీ తో ఫేసీ (2014), డిషూమ్ (2016), గోల్మాల్ ఎగైన్ (2017) బ్లాక్‌బస్టర్ హిట్మూవీల్లో నటించిన పరిణీతి మిషన్ రాణిగంజ్‌లో అక్షయ్ కుమార్‌తో కలిసి పరిణీతి చోప్రా కనిపించనుంది.ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ‘చమ్కిలా’లో దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి చమ్కిలా లో యాక్ట్ చేసింది. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన పరిణీతి పరిణీతి చోప్రా 1988న అక్టోబర్ 22న న హర్యానాలోని అంబాలాలో జన్మించింది. పరిణీతి చోప్రా ధనిక కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి, పవన్ చోప్రా, వ్యాపారవేత్త, అంబాలా కంటోన్మెంట్లో భారతీయ సైన్యానికి డీలర్ కూడా తల్లి రీనా చోప్రా. అంబాలాలోని జీసస్ మేరీ కాన్వెంట్లో, UKలోని మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్, ఎకనామిక్స్ ఫైనాన్స్‌లో ట్రిపుల్ హానర్స్ డిప్లొమా పొందింది. అలాగే మ్యూజిక్‌లో బి.ఎ. హానర్స్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు 43.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. యష్ రాజ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్‌కు PRగా తన వృత్తిని ప్రారంభించింది. రాఘవ్ చద్దా నికర విలువ రాఘవ్ చద్దా పార్లమెంటులో అతి పిన్న వయస్కుడిగా పాపులర్అయిన ఈ ఆప్ ఎంపి.యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ వంటి ప్రసిద్ధ సంస్థల్లో విద్యనభ్యసించాడు. నికర విలువ రూ. 50 లక్షలుగా తెలుస్తోంది. పరిణీతి లగ్జరీ కార్లతోపోలిస్తే రాఘవ్ చద్దా వద్ద ఉన్నది స్విఫ్ట్ డిజైర్ కారు. -
పెళ్లిలో ఆలియా భట్‌ను ఫాలో అయిన పరిణీతి చోప్రా, ఫోటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను పరిణీతి సోషల్ మీడియా వేదికగా పంచుకోగా కాసేపటికే ఫోటోలు వైరల్‌గా మారాయి. 'మేము మొదటి సారి బ్రేక్‌ఫాస్ట్ కోసం కలిసి కూర్చున్నప్పుడే మా హృదయాలు కలిశాయి. ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాను. ఎట్టకేలకు అందరి ఆశీర్వాదంతో మేము ఒక్కటయ్యాం. మేము ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేము' అంటూ తన సంతోషాన్ని పంచుకుంది. దీంతో పరిణీతి-రాఘవ్‌ల దంపతులకు సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరి జోడి చూడచక్కగా ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెళ్లి వేడుకలో పరిణీతి చోప్రా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహెంగాలో మెరిసిపోగా, పవన్ సచ్‌దేవా డిజైన్ చేసిన డిజైనర్ అవుట్‌ఫిట్‌లో రాఘవ్ చద్దా కనిపించారు. ఈ ఇద్దరూ పేస్టల్ కలర్ దుస్తుల్లో అందంగా కనిపించారు. ఈమధ్య కాలంలో పేస్టల్ కలర్స్, న్యూడ్ మేకప్ ట్రెండ్ బాగా వినిపిస్తోంది. ఆలియా భట్ నుంచి ఇప్పుడు పరిణీతి చోప్రా వరకు.. సింపుల్‌గా, పేస్టల్ కలర్స్‌లో నేచురల్‌గా కనిపించేందుకే సెలబ్రిటీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు పెళ్లంటే రెడ్, ఎల్లో, గ్రీన్ వంటి సాంప్రదాయ కలర్స్ దుస్తుల్లోనే వధూవరులు కనిపించేవారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు హెవీ లెహంగాలు, భారీ నగలు, హెవీ మేకప్ వరకు.. అంతా భారీగా ఉండాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హెవీ అండ్ కాస్ట్లీ దగ్గర్నుంచి ఇప్పుడు సింపుల్ అండ్ క్లాసిక్ అనే ట్రెండ్ నడుస్తోంది. దీనికి తగ్గట్లే న్యూడ్ మేకప్ విత్ పేస్టల్ కలర్స్ అంటూ మరో అద్భుతమైన ట్రెండ్ సెట్ చేశారు మన బాలీవుడ్ ముద్దుగుమ్మలు. ఇక మరో విశేషం ఏమిటంటే.. పరిణీతి చోప్రా ఆలియా భట్‌ను ఫాలో అయ్యిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆలియా కూడా తన పెళ్లికి క్రీం పేస్టల్ కలర్ అవుట్‌ఫిట్‌లో అందంగా ముస్తాబైంది. అంతేకాకుండా మెహందీ ఫంక్షన్లోనూ చాలా సింపుల్ మెహందీలో దర్శనమిచ్చింది. ఇప్పుడు పరిణీతి కూడా అచ్చంగా ఆలియాలానే క్రీం కలర్ పేస్టల్ లెహంగా, చాలా సింపుల్ మెహందీలో కనిపించింది. దీంతో వీరిద్దరి లుక్‌ని పోలుస్తూ పలు ఫోటోలు ఇంటర్నెట్లో దర్శనమిస్తున్నాయి. -
పరిణీతి- రాఘవ్ పెళ్లి.. అందుకోసం 2500 గంటలు పట్టిందా??
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పరిణయమాడింది. ఈ వివాహానికి సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా పెద్దఎత్తున హాజరయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ జంట వెడ్డింగ్ దుస్తుల్లో దిగిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ఇవీ అభిమానులు సైతం నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: నాకెలాంటి సంబంధం లేదు.. పైశాచిక ఆనందం కోసమే: టాలీవుడ్ హీరోయిన్) పరిణీతి లెహంగాపై చర్చ ఇదిలా ఉంటే పెళ్లిలో పరిణీతి చోప్రా ధరించిన డ్రెస్‌పైనే నెట్టింట చర్చ మొదలైంది. వధువుగా హీరోయిన్ ధరించిన లెహంగా డిజైన్ ప్రత్యేకంగా కనిపించడంతో అందరి దృష్టి దానిమీదే పడింది. అయితే వీరి పెళ్లికి దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా సిద్ధం చేశారు. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్రెస్సుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పరిణీతి ధరించిన లెహంగా ప్రత్యేకతలను ఆయన వివరించారు. పరిణీతి కోసం లెహంగా రూపొందించడానికి దాదాపు 2,500 గంటల సమయం పట్టిందని మనీష్ మల్హోత్రా తెలిపారు. ఇది పూర్తిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చేసినట్లు వెల్లడించారు. ఈ అందమైన లెహంగాను పాతకాలపు బంగారు దారంతో రూపొందించామన్నారు. అతిథులను మంత్రముగ్దులను సున్నితమైన మెష్, దుపట్టా, ముత్యాలు, ప్రతి ఒక్కటి ఫెయిర్‌తో అలంకరించామని డిజైనర్ మనీశ్ పేర్కొన్నారు. అంతే కాకుండా పరిణీతి డ్రెస్‌పై రాఘవ్ పేరు ముద్రించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by @parineetichopra -
Parineeti Chopra-Raghav Chadha Wedding: పరిణీతి చోప్రా,రాఘవ్ చద్దా పెళ్లి ఫొటోలు
-
పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా పెళ్లి ఫోటో వైరల్
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మూడు రోజుల పాటు వేడుకలు జరుపుకున్న ఈ జంట.. ముచ్చటగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మూడు రోజులుగా జరిగిన వీరి పెళ్లి వేడుక అత్యంత వైభవంగా కొనసాగింది. (ఇదీ చదవండి: 'విశ్వగానగంధర్వుడు' బాలసుబ్రహ్మణ్యం తొలి గురువు ఎవరు..?) ఈ పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే వివాహం అనంతరం పరిణీతి-రాఘవ్ జంటగా దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో పరిణీతి పింక్ చీరలో భర్త రాఘవ్ చద్దాతో కలిసి పోజులిచ్చారు. పరిణీతి నుదుటిపై సిందూరం ఉంది. దీంతో ఈ ఫోటోలను వారిద్దరి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలో వారి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలను కూడా షేర్ చేయనున్నారు. ఈ వేడుకకి ఇరు కుటుంబాలతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దిల్లీ, పంజాబ్‌ల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్లతోపాటు సినీ, క్రీడా ప్రముఖులు కొత్త జంట రాగ్నీతీ (రాఘవ్, పరిణీతి)లను ఆశీర్వదించారు. కాగా.. సెప్టెంబర్ 30న చండీగఢ్‌లో వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనుంది. ఆ తర్వాత ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది. -
మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ప్రేమజంట.. హాజరైన ప్రముఖులు!
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అధికారికంగా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మూడు రోజుల పాటు వేడుకలు జరుపుకున్న ఈ జంట.. ముచ్చటగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మూడు రోజులుగా జరుగుతున్న వీరి పెళ్లి వేడుక అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. త్వరలోనే అధికారికంగా పెళ్లి ఫోటోలను రిలీజ్ చేయనున్నారు. (ఇది చదవండి: చెల్లి పెళ్లికి హాజరుకాని ప్రియాంక చోప్రా.. అదే ముఖ్యమా!!) పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహానికి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. మనీష్ మల్హోత్రా, సానియా మీర్జా, హర్భజన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆదిత్య ఠాక్రే, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. అయితే ఈ పెళ్లికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మాత్రం హాజరు కాలేదు. ఈ వేడుకకు ఆమె తల్లి, డాక్టర్ మధు చోప్రా హాజరయ్యారు. కాగా.. ప్రియాంక ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిణీతికి శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా.. సెప్టెంబర్ 30న చండీగఢ్‌లో వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనుంది. ఆ తర్వాత ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
చెల్లి పెళ్లికి హాజరుకాని ప్రియాంక చోప్రా.. అదే ముఖ్యమా!!
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా గురించి పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోయిన్గా ఎదిగిన భామ.. ఆ తర్వాత హాలీవుడ్‌కు మారింది. అమెరికాకు చెందిన నిక్ జోనాస్ ప్రేమవివాహాం చేసుకుంది. ఈ జంటకు సరోగసీ ద్వారా ఓ బిడ్డ కూడా జన్మించింది. అయితే ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ పరిణీతి చోప్రా వివాహాబంధంలోకి అడుగుపెడుతోన్న సంగతి తెలిసిందే. ఆప్ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దాను ఆమె పెళ్లి చేసుకుంటోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక జరుగుతోంది. ఇదంతా బాగానే ఉన్నా.. చెల్లి పెళ్లికి అక్క ప్రియాంక చోప్రా హాజరు కాకపోవడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. బంధువులు, సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరవుతున్న ప్రియాంత చోప్రా రాకపోవడం ఏంటా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపింది. మొదట ఈ వివాహానికి ప్రియాంక వస్తుందని అందరూ భావించారు. కానీ ఆమె పెళ్లి హాజరవ్వకుండా అభిమానులకు షాకిచ్చింది. సంగీత కచేరీకి హాజరు పరిణీతి చోప్రా పెళ్లికి రాని ప్రియాంక కాలిఫోర్నియాలోని బర్కిలీలో జరిగిన బంగ్లాదేశ్-అమెరికన్ ఆర్టిస్ట్ జై వోల్ఫ్ సంగీత కచేరీకి హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆమె తన భర్త నిక్ జోనాస్ సోదరుడు ఫ్రాంక్లిన్ జోనాస్‌తో కలిసి జై వోల్ఫ్ కచేరీలో పాల్గొంది. అయినా చెల్లి పెళ్లికి రాకపోవడమేంటని ప్రియాంక తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by Bushra Khan 🇧🇩 (@b.khanfident) -
పరిణీతి-రాఘవ్ చద్దా వెడ్డింగ్: ఒక్క నైట్‌కి హోటల్ సూట్ ఖర్చు ఎంతంటే?
Parineeti Chopra-Raghav Chadha Weddingబాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పెళ్లి సందడి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే వీరి వెడ్డింగ్‌లో కీలకమైన మెహీందీ, హల్దీ వేడుకు ఫోటోలు నెట్లో సందడి చేస్తున్నాయి. ఈ జంట సెప్టెంబర్ 24న రాజస్థాన్ ఉదయ్‌పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace) వేదికగా వివాహానికి సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే వధూవరులతోపాటు బంధుమిత్ర సపరివారం ఉదయ్‌పూర్‌లో ల్యాండ్ అయ్యారు. ముఖ్యంగా బఈ వివాహ వేడుక నిమిత్తం ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ ఉదయ్‌పూర్ చేరుకున్నారు. రాఘవ్ , పరిణీతి వారి జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇవాళ రేపు(శని, ఆది) వివాహ వేడుకలు జరుగాయని వెల్లడించారు. ఈసందర్బంగా ఉదయ్‌పూర్ మరోసారి వార్తల్లో నిలిచింది.ఈ సిటీలోని లీలా ప్యాలెస్, తాజ్ లేక్ ప్యాలెస్ లాంటి కొన్ని విలాసవంతమైన లగ్జరీ సూట్లను లాక్ చేసుకున్నారు. వీరి పెళ్లికి బుక్ చేసిన హోటల్లోని అత్యంత ఖరీదైన మహారాజా సూట్ అద్దెఎంత అనేది ఆసక్తికరంగా మారింది. హోటల్ సూట్ ఒక రాత్రికి రూ. 10 లక్షలు వసూలు చేస్తుందట. 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్ ట్రావెల్ ప్లస్ లీజర్ వరల్డ్ సర్వే అవార్డ్స్ – 2023లో ర్యాంక్ .అంతేకాదు లీలా ప్యాలెస్ ప్రపంచంలోని అత్యుత్తమ 100 మరియు భారతదేశానికి ఇష్టమైన 5 హోటళ్లలో కూడా స్థానాన్ని కూడా సంపాదించింది. శిల్పకళా సౌందర్యానికి పాపులర్ అయిన లీలా ప్యాలెస్ హోటల్అతిథులకు రుచికరమైన వంటల్ని వడ్డించనున్నారు. VIDEO | “Raghav and Parineeti are set to step into a new chapter of their lives for which I want to extend my heartiest congratulations to them,” says AAP leader Sanjay Singh as he arrives in Udaipur to attend Raghav Chadha and Parineeti Chopra’s wedding. pic.twitter.com/vRn0MGcRmH — Press Trust of India (@PTI_News) September 23, 2023 డిజైనర్ దుస్తుల్లో పరిణీతి, రాఘవ్ చద్దా జంట , అతిథులకు నో- ఫోన్ రాఘవ్ మామ, ఫ్యాషన్ డిజైనర్ పవన్ సచ్‌దేవా, వరుడి కోసం అన్ని వివాహ దుస్తులను డిజైన్ చేసినట్టు వెల్లడించారు. ఇక పెళ్లి కూతురు పరిణీతి మనీష్ మల్హోత్రా సమిష్టిని ధరించనుంది. బేసిక్ సాలిడ్ పాస్టెల్ కలర్ లెహంగా, స్టేట్మెంట్ జ్యువెలరీ స్పెషల్ లుక్‌లో ఎట్రాక్షన్‌గా కనిపించనుందని టాక్. అంతేకాదు ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు హాజరయ్యే అతిథులు గోప్యతను పాటించాల్సి ఉంది. అందుకే నో-ఫోన్ విధానాన్ని పాటించాలని వారికి సూచించినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
భారతదేశం మీ తాతల సొత్తు కాదు
న్యూఢిల్లీ: కొద్దిరోజుల క్రితం డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఎంతటి రాజకీయా దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసందే. ఈ వ్యాఖ్యలు ఇండియాకూటమి చేసినా వ్యాఖ్యలుగా భావంచకూడదని ఏవి ఒక పార్టేకి చెందిన చిన్న నేత చేసినవని అన్నారు ఆప్ నేత రాఘవ్ చద్దా. ఎవరో చిన్న నేత.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి ఇండియా కూటమి భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి స్పందిస్తూ నేను సనాతన ధర్మానికి చెందిన వాడిని. ఇటువంటి వ్యాఖ్యలకు అందరూ దూరంగా ఉండాలి. మనం అన్ని మతాలను గౌరవించాలన్నారు. ఆ వ్యాఖ్యలు ఎవరో ఒక పార్టీకి చెందిన చిన్ననేత చేసిన వ్యాఖ్యలని ఇండియా కూటమి అధికారికంగా చేసినవి కాదని అన్నారు. అదే మా ప్రణాళిక.. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమి చేసిందన్నట్లుగా బీజేపీ పార్టీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. దేశం ఇంతకంటే పెద్ద సమస్యలను ఎదుర్కుంటోందని ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి మేము లేవనెత్తాల్సిన అంశాలు చాలానే ఉన్నాయన్నారు. ఇక ఈరోజు ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో జరగనున్న సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించబోయే అంశాల గురించి ప్రస్తావించగా ఒక్కో రాష్ట్రంలో ఎన్నికలు ఒక్కో రీతిగా ఉంటాయని వాటిప్రకారం ఎన్నికల ప్రణాళికను రూపొందించే విషయమై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు. కూటమి అవసరాన్ని బట్టి ఆయా పార్టీలు కొన్ని త్యాగాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆ సీన్ రిపీట్ అవుతుంది.. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి గురించి ప్రశ్నించగా మేము కూటమిలో నమ్మకమైన సైనికుడిగా ఉన్నామని ప్రధాని అభ్యర్థి గురించి కూటమి కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వానికి అర్హులైన చాలామంది ముఖ్య నాయకులు ఉన్నారని ఎన్డీయే కూటమిలోలా ఒక్కరి పేరు చెప్పుకుని ఎన్నికల్లోకి వెళ్ళమని అన్నారు. 1977లో కూడా ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పడిందని అప్పుడు కూడా ప్రధాని అభ్యర్థిని ముందుగా నిర్ణయించలేదని కానీ ఆ కూటమి ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని గుర్తు చేస్తూ 2024లో కూడాఅదే కథ పునరావృతమవుతుందని అన్నారు. భయం మొదలైంది.. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కూడా ఇండియా కూటమి నాలుగింట విజయం సాధించగా ఎన్డీయే కూటమి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింద అక్కడ కూడా వారికి స్వల్ప ఆధిక్యత మాత్రమే దక్కిందన్నారు. ఇండియా బలమైన కూటమని ఎన్డీయే సిద్ధాంతాలు చెప్పే కూటమని అన్నారు. ఇప్పటికే వారిలో భయం పుట్టుకుందని అందుకే ఏకంగా దేశం పేరు మార్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ఒక్కటే చెప్పదలచుకున్నాను. ఇండియా వారి తాతల సొత్తు కాదు. 135 కోట్ల భారతీయులదని అన్నారు. త్వరలో జరుగనున్న ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల గురించి చెబుతూ ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలకు కూడా మాట్లాడే అవకాశమివ్వాలని అజెండా లేకుండా సమావేశాలు ఏమిటో నాకర్ధం కావడం లేదని అసలు ఈ సమావేశాల ఎజెండా ఏమిటో ఒకరిద్దరు బీజేపీ నేతలకు మినహాయిస్తే ఎవ్వరికి తెలియదని అన్నారు. ఇది కూడా చదవండి: నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం.. -
ప్రియాంక చోప్రా సోదరి పెళ్లి.. ఆ మాత్రం రేంజ్ ఉండాల్సిందే!
బాలీవుడ్ భామ, ప్రియాంక చోప్రా సోదరి పరిణీతి చోప్రా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఆప్ పార్టీకి చెందిన రాఘవ్ చద్దాతో కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించిన భామ.. ఆ తర్వాత అఫీషియల్‌గా ప్రకటించింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఈనెలలోనే వివాహా బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వీరిపెళ్లి వేదికపై బీటౌన్‌లో తెగ చర్చనడుస్తోంది. తారల డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వేదిక ముస్తాబవుతోంది. వీరి పెళ్లి కోసం జరుగుతున్న ఏర్పాట్లపై ఓ లుక్కేద్దాం. ఇద్దరు ప్రముఖ రంగాలకు చెందిన వారు కావడంతో అతిథులు సైతం అదేస్థాయిలో రానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: స్టార్ హీరో లగ్జరీ విల్లా.. అద్దెకు కూడా ఇస్తారట!) బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఈనెల 24న వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తేదీలను ఇంకా ధృవీకరించనప్పటికీ వారి సన్నిహితులు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్ వీరి పెళ్లికి వేదికగా నిలవనుంది. మూడు రోజుల పాటు జరిగే మెహందీ, సంగీత్, హల్దీ వేడుకల కోసం లీలా ప్యాలెస్ ముస్తాబవుతోంది. అత్యంత ఖరీదైన హోటల్ ఈ ప్యాలెస్‌లోని హోటల్ గది ఒక్కరోజుకు అత్యధికంగా రూ. 9 లక్షలకు పైగా ధర ఉన్నట్లు సమాచారం. వీరి పెళ్లికి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా హాజరు కానున్నారు. అయితే పెళ్లి తర్వాత గురుగ్రామ్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ బాష్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మే 13న దిల్లీలోనిపరిణీతి, రాఘవ్‌ల నిశ్చితార్థ వేడుకకు కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ప్రియాంక చోప్రా హాజరయ్యారు. (ఇది చదవండి: ఆ తప్పు చేయడం వల్లే కెరీర్ నాశనం: ధనుశ్) View this post on Instagram A post shared by 𝐓𝐡𝐞 𝐋𝐞𝐞𝐥𝐚 𝐏𝐚𝐥𝐚𝐜𝐞 𝐔𝐝𝐚𝐢𝐩𝐮𝐫 (@theleelapalaceudaipur) -
పెళ్లికి ముందే పూజలు తెగ చేస్తున్న ఆ హీరోయిన్
స్టార్ హీరోయిన్ పెళ్లి అంటే హడావుడి మాములుగా ఉండదు. బ్యాచిలర్ పార్టీ, షాపింగ్, ప్రిపరేషన్.. ఇలా చాలా పనులతో బిజీగా ఉంటారు. అయితే కొందరు మాత్రం మ్యారేజ్ కి ముందు దేవుడు-పూజలు లాంటివి చేస్తుంటారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ కూడా అలానే కాకపోతే ఈమెకు తోడు కాబోయే భర్త కూడా ఉన్నాడు. వీళ్లిద్దరూ కలిసి దైవభక్తిలో మునిగి తేలుతుండటం విశేషం. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 'ఉల్టా పల్టా' అసలు మీనింగ్ ఇదేనా!?) హీరోయిన్ పరిణితీ చోప్రా.. హిందీలో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించి పేరు తెచ్చుకుంది. గతేడాది ఓ రెండు చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ భామ.. ప్రస్తుతం మరో రెండు మూవీస్‌లో నటిస్తోంది. ఓవైపు నటిగా బిజీగా ఉన్నప్పటికీ.. ఈ ఏడాది మేలో ఆప్ పార్టీ నాయకుడు రాఘవ చద్దాతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. కాలేజీ రోజుల నుంచే వీళ్లిద్దరూ లవ్‌లో ఉన్నప్పటికీ నిశ్చితార్థంతో వీళ్ల రిలేషన్ బయటపడింది. ఎంగేజ్మెంట్ తర్వాత వీళ్ల పెళ్లి గురించి గాసిప్స్ వచ్చాయి. అయితే కొన్నిరోజుల ముందు మాత్రం తేదీ ఫిక్స్ చేశారు. సెప్టెంబరు 25న వెడ్డింగ్ జరగనుంది. దానికంటే ముందే పరిణితీ.. కాబోయే భర్త రాఘవ్ చద్దాతో కలిసి ఉజ్జయిని వెళ్లింది. మహంకాళేశ్వర స్వామి దర్శనం చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. వాటిపై మీరు ఓ లుక్ వేసేయండి. (ఇదీ చదవండి: 'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా) Wedding soon? #ParineetiChopra and #RaghavChadha offer prayers at Ujjain’s Mahakaleshwar Temple 🙏🏻 #Pinkvilla pic.twitter.com/kPPnyH10Gv — Pinkvilla (@pinkvilla) August 26, 2023 आप सांसद राघव चड्ढा और उनकी मंगेतर, अभिनेत्री परिणीति चोपड़ा ने उज्जैन के महाकाल मंदिर में पूजा की 🙏🙏#raghavchadha #parineetichopra#mahakal pic.twitter.com/JPXsRGUxfg — Jahnvi Sharma (@Jahnvish999) August 26, 2023 -
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార వైఖరి ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గుర య్యారు. ఆయన సస్పెన్షన్‌పై శుక్రవారం రాజ్యసభ నేత పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దేశ రాజధాని ఢిల్లీ(సవరణ) బిల్లు–2023పై ప్రతిపాది త సెలెక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే కొందరు సభ్యుల పేర్లను చేర్చినందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి, నివేదిక ఇచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపింది. ఆప్ మరో నేత సంజయ్ సింగ్ సస్పెన్షన్ పొడిగించే తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. వర్షాకాల సమావేశాల ప్రారంభంలోనే సంజయ్ సింగ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. -
అబద్ధాలు చెబితే కాకి తంతుంది.. ఎంపీ చద్దాపై బీజేపీ ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో బుధవారం ఓ విచిత్ర సంఘటన వెలుగుచూసింది. ఆమ్ ఆద్మీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాపై ఓ కాకి దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పార్లమెంట్ ఆవరణంలో రాఘవ్ చద్దా నిల్చొని ఫోన్ మాట్లాడుతుండా ఓ కాకి ఆయన తలపై తన్ని వెళ్లింది. అనూహ్య పరిణామానికి ఆయన కాస్తా కంగారుపడ్డారు. అయితే ఆ ఘటనకు చెందిన ఫోటోలను బీజేపీకి చెందిన ఢిల్లీ యూనిట్ తమ ట్విట్టర్లో పోస్టు చేసింది. ‘జూట్ బోలే కౌవా కాటే’అంటూ ఆ ఫోటోకు కామెంట్ పెట్టింది. అబద్ధం చెబితే కాకి పొడుస్తుందనే సామెతను ఇప్పటి వరకు విన్నాం, కానీ ఇప్పుడు అబద్దాలు చెప్పిన ఎంపీ రాఘవ్‌ను కాకి కొట్టడం ద్వారా కళ్లారా చూస్తున్నాం’ అని పేర్కొన్నారు. చదవండి: మీ మాటలకు చేతలకూ పొంతన లేదు: మోదీ, షాలపై ఖర్గే విమర్శలు ‘रामचन्द्र कह गए सिया से ऐसा कलयुग आएगा, हंस चुगेगा दाना दुनका और कौवा मोती खाएगा’ आज तक सिर्फ़ सुना था, आज देख भी लिया https://t.co/skKUCm4Kbs — Raghav Chadha (@raghav_chadha) July 26, 2023 మరోవైపు కాకి దాడి చేయడంపై ఎగతాళి చేస్తూ బీజేపీ చేసిన కామెంట్‌కు రాఘవ్ చద్దా గట్టి కౌంటర్ ఇచ్చారు. హంస గింజలు తినే.. కాకి ముత్యాల విందు చేసే కలియుగం వస్తుందని శ్రీరాముడు సీతతో చెప్పాడు’ అనేది మనం ఇప్పటివరకు విన్నాం. ఇప్పుడు చూస్తున్నాం’ అంటూ రామాయణ ఇతిహాసం గురించి ప్రస్తావిస్తూ అటాక్ చేశారు. -
కాబోయే భర్తతో కలిసి ప్లేట్లు కడిగిన బాలీవుడ్ నటి
-
అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!
ఆమె బాలీవుడ్లో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్. ఓవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గత నెలలో ఈమెకు నిశ్చితార్థం జరిగింది. త్వరలో తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి కూడా చేసుకుబోతుంది. అలాంటి ఆమె.. ఇప్పుడు సడన్ గా ఓ చోట ప్రత్యక్షమైంది. కాబోయే భర్తతో కలిసి ప్లేట్లు కడిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ గా మారాయి. ఇంతకీ ఏం జరిగింది? ఎవరా బ్యూటీ? బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు కాస్తో కూస్తో తెలుసు. శుద్ధ్ దేశీ రొమాన్స్, కేసరి తదితర చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం 'చమ్కీలా' అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు అక్షయ్ కుమార్ తో కలిసి 'ద గ్రేట్ ఇండియా రెస్క్యూ' సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఇది అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!) రాఘవ్‌తో పెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దాతో హీరోయిన్ పరిణీతి చోప్రాకు పెళ్లి కుదిరింది. గత కొన్నేళ్లుగా వీళ్లు డేటింగ్ లో ఉన్నారు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకుండా, బయటపడకుండా చాలా జాగ్రత్తపడ్డారు. గత నెలలో అంటే మే 13న వీళ్లకు నిశ్చితార్థం జరిగింది. దీనికి కొన్ని రోజుల ముందు మాత్రమే.. ఈ జంట గురించి న్యూస్ బయటకొచ్చింది. త్వరలో రాజస్థాన్ లో వీళ్లిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. గోల్డెన్ టెంపుల్లో త్వరలో పెళ్లి చేసుకోనున్న పరిణీతి-రాఘవ్.. శనివారం ఉదయం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్(స్వర్ణ దేవాలయం)ని కనిపించారు. దర్శనానంతరం అన్నదాన సత్రంలో ప్లేట్లు కడిగే సేవలో పాల్గొన్నారు. ఈ ఫొటోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవాలయంలో రాఘవ్-పరిణీతి తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. (ఇదీ చదవండి: 'సామజవరగమన' బ్యూటీ ఆ తెలుగు హీరోయిన్‌కి అక్క?) -
మీ పెళ్లికి పిలుస్తారా?.. లిఫ్ట్‌లో హీరోయిన్‌కు ఆసక్తికర ప్రశ్న!
బాలీవుడ్ భామ పరిణితీ చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దాకు ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వనున్నారు. కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట రిలేషన్షిప్ గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతకుముందే చాలాసార్లు రెస్టారెంట్, ఎయిర్‌పోర్టుల్లో జంటగా కెమెరాల కంటికి చిక్కారు. మే 13న దిల్లీలోజరిగిన పరిణీతి చోప్రా నిశ్చితార్థం వేడుకలో సోదరి ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. (ఇది చదవండి: డెలివరీకి ముందు ఉపాసన ఏం చేసిందంటే.. వీడియో వైరల్!) తాజాగా ముంబయిలో ఓ ఈవెంట్‌కు హాజరైన పరిణితీ అభిమానులతో ముచ్చటించారు. పరిణితీ చోప్రాను ఉద్దేశించి మీ పెళ్లి ఎప్పుడు మేడం? మమ్మల్ని పిలుస్తారా? అంటూ ఒకరు అడిగారు. ఆ ప్రశ్నకు నవ్వుతోనే సమాధానమిచ్చింది. మరొకరు ప్రశ్నిస్తూ.. మీ పెళ్లి జీవితం ఎలా ఉంది? అని అడగ్గా.. 'నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు' అంటూ పరిణితీ సమాధానమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది. అయితే వారితో మాట్లాడుతుండగా పరిణీతి చోప్రా లిఫ్ట్ లోపల ఉన్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: టాలీవుడ్ డైరెక్టర్ ఇంట విషాదం) View this post on Instagram A post shared by @varindertchawla -
ఓవల్‌లో వాలిపోయిన ప్రేమజంట.. ఫోటోలు వైరల్!
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఢిల్లీలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక వైభవంగా జరిగింది. నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం విదేశాల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఈ జంట మెరిసింది. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న పరిణీతి చోప్రా ) ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు పరిణీతి, రాఘవ చద్దా ఓవల్‌లో వాలిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న త్వరలోనే వివాహాబంధంతో ఒక్కటి కానుంది. వీరి పెళ్లి వేడుక రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: టాప్ హీరోయిన్ కూతురి అన్నప్రాసన వేడుక చూశారా?) View this post on Instagram A post shared by 😍 PARINEETI ADDICTED 😍 (@parineetigalaxy) -
ఎంగేజ్మెంట్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న పరిణీతి చోప్రా
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం ఇటీవలె ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఢిల్లీలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక వైభవంగా జరిగింది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో పలుమార్లు కెమెరాలకు చిక్కారు. వీరి రిలేషన్‌షిప్‌పై ఎన్నిసార్లు అడిగినా స్పందించని ఈ లవ్‌బర్డ్స్ ఎంగేజ్మెంట్ తర్వాత తమ బంధాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా వీరి ఎంగేజ్మెంట్ వీడియో ప్రోమో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో పరిణీతి తల్లి రాఘవ్ గురించి చెబుతూ.. అతను చాలా మంచివాడని, తండ్రి తర్వాత పరిణీతిని రాఘవ్ చాలా బాగా చూసుకోగలడన్న నమ్మకం తమకు సంపూర్తిగా ఉందంటూ ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలో పరిణీతి ఎమోషనల్ కాగా, రాఘవ్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
హీరోయిన్ పరిణితి ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా
-
పరిణీతి చోప్రా ఫియాన్సీ ఆస్తి ఇంతేనా?
Raghav Chadha Net Worth: ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! బాలీవుడ్లో విజయవంతమైన చిత్రాలలో నటిస్తున్న పరిణీతి చోప్రా విలాసవంతమైన జీవనశైలి కలిగిన నటి. ఆమెకున్న బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఇతర ఆస్తులతో ఆమె నెట్‌వర్త్ రూ. 60 కోట్లు. అయితే ఆమెకు కాబోయే భర్త రాఘవ్ చద్దా ఆస్తుల గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. మై నేత డాట్ ఇన్ఫో ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 50 లక్షలు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా వయసు 34 ఏళ్లు. రాజ్యసభలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీ. కాబోయే భార్య పరిణీతి చోప్రాతో పోల్చితే రాఘవ్ చద్దా జీవనశైలి, నికర ఆస్తులు చాలా తక్కువ. చిన్న ఇల్లు, పాత కారు.. రాఘవ్ చద్దా ప్రకటించిన మొత్తం ఆస్తులు MyNeta.info ప్రకారం.. రూ. 50 లక్షలు. ఇందులో చరాస్తుల విలువ రూ. 36 లక్షలు. సొంత ఇల్లు ఉంది. దాని విలువ రూ.37 లక్షలు. ఇక కార్ల విషయానికి వస్తే.. రాఘవ్ చద్దా వద్ద ఉన్నది 2009 మోడల్ మారుతీ సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్ మాత్రమే. ఇది కాకుండా ఆయన వద్ద దాదాపు 90 గ్రాముల బంగారం ఉంది. దీని విలువ రూ. 4.94 లక్షలు. పరిణీతి నెట్‌వర్త్ రూ. 60 కోట్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం.. పరిణీతి చోప్రా నెట్‌వర్త్ రూ.60 కోట్లు. ఆమె సంపదలో ఎక్కువ భాగం సినిమా డీల్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్ల నుంచి వచ్చిందే. ఆమెకు ముంబైలో సముద్ర తీరాన లగ్జరీ విల్లా ఉంది. ఇక ఆమె దగ్గర ఆడీ A6, జాగ్వార్ XJL, ఆడీ Q5 వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by @parineetichopra ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! -
గ్రాండ్‌గా పరిణీతి- రాఘవ్ ఎంగేజ్మెంట్, ఫోటోలు వైరల్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత, ఎంపీ రాఘవ్ చద్దాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మే 13న జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు కపుర్తలా హౌస్ వేదికగా మారింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను పరిణీతి, రాఘవ్ తమ ఇన్స్టాగ్రామ్ పేజీల్లో పోస్ట్ చేశారు. ఇందులో ఇద్దరూ సేమ్ కలర్ డ్రెస్సులో సింప్లీ సూపర్బ్ అనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న కొత్త జంటకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ ఫంక్షన్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కాంగ్రెస్ నేత చిదరంబరం సహా దాదాపు 150 మంది హాజరైనట్లు తెలుస్తోంది. వీరిలో పరిణితి కజిన్ ప్రియాంక చోప్రా కూడా ఉంది. కాగా ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు గతకొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే! వాటికి బలం చేకూర్చుతూ ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో వీరిద్దరూ జంటగా కెమెరాలకు చిక్కారు. అక్కడితో ఆగకుండా ఐపీఎల్ మ్యాచ్‌లోనూ జంటగా కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయిన విషయం తెలిసిందే! ఎంత ప్రచారం జరిగినా దీనిపై స్పందించని ఈ జంట తాజాగా నిశ్చితార్థ వేడుకతో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. View this post on Instagram A post shared by @parineetichopra చదవండి: సమంతకు నేను పెద్ద ఫ్యాన్‌ను.. ఆమెలా నటిస్తున్నానని చెప్తుంటే.. -
Parineeti Chopra : పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
ఆ నేత ఎంగేజ్మెంట్ రోజే.. భారీ మెజార్టీతో పార్టీ గెలుపు
ఎంగేజ్మెంట్ రోజునే ఓ నాయకుడి పార్టీ కూడా ఘన విజయం సాధించడం అనేది అత్యంత అరుదైన సందర్భం. అలాంటి అరుదైన ఘటన ఆప్ నేత దక్కించుకున్నాడు. అసలేం జరిగిందంటే.. న్యూఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో ఆప్ నాయకుడు రాఘవ్ చద్ధా, నటి పరిణీతి చోప్రాతో ఎంగేజ్మెంట్ శనివారం జరిగనుంది. ఇదే రోజు ఆయన పార్టీ కూడా భారీ మెజార్టీతో గెలిచింది. దీంతో తనకు ఈ రోజు మరింత ప్రత్యేకమని ఆనందంగా చెబుతున్నారు రాఘవ్ చద్దా. ఈ ఫంగ్షన్కి దంపతుల కుటుంబ సభ్యులు, సన్నిహితుల తోసహా 150 మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకకు పరిణీతి కజిన్ గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా కూడా హాజరుకానున్నారు. సరిగ్గా ఈ రోజే జలంధర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ మేరకు రాఘవ్ చద్దా ట్విట్టర్ వేదికగా..ఈ రోజు నాకు మరింత ప్రత్యేకమైనది మాత్రమే గాక మంచి జ్ఞాపకం కూడా. నా తల్లి ఇల్లు లాంటి జలంధర్‌లో ఈ రోజు ఆప్ మంచి ఘన విజయ సాధించింది. అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, మే 10 జరిగిన జలంధర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో చతుర్ముఖ పోటీ జరిగింది. ఆప్‌లోకి మారిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుశీల్ కుమార్ రింకూ కాంగ్రెస్‌కు చెందిన కరమ్‌జిత్ కౌర్‌పై 58 వేల ఆధిక్య ఓట్లతో విజయం సాధించారు.అని ట్వీట్ చేశారు. అయితే ఈ కరమ్‌జిత్ కౌర్ ఈ ఏడాది జనవరిలో భారత్ జోడో యాత్రలో మరణించిన సంతోష్ చౌదరి భార్య. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విజయాన్ని అపూర్వమైనది అని పేర్కొన్నారు. అంతేగాదు పంజాబ్‌లో భగవంత్ మాన్ ప్రభుత్వం మంచిగా పని చేయడం వల్లే తాము గెలిచామని అన్నారు కేజ్రీవాల్. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మేము రాజకీయాల్లోకి వచ్చి పనిచేసేందుకు ప్రజలను ఓట్లు అడుగుతాం. మేము మా పని చేశాం, తమ వెంట ప్రజలు ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు మా బాధ్యతను, విశ్వాసాన్ని మరింత పెంచాయన్నారు. అలాగే పంజాబ్‌ని మరింతగా అభివృద్ధి చేసేందుకు మరింతగా కష్టపడతాం అని భగవంత్ మాన్ అన్నారు. (చదవండి: ఇది సంతృప్తి చెందాల్సిన సమయం కాదు!: శశి థరూర్) -
ఎంపీతో ఎంగేజ్మెంట్.. అందంగా ముస్తాబైన హీరోయిన్ ఇల్లు
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో డిన్నర్, లంచ్ అంటూ రెస్టారెంట్స్ చుట్టూ తిరుగుతూ పలుమార్లు మీడియా కంట పడ్డారు. కానీ తమ ప్రేమ విషయంపై మాత్రం ఇద్దరూ ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు తమ రిలేషన్‌షిప్‌ను పెళ్లిబంధంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. రేపు(శనివారం)ఢిల్లీలో రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం ఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని పరిణీతి చోప్రా ఇంటిని ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సంబంధింత వర్గాల సమాచారం ప్రకారం.. పరిణీతి-రాఘవ్‌ల ఎంగేజ్మెంట్కు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, పలువురు రాజకీయ నేతలు మాత్రమే హాజరవుతారని సమాచారం. నిశ్చితార్థ వేడుకలో రాఘవ్ పవన్ సచ్‌దేవా రూపొందించిన డిజైనర్ డ్రెస్‌లో కనిపించనుండగా, పరిణీతి చోప్రా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన అవుట్‌ఫిట్‌లో కనిపించనుంది. -
నిజంగా బీజేపీకి ఇది పెద్ద గుణపాఠం!
ఢిల్లీ పాలనా వ్యవహారాల నియంత్రణ లెఫ్టినెంట్ గవర్నర్‌దా? లేక ప్రభుత్వానిదా ? అన్న విషయంపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ నేత రాఘవ చద్ధా స్పందిస్తూ..ఈ తీర్పు బీజేపీకి అతి పెద్ద గుణపాఠమని అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజ్యాంగం అందించిన చక్కటి అధికార సమతుల్యతను భంగపరచకూడదని చెప్పకనే చెప్పింది అత్యున్నత న్యాయస్థానం. ఇది నిజంగా బీజేపికీ ఒక పెద్ద గుణపాఠం కావాలన్నారు. ఇది ముమ్మాటికి ఢిల్లీ ప్రజల విజయమేనని అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులమైన మేము ఇప్పుడూ హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నామని ఎద్దేవా చేశారు. అలాగే ఎన్నుకోబడిన ప్రభుత్వాలను అణగదొక్కడానికి బీజేపీ అనుసరించే ఈ పద్ధతి ప్రజాస్వామ్యానికి లేదా రాజకీయాలకైనా మంచిది కాదని ఇప్పటికైన గ్రహించాలన్నారు. సుప్రీం కోర్టు కూడా ఈ రోజు దాన్నే చెప్పిందన్నారు. అంతేగాదు ఢిల్లీ ప్రభుత్వాన్ని అధిగమిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు బ్యూరోక్రసిపై పూర్తి అధికారాన్ని ఇచ్చిన మే 2015 నాటి కేంద్ర నోటిఫికేషన్‌ను గుర్తు చేస్తూ..దీనికి కేవలం రాజకీయమే కారణమని చద్ధా అన్నారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వానికి ఢిల్లీలో కేంద్ర ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య ఎనిమిదేళ్లుగా జరుగుతున్న గొడవల తర్వతా అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారి అని, నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆఖరికి అధికారుల నియామకం సహా ఢిల్లీ ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉంటాయని పేర్కొంది సుప్రీం కోర్టు. ( చదవండి: రాహుల్‌కి ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు: ఇది మీ హోదాకి తగ్గ పని కాదు!) -
MP తో బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా పెళ్లి
-
ఎంపీతో హీరోయిన్ పరిణీతి ఎంగేజ్మెంట్.. అతిథులకు ఆహ్వానం
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా డేటింగ్ రూమర్స్‌తో కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరు జంటగా పలుమార్లు కెమెరాకు చిక్కారు. కానీ తమ ప్రేమ విషయంపై మాత్రం ఇద్దరూ ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే త్వరలోనే వీరు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయినట్లు తెలుస్తుంది. చదవండి: శ్రీజను టార్గెట్ చేస్తూ వీడియో షేర్ చేసిన కల్యాణ్‌దేవ్ సంబంధింత వర్గాల సమాచారం ప్రకారం ఈనెల 13న రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం ఢిల్లీలో జరగనుందట. ఇరు కుటుంసబభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు,సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అత్యంత సన్నిహితులైన 150మంది అతిథులకు ఇప్పటికే ఆహ్వానాలు అందినట్లు సమాచారం. ఇక ఎంగేజ్మెంట్ కోసం వీరిద్దరూ ముంబై నుంచి మంగళవారం ఉదయాన్నే ఢిల్లీకి బయలుదేరారు. నిశ్చితార్థం అనంతరం ఈ ప్రేమజంట తమ రిలేషన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. చదవండి: ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్ కృతిసనన్.. కామెంట్స్ వైరల్ -
ఐపీఎల్ మ్యాచ్‌లో ప్రేమజంట
-
స్డేడియంలో వాలిపోయిన ప్రేమజంట.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డేటింగ్లో ఉన్న భామ ఈనెలలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకునేందుకు సిద్ధమైంది. ఈనెల 13న ఈ ప్రేమజంట దిల్లీలో నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు ఇప్పటికే బీ టౌన్లో తెగ చర్చ నడుస్తోంది. అంతే కాకుండా ఈ ఏడాది అక్టోబర్‌లోనే వివాహాబంధంలోకి కూడా అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు జంటగా కనిపించిన పరిణితీ చోప్రా, రాఘవ్ మరోసారి సందడి చేశారు. (ఇది చదవండి: పొలిటీషియన్తో పరిణీతి పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆప్ నేత.. వీడియో వైరల్) ఈసారి ఏకంగా ఐపీఎల్ మ్యాచ్‌లో కనిపించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. పంజాబ్‌లోని మొహాలి వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు ఈ ప్రేమజంట హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పరిణితీ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఇవీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మొహాలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్-ముంబయి జట్లు తలపడ్డాయి. కాగా.. గతంలో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఆప్ ఎంపీ రాఘవ చద్దాతో పరిణీతి ముంబయిలోని ఓ రెస్టారెంట్లో కనిపించింది. దీంతో వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలాసార్లు జంటగా మీడియా కంట పడ్డారు. అంతే కాకుండా ఈ లవ్ బర్డ్స్‌కు ఆప్ నేతలు సైతం ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు కూడా తెలిపారు. (ఇది చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ) View this post on Instagram A post shared by Arvind Kejriwal Fans (@arvindkejriwalaap.fc) -
ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్న స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా డేటింగ్ రూమర్స్‌తో కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణీతి ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జంటకు సంబంధించిన క్రేజీ న్యూస్ బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. (ఇది చదవండి: ఎంపీతో హీరోయిన్ డేటింగ్.. నిశ్చితార్థం డేట్ ఫిక్స్!) తాజాగా ఈ ప్రేమజంట ఈనెల 13న నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దిల్లీ వేదికగా ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం. అలాగే వీరి పెళ్లి అక్టోబర్‌లో జరిగే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే వీరిద్దరూ గతంలో కలిసే చదువుకున్నారని.. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడిన పరిచయమే వీరిద్దరి మధ్య ప్రేమకు దారి తీసిందని టాక్ వినిపిస్తోంది. కాగా.. ప్రస్తుతం పరిణీతి చోప్రా సినిమాలతో బిజీగా ఉంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అందువల్లే పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: Kutty Padmini: కమల్, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య నమ్మలేదు.. పాపం!) -
లిక్కర్ స్కాం కేసు: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు షాక్!
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాకు ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) షాకిచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసు రెండో అనుబంధ చార్జ్‌షీట్‌లో ఎంపీ రాఘవ చెడ్డా పేరును చేర్చింది. అయితే, ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీకి రూపకల్పన కోసం జరిగిన సమావేశంలో విజయ్ నాయర్‌తో పాటు రాఘవ్ చద్దా ఉన్నారని ఈడీ చార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. ఈ సందర్బంగా అప్పటి ఎక్సైజ్ శాఖ కార్యదర్శి సి. అరవింద్ ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా ప్రస్తావించింది ఈడీ. దీంతో, రాఘవ్ చద్దాకు షాక్ తగిలినట్టు అయ్యింది. ఇక, ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ వంటి ఇతర ఆప్ నేతల పేర్లను ఈడీ.. చార్జ్‌షీట్‌లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం కేసులో ఈడీ మరో ఆసక్తికర అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఢిల్లీలో మద్యం వ్యాపారంలో సాధించిన లాభాలతో హైదరాబాద్‌లో భూములు కొనుగోలు చేశారని, ఇందులో సౌత్‌గ్రూపుదే కీలకపాత్ర అని పేర్కొంది. భూముల కొనుగోలు వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కుమార్ ప్రమేయం ఉందని తెలిపింది. గౌతమ్ మల్హోత్రా, అమన్‌దీప్, మాగుంట రాఘవ, అరుణ్ పిళ్లై వాంగ్మూలాల ఆధారంగా రెండు చార్జిషీట్లను సోమవారం ఈడీ ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుల్ని కస్టడీలోకి ఇవ్వాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్ ఈడీ చార్జిషీట్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ చార్జిషీట్లలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, శరత్‌చంద్రారెడ్డి, కవిత సన్నిహితుడు వి.శ్రీనివాసరావు, ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా అహెడ్, ఫీనిక్స్ గ్రూపు, ఎన్‌గ్రోత్ క్యాపిటల్, క్రియేటివ్ డెవలపర్స్ తదితరుల పేర్లను ప్రస్తావించింది. నిందితుల వాంగ్మూలాల ఆధారంగా అసాధారణ అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పింది. ఆప్ నేతలకు సౌత్‌గ్రూపు రూ.100 కోట్లు హవాలా రూపంలో ముడుపులిచ్చింది. తద్వారా మద్యం విధానం తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుందని పేర్కొంది. ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ కవితపై కీలక అభియోగాలు మోపిన ఈడీ.. తెరపైకి భర్త అనిల్ పేరు.. -
సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్.. ఎంపీతో స్టార్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాలు డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటివరకు ఈ జంట స్పందించకపోయినా కలిసి జంటగా పలుమార్లు మీడియాకు చిక్కారు. ఇక ఇటీవలె వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీనికి బలం చేకూరిస్తూ రీసెంట్గా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన పరిణీతి చోప్రా చేతికి ఉంగరంతో కనిపించింది. దీంతో ఈ జంట ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ఇక పరిణీతి-రాఘువ్ చద్దాలు పెళ్లికి అంతా సిద్దమయినట్లు తెలుస్తుంది. అక్టోబర్ నెలలో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. -
ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత రాఘవ్ చద్దా డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్లో గాసిప్స్ గుప్పుమన్న సంగతి తెలిసిందే. వాటన్నింటినీ నిజం చేస్తూ ఈ జంట చాలాసార్లు ముంబయి, దిల్లీ విమానాశ్రయాల్లో కెమెరాలకు చిక్కింది. దీంతో ఈ జంటపై డేటింగ్ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చాయి. అయితే వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై ఆప్ ఎంపీ సంజీవ్ ఆరోరా విషెస్ కూడా చెప్పారు. అయితే త్వరలోనే ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకోనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. వారి వద్ద నుంచి అధికారిక ప్రకటన వస్తుందని భావించినా అలాంటిదేం జరగలేదు. అయితే తాజాగా ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో పరిణీతి చోప్రా కనిపించింది. ఆ వీడియోలో పరిణీతి చోప్రా చేతికి ఉంగరం కనిపించింది. దీంతో ఈ జంట ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ఆమె వేలికి ఉంగరం కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేశారు. కాగా.. పరిణీతి, రాఘవ్‌ల కుటుంబాలకు కూడా కొన్నేళ్లుగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఎంపీతో హీరోయిన్ డేటింగ్.. నిశ్చితార్థం డేట్ ఫిక్స్!
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా డేటింగ్ రూమర్స్‌తో కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఆమె త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణీతి ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరు తమ ప్రేమను పెళ్లిబంధంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారట. తాజా సమాచారం ప్రకారం మరో వారం రోజుల్లో పరిణీతి-రాఘవ్‌ల నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్స్ వాయిదా వేసుకున్న పరిణీతి పెళ్లి పనుల్లో బిజీగా ఉందట. ఈనెల 10న వీరి ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరగనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టని పరిణీతి-రాఘవల్లు రీసెంట్గా ముంబైలోని ఓ రెస్టారెంట్ డిన్నర్ డేట్‌కి వెళ్లి మీడియా కంట పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఓ ఈవెంట్‌కి కూడా జంటగా కలిసొచ్చారు.దీంతో రాఘవ్- పరిణీతి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఎంగేజ్మెంట్ అనంతరం తమ రిలేషన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. -
రాఘవ్ చద్దా, పరిణితిచోప్రా పెళ్లి సాధ్యమేనా? నటి స్టేట్మెంట్ వైరల్
బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితీ చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ యువనేత రాఘవ్ చద్దాల వివాహంపై కొద్ది రోజులుగా రూమర్స్ జోరుగా వ్యాప్తి చెందుతున్నాయి. వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్నారని, త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల ఓ కార్యక్రమానికి ఈ జోడీ కలిసివెళ్లడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. కానీ ఇప్పటివరకు వీరిద్దరు ఈ విషయంపై నోరుమెదపలేదు. ఈ వార్తలను ఖండించనూ లేదు ఖరారూ చేయలేదు. అయితే తాజాగా పరిణితీ చోప్రా గతంలో ఇచ్చిన ఓ స్మేట్మెంట్కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన పరిణితి.. తాను రాజకీయ నాయకులను మాత్రం పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. స్వయంగాపైకి వచ్చినవారు అంటే తనకు ఇష్టమని, తనకు గౌరవం ఇచ్చేవారినే ఇష్టపడతానని పేర్కొంది. పొలిటిషియన్‌ను తప్ప ఏ రంగానికి చెందినవారినైనా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని తెలిపింది. ఈ అమ్మడు గతంలో ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. యువ నాయకుడు రాఘవ్ చద్దాతో ఈమె సన్నితంగా మెలగడే ఇందుకు కారణం. ఈమె కొత్త సినిమాలో సహ నటుడు హార్డీ సంధు కూడా.. పరిణితి త్వరలో పెళ్లి చేసుకోబోతుందని, ఎట్టకేలకు తనకు కావాల్సిన భాగస్వామి దొరికాడని వెల్లడించాడు. ఆమెకు అడ్వాన్స్‌గా.. ఆల్‌ది బెస్ట్ కూడా చెప్పాడు. దీంతో రాఘవ్ చద్దాతోనే పరిణితి వివాహానికి సిద్ధం అవుతోందని నెటిజన్లు భావిస్తున్నారు. వీరి పెళ్లి సాధ్యాసాధ్యాల గురించి జోరుగా చర్చిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకుడ్ని పెళ్లి చేసుకోనని చెప్పిన పరిణితి ఇప్పుడు మనసు మార్చుకుని ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రేమలో ఏదైనా సాధ్యమే అని అంటున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ అటు రాఘవ్‌కు ఇటు అభిమానులకు షాక్ ఇస్తుందా..? లేదంటే పెళ్లికి రెడీ అవుతుందా చూడాలి! చదవండి: సొంత అంతరిక్ష విమానం.. కల సాకారానికి అడుగు దూరంలో భారత్.. -
ముంబయిలో వాలిపోయిన లవ్ బర్డ్స్.. త్వరలోనే ఎంగేజ్మెంట్!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత రాఘవ్ చద్దా డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంట ఓ రెస్టారెంట్ వద్ద కలిసి వెళ్తూ కెమెరాల కంటపడగా.. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలైంది. అంతే కాకుండా మరో ఎంపీ సైతం వీరిద్దరి రిలేషన్‌ను నిజం చేస్తూ ట్వీట్ చేశారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంటకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన పరిణీతి చోప్రా అభిమానులు సైతం కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే తాజాగా మరోసారి ఈ జంట కెమెరా కంటికి చిక్కింది. అయితే వీరిద్దరి రిలేషన్‌పై ఎవరూ కూడా అధికారికంగా స్పందించలేదు. తాజాగా పరిణామాలతో ఈ లవ్ బర్డ్స్ అందరూ అనుకుంటున్నట్లుగానే డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడికెళ్లినా ఇద్దరు కలిసి జంటగా కనిపిస్తున్నారు. మరోసారి పరిణీతి, రాఘవ్ చద్దా ఆదివారం ఉదయం ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో ఈ జంట కలిసి వెళ్తున్న వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ జంట విమానాశ్రయంలో నవ్వుతూ కమెరాల కంటికి చిక్కారు. ఢీల్లీ నుంచి బయలు దేరి నేరుగా ముంబయిలో వాలిపోయారు. (ఇది చదవండి: ఆప్ నేతతో పరిణీతి చోప్రా డేటింగ్.. ట్వీట్ వైరల్) త్వరలోనే పరిణీతి-రాఘవ్ నిశ్చితార్థం? తాజా నివేదికల ప్రకారం పరిణీతి, రాఘవ్ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. పరిణీతి, రాఘవ్ కుటుంబాలు ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో వారు తేదీని కూడా ప్రకటించే అవకాశముంది. WATCH | Amid wedding buzz, #RaghavChadha and #ParineetiChopra got spotted at Mumbai airport today pic.twitter.com/gih5a79Yrw — Bollywood Buzz (@BollyTellyBuzz) April 2, 2023 -
ఆప్ నేతతో పరిణీతి చోప్రా డేటింగ్.. ట్వీట్ వైరల్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత రాఘవ్ చద్దా డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఇటీవల ఓ రెస్టారెంట్ వద్ద కలిసి వెళ్తూ కెమెరాల కంటపడ్డారు. దీంతో ఈ జంటపై డేటింగ్ రూమర్స్ జోరందుకున్నాయి. అయితే తాజాగా మరో ఎంపీ సంజీవ్ ఆరోరా చేసిన ట్వీట్ వీరిద్దరి రిలేషన్షిప్ మరోసారి చర్చకు దారితీసింది. సంజీవ్ ఆరోరా ట్వీట్లో రాస్తూ..' మీ ఇద్దరి ప్రేమకు నా హృదయపూర్వక ధన్యావాదాలు. వారి మధ్య ప్రేమ, ఆనందం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఈ జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు.' అంటూ వారిద్దరి ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరి డేటింగ్‌పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్స్ ఏకంగా ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అయితే పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా గురించి వారి సన్నిహితులు ఒకరు క్లారిటీ ఇచ్చారు. ఇరు కుటుంబాలు వివాహంపై చర్చలు ప్రారంభించిన తర్వాతే ఇటీవల విందుకు వెళ్లారు. వారు ఒకరికొకరు బాగా తెలుసు.. అలాగే ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి కుటుంబాలకు కొంతకాలంగా పరిచయం ఉంది. ఇంకా కుటుంబ సభ్యులు ఈ విషయంపై చర్చించుకుంటున్నారు. త్వరలో వేడుక జరుగనుంది. ఇద్దరూ కలిసి ఉండటం పట్ల ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. అయితే ఇద్దరూ తమ తమ షెడ్యూల్లో బిజీగా ఉన్నందున ఇప్పుడే తేదీని నిర్ణయించడం కష్టమని సన్నిహితులు తెలిపారు. I extend my heartfelt congratulations to @raghav_chadha and @ParineetiChopra. May their union be blessed with an abundance of love, joy, and companionship. My best wishes!!! pic.twitter.com/3fSWVT4evR — Sanjeev Arora (@MP_SanjeevArora) March 28, 2023 -
బీజేపీకి ఫేవర్‌గా ఎగ్జిట్ పోల్స్.. ఊహించిందే: ఆప్
అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు ఉప ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్‌పై రాజకీయ చర్చ నడుస్తోంది. ప్రధానంగా గుజరాత్ ఎన్నికలే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో తమకు ప్రతికూలంగా ఫలితాలు రావడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎప్పుడూ బీజేపీకి అనుకూలంగానే ఉంటాయని పేర్కొన్నారాయన. ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. ఆప్ ఓటర్లు మౌనంగా, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. వాళ్లు ఎగ్జిట్ పోల్ అంచనాకి చిక్కరు అంటూ కామెంట్ చేశారు. మరి.. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్‌కి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ కంటే ఉత్తమ ప్రదర్శనే ఆప్ చూపించబోతోంద’’ని చద్దా తెలిపారు. గుజరాత్లో ఆప్ కో-ఇన్ఛార్జిగా ఒక మాట చెప్పదల్చుకున్నా.. ఒక పార్టీ కొత్తగా ఒక రాష్ట్రంలో పోటీ చేస్తున్నప్పుడు ఇలా తక్కువ అంచనా వేయడం సహజమే. ఇలాగే ఢిల్లీలో 2013లో ఆప్ పోటీ చేసినప్పుడు.. మూడు, నాలుగు కంటే ఎక్కువ సీట్లు గెల్చుకోకపోవచ్చనే అంచనా వేశారు. కానీ, 28 సీట్లు గెల్చుకుంది కదా!. అలాగే.. ఆమ్ ఆద్మీ పార్టీ గణనీయమైన ఓట్లను సాధించి గుజరాత్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు రాఘవ్ చద్దా. ఇదిలా ఉంటే.. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్లో ఆప్ 90 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమంటూ ప్రకటించారు. ఇదీ చదవండి: మంచు కొండల్లో పోటాపోటీ! -
‘పెట్రోల్‌తో పాలు పోటీపడుతున్నాయి.. ఇక్కడితో ఆగదు’
గాంధీనగర్: పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు అమూల్ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో పాల ధరలపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. ధరల పెరుగుదల విషయంలో పెట్రోల్‌తో పాలు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ధా. ధరలపై ఉదాసీనత ప్రదర్శించే ప్రభుత్వ తప్పులతో దేశంలోని మధ్యతరగతి కుటుంబాలు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాయని విమర్శించారు. ఫుల్ క్రీమ్ మిల్క్, గేదె పాలపై లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేసే గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త ధరలు అమలవుతాయని వెల్లడించింది. దీనిపై ఆప్ ఎంపీ రాఘవచద్దా ట్వీట్ చేశారు. ‘మీకు చెప్పాను కదా..! ధరల విషయంలో పాలు, పెట్రోల్ పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. పెరుగుదలతో సామాన్యుల నడ్డి విరుగుతోంది. ఈ రోజు అమూల్ పాల ధరలు లీటర్‌కు రూ.2 చొప్పున పెరిగాయి. ఉదాసీనంగా వ్యహరిస్తోన్న ప్రభుత్వం కారణంగా సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారు. పాల ధరలు మళ్లీ పెరుగనున్నాయి? కారణాలు.. పశుగ్రాసం ధరల విపరీతంగా పెరగటం, లంపీ వైరస్ వ్యాప్తి’ అని భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశుగ్రాసం ధరలు భారీగా పెరిగిపోతున్నాయని, దాంతో రైతులు ఇతర పంటలను పశువులకు అందిస్తున్నట్లు గుర్తు చేశారు రాఘవ్ చద్ధా. పశుగ్రాసం ధరలు 9 ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయని పేర్కొన్నారు. ఒక్క గుజరాత్‌లోనే గత రెండేళ్లలో 1.36 లక్షల హెక్టార్ల పశుగ్రాసం సాగు తగ్గిపోయిందన్నారు. పశుగ్రాసానికి కొరత ఏర్పడిన క్రమంలో 2020లో 100 ఎఫ్పీఓలు ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పటి వరకు ఒక్కటి సైతం ఏర్పాటు చేయలేకపోయిందని ఆరోపించారు. ఇదీ చదవండి: రాహుల్ ఓ ఫెయిల్డ్ మిసైల్.. కాంగ్రెస్ మళ్లీ ప్రయోగిస్తోంది: బొమ్మై -
అక్కడ వారికి పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్‌లు మాత్రమే దొరుకుతాయి!
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంపై సీబీఐ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. గతంలో కూడా ఇలాంటి దాడులే జరిగాయని, ఏమి కనగొనలేకపోయారని అన్నారు. అమెరికా ప్రసిద్ధ వార్త పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఆయన పనితీరుని ప్రశంసించి ఫ్రంట్ పేజీలో ప్రచురిస్తే... కేంద్ర ప్రభుత్వం సీబీఐ దాడులు నిర్వహిస్తుందని పెద్ద ఎత్తున్న ఆరోపణలు చేశారు. అయినా మనీష్ సిసోడియా ఇంట్లో కేవలం పుస్తకాలు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు మాత్రేమ కనిపిస్తాయని ఆప్ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు సుమారు వంద మందికి పైగా ఆప్ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని, ప్రతికేసులో ఒక్కొక్కరిగా తాము కేసు నుంచి బయటపడ్డామని రాఘవా అన్నారు. ఐతే సీబీఐ విద్య, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా తొమ్మిది నెలలుగా అమలు చేసిన కొత్త మద్యం పాలసీపై విచారణ జరుపుతోంది. ఢిల్లీలో కేంద్ర ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా మద్యం విక్రయించడానికి ఎవరికి అనుమతి ఇవ్వాలనే దానిపై సిసోడియా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని సీబీఐ పేర్కొంది. అంతేకాదు లైసెన్సులతో మధ్యం విక్రయించుకునేలా ప్రైవేట్ వ్యక్తులకే అధిక సంఖ్యలో కట్టబెట్టేందుకు చూసిందని సీబీఐ ఆరోపిస్తోంది. ఐతే అవినీతిని అరికట్టేందుకు, శక్తివంతమైన మద్యం మాఫియాపై పోరాడేందుకు ఈ విధానాన్ని ఉద్దేశించినట్లు సిసోడియా చెబుతుండటం గమనార్హం. (చదవండి: సీబీఐ దాడుల మధ్య కేజ్రీవాల్ ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్) -
బుల్డోజర్లతో ‘‘అమిత్ షా ఇంటిని కూల్చేయండి’’
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో అక్రమ కట్టాల పేరిట ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేతలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు కలుగజేసుకోవడంతో ఈ కూల్చివేత నిలిచిపోయింది. కానీ, అధికారులు మాత్రం సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా.. దాదాపు రెండు గంటలపాటు కూల్చివేతల పనులను కొనసాగించారు. ఆ సమయంలో జహంగీర్‌పురిలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, ఇటీవల హనుమాన్ జయంతి వేడుకల సమయంలో జహంగీర్‌పురిలో గొడవలు జరిగిన విషయం విధితమే. ఈ సందర్బంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్వయంగా ఈ అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మీరు బుల్డోజర్లను ఉపయోగించాలనుకుంటే.. బీజేపీ హెడ్‌క్వార్టర్స్, అమిత్ షా ఇంటిని కూల్చేయండి అంటూ మండిపడ్డారు. అప్పుడు అల్లర్లు ఆగిపోతాయి అంటూ రాఘవ్ చద్దా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 15 ఏళ్లుగా బీజేపీ పార్టీనే మున్సిపల్ అధికారాన్ని అనుభవించిందని, ఆ సమయంలో అనేక ముడుపులు తీసుకొని, అక్రమ నిర్మాణాలకు అనుమతినిచ్చిందని తెలిపారు. ముడుపులు తీసుకున్న బీజేపీ నేతల ఇళ్లను కూడా ఇలాగే కూల్చేయాలని చద్దా డిమాండ్ చేశారు. ఇళ్ల కూల్చివేతపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రాహుల్ ట్విట్టర్ వేదికగా..‘‘భారత రాజ్యాంగ విలువలను కూల్చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదలు, మైనారిటీలే లక్ష్యంగా ఇలా చేస్తున్నారని రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. This is a demolition of India’s constitutional values. This is state-sponsored targeting of poor & minorities. BJP must bulldoze the hatred in their hearts instead. pic.twitter.com/ucSJK9OD9g — Rahul Gandhi (@RahulGandhi) April 20, 2022 ఇది చదవండి: ప్రశాంత్ కిషోర్‌పై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయన అంటేనే ఓ బ్రాండ్.. -
కాంగ్రెస్ పార్టీ చచ్చిన గుర్రం లాంటిది..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టగా.. జాతీయ పార్టీ కాంగ్రెస్ ఓటముల నుంచి ఎలా గట్టెక్కాలో వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ అవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వీరి భేటీ నేపథ్యంలో ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా.. కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. చద్దా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఓ చనిపోయిన గుర్రమని, దానిని ఎన్ని కొరడాలతో కొట్టినా.. అది పరిగెత్తదని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి కేవలం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే సవాల్ విసరగలరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంకాదని కుండబద్దలు కొట్టారు. Congress Party cannot give an alternative to the country. Only Arvind Kejriwal can challenge PM Narendra Modi and BJP. Congress is like a dead horse, there is no point flogging a dead horse: AAP Rajya Sabha MP-elect Raghav Chadha on Prashant Kishor's meeting with Congress pic.twitter.com/nY0t0UlL6s — ANI (@ANI) April 16, 2022 అంతటితో ఆగకుండా.. బీజేపీ పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎప్పటికీ హింసాత్మక ఎజెండాతోనే ముందుకు సాగుతుందని బాంబు పేల్చారు. బీజేపీ ప్రభుత్వాలు ఎన్నటికీ మంచి పాఠశాలలను నిర్మించలేవని, ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేవని అన్నారు. కేవలం నిరక్షరాస్య గూండాలను మాత్రమే తయారు చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. भारतीय जनता पार्टी का मतलब अब भारतीय "ज़ाहिल" पार्टी हो गया है। BJP सही मायनों में गुंडों-लफंगों की पार्टी बन गयी है। BJP के गुंडे लोकतांत्रिक ढंग से चुने हुए मुख्यमंत्री पर हमला करते हैं। लेकिन BJP उन गुंडों को सम्मानित करती है। -@raghav_chadha pic.twitter.com/xSi6IGg8wf — AAP (@AamAadmiParty) April 16, 2022 -
రాఘవ్ చద్ధాకు స్వర భాస్కర్ వెరైటీ విషెష్
న్యూఢిల్లీ: పిన్న వయసులో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు రాఘవ్ చద్ధాకు ప్రముఖ నటి స్వర భాస్కర్ వెరైటీగా విషెష్ చెప్పారు. ‘ఇక నుంచి రాఘవ్ చద్ధా పేరు చివర ‘గారు’ జోడించి పిలవాలేమో. ఎంపీ అయినప్పటికీ దీపావళి పార్టీలలో డ్యాన్స్ చేయకుండా వదలం. చద్ధా జీ అభినందనలు. మరింత ఎత్తుకు ఎదగాల ’ని స్వర భాస్కర్ ట్వీట్ చేశారు. దీనికి రాఘవ్ చద్ధా తనదైన శైలిలో బదులిచ్చారు. ‘నా పేరు చివరిలో ఎటువంటి ప్రత్యయాలు అవసరం లేదు. డ్యాన్స్ ఫ్లోర్‌పైకి నన్ను బలవంతం చేయడం పార్లమెంటరీ ప్రత్యేక హక్కు ఉల్లంఘన/పార్లమెంటరీ ధిక్కారం అవుతుంద’ని ట్వీట్ చేశారు. కాగా, రాఘవ్ చద్ధా, స్వర భాస్కర్ మంచి మిత్రులు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చద్ధా తరపున ఆమె ప్రచారం కూడా నిర్వహించారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, రాఘవ్ చద్ధా, అశోక్ మిట్టల్, ప్రొఫెసర్ సందీప్ పాఠక్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలు పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభకు గురువారం ఎన్నికయ్యారు. (క్లిక్: రాజ్యసభ ఎన్నికల్లో ‘ఆప్’ విజయం..) -
రాజ్యసభ ఎన్నికల్లో ‘ఆప్’ విజయం.. ఎంపీలుగా హర్భజన్, అశోక్ మిట్టల్...
చండీగఢ్: పంజాబ్ నుంచి ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థులు రాజ్యసభ సభ్యులుగా ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికైనట్లు అధికారులు గురువారం ప్రకటించారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, రాఘవ్ చద్ధా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్ మిట్టల్, ఐఐటీ–ఢిల్లీ ప్రొఫెసర్ సందీప్ పాఠక్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాను తమ అభ్యర్థులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నామినేట్ చేసింది. నామినేషన్ల గడువు గురువారం ముగిసింది. ఆమ్ ఆద్మీ మినహా ఇతర పార్టీలు అభ్యర్థులను నామినేట్ చేయలేదు. దీంతో ఆప్ అభ్యర్థులంతా పోటీ లేకుండా ఎగువ సభకు ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి సురీందర్ పాల్ చెప్పారు. రాఘవ్ చద్ధా(33) ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ వ్యవహారాల సహ–ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం వెనుక ఆయన కృషి ఉంది. సందీప్ పాఠక్ ఐఐటీ–ఢిల్లీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. -
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా రాజీనామా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు రాఘవ్ చద్దా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్‌కు అందజేశారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు పంపాలని ‘ఆప్’ నిర్ణయించడంతో ఎమ్మెల్యే పదవిని రాఘవ్ చద్దా వదులుకున్నారు. ‘ఢిల్లీ విధానసభకు నేను రాజీనామా చేశాను. సభాపతితో సహా సభ్యులందరూ నన్ను ఎంతో ఆదరించారు. పంజాబ్ తరపున రాజ్యభలో బలంగా గళం వినిపిస్తాను. పంజాబ్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాన’ని రాఘవ్ చద్దా ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. ఐదుగురు అభ్యర్థులు రాఘవ్ చద్దాతో పాటు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, ఐఐటీ ప్రొఫెసర్ సందీప్ పాఠక్, విద్యావేత్త అశోక్ కుమార్ మిట్టల్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ్య అభ్యర్థులుగా మార్చి 21న ప్రకటించింది. పంజాబ్‌లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏప్రిల్ 9న ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు నిర్వహించనున్నారు. (క్లిక్: పంజాబ్ సీఎం సంచలన ప్రకటన) యంగెస్ట్ ఎంపీ! 33 ఏళ్ల రాఘవ్ చద్దా.. రాజ్యసభలో అతి పిన్న వయస్కుడైన సిట్టింగ్ సభ్యునిగా గుర్తింపు పొందనున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జిగా ఆయన వ్యవహరించారు. వృత్తిరీత్యా చార్టెట్ అకౌంటెంట్ అయిన చద్దా.. ఢిల్లీ లోక్‌పాల్ బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేటైన చద్దాకు ఆ రాష్ట్రంలో గట్టి పట్టుంది. (క్లిక్: రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు) -
వరుస రాజీనామాలు.. మోదం, ఖేదం!
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు అలా వెలుడ్డాయో, లేదో ఇలా రాజీనామాల పర్వం మొదలైంది. ఓడిపోయిన పార్టీలకు చెందిన నాయకులు నైతిక బాధ్యతగా పదవులు వదులుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కొంత మంది ఎంపీలు.. పార్లమెంట్ సభ్యత్వాలను త్యజించారు. ప్రమాణ స్వీకారానికి ముందు రోజు.. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో భగవంత్ మాన్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రోజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారు. సంగ్రూర్ జిల్లాలోని ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు. కాగా, కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమితో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవిని కోల్పోయారు. మండలికి యోగి రాజీనామా యూపీ ముఖ్యమంత్రిగా వరుసగా రెండో పర్యాయం ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్.. శాసనమండలి సభ్యత్వాన్ని వదులుకున్నారు. తాజా ఎన్నికల్లో గోరక్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు. దీంతో మార్చి 21న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. జూలై 6న ఎమ్మెల్సీ పదవి గడువు ముగియనుంది. ఎంపీ పదవిని వదులుకున్న అఖిలేశ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా ఎంపీ పదవిని త్యాగం చేశారు. ఆజంగఢ్ లోక్‌సభ ఎంపీగా ఉన్న ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ నుంచి గెలిచారు. యూపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఆయన ఎంపీ పదవిని వదులుకున్నారు. అఖిలేశ్ బాటలో ఆజంఖాన్ సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్ కూడా అఖిలేశ్ బాటలో నడిచారు. రాంపూర్ లోక్‌సభ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ముగిసిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ నుంచి ఆయన విజయం సాధించారు. (క్లిక్: కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు!) పీసీసీ ప్రెసిడెంట్లకు షాక్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నిరుత్సాహపూరిత ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఆయ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల పదవులను పీకిపారేసింది. పదవుల నుంచి దిగిపోవాలని సోనియా గాంధీ అల్టిమేటం జారీ చేయడంతో ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేశారు. అజయ్ కుమార్ లల్లూ(యూపీ), గణేశ్ గోడియాల్(ఉత్తరాఖండ్), నవజ్యోత్ సింగ్ సిద్ధూ(పంజాబ్), గిరీష్ చోడంకర్(గోవా), నమీరక్పామ్ లోకేన్ సింగ్(మణిపూర్) పదవులు కోల్పోయారు. (క్లిక్: మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం..) ఎమ్మెల్యే పదవికి చద్ధా రాజీనామా ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జిగా వ్యవహరించిన ఢిల్లీ యువ ఎమ్మెల్యే రాఘవ్ చద్ధా తన శాసనసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. రాజ్యసభకు నామినేట్ కావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.