
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఢిల్లీలో వీరి ఎంగేజ్‌మెంట్ వేడుక వైభవంగా జరిగింది. నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం విదేశాల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఈ జంట మెరిసింది.
(ఇది చదవండి: ఎంగేజ్‌మెంట్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న పరిణీతి చోప్రా )
ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు పరిణీతి, రాఘవ చద్దా ఓవల్‌లో వాలిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న త్వరలోనే వివాహాబంధంతో ఒక్కటి కానుంది. వీరి పెళ్లి వేడుక రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది.
(ఇది చదవండి: టాప్ హీరోయిన్ కూతురి అన్నప్రాసన వేడుక చూశారా?)
Comments
Please login to add a commentAdd a comment