
ప్రముఖ యూట్యూబర్, ఆర్జే మహ్‌వశ్ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. వరుస ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కనిపించి తెగ సందడి చేస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈమె పేరు మరింత హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇటీవల లక్నోలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కనిపించిన ముద్దుగమ్మ.. తాజాగా పంజాబ్‌లోని చండీఘర్‌లో జరిగిన మ్యాచ్‌లో మెరిసింది. అయితే ఏకంగా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో సెల్ఫీ ఫోటోను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది.
గత కొద్ది రోజులుగా వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ ఇటీవలే చాలాసార్లు కథనాలొచ్చాయి. ఛాంపియన్ ట్రోఫీ తర్వాతే వీరిపై రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. అయితే ఐపీఎల్ లీగ్‌తో యుజ్వేంద్ర చాహల్ టీమ్ ఆడుతున్న ప్రతి మ్యాచ్‌కు ఆర్జే మహ్‌వశ్ హాజరు కావడం చూస్తుంటే వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా తాజా పోస్ట్‌లో ఈ మ్యాచ్‌కు నీకోసమే వచ్చానంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తే చాహల్‌తో డేటింగ్ ఉన్నమాట నిజమేనని తెలుస్తోంది. ఇక వారి నుంచి అఫీషియల్ ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది.
ఆర్జే మహ్‌వశ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నీ వెనకాల ఉండి మద్దతు ఇచ్చే వారిలో మేము కూడా నీ వెనక రాయిలా నిలబడి ఉన్నాం. నీకు మద్దతు ఇవ్వడం కోసమే మేమంతా ఇక్కడికి వచ్చాం అంటూ పోస్ట్ చేసింది. స్టేడియంలో తన స్నేహితులతో పాటు మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది.