IPL match
-
ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్.. అభిమానులకు మరోసారి నిరాశే
-
IPL 2024: భర్తను చీర్ చేసేందుకు వచ్చిన ధనశ్రీ వర్మ.. లేటెస్ట్ పిక్స్
-
IPL టికెట్లు ఆన్లైన్లో బుక్ చేస్తున్నారా?.. పోలీసుల హెచ్చరిక ఇదే
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ టికెట్లు విక్రయిస్తామంటూ సైబర్ ముఠా మోసాలకు తెర తీసింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ టికెట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి, క్యూఆర్ కోడ్లు పంపి కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే చెన్నై-హైదరాబాద్ మ్యాచ్‌కి టికెట్లు మొత్తం అమ్ముడుపోగా, ఆన్లైన్లో అమ్మకాలను పేటీఎం నిలిపివేసింది. సోషల్ మీడియా వేదికగా టికెట్లు ఆన్లైన్లో అమ్ముతున్నామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు గుంజుతున్నారు. టికెట్లపై డిస్కౌంట్ సైతం ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. క్రికెట్ అభిమానుల అప్రమతంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
SRH Vs MI: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్: మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా నగరంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బుధవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయం పొడిగించారు. ఇవాళ మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయన్నారు. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో చివరి రైళ్లు రాత్రి 12:15 గంటలకు బయల్దేరి 1:10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటుందని మెట్రో అధికారులు వెల్లడించారు. -
ఐపీఎల్ మ్యాచ్‌లో ప్రేమజంట
-
స్డేడియంలో వాలిపోయిన ప్రేమజంట.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డేటింగ్లో ఉన్న భామ ఈనెలలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకునేందుకు సిద్ధమైంది. ఈనెల 13న ఈ ప్రేమజంట దిల్లీలో నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు ఇప్పటికే బీ టౌన్లో తెగ చర్చ నడుస్తోంది. అంతే కాకుండా ఈ ఏడాది అక్టోబర్‌లోనే వివాహాబంధంలోకి కూడా అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు జంటగా కనిపించిన పరిణితీ చోప్రా, రాఘవ్ మరోసారి సందడి చేశారు. (ఇది చదవండి: పొలిటీషియన్తో పరిణీతి పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆప్ నేత.. వీడియో వైరల్) ఈసారి ఏకంగా ఐపీఎల్ మ్యాచ్‌లో కనిపించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. పంజాబ్‌లోని మొహాలి వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు ఈ ప్రేమజంట హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పరిణితీ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఇవీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మొహాలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్-ముంబయి జట్లు తలపడ్డాయి. కాగా.. గతంలో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఆప్ ఎంపీ రాఘవ చద్దాతో పరిణీతి ముంబయిలోని ఓ రెస్టారెంట్లో కనిపించింది. దీంతో వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలాసార్లు జంటగా మీడియా కంట పడ్డారు. అంతే కాకుండా ఈ లవ్ బర్డ్స్‌కు ఆప్ నేతలు సైతం ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు కూడా తెలిపారు. (ఇది చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ) View this post on Instagram A post shared by Arvind Kejriwal Fans (@arvindkejriwalaap.fc) -
KGF స్టైల్ లో ధోని ఎంట్రీ...అడుగుపెట్టగానే దద్దరిల్లిన స్టేడియం
-
హాట్ కేకుల్లా ఐపీఎల్ టిక్కెట్లు
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్ లీగ్ దశ పోటీలు ముగిశాయి. అన్ని క్రికెట్ ఫార్మాట్లకు ఆతిథ్యమిచ్చిన వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఈసారి ఐపీఎల్ తుదిపోరుకు అర్హత సాధించే జట్టు ఎంపికకు వేదిక కానుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్ల హోమ్ గ్రౌండ్లలోనే మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, ఎన్నికల కారణంగా వైఎస్సార్ స్టేడియంను ఆపద్ధర్మంగా నాకౌట్, క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు విశాఖను వేదికగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఎలిమినేషన్ మ్యాచ్, రెండో క్వాలిఫైయింగ్ మ్యాచ్ కూడా విశాఖలో జరగనున్నాయి. తొలిసారిగా ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌లకు వేదికగా నిలిచిన వైఎస్సార్ స్టేడియంలో మ్యాచ్‌లు రాత్రి ఏడున్నరకే ప్రారంభం కానున్నాయి. ఎలిమినేషన్ మ్యాచ్ 8న, రెండో క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్ 10న ఇక్కడ జరగనున్నాయి. ఫైనల్స్ జట్లను తేల్చేది ఇక్కడే 12వ సీజన్ ఐపీఎల్ టోర్నీ నాకౌట్ పోటీలు ఖరారయ్యాయి. తొలి క్వాలిఫయింగ్ రౌండ్ ఏడో తేదీన చెన్నైలో జరగనుంది. ఎలిమినేషన్ మ్యాచ్, రెండో క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్ విశాఖ వేదికగానే జరగనున్నాయి. ఫైనల్ పోరు హైదరాబాద్‌లో జరగనుంది. ఐపీఎల్లో ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీపడిన సంగతి తెలిసిందే. ప్రతి జట్టు పధ్నాలుగు మ్యాచ్‌లను లీగ్ దశలో ఆడింది. లీగ్ దశ శనివారంతో ముగిసింది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లే ప్లేఆఫ్‌కు చేరి నాకౌట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. వాటిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు చెన్నైలో జరిగే తొలి క్వాలిఫయింగ్ రౌండ్లో ఆడనున్నాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేషన్ మ్యాచ్ ఆడతాయి. ఈ మ్యాచ్ విశాఖలో జరగనుంది. లీగ్ చివర్లో సీఎస్కే, ఎంఐ జట్లు అంచనాలు తారుమారు చేశాయి. నిరుటి రన్నర్సప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ పడిలేస్తూ నాలుగోస్థానంలో నిలిచేందుకు తంటాలు పడుతోంది. మరో జట్టు ఓటమి చెందితేనే ప్లేఆఫ్ ఆడే స్థాయిలో ఉంది. ఇక రెండో క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో మొదటి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఓడిన జట్టుతో ఎలిమినేషన్ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఆడనుంది. ఆ మ్యాచ్‌కూ విశాఖే ఆతిధ్యమివ్వనుంది. -
ముంబయి చేతిలో కోల్‌కతా చిత్తు
-
రాజస్తాన్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
-
ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం
-
చెన్నై కోసం పుణెకు ప్రత్యేక రైలు
చెన్నై: ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండేళ్ల నిషేధం తర్వాత సొంతగడ్డపై చెన్నై ఆడుతుంటే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, తమిళనాట కావేరీ జల వివాదం వేడెక్కడంతో చెన్నై మ్యాచ్‌లన్నీ పుణెకు తరలించినట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా వేలాది అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇలా జరిగినందుకు వారేమీ బాధపడలేదు. పుణెను సొంతగడ్డగా భావించి మ్యాచ్‌లాడుతున్న తమ జట్టుకు ఎలా అయినా మద్దతు ఇవ్వాలనుకున్నారు. వారి అభిలాషను ఆ జట్టు యాజమాన్యానికి తెలిపారు. దీనికి వారు సానుకూలంగా స్పందించారు. కేంద్ర రైల్వే శాఖను సంప్రదించి చెన్నై నుంచి పుణెకు ప్రత్యేక రైలుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ ప్రతిపాదనకు అధికారులు కూడా పచ్చజెండా ఊపడంతో ఇక ఆ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ ప్రత్యేక రైలు గురువారం చెన్నై నుంచి క్రికెట్ అభిమానులతో పుణె బయలుదేరింది. పసుపు రంగు జెర్సీలు, పచ్చ జెండాలతో రైలంతా పసుపుమయంగా మారిపోయింది. ‘సీఎస్కే.. సీఎస్కే’అనే నినాదాలతో ట్రైనంతా మార్మోగిపోయింది. ఇంతకీ ఈ రైలు పేరేంటో తెలుసా ‘విజిల్‌పోడు ఎక్స్‌ప్రెస్’. టోర్నీలో భాగంగా శుక్రవారం పుణె వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్–రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి మృతి
చివ్వెంల(సూర్యాపేట): అప్పటి ఐపీఎల్ మ్యాచ్ చూసి ఆనందంగా గడిపిన వారిని ఆగిఉన్న లారీ మృత్యువు రూపంలో కభళించింది. చివ్వెంల మండల పరిధిలోని జి.తిర్మలగిరి వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఆగిఉన్న లారీని కారు వెనుకనుంచి ఢీ కొనడంతో ముగ్గురు దుర్మణం పాలై మరొకరు మృత్యువుతో పోరుడుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరాయకొండపాలెం ఎంపీటీసీ సభ్యుడు శ్యామల శ్రీకాంత్(26), అతని బావమరిది పాత గుంటూరుకు చెందిన తొర్రసాయి కోటేష్(24), కోటేష్ బావమరిది తెనాలి మండలం పినుపాలెం గ్రామానికి చెందిన మైలా పూర్ణచందర్రావు(21)తోపాటు పాత గుంటూరుకు చెందిన దాది సాయిభార్గవ్ హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. మ్యాచ్ చూసి తిరిగి కారులో వస్తుండగా.. చివ్వెంల మండలం జి.తిర్మలగిరి గ్రామ శివారులో హైవే పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్ అక్కడిక్కడే మృతిచెం దాడు. కోటేష్, పూర్ణచందర్, సాయిభార్గవ్‌కు తీవ్రగాయాలు కావడంతో 108లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి కోటేష్, పూర్ణచందర్ మృతి చెందారు. సాయిభార్గవ్ పరిస్థితి కూడా ఉందని వైద్యులు తెలిపారు. కాగా వీరిలో ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్ ఆదివారం సాయంత్రం విమానంలో హైదరాబాద్ వెళ్లి, తిరుగు ప్రయాణంలో కారులో వస్తున్నట్లు బంధువులు తెలిపారు. కోటేష్‌కు నాలుగు నెలల క్రితమే వివాహమైంది. శ్రీకాంత్‌కు భార్య, కూతురు ఉన్నారు. పూర్ణచందర్ బీటెక్ చదువుతున్నాడు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట రూరల్ సీఐ ప్రవీన్‌కుమార్, ఎస్ఐ బి.ప్రవీన్‌కుమార్ సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కోటేష్ తండ్రి హరిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కారు ఢీకొని మహిళ.. భువనగిరిఅర్బన్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన సంఘటన మండలంలోని జమ్మాపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జమ్మాపురం గ్రామానికి చెందిన గంగారపు ఆరోగ్యజ్యోతి(38), ఆమె అన్న కుమార్తె మేరిస్టేల్లాతో కలిసి స్కూటీ బస్‌షెల్టర్‌కు సమీపంలో ఉన్న తమ మామిడి తోటకు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటే క్రమంలో వీరి బైకును హైదరాబాద్ నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఇరువురు రోడ్డుపై పడ్డారు. ప్రమాదంలో ఆరోగ్యజ్యోతి అక్కడిక్కడే మృతి చెందింది. మేరిస్టేల్లాకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం భువనగిరిలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యజ్యోతి అన్న గంగారపు మల్లయ్య రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. లారీ ఢీకొని ఒకరు.. గుర్రంపోడు(నాగార్జునసాగర్): బైక్‌ను లారీ ఢీ కొట్టిన సంఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పాల్వాయి గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ జి.ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండలం ఎం.గౌరారం గ్రామానికి చెందిన మాడ్గుల కమలాకర్(24) పీఏపల్లి మండలకేంద్రానికి తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా పాల్వాయి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో కమలాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కమలాకర్ తల్లి సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. కమలాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
కూతకు వేళాయె
► నేటినుంచి ప్రొ కబడ్డీ లీగ్ ► సీజన్-4 వేలంతో మారిన ఆటగాళ్లు ► జూలై 31న హైదరాబాద్‌లో ఫైనల్ తొలి ఏడాది సక్సెస్... కొన్ని సార్లు టీవీ రేటింగ్‌లు ఐపీఎల్ మ్యాచ్‌ల స్థాయిలో ఉన్నాయి. రెండో సంవత్సరం సూపర్ సక్సెస్... కబడ్డీ గురించి తెలియనివారు కూడా ఒక్కసారిగా ఇదేదో చూసేద్దాం అనే ఆసక్తి చూపించారు. అదే ఉత్సాహంలో మూడో సీజన్‌ను కూడా జనం మెచ్చేశారు... ఇక ప్రొ కబడ్డీ భారత అభిమానుల స్పోర్ట్స్ మెనూలో భాగమైపోయింది. అంతే... మీ ఆదరణ ఉంటే ఏడాదికి రెండుసార్లు అంటూ నిర్వాహకులు సిద్ధమయ్యారు. అటు నగరాలను, ఇటు గ్రామాలను ఏకకాలంలో అలరించిన ఫలితమే... ఇప్పుడు 2016లో రెండోసారి ప్రొ కబడ్డీ లీగ్. కొత్త జట్లకు మారిన ఆటగాళ్లు నాలుగో సీజన్లో ‘అస్లీ పంగా’ అంటూ తొడకొట్టేందుకు సిద్ధమైపోయారు. ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్‌కు రంగం సిద్ధమైంది. సీజన్-4లో భాగంగా నేటి (శనివారం) నుంచి మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలో జరిగే తొలి మ్యాచ్‌లో పుణేరీ పల్టన్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుండగా, మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్లు జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబై అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి మూడు సీజన్లలాగే ఈ సారి కూడా ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లతో పాటు నాలుగు నాకౌట్ మ్యాచ్‌లు కలిపి మొత్తం 60 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. పుణే మినహా మిగతా ఏడు జట్లకు చెందిన నగరాలలో మ్యాచ్‌లు జరుగుతాయి. జూలై 29న సెమీ ఫైనల్, జూలై 31న ఫైనల్ మ్యాచ్‌లకు హైదరాబాద్ వేదిక కానుంది. రూ. 12.82 కోట్లతో... ఐపీఎల్ తరహాలోనే ప్రొ కబడ్డీ లీగ్‌లో కూడా మూడు సీజన్ల తర్వాత ఆటగాళ్ల కోసం గత నెలలో మళ్లీ వేలం నిర్వహించారు. ప్రతీ జట్టు ఇద్దరు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం కల్పించారు. వేలంలో 198 మంది ఆటగాళ్లు పోటీ పడగా, 96 మందిని ఫ్రాంచైజీలు ఎంచుకున్నాయి. వీరికి చెల్లించిన మొత్తం రూ. 12.82 కోట్లు. అత్యధికంగా మంజీత్ ఛిల్లర్ కోసం బెంగళూరు బుల్స్ రూ. 53 లక్షలు వెచ్చించింది. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా ఫజెల్ అత్రాచలి (ఇరాన్)కు రూ. 38 లక్షలు దక్కాయి. డిఫెన్స్ సర్వీసెస్‌లో పని చేస్తున్న 15 మంది సైనికులు లీగ్‌లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతిభాన్వేషణలో భాగంగా ప్రతీ జట్టు గతంలో లీగ్ ఆడిన అనుభవం లేని 18-22 ఏళ్ల వయసు గల ముగ్గురు యువ ఆటగాళ్లను కూడా ఎంచుకున్నాయి. పెరుగుతున్న ఆదరణ ప్రొ కబడ్డీ లీగ్‌లో ఈసారి భారత్‌తో పాటు 12 దేశాలకు చెందిన 24 మంది ఆటగాళ్లు పాల్గొంటుండటం విశేషం. వీటిలో కెన్యా, జపాన్, ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఇద్దరు పాకిస్తానీలు తెలుగు టైటాన్స్ టీమ్‌లో సభ్యులుగా ఉన్నారు. మూడు సీజన్లలో టీవీ రేటింగ్‌ను అంతకంతకూ పెంచుకున్న ఈ లీగ్ నాలుగో సీజన్‌ను దాదాపు వంద దేశాల్లో ప్రసారం చేయాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. టైటాన్స్ టైటిల్ కల! ప్రొ కబడ్డీ లీగ్‌లో రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్న టైటాన్స్ జట్టు గత మూడు ప్రయత్నాల్లోనూ ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. హైదరాబాద్‌లో జరిగిన 2015 సీజన్లో మెరుగ్గా రాణించిన జట్టు మూడో స్థానంలో నిలిచింది. తొలి ఏడాది, ఆ తర్వాత మూడో సీజన్లో మాత్రం ఐదో స్థానంతోనే సరిపెట్టుకుంది. రాహుల్ చౌదరి రూపంలో స్టార్ ప్లేయర్ జట్టులో ఉండగా, సుకేశ్ హెగ్డే మరో కీలక ఆటగాడు. ఈ సారి సందీప్ నర్వాల్, జస్మీర్ సింగ్‌లను తీసుకోవడంతో టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. మూడు సీజన్లలో కలిపి 44 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ 22 గెలిచి 16 ఓడింది. మరో 6 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. ఈసారి జట్టు తొలి లక్ష్యం సెమీ ఫైనల్ చేరుకోవడం. హైదరాబాద్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడని జట్టు... సెమీస్ చేరితే సొంతగడ్డపై విజయావకాశాలుంటాయి. తెలుగు టైటాన్స్ జట్టు: రాహుల్ చౌదరి (కెప్టెన్), సుకేశ్ హెగ్డే, సందీప్ నర్వాల్, సందీప్ ధుల్, జస్మేర్ సింగ్ గులియా, రూపేశ్ తోమర్, వినోద్ కుమార్, ప్రపంజన్, నీలేశ్ సాలుంకే, వినోత్ కుమార్, శశాంక్ వాంఖడే, సాగర్ కృష్ణ, విశాల్ భరద్వాజ్, అతుల్, సోంబిర్ గులియా (భారత్), మొహమ్మద్ మగ్సూద్ (ఇరాన్), అఖ్లాఖ్ హుస్సేన్, మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్). -
మలింగాను అనుకరించబోయి.. !!
శ్రీలంక బౌలర్ లసిత్ మలింగా బౌలింగ్ గురించి అందరికీ తెలిసిందే. అతనిది చాలా విలక్షణమైన బౌలింగ్. విలక్షణమైన బాడీలాంగ్వెజ్తో బౌలింగ్ చేసి బ్యాట్స్‌మన్ ను తికమకపెట్టడం మలింగా స్టైల్.. నిన్నటి వరకు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన మలింగాను ఈసారి అతని అభిమానులు చాలా మిస్సయ్యరనే చెప్పాలి. ఇప్పుడు మిచేల్ మెక్‌క్లెనఘన్, టిమ్ సౌథీ అతడు లేని లోటును పూడుస్తూ.. ముంబై ఇండియన్స్ తరఫున నిలకడగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై ఆటగాడు కృనాల్ పాండ్యా తాజాగా మలింగాను గుర్తుకుతెచ్చాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చాలా విలక్షణమైన బాడీ లాంగ్వెజ్తో బౌలింగ్ చేశాడు. అచ్చం మలింగాను తలపిస్తూ వేసిన ఈ బంతి వైడ్ కావడమే కాకుండా ఏకంగా కీపర్ ప్రయత్నించినా అందకుండా ఫోర్ వెళ్లింది. దీంతో రోహిత్ సేన ఇదేమీ బౌలింగో అర్థం కాక కాస్త తికమక పడింది. Krunal Pandya does a Malinga sans the result #MIvRCB #VIVOIPLhttps://t.co/VelT0DEpCi — IndianPremierLeague (@IPL) April 20, 2016 -
కామెంటేటర్‌గా స్యామీ
కోల్‌కతా: సరిగ్గా నెల రోజుల క్రితం ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్ కెప్టెన్‌గా టి20 ప్రపంచకప్‌ను అందుకున్న డారెన్ స్యామీ... అదే ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్ అవతారం ఎత్తాడు. కోల్‌కతా, పంజాబ్‌ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ ద్వారా కామెంటేటర్‌గా అరంగేట్రం చేశాడు. గతేడాది ఐపీఎల్లో బెంగళూరుకు ఆడిన స్యామీని ఈసారి వేలంలో ఏ జట్టూ తీసుకోలేదు. -
క్రికెట్ మ్యాచ్ చూడొద్దన్నందుకు బాలుడి అదృశ్యం
జీడిమెట్ల: ఇంట్లో ఐపీఎల్ మ్యాచ్ చూడనివ్వడం లేదని ఓ బాలుడు ఇంటి నుండి వెళ్లిపోయిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సైదిరెడ్డి వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌కు చెందిన విజయ్ కుమార్ కుమారుడు సాయిగణేష్ ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసాడు. ఆదివారం ఇంట్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా తండ్రి టీవీ ఆపేశాడు. దీంతో సాయిగణేష్ ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. మంగళవారం కుటుంబ సభ్యులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పుణే మ్యాచ్ లు విశాఖలో...
♦ బెంగళూరుకు ఫైనల్ ♦ ఐపీఎల్ మ్యాచ్‌ల తరలింపు న్యూఢిల్లీ: నీటి సమస్య కారణంగా మహారాష్ట్రలో జరగాల్సిన 13 ఐపీఎల్ మ్యాచ్‌లను ఇతర వేదికలకు తరలించారు. బాంబే హైకోర్టు తీర్పు నేపథ్యంలో లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా నేతృత్వంలో వేదికల మార్పుపై శుక్రవారం సమావేశం జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. దీంట్లో భాగంగా విశాఖపట్నం, రాయ్‌పూర్, కాన్పూర్, జైపూర్లను ప్రత్యామ్నాయ వేదికలుగా నిర్ణయించారు. దీంతో రైజింగ్ పుణే తమ వేదికగా విశాఖపట్నంను ఎంచుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం నిర్ణయం తీసుకునేందుకు రెండు రోజుల గడువును కోరింది. అలాగే ముంబైలో జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ను కూడా ఇక్కడే నిర్వహిస్తారు. ఇక రెండో క్వాలిఫయర్‌తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్‌ను కోల్‌కతాకు ప్రతిపాదించారు. ‘పుణే తమ హోం మ్యాచ్‌ల కోసం విశాఖను కోరింది. ఈ అంశాన్ని పాలకమండలి ముందు ఉంచుతాం. మహారాష్ట్ర సీఎం కరవు బాధిత సహాయక నిధి కోసం రెండు జట్లు రూ.5 కోట్ల చొప్పున విరాళం ఇచ్చేందుకు అంగీకరించాయి. అలాగే మే 1న ముంబై, పుణే జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను పుణేలో జరిపేందుకు అనుమతించాలని కోర్టును కోరనున్నాం’ అని రాజీవ్ శుక్లా తెలిపారు. -
ప్రజలు ముఖ్యమా? ఐపీఎల్ ముఖ్యమా?
► మ్యాచ్‌లను తరలించండి ► బీసీసీఐకి ముంబై హైకోర్టు సూచన ముంబై: మహారాష్ట్రలో తీవ్ర కరువు, నీటి ఎద్దడి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఆడాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లను వేరే చోటుకు తరలించాలని బాంబే హైకోర్టు... బీసీసీఐకి సూచించింది. నీటి సంక్షోభం లేని చోట మ్యాచ్‌లను నిర్వహిస్తే బాగుంటుందని వెల్లడించింది. పిచ్‌ల నిర్వహణ కోసం భారీగా నీటిని వినియోగిస్తున్నారంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ‘బీసీసీఐ, క్రికెట్ సంఘాలు ఇలా నీటిని వృథా చేస్తుంటే ఏం చేస్తున్నారు. ప్రజలు ముఖ్యమా? ఐపీఎల్ మ్యాచ్‌లు ముఖ్యమా? ఈ విషయంలో ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నీటిని వృథా చేయడం నేరపూరితమైన చర్య. మహారాష్ట్రలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నారుగా’ అంటూ జస్టిస్ వీఎం కనడి, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఘాటుగా వ్యాఖ్యానించింది. క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో తాము కేవలం మంచినీటిని మాత్రమే సరఫరా చేస్తున్నామని ముంబై కార్పొరేషన్ తెలపగా... పిచ్‌ల కోసం వినియోగించే నీటిని తాము బయటి నుంచి కొంటున్నామని బోర్డు న్యాయవాది చెప్పారు. దీనిపై విచారణను నేటికి వాయిదా వేశారు. -
ఐపీఎల్ మ్యాచ్ లు తరలించం: శుక్లా
ముంబై: మహారాష్ట్రలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను ఇతర చోట్లకు తరలించేది లేదని లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా తేల్చి చెప్పారు. కరవుతో పాటు నీటి కొరత కారణంగా ముంబై, పుణేల్లో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించకూడదని ఇటీవల నిరసనలు వ్యక్తమమయ్యాయి. ‘కరవు, నీటి సమస్య పరిష్కారానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన తెస్తే అన్ని విధాలా సహకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మేం రైతుల పక్షానే ఉన్నాం’ అని శుక్లా తెలిపారు. అభిమానులూ థర్డ్ అంపైర్లే ఐపీఎల్-9లో థర్డ్ అంపైర్ తీసుకునే కీలక నిర్ణయాల్లో అభిమానులు పాలు పంచుకోనున్నారు. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ప్రేక్షకుల్ని ఆటలో భాగం చేయడానికి కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. ‘ఈ విధానం ప్రకారం ఆటగాళ్ల ఔట్‌ను ప్రకటించే విషయంలో అభిమానులు థర్డ్ అంపైర్‌కు సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు. స్టేడియంలో ఉన్న అభిమానులు తమ నిర్ణయాన్ని ప్లకార్డుపై రాసి చూపించవచ్చు. ఈ ప్లకార్డులను స్కీన్లపై ప్రదర్శిస్తారు. కానీ ఆటగాడు ఔటయ్యాడా? లేదా? అనేది చివరకు థర్డ్ అంపైర్ మాత్రమే నిర్ణయిస్తారు’ అని శుక్లా పేర్కొన్నారు. -
ఒక్కో ఐపీఎల్ మ్యాచ్.. రూ.10 వేల కోట్ల బెట్టింగ్
ముంబయి: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లోని నలుగురు ఆటగాళ్లకు ఫిక్సింగ్‌తో సంబంధాలు ఉన్నాయని ఆయన ట్విట్టర్లో ఆరోపించారు. ఫిక్సింగ్ కుంభకోణంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఉన్నారని మోడీ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ లో ఒక్కో మ్యాచ్‌కు రూ.10వేల కోట్ల వరకూ బెట్టింగ్ జరుగుతోందని ఆయన ట్వీట్ చేశారు. కాగా ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ పై విచారణకు గతంలో సుప్రీం కోర్టు ముద్గల్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. -
60 సీసీ కెమెరాలతో ఉప్పల్ స్టేడియంపై నిఘా!
హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్-8 లో భాగంగా హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య మే 2 న జరగనున్న మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది. అందులోనూ హైదరాబాద్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు ఎక్కువ సంఖ్యలో క్రికెట్ అభిమానులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా.. మందు జాగ్రత్త చర్యగా 1200 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఉప్పల్ స్టేడియం లోపల, బయట 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈవ్ టీజర్స్ కోసం షీ టీమ్స్ బృందాలను రంగంలోకి దింపామని చెప్పారు. అయితే బయట నుంచి తెచ్చే వస్తువులను స్టేడియం లోపలకు అనుమతి లేదని సీవీ ఆనంద్ వెల్లడించారు. -
ఐపీఎల్ మ్యాచ్...
వాహనచోదకులకు ఆంక్షలు విశాఖపట్నం : విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరగనున్న మూడో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిం చారు. ఇవి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ ఏడీసీపీ కె. మహేంద్ర పాత్రుడు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ఆనందపురం మీదుగా పెందుర్తి, సబ్బవరం వైపు మళ్లిస్తారు. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే వాహనాలను లంకెలపాలెం వద్ద సబ్బవరం, పెందుర్తి మీదుగా మళ్లిస్తారు. గాజువాక నుంచి వచ్చే వాహనాలను ఎన్ఏడీ జంక్షన్ వద్ద గోపాలపట్నం, పెందుర్తి మీదుగా మళ్లిస్తారు. విశాఖపట్నంనుంచి భారీ వాహనాలను హనుమంతవాక జంక్షన్ వద్ద అడవివరం మీదుగా ఆనందపురం వైపు అనుమతిస్తారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం వెళ్లే చిన్న వాహనాలను విశాఖ వేలీ స్కూల్ జంక్షన్, ఎండాడ జంక్షన్ వద్ద రుషికొండ మీ దుగా బీచ్‌రోడ్డులో తిమ్మాపురం మీదుగా ఎన్.హెచ్-16 మారికవలస వైపు మళ్ళించనున్నారు. ఎండాడ, కారుషెడ్ల మధ్య ఎన్‌హెచ్-16 రోడ్డులో పాసుల్లేని వాహనాలను అనుమతించరు. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి విశాఖ వచ్చే వాహనాలు (క్రికెట్ మ్యాచ్‌కు వెళ్ళే వాహనాలకు మినహాయింపు) మారికవలస ఎన్. హెచ్-16 జంక్షన్ వద్ద ఎడమవైపునకు తిప్పుకొని జు రాంగ్ జంక్షన్, తిమ్మాపురం, బీచ్‌రోడ్డు, ఎంవీపీ డబుల్‌రోడ్డు మీదుగా ఎన్.హెచ్-16 వైపు మళ్లిస్తారు. బస్సులు వెళ్లే మార్గమిది శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి విశాఖ వైపు వచే చిన్న వాహనాలు, ఆర్టీసీ బస్సులను మారికవలస ఐటీ సెజ్ జంక్షన్ వద్ద కాపులుప్పాడ.. తిమ్మాపురం మీదుగా బీచ్‌రోడ్డు చేరుకుని అక్కడ నుంచి జోడుగుళ్ళపాలెం అప్పుఘర్, ఎంవీపీ డబుల్‌రోడ్డు మీదుగా ఎన్.హెచ్-16 వైపు మళ్లించుకోవాలి. విశాఖ సిటీ నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎంవీపీ డబుల్ రోడ్డు, అప్పుఘర్ మీదుగా బీచ్‌రోడ్డులో తిమ్మాపురం వైపునకు మళ్లి, మారికవలస వైపు వెళ్లాలి. -
సచిన్ చిన్నపిల్లాడిలా...
నాలుగేళ్ల వయసులో బ్యాట్ పట్టిన సచిన్ టెండూల్కర్‌కు 40 ఏళ్ల వరకు అదే జీవితమైంది. క్రికెట్ తప్ప తనకి మరో లోకం కనిపించలేదు. స్కూల్ సరదాలు, ఇతర ఆటపాటలను సచిన్ ఎప్పుడూ పట్టించుకోలేదు. అలాంటి మధురానుభూతులు కూడా పెద్దగా తనకి లేవు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే ఇటీవల ముంబై ఇండియన్స్ టీమ్ ప్రాక్టీస్ సందర్భంగా సచిన్‌ను చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఐపీఎల్ మ్యాచ్ కోసం కుర్రాళ్లకు సూచనలు, సలహాలు ఇచ్చిన టెండూల్కర్... కొద్దిగా ఖాళీ సమయం దొరకగానే పక్కకు వచ్చేశాడు. ఆ సమయంలో ఒక్కసారిగా అతనిలోని పిల్లాడు బయటకొచ్చాడు. ఆటగాళ్లంతా సాధన చేస్తుండగా, తాను మైదానంలో మరో వైపు వెళ్లిపోయాడు. రిమోట్‌తో ఆపరేట్ చేసే డ్రోన్‌ను తెప్పించి తన ఆట ప్రారంభించాడు. గాల్లో దానిని అటూ ఇటూ తిప్పుతూ చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేస్తూ, చాలా సేపు దానితో సరదా తీర్చుకున్నాడు. అయితే తన సిక్సర్ల తరహాలో డ్రోన్‌ను మైదానం బయటికి పంపకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ డ్రోన్‌ను ఇతర క్రికెటర్ల ముందుకు తీసుకెళ్లి సరదాగా వాళ్లని ఆటపట్టించాడు కూడా. -
ఉప్పల్ లో ఐపిఎల్ మ్యాచ్ దృశ్యాలు