
క్రికెట్ మ్యాచ్ చూడొద్దన్నందుకు బాలుడి అదృశ్యం
జీడిమెట్ల: ఇంట్లో ఐపీఎల్ మ్యాచ్ చూడనివ్వడం లేదని ఓ బాలుడు ఇంటి నుండి వెళ్లిపోయిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సైదిరెడ్డి వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌కు చెందిన విజయ్ కుమార్ కుమారుడు సాయిగణేష్ ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసాడు. ఆదివారం ఇంట్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా తండ్రి టీవీ ఆపేశాడు. దీంతో సాయిగణేష్ ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. మంగళవారం కుటుంబ సభ్యులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.