jeedimetla police station
-
వారం రోజులుగా ఇంట్లో శవం పెట్టుకొని...
హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్లో చనిపోయిన మహిళ మృతదేహం వారం రోజులుగా ఇంట్లోనే ఉంది. కుటుంబసభ్యులు మృతదేహంకి అంత్యక్రియలు చేయలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో మహిళ (40) చనిపోయి వారం రోజులు అయింది. కుళ్లిపోయి పురుగులు పట్టినా.. అదే ఇంట్లో కుటుంబీకులు సాధారణ జీవనం గడుపుతున్నారు. ఆ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు -
సేవ చేయాల్సి వస్తుందని.. గొంతునులిమి తండ్రిని హత్య చేసిన కొడుకు
సాక్షి, హైదరాబాద్: కొడుకే తండ్రి పాలిట కాలయముడయ్యాడు.. సేవ చేయాల్సి వస్తుందని కన్నతండ్రినే గొంతు నులిమి హత్య చేసిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ పవన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కుత్బుల్లాపూర్ విలేజ్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ(75), దుర్గమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కుమారుడు సురేష్ ఉన్నారు. కుమార్తెలకు వివాహం కాగా, వృద్ధ దంపతులు కుమారుడు సురేష్ వద్ద ఉంటున్నారు. ఏడాది క్రితం సత్యనారాయణకు పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. అతడికి భార్య దుర్గమ్మ సేవలు చేసేది. ఇటీవల దుర్గమ్మకు సైతం అపరేషన్ జరగడంతో సురేష్ తండ్రికి సేవ చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన సురేష్ తండ్రికి సేవ చేసే విషయంలో తల్లి దుర్గమ్మతో గొడవపడ్డాడు. దీంతో విసిగిపోయిన దుర్గమ్మ కుమార్తె ఇంటికి వెళ్లిపోవడంతో ఇంట్లో తండ్రి సత్యనారాయణ, సురేష్ మాత్రమే ఉన్నారు. ఇదే అదునుగా భావించిన సురేష్ మంచంపై ఉన్న తండ్రి గొంతు నులిమి హత్య చేసి ఏమీ తెలియనట్లు తన తండ్రి చనిపోయాడని చుట్టు పక్కల వారికి చెప్పాడు. స్థానికుల అనుమానంతో వెలుగులోకి.. సురేష్ మాటలపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మెడపై ఉన్న గాయం ఆధారంగా సురేష్ తండ్రిని హత్య చేసినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్న విచారించగా తానే గొంతు నులిమి హత్య చేసినట్లు సురేష్ అంగీకరించాడు. హత్యా నేరం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా అస్పత్రికి తరలించారు. చదవండి: Hyderabad: వాట్సాప్‌లో పరిచయం.. రూ.7 లక్షలు కాజేసిన యువతి -
కొడుకును కొట్టి చంపింది
జీడిమెట్ల: కడుపున పుట్టిన కొడుకును అక్రమ సంబంధానికి అడ్డుగా తలచింది ఓ కర్కశ తల్లి. ముక్కుపచ్చలారని కొడుకును చేతికందిన దాంతో విచక్షణారహితంగా కొట్టేది. ఆ దెబ్బలకు చిన్నారి తట్టుకోలేక విలవిల్లాడిపోయేవాడు. ‘అమ్మా.. నన్ను కొట్టద్దు అమ్మా’ అంటూ రోదిస్తున్నా.. ఆ తల్లి మనసు కరగలేదు. చివరికి బాలుడు కన్నుమూశాడు. అమ్మతనానికి మచ్చ తెచ్చిన ఈ అమానుష ఘటన మంగళవారం హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బాలరాజు, బాలుడి తండ్రి కథనం ప్రకారం... సూరారం ప్రాంతానికి చెందిన సురేశ్ ప్రైవేట్ ఉద్యోగి. భార్య ఉదయ, కుమారుడు ఉమేష్(3)లతో కలిసి ఉండేవాడు. కుటుంబకలహాలతో ఉదయ ఏడాదిగా భర్తకు దూరంగా ఉంటోంది. చింతల్ డివిజన్ భగత్‌సింగ్ నగర్లో నివసిస్తున్న ఈమెకు భాస్కర్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరూ తరచూ ఉమేష్‌ను వేధించేవాళ్లు. ఉదయ అయితే తన భర్తపై ఉన్న కోపాన్ని కుమారుడిపై చూపించేది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కసితో బాలుడిని హింసించేది. మంగళవారం మధ్యాహ్నం కరెంట్ వైర్‌తో విచక్షణారహితంగా కొట్టింది. ఆ దెబ్బలు తాళలేక కొద్దిసేపటికి ఉమేష్ సొమ్మసిల్లి, అచేతనంగా పడిపోయాడు. దీంతో సాయంత్రం 4 గంటలకు సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించాలని కోరింది. పరీక్షించిన డ్యూటీ డాక్టర్ బాలుడు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. బాలుడి ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానించిన ఆస్పత్రి సిబ్బంది జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. ఉదయ, భాస్కర్ల వివాహేతర సంబంధానికి తన కుమారుడు అడ్డుగా ఉన్నాడనే కొట్టి చంపారని సురేశ్ ఆరోపిస్తున్నారు. -
మద్యం దొరక్కపోవడంతో వ్యక్తి ఆత్మహత్య!
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం దొరకడం లేదని ఒగ్గిన శ్రీను అనే వ్యక్తి ఐడీపీఎల్ అటవీ ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 25వ తేదీన మద్యం కోసం శ్రీను అన్ని చోట్లకు తిరిగాడు. చివరగా భార్యతో కలిసి మద్యం కోసం ఎన్టీఆర్ నగర్‌కు వెళ్లి అక్కడ నుంచి కనిపించకుండా పోయాడు. శ్రీను కనిపించడం లేదని కుటుంబ సభ్యులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. స్థానికంగా శవాన్ని గుర్తించిన స్థానికులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతున్ని శ్రీనుగా గుర్తించారుఉ. మృతునికి ఇద్దరు పిల్లలు. కాగా, లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ అయిన సంగతి తెలిసిందే. -
కిడ్నాపైన చిన్నారి క్షేమం
-
కిడ్నాప్ కథ సుఖాంతం
సాక్షి, జీడిమెట్ల: హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. పది రోజుల క్రితం గాజులరామారం చిత్తారమ్మ జాతరలో ఉదయ్‌తేజ్ అనే బాలుడు కిడ్నాప్ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు డీసీపీ సాయిశేఖర్ ఆదేశాల మేరకు సవాల్‌గా తీసుకున్నారు. పోలీసులు 11 బృందాలతో గాలింపు చేపట్టి వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. దీంతో భయపడ్డ కిడ్నాపర్లు ఉదయ్‌తేజ్‌ను సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పొలంలో తెల్లవారు జామున వదిలి వెళ్లారు. గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు గీశారు. జీడిమెట్ల పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు సిద్దిపేటకు చేరుకున్నారు. మరికాసేపట్లో హైదరాబాద్‌కు తరలించనున్నారు. -
క్రికెట్ మ్యాచ్ చూడొద్దన్నందుకు బాలుడి అదృశ్యం
జీడిమెట్ల: ఇంట్లో ఐపీఎల్ మ్యాచ్ చూడనివ్వడం లేదని ఓ బాలుడు ఇంటి నుండి వెళ్లిపోయిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సైదిరెడ్డి వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌కు చెందిన విజయ్ కుమార్ కుమారుడు సాయిగణేష్ ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసాడు. ఆదివారం ఇంట్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా తండ్రి టీవీ ఆపేశాడు. దీంతో సాయిగణేష్ ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. మంగళవారం కుటుంబ సభ్యులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ముందు చూపుతో మందు కొంటే...
హైదరాబాద్: జేబులోని మద్యం సీసా పగిలి వ్యక్తి మర్మాంగాలకు గాయాలు కావడంతో, చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎసై రమేష్ వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట సోమయ్యనగర్‌కు చెందిన మల్లేశ్(26) మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం జగద్గిరిగుట్టలోని ఓ మద్యం దుకాణంలో మద్యం సేవించిన మల్లేశ్ మరో సీసా కొనుగోలు చేసి ప్యాంట్ ముందు జేబులో పెట్టుకున్నాడు. నడుచుకుంటూ వెళ్తుండగా వర్షం రావడంతో పరుగుతీశాడు. ఈ క్రమంలో మల్లేశ్ కింద పడడంతో జేబులో ఉన్న సీసా పగిలి మర్మాంగాలకు గుచ్చుకుంది. తీవ్రరక్తస్రావం కావడంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.