![Drink Addicted Man Self Elimination At Jeedimetla - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/28/alcohol.jpg.webp?itok=03eZUGuR)
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం దొరకడం లేదని ఒగ్గిన శ్రీను అనే వ్యక్తి ఐడీపీఎల్ అటవీ ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 25వ తేదీన మద్యం కోసం శ్రీను అన్ని చోట్లకు తిరిగాడు. చివరగా భార్యతో కలిసి మద్యం కోసం ఎన్టీఆర్ నగర్‌కు వెళ్లి అక్కడ నుంచి కనిపించకుండా పోయాడు. శ్రీను కనిపించడం లేదని కుటుంబ సభ్యులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. స్థానికంగా శవాన్ని గుర్తించిన స్థానికులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతున్ని శ్రీనుగా గుర్తించారుఉ. మృతునికి ఇద్దరు పిల్లలు. కాగా, లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment