drink addict
-
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
శంషాబాద్: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన శంషాబాద్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. ఆర్జీఐఏ సీఐ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక రాళ్లగూడ యాదవ్‌కాలనీలో పెద్దులు, దానమ్మ (25)దంపతులు నివాసం ఉంటున్నారు. దానమ్మ కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, పెద్దులు ఏ పని చేయకపోగా మద్యానికి బానిసై తరచు భార్యతో గొడవపడుతుండేవాడు. బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న పెద్దులు దానమ్మ మెడపై గొడ్డలితో నరకడంతో ఆమె కుప్పకూలింది. సమీపంలోనే ఉంటున్న సోదరులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పటికే దానమ్మ మృతిచెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చర్మం ఒలిచినా దక్కని ఫలితం) -
మత్తు వదలరా... మద్యం మానేయాలంటూ హితభోధ!
సాక్షి, హైదరాబాద్: ‘టెన్త్‌లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చామని ముగ్గురం స్నేహితులం కలిసి బీరు కొనుక్కుని అందులో నీళ్లు పోసుకుని ట్యాంక్ బండ్ కింద ఫ్రెండ్ కారులో కూర్చుని తాగాం. అలా మొదలైన జర్నీ 33 సంవత్సరాలు నిరాటంకంగా నడిచింది. ఆఖరి 7 సంవత్సరాల్లో చివరి మూణ్నెళ్లు సూర్యుడ్ని చూడలేదంటే నమ్మండి’ అంటారు నగరానికి చెందిన కె.మూర్తి (62). ఆయనకు 36వ ఏటే హార్ట్ ఎటాక్ వచ్చి బైపాస్ సర్జరీ జరిగినా మద్యం మానని ఆయన ఇప్పుడు వ్యసనాలన్నీ వదిలేసి, అరవైలో ఇరవైలా హాయిగా ఉన్నారు. అంతేకాకుండా తనలాంటి మరికొందరి చేత తాగుడు మానిపించే పనిలో బిజీగా ఉన్నారు. నగరానికి చెందిన ఓ టాప్ లేడీ డాక్టర్...20 ఏళ్ల పాటు మద్యానికి బానిసయ్యారు. అర్జున్‌రెడ్డి సినిమాలో చూపించినట్టు ఆపరేషన్ థియేటర్స్‌కి కూడా తాగి వెళ్లేవారట. అలాంటి మహిళా వైద్యురాలు ఇప్పుడు అరవై ఏళ్ల వయసులో పూర్తిగా మందు మానేసి ఆల్కహాల్ వ్యసనాన్ని దూరం చేసే మందుగా మారారు. ...ఇలా తాగుడు మానాలని అనుకున్నవారు, విజయవంతంగా మానేసిన వారు..కొత్త పాత ఆల్కహాలిక్స్ కొందరు నగరంలో పలు చోట్ల సమావేశం అవుతున్నారు. తమను తాము సంస్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరిని కలిపేందుకు వారధిగా మారింది ఆల్కహాలిక్స్ అనానిమస్ ఫెలోషిప్. అమెరికాలో పుట్టి...అంతర్జాతీయంగా మెట్టి... దాదాపుగా 90 ఏళ్ల వయసున్న ఆల్కహాలిక్ అనానిమస్ (ఎఎ) సంస్థ అమెరికాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. ఆల్కహాలిక్స్ను విముక్తుల్ని చేసేందుకు అవసరమైన చికిత్సలో వైద్యులకు కో థెరపీగా గుర్తింపు పొందింది. దీనిలో భాగంగానే ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. మహిళలు, పురుషులు ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటపడడానికి స్వచ్ఛందంగా ఇందులో భాగస్తులు అవుతారు. పరస్పరం ఆల్కహాలిజమ్ కు దూరమయ్యేందుకు సహకరించకుంటారు. ఫీజులు, రుసుములు ఏమీ ఉండవు. వ్యసనం నుంచి బయటపడాలనే ఆకాంక్ష ఒకటే అర్హత. మందులు, ఇతరత్రా ఉపయోగించరు. తాగుడు వ్యసనాన్ని దూరం చేసుకున్నవారిని సోబర్స్గా పిలుస్తారు. ఈ సోబర్స్.. బృందంలో చేరి ఆ విషయాలను విడమరచి చెప్పుకోవడం ఇందులో ప్రధానమైన విశేషం. వీరికి సంబంధించిన సమావేశాలు, ఇతరత్రా విషయాలన్నీ రహస్యంగానే ఉంచుతారు. వ్యసన పరుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువు లు కూడా దీనికి అనుబంధంగా పనిచేస్తుంటారు. ట్విన్ సిటీస్‌లోనూ మీటింగ్స్.. ఈ సంస్థ గురించి తెలిసిన నగరవాసులు గతంలో ముంబై వెళ్లి సమావేశాల్లో పాల్గొనేవారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వారానికి 60, 70 దాకా సమావేశాలు జరుగుతున్నాయి. నగరంలోనూ సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్, వైఎంసిఎ నారాయణగూడ, మాదాపూర్, దిల్సుఖ్నగర్, నానక్‌రాంగూడ తదితర ప్రాంతాల్లో వారానికి డజను దాకా సదస్సులు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్లో పీక్స్.. ఈ సంస్థ కార్యకలాపాలు నగరంలో లాక్ డౌన్ టైమ్‌లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఆ సమయంలో ఆల్కహాలిక్స్, వారి బంధువుల నుంచి హెల్ప్‌లైన్స్‌కి కాల్స్ వెల్లువెత్తాయి. అయితే మీటింగ్స్ నిర్వహించే అవకాశం లేక పలువురికి సాయం చేయలేకపోయాం అంటున్నారీ గ్రూప్ సభ్యులు. రెగ్యులర్ మెంబర్స్‌కి మాత్రం ఆన్లైన్, ఫోన్ ఇన్, జూమ్ మీటింగ్స్ నిర్వహించామని చెప్పారు. ఈ సంస్థ సహకారం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు: 96664 66118/119 (చదవండి: ‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా!) -
మద్యానికి డబ్బివ్వలేదని ఉన్మాదం
మైసూరు: తాగుడుకు బానిసైన వ్యక్తి మద్యానికి కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వలేదని ఉన్మాదిగా మారాడు. మహాభారత కాలంలో కంసుడు చేసినట్లుగా చెల్లెలి 8 నెలల బిడ్డను గోడకు కొట్టి హత్య చేసిన దురాగతం మైసూరు నగరంలో చోటు చేసుకుంది. కనకగిరిలోని 5వ క్రాస్‌లో నివాసం ఉంటున్న సిద్దమ్మ అనే మహిళ కుమారుడు రాజు (30) ఈ ఘోరానికి పాల్పడినవాడు. ఇతడు చిన్నా చితకా పనులు చేస్తూ ఆ డబ్బుతో మద్యం తాగుతుంటాడు. శుక్రవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఇంటికి వచ్చి మద్యం డబ్బులు కావాలని తల్లిని అడిగాడు. తన వద్దలేవని చెప్పగా ఇంటిలో ఉన్న చెల్లెలిని అడిగాడు. ఆమె కూడా లేవని చెప్పడంతో రాజు తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. ఇంట్లో ఉన్న టీవీని పగలగొట్టాడు. అంతటితో ఆగకుండా ఊయల్లో పడుకున్న 8 నెలల శిశువును తీసుకుని గోడకు విసిరికొట్టడంతో చిన్నారి ప్రాణాలు విడిచింది. దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానిక విద్యారణ్యపుర పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి రాజు కోసం గాలింపు చేపట్టారు. (చదవండి: నాకు ప్రియుడే ముఖ్యం.. భార్య ఏం చేసిందంటే..? ) -
మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు...
సాక్షి, తానూరు(ఆదిలాబాద్): మండలంలోని జౌలా(కే) గ్రామానికి చెందిన దామాన్‌వాడ్ గణేశ్(18) మద్యానికి బానిసై బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజన్న తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. గణేశ్ గతకొద్ది రోజులుగా మద్యానికి బానిసై ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. బుధవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి రావడంతో తల్లి రుక్మాబాయి మందలించింది. మనస్థాపానికి గురైన గణేశ్ అర్ధరాత్రి ఇంట్లోనే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం తల్లి రుక్మాబాయి చూసేసరికి దూలానికి వెలాడుతూ కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తల్లి రుక్మాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజన్న తెలిపారు. చదవండి: తల్లి, కుమార్తెపై లైంగిక వేధింపులు -
ప్రాణాలు తీసి.. ‘నా భర్త నిద్రపోయాడు.. లేవడం లేదు’ అని నాటకం
సాక్షి, గోపాల్పేట(మహబూబ్‌నగర్): తాడిపర్తిలో ఇంకొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తనే హతమార్చిన భార్య ఘటన మరవక ముందే.. తాగొచ్చి గొడవ పడుతున్నాడని తాజాగా బుద్దారం–లక్ష్మీతండాలో భర్తను కొట్టి, గొంతునులిమి చంపేసింది భార్య. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని ఈ తండాకు చెందిన ముడావత్ రమేష్ (36) కు భార్య శాంతితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. అక్కడ కూలి పనిచేసి జీవనం సాగించేవాడు. కాగా, తరచూ మద్యం తాగొచ్చి గొడవ పడటంతో పాటు ఇంటి కిరాయి సరిగా చెల్లించేవాడు కాదు. దీంతో పదిరోజుల క్రితం ఖాళీ చేసి స్వగ్రామానికి వచ్చారు. నాలుగు రోజులుగా వనపర్తి అడ్డమీదకు పనికి వెళ్లడం వచ్చిన డబ్బుతో మద్యం తాగేవాడు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడి దూషించాడు. ఆవేశానికి లోనైన ఆమె బండిగుంజ (సనుగొయ్య) తీసుకుని తీవ్రంగా కొట్టడమేగాక గొంతు నులిమింది. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వదిలేసింది. అయితే సాయంత్రం చుట్టుపక్కలవారికి ‘నా భర్త నిద్రపోయాడు.. లేవడం లేదు..’ అని నమ్మబలికింది. అసలు విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మృతుడి అన్న ముడావత్ బాలు ఫిర్యాదు మేరకు సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ రామన్‌గౌడ్ కేసు దర్యాప్తు చేపట్టారు. చివరకు శాంతిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తానే చంపేసినట్టు అంగీకరించింది. -
ప్రియురాలిని బీరు సీసాతో పొడిచి చంపిన ప్రేమోన్మాది
సాక్షి, నల్గొండ: ఓ ప్రేమోన్మాది మద్యం మత్తులో చెలరేగిపోయాడు. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని అతి దారుణంగా హతమర్చాడు. ఈఘటన నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ శివం హోటల్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ప్రియురాలు చందనను శంకర్ బీరు సీసాతో పొడిచి చంపినట్టు తెలుస్తోంది. చందన పెళ్లికి నిరాకరించడంతోనే శంకర్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడు శంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. -
పక్కా ప్లాన్.. భార్యకు మద్యం తాగించి దారుణం
లాలాపేట: కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ భర్త. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం.. సీతాఫల్మండి పార్టీవాడకు చెందిన శకత్వాల దర్శన్ ఈసీఐఎల్‌లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య సౌందర్య(25), ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్లది ప్రేమ వివాహం. వీరికి మద్యం తాగే అలవాటు ఉంది. కొంత కాలంగా ఇద్దరూ తరచూ గొడవపడుతూ ఉన్నారు. భార్య సౌందర్యకు విడాకులు ఇవ్వాలని దర్శన్ నిర్ణయించుకున్నాడు. అయితే పెద్దల జోక్యంతో కలిసి ఉంటున్నారు. గత వారం రోజుల నుంచి సౌందర్య భర్త దర్శన్‌తో గొడవపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను ఎలాగైన చంపాలని నిర్ణయించుకున్న దర్శన్ మధ్యహ్నం పథకం ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో సౌందర్యను టవల్ సాయంతో గొంతు బిగించి హతమార్చాడు. నేరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: మైనర్ బాలికతో ప్రేమ.. ఆపై పురుగుల మందు తాగి!) -
రాక్షసుడు: నాడు తండ్రిని, నేడు తల్లిని కడతేర్చాడు
చొప్పదండి: తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే కడతేర్చాడో కొడుకు. అమానుషమైన ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంటలో శనివారం రాత్రి జరిగింది. నాలుగేళ్ల క్రితం తండ్రిని కూడా చంపేశాడు. చాకుంటకు చెం దిన పోలుదాసరి రాయమల్లు–హనుమమ్మ దంపతులకు కొండయ్య ఒక్కడే సంతానం. పెళ్లయి పిల్లలు కలిగినా మద్యానికి బానిసైన కొండయ్యలో మార్పు రాలేదు. డబ్బులు ఇవ్వాలని నిత్యం వృద్ధురాలైన తల్లిని వేధించేవాడు. శనివారం రాత్రి కూడా డబ్బుల కోసం గొడవపడి తల్లిని తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఇంట్లో నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తండ్రిని.. కొండయ్య తీరుతో విసిగిపోయిన భార్య 15 ఏళ్ల క్రితమే అతడిని వదిలేసింది. గ్రామంలోనే వేరేచోట ఉంటోంది. రాయమల్లు–హనుమమ్మ వృద్ధాప్యంలోనూ కూలి చేసి సంపాదించిన డబ్బులో కొంత కోడలు, మనుమరాళ్లకు ఇచ్చేవారు. నిత్యం తాగి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతోనూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో 2016లో రాయమల్లును తీవ్రంగా కొట్టి చంపేశాడు. తండ్రి హత్య కేసులో 10 నెలలు జైలుశిక్ష అనుభవించాడు. 2017లో హనుమమ్మ బెయిల్‌పై కొడుకును విడిపించింది. (చదవండి: చేతులు కట్టేసి డిగ్రీ విద్యార్థిని తోటలో పడేసిన దుండగలు) -
కూల్‌డ్రింక్‌లో షేవింగ్ లోషన్.. ఇద్దరు మృతి!
చెన్నై: లాక్డౌన్ నేపథ్యంలో మద్యానికి బానిసైనవారు మతి చెడినట్టుగా ప్రవర్తిస్తున్నారు. మత్తు కోసం ఏవేవో పుకార్లు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కూల్ డ్రింక్‌లో షేవింగ్ లోషన్ కలుపుకొని తాగడంతో నాలుగు రోజుల క్రితం కేరళలో ఓ వ్యక్తి మరణించిన ఘటన మరువకముందే.. తమిళనాడులోనూ అలాంటి విషాదమే వెలుగు చూసింది. పుదుకొట్టై జిల్లాలోని ఇద్దరు మత్స్యకార యువకులు కూల్ డ్రింక్‌లో షేవింగ్ లోషన్ కలుపుకొని తాగడంతో ప్రాణాలు విడిచారు. మరొకరు ఆస్పత్రిలో విషమ స్థితిలో ఉన్నారు. (చదవండి: దారుణం: రసాయనం మందు వాసన వస్తుండటంతో..) కొట్టైపట్టినమ్‌కు చెందిన ముగ్గురు మత్స్యకార యువకులు ఎం.హసన్ మైదీన్ (35), పి.అన్వర్ రాజా (33), ఎం.అరుణ్ కంతియాన్ (29) నిత్యం మద్యం సేవించేవారు. అయితే, లాక్‌డౌన్‌తో మద్యం దుకాణాలు బంద్ కావడంతో.. ఎవరో చెప్పిన మాటలు విని.. శుక్రవారం రాత్రి కూల్‌డ్రింక్‌లో షేవింగ్ లోషన్ కలుపుకొని సేవించారు. అనంతరం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అయితే, మైదీన్, అరుణ్ వాంతులు చేసుకోవడంతో వారిని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొంతుతూ వారు ప్రాణాలు విడిచారు. అస్వస్థతకు గురైన అన్వర్‌ను కూడా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా, ‘ఐసో ప్రొపిల్ ఆల్కహాల్’ ద్రావణం తాగి పశ్చిమ గోదావరిలో కూడా ఒక యువకుడు మరణించిన సంగతి తెలిసిందే. (చదవండి: మద్యం అమ్మకాలపై హైకోర్టు స్టే) -
మద్యం దొరక్కపోవడంతో వ్యక్తి ఆత్మహత్య!
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం దొరకడం లేదని ఒగ్గిన శ్రీను అనే వ్యక్తి ఐడీపీఎల్ అటవీ ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 25వ తేదీన మద్యం కోసం శ్రీను అన్ని చోట్లకు తిరిగాడు. చివరగా భార్యతో కలిసి మద్యం కోసం ఎన్టీఆర్ నగర్‌కు వెళ్లి అక్కడ నుంచి కనిపించకుండా పోయాడు. శ్రీను కనిపించడం లేదని కుటుంబ సభ్యులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. స్థానికంగా శవాన్ని గుర్తించిన స్థానికులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతున్ని శ్రీనుగా గుర్తించారుఉ. మృతునికి ఇద్దరు పిల్లలు. కాగా, లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ అయిన సంగతి తెలిసిందే. -
తాగి.. తూలి.. ప్రాణాలు విడిచాడు..!
సాక్షి, హైదరాబాద్ : మద్యం మత్తులో నాలాలో తూలిపడిపోయిన ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన లాలాపేట నాల వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. నాలా గోడను ఆనుకుని నిలుచున్న ఓ వ్యక్తి కాసేపటి తర్వాత దానిపైన కూర్చునే ప్రయత్నం చేశాడు. అయితే, అతను మద్యం సేవించి ఉండటంతో గోడ పైనుంచి తూలిపడిపోయాడు. నేరుగా నాలాలో ఉన్నబండరాయిపై పడడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని..మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా మద్యం మత్తులో తూలుతున్న సదరు వ్యక్తి నాలా గోడపై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోయినట్టు వెల్లడైంది. తలకు తీవ్ర గాయమవడంతోనే అతను చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
తాగడానికి డబ్బులు ఇవ్వలేదని...
జీవితాంతం తోడుంటానంటూ అగ్నిసాక్షిగా తాళి కట్టాడు.. మద్యానికి బానిసగా మారాడు.. భార్యను చిత్రహింసలకు గురిచేశాడు.. కూలి డబ్బులతో పాటు పంట విక్రయించగా వచ్చిన సొమ్మును మద్యంకే పోశాడు. చివరకు తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను కడతేర్చిన విషాద ఘటన మక్కువ మండలం మూలవలసలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మక్కువ: మద్యం వ్యసనం... పేద, మధ్యతరగతి కుటుంబాలను చిత్తుచేస్తోంది. ఆస్తులు అమ్మించేస్తోంది. ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తోంది. చివరకు ప్రాణాలను తీస్తోంది. దీనికి మక్కువ మండలం మూలవలసలో ఆదివారం జరిగిన ఘటనే నిలువెత్తు నిదర్శనం. తాగేందుకు డబ్బులు ఇవ్వలేని కట్టుకున్న భార్యనే కత్తితో కడతేర్చాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... చిలకమ్మ(34) భర్త ఎరకయ్య ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తాగిన మందు చాలలేదని, జీడిపిక్కలు విక్రయించగా వచ్చిన డబ్బులను ఇవ్వాలని భార్య చిలకమ్మను వేధించాడు. దీనికి ఆమె నిరాకరించి ఇంటిబయటకు వచ్చింది. సీసీరోడ్డుపై కూర్చొని ఆమె చుట్ట చుట్టుకుంటుండగా ఇంటిలో ఉన్న కత్తిని తీసుకొని వచ్చి, మెడపై, నుదుటపై కత్తితో వేటువేశాడు. దీంతో అక్కడికక్కడే నెత్తురు చిమ్ముతూ చిలకమ్మ కుప్పకూలిపోయింది. గ్రామస్తులు వచ్చి చూసేసరికి మరణించింది. పరారయ్యేందుకు ఎరకయ్య ప్రయత్నించగా గ్రామస్తులు పట్టుకుని కర్ర స్తంభానికి కట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మన్యప్రాంతం కావడం, అర్ధరాత్రి సమయంలో వెళ్లేందుకు పోలీసులకు అవకాశంలేకపోవడంతో సోమవారం తెల్లవారుజామున ఎస్ఐ కె.కృష్ణప్రసాదు, ప్రొహిబిషన్ ఎస్ఐ షేక్ శంకర్లు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఐ సీహెచ్ షణ్ముఖరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణాలు తీస్తున్న నాటుసారా... మన్యం పల్లెల్లో నాటుసారా ఏరులై ప్రవహిస్తోంది. గిరిజనులు సారా మత్తుకు అలవాటుపడుతున్నారు. పనసభద్ర పంచాయతీకి ఒడిశా రాష్ట్రం సమీపంలో ఉండడంతో గిరిజన గ్రామాల్లోకి నాటుసారా సరఫరా అవుతోంది. ఓ వైపు ఎక్సేజ్ అధికారులు దాడులు నిర్వహించి, ఎప్పటికప్పుడు నాటుసారా విక్రయించకుండా అదుపుచేస్తున్నా పరిస్థితి షరామామూలే అవుతోంది. ఎక్సైజ్ కార్యాలయం సాలూరులో ఉండడంతో నిత్యం దాడులు జరగడంలేదు. ఇది సారా వ్యాపారులకు కలిసొస్తోంది. నాటుసారా మత్తు ఎక్కువగా ఉండడంతో పాటు, తక్కువ ధరకు దొరకడంతో గిరిజనులు నాటుసారాకు బానిసలవుతున్నారు. -
కడుపునొప్పితో వ్యక్తి ఆత్మహత్య
శంషాబాద్ రూరల్: కడుపునొప్పి బాధ భరించలేక ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల పరిధిలోని రామంజాపూర్‌లో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివగారి రాజు(28) డ్రైవింగ్‌తోపాటు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తాగుడుకు బానిసైన ఇతను తరచూ కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో గతనెల 24న భార్య లక్ష్మి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలోని కిషన్‌నగర్‌లో పుట్టింటికి బోనాల పండగకు వెళ్లింది. శనివారం రాత్రి తిరిగి కడుపునొప్పి ఎక్కువ కావడంతో బాధ భరించలేని రాజు ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం గమనించిన కుటుంబసభ్యులు కిందికి దించి చూసేసరికి అప్పటికే మృతిచెందాడు. అయితే, రాజు ఆత్మహత్య విషయం బయటకు పొక్కకుండా అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తుండగా.. మధ్యాహ్నం శంషాబాద్ పోలీసులకు సమాచారం అందడంతో గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహానికి స్థానిక క్లష్టర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతుడికి భార్య లక్ష్మి, రెండేళ్ల కొడుకు ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.